﻿ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర
టీటీఎస్ ఆడియో నిర్మాణ పాఠ్యం
భాగం ఐదు — మొత్తం ఎనిమిది భాగాలలో


పన్నెండవ ప్రకరణము  కాశీ

పట్టణమునకి దక్షిణ భాగమున అసీతీరము నందు దుర్గాగుడి ఒకటి యున్నది. ఈ దేవత ఈ పట్టణమునకు కావలిగా వుండే శక్తియని పురజనులు మెండుగా ప్రతి మంగళవారమున్ను వెళ్ళి ఆరాధింపు చున్నారు. ఈగుడి తక్కిన గుళ్ళకన్నా విశాలముగా నున్నది. సమస్త మయిన గుళ్ళున్ను యెక్కడ చూచినా నిత్యయాత్రచేసేవారు అభిషేకనిమిత్తమైపోశే ఉద్దరిణి నీళ్ళతోనున్ను బిల్వదళములతో నున్ను తిలాక్షతలతోనున్ను నిండియున్నవి. యీబిల్వపత్రములు తిలాక్షతలున్ను తినడమునకు వృషభములు లోగా సంచరింపు చున్నవి. కాబట్టి పూజించ పొయ్యేవారు పుష్పమాలికలున్ను, బిల్వదళములున్ను, చేతులో తెలిసేటట్ట్లు యుంచుకుంటే ఈ వృషభములు పయిన పడుతున్నవి. నిత్య యాత్ర చేసే నిమిత్తముగా వేలపర్యంతము స్త్రీలు, పురుషులున్ను, పిడికిలి కణిగిన బుట్టలలో డబ్బిలలో నున్ను బిల్వపత్రము, తిలక్షతలున్ను ఉంచుకొని, మరియొకచేత ఉదకము తీసుకొని, చూచిన లింగానికిన్ని లింగము ఉండే ఆలయ ద్వారము మూసియుండే పక్షమందు ఆ ద్వారపు కడప మీద ఒక ఉద్ధరిణీ ఉదమకుతో అభిషేకము చేసి ఒక బిల్వపత్రము వేసి కొన్ని తిలాక్షతలు చల్లుచు వచ్చుచున్నారు. స్నాననియమము ప్రతి మనిషికిన్ని కలిగియున్నది. శూద్రులుకూడా శిరస్నానము చేయక భోజనము ఛేయరు. ఈ దేశపు బ్రాహ్మణులు ఇతర వర్ణాలను నిండా అనాదరణ చేసి అగౌరవ పరచనందున కర్మహీనులుగా చేయవలెననే క్రీస్తు మతస్థులు ప్రయత్నము ఈ దేశములో ఈ సరికి మిక్కిలి సాగలేదు.

ద్రావిడ దేశములో శూద్రులనున్ను, ముఖ్యముగా చండాలులనున్ను అగౌరవ పరుస్తూ, శూద్రుల దృష్టిన్ని చండాలుల సమీప వర్తిత్వమున్ను కూడని నిండా అగౌరవ పరచడము చేత, వేల పర్యంతము ప్రజలు క్రీస్తు మతస్థులుగా పెదపాళెము మైలాపూరు క్రీస్తుగుళ్ళ వుత్సవాదులలో చూడబడుచున్నారు. భ్రాహ్మణులకు శ్రుతి చోదితములయిన కర్మాదులను చేసుకొనుచు స్వస్తి ప్రజాభ్యం ద్రావిళ్ళు పంచగౌడులతో చేరిన యాచకులు పదిహేను వేల మంది దాకా వున్నారు. అందులో పంచద్రావిళ్ళు సగమని చెప్పవచ్చును.

ఈ కాశిలో వుండే వుపద్రవాలు మూడని చెప్పుకొనుచున్నారు. అవి యేవంటే - రాండు - సాండు - చీడీ అని మూడు వుపద్రవాలు కలవు. రాండు అనగా విధవస్త్రీలు, సాండు అనగా వృషభములు, చీడీలు అనగా మెట్లు. విధవలు నిండా యాచించడము చేతనున్ను, దుర్మార్గపు బాలవిధవలు ఇతర నడతలు కలిగి యుండుట చేత నున్ను వారివల్ల బహు పీడ లోకులకు కలిగి యున్నది. వృషోత్సర్జనము చేసి లోకులు అనేక వృషభములను పట్టణములో విడిచి పెట్టినందున యీ గల్లీలలో మనుష్యులతోటి పాటు మెలగి సంచరింపుచు ఉంచున్నవి. ఇట్లా నుండగా వాటికి రంధి పుట్టినప్పుడు మనుష్యులను చాలా హింస పెట్టుచున్నవి. చీడీలని ప్రతి గల్లీలలో మెట్లు యెక్కి దిగవలసినది. వైపు తప్పి పడ్డవారికి కాళ్ళు చేతులు విరగడము కద్దు.

గొసాయీలు ధనికులుగా మహాజనాలనే పేరు పెట్తుకుని సాహుకారు పనులు చేయుచున్నారు. భిక్షాటకులుగాను బహు మంది బయిరాగులతోటి పాటు సంచరింపుచు ఉన్నారు. కంగాళీలనే భిక్షాటకులకు లెక్కలేదు. సవారీ సమేతముగా యాత్ర వచ్చేవారిని యాచించే కంగాళీలు పక్కీతులు గల్లీలలో సవారీని సాగనియ్యరు.

ఈ కాశీ మహా క్షేత్రములో అధర్వణ వేదమును కొందరు ఘూర్జరులు అధ్యయనము చేసి యున్నారు. ఆ వేదస్వరము ఋగ్వేదస్వరమునకు సమీపముగా నున్ను, ఉదృతముగా నున్ను, యున్నది. యజుర్వేద్ములో మాధ్యందినశాఖ యని శుక్లయజుశ్శాఖ యని ప్రధమ శాఖ యని తైత్తిరీయశాఖ యని సర్వభేదములతో అధ్యయనము చేయుచున్నారు. ఇక్కడ సామగులు నూటిదాకా యున్నా స్వరము దక్షిణ దేశమునకు బహు భేదముగా నున్నది, గాన సౌష్టవము విస్తారములేదు. పంచద్రావిళ్ళలో పంచగౌడులలో నున్ను ఒకటి రెండు శాస్త్రాలు చదివిన పండితులు వెయిమంది దాకా ఈ కాశీలో యున్నారు. న్యాయశాస్త్రము ఇక్కడ నిండా ప్రచురము.

బంగాళీ బ్రాహ్మణులు బహుమంది యిక్కడ పండితులయి యున్నారు. వారు ఉత్కలగౌడులు. ఉత్కలదేశములో మత్స్యభక్షణ, ద్రావిడ దేశములో మాతులకన్యా వివాహము, మాగధదేశములో మద్యపానము, మైధిలదేశములో దేవరేణ సుతోత్పత్తిన్ని, అద్యాపి నిషిద్ధము కాదని ప్రసిద్ధము.

ఈ గంగాపుత్రుల ఉత్పత్తి హేయముగా కొన్ని పురాణాదులలో చెప్పియున్నది. వారు చెప్పడ మేమంటే భీష్మాచార్యులకు పూర్వము గంగ కన్నకొడుకులను తనలో ఐక్యము చేసుకొని యుండగా అటుతర్వాత భీష్మాచార్యుల తండ్రిని గంగ వదలిన వెనక, లోగడ తనలో కలుపుకొన్న పుత్రులను మళ్ళీ భూమిలో ఉద్ధరించినట్టున్ను, తాము వారి వంశస్థులనిన్ని వాదింపుచున్నారు. వారు ఇప్పట్లో కాన్యకుబ్జులతో సంబందములు చేయుచున్నారు. గంగాతీరమునందు ఏదానమున్ను వారిని మినహా మరి ఒకరికిన్ని యివ్వకూడదు. ఠాణీబ్రాహ్మణులు వచ్చినవారికి తీర్ధ పురోహితము చేసినా యిండ్లలో యిచ్చే దాన్ని ప్రతిగ్రహించ తగ్గవారేగాని బాహటముగా గంగాతీరమునందు తీసుకోలేరు. ఘాటియాలకు ఠాణీలకు గంగాపుత్రులు తమ రహితులని అధికారమును ఆ యా కాలములలో చెల్లింపుచు వచ్చుచున్నారు.

ఇక్కడి రూపాయిలకు చెన్నపట్టణపు రూపాయలకున్ను ఒక అణా భేదమున్నది. మన రూపాయలు చిన్న. రూపాయి ఒకటి కి పదహారు గండులనే అరవై నాలుగు పయిసాలు. అన్ని భక్షణయోగ్య పదార్ధాలున్ను నయముగా అమ్మినా రుచికలిగీ యుండడములేదు. చూపుకుమాత్రము బహుబాగా యుంచున్నవి. నీళ్ళున్ను ఉప్పున్నూ కలియని మిఠాయిన్ని పక్వాన్నాలున్ను సకలమయిన బ్రాహ్మణులున్ను కొని భక్షింపుచున్నారు. చేసే వారిజాతి విచారణ అక్కరలేదు. పుష్పాలలో జాజి పూలుతప్ప యితర సుగంధ పుష్పాలు దొరకవు. మన దేశములో తురక పూలని నిషేధముగా యెంచేపుష్పము లంతా యిక్కడ దేవతారాధనకు పరిగ్రహింపుచు నున్నారు. యిక్కడి గుళ్ళలో మహా పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాఖ అనే శ్లోకప్రకారము సమస్త లోకుల క్షేమము కొరకు ఈశ్వర ప్రార్ధన చేయుచున్న తమ కర్మాదులకు విరొధము లేక క్షాత్రధర్మముతో తంమును కాపాడే క్షత్రియ జాతిని గౌరవ పరచుచు, తమకు దొరకని దేశాంతరాలయందుండే పదార్ధాలను వాణిజ్యమూలకముగా తెచ్చి యిచ్చే వైశ్యులను లాలించి, తమకు ఉపచరించి సేవ చేసే శూద్రులను ఆదరింపుచు రమ్మని శాస్త్రనియమ మున్నది గాని వండేపెట్టడానకు అర్హుడయిన శూద్ర దృష్టే మనకు కూడదు, బ్రాహ్మణ వీధి లోనే శూద్రుడు రాకూడ దనే ఆచారము మూల స్మృతులలో ఇటువంటి అగౌరవాలకు ఆకరము పుట్టియున్నది గనుక ద్రావిడ దేశస్ధులు భూరూప మయిన జీవనాలు పుష్కలముగా కలుగుటచేత కర్మాదుల విషయ మయిన ఆచారాలు మెక్కుట మయి శూద్రులను నిండా తృణీకారము చేయుచు రావడముచేత, వారికి మాంసభక్షణ మొదలయిన దుర్మార్గములో బుద్ధితగిలి, స్నానాది కర్మములను వదిలి నికృష్టు లయి వారున్ను వారికి తక్కువ తెగ అయినవారున్ను ఈ నికృష్టములో పడి అవమానపడడ మేమి? సమానత్వము పొందగల మతములోనే ప్రవర్తింపుచున్నామని, క్రీస్తుమతస్థుల ప్రేరేపణకు లోపడుచున్నారు.

ఈ బ్రహ్మాండములో కన్యాకుమారి మొదలు కాశ్మీరమువరకు నుండే దేశము సర్వోత్తమ మయిన కర్మభూమియై, రామకృష్ణాద్యవతారములకు పాత్రభూతమయి, శాపానుగ్రహ శక్తులయిన అగస్త్యాది ఋషులకు వాసయోగ్యమయి యుండిన్ని, ఈ బ్రహ్మాండముయొక్క చివరను వసింపుచు పూర్వకాలమునందు పశుప్రాయులుగా నుండిన యింగిలీషువారిచేత యిప్పుడు యేలబడి యున్నది. నరుబ్బు ఇప్పుడు కర్మశూనులయిన ఆ యింగిలీషువారు ఈశ్వరకటాక్షమునకు ఈ కర్మదేశస్థులకంటే యెక్కువగా పాత్రులై ఉండవలసిన కారణ మేమని యోచించి నంతలో నాకు శ్రీరాములతోపచేసిన యుక్తి యేమంటే, తత్వబోధసాధన మయిన విద్యాబుద్ధి లేనివారికిన్ని స్త్రీ బాలులకున్ను భక్తిజనితమయ్యే నిమిత్తముగా ముఖ్యముగా కర్మాదులనున్ను బింబారాధనలనున్ను ఉద్ధరించిన పూర్వీకులయిన స్మర్తలు బింబాలకు మనోజ్ఞమయిన మధుఘృతాదూలతోనున్ను ఫలరసాలతొనున్ను అభిషేకము చేసి ఆలయాలు కట్టియుంచి అలంకరించి అర్చనచేసి రాజోపచారలాంచనలు జరగవలసిన వని వ్రాస్తే ఇటీవల ఉపస్మర్తలు భక్తినివృద్ధి పొందింప చేయవలెననే వెర్రితాత్పర్యముతో యెంత తేనె అభిషేకము చేస్తే అంత మంచిది, యెంత పెద్దగుడి చిత్రాలతో కట్టితే అంత పుణ్యము, యెన్ని విచిత్రాలతో అలంకరించితే అంత శ్రేష్టము, యెందరిని రూపవతులయిన దాసీలను రాజోపచార నిమిత్తముగా గుడిలో వుంచితే అంత గుణ మని వ్రాసినందున యధోచితము లయిన పంచామృతాభిషేకములను వదిలి అంతర్యామి రూపముతో పరమాత్మ వసింపుచు నుండే దేహములకు భొజ్యములయిన వస్తువులను విస్తరించి బింబముల మీద పోయుచు వ్యర్ధ పరచుచు రాసాగి దర్శనమాత్రము చేతనే కామవికారములను కట్టసాగిరి. మరిన్ని సాధారణపు స్త్రీపురుషులు ధరించే వికార వేషములతోనున్ను వికార చర్యలతోనున్ను బింబాలను అలంకరించసాగిరి. మరిన్ని ఆ గుడికంటె యీగుడిలో విభవము యెక్కువ అనిపించవలెనని పైపోటీలతో వ్యర్ధముగా ద్రవ్యవ్యయము చేసి పయిన చెప్పిన పనికి మాలిన పనులు జరిగించి అలాటి అలంకార విభవముల గుండా లోకులకు భక్తిని కలగజేయ సంకల్పించినందున సర్వాంతర్యామి యైన భగవంతునికి అది విరుద్ధముగా తోచినది.

ఆ ప్రకారమే బ్రాంహ్మణులను సత్కర్మముల నాచరింపుచు లోకుల శ్రేయస్సును ప్రార్ధింపుచు అందరినిన్ని ఆశీర్వదింపుచునుండు డని చెప్పితే మేము సర్వోత్కృష్టులమని అహంకరించి ఇతర వత్ణములను తృణీకరించ సాగిరి. అదిన్ని భగవంతునికి అసహ్యమయినట్టు తోచుచున్నది. సగుణ బ్రహ్మారాధన విషయమయి చిత్తము భక్తి కలిగి తదేకనిష్టతో ఉండేకొరకు ధ్యానారంభకాలము నందు, యధోచితముగా తగుపాటి మత్త ద్రవ్యమును సకృదావృత్తిపుచ్చుకొను మన పూర్వీకులు దోవచూపితే, సారాయి పీపాయిలను ఖాలీచేయ సాగినారు. గొ బ్రాహ్మణుల పోషణ ప్రకటనమయ్యే కొరకై వారి పోషణ విషయమై అబద్ధమయినా ఆడవచ్చునని పూర్వీకులు వారికి పక్షముగా వ్రాస్తే, అపద్దముతోనే జీవనము ఛేయసాగిరి. వృద్ధ మాతాపితృపోషణ ముఖ్యమని తెలియపరచను అస్యకార్యశతం కృత్వా అని మనువువ్రాస్తే పరద్రవ్యమును పేలపిండి వలెనే భుజింపసాగిరి. యీ రీతిగా పూర్వీకులు కడతేరేటందుకు వేశిన మొలకలను విషధారలతో పెంచినందుచేత విషజ్వాలా సహితము లయిన ఫలములే ఫలించినవి.

కలిలో భావిఫలములను పూర్వీకులు ఊహించినట్టు ఈకర్మతులు బహు మంచిది బహుమంచిది అనిచేసే పనులంతా యీశ్వరదృష్టికి అపరాధములుగా తోచి ఈ విపరీతము లయిన ఆచారములనున్ను అర్చనలనున్ను బ్నొత్తిగా నిలపదలచి యిప్పుడు ఈ బ్రహ్మాండములో యధోచితముగా పదవాక్య ప్రమాణ్యముగల యింగిలీషువారిని యీ కర్మభూమిని యేలేటట్టు చేసినాడు. యీ ఇంగిలీషువారికి అనుగుణము వుండడము మాత్రమే కాకుండా భూతదయ పశ్చాత్తాపము తారతమ్య జ్ఞానము శుచిరుచి సాత్విక గుణము ఉపశాంతి ఈశ్వరభక్తి యిది మొదలయిన సుగుణాలు శావావున్నట్టు తోస్తున్నది. తద్ధ్వారా వారు సర్వాంతర్యామి కటాక్షానికి పాత్రులయి సర్వోత్తమ మయిన యీ కర్మ భూమికి సార్వభౌములయినారని తోచు చున్నది.*

యీ కాశీపట్టణ మందువుండే సమస్త బ్రాహ్మణులు స్తోమాలని తడలనిపేళ్ళు వహించి ప్రత్య్హేకము ప్రత్యేకు లయిన గుంపులుగా నొక్కొక్క గుంపుకు ఒక అధిపతిని యేర్పరచుకొని యిది జాలంభొట్లస్తోమ మనిన్ని, యిది రాజేంద్రబాబు తడయనిన్ని యిట్లా చెప్పబడుచు కొంతకాలము ఒక గుంవు మరియొక గుంపుతో విహితముగానున్ను మరికొంతకాలము ద్వేషరీతిగానున్ను విద్వత్ గ్రామము గనుక

*వీరాస్వామయ్యగారి కాలంలో ఈ దేశంలో ఉద్యోగాలుచేసిన దొరలలో సర్ తామస్ మన్రో, విలియం బెంటింకు గార్ల వంటి సత్పురుషులు, స్నేహపాత్రులు చాలామంది వుండేవారు. అందువల్లనే ఆంగ్లేయులయందు వీరి కంత అభిప్రాయం కలిగింది.

ఆచార వ్యవహారములను గురించి తాత్పర్య భేదము కలవారము ప్రవర్తింపుచు వుంటారు. వీరిని ఆరాధన చెయ్యడములో ఉపాయము తెలిసి కొంత గుంపులకు ముందుగా కొంతగుంపుకు వెనక కొంత గుంపుకు సమకాలములో ప్రత్యేక స్థలాలలోనున్ను యీ ప్రకారముగా సభాపూజలు ఛేయుచు రావాలసినది. సుమంగలీపూజకు వేయి మంది స్త్రీలు వత్తురు. భిక్షము పెట్టేవారు కలిగితే రెండువేలమంది అనాధ స్త్రీలు జమ అవుతున్నారు. యిందరికిన్ని అన్నపూర్ణ కటాక్షముచేత పుష్కళమయిన అన్నము దొరుకుచున్నది. పిలువకనే వచ్చే పరదేశులలో స్త్రీలు పురుషులుగా రెండు వేల మంది పంచ ద్రావిళ్ళలో వున్నారు. వీరి కందరికి అన్నపూర్ణ సత్రములో పూనా శ్రీమంతుని తమ్ముడైన అమృతరాయడు రెండు వేల నాలుగు వందలు మందికి ప్రతిదినమున్ను అన్నము పెట్టుతాడు *మన దక్షిణదేశస్థులు బహుమంది కాశీ తంబురాయడనే పండారముగుండా పది వందల కి అన్నము ప్రతిదినము కలగచేసియున్నారు. మయిసూరు రాజు మొదలయిన గొప్పవారు యింకా అనేకులు అన్నముగానున్ను శీదా, స్యయంపాకము, లుగానున్ను ప్రతి దినమున్ను యిచ్చుచున్నారు. విశ్వేశ్వరుడు యిక్కడ చనిపొయ్యే వారికి తారకనామ ఉపదేశము చేస్తానని ఆచొప్పున అన్నపూర్ణయిక్కడ వసించే వారికి అన్నము సమృద్ధిగా కలగచేస్తాననిన్ని ప్రతిజ్ఞ చేసినట్టు పురాణ మందు చెప్పియున్నది. అన్నపూర్ణ ప్రతిజ్ఞ ప్రత్యక్షముగా వున్నది.

శ్రీరాములుయొక్క అవతారానికి పూర్వమే అనాదిగా రామనామము తారకమయి యున్నది. అది తెలిసి శ్రీరాములకు ఆనామము తోనే వసిష్ఠులు నామకరణము చేసినారు. ఈహేతువుచేత యీ పట్టణములో యెవరు చనిపోయినా శ్మశానానికి శవానికి శవానుగమనము చేశే వారు రామ నామసత్తుహే అంటు నడుస్తారు. తద్ద్వారా తద్వ్యతిక్తమయిన దంతా అనృతమని అర్ధమవుతూ వున్నది. యీ మహా స్థళానికి శ్రీమంతులు అనేకులు వచ్చి లక్షల మోడి సెలవు చేసినారు. స్థళమహాత్మ్యమేమో కాని, యే బహనా, నెపము,చేతనయినా నెలకు

*పీష్వా అమృత రాయని దానదర్మములను గూర్చి బిషప్ హెబరు చక్కగా వర్ణించి యున్నాడు. ఈ అమృతరాయడు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు లోనే దివంగతుడైనాడు.

నాలుగయిదు లక్షలు సెలవుచేసేపాటి ఆసామి ఒకడు యీస్థళమందు వసింపుచున్నే యుంటాడు. ఇప్పట్లో శ్రీమంతుని తమ్ముడు బిమ్మాజీ అనే అతను నెలకు మూడు లక్షల రూపాయలు ఖర్చు ఛేసుకుంటూ అసి తీరమందు యున్నాడు. యింకా యీదేశపు బహు ధనికులు విరామదశను పొంది కాశీవాసము చేయుచున్నారు. యీక్షేత్రాన అవశ్యముగా చెయ్యవలసినపనులు వాసము ఒకటిన్ని వర్షాశనదానము ఒకటిన్ని ముఖ్యములు.

కాశీ పట్టణములో పదివేల యిండ్లున్ను, లక్షప్రజలున్ను వుందురని తోచుచున్నది. *యిక్కడ దొరకని పదార్ధము వకటిన్ని లేదు. అందరు దేశభాష అయిన హిందూస్థాన్ మాటలాడు చున్నారు. బాహాటమయిన సంత అంగళ్ళను బాళాలని వ్యవహరింపుచున్నారు. ఉత్సవాదులను మ్యాళా అనిన్ని, పల్లకీలను కడుకడియా అనిన్ని, బోయీలను కారులోకు అనిన్ని వాడుతారు. బొందిలీ ఖండములో బోయీలను డీమరు అంటూవచ్చిరి. సామాన్య నౌకరుల జీతము నెలకు నాలుగు రూపాయలకు యెక్కువ లేదు.

యీ స్థల మాహాత్మ్యము స్కాందపురాణాంతర్బూతముగా వుండే కాశీ ఖండములో వంద అధ్యాయాలుగా విస్తరించి చెప్పబడుతునున్నది. యిదిగాక సూక్ష్మముగా ఐదు అధ్యాయాలు గల కాశీ మాహాత్మ్య మనే గ్రంధమున్ను విస్తరించబడి యున్నది. వాటి సార

*బిషప్ హెబరుగారు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు లో కాశిని దర్శించి తన దినచర్యలో చక్కగా వర్ణించియున్నారు. అదిచాలా విషయములలో వీరస్వామయ్యగారు వ్రాసినదానికి సరి పోతున్నది. జనసంఖ్య విషయంలో మాత్రం వీరాస్వామయ్యగారు పొరబాటుపడినట్లు కనబడుతూవుంది. హెబరుగారు వ్రాయడంలో పద్దెనిమిది వందల ఎనిమిది లో వేయబడిన ఒక జనాభా లెక్క ప్రకారం కాశీలో ఐదు,ఎనభై రెండు,సున్నా ప్రజలు వున్నట్లు తేలిందనిన్నీ దానిలో కొంతమంది అతిశయోక్తి వున్నదనుకున్నా, ఉన్న లెక్క అది ఒక్కటేననిన్నీ, పట్టణ వైశాల్యము బట్టిన్నీ క్రిక్కిరిసియున్న కట్టుడును బట్టిన్నీ ఆ అంచనా యించుమించుగా సరియైనదేనని తొస్తూ వున్నదనిన్ని, లండన్, ప్యారిస్ నగరాలు తప్ప ఐరోపాలోని తక్కిన అన్ని నగరాలు కన్నా యీ కాశీనగరం ఎక్కువ జనాకీర్ణంగా వున్నదనిన్నీ వ్రాశారు. చూడు. బిషప్ హెబర్సు జర్నల్ మొదటి సంపుటము, పుటలు మూడు వందలు డెబ్బై నుంచి నాలుగు వందలు వరకు.

మేమంటే నిర్గుణ బ్రహ్మము సృష్టి సంకల్పము కాకమునుపు జ్యోతిర్మయకారముగా యీ స్థలములొ మిక్కిలి జ్వలిస్తూ వున్నట్టున్ను బ్రహ్మకు, విష్ణువుకున్ను అహంపూర్వ మహంపూర్వ మని వివాదము పొసగినట్టున్ను జ్యోతిర్మయాన్ని చూచి ఆ యుభయులున్ను పరమయిన వస్తువు యీజ్యోతిస్సని తెలుసుకొని తాము శాంతిపడ్డట్టున్ను, సాంబమూర్తి ఈ స్థలము అనుపూర్విక మయినందున యిక్కడ వసించసాగినట్టున్ను, తద్ద్వారా మహాశ్శశాన మయినదనిన్ని ఆ జ్యోతిర్లింగము యిప్పటికిన్ని యిక్కడ పంచకోశాత్మకముగా యున్న దనిన్ని అదిని యీ భూమి జ్యోతిర్భూతానికి వాసయోగ్యమయినందున బ్రహ్మాదులు యిక్కడ తపస్సుచేసి సకల సిద్ధులు పొందినారనిన్ని, అగస్త్యాది ఋషులు అదేప్రకారము యుక్కడ తపస్సు చేసి సచ్చిదానందమును అనుభవించినందున యీ స్థలము ఆనందవనమనే పేరు వహించినదనిన్ని, మహాప్రళయాదులలో జ్యోతిర్భూతానికి యీ భూమి వాసయోగ్యమైనందున త్రిగుణాత్మకమయిన మూడు ముండ్లవంటి కొనలు కల ఆయుధముతో యీ భూమి యెత్తబడి వుండినందున త్రికంటక విరాజితమనే బిరుదు యీస్థళానికి కలిగినదనిన్ని, మిక్కిలి ముఖ్యముగా చెప్పి అటుతర్వాత పరాపరఫస్తువు సర్వాంతత్యామి గనుక యెవరియందు ఆ వస్తువును ఆరొపితము ఛేసినా ఛేయవచ్చును గనుక స్కాందపురాణ కారకుని ఇష్టప్రకారము అపరాపర వస్తువునే శివుడని సిద్ధాంతపరచబడిన ఆ సాంబమూర్తి తద్ద్వత్తుగా జ్యోతిర్మయముగా ప్రకాశించి నాడనిన్ని, ఆయన కటాక్షము సంపాదించి బ్రహ్మాదులు వారివారి అధికారాలు పుచ్చుకున్నారనిన్ని విస్తరించి

యున్నది.

యింతటికి యిక్కడి యీశ్వరుని పేరు విశ్వేశ్వరుడు. ఇది సమష్టివాచకము. లింగమున్ను సమష్టిరూపమేగాని పార్వతిసహితముగా వృషభారూఢుడయిన సాంబమూర్తి రూపముకాదు, లక్ష్మిని వక్షస్థలమందు వహించిన మహావిష్ణు రూపమున్ను కాదు, అయితే శైవులు ఆ లింగారాధనను చేయుచు వచ్చుచున్నారు. అందువల్ల వైష్ణవులు ఆ రూపము యొక్క ఆరాధనను వదిలినారు. యీస్థలములో జ్యోతిర్భూతమ్మ


పదమూడవ ప్రకరణము  కాశీవాసము మరియు గాజీపూరు

జ్వలిస్తూ యుండినందున ముక్తిక్షేత్ర మయినది. ఈ క్షేత్రములోని పాపులకు ప్రకారాంతరముగా కాలభైరవ దండన మూలకముగా పాపానుభవము చెప్పి అటుతర్వాత విశ్వేశ్వరుడివల్ల తారకమంత్రము వుపదేశమయి ముక్తిని పొందేటట్టు పురాణసిద్ధ మయి యున్నది.

యీ స్థలము అవిముక్త క్షేత్రమయినందున గంగ విశ్వేశ్వరుడి అనుగ్రహము సంపాదించి అసి-వరణల మధ్యే తనలోని జంతువులగుండా యెవరికిన్ని ఉపద్రవము చేసేది లేదని ఖరారుచేసి ఇక్కడ ప్రవహించసాగినది. ఈ కలియుగములో పాపాలను పోగొట్టడానకు గంగకు మించిన పదార్ధములేదని కంఠోక్తిగా కాశీఖండములో చెప్పియున్నది. ఆటువంటి గంగ ఇటువంటి క్షేత్రములో ఇక్కడ జతపడినందున ఈ రెంటిమూలకముగా పరమాత్మడు అనేకుల భక్తిని ఆకర్షించి తరింపచేయుచున్నాడు. ఇటువంటి మహాస్థలములో డిసంబరు నెల పదహారు తేది రాత్రివరకు వసించినాను.

తేది ఉదయాన నాలుగు ఘంటలకు ధనుర్లగ్నములో పన్నెండు దాండ్లుగల బజరాలోయెక్కి గయకు తరలి వచ్చినాను. నాబోయీలు మొదలయినవారు ఉండడానికి పట్టేలు అనే తడికెలు కట్తిన పడవను ఒకదాన్ని కూడా తేవడమయినది. ఈ బజరాకు పట్నా అనే షహరు వరకు బాడిగె యాభై యైదు రూపాయలున్ను, పట్టేలు అనే పడవకు ముప్పై రూపాయలున్ను యిచ్చినాను. కార్తీకశుద్ధ పున్నమివరకు యీ ప్రాంతమందు శీతకాలము ప్రవేశించలేదు. అదిమొదలు చలి దినదిన ప్రవర్ధమాన మయినందున యెండను మనదేశములొ వసంతకాలపు వెన్నెలవలె అతిప్రియముతో అనుభవింపుచు నున్నారు.

కాశీపట్టణ్ము గంగయెడ్డు అయినందున గంగ ధనురాకారముగా ప్రవహింపుచు గట్టునుకోసి వొత్తిరాకుండా బలమయిన గట్టములను వొడ్డున కడాకున్ను కట్టియుంచుట చేత, వొడ్డు కోశేదానికి బదులు ప్రవాహముయొక్క జోరు భూమిని కోశి లోతు అవుతూ వచ్చినది. గనుక ఆ చొప్పున లొతు కావడమువల్ల వడ్డున వుండే భూమి వూటపారి యీ శీతాకాలములో అతిశీతలమయి పయిగా జనసమ్మర్ధము విస్తారమయి నందున జ్వరాలు మొదలయిన అనేక రోగాలను ఉత్పత్తి చేయుచున్నది. మిక్కటముగా భూమి కొత్త అయినవారికి వుపద్రవము యెక్కువగా వుంచున్నది. కాశీలో ప్రవేశించిన వెనక యికను సుభిక్ష రాజ్యములో ప్రవృత్తి కలుగు చున్నదనే తాత్పర్యము చేతనున్ను కలకత్తా పర్యంతము నావల మీద పోవలెననే యిచ్చచేతనున్ను కాశెలో కొన్ని దినములు వసించవలసియున్నదనిన్ని హయిదరాబాదులో కొలువుపెట్టిన ఒక జత పండ్రెండు మంది బోయీలనున్ను, ఆరుగురు బంట్రౌతులనున్ను పట్నాంన్నుంచి వచ్చిన ఆరుగురు కావడి వాండ్లనున్ను కొలువు తీసి వేసినాను. మిగిలియున్న వారిలో నలుగురికి కుదురుతువస్తే ఆరుగురికి జ్వరాలు మొదలయిన యుపద్రవాలు తగులుతు వచ్చుచున్నవి. యిక్కడి స్థలజ్ఞులు అదేప్రకారము రోగపీడితులుగానే వున్నారు. యిక్కడి చలి మన దేశస్థులకు అసహ్యముగా నున్నది. నాపరివారానికంతా ధగళాలు, కుళ్ళాయిలు, చావళ్ళు, లుంగీలున్ను తీసియిచ్చిన్ని కుంపట్లు ఆపేక్షింపుచున్నారు. నేను ప్లానుల, ఫ్లాన్ల్,తో అన్ని వస్తువులున్ను వారివలెనే కుట్టించుకుని ధరించినాను. యెండకాలములో వుష్ణము అదెప్రకారము అతిమిక్కటముగా నుంచున్నదట. అందుకు కారణము అప్పట్లో గంగ లోపలికి పోవడము ఒకటే గాని వేరే తొచలేదు. ఇప్పట్లో ఇక్కడ అహస్సు ఇరవై ఆరు గడియలు. యీ వాశి రాత్రి వృద్ధి అయి వుంచున్నది.

కాశీక్షేత్రము సకల స్థలములలోనున్ను చేసిన పాపములను పోగొట్టుచున్నది. యీ కాశీ మహాస్థలమందు లోకులు చేసే పాపములను యావత్తున్ను పోగొట్టడానికి జ్యోతిర్లింగ ప్రదక్షిణార్ధము పంచక్రోశయాత్ర అని యొకటి చేయవలసినది. ఆ యాత్ర చేసిరావడానకు అయిదు దినములు పట్టుచున్నది. ప్రధమ దినము మణికర్ణీకలో స్నానము చేసుకొని సంకల్ప పురిసారముగా ప్రయాణమయి మొదటి దినము కద్రమేశ్వరము అనే యూళ్ళో నిలిచి అక్కడ కర్దమతీర్ధములో స్నాన తీర్ధశ్రాద్ధాదులు చేసి కద్మమెశ్వరుని అర్చించి రెండో దినము భీమచండీ అనే స్థలము చేరి అక్కడ మొదటి దినము వలెనే గడిపి మూడో దినము రామేశ్వరము చేరి అక్కడ వరణ ప్రవహింపుచున్నది గనుక అక్కడ వరణా తీరమందు తీర్ధనిధి చేసి రామేశ్వరార్చన చేసి, నాలుగో దినము కపిలధార అనే స్థలము చేరవలెను. అక్కడ లోగడి మూడు దినముల వలెనే గడిపి అయిదో దినము మణికర్ణీక చేరి అక్కడ తొలు నాలుగు దినములవలెనే గడిపి స్వస్థలము చేరవలెను. యీ యాత్ర తిరగడము ఇరవై ఆరు కోసులు కద్దు. ప్రతి మజిలీస్థలములో నున్ను విశాలమయిన ధర్మశాలలు కట్టి యున్నవి. యిదిగాక అంగళ్ళు యిండ్లు, తొపులు అక్కడక్కడ కలిగి వున్నవి. దారిపొడుగునా శాల, నీడకొరకు వేసిన చెట్లవరస, యుంచి యున్నారు. ప్రదక్షిణానికి ఆరంభము అసిమొదలుగా చేయవలసినది.

కాశీయాత్ర చేసేవారు వారానికి ఒకసారి మసోపవాసి అనేనక దేవి దుర్గా గుడికి సమీపముగా నున్నది. అక్కడికి వెళ్ళి కొన్ని గవ్వలు వేయవలసినది. వేయనివారి యాత్రాఫలము ఆమె అపహరించేటట్టు ఒక వదంతి కలిగి యున్నది. యీ పంచక్రోశయాత్ర చేసే టప్పుడు భిక్షకులకు, గలిగినవారు నిండాగా నుపచరింప వలసియుంచున్నది. యీ కాశీక్షేత్రమందు గంగలో పూజచేసే బిల్వము ముణిగి పోవుచున్నదని ప్రసిద్ధి కలిగియున్నది. ప్రయాగలో స్త్రీలు యిచ్చేవేణిన్ని అదే ప్రకారము మణిపోతూ వుంచున్నది. యేస్థలములో నున్ను సన్యాసులు త్రిరాత్రానికి అధికముగా వాసము చేయకూడదని విధియేర్పడి యున్నా, విశ్వేశ్వర స్మృతి ప్రకారము ఈ కాశికి వచ్చిన యతులు యీ స్థలము వదలి పోకూడదని యేర్పరచి యున్నందున పంచగౌడులు పంచద్రావిళ్ళలో సుమారు వెయ్యింటికి యతులు యీ మహాస్థలములో నివాసముగా యున్నారు.

ఆంధ్రులలో వెలనాడు, కాసలనాడు, మురికినాడు అని వున్నట్టున్ను ద్రావిళ్ళలో వడమలు, కండ్రమాణీక్యము, యెణ్నాయిరము అని వున్నట్టున్ను ప్రతి గౌడ తెగకున్ను అనేక చీలికలున్నవి. బహు సావకాశముగా విచారించక గాని వాటి ఖుల్లస్సు బోధపడదు. బంగాళీ బ్రాహ్మణు లయిన ఉత్కల గౌడులలో ఒక అన్యాయము జరుగు తున్నది. అది యేమంటే లోగడ వారి తెగలో కొంత విపత్తులు వచ్చినప్పుడు కొందరు యధాశాస్త్రముగా ప్రవర్తింపుచున్నట్ట్లున్ను, అద్యాపి వారి సంతతి ద్వారా కులీనులయినట్టున్ను, అటు కులీనుడికి కన్యకును వివాహము చేసి యిస్తే కులము పవిత్రమవుతున్న దని ఒక బోధ తోచి యుపపన్నులు అందరున్ను అటువుండే బహు కొద్దిమంది కులీనులకు బహుద్రవ్య మిచ్చి వొప్పచేసి కన్యమీద కన్యను యిరువై ముప్పైయింటిగాకా యిచ్చి వివాహము చేయుచున్నారు. ఆ ప్రకారము వివాహము చేసుకొన్న కులీనుడు తదనంతరము నూరాగులు యిస్తేగాని ఒక రాత్రి ఆప్రకారము వివాహమయిన స్త్రీలతో వసించేదిలేదు. అటుగనుక అటు వివాహమయిన స్తీలు చాపల్యము లేనివారు హింసపడుతూ, చాపల్యము కలవారు వ్యస్థ తప్పి నడుచుచున్నారు.

యీదేశములో వసింఛే ఘూర్జర దేశాస్థులు అనేక తెగలుగా భేడా వారని, నాగరీ లని ప్రత్యేకగుంపులుగా ఒకరి యింట్లో ఒకరు భోజనము లేక నియమము కలిగియున్నారు. యీ దేశములో దృష్టి దోషవిచారము లేకపోయినా కచ్చారసూయి, పక్కారసూయి అనేపాక నియమాలు బహుశా పాటింపు చున్నారు. పక్కరసూయి ఒకడు పాకము చేసినది మరి ఒకడు సంప్రదాయము విచారించక శూద్రుడయినా బ్ర్రాహ్మణునిచేత కూడా తినడు. శూద్రులు బహుశా మాంస భక్షణము చేయడములేదు. కొన్ని సంఫత్సరముల కిందట దక్షిణ దేశములో నుంచి గూపాలకజాతి యయిన ఒక గొప్ప మనిషి కొమార్తె ఇక్కడికి యాత్ర వచ్చి స్వకులస్థులను యిక్కడ పరిచర్యకు కొలువు వుంచినది. అటు కొలువువున్న స్త్రీలు పురుషులున్ను వచ్చిన స్త్రీ మాంస భక్షణము చేయడము చూచి, నిండా నిందించి కొలువు వుండమని చాలించుకొన్నారు. యీదేశములో గోపాలకులు తులసీమణి ధారము చేసినట్టయితే ఆచార సంపన్నులని వారి చేతి గంగను ధారాళముగా యీ దేశపు సర్వజనులున్ను పుచ్చుకొంటారు. వారిని సచ్చూద్రులని చెప్పుతారు.

కాశీలో సకల గ్రంధమలున్ను సంగ్రహింపబడి వున్నవి. కంపెనీవారు బహు దినములుగా ఒక పాఠశాలను వుంచి సమస్త గ్రంధాలు సంగ్రహించి యుంచి పాఠము చెప్పను మనిషికి ముప్పై రూపాయీలు జీతము ఛేసి పదిమంది పండితులను వుంచి చదవడానకు వంద మంది విద్యార్ధులకు మూడేసి రూపాయలు లెక్కని జీతమును చేసియుంచినారు.* యింకా రాజాధిరాజులు గ్రంధ సంగ్రహము కావలసినప్పుడు లక్షావధి రూపాయలు కాశికి పంపించి గ్రంధ సంగ్రహము చేయుచు నున్నారు. గనుక బహుమంది పెద్దలు తమ సోధనార్ధమున్ను అట్టి తరుణాలలో రాజాధిరాజులకు పనికి వఛ్ఛేటట్టు చాయడానికిగాను అనేక గ్రంధాలు సంగ్రహించి అపారముగా వుంచి యున్నారు.

కాశికి సుమారు యిరువై మజెలీలలో గోకుల బృందావనము యుండి యున్నది. హరిద్వార మనే పుణ్యభూమి ఇరవై మజిలీలలో నున్నది. ఆ హరిద్వారమునుండి గంగోత్తరికిన్ని బదరీకేదారానికిన్ని బదరీ నారాయణానికిన్ని జ్వాలాముఖి కిన్ని దారిపోతున్నది. హరిద్వారము వెళ్ళకనే పయిన వ్రాసిన స్థలములకు యెక్కడికిన్ని పోను ఆయత్తు కాదు. హరిద్వారమునుంచి పయిన వ్రాసిన స్థలములలో యే స్థలానికి పోవలసినా ఈశ్వరేచ్చ యేమోగాని పదిహేనేసి దినాల మజిలి ఆయూస్థలములకు సరిగా నున్నది. అందుకు ఒక స్థలమునుంచి ఒక స్థలానికి వెళ్ళడానికి వేరేదారిలేదు. గంగోత్తరినుంచి బదరీకేదారము వెళ్ళవలసివస్తే హరిద్వారానికి వచ్చి పోవలసినది. అయోధ్య అతి సమీపము. ప్రయాగకు పన్నెండు ఆమడ వున్నవి.

పయిన వ్రాసిన గంగోత్తరి మొదలయిన మహాస్థలములు అన్ని నీలకంఠనేపాళరాజుయొక్క రాజ్యములొ యున్నవి. ఆరాజు నేపాళములో వాసముచేయుచు యింగిలీషువారికి లోబడియున్నాడు. ఆ నేపాళము వద్దనే మూరంగి అనే యూరున్నది. అందులో ద్రాక్షలు ఫలింపుచున్నవి. ఆ గ్రామము కాశీతంబురాయడనే పండారానికి

*ఈ విద్యాలయమును గురించి బిషప్ హెబరు చక్కగా వర్ణీంచినాడు.

బదరీ కేదారేశరుని పూతానైవేద్యాల కొరకు నేపాళరాజు జాగీరు యిచ్చియున్నాడు. ఆ ప్రాంతములలో మంచు అపారముగా నున్నది. కేదారేశ్వరునికి ఆరునెలలు పూజలేదట. మంచుకాలము యొక్క ఉపక్రమణలో ఒక పెద్ద కొడి స్తంభము నాటిపెట్టి మంచు గుడిని మూసుకునిపోతే మంచుకాలము తీసినవెనక ఆ కొడి స్తంభము గుర్తుపట్టుకొని మంచుగడ్డలు తొవ్వి యెత్తి గుడిని కనుక్కోవలసినదని చెప్పినారు.

ఈశ్వరుడు నీళ్ళలోని చేపలకు జలాధివాసము సహజము చేసి నట్టు ఆయాస్థలస్థులకు ఇటువంటి తనరూప మయిన కాలాలను సహజము చేయుచు వచ్చినాడు. కాలాన్ని అనుభవింఛే వ్యక్తిలోనున్ను కాలములోనున్ను యీశ్వరుడు అంతర్యామి అయినప్పటికిన్ని అభ్యాసము వల్లనున్ను యిచ్చవల్ల నున్ను యిటువంటి కాలభేదములు కొన్ని వ్యక్తులకు సరిపడక వుంచున్నవి. యెట్లా అత్తిచెట్టుయొక్క అనేకపండ్లలోని ఒక క్రిమిగాని ఆ ఛెట్టుయొక్క గాత్రమునున్ను శక్తినిన్ని యెట్లా తెలుసుకో నేరదో తద్వత్తుగా అనేక బ్రహ్మాండాలు ఉత్పత్తి ఛేసిన యీశ్వరునియొక్క చిద్విలాస మహిమను ఒక బ్రహ్మాండములోని ఒకా నొక ప్రాణి తెలిశి ఆశ్చర్య పడడానకు శక్తుడు కాడు.

యీ కాశీ మహాపట్నము యొక్క వేడుకను చూచి ఆనందించి, కపిల మహాముని యించుకు అధికముగా తనతప, ప్రభాముచేత యీ కర్మభూమికి చివరను గంగాతీరమునందు కాశ్మీరము అనే పట్నాన్ని ఉత్పత్తి చేసి సకల విధాలా బాగాచేసి కాశీవిశ్వేశ్వరునికి యెరుకచేసి అక్కడికివచ్చి చూడుమని ప్రార్ధించి నంతలో విశ్వేశ్వరుడు ఆ కపిలుని మాట నిజమేనని తెలుసుకున్నవాడై అప్రతిద్వంద్వముగా కాశి యుండవలసిన సంకల్పము పరమాత్మునికి నుండగా గర్వము చేత కపిలుడు యీప్రకారము ఛేసినాడు గనుక ఆ కాశ్మీర పట్నము అతని గర్వభంగము అయ్యేకొరకు వెంబడిగానే మ్లేచ్చాక్రాంతమయి మ్లేచాభూయిష్టమయి పోగాకా అని శపించినాడట. అదిమొదలు అద్యాపి యెంత అక్కడ శంకరాచార్యులవారు దిగ్విజయము చేసినా సరస్వతీపీఠమున్నా అక్కడ ప్రవహింఛే గంగ సస్యాదులకు కూడా వుపయోగింపుచున్నా అక్కడవున్న బ్రాహ్మణులు అందరు బలాత్కారముగా తురకలలోకలిసి బ్రాహ్మణుడు అప్ర్రాంత్యాల తలచూపడము అద్యాసి ప్రయాసగా నున్నది.

ఇప్పట్లో ఆ రాజ్యము రణజిత్తు సింగు* అధీనముగా యున్నది. ఆకాశ్మీరములోనే కుంకుమపువ్వు అవుచున్నది. శాలూలు నేయడానికి యోగ్యమయిన వెంట్రుక లయ్యే మృగాలు ప్రత్యేకముగా ఉత్పత్తి అవుచున్నవట. కాశ్మీరశాలూలు బయటికి విస్తారము రావటములేదట. అందుకు నకలుగా లాహోరులో నేసిన శాలూలు బయటికి విక్రయయానికి వచ్చేటట్టు విన్నాను. నిరక్షదేశము మొదలుగా ఇరవై మూడు భాగల దూరము లో నుండే కాశీ లొగానే కాలము మొదలుకొని ఆచారవ్యహారములు యింత భేదించి యుండగా యికను ఉత్తరోత్తరా యేమి వింతగా నుండునో తెలిసినది కాదు, వీపుమీద నుండే మచ్చ చూడడానకు కూడా మనుష్యుడు శక్తుడుకాడు. మాయావృతజ్ఞానము కలిగి వుండుట మిక్కటముగా యీ ప్రకారము మాయామగ్ను లయిన అస్మదాదులను కాపాడ వలసినది.

వ స|| డిసంబరు ఇరవై ఎనిమిది తేది పట్నా అనే షహరు ప్రవేశించినాను. గంగలో పదిదినములు బజరా పట్టేలు అనే పడవల గుండా నడవడమయినది. దారిలో గంగ కిరుప్పక్కలనున్న వూళ్ళ పేళ్ళు ఈ అడుగున వ్రాయుచున్నాను. నెం.ఇరవై ఒకటి. కబారా ఒకటి మంజీ ఒకటి ఛోటక్పూరు ఒకటి కనాలుగంజి రెండు సయత్పూరు ఒకటి మాంజీ ఒకటి చోబక్పూరు ఒకటి రోజా ఒకటి జిమ నియ్యాం ఒకటి రాంపూరు ఒకటి మదనా పూరు ఒకటి గాజీపూరు ఒకటి కాతిసుపూరు ఒకటి నెరువూరు ఒకటి బకుసరు, బక్సార్, ఒకటి నిక్కావూరు ఒకటి బుదాగా ఒకటి కట్రాజిగంజి ఒకటి బిసన్ పూరు ఒకటి ఆరా ఒకటి నవరంగా ఒకటి రామనగరము ఒకటి శిరువూరు ఒకటి శిరంపూరు ఒకటి చప్రా ఒకటి రస్తాన్ గంజి ఒకటి దానాపూరు ఒకటి బాకీపూరు ఒకటి పట్నా ఒకటి.

*రంజితసింగు శిక్కుల రాజు. పదిహేడు వందల ఎనభై లో జన్మించి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది లో దివంగతుడైనాడు.

పెరుగు, పాలు, కూరగాయలు - ఇత్యాది అనేక దినముల పరియంతము బాగావుండని పదార్ధాలకు గాను ఒకవేళ గంగకు ఇరుపక్కలావుండే వూళ్ళలోకి వెళ్ళితే మనుష్యులు వెళ్ళీ రావలసినది. సుఖహేతువులంతా కష్టసాధ్యములు గనుక యీ గంగా తీర సంచారసుఖానుభవములో పడవలోకి నీళ్ళు వూరి వచ్చిన దనిన్ని పడవ తోశే వాండ్లు చెప్పినట్టు వినలేదనిన్ని కూడా వుండే పరిజనుల ప్రకృతులు భిన్నాలు అయినందున వాండ్లు ఒకరితో నొకరు కలహము పడడము వల్లనున్ను, వద్దవుండే స్థితికి చోరులవల్ల అపాయము వచ్చునేమో అనే భయముచేతనున్ను, మనస్సుకు అప్పుడప్పుడు ప్రపంచదృష్టి పూరా కలిగిన దేహాధీన మయినందున వికల్పము కలుగుచున్నది. అప్పట్లో జగము యావత్తు పరబ్రహ్మ ఆడించే బొమ్మలుగాని, వేరే కాదనిన్ని తృణాగ్రమయినా యీశ్వరాజ్ఞ చేతనే కదల వలసినదిగాని మరిఆన్యధా కాదనే తెలివితోనున్ను మనస్సునిండా ఖేదాన్ని పొందనియ్యకుండా బుద్ధిద్వారా శిక్షించి నట్టయితే పయిన వ్రాసిన స్థలజల సౌఖ్యములు మిక్కిలి ఆనందములుగా తేటపడు తున్నవి.

యీ గంగలో నడిచే అనేకపడవలు అనేక భేదములు కలిగి యున్నవి. అందులో విచారించగా తెలియవచ్చిన వాటిని అడుగున వ్రాసినాను. నావల భేదక్రమము బజరా ఒకటి. అది ఒంటికంభము కలది. వెడల్పుయెక్కువ. తలపక్కచుక్కాణి, చుక్కాణి మొదలు పొడుగున తగ్గుచూవచ్చు చున్నది. పిన్నిస్సు ఒకటి. అదిరెండు కంభాలుకలది. నిడువు యెక్కువ. మొనను చుక్కాణీ. యిల్లు మధ్యే వుంచున్నది. పొడుగు కొనా మొదలున్నుసమము. కటరు ఒకటి. అది పిన్నిసుజాడ, గాలిని చాపలచేత వైపు, వీలు, చేసుకోవచ్చును. బవులియ్యా ఒకటి. అదిబజరాజాడ, గాలిని చాపలచేత స్వాధీనము చేసుకోవచ్చును. డోంగా ఒకటి. అది చిన్నయిల్లు గలతేలిక పడవ. బాలిబోటు ఒకటి. అది చెయిపడవ. పయిన వ్రాసిన ఆరుదినుసులు సవారీలాయఖు. సర్కు మోసే నావలు పట్టేలి ఒకటి. అది మిరిజాపురపు శాత. పొడుగు తక్కువ. వెడల్పు యెక్కువ. వులాకు ఒకటి. అది పట్నాశాత.

పట్నా మధ్యే గంగకు యిరుపక్కలా వుండే వూళ్ళలో గాజీ గంగలో కలియుచున్నది. చప్రావద్ధ కర్మనాశినీ అనే నది దక్షిణము నుంచి వచ్చి గంగలో కలియుచున్నది. యీ కర్మనాళిని నదిలో యెవరు కాలుపెట్టినాగాని సుకర్మాలు నశించుచున్నదనే తాత్పర్యముచేత కర్మఠులు యెవరున్ను యీనదిలో కాలు పెట్టరు. యీనది దాటడానకు కాశీనుంచి గయకు వచ్చే దోవలో అహల్యాబాయి అనె యశ, కాయము గల పుణ్యాత్మురాలు వారధి కట్టడానకు శానా యత్నము చేసినది. యిప్పటికి ఆమె చేర్చిన సామానుతో కట్టాడానకు అనేకులు యత్నము చేసినా కొనసాగలేదు.

యీ పట్నాషహరువద్ద పునఃపునః అనే నది దక్షిణమునుంచి వచ్చి గయవద్ద వచ్చే ఫల్గుని నదివలెనే గంగాసంగమ మయినది. యీ పున, పున, అనేనది గయా క్షేత్రమునకు ప్రదక్షిణముగా ప్రవహింపుచున్నది గనుక యెటువంటి గయకు వచ్చే వారున్ను యీ పున, పున, నదివద్ద క్షౌరము చేసుకొని తీర్ధశ్రాద్ధము చేసి గయావ్రజనము చేయడానకు నియమము ధరించవలసినది.

దక్షిణమునుంచి వచ్చే పయినదు లంతా నర్మదానదివలెనే వింధ్య పర్వతములొ ఉత్పత్తి అయినవి. శోణభద్రా నదిన్ని, నర్మదానదిన్ని ఒక్క ప్రదేశములోనే ఉత్పత్తి అయి రెండు ధారలుగా చీలి ఒకటి లింగాలనున్ను, మరి ఒకటి వినాయకశిలలనున్ను జగత్తుకు కలుగ ఛేసి యున్నవి. యిదిగాక పేరు ప్రశస్తములేని కొన్ని నదులు ఉత్తరము నుంచి వచ్చి కాశీ పట్నాలమధ్యే గంగలొ కలియు చున్నవి.

కాశి మొదలు పట్నాషహరు వరకు గంగకు ఇరుపక్కలా సరసు అనే పెద్ద ఆవాలున్ను, రాయి అనే చిన్న ఆవాలున్ను, బూటి అనే శనగలున్ను, పటానులున్ను, కందులున్నూమితముగా పయిరు చేసి యున్నారు. యీ పెద్ద ఆవాలు చెట్లు ముల్లంగి చెట్లవలెనే ప్రధమములో పయిరు అయి యెన్నుతీసి పచ్చని పూలు పూచి, గోరుచిక్కుడు కాయలవలె కాయలు కాయుచున్నవి. యీ ఆవకూర యీమంచు దినములలో పుల్లకూరవండి యీ దేశస్థులు అవశ్యముగా పుచ్చుకొను చున్నారు. పుల్లకూర బహురుచిగా వుంచున్నది. మంచు కాలములొ దేహానికి లేపనము చేసేటందుకు నాలుగు

విధాలు పరిమళ శైలములు యిక్కడ తయారు అవుతున్నవి. వాటి పేళ్ళు సుగంధరాజతేలు అనేది ఒకటి, బేలా అనేదిఒకటి, చెంబెలిఅనే నూనె ఒకటి, పూలేది అనేనూనె ఒకటి, ఇవి వుపపన్నులు చేసుకొనేవి. పేదలు పెద్ద ఆవాలనూనె పట్టించుకొను చున్నారు. యీ తైలాలతో అంగమర్ధనము చేయకపోతే చర్మములో ల్నుంచి సూదితో కుట్టి నట్టు బెజ్జాలుపడి నెత్తురు చెమ్మగింపు చున్నది. యీ ప్రకారము నాపదిజనానకు నడిచేటప్పుడు కాళ్ళలో కొందరికి నెత్తురు చెమ్మగించి నందున భయపడి వారు యిందుకు వైద్యము ఆవనూనె పట్టించి వేన్నీళ్ళు పోసి కడిగితే వెంబడిగానే వాశి అయిపోతున్నది. చిన్నఆవాలలో నూనె నిండా రావడము లేదు గనుక చిన్న ఆవాలను భక్ష్యయోగ్యముగా వాడుకొని, పెద్దఆవాలలో మాత్రము నూనెను గానుగ ఆడి తీయుచున్నారు.

యీ మంచుకాలములో బ్రాహ్మణ సంతర్పణలు కాశిలో నావల్ల యీశ్వరుడు జరిపినప్పుడు యీ దేశములో నివాసముగా నుండే పంచద్రావిళ్ళకు దృష్టిదోషము అక్కరలేనందున ఆ బ్ర్రాహ్మణులు ఆవరణలోపలను భోజనము ఛెయడానకు చలి యుపద్రవముగా వుంచున్నదని పగలు రెండుజాములవేళ మెద్దెమీద పయిదళములో యెండలో ఆకులు వేయించుకొని కాకుల బాధలేకుండా నాలుగు పక్కలా నలుగురు శూద్రులు తుపాకులు కాలుస్తూ యుండేటట్టు యేర్పరసుకొని యెండ సౌఖ్యముగా వున్నదని భోజము చేసినారు.

కాశివరకు తాటిచెట్లు కండ్లపడక పోయినా, గంగకు యిరుపక్కలా అనేక గ్రామాదులలో తాటిచెట్లు కలిగి యున్నవి. యిరువై యేండ్లకు మునుపు జాతులవాండ్లు పొట్టేటసు అనే గడ్డలు, బంగాళాదుంపలు, యీ దేశానికి తెచ్చి పయిరుపెట్టే క్రమమును యీదేశపు జనులకు నేర్పించినారు. అది మొదలుగా యీ దేశములొ యెక్కడ చూచినా వాటికి ఆలి అనే పేరు పెట్టి అమోఘముగా పయిరు పెట్టుచున్నారు. ఆ గడ్డలు పెద్దదినుసు నిమ్మకాయలంతేసి, చిన్నదినుసు గచ్చకాయలంతేసిగా అనేక రాసులుగా పన్నీరు పూలవర్ణముతో ఫలించి యెక్కడ చూచినా యీ ప్రాంత్యములలో అమ్ముచున్నారు. గంగలో పడవలు యెల్లప్పుడు వస్తూపోతూ వుండడముచేత యీ పడవలు వాడికెగా నిలిచే ఘాట్లవద్ద యిటువంటి భక్ష్యయోగ్య మయిన వస్తువులు తెచ్చి పెట్టుకుని అమ్ముతూ వుంచున్నారు. కాశిలో అమ్మే గొయ్యా పండ్లు, జామపండ్లు, మిక్కిలి గొప్పలుగా, విత్తులు శానా తక్కువగా యుంచున్నవి. ఈ దేశములో కాలము యెరిగి కూరకాయలు వేయుచున్నారు గనుక ఒక కాలములో అయ్యేవస్తువులు మరియొక కాలములో మన దేశములో అకాలములో కూడా దొరికేటట్టు చిక్కదు.

పట్నా అనే షహరు దానాపూరు మొదలుగా ఆరుకోసుల దూరమునకు ఒకే షహరుగా నున్నది. పట్నా షహరులో కలకటరు జడిజీ మెజిస్ట్రేటు ఉండడము మాత్రమేగాక ఒక అప్పీలు కోరటు రివిన్యూ క్రిమినాలు సంగతులు విచారించడానకు ఒక కమిసనరు వున్నాడు. యీ షహరు మ్లేచ్ఛమయముగా నున్నది. లోగడ యెల్లీసు దొర యీ దేశము చూసే నిమిత్తము వచ్చియుండి యీ షహరులో గోమాంసము బహిరంగముగా బజారులో పెట్టి అమ్ముచున్నారు, యీ వింత నేను హిందూదేశములో యెక్కడ చూడలే దని వ్రాసినాడు. అటువంటి వస్తు విక్రయము నా కండ్ల పడకపోయినా అంతపని సాధారణముగా చేసేపాటి మ్లేచ్ఛ షహరు అనవచ్చును.

ఈ షహరులో రెండు దేవస్థలా లున్నవి. ఒకటి పట్నాదేవి మందిరము, మరియొకటి గోపీనాథుని మందిరము. రాజసపూజ వితరణగా జరుగుచున్నది. గాజీపూరు, ఆరా, చప్రా, వీటికన్నా యీ షహరులో యిండ్లమిద్దెలున్ను విస్తారముగా నున్ను, గొప్పలుగానున్ను కట్టియున్నవి. కాశీపట్నమువలెనే ప్రతిసందుకు పాటక్కులనే వాకిళ్ళు తలుపులతోకూడా కట్టియున్నవి. రాత్రిళ్ళుమూశి గడియలు బీగము వేయుచున్నారు. బాజారులను బహునిర్బంధము మీద యిటీవల జాతులవాండ్లు వెడల్పుచేసి చక్కపెట్టినారు. యిండ్లకు బాడిగె యీ షహరులో బహు అల్పము. నేను దినానికి ఒక రూపాయివంతున నిలిచిన దినమునకు బాడిగె యిచ్చుచు వచ్చినాను. సకల పదార్థాలు సకల విధములయిన పనివాండ్లు సమృద్ధిగా దొరుకుదురు. పనివాండ్లను యీ దేశస్థులు కాలీగర్లు అని అనుచున్నారు. యీ షహరులో యెక్కాలనే ఒంటిగుర్రపు గాడీలు బాడిగకు వేలాంతరాలు దొరుకును. యీ సహరులోవుండేపాటి యెక్కాలు యెక్కడా లేవని హిందూస్తాన్ లో ప్రసిద్ధము. ద్వీపాంతర పదార్ధాలుకూడా సమృద్ధిగా దొరుకును. యింగిలీషు షాపులు కొన్నియున్నవి.

షహరుకు మూడుకోసుల దూరములో జాతులవాండ్లు గంగాతీరమునందు యిండ్లు, తోటలు కల్పనచేసుకొని యున్నారు. సమస్తఫలవర్గాలున్ను దొరుకును. అరిటిపండ్లు దొరికినా బొంతపండ్ల జాతేగాని రస్తాళి మొదలయిన రుచికరమయిన జాతిపండ్లు దొరకవు. నాగపూవు వదిలిన వెనక మంచి అరిటిపండ్లు వెడల్పుగల అరిటి అకులున్ను చూచిన వాణ్నికాను. మెవావస్తువులని యీషహరులొ పిస్తా, బాదము, అగురోటు, మునక్కా అనే విత్తు కలిగిన విత్తు లేని ద్రాక్షయేమి పయిచెక్కు యెండి లొపల మాధుర్యము గలిగి విత్తు అతిహ్రస్వముగా కండకలిగిన అనారు అనే దాడింమపండ్లున్ను యెండి అత్తిపండ్లున్ను సమృద్దిగా అమ్ముతారు. సెబుభి యివి మొలయిన శీమ అప్పీల్సు యీ దేశములో అవుతున్నవి. కాశీలో హుక్కాబుర్రలు అమ్మేటందుకు ఒక వీథి ప్రత్యేకముగా యున్నట్టు యీషహరులో యెక్కడ చూచినా నానావిధాలయిన పాదరక్షలు, హుక్కాబుర్రలు మొదలయినవాటి సామానులు అమ్ముతువుంచున్నవి. చలికాలములో రజాయి దుప్పట్లు, రజాయి చొక్కాలు అమితముగా తయారు చేసి అంముతారు.

యీ షహరులో హయిదరాబాదు వలెనే ఆయుధములే ఆభరణాలుగా యుంచే స్వభావము కల మనుష్యులు సమృద్ధిగా వున్నా యింగిలీషువారి అధికారము పూర్తిగా యిక్కడ జరగసాగిన వెనక లక్షాంతరాలు ఆయుధాలు నిర్బంధము మీద లోకులవద్ధ తీసి విరిచి గంగలో వేసినారు. అట్లా చేసిన్ని యింకా యెవరిచేత చూచినా ఆయుధాలున్ను నిర్నిమిత్తముగా ఒకణ్ని ఒకడు నరుక్కోవడాలున్ను గలగి యున్నది.

యీ దేశములో చక్కెర కాచి పోసే కలకండ, చీనా కలకండ పచ్చకర్పూరమున్ను యెంత మాత్రము దొరకదు. నేపాళ దేశము


పదునాలుగవ ప్రకరణము  హిందూస్తాన్ సంస్థానాలు మరియు ఆచార విచారణ

యిక్కడికి సమీపము గనుక అక్కడ అయ్యే కస్తూరి అమ్ముతారు. అందులో కృత్రిమము బహుశ, జరుగుచున్నది. కుంకుమ పువ్వు అయ్యే కాశ్మీర దేశము దక్షిణదేశము కన్నా యీ దేశానికి సమీపముగా వున్నా మనదేశములో దొరికేపాటి మంచి విడి కుంకుమపువ్వు యిక్కడ దొరకదు. వస్తువులు అయ్యే దేశాలనుంచి అన్య దేశాలకు ప్రియమయిన దినుసులను తమ దేశములో వాడీకెలోకి తేకనే పంపించేటట్టు తోచుచున్నది. యీ దేశస్థులు యిక్కడి శీతము యేపాటి? నేపాళ దేశములో కలిగే చలికి సహస్రాంశములలో ఒక అంశ యిక్కడ లేదని చెప్పుతారు. సాల గ్రామాలు ఉత్పత్తి అయ్యే కొండ భూమి నేపాళ దేశములోనే వుండియున్నది. ఆ కొండ మీదుగా గండకీనది ప్రవహింపుచున్నది. ఆ నదిలో సాలగ్రామాలు యెత్తడము నర్మదా శోణభద్రా నదులవలె పట్నావద్ద కలిసే గండకీ నదిలో పట్టిన తావున సాలగ్రామాలు దొరకవు, ఆ కొండ ప్రదేశములోనే ఆ నదిలోనే సాలగ్రామాలు కలిగి వున్నవి.

యీ హిందుస్తాన్ లో యింగిలీషు వారికి అధీనము కాకుండా యికను నిండా ప్రయత్నము మీద స్వాధీనము కావలసిన రాజ్యము రణజిత్తుశింగుదీ ఒకటేను. వాడి రాజ్యము హిందూస్తాన్ కు చివర కాశ్మీర ఖండమున్ను, లాహోరు అనే షహరున్ను, మూడు లక్షలమంది మార్బలము కలిగియున్నాడు. హయిదరాబాదు చట్టముగా యింగిలీషు వారిని ఉపసర్పించుకొని రాజ్యము చేయుచు నుండే వారు జోతీపురపు రాజు, జయపురపు రాజు, బిక్కనెరి, బికెనీరు!, రాజు, నేపాళపురాజు లక్కునో నబాబు, శింధ్యా, హోలుకరు, వీరు తప్ప మరి యెవరున్ను రాజ్యాధిపతి అని పేరు పెట్టి పిలవడానికి హిందూస్తాన్ లొ లేరు. హోలుకరు, వీరు తప్ప యెవరున్ను రాజ్యాధి పతి అని పేరు పెట్టి పిలవడానకు హిందూస్థాన్ లో లేరు. హోలుకరు గడిచి పోయిన వెనక రాజ్యము బహుశ, యింగిలీషువారి అధీనమయి హోలుకరు కొడుకు యింగిలీషువారి ఆజ్ఞాబద్ధుడుగా నున్నాడు హోలుకరురాజధాని హిందోలి అనే షహరు. శింధ్యాపడిపోయిన వనక వాడికి వున్నలక్షమంది మార్బలము చేదరనియ్యకుండా పట్టుకొని దత్త పుత్రిడితొ హింసపడుతూ శింధ్యాబార్య కాలము గడుపుతూన్నది. ముందరి శింధ్యారాజధాని హుజనీపట్నము. యిప్పట్లో గవాలియ్యరులో దండు సమేతముగా అతని కుటుంబము వాసము చేస్తూవున్నది. లక్కునో నవాబు ధనము విస్తారముగావున్నా లక్షపౌజు వున్నా ప్రజలను హింస పెట్టుతూ* పేరుకు నవాబుగా వున్నాడు. జోతీపురము జయపురము బిక్కానెరి రాజులు మారువాడీలు గనుక యీశ్వరుడు వారికి యిచ్చిన సిర్జల భూములలో యున్నారు.

జ్వాలాముఖి యనేస్థలము రణజిత్తుశింగు రాజ్యములో వున్నది. ఆదేవిని అతడు బాగా ఆరాధింపు చున్నాడు. అతని రాజ్యములొ యిప్పటికిన్ని న్యాయము బాగా జరుగుతూ ప్రజలు బాగా పరిపాలింపబడుతూ యున్నారు. యీదేశము మొదలు కాశ్మీరములొగా సారా అనిన్ని, బరువు అనిన్ని మంచుగడ్డలు పడుచున్నవి. యింతమంచు నీభూమికి పెట్టిన ఈశ్వరుడు ఈ భూమినివాసుల క్షేమముకొరకు ఉష్ణోదకపు పూట కలిగిన గుండములు కొన్ని నిర్మించి ఉన్నాడు. అవియెక్కడ వంటే గయనుంచి జగన్నధానికి పొయ్యేమార్గములో బలుబలు అనేవూళ్ళో వొకటి, గయకు కొంతదూరములో రాజగృహీ అనేవూళ్ళో ఒకటి, మూంగేరి అనేముంగా చీరలు అయ్యే గంగవొడ్డుషహరుకు సమీపముగా సీతాగుండ మనేది వొకటి, హుజ్రి దేశములో తప్తమణికర్ణిక అనే గుండాము వొకటి, డాకాదేశములో బాలవాగుండ మనేది ఉదకము మీద జ్వాలలు లేస్తూవుండే గండము వొకటి, బదరీ నారాయణమువద్ద వుండేది వస్తువులను వేడిచేసే గుండము వొకటి, యీప్రకారము ఈశ్వరుడు సృస్టించి వున్నాడు. తప్రమణికర్ణికలో బియ్యము మూటకట్టి వేస్తే అన్నముగా పచనమవుచున్నదట. ఈ వుష్ణగుండముల వుదకము యావత్తు గంధకపు వాసన కలిగి వున్నట్టు విచారణమీద తెలిసినది. సదా జ్వాలలు

*ఇది ఇంగ్లీషువారు వ్యాపెంప చేసిన వదంతి యని బిషప్ హెబరుగారు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో స్వయముగా చూచి వ్రాసినారు.

కలిగి వుండే జ్వాలాముఖి గుళ్ళోనున్ను ఆ ప్రకారమే గంధక పరిమళము సదా కలిగి వున్నట్టు తెలియవచ్చినైది. నాయిక్తితో విచారించగా పయి భూములలో శీతము కలుగ చేసిన ఈశ్వరుడు భూమి కింద వుష్ణంకు కలిగివుండే కొరకు గంధమము విస్తారముగా వుత్పత్తి చేసినాడనిన్ని, అగ్ని గంధములో పుట్టడము సహజము గనుకనున్ను యీ గంధకము కలిగిన ప్రదేశములలో పుట్టే వూటజలము సహజముగా ఉష్ణముగా వుండేటట్టు తోచుచున్నది. జ్వాలాముఖిప్రదేశములొ ఆరాధన నిమిత్తమయి గంధకద్వారా భూమిలో జ్వాలను ఈశ్వరుడు సదా కలగచేసినట్టు తొచుచ్ఫున్నది. జ్వాలాముఖి స్వారూపముగా వుండే మహామాయ రణజిత్తుశింగుకు ప్రత్యక్షముగా యిష్టసిద్ధులు చేయుచూ యున్నది.

జ్వాలాముఖికి కొంత దూరములో రేవాలేశ్వర మనే తటాకములో అద్యాసి రెండు పెద్ద గుండ్లు పర్వతాకారముగా తేలుతూ లోకుల యారాధనలను అంగీకరింపుచు సంచరిస్తూ వుండేటట్టు నిశ్చయముగా తెలిసియున్నది. ఆ శిలల స్వభావము యెటువంటిదో తెలిసినదికాదు. కాలక్షేప నిమిత్తమయి సృష్టించిన యీ సృష్టిలో అటువంటి ఉదకము మీద తేలే శిలలు వుంటే యేమి వింత! అయితే దానికిన్ని హేతువు గర్భములో వున్నదని తొచుచున్నది.

నేపాళ దేశములో దేవప్రయాగ అనే వూరు వొకటి వున్నది. అందులో భగవత్పాదులవారు శ్రీరామమూర్తిని యంత్ర సహితముగా స్థాపించి కర్మకులుగా వుండే ద్రావిళ్ళు ఆ మూర్తిని ఆరాధన చేసేటట్ట్లు నియమించి ద్రావిళ్ళను కొందరిని అక్కడ వుంచినారు. ఆద్యాపి వారు అక్కడ వుండి పుట్టే ఆడబిడ్డలను యీ దేశములో నుంచి వచ్చే ద్రావిళ్ళకు స్థితులు వ్రాసియిచ్చి వివాహము చేసియిచ్చి అక్కడనే వుంచుకుంటూ వచ్చుచున్నారట. ఆటు జరగడమువల్ల ద్రావిడ దేశస్థుల యిండ్లు యిన్నూరుదాకా ఆ దేవప్రయాగలో యేర్పడి వున్నవి.

ద్రావిళ్ళ ప్రవేశము కావడములో యీ దేశములో యింతే కాకుండా మొన్నూరుయేండ్ల కిందట ద్రావిడి యయిన యొక వెలనాటి నాడు దేశములో భార్యను వదిలి బృందావనానికి వచ్చి వరక్తుడయి సన్యాసము తీసుకొన్నాడు. కొన్నిదినములకు పిమ్మట భార్య వెతుక్కొనుచు ఆ పురుషుని వద్దికి వచ్చి తన్ను పరిగ్రహించక పోయినంతలో ఆపె నిండా నిర్బంధపెట్టి కృష్ణమూర్తి ఆజ్ఞ అయితే నన్ను పరిగ్రహిస్తావా అని అడిగి నట్టున్ను, మంచిదని అతను కృష్ణమూర్తి యుపాసకు డయినందున చెప్పినట్టున్ను పిమ్మట కృష్ణమూర్తి ప్రత్య్హక్షమయి భార్యను స్వీకరించమని ఆజ్ఞ యిచ్చినట్టున్ను అటుపిమ్మట ఆ సన్యసించిన పురుషుడు భార్యను అంగీకరించి యేడుగురు కొడుకుల కన్నట్టున్ను ఆ యేడుగురున్ను యేడుపీఠాలను యేర్పరచుకొని వల్లభాచార్యులని పేరుపెట్టుకొని కృష్ణమూర్తి యుపాసకులై ద్వారక మొదలుగా యీ హిందూస్తాన్ లో వుండే బనయా అనే వైశ్వెజాతి వారికంతా ఆచారవ్యహారాదు ఉపదేశించి అటుయేర్పడ్డ శిష్యులకు తులసీ మణులు ధారణ చేసి అతిప్రబలులుగా వున్నారు. వారు ద్రావిడ దేశపు వెలనాటి వారితో సంబంధములు చేయుచూ వృద్ధిపొందినారు. ఆయేడు పీఠాలలో నాధద్వారములో ఒక పీఠము వున్నది. అది ముఖ్యపీఠమని చెప్పుకోవడము. దక్షిణదేశములో వారికి శిష్యులు కోటిమంది గుజరాతీ వాండ్లు ఆ యేడుపీఠస్థుల యొక్క వంశస్థులు హిందూదేశము యావత్తున్ను శిష్యయాత్ర చేస్తూవుంటారు.

యీ వల్లభాచార్య పీఠస్థులు గోపీకృష్ణోపాసకులు. వారికి బనయా జాతికాక ఇంకా అనేక శూద్రజాతివారు గూడా శిష్యులై యున్నారు. యీ వల్లభాచార్యుల పీఠముగాక హితహరి వంశాచార్యులని యీ దేశపు బ్ర్రాహ్మణుడు వొకరు రాధాకృష్ణోపాసన చేసి బృందావనములో వక పీఠమును యేర్పరచుకొని వారికి తులసీమణి ధారణచేసి ఆచారవ్యహారాలు నియమించి వున్నాడు. యీ పీఠస్థుని వంశస్థులకు ఏకాదశినాడు తాంబూల చర్వణము చేయడానికి శ్రీకృష్ణమూర్తి అనుజ్ఞ యిచ్చి వున్నాడని అపశక్యముగా అతని శిష్యజనులున్ను ఏకాదశినాదు ఆద్యాపి తాంబూల చర్వణము చేయుచూ వుంచున్నారు. హిందూస్తానులో ఏకాదశినాడు విష్ణుభక్తులు సకలవిధములయిన ధాన్యములు పరిత్యజించి కందమూలాదులు శింగాణి పిండిన్ని తిని వ్రతము ఆచరింపు చున్నారు.

బ్రాహ్మణులకు దక్షిణ దేశములో భట్లు, అయ్య అని పౌరుష నామధేయ్ములు స్వనామముతో కలిసివుండేటట్టు యీదేశములో బ్రాహ్మణులకు పాడె, దూబె, చౌబె, మిశిరి, తేల్వాడి, అని పౌరుషనామధేయాలు కలిగి వున్నవి. యీ పంచగౌడు లని పంచ ద్రావిళ్ళనిన్ని భేదము కలిగి వుండడమే వాటికి కారణముగా వున్నది. మిక్కిలి విచారించగా నా బుద్దికి తెలియ బడ్డది యేమంటే సుమారు వెయ్యున్నేనూరు సంవత్సరములకు ముందర హిందువులు వసించే హిందూస్తాన్ అనే యీ గంగా యమునల మధ్యేవుండే భూమి మ్లేచ్చ భూమి అయిన పార్షి దేశానికి సమీపము అయి వుండగా కాబూలు కనమగుండా సింధువనిన్ని హిందువనిన్ని ద్వినామక మయిన మహానదిని దాటి కలి సాంమ్రాజ్య ప్రేరణచేత మ్లేచ్చులు* డిల్లి అనే హస్తినాపురి ప్రవేశించి కర్మద్వారా బ్రాహ్మణులు అయివుండే వారికర్మములు సాగకుండా వారిని భ్రష్టులను చేశేకొరకై అనేక హింసలు చేసినందున యీ రాజ్యము యావత్తు మ్లేచ్చాక్రాంతమైనందున యీ దేశస్థులు కర్మమును నిండా పాటించను వయిపులేనివారైరి.

యిప్పట్లో దాక్షిణాత్యులయున హిందువులు స్వభాషతో యింగిలీషుమాటలు కలిసి మాట్లాడుతూ వచ్చేటట్టు యిక్కడ దొరతనము చేసేవారి తురకమాటలు సంస్కృతభాషతొ యీ డేశస్థులు కలిపి మాట్లాడుతూ తురకలవలెనే వస్త్రవాహనాద్యలంకారాలను అంగీకరించి ప్రవర్తిస్తూ వఛ్ఛేటట్టు తెలిసినది. అయినప్పటికిన్ని ముఖ్యమయిన వర్ణాశ్రమ ధర్మాదులు మాత్రము యిక్కడివారు వదిలినారు కారు.

*మ్లేచ్చుల దండయాత్రలు, క్రీస్తుకు పూర్వము మూడు వందలు నుంచి రెండు వందలు వరకు శరాబ్దములలో మన దేశమునకు, గ్రీకులు, వయనులు, శాకులు వచ్చిరి. క్రీస్తు తరువాత కూడా యీచీ మొదలకు ఆశియా తెగలువచ్చిరి. క్రిస్థుశకము ఐదు,ఆరు శతాబ్దములలో, హూణులు, ఎనిమిదవ శతాబ్ధములో అరబ్బీలు, తరువాత ఆఫ్ఘనులు పారశీకులును వచ్చిరి. వీరినందరిని మనవారు మ్లేచ్చులనిరి.

యీబ్రహ్మాండమునందు నున్న బ్రాహ్మణమండలి ద్రావిళ్ళ నిన్ని, గౌడులనిన్ని రెండు తెగలుగా చీలి ఆ రెండు తెగలలో నున్ను అయిదేశి తెగలు యేర్పడి తుదకు పది తెగలుగా చీలినది. అందులో గౌడులకు సొంతమయిన భూమి సాత్విక ప్రధానముగా అనాదిగా వుండుటచేతనున్ను స్థూలదేహాలు పృధివీ భూతానుగుణముగా వుండేవి గనుకనున్ను అనాది సంప్రదాయ ప్రకారముద్వైతాద్వైతాలు శాస్త్రము చేత వాదింపబడుచునున్నా కర్మదృష్ట్యా ఉపాస్యదేవతలు భిన్నుములు గానున్నా యెదటివాడి ఉపాస్యదేవతను నిందించకుండా స్వంత తండ్రిని కాపాడి యితరుల తండ్రులను కొట్టక తిట్టకవుండి మర్యాద చేయుచు వుండేటట్టు తమ తమ అంత, కరణాను గుణముగా ఉపాసనములు చేయుచు అందరు అన్యోన్యముగా ప్రవర్తింపుచున్నారు.

స్వదేశము వదిలి కర్మము మీది శ్రద్ధ విస్తారము కలగ చేసుకొనుట చేత లేచి వచ్చిన దక్షిణ దేశస్థులయిన ద్రావిళ్ళు వింధ్య పర్వతాలకు దక్షిణదేశమునందు ప్రవేశించగానే ఆ దేశవాసులు అందరు అప్పట్లో శ్రుతి స్మృతి పురాణాదుల సంకేతాలకు నిండా లోబడని వారలై మూఢులుగా ఉన్నందున వింధ్య దక్షిణదేశమునకు యిక్కడినుంచి లేచి వచ్చినవారు చేతనయినంత మట్టుకు కృత్య సంకేత ప్రకారము వైశ్యజాతిని మాత్రము కల్పించ తలచి క్షత్రియ కృత్యానికి తగినవారు లేనందున ఆ వర్ణకల్పన వదిలి తాము బ్రాహ్మణులుగానున్ను తాము కల్పించినవారు వైశ్యులుగానున్ను యితరు లందరు శూద్రులుగానున్ను యేర్పాటుచేసి అలాగే ప్రవర్రింపుచూ వచ్చినారు. అందువల్లనే వైశ్యులు మేమంటే మేము వైశ్యులమనే వివాదము అద్యాపి దక్షిణదేశములో తీరకుండావున్నది. వింధ్యకు దక్షిణదేశ నివాసులు అందరున్నూ తత్పూర్వము శూద్రులకు శ్రుతి స్మృతి పురాణాదులగుండా నియమింపబడియుండే ఆచారాలు యెరగక నొక మూఢ ధోరణి అయిన తమ పూర్విక మార్గముగా ప్రవర్తింపుచు వున్నందున, ఇక్కడినుంచి లేచి వచ్చిన బ్రాహ్మణులు శూద్రులతొ తాము యీదేశములో ప్రవర్తింపుచూ వచ్చిన జాడ వదిలి తమ యెక్కువగౌరమును ఆపాదించుకొనే కొరకు వాండ్లను కొంత వెలిగా వుంచి తదనుగుణముగా ఉపస్మృతులు పురాణాదులు కల్పనచేసి అక్కడి భూపతులకు బోధించి తమకు తోచిన కర్మాదులను క్రమక్రమముగా ఆచారవ్యవహారాదుల మూలముగానున్ను బింబారాధనల ద్వారానున్ను ప్రబలపరచుచు వచ్చినారు.

వింధ్యకు నుత్తర దేశవాసులయిన బ్రాహ్మణులు అందరున్ను ఋషులని అద్యాపి బ్రాహ్మణుల సంధ్యావందనములలో గంగా యమునల నడుమనున్న ఋషులకు సమస్కార మని వచిస్తూవున్నారు. దక్షిణదేశములో తత్పూర్వము బ్రాహ్మణులు లేనందున యీ దేశము నుంచి వచ్చిన బ్రాహ్మణులను నాక్షాదృషులనే తాత్పర్యముతో దక్షిణదేశములోని భూపతులు వీరు చెప్పినట్టువిని, ఆలయాదులు వాటి ఆరాధనలు, బ్రాహ్మణ గౌరవము, వారిపోషణ, మొదలయినవి సకలవిధాల చేస్తూ వచ్చినారు. అప్పట్లో యీ బ్రాహ్మణులు వింధ్యకు దక్షిణ దేశానికి రావడము సూర్యుడు భూమికి దిగివచినట్టు అక్కడి భూపతులకు తోచినది గనుక యీ బ్రాహ్మణులు తమ దేశము వదిలిపోకుండా వుండేకొరకు అపారమైన భూస్థిరులు యిచ్చినారని నాకు తోచశాడుతున్నది. యిప్పట్లో అక్కడి బ్రాహ్మణులు అనుభవించే భూస్థితులవంటివి యేకాలమందున్ను యీదేశపు బ్రాహ్మణులు యిక్కడ అనుభవించినది లేదు గనుక యీ హేతువు పై వూహకు నిండా అకరముగా వున్నది.

యీ ప్రకారము కర్మశ్రద్ధ మితిని మింఛేటట్టు చేసేకొద్దిన్ని క్రమక్రమముగా తమలోతమకే యీకర్మము చేసుటచేత నేను యెక్కువంటే ఆ కర్మము నీవు చేయతగవు గనుక నీవే తక్కువ యని వివాదము పుట్టి వివాద పురస్సరముగా ద్వేషము జనించి నీవు చూడగా నేను బోజనము చేయరా దనిన్ని నీవు తాకిన పాత్ర నేను కడగక వాడుకో ననిన్ని, నీ యుపాస్య దేవత మీద ఫలాని ఫలాని దోషాలు వున్న వనిన్ని, నా యుపాస్యదేవత గుడికి నీవు రాకూడ దనిన్ని, నీయుపాస్యదేవత గుడి నీడలోకి కూడా కూడా నేను రా ననిన్ని వాదింపుచు తమ్మున గురుభావనగా ఆరాధింపుచూ వుండే అక్కడి దేశస్థులకు కూడా వారిలో వారికి అలాటి ద్వేష బుద్ధిని పుట్టించి పుండ్రాలు వస్త్రధారణలు కూడా వీదు ఫలాని దేవతోపాసకుడు, వీడు ఫలాని కర్మము చేసేవాడని గురుతు వుండే కొరకు సంపూర్ణముగా భేదించే టట్టు ఛెసినారు. అది మొదలు దిన దినానికి శైవ వైష్ణవులున్ను తదంతర్భూతులున్ను యితరులున్ను ద్వేషములకు అంతము లేకుండా యిప్పటికిన్ని వివాద పడుతూ వున్నారు.

హిందూస్తాన్ లో ప్రవేశించిన తురకలు క్రమ క్రమశ, వింధ్య దక్షిణచేశములో కూడా పిమ్మట ప్రవేశించినా యిక్కడ హిందువుల సహవాసము తత్పూర్వము తమకు నిండా కలిగి వున్నందుచేతనున్ను హిందువుల మత సంకేత బలాబలాలను చక్కగా తెలుసు కొని వున్నందు చెతనున్ను తమ మతోద్ధారకుడైన మహమ్మదు తనువు ధరించిన తమ మతము శ్రేష్టమని లోకులకు బోధపడే కొరకు తమ మతములో ఒకణ్ని కలుపుకొని తురక చేస్తే పుణ్యమనిన్ని తమ మతముకాని వాని మొగము చూడరా దనిన్ని ఖురానులో వ్రాసిన మాటను నమ్మి మూఢభక్తి కలిగిన తురక భూపతులు యిక్కడ అదిలో తురకల చేసే కొరకు హిందువులను హింస పెట్టినట్టు దక్షిణ దేశములో పిమ్మట వారు హింసించిన వారు కారు. రాజ్యకాంక్ష కలిగిన బుద్ధి ఆ విషయములో వారికి సాత్వికాన్ని సంపాదించి యిచ్చినది.

వెనక వెంబడిగానే నడితి వెరేనున్ను తత్వము వేరేగానున్ను వుండే హిందువుల బహిరంగ కృత్యములు చూచి వీండ్లు వెర్రివాండ్లు తెలియక రాళ్ళు రప్పలు నదులు కొండలు యివి మొదలైన వాటిని దేవుండ్లనుగా యెంచి చెడిపోతారనే పశ్చాత్తాపబుద్ధి మాత్రమే కలిగిన అతి దూరములోవుండే సాత్వికగుణప్రధాను లయిన యింగిలీషు జాతి వాండ్లు హిందుదేశానికి భూపతులయినందున వారివల్ల కర్మాదులు యేహ్యపడ్డా ప్రబలవిరోధము మాత్రములేక తమ తమ కర్మాదులు తమ తమ యిష్టాల్నుసారముగా సారినమట్టుకు గడుపుకొంటూ యిప్పుడు దాక్షిణాత్యులు అక్కడ వున్నారని తోచుచున్నది.

పయిన వ్రాసిన ప్రకారము గంగా యమునా తీరవాసులయిన బ్రాహ్మణులలో కొన్ని తెగలు వింధ్య దక్షిణదేశములో ప్రవేశించిన వెనక నొక తెగ కృష్ణాగూదావరీ నదుల సమీపప్రాంతమందున చేరినందున దేశభాష అక్కడ ఆంధ్రమ యినందున ఆంధ్రమయినందున ఆంధ్రులయినారనిన్ని రెండోతెగ కావేరీ తామ్రపర్ణీనదుల సమీపములో చేరినందున ఆ దేశభాష రీత్యా వారు ద్రావిళ్ళు అయినారనిన్ని మూడోతెగ గోదావరి యుత్పత్తికి సమీపముభూమి అయిన నాసికా త్రియంబకము మొదలయిన భూమెచేరినందున దేశభాషరీత్యా వారు కొంకణులని మహారాష్ట్రులని రెండు నామములు గల దేశస్థులైనారనిన్ని నాలుగో తెగవారు కావేరి యుత్పత్తికి సమీపస్థళమయిన కర్ణాటకులైనారనిన్ని తోచుచున్నది.

నిండా విచారించగా ఘూర్జరులు మాత్రము ఎప్పుడున్ను హిందుస్తాన్ లోనుంచి యెత్తిపోయిన బ్రాహ్మణులతో చేరినావారు కారు. వారు ఎల్లప్పుడున్ను ఘూర్జర దేశములోని కాపురస్తులే నని తోచబడుచున్నది. అయితే వారిని పంచద్రావిళ్ళతో కలిపి వాడడము ఎందువల్లనంటే వారున్ను ద్రావిళ్ళరీతిగా వింధ్య దక్షిణదేశ నివాసులయి వున్నందుననున్ను హిందూస్తాన్ లో అయిదు తెగలుగా అయిదు దేశాలలో బ్రాహ్మణులు వృధక్కు వృధక్కుగా భాగింపబడి వున్నందున యీ పంచగౌడులకు ప్రతిగా పంచగ్రావిళ్ళు అనుకోవడానకు ఘూర్జరులను కూడా కూర్చి వాడుకుంటూ వచ్చేటట్టు తోచబడుచున్నది. అందుకు ప్రబలమయిన కారణము యేమంటే యీ దేశములోపుట్టిన గయావళీలు మొదలైన స్థలవాసులు ఘూర్జరులు వినాగా వుండే నాలుకు తెగల ద్రావిళ్ళు అన్నశ్రాద్ధముచేస్తే బ్ర్రాహ్మణార్ధముచేసి వారి పాకములో భోజనము చేస్తారు గాని ఘూర్జర బ్రాహ్మణులు చేసే శ్రాద్ధాలలో భ్రాహ్మణార్ధము నిమిత్తమైవారి పాకములో భోజనము చేయడము లేదు. ఘూర్జరుల చేత చటకశ్రాద్ధము చేయించి శీదా లనే స్యయంపాకము గయావళీలు పుచ్చుకుంటున్నారు. అందువల నున్ను యీ ఆచారములనే అద్యాపి దక్షిణ దేశమందున్ను కడమ నాలుగు తెగల ద్రావిడ బ్ర్రాహ్మణులున్ను పాటిస్తూ వుండడము చేతనున్ను కావేరి తామ్రపర్ణి తీరాల యందు మాత్రము ఘూర్జర బ్రాహ్మణులు నిండా కర్మకులుగా నడవపట్టి ఒక మాత్రముగా వారితో భోజన ప్రతిభోజనాలు కల్గివుండుట చేతనున్ను భగవత్పారుల వారు దిగ్యిజయము చేసినప్పుడు ఘూర్జర దేశములోనే నివాసులుగా వున్నట్టు శంకర విజయములో కని వుండుట చేతనున్ను బ్రాహణ మండలి పృధక్కు కాకమునుపే యీ మండలిలో చేరక ఘూర్జరులు ప్రత్యేకముగా స్వదేశ నివాసము యెప్పుడు ఒకటే రీతుగా ఛెస్తూవుండే టట్టు తోచుచున్నది.

యీ ప్రకారము యిప్పుడు తెలివచ్చి వుండే పంచగౌడులు పంచద్రావిళ్ళు అనే పదితెగల బ్రాహ్మణులు గాక పరశురామ నిర్మితమైన కేరళదేశాస్థులు, చిత్పావనులు, కరాడీలు, అనేమూడు తెగలవారు వున్నారు. యీ మూడు తెగలలో పునా శ్రీమంతుడు చిత్పావన బ్రాహ్మణుడై సార్వభౌముడై బహుకాలము ప్రవర్తించి నందున కొంకణస్థులలో నాశికాత్రయంబక నివాసులైన బ్రాహ్మణులకు కనకాభిషేకాలుచేసి, ఆ తెగతొ పూరాగా తాను తన జాలాన్ని కలిపి కరాడీలను కూడా కలిసినారు. యిప్పుడు మహారాష్ట్రులకున్ను వారికిన్ని యెంత మాత్రమున్ను భేదములేకుండా వుభయులు వొకరితో వొకరు కలిసి యున్నారు. యీ తెగలు గాక కేరళ దేశస్థులు తమ దేశములొ పూజ్యులుగా, యితర బ్రాహ్మణులతో నిండా కలియక నున్ను కలియ కూడకనున్ను నంబురు, నంబూద్రీ, లనిపించుకొని తమంతట తాము వుండి వున్నారు.

గయలో బ్రహ్మ కల్పిత బ్రాహ్మణులనే వొక తెగవారు గయావళీలుగా వున్నారు. కాశిలో గంగా పుత్రులని వొక తెగవారు గయావళీలుగా వుండి వున్నారు. యిదిన్నిగాక శాకద్వీప బ్రాహ్మణులని వొక తెగవారు హిందూస్థాన్ దేశములో వాసము చేస్తూ యిప్పటికిన్ని వున్నారు. వారి వృత్తాంత మెమంటే శ్రీకృష్ణులు ద్వారకలో విరాజమానులయి వుండగా సాంబుడనే అతని కొమారుడికి పెద్దరోగము ప్రాప్తించి నట్ట్లున్ను చికిత్స నిమిత్తమై వైనతేయుడు శాకద్వీపమునుంచి వొక బ్రాహ్మణుని తెచ్చినట్టున్ను వాని వంశస్థులు తామని ఆ తెగవారు అద్యాపి యీ దేశములొ చికిత్స చేస్తూ నెగడి వున్నారు. పైన వ్రాసిన తెగలుగాక యీ హిందూస్తాన్ లో విశ్వరర్మకు రంభకున్ను శాపము తగిలి భూలోకములో మానుషజన్మము కలిగి ఉభయులున్ను దాంపత్యము పొసగి సంతు కలిగినట్టున్ను వారికి కలిగిన సంతు విశ్వకర్మ కల్పిత బ్రాహ్మణులని వారి శిల్పిపనులు చేస్తూ యిప్పటికిన్ని నెగడి వున్నారు.

గయలో వుండే డాక్టరు జాన్ డేవిడు సన్ దొర ప్రపంచసృష్టి సంబంధము లయిన మాటలు నాతో ఆడుతూవుండగా హిందూదేశములో వుండే బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలనె భేదము యీశ్వ నిర్ణయమా? లేక్ మానుష సంకేతమా? అని ప్రశ్నవేసినాడు. బహుదూరము వాదము జరిగి మానుష నిర్ణయమని తెలియచేసినాను. పిమ్మటనున్ను బహుశా విచారించగా అదే తాత్పర్యమునాకు బోధ అయినది. అందుకు హేతువులు యేమంటే వొక పురుషుడు ప్రజల వుత్పత్యర్ధమున్నూ తద్వారా మానుషానందానుభవార్ధమున్ను స్త్రీని పరిగ్రంచి ప్రజావృద్ధి చేసినట్టు యీశ్వరుడు సృష్టించిన అనేక బ్రహ్మండాలలో అనేకకోటి పిండాండాలు అంతర్భూతములై వున్నవి. ప్రతిపిండాండానికిన్ని బ్రహ్మాండానికికలిగిన సకలగుణాలు చేష్టలు మొదలయినవి వేర్పడివున్నవి. అందుకు దృష్టాంత మేమంటే పృధివ్యప్తేజోవాయ్వాకాశాలు ప్రతి బ్రహ్మాండానికికలిగివున్నట్టు అంతర్భూతములుగా వుండే అనేక పిండాండాలకు కలిగివున్నవి. ప్రతి పిండాండానికిన్ని అనేక సూక్ష్మ పిండాండాలు అంతర్భూతములై వున్నవి. అందుకు దృష్టాంతమేమంటే ప్రతి దేహములోనున్ను అనేక క్రిమికీటాదులు ఉత్పత్తి అయి నశింపుచు వుండడము సిద్ధము గనుక యీఅర్ధమున్ను సత్యమే గదా! ఒక అద్దానికి యెదురుగా మరివొక నిలువుటద్దము కట్టి నడమ మనిషి నిలిచి చూస్తే వొకటిలో నొకటిగా తన ప్రతి బింబాలు అసంఖ్యేయముగా ఉత్పత్తి అయ్యేటట్టు దీపదీపికా న్యాయముగా అనేక అనుష్యులున్ను జంతువులున్ను పరంపరగా యీశ్వర భాతిచేత సృష్టములై స్థితిని బొంది లయమవుచు నున్నవి.

ఇట్లు సృజింపబడిన యనేక బ్రహ్మాండములలో మనము వసించే బ్రహ్మాండము న్నొక్కటే. యిందులో యీ భూమియొక్క కొలత యింగిలీషు వారి యొక్క వూహ ప్రకారమున్ను మన గోళశాస్త్ర ప్రకారమున్ను చచ్చొకము సుమారు యిరువైకొట్లమయిలు లున్నవి. వీటిలో ఉదకమయముగా నుండే భూమి పదమూడు కోట్లు మయిళ్ళు పోగా మనుష్య వాసముగా నుండే భూమి నాలుగు కోట్ల మయిళ్ళు. యిందులో వశింఛే మనుష్యమండలి డెబ్బదికోట్లు. యిందులో దక్షిణోత్తరాలలో కన్యాకుమరి మొదలు కాశ్మీరము వవకున్ను తూర్పు పడమరలలో సింధునది మొదలు బ్రహ్మపుత్రి నదివరకున్ను వాసము చెసే హిందు దేశల్పు జనులను మొత్తముగా చెరిసగముగా లెక్కచూచినా ముప్పదియైదు కోట్లకు యెక్కువవుండరు. వర్ణాశమ నియమము కలిగిన కర్మభూమి పయిన వ్రాశిన యల్ల సరిహద్దుకు లోపల నున్నది గాని యీ బ్రఖాండములో మరియెక్కడనున్ను లేదు.

పైన వ్రాసిన చత్రురశ్ర, మ భూమిలో నుండే మానిషమండలికి మాత్రమే వర్ణాశ్రమ ధర్మములు కలిగియున్నవి గాని మిగిలిన సగం భూమిలోనున్ను వారికి వృత్తులచేతనున్ను కృత్యములఛేతనున్ను మనుష్యతారతమ్య జ్ఞానమేగాని వృత్తికృత్యములతోకూడా హిందూదేశ మర్యాద ప్రకారము రక్త పరంపర నిమిత్తము లేదు. యీ కర్మభూమిలోనున్ను రక్త పరంపరే స్వతంత్రముగా వర్ణాశ్రమాలను కాపాడనేరదు. కృత్యమున్ను వృత్తిన్ని పుట్టుకతొకూడా మిళిగమై యుండవలసి యున్నది గదా! యిందుకు ఆకరమేమంటే జన్మనా జాయతే శూద్ర, కర్మణా యాయతే ద్విజ, అనే వచనమే ఆకరము. యీశ్వరుడు ఆదిలో యీ వర్ణాశ్రమ ధర్మములతో మనుష్య సృష్టిని చేసి యుంటే బ్రహ్మాండమందంతటా యీవర్ణాశ్రమ ధర్మములు యీ రీతిగానే గలిగియుండ వచ్చునే! అయితే ఈ బ్రహ్మాండములలో మానుష సృష్టి పయినవ్రాసిన చతురశ్రమమైన కర్మభూమి మొదలుగా ఆరంభింపబడినది. అందుకు అకర మేమంటే యింగిలీషు వారి బైబిలులో యేడం, Adam,అనే కూటస్థురాలున్ను యీ ప్రదేశములో పుట్టినట్టు చెప్పియున్నది గనుకనున్ను మన పురాణాలు అందుకు ఏకవాక్యతపడుతున్నవి గనుకనున్ను మన పురాణాలు అందుకు ఏకవాక్యతపడుతున్నవి గనుకన్ను మానుష సృష్టికి ఆరంభము మొట్టమొదట హిందుదేశములో నుంఛేనని నిశ్చయించ వలసినది. పిమ్మట పరంపరగా దీప దీపికా న్యాయముగా బ్రంహ్మాండమంతా మానుష మండలితొ నిబిడీకృత మవుతూ వచ్చుచున్నది.

అటు సృష్ట్రికి అది మనుష్యులు యీ ప్రదేశములొ వసించినందు చేతనున్ను వారు సచ్చిదానంద స్వరూపుడైన యీశ్వరునికి యధోచితిముగా సమానులుగా వుండవలసినవారు గనుకనున్ను తద్వారా వారు స్వేచ్చామరణము గలవారుగా వుండవలసినవారు గనుకనున్ను అటువంటి మహాత్ములు యీశ్వరుని చిద్విలాసము చూచి బహు కాలము ఆనందింపుచు వుండడానకు కోరి చిరకాలము జీవింపుచు వుండవచ్చును గనుక నున్ను వారి యీ భూమిలో సృష్టులయినవారి పరంపరలను చూచి, నాలుగు ముఖ్యమయిన పనులకుగాను మానుష కోటిని నాలుగు వర్ణములుగా నియమించి, యీ నియమింపబడిన వారి పరంపరే ఆ యా వర్ణాశ్రమకృత్యములు చేయుచు వుండతగినవి కాని వొక వర్ణమువాడు మరియొక్క వర్ణము కృత్యములు చేయకూడదనిన్ని ఒక వేళ చేస్తే భ్రష్టులవుతారనిన్ని శిక్షకూడా విధించి ఆయా వర్ణాశ్రమాలలో నున్నవారు వర్ణానుసారముగా చేయ వలసిన పనులు తెలియడానకు పూర్వికులు శృతి స్మృతులు చేసి యిచ్చి నారనిన్ని తేట పడుచున్నది. అందుకు ఆకరము యజుర్వేదములో భరద్వాజమహామునివల్ల శృతులు మానుష మండలిలో ప్రచురము చాయబడ్డవని వున్నది. అష్టాదశ స్మృతులున్ను వాటి వాటి నామాంకితాలవల్లనే మంవాదులయిన యిక్కడ మనుష్యులఛేత వర్ణాశ్రమ ధర్మాలను నియమించి తెలియ వ్రాయబడిన పుస్తకము లని తేట పడుచున్నవి.

మూల స్మృతులు పన్నెండు స్కృతులున్ను ఆజ్ఞలను విధించి నట్టు విషయాదులను నిరూపించి చెప్పుతూ వచ్చును గాని ఫలాని ఋషి మతము యిది, అందుమీద నామతము ఇది, అని మూలస్మృతులు చెప్పవు. అటు ఋషులు మతాలు వుదాహరించి చెప్పే వంతా ఉపస్మృతియని శానా దూరము వలసినది. ఇందులొ యేదేది మూల స్కృతియని శానా దూరము గయలో జడ్జీగా వుండే జార్జి ఐ. మారీసు దొరగారి సన్నిధానమందు నాకున్ను యిక్కడి పండితులుకున్ను వివాదము పడి ఒక నిశ్చయానకు వచ్చినాము గనుక ఆమూల స్కృతుల పేళ్ళు యీ అడుగున వ్రాయుచున్నాను. నెం.ఇరవై మూడు, స్వాయం భువమను స్కృతి ఒకటి. బృహస్పతి స్మృతి రెండు. వశిష్టస్మృతి మూడు. కశ్యప స్మృతి నాలుగు. భారద్వాజస్మృతి ఐదు. గౌతమస్మృతి ఆరు. యాజ్ఞవల్క్య స్మృతి ఏడు. భృగుస్మృతి ఎనిమిది. నారద స్మృతి తొమ్మిది. కపిల స్మృతి పది. పరాశరస్మృతి పదకొండు. వ్యాసస్మృతి పన్నెండు. కాత్యాయన స్మృతి పదమూడు. ఆపస్తంబ స్మృతి పద్నాలుగు. అశ్వలాయనస్మృతి పదిహేను. కణ్వస్మృతి పదహారు. అత్రిస్మృతి పదిహేడు. హరీత స్మృతి పద్దెనిమిది. యివి మూల స్మృతులు అనడానకు యెవరు సందేహపడనేరరు. కాశిలో యీ వివాదము పొశిగివున్నట్టయితే కంపెనీవారి పాఠక శాలలోనున్ను యింకా అనేకులవద్ద నున్ను గ్రంధగ్రహము బాహుళ్యముగా వున్నది గనుక వయిపు, వీలు, అయునన్ని మూల స్మృతులు సంపాదింతును.

ఇటీవల మారీసుదొర బహురసికుడును బహు శోధకుడున్ను గనుక సహగమనము స్త్రీలకు కూడదని లార్డు బెంటిక్కుగారు విధించి యిటీవల యేర్పరచినారు గదా, మీలో స్త్రీలు పురుషుడు చనిపోతే అగత్యముగా సహగమనము చెయ్యవలసినదేనా? చేయక పోతే ప్రత్యనాయమా? అని ప్రశ్నచేసినాడు. మను పరాశరులు అదిస్మత్రలు, వారి స్మృతులలొ పురుష దేహాసంతరము విధవస్త్రీలు నడవలసిన విధులను విధించి వ్రాశినారుగాని సహగమనము చేయ వలసిన దని విధిగా మూలస్మృతులలొ వ్రాయలేదు, నేను బహుదినాలుగా యీ సంగతిని విచారింపు చున్నాను, ఉపస్మృతులలో యీ విషయానకు అనేక ఆకరము లున్నవిగాని మూల స్మృతులలో లేదని చెప్పినంతలో యిక్కడి కోటపండితులు తద్వ్యరింతముగా చెప్పి తుదను మూలస్మృతులలో సహగమనానికి ఆకరము లేదని ఒప్పుకున్నారు.

యీ స్మృతులు కల్పించిన వారి పేళ్ళనున్ను ఋగ్యజు స్వామాలను భూమిలో ప్రచురము చేసిన భారద్వాజుల పేరున్ను సావధానముగా యోచిస్తే వారు యీ కర్మభూమిలో వుత్పత్తి అయినవారు మాత్రమేగాక ఆయా పద్దెనిమిది ఋషుల జననమును జనన కాలమున్ను పురాణాదులవల్ల వూహించి చూడగా సృష్టికి బహు కాలమునకు వెనక వారు జననమయిన వారుగా అగుపడుతున్నారు. అప్పటికి వర్ణాశ్రమ ధర్మాలు సృష్టిక్ ఆదిన కలిగినవిన్ని కారు. యీశ్వర నిర్ణల్యమున్ను కాదు. అయితే భారద్వాజులేమి స్వాయంభువమను నేమి, పరాశరులేమి, గౌగము లేమి, కశ్వపు లేమి, యింకా యితర స్మత్రలేమి వీరిని మనుష్య మాత్రులుగా చెప్పకూడదు, బ్రహ్మజ్ఞానము కలవారు గనుక సచ్చిదానంద స్వరూపులుగానే చెప్పవలసినది.

పయిన వ్రాసిన ప్రకారము వర్ణాశ్రమ ధర్మాలు వారు నియమించినంతలో యేతత్సంకేతానికి ఆ దినము లోబడ్డవారి రకత పరంపర గలవారే ఆ ధర్మాలను ఆచరించవలసినది గాని యితరులు ఆచరించకూడదని అప్పటి సంకేత ప్రకారము నియమము యేర్పడ్డది గనుక క్రీస్తు మతస్థులవలనున్ను చూచినవారికంతా బోధించి నిర్బంద పెట్టి యీ హిందూమతములో కలుపుకోవడానకు హిందువులకు నిమిత్తము లేకుండా పోవడము మాత్రమే కాకుండా ఆ ప్రకారము నియమించబడ్డ ధర్మాలుతప్పి నడిచిన వారినంతా యీ హిందు సమూహములోనుంచి తోశి అటు ప్రార్థింఛే క్రీస్తు మహమ్మదు మతస్థులతో చేరేటట్టుగా ప్రేరేపణ చేయడమవుచున్నది. ముఖ్యముగా వర్ణాశ్రమ ధర్మాలు చేసినంతలో వర్ణాశ్రమములు సిద్ధి అయ్యేటట్టుగా శాస్త్రాలు యేర్పడివుండడము మాత్రమే కాకుండ ఆదినం కేతానికి లోబడ్డ వారి పరంపర వంటివారే ఆ కర్మాదులు చేయవలసినది గాని యితరులు ఆకర్మాదులు చేసినంతలో ఆ వర్ణాశ్రమములు చిద్ధించక పోవలసినదని కూడా వెంబడిగా ఒక విధి శాస్త్రాలలో యేర్పడి వుండవలసిన దేమని యోచించిగా భారద్వాజులు మనకోసరము భూమిలో ప్రచురము చేసిన మూడు శృతులున్ను మన్వాదులు తదనుసారముగా చేసిన స్కృతులున్ను గజోమిధ్యా పలాయనం మిధ్యా అని అడివి యేనుగ బ్రహ్మజ్ఞాని తరిమితే తప్పించు కోవడానికి పరిగెత్తుతూ జగన్మిధ్యా బ్రహ్మసత్య మనే అద్వైత వచన ప్రకారము నా పరుగు అబద్ధము, తరమే యేనుగ అబద్ధము, బ్రహ్మమనే అస్తువఒకటే సత్యము అని ద్వైతులు నవ్వేటట్టుగా అద్వైతి అనుకున్నట్టు ఒక్కటే వస్తువని అంతస్తులోనమ్మి ఆవస్తువే యిన్నిగా వున్నదనే నిశ్చయముతో పయికి కనపడే అనేక వస్తువుల స్వరూపాలను మనోవికాలుగా భావించి అయినప్పటికిన్ని దేహబుద్ధి వుండేవరకు వాటికి తారతమ్యములు విచారించి తారతమ్యమయిన పనులు చేయవలసినది గనుక యీరీతిని నడవడానికి సాంప్రతాయకము తెలిసినవారే నడుతురుగాని నూతనస్తులు ఒకటి అనుకుంటూ ఒకటి చేయడము ప్రయాస గనుక చేసిన సంకేతము వదవక చేడిపొవనే తాత్పర్యముచేత పూర్వికులు అదినం కేతానికి లోబడ్డవారి వంశస్థులే యీ నర్ణాశ్రమధర్మాలు జరపవలనని నిశ్చయము చేసినారని నాకు తోచుచున్నది.

పయినవ్రాసిన మూల స్కృతులు పన్నెండు గాక మరికొన్ని స్మృతులుగూడా మూలస్మృతులని వివాదాస్పదములుగా వున్నవి. ఋగ్యజుస్సామాలుగాక అధర్వణమున్ను వొక ప్రత్యేకమయిన వేద మని వివాదముగా వున్నది. బ్రాహ్మణమండలి పయినవ్రాసిన ప్రకారము భిన్నులయి ఒక తెగ దక్షిణదేశ నివాసులయిన వనక దేశకాలాలకు అనుగుణముగా దక్షిణానికి సాగివచ్చిన మండలిలోని పండితులు నూరారులు ఉపస్కృతులు వ్యాస, వశిష్ట, నారద, అని ఆకరాలు వ్రాసి వారి వారికి సమ్మతి అయినట్టు వుపస్కృతులు యేర్పరచినారు. దక్షిణదేశములో మూల స్మృతుల సంగ్రహించడము విస్తారము లేనందున యెల్లాజియ్యము, నిర్ణయసింధు మొదలయిన ఉపస్కృతులే సంభవించే విషయాల పరిష్కాతము నిమిత్తము యెత్తిచూచుచున్నారుగాని మూల స్కృతుల జ్ఞాపాకమే మరచినారు. ఉత్తరదేశములొ పండితమండలి బహుశ, దక్షిణదేశానికి లేచిపోయు నందుననున్ను మూలస్మృతి సంగ్రహమును తాము విపత్తులచేత చేసి వుండనందున నున్ను యిటు వెనక పుట్టిన మితాక్షరము సరస్వతీ విలాపము మొదలయిన కొన్ని వుపస్కృతులె హిందుస్తాన్ లో ప్రచురముగా వాదుతారుగాని దక్షిణదేశమువలె యిక్కడ వున్న స్మృతుల పరంపర అనర్గళ పరంపర అనర్గళ ప్రవాహమై వుండ షట్చాస్త్రముల వల్ల ఆదినుంచి వివాదస్పదములుగా వుండే ద్వైతాద్వైతమతాలు రెండుగాక విశిష్టాద్వైతమతము ఒకటి అతి ప్రసిద్ధమయి దక్షిణదేశములో యిప్పుడు వెగడియున్నది. అటు ఒకటే ఆశ్చర్యకరమయిన యుక్తులతో నేగడి విదిన్ని గాక ఆరుకాటి రాయజి* సర్వాధికారము చేయుచు వుండగా సాకారాద్వైతమని ఒక మతము వుద్ధరించి ప్రబలము చేయ తలచినాడు. పాండిత్య కుశలతలు అది శృతిస్కృతులనే వృక్షముయొక్క క్షేమాన్ని వతకకుండా వేళ్ళను భేదించడమేవృక్షమునకు బలక మని దక్షిణ దేశస్థులు మూలభేదము చేయుచువచ్చు చున్నారు. వారి తాత్పర్యానికి వ్యతిరిక్తముగా వృక్షము బలహీన దశను క్రమ క్రమశ, పొందుచున్నది.

అయినప్పటికి యీ సర్వోత్తమ మయిన కర్మభూమి కర్మ ద్వారా బ్రంహ్మానుసంధానము చేసే మార్గమును యేర్పచిన పూర్వీకుల తప, ప్రభావము అమితము గనుక జరిగిన అచాతుర్యాలకు విశ్వేశ్వరుడు మ్లేచ్చులవల్ల తగుపాటి శిక్ష కొంతకాలము హిందూదేశపు కర్మకులకు కలగచేసి యిప్పుడు సాత్వికగుణ ప్రధానులయిన యింగిలీషువారిని బహు దూరము నుంచి అనాయాసముగా యీ కర్మ భూమికి దెచ్చి యిక్కడి సార్వభౌమత్వము వారికి కలగ చేసినాడు. యిఖమీదటనున్ను ఆ కరుణా కటాక్షముతొనే మన అపరాధాలు క్షమచేశి ఆదిని వుద్ధరింపబడ్డ శృతి స్కృతి చోదితమయిన కర్మములున్ను తజ్జనితమయిన బ్రంహ్మానుసంధానమున్ను నిష్కల్మషముగా కాలాంతరములో సిద్ధించ వలశినది.

*చెన్నరాజధానిని ఇంగిలీషు వారక్రమించే నాటికి ఈ సముద్రతీరపు భూమిని చాలవరకు కర్నాటక మనే వారు. ఆ కర్ణాటక నవాబునకే ఆర్కాటు నవాబు అనిపేరు. వాలాజా నవాబు కింద శిరస్తాదారు రాయరేడ్డిరావుగారు చాలా బలవంతుడుగా వుండేవాడు. ఇతడు పద్దెనిమిది వందల తొమ్మిది లో చనిపోయినాడు.


పదిహేనవ ప్రకరణము  గయా మహాక్షేత్రము

పయిన వ్రాశినటువంటి పట్నాషహరులో డిసంబరు నెల ముప్పై ఒకటి తేది దాకా వుండి పద్దెనిమిది వందల ముప్పై ఒకటి సం|| జనవరి నెల ఒకటి తేది ఉదయ మయిన నాలుగు గడియలకు గయా మహాక్షేత్రానికి ప్రయాణమై పది ఘంటలకు పున, పున, అనే నదివద్ద చేరినాను. దారి సడక్కు వేసియున్నది. యిరుపక్కల తోపులు వూళ్ళు నిబిడీకృతముగా యున్నవి. గయా వ్రజనము చేయడానము పున, పున, నదివద్ద క్షౌరముచేసుకొని శ్రాద్ధము చేసి సంకల్పము చేయవలసినది గనుక అదేప్రకారము జరిగించినాను. దిగడానకు నదివొడ్డున స్థలములేదు గనుక బయలులో గుడారము వేశి వంటభోజనములు గట్టున గడుపుకుని రాత్రి నీమా నదామా అనే వూళ్ళవద్ద ఒక సరాయి, ఒక పబ్లిక్కుబంగళా వుండగా వాటి సమీపమండు నిలిచినాము. సరాయిమధ్యే ఒక భావియున్నది. సరాయి దిగడానకు మంచివసతి. యీ సరాయి పట్టణమునకు తొమ్మిది కోసులదూరములో నున్నది. భాటబాగుగాని దువ్వరేగడ భూమి నీమా వదామా అనే రెండు వూళ్ళున్ను గొప్ప వూళ్ళేను. బాజారు వున్నది. అన్ని పదార్ధాలు దొరుకును. వంట చెరుకులు మాత్రము ప్రయత్నముమీద దొరకవలసినది. మిరిజాపూరు మొదలుగా అడివి సమీపముగా యీ ప్రాంత్యాల లేదు గనుక గొమయ శుష్కములు నాటుపురాలలో బహుశ, వాడుతారుగాని వంటచెరుకులు పట్టణములలో దొరికేటట్టు సహజముగా నాటుపురాలో దొరకవు. పున, పున, అనేనది నిండా వెడల్పు లేకపోయినా జీవనదిగా సార్వకాలము ప్రవహింపుచున్నది. యీ రాత్రిపయి రెండువూళ్ళవద్ద వసించియున్నాను.

జనవరి రెండు తేది ఉదయమయిన రెండు ఘడియలకు మంచువల్ల బాగా యెండవచ్చిన వనక బయలుదేరి యిక్కడికి తొమ్మిది కోసుల దూరములో వుండే జానా అనే వూరు ఒకటి ఘంటకు చేరినాను. దారి నిన్నటి వలెనే బాగా సడక్కుకలిగి యున్నది. ఈ వూరు షహరువంటి వూరు, పది వందల యిండ్లు కద్ధు, బట్టలుకూడా నేశి అమ్ముతారు. గొప్ప బాజారు వున్నది. వూరివద్ద ఒక చిన్ననది ప్రవహించుచున్నది. నదివొడ్డున లోగడె మజిలీవలెనే హిందువులకు ఒక సరాయి, జారులవారికి ఒక బంగళా కట్టివున్నది. బరక్రదాసు అనే పోలీసు బంట్రౌతు ముసాఫరుల సరఫరాయి నిమిత్తమున్ను కాపు నిమిత్తమున్ను సరాయి బంగాళాలవద్ద కాచియుంటాడు. యీ గొప్ప వూరిలో వంటచెరుకులు ప్రయత్నము మీద దొరికినవి. యీ రాత్రి యిక్కడ వసించినాను.

తేది ఏడు ఘంటలకు బయలువెళ్ళీ యుక్కడికి ఎనిమిది కోసుల దూరములోవుండే చెలాయనే యూరు రెండు ఘంటలకు చేరినాను. దారినిన్నటిదారివలెనే బాగావున్నది. ఈవూరిలోను సరాయి బంగాళా వున్నప్పటికిన్ని సరాయిలో మనుష్యులు నిండి యున్నందుననున్ను కాశీ పట్టణము మొదలుగా ప్రతి జిల్లా మేజస్ ట్రేటు వారు వారి సరిహద్ధు పరియంతమున్ను చప్రాశి అనే ఒక బిళ్ళ బంట్రౌతును దయచేశియిస్తూ వున్నందున, కూడావున్న తయినారి బంట్రౌతు గుండా ఆవూరిజమీందారుణ్ని పిలుపించి వాడియింటిని ఖాలీ చేయించి అందులో దిగినాను. యీ వూరు గొప్పవూరేను. సకల పదార్ధాలు దొరుకును. జలవసతి నిండాలేదు. యీ వూరిలో యీరాత్రి ససించినాను.

తేది ఉదయ మయిన ఏడు ఘంటలకు ప్రయాణమై యిక్కడికి పది కోసుల దూరములో వుండే గయామహాక్షెత్రము రెండు ఘంటలకుచేరినాను. కాశిలోవుండాగానే డౌలత్తురావు శింధ్యా గయావళి సహదేవ భయ్యా స్వీకారపుత్రుడయిన చోటాలాలు భయ్యా యోగ్యుడని తెలిసినందున ఆ చిన్నవాణ్ణి కాశికి పిలుపించినాను. అతడు రాజసల్తనతో కూడా నావంబడి ఒక బజరాచేసుకొని పట్నాషహరుకు వచ్చి అక్కడి నుంచి కూడా గయకు మజిలి మరుమజిలీగా నాతోకూడా భోజనము చేసుకొంటూవచ్చి ముందర దిగడానకు విష్ణుపాదము గదాధరస్వామి గుళ్ళకు ఫల్గుణీనదికిన్ని అతి సమీపముగా ఒక గొప్పయిల్లు కుదుర్చి పెట్టినందున అందులో దిగి, యీశ్వర కటాక్షముచేత నాగయావళీ ఉపపన్నుడయి బ్నహుశ, యింగిత జ్ఞానము తెలిసి గదాధర భట్లు అనే దేశస్థ బ్ర్రాంహ్మణుని తనవద్ద సర్వాధికాగానున్ను ప్రాపకుడుగానున్ను వుంచుకొని వున్నాడు. గనుక సకల విధాల ఆ క్షేత్రము నా స్వస్థలములవలెనే అయ్యేటట్టుగా జాగ్రత్త పెట్టించినాడు. కాశీనుంచి వచ్చేదారిలో చప్రా అనేషహరులో లోగడ చన్నపట్టణములో ఆక్టింగు గౌనరుగా వున్న గ్రీందొరగారు జననమయి వారి తండ్రిగారు అక్కడ బహుకాలము అధికారము చేసినందున వారి పాత నవుకరులకు కొంత యినాములు యిచ్చి వారి కుశలము విచారించే కొరకు నన్ను కొన్ని దినములు చప్రాలొ నిలువు మని చెప్పినందున ధనుగ్రయ త్వరగా ఆరంభించడానకు కొంత ఆలస్య పడ్డరి గనుక ధనుర్మాసములో గయావ్రజనము సమాప్తి కాక పొయినా ఆరంభము మాత్రము ధనుర్మాసములోనే చేసినాను.

గయాక్షేత్రము మహా గొప్పపట్టణము. అందుకు వుత్తర భాగ మందు యాభై యేండ్లుగా యింగిలీషువారు సాహేబు గంజు అని రెండు కోసుల దూరములో తాము యిండ్లు తోటలు కట్టుకొని ఒక బస్తీ చేసినారు. అక్కడ అనేక మళిగలు గొప్పబజారు వీధిన్ని యేర్పడ్డది. సకలపదార్ధాలు ఆబజారులో చవుక. ఆసాహేబుగంజు బస్తిన్ని గయాషహరున్ను యిప్పట్లో యిండ్ల సమూహముతో కలిసి వున్నది. రెండు స్థలాలలో మూడు వేలయిండ్లున్ను పదిహేను వేల వేల మంది ప్రజలున్ను కలిగి వుండునని తోచుచున్నది. గయలో ఒక మేజస్ ట్రేటు ఒక జిల్లాజడ్జి, ఒక డాక్టరు, యాత్రదారుల వద్ద మహస్సూలు వసూలు చేయడానికి ఒక టాక్సుకలకటరు జిల్లాకలకటరుకు అంతర్బూతముగా వున్నారు. గయాపట్నము బాహారుజిల్లాతో చేరినది. కలకటరు హుజూరి కచ్చేరి యిక్కడ బహుకాలము వశింపుచూ వుంచున్నది. యిక్కడ సకల పదార్ధాలు ద్వీపాంతర వస్తువులు సకల విధములయిన పనివాండ్లు కలరు. గడియారము చక్క పెట్టడానకు పనివాండ్లుమాత్రము పట్నా షహరులో వుండేటట్టు మిక్కటము యిక్కడలేదు. మిఠాయి అంగళ్ళలో తిలలతో అనేక దినుస్సులు భక్ష్యరూపములుగా చేసి అమ్ముతారు. వాటిఆకుకూరకు నిండా బాగా వుంచున్నది. యెర్రమందారపు మొగ్గలు అమితముగా తెచ్చి కూరకు అమ్ముతారు. అది పెసలపప్పుతో కలిపి వండితే బహు బాగా వుంచున్నది. మన దేశములో యీ మొగ్గలు వున్నా వికసించినవనక అర్చనకు వాడుతాముగాని మొగ్గలను భక్ష్యయోగ్యముగా వాడడములేదు. యిక్కడి దూదుప్యాడాలు ప్రసిద్ధి కలిగి దినాల పేరట వుంచున్నవి, వీధులు కాశీ అంతటి కుసంది కావు. జాహేబు గంజువీధులు దక్షిణ దేశములోని వీధులకు సరి పోలి వున్నవి. యిండ్లు నాలుగు అంతస్తులుదాకా కొయ్యసామాను వేశి మజుబూతి, గట్టి, మిద్దేలుగా కట్టి వున్నారు.

యీ క్షేత్రముచుట్టు కొండలు వుండడము మాత్రమేగాక షహరుమధ్యే కూడా చిన్న తిప్పలు వున్నవి. ఆ తిప్ప మిట్టలమీదనే యిండ్లు కట్టియున్నారు. సమీప మందున్న ఫల్గుని నదిని ఇక్కడి దేశస్థులు ఫల్గు అనుచున్నారు. బహుశ, వడల్పు కలిగి బహుదూరము ప్రసిద్ధి కెక్కియున్నా ప్రవహింపుచు వుండే దినాలు బహు కొద్ది గనుక అందులో యెక్కడ చూచినా చలమలుతీసి స్నాన పానాలు గడుపుకుంటూ వుంటారు. యీ చలమల విషయమయి యీ షహరుని వాసుల ఖర్చులు విస్తారముగా ప్రతి నెలకు తగులుతూ వచ్చుచున్నది. గదాధరస్వామి సన్నిధిలో వుండే ముఖ్య చలమ వుదమకు కూపోదక మర్యాదగా వుష్ణకాలానకు శీతముగానున్ను శీతకాలానకు వుష్ణముగాను వుంచున్నది. గయావళీల యిండ్లు---పది వందల చిల్లర అని ప్రసిద్ధి అయి వున్నా ఏడు వందలు యిండ్లు హాజరుగా వున్నవి. గౌడబ్రాహ్మణుల యిండ్లు శానా

వున్నవి. మహారాష్ట్రులు ఆంధ్రులు కలిశి ముప్పై యిండ్ల దాకా వున్నారు. పంచద్రావిళ్ళలో నూటిదాకా బ్రాహ్మణ మండలి చేరుతున్నవి. వారికి జీవనము షోడశీ అనే పౌరొహితము. వారు గయావళీలను వుపసర్పించుకొని వుంటారు. వారి ఆజ్ఞానుసారముగా వచ్చినవారి గయాప్రజనాలకు పౌరోహితము చేయిస్తారు. వారికి క్లిప్తములు, నిర్ణయములు, యేర్పడి యున్నవి. అందుకు తక్కువ యాత్రవారివల్ల పుచ్చుకొరు.

యిక్కడ గయాప్రజనాలు చేసే క్రమాలు నాల్గు. అష్టగయా అనే గయావ్రజనము ముఖ్యమున్ను ఖర్చుయెక్కువ పట్టేదిన్ని, పంచగయా అనేది రెండోపక్షము. యేకోద్ధిష్ట మనేది మూడోపక్షము.

ఫల్గుశ్రాద్ధ మనేది నాలుగోపక్షము. మొదటి పక్షానికి కంపెనీ సర్కారుకు వంద నలభై ఎనిమిది, రు పద్నాలుగు సగం, రూపాయి యివ్వవలసినది. రెండోపక్షానికి డెబ్బై నాలుగు, రు ఏడు సగం, మూడోపక్షానికి మూడున్నర రూపాయ, నాలుగోపక్షానికి రెండు రూపాయలు.

యీ గయా మాహత్మ్యము వాయుపురాణ గరుడ పురాణాంతర్భూతముగా యెనిమిది అధ్యాయాలతో యిక్కడ ప్రచురముగా వున్నది. వాటిసారము యేమంటే గయాసురుడనే రాక్షసుడు అతి దీర్ఘకాయము కలవాడు బహు తపస్సుచేసి సకలతీర్ధాలకన్నా తన దేహము అతి పవిత్రముగా వుండేటట్టు వరముతీసుకొని తన తొలుదేహవాసనసంబంధమయిన తామస పనులుచేస్తూ వచ్చినట్టున్ను, త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మ వాణ్ని శాంతిపొందించవదలచి వాడివద్దికి వచ్చి నీదేహము అతిపవిత్రము గనుక నీదేహముమీద నేను యాగము చేయతలచినానని చెప్పినంతలో రాక్షసుడు సమ్మతించి ఈక్షేత్రములో తలపెట్టి శయనించినట్తున్ను బ్రహ్మ ఋత్విక్కులను సృషృంచి యాగము వుపక్రమణ చేసినంతలో రాక్షసుడి శిరస్సు చలనతదశ పొందినట్టున్ను శిరస్సును కదలకుండా పెట్టేకొరకు యెన్ని గొప్పకొండలు తెచ్చివేసినా నిలవక చెదిరి చుట్టు పడి యిప్పుడు రామపర్వతము ప్రేతపర్వతముగా సమీపమున నిలిచివుండేటట్టున్ను అటుపిమ్మట అవశాత్తుగా నొకానొక పతివ్రత పురుషుడి శాపన్ని ధరించి శిలారూపముగా వుండగా ఆ శిలను తెచ్చి గయాసురుడి శిరస్సుమీద వుంచినట్టున్ను ఆ శిలా అతిపవిత్రమయినదిగనుక గయాసురుడు తోసివేయలేక శిరస్సు మీద వుంచుకున్నా వాడి శిరస్సుయొక్క కంపముమాత్రము వదల నందున బ్రహ్మ యాగము పరిపూర్తి చేసేకొరకు యీశాన విష్ణుకమలాసన అని శ్రాద్ధకాలములలో వచించే శ్లోకప్రకారము దేవతలందరు వచ్చిరి. విష్ణువు గదాధర స్వరూపుడయి ముఖ్యముగా ఆ శిరస్సు మీద వున్న శిలమీద కుడికాలుపెట్టి నట్టున్ను తదనంతరము శిరస్సు కదలకుండా బ్రహ్మ యాగము పరిపూర్ణ మయి నట్టున్ను యాగసంరక్షణ నిమిత్తముగా గదాధారుడై అక్కడ నిలిచిన విష్ణువు కరుణాసముద్రుడు గనుక వచ్చిన సకల దేవతల సమ్మతముగా, లేవలేని గయాసురుడున్ను శిలా స్వరూపముగా వున్న పతివ్రతయున్ను ప్రార్ధించి నంతలో తాను అదేస్వరూపముగా ఉయెల్లప్పటికి యిక్కడ విరాజమాన మయ్యేటట్టు వొప్పుకున్నట్టున్ను అప్పట్లో కూడిన సమస్త దెవతలు చేసిన ప్రార్ధన ప్రకారము యెవరు యీ స్థలమందున శమీపత్రప్రమాణేన పిండం దద్యాద్గయాశిరే అనే శ్లోక ప్రకారము పిండ ప్రదానము ఛేసినా వంద ఒకటి కులమువారు తరించేటట్టు వర మిచ్చినాడు. గనుక తదారభ్య పితృస్వరూపుడైన పరమాత్మ యిక్కడ శ్రాద్ధ కర్మాలు చేసినంతలో అతితృప్తు డయ్యేటట్టు నిశ్చయ మయి యున్నది గనుక, ప్రతిదినము వుదయ ప్రభృతి సాయంకాల పర్యంతము సహస్రావధి ప్రజలు ఆ రీతిగా వుంచిన విష్ణు పాదలాంఛన మీద పిండప్రదానాలు చేస్తూ వుంటారు. శ్రాద్ధము వినా పిండప్రదానము మాత్రము కూడకపోయినా స్థల పురాణములో యీ స్థల మందు పిండప్రదానమే ముఖ్యముగా చెప్పివున్నది. గనుక అనేక ముగా పెట్టవలసిన శ్రాద్ధాలకు బదులు యీ స్థలాంతర్భూతమయిన ప్రదేశాలలో పిండప్రదానాలు మాత్రమే ఛేయుచున్నారు గనుక నేను ఆ దేప్రకారము ఛెసినాను.

నెం. ఇరవై ఏడు అష్టగయ చేయవలసిన క్రమము, -- క్షేత్రము ప్రవేశించిన దినము ఫల్గునినదిలో స్నానముచేసి గదాధర్శనము విష్ణుపాదము గుడి బహుపాదదర్శనము విష్ణుపాదదర్శనముచేసి క్షేత్ర వుపవాసము వుండవలసినది. విష్ణుపాదము గుడి బహుసుందరముగా నల్లశిలతో ముందు విశాలమయిన ముఖమంటపముతోకూడా అహల్యాబాయి కట్టించివున్నది. అరటి పువ్వందముగా సువర్ణమలాముతో చేసిన కలశముతోకూడా ఒక స్తూపీ యేర్పరచి యున్నది. గదాధరస్వామి మందిరము అందుకు రెండో తరము విష్ణుపాదపు గుడికి చేరినట్టుగానే కట్టియున్నది. గోడలో చేర్చి గదాధరమూర్తిని నిలిపివున్నారు. విష్ణుపాదము, మనిషి అడుసులో కాలిపెట్టితే అడుగు యేర్పడ్డట్టు శిల మీద లాంచనగా యెర్పడివున్నది. బహుకాలమయినది గనుక రేఖాలాంచనలు తెలియవు. మహాపూజా కాలమందు ఆపాదము మీద చందనము సమర్పించి కుంకుమ పువ్వుతో రేఖాలాంఛనములు చందనము మీద అతి సుందరముగా యేర్పరుస్తారు. గదాధర మూర్తిని అతి సుందరముగా కల్పించి వున్నది. యీ రెండు గుళ్ళు ఫల్గుని తీరమందు వున్నవి. విష్ణు పాదానికి సమీపముగా అష్టాదశపాదాలు యీశాన విష్ణు అనే శ్లోక ప్రకారము ఒకటే పెద్ద శిల మీద వున్నట్టు వదంతి గనుక ఆ శిలకు ఒక పెద్ద మంటపము అహల్యాబాయి కట్టించి వున్నది. ఆ పుణ్యాత్మురాలు శానా ధర్మాలు యిక్కడ ఛేసి వుండెను. అది అంతా యిప్పట్లో నిలిచిపొయినవి. ఆపె ఆకృతి శిలతో చేసి గదాధరస్వామి గుడివద్ద ఆపె అన్నసత్రములో వుంచినారు గనుక ఆ బింబాన్ని చూచి ధన్యుణ్ణి అయినాను. ఆ అన్నసత్రమున్ను యిప్పుడు నిలిచిపోయినది.

డో దినము ఫల్గుని శ్రార్ధము క్రమముగానే ఛెయవలసినది. గయావళులను తప్ప మరి ఒకరిని బ్రాహ్మణార్దము చెప్పకూడదు. యీ దినము పెట్టే పిండాలు ఫల్గుని నదిలో పెట్టవలసినవి. బ్రాహ్మణార్ధానికి మనకు యేర్పడ్డ గయావళి వారి స్వకియ్యుల్ను పిల్చుకొని రావలసినది గాని వారి సంకేతము ప్రకారము మనము పిలిస్తే వారు రారు. యీ గయావళీలు యెందరు యెక్కడ వచ్చి యాత్రవారిని కల్సుకున్నా యజమానుడు యిచ్చవచ్చిన వాణ్ని నీవు నా గయావళీ అని నియమించి మిగిలిన వారిని నాకు అక్కరలేదని చెప్పవచ్చును. కాశీ ప్రయాక స్థలముల వలెనే నిర్బంధము లేదు.

డో దినము షహరుకు ఉత్తరపు పక్క మూడు కోసుల దూరములో వుండే ప్రేతపర్వతానికి పోవలసినది. కొండకింద బ్రంహ్మగుండము అనే తీర్ధము ఒక గుంట అందముగా వున్నది. గయావ్రజనము చేసే వారికి గయావళి మూలకముగా పిండపిచ్చి యనే అంగటివాడు ఒకడు యేర్పడుతాడు. ఆ యా దినానికి పెట్టవలసిన పిండాలు తెలిసి పిండ మామగ్రీలు బ్రాహ్మల కయితే బియ్యము యితరులకు యన పిండిన్ని నువ్వుల్ దర్భ తేనె నెయ్యి మృణ్మయ పాత్రలో పెట్టి యిస్తాడు. వానికి అష్టగయ చేసేవారు రెండురూపాయిలు యివ్వవలసినది. యీ షోడశీ ఆ పిండ సామగ్రీని తీసుకొని కూడావస్తాడు. ప్రేత పర్వతమునకు వచ్చేవాడు రెండు తావులలో పిండ ప్రదానము చేయవలసినది. యీ కొండకు సుమారు మున్నూరు మెట్లు కలవు. యెక్కడము ప్రయాస, సవారి మీద పోదామంటే కొండపయిన స్నానికి వుదకములేదు గనుక నడిచిపోవలసినది. ఆ కొండమీదికి నిమిత్తము లేనివారిని సర్కారు మనుష్యులు పొనియ్యరు. వుపచారము చేశేవాడు కూడా వస్తే వాడికి వేరే అమరాహి అనే వొక చీటి మూడున్నర రూపాయి యిచ్చి తీసియ్యవలశినది. భార్య మొదలయిన వారు కూడా వస్తే వారికి వేరే ఛీట్లు మూడున్నర రూపాయి వంతున యిచ్చి తీసుకోవలసినది. కొండమీద స్వర్ణరేఖ ఒక శిలామంటపము కిందవున్నది.

ప్రేతగయావళీలు అనే వక తెగవారు వుంటారు. వారు పిండదాన కాలమందు శానా తెమ్మని తొందర పెట్టుతారు. అష్టగయకు రెండురూపాయలు వారికి క్లిప్తము, నిర్ణయము,. అంతమటుకు యిచ్చితీరవలెను. యీ ప్రేత గయావళీలు సుఫలము యివ్వడమని వొక సంప్రదాయము. ఈ ప్రేత గయావళీలు సుఫలము యిచ్చేక్రమ మేమంటే, పిండప్రదానము కాగానే భం అనే పేరుతో చెయితిప్పి నోరుకొట్టుకొని మీపితృలు స్వర్గస్థులయినా రని చెప్పవలసినది. అక్కడ పిండప్రదానము కాగానే మడుగు నిమిత్తము లేదు గనుక స్త్రీలతో కూడా సవారీల మీద యెక్కి కొండ దిగి వచ్చినాను.

యీ ప్రేతగయావళీలు గయావళుల అక్రమసంతు అనే వొక మాట వాడుకుంటారు. అసలు గయావళీల ఉత్పత్తి పయిన వ్రాసినప్రకారము బ్రహ్మయాగార్ధము ఋత్విక్కులను సృష్టించి నారని వ్రాసివుంటే గదా. వీరు ఆ ఋత్విక్కుల సంతువారని యీ గయావళీలను బ్రహ్మకల్పితబ్రాహ్క్మణు లని వారిపూజా కాలమునందు వచింప బడుచున్నది. బ్రహ్మ యాగము పూర్తికాగానే సమస్తమున్ను కావలశినమట్టుకు వీరికి యిచ్చి నప్పటికిన్ని మళ్ళీ బ్రహ్మను చాలదని యాచించి నట్తున్ను, బ్రహ్మకు కొపమువచ్చి మీకు యిచ్చినది సమస్తమున్ను వ్యర్ధమై పోగాకా అనిన్ని, మీరు విద్యారహితులై దరిద్తురులైపోదురు గాకా అనిన్ని శపించినట్టున్ను ఆపిమ్మట వారు పశ్చాత్తపులై బ్రహ్మను శరణు చొచ్చినంతలో యిక్కడ పితృకర్మాలు చేసేవారు మిమ్ములనే ఆరాధింపు చున్నారు, అందువల్ల జీవనము చేయం డని ఆజ్ఞ యిచ్చి నట్టున్ను అదే పురాణములో వ్రాసియున్నది. ఆ బ్రాహ్మణ కల్పన కాలమునందు వారికి సమానులయిన స్రీలను ఉత్పత్తి చెయలేదు గనుక యీ క్షేత్రములొ మిక్కటముగా వసియింపుచు నుండే మేదరజాతి స్త్రీలను వారు పరిగ్రహించి తద్వారా వంశము వృద్ధిఅయి నట్లున్ను అందువల్ల అవ్యాపి స్త్రీప్రజ వీరిలో వంటవార్పులకు పనికిరాకుండా బోగార్ధమునకు మాత్రము ఉపయోగింపుచు వుండేటట్టు యిక్కడా ప్రసిద్ధముగా నున్నది. యీ గయావళీలు భార్యలచేత భోజనము చెయ్యరు గనుక మన దేశము నుండి వచ్చిన అనాధస్త్రీలను స్వయం పాకమునకు కొలువు పెట్టుకొంటారు. తమస్త్రీలచేత నీళ్ళు తాగేది లేదని చెప్పడము. యీ గయావళీల స్త్రీలు యధోచిత మయిన రాణివాసము గలిగి వుంటారు. యీగయావళీలకు యెనిమిది యేండ్లలోనే వివాహమవుచున్నది. రెండోపెళ్ళికిపడుచును యివ్వడములేదు. వీరి ఆజ్ఞకు తగ్గట్టే వివాహము మొదలయిన విషయములలో వీరికిప్రయము యెక్కువగా అవుచున్నది. వీరియిండ్లలో స్త్రీప్రాబల్యము యెక్కువ అని ప్రసిద్ధి. గయాఫళీల విద్యావివేక విషయాలళొ బ్రహ్మశాపము వ్యర్ధమయినట్టు తోచలేదు. వారి ఆచారాలు యీ దేశానకు తత్కాలానుగుణముగా వున్నా మన దేశస్థులకు యేహ్యముగా నున్నది.

గో దినము ప్రేతపర్వతము దారిలొనే షహరుకు రెండు కోసుల దూరములో సాజెబుగంజుకు చేరినట్టుగా రామపర్వత మనే కొండవున్నది. అక్కడికివెళ్ళి నాలుగు ప్రదేశాలలో నాలుగు ఆవృత్తులు పిండప్రదానాలు చేయవలసినది. కొండమీద శివమందిరము, రామమందిరమున్ను వున్నవి. గనుక ఆ అమందిరాల సన్నిధిలో పిండప్రదానము చేయవలసినది. యీకొండ యెక్కడము నిండా యెక్కుడు కారు. వంద నలభైమెట్లు యెక్కవలసినది. మెట్లు నిండా పొడుగుకావు. యీ పర్వతముమీదను పిండప్రదానముకాగానే యిక్కడకూడా ప్రేతగయావళీల ప్రదేశము గనుక భం అనె ధ్వనితో వారు సుఫలము యియ్యవలసినది. యీ కొందమీదనున్ను వుదకములేదు. అష్టగయ చేయని మనుష్యులను యీకొండమీదికి కూడా రానియ్యరు. యీ కొండ దిగివచ్చిన వెనక కింద మూడు తావులలో పిండప్రదానాలు చేయవలసినది గనుక నేటిదినము దిగివచ్చే టప్పుడు పాదచారిగానే దిగిరావలశినది. యీ పిండపిచ్చులు వగయిరాలు పావుశేరు బియ్యముతో అక్కడక్కడ పిండప్రదానాలు చెస్తూవస్తే అష్టగయకు రెండురూపాయిలు వంతున యివ్వవలసినది. అర్ధశేరుకు రూపాలు నాలుగు, శేరుకు రూపాయిలు రెండు దేలెక్క ప్రకారము షోడశికిప్రేతగయావళీలకు నిష్కర్ష గనుక బియ్యపుమూయినకు తగ్గట్లు తిలలు మొదలైన సామానులు యిస్తాడు. యీ దేశములో తెల్లనువ్వులు విస్తారముగా వున్నాయీ పితృకర్మాలకు వాడడము నల్లతిలలేదు. దర్భదొరకదు గనుక యీ దేశమునందు యావత్తు అతి కోమలముగా పెరిగే కుశనుప్రతిగా వాడుకుంటున్నారు. ప్రతి పిండప్రదానానికి కారుణ్యాల సహితముగా పిండప్రదానము కాగానే ధర్మపిండాలని నలభై శ్లోకాలతో నాలుగు నుంచి సున్నా వరకు పిండాలు వేయవలచినది. యీధర్మపిండాలు ప్రతి పిండప్రదానకాలందు వెయ్యవలసినది. పితృవంశే మృతాయేచ అనే శ్లోకాలతో ధర్మపిండాలు వేయవలసినది.

దో దినము పంచతీర్ధాలనే నాలుగు ప్రదేశాలలో పిండప్రదానాలు చేయవలసినది గనుక నాలుగు పిడతలు హాజ రయి వుంచున్నవి. వాటిని సాహెబుగంజు వద్దవుండే వుత్తరమానస తీర్ధానికి తెచ్చి అయిదు పిడతలలొ అన్నము ఒకసారిగా పక్వముచేసుకుని ఆతీర్ధము ఒక గుంట ఆకారముగా వుంచున్నది గనుక ఆతీర్ధము వొడ్డున నొక సారి పిండప్రదానముచేసి అక్కడ గుళ్ళోవుండే సూర్యమూర్తి దర్శనము చేసుకుని మౌనవ్రతముతో దక్షిణమానసతీర్ధము అనే సహరునధ్యైవుండే నొక పెద్దగుంటకు కడమ, నాలుగు పిడతల అన్నము పిడతలతోనే యెత్తుకుని రావలసినది. యీ రెండు మానవతీర్ధాలు రమణియ్య మయినవికావు.

ఆ దక్షిఅణ మానస తీర్ధములోనే మూడు తావులలో వుదీచితీర్ధమని, ఖనఖలతీర్ధమని, దక్షిణమానస తీర్ధమని, మూడు పేళ్ళతో పిండ ప్రదానాలు చేసి అక్కడ మందిరములో వుండే సూర్యమూర్తి దర్శనము చేసుకొని ఫల్గుని నదికి ఒక పిడత అన్నము తీసుకుని వచ్చి అక్కడ గదాధరునికి యెదురుగా పిండప్రదానముచేసి, గధాదరునికి అభిషేక పూజలు చేసి, దర్శనము చేసుకుని అక్కడికి కొంతదూరములో వుండే పితామహేశ్వరుని దర్శనము చేసుకుని, రావలసినది. రామపర్వతములో, ప్రేత పర్వతములో ప్రేతగయావళీల పూజ చేసి నట్లు యీ స్థలాలలో స్వంత గయావళీ పూజచేస్తూ రావలసినది. యీ ఫల్గుని నదికి అనేక స్నానఘట్టాలు కట్టి వున్నారు. గయావళీల యిండ్లు అనేకముగా ఫల్గునీ నదీతీరమందుకూడా శానా గొప్పలుగా కట్టివున్నవి యీగయవాళీలకు కాపురము వుండే యిండ్లు గాక పరువుకలవారు బయటకు అని కచ్చేరి కూటాలు వేరే కట్టుకుని వుంటారు. ఆప్రేత గయావళీలు యీ గయావళీలను వుపసర్పించుకొని వుంటారుగాని వారికి స్వతంత్రదశ వున్నట్టు అగుపడ లేదు. గదాధర స్వామిపూజ ప్రేతగయావళీలది. విష్ణుపాద పూజ శుద్ధగయావళీలది.

రో దినము, ధర్మారణ్యం బౌద్ధగయ అనే ప్రదేశాలకు పోవలసినది. యీ ప్రదేశాలు షహరుకు నాలుగు కోసుల దూరములో వుంచున్నవి. పోయిరావడానకు అస్తమాన మవును. యీ ప్రదేశాలు క్షేత్రానికి పశ్చిమ భాగమందున్నవి. యిక్కడ ఒక గోసాయి పీఠస్థుడు జాగీరు అనుభవిస్తూ వచ్చినవారికి సదావృత్తి యిస్తూ వుంటారు. యీ స్థళము గయనుంచి కలకత్తావెళ్ళే భాటలో వున్నది. ఇక్కడ దెహబ్రహ్మవాదుల బౌద్ధగుడి ఒకటి యున్నది. అక్కడవుండే ప్రతిమలు బ్రహ్మదేశములో నుంచి జాతులవాండ్లు తెచ్చిన ప్రతిమకు సరిగా యున్నవి. ఆ గుడి చూడగా రెండు వందలు నుంచి మూడు వందలు వరకు యేండ్లకిందట కట్టినట్టు అగుపడుతున్నది. ఆ మతస్థుల ప్రబలము యెప్పుడు యీ ప్రాంత్యాల అయివున్నదిన్ని ఖుల్లముగా తెలియలేదు. యిందుకు వుత్తరము జయపురము, జోతీపురము, బిక్కానెరి అనే మారువాడి దేశాలు మొదలుగా దేహబ్రహ్మవాదుల నివాసభూమి గనుక పూర్వము ఒక కాలమునందు వారు యిక్కడ ప్రవేశించి పిమ్మట యీ కర్మ భూమియందు నిలవలేక ఖిలల్పపడి వుందురు.

యిక్కడ వుండే గోసాయి మహంతు సంత్రాసునింబూ అనే నారదపు కాలలలో అనేక లవణాలు పిప్పలి, శొంఠి, మొదలయిన జీర్ణకారి పదార్ధాలు కూరిపోశి యెండపెట్టి వచ్చినవారికి మెప్పుగా తారతమ్యము విచారించి యిస్తాడు. యీ దేశములొ ఆహార పదార్దాలు బలకరమయినవి గనుక అజీర్తిమాద జ్వరాలు వస్తూవుండుట చేత పాచక మనే మందులు కరక్కాయలు, జీలకర్ర, పిప్పళ్ళు, వోమము మొదలయిన వస్తువులను భావన చేసి అటువంటి పదార్దాలు నారదపు కాయలు మాదీఫలములలో యిమిడ్చి యిక్కడ చెయ్యడమే కాకుండా నేపాళాన్నుంచి అనెకముగా తెప్పించి అమ్ముతూ వుంటారు. ఆ సంత్రాసునింబు అనే పండ్లలో సూదులు గుచ్చి పెట్టితే సూదులు కరిగి పొతున్నవని వదంతి. యీపాచక ఔషధాల దినుసులకు యిక్కడ లెక్కలేదు. యీ ఔషదాలు జీర్ణకరములై భేదికారిగా వున్నవి.

గయావళీలు వచ్చిన ప్రభువు ప్రసన్నుడయితే అంతకు మిక్కిలి పండగ వేరే లేదు గనుక కలిగిన భూషణాదులు అలంకరిచుకుని వుండే నల్తముతొకూడా యిటువంటి పిండదానము చేసే ప్రదేశాలకు యజమానుడితో కూడా వచ్చి చేశే పూజలు ప్రతిగ్రహిస్తారు. ఒక నూత్రులయితే షోడశిని కూడా పిల్చుకుని వెళ్ళి యీ ముందు వ్రాసిన స్థలములలొ నంతా పిండదానాలు చేసి రావలసినది. ఆ బౌద్ధ గయలో జగన్నాయకుల గుడి వొకటి వున్నది. పయిన వ్రాశిన మహంతుతొట ఒకటి గొప్పదిగా నున్ను సుందరముగా నున్నది. ఈదినము నాలుగు తావులలో పైన వ్రాసిన ప్రకారము పిండదానాలు చేయడమయినది.

డో దినమందు లేచి తొలుదినమే బౌద్ధగయ చేశేనాడే చేస్తే నిండాప్రయాస అవుతున్నది గనుక యీదినము క్షేత్రానికి అతిసమీపముగా వుండే బ్రహ్మసరస్సుకు వెళ్ళీ అక్కడ పిండదానము చేసి కాక బలి, యమబలి, శ్వాసబలి యనే మూడుబలులు అక్కడికి సమీపముగా వుండే ఒక మంటపములో వేశి అక్కడ వుండే చూతవృక్షదర్శనము చేసి పూజచేసి రావలసినది.

యెనిమిదో దినమున విష్ణు పాదానికి సమీపముగా వుండే అష్టాదశ పాదాలమీద పన్నెండు మాట్లు ప్రత్యేక ప్రత్యేకముగా పిండదానాలు ఒక మంటపములోనే ప్రత్యేక ప్రదేశాలలో చేశి ప్రతి పాదము వద్దనున్ను నదదీప మనే ఘృతదీపాలువుంచి క్షెరతప్రణము ప్రతిపాదము మీద పితృద్దేశముగా చేయ వలసినది. యీ కృత్యము కావడానకు యీదినము అస్తమాన మవుతున్నది. ఈ స్థలాలయందు పిండ ప్రదానాలు చెశేటప్పుడు యేదేవతాత్మకముగా ఆస్థళము వుంటే ఆలోకములో అన్శత్పతృ నివాస సిధ్యర్ధం అని సంకల్పము చేయుచూ రావలసినది.

తొమ్మిదో దినమున ఫల్ఘునీశ్రాద్ధమువలేనే క్రమముగా అన్నశ్రాద్ధము విష్ణుపాద ప్రయుక్తముగా చేసి శ్రాద్ధానంతరము విష్ణుపాదము మీద పిండప్రదానము చేయవలసినది. విష్ణుపాదము మీద అశక్యముగా లోకులు పిండాలు వేస్తూ వుంటారు గనుక పిండముమీద పిండము పడకుండా రాజాధిరాజులుగ వుండే వారు సరకారుహుకుము మీద తాము పిండప్రదానము చేశి బయిట వచ్చేకొరకు యెవరినిన్ని గర్భగృహములోకి రానివ్వకుండా సరకారు మనుష్యులను వుంచి నిరోధము చేస్తారు. యిటువంటి లౌకీకప్రతిష్ట అయిన పనులు యిక్కడి జడ్జీగా వుండే మారీసు దొరగారికి, కలకత్తాలో వున్న నావిహితుడయిన మేస్తర్ మించ్చన్ దొరగారు ఒక కాకితము పంపించినంతలోనాయెడల మిక్కిలి కటాక్షము వుంచి యిక్కడవుండే సకల అధిరారము గల యింగిలీషు దొరలతో నాకు విహితము చేసి వారిగుండా కావలసిన సహాయము నాకు కరతలామలకము అయ్యేటట్టు చేసినాడు గనుక యీశ్వర కటాక్షముచేత నాకు కావలసినంతకన్నా యెక్కువ లౌకీక ప్రతిష్ట యిక్కడ సిద్ధించినది.

విష్ణుపాదముమీద పిండప్రదానము కాగానే గయావళీకి ముఖ్యముగా గోదానము చేయవలశినది. యీ విష్ణుపాదపు గుడివద్ద కొన్ని ధర్మశాలలు కట్టివున్నవి. స్థలంతరము దొరకనివారు యీ ధర్మశాలలో శ్రాద్ధాలు ఛేయుచున్నారు. యీ దినము యెక్కడ శ్రాద్ధము పెట్టినా పిండాలు తెచ్చి విష్ణుపాదముమీద వేయవలసినది.
