﻿ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర
టీటీఎస్ ఆడియో నిర్మాణ పాఠ్యం
భాగం ఎనిమిది — మొత్తం ఎనిమిది భాగాలలో


ఇరువదిమూడవ ప్రకరణము  గంజాము నుండి రాజమహేంద్రవరము

తేది వుదయమయిన ఆరుగంటలకు లేచి యిక్కదికి ఏడు కోసుల దూరములో వుండే ఆచంటయనే వూరు పదకొండు గంటలకు చేరినాను. దారిలో సప్తగోదావరి యనే వొక పాయ పడవలకుండా దాటడమయినది. యిది కాలి భాట. తొపులు, వూళ్ళమధ్యే నడుస్తూ వచ్చినాము. అందులో రాల, ర్యాలి, యనే వొక గ్రామములో శుభ్రమయిన నల్లశిలతో ప్రభసమేతముగా వొక గోపాలమూర్తిని చేసివున్నది. ఆ ప్రభలోనున్న మూర్తి పీఠము మీదనున్ను రాసక్రీడలు మొదలయిన అవసరాలు మూర్తీభవించి నట్లుచెక్కి ప్రధానమూర్తిని గోళ్ళు, వెండ్రుకలుకూడా విరళపరచి అతిసుందరముగా చేసివున్నది. యీ మూర్తి సముద్రములో కొట్టుకొని వచ్చినట్టు యిక్కడ చెప్పుకొంటారు. ఆచంట అనే వూళ్ళో వెంకటరాయనింగారు తన నివాసముకొరకు వొక గొప్ప నగరుకట్టి దానికి చుట్టూ సుందరమయిన వనము నిర్మించిల్ వున్నాడు. యీ వూళ్ళోనున్ను, వాడపల్లెలోపల వున్నట్టే వొక పోలైసు అమీను వున్నాడు. ముప్పై బ్రాహ్మణ యిండ్లు వున్నవి. యిక్కడ పెండలపు గడ్డలు బహు బాగా అయి


ఇరువదినాల్గవ ప్రకరణము  రాజమహేంద్రవరము నుండి నెల్లూరు

యీనెట్టున బహుప్రసిత్థి కెక్కివున్నవి. వొక దేవాలయముకూడా వున్నది. యీవూళ్ళో యీరాత్రి వసించినాను.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కడికి రెండామడ దూరములోనుండే శింగవృక్ష మనే వూరు వొక గంటకు చేరినాను. దారి వరిపొలాల గనిమొల మీద నడిచి రావలసినది. రేగడ భూమి అయినందుననున్ను, వర్షాలు కురిశి వున్నందునన్ను చాలా అడుసునీళ్ళు గలిగి బహుప్రయాసగా వుండినది. గోదావరి వుదకము లడ్డకట్టి తెచ్చిన నాలుగు మడుగులు, రొమ్ముల లోతునీళ్ళలో దాటినాము. శింగవృక్ష మనే వూరు గొప్పబస్తీ. వంద బ్రాహ్మణ యిండ్లు కలవు. అనేకముగా అంగళ్ళు కలవు. ఈవూళ్ళో భోజనానకు నిలిచి మూడు గంటలకు మళ్ళీ బయిలువెళ్ళీ ఆరు గంటలకు బోండాడ ప్రవేశించినాను. దారిలో తెల్లవారివలెనే రెండు మడు, గులు దాటడమయినది.

బోండాడ అనేవూరున్ను బస్తీగ్రామమేను. యీ వూరికున్న ఘట్టిపర అయినందున ధాన్యము పాతరలువేశి వుంచుతారు. రాజమహేంద్రవరము మొదలుగా తాటిచెట్లు అమితముగా కలిగివున్నవి. ప్రతివూరనున్ను తాటిపండ్లరసము తీసి చాపలుగా చేసి వుంచుతారు. యీరాత్రి యిక్కడ వసించినాను.

ఆగష్టునెల ఒకటి తేది వుదయమయిన నాలుగు గంతలకు బయిలువెళ్ళీ యిక్కడికి నాలుగు కోసులదూరములో నుండే యేలూరిపాడు అనేవూరు పది గంటలకు చేరినాను. యీవూరు పేటస్థలము. నేడు నడిచిన దారి యిసకపర. శింగవృక్ష మనేవూరు మొదలు యిదే రీతిని దారి అనుకూలముగా వున్నది. బండ్లు సమేతముగా రావచ్చును. యీవూరు నియోగుల అగ్రహారము. రాజమహేంద్రవరము జిల్లాకున్ను బందరు జిల్లాకున్ను యీవూరివద్ద వుండే వుప్పుకాలువ సరిహద్దు అని తెలియవలసినది.

యీ మధ్యాహ్నము పన్నెండు గంతలకు యిక్కడినుంచి భోజనము చేసుకొని బయిలి వెళ్ళి వుప్పకాలవ సంగళ్ళకుండా దాటి రాత్రి ఏడు గంతలకు యిక్కడికి ఆరు కోసులదూరములో వుండే తుమ్మడి యనే వూరు చేరినాను. యీ మధ్యాహ్నము మీద నడిచిన దారి యిసకపర, శుద్ధబయిలు. యేలూరిపాడు మొదలుగా వర్షాలు లేనందున యిక్కడ దారిలో మడువులు బొత్తిగా యెండివున్నవి. దారిలో కలిదండియనే ప్రసిద్ధి గ్రామము దాటి వచ్చినాను. తుమ్మడి అనే గ్రామములో బ్రాహ్మణయిండ్లలో స్థలము దొరకనందున కలకత్తాలో విశ్రయించడానకు యిచ్చివచ్చిన రెండు డేరాలు, వెంకటరాయనింగారికి యిచ్చివచ్చిన వొక డేరాగాక మిగిలిన రెండు డేరాలు యిక ఫరవాలేదు ప్రతివూళ్ళో బ్రాహ్మణ యిండ్లలో స్థలము దొరకునని అందరు బోధించినా చెయికావలికి యెనిమిదిమంది బోయీలచేత తెచ్చినందున ఆ రెండు డేరాలు వొక బావివద్ద వేయించి యీరాత్రి గడపడమయినది. యీవూళ్ళో మంచినీళ్ళు బహుప్రయాస. నేను డేరాలు వేయించిన స్థలమున వుండే బావి యీ వూరికి మంచినీళ్ళు, ఆ నీళ్ళు మాకు తాగకూడనిదిగా వున్నది. అభ్యాసము అన్నిటినిన్ని అనుకూలపపరుస్తున్నదనే యింగిలీషుమాట యీ దినము సత్యముగా తొచినది.

తేది వుదాత్పూర్వము రెండు గంటలకు మబ్బుచినుకులుగా వున్నా లేచి యిక్కడికి రెండామడదూరములో వుండే మచిలీబందరు అనే షహరు యీ దేశస్థులు పేటా అని చెప్పే బస్తీని ఆరు గంటలకు ప్రవేశించినాను.*

గమనిక, * మచిలీబందరు రెండవ తేది మగళ్వారం ఉదయాన దారి యిసకపొర నాతమ్ముడయిన సీతాపతికి బారుజల్లి అనే తాలూకాకు పని అయింన్నీ నాకోసరం బందరులో శలవుమీద కాచివున్నాడు. మణపాక సాల్వపతినాయిడుగారు నాకు విహితుడు గనుకనున్ను వారు వుభయులూ కలుసుకొని వీరాస్వామయ్యగారిని వాద్యములతో వూరిలోకి తీసుకొని వెళ్ళి రామన్నపేటలో వక గొప్పతోటయింట్లో బస యేర్పరిచినారు.

దారి నిన్నటివలెనే యిసుకపర. బండ్లు సాధారణముగా

, వ్రాత ప్రతిపుట నాలుగు వందలు ఎనభై ఎనిమిది లోని అదనపుసంగతి, నడవవచ్చును. రామన్నపేటలో వొక గొప్పతోట యింట్లో దిగినాను. యీ మచిలీబందరు బస్తీలో ఇరవై రెండు పేటలు కలిగివున్నది. వొక్కొక్క పేటను పూర్వమందు లక్ష్మెకటాక్షము కలిగిన పురుషులు తామై కలగచేసినారు గనుక ఆపేటలలో వచ్చుబడిబాడిగెలను పేటలు కలగచేసిన వారి వంశస్థులు నూరారు రూపాయలవంతున సుఖోపాయముగా యిప్పట్లో ప్రతిమాసమున్ను అనుభవింపుచున్నారు. ఈ బస్తీ లోగడ తురకలది. హయిదరాబాదు కింద వున్న అధికారస్థుడు యిక్కడికి తాను నవాబు అనిపించుకొని యీ రాజ్యాన్ని ఆక్రమించినాడు. ఆ స్వామి ద్రోహము వారి వంశస్థులను కంపెనీవారికింద పించను తీసుకొని యిప్పట్లో వుండేటట్టు చేసినది.

పూర్వకాలము మొదలుగా యీ బస్తీ సర్వాధికారుల నివాసముగా వుంటూ రావడముచేతనున్ను, యిప్పట్లోనున్ను వుత్తరఖండం ప్రొవింషియల్ కోరటులో జిల్లాకోరటు కలకటరు కచ్చేరి మమ్మిస్సెర్యాటు ఆఫీసు సహితముగా కొంత దండు వసించివుంటూ రావడంచేతనున్ను, కాండ్రేగులవారు మొదలయిన కొందరు జమీందారులు సాహుకారులు వర్తకులున్ను వుండుటచేతనున్ను బస్తీ చాలాగా శోభించివున్నది. రాజవీధులు బాగా విశాలముగా వున్నవి. యిండ్లు బయిట చూచేటందుకు చిన్నవిగా అగుపడ్డా లోపలి ఆవరణాలు విశాలముగా కట్టివున్నారు. లోముంగిళ్ళుమాత్రము కొంచపరచి కట్టివున్నారు. సమస్ పదార్ధాలున్ను సమస్తపనులు చేయగల మనుష్యులున్ను దొరుకుదురు. శ్రీకాకొళము వదిలిన వెనక బాడిగెకు బండ్లు యీ బస్తీలొ దొరకడము కష్టము. భూమి వుప్పుకలిసిన రేగడి. నీళ్ళవసతి లేదు. దూరమునుంచి యీ బస్తీకి మంచినీళ్ళు తెచ్చుకోవలసినది.

వీరాస్వామయ్యగారు బందరులో జిల్లాజడ్జిగా నుండిన ఆంధ్రభాషోదారకులగు చార్లెస్ ఫిలిప్ బ్రౌను గారిని దర్శించారు గాని యీ పుస్తకములొ ఆ సంగతి వ్రాయలేదని బ్రౌనుగారు స్వదస్తూరితొ వ్రాత ప్రతి నాలుగు వందలు ఇరవై మూడు పుటలో రిమార్కువ్రాసినారు. వీరాస్వామయ్యగారు చెన్నపట్టణము చేరిన తరువాత బ్రౌనుగారికి వ్రాసిన యింగ్లీషు వుత్తరము వ్రాతప్రతి చివర అంటించబడియున్నది. వీరాస్వామయ్యగారిని బందరుపుర వాసులు పద్నాలుగు రోజులు అక్కడ వుంచారు.

మనుష్యులు నిండా ఆరోగదృఢగాత్రులుగా వుండలేదు. స్త్రీలు లలంకారపురస్సారముగా శోభాయమాన లయి వున్నారు. స్వరూపలావణ్యము గలవారు కారు. చెవులకు నిడుపుగొలుసులు వేశి కొన్ని పాపటకు చేర్చి చెక్కుతారు. స్త్రీ పుర్లుషులు చాయ వేసిన వస్త్రప్రియులై యున్నారు. రాజమహేంద్రవరానికి యీవల కృష్ణవరకు బ్రాహ్మణ్యమునకు భూజీవనాలు విస్తారములేక సంతుమాత్రము అతిశయిస్తూ రావడముచేత బందరుబస్తీ యాచక బ్రాహ్మణపూరితమై వున్నది. గంజాం, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, మచిలీబందరు, గుంటూరు జుములా యీఅల్యిదు జిల్లాలలోను భూమి విస్తారము జమీందారుల అధీనముగా పూర్వము నుంచి చేయబడివున్నందున జమీందారుల ప్రాబల్యద్వారా హిందువులవల్ల అద్యాపి కొన్ని విశేషధర్మాలు ఇరవై నుంచి ముప్పై వరకు వేల బ్రాహ్మణులకు సంతర్పణములున్ను చేయబడుచున్నవి. అన్నిటిలోను బందరు కాకినాడ జిల్లాల జమీందారులు చాలా ధర్మబుద్ధిగలవారు. రాజా కొచ్చర్లకోట వెంకటరాయనింగారు రెండావృత్తులు కుటుంబసహితముగా తులాభారము తూగి రెండావృత్తులు లక్ష బ్రాహ్మణభోజనము చేయించి అనేకయాగాలు చేయించినారు. వాశిరెడ్డి వెంకటాద్రినాయుడు అప్పారావు మొదలైన మరికొందరు అంతకు యెక్కువగా హిందుధర్మములను జరిగించినారు. యీ దేశస్థులు కచ్చేరి సహితముగా విందుచేస్తే ఆ వుత్సవాన్ని మేజువానీ లంటారు. కాకినాడజిల్లా సాలుకు రెండు లక్షల వరహాలు యెత్తుచున్నది. మచిలీబందరు ఆరు లక్షల వరహా లెత్తుచున్నది. యీ మచిలీబందరులో ఆగస్ఠు నెల పదిహేను తేదివరకు వసించినాను.

తేది వుదయాత్పూర్వము నాలుగుగంటలకు బైలువెళ్ళి యిక్కడికి రెండు ఆమడ దూరములో నుండే కొత్తపాళె మనే కృష్ణాతీరపు వూరు పది గంటలకు చేరినాను. దారిలో యీదేశస్థులు పర్రలు అని చెప్పే పల్లెలు కొన్ని వున్నవి. రేగడభూమి. కొత్తపాళెమునకు రెండు కోసుల దూరములో చల్లపల్లియనే యేర్లగడ్డ జమీందారుని నివాసగ్రామము వొకటి వున్నది. అందులో సుందరతరముగా వొక మిద్దెను ఆ జమీందారుడు కట్టియున్నాడు. యీ కొత్తపాళెము చిన్నవూరు అయినప్పటికిన్ని వెచ్చా గోపాలకృష్ణమ్మయనే కోమటి యిప్పట్లో బందరు ప్రొవింషియల్ కోర్టులో ప్లీడరుగావుండి అతడు వొక సత్రము కట్టించినందున మార్గస్థులకు బహువుపకృతిగా వున్నది.

గంజాంలో బందం చలమయ్య అనే అతను, విశాఖ పట్టణములో చిన్నం చలమయ్య అనేఅతను, యానాంలో మన్నెం కనకయ్య, రాజమహేంద్రవరములో గుండు శోభనాద్రి వగైరాలు జమీందారులయి లక్షాంతరములు వ్యాపారముచేసి దొరతనపు డౌలు పాయాపరువున్ను కలిగివున్నా వీరిని దక్షిణ దేశములాగున శెట్టి అనడములేదు గాని గారు అనే ప్రతిష్టావాచక ప్రయోగమున్ను తాజీం అనే ప్రత్యుద్ధానమున్ను వీరికి చేయకూడ దని వొక నిష్కర్ష యితర జాతులందరు తాగాల్యతునుంచి చేసుకొని అటు యీ దేశములో జరిగింపుచున్నారు. కోమటి జాతిలో వెచ్చా వారి కుటుంబము లాగున గవర్నమెంటు వుద్యోగాలు చేసిన కుటుంబాన్ని ఎక్కడా చూడలేదు/ శూద్రజాతిలోనున్ను యెంతగొప్పవాడైనా నాయిడనే ప్రతిష్టా వాచకాన్ని ఆ పురుషుని పేరుతోకూడా సాధారణముగా వాడరు. గంజాం మొదలుగా భోగస్త్రీలు సభాస్థలములకు వస్తే తంబుర వీణల వుంచుకొని పాడేకాలము తప్ప తక్కిన వేళలలో కూర్చుండకూడరు. పశ్చాత్తాపములేక రెండు మూడు ఝాములు వారిని నిలల్వపెట్టుతారు.

బందరుజిల్లా ప్రవేశించినవెనక బందిపోట్లు, పితూరీలు అనే మాటలు వినడములేదు. ఆ విషయమై యీ దేశము సుభిక్షముగా వున్నది. యిటీవల గుంటూరుజిల్లాలో భేది, వాంతి వుపద్రవాలు చాలా కలిగియున్నట్టు తెలియడమయినది. ఆ వుపద్రవము తగిలినయింట్లో మళ్ళీమళ్ళీ తగులుతూవున్నట్టు తెలిసినది. గనుక అందుకు హేతువు నాకు తొచడము యేమంటే అవశాత్తుగా వొక పురుషునికి ఆ వుపద్రవము తగిలి విపత్తుకు హేతువు కాగానే సన్నిహితులు భీతినిచెంది భీతిద్వారా యీ వుపద్రవము పరంపరగా వారు తెచ్చుకొనేటట్టు తోచుచున్నది. భీతి మరణాన్ని యివ్వగల వుపద్రవమని అనుభవసిద్ధముగదా! తేన వినా తృణాగ్రమపిన చలతి అనే వాక్యము సత్యమయినా దేహదృష్టిచేత నున్ను ప్రపంచ దృష్టిచేతనున్ను యిటువంటి వూహలు దేహదృష్టి విలయము పొందే కొరము చేయవలసి యున్నది.

కృష్ణాతీరమునందు పంతొమ్మిది తేది మధ్యాహ్నమువరకు నిలిచి నాను. కృష్ణానదీ మహాత్మ్యము విచారించగా లోకులనుతరింపచేసే కొరకున్ను యీ కలిలో లోకుల పాపాలు యెంతబళువో అంత పాటి పుణ్యము వొక స్నానముచేతనే కలిగేకొరకున్ను శ్రీమహావిష్ణువు యీ నదీస్వరూపముగా అవతార మెత్తినట్టు తెలియవచ్చినరి. యీ కృష్ణామాహత్మ్యము స్కాందపురాణాంతర్భూతముగా వున్నది. యిక్కడికి రెండు కోసుల దూరములో కళ్ళేపల్లి అనే మహాస్థలము వొకటి వున్నది. యీ నది సహ్యపర్వతములో వుత్పత్తి అయినది. ఆవుత్పత్తి స్థలసాగరసంగమాలకు డెబ్బై ఆమడ అని విన్నాను. యిక్కడ కృష్ణానది కోశెడు వడల్పు, అనేక గొప్పలంకలు కలవు. అందులో అనేక అడివి యావులు స్వేచ్చగా విహరింపుచున్నవి. యీ లంకలలో కాయకూరలు చాలాగా పైరై బందరు బస్తీలో వ్రయ మవుచున్నవి.

తేది మధ్యాహ్నము మీదట ఒకటి గంటకు బయిలువెళ్ళి కృష్ణానది పడవలకుండా దాటి ఐదు కోసుల దూరములోవుండే కనగాల యనే వూరు సాయంకాలము తొమ్మిది గంటలకు చెరినాను. యీ తీరమందు గ్రామస్థులు తమ ఖర్చుకింద పడవలు చేయించుకుని బీదలవద్ద డబ్బులు తరాతర ప్రకారము పుచ్చుకుని దాటిస్తారు. బలిష్ఠులకు అధికారస్థులకు అమిజీ, వెట్టి,కి దాటిస్తూ వుంటారు. యీతీరమందు నా స్నానకాల మందు చుట్టుపక్కల గ్రామాలలో వుండేవారుగా భూరి దక్షిణ నిమిత్తము రెండు వందలు బ్రాహ్మణులు చేరినారు.

యిక్కడి బ్రాహ్మలలొ కొందరు దేశాంతరాలు వెళ్ళి ద్రవ్యము సంపాదించి స్వదేశము కుదురుగా చేరినందువల్ల నున్ను యీ తీరపు బ్రాహ్మలు పుత్రదారాదులయిన బాంధవులను వదిలి దక్షిణము కన్యాకుమారివరకున్ను, వుత్తరము కాశ్మీర పత్యంతమున్ను సంచారము చెసి లోకులు చేయతగిన బ్రాహ్మణపూజలు నిర్బంధపెట్టి చేయించుకుంటూ వుంటారు. యీరీతిని కొండవేడు మొదలయిన యీ స్థలజ్ఞులు విచ్చలవిడిగా వొకరినిచూచి వొకరు సంచరించ ప్రయత్నపడ్డవా ఆవరించేపాటి ముక్కరలు చాలా లావుగా చేసి ధరించుతారు. యీ లోపల భూమికొలతను కత్తెలు, కత్తులు, అంటారు. గంజాం మొదలుగా కృష్ణాతీరమువరకు పెద్దమనుష్యులు సమానుల సమాగమము అయినప్పుడు అత్తరుతాను వుంచి తాంబూలముతోకూడా అత్తరునున్ను అవశ్యము యిస్తూ వస్తారు. యీ కళింగదేశము మొదలుగా కోసులు సుళువుగా అగుపడుచున్నవి. యిక్కడి వొక కోసు దక్షిణదేశపు రెండుగడియల దూరానకు కాలు గడియ తక్కువ అని చెప్పవచ్చును. గ్రామలెక్కలు మొదలయిన వ్రాతలు రాజమహేంద్రవరానకు దక్షిణము తాటాకులలో వ్రాస్తారు.

గంజాం మొదలు విజయనగరము వరకు తామర సమస్త గుంటలలో, చెరువులలో వేశివున్నారు. వాటి తూంట్లను కూర మొదఒలయిన పక్వాన్నాలుగా చేసి భక్షిస్తూ వస్తారు. నీళ్ళు తూకడానకు బావుల వద్ద తాటాకులు దొన్నెలుగా కట్టివుంచుతారు. వాటికి తాడుకట్టి నీళ్ళు చేదినంతల్లో రెండుపళ్ళ నీళ్ళు వచ్చుచున్నవి. యీ కనగాల అనే వూరు గొప్పది. విశాలమయిన బ్రాహ్మణ యిండ్లున్ను వొక గొప్ప చావడిన్ని కలవు. సమస్త పదార్ధాలు దొరుకును. యిక్కడ సమీపముగా కాటికెవా రని పౌరుష నామధెయముగల వొక నేత్రచికిత్సకుల కుటుంబము వున్నది. వారు యధాశాస్త్రముగా నేత్రచికిత్సకుల కుటుంబము వున్నది. వారు యధాశాస్త్రముగా నేత్రచికిత్స చేయుచూ వుంటారు. యీ వూళ్ళో యీ రాత్రి నిలిచినాను. దారి నల్లచౌటిరేగడ. తుమ్మచెట్లు యిరుపక్కలా వుంటూ వచ్చినవి. దారిలొ భట్టుప్రోలు అనే వూరివద్ద లంజదిబ్బ అని వొక మిట్టవున్నది. అదిమొదలు చెట్లశాలను దారిలో వేసివున్నారు.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కడికి ఆరు కోసుల దూరములో వుండే చందవోలు అనే గ్రామము ఏడు గంటలకు చేరినాను. దారి యిసకపర. యిరుపక్కలా చెట్లు పెట్టివున్నారుగాని నిండా లేతలు గనుక నీడ యివ్వనేరవు. యీ చందవోలు అనే వూళ్ళో వెచ్చా గొపాలకృష్ణమ్మ తమ్ముడు ధర్మపురి అనే అతను వొక సత్రము కట్టితివున్నాడు. యీవూరినుంచి కొండవీడుశీమకు దారి చీలిపొతూ వున్నది. యీవూరు తురక భూయిష్టమయినది. లోగడ అనేక శివా కోసులదూరములోవుండే చినగంజాం అనేవూరు ఆరు గంటలకు చేరినాము. దారి యిసకపొర అయినా కాలు దిగబడేపాటి బొల్లియిసక కాదు. చినగంజాంవూరిచుట్టూ వుప్పుపంట విస్తారము చేస్తారు. వూరు నిండా చిన్నది కాదు. యిక్కడ కొళంద వీరాపెరుమాపిళ్ళ సత్రము వొకటి వూరికి బయిలున వున్నది గనుక అక్కడదిగినాను. ముసాఫరులకు కావలశిన సామాను దొరికినది.

తేది వుదయాత్పూర్వము మూడు గంతలకు బయిలుదేరి యిక్కడికి నాలుగు కోసుల దూరములోవుండే అమ్మనబోలు అనేవూరుఆరు గంటలకు చేరినాను. దారి నిన్నటిదినము మేమునడిచినట్టె ఉపాయమయిన యిసకగా వున్నది. చనగంజాం అనే వూరితో గుంటూరు జిల్లా సరిహద్ధుసరి. యివతల నెల్లూరిజిల్లా అమ్మనబోలు అనేవూరు గొప్పదేను. సమస్త పదార్థాలు దొరుకును. కృష్ణకు యీవలవుండే యిండ్లు అన్ని పూరివేసికట్టివున్నవి. పెంకుటిండ్లు సకృత్తైనందున యీ దేశస్థులకు అగ్నిభయము చాలా కలిగివున్నది. బాపట్ల వద్దినుంచి నాతోకూడా వచ్చిన పరిచారకపు బ్రాహ్మణులు కొందరు వారి స్వగ్రామమయిన లంజచెరుకూరికి రెండుకొసులదూరములో వుండగా వెళ్ళి అమ్మనబోలులో మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. ఈ వూరి గ్రామ కరణము యింట్లో వంట భోజనాలు కాచేసుకున్నాము. బాపట్ల వలెనే యీ వూళ్ళోనున్ను తొపులు చెరువులు వసతిగా వున్నవి. మధ్యాహ్నము మీదట రెండు గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమడదూరములో వుండే ఆకులల్లూరు అనేవూరు ఆరు గంటలకు చేరినాను. దారి వుప్పుకలిశిన రేగడ. వర్షాకాలములో నడవడము ప్రయాసగా వుందును.

ఆకులల్లూరు అనే వూరు యధోసితము పెద్దదిగా వున్నది. ఎనభై బ్రాహ్మణ యిండ్లు వున్నా స్థలము యిచ్చేవారు కారని ప్రసిద్దికెక్కివున్నారు. అయినప్పటికి యీ శీమగ్రామ అధికారులయిన రెడ్డి కరణాలను పిలిపించి మాట్లాడి వొక బ్రాహ్మడి యిల్లు కురుర్చుకుని అందులో బసచేసినాను. అన్నిపదార్ధాలు దొరికినవి.

రాజమహేంద్రవరము మొదలు గుంటూరుజిల్లా సరిహద్దువరకు సరఫరాయి బంట్రౌతులను నాయక వాడీ లంటారు. వారు ముసాఫరులకు గొప్పవారయిన పక్షమందు సమస్త సరఫరాయి చేస్తూరావలసినది. నెల్లూరిజిల్లా మొదలుగా ఆదేతరహా నౌకరులను మహాతాదులంటారు. నెల్లూరిజిల్లాలో భూమికొలతను కుచ్చళ్ళు అంటారు. కుచ్చల ఒకటి కి రెండు గొర్రుల సంజ్ఞ యారాత్రి యిక్కడ వసించడమైనది.

తేదీ వుదయాత్పూర్వము నాలుగుగంటలకు లేచి యిక్కడికి నాలుగు కోసులదూరములోనుండే వలగపూడిసత్రము రెండు గంటలకు చేరినాను. దారి యిసకరేగడ కలిసియున్నది. యీసత్రము రాజాముద్ధుకృష్ణమనాయుడు వెలగపూడియనే గ్రామముందుగా యిక్కడి జమీందారులవద్ద యినాముగా సంపాదించి కట్టినాడు. గ్రామపు వసూలులో సదావృత్తి యిస్తూ వునారు. సత్రములక్షణముగా కట్టి యిప్పటికి బాగావున్నా కళాహీనమై వున్నది. నా అనుభవముచేత విచారించగా కళకలలాడుతూ వుండే భవంతుల కళావిలాసాలు వొకటే తీరున వున్నావాటి వ్యత్యాసకాలాలలొ కళాహీనమై పాడుకోరుతూ వుంటున్నది. గనుక యిటువంటి మానుష నిర్మాణములయందుకూడా పరమాత్ముని చైతన్యము యథోచితముగా ప్రతిఫలించెటట్టు తోచుచున్నది. యిక్కడ వంటభోజనాలు కాచేసుకుని ఐదు గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి మూడుకోసులదూరములోవుండే కరేడు అనేవూరు రెండు గంటలకు చేరినాను.

దారిలో రెండు వుప్పుటేరులు దాటినాము. యిప్పుఛు కాలినడకగానే వున్నది. యీ రెండుయేరులలో సర్పాకారమయిన విషజంతువుల భయము కదాచిత్తుగా కలిగి వుంచున్నది. దారి యిసకకలిసిన రేగడ. అమ్మనబోలుకు ఆకులల్లూరి మధ్యే నాగర్తను కొత్తపట్టణము యీతముక్కల వగయిరా బస్తీలువున్నట్టు యీమధ్యే గొప్పవూళ్ళులేవు. కరేడు గొప్పవూరు. యాభై బ్రాంహ్మయిండ్లు, వొక సత్రము, రెండుగుళ్ళున్ను, కలిగిన పేటస్థలము. సమస్తపదార్ధాలు దొరుకును. యీ రాత్రి యీ వూరి కరణము కట్టించిన సత్రములో వసించినాను.

తేది వుదయాత్పూర్వము రెండు గంటలకు లేచి యిక్కదికి రెండు ఆమడ దూరములోవున్న కొత్తసత్రమనే పేరుతో రామానుజరాయడుకట్టిన సత్రము రెండు గంటలకు ప్రవేశించినాను. దారి బహుయిసక. రామయపట్నము వరకు కాలు పూడిబోతూ వచ్చినది. యివతల సత్రమునకు రెండు కోసుల అంత యిసకలేదు. సత్రము బహు వసతిగా వున్నది. వద్దవుండే అంగళ్ళల్లో భాటసారులకు కావలశిన పదార్ధాలు దొరుకును. యిక్కడ వంటభోజనము కాచేసుకుని యిక్కడికి ఐదు కోసుల దూరములోవుండే జువ్వులదిన్నె అనేవూరు ఆరు గంటలకు చేరినాను. దారి కొంతమేర యిసక, కొంత యిసక కలిసిన రేగడ. దారిలో మామిళ్ళదొరువు అనే మజిలీవూర ముసాఫరుఖానా దొరలు దిగే లాయఖుగా వొకటి వున్నది.

జువ్వలదిన్నె అనేవూరు గొప్పదయినా నీళ్ళు ఆసరా విస్తారములేదు గనుక పంటలుజబ్బు. పేటస్తలముగా శానాకోమటి యిండ్లువున్నందున సమస్తపదార్ధాలు దొరుకును. దేవాలయాల సహితముగా కొన్ని బ్రాహ్మణయిండ్లు వున్నవి. అందులో వొక యింట్లో రాత్రివశించినాను. కృష్ణకు యివతల పశువులు గొప్ప దేహాలు కలవిగా వుంటూ వచ్చినవి. అమ్మనబోలు మొదలుగా అటువంటి పశువులు పుష్టికలవిగా గాలిమందలుగా అనేకములు చూస్తూ వచ్చినాను.

నేను యీవరకు కన్యాకుమారిమొదలుగా సంచరించిన భూములలో యీపాటి వైలక్షిణ్యము, స్థూలము, వున్నతము కల పశువులను చూడలేదు. యీ పశువుల పోషణముందర వ్యవసాయము నున్ను యీ దేశపు కాపులు లక్ష్యపెట్టేవారు కారు. పొలము బీడువేసి వాటికి పుల్లరి అనే తీరువ యిచ్చి పశువులను మేపించి కాపాడుతారు. యీ నెట్టు వారికి పశుధనమే ప్రబలముగా కలిగి వున్నది.

తేది వుదయాత్పూర్వము రెండు గంటలకు లేచి యిక్కదికి రెండామడ దూరములో వుండే కొడవలూరి సత్రము ఎనిమిది గంటలకు చేరినాను. దారి పంటల్లూరివరకు యిసక కలిసిన రేగడ. పంటల్లూరు మొదలుగా సత్రమువరకు సడక్కువేశి శాలవేశి వున్నది. పంటల్లూరు భారీదస్తు అయ్యే గ్రామము. తహశీలుదారుడు వుండే కసుబా. నేను దిగిన సత్రము వసతిగా వున్నా జలసౌఖ్యము మట్టు. యిక్కడ గొప్పది. పది వందల యిండ్లు వుండును. రధములుపొయ్యే వీధులు మాత్రము నిండా విశాలముగా వున్నవి. స్వతంత్రుడుగా శీమనుంచి వచ్చివుండే పేయిర్ అనే దొరను యాత్రవారి మహసూలు వసూలు చేసే పనులలో కలకటరు హస్తాంతరముగా మామూలు ప్రకారము అటారానాళాఃఘాటువద్ద వుంచి వున్నారు. యాత్ర వారి సమేతముగా పండాల విచారణ ఆ దొరల పరమై వుంచున్నది. బియ్యము మొదలయిన సమస్త పదార్ధములు అంగళ్ళలో వుండేవి. స్వామికి నైవేదనార్హములు గనుక వాటిని వాసన చూచి మళ్ళీ ఆ రాసులలో నెయ్యనివ్వరు. యీ నియమము వింతగా యీవూళ్ళో జరుగుచున్నది. మహాజనులనె సాహుకారులు యీ వూళ్ళో లేదు. సమస్త పదార్తములు దొరుకుచున్నవి. యూవూరు సముద్రతీర మందున్నది. యిక్కడ సముద్రస్నానము బహుముఖ్యము. జాతుల వాండ్లు సముద్రతీరమందు యిసక దిబ్బలలో వుపాయమైన యిండ్లు కట్తుకుని కాపురమున్నారు.

కొత్త మూర్తులను ప్రతిష్టచేసిన వెనక గుళ్ళోవుండే పాత మూర్తులను మూటినిన్ని రెండో ప్రాకారములొ వుండే మోక్షద్వారమనే కూపములో ప్రవేశింప పెట్టుతారు. ఆ కూపము అగాధమైన లోతని తెలియవచ్చినది. ఆకూపము వుండే ప్రదేశానకు యిక్కడివారు పొను భయపడుతూ వుంటారు. పాత మూర్తులలో నుండిన చైతన్యకళలను కొత్తమూర్తుల వక్షస్థలాలలో ప్రవేశింప పెట్టినవనక రెండుమూడు నెలలలో ప్రవేశింపపెట్టిన వృద్ధ కొరాతకులు దేహాలు వదులుతారని నిశ్చయముగా తెలిసినది. దాని కారణము యీశ్వరునికే తెలుసును. అయినా నాకు భయమే కారణముగా తోచుచున్నది. యిక్కడ నాలుగు కూరలు పప్పుపులుసు పరమాన్నము రెండు పిండివంటలతో సాధారణముగా వెయింటికి భోజనము చేయించ వలిస్తేయిన్నూటయాభై రూపాయలు సరాసరిపట్టుచున్నది. యిక్కడ అనేక మఠాలున్ను రోగిష్ఠులకు ప్రసాదవినియోగమయ్యేకొరకు కుంఫ్హిణీ ధర్మశాల వొకటిన్ని వుండేటందున బ్రాహ్మణ భోజన నిమిత్తము వొకదినముముందు పిలిస్తేపండితులు పామరులు సహా భోజనము కాఛెసుకుని రెండు గంటలకు బయిలు వెళ్ళి యిక్కడికి అమడదూరములో వుండే నెల్లూరు షహరు ఆరు గంటలకు చేరినాను.

పయి సత్రమువద్ద కొమటియిండ్లులు కొన్ని చేరినవి గనుక కావలసిన సామానులు దొరికినవి. ఆ సత్రానికి ముందు అల్లూరు మొదలుగా నేమి, యివతల నెల్లూరువరకు న్నేమి నాలుగైదు సత్రాలున్నవి. దారి సడక్కు వేశి గులకరాళ్ళు పరచి ఘట్టించి శాల చెట్లు వుంచివున్నారు. అవి పెద్ద చెట్లు అయినవి గనుక నీడ బాగా యిస్తూవున్నవి. నెల్లూరిలో జిల్లాజడ్జి కలకటర్లు వున్నారు.

పినాకినీనది దాటి నెల్లూరు ప్రవేశించినాము. నది అరకోసెడు వెడల్పు కద్దు. వొడ్దున రంగనాయకులపేట యనే గొప్ప విష్ణుస్థలమున్నది. వుత్తరము మూడుకోసుల దూరములో జొన్నవాడ యనే వూరు కామాక్షమ్మదేవీ సహితముగావున్నది. అక్కడ లక్ష్మీసరస్వతులు వింజామరలు వేశే అవసరముగా దేవివద్ద బింబాలను చేసి వున్నారు. బహుమంది సేవించి వరప్రసాదసిద్ధు లవుతారు. ఆ వూరు భోగస్త్రీలకు మిరాశి గనుక వారి సంఘప్రాబల్యముగలది. ఆవూరికి మిక్కిలి సమీపముగానే వొక చిన్న కొండమీద నరసింహస్వామి దేవాలయ మున్నది. యీజిల్లాలోనే వంగోలుకు రెండామడదూరములో శింగరాయకొండ యనే జాగ్రతస్థలము వొకటి వున్నది. నెల్లూరు సౌఖ్య మయిన వూరు. ఆరోగ్యకరమయిన భూమి. సుమారు వెయ్యిండ్లుకలవు. వుద్యోగస్థులచేత నిబిడీకృతముగావున్నది. గాని వర్తకులు లేరు. సమస్త కూరకాయలు పదార్ధాలు మంచి పాలుపెరుగు కావలశినప్పుడు దొరుకును.

చినగంజాం మొదలుగా సముద్రతీరమందు యీ జిల్లాలో వుప్పు పయిరుచేయడము విస్తారము గనుక వుప్పరజాతి స్త్రీలు దోటిముక్కరలు ధరించి పురుషులు సహాగా భూమి తొవ్విపొలాలుయేర్పరచే పనులలో జాగ్రత్తగా వుంటారు. యిప్పట్లో దక్షిణదేశము పడమటిదేశము పొడుగునా భూమి తొవ్వడానకు నెగడివుండేవారు యీ దేశపు వుప్పరవాండ్లున్ను, వోఢ్రదేశపు వొడ్డేవాండ్లుగా తోచినది. నెల్లూరిలో సమస్త విధములయిన పనివాండ్లు వున్నారు. మరునాడు యావత్తు యిక్కడ వసించినాను.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమణ్నరదూరములో వుండే మనుబోలువద్ద కృష్ణమాచార్యుల సత్రము ఏడు గంటలకు చేరినాను. యీ సత్రము బహువసతిగా వున్నది. సమస్తపదార్ధాలు దొరికినవి. యిక్కడ వంట, భజనములు కాచేసుకుని యిక్కడికి ఆమడ దూరములో వుండే గూడూరు జాములో చేరినాము. గూడూరు పెద్దదైనా అనావృష్టి కాలములయందు నీళ్ళకు బహు ప్రయాస. బావులు లేవు. ప్రయాసమీద బ్రాహ్మణయిండ్లలో స్థలము దొరికినది.

రాజమహేంద్రవరము వదిలినది మొదలు నియోగుల కర్ణీకపు వుద్యోగము కలవారై పూర్వోత్త్రరమునుంచి ప్రబలులుగా వుండడము వల్ల గొప్ప యింఛ్లు కట్టుకొని వున్నారు. వీరి ప్రారబ్ధవశమువల్లల్ భాటసారులకు స్థలము యిస్తేతమకు పరువుతక్కువాని వొక బుద్ధి జనియించి యిల్లు గొప్పగదా అని అవరైనా వెళ్ళి స్థలము అడగపోతే బ్రాహ్మణ యిండ్లకు పొమ్మంటారు. మీరు బ్రాహ్మణులుకారా అని ప్రశ్నచేస్తే కాదు మేము కరణాలము, స్థలములేదు పొమ్మంటారు. యీ వూళ్ళో రెడ్లు ప్రబలముగా వున్నారు. వొక దేవాలయ మున్నది. యిక్కడ యీ రాత్రి వొక బ్రాహ్మణయింట్లో వసించినాను. దారి సడక్కువేశి శాలపెట్టి వంటల్లూరు మొదలుగా వొక్కతీరుగా గులకపరచి వారధులు కట్తివున్నవి.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కడికి ఇరవై నాలుగుఆమడ దూరములొవుండే నాయడిపేట అనే వూరు తొమ్మిది గంటలకు చేరినాను. యిది పేటస్థలము. సమస్త పదార్ధాలు దొరుకును. మనుబోలు మొదలుగా వెంకటగిరిరాజు వారి భూమి. యె పేటలోను, వారి సదవృత్తి అన్నసత్రము, నగెరున్ను వున్నది. యిక్కడ బోజనము చేసుకుని ఆరు గంతలకు బయిలువెళ్ళి యిక్కదికి కోసెడు దూరములో వుండే బ్రాహ్మణ పుదూరు చేరినాను. యీవూరు దారి కాక పొయినా యాభై యిండ్లు విద్యన్మడలి వుండే గ్రామము గనుకనున్ను నాపరివారల స్వకీయులు కొందరు అక్కడ వున్నారు. గనుకనున్ను యీ వూరికి రావడమయినది. యిక్కడ అనాది దేవాలయాలు రెండు ఆబ్రాహ్మణుల పేదరికమునకు తగినట్టి కాపాడబడుచున్నవి. యీ బ్ర్రాహ్మలకు ఈ గ్రామము శ్రోత్రియము. ఈ వూళ్ళో ఇరవై తొమ్మిది తేది మధ్యాహ్న పర్యంతము నిలవడమయినది.

కృష్ణ మొదలుగా గూడూరివరకు తాగ నీళ్ళులేవని జనులు హాహాకారపడుతూ వుండినారు. ఇవతల నాయడిపేట మొదలుగా యెక్కువ వర్షాలు ప్రతిదినము కురుస్తూ వున్నవి. జగదీశ్వదుడు యీ చొప్పున పాత్రాపత్రములు యెరిగి జీవనాదానము చేయుచూ వున్నాడు. కాల నష్టములకు కారణము అనేకవిధాలా విచారించగా రాజధర్మము ప్రజల నడవడికె యీ రెండుకారణాలున్ను ముఖ్యములని తొచబడుచున్నది. గూడూరు మొదలుగా దారి సడక్కుకాదు. యిసక కలిసిన రేగడ. నాయుడిపేటవద్ద సువర్ణముఖరీనది దాటవలసినది. యేరు అరగడియ దూరము వెడల్పుకద్దు.

నెల్లూరు మొదలుగా అరవమాటలు వింటూ వస్తారు. యీ వూరికి ఆ వూరు యిన్ని గడియల దూరమని చెప్పుతారు. కోసులమాట నిలిచిపోయినది. వుత్తరపినాకిని మొదలు దక్షిణపినాకిని వరకు మధ్య దేశముగా తోచుచున్నది. యీ దేశాములో పడమటి నుంచి కన్నడము వచ్చి కలిసినది. దక్షిణము నుంచి అరవము వచ్చి కలిశినది. వుత్తరము నుంచి తెనుగు అదే రీతుగా వచ్చి కలిసినది గనుక యీధ్యదేశపు భాష యీ మూడు భాషల మిశ్రమయి యీ మూడు భాషలు యీ దేశస్థులు వచ్చి రాక ఆ యా దేశములోకి వెళ్ళి మాట్లాడపోతే ఆ యా దేశస్థులు హాస్యము చేయసాగుతారు.

తేది మధ్యాహ్నముమీద మూడు గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమడదూరములో వుండే దొరవారి కోనేరు అస్తమానానకు చేరినాను. యిక్కడ వెంకటగిరి రాజు వొక గుంట తొవ్వించినాడు. అందులో యెన్నడికి అరోగ్యముగానున్ను, రుచికరముగానున్ను ఆరోగ్యకరముగానున్ను వుండే వుదకము కలిగివున్నది. యిక్కడ వారు కట్టివుండే సత్రము చావిళ్ళు యధోచితముగా విశాలములై వున్నా నిత్యము వేలమోడిగా ప్రజలు దిగుతారు గనుక స్థలము సమ్మర్ధముగా వున్నది. సమీపమందు వుండే అంగళ్లలోను, భాటసారులకు కావలశిన పదార్ధాలు అన్ని దొరుకును. యిక్కడ యీరాత్రి వచించినాను. దారియెర్రయిసక. యిరుపక్కలా అడివి. చోర భయము కద్దు.

చేది వుదయాన నాలుగు గంతలకు బయిలువెళ్ళి యిక్కదికి ఆమడదూరములో వుండే మన్నారు పోలూరు రెండు గంటలకు చేరినాను. దారి నిన్న మధ్యాహ్నము నడిచినటువంటిదేను. యిక్కడ ప్రసిద్ధమయిన కృష్ణ దేవాలయము వున్నది. వూరికి వుభయపార్శ్వాలా కాళించి యమునలు అనే నదులు రెండు చిన్నివిగా ప్రవహిస్తూవున్నవి. యీ గుళ్ళో జాంబవతుని గుహ యనే బావి వొకటి వున్నది. యిక్కడ జాంబవతునితో పోరి శమంతకమణిన్ని, జాంబవవతిన్ని ప్రతిగ్రహించి శ్రీకృష్ణులు విరాజమానుడయినట్టు స్థలపురాణము తెలియపరుస్తున్నది. భక్తాభీష్టములిచ్చే కోదండరామస్వామి ఆలయమున్ను, జాంబవతుని ఆలయమున్ను లోఆవరణములో వున్నది. కృష్ణమూర్తిని వ్యత్యస్తపాదమనే ధ్యాన శ్లోక ప్రకారము నిర్మించి వున్నారు. యిరువైయిండ్ల బ్ర్రాహ్మణులు వున్నారు. అగ్రహారము ముందర తిరుక్కొళము గమణీయముగా వొకటి యున్నది. వెంకటగిరిరాజాగారి నగరు వొకటి కట్టి వున్నారు. అతిరుక్కొళము నీళ్ళు నిండా పాచి అయినప్పటికిన్ని ప్రతియింటా బావులున్నవి గనుక జలవసతి కలదిగానే వున్నది. కాళిందీ నదికి ఆపక్క, కోటపోలూరని వొకటి వున్నది. గడియ దూరములో సూళూరుపేట అనేపేటా వొకటి వున్నది. యిక్కడి నూరిండ్ల నియోగులు చుట్టుపక్కలా వున్నారు. పోలూరిలో ప్రయత్నము మీద కావలశిన పదార్ధాలు దొరుకును. నెల్లూరు మొదలుగా భూమి తొవ్వితే అక్కడక్కడ కావలసి నన్ని గులకరాళ్ళు తియ్యవచ్చును. నిన్నానేడు నదిచిన భాట కొంత మేర రాతిగొట్టుగా వచ్చినది. యిక్కడ యీరాత్రి నిలిచినాను.

తేది వుదయమయిన నాలుగు గంటలకు బయిలు వెళ్ళి యిక్కడికి ఆమడదూరములో వుండే చిలకలపూడి రామస్వామి సత్రము ఏడు గంటలకు చేరినాను. దారి సన్నయిసక పొర. నిండా అడివి లేదు. యీ సత్రము పూర్వము వున్న వొక గుంతను ఆసగాచేసి కట్టినాడు. మంచి మజిలీ స్థలము. సత్రము విశాలముగా వున్నది. సత్రములో తొవ్విన బావినీళ్ళు తేలికగానున్ను, రుచిగానున్ను వుంచున్నవి. భాటసారులకు కావలసిన సామానులు అన్ని దొరుకును. యిక్కడ భోజనము కాచేసు కోవడానకు మధ్యాహ్నము నిలిచినారు.

నెల్లూరిసీమ పుల్రుషులు, స్త్రీలు దేహపటుత్వము కలవారుగా నున్ను, యధోచితమయిన శుకచరూపము కలిగి సౌందర్య వతులుగా తోచు చున్నదిగాని దేహవర్ణము నలుపుకలసిన చామనగా తోచుచున్నది. గుణము నిష్కాపట్య ప్రధాన మని చెప్పవచ్చును. యీ మధ్యాహ్నము మీదట రెండు గంటలకు బయిలు వెళ్ళి యిక్కడికి ఆమడ దూరములో నుండే కోళూరురాజు సత్రము ఆరుగంటలకు చేరినాము. దారిలో పెరియవేడు అనే వూరువున్నది. అక్కడినుంచి బండి భాట గుమ్మడిపూడిమీద చీలిపోవుచున్నది. నేను వచ్చిన భాటలో పయిసత్రము సమీపముగా పడవలగుండా వొక వుప్పుటేరు దాటవలెను. చెన్నపట్టణమునకు సమీపగా వుండే కాకిరేనుకాలువకు నీళ్ళువచ్చే ప్రళయకావేరి అనే యేరు పోలూరుదాకా ప్రవాహకొలమునందు వచ్చుచున్నది. ఆయేరు యీ దినము దారి నడవడములో చూస్తూ రావచ్చును. నేడు మధ్యాహ్నము నడిచినదారి యిసకపర. పెరియవేడు మొదలుగా వుప్పుపయిరు చేసే అళాలు శానా వున్నవి. పయినవ్రాసిన సత్ర్ము నుంచి సుందరమయినతోట మధ్యే రెండుకట్లుగా కట్టి వున్నది. జలవసతి కద్దు. సత్రమువద్ద వొక అంగడి అయినా అన్నిపదార్ధాలు దొరికినవి. యీ రాత్రి యిక్కడ వసించినాను.


ఇరువదియైదవ ప్రకరణము  నెల్లూరు నుండి చెన్నపట్టణము

సెప్టెంబరునెల ఒకటి తేది ఉదయాత్పూరము నాలుగంటలకు బయిలువెళ్ళీ యిక్కడికి పద్నాలుగు ఆమడలదూరములో వుండే పొన్నేరి యనే స్థలము పది గంటలకు చేరినాను.*

గమనిక, * ఇక్కడ యీదులనారాయణయ్యగారి దగ్గఱ బసచేసినా నని వ్రాతప్రతి నాలుగు వందలు ఇరవై పుట.

దారి రేగడభూమి గనుకనున్ను వర్షాలునిండాగా యిప్పట్లో కురిశివున్నది గనుకనున్ను నడవడానకు నిండా ప్రయాసగా వుండినది. పొన్నేరి వూరిముందర అరణ్యనది రొమ్ములమట్టు నీళ్ళుండగా కాలినడకగా దాటినాము. పొన్నేరియనే వూరు రెండుభాగాలుగా విభజింపబడి వున్నది. ఆరెండు భాగాలున్ను కలియడానకు మధ్యే వొక విశాలమయిన అంగడివీధి సత్రాలు సహితముగా కట్టివున్నది. యీ వీధిలో ప్రతిసంవత్సరము హరిహరాదులు వారివారి వాహనారూఢులయి సంధించే వుత్సవము జరుగుచున్నది. గనుక ఏతద్విషయమయి యీ వీధిని బహుసుందరముగా యేర్పరచివున్నారు. దక్షిణభాగమందు వుండేవూళ్ళో ఆరుముఖ మొదలారి వొక శివాలయము తటాకము మొదలైన ధర్మస్థలములను నిర్మించివున్నాడు. ఉత్తరభాగమందు అనారి విష్ణుస్థలము తటాకము మొదలయిన దేవాలయ బ్రహ్మాలయాలు వున్నవి. నలభై బ్రాహ్మణయిండ్లు కలవు. బట్టలు సహితముగా కావలసిన పదార్ధాలు అన్ని యీ వూళ్ళో దొరుకును. విశాలమయిన సత్రాలు చెన్నపట్టణపు వారు కొన్ని కట్టివున్నారు. విష్ణు స్థలమునకు భూరూపకమయిన జీవనము వుండేటందున కంపెనీవారు ధర్మకర్తను యేర్పరచి పనులు జరుపుకుంటారు. శివస్థలమునకు ఆరుముఖ మొదలారి వొక ముఠాను తీసి దాని ఆర్జితముగుండా అతి విమర్శగా నిత్యోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాలు జిరిగింపుచున్నాడు.

ఈస్థల మహాత్మ్యము బ్రహ్మాండపురాణాంతర్భూతముగా ఐదు అధ్యాయాలువున్నవి. వాటిసారమేమంటే శ్రీకృష్ణమూర్తి ద్వాపరాంతమందు కలిలో తాను యీస్థలములో మూర్తీభవింఛేటట్టు ఋషులకు చెప్పివున్నందున ఈ రహస్యము భారద్వాజులు తెలుసుకుని యిదే బృందావనక్షేత్రమని నిశ్చయించి యిక్కడ స్వామిసాక్షాత్కారము పొందడమునకు బ్రహ్మను కూర్చి తపస్సుచేసినట్టున్ను బ్రహ్మభారద్వాజుల యిష్టసిద్ధి అయ్యేకొరకు విష్ణుప్రీత్యర్ధముగా నారాయణవనములో యాగము చేసినట్టున్ను అప్పుడు అరణి మధనలో ప్రధమము వొక నది పుట్టినంతలో ఆ అరణ్యనదిని భారద్వాజుల నిత్యకర్మాదులకు వొదిగేటట్టుగా యీ పొన్నేరికి పంపించినట్టున్ను పిమ్మట యాగానంతరము శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమైనంతలో భారద్వాజుల యిష్టసిద్ధి చేయమని వేడుకుని శేషశాయి రూపముతో ఈ స్థలములో విరాజమాను డయ్యేటట్టు చేసినట్తున్ను పిమ్మట వొక గోవు పాలు కార్చడం మూలముగా వూహించి పుట్టచేత కప్పబడియుంఛే స్వయంభు కృష్ణమూర్తిని కరిపాండ్యరాజు వేశేషక్షీరాభిషేకము వల్ల బయిలుపరచి దేవాగారాలు కట్టి తనపేరు సహితముగా కరికృష్ణుడని నామమరణముచేసి ఆరాధనచేయనుచూ వచ్చినట్టున్ను ఈ అరణ్యనదిన్ని ఈ స్థలమున్ను తదారభ్య యింద్రాదుల శాపాన్ని పోగొట్టి అనేకులను పావనులుగా చేయుచూ వుండేటట్టు విదితమయివున్నవి.

ఈ దినము వుట్లపండగ గనుక యిక్కడ భొజనానికి నిలిచి స్వామి దర్శనమున్ని చేసి నాలుగుగంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమడదూరములోవుండే విచ్చూరికి రాత్రి రెండు గంటలకు చేరినాను. మధ్యాహ్నముమీద నడిచినదారి రేగడభూమి. బండిదారి వొకటి కాలిదారి వొకటి అంతు రెండుదారులు కలిగివున్నవి. కాలిదారిగానే నడుస్తున్నవి. వర్షాకాలము గనుక బహు ప్రయూసగా వున్నది. పొన్నేరికి రెండు గదియల దూరములో యెలవంబేటి వద్ద కొరత లేదు నడుముల మట్టులోతు గనుక కాలినడకగానే దాటినాము. విశేష ప్రవాహకాలమందు పడవలు తెప్పలగుండా దాటవలసినది. విచ్చూరు లింగిశెట్టివారికి శ్రోత్రియగ్రామము. సంవత్సరానకు వెయివరహాలు యెత్తును. ముప్పై బ్ర్రాహ్మణ యిండ్లు కలవు. సమస్త పదార్దాలు దొరుకును. చుట్టూ అశ్వద్ధవృక్షాలుగల రమణీయమయిన వొక తామరకొలను అగ్రహారమునకు సమీపముగా వున్నది. యిక్కడ ఈ రాత్రి మసుసటి దినము మధ్యాహ్నమువరకు నిలిచినాను.

లోకములో యీశ్వరుడు వొక రూపముతో ఆదరింపుచు మాతాపిత్రాదులు అనేక రసాలను కాలోచితముగా తెచ్దుకొని వొక్కొక్క రసముతో వొక్కక్క విధమయిన అభినయాన్ని పట్టి శిసువులను రక్షించేటట్టు సమస్తవిధాలా యెదటనిలిచి యీశ్వరుడు మాట్లాడుచు వుండగా యీశ్వరుడు ప్రత్యక్షముకావలె నని లోకులు యీశ్వర సాన్నిధ్యము కావలెననిన్ని పిచ్చి తపస్సులు చేయుచున్నారు. యిందుకు కారణము జగదీశ్వరుని దురత్యయ మయిన మాయకాని వేరేకాదు.

తేది మధ్యాహ్నము మీదట నాలుగు గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమడ దూరములో వుండే తిరువట్టూరు అనే మహాస్థలము అస్తమానానకు చేరినాను. *

గమనిక, * కోమలేశ్వరుడి గుడి మునియపిళ్ళ కొమారుడు శ్రీనివాసపిళ్ళ వారున్ను వచ్చి కలుసుకొని తమ సంకల్పం సిద్దించెగదా అని ఆనంద పడ్డాడు అని వ్రాత ప్రతి నాలుగు వందలు ఎనభై ఒకటి పుటలో వున్నది.

దారి వుప్పురేగడిభూమి. చెరిసగము దూరములో సుంకపుమెట్టు వొకటి వున్నది. సుంకము వసూలు నిమిత్తము యిక్కడ మూటలు ముల్లెలు చెన్నపట్టణమునకు నాలుగు పక్కలా వుండే మెట్లలో సోదా యిచ్చేటట్టుయిక్కడ యివ్వవలశినది. నేటి దారిలోమధ్యే కాకిర్రేవు కాలువ దాటవలశినది. వారధి మీదపోతే కొంతచుట్టు గనుక పడవలగుండా ఆ కాలువ దాటినాను. వర్షాకాలము గనుక దారి అడుసుగా వున్నది. యీతిరువట్టూరు బహు సుందరమైన వూరు. ప్రతిసంవత్సరము యిక్కడ జరిగే బ్రహ్మోత్సవము వసంతకాలములో శుక్లపక్షములో అపర రాత్రిళ్ళలో విభాము జరుగుటచేత చెన్నపట్టణములో సమస్త విధములయిన జీవనోపాయాలు కలవారు నిద్రాకాలాన్ని మానుషానందాను భవానకు వుపయోగము చేసుకుని చెన్నపట్టణము మొదలు తిరువట్టూరివరకి రెండు కోసులదూరములో అడుగుకు వొక సత్రముకట్టి దానికి తగ్గ వుపచారములు వారువారు ఆ సత్రాలలో చేస్తూవుండడమువల్ల సౌఖ్యముగా వచ్చి యీబ్రంహ్మోత్సవాన్నిన్ని వేడుకపరచి తాము ఆనందపడిపోతూ వుంటారు. యీవూళ్ళో చెన్నపట్టణపు వుపపన్నులు అనేకసత్రాలు కట్తివున్నారు. విశాలమయిన వీధులు కలవి. వీధులు తెంకాయచెట్లశాలల వల్లను బయిటితిన్నెలు పందిళ్ళుచేతనున్ను అలంకరించబడివున్నవి. సుందరమయిన దేవాలయము తటాక సహితముగా వున్నది. సమస్తపదార్ధాలు దొరుకును. యీ గుడిధర్మము లింగిశెట్టి కుమారుడైన అరుణాచల శెట్టి తనచేతి సొమ్ము సంవత్సరానకు రెండు వేల వరహాలదాకా ఖర్చు చేసి జరిగింపుదున్నాడు. ఆ ధర్మము కాక అతను అన్నదానాపేక్ష చాలా కల వంశములో జనించినాడు గనుక ఆ వాసన యీ పురుషుణ్ని బాగా పట్టి వున్నది.

యీ స్థల మహాత్మ్యము యే మంటే సృష్టికి ఆదియందు భూమి జలార్ణవమై వుండగా యీశ్వరుడు సృష్టికి అంకురముగా వొక ఔదుంబర వృక్షము కలగచేసి చండవాయువు చేత ఆవృక్షమును యుక్తప్రదేశములో నిలుపుమని పంపించినట్టున్ను ఆ వృక్షము యీ వూళ్ళో పతనమై పాతాళలోకము అంటినట్టున్ను దాన్ని వేళ్ళపుష్టి భూమిని అప్పట్లో ఆవరించి భూమి మీద వుండే వుదకాన్ని పానము చేసి భూమిని బయిలు పడతోశినట్టున్ను అప్పట్లో వినాయకుడు మొదలయిన ఆవరణదేవతలు ఆచెట్టు కింద ప్రవేశించినట్టున్ను ఆదిశేషుడుకూడా వొకపుట్టను యిక్కడ కల్పించుకొని వసింపుచున్నట్టున్ను అఘుపిఎనిమిదిమ్మట యీస్థలములో వసించగలందులకు పార్వతిని రమ్మంటే సృష్టి స్థితి సంహారములలో అధికారము తనకుకూడ యివ్వకగాని తాను రానని చెప్ప్నట్టున్ను పిమ్మట యీశ్వరుడు అదేప్రకారము అధికారము యిచ్చి పార్వతిని వెంటపెట్టుకుని ఆదిశేషునివల్ల పూజింపబడి అతను కట్టుకునివున్న వల్మీకములోనే ప్రవేశించి అద్యాది వుండేటట్టున్ను పార్వతీదేవినిన్ని త్రిపురసుందర్యాకారము వహించి సృష్టి స్థితి సంహారాధికారము చేయుచూ యిక్కడ విలశిల్లి వుండేటట్టున్ను పిమ్మట యీశ్వరుడు తన ప్రతిభాతిని మూర్తీగాచేసి సుందరుడని నామముపెట్టి పార్వతియొక్క ప్రతిభాతితో పొగడచెట్టుకింద యిద్దరి కిన్ని వివాహముచేసినట్టున్ను ఆ వాహము ఛూడవచ్చిన గంగాస్నాతయయిన భక్తుడు కాలాతీతముగా వచ్చి వివాహము చూడడానకు లేకపోయెనని దు, ఖపడితే అతని గంగను యిక్కడి తటాకములొ విలసింపచేసి మళ్ళీ ఆవివాహ లాంఛన జరిగించి అతనికి దర్శనము యిచ్చినట్టున్ను ఆ వివాహలాంచన ప్రతిసంవత్సరము యిప్పుడు బ్రహ్మోత్సవములో పొగడమాను సేవ అని జరిగేటట్టున్ను బ్రహ్మకు పార్వతి నిమిత్తము తాను ఆడిన తాండవము యీశ్వరుడు యిక్కడ మళ్ళీ దర్శనము అయ్యేటట్టు చేసినట్టున్ను మరికొన్ని కాలాలలో కొందరు భక్తులకు అపహరించబడ్డ భాగ్యాన్ని త్యాగము చేసినట్టున్ను మొట్టమొదట పుట్టిన పురి అయినందున యీవూరు ఆదిపురి అనిపేరు కలిగి తాండవము చూపుటచేత తాండవ ప్రయుక్తమయిన భవును అనే నటనలు ఆడుతూ త్యాగద్వారా త్యాగరాజు అని మూర్తి పేరువహించి వల్మీకనివాసముచేత అదే మూలస్థానమై వుండేటట్టుగా ప్రసిద్దిపడి యున్నది. యిక్కడ మరునాడు దాకా వచింనాను.

తేది సాయంకాలము ఐదు గంటలకు బయిలువెళ్ళి యిష్టులతో కూడా చెన్నపట్టణమునకు అరకోసెడుదూరములో తండయారు వేడులో వుండే నాతోట యిల్లు ఆరుగంటలకు చేరినాను. దారి యిసక పొరభూమి. యిరుపక్కలా తోటలు సత్రాలు దట్టముగా వుండుటచేతనున్ను భాట వెడల్పు చలాకలిగివుండుట చేతనున్ను బహు రమణీయముగా చూడవేదుకగా వున్నది. జగదీశ్వరుడు ఈ తృణాన్ని మేరువు చేసుననే వాక్యము సత్యము అని నేను అతి ఘోర ప్రమాణము చేయగలను. అది యెట్లాగంటే నేను స్వస్థలము వదిలి మళ్ళీచేరినకాలము పదిహేను మాసాలౌ పదిహేను దినాలు పది నిమిషాలు. నాస్వస్థలము వదిలి దూరదేశము సంచరించి మళ్ళీవఛ్ఛినట్టు నాకు నాపరివారానికిన్ని తోపచేయక వొకరికి కాలిలో ముల్లుకూడా నాటినట్టు తోపచేయకుండా తృణానికి తక్కువ అయిన నన్ను రాజఠీవిగానే స్థలముచేర్చినాడు.

గనుక అవ్యాజముగా ఈశ్వరుడు తృణాన్ని మేరువుచేస్తాడనే మాట సత్యం సత్యం పున, సత్యమని నా సహోదరులైన లోకులు నమ్మవలశినది.

నా జన్మభూమి అయిన చెన్నపట్టణపు వృత్తాంతము యెటువంటిదంటే మూడు వందలు యేండ్ల కిందట చంద్రగిగిలో బీజానగరపు స్దంస్థానాధిపతి యయిన శ్రీరంగరాయడు దొరతనము చేయుచుండగా డే అనే దొర యీ సముద్రతీరమునందు వొక రేవుబందరు కట్టించవలనని యత్నము చేసి శ్రీగంగరాయణ్ని అడిగి వుత్తరువు తీసుకుని యీ ప్రాంత్యాలకు జమీందారుడయిన దామర్ల వెంకటాద్రినాయుడి పేర సన్నదు పుచ్చుకొన్నాడు. ఆ వెంకటాద్రినాయడు డే దొరకు కృతపరిచయుడు గనుక శ్రీరంగరాయడు తన పేరుపెట్టి శ్రీరంగరాయ పట్టణము అని రేవు బందరు కట్టమన్నా వెంకటాద్రినాయడు తన తండ్రియైన చెన్నపనాయడి పేరట చెన్నపట్టణ మని పేరుపెట్టి కట్టమని చెప్పడమేగాక తానే సన్నిధానాధిపతి గనుక అదే నామకరణము ఆరంభములో ఛేసినందున చెన్నపట్టణమని పేరు కలిగినది. తత్పూర్వము యీరేవును యింగిలీషువారు మదిరాసు అంటూ వచ్చినారు.

పిమ్మట పదహారు వందల నలభై నాలుగు యింగిలీషు సంవత్సరములో రేవు బందరుకు చేరినట్టుగా వొక కోటకట్టి చముద్రతీరము నందు రెండుకోసుల భూమిని యింగిలీషువారు స్వాధీనము చేసుకున్నారు. అటుపిమ్మట పదహారు వందల అరవై ఒకటి సంవత్సరములో యింగిలీషువారిలో కొంత అంత, కలహము జరిగి అరాజమమయి పదహారు వందల డెబ్బై ఒకటి సంవత్సరములో మళ్ళీ స్థిరపడి యీ రేవు బందరు సుంకము యిజారా కంపెనీవారి చేసినారు. వంబడిగానే కంపెనీవారి ప్రాపకము కోరి జగదీశ్వరుడు సత్యవాదులపై పక్షపాతి గనుక యింగిలీషువారు చాలా సత్యసంధులయినందున యీ బస్తీలో మూడు లక్షల ప్రజ వాసముఛెశేటట్టు చేశినాడు. పిమ్మట పదహారు వందల అరవై ఆరు సంవత్సరములో నలభై వేల వరహాలు సాలుకు యెత్తేపాటి భూమి కంపెనీవారి యధీనమయినది. పిమ్మట పదిహేడు వందల రెండు సంవత్సరములో డిల్లీ పాదుషా అవరంగజీబు తరపున దావూతుఖానుడు దండుయెత్తివచ్చి యింగిలీషువారిని చాలా కలతపెట్టినాడు. అప్పట్లో అనేక తెగలు అనేక దేశములనుంచి యిక్కడికి చేరినందున యెడమచెయ్యి కక్షి అని కుడిచెయ్యి కక్షి*

గమనిక, * కుడియెడమల కులకక్షలు, వైష్ణవబ్రాహణులలోని వడగలి తెంగలి తెగలవలెనే ద్విజేతరకులములందు కుడి ఎడమ కులకక్షలు చాలాకాలమువరకు అతి తీవ్రముగా నుండేవి. కుడిచెయ్యి కలకక్షిలో లింగధారణముచేసిన నేతగాండ్రు, తెలికలవాండ్లు, కుట్రపుపనివాండ్రు, బలిజలు, గొఱ్ఱెల కాపరులు, కుమ్మరులు, మేదరులు, చాకళ్ళు, మంగళ్ళు, జోగులు, బుడబుక్కలవాండ్రు, మాలలు నుండిరి. ఈ కుడికులమువారిని కొన్నిచోట్ల చైనాచారులని న్ని, కొన్నిచోట్ల మహానాటివారనిన్ని వ్యవహరించిరి. ఎడమచెయ్యి కులములను పాంచాలలనిన్ని, మత్తుజనిన్ని వ్యహరించిరి. వీరిలో జందెములు వేసికొను అయిదు తెగల బత్తులు, వెండి బంగారు పనిచేయు కంసాలిబత్తులు, రాగి యిత్తడి పనిచేయు కంచరిబత్తులు, రాతి పనిచేయు శిల్పులు, రంగులువేయు హటగాదులు, నేతనేయు దెవాంగులును, గొల్లలు, మతరాచలు, మాదిగలు మొదలగువారుండేవారు. ఈ రెండు కక్షలలోని కులములవారు వొకరికన్న వొక రెక్కువ వారమనిన్ని తమకు ముందుగా మర్యాదలు జరుగవలెనన్ని తగవులాడుచుండేవారు. ఈ రెండు తెగలకు వేరువేరు మతాచారములుండెను. దేవతలు దేవుళ్ళు నుండిరి. వీరి వివాహములందు మరణములందు కొలువులందు జాతరలందు ఒక కులకక్షివారి వీధులనుండి రెండవకక్షి కులములవా రూగేంపులు చేయకూడదను కులకట్టులు నిషేధములు అనాదిసిద్ధముగా నుండి తగవులకు దెబ్బలాటలకు కారణ మగుచుండెను. పెండ్లిండ్లలో మహానాటివారిలో మాలలు గుఱ్ఱమునెక్కి యూరేగుటకు కొన్ని గ్రామములందభ్యంతర ముండెను. తక్కివారిలో ఆయా కులముల తారతమ్యములను బట్టి పల్లకీలు మొదలైనవి యెక్కి భజంత్రీలు మేళతాళములతో నూరేగినచో నెడమకులములవా రభ్యంతర పెట్టకుండిరి. ఇంకను చిత్రవిచిత్రములైన యాచారాలుండెను. ఇవి మీరినట్లయితే రెండవారు ఆటంక పరుచుచుండేవారు. చాలాకాలమువరకు నింగ్లీషు కంపెనీప్రభుత్వము వారీ కులమర్యాదలను కాపాడుచునే యుండిరి. సివిలు క్రిమినలు కోర్టు లీ తగవులతో నిండుచుండేను. దేశము తెలుగు మీరిన తరువార రోడ్లు మొదలగు బహిరంగస్థలములలో నందరికిని సమానమైన హక్కులు కల సమ సిద్ధాంతము స్థాపింపబడినది. చెన్నపట్టణమున పదహారు వందల యాభై రెండు, వంద డెబ్బై నుంచి ఏడు వరకు, పదిహేడు వందల పద్దెనిమిది సంవత్సరములం దిట్టితగవులువచ్చింట్లు కంపెనీ వారి రికార్డులలోనే వివరింపబడియున్నది. ఈ రెండుకులములవారికి పెద్దనాయకునిపేట ముత్యాలపేటలలో ప్రత్యేక వీధు లేర్పాటు చేయబడెను.

అని రెండు పక్కలుగా యిక్కడివారు చీళి యింగిలీషువారికి చాలా శ్రమను కలగఛెసినారు. అందుకు నలభై సంవత్సరముల తర్వాత ప్రాంసువారు యీకోట తీసుకొని యింగిలీషువారిని వెళ్ళకొట్తినా హిందూస్థాన్ లో యింగిలీషుజాతికి దిగ్విజయము కలిగి వుండెను గనుక వారు వొకపాటిగా సమాళించినారు. వెంబడిగానే ఐదు సంవత్సరములకు రాజీ మీద యీ స్థలమును యింగిలీషువారు స్వాధీనము చేసుకున్నారు. పదిహేడు వందల నలభై రెండు సంవత్సరములో కలాపన పొసగి జగదీశ్డ్వరుని కటాక్షముచేత ప్రాంసు దండు పరారి అయిపోయినది. అది మొదలుగా అరికాటి నవాబును విహితపరుచుకుని క్షేమముగా కాలము తోయుచుండగా పదిహేడు వందల అరవై ఏడు సంవత్సరమువరకు హయిదరుతో నవాబు నిమిత్తము పోరవలశి వచ్చినది.

అది మొదలు యధాక్రమముగా అరికాటినవాబు రాజ్యమంతా యింగిలీషువారి అధీనమయి వుత్తరము గంజాం మొదలు దక్షిణము తిన్నెవల్లి శీమవరకున్ను తూర్పుసముద్రము మొదలు పశ్చిమసముద్రమువరకున్ను యేకచక్రాధిపత్యముగా యీ చెన్నపట్టణమును రాజధాని చేసుకుని కంపెనీవారు యేలుతూ వున్నారు. యీ రాజదానికింద యిప్పుడు వుండే జిల్లాలు యిరువైవొకటి. యింత భూమిమధ్యే మయి సుమారు మళయాళము కొచ్చిల్ యీ దేశముల రాజులుతప్ప కొదవ అందరు జమీందారి పాయకాలవారు గాని యుద్ధసన్నద్ధులు కాగల భూపతులు వొక్కడున్నులేరు.

యీ చెన్నపట్టణము కొడి, జండా, కింద యిప్పుడు సాలుకు సుమారు ఒకటింకాలు కోటివరహాలు వసూలవుతున్నవి. ఖరుచులు అప్పులకు యిచ్చేవడ్డి సహాగా వసూలుకు యెక్కువగాని తక్కువలేదు. యీ చెన్నపట్టణము కొడికింద కంపెనీవారి అప్పు సుమారు రెండుకోట్లవరహాలు వుండును. స్థావరజంగమ రూపమైనస్థితి మూడుకోట్ల వరహాలు వుండునని తోచుచున్నది. దండు నలభై వేలమంది ఫౌజువున్నది. యీ చెన్నపట్టణపు బస్తీకి మూడుపక్కలా షహరు, పానా, గోడపెట్టివున్నది. తూర్పుపక్క సముద్రమేగాని గోడలేదు. బస్తీకోసెడు దూరములో దక్షిణపక్క యుద్ధసన్నద్ధమయిన కోట సముద్రవారగా కట్టివున్నారు. వుత్తరపక్క సముద్రముగట్టున యెగుమతి దిగుమతులయ్యే రేవు సరుకు వేసేకొట్లున్ను కట్టి వున్నవి. ఈ చెన్నపట్నానికంతా పాపంవీథి శాలవీధి ఈరెండున్ను విశాలమైనవి. నిండా కుసంధి అయిన వీధులుకావు. యిండ్లకు రెండువిధాల పన్ను రూకలు తీసుకుని వీధులుపూడ్చి మరామత్తుచెసి ఠాణాలు వుంచి కంపెనీవారు కావలి కాస్తూవుంటారు. యిండ్లు తలవాకిలి తిన్నెలు పందిళ్ళు బయిటికి అలంకారముగానున్నూ లోపల కలకొద్దిలో ఘాలికి అడ్దులేకుండా కట్టియున్నారు. పది దేవాలయముల దాకా యున్నవి. అందులో విభవముగా ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు జరుగుతూ వుంచున్నవి.

సముద్రముగుండా వచ్చేపొయ్యే సరుకులకు తీరువసుంకము తీశే నిమిత్తము సముద్రతీరమందు కష్టంహవుసు అని వొక కఛ్ఛేరివున్నది. గట్టున వచ్చేపొయ్యే సరుకులకు తీరువ తియ్యడానకు పడమటిపక్క లాండు కష్టంహవుసు అని వొక కచ్చేరి కట్టివున్నది. మిగిలిన కఛ్ఛేరీలు కొన్ని రేవులొనున్ను, కొన్ని కోటలోనున్ను, కొన్ని బయటతొటలలోనున్ను చేయుచూ వుంటారు. సర్వాధికారియైన గౌనరుయిల్లు అరికాటి నవాబు యిల్లున్ను కోటకు దక్షిణభాగ మందు పావుకోసు దూరములొ తిరువళిక్కేణి అనె వుపగ్రామములో వున్నవి. జాతుల వాండ్లందరు బస్తీకి దక్షిణము ఆమడ దూరములో వుండే పెరుంబూరి వరకున్ను సుందరమయిన తోటలు వేసి బంగాళాలు, యిండ్లు కట్టుకుని వున్నారు. బస్తీలోపలవుండే హిందువుల యిండ్లలో అయ్యాపిళ్ళ యిల్లు పెద్దది. కోటలోపల వుండే యిండ్లలో వాడలకు తెలిశే నిమిత్తము రాత్రిళ్ళు దీపముపెట్టే యెక్కీసుచెంజియిల్లు పెద్దది. బయిటావుండే జాతులవాండ్ల మిద్దెలలో మురాతు, J. Moorat, కట్టిన యిల్లు పెద్దది.

బస్తీకి దక్షిణము తిరువళిక్కేణి, మయిలాపూరు, తిరువటేశ్వరుని పేట మొదలయిన కొన్ని వుపగ్రామాలు వున్నవి. పడమటిపక్క చూళ పొరికపాక, కోమలేశ్వరునిగుడి యివి మొదలయిన కొన్ని గ్రామాదు లున్నవి. వుత్తరభాగమందు చాకలపేట, రాయపురము, తండయారువేదు మొదలయిన్ కొన్ని గ్రామాలు వున్నవి. యీ బస్తీలో వుండే హిందువులు అందరు వుత్తరభాగమందు తిరువట్టూరి వరకు ఆరామక్షేత్రాలు భేటాగా యేర్పరచుకొని విలాసకాలముల యందు అక్కడికి వెళ్ళి విహరిస్తూ వుంటారు. కోమలేశ్వరున గుడివద్ద వొక చిన్నయేరు ప్రవహింపుచున్నది. దక్షిణపక్క మయిలాపూరు చెరువు కట్టివున్నది. పడమటిపక్క లుంగంబాక చెరువు కట్టియున్నది. వుత్తరపక్క ప్రతి తోటలలో తటాకాలు, దొరువులు తొవ్వివున్నారు. అందులో జగదీశ్వరుని కటాక్షముచేత మంచినీళ్ళు కలిగివున్నవి. సమస్త ద్వీపాంతరాల పదార్ధాలు కలవు. పనివాండ్లసహా అమితముగా కలరు. అయితే జనసమ్మర్దముచేత భూమి ఆరోగ్యమయినది కాదు. వుష్ణవయువు భూమి. సంకలిత రోగాలు ప్రాప్తిస్తూ వస్తున్నవి. కాల నియమాలు లేకుండా కాయగూరలు, ఫలాదులు, పుష్పాదులు అమితముగా దొరుకుచున్నవి.

యిక్కడివారి ప్రకృతులు ఉపాయవేత్తలుగాని సాహసులుగారు. ద్రావిడాంధ్రకర్ణాటక దేశాలమధ్యే యీ ప్రదేశము వుండుటచేత బాల్యాదారభ్య దేశ్యములయిన ఆ మూడు భాషలున్ను ముందు దొరతనముచేసినవారి తురకభాష, యిప్పుడు దొరతనము చేసే యింగిలీషువారి భాషయున్నూ నోటనానడముచేతనున్ను, పదార్ధములుగా కొన్ని సంసృతవాక్యాలు అభ్యసించుటచేతనున్ను యిక్కడివారి వుచ్చారణ స్ఫుటముగా వుంటూ వచ్చుచున్నది. యిక్కడి స్త్రీలు గర్విష్టులుగానున్ను, పురుషుల పట్ల నిండా చొరవచేసుకొగలవారుగానున్ను అగుపడుతారు. అయితే వస్త్ర్రాభరణప్రియులే గాని నైజగుణమయిన సాహసము నిండా కలవారుగా తోచలేదు.

యిక్కడి భూమి సారవత్తు కాకపోయినా లోకులు చేసే కృషివల్ల ఫలకారిగా వున్నది. వృక్షాదులు పుష్టికలవి కాకపోయినప్పటికిన్ని యిక్కడ సమస్తదేశపు వృక్షాదులున్ను కలవు. సమస్తజారుల పుష్పాదులు చూడవచ్చును. యిక్కడివారు చాలా మూర వెడల్పుకలబట్టలు కట్టుతారు. యధోచితము యిక్కడివారు కర్మకులుగానున్ను, దేవబ్రాహ్మణ విశ్వాసము కలవారుగానున్ను వుంటారు. యిక్కడి హిందువులకు పూర్వపు పురోవృద్ధి లేకపోయినప్పటికిన్ని ముందర చెందిన వాసనను ప్రయాసమీద కాపాడుకుంటూ వస్తారు. జాతులవారి జనబాహుళ్యము వారి విభవముతో స్త్రీ పురుష సల్లాపాలు చూడవలిస్తే ప్రతిదినము సాయంకాలమందు పరంగికొండశాల

గమనిక, పరంగికొండ అనగా సెంట్ తామస్‌మౌంటు. శాల యనగా బాటకిరు ప్రక్కల నీడకొరకు వేయు చెట్లవరుస. ఆకాలమున మౌంటురోడ్డులో కోటదగ్గర నుండి సెంట్ తామస్‌మౌంటుకు పోవు దారిలో ఐదు మైళ్ళ దూరమున కారన్ వాలీసు స్మారక చిహ్నము వరకు బాట విశాలమైనునుపైయుండెను. దానికి రెండుప్రక్కల మఱ్ఱిచెట్లు ఇతరవృక్షములు వరుసగానుండెను. ఇంగ్లీషు స్త్రీ పురుషులు సాయంకాల మా స్మారక చిహ్నము వరకు పల్లకీలలోను బండ్లలోను పోయి అక్కడ నేడు బీచిలోవలెనే సరససల్లాపములతో విహరించుచుండిరి. ఇట్లే వాడరేవు అనగా హార్బరు వద్దను నీడకొరకు చెట్లు వరుసగా పెంచియుండిరి. ఇదియే వాడరేవుశాల.

లోను సముద్రము వద్ది వాడరేవుశాల*లోనున్ను నిలిస్తే వారందరు వాహన విశేషాలు యెక్కి వస్తారు గనుక చూచి ఆనందించ వచ్చును. యిట్టిదొరతనములో జగదీశ్వరుడు నావంశపరంపరగా జీవనము కలగజేసి నన్ను వుంచియున్నాడు.

కాశియాత్ర చరిత్ర సంపూర్ణమైనది.

అనుబంధము

సంపాదకుడు

దిగవల్లి వేంకట శివరావు

బెజవాడ

అనుబంధము

సూచిక,

విషయములు పుట

ఒకటి. సౌరమానము, చాంద్రమానము, బౌర్హస్పత్యమానము

అధిక క్షయ మాసాలు ఒకటి నుంచి నాలుగు వరకు

రెండు. సనరణల పట్టిక మూడు నుంచి పదహారు వరకు

మూడు. చెన్నపట్టణ ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారములో వున్న

కాశీయాత్ర చరిత్ర అసలు గ్రంధం

వ్రాతప్రతి - మచ్చుపుటలు పదిహేడు నుంచి ముప్పై మూడు వరకు

నాలుగు. కాశీయాత్ర చరిత్రలోని కొన్ని పదముల అర్ధములు ముప్పై నాలుగు నుంచి నలభై వరకు

ఐదు. అకారాది విధయసూచిక నలభై ఒకటి నుంచి డెబ్బై తొమ్మిది వరకు

కృతజ్నత

ఈ గ్రంధప్రకటనకు అనేక అంతరాయాలు కలిగినప్పటికీ, పరమేశ్వరుని అనుగ్రమహంవల్లను, మిత్రుల తోడ్పాటువల్లను, ఇది నిర్వహింపగలిగాను. ఈకార్యంలో బ్రహ్మశ్రీ శతావధాని వేలూరి శివరామశాస్త్రులుగారు, శ్రీ చెరుకుపల్లి వేంకటప్పయ్యగారు, శ్రీ ఘంటసాల సీతారమశర్మగారు, శ్రీ చల్లా జగన్నాధంగారు, శ్రీ కుందా నరసింహమూర్తిగారు మొదలైన నామిత్రులు చాలా శ్రద్దతీసుకుని నాకనేక విధాలుగా తోడ్పడ్డారు. శ్రీ శాస్త్రులువారు తమ ఆరోగ్యం సరిగ్గాలేనప్పటికీ పుస్తకాన్ని జాగ్రత్తగా పరిశోధించి కొన్ని ప్రయోగాలకు అవసరమైన అర్ధాలు వ్రాసి యివ్వడమేగాక అకారాది విషయ సూచికను కూడా సరిచూసి కొన్ని సంగతులు చేర్చారు. వీరందరికి కృతజ్నుడను.

తొమ్మిది నుంచి పది వరకు-నలభై ఒకటి -దిగవల్లి వేంకటశివరావు సం|| మార్చి పదహారు తేది మొదలు జూలై తొమ్మిదవ తేది వరకు ఆంధ్రనార పత్రికలో వారానికి ఆరు ఏడు కలములచొప్పునను, మార్చి మొదటి తేది మొదలు మే పది తేది వరకు కృష్ణాపత్రికలోనూ, వరసగా ప్రతివారము వ్యాసాలరూపంగా ప్రకటితమైనది. ఇది ఇంకా పుస్తకరూపంగా ప్రకటించబడలేదు. మీకు కావలిస్టే ఆ సంచికలు తెప్పించుకుని చదివి చూడండి.

చ్సరిత్రపేరున మన కన్నులు గప్పుతూ బ్రిటిష్ ప్రభువుల యాధిక్యతను మన అల్పత్వమును ప్రకటించుటకు భారత దేశమున బ్రిటిష్ రాజ్యతంత్రమును సమర్థించుటకు ఏర్పడిన చరిత్ర వాఙ్మయం లోని అసత్యపు వ్రాతల నన్నింటినీ పూర్వకాలంనాటి ఇంగ్లీషు గ్రంధకర్తల నోళ్ళద్వారానె ఖండించి రాజకీయార్థిక రహస్యాలను భేదించి యధార్ధ చరిత్రను బయల్పరచ గలిగాను. ఇంకా వివరాలు కావలసిన వారు చదువుకో గలందులకు అసలు గ్రంధాలపేర్లుకూడా అందులో వుదాహరించాను. ఇది నాలుగేళ్ళనుంచీ చేస్తూవున్న పరిశొధన యొక్క ఫలితము.

ఆంధ్ర వార పత్రికలోని వ్యాసాల శీర్షికలు చూడండి,

* విస్సన్న చెప్పింది వేదం-విన్ సెంటుస్మిత్తు వ్రాసింది చరిత్ర

, ప్రచారంలో లేకుండా చేయబడిన పూర్వచరిత్రలు, చరిత్రలో కెక్కకుండా చేయబడిన, ఆంగ్లయుగంనాటి చరిత్రాంశాలు, నూతనంగా సృష్టిమబడిన పక్షపాతపు చరిత్రలు.,

*భారతదేశ పారతంత్ర్యము - భారతీయుల దేశాభిమానము.

, భారతీయులు బ్రిటిష్ రాజ్యతంత్రానికి సులభంగా లొంగలేదు- దానికి ఇష్టపడి హర్షించలేరు - నూరేండ్లు పోరాడారు.,

*ధరణాకూర్చొనుట - సాత్విక విరోధము.

, పదహారు వందల డెబ్బై ఎనిమిది నుంచి పదహారు వందల ఎనభై రెండు వరకు, పద్దెనిమిది వందల అరవై ఐదు, పద్దెనిమిది వందల పదమూడు నుంచి పద్దెనిమిది వందల పదిహేను వరకు సంవత్సతములలో కంపెనీ పరిపాలనలో జరిగిన సత్యాగ్రహముల చరిత్ర.,

*ఇంగ్లీషు దొరతనముయొక్క ప్రత్యక్ష ఫలితాలు.

, భారత దేశ రాజకీయ ఆర్ధిక సాంఘిక పరిస్థితులలలో మార్పులు.,

*బ్రిటిష్ హెబరుగారి భారదేశయాత్ర.

, పద్దెనిమిది వందల ఇరవై నాలుగు నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఆరు వరకు మధ్య ఆయన చూచిన భారతదేశ స్థితిగతులు.,

*కృష్ణాపత్రికలో- ఇంగ్లీషు చదువుల చరిత్ర.

ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర కాలం నాటి భారతదేశ రాజకీయ, ఆర్ధిక సాంఘిక పరిస్తితులను గూర్చిన వివరములను తెలిసికొన గోరువారు పైన నుదాహరించిన వ్యాసాలను, నేను రచించిన భారత దేశమున బ్రిటిష్ రాజ్య తంత్రము అను బ్రిటిష్ ఇండియా చరిత్రను తప్పకుండా చదవాలి.


అనుబంధము  కాలమానము సవరణలు మరియు చారిత్రక పద వివరణలు

కాశీయాత్ర చరిత్ర - అనుబంధము

సౌరమాన చాంద్ర మాసములు - అధిక క్షయమాసాలు.

ప్రపంచములో మనుష్యులందరూ సూర్యచంద్రుల నడకలను బట్టి కాలం లెక్కించుకుంటారు. అమావాస్యనుండి అమావాస్యవరకు గాని పౌర్ణమినుండి పౌర్ణమివరకూ గాని చంద్రుని వృద్ధి క్షయాలు చూసి నెలలు లెక్కపెట్టుకుంటారు. ఇలాంటి నెలలో రమారమి ఇరవై తొమ్మిది సగం రోజులు వుంటాయి. అలాగే సూర్యుడి నడకవల్ల కలిగేఋతువుపోయి అది మళ్ళీ రాగానే ఒక సంవత్సరమైనదని వ్యవహరించు కుంటారు. సూర్యుడు ఆకాశ చక్రంలో మేషాది పండ్రెండు రాసులూ తిరిగి రవడానికి మూడు వందలు అరవై ఐదు రోజుల ఆరు గంటల పన్నెండు నిమిషాలు ముప్పై సెకనులు పడుతుంది. పన్నెండు చాంద్రమాన మాసాలూ కలిసి మూడు వందలు యాభై నాలుగు రోజుల ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల ముప్పై నాలుగు సెకనులు మాత్రమే అవుతాయి. సూర్యుడొక రాసినుంచి ఇంకొక రాసిలో ప్రవేశించడానికి సంక్రాంతి అంటారు. దానికి పట్టే కాలాన్నే మాసంగా లెక్క పెట్టుకుంటే ఒకనెలలో ఇరవై తొమ్మిది లేక ముప్పై రోజులు ఇంకొక నెలలో ముప్పై ఒకటి రోజులు వుంటూవుంటాయి. అలాంటి పన్నెండు నెలల సౌరసవత్సరానికి రోజులు మూడు వందలు అరవై ఐదు సగం అవుతాయి. ఇలాంటి పండ్రెండు సంక్రాంతులను బట్టి ఏర్పడిన పన్నెండు మాసాలకూ మేషాది పన్నెండు రాసుల పేళ్ళు చైత్ర వైశఖాది పన్నెండు పేర్లుకూడా వ్యహారంలో వున్నాయి. ఈపద్ధతికే సౌరమాసం అని అంటారు. ఇది అరవదేశంలోను మళయాళదేశంలోనూ బంగాళాదేశంలోను వాడుకలోవుంది.

క్రీస్తుశకంలో ఇంగ్లీషువారు వాడేమాసాలుకూడా సౌరమానమాసాలే. తురకలు కేవలమూ నెలబాలుణ్ణీచూసి లెక్కపెట్టే చాంద్రమానమాసాలే వాడుకుంటారు. సౌరమాన సంవత్సరం కన్న చాంద్రమాన సంవత్సరం చిన్నది అవడంవల్ల వారి పండుగలు కొన్నాళ్ళవరకూ ఒక ఋతువులోను కొన్నాళ్ళతరువాత ఇంకొక ఋతువులోనూ వస్తూవుంటాయి.. పైన చెప్పినట్లు చంద్రసూర్యులు గమనాన్ని బట్టి గాక బృహస్పతి గమనాన్నిబట్టి కాలం లెక్కించుకొనే బార్హస్పత్యేమానం అనేది ఒకటి ఉత్తర హిందూస్థానంలోమగద దేశము మొదలైనచోట్లను ఓడ్రదేశంలోను వాడుకలో వున్నది. ఈ మాసంలో సంవత్సరానికి రమారమి మూడు వందలు అరవై రోజులే వుంటాయి.

మన ఆంధ్రదేశంలోను మహారాష్ట్ర కర్ణాటక దేశాలలోను చాంద్రమానమే వాడుకలో వున్నది. చాంధ్రమానం శుద్ధపాడ్యమితోను సౌరమాన మాసం సంక్రాంతితోను ఆరంభం అవడం వల్లను ఒకే పెరుగల మేష లేక చైత్రమాసం యొక్కవ్యాప్తి సౌరచాంద్రమానాలనుబట్టి తేడా వున్నందువల్లను యీరెండు మాసాలని బట్టి ఏర్పరచిన పర్వదినాలకు, సంబంధం లేకుండాపోతుందని మన జ్యోతిష్కులు చాంద్రమానాన్ని సౌరమానానికి లంకేవేసి మన సంవత్సరాదిని సౌరమానం మేష మాసం మన చైత్రమున్నూ వృషభమాసం వైశాహమున్నూ అవుతాయి. పైవుద్దేశ్యంతో మన పంచాంగాలలో తిధి వార నక్షత్రాదులను కూడా ఇలాగే సరిపుచ్చారు. అమావాస్యనాడు సూర్యచంధ్రులు కలిసియుంటారు. చండ్రుడు రొజుకు రమారమి కాశీయాత్ర చరిత్ర - అనుమంధము

అంశలు, డిగ్రీలు, నడుస్తాడు, సూర్యుడు ఒక అమ్శ మాత్రమే నడుస్తాడు. అందువల్ల వీరిద్దరికీ యాభై తొమ్మిది ఘడియల నాలుగు విగడియలలో,, ఇరవై మూడు సగం గంటలలో, పన్నెండు అంశల అంతరం కలుగుతుంది. ఈఅంశం వల్లనే ఒక తిధి ఏర్పడుతుంది. ఇలాంటి ముప్పై తిధుల కొక చాంద్రమాసం అవుతుంది. అయితే చాంద్రమాన సంవత్సరంలో తిధులు మూడు వందలు అరవై వున్నా రోజులు మూడు వందలు యాభై నాలుగు మాత్రమే గనక తిధులు వృద్ధిక్షయం చెంది ఆరు రోజులు తగ్గుతాయి. సూర్యచంద్ర్రుల నడకలలో తేడాలవల్ల ఒక తిధివ్యాప్తి ఒకప్పుడు అరవై ఐదు గడియలు ఇంకొకప్పుడు యాభై మూడు గడియలూ వుంటుంది. ఇలాగ మొత్తం మీద చాంద్రమాన సంవత్సరంలో పదమూడు క్షయ తిధులూ ఏడు వృద్ధి తిధులూ వుంటాయి.

ఇంక నక్షత్రాల సంగతికూడా ఇంతే. మొత్తం మీద చంద్రుడు రోజుకో నక్షత్రంలో వుంటాడుగనుక నక్షత్రమాసంలో ఇరవై ఏడు రోజులు పైచిల్లర వుంటాయి. తిధులలాగనే కొన్ని నక్షత్రాల వ్యాప్తి వృద్ధీ కొన్నింటిని క్షయమూ చెందుతుంది.

వారానికి ఏడు రోజులే వుంటాయి గాని పక్షంలో మాత్రం ఒక్కొకప్పుడు పదమూడు రోజులు, ఒక్కొక్కప్పుడు పద్నాలుగు రోజులు, పదహారు రోజులుకూడా వుంటాయి.

పైన చెప్పినట్లు చాంద్రమానాన్ని సౌరమానంతో సరిపుచ్చడంలో రమారమి మూడు సంవత్సరాల కొకమాటు చాంద్రమాన సంవత్సరంలో పదమూడు నెలలు ఏర్పరచ వలసి వస్తూ వుంటుంది. దానికే అధిక మాసమంటారు. ఏమాసం అధికమాసంగా నిర్ణయించడం అనే విషయంలో కూడా సంక్రాంతినే లక్ష్యంగా తీసుకుంటారు. సూర్య చంద్రుల గమనాలను బట్టి చాంద్రమానం చిన్నదిన్నీ సౌరమానం పెద్దదిన్నీఅ అయినప్పుడు ఆ చాంద్రమానంలో సంక్రాంతి వుండదు. ఆమాసాన్ని అధికమాసంగా నిర్ణయిస్తారు. చాంద్రమాసము పెద్దదిన్నీ సౌరమాసము చిన్నదిన్నీ అయినప్పుడు ఆ చాంద్రమాసంలో సూర్యుడు ఒకరాసి దాటి యింకొక రాసిలోకి పోయి మళ్ళీ దానిని కూడా దాటి మూడవరాసిలోనికి పొతాడు. ఒకేచాంద్రమాసంలో ఇలాగ రెండు సంక్రాంతులు కలగడంవల్ల ఆమాసానికి రెండు పేళ్ళు పెట్టవలసి వస్తుంది. అందుచేత ఆ సంవత్సరంలో ఒక నెలను అణిచివేస్తారు. దనికే క్షయమాసమంటారు. అప్పుడు పదకొండు నెలలే వుండవలసిందేగాని క్షయమాసం వచ్చిన సంవత్సరంలో తప్పకుండా అధికమాసంకూడా వస్తూవుంటుంది గనుక ఆ సంవత్సరంలోకూడా సరిగ్గా పన్నెండు నెలలు వుంటాయి. క్షయమాసాలు చాలా అదుదుగావస్తాయి. నూరు సంవత్సరాలలో ఒకటి రెండు క్షయమాసాలు వస్తాయి. శాలివాహన శకము వెయ్యి ఏడు వందలు నలభై నాలుగువ సంవత్సరము, క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై రెండు నుంచి పద్దెనిమిది వందల ఇరవై మూడు వరకు, చిత్రభాను నామ సంవత్సరంలో ఆశ్వయిజం అధికమాసంగాను పుష్యమాసం క్షయమాసంగాను వచ్చాయి. మళ్ళీ, పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు, శోభకృతు సంవత్సరంలో పుష్యము క్షయమాసంగాను ఆశ్వీజము అధికమాసం గాను వస్తాయి. ఎఫ్ఫుడువచ్చినా క్షయమాసం మార్గశీర్ష పౌష మాఘ మాసాలలో నే వస్తాయి. ఎందుచేతంటే ఈ చాంద్రమాసాలకు ఇరవై తొమ్మిది దినముల వ్యాప్తిగల సౌరమాసములతో సంబంధం వున్నది.*

*చూడు, ఆంధ్రవిజ్ఞాన సర్వస్వంలో కొమఱ్రాజు లక్షమణరావుపంతులు గారు వ్రాసిన అధికమాసం అనే వ్యాసము, లక్ష్మణరాయ వ్యాసావళిలో పంచాగము అనేవ్యాసము.

కాశీయాత్ర చరిత్ర - సవరణల పట్టిక అసలు గ్రంథం - వ్రాతప్రతి - మచ్చుపుటలు

చెన్నపట్టణం గవర్నమెంటు ఓరియంటల్ మన్యూస్క్రిట్సు లైబ్రరీలో వున్న నెం.పద్నాలుగు వందల ఏడు కు కాశీయాత్రచరిత్ర వ్రాతప్రతి. పద్దెనిమిది వందల ముప్పై రెండు లో బందరు జిల్లాజడ్జిగా వుండిన సె. పి. బ్రౌను దొరగారికి, ఈ గ్రంధకర్త వీరాస్వామయ్య గారు వ్రాయించి పంపిన అసలు పుస్తకమే.

ఇది పన్నెండు సగం అంగుళముల నిలువు ఎనిమిది ముప్పావు అంగుళముల వెడల్పు గల అరఠావులకు రెండు పక్కలా పుటకు ముప్పై ఒకటి పంక్తుల చొప్పున మంచి దస్తూరీతో తప్పులు లేకుండా వ్రాయబడిన నాలుగు వందలు తొంభై పుటల గ్రంధం శైధిల్యము, గ్రంధపాఠములులేవు. సమగ్రమైనది.

సంక్షిప్త పరచబదిన ఇంకొక ప్రతి తమవద్ద నున్నదనిన్నీ పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది లో అచ్చు పడిన గ్రంధం ఇంకా సంక్షిప్తమైన దనిన్నీ ఇదే అన్నింటికంటే మేలైన ప్రతి అనిన్నీ బ్రౌను గారు దీనిపైన పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది లో రెమార్కు వ్రాసి యున్నారు.

ఈ అసలు గ్రంధానికీ అచ్చుపుస్తకానికీ భాషలోకూడా తేడాలు కనబడుతూ వున్నవి. అసలు గ్రంధంయొక్క రచన ఎలావుంటుందో తెలియగలందులకు మచ్చుకు కొన్ని భాగాలను ఇక్కడ వుదాహరిస్తున్నాను.

వీరాస్వామయ్యగారు దినచర్యగాను, తమ మిత్రుడైన కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళగారికి జాబులు గాను వ్రాసిన కాశీయాత్ర చరిత్ర గ్రంధరూపంగా ఎలా కూర్చబదిందీ, దానిని అచ్చువేయడంలో ఆ గ్రంధాన్ని ఎలా తగ్గించినదీ, ఎలాగ మార్చినదీ కూడా ఈ వ్రాతప్రతివల్ల తెలుస్తుంది. వుప్పుకాలువకు వారధి కట్టి వుంన్నది, దాటి రావాలశ్నిది, దొవలో కొరతలేరు దాటవలశింది, అనే మొదలైన సూచనలు వీరాస్వామయ్యగారు అసలు జాబులలో మిత్రునికి వ్రాసే వాడుక భాషగానే వున్నది. ఇప్పటికీ వాడుక భాషకూ ఆ కాలంనాటి భాషకూ గల తేడాలు కూడా దీనివల్ల తెలుస్తాయి. ముఖ్యంగా వర్ణక్రమంలోని విశేషాలు గమనించతగివని. ఉ, భ్రాంహ్మణులు, చంన్నపట్నము, వుంన్నవి, లింగ్గము, తండ్డయారు వేడు, బండ్డి, మొదలైనవి. కొ, కో, గొ, గో, దొ, దో మొదలైన అక్షరాలకు ఏత్వమిచ్చి కొమ్ము, కొమ్ముకు దీర్ఘము ఇచ్చి ఒకారముగా వ్రాసే పద్దతి, ఇప్పుడు అచ్చూక్షరాలలో దొరకడంలేదు. ఇంకా చాలా వెశేషాలున్నవి చూడండి.

ఈవ్రాతప్రతిలోని భాగములు వ్రాసుకొనుట కనుజ్ఞ నిచ్చిన ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారాధికారులకు కృతజ్ఞడను.

భెజవాడ, ఇరవై నుంచి తొమ్మిది వరకు-నలభై ఒకటి ----దిగవల్లి వేంకటశివరావు.

యిది ఏనుగుల వీరాస్వామి అల్లించిన కాశీయాత్రచరిత్ర.

పద్దెనిమిదిth May పద్దెనిమిది వందల ముప్పై ఒకటి page in the printed Edition.

ప్రతి నెంబరుఒకటి

సంవ్వత్సరం మే నెల పద్దెనిమిదిది కుజవారం రాత్రితొమ్మిది ఘంటలకు చంన్నపట్నం వదిలి ప్రయాణమయి మాధవరం అనే గ్రామములో రాత్రి నిలిచినాను మాధవరం తండ్డయారువేడులోవుండె వాతోటకు మూడుఘడియల దూరం కీనీరుభూమి మాధుర్యమయిన వుదక సమృద్ధికలదు ద్ర్రావిడ వైష్ణవులు కసపురం క్రిషిమీద లక్ష్యం లేదు సమిధలు వగయిరా పట్నంలో అమ్ముకుని జీవనం చేసేవారు దోవలో వుప్పుకయ్య వుంన్నది ఆవుప్పుకాలువకు వారధికట్టి వుంన్నది దాటి రావలశ్నిది.

వుదయాన మాధవరం వదిలి పొల్లిపాలవాయ సత్రం మార్గంగ్గా వెంక్కటేశనాయుడి సత్రం చేరినాను అక్కడ తఋఆకము వుంన్న సత్రం ఖిలమయివుంన్నది అంగళ్ళుకద్దు మాధవరానికి ఐదు ఘడియలదూరం దొవ సరాళమయిన బుడ్డిభాట ఆ రాత్రి పెద్దపాళెం చేరి నాను దొవలో కొరతలేరు దాటవలశినది దగ్గర దగ్గర గ్రామాలు వుంన్నవి భాటసరాళం పెద్దపాళెంలో శక్తిరూపకంగ్గా పరమాత్ముడు తామస ఆరాధనను అంగీకరించ్చి లోకుల యిష్టసిద్ధి చేస్తూ వుంన్నాడు. అరణ్య నదీతీరం వాసయోగ్యం భ్రాంహ్మణ అగ్రహారం పలప

ట్టాడ యిండ్లు శివాలయం వున్నది ఆ శక్తి చింన్న లింగ్గం జాడగా భూమిలో వుద్బవించ్చివుంన్నది. శక్తి ఆలయం బహు చింన్నది శూద్రపూజ యీస్థళం పై సత్రానికి రెండుఆమడ దూరం.

ది పగులు పెద్దపాళెంలోవుండి రాత్రి తిరువళ్ళూరు చేరి నాను దొవలో కొరతలేరు మళ్ళీ దాటవలశ్నది దోవ సరాళం మంచ్చిబండ్డిభాట నెంగలి అనే గ్రామంవద్ద దొవలో సత్రంవుంన్నది తిరువళ్ళూరు విష్ణుస్తళం తీర్ధప్రాబల్యం, పుట.రెండు, తీర్ధంపేరు వృత్తాపనాశనీ తీర్ధంలో ప్ర్రార్ధనవాండ్లు బెల్లం వేయడం సాత్వికమూర్తి మహా ప్రాయశ్చత్తాలలో స్మృతిరీతిగా యీ తీర్ధం స్నానం యెత్తివుంన్నది ప్యాటస్థళం సమస్త వస్తువులు దొరుకును యీస్థళం పయిపాళ్యాని. రెండ్డుంన్నర ఆమడ యిక్కడ ఇరవై ఒకటి ది మధ్యాంన్నంవర్కు వుంన్నాను.

ది రాత్రి రామంజేరి మార్గంగా కనకంమ్మ సత్రం చేరి నారు రెండు ఆమడదూరం నది దాటవలశ్నిది రామంజేరివద్ద దారి రాతి గొట్టు మిగతాభాట సరాళం సత్రం బొంమాకంటి శంకరయ్య కట్టినాడు ప్యాటస్థళం కోమట్లు వుపపన్నులు అగ్రహారం వుంన్నది యిది మొదలుగా కావేటినగరంవారి శీమ గుంట్ట వుదకం బాగావుంన్నది.

ది బుగ్గగుడి భోజనానికి పగులు చేరినాను భాట సరాళం దూరం పద్నాలుగు ఆమడ పుణ్యప్రదేశం శాశ్వతంగా మూడుధారలు గంగ్గా యమునా సరస్వతీ అనిపించ్చుకుని గుడికింద్ద స్రవించ్చి నదిలోపడుతుంన్నది కాశీగుడి లాంచ్చనగా మూర్తులకు పేరు వుంచ్చివున్నారు సమీపాన వూరు యిండ్లు లేదు పదార్ధాలు దూరాన్నించి తెచ్చుకుని గుడికి సమీపముగా వుండ్డె తోపులో వంట్టచేసుకుని భోజనం చేసుకోవ్లశ్నిది. రమణియ్యం ప్రదేశం వుదకవసతి అరణ్యనదీతీరం యీరాత్రి నగిర మార్గంగా పుత్తూరు చేరినాను. పద్నాలుగు ఆమడదూరం నగిరివద్ద కనమ దాటవలశ్నిది కనం రాతిగోట్టు నాలుగు ఘడియల దూరం భాట ప్రయాస అవతల సరాళమయిన భాట నగిరి ప్యాటస్థళం సకల వస్తువులు ముసాఫరులకు కవలశ్నిది దొరుకును యీ పగిరిలో వెంకటేశనాయ, పుట.ఎనిమిది,డి కొమారుడు గొప్ప సత్రం కట్టను యత్నంచేస్తూ వుంన్నాడు. పుత్తూరిలో మునియప్పిళ్ళ సత్రం వుంన్నది యిప్పుడువచ్చిన భ్రాంహ్మల్కు గోసాయీలకు బైరాగులకు సదావర్తి యిచ్చేటట్టు నిశ్చయమయి వుంన్నది కంపెనీవారు దొరలకు ముసాఫరుఖానా కట్టివుంన్నారు చింన్న ప్యాటస్థళం కావలశిన సామానులు దొరుకును బ్ర్రాంహ్మల యిండ్లు వుంన్నవి మంచ్చినీళ్ళ గుంట వుంన్నది రమణియ్య ప్రదేశం చుట్టూ కొండలు.

అంజాలమ్మ కనమదాటి పడమాలపేటసత్రం ప్రవేశించినాను ఆమడదూరం కనమరాతిగొట్టు అయినా దాటడం నిండ్డా ప్రయాసకాదు ఆ కనమలో అంజాలమ్మ అనేశక్తి ప్రతిమెను వుంచ్చి వుంన్నది పందిలివేశి వుంన్నారు పరమాత్ముడి చైతన్యం ఆ ప్రతిమ యందు ప్రతిఫలించ్చి ప్రార్దించినవారి యిష్టశిద్దిని చేస్తూవుంన్నది భాట సరాళం. యీ సత్రం కొల్లా పెద్దసామి శెట్టి కట్టించినాడు సత్రం విశాలంగావుంన్నది బ్ర్రాంహ్మల్కు మాత్రం సదావర్తి యిస్తూంన్నారు తద్వారా సత్రానికి యశస్సు కలిగివుంన్నది. కనకంమ్మసత్రం మొదలు యీవర్కు కావేటినగరంవారిరాజ్యం. యీ రాత్రి అలమేలుమంగాపురం మార్గంగా దిగువతిరుపతి చేరినాను ఆమడదూరం దొవలో సువర్నముఖి దాటవలశినది. చెరువుకట్టమీద కొంత్తదూరం భాట నడవలశ్నిది సరాళమైన భాటెను దోవలో కొంన్ని బస్తీఅయ్ని వూళ్ళువుంన్నవి ఇరవై మూడు ఆదివారం ఇరవై నాలుగు ది సోమవారం ఇరవై ఐదు ది మంగళ్వారం ఇరవై ఆరు ది ఇరవై ఏడు ది బుధవారం ఇరవై ఎనిమిది ది గురువారం, పుట.నాలుగు, ఇరవై తొమ్మిది ది శుక్రవారం ముప్పై ది శనివారం ముప్పై ఒకటి ఆదివారం యీ తేదీ దినములు దిగువతిరుపతిలో వుంన్నాను.

ది భుధవారం కొండయెక్కి దిగినాను ఇరవై ఏడు ది గురువారం కపిలతీర్ధంలో సమారాధన చేసినాను ముప్పై ది ఆదివారం పగులు మూడు ఘంటల్కు తిరుపతివదిలి కరకరంబాడికి పోయినాను దిగువ తిరుపతిలో గొవిందరాజుల గుడి కోదండరామస్వామిగుడి వుంన్నది రామస్వామి గుడికి సర్కారు కుంమ్మక్కుఏమీలేదు గోవిందరాజుల గుడిఆచార్య పురుషుల స్వాధీనంలో వుంన్నది సర్కారువిచారణ కద్దు బ్రాంహ్మలు త్రిమస్తులగా రెండు వందలు యిండ్లు కద్దు గురునాధ శెట్టి అన్నసత్రం స్మార్తులకు వుంచి వుంన్నాడు మునియప్పెళ్ళ పదమూడు మందిచిన్నవాండ్లను పోషించ్చె పాటకశాల వుంచ్చి వేదాధ్యయనం చెప్పిస్తూ వుంన్నాడు చందూలాలా మొదలయిన ముగ్గురు పుణ్యాత్ములు గొసాయీల వగైరాలకు సదానత్రి యిప్పిస్తూవుంన్నాడు రెండ్డు మూడు రామానుజకూటాలని నామకరణంచేసి శ్రీవైష్ణవుల్కు ప్రసాదం దినం కలుగుతూ వుంన్నది. భారీవూరు సకల పదార్దాలు దొరుకును సకల విధములయిన పనివాండ్లు కలరు పంగ్గులూరు గురునాధ శెట్టి వగయిరా కొంద్దరు సాఃహుకార్లు వున్నారు. షహరుస్థళం అనిపించ్చు కుంట్టూ వుంన్నది కోతుల వుపద్రవం కలిగివుంన్నది పానానికి సరశింహ్మతీర్ధ వుదకం వుపయోగిస్తున్నది గాని వేరేలేదు రెండు ఘడియల దూరంలో కపిలతీర్ధం వుంన్నది యిది బహురమణియ్య ప్రదేశం గంగ్గదార సదాపడుతూ కింద తటాకవతుగా గంగ్ల నిలిచువుంన్నది, పుట.ఐదు, చుట్టూ విశాలమయిన మంట్టపం కట్టివుంన్నది భ్రాహ్మణ సంవారాదనకు అతియోగ్యంగా వుంన్నది యీ చుట్టుపక్క దేవస్థళాలలో చందులాలా ధర్మాలు నిండాగా జరుగుతున్నది ఘాలికాలంగనుక కొండమీద ఒక పగులు వున్నాను దిగువ తిరుపతినుంచ్చి కొండమీద స్వామివుండెప్రదేశం ఇరవై నాలుగు ఆమడ ఘాలిగోపురంవర్కు యెక్కుడు దిగుడు బహు కష్టం ఆవల కొంతప్రదేశం సమభూమిగా వుంటున్నది మళ్ళి యొక్కడం దిగడం కలిగినా ఘాలిగోపురంవర్కు కలిగినసంత ప్రయాసకాదు దారిలో నిలవడానికి అనేక మంట్టపాలు వుదక వసతి కలిగివుంన్నది ఘాలి గోపురంవద్ద ఒఖ బయిరాగి శ్రీరామవిగ్రహాలను ఆరాధిస్తూ వచ్చిన వారికి మజ్జిగ మొదలైనది యిచ్చి ఆదరిస్తూవుంన్నాడు. యెగువ తిరుపతిస్వామికి చెల్లుబడిఅయ్యె ప్రార్ధనలవల్ల కంపెనీవారికి సుమారు లక్షరూపాయలు వస్తూవుంన్నది యె సత్కార్యం యెగువ జరిపించ్చడానికి సర్కార్కు రూక యివ్వవలశి వుంన్నది యిక్కడ పరమాత్ముడు సంపూర్ణ కటాక్షంతో ప్రతిఫలించ్చి లోకుల పాపాంన్ని వారివిత్తం కుండాహరించ్చి యిష్టశిద్ధి చేస్తూవుంన్నాడు. వుండె శ్రీనివాసమూర్తి ప్రతిమె దివ్యమంగళ విగ్రహంహంగ్గా వుంన్నది దేవతులో ల్యాక దేవతులకు సమానమయిన వారో గత కాలంలో ఆమూర్తిని ఆరాధించ్చినట్టు తోస్తుంన్నది యిక్కడ గోసాయి బయిరాగులకు గురుపీఠంగావుండ్డె మహాంత్తుమఠం వకటి అతివిశాలంగ్గా కట్టి వుంన్నది ఆ మహంతుకు సిష్యార్జన విస్తారం కలదు. యిండ్లు నంకుచితం చైత్రమాసం మొదులు జ్యేష్టమాసంవర్కు వుదయకాలమంద్దు చ, పుట.ఆరు, చల్లని ఘాలికొట్టుతుంన్నది. అది శీతళించ్చి కొండమీద వుండెవారికి నిండ్డారోగప్రద మవుతున్నది. కోతుల వుపద్రవం విస్తారం. అడివిపందులు నిరొపద్రవంగ్గా మనుష్యుల మధ్యే సంచరిస్తూవుంట్టున్నది ఘాలికాలంలో మనుష్యులు నిండా కొండమీద వుండడం లేదు కొండమీద అరతిరుపావడ రెండు వందలు ఇరవై రూపాయిలు యిచ్చి విడిచి దక్షిణనసమేతంగ్గా ప్రసారం వినియోగం చేయడమయినది.

ఆదివారం రాత్రి కరకంబాడి చేరినాను దిగువతిరుపతికి ఆమడ దూరానికి కొంచ్చం తక్కువగా వుంన్నది యిది పాళెగాడి వూరు తిరుపతివగైరా వూళ్ళ కావలికెగాను యీ కరకంబాడి దీనితో చేరిన కొన్ని గ్రామాలు ఆ పాళెగాడికి కంపెనీవారు జారీగా నడిపిస్తూ వుంన్నారు. వూరు వసతి అయినదికాదు అయిన అవతల కఠినమయిన అడివగనుక విదిల్యాక దిగవలశ్ని మజిలీ అయినది. పోస్టు ఆఫీసు యిక్కడ వుంన్నది యధోచితంగా సామానులు ముసాఫరులకు దొరుకుతున్నది యిక్కడ ముసాఫరుఖానా కట్టివుంన్నది.

ది పగులు ఆరు ఘంటల్కు ముందురత్రి రెండ్డు ఘంటల్కు బయలుదేరి శెట్టిగుంట్ట చేరినాను దోవమిక్కిలి అరణ్య మధ్యంలొ వుండ్డి వుంన్నది. దొంగల రొష్టు మిక్కిలికద్దు. రాతిగొట్టు మార్గంమధ్యే పాలేగాండ్ల వూళ్ళు మామండూరు క్రిష్ణాపురం దోవలో దాటవలశ్నిది. వీరి సహాయం ల్యాక మాతుబరులు నిర్బయంగా యీఅడ్వి దాటలేరు. కలక్కటరుల్కు యీఅడ్విబాట నిర్భయంగా యీఅడ్వి దాటలేరు. కక్కటరుల్కు యీఅడివిబాట నిర్భయంగా చెయ్యడానికి, పుట.ఏడు, చాతకాకుండా వుంన్నది మామండూరికి యీవల ఐదు ఘడియల దూరములో బాలపల్లె అనేవూరు వుంన్నది అది మొదలు కడపజిల్లా సరిహద్దు యీ బాలపల్లె భూమినీళ్ళు బహు రోగప్రదమయినది. యిక్కడ రెండుమూడు నదుల వంట్టి కాలువలు దాటవలెను ఖనమ ఒఖటి దాటవలెను. బాట బహు రాతిగొట్టు యెక్కుడు దిగుడుగా వుంట్టుంన్నది. బహు దట్టమయిన వెదురు అడివి యీ శెట్టిగుంటలో మంచినీళ్ళచెరువు ఒఖటి వుంన్నది రెండ్లు బ్ర్రాంహ్మణ యిండ్లు కలవు ప్యాటస్థళం. కావలశిన సామానులు దొరుకును. బాలపల్లె మొదలు కడప కలక్కటరు అడ్వికొట్టి బాటవెడల్పుచేసి అక్కడక్కడ ఠాణాలు వుంచివున్నాడు. శేట్టిగుంట చేరె వర్కు భాట రాతిగొట్టుగానున్న అడ్విగానున్ను వుంటుంన్నది. కరకంబాడినుంఛ్ఛి ఆపాళెగాండ్లను మంచితనం చేసి యిరువైయింట్కి తుపాకీవాండ్లను శెట్టిగుంట దాకా తెచ్చినాను బాలపల్లెలో ముసాఫరుఖానా వుంన్నది యీదినం పగులు మూడు ఘంటల్కు బయలు దేరి సాయంత్రం ఏడు ఘంటల్కు ఒకటి ఆమడ దూరంలో వుండే కోడూరువద్ద వుండె సత్రం అగ్రహారం చేరినాను. కోడూగు బస్తి ప్యాటస్థళం ముసాఫరుల ఖానా వుంన్నది.

బ్రాహ్మణయిండ్లు లేవు. పయి అగ్రహారంలో యెమీ దొరకదు అంగళ్ళు లేవు భ్రాంహ్మలు శాంతులు కారు.

ది జూన్ ఐదు ఘంటల్కు బయలు వెళ్ళి ఆమడదూరంలో వుండె వోరంబాడు తొమ్మిది ఘంటల్కు చేరినాను యిక్కడ ముసాఫరుఖానా వుంన్నది ప్యాటస్థళం అన్ని సామానులు దొరుకును బాట బాగానేవున్నది. శెట్టిగుంట నుంచ్చి కోడూరికి రెండుమార్గాలు వఖటి అడ్విలో దండుభాట వఖటి పల్లెలమీద కాలిబాట. యీ కాలి భాటలోను సవారీలు రావచ్చు, పుట.ఎనిమిది,ను అడ్విభయం కోడూరితో సరి. యివతల భూమి తెరపగా దగ్గర గ్రామాలు పయిరుపొలం వుదకవసరి యిది మొదలయినది. భాటలో కోడూరి మొదలు కలిగి వుంన్నది యక్కడ చూచినా చింతచెట్లు కలవు బాలపల్లెవద్ద వుండ్డె కొండ వాగునీళ్లు నాబోయీలు వగైరా తాగినంద్దున వఖ బోయి వక కావడివాడు జ్వరం తిగిలి ఖాయిలా పడ్డంద్ను సమీపవతుగావుండె వోరంబాడిలో మధ్యాంన్నం నిలిచినాను యీ బాలపల్లెవద్ద వుండె కొండవాగువద్ద రాతిగొట్టు కనుమ వుంన్నది వాటివద్ద శ్రీనివాసమూర్తి పాదం వుంన్నది. అక్కడ నుంచ్చిపడమటి దేశస్తులు కొండ్డయెక్కుతారు యీదినం మూడు ఘంటల్కు బయలు దేరి ఘడియప్రొద్దువుండగా పుల్లంప్యాట చేరినాను నాలుగు ఘడియలు దూరం ముసాఫరు ఖానావుంన్నది ప్యాటస్థళం బ్రాంహ్మణయిండ్లు కలవు., ఈముద్రణం పుటలు.రెండు నుంచి మూడు వరకు,

వ్రాతప్రతి పుటలు నలభై నాలుగు నుంచి యాభై వరకు, చూడు. ఈముద్రణం పుటలు. ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు వరకు,

జూన్ ఇరవై ఆరు ది మంగళవారం రాత్రి మొదలు జూలాయి యనిమిదొ తేదీ మంగళ్వారం సాయింత్రంవరకు హయిదరాబాదు షహరుతో చేరిన బేగంబాజారులో వుంన్నాను ఆ రాత్రి మొదలు జూలాయి పదమూడు ది సోమవారం రాత్రివరకు శికింద్రాబాదు అనే పేరుగలిగిన యింగిలీషు వారిదండు వుండె బస్తీకి సమీపంగా వుండె కాకాగూడం అనే బొమ్మదేవరు నాగన్నతోట చావడిలొ వుంన్నాను. యీ హయిదరాబాదు షహరుకు చుట్టు బేగంబజారు అనే బస్తీ ఒకటి సాహుకార్ల కొఠీలుకలది వుంన్నది యిది షహరు ఆపేక్షయా వాసయోగ్యం యిక్కడికి కోశడు దూరములో కారువాన అనే బస్తీ రత్నాలు వగైరా అంమ్మె వర్తకులు వుండె స్థళం వకటి వుంన్నది. ఆబేగంబాజారుకు చేరినట్టు యింగిలీషు రెసైడెంటు నిజాంవారి ఖర్చుకింద విస్తారంగానున్ను అలంకారగానున్ను వక హవేలి కట్టించుకొని, పుట.నలభై మూడు, బాడిగె నిజాంకు యిస్తూ కాపురంగావుంన్నాడు. యీహవేలిచుట్టు లోకులు వర్తకులు యిండ్లు కట్టుకుని వుండటచేత వకపెద్ద బస్తీ అయినది. యీస్థలం పేరు చంద్రఘాటు అంటున్నారు. షహరులోపల షాలీబండ అనేపేరుగల్గిన వక పేట వుంన్నది. యీస్థలమందు యిక్కడ కల బ్రాంహ్మమండలి యిండ్లు కట్టుకుని కాపురం వుంన్నారు. దివాను పెష్కారు చందులాలు యిక్కడ యిల్లు కట్టుకుని కాపురం వుంన్నారు. నిజాందేవడి యీ షహరు మధ్యే వుంన్నది. అనేక మయిన పెద్ద మనుష్యులు అమీర్లు వుమారాలు అనే పేరుగల వార్లు సాధారణపు వర్తకులు నిజాంవంశస్తులు షహరుమధ్య కాపురంవుంన్నారు. షహరుమధ్యే మక్కామశీదు అనే వక తురకల జపశాల వుంన్నది. వాటిస్తూపీలు రెండు మొలాం ఛేసినది బహుదూరాన్ని తెలుస్తుంది. మశీదుకు యదురుగా లోగడ దినాను మీరాలం అనేవాడు కట్టించిన కారంజీలు లోతు కలది వుంన్నది. వాటికి సమీపముగా గుజలీ అంగడీచౌకు అనేపేరు గలది ఒకటి బట్టల అంగళ్ళు పాత్రసామాను అంగళ్ళు నాలుగు దోవలు అనేపేరు చేరడానికిగాను కట్టిన ఒక గొప్పస్తూపెకలిగి నాల్గుద్వారాలుకలిగిన వక చావడి వుంన్నది. షహరులోపల రాజవీధులకంత్తా గుండురాళ్ళు పరిచినారు. అటువంటి వీధులలొవుండె కస్మలము అడుసు నడిచేవారికి పాదాలను పూడుస్తూ వుంటుంన్నది. యిండ్లాలంకారం సందుల కునంది యితర దక్షిణదేశం షహరులలో వాసంచేసేవారికి యిష్టతిగావుండదు. రాజ వీధులలో ఏనుకులు మొదలైన వాహనాలు సదా వస్తూపోతూ వుండుటచేతనున్ను ప్రతిమనిషి ఆయుధపాణులయి మెత్తని వారిని, పుట.నలభై మూడు,నరకడం కొట్టడం శూరకృత్యంగా యిక్కడ యంఛేవాడికె అయి యుండడము చేత షహరులో యితరదేశస్తులు సవారి మీద పోయి రావలిస్తే కొందరు ఆయుధపాణులు వాక్పారుషం కలవారినిగా కూడా పిల్చుకొని పోవలశివుంన్నది. కృష్ణానది దాటినది మొదలు హయిదరాబాదువరకు పక్కీరులమయం గనుక సవారిమీద యవరువచ్చినా అడుగడుక్కూ పక్కీరులు పోగడి భిక్షం అడగకమానరు. వార్కి కొన్ని గవ్వలయినా యిస్తూరాకపోతే అవుమానం వంటిది పైసావారికి గొప్ప సంభావన చంన్నపట్టం ర్పూ ఒకటి కి ఇక్కడి పైసాలు యాభై పైసా ఒకటి కి ఇరవై పుంజీలు గవ్వలు వుంజీ ఒకటి కి గవ్వలు నాలుగు యీ హయిదరాబాదులో పిచ్చి రూపాయలని వకదినం గొవిందబకుషీలు అని ఒక దినుసు చలామణి అవుతుంది యీ రూపాయిలు ఒకచేతినుండి వకచేతికి వచ్చినట్టు అయితే ఒకటికి రెండుపైసాలు నట్టమియ్యకనే మారకం కానేరదు. యీ చలామణి రూపాయలకు యిక్కడవారుచేసే పరీక్ష అన్యాదృశ్య్హము. యటువంటి రూపాయికయినా ఒకదోషం పెట్టకమానరు. చన్నపట్టం కంపెనీరూపాయలకు ఆ తొందరలేదూ అయితే దొరకవు. యిక్కడి రూపాయిలకు ర్పూ. ఒకటి కి. పైసాలు నలభై పైసాలు ఎనభై యీ షహరు గోడకు చేరినట్టుగా ముశీ అని యిక్కడివారు చెప్పి ముచుకుందనది పారుతూ వుంన్నది. యీనది వాడపల్లివద్ద క్రిష్ణలో కలుస్తున్నది గొప్పనది పోయిన సంవత్సరం, పుట. నలభై రెండు, నది ప్రవాహం యెక్కువగా వచ్చి ఢిల్లీ దర్వాజా వద్ద యింగిలీసువారుకట్టిన వారిధిని పగలగొట్టి యీ షహరులో కొన్ని వీధులు ముంచ్చివేశిపోయినది. బేగంబాజార్కు షహర్కు మధ్యే యీనది దాటడానికి పూర్వకాలమంద్దు తురకలు రాళ్ళతో అతిజలనతుగా వక వారధి యెనుగలు మొదలయినవి గుంపులుగా ఎక్కి పొవడానికి యోగ్యంగా కట్టినారు. షహరుచుట్టూ చింన్న తిప్పలు కొండలమయం అనేక తిప్పల అగ్రమంద్దు మశీదులు కట్టివుంన్నారు. హిందూ దేవాలయాలులేవు వుంన్నా వృద్ధికిరానివ్వరు షహరుకు యింగిలీసు దండ్డుకు రెండు కోసులదూరం వుంన్నది మధ్య హుస్సెనుసాగరు అనే పేరుగల గొప్ప చెర్వు వుంన్నది ఆకట్టమీద యింగిలీసువారు గుర్రపుబండ్లు పొయ్యేటంద్దుకు యోగ్యంగా భాట ముచ్చటగా చక్కచేసి మొగలాయి వాహనాలు మనుష్యులు యెక్కి నడిచి చరచకుండా భాటకు యిరుపక్కలా తమ పారా పెట్టియున్నారు. జాతులవాండ్లను వినహాగా యితరులను ఆకట్టమీద హుకుంల్యాక యెక్కనివ్వరు. యీ జాతులవారిపేరు పరంగ్గీలని యాల అంట్టారంటే ఫిరంగ్గీలతో సహా వాసం చేసె వారుగనుక ఫిరంగ్గివారని యీ దేశస్తులనసాగినారు యితర దేశాలలో పరంగ్గీవారని అనబడ్డా, రు, కంపెనీలష్కరు వుండ్డె స్థళం హయిదరబాదుకన్నా దిన దినానికి యెక్కువగా, పుట.నలభై రెండు, బస్తీ అవుతున్నది ఇరవై సంవత్సరముల కింద్ద నేను చూచినప్పటికంన్నా యిప్పట్కి హాశ్చర్యకరమయిన బస్తీ అయినది షహరులో వస్తువుల్కు నిరుకులేదు యెవస్తువమీద సుంకాన్ని యవడు వూహించి దరఖాస్తుచేసినా దివాన్ జీసుంక్కం గుత్త యిస్తాడు కట్టెలబండ్లకు విస్తరాకుల్కు షహరులో రావడానికి నాల్గు అయిదు తీరువలు అడిగితీసేవాడికి జోరావరి గొద్ది యివ్వవలసివుంన్నది చంఫ్ఫినా అడిగే దిక్కులేదు యింగిలీసు దండ్డులో యీ తొందర ల్యాక న్యాయ విచారణకూడా కొత్తవాల్ చావడిలో కంమ్మిసరయాట్టు అసిస్టాంటుగుండా జరుగుతూంది గనుక లోకులు వర్తకులు యీదండ్డులో వశించడానికి దినదినానికీ యెక్కువగా యిచ్చయిస్తూవుంన్నారు యిక్కడి యిండ్లు అంత్తా యెన్నిమిద్దెలు అంతస్థులవారిగా కట్టినా స్తంభాలమీద పయివూరి లోభంచేసి మట్టి గోడలుపెట్టి ఆగోడలపైన నాజూకు అయిన సంన్నగార కావలశ్ని చిత్ర విచిత్రాలతో పూస్తూన్నారు యిక్కడ మట్టి గులక కలిస్ని యెర్రర్యేగడ మహాఘట్టిగా వుండతగ్గది ఇంగ్లీసు దండులో నేను దిగిన స్థళం వాసయోగ్యం యీ షహరుచుట్టూవుండే భూమి బహు సారవత్తూయినది యె వ్రిక్షం వేశినా అతివీర్యంగా పయిరు అయి వస్తుంన్నది అయితే పయిరు పెట్టె శ్రద్ద యెవరికి రెండ్డు కారణాలవల్ల లేవు మొదటికారణం బీదలయినవారు యెచెట్టు వేసినా, పుట.నలభై రెండు, వాటి ఫలాన్ని క్షేమంగా ఆయుధాలే ఆభరణాలుగా వుంచుకొని దర్పణమె యశస్సుగా బీవించ్చుకొని వుండె లోకులు అనుభవించ్చనియ్యరు వుపసంపన్నులు తోటలు వనాలు వెతామంటే విపత్పరంపరలు రాజకియ్యంచాత అప్పటప్పటికి వారికి సకలుగుట చాత తాసుఖం అనుభవించడానికి ప్రాప్తం ల్యాకవుంన్నది యింతకు వోర్చివేశిన చెట్లు మహాభాగా అయివుంన్నది చోటాఆరంజిపండ్లు నిస్తారంకద్దు సకల విధములయిన పండ్లు అంటిపండ్లు వినహాగా మంఛ్ఛిది దొరుకును అయితే అతి ప్రియము చంన్నపట్ణానికన్నా మూడింతలు ధర యివ్వవలశ్నిది కూరగాయలు అదెప్రకారము ప్రియమయినా మహా రుచి కరంగావుంన్నది వస్త్రాలు ఆఃభరణాలు శిపాయిలాయక్కు అయినవి యీషహరులో దొరుకును. భారీరత్నాలు కొనేపాటివుత్సాహం ధైర్యం ఎవరికీ లేనందున వర్తకులు తేవడంలేదు. ఆభరణాలు వగయిరా వుంచుకొని విక్రయించే తమ కాపు నిమిత్త్యం కొంత శిబ్బంది వుంచవలశి వుంట్టున్నది తద్వారా వక బుజురుగు వార్కి కలగడవమ వుతున్నది అందువల్ల కావలశ్ని గొప్పవారు వారి యింట్టికి వెళ్ళడం వారిని పిలిపించ్చుకుని కావలశింద్ది వారుసెప్పినధరకు పుచ్చుకుని తమకు సమ్మతి అయినప్పుడు ఖరీదుచేస్తూ వస్తారు. వర్తకసరళిగా అటువంటి గొప్ప వస్తువులుకొని అమ్మడంలేదు సాత్వీక ప్రభ్హుత్వంకల రాజ్యంలో మెదిగిన వారికి యీ షహరులో వునికింన్ని యీ రాజ్య సంచారమున్నూ భయప్రదంగా వుం, పుట.నలభై,టుంన్నది., చూడు. ఈముద్రణం పుట ముప్పై నాలుగు,

వ్రాతప్రతి పుట మూడు వందలు యాభై ఐదు*

క్రిష్ణనగరు చేరినదిమొదలు ప్రతిదినం కొంత మబ్బువేశి నాలుగు ఘడియలు అమితమయిన ఘాలి కొట్టి పడవలను హల్ల కల్లోలంచేసి మబ్బును తీసుకొనిపోతూ వుంన్నది. యీ చానక్కు! లోముందు దినములు వెఫ్ ట్పాడ్ డాకటర్ కార్బిన్ అనేవారి తొటలో గంగ్గవడ్దున గుడారాలువేశి నివశించినాను. యీ యిద్దరు ధొరలు బహు పరోపకారులున్ను సాంప్రదాయకులుగా తోచినది. ఆ డాకటర్ కార్బిన్ అనే దొర చికిత్స నిమిత్తంగా వక గ్రంధం చేసినాడు భేదివాంతి, పుట.మూడు వందలు యాభై ఆరు,చిగిత్స నిమిత్తమున్ను అదెప్రకారం వక గ్రంధం చేసినాడు. నాడేరాలు వెయ్యడానకు పరిశుధి అయిన స్థళం నాబజారానిలిచిన తావులో దొరకక పోయుణంతల్లో సమీప నివాసులయిన పయియిద్దరు దొరలకు వారితోటలో కొంచ్చం స్తళం నిమిత్తం నఖ చీటి వ్రాసుకుంన్నంత్తల్లో సర్వాంతర్యామియొక్క ప్రేరణచాత నాకు కావలసినంత స్తళం వారి తోటలో యిచ్చి నేను అక్కడ వుంన్నమట్టుకు సహోదర న్యాయంగా నడిపించ్చినారు యీశ్వరుడు వారిని రక్షించ్చు గాకా.

*పాత ముద్రణం అచ్చుపుస్తకంలో ఈ పేరాగ్రాపులేదు. అందువల్ల ఈ ముద్రణలోనూ లేదు.

ఈముద్రణంలోఅచానక్కు, బారకుపూరు, పుటరెండు వందలు అరవై ఎనిమిది వ్రాత పుటమూడు వందలు యాభై ఆరు., ముద్రణం పుట రెండు వందలు అరవై తొమ్మిది,

, పద్దెనిమిది వందల ముప్పై ఒకటి, ఏప్రిల్ తొమ్మిది తేదీ శనివారం పన్నెండు ఘంటల్కు సార్వభౌముడి విభూతి పరంపర యెక్కువగా కలిగిన కలకత్తాపట్నం ప్రవేశించినాను యీదినముల్లో యిక్కడ నివాసం చేసే జనసమూహంయొక్క దేశ కాల ద్వారా జనించే భక్తి పురస్కతమయిన చరత్కుపూజా భాను పొడా అనే ఆరాధనలు యీశ్వర చైతన్యం యిక్కడ విస్తారం ప్రతి భాతియై*, యెట్లా హైదరాబాదులో నా ప్రవేశకాలంలో తన ఆరాధనకొరకు పీర్లపండగను సంభవింప్ప చేసినాడో యెట్లా నాగపూరిలో గోకులష్టమి ప్రయుక్తంగా పసలపండుగ ఘటింనదో యెట్లా మిరిజాపూరిలో కార్తీకమాస ప్రయుక్తంగా యీశ్వర శ్రిష్టి అయిన నక్షతాలకు ప్రతిభాతిగా ఆకాశదీపాలు పెట్టె పండగ యెట్లా ఘటించ్చినదో కాశీలో కృత్తికా స్నానాలలో పంచత్నాలు అనే దినాలు యెట్లా ఘటించినదో గయామహాక్షేత్రంలో శివరాత్రి ఉత్సవం ఘాలిపఠా పండుగ యెట్లా ఘటించ్చినదో పట్నా షహరులో హోళిపండగ అనే మహోత్సవం యెట్లా ఘటించినదో తద్వతుగా, యీకలకత్తాలోనున్ను సాంబమూర్తి ప్రీతికరమయిన పయివ్రాసిన మహోత్సవం ఘటించినది. యీ వుత్సవంలో యిక్కడి జనులు మనదేశములో శడలు ఆడినట్లు దేహాలను పొడుచుకుని నరుక్కుని తమ రక్తదర్శనాలు చేసి సంన్యాసా, పుట.మూడు వందలు యాభై ఏడు, శ్రమలాంచనలు వహించి వుదకకుంభదానాదులు పిండప్రదానాలు మొదలైన శ్రాద్ధాలు పితృప్రీతిగా కూడా జరిగిస్తూవుంన్నరు పైన వ్రాసిన స్థళంలో పయిన వుత్సవాలకు మించ్చినది సంవత్సర మధ్యే ఆయా స్థళనివాసులకు

*బ్రాకెట్లలోని భాగం పూర్వపు ముద్రణం అచ్చుపుస్తకంలొ లేదు. అందువల్ల యీ ముద్రణంలోనూ లేదు.

ల్యాక వుంన్నది. కలకత్తా షహరుకు చేరిన ఉత్తరపార్శ్వం చిత్తుపూరు అనే ప్రదేశంలో గంగాతీరమంద్దు యభయి రూపాయలు నెల ఒకటి కె బాడిగ నిష్కర్ష చేసి వక యిల్లు తీసుకుని అందులొ ప్రవేశించ్చి నాను.

వ్రాతప్రతి పుటలు నాలుగు వందలు ఇరవై నాలుగు నుంచి నాలుగు వందలు తొంభై వరకు,, ఈముద్రణం పుటలు రెండు వందలు అరవై తొమ్మిది నుంచి రెండు వందలు డెబ్బై నాలుగు వరకు,

, నాలుగు వందలు ఇరవై నాలుగు, నా జన్మభూమి అయిన చంన్నపట్నం వ్రిత్తాంత్తం యటువంటిదంటే యింన్నూరుయేండ్ల కిందట చంద్రగిరిలో వీజానగరం సమస్తానాధిపతి అయిన శ్రీరంగరాయడు ధొరతనం చేస్తూ వుండగా డే అనే ధొర యీ సముద్రతీరమంద్దు వక రేవుబందరు కట్టించవలనని యత్నంచేసి శ్రీరంగరాయణ్ణి అడిగి వుత్తరువు తీసుకుని యీప్రాంత్యాలకు జమీదారుడైన దామరుల వెంక్కటాద్రినాయుడిపేర సన్నదు పుచ్చుకున్నాడు. ఆ వెంక్కటాద్రినాయుడు తన పేరుపెట్టి శ్రీరంగరాయపట్నం అని, నాలుగు వందలు ఇరవై ఐదు, రేవు బందరు కట్టమన్నా వెంక్కటాద్రినాయుడు తన తండ్రి అయిన చంన్నప్పనాయడిపేర చంన్నపట్నమని పేరుపెట్టమని చెప్పటమేగాక తానె సంన్నిధానాధిపతి గనుక అదే నామకరణం ఆరంభంలో చేసి నందున చంన్నపట్నమని పేరుకలిగినది తత్పూర్వం యీ రేవును యింగ్గిలీసువారు మదరాసు అంటూ వచ్చినారు యిప్పటికి వింధ్యన్యోత్తర దేశంలో మందరాసు అంటే యీస్తళం నిర్నయమవుతుంన్నది. గాని ఛంన్నపట్నం అంటే యవరికి అక్కడ తెలియదు పింమ్మట పదహారు వందల నలభై నాలుగు యింగిలీసు సంవ్వత్సరంలో రేవుబందరుకు చేరినట్టుగా వక కోటకట్టి సముద్ర తీరమంద్దు రెండు కోసుల భూమిని ఇంగిలీసు వారు స్వాధీనం చేసుకుంన్నరు. అటుపింమ్మట పదహారు వందల అరవై ఒకటి సంవ్వత్సరం యింగిలీసు వారిలో కొంతాఅంత, కలహంజరిగి అరాచికమయి పదహారు వందల డెబ్బై ఒకటి సంవ్వత్సరంలో మళ్ళీ సుతరాయించ్చి యీరేవుబందరు సుంకం యిజారా కంపెనీవారి చేసినారు. వెంబడిగానే కంపెనీవారి ప్రాపకం కోరి జగధీశ్వరుడు సత్యవాదుల పక్షపాతి గనక యింగ్గిలీషువారు చాలా సత్యఫంధులు అయినంద్దున యీ బస్తీలో మూడులక్షల ప్రజ వాసం ఛేసేటట్టు చేసి నాడు. పింమ్మట వెయ్యి ఆరు వందలు తొంభై ఆరువ సంవత్సరంలో నలుభయివేల వరహాలు సాలుకు యెత్తేపాటే భూమి కంపెనీవారి అధీనం అయినది అటుపిమ్మట పదిహేడు వందల రెండు సంవత్సరంలో ఢిల్లీపాదుషా అవరంగజీబు తరఫున దావూదుఖాన్ డు దండ్డుయెత్తివచ్చి యింగ్లీసువారిని చాలా కలతపెట్టినాడు అప్పట్లో అనేక తెగలు అనేక దేశాలనుంచి యిక్కడ చేరి, నాలుగు వందలు ఇరవై ఆరు, నంద్దున యడమచెయ్యి కక్షి అని కుడిచెయ్యి కక్షి అని రెండుపక్కలుగా యిక్కడ వారు చీళి యింగిలీసువారికి చాలా శ్రమను కలుగచేసినారు అందుకు నులుభై సంవత్సరముల పింమ్మట ప్రాంసువారు యీకోట తీసుకుని యింగిలీసువారిని వెళ్ళకొట్టినా హింద్దూస్తాన్ లో యింగిలీసుజాతికి దిగ్విజయం కలిగివుండెను గనక వొకసాటిగా సమాళించినారు వెంబడిగానె అయిదు సంవత్సరములకు రాజీమీద యీ స్తళాంన్ని యింగిలీసువారు స్వాధీనం చేసుకొంన్నారు పదిహేడు వందల ఎనభై రెండు సంవత్సరంలో కలాపన పొశిగి జగధీశ్వడి కటాక్షంచాత ఫ్రాంసుదండు పరారి అయిపోయినది అదిమొదలుగా అరికాటి నవాబును విహిత పరచుకొని క్షేమంగ్గా కాలంతోస్తూ వుండగా పదిహేడు వందల అరవై రెండు సం. మొదలు పదిహేడు వందల ఇరవై ఒకటి సం. వరుకు హయిదరుతో నవాబు నిమిత్తం పోరవలసి వచ్చినది. అది మొదలు యధాక్రమంగా అరికాటి నవాబు రాజ్యమంతా యింగిలీసువారి స్వాధీనమై వుత్తరం గంజ్జాం మొదలు దక్షిణం తిన్నెవల్లిశీమ వరకుంన్నూ తూర్పున సముద్రం మొదలు పశ్చిమం సముద్రం వరకూ ఏకచక్రాధిపత్యంగా యీ చంన్నపట్నాన్ని రాజధాని చేసుకొని కంపెనీవారు యెలుతూవున్నారు యీ రాజధాని కింద్ద యిప్పుడు వుండే జిల్లాలు ఇరవై ఒకటి యింతభూమి మధ్యేమయిసూరు, మళయాళం కొచ్చి యీ ముగ్గురు రాజులు తప్ప కొదవ అంద్దరు జమిందారిపాయా కలవారుగాని యుద్ధసన్నుద్దుడుకాగల భూపతి, నాలుగు వందలు ఇరవై ఏడు, వక్కడూ లేడు యీ చంన్నపట్నం కొడికింద్ద యిప్పుడు వసూలు సాలుకు వకటింకాలుకోటి వరహాలు అవుతున్నది ఖర్చు అప్పులకు యిచ్చేవడ్డీ సహాగా వసూలుకు యక్కువగాని తక్కువకాదు యీ చంన్నపట్నం కొడికింద్ద కంపెనీవారు అప్పు సుమారు రెండు కోట్ల వరహాలు వుండును స్థావరజంగ్గమ రూవకమయిన స్తితి మూడుకోట్ల వరహాలు వుండునని తోస్తుంన్నది. దండు యాభైవేలమంది పౌజువుంన్నది. యీచంన్నపట్నం బస్తీకి మూడుపక్కలా షహరుపానా గోడ పెట్టివుంన్నది. తూర్పుపక్క సముద్రమేగాని గోడలేదు. బస్తి కోశెడుదూరం చచ్చవుకానికి వుంన్నది. బస్తీకిపోవు కోశడుదూరంలో దక్షిణపక్క యుద్దసన్నద్దమయిన కోట సముద్రవారగా కట్టివుంన్నారు. వుత్తరపక్క సముద్రంగట్టున యెగుమతి దిగుమతులు అయ్యే రేవు సరుకు వేసే కొట్లు కట్టివుంన్నది. యీ చంన్నపట్నానికంతా పాపం వీధిశాలవీధి యీ రెండు విశాలమయినది నిండ్డా కుసంద్ది అయిన వీధులు కాదు యిండ్లకు రెండువిధాల పంన్నురూకలు తీసుకుని వీధులు వూడిచి మరామత్తు చేసి ఠాణాలువుంచ్చి కంపెనీవారు కావిలి కాస్తూ వుంటారు. యిండ్లు తలవాకిలి తిన్నెలు పందిళ్ళు బయటికి అలంక్కారం గానుంన్ను లోపల కలకొద్దిలో ఘాలికి అడ్డం లేకుండ్డా కట్టివుంన్నారు. పరి దేవాలాయాల దాకావుంన్నది అంద్దులో విభనంగా ప్రతిసంవ్వత్సరం బ్రంహ్మో, నాలుగు వందలు ఎనభై ఎనిమిది,త్సవాలు జరుగుతూ వుంటుంన్నది సముద్రంకుండావచ్చి పొయ్యే సరుకులకు తీరువ సుంక్కం తీశె నిమిత్తం సముద్రతీరమందు కష్టంహవుని అని వక కచ్చేరి వుంన్నది. గట్టున వచ్చెపొయ్యే సరుకులకు బస్తికి పడమట పక్క ల్యాండు కష్టం హవుసని కొన్ని కోటలోను కొన్ని బైట తోటలోను చేస్తూవుంటారు. యిక్కడికి సర్వాధికారి అయిన గవునరు యిల్లు అరికాటినావాబు యిల్లు కోటకు పడమర పావు కోశెడు దూరంలో తిరువళిక్కెణె అనే వుపగ్రామంలో వుంన్నవి. జాతలవాండ్లు అంద్దరు బస్తికి దక్షిణం ఆమడ దూరంలో వుండే పరంగి కొండవరకు మూడుకొసుల దూరంలో వుండే పరంగికొండవరకు మూడుకోసుల దూరంలో వుండే పరుంబ్బూరి వరకు సుందరమయిన తొటలు వేసి బంగ్గళాలు యిండ్లు కట్తుకుని వుంన్నారు. బస్తీలోపల వుండేవాళ్ళు హిందువుల యిండ్లలో అయ్యాపిళ్ళ యిల్లు పెద్దది కోటలోపల వుండే యిండ్లలో వాడలకు తెలిశె నిమిత్తం రాత్రిళ్ళు దీపంపెట్టె యెక్సిచెంఇల్లు పెద్దది బయట వుండే జారులవాండ్ల మెద్దెలలో మురాతు కట్టినయిల్లు పెద్దది బస్తికి దక్షిణం బస్తికి సమయమయిన తిరువళిక్కెణి మైలాపూరు తిరువటేశ్వరుడిపేట మొదలైన కొంన్ని వుపగ్రామాలు వుంన్నవి పడమట పక్క చూళా పొరశవాక కోమలేశ్వరుడిగుడి యివి మొదలైన కొన్ని గ్రామాదులు వుంన్నది. వుత్తరభాగమందు చాకలపేట రయపురం తండ్డయారువెడు మొదలయిన కొంన్ని గ్రామాదులు వుంన్నవి యీబస్తీలో వుండ్డే హిందువులు అందరు వుత్తరభాగమండ్డు తిరు, నాలుగు వందలు ఇరవై తొమ్మిది,పట్టూరివరకు ఆరామక్షేత్రాలు భేటగా యేర్పరచుకొని విలాసకాలాల యందు అక్కడికి వెళ్ళీ విహరిస్తూ వుంట్టారు. కోమలేశ్వరుడిగుడివద్ద వక చింన్న యేరు ప్రవహిస్తూ వుంన్నది దక్షిణపక్క మైలాపూరి చెరువు వకటి వుంన్నది పడమటిపక్క నుంగ్గంబాక చెరువు వకటి వుంన్నది. వుత్తరపక్క ప్రతితోటలో తటాకాలు దొరువులు తొవ్వివుంన్నారు. అందులో జగఢీశ్వడి కటాక్షం చాల మంచి నీళ్ళూ కలిగివుంన్నది. సమస్త ద్వీపాంత్తర పదార్ధాలు పనివాండ్లసహా అమితంగా దొరుకుతూవుంన్నది. యిక్కడి వారి ప్రకృతులు వుపాయవేత్తలుగాని సాహసులు గారు. ద్రవిడ ఆంధ్ర కర్నాటక దేశాలకు మధ్యే యీప్రదేశం వుండ్డుట చాత బాల్యారభ్యం దెశియ్యమయిన యీమూడు భాషలున్నూ ముంద్దు ధొరతనం ఛేశినవారి తురకభాష యిప్పుడు ధొరతనం చేశేవారి యింగిలీసు భాష మాటలు నోట వానడంచాత నుంన్ను పదార్ధంగా కొంన్ని సంసృత వాక్యాలు అఃయశించ్చుట చాతనుంన్ను యిక్కడివారి వుచ్చారణ స్ఫుటంగా వుంట్టూవస్తుంన్నది. యిక్కడి స్త్రీలు గర్విష్టులుగానున్నూ పురుషులపట్ల నిండా చొరవ ఛేసుకోగలవారుగానున్ను అగుపడతారు. అయితే వస్త్రాభరణ కృషిప్రియులెగాని నైజగుణమయిన సాహసం నిండా కలవారుగా, నాలుగు వందలు ఇరవై,తొచలేదు. యిక్కడి భూమి సారవంతం కాకపోయినా మోకులు చేశె కృషివల్ల ఫలకారిగావుంన్నది వృక్షాదులు పుష్టికారులు కాక పోయినప్పటికిన్ని యిక్కడ సమస్తదేశపు వృక్షాలు సలవు సమస్త జాతుల పుష్పాలు చూదవచ్చును యిక్కడివారు చాలా మూరవెడల్పుకల బట్టలు కడతారు. గనక యితర దేశాలవాడికె బట్టలు వీరికి పనికిరాక వుంటుంన్నది. యధోచితం యిక్కడివారు కర్మఫలంగానుంన్ను దేవబ్రాహ్మణ విశ్వాసం కలవారుగా వుంట్టారు. జగఢీశ్వర కటాక్షంచాత యిక్కడి హింద్దువులకు పూర్వ పురోవృద్ధిలేక పోయినప్పటికిన్ని ముంద్దర చెంద్దిన వాసనను ప్రయాసమీద కాపాడుకుంటూ వస్తారు. జారులవారి జనబాహుళ్యం విభవం తెంపు స్త్రీపురుష సల్లాపాలు చూడవలిస్తే ప్రతిదినం సాయంత్రకాలమంద్దు పరంగికొండ్డ శాలలోను సముద్రంవద్ద వాడరేవు శాలలోనున్ను నిలిస్తే వారు అందరు... వాహన విశేషాలు యెక్కివస్తారు గనక చూచి అనందించ వచ్చును యిటువంటి రాజధానిలో జగఢీశ్వరుడు తరాల వెంబడిగా జీవనం కలగజేసి నంన్ను నిలిపి వుంన్నాడు. జగద్గుగోసాహి జగద్గురోసాహి జగద్గుగోసాహి.

కాశియాత్ర చరిత్ర వ్రాతప్రతి సంఫూర్ణ మైనది.

సవరణ

యిది ఏనుగుల వీరస్వామి అల్లించిన కాశియత్ర చరిత్ర అనే శీర్షికతో అసలు గ్రంధం వ్రాత ప్రతి ప్రారంభమవుతుంది. ఈమచ్చుపుటలు శీర్షికను కూడా నేను అలాగే వ్రాసాను. అచ్చు చిత్తులు దిద్ధడంపూర్తిఅయి ఫారం కట్టేవరకూ కూడా అది సరిగ్గానేవున్నది గాని తీరా ఫారం మిషనుపై కెక్కిన తరువాత అచ్చువేయడానికి ఆజ్ఞయిచ్చేవారు అది పొరపాటనుకుని, వీరస్వామిని ఫీరాస్వామి అనిన్నీ, కాశియాత్రను కాశీయాత్ర అనిన్నీ దిద్దినారు!

అసలు గ్రంధానికి మళ్ళీ ఒక ప్రతి వ్రాయించి అచ్చు వేయవలసివచ్చి నందువల్ల ఇలాంటివి - లేఖరి పొరపాట్లు కొన్నీ, అచ్చు చిత్తులు దిద్దేవారి పొరపాట్లు కొన్ని, నా పొరభాట్లుకొన్నీ, దీనిలోకి దొర్లడం సంభవించింది. ఇందుకు క్షమాపణ వేడుకున్నాను.

------సంపాదకుడు.

కొన్ని పదముల అర్థములు

పుట

సరాళము=సరళము, తిన్నని, సుళువైన, చిక్కులులేనిది, సరళము, సరాళము, బాట, భాట, అప్పటి వాడుకభాషలో రూపాంతరాలు - చూడు, బ్రౌణ్యనిఘంటువు. ఇది చాలసార్లు ప్రయోగింపబడినది.

పలపట్లల యిడ్లు = చిల్లరజనముయొక్క యిండ్లు, సకలపట్టాడ యిండ్లు అని వ్రాతప్రతిలో వున్నది. పలపట్టడ అనే అరవమాటలోనుండి పలపట్ర అనే తెలుగు రూపము వచ్చినది. పలపట్రజనము అనగా చిల్లరజనము,, rabble, అని బ్రౌణ్య - మిశ్రనిఘంటువు.

ఉత్తర పినాకిని దక్షిణ పినాకినికిని మధ్యనున్న దేశంలో అరవంలోనుండి, కన్నడంలోనుండీ, తురకంనుండీ, ఇంగ్లీషునుండీ కూడా చాలామాటలు తెలుగులోకి వచ్చికలిసి వాడుకలో నున్నవి. వీరాస్వామయ్యగారు కాశీయాత్ర చరిత్ర లోనే వ్రాశారు. ఈప్రయోగాలన్నీ బ్రౌణ్యనిఘంటువులో కనబడుతున్నవి.

పేటస్థలము=పేట, అనగా పట్టణసమీపమందుండి సంతసాగే యూరు, నగరము యొక్కశాఖ, బస్తీలోభాగము, లేక దానినంటిన ఉపగ్రామము. నాట్యస్థళము అని వ్రాతప్రతి లేఖరి వ్రాసియున్నాడు.

వ్రాతప్రతికీ అచ్చుప్రతికీ వర్ణక్రమంలో ఇలాంటి తేడాలు చాలావున్నవి. అచ్చుప్రతిలో కూడా ఒకేపదము కొన్నిసార్లు ఒకలాగున మరికొన్నిసార్లు ఇంకొకలాగున వ్రాయబడినది. ఉదావరణానికి, బ్రాంహ్మణుడు, బ్రాఃహ్మణుడు, కర్మ, కమన్ మొదలైనవి.

మూడు., కనమ, రాతిగొట్టు,, దోవ, రాతిగొట్టు, ఆరు,- రాతిపారు, రాతిపాద, రాతిపర అని కూడా బహుళంగా ప్రయోగింపబడినది., బ. ప్ర,*

ఇందులోని గొట్టు శబ్ధము భూమియొక్క స్వభావవమును సూచిస్తుంది. వస్తు స్వభావమువలెనే మనుష్య స్వభావమును సూచించే గొట్టు శబ్ద మున్నది. ఉదా,

*ఈ పట్టికలోని కొన్నిపదములకు అర్థములను బ్రహ్మశ్రీ శతావధాని వేలూరి శివరామశాస్త్రులుగారు వ్రాసియున్నారు. తక్కినవి బ్రౌణ్యనిఘంటువు మొదలైన గ్రంధములలోనివి.

^బ.=ప్ర=బహుళ ప్రయోగము, చాలాసార్లు ఉయోగింపబడిన పదము. బ్రౌణ్య= సి పి బ్రౌనుగారు రచించిన తెలుగు నిఘంటువు, పద్దెనిమిది వందల యాభై రెండు, బ్రౌణ్య - మిశ్ర = బ్రౌణ్యనిఘంటువు చివర అనుబ్ంధముగా చేర్చబడిన మిశ్రపదముల నిఘంటువు, పద్దెనిమిది వందల యాభై నాలుగు,

ఈపట్టికలో చేరని పదములు అర్ధములకు పై నిఘంటువులు చూడవలెను. హిందూస్థానీ పదములకు నేను కూర్చిన పారిభాషిక నిఘంటువు చూడవలెను.

దేబిరిగొట్టు, వాపిరిగొట్టు, తంట్రగొట్టు, అని వాడతారు. విశేషణముగా కఠినమైన దుష్టమైన అని అర్థమున్నది =, బ్రౌణ్య,.

అవసరాలుగా = రీతులుగా,, బ. ప్ర,

చీకారణ్య = కీకారణ్య,, బ. ప్ర,

హాశ్శీలు = పన్ను, సుంకము, రుసుము

పుంజధాన్యములు = మెట్టధాన్యములు

బేబందు = సరియైనకట్టు దిట్టములేని, తారుమారుగా వుండే,, బ్రౌణ్య-మిశ్ర,

మేటీలు = అంశములు, భాగములు,

హామీభరాయించి = బాధ్యత వహించి

పరుష వాండ్లు,, పర్షవాండ్లు, = తిరుణాళ్లకు వచ్చే గుంపు, పరస = యాత్రకువచ్చు జనము, అని శబ్దరత్నాకరము.,

వయిపు, వైపు = ఉపాయము, వీలు, వైపు దెలసి బలుక వలయు వేమా, బ. ప్ర.

పొలకట్లు = దున్నిన మడులు. సాగుకు దున్నిన పొలము. దీనికి బ్రౌనుగారు కాశియాత్ర చరిత్ర యాభై ఐదువ పుటనే ప్రమాణంగా పేర్కొన్నారు.

పేడించు = సేవించు

చెయికావలి = కాయి కావిలి, చెయిజాగ్రత. ముందు జాగ్రత్త కోసం వుంచుకొనే బియ్యం వగైరా భోజనసామాగ్రి, Reserve,, బ. ప్ర,

చేరీనట్టు = ఆనుకొనినట్లు., బ. ప్ర,

గుజరీ అంగడి, వంద అరవై ఒకటి, = గుజరి, గుజిరి, గుజలి = బజారు స్థలము, సంతచోటు, గుజలీబజారు,, దొంగల బజారు, బజారువేళ - సాయింత్రము Market Place, Thieving Bazer, a Madras word-బ్రౌణ్య-మిశ్ర.,

స్తుపీ = మశీదుపైన, బురుజు పైసగల శిఖరము

జోరావారి =, జోరావరి, బలాత్కారము, బలోద్దతి

అమానిగా = గుత్తకివ్వక దివాణపు విచారణ కింద నుండే భూమి

మామిలియ్యతు = సర్కారు నిర్వహణము. చూడు, మామిలీయతు, రెండు వందలు ఇరవై ఎనిమిది,

దివానుపేష్కారు = ప్రధాన పరిపాలకోద్యోగి, సివిలు అధికారి

నజరు యినాతులుగా = పైయధికారుల కిచ్చు నజరులుగాను, క్రింది వారి కిచ్చు బహుమతులుగాను

పారా = కావలి, పారాచౌకీ అనగా కావలిస్థలము

అంతు = వెరసి, బ. ప్ర,
