﻿ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర
టీటీఎస్ ఆడియో నిర్మాణ పాఠ్యం
భాగం రెండు — మొత్తం ఎనిమిది భాగాలలో


మొదటి ప్రకరణము  చెన్నపట్టణము నుండి శ్రీశైలము వరకు

తేదిరాత్రి ఆమడలో నున్న కరకంబాడు చేరినాను. తిరుపతి వగైరా వూళ్ళ కానలికిగాను ఆ కరకంబాడున్ను, యింకాకొన్ని గ్రామాలున్ను అచ్చటి పాలెగానికి కంపెనీవారు జారీగా నడిపించు

మేలో ఆందోళన చేయగా పద్దెనిమిది వందల ముప్పై మూడు మొదలు కంపెనీవారు దేశీయ మతములతో జోక్యం కలిగించుకో గూడదనే భావంతో ప్రవర్తింపసాగినారు. గాని తిరుపతి జగన్నాధం మొదలయిన దేవస్థానాల పరిపాలన మాత్రం ఎప్పటిలాగునే కంపెనీ ఉద్యోగులు నిర్వహింఛేవారు. తుదకు పద్దెనిమిది వందల నలభై మూడు లో కంపెనీవారు తమవశంలో వుండిన దేవాలయాలను మశీదులను కొందరు ప్రయివేటు వ్యక్తులకు కొన్ని సంఘములకు ఇచ్చివేశారు. ఆ ధర్మాదాయముల తాలూకు తమవద్ద నిల్వ యుండిన లక్షలాది ద్రవ్యం మాత్రము ఇచ్చివేయలేదు. ఆసందర్బంలోనే తిరుపతి దేవస్థానాన్ని అప్పటి మహంతుకిచ్చారు. అంతట ఈ ధర్మాదాయాలు, సరియైన సట్టుబాటులేక పాడైనాయి. ఈ ధర్మాలు స్శిస్తూవున్నా ధర్మకర్తలు సొమ్మును ఎంత దుర్వినియోగం చేస్తూవున్నా కంపెనీవారు జోక్యం కలిగించుకోకుండా వుపేక్షించారు. వెయ్యి ఎనిమిది వందలు పదిహేడువ సంవత్సరపు శాసనమునుబట్టి వానిని, సక్రమంగా నిర్వహించవలసిన బాధ్యతను గాలికి వదలివేశారు. ఈఅరాచకం ఇరవై సంవత్సరాలు జరిగింది. తరువాత పద్దెనిమిది వందల అరవై మూడులో ఒక క్రొత్త ధర్మాదాయములచట్టం శాసింపబడింది. ఈ చరిత్రంతా పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి లో మద్రాసు గవర్నరు కవుంచిలు మొదలైన వెంబాకం రామయ్యంగారు వ్రాసియున్నారు., ముప్పై ఒకటి డిసెంబరు పద్దెనిమిది వందల డెబ్బై రెండు తేదీగల మద్రాసు గవర్నమెంటు జుడీషియల్ ప్రొసీడింగ్సు చూడండి, చున్నారు. ఆయూరు వసతిగాకపోయినా అవతల మహారణ్యము గనుక విధిలేక అక్కడ దిగవలసి యున్నది. పోష్టాఫీసు వున్నది. యధోచితముగా వస్తువులు దొరుకును. ముసాఫరుఖానా యున్నది.

తేది రెండు గంటలకు శెట్టిగుంట చేరినాను. దోవ మహారణ్యము, రాతిగొట్టు, మిక్కిలి దొంగలభయముగలది. నడమ మామండూరు కృష్ణాపుర మనే రెండు పాలెగాండ్ల వూళ్ళున్నవి. వారిసహాయములేక మాతుబర్లు నిర్భయంగా ఆ యడవిదాటలేరు. కలకటరు ఆదోవను నిర్భయంగా చేయను చేతగాక నున్నారు. మామండూరుకి ఈవల ఎనిమిది గడియల దూరాన బాలపల్లె యున్నది. అది మొదలు కడపజిల్లా సరిహద్దు. బాలపల్లెలో ముసాఫరుఖానాయున్నది. ఆభూమి జలము బహురోగప్రదము. అచ్చట రెండుమూడు నదుల వంటి కాలువలు దాటవలెను. కనమ యొకటి దాటవలెను. భాట బహురాతిగొట్టు. ఎక్కుడు దిగుడుగా నున్నది. అక్కడ బహు దట్టమయిన వెదురడవి. ఆ శెట్టిగుంటలో మంచినీళ్ళు చెరు వున్నది. రెండు బ్రాహ్మణుల యిండ్లున్నవి. పేటస్థలము అన్నివస్తువులు దొరకును. బాలపల్లె మొదలుకొని కడప కలకటరు అడవికొట్టి బాట వెడల్పుచేసి అక్కడక్కడ ఠాణా లుంచియున్నారు. కరకరంబాడి నుండి ఆ పాళెగాండ్లను మంచితనము జేసుకొని యిరువైమంది తుపాకీల వారిని శెట్టిగుంట దనుక తెచ్చినాను. నాడు మూడు ఘంటలకు శెట్టిగుంట విడిచి ఆమడదూరములో నున్న కోడూరు వద్దనుండే అగ్రహారమువద్ద సత్రము జేరి నాను. కోడూరు బస్తీ. పేటస్థలము ముసాఫరుఖానా యున్నది. బ్రాహ్కణ గృహములేదు. పై యగ్రహారమందు యేమిన్ని దొరకదు. అంగళ్ళులేవు. ఆ బ్ర్రాహ్మణులు పరోపకారులుగాదు.

జూన్ ఒకటి తేది ఐదు ఘంటలకు లేచి ఆమడ దూరములో నున్న వోరంబాడు తొమ్మిది ఘంటలకు చేరినాను. అది పేటస్థలము. అన్నివస్తువులు దొరుకును. ముసాఫరుఖానా యున్నది. బాటసరాళము. శెట్టిగుంటనుంచి కోడూరికి అదివిలో దండు భాట యొకటి పోవుచున్నది. పల్లెలమీదుగా కాలిబాట యొకటి పోవుచున్నది. కాలిభాటలో సనారీలు రావచ్చును. అడివిభయము కోడూరితో సరి. అవతల భూమి తెరపగా నున్నది. దగ్గిరదగ్గిర గ్రామాలు, పైరుపొలాలు, జలసమృద్ధిన్ని భాటలో కలిగియున్నవి. అంతటయున్ను చింతచెట్లు గలవు. బాలపల్లె వద్ద కొండవాగు నీళ్ళు నాబోయీలు వగైరాలు తాగినందున నొక బోయిన్ని, ఒకకావటివాడున్ను జ్వరము తగిలి ఖాయిలాపడిరి. గనుక దగ్గిరి నోరంబాడిలో మధ్యాహ్నము నిలిచినాను. పై బాలపల్లెనది వాగువద్ధ శ్రీనివాసమూర్తిపాద మొకటి చేసియున్నది. అక్కడనుంచి పడమటి దేశస్థులు కొండ యెక్కుచున్నారు. ఆదినము మూడు ఘంటలకు లేచి రెండు గడియల దూరములో నున్న పుల్లంపేట గడియు ప్రొద్దు ఉండగానే చేరినాను. అది పేటస్థలము. ముసాఫరుఖానా యున్నది. బ్రాహ్మణుల యిండ్లు గలవు.

తేది రాత్రి మూడు ఘంటలకు లేచి రెండు ఆమడ దూరములో నున్న నందలూరు చేరినాను. భాట సరాళమే. ఊరివద్ద చెయ్యా రనే నది గడియ దూరము వెడల్పు గలిగియున్నది. నదికి నిరుపక్కల గుళ్ళున్నవి. అది పుణ్యక్షేత్రము. పరశురాముని మాతృహత్య నినర్తించిన స్థలము. అక్కడికి రెండు ఘడియల దూరమందు అత్తిరాల యనే మహాస్థలము అగ్రహారసహితముగా నున్నది. ఊరు తురకలతో నుండియున్నది. మొసాఫరుఖానాకలదు. పేటస్థలము, సకల వస్తువులు దొరుకుని. బ్రాంహ్మణుల యిండ్లు వసతిగా నున్నవి. ఆదిన మంతయు అక్కడనే యుంటిని.

తేది రాత్రి రెండు ఘంటలకు లేచి తొమ్మిది ఘంటలకు రెండు ఆమడ దూరములో నున్న భాకరాపేట చేరినాను. దోవమంచి దయినను రాతిగొట్టు. కొండపక్కను భాట పోవుచున్నది. పొడిచెట్లు అడివి, దోవలో వొంటిమిట్ట యనే గ్రామమున్నది. అక్కడ నాల్గు పక్కల కొండలే కట్టగా గల్గిన యొక్క భారీ చెరువున్నది. చెరువు కట్టమీద భాట. ఆ వొంటిమిట్టలో చూడ వేడుకలయిన గుళ్ళున్నవి. ముసాపరుఖానా యున్నది. బస్తీ గ్రామము. ఆ భాకారాపేట పేటస్థలము. అన్ని వస్తువులు దొరుకుని. అంతటా రాళ్ళున్నవి. వసతి యయిన బ్రాహ్మణ గృహములేదు. నాడు మూడు ఘంటలకు లేచి రాత్రి రెండు ఘంటలకు కడప చేరినాను. దారిలో కొండలు, కనమలు దాటవలెను. దారి బహు రాతిగొట్టు, జలవసతి లేదు. కడపలో నాలుగు దినము లుంటిని. ఆది మంచి పట్టణ మనబడి యున్నది. అన్నిపనివాండ్లు గలరు. జిల్లాకోరటున్ను కలకటరుకచ్చేరి గలవు. ఆయాయిలాకా మనద్దీలు ఇండ్లు కట్టుకొని కాపుర మున్నారు. దగ్గిర నది యున్నది. ఊరి నడుమ నొక బుగ్గ యున్నది. ఇండ్లు సంకుచితములు. ఊరివద్ద నొక రెజిమెంటు ఉన్నది. అందులో ఆ యిలాకా దొరలు కాపుర మున్నారు. మరియొక పక్క సీవిలు దొరలు కాపుర మున్నారు.

తేదీ ఉదయాన ఐదు ఘంటలకు కడప విడిచి తొమ్మిది ఘంటలకు పుష్పగిరి చేరినాను. దోవ సరాళము. కడపవద్ద నొక నది దాటవలెను. అది వాన కిరిసినప్పుడు అతివేగముగా ప్రఫహించి వెంటనే తీసి పోవుచున్నది. పుష్పగిరి పుణ్యక్షేత్రము పినాకినీనదీ తీరము. నదిగట్టున కొండ వెంబడిగా రమణియమైన యొక దేవస్థల మున్నది. అది హస్థినిక్షేపము చేయతగిన పుణ్యస్థలము. స్మార్థ పీఠాధిపరి యయిన పుష్పగిరి స్వాములవారు అక్కడ మఠము గట్టుకొని నివాసము చేయుచున్నారు. భ్రాంహ్మణ గృహములున్నవి. అక్కడి బ్ర్రంహణులు కొంత వేదాంతవిచారణ గలవారుగా కనబడుచున్నారు. అన్ని వస్తువులకున్ను పేటకు పోవలెగాని, అక్కడదొరకవు. నదిదాటి ఊరు ప్రవేశించవలెను, మళ్ళీ నదిదాటి భాటకు రావలెను. ఊరు రమ్యమైనది. ఆదినము మూడు ఘంటలకు బయలుదేరి కొన్ని పినాకినీ నది కాలువలు దాటి ఐదు గడియల దూరమందున్న కాజీపేట చేరినాను. బాట నిండామంచిదికాదు. అది పేటస్థలము. వసితిగా నుండే యిండ్లు లేవు. అయినా బ్ర్రాంహ్మణులున్నారు.

తేది రాత్రి మూడు ఘంటలకు లేచి పద్నాలుగు ఆమడలో నున్న దువ్వూరు తొమ్మిది ఘంటలకు చేరినాను. దోవలో అడివిలేదు. బయలు పొలము లెస్సగా నున్నది. ఆ గ్రామములో వసితిగా నున్న యిండ్లు, చావిళ్ళు గలవు. చేరినట్టు పేటయున్నది. అక్కడ అన్ని వస్తువులు దొరుకును. అదివరకు కడపజిల్లాలో చేరినభూమి. ఆ యూరు మూడు ఘంటలకు వదిలి ఐదు గడియల దూరమందున్న వంగలి గ్రామమును గడియ ప్రొద్దుగద్దనంగనే చేరినాను. అక్కడ గొప్ప యిండ్లు, చావిళ్ళున్నున్నవి. దగ్గిర పేటగలదు. అదికందనూరు వబావగారిది. రూపశింగనేసరదారుల్ని కొలువుకు గాను, ఈగ్రామము వగైరా కొన్ని యూళ్ళు జాగీరుగా నివ్వబడినవి. దువ్వూరు మొదలుకొని ప్రతి గ్రామమందున్న కొండ కరంకలవాండ్లు ఇనపరాళ్ళతో నినుము జేయుచున్నారు.

తేదీ వాననుంచి మధ్యాహ్మము వరకు నిలచి పన్నెండు ఘంటలకు బైలుదేరి దారి చూపను అచ్చటి వారిని తీసుకొని అరగడియ ప్రొద్దుకద్దనంగనే పద్నాలుగు ఆమడలో నున్న అహోబళ క్షేత్రమును చేరినాను. గోప సరాళము. అడుగడుగుకు గ్రామములున్నవి. ఒక చిన్న నదిన్ని, వాగుకాలువలున్ను దాటవలెను. అయితే అడివిభూమి. ఆక్షేత్రమందు యెగువ అహోబళము, దిగువ అహోబళమని రెండు స్థలములు ఒకదాని కొకటి నాలుగు గడియల దూరమందున్నవి. నడమ చీకటిగల యడివి. యెగువ అహోబళానికి పైన కొండమీద ఉక్కుస్తంభమని చెప్పబడే స్తంభముగల పుణ్యక్షేత్రమున్నది. అక్కడి అడవి నడుమ కాలిబాట. ఒక సవారిన్నిపోదు. అది నరసింహ్వమూర్తి ఉద్బవించిన స్థలము. దిగువనను, యెగువనను నరసింహమూర్తి ప్రతిమ లనేక యవనరాలుగా చేసి బెట్టి ఆరాధింపుచున్నారు. ఈస్థలము కుంభకోణము వద్దనుండే అహోబళంజియ్యరువారి యొక్క అధీనము. వారి ముద్రకతన్ అహోబళానకు రెండు కోసుల దూరమందున్న బాచపల్లెలోనిండి ఆస్థల విచారణ జేయుచున్నాడు. ఆముద్రకతన్ యెగువ దిగువ స్థలములలో అర్చన చేసే అర్చకుల కిద్దరికిన్ని అప్పుడప్పుడు నెల ఒకటి కి ఆరు రూపాయిలు జీతము యేర్ప రచుచు వచ్చుచున్నాడు. గుడి ఖర్చులకు జియ్యరు పంపింఛే అయివజు దప్ప మరియే అకరమున్ను లేదు. రాజా చందులాలా* యీస్థలానకు ప్రయాధన్ మైన సాలుకు రూపాయలు ఇప్పింపుచున్నాడు. యెగువ అహోబళానకు

*రాజా చందులాలా హైదరాబాదు నివాస పేష్కారు.

సవారీలు వెళ్ళడము ప్రయాస. దిగువ అహోబళములో శూద్రగుడిశెలు కొన్ని యున్నవి. యెగువ అవిన్నీలేవు. జనులు దేవాలయములందే దిగవలసినది. చీకారణ్యప్రదేము. మృగభయము గలదు. జలము రోగప్రదము. మనుష్యులు నివసింపను భయపడుచున్నారు. దేవస్థలలు శిధిలము లయినందున జెల్లేడు, పల్లేరు మొలచి యున్నవి. అచ్చట ఫాల్గునమందు బ్రంహ్మోత్సవము. అప్పుడు జనులు వచ్చుచున్నారు. ఉత్సవకాలమందు రెండు వందలు వరహాలు హాళ్ళీలు వసూలవుచున్నవి. వాటినంతా కందనూరి నబాబు పుచ్చుకొని వెనక గుళ్ళ సంగతినే విచారింపడు. ఈ స్థలములలో ప్రతిఫలించి యున్న పరమాత్మ చైతన్యము, స్వప్రకాశముచేత లోకులకు భక్తిని కలగ చేయుచున్నది గాని, అక్కడ నడిచేయుపచారములు దానికి నేపాటిన్ని సహకారిగానుండలేదు. ఈ రెండు స్థలములలోను న్నొక వస్తువున్ను దొరకదు. ఉప్పుతో తొమ్మిదిన్ని బాచపల్లెలో నుంచి తెచ్చుకోవలెను. ఆ రాత్రి అక్కడ నిలిచినాను. బాచపల్లె కంపెనీ వారిది. మంచి గ్రామము.

వ తేడి పగలు పన్నెండు ఘంటలకు గిదువ అహోబళములో నిలిచి చేతనున్న వస్తువులతో నక్కడి బింబములను ఆరాధించి ఒకటి ఘంటకుప్రయాణమై ఆరు ఘంటలకు శ్రీరంగాపురము చేరినాను. అది పద్నాలుగు ఆమడదూరము. దోవ సరాళము. మిక్కిలి అడివి. పడమరుద్రవఠమనే బస్తీగ్రామ మున్నది. అది కడపజిల్లాలో ఛేరినది. గొప్ప ఫేటస్థలము. కావలసిన వస్తువులు దొరుకును. సరాబు అంగళ్ళు, బ్రాహ్మణ గృహములు గలవు. శ్రీరంగాపురము చిన్నది, బస్తీగ్రామం, కొంఫిణీవారిది, ఇండ్లు చిన్నవి, ఉదకసౌఖ్యములేదు.

తేది రాత్రి మూడు ఘంటలకు లేచి ఎనిమిది ఘంటకు ఆమడలో నున్న మహానంది యనే మహాస్థలము చేరినాను. దోవసరాళము. మహాదేవపురము, బసవాపురము అనే బస్తీ గ్రామములు దోవలో నున్నవి. ఆ మహానంది చీకారణ్యములో నున్నది. కొండ సమీపము గుడి చుట్టు సకలవృక్షములు నున్నవి. గుడి సమీపమున ఒక గుడిశయున్నులేదు. అన్ని వస్తువులు జననాపురమునించి తెచ్చుకొనవలెను. నిప్పు దొరకటమున్ను ప్రయాస. అచ్చట రాత్రిపూట మనుష్యులు నిలవరు. ఆ గుడిలో లింగమునకు దిగువగుండా తీర్థము స్రవించి ఒక తొట్టెలో నిలిచి అవతల ప్రవహింపుచున్నది. గుడి తీర్థము రమణీయ్య మైనది. శాస్త్రసిద్దమైన స్థలము. అర్చకుడు తంబళమువాడు. వచ్చినావారు తామే యీశ్వరుని అభిషేకము చేసి పూజింపు చున్నారు. అర్చకుడు ప్రతిదినమున్ను ఉదయమయిన జాముకు వచ్చి గర్భగృహము తలుపు తెరుచుచున్నాడు. గోసాయీలున్ను బయిరాగులున్ను రెండు, మూడు దినములు ఆ స్థలమందు నిలిచి పునశ్చరణ చేయుచున్నారు. అక్కడ రెండు ఘంటల దనుక నుండి రాత్రి ఆమడదూరములో నున్న బండాతుకూరు సాయంకాలమునకు చేరినాను. దోవ రేగడభూమి. ముండ్లు విస్తరించి యున్నవి. దోవలో నొక చిన్న నదిన్ని, మరికొన్ని కాలువలున్ను దాటవలెను, అడివి లేదు. ఆ యూరు కందనూరు వారిది. బస్తీ గ్రామము. అన్ని వస్తువులు దొరుకును. ఇండ్లు గొప్పవి. ఆప్రాంతములలో ఆవులకు పాలు పితుకుట లేదు. దూడలను ఆవులతో కూడా మేతకు తోలుచునున్నారు. అక్కడివారికి యెనప పాడి సహజముగా నున్నది. పశువులకు తాము కాపురముండే యిండ్ల కంటే చక్కగా కొఠములు కట్టి బాగా కాపాడుచున్నారు. ఆ ప్రాంతములలో వరిపంట లేదు. పుంజధాన్యములు సమృద్ధిగా పండుచున్నవి. శూద్రులు బాగా కష్టపడి కృషిచేయుచున్నారు. బ్రాంహ్మణులకు భూజీవనము పుష్కలముగా కలిగియున్నది.

తేది రాత్రి నాలుగు ఘంటలకు ఆమడలోనున్న వెలపనూరు చేరినాను. దోవ రేగడ, సరాళము, అడివినిండాలేదు. ఇండ్లు గొప్పవి. బట్టల అంగళ్ళు గూడా యున్నవి. సకల పదార్థములును దొరుకును. మంచి బ్ర్రాంహ్మణులున్నారు. గ్రామకరణ మయిన శేషప్ప అనేఅతడు అన్నదానము జేయిచున్నాడు. ధర్మ్మాత్ముడు. నవాబు తరపున ఉద్యోగస్థులు కొందరు ఆ గ్రామములో నున్నారు. ఉదకసౌఖ్యమునిండాలేదు. అక్కడికి ఓంకార మనే స్థలము ఎనిమిది పరుగుల దూరములో అడవినడుమ నున్నది. ఆ దినము మధ్యాహ్నము రెండు ఘంటలకు బయలుదేరి రెండు ఘడియల ప్రొద్దు కలదనంగా ఆమడదూరమున నుండే పేంపెంట్ అనే గ్రామము చేరినాను. దోవ అడివి బలసినది. మృగుభయము కలదు. గులక, రేగడ కలసిన భూమి. ఆ యూరు నవాబు యిలాకాలో చేరినది. భెబందు గ్రామము. చిన్నయిండ్లు పదార్ధాలు విశేషముగా దొరకవు.

తేదీ వుదయమైన గడియకు బయలుదేరి ఆమడదూరములోనుండే ఆత్మకూరు చేరినాను. భాట మంచిది. అడివి నిండాలేదు. ఆ యూరు కందనూరు నవాబు తాలూకా ఉద్యోస్థులుండే కనుబాస్థలము. ఆ కందనూరు నవాబు తాలుకా నాలుగు మేటీలుగా పంచి ఒక్కొక్కమేటీకి నొక్కొక్క ఆములుదారుని నేర్పచినాడు, కొంతతాలూకా తన వద్ది నవుకరులకు జీతానికి బదులుగా జాగీరుకా నిచ్చినాడు. ఆ నవాబు, కంపెనీకి సుమారు లక్షరూపాయీలు సాలెనా కట్టుచున్నాడు. అతని రాజ్యము భళ్ళారి జిల్లా కలకటరాజ్ఞకు లోబడినది. కలకటరు తరఫున నొక వకీలు కందనూరులో కాపురమున్నాడు. ఆ నవాబు రాజ్యస్థులకు స్వంతముగా నొక ఖాజీకోటు పెట్టి న్యాయవిచారణ చేయుచున్నాడు గాని, జిల్లా కంపెనీ కోరటుకు నిమిత్తములేదు. నవుకరులకు జీతము క్రమముగా ముట్టచెప్పడములేదని వదంతిగా నున్నది. అందరికి జీతము బహుస్వల్పము. తాలూకా అములుదారుల మీద అకబరునివీను అని ఒక ఉద్యోగస్థుని ఉంఛియున్నందువలన పనులు హామీ భరాయించి చూడడమునకు నెవరికిన్ని స్రాతంత్ర్యము లేక నున్నది. ఆ యాత్మకూరు దూరము నించి వినడానకు గొప్పయూరు, పేటస్థలము. ప్రతి ఆదివారమున్నుసంతకలదు. సంతలో సకల పదార్ధములు దొరుకునని ప్రసిద్ధి కలిగియున్నది. వచ్ఫివిచారించగా తద్వ్యతిరిక్తముగా నగుపడును. సంతలో ముసాఫరులకు అక్కరలేని పదార్ధాలు విక్రయింపుచున్నారు గాని ఉపయోగించునవి విశేషించి లేవు. ఆయాత్మకూరులో శ్రీశైల స్థలమందలి యాచకులున్ను యాత్రచేయను వచ్చిన వారివద్ద హాశ్శీలు పుచ్చుకునే నవాబు ముసద్దీలున్ను ఉన్నారు. అక్కడికి శ్రీశైలము నాలు గామ డని చెప్పుచున్నారు. ఆ నాలు గామడ దూరములో నడమ కొన్ని యూళ్ళున్నా, పదార్తములు ఎంత మాత్రమున్నూ దొరకవు గనక నక్కడనుంచి బయలు వెళ్ళీనది మొదలు మళ్ళీ ఆ స్థలముచేరేవరకు కావలసిన సామానులన్ని మరచిపోకుండా తీసుకొని పోవలసినది. మరచిన పరార్ధములు తక్కువ పడే యుండును. శ్రీశైలయాత్రకు తీసే హాశ్సీలు కందనూరునవాబుకు చేరుచున్నది. శివరాత్రి ఉత్సవములో శూద్రజనము ఒకటికి ర్పూ రెండు, గురానికి ర్పూ ఐదు, అభిషేకమునకు ర్పూ మూడు, వాహనోత్సవము చేయిస్తే ఉత్సవపు సెలవులు గాక గ మూడు, దర్మణసేవోత్సవమునకు ర్పూ మూడు. ఈప్రకారముగా పుచ్చుకొనుచున్నారు. శ్రీశైలమునకు నాలుగు భాటలు. ఎటుపోయినా నీశ్వర సంకల్పమేమో నాలుగు ఆమడదూరము, ఛీకారణ్యమయిన దోవ. ఒక భాట నెల్లూరు మీద నచ్చి చుక్కల పర్వతము నెక్కవలసినది. మరియొకటి కంభం దూపాటి మీదవచ్చి చుక్కలకొండ నెక్కవలెను. మరియొక భాట పడమటి దేశస్థులు కృష్ణానది దాటి రావలసినది. ఆ కృష్ణ పాతాళగంగయని పేరువహించి శ్రీశైలము క్రింద ప్రవహింపుచున్నది. శ్రీశైలమునుంచి ఆగంగకు పోవలెనంటే రెండుకోసుల దూరము. దిగియెక్కవలెను. కొంతదూరము సుళువైన డోలీమీద పోవచ్చును. మెట్లు పొడుగుగనుక నెక్కడము, దిగడము కష్టము. నేను వచ్చిన యీ యాత్మకూరు భాట తప్పమిగతా మూడు భాటలు ఉత్సవకాలములలో నడవవల్సినది గాని తలుచుకొన్నప్పుడు నడవకూడదు. మృగభయము, చెంచువాండ్ల భయమున్ను విస్తరించియుండును. ఆ ఛెంచువాండ్లు అడివి మనుష్యులయినను యాత్రకు వచ్చేవారిని యాచించి తినే వాడికే పడియున్నారు. శివరాత్రి మొదలు చైత్రమాసమువరకు శ్రీశైలము మీద ప్రతిదినమున్ను పల్లకీసేవ అనే ఉత్సవము జరుగుచున్నది. ఛైత్రమాసములో భ్రమరాంబ యనే దేవికి తామసపూజ చేసి శ్రీశైలముమీద వచ్చియుండే జనులు విరామమును బొందుచున్నారు. అటుపిమ్మటనొకరిద్దరు అర్చకులు మాత్రము మార్చిమార్చి ఆయాత్మకూరు నుంచి వచ్చి యుంచున్నారు. ఎక్కువ దినములుంటే అక్కడి నీళ్ళు ఒంటక జ్వరము, మహోదరము, సోభ మొదలయిన రోగములు కలుగుచున్నవి. శ్రీశైలమున గుడికి సమీపముగా ఇరవై చెంచుగుడిశేలున్నవి. వారున్న ఆ గుడిశెలు వదిలి భాద్రపద మాసములో వలస పోవుచున్నారు. అప్పటికి వర్షాకాలము తీరి యీగెల ఉపద్రవము కలుగుచున్నది. అది సహించతగినది కాదు. గుడివద్ద స్వామికి ఆవులు వంద దనుక నున్నవి. కడప విడిచిన వెనుక ఆవుపాలు, పెరుగున్ను కండ్ల చూడవలెనంటే శ్రీశైలముమీద చూడవలసినది గాని ఇతర స్థలములలో ఆవులను మాత్రము కండ్ల చూడవచ్చును. ఆవుపాలు తీసుటలేదు, దూడలకు విడిచిపెట్టుచున్నారు. అంత జాగ్రత్తగా ఈ దేశస్థులు పసువులను కాపాడిన్ని, దున్నడముకు ఎద్దులు నెల్లూరుసీమనించి తెచ్చే వారివద్ద హమేషా వారికి కొనవలసి యున్నది. ఎనుములు పాడికే గాని అచ్చటి దున్నలు ఆభూమిని నిగ్గి దున్న నేరవు. తడవకు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు వరహాలు పెట్టి యెద్దులను కొనుచున్నారు. ఆ యాత్మకూరి కాపురస్థులు అనేక పర్షన్ వాండ్లను గొప్ప, చిన్నలను చూచి మెరుగైనవారై యున్నారు. ముసాఫరులకు దేవి యాచకులయిన తెనుగు బ్ర్రాంహ్మణులు రెండిండ్లవారున్ను, స్వామి యాచకుడయిన జంగవాడొకడున్ను - వీరే స్థల మివ్వవలసినది గాని, యితరుల యిండ్లు గొప్పలయినను స్థల మివ్వరు. రెండు నుంచి మూడు వరకు చిన్న దేవస్థలములు, చావిళ్ళున్ను న్నవి. తప్పితే అందులో దిగవలసినది. ఆయాత్మకూరినించి పట్టణపు షవారీల మీద కష్టముగా శ్రీశైలపర్వతమునకు పోయి చేరవచ్చునని తెలియనందుచేత మూడు డోలీలు రెండు రూపాయీలకు చేయించినాను. వాటిని నొక దినములో అక్కడి వడ్లవాడు చేసినాడు. అక్కడి రూపాయికిన్ని చెన్నపట్టణపు రూపాయికిన్ని సుమారు కాలురూపాయి భేదమున్నది. పట్టణపు రూపాయి ఒకటి కె అక్కడి రూపాయిపన్నెండు ఎనిమిదిమంది కూలి బోయీలను అక్కడి వారిని శ్రీశైలమునకు పోయి రాగలందులకు జనము ఒకటి కి రూపాయిలు నాలుగు లెక్కను కుదుర్చుకొన్నాను. నా వుప్పాడాబోయీలను ఎనిమిది మందిన్ని వారికి సామాను తేను మూడు బోయీలనున్ను నాసామాను తేను నాకావటి వాండ్లను ఆర్గురు నిన్ని తీసుకున్నాను. వారి సామనున్ను బంట్రోతులకు నలుగురికి భోజన సామానున్ను తేను ఒక కావటివాని కూడా తీసుకోన్నాను. నాపరివారమైన్ ఇరవై ఐదు మంది బ్రాంహ్మణులకు ఐదు దినముల మెనూను, భత్యము, తీసుకొని ఇరవై ఐదవ తేది ఉదయాన మూడు ఘంటలకు ఆత్మకూరు వదిలి నాలుగు కోసుల దూరములో నుండే నాగులోటి అనేగుడి లో ఘంటకు ప్రవేశించినాను. దోవలో రాధాపురము, కృష్ణాపురము, వెంకటాపురము, సిద్ధాపురమున్ననే గ్రామములున్నవి. బహు చిన్నవి. చెంచు వాండ్లు, యితరులున్ను కలిసి కాపురమున్నారు. ఆ వెంకటాపురము వరకు భాట సరాళము, వెల్లడిగా నున్నది. అది మొదలు నాగులోటి గుడివరకు భాట సరాళమయినా యిరుపక్కలనున్ను దట్టమయిన అడివి. ఆ సిద్ధాప్, ఉరములో చెంచువాండ్లకుగాను నవాబు మనుష్యులు మనిషి ఒకటి కికె మూడు డబ్బులు హాళ్ళీలు పుచ్చుకొనుచున్నారు. డబ్బులు అనగా చెన్నపట్టణపు రెండు దుడ్లు. అక్కడ అణాలు, అర్ధణాలు, పావులాలు దొరకవు. అక్కశడ దబ్బులు మార్చి పెట్టుకొని సెలవు చేయవలసినది. అణాకు మూడుడబ్బులవుచున్నవి. ఆడబ్బులు ముందరి పట్నం లింగిశెట్టి దుడ్లవలెనే అరిగిపోయి యున్నవి. ఆ నాగులోటి వరకు సవారీ మనుష్యులున్ను సాధారణముగా పోవచ్చును. నాగులేటిలొ సిద్ధాపురములో కాపురమున్న చెంచువాండ్లు వేటకు రాగా వారింజూడవలసినదేగాని యితరులు పరిష వారికి కనుబడదు. ఆ గుడి మజిలీ చేసి దిగను నయిపు, వీలు, గా జలవసతి కలిగి యున్నది. ఆ గుడి వీర భద్రస్వామిది. ఒక జంగము ఆత్మకూరిలోనుంచి వారానికి రెండు ఆవృత్తులు వచ్చిపూజచేసి పొవుచున్నాడు. అక్కడ మధ్యాహ్న భోజనము చేసుకొని మూడు ఘంటలకు బయలు దేరి అక్కడికి అయిదు కోసుల దూరములో నున్న పెద్దచెరువు అనే యూరు తొమ్మిది గంటలకు చేరినాను. నాగులోటి వదిలనది మొదలు కోసేడు దోవపర్యంతము కష్టమయిన కొండ యొక్కుడు, దిగుడుగానున్నది. మెట్లు బాగా కట్టియున్నవి. ఆ కోసెడు మిక్కిలి ప్రయాస. అవతల రెండు కోసులు ఎక్కడము, దిగడము లేక పోయినా దోవ రాతిగొట్టుగాను న్నిరుపక్కల దట్టమయిన అడివిగాను నున్నది. సవారీలు వస్తే చెట్లకొమ్మలు వాటికి తగులును. ఆరాతిగొట్టు దారిని దాటిన వెనుక పెద్ద చెరువుదాకా గుర్రపుబండ్లు పొయ్యే పాటిగా, భాట విశాలముగా సమముగా నున్నది. పెద్ద చెర్వునుంచి పచ్చేటప్పుడు రెండుమూడు భాటలు చీలిపోవు చున్నవి. తెలిసిన చెంచుగాండ్లను పిలుచుకొని నాగులోటె చేరవలసినదిగాని స్వతంత్రముగా బోనే తప్పిపోదురు. కుడిచేతి పక్క చీలే భాటలు వదిలి యెడమ చేతిపక్కభాటను పట్టి వస్తే నాగులోటికి రావచ్చును. ఆ పెద్దచెరువు విడిచి శ్రీశైలము చేరేవరకు గాని నాగులోటి వదిలినది, మొదలుచేసుకొనిగాని యెక్కడనున్ను ఆవరణ సంబంధమయిన నీడయున్ను, జలవసతి గల ప్రదేశమున్నులేవు. ఆపెద్దచెర్వు అనే యూరిలో పందులు తోలను చాలేపాటి ఇరవై కిరాతకుల గుడిశలున్నవి. మరి వేరేనీడలేదు. చెరుఫులో రమణియ్యమయిన రామరస పుష్పాలుగల జలము కలిగి యున్నది. చెన్నపట్టణపు కొణ్నూరు నీళ్ళు వదిలిన వెనక నింశపాటి యుదకము నేను చూచినవాడను గాను. అందరున్ను ఆ చెరువుకట్టమీద వంట, భోజములు చేసుకొని వానవచ్చునేని ఆ గుడిశలలో కూర్చుండి యుండవలసినది. ఆయూరి చెంచు బోయీలనే కిరాతకులకు నొకడు యజమానుడుగా నాయకుడనే బిరుదు వహించియున్నాడు. వాడు ధర్మ్మాత్ముడు. పరషవారివద్ద నవాబు సరకారుయొక్క ఆజ్ఞప్రకారము మనిషికె మూడు డబ్బులవంతున హాశ్శీలు తీసుకొన్నా పస్తుగా నుండేవానికి బియ్యమిచ్చి పాత్ర యిచ్చి వంటచేసుకొనుమని ఉపచరింపుచున్నాడు. ఆమార్గముగా శ్రీశైలమునకు వెళ్ళేవారికి పొయ్యేటప్పుడు, వచ్చేటప్పుడు అక్కడ నిస్సందేహముగా విధిలేక మజిలీ చేయవలసి యున్నది. నేను తిరుగుదలై పచ్చేటప్పుడు పదిరూపాయీల్లో నొక చావిడి విశాలముగా కట్టవచ్చునని ఆనాయకుడు మొదలైన వారిగుండా తెలుసు కోంటిని. అక్కడి వాడిక ప్రకారము వెదురు తడికలతో గోడలుపెట్టడము వలన నన్ను, అడివి వెదురు మయంబు నందుననున్న, అక్కడి వెదురు తడికెలు మట్టి


రెండవ ప్రకరణము  శ్రీశైలము నుండి హైదరాబాదు రాజ్యము వరకు

గోడలకంటె ద్విగుణ మయిన బలము కలవి గనుకనున్ను బహు బల మయిన కొయ్యసామాను అతినయముగా దొరుకుచున్నది. గనుకనున్ను వారు చెప్పిన ప్రకార మొక చావిడి కట్టదానకు రూపాయలు ఇరవై చాలు నని తోచినది. ఆరాత్రి చెరువుకట్టమీద వంట, భోజములు చేసుకొని ఉదయమయిన నాలుగు ఘంటకు బయలుదేరినాను. ఆరాత్రి మిక్కిలి చల్లగాలితో కూడామబ్బు తుంపర పడుచుండెను గనుక నొక బోయిగుడిశె ఖాళీ చేయించి అందులో పండుకొన్నాను.

రతేదీ అక్కడికి నాలుగు కోసుల దూరములో నుండే శ్రీశైలము పన్నెండు గంటలకు చేరడ మయినది. పెద్దచెరువు విడిచి వెంబడిగానే కొండయెక్కను ఆరంభించవలసినది. ఒక్ కోసెడు యెక్కుడు, దిగుడుగా నుంచున్నది. అయితే మెట్లువైపు, వీలు,గా కట్టియున్నవి. నిండా ప్రయాస కాదు, ఇరుప్రక్కలా అడివి. అటుపిమ్మట కోసెడు దూరము సమభూమి. అందులో పొయ్యేదారి రాతిగొట్టుగా నుంచున్నది. అటుపిమ్మట భీముని కొల్ల మనే$ అగాధాఇన కొండ్ పల్లమువరకు కొండ యెక్కుడు దిగుడుగా నుంచున్నది. అక్కడ మెట్లు ఏర్పరచి కట్టియున్నవి. ఆయాగాధ మైన కొండదొవలో నొక వాగు పారుచున్నది. అక్కడ ఆసోదా చేసుకొని కొండయేడుతిరుగుళ్ళు, రెండువేల మెట్ట్లు పర్యంతము, మిక్కిలి పొడుగుగా నెక్కవలసినది. ఆ ప్రదేశములో నెక్కేటప్పుడు, దిగేటప్పుడున్ను వాడికె లేనివారికి చుట్టూ చూస్తే కండ్లు తిరుగును. మెట్లు బాగుగా నెక్కవలసినంత దూరము కట్టి యున్నవి. చుట్టు ఏతట్టు చూచినా నవ్రతములున్నవి. యీప్రకారము రెండుకోసులు ఎక్కిన వెనుక సమభూమిలో రాతిగొట్టు గల మార్గము శ్రీశైల పర్యంతము పోవుచున్నది. ఆ కొండ యెక్కుటుకు, దిగుడుకు తిరుపతి బోయీలు డోలీకి ఆరు మంది అయినట్టయితే అనాయాసముగా నెక్కిపోదురు. అంతదూరము ఎక్కుడు దిగుళ్ళలో తిరుపతి గాలిగోపుర పర్యంతము అక్కవలసినంత ప్రయాస యెక్కడనున్నులేదు. నాతోడవచ్చిన వుప్పాడా బోయీలు ఎనిమిది మందిన్ని నాడోలీని అనాయసముగానే మోసినారు. అయితే నాగులోటి దాటగానే కొండ యెక్కవలసిన దాని కంటే రఫంత ప్రయాస యెక్కువ గనుక, అక్కడ ప్రధమ మందే యీలాగున నున్నదే, యిక నేలాగున నుండునో యని అధైర్యము తోచుచున్నది. అవతల సాగిపోగా సుళువనిపించుచున్నది గాని వేరుగాదు. ఆ కోండ ఉయెక్కుడు, దిగుడులలో ఆత్మకూరి బోయీలకు వుప్పాడ బోయీలు తీసిపోలేదు. ఆ యాత్మకూరి బోయీలకు సంవత్సరమునకు నొకసారి పనిపడు చున్నది గాని నిండా పనిలేదు గనుక నెక్కడము, దిగడములలో తిరుపతి బోయీల వలెనే ఆబోయీలు వాడికే పడిన వారుకారు. నేను చేయించిన డోలీకి బంగాళా పాలకీ వలెనే రెండుం ముక్కాలడుగు వెడల్పు పెట్టించినాను. అది శ్రీశైలమునకు సాధారనముగా సాగిపోయినది. కందనూరు నవాబు వగయిరాలు పల్లకీల మీదనే శ్రీశైలమునకు వెళ్ళియున్నారు. సంపన్నులయి నందున దోవలోని చెట్ల కొమ్మలు కొట్టడమునకు ముందుగా మనుష్యులను జాగ్రత్త పెట్టి యుండవచ్చును.

తేది పగలు మూడు ఘంటలకు శ్రీశైలముమీది గుడి కల్యాణ మంటపములో నుంటిని. అక్కడ ముందు గుడికి చుట్టున్ను గొప్ప పట్టణ ముండను. వేశ్యా స్త్రీల యిండ్లు మట్టుకు మూడు వందలు డెబ్బై ఉండినవి. ఆపట్టణ మంతయు ఇప్పుడు పాడుబడి పోయెను. ఇంటింటనున్న బావులు శిధిలములయినవి. గోడలుగూడా ఇప్పుడు తెలియుచునున్నవి. ఐదు వందలు? ఏండ్లనాడు అనవేమారెడ్డికి భగవంరుని కటాక్షము చేత బంగారనుములు పండినవని వాడుక కలిగియున్నది. అతడు స్వామి గర్బగృహమునకున్ను, ధ్వజస్తంభములకున్ను బంగారు మొలాము చేసిన రాగి తగుళ్ళు కొట్టించినాడు. అని యుప్పుడు నిండా శిధిలములుగా నున్నవి.

గుడికి రెండు ప్రాకారములు కలిగియున్నవి. బయిటి ప్రాకారపు గొడలమీద నాలుగుపక్కల శివలీలలు సుందరములయిన ప్రతిమలుగా చెక్కియున్నవి. వాటిని శిల్పి బహు బాగాచేసినాడు. అయితే రాళ్ళను వయివుగా నంతన చేసినవాడుకాడు. ప్రాకారము మీద ప్రతి కోట కొమ్మకు నొక్కొక్క ప్రతిమ చెక్కియున్నది. గుడి లోపల గెండో ప్రాకారము బొత్తిగా శిధిల మయిన్నది. మంటపములు ఆ రీతిగానే యున్నవి. అర్చకులకు మనసు వచ్చినప్పుడు దీపారాధన, నైవేద్యములు స్వామికి చేయబడు చున్నవి. గాని నిత్య నియమము లేదు. బ్రాంహ్మణులు స్వేచ్చగా లింగమును తాకి అభిషెక నివేదనలు చేయవచ్చును. భ్రమరాంబా దేవికి మాత్రము మిరాశీ అర్చకులతరపున నొకడు నియమముగా గుడిలో కాపురముండి అర్చన చేయుచున్నాడు. అలాగు అర్చనచేసే గుమాస్తా సంవత్సరము ప్రాణము తోనుండుట దుస్తరము. అందుకు కారణము రోగప్రదేశమేనో, వానిభక్తి తక్కువేనో తెలిసినదికాదు. ఇప్పుడు ఐదు సంవత్సరములుగా రాజశ్రీభొట్లు అనే బ్రాహ్మణుడు ముప్పై ఏండ్లవాడు ప్రాణముతో నక్కడ నిలచియున్నాడు. అది ఆశ్చర్యముగా నున్నది. అతడు ఏకాకి. ఆగుడి లింగము భూమికి జీనెడు పొడుగుగా నున్నది. విమానమునకు నాలుగు శిఖరములు, అని నాలుగుపక్కల శిధిలము లయియున్నవి. నడమనున్న గొప్పశిఖరము దర్శనమునకు నుపయోగింపు చున్నది. ఆత్మకూరి దారిని వస్తే గుడిలో ప్రవేశించేవరకు శిఖరదర్శనము కానేరదు. నెల్లూరి కంభము మార్గములనస్తే గుడికి మూడుకోసుల దూరములోనున్న శిఖరేశ్వర మనేపేరు గలిగిన యున్నత ప్రదేశమునకు శిఖరము తెలియు చున్నది. ఆగుడివద్ద వశింపుచున్న చెంచువాండ్లు ఆత్మకూరి వారివలెనే మిక్కిలి కొవ్వినవారు. భ్రమరాంబ గుడికిన్ని, మల్లికార్జునస్వామి గుడికిన్ని సమీపమందే కొంచెపు మిట్టమీద శ్రీచక్రస్థాపన చేసియున్నది. గుడిలో ఇరవై రెండు తీర్ధములున్నవి. ప్రతి తీర్ధమందున్ను కొండవూట స్రవించి తీర్ధములము అంతర్వాహినిగా పారివచ్చి అవతల సాగి పోవుచున్నది. ప్రతి తీర్ధమునకున్ను సూర్యరశ్మి పడకుండా పైన మంటపాలు కట్టియున్నవి. ఏ తీర్ధమున్ను మోకాటిలోతుకు నెక్కువలేదు. రోగకారియని అక్కడివారు చెప్పినారు. ఉదకము నిర్మలముగా నున్ను, శీతళముగా నున్నది. ఆగుడిహాశ్శీలు మూలకముగా సంవత్సరము ఒకటికి పదిహేను వేల కందనూరు నవాబుకు వచ్చినా, గుడి యేగతి పొందేదిన్ని విచారింపడు. ఏరయినా మరమ్మతు చేసినట్టయితే సెలమత హాశ్శీలు తీసుకొనుచున్నాడు. రాజా చందలాలా ఈనిర్బంధము చేత కొంత మరమ్మతుచేసి విసికి విడిచి పెట్టినాడు. అతను అర్గురు బ్రాంహ్మణులను నెల ఒకటికి మూడు రూపాయీలు జీతముచేసి నిత్యము స్వామికి అభిషేకము చేసేటట్టు వుంచినాడు. మహిషాసుర మర్ధనము మహినూరి దేశములో చేసినందున ఆదేశమునకు మహిసూరనే పేరు వచ్చినదను చున్నారు. అక్కడ మహిషాసుర మర్ధనమయినందున వెనుక భ్రమరాంబ శ్రీశైలము ప్రవేశించినది. మహిసూరు తద్ద్వారా ఆమె పుట్టిన దేశమని ఆ దేశస్థులు ఎవరు వచ్చినా హాశ్శీలు యియ్యనక్కరలేదు. జంగాలకు, ఆరాధ్యులకు, బ్రాంహ్మణులకున్ను ఉత్సవ కాలములో హాశ్శీలు లేదు. గుడిలో నే పక్క చూచినా అడివి ములిచి సర్ప వ్యాఘ్ర భూయిష్తముగా నున్నది. ఆ యడవి కొట్టి చక్కచేసే దిక్కులేదు. స్వామికిన్ని, దేవికిన్ని ఎవరయినా ఆభరణాలు, వస్త్రాలు సమర్పించిరేని వాటిమదింవంత రూకలు హాశ్శీలు పుచ్చుకోనడము మాత్రమే కాకుండా కొన్ని దినములు పోనిచ్చి ఆ వస్తువులే ఆ కందనూరి నవాబు అపహరించు చున్నాడు. తిరుపతి విషయముగా కంపెనీవారిని అహో గుణవతీ భార్యా భాండమూల్యం న యాచతే అనే శ్లోకసంగతి ప్రకారము ఆ స్థలవర్తమానము తెలిసినవారు కొనియాడవలసియున్నది. కలి సామ్రాజ్యము గనుక లోకక్రమం సాక్షిగా నుండే యీశ్వరుడు లోకులకు కర్మఫలప్రదానము చేయుట కంటె ఎక్కువ యేమి చేయగలడు? ఇది నర్మజనపూజిత మయిన ప్రసిద్ధి కొనిన స్థలము. శిఖరదర్శన మాత్రము చేతనే జన్మాదులు లేవని పురాణాలు మొరపెట్టు చున్నవి. యీ మహాస్థలము మూడు ఘంటలకు వదిలి నాలుగు ఘంటలకు దిగుడు గనుక త్వరగా భీముని కొల్లము చేరినాను. ఆరు నాలుగు ఘంటలకు పెద్దచెరువు చేరినాను. ఆ రాత్రి అక్కడ వచించి ఇరవై ఒకటి తేది ఉదయమయిన మూడు. నాలుగు ఘంటకు బయలువెళ్ళి ఆరు ఘంటలకు నాగులోటి చేరినాను. అక్కడ నించి భోజనోత్తరము మూడు ఘంటలకు బయలుదేరి సాయంకాలము నాలుగు ఘంటలకు బయలుదేరి సాయంకాలము ఐదు ఘంటలకు ఆత్మకూరు చేరినాను.

తేది మూడు ఘంటలకు అక్కడనుంచి బయలివెళ్ళి కోసెడు దూరములో నుండే నందిగుంట అనేగ్రామము నాలుగు ఘంటలకు చేరి వర్షో పద్రవముచేత అక్కడనే నిలిచినాను. భాట మంచిది. అయితే ముండ్లు విస్తారముగా నున్నవి. ఆ గ్రామము గొప్పది. భ్రాంహ్కణుల యిండ్లు, కోమట్ల యిండ్లు న్నున్నవి. సకల పదార్ధాలున్ను దొరుకును. దేవస్థల్లములున్నవి. ఆ దేవస్థలములో దిగినాను.

తేది ఉదయాన మూడు ఘంటలకు బయిలుదేరి రెండామడ దూరములోనున్న నివృత్తిసంగమ మనే పుణ్యక్షేత్రము ఇరవై ఒకటి ఘంటలకు చేరినాను. అది కృష్ణాతీరము. ఆ కృష్ణలో తుంగభద్రతో కూడా అయిదు నదులు అంతకు మొందే కలియుచున్నవి. భనాశిని అనే నదిన్ని ఆ స్థలమందు కలియుచున్నది గనుక అక్కడ కృష్ణానది అనర్గళముగా ప్రవహింపుచున్నది. వాసయోగ్యమైన ప్రదేశము. ఏటియొడ్డున ధర్మరాజ ప్రతిష్టితమైన శివస్థల మొకట్యున్నది. బృహస్పతి కన్యాగతు డయినప్పుడు అక్కడ అనేకవేల ప్రజలు వచ్చి కృష్ణపుష్కరాల యాత్ర చేసుకొని పోవుచున్నాదు. సకల పాపాలను నివృత్తిని పొందించే ప్రదేశము గనుక నివృత్తి సంగమ మనేపేరు ఆస్థలమునకు వచ్చినది. ఇరువది బ్రాంహ్మణుల యుఇండ్లున్నవి. కావలసిన పదార్దాలు ప్రియముగా దొరుకును. ఊరుకొండకింద నున్నది. అక్కడ కృష్ణ ఉత్తర వాహినిగా ప్రవహించు చున్నది. ఆ దినము వచ్చినదోవ మహా సుఖకర మహినది. ఎటువంటి ఋతువులోనున్ను సన్న గులక భూమి గనుక భాట ప్రతికూల మయ్యేది కాదు. అడివిలేదు. దోవలో అడుగడునకు గ్రామాదులున్నవి. జలవసతి కలదు. ఊరూరికి శిధిలమయిన కోట యొకటి కలిగియున్నది. అక్కడి గుళ్ళలో తంబలవాండ్లు అర్చకులుగా నున్నారు. కావలిసినవారు తామే పూజ చేయవచ్చును. ఆ యూరున్ను కందనూరు నవాబుతో చేరినది. ఆ కృష్ణ దాటడానికి మనిషికి ఇంతమాత్రమని హాశ్శీలు పుచ్చుకొనుచున్నారు. శ్రీశైలానకు వెళ్ళేటందుకు నేను శూద్ర మనిషికి ఒకటి కి ర్పూ మూడు సగం గుర్రనికి ర్పూ మూడు సగం అభిషేకానికి ర్పూ సగం బ్ర్రాహ్మణునికి అ రెండు, లెక్కనిచ్చినాను. కృష్ణ అక్కడ దాటవలసినది గనుక అక్కడ ఘాటు హాశ్శీలు ఒక పక్క కందనూరు నవాబుకున్ను ఒక్కప్రక్క హయిదరాబాదు వారికిన్ని యివావలసి యున్నది. ఆకృష్ణ యీవలి గట్టువరకు కందనూరి నవారియొక్క దొరతనమునకు లోబడిని దేశము. ఆవలిగట్టు మొదలు చేసుకొని హైదరాబాదు వారి రాజ్యము. తిరుపతి మొదలు ఆ యూరివరకు ప్రతి గ్రామమున కున్ను ఒక రెడ్డిన్నీ, ఒక కరణమున్ను ఉన్నారు. ఆ కరణాలు కొందరు నందవరీశులు, కొందరు ప్రధమ శాఖలు, కొందరు నియోగులు. ఈరీతిగా బ్ర్రాహ్మణులు ఆ యుద్యోగమును చూచుచున్నారు. కట్టుబడి బంట్రోతులని జీతానికి బదులుగా భూమిని అనుభవింపుచు కావలి కాచుకొని గ్రామాదుల సకల పని పాటలున్ను చూచున్నారు. పరువు కలిగిన ముసాఫరులకు కావలసిన సరంజామా సహాయసంపత్తు ఆ రెడ్డి కరణాలగుండా కావలసినది. ఆ యుద్యోగస్థుల నిద్దరినిన్ని నయభయముల చేత స్వాధీన పరచుకొంటేగాని మార్గవశముగా వచ్చే పరువుగల వారికి పనులుసాగవు. పరువుగలిగిన ముసాఫర్లు అధికారపు చిన్నెకొంత వహించితేనే బాగు. నిండాసాత్విక గుణము పనికిరాదు. మార్గము చూపించడమూకున్ను దిగిన తావున కావలసిన సామానులు తెప్పించి యివ్వడమునకున్ను రెడ్డి కరణాల యొక్క ఉత్తరవు ప్రకారము ఆ కట్టుబడి బంట్రోతులు పనికి వచ్చుచున్నారు. ఓంకార మనే స్థలమందలి తీర్ధములో నున్న జలమందు మునిగి క్షణమాత్రము తల యెత్తక నిలిపియుంటే ఓంకార నాదము వినిపింపుచున్నది. ఆనివృత్తిసంగమమునకు నేను వచ్చిన భాటలో అక్కడకు ఆమడ దూరములో ముసలిమడుగు అని యొక యూరున్నది. అది పేటస్థలము, దిగేమజిలి, వసతియయిన గ్రామము. ఆ నివృత్తిసంగమములో నుండే అగ్రహారీకులకు భళ్ళారి జిల్లా శిరిస్తా చేసి యిప్పట్లో బోర్డు సిరస్తాగానుండే రామచంద్రరాయుడు ఒకకాలమందు అక్కడికి యాత్ర బోయి వాక్సహాయముచేసి ఆ యగ్రహారీకులు నవాబు సరకారుకు కట్ట్టుచునుండే పన్నురూకలను మాపుచేయించినారు. అనుభవించే భూమిని సర్వదుంబాలా చేశినాడు. గనుక అక్కడి ద్విజులు మేము చేసే సత్కర్మ ఫలము అతనికి చెందవలసిన దని చెప్పి కొనియాడుచున్నారు. కడప మొదలుకొని యిదివరకు జ్యేష్టమాసము మొదలు శ్రావణమాస పర్యంతము క్రమమయిన వర్షాకాలము. ప్రతి దినమున్ను మబ్బు, వర్షము కలిగియున్నది. కొండకింది గ్రామాదులలో గాలి కొట్టేటప్పుడు ఆ గాలి కొండలమీద మోది అతి ధ్వనితో బహువేగముగా సమీపమందు విసురుచున్నది. కొత్తవారికి ఆగాలి సహించడము ప్రయాసగా నుంచున్నది. తిరుపతి మొదలు కొని యెంత పాతబియ మని అంగటివాడు ఇచ్చినను కొత్తబియ్యము వలెనే అన్నము మెత్తపడుచున్నది, గనుక ఆ బియ్యము వాడికె బడేదాకా ప్రయాసగా నుండును. నాటు ఉప్పుడుబియ్యము ఆ ప్రాంతములలో బొత్తిగా దొరకదు. పేదలు జొన్నలతోనున్ను, అరికె యన్నముతోనున్ను కాలము గడుపుచున్నారు.

తేది మొదలు ఇరవై నాలుగు తేది మధ్యాహ్నపర్యంతము తీర్ధ విధి మొదలయిన పితృక్రమములు చేయడానికు అక్కడ వుండి పన్నెండు ఘంటలకు భోజనము చేసుకొని బయలుదేరి రెండు కోసెడు దూరములో నుండే సిద్ధేశ్వరం ఘాటుకు పోయినాను. ఆ రెండు కోసున్ను కొండమీద నెక్కి నడిచి కొండ తిరిగి పోవలసినది. దారి రాతిగొట్టు ఎక్కి దిగుచు నడవలసినది. అక్కడ కందనూరు వారిది యొక పుట్టి యున్నది. నలుగురు బోయిజాతి మనుష్యులు ఆ పుట్టిని తెడ్లతో తోసిగడుపు చున్నారు. ఆ పుట్టి - అనగా పెద్ద వెదురుగంప, ఇరవై మంది కూర్చుండవచ్చును. పయిన చర్మముతో కవచము కుట్టియున్నది. బహుసున్నితము. రవంత ద్వారము పడితే ప్రమ్మదము వచ్చును. ఒక్ పల్లకీనిన్ని పన్నెండు మంది బోయీలనున్ను ఒక ఇడతకు దాటించినారు. అవతలిగట్టుకు పోయి రావడానికి ఇరవై నాలుగు నిముషాలు పట్టుచున్నవి. దాని తావున నదికి నిరుపక్కలా కొండలున్నవి. తద్వారాగాలితోను విస్తరించి ఆఘాటుకు లేదు. గనుక ఆఘాటు ఇతరములయిన ఘాట్లకన్నా నది దాటడానికి క్షేమకరము. నాలుగు ఘంటలకు నాసరంజామాతో గూడా అవతలిగట్టుకు పోయి అక్కడ హాశ్శీలు సవారీకి రూపాయిలు ఐదుద్ను, గుఱ్రానికి రెండు రూపాయిన్ని, శూద్రులకు స్వల్పముగా నున్ను యిచ్చి ఆగట్టువలేనే నిజాం యిలాకా వారికిన్ని యిచ్చి నాలుగు ఘంటలకు బయలుచేరి అక్కడికి మూడుకోసుల దూరములో నుండే పెంటపల్లి అనే గ్రామము మూడు ఘంటలకు చేరినాను. డారి కొండలనడమ బోవుచున్నది. అందులో రెండు కోసులదూరము రాళ్ళమయమయిన కనమ. అది దాటిన వెనక నొక కోసెడు దూరము వెల్లడిగా, భాట బాగుగా నున్నది. ఆ గ్రామములో విశాలమున్ను, సుందరము న్నయిన వెంకటేశ్వర దేవాలయ మొకటి యున్నది. ముసాఫరులు దిగడానికి ఇదే యిండ్లకన్నావసతిగా నున్నది. బస్తీ గ్రామము ఇరవై కోమటి యిండ్లున్నవి. సకల పదార్ధములున్ను దొరుకును. ఆగ్రామము హయిదరాబాదు రాజ్యములో చేరినది. అయినా హయిదరాబాదు నవాబు క్రింద అనేక జమీనుదారులున్నారు. గనుక కొల్లపురపు జమీనిదారునితో ఆ గ్రామముచేరియున్నది. ఆ జమీందారులు క్లుప్తమయిన రూకలు కట్టి సకల రాజ తంత్రములున్ను తమ తమ జమీనుదారిలో స్వతంత్రముగా జరిపింపుచున్నారు. సేవా సయాయ సంపద ఎక్కువగల జమీనుదారుడు క్లుప్తమయిన రూకలిచ్చుటలేదని చెప్పుట కలదు. అప్పుడు హయిదరాబాదు వారు దండెత్తి కొట్టి సాధించి రూకలు తీసుకునుచున్నారు. ఆ జమీనుదారులకు ఒకరి కొకరికి సరిపడక వచ్చినట్టయితే పోట్లాడి చావడముమాత్రమే కాకుండా ఒకరి గ్రామాదులను ఒకరు కొల్లపెట్టి రహితులను హింసించి గామాదులను పాడు చేయుచున్నారు. ఈలాగున కలహములు పొసగినప్పుడు న్యాయము విచారించి యొకరి కొకరికి సమ

రస పెట్టకుండా దివాన్ జీతనము చేసే చందులాలా ప్రభృతులు ద్రవ్య కాంక్ష చేత నుభయులకున్ను కలహమును పెంచి వేడుక జూచుచున్నారు. ఈలాటి ప్ర్రారబ్దము నా ప్రయాణకాలములోనే వనపత్రి జమీను దారునికినీ కొలాపురపు జమీనుదారునినిన్ని ఒక సంవత్సరముగా పొసగి తహతహపడుచున్నది. నెను ఆ పెంటపల్లి కోటలో హయిదరాబాదు నవాబువారిది కొంత ఫౌజు ఉన్నందున నయభయాలచేత ఆ ఖిల్లాదారుని స్నేహితుని చేసుకొని జవానులను కొందరినికూడా తీసుకొని ఇరవై మూడుతేది ఉదయాన నాలుగు ఘంటలకు ప్రయాణమై రెండు కోసుల దూరములోనున్న పానగల్లు అనే ఖిల్లాగ్రామము ఒకటి నుంచి రెండు వరకు ఘంటలకు చేరినాను. మూడు కోసుల దూరమునకు వెనక తుమ్మగుంట యనే గ్రామమున్నది. అది మొదలు కంపెనీవారు హయిదరాబాదుకు లష్కరు వెళ్ళడానకు నెర్పరచిన భాట. అంతకు లోగడ దువ్వూరు మొదలుకొని ఆ తుమ్మగుంట వరకు శ్రీశైల యాత్ర నిమిత్తమై నేను కల్పించుకొన్న భాట. ఆ పెంటపల్లెకు పోయిన వెనక హయిదరాబాదుకు వెళ్ళను అనేక భాటలను లోకులు చెప్పుదురు. వాటిలో కొత్తకోటభాటను అందరు సాధారణముగా ముఖ్యమని చెప్పుదురు. అది చుట్టుగానున్ను, ప్రయాసమైన మార్గముగా నున్నది. ఆ తుమ్మగుంటవరకు భాట వెల్లడిగా సరళమయినదిగా యిసకపరగా నున్నది. అది మొదలుకొని పానగల్లువరకు చిన్నచిన్న కొండలపక్క పార్శ్వములలోనుంచున్నది. అపానగల్లు కొండకింద నున్ను, కొండమీద విశాలమైన దుర్గమున్నది. ఆగ్రామమున్ను, దానితొ చేరిన మరికొన్ని గ్రామములున్ను డేరాల దారోగాకు జాగీరుగానిచ్చినారు. గ్రామము బస్తీగాకపోయినా యింగీలీషుల ముష్కరుకు సరంజామాచేసి వాడికె పడినది గనుక ముసాఫరులకు కావలసిన వస్తువులు దొరుకుచున్నవి. ఇండ్లు మిక్కిలి కుసందిగా నున్నవి. చావళ్ళు గలవు. బ్రాంహ్మణులు నిండా పారమార్ధికులుగారు. ఆ రాత్రి అక్కడనే నిలచినాను.

తేది ఉదయాన నాలుగు ఘంటలకు బయలునెళ్ళీ పన్నెండు ఘంటలకు మూడు కోసుల దూరములోనుండే చిన్నమంది అనే గ్ర్రామము చేరినాను. మూడు కోసుల దూరమునకు వెనక వనపర్తి అనే జమీనుదారి కసుబాగ్రామము ఖిల్లా సహితముగా సంస్థానపరువు కలిగియున్నది. పానగల్లునించి తెచ్చిన జవానులను మార్చడమునకు రెండు గంటలసేపు అక్కడ నిలిచినాను. వనపత్రి రెండు ఘంటలకు చేరినాను. దోవ యిరుప్రక్కలా అడివి కలిగియున్నా దారి సన్నయిసుకపరగా బాగాఉన్నది. మృగభయము లేదు. వనపత్రివరకు కొండలనడమ భాటపోయినా రాతిగొట్టుకాదు. ఆ యూరున్ను రహదారి అయినందున ముసాఫరులకు కావలసిన సామానులు దొరుకును. ఊరూరికి కోటలు వుండడము మాత్రమే కాకుండా హయిదరాబాదువారి రాజ్యములో ఊరూరుకి ఒక జమీదారుడున్నందున శిబ్బందికి జీవనము కలగడమొక్కటేగాని, రహితులకు న్నితరులకున్ను క్షేమములేక ప్రాణభయముతో సదాకాలము తోయుచు నుండవలసి యున్నది.

కంపెనీవారు మజిలీపట్టీలు వారి పంచాంగములో వ్రాయుచువచ్చుచున్నారు. గ్రామాదులపేళ్ళు అడిగితే అట్టి గ్రామమే దారిలోలేదనుచున్నారు. గ్రామదుల దూరమును కొన్ని ప్రకరణములలో తప్పివ్రాసినారు. ఇందుకు సందేహములేదు.

ఆచిన్నమంది అనేవూళ్ళో వసతి యయిన చెరువు కట్టమీద నీడయివ్వగల చెట్లున్నవి. ఇండ్లలో దిగడానకు స్థలముచాలదు గనుక చెరువుకట్టమీదనే వంట చేసుకొని భోజనము చేసి రెండు ఘంటలకు బయిలువెళ్ళి అక్కడికి నాలుగు కోసుల దూరములోనుండే గణపురము సాయంకాలము మూడు ఘంటలకు చేరినాను. ఆగణపురానికి వెళ్ళేదోవలో చోళపురము, మొనోజీపేట అనే రెండూళ్ళున్నవి. మనోజీపేటవరకు భాట కిరుపక్కల దట్టమయిన అదివి భాట విశాలముగానున్ను, గులక యిసుక పొరగానున్ను నడవడానికి వైపుగానున్నది. భాట కిరు పక్కల కొంతదూరములో చిన్నతిప్పలున్నవి. మనోజీపేట అనే వూరు బస్తీ అయినది. దేవాలయమున్నది. కొంత దూరములో కొండమీద వెంటెశ్వర స్థలమున్నది.

ప్రసిద్దమయిన దేవస్థలము. ఆ మనోజీపేటకు సమీపాన నీడ గల యొక తోపు సుందరుముగా నున్నది. అక్కడికి సమీపముగానే బంగారురంగు అనే పేరు కలిగిన యొక సోగసయిన గుండు ఒక తిప్ప కొన యందున్నది. చూపుకు ఆతిప్పగుండు పానపట్ట సహితమయిన లింగాకారముగా నగుపడుచున్నది. ఆ మనోజిపేట మొదలుగా గణపురము వరకు కొండలనడుమ భాట పోయినా రాళ్ళు లేవు. అది గులక యిసక పొరగా నున్నది. ఆ గణపురము జాగీరు గ్రామము. కొండకింది యూరు, కొండమీద దుర్గము, కోట, మజుబూతి, గట్టి,గా కట్టి యున్నది. బస్తీగ్రామము. ఇరవై నుంచి ముప్పై వరకు బ్రాహ్మణులయిండ్లునా చిన్నవి గనుక స్థలము దొరకడము ప్రయాస. చావిళ్ళున్నవి. అన్ని పదార్దాలు దొరకును గాని నీళ్ళకు బహుప్రయాస. బావులు లోతుగా నుండడమే గాక జలము ఉప్పుగా నున్నది. మంచినీళ్ళు బహు దూరముగా వెళ్ళి తెచ్చుకొనవలసినది. ఆ రాత్రి అక్కడ నిలచినాను.

తేది ఉదయాన నాలుగు ఘంటలకుప్రయాణమై పదకొండు ఘంటలకు మూడు కోసుల దూరములో నుండే జడచర్ల అనే యూరు చేరి నాను. దారి యిసుకపొర. ఆ నడమ మూలకర్ర, కోటూరు, ఆలూరు అనే గ్రామాలు న్నవి. ఆలూరివరకు అడివినడమ భాట. ఆలూరుమొదలుకొని అడివిలేదు. దారిలో జలసమృద్ది గల బావులు, చెరువులు న్నున్నవి. పరిపొలాలు పొలకట్లు తీర్చియున్నవి.

కృష్ణానది దాటినదిమొదలు శెషాచలపర్వతము అదృశ్వమయినా అడుగడుగుకు చిన్న చిన్న పర్వతాలున్నవి. సృష్టిచేసిన పరమాత్ముడు ఆ కొండలు రాతిమీద రాయిని అతికియుంచినట్టుగా నొక కొండమీద నొక బండ యిమడక దొర్లునని తొచిన తావులలో పలకవంటి రాళ్ళను కొల్లేరులో చెక్కి చక్కచేసినట్టు ఉంచి యిమిడిచి యున్నవది. ఆ కొండల సమూహములను జూడగా భూమిని మొక్కాలు వాశి పర్వతమయముగా భగవంతుడు చేసినట్లు తోచుచున్నది. అన్ని పర్వతములను సృష్టించ డానికి ముఖ్యకారణ మేమని యోచించగా నీ భూగోళము ఉదకబుద్బుదము గనుక భూమిని స్థావరదశను పొందించేటందుకు ఈ పర్వతసమూహములను సృస్టించినట్టు తోచబడుచున్నది. పరమాత్ముని యొక్కలీలావిభూతియయిన యీవిచిత్ర పర్వత సమూహములున్ను నానావిధములయిన వృక్షాలున్ను కలిగిన అరణ్య సమూహాలు చూడగా బుద్ధి ఆశ్చర్య పడడానికి చాలియున్నది గాని ధృడమయిన భక్తిని పొందచాలక నున్నది. ఆపగలు అక్కడ నిలచినాను. ఆయూరు బస్తీయయినది. సంపన్నులయిన కోమటివసతి గదులున్నాయి. దేవస్థలమున్నది. అందులో దిగవచ్చును. రమణియ్యమైన కొలను వున్నది. అదిచుట్టు మంటపాలతో నేర్పరచ బడియున్నది. సకల విధవస్తువులు దొరుకును. ఆయూరున్ను ఇంకాముప్పై ఆరు గ్రామాలున్ను రాజగోపాలరావు అనే ఆరువేల నియోగి బ్రాంహ్మణునికి కొన్నితరాలుగా జమీను నడుచుచున్నది. మూడు లక్షల రూయాయీలు గోలకొండ నవాబుకు కట్టుచున్నారు. ఇప్పుడుపన్నెండు సంవత్సరముల చిన్నవాడు తల్లికి సహాయముగా దొరతనము చేయుచున్నాడు. ధర్మ సంస్థాన మని చెప్పబడుచున్నది. రాచూరు అనేయూరు వారికి రాజధానిగా నున్నది.

తేది ఉదయమయిన ఐదు ఘంటలకు లేచి మూడు కోసుల దూరములోనుండే నాగనపల్లె, బాలనగర మని రెండుపేళ్ళుకలిగిన యూరుపది ఘంటలకు చేరినాను. దారిమిక్కిలి సరాళము. గులక అయిసక కలిగిన రేగడభూమి. నడవ డానికి బండ్లకు మిక్కిలి సయిపుగా నున్నది. ఆయూరికి చుట్టున్ను కోట యున్నది. అది బాలచందు అనేముసద్దికి జాగీరుగానివ్వబడినది. అతడు బహుధర్మాత్ముడని పేరుబడి యశ, కాయముతో ఇప్పటికి జీవింపు చున్నాడు. అతనికి మొగసంతులేదు. అల్లునికి జాగీరు నదుచుచున్నది. ఆకోటనున్ను, గ్రామమునున్ను బహుబస్తీచేసియున్నాడు గనుక ఇదివరకు చూచిన యనేకములయిన కోటలలో ఈకోట గచ్చుచేసి చూపుకు బాగా ఉన్నది. బహుబస్తీ గ్రామము ఆ గ్రామములో నుండే యొక ఆడమనిషి అక్కడ ధర్మ శాలయని వాడుకొనే యొక సత్రము కట్టియున్నది. తిరుపతి వదిలిన వెనుక సత్రమనే మాట యిక్కడ విన్నాను. బాలచందు రెండు దేవాలయములు హరి హరాదులకు చేర్చి యొకటిగా కట్టి తోపువేసి సమీపమందు అగ్రహారముకట్టి యిచ్చివాటికన్నిటికిన్ని జీవనానికి పూర్తియయిన భూవసతి యేర్పచినాడు. అక్కడ భొజనము చేసుకొని మూడు సగం ఘంటలకు బయలు దేరి మూడు కోసుల దూరములో నుండే జానంపేట ఫరక్కూనగర మని రెండు పేళ్ళుకలిగి బస్తీ బజారువీధి కలిగియున్న గ్రామము ఐదు సగం ఘంటలకు చేరినాను. ఆ యూరు తురకలతో నిండియున్నది. ఒక గోసాయిచావడి గుడికి అంతర్భూతముగా నున్నది. దిగడానికి అదిన్ని, చావిళ్ళును తప్పవేరే యిండ్లలో స్థలము దొరకదు. నీళ్ళకు బహుప్రయాస, లోతుగల బావులు ఊళ్ళోఉన్నా మంచి యుధకము కాదు. దూరమునించి మంచినీళ్ళూ తెచ్చుకోవలసినది. పానగల్లు మొదలుగా ఆయూరివరకు బాట గుర్రపుబండ్లు వచ్చేపాటి విశాల మయి చక్కతనము గలిగియున్నా బాలనగర మనే యూరిముందర కొంచము రాతిగొట్టు. మిగతభాట బహుసరాళముగా నున్నది. పల్లములలో దిగి మిట్టలెక్కుచు భాట సాగిపోవలెను. సాధారణ మయిన యడవినడమ భాట పోవుచున్నది. ఆ జానంపేట వద్ద నొక కోటయున్నది. కడప వదిలిన వెనుక అప్రయత్న పూర్వకముగా శాకములు అక్కడి అంగళ్ళలో దొరకుచున్నవి.

ఈదేశాటనము ఛేసుటవలన దేహమునకు లాఘవము కలుగుట యనే లాభ మొక్కటి మాత్రమే కాక ద్రవ్య సాధ్యము కాని స్థలములలో పదార్ధము లెంతమాత్రమే కాక ధ్రవ్యసాధ్యము కాని స్థలములలో పదార్ధము లెంతమాత్రము దొరికినా అవి అపూర్వము లైనందున జీవాత్మునికి మిక్కిలి ప్రియ భొజ్యములుగా నుంచున్నవి. నానావిధ స్వభావములు కలిగిన మనుష్యులు ఇతర దేశపు జంతువులనున్ను, స్థావరములయిన శిలా వృక్షాదులనున్ను చూడడము జన్మాంతర సుకృతముచేత నొకవేళ భక్తి కలుగుటకు కారణము గావచ్చును. ఆ రాత్రి ఆ గ్రామమందు నిలిచినాను.

తేది ఉదయాన నాలుగు ఘంటలకు ప్రయాణమై ఆరు కోసుల దూరములో నున్న షాపుర యూరు పది ఘంటలకు చేరినాను. దోవలో పాలమాకుల యనే జలసౌఖ్యము గల గ్రామముమున్నది. ఆ పాలమాకుల వరకు భాట సరాళము. కొంత కొంత దూరము రాతిగొట్టుగా నున్నది. హలచలక వదిలిన వనక పర్వత సమూహముల దర్శనము దారిలో నిదివరకు లేదు. సాధారణమైన యడవినడుమ భాట పోవుచున్నది. ఆ గ్రామములో దిగి వాడికెపడిన మామిడితొపు జలవసతిగా నున్నందున అక్కడ భోజన మునకు దిగినాను. గ్రామమందు కావలసిన పదార్ధములు దొరకును గాని దిగను స్థలమివ్వరు. ఆత్మకూరు మొదలుకొని దిగడానకు దేవస్థలములుంటేనే వయివుగాని యండ్లలో స్థలమివ్వరు. ఇచ్ఫేపాటి విశాలమయిన యిండ్లులేవు.

ముసాఫరులు పరువు కావాలంటే డంభము వహించవలెను. ఆ డంభమునకు తగిన దాతృత్వము లేకుంటే లోకులు సంతోషింపరు. ఇంతే కాకుండా దోవలో విషయభోగములు నెక్కువగా ఆపేక్షించే కొద్ది వ్యసన మొక్కువౌచున్నది.

దూరప్రయాణము బోను మేనా సవారీలు తీసుకొనివచ్చేవారు సవారీలకు దండను ఆసరాచేసి కిందను మీదను నాలుగు ఇనపకమ్ములు బిగియింఛి యిస్కూలు చీలలు కొట్టక మునుపు బలమయిన మూలతగుళ్ళు కొట్టించి ఆ తగుళ్ళలో ద్వారములు చేసి వాటిలో యిస్కూలు చీలలు బిగియించవలెను. అటు చేయనందున నా బంగాళాపాలకీ దోవలోమోసుకొని వచ్చునప్పుడు ఆ చీలలు కొట్టిన తావున పలక చీలి పల్లకీ కిందపడుచు నుండెను. చీలిన చప్పుడు వినగానే నాబోయీలు పల్లకీని దిగువ దించినారు. దోవలో బావులు లోతుగా నుంటే నీళ్ళు చేదుకోవచ్చు నని తెచ్చిన సీమ సన్నతాడు ఇరవై బారలది వద్దనుండగా పయిన నాలుగు కట్లున్నూ చట్టానికి దిగువ నాలుగు కట్లున్ను చుట్టు బలముగా వేసి ముందు దండెకున్ను వెనక దండెకున్ను దిగువ ఛట్టముగుండా మూడు కట్లువేసి బిగించి ఇదివరకు భగత్కటాక్షము చేత ఆ పల్లకీ మీదనే సవారీ అయి వచ్చినాను కాబట్టి పల్లకీసవారీ అయి వఛ్ఛేవారు కొన్ని తాళ్ళు చాలక దోవలో నెక్కడ విచారించినా తాళ్ళు దొరికినవి కావు గనుక సాగనార నివృత్తిసంగమ మనే గ్రామములో తీసి బోయీలచేత తాళ్ళు పేడించి కట్టించినాను.

యింతే కాకుండా పనివారసమేతముగా దూరదేశము పొయ్యే వారు దారిలో అస్వస్థపడే పరిజనము ఆటంకపడి నిలవకుండా సాగి రావడానికి దినానికి మూడు ఆమడ దూరము నడవగల యొక గుఱ్ఱపు తట్టున నున్ను నాలుగు బోయీలలో నొక తేలికయయిన సామాన్యపు డోలీ నిన్ని కూడా తీసుకొని రావలసినట్టుగా నా యనుభవము నాకు తెలియ చెప్పినది. అదే ప్రకారము తిరుపతిలో రూపాయలు ఇరవై మూడు కి ఒక గుఱ్ఱపుతట్టువను తీసి కూడా తెచ్చినాను. అందరున్ను ఆరొగ్యముగా నుండే కాలములో తట్టువ మీదనున్ను డోలీలోనున్ను కావలసిన భోజన సామానులను అధికముగా చెయికావలికి వెసుకొని పోవచ్చును.

యింకా నా యనుభవము వలన తెలియవచ్చినది యేమంటే సపరివారముగా దేశము తిరిగేవారు చికిత్స చేసే క్రమము యధోచితముగా తెలిసిన వారిని కూడా పిలుచుకొని తగుపాటి యౌషధములు కూడా తీసుకొని పోవలసినది. ముఖ్యముగా అజీర్తికి జ్వరమునకు వ్రణాలకు గాయములకున్ను ఔషధాలు తీసుకొని పోవలసినది. ఆ ప్రకారముగానే నేను తెచ్చి నా వద్దనుండే ఔషధాలు నా బుద్ధిస్పురణద్వారా నాతో కూడా వచ్చిన వారికె ఇచ్చుచు వచ్చినంతలో భగవత్కటాక్షముచేత నా పరివారానికి వచ్చిన యుపద్రవములు నివారణ మవుచు వచ్చినవి. కూడా వఛ్ఛేవారికి నొక విధమయిన నిర్బయమున్ను తోచి యుండను. శీమమైనపువత్తు లెంత భద్రముగా నుంచినా తునకలుగా పగులు చున్నవి గనుక బంగాళా నాటువత్తులే దారికి యోగ్యము లని తెలుసుకొన్నాను. అణాలు, అర్ధణాలు, పావులాలు చెన్నపట్టణపు దుడ్లు కడప విడచిన వనుక దొరకవు. కూడా తెచ్చియుంటే వెండినాణ్యములు మాత్రము పనికివచ్చుచున్నవి. కృష్ణ కవతలి పయిసాలు కృష్ణ కీవల పనికిరావు. కృష్ణకు నుత్తరమున అణాలున్ను పనికిరావు.


మూడవ ప్రకరణము  హైదరాబాదు

ఆషాపురము మూడు ఘంటలకు వదిలి రాత్రి ఎనిమిది ఘంటలకు ఆరు కోసుల దూరములోనుండే హయిదరాబాదు షహరు ప్రవేశించి షహరుకు సమీపమందుండే బేగంబజార అనే పేటలో నొక తోటలోని బంగాలాలో దిగినాను. ఆ షాపురము వదలిన వెనక రెండు కోసుల దూరములో షంషాబాదు అనే బస్తీ గ్రామము కోటసహితముగా నొకటి యున్నది. అదివరకు దోవసరాళము. లొగడి మజిలీ భాటవలెనే ఒకటి గడియదూరము మిట్టయెక్కుచు గడియ దూరము పల్లములో దిగుచు దారిని నడవవలసినది. షంషాబాదు మొదలు చిన్నతిప్పలు దారికి నాలుగు పక్కలా అగుపడుచు వచ్చును. దారి కొంచెమయిన రాగిగొట్టుగలది. దగ్గిరదగ్గిర చిన్న గ్రామాలున్నవి. అనేక మశీదులు చూచుచు పోవచ్చును. చిన్న చెరువులు కొన్నియున్నవి. వాటికింద మామిడితోపులున్ను, కూరగాయల తోటలున్ను వేసియున్నవి.

ఆ దినము మొహర్రం అనే పండుగ ఆరంభ మయినది. ఆ తొమ్మిదో దినము ఆ షహరుకు కంచికి గరుడసేవ ముఖ్యమైనట్టుగా ఆ మొహర్రం పండుగ ప్రబలమైన యుత్సవము. ఆ యుత్సవ కాలములో పరమ్మాత్ముని చైతన్యము ఆ షహరులో వెక్కువగా ప్రకాశించుట చేత అనేక వేలమంది యితర మతస్థులుగా నుండేవారు కూడా షహరుకువచ్చి ఆతొమ్మిదోదినము మొదలు ఆఖరువరకు నుంచున్నారు. సకల విధములయిన యారాధనలను అంగీకరించి యాదృశీ భావనా యత్ర సిద్ది భ్రవతీ తాదృశీ అనే వచన ప్రకారము లోకుల యిష్టసిద్ధిని చేసే పరమాత్ముడు ఒక్కడే గనుక ఆ యుత్సవ కాలములో పరమాత్ముని చైతన్యము అక్కడ ప్రతిఫలించుటచేత ఆ స్థలముఆ కాలమందు పుణ్యస్థలమని భావించి అక్కడ వట్టికాలమందు నన్ను ప్రవేశ పెట్టినందుకు నీశ్వరుని చాలా కొనియాడడ మయినది.

తేది రాత్రి మొదలు జూలాయి నెల రెండు తేదీ సాయంకాలము వరకు హయిదరాబాదు షహరుతో చేరిన భేగంబజారులో నున్నాను. ఆ రాత్రిమొదలు జూలాయి పదమూడు తేది రాత్రివరకు శికందరాబాదు అనే పేరుగలిగిన యింగ్లీషువారి దండు ఉండే బస్తీకి సమీపముగా నున్న కాకాగూడ మనే బొమ్మదేవరు నాగన్నతోట చావడిలో నుంటిని.

హయిదరాబాదు షహ్రుకుచుట్టు బేగంబజారు అనే బస్తీయొకటి యున్నది. అందులో సాహుకర్ల కొఠీలు కలవు. అది షహరు కంటే వాసయోగ్యము. అక్కడికి కోసెడు దూరములో కారువానా అనే బస్తీ యొకటి యున్నది. అది రత్నాలు వగయిరా అమ్మే వర్తకులుండే స్థలము. ఆ బేగంబజారుకు చేరినట్టు యింగిలీషు రెసైడెంటు వారి ఖర్చుక్రింద విస్తారముగా నున్ను అలంకారముగా నున్ను ఒక హవేలి చుట్టున్ను లోకులున్ను వర్తకులున్ను ఇండ్లు కట్టుకొని యుండుటచేత నొక పెద్ద బస్తీ అయినది. ఆ స్థలము పేరు చంద్రఘాటు అనుచున్నారు.

షహరు లోపల షాలీబండ అనే పేరు కలిగిన యొక పేట యున్నది. ఆ స్థలమందు అక్కడి బ్రాంహ్మణులు ఇండ్లు కట్టుకొని కాపుర మున్నారు. దివాన్ పేష్కారు చందులాలు అక్కడ ఇండ్లు కట్టుకొని కాపురమున్నాడు. నిజాందేవిడి షహర్ నడమనున్నది. అనేకులయిన పెద్దమనుష్యులు, నిజాం వంశస్థులున్ను షహరు నడమ కాపురమున్నారు. షహరునడమ మక్కామజ్జీత్ అనే యొక తురకల్ జపశాల యున్నది. దాని స్థూపీలు రెండు మొలాము చేయబడి యున్నవి గనుక బహుదూరానికి తెలియుచున్నవి. మశీదుకు నెదురుగా లోగడి దివాన్ మీరాలం అనేవాడు కట్టించిన కారంజీలు లోతుగా నున్నవి. వాటికి సమీపముగా చౌకు అనే పేరుగల గుజిరీ అంగడి యొకటిన్ని, బట్టల యంగళ్ళు, పాత్రసామానుల యంగళ్ళున్ను ఉన్నవి. నాల్గు దోవలు చేరడానకు గాను కట్టిన యొక గొప్ప స్థూపీ గలిగి నాలుగు ద్వారాలు దానాకు కట్టిన యొక గొప్ప స్థూపీ గలిగి నాలుగు ద్వారాలు గలిగిన యొక చావడిన్ని యున్నది. షహరులో రాజవీధులయందు గుండురాళ్ళు పరచియున్నవి. అట్టి వీధులలోనుండే కశ్మలమయిన యడుసులో నడిచేవారి పాదాలు పూడిపోవుచున్నవి. ఇండ్ల యలంకారమున్ను సందులకు సందియున్ను యితర దక్షిణదేశపు షహరులలావాసముచేసే వారికి ఇష్టముగా నుండవు. రాజవీధులలో ఏనుగులు మొదలయిన వాహనాలు యెల్లప్పుడు సంచరింపు చున్నవి గనుక నున్ను మనుష్యులందరున్ను, ఆయుధపాణులై మెత్తని వారిని కొట్టి నరుకుచున్నారు గనుక నున్ను, షహరులో ఇతర దేశస్థులు సవారీమీద పోయి రావలసియుంటే ఆయుధపాణులైన వాక్పారుష్యము కలవారిని కొందరిని కూడా పిలుచుకొని పోవలసి యున్నది. కృష్ణానది దాటినది మొదలు హైదరాబాదు వరకు ఫకీరులు నిండియున్నారు గనుక సవారీమీద నెవరు వచ్చినా అడుగడుగునా ఫకీరులు భిక్షం అడగక మానరు. వారికి కొన్ని గవ్వలయినా యిచ్చి పోకపోతే అవమానము తోచుచున్నది. చెన్నపట్టనపు రూపాయి ఒకటి కి అక్కడి పయిసాలు యాభై పయిసా ఒకటి కి ఇరవై పుంజీగవ్వలు. పుంజీ ఒకటి కి గవ్వలు నాలుగు. యీ హయిదరాబాదులో పిచ్చిరూపాయిలని యొక దినున్ను గోవింద బఖ్షీలని యొక దినుసున్ను చెలామణి యవుచున్నవి. ఆ రూపాయలు ఒకచేతి నుంచి యొక చేతికి వచ్చేటప్పుడు యొకటి రెండు పయిసాలు నట్టమియ్యకనే చెలామణీ కానేరదు. చెలామణీ రూపాయలకు అక్కడివారు చేసే పరీక్ష అసదృశ మయినది. ఎట్టి రూపాయిలకయినా ఒక దోషము పెట్టకమానరు. చన్నపట్టణపు కంపెనీ రూపాయలకు ఆ తొందరలేదు. అయితే అవి దొరకవు. మరి అక్కడి రూపాయలకు రూపాయి ఒకటి కి పయిసాలు ఇరవై.

ఈషహరు గోడకు చేరినట్టుగా ముసి అని అక్కడి వారిచేత చెప్పబడుచున్న ముచుకుంద నది పారుచున్నది. ఆ నది వాడపల్లెవద్ద కృష్ణలో కలియుచున్నది. అది గొప్పనది. పోయినసంవత్సరం నదీప్రవాహము ఎక్కువగావచ్చి డిల్లీ ధరవాజవద్ద యింగిలీషువారు కట్టిన వారిధిని పగలకొట్టి ఆ షహరులో కొన్నివీధులున్ను, బేగంబజారులో కొన్నివీధులున్ను ముంచివేసి పోయినది. బేగంబజారుకున్నూ, షహరుకున్నూనడమ ఆ నది దాటుటకు పూర్వకాలమందు తురకలు మంచిరాళ్ళతో అతి బలముగా నొక్క వారధి యేనుగలు మొదలయినవి గుంపుగా నెక్కి పోవడానకు యోగ్యముగా కట్టినారు. ఆ షహరు చుట్టున్ను చిన్న తిప్పలున్నవి. కొండలు మెండు. అనేక తిప్పలు కొనల యందు మశీదులు కట్టబడి యున్నవి. హిందూ దేవాలయాలు లేవు. అవి యున్నా వృద్ధికి రానియ్యరు.

షహరుకున్ను ఇంగిలీషుదండుకున్ను రెండు కోసుల దూరమున్నది. నడమ హుశేనుసాగర మనే పేరుగల యొక చెరువున్నది. ఆకట్టమీద యింగిలీషువారు గుర్రపుబండ్లు పొయ్యేటందుకు యోగ్యముగా భాట ముచ్చటగా చక్కచేసి మొగలాయి వాహనాలున్నూ మనుష్యులున్ను ఎక్కినడచి చెరచకుండా భాటకు ఇరు పక్కల తమ పారా పెట్టియున్నారు. జాతులవాండ్లను తప్ప ఇతరులను ఆ కట్టామీద హుకుములేక ఎక్కనియ్యరు. ఈ జాతులవారిని సరంగీలని ఏలచెప్పుచున్నారంటే ఫిరంగీలతొ సహవాసము చేసేవారు గనుక ఫిరంగీవారని ఆభాసముగా అనబడుచున్నది. కంపెనీ లష్కరు ఉండే స్థలము హయిదరాబాదుకంటే నానాటికీ ఎక్కువగా బస్తీఅవుచున్నది. ఇరవై సంవత్సరముల క్రిందట నేను చూచినదాని కంటే మిక్కిలి బస్తి అయియుండుటను చూడగా ఆశ్చర్యముగా నున్నది. షహరులో వస్తువులకు సుంకకులేదు. ఏవ్స్తువు మీద సుంకానికి ఎవడు ఊహించి దర ఖాస్తుచేసినా దినాంజీ ఆ సుంకము గుత్తకు ఇచ్చుచున్నాడు. కట్టెల బండ్లకు, విస్తరాకులకున్ను, షహరులో రావడానికి నాలుగయిదు తీరువలు తీరువ తీనేవాని జోరావరి కొద్దిన్ని ఇవ్వవలసి యున్నది. చంపినా అడిగేదిక్కులేదు. యింగిలీషు దండులో ఈ తొందరలు లేకుండా న్యాయవిచారణ కూడా కొత్తవాల్ చావడిలో కమ్మిస్సేరైయాటు అసిస్టాంటు గుండాజరుగుచున్నది. గనుక లోకులున్ను వర్తకులున్ను ఆదండులో వసించడానికి మిక్కిలి ఇచ్చయింపు చున్నారు. అక్కడి యిండ్లకంతా ఎన్నిమిద్దెలు అంతస్తులుగా కట్టినా స్తంభాల మీద పయి పూరి మోపుచేసి మట్టి గోడలుపెట్టి, ఆ గోడల పయిన నాజూకుగా సన్నగారచేసి కావలసినట్టు చిత్రములతో పూయుచున్నారు. అక్కడి గులక కలిసిన యెర్రరేగడ మిక్కిలి గట్టిగా నుంచున్నది.

యింగిలీషు దండులో నేను దిగిన స్థలము వాసయోగ్యము. ఆ షహరుకు చుట్టునుండే భూమి బహు సారవత్త మయినది. ఏవృక్షము వేసినా అరి వీర్యముతొ పయిరయి వచ్చుచున్నది. అయితే పయిరుపెట్టే శ్రద్ధ యెవరికిన్ని రెండు కారణములచేత లేదు. మొదటి కారణమేమంటే బీదలయినవారు ఏచెట్టువేసినా వాటిఫలమును క్షేమముగా, ఆయుధాలే ఆభరణాలుగా నుంచుకొని దర్పమేయశస్సుగా భావించుకొని యుండే లోకులు అనుభవించ నియ్యరు. రెండో దేమంటే ఉపపన్నులు తోటలు వనాలు వేసుకొనవలె నంటే రాజకీల్యము లయిన విత్పరంపరలు అప్పుడప్పుడు వారికి కలుగుటచేత ఆ సుఖము ననుభవించ డానికి ప్రాప్తిలేక నున్నది. ఇంతకున్ను ఓర్పుచేసిన చెట్లు బహుబాగా అయియున్నవి. చోటా అరంజీపండ్లు విస్తరించి కలవు. సకల విధములయిన పండ్లున్ను, అరటిపండ్లు దప్ప మంచివిగానే దొరుకును. అయితే అతిప్రియము. చెన్నపట్టణము కంటే మూడింతలవెల యివ్వవలసినది. కూరగాయలు ఆ ప్రకారమే ప్రియములయినా మహా రుచికరములుగా నున్నవి. వస్త్రాలు, ఆభరణాలు, శిఫాయిలకు లాయఖు అయినవి, ఆ షహరులో దొరుకును. భారీరత్నాలు కొనేపాటి యుత్సాహధైర్యము లెవరికిన్ని లెనందున వర్తకులు తేవడములేదు. ఆభరణాలు వగయిరాలు ఉంచుకొని విక్రయించేవారు తమ పాపు నిమిత్తమై కొంత శిబ్బందిని వుంచుకొన వలసి యున్నది. తద్ద్వారా ఒక గొప్పగౌరవము వారికి గలుగుచున్నది. అందువలన రత్నాలు, నగలు, కావలసిన గొప్పవారు వారియింటికి పెళ్ళి, వారిని పిలిపించుకొని కావలసినది వారు చెప్పిన ధరకు పుచ్చుకొని తమకు సమ్మతి అయినప్పుడు ఖరీదు నిచ్చుచున్నారు. వర్తక సరణిగా అట్టి గొప్ప వస్తువులు కొని అమ్మడము లేదు. సాత్విక ప్రభుత్వముకల రాజ్యములో మెదిగినవారికి ఆ షహరులో ఉనికిన్ని, ఆరాజ్య సంచారమున్ను, భయప్రదములుగా నుంచున్నవి.

ఆ షహరు మూడు కోసుల దూరములో గోలకొండ అనే ప్రదేశ మొకటి యున్నది. అక్కడ బలమైన కోటయున్నది. అందులో నిజాముయొక్క, అంత, పుర స్త్రీలు సంస్థానము యొక్క మూలధనముతో కూడా ఉన్నారు, అందులో విస్తరించి గృహములు కట్టుకొని మనుష్యులు కాపురమున్నారు. ఆ షహరులో పెద్దమనుష్యులు ఆనందము కొరకు చేసుకోవడ మేమంటే ఒకబగీచా అనే చిన్నతోటవేసి, అందులో జలధారలు పయికిలేచే కారంజీలు, కట్టి యుంచుకొనుచున్నారు. ఆజల సూత్రాలు అలమారముగానే యుంచున్నవి.

అక్కడి రాజ్యూతంత్రము జరిపే క్రమమంటే పూర్వకాలమందు డిల్లీ పాదుషాను, శిఫాయి ధర్మముచేత సంతోషపెట్టి, ఆరాజ్యమును జాగీరుగా పుచ్చుకొన్న ఆనవాబు వంశస్థులు ఇప్పుడు రాజ్యము చేయుచున్నారు. యింతకు మునుపు షౌలరుజంగు అనే అతడు దొర తనముచేసి, సంవత్సరము కిందట చనిపోయునాడు. అతిని కొడుకులలో నొకడయిన నానద్దౌలా అనే అతడు ఇప్పుడు కంపెనీవారి సహాయము చేతకట్టుకొని ప్రభుత్వమును వహించి యున్నాడు. ఈ నవాబు కింద ఒక దివాన్ జాగీరు అనుభవింపు చున్నాడు. అతని కింద ఒక పేష్కారు సకల రాజ్య తంత్రము విచారింపు చున్నాడు. ఉండే రాజ్యమంతయు నవుకరులయిన అమీరు ఉమరాలనె పెద్దమనుష్యులకు జాగీరులుగానున్ను, పారంపర్యముగా ప్రభుత్వము చేసేవారికి జమీనులు గానున్న, భాగించి జమీనుదార్లవద్ద మాత్రము సాలుకు ఇంత మాత్రమని రూకలు వసూలుచేసుకొను చున్నారు. అమానిగా తాలూకాల నుంచుకొని మామిలియ్యతు వ్యహారమును జరుపు కోవడము నిండా లేదు. వారి వారి అధీనముగా నుండే భూమికి వారు వారు పూర్ణమయిన స్రాతంత్ర్యము గలిగి ఆయా భూములలోని కాపురస్థులను భర్త భార్య మీద చెల్లింఛే అధికారము కంటే ఎక్కువయిన అధికారముతో నేలుచున్నారు. ఆనావాబు పెద్దల వద్ద నలభై సంవత్సరముల కిందట కంపెనీ వారు స్నేహమూలకుగా ప్రవేశించి ఆరు పటాలాలను, వారి తయినాతిగా శికందరాబాదు అనేస్థలములో ప్రవేశపెట్టి, వకీలు భావనగా నొక రెసైడెంటును అక్కడ నిలిపినారు. ఆ పటాలాలవద్ద జాగీరుగా కంపెనీవారు పుచ్చుకొని యిప్పటికిన్ని అనుభవింపు చున్నారు. క్రమక్రమముగా రాజ్యతంత్రములో ఏ పని జరిగించవలసి వచ్చినా రెసైడెంటు అనుమతిలేక జరిపింఛె వాడికెలేని ఘట్టము ఇప్పట్లో పొసగి యున్నది. తమకు రూకలు కట్టని బలవంతులయిన జమీనుదారులవద్ద సాలేనా పయికము వసూలు చేసుకొనేటట్టు కందనూరు నవాబు రాజ్యము కంపెనీవారి యధీనము చేసినట్టే, కొద్ది కొద్దిగా చేయుచు వచ్చుచున్నారు. అటువంటి జమీందారులవద్ద కంపెనీ వారు రూకలు వసూలుచేసి నిజాముకు ముజరా యిప్పించుచున్నారు. సదరహి ఆరు పటాలాలు గాక నింకా పన్నెండు పటాలాల పర్యంతము రిసైడెంటు మూలకముగా ఆ నవాబు దివాన్ ఫేష్కారు యిచ్చుచు, రూకలు కట్టని జమీదారుని మీదికి కావలసినప్పుడు కావలసిన మట్టుకు ఆ ఫౌజును పంపించుచు వచ్చుచున్నారు. ఇప్పుడు దివాన్ ఫెష్కారు చేసే చందులాలా సదరహీజాస్తి పటాలాల జీతానికి గాను నెల ఒకటి కి సుమారు మూడు లక్షల రూపాయలు యిచ్చుచున్నాడు.

యిదిగాక నవాబు మనోవర్తి ఖర్చులకు గాను నెల ఒకటి కె మూడు లక్షల రూపాయలు ఇవ్వవలసి యుంచున్నది. ఇంతేకాక నజురుయినా యతులుగా కొంత సెలవు చందులాలుకు తగులుచు వచ్చుచున్నది. ఇది పోగా మిగిలిన వస్తువులు ఆ దివాన్ పేష్కారు చేసేవాడు సమ్మతమైన వ్రయము చేసుకొనుచు వచ్చుచున్నాడు. ఆ వ్రయములు చెయ్యడమునకు రాజ్యములో అయ్యే వసూలు చాలక దివాన్ పేష్కారు అప్పులతో తహతహ పడుచున్నాడు. ఆ నవాబు రాజ్యమంతా కంపెనీ వారివల్ల చాలా భయమును పొంది యున్నది.

యిటువంటి షహరు ఇరవై తేదీ ఉదయాన నాలుగు ఘంటలకు వదిలి మూడు కోసుల దూరములో నుండే మేడిచెర్ల అనేయూరు ఐదు సగం ఘంటలకు చేరినాను. దోవ బహు సరాళము, గులక యిసకపొర, గుర్రపుబండ్లు నడవడానికి యోగ్యముగా నున్నది. బాటకు నిరుపక్కల సీతాఫలపు చెట్లయడవి, మనోహరముగా నున్నది. మేడిచెర్ల యూరి ముందర నొకటి రెండు వాగులు దాటవలసి యున్నవి. అవి వర్షాకాలమున ప్రవాహము వస్తే దాటుటకు నొకటి రెండు దినములు కావలసియున్నది. ఊరు పెద్దది, కావలసిన వస్తువులు దొరుకును, అంగళ్ళు చాలా యున్నవి.

నేను చెన్నపట్టణము నుంచి వచ్చేటప్పుడు కొలువుగా పెట్టుకొని తెచ్చిన ఆరు మంది బంట్రౌతులు గాక కడపలో నాలుగు మరాటి బంట్రౌతులను కొలువులో పెట్టినాను. హయిదరాబాదులో నెక్కువగా నాలుగు మందిని కొలువు పెట్టినాను. వీరికంతా జనము ఒకటి కి నెల ఒకటి కి రూపాయలు ఏడు లెక్కను జీతముచేసి నేను చేసిన ఖాయిదా యేమంటే కాపాడవలసిన మూల పదార్ధము సహజముగా యజమానివద్ద నుండే పెట్టెలలో నుండు ననే తాత్పర్యము లోకులకు ఉండవలసినదే గనుక అటువండి తాత్పర్యముతొ అయోగ్యులు ప్రమాదమును చేతురని తలచి నామూల ధనము క్షేమముగా నుండుట కొరకు మూలధనపు పెట్టెలను సవారీలలో ఉంచి సవారీ తలుపులకు బిగాలు వేసి సవారీలను ఊళ్ళలో దూర ప్రదేశపు చావిళ్ళలోనున్ను, ముసాఫరు ఖానాలలో నున్ను, మశీదులలో నున్ను ఉంచి యిద్దరేసి బంట్రౌతులను జాముకు ఒక జతగా పారాయిచ్చే బట్టు ఆరు మందిని నిశ్చయించి బోయీలను జాగ్రత్తగా కూడా ఉండేలాగు దిట్టము చేయుచూ వచ్చినాను. సామాను కావడి పెట్టెలను నేను దిగేస్తలములో ఉంచి అక్కడ జాముకు ఒకడు వంతున పారాఉండే లాగు ముగ్గురు బంట్రౌతులను ఉంచుచు వచ్చినాను. హయిదరాబాదులో పాల్ లు అనే శిఫాయి డేరాలు నాలుగు తీసినందున అవి మోయను నాలుగు యెద్దులున్ను ఆడేరాలలో చెమ్మగిలకుండా వేసే కీలు చాపలు మోయను ఒకయెద్దున్ను, ఆడేరాల మేకులు రెండు వందలు మోయను ఒక ఎద్దున్ను, అంతు ఆరు యెద్దులున్ను ఎద్దు ఒకటి కి నెలకు రూపాయలు ఎనిమిది లెక్కకొలువు పెట్టి తీసుకొని వచ్చినాను. మూడు యెద్దులకు నొక మనిషి వంతున ఇద్దరు యెద్దుల వాండ్లు కూడా వచ్చినారు. ఆడేరాలు కట్టనున్ను, తియ్యనున్ను ఇద్దరు కళాసులను నెలకు ఒకటి కి మనిషి ఒకటి కి రూ. లెక్కను సంబళానికి కొలువు పెట్టుకొన్నాను. ఆ డేరా బొంగులు ఎద్దులు మోయవు గనుక మోయను ఒక మనిషిని ఆరు రూపాయల జీతము నిష్కర్షము చేసి కొలువు పెట్టి నాలుగు డేరాల బొంగులు పదిన్ని సదరహి యిద్దరు కళాసులచేతనున్ను, సదరహి మనిషి చేతనున్ను మోయించుకొని వచ్చినాను. ఇంతేకాక హయిదరాబాదు నించి నాగపురికి పొయ్యేదారి బహు అడివిన్ని, మృగ భయమున్ను, చోరుల యుపద్రవమున్ను కలిగినది గనుక దారిబాగా తెలిసే కొరకు హయిదరాబాదు రెసై డెంటు వద్దనుండే పోష్టాఫీసు రయిటరు మేస్తరు ల్యూమ అనే పరంగి వాని మంచి తనము చేసుకొని ఒకరన్నర్సు అనే టప్పాల మనిషిని కూడా పిలుచుకొని అక్కడక్కడికి రన్నర్సు మనుష్యులు వారి వారిహద్దు వరకు నాతోకూడా వచ్చి దారి చూపించేటట్టు దిట్టము చేసుకొన్నాను. ఆ తపాలా రన్నర్సులను ఇక్కడ హరకాలని వాడుచున్నారు. వారిని కంపెనీ యిలాకా మనుష్యు లని ఆయా యూళ్ళలో గౌరవపరచు చున్నారు.. తద్ద్వారా యీ యుపాయము నేను చెయ్యడము మిక్కిలి అనుకూల మయినది గనుక ఆ రన్నర్సుకు ఒకటి రూపాయి దనుక ఇచ్చుచు పుసలాయించి ఒక మజిలీ నుంచి మరియొక మజిలీకి పిలుచుకొని వచ్చినాను. ఆకృష్ణ దాటినది మొదలు ఆ దేశములో కాకులు విశేషముగా లేవు. ముఖ్యముగా హయిదరాబాదు షహరులో ఒకటియైనా కనుపడినది కాదు. డెగలు పెంచేవారు విస్తరించి యున్నందున షహరులో వుండే కొన్నిటినిన్ని బ్రతకనియ్యరని తోచుచున్నది. ఆ రాత్రి అక్కడే నిలిచినాను.

తేదీ ఉదయాన మూడు ఘంటలకు బయలుదేరి రెండు కోసుల దూరములో నుండే మాషాపేట అనే యూరు పన్నెండు ఘంటలకు చేరినాను. దోవ నిన్నటి దోవవలెనే రమణియ్యముగ నున్నది. ఇరు పక్కలా జీడిచెట్లు, టేకుచెట్లు, మోదగచెట్లు, మొదలయిన వృక్షములు గల యడివి భూమి, సమ మయినది. ఆ మాషాపేట గొప్పయూరు. పేటస్థలము, సకలపదార్ధాలు దొరుకును. అక్కడ ఆరాత్రి నిలిచినాను. ఆయూరు వర్షాకాలములో మిక్కిలి బురద కలిగి చిత్తడిగా నుంచున్నది. హయిదరాబాదు వద్ద హుశేనుసాగర మనే చెరువు మొక ప్రకారము దిగిన గ్రామము నుంచి అవతల దిగిపొయ్యే గ్రామనునకు పంపుచు వచ్చినాను. ఆరాత్రి దేవాలయములో చేరిన భ్రాంహ్మణ గృహమందు నిలిచినాను.

తేదీ ఉదయాన మూడు ఘంటలకు బౌయలుదేరి అక్కడికె ఐదు కోసులదూరలో నుండే కామారెడ్డిపేట పది ఘంటలకు చేరినాను. కృష్ణదాటినది మొదలుగా ఆ బిక్కనూరిపేట పర్యంతము దోవ గులక యిసక కలసిన గట్టిరేగడభూమి. ఏకాల మందున్ను నడిచేవారికి ఒక శ్రమమున్ను ఇయ్యదు. ఆ భిక్కనూరుపేట వదిలినది మొదలు కామారెడ్డిపేట చేరే పర్యంతము కాలుదిగబడే నల్ల రేగడ భూమి, వర్షాకాలములో మిక్కిలి అడుసుగా నుంచున్నది. యెండాకాలములో ముండ్లవలెనే నడిచే వారికి గుచ్చుకొనుచు, కొంతదూరము భాట గులక యిసక పరగా నుండినా యీ నల్ల రేగడ భూమిలో పడే ప్రయాస అసౌఖ్యమును జ్ఞాపకానికి రానియ్యదు. దోవలో కొన్ని వాగులు దాటవలసి యున్నవి. ఆ కామారెడ్డిపేట వసతి యయిన గ్రామమే. అంగళ్ళు కలవు. అన్ని పదార్ధాలున్ను దొగుకును. భ్రాంహ్యణగృహమందే దిగినాను. చెరువు వున్నది. జలవసతి గలదు. కృష్ణదాటినది మొదలుగా ప్రతిగ్రామములో నున్ను బియ్యము మంచిదిగా దొరుకు చున్నది. వడ్లపయిరు విస్తరించి హయిదరాబాదు మొదలుకొని పండుచున్నది. ఆరాత్రి అక్కడ వసించినాను.

తేది ఉదయమున మూడు ఘంటలకు ఆ యూరు వదిలి అక్కడికి నాలుగు కొసుల దూరములొ నుండే మల్లుపేట అనే గ్రామము పది ఘంటలకు ప్రవేశించినాను. దోవనిన్నటికన్నా యెక్కువయయిన నల్లరేగడ్దభూమి. బహులోతుగల వాగులున్ను, చెరువు మడుగులున్ను దాటవలసి యున్నది. ఆ గ్రామము ఖిల మయినది. యధోచిత ముగా ముసాఫరులకు కావలసిన సామానులు దొరుకును. దిగడానికి స్థలము లేక ఆ గ్రామమందు మూడు డేరాలు ఒక చావడివద్ద కొట్టించి దిగినాను. హయిదరాబాదు దాటినది మొదలు ప్రతి గ్రామానికిన్ని కోటలు బలమయినవి లేవు. కొన్ని కొన్ని గ్రామాలలో బురుజులు మాత్రము కట్టించి యుంచుతారు. ఆ మల్లుపేటలో ఒక పాడుకోట యున్నది. చెరువు జలసమృద్ధి గలది. ఆ గ్రామములో రాత్రి వసించినాను.

తేది ఉదయాన ఏడు ఘంటలకు బయలువెళ్ళి పదకొండు ఘంటలకు ఐదు కోసుల దూరములోనుండే యీదలవాయి అనే రామస్థలము చేరినాను. ఆ యూరు చీలి జమీందారునితో చేరినది. గుడి చక్కగా కట్టి యుండక పోయినా దక్షిణదేశపు మర్యాద ప్రకారము ఆ జమీను దారుడు గుడిలో సకల రాజోపచారములతో ఆరాధన నడిపింపు చున్నాడు. గుడిచుట్టు ముప్పై ఇండ్లుగల బ్రాంహ్మణుల యగ్రహారమున్నది. ఈతురకల రాజ్యమందు ఈస్థలము కుంపటిలో దామర మొలచి నట్టున్నది. తిరుపతి వదిలిన వెనక రాజోపచారములతో ఆరాధన నెడిచే గుడి యిది యొకటే చూచినాను. నా విచారణలోనున్ను వేరేలేదని తెలిసినది. ఈయూరు యధోచితముగా బస్తీగానే యున్నది. కావలసిన సామానులు దొరుకును. ఇక్కడి గుడిలో ప్రతిఫలించి యున్న పరమాత్ముడు ఈ జమీనుదారుని వంశస్థులకు పిలిచితేప లుకు ననేనాటి యనుగ్రహముతో ఆరాధనలు గైకొనుచున్నాడు. మల్లుపేట వదిలిన వనక కోసెడు దూరానికి ఇవతల యీదలగండి అనే దట్టమయిన అడివి యున్నది. రెండు కొంచపాటి తిప్పల నడమ భాట పోవుచున్నది. భాట బహురాతిగొట్టు, నల్లరేగడ భూమి. బహుచోర భయము గలది. మిక్కిలి భయంకరులయిన యింగిలీషు దొరలనే యీదలగండి భాటలో దోచినారు. నేను మల్లుపేట నుంచి ఆయుధసాణులను కొందరిని కూడా తీసుకొని నాతోకూడా వచ్చిన మనుష్యులను యుద్దసన్నద్దులుగా దిట్టము చేసుకొని గండి దాటి వచ్చినాను. దీనిపేరు యీదల్లఘాటు అని చెప్పుచున్నారు. నడమ వాగులు దాటవలెను. అదిన్నిగాక యీదలవాయి యూరినందు పర్షాకాలములో చెరువులో నుంచి మిక్కిలి వేగముగా పారుచునున్న బహులోతు గల రెండలుగు కాలువలు దాటవలెను. అక్కడ డేరామేకుల కంట్లము చెరువు మడుగు కాలువలు దాటేటప్పుడు కొట్టుకొని పోయినది. ఇట్టి భయ ప్రదేశములకు తుపాకులు బహుజరూరు గనుక కడపలో రెండు తుపాకులు తీసుకొన్నాను. హాయిదరాబాదులో కొల్వు పెట్టిన వారిలో అయిదుగురు తుపాకులు తెచ్చేటట్టు నిశ్చయము చేసినాను. ఆ గండిలో నడిచే టప్పుడు అక్కడక్కడ తుపాకీలు కాల్చుచు రావడ మయినది. మల్లుపేట మొదలుగా యీదలఘాటు చేరేపర్యంతము భాట నల్ల రేగడ భూమి, వెనుక భాట రాతిగొట్టు. ఆయీదలవాయి యూరిలో చీలి జమీనుదారుని తరఫున పట్టేలు అనే అధికారస్థుడున్నాడు. దేవాలయ విచారణను అతడే చేయు చున్నాడు. ఆయూరిలో ఇరవై మూడు తేదీ రాత్రి పర్యంతము నిలవడమైనది.

తేదీ ఉదయమున మూడు ఘంటలకు యీదలవాయి వదిలి అక్కడికి రెండు కోసుల దూరములోనుండే జగనంపల్లె అనే గ్రామము పన్నెండు ఘంటలకు ప్రవేశించినాను. యీదలవాయి దాటినది మొదలు కొని కోసెడు దూరములో నుండే డిచ్చుపల్లె అనే మజిలీ గ్రామము చేరేవరకు ఒక చిన్నఘాటునడుమ మార్గము పోవుచునది. అయినా మొందర వదలివచ్చిన ఘాటంత భయము కలది కాదు. భాట సమభూమి. గులక యిసకపొర. కొంచెము రాతిగొట్టు, ఇరుపక్కల మోదుగ చెట్లు వగైరాల యడినవి. ఈ డిచ్చుపల్లెలో యీదలవాయిలో నుండే రామమూర్తిని ప్రతిష్టచేసే నిమిత్తమై పూర్వమందు గొప్పదేవాలయము కట్టినారు. అయితే వాసానికె యోగ్యముగాదని తోచి పరమాత్ముడు కొన్ని లోకదృష్టాంతముల చేత తెలియచేసి యీదలవాల్యిలో యిప్పుడు ఆరాధనలు గైకొనే మూర్తులను స్తాపింపచేసినాడు. ఇప్పటికిన్ని డిచ్చుపల్లెలో కట్టిన దేవాలయము పాడుగాఉన్నది. ఈడిచ్చుపల్లె మొదలు జగనంపల్లె కోసెడు దూరము కలదనే వరకు భాట సరాళము, గులక యిసకపర, నిండా అడివి లేదు, అవతలి కోసెడుదూరమున్ను ఘాటునడుమ పోవుచున్నది. భాట కిరుపక్కల దట్టమయిన యడివి. కొండలసందున భాట. ఈఘాటు నిండా భయాస్పద మయినది కాదు. ఇక్కడ మొగలాయి రాణావారు కొందరు తుపాకులతో కూడా ఉంచున్నారు. వారు వచ్చేవారిచేత


నాల్గవ ప్రకరణము  కృష్ణా గోదావరుల మధ్య దేశము

మనిషికి రెండేసి పయిసాలువంతున పుచ్చుకొను చున్నారు. యీఠాణావారు పాంధులను కాపాడే వారివలె అభినయించడమే గాని వేరుగాదని తెలిసియుండ వలసినది. ఈ జగనంపల్లెలో రెండు చిన్న దేవాలయాలున్నవి. రమణియ్యమైన స్నానఘట్టము కలిగిన చెరువున్నది. అంగళ్ళు కలవు. అన్ని పదార్ధములు దొరుకును. బ్రాంహ్మణుల యిండ్లలోనే దిగి నాను. యిక్కడికి నాలుగు మజలీల దూరములో వేములవాడ అనే మహాక్షేత్రమున్నది. అది భీమేశ్వర రాజేశ్వరక్షేత్రము. వేములవాడ భీమకవి జన్మప్రదేశము. ఈ ప్రాంతములో వ్యాఘ్రాలు పశువులను అప్పుడప్పుడు భాధింపుచున్నవి. ఆ రాత్రి జగనంపల్లెలో నిలవడమయినది.

తేది ఉదయమున ఆరు ఘంటలకు ఆ యూరువదిలి పన్నెండు ఘంటలకు అక్కడికి ఆరు కోసుల దూరములో నుండే దూదుగాం అనే ఊరు చేరినాను. అది గోదావరీ నదీతీరము. ఆరు భ్రాంహ్యణుల యిండ్లున్నవి. గోవదావరి కవతలి గట్టున స్వర్ణ అని చెప్పబడే భ్రాంహ్మణుల యిండ్లు గల యగ్రహారమున్నది. ఆ దినము నడిచిన భాట సరాళము, యిసకపొర, నిండా అడివి లేదు. జగనంపల్లె నుంచి యీదూదుగాముకు రెండు మూడు భాటలు కలవు. అందులో నేను వచ్చినభాట కొంచము చుట్టయినా వసతి యయునది. ఆర్మూరు అనే బస్తీ గ్రామము జగనంపల్లెకు రెండు కోసుల దూరములో నున్నది. ఆయూరి మీదనొక భాట పోవుచున్నది. అది వసతి కాదు. జగనంపల్లెకు నాలుగు కోసుల దూరములో బాలకొండ యనే గొప్పగ్రామము షహరువలెనే బస్తీగానున్నది. యేరస్తాగుండా జగనంపల్లెనుంచి వచ్చినా యీ బాలకొండ నడివీధిలో నడిచి రావలసినది. నేనువచ్చిన భాట శీదాగా బాలకొండకు మధ్య యేయూరున్ను తగలకుండా వచ్చుచున్నది. హయిదరాబాదు వదిలినది మొదలుగా పాలు, పెరుగు మాత్రము తంబళజాతి వారిగుండా ఊరూరిలో సమృద్దిగా దొరకును. కూరగాయలు మాత్రము ఈబాలకొండలో కండ్ల చూడవలసినదిగాని మధ్యదొరకవు. ఈయూరికి మూడు కోసుల దూరములో రామనపేట అనే యూరున్నది. అక్కడ మేనాసవారీలు గంజీఫాచీట్లు ఇవి మొదలయినవి చేసి హయిదరాబాదుకు తీసుకొనిపోయి అమ్ముచున్నారు. యీ యూరిలో జీనిగెలవాండ్లు అనేకులు ఉపపన్నులుగా నున్నారు.

ఈదేశములో కంబళ జాతివారు పుష్పాలు, పాలు, పెరుగు తెచ్చి యిచ్చి మేళాలు వాయింపుచున్నారు. మంగలజారివారు మషాల్ వేయుచున్నారు. బాలకొండకు ఇవతల కొసెడు దూరములో మూకలా అనెచిన్నగ్రామము, అదిదాటి యీదూదుగాముకు రావసినది. యిదినిండా బస్తీ అయినది కాదు. ఆర్మూరు పరగణాతో చేరినది. పట్టేలు గుమాస్తా ఉన్నాడు. నది దాటీంచే పుట్ల విచారణకర్త వాసముగా నున్నాడు. ఈయూరికి అవతలు తట్టున నుండే యూరు మాధ్వుల మయము. వారే తీర్థవాసులు. స్మాత్రులు నది యిండ్లవారు ఈ రెండూళ్ళలో నున్నారు. కావలసిన పదార్ధాలు యధోచితముగా దొరుకును. యీ దూదుగాముకు ఉభయపార్శవాలలో షహరులవంటి గ్రామాలు రెండున్నది. ఒక పక్క బాలకొండ సరేగదా గోదావరి నదికి అటుపక్క నిర్మల అనే షహ రొకటి యన్నది. ఈ రెండు స్థలములలో పట్టణములలో దొరికేలాగు సకల వస్తువులు దొరుకును. యీదలవాయి మొదలుగా దూదుగాము వరకు భాట యోగ్యముగా నున్నది. అడుసువల్ల, రాతిగొట్టువల్ల ప్రయాస నిండాలేదు. ఈగోదావరి తీరమందు తీర్ధవిధులు మొదలయినవి చేయడానికు నాలుగు దినములు ఉంటిని. హయిదరాబాదులో నున్న మట్టుకు అన్ని, దినములు అక్కడ వృధాగా నిలవవలసి వచ్చెగదా అనేవ్యసనము చాలావుండెను. ఇప్పుడుతర్వ్యతిక్తముగా మనస్సుకు బోధ అయినది. ఏలాగంటే అక్కడ నేను నిలిచియున్న సుమారు ఇరవై దినములున్ను ఈప్రాంతములలో క్షోణీపాత మయిన నష్టము, ఇరిగింటి మనిషి పొరిగింటికి పోకూడకుండా కురిసినందున చెరువులు కాలువలు పుష్కలముగా నిండినవి. ఆ వర్షాకాలములో నేను ఈ గ్రామాలలో తగిలి నట్టయితే మిక్కిలి ప్రయాస పడుదును. అటుగాకుండా శ్రీరాముల దేమో నన్ను కొన్ని కారణాలచేత హయిదరాబాదు షహరులో నిలిపినదీన్నికాక, షహరు విడిచి ప్రయాణమైన వనుక కూడా, ప్రతిదినమున్నూ నేను మజిలీచేరి భోజనము చేసిన వెనక సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు వర్షము కురిసి వెలిసేటట్టు కటాక్షింపుచు వచ్చెను.

హయిదరాబాదు వదిలింది మొదలు ఈగోదారి తీరము వరకు నడమనుండే జమీను దారులు, జాగీరుదారులు పరగణాదారులు, షహరుకు ఆపక్కనిండెవారిపాటి బలాడ్యులున్ను కలహప్రియులున్ను కారు. యధోచితముగా రహితు జమాబందిమీద రూకలు వసూలు చేసే జ్ఞాపకము యీప్రదేశపు వారికి ఉన్నది గాని, షహరుకు అవతలితట్టు వారివలె ఊరూరికి కోటలు, కొత్తళాలు, బలముచేసి గ్రామాదులను పాడుచేయడములేదు. కృష్ణదాటినది మొదలుగా ఈగోదావరీతీరమువరకు యిక్కడివారు వాడే కోసు, మన పద్నాలుగు గడియ దూర మవుచున్నది. యిది హల్కాకోసు అనుచున్నారు. కృష్ణకు అవతలిగట్టు పర్యంతము వాడే కోసు, మన రెండుగడియల దూర మవుచున్నది. యిక్కడి కోసు రెండు మయిళ్ళుకు కొంచము తక్కువనే చెప్పవచ్చును. నేను మనకోసుల ఉమారే చూచి వ్రాయుచు వచ్చుచున్నాను. మనగడియ దూరం ఇరవై నాలుగు నిమిషాలకు నడవ వచ్చును. గనుక ఆ నిజామున ఊహించి, ఆ యూ యూరికిగల దూరమును నిర్ణయించి వ్రాయుచు వచ్చుచున్నాను. ఇక నున్నూ అట్లాగే వ్రాయడ మవుచున్నదని తెలియవలసినది.

ఈ గోదావరీ తీరమువరకు ఆ యా మజలీ గ్రామములలో తమలపాకులు దొరుకుచు వచ్చినా మంచివిగా నుండవు. గనుక దిగిన మజిలీ గ్రామాదులలో తమలపాకు లున్నచోటు విచారించి తోటలవృద్దికి మన సంతమనుష్యులను పంపించి లేతవిగా గిల్లించి సంగ్రహించు కొనుచు వచ్చినట్లయితే అనుకూలముగా నుంచున్నది. హయిదరాబాదులో గొప్పవారందరున్ను పండుటాకులు వేసుకొనుచున్నారు.

యీదలవాయిలో తమలపాకులు బహునయము. బాలకొడలో పండటాకులు దొరుకును. కడప మొదలుగా యీ గోదావరీ తీరమువరకు అమ్మే వక్కలు ముడి వక్కలు రెండుగా వొత్తి ఉడక బెట్టినవి కావు, మంచిదిగా ఏర్పరచివొత్తివేసుకొంటే మనదేశపు వక్కలకన్నా బాగా రుచిగా ఉంచున్నవి. యీదేశములో పేదలు నిండా తాంబూలము వేసుకోవడము లేదు, ఒక్కలు మాత్రము నవులుతారు. శూద్రుల చేతి హుక్కాలు ఇతరులు తాగుచున్నారు.

కృష్ణదాటినది మొదలుగానున్న ముఖ్యముగా హయిదరాబాదు మొదలుగానున్ను, ప్రతిమజిలీ యూళ్ళలో బియ్యముతోటి పాటు తియ్యగానుండే గోధుములపిండి విసిరి అమ్ముచు వచ్చుచున్నారు. యీదేశములో రొట్టె వినాగా అన్నమే భుయింపుచు వస్తే దేహానికి బలము లేదని వదైంతి గనుక, మే మొకపూట రాత్రి అన్నముతో కూడా రొట్టె తీసుకొనుచు వచ్చుచున్నాము. అది ఆరొగ్యము గానే యున్నది.

పై జగనంపల్లె నుంచి కుళదర్పణ మనే గోదావరీ తీరపు రామక్షేత్రానికి దారి పోవుచున్నది. ఆక్షేత్రము ఇమ్మడికి నాలుగు కోసుల దూరము. నాగపూరి దారికి వొత్తియుంచున్నది. అక్కడ అనేక బ్రాంహ్మణులు తీరవాసమని యిండ్లు కట్టుకొని యున్నారు. ఈదూదుగాము నదికి గడియదూరములోనున్నది. యిక్కడ స్నానఘట్టము వసతికాదు, నీడలేదు. నది యిప్పట్లో పూర్ణ ప్రవాహముగా నున్నది. ఇక్క్డసుమారు నది గడియదూరము వెడల్పుకలది. నది నడమ కొన్ని లంక లున్నవి.

కడప వదిలినది మొదలుగా అరవభాష తెలిసి మాట్లాడ తగినవారు సకృత్తుగానున్నారు. తెనుగుమాటలు సర్వసాధారణముగా రాగసరిళిగా చెప్పుచున్నారు. ప్రశ్నపూర్వకముగా ఉత్తర ప్రత్యుత్తర మెచ్చేటప్పుడు శబ్దములను సంకుచిత పరచి మాట్లాడుచున్నారు. ఎట్లాగంటే యీ యూరు ఆయూరికి ఎంతదూరమంటే నాకు యేమి యెరుక యని ప్రత్యుత్తరము పుట్టుచున్నది. పండుకొన్నాడు అనడానకు పండినాడని అనుచున్నారు. హిందూస్తాని తురకమాటలు తరుచుగా దేశ భాషలయినందున ఆమాటలు తెనుగుభాషలో గలిపి మాట్లాడుచున్నారు. ఈదేశములో ఈగలు బహు బాధపెట్టుచున్నవి. వర్షా కాలమయి నందున యిటు విస్తారమయిన దని చెప్పుచున్నారు.

కృష్ణ మొదలుగా గోదావరివరకు డ్రావిళ్ళు లెరుగదా? ఆంధ్రులుగా నుండే బ్రంహ్మణులందరు సగోత్రముగాక ఋషిప్రవనర కలియక పొయి నట్టయితే మధ్యదేశమువలె వెలనాడు, కాసలనాడు అనే తెగలు విచారించక సంబంధములు చేయుచున్నారు. లౌకీకులను వ్యాపారులను చున్నారు. మధ్యదేశపు సిద్ధాంతి పంచాంగముతో ఈ గొదావరీ తీరములో నుండే అనేక సిద్ధాంతులు గుణియించిన పంచాంగాలను సరిపెట్టినాను. తిది వార నక్షత్ర యోగ కరణములు అహ, ప్రమాణములు అరగడియ యేక్కువ తక్కువగా సరిపడుచు వచ్చుచున్నవి. యీదేశ పంచాంగములో శూన్యతిధులు, తిధిద్యయాలు వ్రాయడము లేదు. తద్ద్వారా పంచాంగపు వారి మూడ్యముచేత తిధులు ముణిగిపోవుచున్నవి. వైదికులు పాగా, చొక్కా లేక, ఆశీర్వాదము చేసే సంప్రదాయము లేదు. ప్రతిద్వ్జునకున్నూ చేత పంచంగ ముండవలసినది. పంచాంగశ్రవణము బహుప్రబలము. ఈదేశములో యిప్పట్లో వర్షా కాలము గనుక మన దేశపు కార్తిక మాసములోని వ్రతములు శ్రావణమందు శ్రావణ సోమవారలని, నిత్యాభిషేకాలని, సక్త భోజనాలని, ఛెయుచున్నారు. గృహకల్లోల కార్యములలో పురుషులకన్నా స్త్రీలకు చొరవ యెక్కువగా యీ దేశములో కలిగియున్నది.

కడప మొదలుగా గొప్ప వర్తకులు, ధనికులున్నుండే స్థలములో నొక్కొకవేళ డాగావాండ్లనే దొంగలు అతి ధైర్యముతో సాయంకాలములో గుంపుగా ప్రవేశించి యెదట కండ్లపడ్డ వారినంతా చంపి ధనికుల యిండ్లలో, అంగళ్ళలో జొరపడి ఖామందులను పోడిచి చంపి, ఉండే ధనము నెత్తుకొని, అరగడియలో మటుమాయ మయి పోవుచున్నారు. యీప్రకారము హయిదరాబాదు యింగిలీషు లష్కరు మధ్యె జరిగినది. యీ డాగావారి భయము యీ దేశములో విస్తరించి కలిగియున్నది. సాత్వికుల యోగ్యత యిటువంటి దుష్టులు లేకనే ప్రబలముగాదు గనుకనున్ను యిటువంటి వారు యీశ్వర చిద్విలాసానికి సామాగ్రి గనుకనున్ను, వారినిన్ని యీశ్వరుడు రక్షింపుచున్నాడు.

తేది మధ్యాహ్నము పన్నెండు ఘంటలకు ఆ గోదావరి నది దాటి యివతల అయిదు కోసుల దూరములో నుండే నిర్మల అనే షహరు నాలుగు ఘంటలకు ప్రవేశించినాను. దారి నదికి అటు ప్రక్క రెండు మజిలీల వరకు ఉన్నట్టే బాగా గులక యిసుక పరగా నున్నది. నదిదాటగానే ఒక బంగాళా జాతులవాండ్లు దిగడానికి యోగ్యమయినదిగా నున్నది. యివతల చిన్న యూళ్ళు మూడున్నవి. కొన్ని మజబూతి అయిన పాడుకోట లున్నవి. నిర్మల అనేయూరు పట్టణము వంటిది. సకల పదార్ధాలు దొరుకును. సకల విధములయిన పని వాండ్లున్నారు. ఊరుచుట్టున్నూ, ఊరు నడుమనున్ను చిన కొండలు నిండా వున్నవి. గొప్ప యిండ్లు కలవు. ఊరుకి చుట్టున్ను, తొటలు, చెరువులు కలిగి యున్నవి. ఇక్కడ అరికాటి నబాబు కింద లోగడ రాయిజీ *

గమనిక, *ఆర్కాటు నవాబుకింద రాయరేడ్డెరావు అను నతడు శిరస్తాదారుగా నుండేవాడు. ఇతడు పద్దెనిమిది వందల తొమ్మిది లో బలవన్మరణము నందినాడు.

సర్వాధికారిగా ఉన్నట్టు ఒక పరగణాదారుడు ఉన్నాడు. దేశముఖి, దేశపాండ్యాలు ఉన్నారు. కొత్తవాలు మొదలయిన యధికారస్థులున్నారు. వంద బ్రాంహ్మణ యిండ్లును, ఒక దేవాలయమున్నూ ఉన్నవి. అక్కడ నేను దిగినాను. యిట్లా గొప్ప యూళ్ళలో నుండే బ్ర్రాంహ్మణ మండలికి సభాపతి అనే ఒక బ్రాహ్మణుదు ఉన్నాడు. అతని యూజ్ఞకు తక్కిన వారు యధోచితముగా లోబడి యున్నారు. నిర్మల పంచపాత్రలు ఈప్రాంతములలో బహు ప్రసిద్దిగా నున్నవి. నిండా కంచర యిండ్లున్నవి. అయితే కూతురి ప్రౌఢమ తండ్రికి ఏప్రకారము అనుభవానికి రాదో అలాగే ఆయాపదార్ధాలు పుట్టే స్థలముల యందు అచ్చటివారికి అనుభవానికి రావు. అందుకు దృష్టాంత మేమంటే యిక్కడచేసే పంచపాత్ర యొకటి చూతామన్నా యీ యూరున దొరికినదికాదు. ఈ నిర్మల నుండే పొష్టు రన్నర్సులనే టప్పా మనుష్యులు హైదరాబాదు పోష్టాఫీసు యిలాకావారు ఇది మొదలుగా నుండే టప్పా మునుష్యులు నాగపూరి పోష్టాఫీసు యిలాకావారు గనుక రెండు యిలాకాలకు న్నిద్దరు మనిషీలు ఇక్కడ నున్నారు. నాగపూరు మనిషీగుండా నగపూరు వరకూ నొకటప్పామనిషిని మజిలీ మజిలీకిన్ని కూడా వచేటట్టు దిట్టము చేసుకొన్నాను. వూరి అములు దారుడు నేను వచ్చేటందుకు మొందరనే తగయిరు అయినాడు గనుక దేశపాండ్యా వెంకటరాయనివారిగుండా యేదులాబాదు వరకు వచ్చే టట్టు నాలుగు మంది ఆయుధ పాణులయిన జవానులను తయినాతి చేసుకొన్నాను. ఈ నిర్మలలో దృశ్యాఅనేవాడు. నిజాముకింద అధికారము చేసేవాడు. అతడు తన రాజ్యపురూకలు యజమానునికి పంపించకుండా తన చేతికిందనున్న భూమిని ఆక్రమించవలనని కోటలు కట్టి యజమానునితో చచ్చేవరకు యుద్ధముచేయుచు రాజ్యము ననుభవింపుచువచ్చినాడు. నేను దిగిన దూదుగాము అనేది నదీతీరమదలి యూరు. బహు రహధారి. కశిభాటలో నున్నది. ఆ నిర్మలలో మొదటి తేది ఉంటిని.

ఆగస్టునెల రెండు తేది ఉదయాన ఆరు ఘంటలకు ఉదయాన బయలువెళ్ళీ ఎనిమిది కోసుల దూరములో నుండే వొడ్డూరు అనె యూరు ఒకటి ఘంటకు చేరినాను. దోవ బహు ప్రయాస. నల్ల రేగడి భూమి. వర్షాకలములో నడిచేవారికి అడుగు అమడగా నుండును. ఏడు కొండలు దారిలో నడిచేవారికి నెక్కి దిగవలసియున్నది. దారిలో అడుసుతో కూడా రాళ్ళు మిశ్రములై యున్నవి. దారిలో అంకిరి అనే యూరున్ను మరికొన్ని చిన్న యూళ్ళున్నున్నవి. మజిలీ చెయ్యడానికి వయిపు అయినవి కావు. యీ నిర్మల్ నుంచి నేరేడు కొండ అనే యూరిమీదనొక భాటపోవుచున్నది. అ భాట సమీపమయినా వర్షాకాలములో నడవకూడదు. యీదినము నడిచిన భాట కిరుపక్కల దట్టమయిన యడవి. వ్యాఘ్రభయము జగనంపల్లె మొదలుగా కలిగియున్నది. పాంకిలి అనేయూరివద్ద ఒక వాగు దాటవలెను. ఇది బలమయిన వారు. అవతలి యూరి ముందర నొక లోతుగల వాగు ఉన్నది. యిదేగాక అనేకములయి గనుక చిల్లర వాగులు అనేకములు దాటినాను. ఈ వొడ్డూరు బస్తీ గ్రామము. సకల పదార్ధములు దొరుకును. భ్రాంహ్మణుల యిండ్లు చావిళ్ళున్నున్నవి. ఇక్కడ నొక చావిడిలో ఈ రాత్రి నిలిచినాను.

తేద ఉదయాన ఆరు ఘంటలకు బయలు వెళ్ళి ఏడు కోసుల దూరములో నుండే విచ్చోడా అనే యూరు ఒకటి పాయింట్ రెండు ఘంటలకు చేరినాను దారి నిన్నటివలెనే సకల్ విధములయిన ప్రయాసలను ఇచ్చుచున్నది. కొండ యొక్కుడు దిగుడు గలది. రాతి గొట్టు మాత్రములేదు. దారిలో కడం అనే నది దాటవలెను. ఈ నది వెడల్పు తక్కువ అయినను బహు ఘాత చేసేది. పడవ, తెప్ప, మొదలైనవి కూడా ప్రవాహవేగములో నడవవు. ప్రవాహ కాలములో కంపెనీ టప్పాకూడా రెండు మూడుదినములు ఇక్కడ నిలిచిపొవు చున్నది. విచ్చోడా అనే యూరు బహుచిన్నది. యధోచితముగా కావలసిన పదార్ధాలు ముసాఫరులకు దొరుకును. ఇక్కడ డేరాలలో వసించినాను. వోడ్డూరు - విచ్చోడా మధ్యే కొన్ని చిన్న గ్రామాలున్నవి. నిలవయోగ్యములు కావు. దారికి యిరుపక్కలా చిన్న పర్వతములు దర్శన మవును. మిట్టలో నించి పల్లానికి నిండా దిగే కడం నది దగ్గిర నెక్కవలసి యున్నది. ఆయూరున ఆరాత్రి ఉన్నాను.

తేది ఆరు ఘంటలకు బయలుదేరి రెండు ఘంటలకు పది కోసుల దూరములో నుండే యేదులాబాదు అనే షహరువంటి యూరు చేరినాను. దారి అట్నూరు అనే యూరివరకు నల్లరేగడభూమి. అడుసు లోగడి రెండు దినముల వలెనే దిగపడుచున్నది. ప్రయాస చెప్పి తీరదు. ఆట్నూరు మొదలు యేదులాబాదు వరకు దారి నడవడానికి గులక యిసుక పరయున్నుచిన్న రాళ్ళగోట్టున్ను గనుక అనుకూలముగా నున్నది. అయితే మేకల గండి అనే ప్రసిద్ద మైన ఘాటు ఇక్కడ దాటవలసినది. ఈ ఘాటులోని యడివి, బల్లెము దూరని పాటి దట్టమని చెప్పవచ్చును. వ్యాఘ్రభయము విస్తారము. పులియడుగులు దారిలో చూచుచు మేము నడిచినాము. బహు జాగ్రత్తగా బాటసార్లు ఇక్కడ నడుచు చున్నారు. ఒకరిని ఒకరు విడిచే ప్రదేశము కాదు. తుపాకులు అక్కడ కాల్చుచు వచ్చినాము. కొండల చెరువుల నడమ భాట పోతున్నది. అట్నూరి వద్ద నొక పెద్దవాగు దాటవలసినది. యింకా శానాశానా చిన్నచిన్న వాగులు దాట వలిసియున్నవి. నిర్మల మొదలు భాటలో సన్నముగా, విడువుగా నిండే చీకటి యీగెలు నిండా కరుచుచున్నవి. యీ మేకల గండి యడివిలో నడిచే టప్పుడు నడిచేవారు చిన్న మండలు విరిచి చేతపట్టుకొని తోలుకొనుచు రావలసినది. ఆ మక్షికాల భాధ ఘాటు దాటే పర్యంతముగలదు. ఆఘాటు ములులే అనే యూరి పర్యంతము ఉన్నది. ఆఘాటును మేకలగండి అనటానికి కారణమేమంటే ఘాటు మధ్య వుండే రాళ్ళన్ని మేక అడుగులతో ఈశ్వరుడు సృస్టిచేసి యున్నాడు. యేదులాబాదులొ సకల పదార్ధాలు దొరుకును. సకల విధములయిన పనివాండ్లు వున్నారు. జలవసతి కలదు. బ్రాంహణ యిండ్లు కలవు. ఊరికి బయిట బ్రంహ్మచారి బావా మఠ మున్నది. వూరి మధ్యే కొన్ని మఠాలున్నవి. ఒక మఠములొ దిగినాను. విచ్చోడా అనే వూరు మొదలుగా వోణి అనే వూరు వరకు ముషోర్మల్కు అనే దివాంజీకి జాగీరు అయివున్నది. యీ యేదులాబాదులో నాయబు అనే అములుదారు డున్నాడు. ఈయూళ్ళోకూడా వచ్చిన వారియొక్క అసోదా నిమిత్తమున్ను, పదార్ధాల సంగ్రహము కొరకున్ను ఆ దినమంతా నిలచినాను.

వ తేది ఉదయమైన ఆరు ఘంటలకు బయలు వెళ్ళీ ఎనిమిది కొసుల దూరములో నుండే ధనోరా అనే యూరు ఒకటి పాయింట్ రెండు ఘంటలకు చేరినాను. దారి నల్లరేగడ అయినా అడుగున రాతిపారు గనుక నెంత వర్షముకురిసినా ఆట్నూరు వర్యంతము దిగబడేలాకు ఈదారి దిగబడదు. దారి కిరుపక్కల భూమి వెల్లడిగానున్నది. ఆదివిలేదు. అయితే దారి రాతిగొట్టు. శానా వాగులు వర్షాకాలములో దాటవలసి యుంచున్నవి. యేదులాబాదుకు కొంత దూరములో నొక పెద్దవాగు మధ్య వుండే జేనదు అనే వూరి వద్ద నొక పెద్ద వాగు దాటవలెను. ఈ జేనదు అనే యూరు మంచి బస్తీ అయినది. ముచ్చటగా రాతి పని చేసిన యొక విష్ణు దేవాలయము ఈ యూరి చెరువు గట్టున వున్నది. సకల పదార్ధాలు దొరుకును. యేదులాబాదుకు సమీపముగా కోసుల దూరములో ఈ వూరున్నందున నెను దిగలేదు. ఇదిగాక చిన్నవూళ్ళు కొన్ని వున్నవి. మజిలీ చేయడానికి తలుచుకొనతగినవి కావు. ధనొరా వూరిముందర పిన్నగంగ అనే నది దాటవలసినది. ఇక్కడ కొయ్య తొలిచిన రెండేసి చిన్న దోనెలు జోడించి కట్టినదోనె రెండేసి సవారీలున్ను ఆరుబోయీలున్ను ఒక తేవకు దాటింపు చున్నది. సామానులున్న పరివారమున్ను దాటడానికి రూపాయలు రెండు దోనెవాండ్లకు ఈనాముగా నిచ్చినాను. కొంఫిణీవారి తఫాల్ దాటించడానికి సంవత్సరానికి ఒకటి కి మూడు రూపాయీలు లెక్క జీతముగా పన్నెండు రూపాయిలు గోదావరి మొదలయిన నదులు దాటించేవారికి యిచ్చేటట్టు వర్షాకాలము నాల్గు నెలలకు నెల ఒకటి కి మూడు మూడురూపాయీలు లెక్క జీతముగా నిచ్చుచున్నారు. లోకులవద్ద మనిషికిన్ని పశువుకు న్నింత మాత్రమని పుచ్చుకొని యీ దోనె వాండ్లు తమ వచ్చుఒడిలో నొక హిస్సా నిజాము సర్కారుకు ఇస్తారు. ధనొరా అనే వూరు చిన్నది. యధోచితముగా ముసాఫరులకు కావలసిన సామానులు ప్రయత్నముమీద దొరుకును. నేను నదియొడ్డున డేరాలలో వసించినాను. బ్ర్రాంహ్మణుల యిండ్లు లేవు. ఒక అంగడి యున్నది. యీ ప్రాత్యపు గ్రామాలలోనంతా వర్షాకలములో కాలుపెట్టను మనసురాదు. అసహ్యమయిన అడుసు. నడమ గ్రామములున్నవి. యిక్కడ యీ రాత్రి నిలిచినాను.

వ తేది ఉదయమైన ఆరు ఘంటలకు బయలుదేరి ఒకటి ఘంటకు ఏడు కోసుల దూరములో నుండే కాయరా అనే వూరు చేరినాను. దారి నిన్నటి దారివంటిదే. చిన్న వాగులు శానా వర్షాకాలములో దాటవలసి యున్నవి. యిదిగాక ఒకరాతి గొట్టుకల కనమ యెక్కి దిగవలసి యున్నది. యీ కనమ మీద ముందు వెనక అడివి కలిగియున్నది. యీ యడివిలో మేకల గండిలోనున్న యీగెలవంటి యీగెలు నడిచేవారిని బాధ పెట్టుచున్నవి. రోనేగరుగాం అనే వూరితో యీయడివిసరి. అవతల పొడిచెట్లుగాని భయములేదు. కాయరా యూరి ముందర నొక పెద్దవాగు దాటవలెను. కాయరా అనే యూరు బస్తీయయినది. నాయబు ఉండే కసుబా స్థలము. సకల పదార్ధాలు దొరుకును. బ్రాంహ్మణ యిండ్లు యిరవైదాకా కలవు. ఫేష్కారు యొక్క యింటిలో దిగి యీ రాత్రి ఇక్కడ నున్నాను.

తేదీ ఉదయమున మూడు ఘంటలకు బయలు వెళ్ళి ఐదు కోసులదూరములో నుండే వోణీ అనే యూరు పదకొండు ఘంటలకు చేరినాను. దారిలో చిన్నయూళ్ళు నాల్గున్నవి. నడిచినంత దూరము నల్ల రేగడ, అడుగున రాతిపరి, పయిన అడుసు. చిన్న వాగులు కొన్ని దాటవలసినది. అడివి, రాతిగొట్టు, వేమనో అనే గ్రామము బహు బస్తీ అయినది. దేవాలయాలు కలవు. సకల పదార్ధాలు దొరుకును. అధికారస్థులుండే కసుబాస్థలము, జలవసతి కలదు. ఇండ్లుగొప్పవి. నేను గొప్ప వేంకటేశ్వరదేవాలయములో దిగినాను. సవారీల నుంచడానికి, బోయీలు జవానులు కావటివాండ్లు వగయిరా లుండడానికిన్నీ, చావిళ్ళూ మణిగ లడే జామీనులు, మశీదులు అసర్ ఖానాలు శానా వున్నవి. దినుసువల్లు నాణ్యములు ఇక్కడ మార్చుకోవలసినది. ఈ యూరంతా యిసుక పర గాని, అడుసుకాదు. ఆ యూరు నదీతీరము. నిజాము వద్ద కలటరు హొదా చేసినవారు కొంద్రు జాతులవాండ్లు యిక్కడ యిండ్లు కట్టుకొని యున్నారు. ఇంగిలీషువారు కలకటరులు కావడానికి హేతువేమంటే నిజాము తరపున నున్న అధికారస్థులు జమీందారులు నసిగా రూకలు పంపించనందున యింగిలీషు దొరలు తాలూకాలమీద నుండే దాపుమీద రూకలు వచ్చునని దివాంజీ చేసే చందులాలా యోచించి రిసైడెంటుతో మాట్లాడి తాలూకాల మీదికి తన యములు దారులతొ కూడావుండి వ్యవహారము చూడ గలందులకు యింగిలీషు దొరలను పంపించినాడు. వారు అక్కడక్కడ నిజాం అధికారస్థులతొ కూడా వుండే వ్యవహారము జరిగించినారు. అందువల్ల మొగలాయి ధోరణి జులుము లోకుల మీద నిండా వ్యవహారస్థులు చేయకుండా వచ్చినది గనుక అధికారస్థులకు వైపు, ఉపాయము, తోచక, చందూలాలాకు తెలియచేసి నంతట్లో మళ్ళీ ఆ కలకటరులను రిసైడెంటు పిలుపించుకొన్నాడు. యిప్పటికీ యింగిలీషువారి న్యాయ ఉన్నది గాని, *

గమనిక, *మద్రాసు ఫోర్టుసెంటు జార్జికోటలో సివిలు సర్వీసు ఉద్యోగులకు దేశభాషలు వ్యవహారములు నేర్పడం కోసం పద్దెనిమిది వందల పన్నెండు లో నొక కాలేజి స్థాపింప బడినది.

కాలీజి సిద్ధాంతి వ్రాసినట్టు యింతకు మునుపే సింహరాశిగతుడైనట్టు వ్రాయలేదు. తూర్పు దేశము నుంచి క్షామాదులకు లేచివచ్చి యిక్కడ నిలకడగా నిలచిన వారెవరయినా గ్రామాదులలో నుంటే వారు మాత్రము తెనుగు మటలాడుచున్నారు. తూర్పు దేశపు బ్రాంహ్మణులు, కోంట్లు మాత్రమీ దేశానికి యిదివరకు యొగ పాకి వచ్చుచున్నారు. నేను బ్రాంహ్మణనింటిలో యీ రాత్రి వసించి, యింగిలీషువారు యిక్కడనున్ను ముందు మజిలీలో నున్ను కట్టించి యుండే ముసాఫరుఖానాలో నా సవారీలు మూడు న్నుంచినాను.
