﻿ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర
టీటీఎస్ ఆడియో నిర్మాణ పాఠ్యం
భాగం ఒకటి — మొత్తం ఎనిమిది భాగాలలో


పీఠిక మరియు చారిత్రక పరిచయము

తృతీయ ముద్రణము

పీఠిక

భారతదేశ చరిత్రను గురించీ ప్రజల స్థితిగతులను గురించీ తేట తెనుగులో జాబులుగాను, దినచర్యగాను రచింపబడిన యీ చరిత్రగ్రంథము తెనుగు వాఙ్మయంలో అపూర్వమైనది. ఇది అందరూ చదవలసిన పుస్తకం. ఇది చిరకాలం కిందటనే అనగా పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది లో నొకమాటు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది లో నింకొకమాటు అచ్చు పడిందిగాని మళ్ళీ అచ్చుపడలేదు. అందువల్ల ఈ పుస్తకంయొక్క ప్రతులు ఇప్పుడు చదవడానికైనా ఎక్కడా దొరకడంలేదు. ఏమారుమూలనైనా తలవని తలంపుగా ఒక ప్రతి దొరికినా దానిలోని పుటలు తిప్పితేనే నుసి అయిపోయేటంత పాతబడి పెళుసెక్కి వున్నాయి. వీరాస్వామయ్యగారు పద్దెనిమిది వందల ముప్పై రెండు ఆ ప్రాంతంలో సి పి బ్రౌను దొరగారికి వ్రాయించి పంపిన పుస్తకం వ్రాతప్రతి యొకటి చెన్నపట్టణం ఓరియంటల్ మాన్యూస్క్రిప్ట్సు లైబ్రరీలో ఉందిగాని, అది చదవడానికి వెళ్లి కొన్నాళ్ళు ఉండాలి. అంతే కాకుండా అచ్చు పుస్తకానికీ దానికీ కొన్ని తేడాలు కూడా వున్నాయి. అందువల్ల ఈగ్రంథం మళ్ళీ అచ్చు వేయడం చాలా అవసరమైంది.

పుస్తకం రచింపబడిన నాటికీ నేటికీ మనదేశ పరిస్థితులలో చాలా మార్పులు వచ్చాయి. అందువల్ల అప్పట్లో వీరాస్వామయ్యగారు తన కాలంనాటి వారందరికీ తెలిసిన సంగతులే యని విపులంగ వ్రాయక సూచించి వదిలిన రాజకీయ సాంఘిక చారిత్రక అంశము లనేకములు ఇప్పుడు విప్పిచెప్పితేనే గాని అర్థంకావు. ఉదాహరణానికి తిరుపతి దేవస్థానంవల్ల కంపెనీవారికి సాలున లక్షరూపాయల ఆదాయం వస్తున్నదని ఈ గ్రంథంలో వ్రాసివున్నది. ఆ కాలంలో మన ధర్మాదాయాలన్నీ కంపెనీవారే స్వయంగా పరిపాలించే వారనిన్నీ భోగములు, అర్చనలు కలెక్టర్లే చేయించే వారనిన్నీ, మిగిలిన సొమ్ము కంపెనీఖజానాలో చేరే దనిన్నీ ఆ కాలంనాటి చరిత్ర చదివితేనే తప్ప తెలియదు. ఇలాంటి చరిత్రాంశా లన్నింటికీ తగిన వివరణములు, తబ్సిలు, సంపాదించి ఫుట్‌నోట్సుగా వ్రాశాను.

పద్దెనిమిది వందల ఇరవై నాలుగు నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఆరు వరకు మధ్య కలకత్తాలో కంపెనీవారి కొలువులో ప్రధాన క్రైస్తవ మతాధికారిగా నుండిన బిషప్ హెబరుదొర భారతదేశంలో పర్యటనం చేసి తాను చూసిన సంగతులను తన దినచర్యలోను తన భార్యకు స్నేహితులకు వ్రాసిన ఉత్తరాలలోను వ్రాసియున్నాడు. అది బిషప్ హెబర్సు జర్నల్ అని మూడు సంపుటములుగా ప్రకటించబడి ఆ కాలంనాటి హిందూదేశచరిత్రను ప్రజల స్థితిగతులను గూర్చిన ప్రమాణగ్రంథంగా పూజింపబడుతూ వున్నది. మన వీరాస్వామయ్యగారి గ్రంధం ఆగ్రంథాని కేవిధంగాను తీసికట్టుకాదు. సందర్భానుసారంగా హెబరు గారి గ్రంథంలోనుండి కొన్ని సంగతు లీగ్రంధంలో అక్కడక్కడ ఉదాహరించారు.

పూర్వముద్రణం అచ్చుప్రతులలో వదిలివేయబడి ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంలో వున్న వ్రాతప్రతిలోని విశేషాంశాలను కొన్నింటిని సందర్భానుసారంగా వుదాహరించాను.

వీరాస్వామయ్యగారి పర్యటనమును తెలుపగల ఒక హిందూదేశ పటమును దీనిలో చేర్చారు. శ్రీ వీరాస్వామయ్యగారియెక్కయు, ప్రజాసేవయందు వీరికి తోడ్పడిన వీరి మిత్రులైన కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళగారు, వెంబాకం రాఘవాచర్యులుగారు, జార్జి నార్టనుగార్ల యొక్కయు చిత్రపటాన్ని కూడా దీనిలో చేర్చారు.

ఈగ్రంథాన్ని మళ్ళీ యిప్పుడు ముద్రించడంలో పూర్వ ముద్రణపు మూలగ్రంధంలో మార్పులు ఏమీ చేయక యథాతథంగానే అచ్చువేయించాను. అయితే పాఠకుల సౌకర్యంకోసం గ్రంధాన్ని ప్రకరణాలుగా విభజించి, విషయం మారినప్పుడల్లా పేరాలుగావిడదీసి, వాక్యాలు సులభంగా అన్యయంకావడానికి మధ్య కామాలు, మొదలైన గురుతులున్నూ, వాక్యాలచివర ఫుల్ స్టాపు చుక్కలున్నూ వుంచినాను. అందువల్లను చరిత్రాంశాలు వివరణలుగల ఫుట్ నోట్సువల్లను పూర్వ ముద్రణంలో మూడు వందలు ఇరవై ఎనిమిది పుటలున్న గ్రంధం ఈముద్రణంలో మూడు వందలు డెబ్బై నాలుగు పుటలకు పెరిగింది.

కృతజ్ఞత.

కాశీయాత్ర చరిత్ర అచ్చు వేయించడానికి పూర్వముద్రణపు గ్రంధం కోసం చాలారోజులు ప్రయత్నించినా దొరకలేదు. పుస్తకం దగ్గరవున్న ఇద్దరు పెద్ద మనుష్యులు యిస్తామని ఇచ్చారుకారు. ఆఖరికి వేటపాలెం సరస్వతీ నికేతనం గ్రంధాలయంలో ఒక ప్రతి వుందని తెలియగా దాన్ని నా మిత్రులైన శ్రీ పిశిపాటి సీతాకాంతం గారు స్వయంగా వెళ్ళి తెచ్చిపెట్టారు. దానిలో కొన్నిచోట్ల అక్షరాలు చిరిగివున్నాయి. దాని కొక ప్రతి వ్రాసుకొని దానినిబట్టి ఈపుస్తకాన్ని అచ్చువేయిస్తుండగా రాజమహేంద్రవరంలో శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు గారి దగ్గర యింకొక ప్రతి వున్నట్లు తెలిసింది. దాన్ని నామిత్రులు శ్రీనిట్టల భవానిశంకర శాస్త్రిగారు తెచ్చిపెట్టారు. ఆప్రతినిబట్టి అచ్చుపడిన భాగాన్ని మిగతా గ్రంథాన్ని సవరణ చేశాను.

పాత ప్రతిలో వున్న వీరాస్వామయ్యగారి బొమ్మకు శ్రీ నారాయణసింగుచౌహణ్ గారు ఫోటోతీశారు. దానినిబట్టి ఆంధ్రపత్రికాధిపతులు శ్రీ శివలెంక శంభుప్రసాదు గారు బ్లాకు తయారుచేయించి యిచ్చారు. వీరాస్వామయ్యగారి యాత్రామార్గాన్ని తెలిపే దేశపటానికికూడా వారే బ్లాకు తయారుచేయించి యిచ్చారు వీరాస్వామయ్యగారు జార్జి నార్టనుగారు, రాఘవచార్యులు గారు కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళెగార్ల పటములుగల ఫొటోబ్లాకును శ్రీ పచ్చయ్యప్ప కళాశాల ధర్మాధికారులు యిచ్చినారు.

ఈగ్రంధంలో చేర్చిన రాజకీయ సాంఘిక చరిత్రాంశాలు, వివరణలు, ఫుట్ నోట్సు వ్రాయడానికి అనేక పురాతన పుస్తకాలు చదవవలసివచ్చింది. మద్రాసు కనామెరాలైబ్రరీలొవున్న ఆ, పుస్తకాలను బెజవాడ రామమోహన గ్రంధాలయం ద్వారా తెప్పించుకోగలిగాను.

శ్రీ నాగళ్ళ భవానీ శంకరనాయుడుగారున్నూ, శ్రీరేకపల్లి విశ్వనాధం గారున్నూ, శ్రి మాడపాటి లక్ష్మీకాంతారావుగారున్నూ, నాగుమాస్తా శ్రీ వల్లూరు వెంకట కృష్ణారాఫున్నూ యీ పుస్తకం వ్రాత వగైరాపనిలో నాకు చాలాసహాయం చేశారు.

యుద్ధంవల్ల కాగితం ధర ఎక్కువ అయినది. గ్రంధముద్రణ చాలా ధనవ్యయకారణమైంది. దీనిని అచ్చువేయడాని కీక్దింద పేర్కొన్నవారువిరాళాలుయిచ్చారు.

శ్రీ పల్లేర్లమూడి పద్దయ్యగారు, యనమదల, కృష్ణాజిల్లా, రూపాయలు యాభై

శ్రీ మాజేటి నాగభూషణం గారి భార్యా కనకమ్మగారు, బెజవాడ యాభై

శ్రీ పాటిబండ అప్పారావుపంతులుగారు, బి ఏ, భ్. యల్, బెజవాడ యాభై

శ్రీ తోటకూర వెంకట్రాజుగారు, తాడేపల్లిగూడెం యాభై

శ్రీ బసవరాజు సూర్యనారాయణరావు పంతులుగారి కుమారుడు

శ్రీ సుబ్బారావు పంతులుగారు, బెజవాడ. ముప్పై

పైవిధంగా సహాయం చేసినవారందరికి కృతజ్ఞుడను

బెజవాడ, దిగవల్లి వేంకటశివరావు

రెండు సెప్టెంబరు పంతొమ్మిది వందల నలభై ఒకటి సంపాదకుడు.

వీరాస్వామయ్య గారు కన్యాకుమారి మొదలు కాశ్మీరం వరకున్నూ భారత దేశ మంతటా రెండు సార్లు తిరిగి పద్దెనిమిది వందల ముప్పై నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఒకటి వరకు మధ్య తాము చూచిన సంగతులూ తమకు తోచిన సంగతులూ దినచర్య గాను, తమ మిత్రుడైన కోమలేశ్వర పురం శ్రీనివాస పిళ్ళ గారికి జాబులు గాను వ్రాశారు. అనాటి భారత దేశ స్తితిగతులన్నీ అందులో వర్ణించారు. దానిలో చెన్నపట్నం చరిత్ర కూడ వుంది. దానిని శ్రీనివాస పిళ్ళగారు కాశీ యాత్ర చరిత్ర అనే పేరుతో పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది లో ప్రకటించారు.

, కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళగారు,

శ్రీ కోమలేశ్వర పురం శ్రీనివాసపిళ్ళగారు గడచిన శతాబ్దంలో చెన్న పట్టణంలో వుండి ప్రజాసేవ చేసిన ఆంధ్ర ప్రముఖులు. వీరి తండ్రి పేరు మునియప్పిళ్ళ. వీరు సంపన్న గృహస్థులు. చెన్నపట్నంలో క్షామ నివారణ కోసం, పద్దెనిమిది వందల ఏడు లో స్థాపించిన మణేగారు సత్రానికి పదకొండు మంది దొరలతో పాటు నియమించబడ్డ తొమ్మిది మంది దేశీయ ధర్మకర్తలలో వీరొకరు, చెన్నపట్నంలో కంపెనీ వారి కొలువులో పోలీసు సూపరెంటుగాను, మేస్ట్రేటుగాను, పనిచేసిన వెంబాకం రామనాచార్యులుగారొకరు. ఏనుగుల వీరాస్వామయ్యగారు, వీరు కలిసి పద్దెనిమిది వందల ముప్పై మూడులో నందననామ సంవత్సరం కరవులో బీదలకు అన్నవస్త్రాలిచ్చి కాపాడడానికి చాల పాటుపడ్డారు.

శ్రీనివాస పిళ్ళగారు చాల ధర్మాత్ములున్నూ దూర దృష్టి కలవారున్నూ అయి విద్యాభివృద్ధికి తమ యావచ్చక్తినీ వినియోగించారు. ఈయనకు సంఘ సంస్కారమంటే ప్రీతి. వీరు ఉదారమైన భావాలు కలవారు. ఆడ పిల్లలకు విద్య నేర్పవలెననే పట్టుదల కలవారు. స్వయంగా ఒక ఆడపిల్లల పాఠశాల నడిపారు. ఈ యన ప్రజలలో అక్షరజ్ఞానము వ్యాపింప చేయవలెనని చాల కృషి చేశారు. వీరు చనిపోయే టప్పుడు విద్యాదానం కోసం డెబ్బై వేల రూపాయలు ధర్మం చేయడం వల్లనే వీరి దేశాభిమానము, విద్యా భివృద్ధి యందు వీరికి గల ఆసక్తీ వెల్లడి అవుతున్నాయి. వీరు చనిపోయిన కొన్నేండ్లకు ఆనిధిలో నుంచి హిందూ బాలికా పాఠశాల యొకటి స్థాపింప బడింది. వీరు చెంద చేసిన ధర్మ నిధిలో నుంచి పచ్చయ్యప్పకళాశాలకు అంటే మూడోపాఠశాల స్థాపింప బడింది.

, జార్జినార్టన్ గారు. వెంబాకం రాఘవాచార్యులు గారు,

మొదలు పద్దెనిమిది వందల యాభై మూడు వరకూ మద్రాసు సుప్రీ కోర్టులో అడ్వకేటు జనరలు గా వుండిన జార్జి నార్టన్ దొరగారున్నూ ఇంటర్ ప్రిటరుగా నున్న ఏనుగుల వీరాస్వామయ్య గారున్నూ, శ్రీమాన్ వంబాకం రాఘవాచార్యులు శ్రీనివాస పిళ్ళ గార్లున్నూ ముఖ్య స్నేహితులు. వీరందరూ కలిసి ఆకాలంలో గొప్ప ప్రజాసేవ చేశారు.

పచ్చయ్యప్ప గారు దాన ధర్మాలకోసం చెంద చేసిన లక్షలాది ధనాన్ని వారసులు తినివేసి కూర్చోగా పాత అడ్వకేటు జనరలైన కాంప్టన్ గారు కొత్త అడ్వకేటు జనరలైన నార్టన్ గారు వీరాస్వామయ్య గారు కష్టపడి ఆ దాన ధర్మాలను బయటికి తీసి ఆరు. ఏనుగుల వీరాస్వామయ్యగారు, వారి మిత్రులు

నాటి పరిపాలనకోసం చెన్నపట్నం సుప్ర్రీంకోర్టులో ఒక్క స్కీము తయారుచేయిచాను. ఆ ప్రకారం పద్దెనిమిది వందల ముప్పై రెండు లో ఏర్పాటు చేయవడిన మొదటి ధర్మకర్తల బోర్డులో శ్రీనివాస పిళ్ళె గారి నొక ధర్మకర్తగా నియమించారు. ఆ బోర్డుకు శ్రీ వెంభాకం రాఘవాచార్యులుగారు అధ్యక్షులుగావున్నారు. ఆయన పద్దెనిమిది వందల నలభై రెండు లో చనిపోగా శ్రీనివాసపిళ్ళెగారే అధ్యక్షులై పద్దెనిమిది వందల యాభై రెండు వారుచనిపోయేవరకు ఆపదవిలో వున్నారు. జార్జినార్టన్ గారు పేట్రన్ గా వుండి పచ్చయ్యప్పకళాశాల స్తాపనకూ అభివృద్దికీ మూల కారకులలో ఒకరైనారు.

కంపెనీ పరిపాలన ప్రజల స్థితి.

వరకూ యీదేశంలో ఇంగ్రీషు విద్య స్తాపింపబడలేదు. ప్రజలలో అజ్ఞానం చాలా వ్యాపించివుంది. కంపెనీవారు కేవలం రాజ్యాక్రమణంలోను వ్యాపారం లోను పన్నుల వసూలులోను మునిగి తమ లాభమే ఆలోచించేవారు గాని ప్రజల కష్టసుఖాలను గురించి యోచించేవారుకాదు. పూర్వ గ్రామ పంచాయతీల పరిపాలన తీసివేసి కలక్టర్ల పరిపాలన స్తాపించారు. ఈ కంపెనీపరిపాలనలో ప్రజలు దరిద్రులై, విద్యలేక అగ్జానాంధకారం లోను అనారోగ్యంలోను పడి వుండడము, రాక పోకలకు రోడ్లు, పల్లపు సాగుకు సౌకర్యాలు లేకపోవడము, పన్ను లివ్వలేనివారిని హింసించడము, కలెక్టరులు నిరంకుశత్వము, అధికారుల లంచగొండితనము కోర్టుల యప్రయోజకత్వము క్రైస్తవ మతబోధకుల విజృంభణములవల్లను ఇంకా ఇతర అన్యాయాల వల్లను ప్రజలు బాధపడుతూ వుండే వారు. కొంత ఉదారబుద్ధి గలిగి విద్యాభివృద్ది చేయ దలచిన చెన్నపట్నం కాస్త మంచి ప్రయత్నం కూడా ఆగిపోయింది.

మనదేశప్రజలను ఇంగ్లీషు వారిని చూస్తేనేభయం, తమహక్కులెలాంటివో తమ కష్టాలు అవిరితో చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలోకూడా తెలియదు. వీరికి దారిచూపించే రాజకీయ నాయకులున్నూ లేరు.

హిందూ లిటరరీ సొసైటీ

ఇలాంటి పరిస్థితులలో ప్రజలలో కొంత చైతన్యమూ విజ్ఞాన్ వికాసమూ కలిగించాలని ఏనుగుల వీరాస్వామయ్య గారు, రాఘవాచార్యులు గారు, శ్రీనివాస పిళ్ళెగారున్నూ కలిసి జార్జి నార్టనుగారి నాయకత్వం కింద చెన్నపట్నంలో హిందూలిటరరీ సొసైటీ అనే ప్రజాసంఘాన్ని స్తాపించి సభలు చేసి ఉపన్యాసాలిప్పించే గొప్ప కృషిచేశారు. ఈ సభ ఆదరణకింద దేశ చరిత్రను గురించీ, ప్రజల హక్కులను గురించీ నార్టను గారు పద్దెనిమిది వందల ముప్పై మూడు నుంచి పద్దెనిమిది వందల ముప్పై నాలుగు వరకు మధ్యకొన్నిమహోపన్యాసాలిచ్చారు. అందువల్ల చెన్నపట్నం ప్రజలలో రాజకీయ పరిజ్ఞానం కలిగింది. ప్రజలు ఇంగ్లీషు విద్య కావలెనని కంపెనీవారిని కోరడం ప్రారంచించారు.

ఏనుగుల వీరాస్వామయ్యగారు, వారి మిత్రులు ఏడు

నవయుగారంభం

చెన్నపట్నంలో ఒక ఇంగ్లీషు కాలేజీ స్థాపించడం అవసరమనిన్ని తాము కూడా కొంతసొమ్ము విరాళం యిస్తామనిన్ని ప్రభుత్వం స్థాపించే విధ్యాసంస్థల పాలనలో తమకుకూడా కొంత అధికారమూ పలుకుబడీ వుండాలనిన్నీ కోరుతూ మహజరు తయారుచేసి డెబ్బై వేలమంది సంతకాలు చేసి జార్జినార్టన్ గారి ద్వారా ఎనిమిది నవంబరులో గవర్నరుకు అందచేశారు. అంతట గవర్నరు ఎల్ ఫిన్ స్టన్ గారు మవిద్యావిధానం స్థాపించడానికి నిశ్చయించి కొందరు దొరలును దేశీయులును గల యునివర్సిటీ బోర్డును పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది లో నిమించారు. అందులో మన రాఘవాచార్యులు, శ్రీనివాస పిళ్ళెగారుకూడా సభ్యులు. దానికి ఎల్ ఫిన్ స్టన్ గారు ధ్యక్షులు. దాత స్థాపింపబడిన మద్రాసు యునివర్సిటీ అనే ఉన్నత పాఠశాల పరిపాలక లోకూడా వీరిని సభ్యులుగా నియమించారు. పద్దెనిమిది వందల నలభై ఒకటి ఏప్రిల్ నెలలో జరిగిన ఆ షు ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రజలు ఉత్సాహంచూసి ఒక నూతన శకం ప్రారంభమైందని గరర్నరుగారేఅన్నారు.

శ్రీ గ్తాజుల లక్ష్మీనర్సుసేట్టిగారు

వీరాస్వామయ్య ప్రభృతులు ప్రజాసేవ ప్రారంబించిన పదేండ్లలోనే చెన్నపట్నంలో ఆంధ్ర వర్తకులైన శ్రీ గాజుల లక్ష్మీనర్సుసెట్టిగారు రాజకీయనాయకులై నీపరిపాలనలోవున్న లోపాలూ మిషనరీలుచేస్తూఫున్న అన్యాయాలు ప్రజల కష్టాలు వారికి తెలియచేసి రాజ్యాంగ సంస్కరణల కోసం పాఅటుపడడానికి చెన్నపట్టణ శసంగం అనే ప్రజాసంఘాన్ని క్రెసెంటు అనే జాతీయ పత్రికను పద్దెనిమిది వందల నలభై నాలుగులో నుంచి గొప్ప రాజకీయ ఆందోళన లెవదీసి ఇరవై దేండ్లు ప్రజాసేవచేశారు.

ఇలాగ తరువాత కలిగిన విద్యాభివృద్దికీ జాతీయ చైతన్యానికీ ఉత్తరదేశంలో మోహనరాయల లాగ ఇక్కడ మన శ్రీనివాసపిళ్ళె, వీరాస్వామయ్య ప్రబృతులు పునాదివేశారని నిస్సంశయంగా చెప్పవద్దు. పచ్చయప్పకళాశాలా భవనంలో ఉపన్యసిస్తూ అప్పట్లో చెన్నపట్నం హైకోర్టులో అడ్వకేటు జనరల్ గా మూలపురుషులు వీరేనని ప్రశంసించారు.

చరిత్ర సాధనాలు

ఏనుగుల వీరాస్వామయ్య గారి జీవితాన్ని గురించీ వారి కాలంనాటి స్థితిగతులగురించీ వారుచేసిన ప్రజాసేవగురించీ శ్రీనివాసపిళ్ళె ప్రభృతులను గురించీ వివరాలు తెలుసుకోగోరేవారు ఈక్రింది పుస్తకాలు, పత్రికలు, చూడవచ్చును.

Rudimentals,-by George Norton, పద్దెనిమిది వందల నలభై ఒకటి,

Educational speeches of The Hon. John Bruce Norton పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి పద్దెనిమిది వందల అరవై ఐదు వరకు

The Madras Journal of Education. Aptfl పద్దెనిమిది వందల అరవై ఎనిమిది, p p వంద యాభై నాలుగు నుంచి వంద యాభై మూడు వరకు

The Asylum Prsss Almanac Madras, పద్దెనిమిది వందల ఇరవై నుంచి పద్దెనిమిది వందల యాభై ఐదు వరకు

-The Histoiy of Pchaiappas Charities ఏనుగుల వీరాస్వామయ్యగారు బ్రౌను గారికి వ్రాసిన లేఖ తొమ్మిది

నేను చెన్నపట్టణం చేరిన తరవాత క్రీ|| శే|| లంగరుపాపయ్యగారి భార్యను కొమాళ్ళను కలుసుకొని వారిదగ్గరనున్న స్కాంద్దం *అనే గ్రంథంయొక్క వివరాలనడిగి తెలుసు కొన్నాను. ఈ స్కాంధంలో ఆరు సగుంహితలు యాభై కాండ్డలు ఒకలక్ష గ్రంథం ఉన్నది. ఆ యారు సంగుహితల పేర్లు యేవనగా, -

*సనత్కుమార సగుంహిత ఒకటికి వీట్కి శ్లోకాలు పదిహేను వేల

*సూతసగుంహిత రెండు ఆరు వేల

*బ్రంహ్మసగుంహిత మూడు మూడు వేల

*వైష్ణవ సంహిత నాలుగు ఐదు వేల

*శంక్కర సంహిత ఐదు మూడు వేల

*సౌరసంహిత ఆరు పది వందల

ఈ ఆరు సంహితలలో పాపయ్యగారు అయిదవదైన శంక్కర సంహిత నిర్దిష్టమైన చక్కని తెనుగు పద్యములలోని కనువదింపజేశారు. దానిని నేను తెచ్చినాను. తమరు పంపమంటే ఆ ఆరు సంహితలను బంగీలో పంపుతాను, లేదా శంక్కర సంహిత * తెనుగుతర్జుమా మాత్రమే పంపుతాను. ఏ సంగతిన్నీ తెలుపకోరుతాను.

ఈసారి కాశీయాత్ర చేయడంలో నేను కడప, హైదరాబాదు, నాగపూరు, జబల్‌పూరు, మిరిజాపూరు, అలహాబాదుల మీదుగా పోయినాను. తిరిగి వచ్చేప్పుడు నేను ఘాజీపూరు, చప్రా, పట్నా, గయ, కలకత్తా, పూరీ, జగన్నాధము, గంజాము మీదుగా అన్ని ఉత్తరజిల్లలలోనుండీ వచ్చాను. దీనిని గురించి సరియైన వృత్తాంతము వ్రాస్తూ వచ్చాను. ఈ వృత్తాంతంలో హైందవ పుణ్యస్థలము లన్నిటి యొక్క చరిత్రలు మహానదుల చరిత్రలు మొదలైనవి వ్రాశాను. హిందూ మహమ్మదీయ క్రైస్తవమతములను గురించీ హిందూపురాణములను గురించీ జ్యోతిచ్ఛాస్త్రమును గురించీ చర్చించాను. మఱిన్నీ నేను చూచిన ఆయా ప్రదేశాములలోని ప్రజల యాచారాలు వ్యవహారాలు వానిలో ఒకచోటుకు ఇంకొకచోటుకు భేదములుండడానికి గల కారణాలున్నూ వర్ణించాను.

ఈ పుస్తకము చాలమంది కావలెనంటున్నారు. మచిలీపట్టణంలో మీరు స్థాపిస్తామని సెలవిచ్చిన ముద్రాక్షరశాలలో యీ పుస్తకాన్ని అచ్చువేయించి మూడువందల ప్రతులు ప్రకటించడాని కవకాశముంటుందా? ఈ పుస్తకాలు శీఘ్రంగానే అమ్ముడుపోతాయని నా నమ్మకము. ఈ పుస్తకమిప్పుడు వ్రాతలో నాలుగు వందలు అరఠావులున్నది. తమ సెలవైతే బంగీతపాలులో తమకొక ప్రతిని పంపుతాను. తమరు నెమ్మది మీద చిత్తగించి దానిపైన యభిప్రాయం దయచేయవచ్చును.

______________________________________________________________

*ఈమాటలు అసలు ఉత్తరంలో కూడా తెలుగులోనే వున్నాయి.

యేనుగుల వీరాస్వామయ్యగారు బ్రౌను గారికి వ్రాసిన లేఖ.

ఈ పుస్తకం ప్రకటించడంలో దీనివల్ల నేను లాభము పొందదలచడం లేదని మవవిచేస్తున్నాను. దీని ప్రతులను అమ్మడంవల్ల వచ్చే లాభాన్ని ఇచ్చివేయడానికి నాకు యేలాంటి అబ్యంతరమున్నూ లేదు. నష్టమైనా వస్తే నేనే భరింపగలను. నష్టము రాదనే నాదృఢవిశ్వాసము.

నేను మచిలీపట్టణముననున్న కాలంలో తాము నాయెడల చూపిన దయకు నా కృతజ్ఞతాభినందనాలు స్వీకరించగోరుతాను. ఈయూరినుంచి తమకేమికావలసినా నాకు తెలిపితే నేను ఆపనిని జాగ్రత్తగా చేస్తాను.

ఇలాగ చనవు తీసికొన్నందులకు క్షమింపవేడుతూ తమ యారోగ్యముకొతకు సౌఖ్యముకొరకు పరమేశ్వరుని ప్రార్ధిస్తూ అతిగౌరవ పురస్పరంగా విరమించు తమవిదేయుడు, అనుగ్రహపాత్రుడు, భృత్యుడు.

, Y, యే. వీరాస్వామి

అని ఇంగ్లీషుసంతకం వున్నది.

తాజాకలం.

ప్రస్తురం స్టోనుహౌసు దొరగారివద్ద వున్న నాతమ్ముణ్ణిగురించి నేను తమ్మువేడుకున్న విషయంతో జ్జ్ఞాపకం చేస్తున్నాను.

, Y, యే. వీరాస్వామి.

అని ఇంగ్లీషు సంతకము వున్నది.

ఈజాబుపైన సి పి బ్రౌనుగారి నోటు,

ఆ పుస్తకాన్ని ప్రకటించడానికి ఇంకా సిద్దంగా లేమనిన్నీ ఆపుస్తకమును పంపితే చూస్తాననిన్నీస్కాందమును ఈకింది భాగాలను తెనిగించేపని ప్రస్తుతము నిలుపు తున్నామనిన్నీ, సూతసంహిత నావద్ద నున్నదనిన్నీ తెలుపుతూ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది జనవరి ఇరవై ఐదవ తేదీన జవాబువ్రాడమైనది అని యున్నది.

కాశీయాత్ర వ్రాత ప్రతి నాలుగు వందలు యాభై ఐదు పుటలో, మచిలీబందరునుగూర్చి వ్రాస్తూ నాతమ్ముడయిన సీతాపతికి బారుజల్లీ అనే తాలుకాకు పనిఅయింన్నీ నాకోసరం బందరులో శలవుమీద కాచివున్నాడు అని వీరాస్వామయ్య గారు వ్రాశారు. బహుశ, పైవుత్తరంలో వుదహరించిన తమ్ముడు అతడే అయి యుండవచ్చును.

ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర

నాలుగు. కృష్ణా గోదావరుల మధ్య రాజకీయ సాంఘిక స్థితి-ఆచారవ్యవహారాలు-అరవము, తెలుగు-పంచాంగము- వైదికులు - డాగావాండ్లు - నిర్మల - నిజాముకింద యింగ్లీషు కలకటర్లు- తెనుగుభాష -దృష్టిదోషము. నలభై ఐదు నుంచి అరవై వరకు

ఐదు. నాగపూరురాజ్యం పూర్వచరిత్ర - రఘోజీ, అస్పాసాహెబు - ఇంగ్లీషువారి రాజ్యతంత్రము - కామిటిఅనే ఇంగ్లీషు దండుప్రడేశం - పరిపాలన - స్త్రీ పురుషులు - దేశాచార వ్యహారములలో ధర్మశాస్త్రములో తేడాలు - కామిటి వర్ణన - బింబారాధన - హిందువులు, క్రైస్తవులు - స్వదేశ పక్షపాతము - రామటెంకి క్షేత్రము. అరవై నుంచి డెబ్బై ఆరు వరకు

ఆరు. దొంగల తళావు - నాగపూరిరాజ్యము - బంగాళా గవర్నమెంటు - జపల్పూరులో కంపెనీ పరిపాలన - అవతారాలు, త్రిమూర్తులు, క్రీస్తు, మహమ్మదు, పరబ్రహ్మ - బోయజాతి - తీజవారా - నర్మదానదిలో తాళ్ళన్నీ లింగాలే - రేవుపడవలు - కంపెనీవారి హాశ్శీలు - ఆంధ్ర భ్రాహ్మణులు - చిత్పానములు - వింధ్యపర్వతము - ఇంగ్లీషు దొరతనము - న్యాయవిచారణ. డెబ్బై ఆరు నుంచి తొంభై వరకు

ఏడు. జబల్ పూరు - దేశచరిత్ర - సాగరారాజు - ఇంగ్లీషు దొరతనము - ఆచారనియమాలు - శూద్రదృష్టి, స్త్రీలు - దాక్షిణాత్యులకు ఉత్తర దేశస్తులకు ఆహారములో ధైర్య స్థైర్యాలలో బింబారాధనలలో తేడా - నెల్లూరికి ఉత్తర దక్షిణములలోతేడా. తొంభై ఒకటి నుంచి వంద ఏడు వరకు

ఎనిమిది. బొందిలి ఖండము - మైసూరు - రీమా - ఆగామిసంచిత ప్రారబ్ధకర్మాలు, విధి, ఈశ్వర కటాక్షములను గూర్చిన చర్చ. వంద ఏడు నుంచి వంద పదహారు వరకు

తొమ్మిది. హనుమాన్యా - డ్రమ్మన్ గంజా - ఇంగ్లీషువారు - దొంగలభయము - మిరిజాపూరు - గంగానది - కంపెనీవారి రాజ్యంలో ఆయుధాలు పట్టనియ్యరు - తమలపాకులు - వింధ్యవాసిని - గొపీగంజు - భాగవత కాలక్షేపము - పోలీసు. వంద పదహారు నుంచి వంద ఇరవై ఎనిమిది వరకు

పది. ప్రయాగ - అక్షయ్వటము - త్రివేణిసంగమము- క్షేత్రమహత్మ్యము - అక్బరుపాదుషా - వేణీదానము - బంగాళాగవర్నమెంటు ఫినాన్సుకమిటీ - నదులుగుళ్ళు ఈశ్వడేనా? - మూర్జరులు-పంచగౌడస్త్రీలు - దక్షిణంలో పస్త్రాల శుభ్రత, ఉత్తరాన్ని పాత్రసామానుల శుభ్రత- పంచగౌడులు, ద్రావిళ్ళు, వారి ఆచారవ్యహారాలు - జ్ఞానయోగము.వంద ఇరవై ఎనిమిది నుంచి వంద నలభై వరకు

పదకొండు. హిందూస్థానీమాటలు - వర్ణాశ్రమధర్మములు - గౌడసన్యాసులు - గోసాయిలు -అద్వైతము - హిందూమతశాఖలు - క్రీస్తు మతస్థులు బౌద్దమతము - స్త్రీలు మోక్షార్హతా? హృత్కమలములు - ఖజరాలు - గంగానదిమీర ప్రయాణము - ప్రయాగ కాశీల సంకల్పములు.వంద నలభై నాలుగు నుంచి వంద ఎనభై ఎనిమిది వరకు

లిపులు గయావళీలు పంచగౌడ బ్ర్రాహ్య్మణుల ఆచారములు. సౌరమాన చాంద్రమాన

బార్హ స్పత్యమనములు - అధికక్షయ మాసాలు తమల పాకులు - నావదొంగలు మధ్వాచార్యులు- గయావళీలమతము.

పద్దెనిమిది, దేశాలు, చప్పన్నభాషలు - ఏడులోకాలు - ఉత్తరదక్షిణ దృవములు - దేవతలు, దంధర్వులు, రాక్షసులు, పిశాచములు - సప్తసముద్రాలు - సృష్టిక్రమము పృధివ్యస్త్రేజో న్యాకాశాలు - పరికర్త్వము - ప్రకృతులు - ఆత్మ అంతరాత్మ పరమాత్మ - తిర్యగ్జంతుకోటి

- ఆకాశవాయు నహ్నిభూతాలు - సత్వరజస్తమో గుణములు, అరిషద్వర్గములు - లింగబేధములు - సప్తగ్రహములు - ఇంగ్లీషు గ్రహలాఘవశాస్త్రము, సూర్యసిద్ధాంతము -

అహ, ప్రమాణములు - ఇంగ్లీషు వారి భూగోళజ్నానము.

పంతొమ్మిది. బదర్గంజు నుండి కలకత్తాకు పోవు గంగానది మార్గములు - జలచరములు - బజరాల ప్రయాణము - కృష్ణనగరము - నతీయ, నవద్వీపము, - శీంతివూరు హుగ్గలీ - బారకుపూరు - శ్రీరాంపూరు - కలకత్తా - కాళికాశక్తి-గుడి-పూజలు, ఉత్స్తవములు - బంగాళీ స్త్రీపురుషులు-కులీనులు - కలకత్తా పూర్వచరిత్ర - మూర్షిదాబాదు నవాబు, డిల్లీపాదుషా, ఇంగ్లీషు వారి రాజ్యతంత్రము-కలకత్తా వర్ణన-ఇంగ్లీషుకాలీజి-క్రీస్తు మతప్రచారము.

ఇరవై. వుడుబడియా - ఆయుధాలనిషేధము - భద్రకాళి - జలేశ్వరము - మలడిజ్వరము -

భాలీశ్వరము - మత్స్యభక్షణ - పెరిమిట్టు చౌకీలు - వుత్కలదేశము - వైతరిణీనది, నాభిగయ, జాజిపురము - భోయీలు - సుఖరోగములు - కటకము - ఇంగ్లీషువారి రాజ్యతంత్రము.

ఇరవై ఒకటి, క్రీస్తుమతాతంతరుల కీ కర్మదేశమెందుకువశమైనది? - వర్ణాశ్రమములు పాడగుట -

ఇంగ్లీషువారు, క్రీస్థుమత ప్రచారము, మహమ్మదీయులు - హిందూమహమ్మదీయ క్రైస్తవమతములకు, బ్రాహ్మణులకు దొరలకు, గల తేడాను గూర్చిన ఇతిహాసములు - సత్యూవాది, కులీనబ్రాహ్మణునికధ - జగన్నాధ మహాక్షేత్రము - స్థలపురాణము - గుడివర్ణన - అర్చనలు భోగములు - బలభద్ర కృష్ణ సుభద్రలు, సుదర్శనమూర్తి-జగన్నాధప్రసాదము -

వీని అంతరార్థము.

ఇరవై రెండు. నరసింగఘాటు - కళింగగౌరకోమట్లు - చిలక సముద్రము - పోలీసునౌకరులు - తపాలాఉద్యోగులు - మన్యాలు - గంజాంషహరు పాడుబడుట - ఋషికుల్యనది - కళింగదేశము - చత్రపురము - కొండపాళెగాండ్ర బందిపోట్లు - అధర్వణవేదము - యిచ్చాపురము - గంజాం జిల్లాలో రేవులు - జమీందార్లు, బందిపోట్లు -ఏకశి పాసానికురుతే ఫలం ధుంజ్తే.

విషయసూచిక

మహాజన, - శిష్టుకరణాలు - బ్రాహ్మణులలో వాడు భేదములు, నియోగులు - సరుక్యూటుకోర్టు - ఇంగ్లీషువారి నేరవిచారన పద్ధతి - శ్రీకాకుళము - భోగస్ట్రీలు - భరతశాస్త్రము - విజయనగరం తాలూకాలో అగ్రహారములు - విజయనగరం చరిత్ర - వర్ణన.

ఇరవై మూడు. వుప్పాడబోయీలు - వీరభద్రరాజు పితూరి - సింహాచలము - విశాఖపట్టణం జిల్లా స్త్రీలసౌందర్యము - తెనుగుభాష - యిండ్ల అలంకారములు - వుప్పాడబోయజాతి, సర్కారుకు తలపన్ను, మధ్యపానము స్త్రీపురుషులలో మోహము - పిఠాపురము, పాదగయ - పెద్దాపురము - జమీందారీలు - రాజానగరము - రాజమహేంద్రవరము చరిత్ర - ఇంగ్లీషువారి రాజ్యాక్రమణ, పరిపాలన - శాంతిభద్రతలు - కొచ్చర్ల కోట వెంకటనాయినింగారు - వాడపల్లి.

ఇరవై నాలుగు. శృంగవృక్షము - మచిలీ బందరు పూర్వచరిత్ర - స్త్రీపురుషులు - ఉత్తరసర్కారు జిల్లాలు జమీందార్లు - కోమటి జమీందార్లు - కృష్ణాతీరపు యాచక బ్రాహ్మణులు-కళింగదేశము, ఆంధ్రదేశము - స్త్రీపురుషులు - అత్తరు తాంబూలములు - చందవోలు - బాపట్ల - వేటపాలెము - నెల్లూరు - వుప్పరజాతి, వొడ్డెవాండ్లు - నియోగులు, కణీజాకములు - అరవ మాటలు - ఉత్తరపినాకిని మొదలు దక్షిణ పినాకినివరకు మధ్యదేశము - నెల్లూరి సీమ స్త్రీ పురుషుల స్వభావము.

ఇరవై ఐదు. పొన్నేరి - స్థలమహాత్మ్యము - తిరువట్టూరు-స్థలపురాణము-చెన్నపట్నం వారి సత్రాలు, తోటలు - చెన్నపట్నము పూర్వచరిత్ర - శ్రీరంగరాయలు - దామెర్ల వెంకటాద్రి నాయుడు - ఇంగ్లీషువారి రేవు బందరు - కుడిఎడమ కులకక్షలు - ఫ్రాంసువారు - హైదరాలీ - అరికాటు నవాబు రాజ్యం ఇంగ్లీషువారి వశమగుట - చెన్నపట్నం రాజధానిలో కంపెనీ వారి పరిపాలన - చెన్నపట్నం వర్ణన - స్త్రీ పురుషుల ప్రకృతి - ఇంగ్లీషువారు.

విషయసూచిక

పన్నెండు. కాశి - గంగాపుత్రుల దౌర్జన్యము - మణికర్ణిక - ఆసివరణలు - ఘట్టములు - ఆలయములు -

అర్చకులు - పాటక్కులు - ఇళ్ళు - రాండ్ సౌండ్ చీడీలు - వేదశాఖలు - అహల్యాబాయి - పునాశ్రీమంతుడు - గంగాపుత్రుల ఉత్పత్తి - నాణ్యములు - బ్రాహ్మణులు అహంకరించుట, శూద్రులదృష్టి, చండాలుర సమీపవర్తిత్వమును నీచపరచుట - క్రీస్తు మత ప్రచారము - లేనిపోని ఆరాధనములు ఆచారములు - దేవాలయాలమీద బోమ్మలు - కాశీబ్రాహ్యణుల తేడాలు స్తోమాలు - అన్నదానము - రామనామతారకము - కాశీ జనసంఖ్య - కాశీమహత్మ్యము - విశ్వేశ్వరుడు సమిస్టిరూపము.వంద యాభై ఐదు నుంచి వంద డెబ్బై రెండు వరకు

పదమూడు,. కాశీవాసము - చలి - పంచక్రోశయాత్ర - ఘూర్జరులు - పచ్చూద్రులు - ఉత్తరహిందూస్థానములోని పుణ్యక్షేత్రములు - నేపాళము - కాశ్మీరము - రణజిత్తుసింగు -

గంగలో నడిచేపడవలు - గాజీపురము - పన్నీరు, అత్తరు - అహల్యాబాయి - పరిమళ తైలములు - పట్నాషహరువర్ణన.వంద డెబ్బై రెండు నుంచి వంద ఎనభై ఐదు వరకు

పద్నాలుగు. కొంపినీవారి రాజ్యాధిపత్యము - స్వదేశసంస్తానాలు - జ్వాలాముఖి - రణజిత్తుసింగు -

నేపాళము, దేవప్రయాగ - వల్లభాచార్యపీఠము - బ్రాహ్మణశాఖలు - దాక్షిణాత్యులు - ద్రావిళ్ళు - గౌడులు ఘార్జరులు - తురకల దండయాత్రలు - చిత్సావనులు - నంబూద్రీలు -

వర్ణాశ్రమధర్మము మానవకల్పితమూ, ఈశ్వరనిర్ణయమా? -మూలసంసృతులు -

సహగమనము - స్మృతికర్తలు - క్రీస్తుమతము, ల్మహమ్మదుమతము - ఉపస్మృతులు -

పురాణములు, ఉపపురాణములు - సాకారాద్త్యైతము.వంద ఎనభై ఐదు నుంచి రెండు వందలు రెండు వరకు

పదిహేను. నీమానదామా - గయామహాక్షేత్రము - సాహేబుగయా - క్షేత్రమహత్మయ -

గయాసురుని కధ - అష్టగయ - చేసే క్రమము - అహల్యాబాయి - పల్గునిశ్రాద్ధము-పిండపిచ్చి - ప్రేతగయావళీలు - విష్ణుపాదము, అక్షయవటము భౌద్ధగయ - గయావ్రజనము -

రామపర్వతము.రెండు వందలు మూడు నుంచి రెండు వందలు పదిహేడు వరకు

పదహారు. సుఫలం - అష్టతీర్ధాలు - విష్ణుపాదశ్రాద్ధము - బ్రహ్మయోని - తీర్ధమహిమలు - కాశీగయా మహత్మ్యములు - మగధదేశంలోని మహాస్థలములు - యాచకులు -

పంటలు, ఫలజాతులు - పంచగయలు - జమీందారీలు -, కారన్ వాలీసు శాశ్వతపైసలా, -

గ్రామ పరిపాలన - అభినమందు, కంపెనీ యిజారా. రెండు వందలు పదిహేడు నుంచి రెండు వందలు ముప్పై ఒకటి వరకు

పదిహేడు. పాట్నానుండి గంగానదిమీద ప్రయాణము - ముప్పైమూడుకోట్ల దేవతలున్నా

దేవుదోక్కడే -శైవవైష్ణవాదిశాఖలు - మాంఘీరు- సీతాగుండము- ఉష్ణగుండపు కధ-

దాతావైధ్యనాధము-అణీమాధ్యష్టసిద్ధులు - కహలుగాం - రాజామహలు - కొంపినీ

ఉద్యోగాలు, జీతాలు, లంచాలు - పార్శీభాష.

ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర

విషయసూచిక

కాశీయాత్ర చరిత్ర సం|| రెండవకూర్పు

లోపలి టైటిల్ పేజి, ముఖపత్రం, నకలు. ఈముద్రణం

పుట

ఆకూర్పులోఏనుగుల వీరాస్వామయ్యగారి బొమ్మకు ఫోటో

శ్రీనివాస పిళ్ళెగారు వ్రాసిన పీఠీక.ఒకటి నుంచి రెండు వరకు

కాశీయాత్ర చరిత్రలోని ప్రసంగములు ఒకటి నుంచి ఏడు వరకు తాత్పర్యము.

కాశీయాత్రచరిత్రలో వర్ణింపబడిన షహరులు. ఐదు

చెన్నపట్నం ఓరియంటల్ మాన్యుస్క్రిబ్ట్సు లైబ్రరీలోవున్న

కాశీయాత్ర చరిత్ర వ్రాతప్రతి మొదటిపుట నకలు. ఎనిమిది

ఏనుగుల వీరాస్వామయ్యవారి జీవితచరిత్ర.ఒకటి నుంచి పది వరకు

--శ్రీనివాస పిళ్ళెగారు వ్రాసినది.

కాశీయాత్రచరిత్ర, మూలగ్రంధము

సౌరమానము, చాంద్రమానము, అధికక్షల్యమాసాలు

సవరణల పట్టిక, అకారది విషయసూచిక.

ఒకటి., పద్దెనిమిది వందల ముప్పై మే పద్దెనిమిది, చెన్నపట్టణము నుండి ప్రయాణము - తిరుపతి దేవస్థానము - కంపెనీ సర్కారు విచారణ - సాలుకు లక్షరూపాయల లాభము - అహోబళము - కందనూరి నవాబు హాప్సీలు - మహానంది - ఆత్మకూరు - శ్రీశైల యాత్ర - యాత్రీకులపైన హాశ్శీలు - చెంచువాండ్లు - నాగులోటి - అడివి.ఒకటి నుంచి పదిహేడు వరకు

రెండు. శ్రీశైలం - గుడి - కందనూరి నవాబు హాశ్శీలు - నివృత్తి సంగమం - కృష్ణానది - గ్రామముల పరిపాలన - కరణాలు - కావలి బంట్రౌతులు - బళ్లారిజిల్లా - సిద్ధేశ్వరం ఘాటు - హయిదరాబాదు రాజ్యం - జమీందారులు - దేశాటనము. పద్దెనిమిది నుంచి ముప్పై రెండు వరకు

మూడు. హయిదరాబాదు - మొహరం - బేగంబజారు - షహరు వర్ణన - పరిపాలన - చందులాలా - శికిందరాబాదు - ఇంగ్లీషుదండు - కంపెనీవారి రాజ్య తంత్రము - పరిపాలన - నైజాం జమీందారులు - యీదలవాయి - దొంగల భయము - వేములవాడ భీమకవి.ముప్పై రెండు నుంచి నలభై ఐదు వరకు ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర

సంపాదకుని ఫుట్నోట్సు - వివరణల సూచిక.

కాశీయాత్ర చరిత్ర గురించి పుట

శ్రీగిడుగు వేంకటరామమూర్తిపంతులుగారి ప్రశంస, ముఖపత్రం

కాశీయాత్ర చరిత్ర తృతీయ ముద్రణం పీఠికలో

బిషప్ హాబరుగారి భారతదేశయాత్ర ప్రశంస, ఒకటి నుంచి రెండు వరకు

ఏనుగుల వీరాస్వామయ్యగారు - వారిమిత్రులు...... నాలుగు నుంచి పది వరకు

వీరాస్వామయ్యగారి జీవిత విశేషాలు........ నాలుగు

కోమలేశ్వర, పురం శ్రీనివాసపిళ్ళెగారు....... ఐదు

జార్జినార్టన్ గారు-వెంబాకం రాఘవాచార్యులు గారు...... ఐదు

కంపెనీ పరిపాలన - ప్రజలస్థితి........ ఆరు

హిందూలిటరరీ సొసైటీ...... ఆరు

నవయుగారంభం....... ఏడు

శ్రీగాజుల లక్ష్మీనర్సుసెట్టి గారు...... ఏడు

చరిత్ర సాధనాలు...... ఏడు నుంచి ఎనిమిది వరకు

వీరాస్వామయ్యగారు బ్రౌను గారికి వ్రాసిని లేఖ....... ఎనిమిది నుంచి పది వరకు

చెన్నపట్నం ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములో ఉన్న కాశీయాత్ర చరిత్ర ఇరవై ఆరు

మాదిరి పుట, చూడు షహరుల వర్ణనగల పుట,

శ్రీనివాసపిళ్ళెగారు వ్రాసిన వీరాస్వామయ్యగారి జీవిత చరిత్రలో వివరణలు

విఫరణ పుట

తూర్పుఇండియా వర్తక సంఘం, కంపెనీ,వారి ప్రభుత్వకచ్చేరీలు

వర్తక కార్యాలయాలు

ఇంగ్లీషు హవుసు ఆపు యేజన్సీలు

లోయర్ హవుసు

బోర్డు అపుత్రేదు ఆఫీసు

చెన్నపట్నం హైకోర్టుకు పూర్వంవున్న ఉన్నతకోర్టులు

సుప్రీంకోర్టు

సదర్ అదాలతు కోర్టు

చాంద్రమానము సౌరమానము

అధిక క్షయమాసాలు

, చూడు, అనుమంధం,

సర్ రాల్ ఫ్ సాంగ్తర్

నందన సం|| కరవు

సర్ రాబర్టు కెమిన్

వారాస్వామయ్యగారి మరణసంవత్సరం ఏనుగుల వీరాస్వామయ్యగారు, వారి మిత్రులు

History of the Presidency College Mfedra-s, Centenary, పంతొమ్మిది వందల నలభై-

The Madras Tercentenary Commemoration Volume

The History of Madras- Prof. C. S. Srinivasachari

H, D. Love

Vestiges of Old Madras

Life of Gazida, Lakshminarsu Chetty Garu,. Representative

-men of Southern India-by G, Parameswaram Pillai, పద్దెనిమిది వందల తొంభై ఆరు,

The Journal of Vennelacunty Soobrow, Native of Ongole

Foster Press, Madras. పద్దెనిమిది వందల డెబ్బై మూడు

శ్రీ ఒంగోలు వెంకటరంగయ్యపంతులుగారు వ్రాసిన నెల్లూరులోని కొందఱు గొప్పవారూ---వెన్నెలకంటి సుబ్బారావుపంతులుగారు. అనేచిన్నపుస్తకం.

సం|| మార్చి ఒకటి వతేదీ మొదలు కృష్ణాపత్రికలో పదకొండు సంచికలలో ప్రకటింపబడిన ఇంగ్లీషుచదువులు అనే శెర్షికతో నేను వ్రాసిన వ్యాసాలు.

ఆంధ్రపత్రిక వృషసంవత్సరాది సంచికలో చెన్నపట్టణము దాని పూర్వచరిత్ర అనే శీర్షికతో నేను వ్రాసినపెద్దవ్యాసం.

ఆంధ్ర వార పత్రికలో పంతొమ్మిది వందల నలభై ఒకటి స|| మార్చి ఇరవై ఆరు వతేదీ మొదలు ఐదు సంచికలలో నేను వ్రాసిన బిషప్ హెబర్ గారి భారతదేశయాత్ర అనే వ్యాసాలు.

ఆంద్రపత్రికలోనే పంతొమ్మిది వందల నలభై ఒకటి సం|| ఫివ్రవరి ఐదవ తేదీన కాశీయాత్ర చరిత్రను గురించిన్నీ జూలై ముప్పైవ తేదీన శ్రీ ఏనుగుల వీరాస్వామయ్యగారిని గురించిన్నీ నేను వ్రాసిన వ్యాసాలు.

సి. పీ. బ్రౌన్ దొరగారికి వీరాస్వామయ్యగారు వ్రాసిన లేఖ

[వీరాస్వామయ్యగారి దస్తూరితో ఇంగ్లీషులోవున్న-అసలు ఉత్తరం, చెన్నపట్టణమున ఓరియంటల్ మాన్యుస్చ్రిప్ ట్సు లైబ్రరరీలోవున్న కాశీయాత్ర చరిత్ర వ్రాతప్రతిచివర అతికించియున్నది. దానకిది తెనుగు. ఉత్తరంపైన బ్రౌనుగారి స్వదస్తూరీతో రెమార్కు వున్నది. ఉత్తరంపైన సీ. పీ. బ్రౌన్ ఎస్కైర్, మచిలీపట్టణము అని పై విలాసమున్నది]

నాప్రియమైన అయ్యా మద్ర్రాసు

వ సం|| పదిహేనవ తేది

నేను నాకుటుంబంతో కిందటి సెప్టెంబరు నెలలో సుఖంగా చెన్నపట్టణచేరి సుప్ర్రీము కోర్టులో నా, ఇంటర్ ప్రిటర్, నే చూపడం ప్రారంభించినాను. నేను చాలాకాలము సెలవులో వున్నందున చేయలసిన పని చాలా పెరిగిపోయి యున్నది. అందువల్ల తమకు ఇంతకు పూర్వము జాబు వ్రాయలేక పోయాను. ఇందుకు నన్ను క్షమింప వేడుతాను.

ఏనుగుల వీరాస్వామయ్యగారు, వారి మిత్రులు.

రచయిత, దిగవల్లి వేంకట శివరావు.

ఏనుగుల వీరాస్వామయ్యగారు పంతొమ్మిదో శతాబ్ద ప్రారంభంలో క్రీస్తు శకం పదిహేడు వందల ఎనభై నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఆరు వరకు మధ్య చెన్నపట్నంలోవుండి, ప్రజాసేవచేసిన ఆంధ్రమహా..... ప్ర వీరుచెన్నపట్టాణంకాపురస్తులు. ఆంధ్రనియోగి బ్రాహ్మణులు. వీరి తండ్రి సామయమంత్రి. ఫీరిది శ్రీవత్సగోత్రము. పద్దెనిమిది వందల పదిహేను మొదలుకుని పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది వరకూ పట్టణంలో సదర్ అదాలతు కోర్టులో ఇంటర్ ప్రిటరుగా వుండిన ఒంగోలుజిల్లా కాపురస్థుడైన శ్రీ వెన్నెలకంటి సుబ్బారావు పంతులుగారికిన్ని, రాజానగరం, అచవెలవగైరా గ్రామముల జమీందారులున్ను రాజమహేంద్రవరం కాపురస్థుడు అయిన శ్రీ కొచ్చెర్లకోట వెంకటరాయనింగారికిన్నీ వీరు బంధువులు. వీరేసంవత్సరంలో జన్మించారో తెలియలేదు. అయితే పద్దెనిమిది వందల ముప్పై ఐదులో తనువు చాలించుకునేటప్పటికి యాభై ఐదు సంవత్సరాలున్నాయనుకుంటే, వీరు పదిహేడు వందల ఎనభై లో పుట్టి యుంటారు.

వీరాస్వామయ్యగారికి తొమ్మిదవయేటనేతండ్రి చనిపోయినాడు. తేడాఎక్కువగా లేదు. ఈయన కష్టపడి వీధిబడిలో తెనుగు, అరవము, సంసృతము చదువుకొని స్వయంకృషివల్ల ఇంగ్లీషునేర్చుకొని, తన వన్నెండవ యేటనే ఈస్టు ఇండియా వర్తశకంపెనీవారి కొలువులోవాలంటీరుగా ప్రవేశించి, కొన్నిచిన్నవుద్యోగాలుచేసి మద్రాసులో నేటి హైకోర్ఘుకు పూర్వం వుండిన సుప్రీము కోర్టుకు తెలుగు అరవము ఇంగ్లీషు భాషలలో తర్జుమాచేసే ఇంటర్ ప్రిటర్ ఉద్యోగంలో పద్దెనిమిది వందల పంతొమ్మిది లో ప్రవేశించి, హెడ్ యింటర్ ప్రిటర్ పదవిని పొందారు. ఆ కాలంలో అది పెద్ద ఉద్యోగం. ఆ న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తులుగా వుండిన అందరి మన్ననలకూ వీరు పాత్రులై పద్దెనిమిది వందల ముప్పై ఐదు లో కొలువు చాలించుకున్నారు. వెయ్యి ఎనిమిది వందలు ముప్పై ఆరువ సంవత్సరం అక్టోబరు మూడవ తేదీన స్వర్దస్థులైనారు.

వీరాస్వామయ్యగారికి యింగ్లీషు తెలుగు అరవలందున్నూసంసృతంలో మంచి పాండిత్యం వుండేది. వీరికి శ్రుతిస్ముతులు, శాస్త్రాలు, బాగా తెలుసును అనేక పండితసభలందు పాల్గొన్నారు. పద్దెనిమిది వందల ఇరవై రెండు నుంచి పద్దెనిమిది వందల ఇరవై మూడు వరకు మధ్య క్షయమాస నిర్ణయించడానికి జరిగిన సభలో వాదించి గెలిచారు. గయలోజరిగిన పండితసభలో స్మృతులేవో ఉపస్మృతులేవో ఆదిపురాణాలేవొ నిర్ణ యించారు. స్మృతి చందస్సు తర్జుమాచేశారు. వీరాస్యామయ్యగారు దొరలతో రాజకీయ సాంఘిక మతవిషయాలు నిర్బయంగా చర్చించేవారు. వీరి అభిప్రాయాలు విమర్శలు కొన్ని వీరు రచించిన కాశీయాత్రలో వున్నాయి.

సీ. పె. బ్రౌనుదొరగారు వీరికి స్నేహిగులు. ఈ బ్రొవ్నుదొరగారు పద్దెనిమిది వందల యాభై ఐదు మధ్య్స ప్రకటించిన తెలుగు నిఘంటువులో ఇంద్రాణి, శేదా, పాలకట్టు, సంవర అను పదాల అర్ధాలకు వీరాస్యామయ్యగారిని ప్రమాణంగా పేర్కొన్నారు.

ఏనుగులవీరాస్వామయ్యగారు, వారిమిత్రులు

నాటిపరిపాలనకోసం చెన్నపట్నం సుప్రీముకోర్టులో ఒక్కస్కీము తయారుచేహించారు. ఆ ప్రకారం పద్దెనిమిది వందల ముప్పై రెండు లో ఏర్పాటు చేయబడిన మొదటి ధర్మకర్తల బోర్డులోశ్రీనివాస పిళ్ళెగారి నొక ధర్మకర్తగా నియమించరు. ఆబోర్డుకు శ్రీ వెంబాకం రాధవచర్యులుగారు అధ్యక్షులు గా వున్నారు. ఆయన పద్దెనిమిది వందల పన్నెండులో చనిపోగా శ్రీనివాసపిళ్ళెగారే అధ్యక్షులై పద్దెనిమిది వందల యాభై రెండు లో చనిపోయేవరకు ఆపదవిలోవున్నారు. ఝార్జినార్టన్ గారు పేట్రన్ గా వుండి పచ్చయప్పకళాశాల స్థాపనకూ అభివృద్దికీ మూలకారకులలో ఒకరైనారు.

కంపెనీ పరిపాలన ప్రజల స్థితి

వరకూ యీదేశంలో ఇంగ్లీషు విద్య స్థాపింపబడలేదు. ప్రజలలో అజ్ఞానం చాలా వ్యాపించివుంది. కంపెనీవారు కేవలం రాజ్యాక్రమణలోను వ్యాపారంలోను పన్నుల వసూలులోను మునిగి తమ లాభమే ఆలోచించేవారు గాని ప్రజల కష్టసుఖాలను గురించి యోచించేవారు కారు. పూర్వగ్రామ పంచాయరీల పరిపాలన తీసివేసి కలెక్టర్ల పరిపాలన స్థాపించారు. ఈకంపెనీపరిపాలనలో ప్రజలు దరిద్రులై విద్యలేక అజ్ఞానాంధకారంలోను అనారోగ్యంలోను పది ఉండెను, రాకపోకలకు రోడ్లు, పల్లపు సాగుకు సౌకర్యాలు లేకపోవడము, పన్నులూధికంగాఉండి రైతులు భరించలేక పోవడము, పన్నులివ్వలేనివారిని హింసించడము, కలెక్టర్ల నిరంకుశత్వము, అధికారుల లంచగొండితనము కోర్టుల ల్యప్రయోజకత్వము క్రైస్తవ మతబోధకుల విజృంభణములవల్లను ఇంకా ఇతర అన్యాయాల వల్లను ప్రజలు బాధపడుతూవుండేవారు. కొంత ఉదారబుద్ధి గలిగి విధ్యాభివృద్ధి చేయ దలచిన చెన్నపట్నం కాస్తమంచి ప్రయత్నంకూడా ఆగిపోయింది.

మనడేశప్రజలకు ఇంగ్లీషు వారిని చూస్తేనేభయం, తమహక్కు- కష్టాలు ఎవరితో చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలోకూడ తెలియదు. వీరికి దారి చూపించే నాయకులున్నూ లేదు.

హిందూ లిటరరీ సొసైటీ

ఇలాంటి పరిస్థితులలో ప్రజలలో కొంతచైతన్యమూ విజ్ఞానము కలిగించాలని ఏనుగులవారాస్వామయ్యగారు, రాఘ వాచార్యులు గారు, శ్రీనివాస పిళ్ళెగారున్నూ కలిసి జార్జి నార్టను గారి నాయకత్వం కింద చెన్నపట్నంలో హిందూ లిటరరీ సొసైటీ అనే ప్రజాసంఘాన్ని ష్తాపించి సభలుచేసి ఉపన్యాసాలిప్పించి గొప్ప కృషిచేశారు. ఈసభ అదరణకింద దేశ చరిత్రను గురించీ దేశపరిపాలన గురించీ రాజ్యాంగశాస్త్రమును గురించీ ఇంగ్లీషువిద్యావశ్యకతను గురించీ ప్రజల హక్కులను గురించీ నార్టనుగారు పంతొమ్మిది వందల ముప్పై మూడు నుంచి పంతొమ్మిది వందల ముప్పై నాలుగు వరకు మధ్య కొన్నిమహోపన్యాసాలిచ్చారు. అందువల్ల చెన్నపట్నం ప్రజలలో రాజకీయ పరిజ్ఞానంకలిగింది. ప్రజలు ఇంగ్లీషు విద్య కావలెనని కంపెనీవారిని కోరడం ప్రారంచించారు.

ఏనుగుల వీరాస్వామయ్యగారు, వారి మిత్రులు

నవయుగారంభం

చెన్నపట్నంలో ఒక ఇంగ్లీషు కాలేజీ స్థాపించడం అవసరమనిన్నీ తాముకూడా కొంతసొమ్ము విరాళం యిస్థామనిన్నీ ప్రభుత్వం స్థాపించే విధ్యాశాఖపరిపాలనలో తమకుకూడా కొంత అధికారమూ పలుకువడీ వుండాలనిన్నీ కోరుతూ ఒక మహజరు తయారుచేసి డెబ్బై వేలమంది సంతకాలుచేసి జార్జీనార్టన్ గారి ద్వారా పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది నవంబరు లో గవర్నరుకు అందచేశారు. అంతట గవర్నరు ఎల్ ఫిన్ ష్టన్ గారు ఇంగ్లీషువిద్యావిధానం స్థాపించడానికి నిశ్చయించి కొందరు దొరలు, స్వదేశీయులును గలఒక యునివర్సిటీ బోర్డును పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో నియమించారు. అందులోమన రాఘవాచార్యులు గారు, శ్రీనివాసపిళ్ళెగారుకూడా సభ్యులు. దానికి జార్జి నార్టన్ గారు అధ్యక్షులు. తరవాత స్థాపింపబడిన మద్రాసు యునివర్సిటీ అనే ఉన్నత పాఠశాల పరిపాలక వర్గంలోకూడా వీరిని సభ్యులుగా నియమించారు. పద్దెనిమిది వందల నలభై ఒకటి ఏప్రిల్ నెలలో జరిగిన ఆ ఇంగ్లీషు ఉన్నత పాఠశాల ప్రారంబోత్సవంలోప్రజలు ఉత్సాహంచూసి ఒక నూతన యుగం ప్రారంభమైందని గవర్నరుగారే అన్నారు.

, శ్రీగాజుల లక్ష్మీనర్సు సేట్టిగారు

ఫీరాస్వామయ్య ప్రభ్రుతులు ప్రజాసేవ ప్రారంబించిన ఏడేండ్లలోనే చెన్నపట్నం లో ఆంధ్రవర్తకులైన శ్రీ గాజుల లక్ష్మీనర్సుసెట్టిగారు రాజకీయనాయకులై కంపెనీపరిపాలనలోవున్న లోపాలు మిషనరీచేస్తూవున్న అన్యాయాలు ప్రజల కష్టాలు పైవారికి తెలియచేసి రాజ్యాంగ సంస్కరణల కోసం పాటుపడడానికి చెన్నపట్టణ స్వదేశసంఘాన్నీ క్రెసేంటు అనేజాతీయపత్రికను పద్దెనిమిది వందల నలభై నాలుగు లో స్థాపించి గొప్పరాజకీయ ఆందోళనలేవదీసి ఇరవైఐదేండ్లు ప్రజాసేవచేశారు.

ఇలాగ తరువాత కలిగిన విద్యాభివృద్దికీ జాతీయ చైతన్యానికీ ఉత్తరదేశంలో రమమోహనరయల లాగ ఇక్కడ మన శ్రీనివాపిళ్ళె, వీరాస్వామయ్య ప్రభృతులే పునాదివేశారని నిస్సంశయంగా చెప్పవచ్చు. పచ్చయప్పకళాశాలాభవనంలో వున్న జాన్ బ్రూస్ నార్టన్ గారు ఈదక్షిణ హిందూస్థానంలో ఇంగ్లీషు విధ్యాభివృద్దికి మూలపురుషులు వీరేనని ప్రశంసించారు.

, చరిత్ర సాధనాలు

ఏనుగుల వీరాస్వామయ్య గారి జీవితాన్నిగురించీ వారి కాలంనాటి స్థితిగరులను గురించీ వారు చేసిన ప్రజాసేవగురించీ శ్రీనివాసపిళ్ళె ప్రభృగులను గురించీ ఇంకా వివరాలు తెలుసుకోగోరేవారు ఈక్రింది పుస్తకాలు, పత్రికలు, చూడవచ్చును.

Rudimentals,--by George Norton, పద్దెనిమిది వందల యాభై ఒకటి,

Educational speeches of The Hon. John Bruce Norton పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి పద్దెనిమిది వందల అరవై ఐదు వరకు

The Madras Journal of Education Aprfl పద్దెనిమిది వందల అరవై ఎనిమిది, p p.వంద యాభై నాలుగు నుంచి వంద యాభై ఐదు వరకు

Asylum Press Almanac. Madras, పద్దెనిమిది వందల ఇరవై నుంచి పద్దెనిమిది వందల ముప్పై ఐదు వరకు

Histoiy of Pacbaitppas Charities History of the Presidency College Madras, Centenary, పంతొమ్మిది వందల నలభై.

The Madras Tercentenary Commemoration Volume

The Histoiy of Madras- Prof C, S, Srinivaaachari

Vestings of old Madras-- H. D. Love

Life of Gazola Lakshminarsu Chetty Qaru, - Representative

men of Southern India by G, paramehwaram Pillai(పద్దెనిమిది వందల తొంభై ఆరు}

. The Journal of Vennelacunty Soobrow, Native of Ongole

Foster Press, Madras. పద్దెనిమిది వందల డెబ్బై మూడు

శ్రీ ఒంగోలు వేంకటరంగయ్యపంతులు గారు వ్రాసిన నెల్లూరులోని కొందఱుగొప్పవారూ--వెన్నెలకంటి సుబ్బారావు పంతులుగారూనేచిన్నపుస్తకం.

సం|| మార్చి మొదటి తేది మొదలు కృష్ణాపత్రికలో పదకొండు సంచికలలో ప్రకటింపబడిన ఇంగ్లీషు చదువులు అనే శీర్షికతో నేను వ్రాసిన బ్యాసాలు.

ఆంధ్రపత్రిక వృషభసంవత్సరాది సంచికలో చెన్నపట్టణము దాని పూర్వ చరిత్రా అనే శీర్షికతో నేను వ్రాసిన పెద్ద వ్యాసము. ఆంధ్ర వార పత్రికలో పంతొమ్మిది వందల నలభై ఒకటి సం|| మార్చి ఇరవై ఆరువ తేదీమొదలు ఐదు సంచికలలో నేను వ్రాసిన బిషప్ హెబర్ గారి భారతదేశయాత్ర అనేవ్యాసాలు. ఆపత్రికలో పంతొమ్మిది వందల నలభై ఒకటి సం|| ఫిబ్రవరి ఐదవ తేదీన కాశీయాత్ర చరిత్రగురించిన్నీ జూలై ముప్పైవ తేదీన శ్రీ ఏనుగుల వీరాస్వామయ్యగారిని గురించిన్నీ నేను వ్రాసిని వ్యాసాలు.

, సి పి బ్రొన్ దొరగారికి వీరాస్వామయ్యగరు వ్రాసిన లేఖ

[శ్రీ వీరాస్వామయ్యగారి దస్తూరితో ఇంగ్లీషులోవున్న అసలు ఉత్తరం, చెన్నపట్టణమున ఓరియంటల్ మాన్యూస్క్రిట్సు లైబ్రరీలోవున్న కాశీయాత్ర చరిత్ర వ్రాతప్రతిచివర అతికించి యున్నది. దానికిది తేలుగు. ఉత్తరపైన బ్రౌనుగారి దస్తూరితో రెమార్కు వున్నది. ఉత్తరం పైన సి పి బ్రౌన్ ఎక్త్వర్, మచిలీపట్టణము అని పైవిలాసమున్నది]

మద్రాసు, వెయ్యి ఎనిమిది వందలు ముప్పై ఒకటివ సం|| డిశంబరు పదిహేనవ తేది.

నాప్రియమైన అయ్యా

నేను నాకుటుంబఒతో కిందటి సెప్టెంబదు నెలలో సుంఖంగా చెన్నపట్టణం చేరి సుప్రీముకోర్టులో నా, ఇంటర్ ప్రిటర్, పని చూడడం ప్రారంబించినాను. నేను చాలాకాలము సెలవులో వున్నందున చేయవలసిన పని పెరిగి పోయి యున్నది. అందువల్ల తమకు ఇంతకుపూర్వము జాబు వ్రాయలేక పోయాను. ఇందుకు నన్ను క్షమింప వేడుతాను.

ఏనుగుల వీరాస్వామయ్యగారు బ్రొను గారికి వ్రాసిన లేఖ.

ఈ పుస్తకం ప్రకటించడంలో దీనివల్ల నేను లాభము పొందదలచడంలేదని మనవి చేస్తున్నాను దీని ప్రతులను అమ్మడంవల్ల వచ్చే లాభాన్ని ఇచ్చివేయడానికి నాకు యేలాంటి అభ్యంతరమున్నూ లేదు. నష్టమేమైనావస్తే నేనే భరింపగలను. నష్టము రాదనే నా దృడనిశ్వాసము.

నేను మచిలీపట్టణముననున్న కాలంలో తాము నాయెడల చూపిన దయకు నా కృతజ్ఞతాభివందనాలు స్వీకరింపగోరుతాను. ఈయూరినుంచి తమకేమికావలిసినా నాకు తెలిపితే నేను ఆపనిని జాగ్రత్తగా చేస్తాను.

ఇలాగ చనువు తీసికొన్నందులకు క్షమింపవేడుతూ తమ యారోగ్యము కొరకు సౌఖ్యముకొరకు పరమేశ్వదుని ప్రార్ధిస్తూ అతిగౌరవ పురస్సంగా మీముందు తమవిధేయుడు. భృత్యుడు.

, Y, యే. వీరాస్వామి

అని ఇంగ్లీషుసంతకం వున్నది.

తాజాకలం.

ప్రస్తుతం స్టోనుహౌసు దొరగారివద్ద వున్న నాతమ్ముణ్ణిగురించి నేను తమల్ని వేడుకున్న విషయం తమకు వినయముతో జ్ఞాపకం చేస్తున్నాను.

, Y, యే. వీరాస్వామి

అని ఇంగ్లీషుసంతకం వున్నది.

ఈ జాబుపైన సి పి బ్రౌనుగారి నోటు,

ఆపుస్తకాన్నిప్రకటించడానికి ఇంకా సిద్దంగా లేమనిన్నీ ఆపుస్తకమును పంపితే చూస్తాననిన్నీ స్కాందమును ఈకింది బభాగాలను తెనిగించేపని ప్రస్తుతము నిలుపుతున్నాననిన్నీ, సూతసంహిత నావద్ద వున్నదనిన్నీ తెలుపుతూ పద్దెనిమిది వందల ముప్పై రెండు జనవరి ఇరవై ఐదవ తేదిన జవాబువ్రాయడమైనదీ అని యున్నది.

ఈ కాశీయాత్ర వ్రాత ప్రది నాలుగు వందలు యాభై ఐదు పుటలో, మచిలీబందరును గూర్చి వ్రాస్తూ నాతమ్ముడయిన సీతాపతికి బారుజల్లీ అనే తాలూకాకు పని అయిందన్నీనాకోసరం బందరులో శలవుమీద కాచివున్నాడు అని వీరాస్వామయ్య గారు వ్రాశారు. బహుశ, పైఉత్తరంలో ఉదాహరించిన తమ్ముడు అతడే అయి యుండవచ్చును.

ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర

ప్రకణము పుటలు

లిపులు - గయాళీలు పంచగౌడ బ్రాహ్మణుల ఆచారములు - సౌరమాన చాంద్రమాన బార్హ స్పత్యమాసములు - అధికక్షయ మాసాలు - తమలపాకులు - నావదొంగలు - ఆధ్వాచార్యులు - గవళీలమతము -

దేశాలు, చప్పభాషలు - ఏడులోకాలు - ఉత్తరదక్షిణ ధృవములు - దేవతలు, గంధర్వులు, రాక్షసులు, పిశాచములు-సప్తసముద్రాలుసృష్టిక్రమము - పృధవ్యస్తేజో వాయ్వ్యాకాశాలు - పర్తవము - ప్రకృతులు ఆత్మ అంతరాత్మ పరమాత్మ - తిర్య్హగ్జంతుకోటి - ఆక్కశవాయునహ్నీభూతాలు - సత్వరజస్తమోగునములు - అరిషడ్వర్గములు - లింగభేదములు - సప్తగ్రహములు - ఇంగ్లీషు గ్రహలాఘవశాస్త్రము. సూర్య సిద్ధాంతము - అహ, ప్రమాణములు - ఇంగ్లీషు వారి భూగోళజ్ఞానము.

బదర్ గయానుండి కలకత్తాకు పోవు గంగానది మార్గములు - జలచరములు - బజరాల ప్రయాణము - కృష్ణనగరము - నదీయ, నవద్వీపము, - కాంటిపూరు - హుగ్గలీ - బారకుపూరు - శ్రీరాంపూరు - కలకత్తా - కాళికాశక్తి-గుడి-పూజలు, ఉత్సవములు- బంగాళీ స్త్రీపురుషులు-కులీనులు- కలకత్తా పూర్వచరిత్ర - మూర్షిదాబాదు నవాబు, డిల్లీపాదుషా, ఇంగ్లీషు వారి రాజ్యతంత్రము- కలకత్తావర్ణన-ఇంగ్లీషు కాలీజు-క్రీస్తుమత ప్రచారము.

వుడుబడియా - ఆయుధాల నిషేధము - భద్రకాళి - జలేశ్వరము - మండిజ్వరము - కాళేశ్వరము - మత్స్యభక్షణ - పెరిమిట్టు చౌకీలు - వుత్కలదేశము - వైతరణీనది, నాభిగయ, జాజిపురము - బోయీలు - సుఖరోగములు - కటకము - ఇంగ్లీషువారి రాజ్యతంత్రము.

క్రీస్తు మతాంతరుల కీ కర్మదేశ మెందుకు వశమైనది? - వర్ణాశ్రమములు పాడగుట - ఇంగ్లీషువారు, క్రీస్తుమత ప్రచారము, మహమ్మదీయులు - హిందూమహమ్మదీయ క్రైస్తవమతములకు, బ్ర్రాహ్మణులకు దొరలకు, గల తేడాను గూర్చిన ఇతిహాసములు - సత్యవాది, కులీనబ్రాహ్మణుని కధ - జగన్నాధ మహాక్షేత్రము - స్థలపురాణము - గుడివర్ణన - అర్చనలు భోగములు - బలభద్ర కృష్ణ సుభద్రలు, సుదర్శనమూర్తి-జగన్నాధ ప్రసాదము - వీని అంతరార్ధము.

నరసింగఘాటు - కళింగ గౌరకోమట్లు - చిలక సముద్రము - పోలీసు నౌకరులు- తపాలా ఉద్యోగులు - మన్యాలు - గంజాంషహరు పాడుబడుట - ఋషికుల్యనది - కళింగదేశము - చతాపురము -కొండపాళెగాండ్ర బందిపోట్లు - అధర్వణవేదము- యిచ్చాపురము - గంజాంజిల్లాలో రేవులు - జమీందార్లు, బందిపోట్లు - ఏక, పాసానికురుతే ఫలం భుంజ్కే

లిపులు - గయాళీలు పంచగౌడ బ్రాహ్మణుల ఆచారములు. సౌరమాన చాంద్రమాన బార్హ స్పత్యమాసములు - ఆధికక్షయ మాసాల - తమలపాకలు -నావదొంగలు మధ్వాచార్యులు - గయావళీలమతము. రెండు వందలు ముప్పై ఒకటి నుంచి రెండు వందలు నలభై ఐదు వరకు

పద్దెనిమిది. యాభై ఆరు దేశాలు, చప్పన్నభాషలు - ఏడులోకాలు - ఉత్తరదక్షిణశ్వేతములు - దేవతలు, దంధర్వలు, రాక్షసులు, పిశాచములు-సప్తసముద్రాలు- సృష్టిక్రమము - పృధివ్యస్తేజో నాయ్వ్యాకాశాలు - పరితత్వము - ప్రకృతులు - ఆత్మ అంతరాత్మ పరమాత్మ - తిర్యగ్జంతుకోటి - ఆకాశవాయు నహ్నిభూతాలు - సత్వరజస్తమోగుణములు, అరిషడ్వర్వములు - లింగభేదములు - సప్తగ్రహములు - ఇంగ్లీషు గ్రహలాఘవశాస్త్రము, మాగ్యసిద్ధాంతము - అహ, ప్రమాణములు - ఇంగ్లీషు వారి భూగోళజ్ఞానము. రెండు వందలు నలభై ఐదు నుంచి రెండు వందలు యాభై ఒకటి వరకు

పంతొమ్మిది. బదర్ గంజునుండి కలత్తాకు పోవు గంగానది మార్గములు- జలనగములు-బజరాల ప్రాయాణము - కృష్ణనగరము - నదీయ, నరద్వీపము, - శాంతిపూరు - హుగ్గులీ - బారకుపూరు - శ్రీరాంపూరు - కలకత్తా - కాళికాశక్తి - గుడి-పూజలు, ఉత్సవములు - బంగాళీ స్త్రీపురుషులు- కులీనులు - కలకత్తా పూర్వచరిత్ర - మూర్షిదాబాదు నవాబు, డిల్లీపాదుషా, ఇంగ్లీషు వారి రాజ్యతంత్రము. కలకత్తా వర్ణన- ఇంగ్లీషు కాలేజి-క్రీస్తు మతప్రచారము.రెండు వందలు అరవై రెండు నుంచి రెండు వందలు ఎనభై వరకు

ఇరవై. వుడుబడియాస్ - అయుధాల నిషేధము - భద్రకాళి - బలేశ్వరము - మలడిజ్వరము - బాలేశ్వరము - మత్స్యభక్షణ - పేరిమిట్టు చౌకీలు - వుత్కలదేశము - వైతరిణీనది, నాభిగయ, జాజిపురము - బోయీలు - సుఖరోగములు - కటకము - ఇంగ్లీషు వారి రాజ్యతంత్రము. రెండు వందలు ఎనభై నుంచి రెండు వందలు తొంభై ఎనిమిది వరకు

ఇరవై ఒకటి. క్రీస్తుమతాంతగుల కీ కర్మదేశ మెందుకు వశమైనరి? - వ్ఫర్ణాశ్రమములు పాడగుట - ఇంగ్లీషువార్రు, క్రీస్తుమతప్రచారము, మహమ్మదీయులు - హిందూమహమ్మదీయ క్రైస్తవమతలకు, బ్రాహ్మణులకు దొరలకు, గల తేడాను గూర్చిన ఇరిహాసములు - సత్యవాది, కులీనబ్ర్రాఃమణుని కధ - జగన్నాధ మహాక్షేత్రము - స్థలపురాణము - గుడివర్ణన - అర్చకులు భోగములు - బలభద్ర కృష్ణ సుభద్రలు, సుదర్శనమూర్తి-జగాన్నధప్రసాదము -వీని అంతరార్ధము. రెండు వందలు తొంభై ఐదు నుంచి మూడు వందలు పద్నాలుగు వరకు

ఇరవై రెండు. నరసింగ ఘాటు - కళింగగౌరకోమట్లు - చిలకసముద్రము - పోలీసునౌకరులు - తపాలా ఉద్యోగులు - మన్యాలు - గంగాంషహరు పాడుపడుట - ఋషికుల్యనది - కళింగదేశము - చత్రపురము - కొండెపాళిగాండ్ర బందిపోట్లు - అధర్వణవేదము - యిచ్చాపురము - గంజాంజిల్లాలో రేవులు - జమీందార్లు, బందిపోట్లు - ఏకః పాసానికురుతే భజం భుంజ్కే మహాజనం -శిష్టుకరణాలు - బ్ర్రహ్మణులలో నాడు భేదములు, నియోగులు - సరుక్యూటుకోర్టు - ఇంగ్లీషువారి నెరవిచారణ పద్దతి - శ్రీకాకుళము - భోస్త్రీలు - భరతశాస్త్రము - విజయనగరం తాలూకాలో అగ్రహారములు - విజయనగరం చరిత్ర - వర్ణన.

వుప్పాడ బోయీలు - వీరభద్రరాజు పితూరీ - సింహాచలము - విశాఖపట్టణం జిల్లా స్త్రీలసౌదర్యము -తెనుగుభాష - యిండ్ల అలంకారములు - వుప్పాడబోయజాతి, సర్కారుకు తలపన్ను, మద్యపానము - స్త్రీ పురుషులలో మోహము - పిఠాపురము, పాదగయ - పెద్దాపురము జమీందారీలు - రాజానగరము - రాజమహేంద్రవరము - కొచ్చర్లకోట వేంకటరాయనింగారు - వాడపల్లి.

శృంగవృక్షము - మచిలీబందరు పూర్వచరిత్ర - స్త్రీపురుషులు - ఉత్తర సర్కారు జిల్లాల జమీందార్లు - కోమటి జమీందార్లు - కృష్ణా తీరపు యాచక బ్రాహ్కణులు - కళిందదేశము, ఆంధ్రదేశము - స్త్రీపురుషులు - అత్తరుతాంబూలములు - చంచవోలు - బాపట్ల - వేటపాలెము - నెల్లూరు - వుప్పరజాతి వొడ్డెవాండ్లు - నియోగులు, కణీంకములు - అరవమాటలు - వుత్తరపినాకిని మొదలు దక్షిణపినాకినివరకు మధ్యదేశము - నెల్లూరి సీమ స్త్రీపురుషుల స్వభావము.

పొన్నెరి - స్థలమహత్మము - తిరివట్టూరు-స్థలపురాణము, చెన్నపట్నం వారి పత్రాలు, తోటలు - చెన్నపట్నము పూర్వచరిత్ర - శ్రీరంగరాయలు - దామెర్ల వెంకటాద్రి నాయుడు - ఇంగ్లీషువారి రేవు బందరు - కుడి యెడమ కులకక్షలు - ఫ్రాంసువారు -హైదరాలీ - అరికాటు నవాబు రాజ్యం ఇంగ్లీషువారి వశమగుట - చెన్నపట్నం రాజధానిలో కంపెనీ వారి పరిపాలన - చెన్నపట్నం వర్ణన - స్త్రీపురుషుల ప్రకృతి - ఇంగ్లీషువారు.

చెన్నపట్టణ ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారములో నున్న కాశీయాత్ర చరిత్ర వ్రాత ప్రతిని గురించి వారిపుస్తకాల పట్టెడలో వ్రాయబ్నడిన వివరములు.

A DESCRIPTIVE CATALOG OF THE TELUGU MANUSCRIPTS IN THE GOVERNMENT ORIENTAL MANUSCRIPTS LIBRARY, MADRAS.

Vol. VI Vacanakavyus, pages పదిహేడు వందల పదిహేడు నుంచి పదిహేడు వందల ఇరవై ఎనిమిది వరకు నంబరు పద్నాలుగు వందల ఏడు. కాశీయాత్ర చరిత్ర.

KASIYATRA CARITRA.

Substance paper. size పన్నెండు సగం X ఎనిమిది ముప్పావు inches. pages నాలుగు వందలు తొంభై Lines, ఇరవై ఒకటి on a page. Chaaracter, Telugu Condition, slightly injured. Appearance, old. Mode of writing, fair and free from mistakes.

Complete.

The following note appears in the beginning of the work,

N. B.- The printed copy is somewhat abridged from the present one, which was presented to me by the author. This manuscript is given at full length, another copy in my library నంబరు రెండు వందలు నలభై ఏడు is abridged one - and the printed edition is very much retrenched. The present Volume is the best of the three, the alterations afterwards made being not always improvements.

C. P. Brown పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది

At the close the work is made the following note in pencil. Examined by Appaiah and Vencatrow, Render.

At the end of the MS is pasted a private letter of the Author, Enugula Virawami dated ఒకటిth December పద్దెనిమిది వందల ముప్పై ఒకటి, and addressed to Mr. C. P. Brown. In this letter the Author describes the work as follows,

During my last travel to Benares, I took my mute in going thro Cuddapah, Hyderabad, Nagpore, Jabalpore, Mirjapore and Allahabad. In return I came by Gazpore,, Chaprah,, Patna, Gyah, Caltutta, Pooree, Ganjam and all Northern districts, and kept a correct journal of the same. I beg also to inform you that in that journal. I have been giving a correct brief histories of all the Hindoo holly places, rivers, etc., and made several observations upon Hindooism, Mahamadism and Christianity, also upon Hindoo Mi theology and Astronomy. I have also commented shortly upon customs, manners, castes, laws and late Governments of the several places యెనుగుల వీరాస్వామయ్య వారి చేత వాయబడి

కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళెగారి వుత్తరువు ప్రకారం

పుదూరి నారాయణశాస్త్రిచేత లెఖక తప్పులు దిద్దబడి

సం|| ఏప్రిల్ నెలలో

అచ్చువేయబడిన యీపుస్తకము గవర్నమెంటువారి వుత్తరువు ప్రకారము

వర్తమాన తరంగిణీ ముద్రాక్షరశాల యందు

పువ్వాడ వేంకటరావుగారి వలన

రెండవతూరి

ముద్రింప బడినది.

దో సం|| డిసంబరునెల పీ ఠి క

ఇందువల్ల అతి వినయముతో తెలియపరచుటయేమంటే యేనుగల్ వీరాస్వామి అయ్యవారలంగారు కాశీయాత్ర బోవునప్పుడు యాత్ర సంగతులున్ను ఆయా ప్రదేశముల వినోద సంగతులున్ను వ్రాయించి పంపించవలెనని యడిగినందున వారు అలాగే అప్పుడప్పుడు వ్రాయించి పంపగా ఆ సంగతులను పుస్తకముగా చేర్చినాను. అది కరకరంబాటి తపాలా రైటరు-పనయారువేలకు మొదలారి అరవభాషతో తర్జుమాచేయించగా అచ్చు వేయించి ప్రసురము చేయబడియున్నది. అనేక గొప్పప్రభువులు తెనుగు భాషతో నావద్దనున్న యాపుస్తకము ప్రచురము చేయబడితే బహు జనోపయుక్తముగా నుండునని కోరినందున పైన చెప్పిన పుస్తకము కాశీయాత్రచరిత్ర యనే పేరుతో అచ్చుమూలకంగా ప్రచుర ప్రచడమైనది.

యిందులో యాత్రబోవువారికి వుపయోగించేలాగు మాగన్ ములు, మజిలీలు అచ్చట దొరికే వస్తువులున్ను వ్రాసియుండుట మాత్రమేగాక మార్గముల కిరుపక్కలనుండే అడువులు, కొండలు, పొలాలు, గుంటలు, తోపులు, వూళ్ళు మొదలైనవాటి వివరములున్ను మజిలీలొ నుండే స్థలవసతి, గృహవసతి, జలవసతులున్ను మజిలీల సమీప గ్రామముల సంగతులన్ను, తిరువళ్ళూరు, తిరుపతి, అహోబిలము, శ్రీశైలము, కాశి, గయ, జగన్నాధము, శ్రీకూర్మము, దాతావైద్యనాధము, సింహాచలము, కళ్ళేపల్లి, శ్రీకాకొళము మొదలైనదివ్యదేశముల మహిమలున్ను, గంగ, యమున, సరస్వతి, ప్రయాగ, గొదావరి, కృష్ణ, సరయు, శోణభద్ర, కర్మనాశిని, గండకి, ఫల్గుని, పున, పున, నది, సీతాగుండము, బ్రహ్మగుండము, పినాకిని మొదలైన నదుల మహిమలున్ను, హయిదరాబాదు, నాగపూరు, కటకం, కలకత్తా, రాజమహేమ్, ద్రవరం, పట్నా, గంజాం, విశాఖపట్ణం, విజయనగరం, మచిలీబందరు, నెల్లూరు, చెన్నపట్నం వగైరా షహరుల సంగరులున్ను, మరిన్ని ఆయా ప్రస్తావములలో అద్వైత ద్వైత విశిష్టాద్వైత మతములు, క్రీస్తు మహమ్మదు మతములు దక్షిణదేశస్థులకున్న, ఉత్తరదేశస్థులకున్ను వుండే ఆచారాది భేఅములు గౌడద్రావిడాది బ్ర్రాహ్మణ జాతి విభజనలు, భూగోళ భగోళస్థితి క్రమములు మొదలైన యనేక విచిత్రసంగరులు బహు జనోపకారబుద్దితో వ్రాయబడి యున్న వాటిలో యీ కొన్ని విషయములను యీపుస్తకము అచ్చువేసి ప్రచురము చేయపూనుకొన్నందున నాబుద్ధి శక్తి స్వల్పమయినా విధిలేక యధా శక్తిగా వ్రాయడమైనది.

కోలలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళ.

రామజయం

రాజేశ్రీ యేనుగుల వీరాస్వామి అయ్యవారలంగారు లోకోపకారబుద్ధితో యాత్రసంగరులను వ్రాయునప్పుడు ప్రస్తానములలో అనేకులకు సందేహాస్పదములైన విషయములను గురించి తమ సూక్ష్మమయిన బుద్ధిబలముచేత నిష్పక్షపాతముగా ప్రసంగింపుచు తమ తాత్పర్యములను బయిలుపరచి యున్నారుగనుక వాటిని చదివేవారు సులభముగా తెలుసుకునేకొరకు ఆ ప్రసంగములకు మొదటనున్ను తుదనున్ను పుష్పములు వుంచి మరిన్ని స్పష్టముగా తెలిశేకొరకయి ఆ ప్రసంగగ్రంధపంక్తులయొక్క మొదళ్ళనున్ను పుష్పములు వుంచియున్నవి. *అని అతిసులభముగా చరివేవారికి తెలియుటకై ఆ యా ప్రసంగములు వుండే పుటల లెక్కయున్ను ఆ యా ప్రసంగములయొక్క తాత్పర్య సంగ్రహములున్ను ఈ యడుగున వ్రాయబడుచున్నవి.

*ఈపుష్పము గుఱుతు లీముద్రణమున వుంచలేదు.

ప్రసంగ తాత్పర్యము

పూర్వ ముద్రణమున పుట ఈముద్రణములొని పుటలు

యాభై ఆరు. ఇందులో ఆచారాలంకారా హారభేదములు దేశానుసారంగా స్కృతికర్తలు కలగ చేసినందున వొక దేశస్థుడు మరియొక దేశస్థుని నిందించరాదని చెప్పి అందుకు కాశీదేశమందు భోజనానకు దృష్టిదోషము పరిషేచనము చేసుటవల్ల పనిలేదనుచున్నారనిన్ని, ఉదకము పంచభూతములతో చేరినది గనుక అగ్ని మొదలయిన యితర భూతములకు స్పర్స దోషము లేనట్టు ఉదకానకున్న వనిలేదనుచున్నారనిన్ని, పర్యుషితాన్న భక్షణము దక్షిణదేశమందు అనుకూల మని అంగీకరింపబడి యున్నా వుత్తరదేశస్థులు అంగీకరించ లేదనిన్ని దృష్టాంశములు చెప్పబడి యున్నవి. [అరవై ఐదు నుంచి అరవై ఏడు వరకు]

యాభై తొమ్మిది. ఇందులో ప్రపంచమందు యే కార్యమున్ను మంచి చెడుకలిసి యుంచున్నదని చెప్పి అందుకు దృష్టాంతముగా హిందువులు మూఢులకున్ను బాలులకున్ను దైవభక్తి కలగవలనని బింబముల యందు దైవత్వమును ఆరోపించితే పరిపాకమందు కూడా ఆ నమ్మిక పట్టుబడి దైవముయొక్క అఖండ స్వరూపము తెలియకుండా చేయుచున్నదనిన్ని క్రీస్తుమతస్థులు ఆదిలోనే దైవము సర్వ భూతాత్మకమని బోధ చేసుటవల్ల మూఢులున్ను, బాలులున్ను, దైవము కలదనే జ్ఞానమేలేక ముణిగిపోతారనిన్ని విధవలకు వివాహము కూడదంటే బాల విధవలు దు, ఖపడుతారనిన్ని, విధవలకు వివాహము కూడునంటే మొగుణ్ణి చంపి మరివొకణ్ని పెండ్లాడుతారనిన్ని దృష్టాంతములు చెప్పబడియున్నవి. [అరవై ఎనిమిది నుంచి డెబ్బై వరకు]

డెబ్బై ఒకటి. ఇందులో పరమాత్మడు వొక్కడయినా అనేక మూర్తి భేదములుగా పూజింఛడము బాధకము గాదనిన్ని, సృష్టిసంహారములు చేసే బ్రహ్మరుద్రులకు అవతారము నిమిత్తము లేకపోయినా స్థితికతన్ అయిన విష్ణువుకు రక్షణాధన్ మై అనేక అవరారములు

యెత్తవలసి వచ్చినందున అనేక మూర్తి భేదములు కలిగి ఆ ఘాత్రు లు

పూజ్యములయినవనిన్ని ఒక విందులో అనేకవిధములయిన భక్ష్యశాకాదులు

చేస్తే భుజించే వారికి ఒక్కొక్క దానిమీద రుచిగలిగినట్టు భక్తులకు వొక్కొక్కమూర్తి

మీద భక్తి కుదురుననిన్ని చెప్పబడియున్నది.

యిందులో యెట్టివానికిన్ని సరివారిలో తానుగొప్ప పడవలెననేకోరికే కలిగి యుంచున్నదనేటందుకు బోయీలు సవారీ మోసుట ప్రయాసయైనా తమజతలో తాము గౌరవపడవలెనని ప్రయాసపడుట దృష్టాంతముగా చెప్పబడియున్నది.

ఇందులో దాక్షిణాత్యులకున్ను, ఔత్తరీయుల కున్ను ఆచారభేదమున్ను ధైర్యస్థైర్య

భేదములున్ను కలిగిబున్నదనిన్ని దక్షిణదేశము వుష్ణభూమి గనుక అప్పటివారిక్

జఠరాగ్నిమందించి అల్పాహారములు భుజించుటవల్ల హృదయ కలము

దృఢముతప్పుటవల్ల ధైర్యములేక చాంచల్యము కలిగి వుండుటవల్లనే వారి కడతే

రడానకు పెద్దలుగుండా రాజోపచారములతో అనేక దివ్యదేశములు కల్పించబడిన

వనిన్ని ఉత్తర దేశము శీతభూమియై నందున అచ్చటి వారికి అగ్నిపుష్టి

గలిగి గురువైన వస్తువులను భుజించుటవల్ల ధైర్యస్థైర్యములు కలిగి చిత్త

చాంచల్యము లేక జ్ఞానముద్వారా కడతేరగలరనే తాత్పర్య్హముతో

విశేషించి దివ్యదేశములు కల్పించబడలేదనిన్ని సయుక్తికముగా చెప్పబదియున్నది.

యిందులో సుఖదు, ఖములు కర్మాధీనము లాయెనే యీశ్వరాధనవల్ల

దు, ఖములు తప్పిపొవునా, పోవా? అని శంకించుకుని కర్మమే ప్రబలమనే

టందుకున్ను, యీశ్వరకృపవల్ల ఆపత్తులు నివతిన్ందు ననటందుకున్ను

శాస్త్ర ప్రమాణములు వున్నందున కర్మము తల్లివంటిదనిన్ని యీశ్వరుడు తండ్రి

వంటి వాడనిన్ని తల్లి, శిశువు తప్పుచేస్తే నాణ్ని శిక్షించునప్పుడు దండ్రి కరుణతోచినట్టయితే ఆ తల్లి శిక్షను తప్పించే లాగు యీశ్వరుడు కర్మానుభవములను తప్పించుననిన్ని, మరిన్ని తల్లి శిశువును సకలవిధాలా రక్షించి వాని

మంచినడతలను చెప్పి వానియెడల తండ్రికి మిక్కిలి విశ్వాసము కలుగచేసే లాగున సత్కర్మము యీశ్వరకటాక్షములను విడవకూడదనిన్ని చెప్పబడియున్నది.

ఇందులో శైవ వైష్ణవ మతములలో పెద్ద పామరులను కూడా తరింపచేయవలెనని వారి నడతలకు అనుకూలముగా మీరు సారాయి తాగినా యీశ్వరార్పితము చేసితాగండని శాక్తరామానుజ కూట పూజలను కలగజేసినట్టు ఆత్మహత్య చేయవలనన్నవారికి యీశ్వరార్పితముగా త్రివేణిలో దేహత్యాగము విధింపబడినదని చెప్పియున్నది.

ఇందులో స్వామియెడల భృత్యుని న్యాయముగా నటించుట ఇహపరసాధకమని చెప్పియున్నది.

ఇందులో జ్ఞానమే మోక్షమునకు ముఖ్యసాధనమయినా కర్మద్వారా సాధింపబడిన జ్ఞానమే నిర్విఘ్నముగా మోక్షమును పొందించుగాని శుద్ధజ్ఞానము బలముకలదిగాదని సదృష్టాంతముగా చెప్పియున్నది.

ఇందులో సౌరశాక్తాది మతాలు అద్వైత విశిష్టాద్వైతద్వైత మతములలో చేరినవనిన్ని దీపదీపికాన్యాయముగా జగదీశ్వరులకు భేదములేదనుట అద్వైతననిన్ని, పాలతో కలిసి యున్న నెయ్యివలె కించిత్తు భేదము కలది విశిష్టాద్వైతమనిన్ని పాలుపెరుగు మజ్జిగలవలె భేదము కలదనుట ద్వైతమనిన్ని, క్రీస్తుమహమ్మదు మతస్వరూపమున్ని స్త్రీలకు అధోభాగందున్న హృదయగ్రంధి వీడి ఊర్థ్య భాహగమందున్న హృదయద్గ్రంధి వీడనందున మోక్షహేతువైన జ్ఞానము పుట్టనందున వారికి మోక్షములేదనిన్ని యితర జంతువులవలె స్త్రీలు పురుషులకు భోగార్హత లేననిన్ని చెప్పబడియున్నది.

యిందులో బ్ర్రాంహ్మణులు శూద్రజాతిని మిక్కిలి తక్కువ పరచుట యితర మతము వృద్ధిబొందుటకు హేతువయిన దనిన్ని, పెద్దలు పామర జనులను కడతేర్చవలెనని బింబారాధనను విధీంచితే భగవంతుని హేయములైన వికారపు ఉపచారములను లోకులు చేయసాగినందుననున్ను బ్రాహ్మణులు మేము శ్రేష్టులమని ఇతరవర్ణాలను ధిక్కరించడము వల్లనున్ను వీరి దురాచారముల వల్లనున్ను వీరియేడల భగవంతునికి కటాక్షము తప్పి సత్యము మొదలయిన సుగుణ సంపత్తుగల యింగిలీషువారు హిందుదేశము యేలేటట్టు దేవుని కృపకు పాత్రులైనారనిన్ని చెప్పియున్నది. వంద అరవై ఐదు నుంచి వంద డెబ్బై ఎనిమిది వరకు

యిందులో గౌడులు సాత్విక దేశమందు వసించుటవల్ల సత్వగుణము గలిగి మత ద్వేషములు లేని అన్యోన్యముగా వున్నారనిన్ని డాక్షిణాత్యులైన ద్రావిళ్ళు మిక్కిలి కర్మ శ్రద్ధగలవారయి నందున వీరికి మతద్వేషములు హెచ్చయి అన్యోము లేక యున్నారనిన్ని గౌడద్రావిళ్ళవిభజన క్రమమున్ను కేరళస్థులు, చిత్సాననులు, కరాడీలు, గయావళీలు గంగాపుత్రులు శాకద్వీపబ్రాహ్మణులు విశ్వకర్మబ్రాహ్మణులు వీరి సంగతిన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర జారి భేదములు యీశ్వర కల్పితములయితే సకల దేశములయందున్ను యీ జాతిభేదములు వుండవలసినిది, అలాగు లేక కర్మ భూమియందు మాత్రమే కలిగియుండుటవల్ల జాతిభేదములు మనుష్య కల్పితములనిన్ని స్మృతులయొక్క విభజన క్రమమును వ్రాసియున్నది. వంద తొంభై నుంచి రెండు వందలు రెండు వరకు

యిందులో గంగాదితీర్త ములనున్ను కాశి మొదలయిన పుణ్యక్షేత్రములనున్ను పౌరాణములగుండా సకల పాపనాశకములనిన్నీ, ముక్తిప్రదములనిన్ని యేర్పరచి నందుకు కారణమేమంటే పెద్దలు మంచి యోచనగలవారై ప్రపంచ వ్యాపారములలో ముణిగియుండే జనులకు తాముచేసిన పాపములు పుణ్యతీర్తములలో స్నానముచేస్తే నివర్తించుననే ధైర్యముతో తీర్థ స్నానము చేసి నెమ్మది పడుదురనిన్ని, విరామదశను పొందదలచిన మనుష్యులు వొక్కచోటనేవుండి మోక్షమును పొందుదురనిన్ని, పురాణములద్వారా తీర్త ములకున్న, క్షేత్రములకున్ను, క్షేత్రములకున్ను మజిమలు కలగచేసినారనిన్ని పుత్రాదులకు తల్లితండ్రాదులు వున్నట్టుండి చనిపోతే వారి ఋ ణముతీర్చు కోక పోతిమిగదా అనేపశ్చాత్తాపము తీరేకొరకు, గయా ప్రజనాదులకు మహిమలు కల్పించినారనిన్ని చెప్పబడియున్నది.....రెండు వందలు ఇరవై ఒకటి నుంచి రెండు వందలు ఇరవై రెండు వరకు

రెండు వందలు ఐదుయిందులో క్రీస్తుమతస్థులు దేవుడు వొక్కడయి యుండగా మీ మతములో అనేక దేవతలు గలరని యేలాగు చెప్పుచునారని ప్రశ్న చేయగా మాలోనున్ను దేవుడు వొక్కడేను. అయితే మీలో సేయింట్సు అనే దేవసమానులైన పురుషుకు అరాధించేలాగు మాలోనున్న శివవిష్ణు గణపతి మొదలైన దివ్యపురుషులను అరాధింపుచున్నాము గాని దేవుడు వొక్కడేననేటందుకు సందేహము లేదని చెప్పియున్నది.రెండు వందలు ముప్పై మూడు నుంచి రెండు వందలు ముప్పై నాలుగు వరకు

యిందులో కొన్నిచోట్ల జలము బియ్యమువుడికే పాటి వేడికలిగి వుండుటకు కారణమేమంటే గంధములోఅగ్నిత్వరగా ఉత్పత్తి కావడము సహజము గనుక ఆ చోట్లు గంధక మయమైనందున జలము ఉష్ణముగా వుంచున్నదని చెప్పబడియున్నది. రెండు వందలు ముప్పై ఐదు నుంచి రెండు వందలు ముప్పై ఆరు వరకు

యిందులో జగదీశ్వర కటాక్షముగలవారికే ఆణిమాద్యష్ట సిద్దులు కలగడానికు హేతువులయిన మూలికలు సిద్ధించుగాని ఇతరులకు సిద్ధించనేరవని చెప్పబడియున్నది.రెండు వందలు ముప్పై ఏడు నుంచి రెండు వందలు ముప్పై ఎనిమిది వరకు

రెండు వందలు పద్నాలుగుయీ గొప్ప ప్రసంగములో మధ్యమతము గయలో వ్యాపించినదుకు కారణమున్ను గయావళీలనువిమంత్రణ చెప్పుటకు హేతువున్ను చప్పన్న దేశస్థిన్ని భూగోళ స్థితిన్ని చతుదన్ శ భువనస్థిన్ని ధ్రువద్యయ స్థితిన్నిదేవరాక్షస స్థితిశ్రమమున్ను వైకుంఠాది లోకస్థితిన్ని సముద్రముల స్థితిన్ని ద్వీపముల స్థితిన్ని పంచభూత సృష్టిక్రమమున్ను చరాచర స్థితిగరులున్ను జాగ్రత్సస్నసుషుప్త్యవస్థా స్వరూపమున్ను స్థూలదేహ సృష్టిక్రమమున్ను పంచభూతాల వ్యాప్తిక్రమమున్ను బాల్యాద్యవస్థాహేతువులున్ను సత్వరౌజస్తమోగుణకార్యములున్ను స్త్రీలింగ పుల్లింగ నపుసకలింగ శబ్ధముల విభజనమున్ను శాక్తాదిమత సంకేతస్వరూపమున్ను దేవరక్షసాదిసృష్టిభేధ హేదువున్ను భగోళస్థితిక్రమమున్ను ప్రతి దేశానకున్ను అహ, ప్రమాణ భేదములున్ను భూమికి చలనము కలదనేటందుకు హేతువులున్ను చెప్పబడియున్నవి.

యిందులో నాస్తికులు ఈశ్వరుడులేడు స్వభావముచేతనే ప్రపంచము జరుగుచున్నదని చ్దెప్పినా వారు జ్ఞానులకు దూష్యులు కారనిన్ని జ్ఞానులున్ను పరతత్వమనే వస్తువు ఈశ్వరుడనిగాని ఈశ్వరి అనిగాని స్త్రీలింగ పుల్లింగ ధర్మములు కలదికాదని చెప్పుచున్నారు గనుక యీ వుభయులకున్ను పరతత్వమనిన్ని స్వభావమనిన్ని శబ్ధభేదమేగాని అధన్ భేదము లేదని చెప్పబడియున్నది.

ఇందులో యీశ్వరుడు పరులకు యీహిందూ దేశమును స్వాధీనపరచినందుకు కారణ మేమంటే అందరున్ను అహింస సత్యము మొదలైన సద్గుణములతోనే నటిస్తే తన చిద్విలాసానకు వ్యతిరిక్తమని యెంచి యిచ్చటివారికి కామ క్రోధాదులను వృద్ధిబొందించి తద్వారా బ్ర్రాహ్మణలగుండా యిచ్చటి క్షత్రజాతిని బొత్తిగా నశింపచేసి వెనక బ్రాహ్మణుల ల్గర్వభంగముకొరకు తురకలను కొన్నాళ్ళు వృద్ధిపరచి మళ్ళీ కరుణతో సాత్వికులయిన యింగిలీషువారికి యీ దేశాధికారముని యిచ్చనాడని చెప్పియున్నది.

ఇందులో మహమ్మదు మతస్థులు బలాత్కారముగా యితరులను తమ శాస్త్ర ప్రకారము తమ మరములో కలుపుకొనుచు క్రీస్తువులనున్ను హిందువులనున్ను నపుంసకులనుచున్నారు. మరిన్ని క్రీస్తువులు తురకలను క్రూరులనిన్ని హిం ఏనుగుల వీరాస్వామయ్యవారి జీవిత చరిత్ర*

, రచయిత, శ్రీ కోమలేశ్వరపురం శ్రీనివాస పిళ్ళగారు

ఈ చెన్నపట్టణపు కాపురస్థుడయిన శ్రీవత్స గోత్రోద్భ వుడైన యేనుగుల సామయమంత్రి మాధన్యునకు పుత్రుండగు యేనుగుల వీరాస్వామయ్యవారితోను బహుదినములు సహవాసము చేసి స్నేహితుడనై యుండిన నేను, ఆయన చేసిన కాశీయాత్ర చరిత్రలోని సంగతులను వ్రాసేటందుకు ముందుగా ఆ పురుషుని చర్యలను తెలిసిన మట్టుకు చెప్పక పోదునేని ఆయన విషయమై న్యాయము సడిపించిన వాడను కాకపోదు నన్న భయముచేత వాటిని పూర్తిగా వర్ణింపను శక్తి యోగ్యతలు లేని వాడనైనా పూనుకోవలిసి వచ్చినందున వాటిలో కొన్నింటిని సంగ్రహముగా వర్ణించిన వాడ నౌచున్నాను.

యేనుగుల వీరాస్వామయ్యగారికి తొమ్మిదవ యేట పితృని యోగము సంభవించెను. అప్పుడు ఆయన తల్లివినాగా వేరే పోషకులు లేక యుండిరి. తండ్రి వుంచిన ఆస్తిని మితముగానే యుండెను. పండ్రెండవ యేట యింగిలీషు బహు వేగముగా చదవ శక్తిగలిగి యుండినందున అప్పుడు ఆయన ఆపఫీసులో నుండే యగ్జామినరులు యిద్దరున్ను ఆయనను రీడరుగా వుంచుకోవలెనని వివాదపడుచు వచ్చిరి. దానివల్ల ఆ వయస్సులో ఆయనకు కలిగియుండిన సామర్థ్యము తెలియవచ్చుచున్నది. పదమూడవ యేట తిర్నవల్లి కలక్టరు కచ్చేరీలో యింటేరు ప్రిటరుగా నన్ను ట్రాన్సులేటరుగానున్న రెండు సంవత్సరములు వుండి పదియేవనయేట పట్టణమునకు వచ్చిచేరెను. అటుతర్వాతను కొన్ని సంవత్సరములవరకున్ను యింగ్లీషు హవు

*ఈజీవిత చరిత్రను శ్రీ కోమరేశ్వరపురం శ్రీనివాస పిళ్ళెగారు రచియించి కాశీయాత్ర చరిత్రతో చేర్చి పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది లోఅచ్చువేయించారు. ఇంకా ఇతర వివరాలకు పీఠిక చూడండి.

, సులు, *యేజన్సీలు గొప్ప జమీందారులు వీరితోవర్తకసరళిగా వ్యా, సంగము,*చేయిచువచ్చి! వొయర్ హవుసులొ బొక్కీపకీరుగావుండి హేడు కౌంటాంటు అయి తర్వాత సుప్రీంకోర్టు

$యింటేరు ప్రీటరు, పనిలో ప్రవేశించినారు. అప్పుడు బోర్డు ఆవుత్రేడు ఆఫీసువారు ఆయన యెడల తమకు కలిగియుండే విశ్వాసమునకు గురుతుగా ముక్కుపొడి వేశే బంగారుడబ్బి యొకటి బోర్డు శక్రిటేరి మూలముగా సుప్రీంకోర్టు జడ్జీగారి శలవుమీద ఆయనకు యిప్పించినారు.

ఆయన తనకు పరులు స్వల్పోపకారము చేసినా వారియెడల జరిగించిన మేలు చెప్ప నలవిగాదనుటకు ఆయన తిరుణామలకు వెళ్ళినప్పుడు ఆ గుడిలో తనవలెనే స్వామి దర్శనమునకు వచ్చిన ప్రజలకు సహాయముగా నుండే యొక బంట్రౌతు తనకు జాగ్రత్తగా స్వామి దర్శనము చేయించినందుకు వాని మంచి నడతలను

*నాకు దొరికిన ప్రతిలో బ్రాకెట్లలోని అక్షరాలు చిరిగివున్నాయి.

మనదేశములో వర్తకం చేయడానికి వచ్చి ప్రభువులైన ఇంగ్లీషు వర్తక సంఘంవారు చాలా కాలం వరకూ దేశపరిపాలనతో పాటు తమ వ్యాపారం కూడా జరుపుతూనే వుండేవారు. అందువల్ల ప్రభుత్వం కచ్చేరీలతోపాటు వ్యాపార కార్యాలయాలుకూడా వుండేవి. బోర్డుఆఫ్ త్రేడు కంపెనీవారి వర్తక శాఖకు సంబందించిన కార్యాలయము. వొయర్ హవుసు అనగా సరకులకొట్టు.

$ ప్రస్తుతం చెన్నపట్నంలో వున్న హైకోర్టు పద్దెనిమిది వందల అరవై రెండు లో స్థాపింపబడినది. అంతకుపూర్వం దీని స్థానే రెండు ఉన్నతకోర్టు లుండేవి. ఒకటి ఇంగ్లీషురాజు అధికారంక్రింద స్థాపింపబడి ఇంగ్లీషు న్యాయశాస్త్రం ప్రకారం కేవలం విచారించే పరమోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు. రెండవది ఇంగ్లీషుకంపెనీవారి అధికారంక్రింద స్థాపింపబడి మనదేశంలొ హిందూ మహమ్మదీయుల ధర్మశాస్త్రాల ప్రకారం కేసులు పరిష్కరించే జిల్లాకోర్టులపైన అధికారం గలిగిన సదరు అదాలతు కోర్టు. ఈ రెండు కోర్టులలోను ఒక్కొక్క ప్రధాన న్యాయమూర్తి ఇద్దరేసి సాధారణ న్యాయమూర్తులు వుండేవారు. రెండుకోర్టులలోను ఇంగ్లీషు అరవము తెనుగు మొదలైన భాషలలో తర్జుమా చేసే ఉద్యోగులుండేవారు. వారినే ఇంటర్ ప్రిటర్ అనేవారు. వీరాస్వామయ్యగారీ పనిలో పద్దెనిమిది వందల పంతొమ్మిది లో ప్రవేశించారు.

యిచ్చటా రివిన్యూబోర్డువారికి శ్రుతపరచి వానికి వెండిబిళ్ళయున్ను ఒక వరహాయెక్కువ జీతమున్ను కలిగేలాగు చెసినది సాక్షిభూతముగా నున్నది. ఆస్థలమునకు అష్టబంధనము చేయించి గజదానము చేసినారు. యిది వారి శక్తికి యెచ్చయిన కార్యముగా అందరికిన్ని తెలియవలశినది. అక్కడి కలకటరు ఆయననున్ను ఆయనతో కూడా వచ్చిన మరికొందరు ప్రభువులనున్ను చూచి మీరందరున్ను కూడి యిక్కడి దేవుల్నికి రధముకట్టిస్తే బాగా వుండునని చెప్పగా అప్పట్లో ఆ ప్రభువులందరుకున్ను అలాగే చేయచున్నామని ఆయనగుండా అనిపించి అక్కడినుంచి పట్టణమునకు వచ్చిన తర్వాత ఆ ప్రభువులు ఆ కార్యమును గూర్చి సదరహి అయ్యవారితో యెచ్చరించడమే కానుకొనిరి. అయ్యవారు తాను మంచిదని చెప్పినందున ఆకర్యము తన శక్తికి మించినదైనా అపరిమతమైన ధనవ్రయము చేసి రధము కట్టించి తన మాటను కాపాడు కొన్నారు. యిందువల్ల ఆడినమాట కాపాడుటకై శక్తికి మించిన కార్యములను సాధింపుచు వచ్చినారని స్పష్టముగా తెలియు చున్నది. వారి కాశీయాత్ర వెళ్ళినప్పుడు నేను ఆ రధానకు యినప గొలుసులు జాగ్రత్త పెట్టి గవర్నమెంటువారిగుండా వాటికి రంగుపూయించిన సంగతి స్వల్ప సహాయమైనా దాన్ని అనేక ప్రకరణములలో నుదాహరించి గొప్పగా కొనియాడిరి. యీలాగు స్వల్పోపకారములను గొప్పగా కొనియాడుతూ వచ్చినందున యితరులకు విశేష కార్యముల యెడల ప్రవృత్తికలుగుచూవచ్చెను.

ఒక్క సంవత్సరమునకు అధికముగానే వారు ప్రతి ద్వాదశిన్ని భక్ష్య భోజ్య ఫలాజ్య దధి ప్రాజ్యములయిన బ్రాంహ్మణారాధనలు చేసి తర్వాత తాను ద్వాదశి పారణ చేయుచు వచ్చినారు. ఆ సంతర్పణలు యీ పురమందు మహోత్సవములుగా నుండినవి. అన్న ప్రధానమందు వారి చాతుర్యమున్ను జాగ్రత్తయున్ను వర్ణింప శక్యము గావు. వొక్క స్థలమందు ఏకపాకములో ఏకాపోశనముగా వొక్క లోపమున్ను లేకుండా మూడు నాలుగు వేల బ్రాహ్మణుల భుజించునప్పుడు తా నొక పరిచారకుని కంటే సులభుడుగా నటించెను. అందరికిన్ని అనేక విషయములలో కాలయాపన మౌచున్నది. ఆ పురుషుడు ఇట్టి సద్విషయమందు, శ్రమను యెంచక స్వల్పకాలమును వ్రయపరచినది పరలోకగతుడైనా వున్నట్టే కొనియాడబడేలాగు చేయుచున్నది. ఇట్టి సత్కార్యము చేసినవారికి అది కీర్తి హేతువు కావడము మత్రమేగాక యితరులకున్ను అలాటి కీర్తి యెడల సుబుద్ధి కలగుటకు కారణ మవుచున్నది.

యీ పురమందు క్షయమాస *విషయ మయి మహాసభ కూడినప్పుడు అయ్యవారు తన పక్షమును శ్రుతి స్మృతి ప్రమాణములతో స్థాపన చేయగా ఆ సభవారు మిక్కిలీ సంతోషపడి అందుకు చిహ్నముగా అయ్యవారికి రత్నహారమును బహుమతిచేసి వారి సద్గుణములను వొక పత్రికలో వ్రాసి ఆయనకు పంపిరి.

*దక్షిణదేసములో చాంద్రమానము సౌరమానము కూడా వ్యవహారంలో వున్నాయి. ఉత్తరదేశంలో బార్హ స్పర్యేమానముమాత్రం వ్యవహారంలో వుంది. సౌరమాన సంవత్సరానికి మూడు వందలు అరవై ఐదు దినములు పదిహేను గడియల ముప్పై ఒకటి విగడియలు ఉంటాయి. చాంద్రమాన సంవత్సరములో మూడు వందలు అరవై దినములున్ను, బార్హస్పత్యమాన సంవత్సరానికి మూడు వందలు అరవై ఒకటి దినముల పదకొండు గడియలున్నూ వుంటాయి. అందువల్ల ఈమూడు మానముల ప్రకారం గుణింపబడే పంచాంగాలకు తేడా ఉండితీరాలి. అయితే దక్షిణదేశంలోని దైవజ్ఞులు చాంద్రమానాన్ని సౌరమానంతో సరిపుచ్చడానికి మనపంచాంగాలలోని అధిక క్షయ తిధులలాగనే అధిక క్షయ మాసాలు కల్పించారు. ఒక్కొక్క సంవత్సరంలో అధికమాసం అని పేరుపెట్టి ఒకమాసాన్ని చేర్చి సంవత్సరానికి పదమూడు నెలలు చేస్తారు. ఇలాగ సరిపుచ్చుకుంటూ వస్తూంటే కొన్ని సంవత్సరా లయ్యేటప్పటికి చాంద్రమాన సంవత్సరంలో ఒక నెల తగ్గిస్తేగాని సౌరమాన సంవత్సరానికి సరిపోవని పరిస్థితి తటస్థింది. అంతట మన దైవజ్ఞులు, పండితులు, సభచేసి ఏ నెలను లెక్కలోనుంచి తీసివేయవలెనో నిర్ణయిస్తారు. అట్టిమాసానికే అనహస్పతి క్షయమాస మంటారు. అంతట ఆ క్షయమాసం లెక్కలోకిరాక తరువార వచ్చేమాసంలో కలసి పోగా ఆ సంవత్సరంలో పదకొండు నెలలే వుంటాయి. శాలివాహనశక పదిహేడు వందల నలభై నాలుగు చిత్రభాను సం||లో పుష్యమాసము క్షయ మాసముగా నిర్ణయించబడింది. అది క్రీస్తు శకము పద్నాలుగు డిసెంబరు పద్దెనిమిది వందల ఇరవై రెండు కును

పదకొండు జనవరి పద్దెనిమిది వందల ఇరవై మూడు కును మధ్య కాలమున వచ్చిన మార్గశీర్ష మాసమునకు సరిపోతున్నది., స్వామి కణ్ను పిళ్ళగారి ఎపిమిరిస్ చూడండి., ఆయన వుద్యోగములో నుండిన కాలము వరకు ఆ కోర్టు జడ్జీలకు తృప్తిగా నడుచుకొన్నారనేటందుకు దృష్టాంతముగా పెద్ద జడ్జీ యయిన సర్ రాల్ఫు ఫాల్మరు దొరగారు *ఆయనకు వ్రాసి యిచ్చిన టెస్ఠిమోనియాల్ అనే యోగ్యతాపత్రికలో విశేషముగా ఆయన కోర్టులోనున్ను, చేంబరులోనున్ను అలసట లేక బహు నెమ్మదితో పనులు గడుపుచు వచ్చె ననిన్ని, ఆయన తనగొప్ప వుద్యోగపు పనులను మిక్కిలీ నమ్మకముగా జరిపింఛె ననిన్ని మరిన్ని ప్రజల మేలుకోరి స్మృతిచంద్రిక మొదలైన కొన్ని పుస్తకములకు ట్రాన్సులేషన్ చేసెననిన్ని నే నెరిగినంతలో గవర్నమెంటువారి విశేషకృపకు యీ పురుషుడు పాత్రు డయి నట్టు హిందు పెద్ద మనుష్యులలో మరి ఎవరున్ను యెక్కువైన వారి లేరని దృఢముగా నాకు తోచి యున్నదనిన్ని వ్రాయబడి యున్నది.

లోకములో గంగాస్నానమునకు వెళ్ళిన పురుషుడు తన తల్లి దండ్రులకు గంగ తెచ్చి యివ్వడము వాడికె బడియున్నది. యీ మహాపురుషుడు గంగను పడవలు బండ్లు కావళ్ళు వగయిరాల మీద తెచ్చి యీ దేశములో నుండే నాలుగు వర్ణాల వారిలో నున్నుండే గొప్పమనుష్యులగుండా ఆ యా వర్ణములలోని ముఖ్యుల పేళ్ళు తెలుసుకొని వారి కందరికి గంగనున్ను జగన్నాధ పట ప్రసాదములనున్ను యిప్పించెను. అందువల్ల అందరినిన్ని తన బంధుసమానులుగా చూచే వారని స్ఫుటముగా తెలియుచున్నది. ఆయన యాత్ర బోవునప్పుడు #నేను సకృదావృత్తి అక్కడి వినోదములను వ్రాయించి పంపించవలె నని అడుగు కొన్నందుకు

*సర్ రాల్ పాల్మర్ గారు మద్రాసుసుప్రీము కోర్టులో పద్దెనిమిది జూలై పద్దెనిమిది వందల ఇరవై నాలుగు తేదీన న్యాయమూర్తులలో నొకడుగ నియమింపబడినారు. ఇరవై ఎనిమిది జనవరి పద్దెనిమిది వందల ఇరవై ఐదు వ తేదీన ప్రధాన న్యాయమూర్తి యైనారు. ఈయన ఇరవై ఐదు అక్టోబరు పద్దెనిమిది వందల ముప్పై ఐదు వ తేదీన పని చాలించుకొన్నారు.

# వీరాస్వామయ్యగారు మద్రాసునుండి పద్దెనిమిది మే పద్దెనిమిది వందల ఎనభై వ తేదీన యాత్రకు బయలుదేరి మూడు సెప్టెంబరు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి వ తేదీన తిరిగి వచ్చినారు.

యాత్రలో ప్రతిదినచర్యలనున్ను ఆయా ప్రస్తావనములలో జగదీశ్వరుడు తనకు తోపచేసిన తాత్పర్యములనున్ను మార్గమందు పరులవల్ల తాను చెందిన సహాయములనున్ను, తనవలె యాత్ర పోవువారు మార్గములో పూర్వముగానే జాగ్రత్త పెట్టుకొనవలసిన విషయములనున్ను క్రమముగా అప్పుడప్పుడు వ్రాసి పంపుచు వచ్చిరి. ఆ పుస్తకమును చూచుటవల్ల యాత్రబోయి చూచి తెలియవలసిన సంగతులన్నీ తెలియుచున్నవి. ఆ పుస్తకము పనయూరి వెంకుమొదలారిగుండా అరవముతొ తర్జుమా చేయించబడి అచ్చు వేయించబడి యున్నది. నాగపూరి వీరాస్వామి మొదలారి మహారాష్ట్రముతో భాషాంతరము చేయించినాడు. ఆ మహారాష్ట్ర పుల్స్తకమును నాగపూరి రెసైడెంటుగారు తాను యింగ్లీషుతో త్రాన్సులేషన్ చేసి ప్రసిద్ధి పరచ తలచి అయ్యవారిని సెలవు అడిగినందుకు వీరు నేనే భాషాంతరము చేయించి పంపుచున్నానని తెలియజేసి కొంత భాషాంతరము చేయించినారు. భగవంతుని కృపవల్ల కొదవయున్ను యే పుణ్యాత్ముల గుండానయినా పూర్తి కావచ్చును.

వందసంఫత్సరపు క్షామము * లో నేను కొంత ధాన్యసంగ్రహము చేసి వుంచడము మేలని చెప్పినందుకు అయ్యవారు మనము ధ్యానము సంగ్రహించి మనము మట్టుకు భుజించి అన్నాతురులై దు, ఖపడే పేదలను చూచుచు జీవించుట అప్రయోకము గనుక తన ప్రయోజనమునకు గాను విస్తరించి జాగ్రత పెట్టుకొన రాదని చెప్పి ఆ దుర్భిక్షములో శక్తి వంచనలేకుండా తాను అన్నప్రదానము చేయుచు యితరులను స్వప్రయోజనమునకు అనురింఛేలాగు అనుసరించి వారినిన్ని పేదల పోషణ విషయమై ప్రవర్తింపజేయుచు ఆ లాగు ప్రవర్తించిన వారిని తాను మిక్కిలీ కొనియాడి సంతోషపెట్టుచు వచ్చిరి.

* నందననామ సంవత్సరపు కరవు పద్దెనిమిది వందల తొంభై రెండు నుంచి పద్దెనిమిది వందల మూడు వరకు మధ్య వచ్చింది. దీనికి గుంటూరు కరవు అనికూడా పేరు.

అందువల్ల మరికొందరున్ను అన్నదానమందు ప్రవర్తింపుచు వచ్చిరి. మరిన్ని గంజిదొడ్డి యనే అన్నసత్రములో గవర్నమెంటు వారు అపార ద్రవ్యమును బదల అన్నదాంవిషయమై ఖర్చుచేసినప్పుడు అయ్యగారు ఆ ధర్మవిచారణ ప్రభువులలో తాను వొక్కడుగనుండి పేదలకు కాలములొ విమర్శగా అన్నమును అందచేసేకొరకై పడిన శ్రమ చెప్ప శక్యముకాదు. అది యేలాగంటే పది వందల రెండు వేల తూముల బియ్యమును ప్రతిదినమున్ను పాకముచేయించి తన దృష్టిపధములో పేదలను శ్రమపడనీయకుండా రెండుజాములకు లోగానే అన్న మంతయు వినియోగపరచుచు వచ్చిరి. మరిన్ని తన బుద్ధి శక్తిని యావత్తున్ను రాత్రిన్ని పగలున్ను ఆ కార్య విషయమై వాడుచు వచ్చిరి.

ఇదిగాక అయ్యవారి నాతో ఒక ప్రస్తానములో చెప్పియుండే యొక సంగతి మిక్కిలి ప్రయోజనకారిగా తొచినందున యీ అడుగున వ్రాయుచున్నారు. వొక పురుషుడు విస్తరించి ద్రవ్యము నార్జించిపెట్టి తాను సద్వ్రయము చేయకుండా చనిపొవుట నిష్ఫలమని యున్ను చనిపోవువారు తమకు పిమ్మట జరగవలసిన కార్యములను వ్రాసే మరణశాసనములు అనేకముగా తన వుద్యోగమును పట్టి ట్రాం సు లేషన్ చేయవలసి వచ్చి నందున ఆ వ్రాసినవారి తాత్పర్యములనున్ను వారి జీవించి యుండగా చేయుచు వచ్చిన కృత్యములనున్ను వారికి యీలోకవిషయమై యుండిన తాత్పర్యములనున్ను వారు వ్రాసిన మరణశాసనములు వారి మరణానంతరము ఆ తాత్పర్యానకు సంబంధించకపొవుటనున్ను వారు స్వఫ్నావస్థలో గూడా చూడనివిగానున్ను యెట్టి బుద్ధిమంతులకున్ను యీలాగు సంభవించు నని ఊ హించ కూడనివిగానున్ను వుండే అనేక విషయములు సంభవించడమునున్ను తాను తెలుసుకొన్నందున తన మనసుకు లోకరీతి బాగా తెలిసి పరలోకదృష్టి ప్రబల మవుచు వచ్చినదని చెప్పినారు.

మరిన్ని తన కూతురి వివాహమందు అన్నన్య క్షుధిత, పాత్రమనే వచనప్రకారము అన్నానకు ఆకలిగొన్నవారందరున్ను పాత్రులని యోచించి అందుకు ఆక్షేపైంచిన వారినిన్ని సమ్మతిపెట్టి సమస్త జాతులకున్ను అన్నప్రదానము చేసినారు. దీనివల్ల ఆయన సర్వ సమదృష్టి గల పురుషుడని స్పష్టముగా తెలియువచ్చు చున్నది. కొందరు యీవివాహ విషయమై ద్రవ్యమును వ్యయపరచుట కంటె చిన్నదానిపోషణకొరకు ద్రవ్యమును మదుష్యాధీనముగా నుంచుటకు ప్రతిగా యీశ్వరునిచేత నేను వుంచుచున్నానని చెప్పి అపారముగా అన్నదానము చేసినారు.

ఈచెన్నపట్టణమందు హిందు లిటరైరి సొసయిటి యనే విద్వత్సభను తాను కల్పనెచేసి దాన్ని వృద్ధిపొందించను యిచ్చటి గొప్ప మనుష్యులను స్వంతపనికి అనుసరించేలాగు అనుసరించి వారి వారికి ఇష్టములయిన విద్యావిషయము లన్నీ యీ సభవల్ల సిద్ధించునని అనేక మార్గములను కనుపరచుచు వారి కందరికిన్ని యీ సఃభమీద శ్రద్ధ వృద్ధిబోందేలాగు చేయుచు వచ్చిరి.*

అయ్యవారు తన వుద్యోగమును వదలుకొని విరామదశను బొందవలెనని తన్ను యేలుచునుండిన సుప్రీం కోరటు పెద్ద జడ్జీ యైన సర్ రాబర్టు కమిన్ దొరగారికి వ్రాసుకొన్నప్పుడు ఆ కోరటు అడ్వకేట్ జనరల్ జార్జి నార్టను దొరగారు అయ్యవారియొక్క అతి చాతుర్య విశిష్టమయిన ద్విభాషిత్వ క్రమములను విస్తరించి చెప్పినంతలో జడ్జిగారు తానున్ను అయ్యవారి సుగుణములను బహు తరముగ తెలియపరచునప్పుడు యీ వుద్యోగమును యీ పురుషుడు గడిపినట్టు గడిపే శక్తిమంతులను నేను యిదివరలో చూడ

*దీనిని గూర్చిన తప్సీలుకు పీఠిక చూడండి.

సర్ రాబర్టు బక్లే కమిషన్ గారు మద్రాసు సుప్రీముకోర్టులో ముప్పై ఒకటి డిసెంబరు పద్దెనిమిది వందల ముప్పై ఐదు వ తేదీనుండి పదిహేడు జనవరి పద్దెనిమిది వందల నలభై రెండు వ తేదీవరకు ప్రధాన న్యాయమూర్తిగా నుండేవారు.

లెదనియున్ను యీ పురుషుడు యీ వుద్యోగమును వదలుట యీ కోరుటుకు బహు నష్ట మనిన్ని వ్యసనపూర్వకముగ సెలవిచ్చినారు. జడ్జీగారు యీలాగు చెప్పే పాటియోగ్యతతో అయ్యవారు తన వుద్యోగమును జరుపుకొన్నారు.

అయ్యవారు తాను జీవించియుండిన కాలమునకున్ను కీర్తి ప్రతిష్టా హేతువులయిన సత్కార్యములను అనేకముగా జరిగించి తుదను నిర్యాణకాలము సంభవించినపుడు తీర్దయాత్రా ఋగ్యజుస్సామ వేదత్రయ పారాయణాది సత్కర్మ ప్రభావ పరిశుద్దాంత, సరణలై పరమేశ్వర కరుణాకటాక్ష లబ్ధతత్వావబోధచేత మాతృ భ్రాతృ పుత్రికా భార్యానుహృన్మిత్ర బంధువులయెడల నుండిన స్నేహపాశములను మూషికా జాలచ్చేదన న్యాయముగా చేదించి యీషణత్రయ రహితులై దేహ లోక శాస్త్రవాసన లనే వాసనాత్రయమునున్ను అగిద్యాస్మితా రాగ ద్వేషాభినివేశంబు లనియెడు పంచ క్లేశములనున్ను జయించి నిస్స్ంగులై వానప్రస్తాశ్రమ ప్రతినిధిగా కొన్ని దినములు ఆరామవాసము చేసి మహావాక్యార్ధ విచారణవల్ల సచ్చిదానందఘన మయిన బ్రహ్మకున్ను తనకున్ను బేదము లేదని తెలిసి సోహంభావన జేయుచు నుండి యిష్టులుగా నుండిన వారిని తనకు ఆపత్సన్యాసము సిద్దింప చేయవలె నని బహుతరముగా ప్రాధించి తన స్నేహ సంహందెకులయిన వారికి అనేక విధవివేక హేతువులగు వాక్యములను బోధచేసి సమ్మతి పరచి నిర్యాణదినమందు బహిరంగమయిన ఆపత్సన్యాసమును స్వీకరించిన ముహూర్తములోనే యోగాసనాసీనులయి ప్రణవాను నంధానము చేయుచు ప్రాణోత్క్రమణ క్షణ పర్యంతమున్ను పూర్ణమయిన తెలివి కలిగియుండి, ఆత్మ నిత్యుడు దేహము అస్థిర మనియున్ను తెలిసిన వారు గనుక, దేహము వదలుటవల్ల వ్యసనమును చెందక సంతోషముతో అనాయసంగా శాలివాహన శకంబు పదిహేడు వందల అరవై అగు దుర్ముఖ భాద్రపద బహుళ పక్షాష్టమీ సోమవారమునాడు* ఉదయాన స్థూలదేహము వదిలి లింగ దేహముతో పునరావృత్తిరహిత శాశ్వత బ్రహ్మలోక నివాసమును పొందినారు.

కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళె

*దుర్ముఖ సంవత్సరము శాలివాహన శకమున పదమూడు వందల అరవై లో రావడం లేదు. అది పదిహేడు వందల యాభై ఎనిమిది లోవచ్చుచున్నది. పదిహేడు వందల అరవై అనునది పొరబాటు అని తోస్తూవున్నది. శాలివాహనశక పదిహేడు వందల అరవై ఎనిమిది దుర్మిఖిసంవత్సర భాద్రపద బహుళ రెండు సోమవారము నకు సరియైన ఇంగ్లీషు తేదీ వెయ్యి ఎనిమిది వందలు ముప్పై ఆరువ సంవత్సరము అక్టోబరు మూడు వచ్చిన తేది అవుతున్నది.

స్వామి కణ్ణుపిళ్ళెగారి ఇండియన్ ఎపిమిరిన్ చూడండి


మొదటి ప్రకరణము  చెన్నపట్టణము నుండి శ్రీశైలము వరకు

శ్రీరామజయము.

శ్రీ

జగదీశ్వరుండు నాచేత కొంత దేశాటనము జేయింప దలచి నన్ను నేలుచున్న సూప్రీంకోరటు

గమనిక, సుప్రీంకోర్టు చెన్నపట్టణమున క్రీస్తు శకం పద్దెనిమిది వందల మొదలు పద్దెనిమిది వందల అరవై రెండు వరకు అనగా మద్రాసు హైకోర్టు స్థాపింపబడువరకు నుండిన ఉన్నత న్యాయస్థానము. దీనిలో ఒక ప్రధాన న్యాయమూర్తి ఇద్దరు సహాయ న్యాయమూర్తులు నుండేవారు.

దొరలగుండా సెలవిప్పించినాడు. గనుక నేను కాశీయాత్ర బోవలెనని పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరము మే నెల పద్దెనిమిదవ తేది కుజవారము రాత్రి తొమ్మిది ఘంటలకు చెన్నపట్టణము విడిచి మాధవరము జేరినాను. అది తండయారువీడులోనుండే నాతోటకు మూడు గడియల దూరము, కీనీరుభూమి, మధురమయిన జలసమృద్ధి గలది. ద్రావిడ వైష్ణవుల నివాసము. వారు సమిదెలు వగయిరాలు చెన్నపట్టణములో అమ్మి జీవింపుచున్నారు. దోవలో ఉప్పుకయ్యయున్నది. అందులో కాక్రయన్ దొర పడవలు నడిచే పాటికాలువ తొవ్వించి వారధులు కట్టించి యున్నాడు.

తేది ఉదయాన అక్కడనుండి పాలవాయి సత్రము మీదుగా వెంకటేశ నాయడి సత్రము చేరినాను. అది శిథిలమై యున్నది. తటాకమున్నది. అంగళ్ళు గలవు. అది మాధవరమునకు ఐదు గడియల దూరము. దోవనరాళము. బండ్లు నడుచును. ఆ రాత్రి పెద్దపాళెము చేరినాను. దోవలో కొరతలేరు దాటవలెను. దగ్గిర దగ్గిర గ్రామాలున్నవి. బాట నరాళము. ఆ పాళెములో శక్తిరూపములో పరమాత్ముడు తామస పూజల నంగీకరించి లోకుల కిష్టసిద్ధిని జేయుచున్నాడు. ఆ శక్తి చిన్న లింగము జూడగా భూమిలో నుద్భవించి యున్నది. ఆ గుడి బహుచిన్నది. శూద్రపూజ. ఆ పాళెము అరణ్య నదీ తీరము. వాసయోగ్యము. బ్రాహ్మణాగ్రహారము, శివాలయము, పలపట్రల యిండ్లున్నున్నవి. ఈ పాళెము, పై సత్రానికి ఆమడదూరము.

తేది పగటిమీద నక్కడనుండి తర్లి రాత్రి తిరువళ్ళూరు చేరినాను. దోవ సరాళము. మళ్ళీ కొరతలేరు దాటవలెను. దోవలో వెంగలియనే గ్రామమువద్ద సత్రమున్నది. తిరువళ్ళూరు విష్ణుస్థలము. హృత్తాపనాశిని యనే తీర్థమున్నది. అందులో ప్రాథః నెలవారు బెల్లము వేయుచున్నారు. ఆ తీర్థస్నానము స్మృతులయందు మహా ప్రాయశ్చిత్తములలో ముఖ్యముగా జెప్పబడియున్నది. అది వేట స్థలము. అన్ని వస్తువులు దొరుకును. అదిపై పాళెమునకు ఇరవై నాలుగు ఆమడ దూరము.

తేది పగటిమీద రామంజేరి మార్గముగా రాత్రి కనకమ్మ సత్రము జేరినాను. రెండు ఆమడమూరము. దారిలో నొక నది దాట వలెను. రామంజేరి వద్ద దోవ రాతిగొట్టు, మిగత సరాళము. ఆ సత్రము బొమ్మకంటి శంకరయ్య కట్టించినది. వేట స్థలము. కోమట్లు సంపన్నులు. అగ్రహార మున్నది. అది మొదలుకొని కార్వేటినగరము వారిసీమ సత్రపు కోనేటినీళ్లు లెస్సయున్నవి.

తేది పగలు బుగ్గగుడి చేరినాను. బాట సరాళము. ఒకటి ఆమడ. పుణ్యక్షేత్రము. శాశ్వతముగా మూడు జలధారలు - గంగా యమునా సరస్వతు లనిపించుకొని గుడికింద స్రవించి అరణ్యనదిలో బడుచున్నవి. కాశిగుడిరీతిగా మూర్తులకు పేర్లుగలిగియున్నవి. దగ్గిర గ్రామములు, యిండ్లు లేవు. పదార్థములు దూరమునుండి తెచ్చుకొని గుడివద్ద తోపులో వంట చేసుకొనవలెను. రమ్యప్రదేశము. అరణ్య నదీతీరము. ఆ రాత్రి నగిరె మీదుగా పుత్తూరు చేరినాను. ఒకటి ఆమడ దురము. నగిరెవద్ద కనమ దాటవలెను. అది రాతిగొట్టు బాట. నాలుగు గడియల దూరము ప్రయాస, అవతల సరాళము. నగిరె పేట స్థలము. ముసాఫర్లకు అన్ని వస్తువులు దొరుకును. అక్కడ వెంకటేశ నాయుడి కొడుకు గొప్ప సత్రము కట్టను యత్నము చేయుచున్నాడు. పుత్తూరిలో మునియప్పిళ్ళ సత్రమున్నది. బ్రాహ్మణులకు గోసాయిలకు బైరాగులకు ---- యిచ్చుచున్నారు. అక్కడ కంపెనీవారు దొరలకు ముసాఫరుఖానా కట్టియున్నారు. చిన్న పేట స్థలము. రమ్య ప్రదేశము. చుట్టుకొండ లున్నవి. కావలసిన వస్తువులు దొరుకును. బ్రాహ్మణుల యిండ్లున్నవి. మంచినీళ్ళ గుంటయున్నది.

వ తేదీ అంజాలమ్మ కనమదాటి వడమాలపేట సత్రము చేరినాను. ఆమడదూరము, అక్కడి కనమ రాతిగొట్టయినా నడచుట నిండా ప్రయాసగాదు. అక్కడ అంజాలమ్మ అనే శక్తి ప్రతిమ పందిటికింద యుంచబడియున్నది. అందులో పరమాత్మ చతన్యము ప్రతిఫలించి ప్రార్తించినవారి యిష్టసిద్ధిని జేయుచున్నది. బాటసరాళము. ఆసత్రము కొల్లాపెద్దసామి శెట్టి కట్టించినది. విశాలముగా నున్నది. బ్రాంహ్యణులకు మాత్రము సదావృత్తి యిచ్చుచున్నారు. వేటబస్తియైనది. కోమట్లు విస్తదించి యున్నందున వారు విరాళమువేసుకొని గోసాయిలకు బైరాగులకు సదావృత్తి యిచ్చున్నారు. తద్ద్వారా సత్రమునకు యశస్సు కలిగియున్నది. కనకమ్మ సత్రము మొదలుకొని యిదివరకు కార్వేటి నగరమువారి సీమ. ఆరాత్రి అలమేలు మంగాపురము మీదుగా దిగువ తిరుపతి చేరినాను. ఆమడదూరము. దొవలో సువర్ణముఖి యనే నదియున్నది. బాటసరాళము. కొంతదూరము చెరువు కట్టమీద నడవవలెను. దోవలో కొన్నిబస్తీ గ్రామములునవి. అక్కడ రెండు దినములుంటిని. అందులో నొకనాడు వెంకటాచలపతి దర్సనార్తమై కొండయెక్కి దిగినాను. మరునాడు కపిలతీర్ధములో సమారాధన చేసినాను. దిగువ తిరుపతిలో గోవిందరాజులగుడి కోదండరామస్వామి గుడియు నున్నవి. రామస్వామి గుడికి సరకారు కుమ్మక్కు కొంచమైనాలేదు. గోవిందరాజులగుడి ఆచార్యపురుషుల అధీనముగానున్నది. అయినా సర్కారు విచారణకలదు. త్రిమతస్తులయిండ్లు రెండు వందలు దనుక గలవు. గురునాధశెట్టి స్మార్తులకు అన్నసత్రము పెట్టియున్నాడు. మునియప్పపిళ్ళ పన్నెండు మంది చిన్నవాండ్లకు పాఠకశాల యేర్పరచి అన్నంపెట్టి వేదము చెప్పించుచున్నారు. చందులాలా* వగయిరా ముగ్గురు పుణ్యాత్ములు గోసాంఖాలు వగైరాలకు సదావృత్తి యిచ్చుచున్నారు. మూడు రామానుజ కూకటములున్నవి.

*చందూలాళ్ హైదరాబాదులో దివాన్ పేష్కారు.

వాటిలో వైష్ణవులకు ప్రతిదినము ప్రసాద మిచ్చుచున్నారు. తిరుపతి భారీగ్రామము. అన్ని వస్తువులు దొరుకును. అన్ని పనివాండ్లు కలరు. పంగులూరు గురునాధ శెట్టి వగైరా సాహుకార్లు వున్నందున షహరుస్థలము రీతిగానున్నది. కోతుల తొందరకలదు. సరసింహ తీర్ధజలమే సానార్హముగాని వేరే లేదు. రెండు గడియల దూరములో కపిలతీర్ధమున్నది. అది రమ్య ప్రదేశము. గంగధార సదా పడుచు కింది తటాకముగా నిలిచియున్నది. చుట్టు విశాలమైన మంటపము కట్టియున్నది. అది బ్రాహ్మణ సమారాధనకు యోగ్యమయినది. ఆచుట్టుపక్కల దేశస్థలములలో చందులాలా ధర్మములు నిండాగా జరుగుచున్నవి. గాలి కాలము గనక కొండమీద నొక్క పగలుంటిని. దిగువతిరుపతికి కొండమీద స్వామిగుడి పద్నాలుగు ఆమడ. గాలిగోపురమువరకు నెక్కడము, దిగడము బహుప్రయాస. ఆవల కొంతభూమి సమముగా నున్నది. మళ్ళీ యెక్కడము, దిగడము కలిగియున్నా అంతప్రయాసకాదు. దారిలో నిలుచుటకు జలవసతి గల మంటపాలు చాలాగలవు. గాలిగోపురము వద్ధ నొక్క బైరాగి శ్రీరామవిగ్రహపూజ చేయుచు, వచ్చినవారికి మజ్జిగ మొదలైనవి యిచ్చి ఆదరించుచున్నాడు. వెంకటేశ్వరునికి ప్రార్థనలు చెల్లించే లోకులవలన కొంఫిణీవారికి సాలుకు సుమారు లక్షరూపాయీలు వచ్చుచున్నవి*, కొండమీద యేధర్మ కార్యము చేసుటకున్ను

*నూరేండ్లనాటి దేవాదాయాలు, ధర్మాదాయాలు, - ఇంగ్లీషు వర్తక కంపెనీవారు మనదేశాన్ని ఆక్రమించిన తరువాత చాలాకాలం వరకు హిందువుల దేవాలయాలను తురకల మశీదులను కాపాడుతూ వారి ధర్మాలను స్యయంగా పరిపాలించేవారు. దీనిని గురించి కొన్ని కట్టుబాట్లు చేస్తూ క్రీస్తు శకం పద్దెనిమిది వందల పది సం|| వంగరాష్ట్రములో నొక శాసనం చేశారు. అలాగే మద్రాసులో వెయ్యి ఎనిమిది వందలు పదిహేడువ సంవత్సరపు ఏడవ రెగ్యులేషను అనబడు చట్టాన్ని శాసించారు.. ధర్మాదాయాల సొమ్మును రెవెన్యూతోపాటు జిల్లాకలెక్టర్లే వసూలుచేసి దేవుడి ఉత్సవాలు, అర్చనలు, భొగాలు స్యయంగా జరిపించేవారు. మిగిలిన సొమ్ము కంపెనీ వారి ఖజానాలోకి చేరేది. ఈ కలెక్టర్ల పైన రివిన్యూ బోర్డువారికి పై తనిఖీ అధికారం వుండేది. మనదేశంలో ఇంగ్లీషువారి అధికారం బలపడినకొద్దీ దేశ ప్రభుత్వంలో క్రైస్తవ మిషనరీల పలుకుబడి ఎక్కువ కాసాగింది. ఈక్రైస్తవుల ప్రభుత్వం ఇలాగ హిందువుల విగ్రహారాధనను, తురకల మశీదులను ప్రోత్సహించడం అసభ్యంగా వున్నదని మిషనరీలు ఇంగ్లాం సర్కారుకు రూక యివ్ఫవలెను. అచ్చట పర్మాత్ముడు సంపూర్ణ కటాక్షముతో లోకుల పాపములను వారివిత్తముగుండా హరించి యిష్టసిద్ధిని చేయుచున్నాడు. కొండమీద శ్రీనివాసమూర్థి దివ్యమంగళంగా నున్నది. దేవతలో దేవతలంతవారో, పూర్వము ఆమూర్థి ని ఆరాధించినట్టుతోచుచున్నది. అచ్చట గోసాయి, బైరాగులకు గురుపీఠముగా నుండే మహంతుమఠమొకటి అతి విశాలముగా కట్టియున్నది. ఆమహంతుకు శిష్యార్జన విశేషించి కలదు. కొండమీద యిండ్లు సంకుచితములుగా నున్నవి. చైత్రము మొదలు జ్యేష్టమువరకు ఉదయాన చలిగాలి కొట్టుచున్నది. దానివలన శీత జ్వరాది రోగములు పుట్టుచున్నవి. కోతుల తొందర హేచ్చు. అడవి పందులు నిదుపద్రవముగా మనుష్యులనడుమ సంచరింపుచున్నవి. గాలి కాలములో మనుష్యులు నిండా కొండమీద నుండరు.


ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర
టీటీఎస్ ఆడియో నిర్మాణ పాఠ్యం
భాగం రెండు — మొత్తం ఎనిమిది భాగాలలో


మొదటి ప్రకరణము  చెన్నపట్టణము నుండి శ్రీశైలము వరకు

తేదిరాత్రి ఆమడలో నున్న కరకంబాడు చేరినాను. తిరుపతి వగైరా వూళ్ళ కానలికిగాను ఆ కరకంబాడున్ను, యింకాకొన్ని గ్రామాలున్ను అచ్చటి పాలెగానికి కంపెనీవారు జారీగా నడిపించు

మేలో ఆందోళన చేయగా పద్దెనిమిది వందల ముప్పై మూడు మొదలు కంపెనీవారు దేశీయ మతములతో జోక్యం కలిగించుకో గూడదనే భావంతో ప్రవర్తింపసాగినారు. గాని తిరుపతి జగన్నాధం మొదలయిన దేవస్థానాల పరిపాలన మాత్రం ఎప్పటిలాగునే కంపెనీ ఉద్యోగులు నిర్వహింఛేవారు. తుదకు పద్దెనిమిది వందల నలభై మూడు లో కంపెనీవారు తమవశంలో వుండిన దేవాలయాలను మశీదులను కొందరు ప్రయివేటు వ్యక్తులకు కొన్ని సంఘములకు ఇచ్చివేశారు. ఆ ధర్మాదాయముల తాలూకు తమవద్ద నిల్వ యుండిన లక్షలాది ద్రవ్యం మాత్రము ఇచ్చివేయలేదు. ఆసందర్బంలోనే తిరుపతి దేవస్థానాన్ని అప్పటి మహంతుకిచ్చారు. అంతట ఈ ధర్మాదాయాలు, సరియైన సట్టుబాటులేక పాడైనాయి. ఈ ధర్మాలు స్శిస్తూవున్నా ధర్మకర్తలు సొమ్మును ఎంత దుర్వినియోగం చేస్తూవున్నా కంపెనీవారు జోక్యం కలిగించుకోకుండా వుపేక్షించారు. వెయ్యి ఎనిమిది వందలు పదిహేడువ సంవత్సరపు శాసనమునుబట్టి వానిని, సక్రమంగా నిర్వహించవలసిన బాధ్యతను గాలికి వదలివేశారు. ఈఅరాచకం ఇరవై సంవత్సరాలు జరిగింది. తరువాత పద్దెనిమిది వందల అరవై మూడులో ఒక క్రొత్త ధర్మాదాయములచట్టం శాసింపబడింది. ఈ చరిత్రంతా పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి లో మద్రాసు గవర్నరు కవుంచిలు మొదలైన వెంబాకం రామయ్యంగారు వ్రాసియున్నారు., ముప్పై ఒకటి డిసెంబరు పద్దెనిమిది వందల డెబ్బై రెండు తేదీగల మద్రాసు గవర్నమెంటు జుడీషియల్ ప్రొసీడింగ్సు చూడండి, చున్నారు. ఆయూరు వసతిగాకపోయినా అవతల మహారణ్యము గనుక విధిలేక అక్కడ దిగవలసి యున్నది. పోష్టాఫీసు వున్నది. యధోచితముగా వస్తువులు దొరుకును. ముసాఫరుఖానా యున్నది.

తేది రెండు గంటలకు శెట్టిగుంట చేరినాను. దోవ మహారణ్యము, రాతిగొట్టు, మిక్కిలి దొంగలభయముగలది. నడమ మామండూరు కృష్ణాపుర మనే రెండు పాలెగాండ్ల వూళ్ళున్నవి. వారిసహాయములేక మాతుబర్లు నిర్భయంగా ఆ యడవిదాటలేరు. కలకటరు ఆదోవను నిర్భయంగా చేయను చేతగాక నున్నారు. మామండూరుకి ఈవల ఎనిమిది గడియల దూరాన బాలపల్లె యున్నది. అది మొదలు కడపజిల్లా సరిహద్దు. బాలపల్లెలో ముసాఫరుఖానాయున్నది. ఆభూమి జలము బహురోగప్రదము. అచ్చట రెండుమూడు నదుల వంటి కాలువలు దాటవలెను. కనమ యొకటి దాటవలెను. భాట బహురాతిగొట్టు. ఎక్కుడు దిగుడుగా నున్నది. అక్కడ బహు దట్టమయిన వెదురడవి. ఆ శెట్టిగుంటలో మంచినీళ్ళు చెరు వున్నది. రెండు బ్రాహ్మణుల యిండ్లున్నవి. పేటస్థలము అన్నివస్తువులు దొరకును. బాలపల్లె మొదలుకొని కడప కలకటరు అడవికొట్టి బాట వెడల్పుచేసి అక్కడక్కడ ఠాణా లుంచియున్నారు. కరకరంబాడి నుండి ఆ పాళెగాండ్లను మంచితనము జేసుకొని యిరువైమంది తుపాకీల వారిని శెట్టిగుంట దనుక తెచ్చినాను. నాడు మూడు ఘంటలకు శెట్టిగుంట విడిచి ఆమడదూరములో నున్న కోడూరు వద్దనుండే అగ్రహారమువద్ద సత్రము జేరి నాను. కోడూరు బస్తీ. పేటస్థలము ముసాఫరుఖానా యున్నది. బ్రాహ్కణ గృహములేదు. పై యగ్రహారమందు యేమిన్ని దొరకదు. అంగళ్ళులేవు. ఆ బ్ర్రాహ్మణులు పరోపకారులుగాదు.

జూన్ ఒకటి తేది ఐదు ఘంటలకు లేచి ఆమడ దూరములో నున్న వోరంబాడు తొమ్మిది ఘంటలకు చేరినాను. అది పేటస్థలము. అన్నివస్తువులు దొరుకును. ముసాఫరుఖానా యున్నది. బాటసరాళము. శెట్టిగుంటనుంచి కోడూరికి అదివిలో దండు భాట యొకటి పోవుచున్నది. పల్లెలమీదుగా కాలిబాట యొకటి పోవుచున్నది. కాలిభాటలో సనారీలు రావచ్చును. అడివిభయము కోడూరితో సరి. అవతల భూమి తెరపగా నున్నది. దగ్గిరదగ్గిర గ్రామాలు, పైరుపొలాలు, జలసమృద్ధిన్ని భాటలో కలిగియున్నవి. అంతటయున్ను చింతచెట్లు గలవు. బాలపల్లె వద్ద కొండవాగు నీళ్ళు నాబోయీలు వగైరాలు తాగినందున నొక బోయిన్ని, ఒకకావటివాడున్ను జ్వరము తగిలి ఖాయిలాపడిరి. గనుక దగ్గిరి నోరంబాడిలో మధ్యాహ్నము నిలిచినాను. పై బాలపల్లెనది వాగువద్ధ శ్రీనివాసమూర్తిపాద మొకటి చేసియున్నది. అక్కడనుంచి పడమటి దేశస్థులు కొండ యెక్కుచున్నారు. ఆదినము మూడు ఘంటలకు లేచి రెండు గడియల దూరములో నున్న పుల్లంపేట గడియు ప్రొద్దు ఉండగానే చేరినాను. అది పేటస్థలము. ముసాఫరుఖానా యున్నది. బ్రాహ్మణుల యిండ్లు గలవు.

తేది రాత్రి మూడు ఘంటలకు లేచి రెండు ఆమడ దూరములో నున్న నందలూరు చేరినాను. భాట సరాళమే. ఊరివద్ద చెయ్యా రనే నది గడియ దూరము వెడల్పు గలిగియున్నది. నదికి నిరుపక్కల గుళ్ళున్నవి. అది పుణ్యక్షేత్రము. పరశురాముని మాతృహత్య నినర్తించిన స్థలము. అక్కడికి రెండు ఘడియల దూరమందు అత్తిరాల యనే మహాస్థలము అగ్రహారసహితముగా నున్నది. ఊరు తురకలతో నుండియున్నది. మొసాఫరుఖానాకలదు. పేటస్థలము, సకల వస్తువులు దొరుకుని. బ్రాంహ్మణుల యిండ్లు వసతిగా నున్నవి. ఆదిన మంతయు అక్కడనే యుంటిని.

తేది రాత్రి రెండు ఘంటలకు లేచి తొమ్మిది ఘంటలకు రెండు ఆమడ దూరములో నున్న భాకరాపేట చేరినాను. దోవమంచి దయినను రాతిగొట్టు. కొండపక్కను భాట పోవుచున్నది. పొడిచెట్లు అడివి, దోవలో వొంటిమిట్ట యనే గ్రామమున్నది. అక్కడ నాల్గు పక్కల కొండలే కట్టగా గల్గిన యొక్క భారీ చెరువున్నది. చెరువు కట్టమీద భాట. ఆ వొంటిమిట్టలో చూడ వేడుకలయిన గుళ్ళున్నవి. ముసాపరుఖానా యున్నది. బస్తీ గ్రామము. ఆ భాకారాపేట పేటస్థలము. అన్ని వస్తువులు దొరుకుని. అంతటా రాళ్ళున్నవి. వసతి యయిన బ్రాహ్మణ గృహములేదు. నాడు మూడు ఘంటలకు లేచి రాత్రి రెండు ఘంటలకు కడప చేరినాను. దారిలో కొండలు, కనమలు దాటవలెను. దారి బహు రాతిగొట్టు, జలవసతి లేదు. కడపలో నాలుగు దినము లుంటిని. ఆది మంచి పట్టణ మనబడి యున్నది. అన్నిపనివాండ్లు గలరు. జిల్లాకోరటున్ను కలకటరుకచ్చేరి గలవు. ఆయాయిలాకా మనద్దీలు ఇండ్లు కట్టుకొని కాపుర మున్నారు. దగ్గిర నది యున్నది. ఊరి నడుమ నొక బుగ్గ యున్నది. ఇండ్లు సంకుచితములు. ఊరివద్ద నొక రెజిమెంటు ఉన్నది. అందులో ఆ యిలాకా దొరలు కాపుర మున్నారు. మరియొక పక్క సీవిలు దొరలు కాపుర మున్నారు.

తేదీ ఉదయాన ఐదు ఘంటలకు కడప విడిచి తొమ్మిది ఘంటలకు పుష్పగిరి చేరినాను. దోవ సరాళము. కడపవద్ద నొక నది దాటవలెను. అది వాన కిరిసినప్పుడు అతివేగముగా ప్రఫహించి వెంటనే తీసి పోవుచున్నది. పుష్పగిరి పుణ్యక్షేత్రము పినాకినీనదీ తీరము. నదిగట్టున కొండ వెంబడిగా రమణియమైన యొక దేవస్థల మున్నది. అది హస్థినిక్షేపము చేయతగిన పుణ్యస్థలము. స్మార్థ పీఠాధిపరి యయిన పుష్పగిరి స్వాములవారు అక్కడ మఠము గట్టుకొని నివాసము చేయుచున్నారు. భ్రాంహ్మణ గృహములున్నవి. అక్కడి బ్ర్రంహణులు కొంత వేదాంతవిచారణ గలవారుగా కనబడుచున్నారు. అన్ని వస్తువులకున్ను పేటకు పోవలెగాని, అక్కడదొరకవు. నదిదాటి ఊరు ప్రవేశించవలెను, మళ్ళీ నదిదాటి భాటకు రావలెను. ఊరు రమ్యమైనది. ఆదినము మూడు ఘంటలకు బయలుదేరి కొన్ని పినాకినీ నది కాలువలు దాటి ఐదు గడియల దూరమందున్న కాజీపేట చేరినాను. బాట నిండామంచిదికాదు. అది పేటస్థలము. వసితిగా నుండే యిండ్లు లేవు. అయినా బ్ర్రాంహ్మణులున్నారు.

తేది రాత్రి మూడు ఘంటలకు లేచి పద్నాలుగు ఆమడలో నున్న దువ్వూరు తొమ్మిది ఘంటలకు చేరినాను. దోవలో అడివిలేదు. బయలు పొలము లెస్సగా నున్నది. ఆ గ్రామములో వసితిగా నున్న యిండ్లు, చావిళ్ళు గలవు. చేరినట్టు పేటయున్నది. అక్కడ అన్ని వస్తువులు దొరుకును. అదివరకు కడపజిల్లాలో చేరినభూమి. ఆ యూరు మూడు ఘంటలకు వదిలి ఐదు గడియల దూరమందున్న వంగలి గ్రామమును గడియ ప్రొద్దుగద్దనంగనే చేరినాను. అక్కడ గొప్ప యిండ్లు, చావిళ్ళున్నున్నవి. దగ్గిర పేటగలదు. అదికందనూరు వబావగారిది. రూపశింగనేసరదారుల్ని కొలువుకు గాను, ఈగ్రామము వగైరా కొన్ని యూళ్ళు జాగీరుగా నివ్వబడినవి. దువ్వూరు మొదలుకొని ప్రతి గ్రామమందున్న కొండ కరంకలవాండ్లు ఇనపరాళ్ళతో నినుము జేయుచున్నారు.

తేదీ వాననుంచి మధ్యాహ్మము వరకు నిలచి పన్నెండు ఘంటలకు బైలుదేరి దారి చూపను అచ్చటి వారిని తీసుకొని అరగడియ ప్రొద్దుకద్దనంగనే పద్నాలుగు ఆమడలో నున్న అహోబళ క్షేత్రమును చేరినాను. గోప సరాళము. అడుగడుగుకు గ్రామములున్నవి. ఒక చిన్న నదిన్ని, వాగుకాలువలున్ను దాటవలెను. అయితే అడివిభూమి. ఆక్షేత్రమందు యెగువ అహోబళము, దిగువ అహోబళమని రెండు స్థలములు ఒకదాని కొకటి నాలుగు గడియల దూరమందున్నవి. నడమ చీకటిగల యడివి. యెగువ అహోబళానికి పైన కొండమీద ఉక్కుస్తంభమని చెప్పబడే స్తంభముగల పుణ్యక్షేత్రమున్నది. అక్కడి అడవి నడుమ కాలిబాట. ఒక సవారిన్నిపోదు. అది నరసింహ్వమూర్తి ఉద్బవించిన స్థలము. దిగువనను, యెగువనను నరసింహమూర్తి ప్రతిమ లనేక యవనరాలుగా చేసి బెట్టి ఆరాధింపుచున్నారు. ఈస్థలము కుంభకోణము వద్దనుండే అహోబళంజియ్యరువారి యొక్క అధీనము. వారి ముద్రకతన్ అహోబళానకు రెండు కోసుల దూరమందున్న బాచపల్లెలోనిండి ఆస్థల విచారణ జేయుచున్నాడు. ఆముద్రకతన్ యెగువ దిగువ స్థలములలో అర్చన చేసే అర్చకుల కిద్దరికిన్ని అప్పుడప్పుడు నెల ఒకటి కి ఆరు రూపాయిలు జీతము యేర్ప రచుచు వచ్చుచున్నాడు. గుడి ఖర్చులకు జియ్యరు పంపింఛే అయివజు దప్ప మరియే అకరమున్ను లేదు. రాజా చందులాలా* యీస్థలానకు ప్రయాధన్ మైన సాలుకు రూపాయలు ఇప్పింపుచున్నాడు. యెగువ అహోబళానకు

*రాజా చందులాలా హైదరాబాదు నివాస పేష్కారు.

సవారీలు వెళ్ళడము ప్రయాస. దిగువ అహోబళములో శూద్రగుడిశెలు కొన్ని యున్నవి. యెగువ అవిన్నీలేవు. జనులు దేవాలయములందే దిగవలసినది. చీకారణ్యప్రదేము. మృగభయము గలదు. జలము రోగప్రదము. మనుష్యులు నివసింపను భయపడుచున్నారు. దేవస్థలలు శిధిలము లయినందున జెల్లేడు, పల్లేరు మొలచి యున్నవి. అచ్చట ఫాల్గునమందు బ్రంహ్మోత్సవము. అప్పుడు జనులు వచ్చుచున్నారు. ఉత్సవకాలమందు రెండు వందలు వరహాలు హాళ్ళీలు వసూలవుచున్నవి. వాటినంతా కందనూరి నబాబు పుచ్చుకొని వెనక గుళ్ళ సంగతినే విచారింపడు. ఈ స్థలములలో ప్రతిఫలించి యున్న పరమాత్మ చైతన్యము, స్వప్రకాశముచేత లోకులకు భక్తిని కలగ చేయుచున్నది గాని, అక్కడ నడిచేయుపచారములు దానికి నేపాటిన్ని సహకారిగానుండలేదు. ఈ రెండు స్థలములలోను న్నొక వస్తువున్ను దొరకదు. ఉప్పుతో తొమ్మిదిన్ని బాచపల్లెలో నుంచి తెచ్చుకోవలెను. ఆ రాత్రి అక్కడ నిలిచినాను. బాచపల్లె కంపెనీ వారిది. మంచి గ్రామము.

వ తేడి పగలు పన్నెండు ఘంటలకు గిదువ అహోబళములో నిలిచి చేతనున్న వస్తువులతో నక్కడి బింబములను ఆరాధించి ఒకటి ఘంటకుప్రయాణమై ఆరు ఘంటలకు శ్రీరంగాపురము చేరినాను. అది పద్నాలుగు ఆమడదూరము. దోవ సరాళము. మిక్కిలి అడివి. పడమరుద్రవఠమనే బస్తీగ్రామ మున్నది. అది కడపజిల్లాలో ఛేరినది. గొప్ప ఫేటస్థలము. కావలసిన వస్తువులు దొరుకును. సరాబు అంగళ్ళు, బ్రాహ్మణ గృహములు గలవు. శ్రీరంగాపురము చిన్నది, బస్తీగ్రామం, కొంఫిణీవారిది, ఇండ్లు చిన్నవి, ఉదకసౌఖ్యములేదు.

తేది రాత్రి మూడు ఘంటలకు లేచి ఎనిమిది ఘంటకు ఆమడలో నున్న మహానంది యనే మహాస్థలము చేరినాను. దోవసరాళము. మహాదేవపురము, బసవాపురము అనే బస్తీ గ్రామములు దోవలో నున్నవి. ఆ మహానంది చీకారణ్యములో నున్నది. కొండ సమీపము గుడి చుట్టు సకలవృక్షములు నున్నవి. గుడి సమీపమున ఒక గుడిశయున్నులేదు. అన్ని వస్తువులు జననాపురమునించి తెచ్చుకొనవలెను. నిప్పు దొరకటమున్ను ప్రయాస. అచ్చట రాత్రిపూట మనుష్యులు నిలవరు. ఆ గుడిలో లింగమునకు దిగువగుండా తీర్థము స్రవించి ఒక తొట్టెలో నిలిచి అవతల ప్రవహింపుచున్నది. గుడి తీర్థము రమణీయ్య మైనది. శాస్త్రసిద్దమైన స్థలము. అర్చకుడు తంబళమువాడు. వచ్చినావారు తామే యీశ్వరుని అభిషేకము చేసి పూజింపు చున్నారు. అర్చకుడు ప్రతిదినమున్ను ఉదయమయిన జాముకు వచ్చి గర్భగృహము తలుపు తెరుచుచున్నాడు. గోసాయీలున్ను బయిరాగులున్ను రెండు, మూడు దినములు ఆ స్థలమందు నిలిచి పునశ్చరణ చేయుచున్నారు. అక్కడ రెండు ఘంటల దనుక నుండి రాత్రి ఆమడదూరములో నున్న బండాతుకూరు సాయంకాలమునకు చేరినాను. దోవ రేగడభూమి. ముండ్లు విస్తరించి యున్నవి. దోవలో నొక చిన్న నదిన్ని, మరికొన్ని కాలువలున్ను దాటవలెను, అడివి లేదు. ఆ యూరు కందనూరు వారిది. బస్తీ గ్రామము. అన్ని వస్తువులు దొరుకును. ఇండ్లు గొప్పవి. ఆప్రాంతములలో ఆవులకు పాలు పితుకుట లేదు. దూడలను ఆవులతో కూడా మేతకు తోలుచునున్నారు. అక్కడివారికి యెనప పాడి సహజముగా నున్నది. పశువులకు తాము కాపురముండే యిండ్ల కంటే చక్కగా కొఠములు కట్టి బాగా కాపాడుచున్నారు. ఆ ప్రాంతములలో వరిపంట లేదు. పుంజధాన్యములు సమృద్ధిగా పండుచున్నవి. శూద్రులు బాగా కష్టపడి కృషిచేయుచున్నారు. బ్రాంహ్మణులకు భూజీవనము పుష్కలముగా కలిగియున్నది.

తేది రాత్రి నాలుగు ఘంటలకు ఆమడలోనున్న వెలపనూరు చేరినాను. దోవ రేగడ, సరాళము, అడివినిండాలేదు. ఇండ్లు గొప్పవి. బట్టల అంగళ్ళు గూడా యున్నవి. సకల పదార్థములును దొరుకును. మంచి బ్ర్రాంహ్మణులున్నారు. గ్రామకరణ మయిన శేషప్ప అనేఅతడు అన్నదానము జేయిచున్నాడు. ధర్మ్మాత్ముడు. నవాబు తరపున ఉద్యోగస్థులు కొందరు ఆ గ్రామములో నున్నారు. ఉదకసౌఖ్యమునిండాలేదు. అక్కడికి ఓంకార మనే స్థలము ఎనిమిది పరుగుల దూరములో అడవినడుమ నున్నది. ఆ దినము మధ్యాహ్నము రెండు ఘంటలకు బయలుదేరి రెండు ఘడియల ప్రొద్దు కలదనంగా ఆమడదూరమున నుండే పేంపెంట్ అనే గ్రామము చేరినాను. దోవ అడివి బలసినది. మృగుభయము కలదు. గులక, రేగడ కలసిన భూమి. ఆ యూరు నవాబు యిలాకాలో చేరినది. భెబందు గ్రామము. చిన్నయిండ్లు పదార్ధాలు విశేషముగా దొరకవు.

తేదీ వుదయమైన గడియకు బయలుదేరి ఆమడదూరములోనుండే ఆత్మకూరు చేరినాను. భాట మంచిది. అడివి నిండాలేదు. ఆ యూరు కందనూరు నవాబు తాలూకా ఉద్యోస్థులుండే కనుబాస్థలము. ఆ కందనూరు నవాబు తాలుకా నాలుగు మేటీలుగా పంచి ఒక్కొక్కమేటీకి నొక్కొక్క ఆములుదారుని నేర్పచినాడు, కొంతతాలూకా తన వద్ది నవుకరులకు జీతానికి బదులుగా జాగీరుకా నిచ్చినాడు. ఆ నవాబు, కంపెనీకి సుమారు లక్షరూపాయీలు సాలెనా కట్టుచున్నాడు. అతని రాజ్యము భళ్ళారి జిల్లా కలకటరాజ్ఞకు లోబడినది. కలకటరు తరఫున నొక వకీలు కందనూరులో కాపురమున్నాడు. ఆ నవాబు రాజ్యస్థులకు స్వంతముగా నొక ఖాజీకోటు పెట్టి న్యాయవిచారణ చేయుచున్నాడు గాని, జిల్లా కంపెనీ కోరటుకు నిమిత్తములేదు. నవుకరులకు జీతము క్రమముగా ముట్టచెప్పడములేదని వదంతిగా నున్నది. అందరికి జీతము బహుస్వల్పము. తాలూకా అములుదారుల మీద అకబరునివీను అని ఒక ఉద్యోగస్థుని ఉంఛియున్నందువలన పనులు హామీ భరాయించి చూడడమునకు నెవరికిన్ని స్రాతంత్ర్యము లేక నున్నది. ఆ యాత్మకూరు దూరము నించి వినడానకు గొప్పయూరు, పేటస్థలము. ప్రతి ఆదివారమున్నుసంతకలదు. సంతలో సకల పదార్ధములు దొరుకునని ప్రసిద్ధి కలిగియున్నది. వచ్ఫివిచారించగా తద్వ్యతిరిక్తముగా నగుపడును. సంతలో ముసాఫరులకు అక్కరలేని పదార్ధాలు విక్రయింపుచున్నారు గాని ఉపయోగించునవి విశేషించి లేవు. ఆయాత్మకూరులో శ్రీశైల స్థలమందలి యాచకులున్ను యాత్రచేయను వచ్చిన వారివద్ద హాశ్శీలు పుచ్చుకునే నవాబు ముసద్దీలున్ను ఉన్నారు. అక్కడికి శ్రీశైలము నాలు గామ డని చెప్పుచున్నారు. ఆ నాలు గామడ దూరములో నడమ కొన్ని యూళ్ళున్నా, పదార్తములు ఎంత మాత్రమున్నూ దొరకవు గనక నక్కడనుంచి బయలు వెళ్ళీనది మొదలు మళ్ళీ ఆ స్థలముచేరేవరకు కావలసిన సామానులన్ని మరచిపోకుండా తీసుకొని పోవలసినది. మరచిన పరార్ధములు తక్కువ పడే యుండును. శ్రీశైలయాత్రకు తీసే హాశ్సీలు కందనూరునవాబుకు చేరుచున్నది. శివరాత్రి ఉత్సవములో శూద్రజనము ఒకటికి ర్పూ రెండు, గురానికి ర్పూ ఐదు, అభిషేకమునకు ర్పూ మూడు, వాహనోత్సవము చేయిస్తే ఉత్సవపు సెలవులు గాక గ మూడు, దర్మణసేవోత్సవమునకు ర్పూ మూడు. ఈప్రకారముగా పుచ్చుకొనుచున్నారు. శ్రీశైలమునకు నాలుగు భాటలు. ఎటుపోయినా నీశ్వర సంకల్పమేమో నాలుగు ఆమడదూరము, ఛీకారణ్యమయిన దోవ. ఒక భాట నెల్లూరు మీద నచ్చి చుక్కల పర్వతము నెక్కవలసినది. మరియొకటి కంభం దూపాటి మీదవచ్చి చుక్కలకొండ నెక్కవలెను. మరియొక భాట పడమటి దేశస్థులు కృష్ణానది దాటి రావలసినది. ఆ కృష్ణ పాతాళగంగయని పేరువహించి శ్రీశైలము క్రింద ప్రవహింపుచున్నది. శ్రీశైలమునుంచి ఆగంగకు పోవలెనంటే రెండుకోసుల దూరము. దిగియెక్కవలెను. కొంతదూరము సుళువైన డోలీమీద పోవచ్చును. మెట్లు పొడుగుగనుక నెక్కడము, దిగడము కష్టము. నేను వచ్చిన యీ యాత్మకూరు భాట తప్పమిగతా మూడు భాటలు ఉత్సవకాలములలో నడవవల్సినది గాని తలుచుకొన్నప్పుడు నడవకూడదు. మృగభయము, చెంచువాండ్ల భయమున్ను విస్తరించియుండును. ఆ ఛెంచువాండ్లు అడివి మనుష్యులయినను యాత్రకు వచ్చేవారిని యాచించి తినే వాడికే పడియున్నారు. శివరాత్రి మొదలు చైత్రమాసమువరకు శ్రీశైలము మీద ప్రతిదినమున్ను పల్లకీసేవ అనే ఉత్సవము జరుగుచున్నది. ఛైత్రమాసములో భ్రమరాంబ యనే దేవికి తామసపూజ చేసి శ్రీశైలముమీద వచ్చియుండే జనులు విరామమును బొందుచున్నారు. అటుపిమ్మటనొకరిద్దరు అర్చకులు మాత్రము మార్చిమార్చి ఆయాత్మకూరు నుంచి వచ్చి యుంచున్నారు. ఎక్కువ దినములుంటే అక్కడి నీళ్ళు ఒంటక జ్వరము, మహోదరము, సోభ మొదలయిన రోగములు కలుగుచున్నవి. శ్రీశైలమున గుడికి సమీపముగా ఇరవై చెంచుగుడిశేలున్నవి. వారున్న ఆ గుడిశెలు వదిలి భాద్రపద మాసములో వలస పోవుచున్నారు. అప్పటికి వర్షాకాలము తీరి యీగెల ఉపద్రవము కలుగుచున్నది. అది సహించతగినది కాదు. గుడివద్ద స్వామికి ఆవులు వంద దనుక నున్నవి. కడప విడిచిన వెనుక ఆవుపాలు, పెరుగున్ను కండ్ల చూడవలెనంటే శ్రీశైలముమీద చూడవలసినది గాని ఇతర స్థలములలో ఆవులను మాత్రము కండ్ల చూడవచ్చును. ఆవుపాలు తీసుటలేదు, దూడలకు విడిచిపెట్టుచున్నారు. అంత జాగ్రత్తగా ఈ దేశస్థులు పసువులను కాపాడిన్ని, దున్నడముకు ఎద్దులు నెల్లూరుసీమనించి తెచ్చే వారివద్ద హమేషా వారికి కొనవలసి యున్నది. ఎనుములు పాడికే గాని అచ్చటి దున్నలు ఆభూమిని నిగ్గి దున్న నేరవు. తడవకు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు వరహాలు పెట్టి యెద్దులను కొనుచున్నారు. ఆ యాత్మకూరి కాపురస్థులు అనేక పర్షన్ వాండ్లను గొప్ప, చిన్నలను చూచి మెరుగైనవారై యున్నారు. ముసాఫరులకు దేవి యాచకులయిన తెనుగు బ్ర్రాంహ్మణులు రెండిండ్లవారున్ను, స్వామి యాచకుడయిన జంగవాడొకడున్ను - వీరే స్థల మివ్వవలసినది గాని, యితరుల యిండ్లు గొప్పలయినను స్థల మివ్వరు. రెండు నుంచి మూడు వరకు చిన్న దేవస్థలములు, చావిళ్ళున్ను న్నవి. తప్పితే అందులో దిగవలసినది. ఆయాత్మకూరినించి పట్టణపు షవారీల మీద కష్టముగా శ్రీశైలపర్వతమునకు పోయి చేరవచ్చునని తెలియనందుచేత మూడు డోలీలు రెండు రూపాయీలకు చేయించినాను. వాటిని నొక దినములో అక్కడి వడ్లవాడు చేసినాడు. అక్కడి రూపాయికిన్ని చెన్నపట్టణపు రూపాయికిన్ని సుమారు కాలురూపాయి భేదమున్నది. పట్టణపు రూపాయి ఒకటి కె అక్కడి రూపాయిపన్నెండు ఎనిమిదిమంది కూలి బోయీలను అక్కడి వారిని శ్రీశైలమునకు పోయి రాగలందులకు జనము ఒకటి కి రూపాయిలు నాలుగు లెక్కను కుదుర్చుకొన్నాను. నా వుప్పాడాబోయీలను ఎనిమిది మందిన్ని వారికి సామాను తేను మూడు బోయీలనున్ను నాసామాను తేను నాకావటి వాండ్లను ఆర్గురు నిన్ని తీసుకున్నాను. వారి సామనున్ను బంట్రోతులకు నలుగురికి భోజన సామానున్ను తేను ఒక కావటివాని కూడా తీసుకోన్నాను. నాపరివారమైన్ ఇరవై ఐదు మంది బ్రాంహ్మణులకు ఐదు దినముల మెనూను, భత్యము, తీసుకొని ఇరవై ఐదవ తేది ఉదయాన మూడు ఘంటలకు ఆత్మకూరు వదిలి నాలుగు కోసుల దూరములో నుండే నాగులోటి అనేగుడి లో ఘంటకు ప్రవేశించినాను. దోవలో రాధాపురము, కృష్ణాపురము, వెంకటాపురము, సిద్ధాపురమున్ననే గ్రామములున్నవి. బహు చిన్నవి. చెంచు వాండ్లు, యితరులున్ను కలిసి కాపురమున్నారు. ఆ వెంకటాపురము వరకు భాట సరాళము, వెల్లడిగా నున్నది. అది మొదలు నాగులోటి గుడివరకు భాట సరాళమయినా యిరుపక్కలనున్ను దట్టమయిన అడివి. ఆ సిద్ధాప్, ఉరములో చెంచువాండ్లకుగాను నవాబు మనుష్యులు మనిషి ఒకటి కికె మూడు డబ్బులు హాళ్ళీలు పుచ్చుకొనుచున్నారు. డబ్బులు అనగా చెన్నపట్టణపు రెండు దుడ్లు. అక్కడ అణాలు, అర్ధణాలు, పావులాలు దొరకవు. అక్కశడ దబ్బులు మార్చి పెట్టుకొని సెలవు చేయవలసినది. అణాకు మూడుడబ్బులవుచున్నవి. ఆడబ్బులు ముందరి పట్నం లింగిశెట్టి దుడ్లవలెనే అరిగిపోయి యున్నవి. ఆ నాగులోటి వరకు సవారీ మనుష్యులున్ను సాధారణముగా పోవచ్చును. నాగులేటిలొ సిద్ధాపురములో కాపురమున్న చెంచువాండ్లు వేటకు రాగా వారింజూడవలసినదేగాని యితరులు పరిష వారికి కనుబడదు. ఆ గుడి మజిలీ చేసి దిగను నయిపు, వీలు, గా జలవసతి కలిగి యున్నది. ఆ గుడి వీర భద్రస్వామిది. ఒక జంగము ఆత్మకూరిలోనుంచి వారానికి రెండు ఆవృత్తులు వచ్చిపూజచేసి పొవుచున్నాడు. అక్కడ మధ్యాహ్న భోజనము చేసుకొని మూడు ఘంటలకు బయలు దేరి అక్కడికి అయిదు కోసుల దూరములో నున్న పెద్దచెరువు అనే యూరు తొమ్మిది గంటలకు చేరినాను. నాగులోటి వదిలనది మొదలు కోసేడు దోవపర్యంతము కష్టమయిన కొండ యొక్కుడు, దిగుడుగానున్నది. మెట్లు బాగా కట్టియున్నవి. ఆ కోసెడు మిక్కిలి ప్రయాస. అవతల రెండు కోసులు ఎక్కడము, దిగడము లేక పోయినా దోవ రాతిగొట్టుగాను న్నిరుపక్కల దట్టమయిన అడివిగాను నున్నది. సవారీలు వస్తే చెట్లకొమ్మలు వాటికి తగులును. ఆరాతిగొట్టు దారిని దాటిన వెనుక పెద్ద చెరువుదాకా గుర్రపుబండ్లు పొయ్యే పాటిగా, భాట విశాలముగా సమముగా నున్నది. పెద్ద చెర్వునుంచి పచ్చేటప్పుడు రెండుమూడు భాటలు చీలిపోవు చున్నవి. తెలిసిన చెంచుగాండ్లను పిలుచుకొని నాగులోటె చేరవలసినదిగాని స్వతంత్రముగా బోనే తప్పిపోదురు. కుడిచేతి పక్క చీలే భాటలు వదిలి యెడమ చేతిపక్కభాటను పట్టి వస్తే నాగులోటికి రావచ్చును. ఆ పెద్దచెరువు విడిచి శ్రీశైలము చేరేవరకు గాని నాగులోటి వదిలినది, మొదలుచేసుకొనిగాని యెక్కడనున్ను ఆవరణ సంబంధమయిన నీడయున్ను, జలవసతి గల ప్రదేశమున్నులేవు. ఆపెద్దచెర్వు అనే యూరిలో పందులు తోలను చాలేపాటి ఇరవై కిరాతకుల గుడిశలున్నవి. మరి వేరేనీడలేదు. చెరుఫులో రమణియ్యమయిన రామరస పుష్పాలుగల జలము కలిగి యున్నది. చెన్నపట్టణపు కొణ్నూరు నీళ్ళు వదిలిన వెనక నింశపాటి యుదకము నేను చూచినవాడను గాను. అందరున్ను ఆ చెరువుకట్టమీద వంట, భోజములు చేసుకొని వానవచ్చునేని ఆ గుడిశలలో కూర్చుండి యుండవలసినది. ఆయూరి చెంచు బోయీలనే కిరాతకులకు నొకడు యజమానుడుగా నాయకుడనే బిరుదు వహించియున్నాడు. వాడు ధర్మ్మాత్ముడు. పరషవారివద్ద నవాబు సరకారుయొక్క ఆజ్ఞప్రకారము మనిషికె మూడు డబ్బులవంతున హాశ్శీలు తీసుకొన్నా పస్తుగా నుండేవానికి బియ్యమిచ్చి పాత్ర యిచ్చి వంటచేసుకొనుమని ఉపచరింపుచున్నాడు. ఆమార్గముగా శ్రీశైలమునకు వెళ్ళేవారికి పొయ్యేటప్పుడు, వచ్చేటప్పుడు అక్కడ నిస్సందేహముగా విధిలేక మజిలీ చేయవలసి యున్నది. నేను తిరుగుదలై పచ్చేటప్పుడు పదిరూపాయీల్లో నొక చావిడి విశాలముగా కట్టవచ్చునని ఆనాయకుడు మొదలైన వారిగుండా తెలుసు కోంటిని. అక్కడి వాడిక ప్రకారము వెదురు తడికలతో గోడలుపెట్టడము వలన నన్ను, అడివి వెదురు మయంబు నందుననున్న, అక్కడి వెదురు తడికెలు మట్టి


రెండవ ప్రకరణము  శ్రీశైలము నుండి హైదరాబాదు రాజ్యము వరకు

గోడలకంటె ద్విగుణ మయిన బలము కలవి గనుకనున్ను బహు బల మయిన కొయ్యసామాను అతినయముగా దొరుకుచున్నది. గనుకనున్ను వారు చెప్పిన ప్రకార మొక చావిడి కట్టదానకు రూపాయలు ఇరవై చాలు నని తోచినది. ఆరాత్రి చెరువుకట్టమీద వంట, భోజములు చేసుకొని ఉదయమయిన నాలుగు ఘంటకు బయలుదేరినాను. ఆరాత్రి మిక్కిలి చల్లగాలితో కూడామబ్బు తుంపర పడుచుండెను గనుక నొక బోయిగుడిశె ఖాళీ చేయించి అందులో పండుకొన్నాను.

రతేదీ అక్కడికి నాలుగు కోసుల దూరములో నుండే శ్రీశైలము పన్నెండు గంటలకు చేరడ మయినది. పెద్దచెరువు విడిచి వెంబడిగానే కొండయెక్కను ఆరంభించవలసినది. ఒక్ కోసెడు యెక్కుడు, దిగుడుగా నుంచున్నది. అయితే మెట్లువైపు, వీలు,గా కట్టియున్నవి. నిండా ప్రయాస కాదు, ఇరుప్రక్కలా అడివి. అటుపిమ్మట కోసెడు దూరము సమభూమి. అందులో పొయ్యేదారి రాతిగొట్టుగా నుంచున్నది. అటుపిమ్మట భీముని కొల్ల మనే$ అగాధాఇన కొండ్ పల్లమువరకు కొండ యెక్కుడు దిగుడుగా నుంచున్నది. అక్కడ మెట్లు ఏర్పరచి కట్టియున్నవి. ఆయాగాధ మైన కొండదొవలో నొక వాగు పారుచున్నది. అక్కడ ఆసోదా చేసుకొని కొండయేడుతిరుగుళ్ళు, రెండువేల మెట్ట్లు పర్యంతము, మిక్కిలి పొడుగుగా నెక్కవలసినది. ఆ ప్రదేశములో నెక్కేటప్పుడు, దిగేటప్పుడున్ను వాడికె లేనివారికి చుట్టూ చూస్తే కండ్లు తిరుగును. మెట్లు బాగుగా నెక్కవలసినంత దూరము కట్టి యున్నవి. చుట్టు ఏతట్టు చూచినా నవ్రతములున్నవి. యీప్రకారము రెండుకోసులు ఎక్కిన వెనుక సమభూమిలో రాతిగొట్టు గల మార్గము శ్రీశైల పర్యంతము పోవుచున్నది. ఆ కొండ యెక్కుటుకు, దిగుడుకు తిరుపతి బోయీలు డోలీకి ఆరు మంది అయినట్టయితే అనాయాసముగా నెక్కిపోదురు. అంతదూరము ఎక్కుడు దిగుళ్ళలో తిరుపతి గాలిగోపుర పర్యంతము అక్కవలసినంత ప్రయాస యెక్కడనున్నులేదు. నాతోడవచ్చిన వుప్పాడా బోయీలు ఎనిమిది మందిన్ని నాడోలీని అనాయసముగానే మోసినారు. అయితే నాగులోటి దాటగానే కొండ యెక్కవలసిన దాని కంటే రఫంత ప్రయాస యెక్కువ గనుక, అక్కడ ప్రధమ మందే యీలాగున నున్నదే, యిక నేలాగున నుండునో యని అధైర్యము తోచుచున్నది. అవతల సాగిపోగా సుళువనిపించుచున్నది గాని వేరుగాదు. ఆ కోండ ఉయెక్కుడు, దిగుడులలో ఆత్మకూరి బోయీలకు వుప్పాడ బోయీలు తీసిపోలేదు. ఆ యాత్మకూరి బోయీలకు సంవత్సరమునకు నొకసారి పనిపడు చున్నది గాని నిండా పనిలేదు గనుక నెక్కడము, దిగడములలో తిరుపతి బోయీల వలెనే ఆబోయీలు వాడికే పడిన వారుకారు. నేను చేయించిన డోలీకి బంగాళా పాలకీ వలెనే రెండుం ముక్కాలడుగు వెడల్పు పెట్టించినాను. అది శ్రీశైలమునకు సాధారనముగా సాగిపోయినది. కందనూరు నవాబు వగయిరాలు పల్లకీల మీదనే శ్రీశైలమునకు వెళ్ళియున్నారు. సంపన్నులయి నందున దోవలోని చెట్ల కొమ్మలు కొట్టడమునకు ముందుగా మనుష్యులను జాగ్రత్త పెట్టి యుండవచ్చును.

తేది పగలు మూడు ఘంటలకు శ్రీశైలముమీది గుడి కల్యాణ మంటపములో నుంటిని. అక్కడ ముందు గుడికి చుట్టున్ను గొప్ప పట్టణ ముండను. వేశ్యా స్త్రీల యిండ్లు మట్టుకు మూడు వందలు డెబ్బై ఉండినవి. ఆపట్టణ మంతయు ఇప్పుడు పాడుబడి పోయెను. ఇంటింటనున్న బావులు శిధిలములయినవి. గోడలుగూడా ఇప్పుడు తెలియుచునున్నవి. ఐదు వందలు? ఏండ్లనాడు అనవేమారెడ్డికి భగవంరుని కటాక్షము చేత బంగారనుములు పండినవని వాడుక కలిగియున్నది. అతడు స్వామి గర్బగృహమునకున్ను, ధ్వజస్తంభములకున్ను బంగారు మొలాము చేసిన రాగి తగుళ్ళు కొట్టించినాడు. అని యుప్పుడు నిండా శిధిలములుగా నున్నవి.

గుడికి రెండు ప్రాకారములు కలిగియున్నవి. బయిటి ప్రాకారపు గొడలమీద నాలుగుపక్కల శివలీలలు సుందరములయిన ప్రతిమలుగా చెక్కియున్నవి. వాటిని శిల్పి బహు బాగాచేసినాడు. అయితే రాళ్ళను వయివుగా నంతన చేసినవాడుకాడు. ప్రాకారము మీద ప్రతి కోట కొమ్మకు నొక్కొక్క ప్రతిమ చెక్కియున్నది. గుడి లోపల గెండో ప్రాకారము బొత్తిగా శిధిల మయిన్నది. మంటపములు ఆ రీతిగానే యున్నవి. అర్చకులకు మనసు వచ్చినప్పుడు దీపారాధన, నైవేద్యములు స్వామికి చేయబడు చున్నవి. గాని నిత్య నియమము లేదు. బ్రాంహ్మణులు స్వేచ్చగా లింగమును తాకి అభిషెక నివేదనలు చేయవచ్చును. భ్రమరాంబా దేవికి మాత్రము మిరాశీ అర్చకులతరపున నొకడు నియమముగా గుడిలో కాపురముండి అర్చన చేయుచున్నాడు. అలాగు అర్చనచేసే గుమాస్తా సంవత్సరము ప్రాణము తోనుండుట దుస్తరము. అందుకు కారణము రోగప్రదేశమేనో, వానిభక్తి తక్కువేనో తెలిసినదికాదు. ఇప్పుడు ఐదు సంవత్సరములుగా రాజశ్రీభొట్లు అనే బ్రాహ్మణుడు ముప్పై ఏండ్లవాడు ప్రాణముతో నక్కడ నిలచియున్నాడు. అది ఆశ్చర్యముగా నున్నది. అతడు ఏకాకి. ఆగుడి లింగము భూమికి జీనెడు పొడుగుగా నున్నది. విమానమునకు నాలుగు శిఖరములు, అని నాలుగుపక్కల శిధిలము లయియున్నవి. నడమనున్న గొప్పశిఖరము దర్శనమునకు నుపయోగింపు చున్నది. ఆత్మకూరి దారిని వస్తే గుడిలో ప్రవేశించేవరకు శిఖరదర్శనము కానేరదు. నెల్లూరి కంభము మార్గములనస్తే గుడికి మూడుకోసుల దూరములోనున్న శిఖరేశ్వర మనేపేరు గలిగిన యున్నత ప్రదేశమునకు శిఖరము తెలియు చున్నది. ఆగుడివద్ద వశింపుచున్న చెంచువాండ్లు ఆత్మకూరి వారివలెనే మిక్కిలి కొవ్వినవారు. భ్రమరాంబ గుడికిన్ని, మల్లికార్జునస్వామి గుడికిన్ని సమీపమందే కొంచెపు మిట్టమీద శ్రీచక్రస్థాపన చేసియున్నది. గుడిలో ఇరవై రెండు తీర్ధములున్నవి. ప్రతి తీర్ధమందున్ను కొండవూట స్రవించి తీర్ధములము అంతర్వాహినిగా పారివచ్చి అవతల సాగి పోవుచున్నది. ప్రతి తీర్ధమునకున్ను సూర్యరశ్మి పడకుండా పైన మంటపాలు కట్టియున్నవి. ఏ తీర్ధమున్ను మోకాటిలోతుకు నెక్కువలేదు. రోగకారియని అక్కడివారు చెప్పినారు. ఉదకము నిర్మలముగా నున్ను, శీతళముగా నున్నది. ఆగుడిహాశ్శీలు మూలకముగా సంవత్సరము ఒకటికి పదిహేను వేల కందనూరు నవాబుకు వచ్చినా, గుడి యేగతి పొందేదిన్ని విచారింపడు. ఏరయినా మరమ్మతు చేసినట్టయితే సెలమత హాశ్శీలు తీసుకొనుచున్నాడు. రాజా చందలాలా ఈనిర్బంధము చేత కొంత మరమ్మతుచేసి విసికి విడిచి పెట్టినాడు. అతను అర్గురు బ్రాంహ్మణులను నెల ఒకటికి మూడు రూపాయీలు జీతముచేసి నిత్యము స్వామికి అభిషేకము చేసేటట్టు వుంచినాడు. మహిషాసుర మర్ధనము మహినూరి దేశములో చేసినందున ఆదేశమునకు మహిసూరనే పేరు వచ్చినదను చున్నారు. అక్కడ మహిషాసుర మర్ధనమయినందున వెనుక భ్రమరాంబ శ్రీశైలము ప్రవేశించినది. మహిసూరు తద్ద్వారా ఆమె పుట్టిన దేశమని ఆ దేశస్థులు ఎవరు వచ్చినా హాశ్శీలు యియ్యనక్కరలేదు. జంగాలకు, ఆరాధ్యులకు, బ్రాంహ్మణులకున్ను ఉత్సవ కాలములో హాశ్శీలు లేదు. గుడిలో నే పక్క చూచినా అడివి ములిచి సర్ప వ్యాఘ్ర భూయిష్తముగా నున్నది. ఆ యడవి కొట్టి చక్కచేసే దిక్కులేదు. స్వామికిన్ని, దేవికిన్ని ఎవరయినా ఆభరణాలు, వస్త్రాలు సమర్పించిరేని వాటిమదింవంత రూకలు హాశ్శీలు పుచ్చుకోనడము మాత్రమే కాకుండా కొన్ని దినములు పోనిచ్చి ఆ వస్తువులే ఆ కందనూరి నవాబు అపహరించు చున్నాడు. తిరుపతి విషయముగా కంపెనీవారిని అహో గుణవతీ భార్యా భాండమూల్యం న యాచతే అనే శ్లోకసంగతి ప్రకారము ఆ స్థలవర్తమానము తెలిసినవారు కొనియాడవలసియున్నది. కలి సామ్రాజ్యము గనుక లోకక్రమం సాక్షిగా నుండే యీశ్వరుడు లోకులకు కర్మఫలప్రదానము చేయుట కంటె ఎక్కువ యేమి చేయగలడు? ఇది నర్మజనపూజిత మయిన ప్రసిద్ధి కొనిన స్థలము. శిఖరదర్శన మాత్రము చేతనే జన్మాదులు లేవని పురాణాలు మొరపెట్టు చున్నవి. యీ మహాస్థలము మూడు ఘంటలకు వదిలి నాలుగు ఘంటలకు దిగుడు గనుక త్వరగా భీముని కొల్లము చేరినాను. ఆరు నాలుగు ఘంటలకు పెద్దచెరువు చేరినాను. ఆ రాత్రి అక్కడ వచించి ఇరవై ఒకటి తేది ఉదయమయిన మూడు. నాలుగు ఘంటకు బయలువెళ్ళి ఆరు ఘంటలకు నాగులోటి చేరినాను. అక్కడ నించి భోజనోత్తరము మూడు ఘంటలకు బయలుదేరి సాయంకాలము నాలుగు ఘంటలకు బయలుదేరి సాయంకాలము ఐదు ఘంటలకు ఆత్మకూరు చేరినాను.

తేది మూడు ఘంటలకు అక్కడనుంచి బయలివెళ్ళి కోసెడు దూరములో నుండే నందిగుంట అనేగ్రామము నాలుగు ఘంటలకు చేరి వర్షో పద్రవముచేత అక్కడనే నిలిచినాను. భాట మంచిది. అయితే ముండ్లు విస్తారముగా నున్నవి. ఆ గ్రామము గొప్పది. భ్రాంహ్కణుల యిండ్లు, కోమట్ల యిండ్లు న్నున్నవి. సకల పదార్ధాలున్ను దొరుకును. దేవస్థల్లములున్నవి. ఆ దేవస్థలములో దిగినాను.

తేది ఉదయాన మూడు ఘంటలకు బయిలుదేరి రెండామడ దూరములోనున్న నివృత్తిసంగమ మనే పుణ్యక్షేత్రము ఇరవై ఒకటి ఘంటలకు చేరినాను. అది కృష్ణాతీరము. ఆ కృష్ణలో తుంగభద్రతో కూడా అయిదు నదులు అంతకు మొందే కలియుచున్నవి. భనాశిని అనే నదిన్ని ఆ స్థలమందు కలియుచున్నది గనుక అక్కడ కృష్ణానది అనర్గళముగా ప్రవహింపుచున్నది. వాసయోగ్యమైన ప్రదేశము. ఏటియొడ్డున ధర్మరాజ ప్రతిష్టితమైన శివస్థల మొకట్యున్నది. బృహస్పతి కన్యాగతు డయినప్పుడు అక్కడ అనేకవేల ప్రజలు వచ్చి కృష్ణపుష్కరాల యాత్ర చేసుకొని పోవుచున్నాదు. సకల పాపాలను నివృత్తిని పొందించే ప్రదేశము గనుక నివృత్తి సంగమ మనేపేరు ఆస్థలమునకు వచ్చినది. ఇరువది బ్రాంహ్మణుల యుఇండ్లున్నవి. కావలసిన పదార్దాలు ప్రియముగా దొరుకును. ఊరుకొండకింద నున్నది. అక్కడ కృష్ణ ఉత్తర వాహినిగా ప్రవహించు చున్నది. ఆ దినము వచ్చినదోవ మహా సుఖకర మహినది. ఎటువంటి ఋతువులోనున్ను సన్న గులక భూమి గనుక భాట ప్రతికూల మయ్యేది కాదు. అడివిలేదు. దోవలో అడుగడునకు గ్రామాదులున్నవి. జలవసతి కలదు. ఊరూరికి శిధిలమయిన కోట యొకటి కలిగియున్నది. అక్కడి గుళ్ళలో తంబలవాండ్లు అర్చకులుగా నున్నారు. కావలిసినవారు తామే పూజ చేయవచ్చును. ఆ యూరున్ను కందనూరు నవాబుతో చేరినది. ఆ కృష్ణ దాటడానికి మనిషికి ఇంతమాత్రమని హాశ్శీలు పుచ్చుకొనుచున్నారు. శ్రీశైలానకు వెళ్ళేటందుకు నేను శూద్ర మనిషికి ఒకటి కి ర్పూ మూడు సగం గుర్రనికి ర్పూ మూడు సగం అభిషేకానికి ర్పూ సగం బ్ర్రాహ్మణునికి అ రెండు, లెక్కనిచ్చినాను. కృష్ణ అక్కడ దాటవలసినది గనుక అక్కడ ఘాటు హాశ్శీలు ఒక పక్క కందనూరు నవాబుకున్ను ఒక్కప్రక్క హయిదరాబాదు వారికిన్ని యివావలసి యున్నది. ఆకృష్ణ యీవలి గట్టువరకు కందనూరి నవారియొక్క దొరతనమునకు లోబడిని దేశము. ఆవలిగట్టు మొదలు చేసుకొని హైదరాబాదు వారి రాజ్యము. తిరుపతి మొదలు ఆ యూరివరకు ప్రతి గ్రామమున కున్ను ఒక రెడ్డిన్నీ, ఒక కరణమున్ను ఉన్నారు. ఆ కరణాలు కొందరు నందవరీశులు, కొందరు ప్రధమ శాఖలు, కొందరు నియోగులు. ఈరీతిగా బ్ర్రాహ్మణులు ఆ యుద్యోగమును చూచుచున్నారు. కట్టుబడి బంట్రోతులని జీతానికి బదులుగా భూమిని అనుభవింపుచు కావలి కాచుకొని గ్రామాదుల సకల పని పాటలున్ను చూచున్నారు. పరువు కలిగిన ముసాఫరులకు కావలసిన సరంజామా సహాయసంపత్తు ఆ రెడ్డి కరణాలగుండా కావలసినది. ఆ యుద్యోగస్థుల నిద్దరినిన్ని నయభయముల చేత స్వాధీన పరచుకొంటేగాని మార్గవశముగా వచ్చే పరువుగల వారికి పనులుసాగవు. పరువుగలిగిన ముసాఫర్లు అధికారపు చిన్నెకొంత వహించితేనే బాగు. నిండాసాత్విక గుణము పనికిరాదు. మార్గము చూపించడమూకున్ను దిగిన తావున కావలసిన సామానులు తెప్పించి యివ్వడమునకున్ను రెడ్డి కరణాల యొక్క ఉత్తరవు ప్రకారము ఆ కట్టుబడి బంట్రోతులు పనికి వచ్చుచున్నారు. ఓంకార మనే స్థలమందలి తీర్ధములో నున్న జలమందు మునిగి క్షణమాత్రము తల యెత్తక నిలిపియుంటే ఓంకార నాదము వినిపింపుచున్నది. ఆనివృత్తిసంగమమునకు నేను వచ్చిన భాటలో అక్కడకు ఆమడ దూరములో ముసలిమడుగు అని యొక యూరున్నది. అది పేటస్థలము, దిగేమజిలి, వసతియయిన గ్రామము. ఆ నివృత్తిసంగమములో నుండే అగ్రహారీకులకు భళ్ళారి జిల్లా శిరిస్తా చేసి యిప్పట్లో బోర్డు సిరస్తాగానుండే రామచంద్రరాయుడు ఒకకాలమందు అక్కడికి యాత్ర బోయి వాక్సహాయముచేసి ఆ యగ్రహారీకులు నవాబు సరకారుకు కట్ట్టుచునుండే పన్నురూకలను మాపుచేయించినారు. అనుభవించే భూమిని సర్వదుంబాలా చేశినాడు. గనుక అక్కడి ద్విజులు మేము చేసే సత్కర్మ ఫలము అతనికి చెందవలసిన దని చెప్పి కొనియాడుచున్నారు. కడప మొదలుకొని యిదివరకు జ్యేష్టమాసము మొదలు శ్రావణమాస పర్యంతము క్రమమయిన వర్షాకాలము. ప్రతి దినమున్ను మబ్బు, వర్షము కలిగియున్నది. కొండకింది గ్రామాదులలో గాలి కొట్టేటప్పుడు ఆ గాలి కొండలమీద మోది అతి ధ్వనితో బహువేగముగా సమీపమందు విసురుచున్నది. కొత్తవారికి ఆగాలి సహించడము ప్రయాసగా నుంచున్నది. తిరుపతి మొదలు కొని యెంత పాతబియ మని అంగటివాడు ఇచ్చినను కొత్తబియ్యము వలెనే అన్నము మెత్తపడుచున్నది, గనుక ఆ బియ్యము వాడికె బడేదాకా ప్రయాసగా నుండును. నాటు ఉప్పుడుబియ్యము ఆ ప్రాంతములలో బొత్తిగా దొరకదు. పేదలు జొన్నలతోనున్ను, అరికె యన్నముతోనున్ను కాలము గడుపుచున్నారు.

తేది మొదలు ఇరవై నాలుగు తేది మధ్యాహ్నపర్యంతము తీర్ధ విధి మొదలయిన పితృక్రమములు చేయడానికు అక్కడ వుండి పన్నెండు ఘంటలకు భోజనము చేసుకొని బయలుదేరి రెండు కోసెడు దూరములో నుండే సిద్ధేశ్వరం ఘాటుకు పోయినాను. ఆ రెండు కోసున్ను కొండమీద నెక్కి నడిచి కొండ తిరిగి పోవలసినది. దారి రాతిగొట్టు ఎక్కి దిగుచు నడవలసినది. అక్కడ కందనూరు వారిది యొక పుట్టి యున్నది. నలుగురు బోయిజాతి మనుష్యులు ఆ పుట్టిని తెడ్లతో తోసిగడుపు చున్నారు. ఆ పుట్టి - అనగా పెద్ద వెదురుగంప, ఇరవై మంది కూర్చుండవచ్చును. పయిన చర్మముతో కవచము కుట్టియున్నది. బహుసున్నితము. రవంత ద్వారము పడితే ప్రమ్మదము వచ్చును. ఒక్ పల్లకీనిన్ని పన్నెండు మంది బోయీలనున్ను ఒక ఇడతకు దాటించినారు. అవతలిగట్టుకు పోయి రావడానికి ఇరవై నాలుగు నిముషాలు పట్టుచున్నవి. దాని తావున నదికి నిరుపక్కలా కొండలున్నవి. తద్వారాగాలితోను విస్తరించి ఆఘాటుకు లేదు. గనుక ఆఘాటు ఇతరములయిన ఘాట్లకన్నా నది దాటడానికి క్షేమకరము. నాలుగు ఘంటలకు నాసరంజామాతో గూడా అవతలిగట్టుకు పోయి అక్కడ హాశ్శీలు సవారీకి రూపాయిలు ఐదుద్ను, గుఱ్రానికి రెండు రూపాయిన్ని, శూద్రులకు స్వల్పముగా నున్ను యిచ్చి ఆగట్టువలేనే నిజాం యిలాకా వారికిన్ని యిచ్చి నాలుగు ఘంటలకు బయలుచేరి అక్కడికి మూడుకోసుల దూరములో నుండే పెంటపల్లి అనే గ్రామము మూడు ఘంటలకు చేరినాను. డారి కొండలనడమ బోవుచున్నది. అందులో రెండు కోసులదూరము రాళ్ళమయమయిన కనమ. అది దాటిన వెనక నొక కోసెడు దూరము వెల్లడిగా, భాట బాగుగా నున్నది. ఆ గ్రామములో విశాలమున్ను, సుందరము న్నయిన వెంకటేశ్వర దేవాలయ మొకటి యున్నది. ముసాఫరులు దిగడానికి ఇదే యిండ్లకన్నావసతిగా నున్నది. బస్తీ గ్రామము ఇరవై కోమటి యిండ్లున్నవి. సకల పదార్ధములున్ను దొరుకును. ఆగ్రామము హయిదరాబాదు రాజ్యములో చేరినది. అయినా హయిదరాబాదు నవాబు క్రింద అనేక జమీనుదారులున్నారు. గనుక కొల్లపురపు జమీనిదారునితో ఆ గ్రామముచేరియున్నది. ఆ జమీందారులు క్లుప్తమయిన రూకలు కట్టి సకల రాజ తంత్రములున్ను తమ తమ జమీనుదారిలో స్వతంత్రముగా జరిపింపుచున్నారు. సేవా సయాయ సంపద ఎక్కువగల జమీనుదారుడు క్లుప్తమయిన రూకలిచ్చుటలేదని చెప్పుట కలదు. అప్పుడు హయిదరాబాదు వారు దండెత్తి కొట్టి సాధించి రూకలు తీసుకునుచున్నారు. ఆ జమీనుదారులకు ఒకరి కొకరికి సరిపడక వచ్చినట్టయితే పోట్లాడి చావడముమాత్రమే కాకుండా ఒకరి గ్రామాదులను ఒకరు కొల్లపెట్టి రహితులను హింసించి గామాదులను పాడు చేయుచున్నారు. ఈలాగున కలహములు పొసగినప్పుడు న్యాయము విచారించి యొకరి కొకరికి సమ

రస పెట్టకుండా దివాన్ జీతనము చేసే చందులాలా ప్రభృతులు ద్రవ్య కాంక్ష చేత నుభయులకున్ను కలహమును పెంచి వేడుక జూచుచున్నారు. ఈలాటి ప్ర్రారబ్దము నా ప్రయాణకాలములోనే వనపత్రి జమీను దారునికినీ కొలాపురపు జమీనుదారునినిన్ని ఒక సంవత్సరముగా పొసగి తహతహపడుచున్నది. నెను ఆ పెంటపల్లి కోటలో హయిదరాబాదు నవాబువారిది కొంత ఫౌజు ఉన్నందున నయభయాలచేత ఆ ఖిల్లాదారుని స్నేహితుని చేసుకొని జవానులను కొందరినికూడా తీసుకొని ఇరవై మూడుతేది ఉదయాన నాలుగు ఘంటలకు ప్రయాణమై రెండు కోసుల దూరములోనున్న పానగల్లు అనే ఖిల్లాగ్రామము ఒకటి నుంచి రెండు వరకు ఘంటలకు చేరినాను. మూడు కోసుల దూరమునకు వెనక తుమ్మగుంట యనే గ్రామమున్నది. అది మొదలు కంపెనీవారు హయిదరాబాదుకు లష్కరు వెళ్ళడానకు నెర్పరచిన భాట. అంతకు లోగడ దువ్వూరు మొదలుకొని ఆ తుమ్మగుంట వరకు శ్రీశైల యాత్ర నిమిత్తమై నేను కల్పించుకొన్న భాట. ఆ పెంటపల్లెకు పోయిన వెనక హయిదరాబాదుకు వెళ్ళను అనేక భాటలను లోకులు చెప్పుదురు. వాటిలో కొత్తకోటభాటను అందరు సాధారణముగా ముఖ్యమని చెప్పుదురు. అది చుట్టుగానున్ను, ప్రయాసమైన మార్గముగా నున్నది. ఆ తుమ్మగుంటవరకు భాట వెల్లడిగా సరళమయినదిగా యిసకపరగా నున్నది. అది మొదలుకొని పానగల్లువరకు చిన్నచిన్న కొండలపక్క పార్శ్వములలోనుంచున్నది. అపానగల్లు కొండకింద నున్ను, కొండమీద విశాలమైన దుర్గమున్నది. ఆగ్రామమున్ను, దానితొ చేరిన మరికొన్ని గ్రామములున్ను డేరాల దారోగాకు జాగీరుగానిచ్చినారు. గ్రామము బస్తీగాకపోయినా యింగీలీషుల ముష్కరుకు సరంజామాచేసి వాడికె పడినది గనుక ముసాఫరులకు కావలసిన వస్తువులు దొరుకుచున్నవి. ఇండ్లు మిక్కిలి కుసందిగా నున్నవి. చావళ్ళు గలవు. బ్రాంహ్మణులు నిండా పారమార్ధికులుగారు. ఆ రాత్రి అక్కడనే నిలచినాను.

తేది ఉదయాన నాలుగు ఘంటలకు బయలునెళ్ళీ పన్నెండు ఘంటలకు మూడు కోసుల దూరములోనుండే చిన్నమంది అనే గ్ర్రామము చేరినాను. మూడు కోసుల దూరమునకు వెనక వనపర్తి అనే జమీనుదారి కసుబాగ్రామము ఖిల్లా సహితముగా సంస్థానపరువు కలిగియున్నది. పానగల్లునించి తెచ్చిన జవానులను మార్చడమునకు రెండు గంటలసేపు అక్కడ నిలిచినాను. వనపత్రి రెండు ఘంటలకు చేరినాను. దోవ యిరుప్రక్కలా అడివి కలిగియున్నా దారి సన్నయిసుకపరగా బాగాఉన్నది. మృగభయము లేదు. వనపత్రివరకు కొండలనడమ భాటపోయినా రాతిగొట్టుకాదు. ఆ యూరున్ను రహదారి అయినందున ముసాఫరులకు కావలసిన సామానులు దొరుకును. ఊరూరికి కోటలు వుండడము మాత్రమే కాకుండా హయిదరాబాదువారి రాజ్యములో ఊరూరుకి ఒక జమీదారుడున్నందున శిబ్బందికి జీవనము కలగడమొక్కటేగాని, రహితులకు న్నితరులకున్ను క్షేమములేక ప్రాణభయముతో సదాకాలము తోయుచు నుండవలసి యున్నది.

కంపెనీవారు మజిలీపట్టీలు వారి పంచాంగములో వ్రాయుచువచ్చుచున్నారు. గ్రామాదులపేళ్ళు అడిగితే అట్టి గ్రామమే దారిలోలేదనుచున్నారు. గ్రామదుల దూరమును కొన్ని ప్రకరణములలో తప్పివ్రాసినారు. ఇందుకు సందేహములేదు.

ఆచిన్నమంది అనేవూళ్ళో వసతి యయిన చెరువు కట్టమీద నీడయివ్వగల చెట్లున్నవి. ఇండ్లలో దిగడానకు స్థలముచాలదు గనుక చెరువుకట్టమీదనే వంట చేసుకొని భోజనము చేసి రెండు ఘంటలకు బయిలువెళ్ళి అక్కడికి నాలుగు కోసుల దూరములోనుండే గణపురము సాయంకాలము మూడు ఘంటలకు చేరినాను. ఆగణపురానికి వెళ్ళేదోవలో చోళపురము, మొనోజీపేట అనే రెండూళ్ళున్నవి. మనోజీపేటవరకు భాట కిరుపక్కల దట్టమయిన అదివి భాట విశాలముగానున్ను, గులక యిసుక పొరగానున్ను నడవడానికి వైపుగానున్నది. భాట కిరు పక్కల కొంతదూరములో చిన్నతిప్పలున్నవి. మనోజీపేట అనే వూరు బస్తీ అయినది. దేవాలయమున్నది. కొంత దూరములో కొండమీద వెంటెశ్వర స్థలమున్నది.

ప్రసిద్దమయిన దేవస్థలము. ఆ మనోజీపేటకు సమీపాన నీడ గల యొక తోపు సుందరుముగా నున్నది. అక్కడికి సమీపముగానే బంగారురంగు అనే పేరు కలిగిన యొక సోగసయిన గుండు ఒక తిప్ప కొన యందున్నది. చూపుకు ఆతిప్పగుండు పానపట్ట సహితమయిన లింగాకారముగా నగుపడుచున్నది. ఆ మనోజిపేట మొదలుగా గణపురము వరకు కొండలనడుమ భాట పోయినా రాళ్ళు లేవు. అది గులక యిసక పొరగా నున్నది. ఆ గణపురము జాగీరు గ్రామము. కొండకింది యూరు, కొండమీద దుర్గము, కోట, మజుబూతి, గట్టి,గా కట్టి యున్నది. బస్తీగ్రామము. ఇరవై నుంచి ముప్పై వరకు బ్రాహ్మణులయిండ్లునా చిన్నవి గనుక స్థలము దొరకడము ప్రయాస. చావిళ్ళున్నవి. అన్ని పదార్దాలు దొరకును గాని నీళ్ళకు బహుప్రయాస. బావులు లోతుగా నుండడమే గాక జలము ఉప్పుగా నున్నది. మంచినీళ్ళు బహు దూరముగా వెళ్ళి తెచ్చుకొనవలసినది. ఆ రాత్రి అక్కడ నిలచినాను.

తేది ఉదయాన నాలుగు ఘంటలకుప్రయాణమై పదకొండు ఘంటలకు మూడు కోసుల దూరములో నుండే జడచర్ల అనే యూరు చేరి నాను. దారి యిసుకపొర. ఆ నడమ మూలకర్ర, కోటూరు, ఆలూరు అనే గ్రామాలు న్నవి. ఆలూరివరకు అడివినడమ భాట. ఆలూరుమొదలుకొని అడివిలేదు. దారిలో జలసమృద్ది గల బావులు, చెరువులు న్నున్నవి. పరిపొలాలు పొలకట్లు తీర్చియున్నవి.

కృష్ణానది దాటినదిమొదలు శెషాచలపర్వతము అదృశ్వమయినా అడుగడుగుకు చిన్న చిన్న పర్వతాలున్నవి. సృష్టిచేసిన పరమాత్ముడు ఆ కొండలు రాతిమీద రాయిని అతికియుంచినట్టుగా నొక కొండమీద నొక బండ యిమడక దొర్లునని తొచిన తావులలో పలకవంటి రాళ్ళను కొల్లేరులో చెక్కి చక్కచేసినట్టు ఉంచి యిమిడిచి యున్నవది. ఆ కొండల సమూహములను జూడగా భూమిని మొక్కాలు వాశి పర్వతమయముగా భగవంతుడు చేసినట్లు తోచుచున్నది. అన్ని పర్వతములను సృష్టించ డానికి ముఖ్యకారణ మేమని యోచించగా నీ భూగోళము ఉదకబుద్బుదము గనుక భూమిని స్థావరదశను పొందించేటందుకు ఈ పర్వతసమూహములను సృస్టించినట్టు తోచబడుచున్నది. పరమాత్ముని యొక్కలీలావిభూతియయిన యీవిచిత్ర పర్వత సమూహములున్ను నానావిధములయిన వృక్షాలున్ను కలిగిన అరణ్య సమూహాలు చూడగా బుద్ధి ఆశ్చర్య పడడానికి చాలియున్నది గాని ధృడమయిన భక్తిని పొందచాలక నున్నది. ఆపగలు అక్కడ నిలచినాను. ఆయూరు బస్తీయయినది. సంపన్నులయిన కోమటివసతి గదులున్నాయి. దేవస్థలమున్నది. అందులో దిగవచ్చును. రమణియ్యమైన కొలను వున్నది. అదిచుట్టు మంటపాలతో నేర్పరచ బడియున్నది. సకల విధవస్తువులు దొరుకును. ఆయూరున్ను ఇంకాముప్పై ఆరు గ్రామాలున్ను రాజగోపాలరావు అనే ఆరువేల నియోగి బ్రాంహ్మణునికి కొన్నితరాలుగా జమీను నడుచుచున్నది. మూడు లక్షల రూయాయీలు గోలకొండ నవాబుకు కట్టుచున్నారు. ఇప్పుడుపన్నెండు సంవత్సరముల చిన్నవాడు తల్లికి సహాయముగా దొరతనము చేయుచున్నాడు. ధర్మ సంస్థాన మని చెప్పబడుచున్నది. రాచూరు అనేయూరు వారికి రాజధానిగా నున్నది.

తేది ఉదయమయిన ఐదు ఘంటలకు లేచి మూడు కోసుల దూరములోనుండే నాగనపల్లె, బాలనగర మని రెండుపేళ్ళుకలిగిన యూరుపది ఘంటలకు చేరినాను. దారిమిక్కిలి సరాళము. గులక అయిసక కలిగిన రేగడభూమి. నడవ డానికి బండ్లకు మిక్కిలి సయిపుగా నున్నది. ఆయూరికి చుట్టున్ను కోట యున్నది. అది బాలచందు అనేముసద్దికి జాగీరుగానివ్వబడినది. అతడు బహుధర్మాత్ముడని పేరుబడి యశ, కాయముతో ఇప్పటికి జీవింపు చున్నాడు. అతనికి మొగసంతులేదు. అల్లునికి జాగీరు నదుచుచున్నది. ఆకోటనున్ను, గ్రామమునున్ను బహుబస్తీచేసియున్నాడు గనుక ఇదివరకు చూచిన యనేకములయిన కోటలలో ఈకోట గచ్చుచేసి చూపుకు బాగా ఉన్నది. బహుబస్తీ గ్రామము ఆ గ్రామములో నుండే యొక ఆడమనిషి అక్కడ ధర్మ శాలయని వాడుకొనే యొక సత్రము కట్టియున్నది. తిరుపతి వదిలిన వెనుక సత్రమనే మాట యిక్కడ విన్నాను. బాలచందు రెండు దేవాలయములు హరి హరాదులకు చేర్చి యొకటిగా కట్టి తోపువేసి సమీపమందు అగ్రహారముకట్టి యిచ్చివాటికన్నిటికిన్ని జీవనానికి పూర్తియయిన భూవసతి యేర్పచినాడు. అక్కడ భొజనము చేసుకొని మూడు సగం ఘంటలకు బయలు దేరి మూడు కోసుల దూరములో నుండే జానంపేట ఫరక్కూనగర మని రెండు పేళ్ళుకలిగి బస్తీ బజారువీధి కలిగియున్న గ్రామము ఐదు సగం ఘంటలకు చేరినాను. ఆ యూరు తురకలతో నిండియున్నది. ఒక గోసాయిచావడి గుడికి అంతర్భూతముగా నున్నది. దిగడానికి అదిన్ని, చావిళ్ళును తప్పవేరే యిండ్లలో స్థలము దొరకదు. నీళ్ళకు బహుప్రయాస, లోతుగల బావులు ఊళ్ళోఉన్నా మంచి యుధకము కాదు. దూరమునించి మంచినీళ్ళూ తెచ్చుకోవలసినది. పానగల్లు మొదలుగా ఆయూరివరకు బాట గుర్రపుబండ్లు వచ్చేపాటి విశాల మయి చక్కతనము గలిగియున్నా బాలనగర మనే యూరిముందర కొంచము రాతిగొట్టు. మిగతభాట బహుసరాళముగా నున్నది. పల్లములలో దిగి మిట్టలెక్కుచు భాట సాగిపోవలెను. సాధారణ మయిన యడవినడమ భాట పోవుచున్నది. ఆ జానంపేట వద్ద నొక కోటయున్నది. కడప వదిలిన వెనుక అప్రయత్న పూర్వకముగా శాకములు అక్కడి అంగళ్ళలో దొరకుచున్నవి.

ఈదేశాటనము ఛేసుటవలన దేహమునకు లాఘవము కలుగుట యనే లాభ మొక్కటి మాత్రమే కాక ద్రవ్య సాధ్యము కాని స్థలములలో పదార్ధము లెంతమాత్రమే కాక ధ్రవ్యసాధ్యము కాని స్థలములలో పదార్ధము లెంతమాత్రము దొరికినా అవి అపూర్వము లైనందున జీవాత్మునికి మిక్కిలి ప్రియ భొజ్యములుగా నుంచున్నవి. నానావిధ స్వభావములు కలిగిన మనుష్యులు ఇతర దేశపు జంతువులనున్ను, స్థావరములయిన శిలా వృక్షాదులనున్ను చూడడము జన్మాంతర సుకృతముచేత నొకవేళ భక్తి కలుగుటకు కారణము గావచ్చును. ఆ రాత్రి ఆ గ్రామమందు నిలిచినాను.

తేది ఉదయాన నాలుగు ఘంటలకు ప్రయాణమై ఆరు కోసుల దూరములో నున్న షాపుర యూరు పది ఘంటలకు చేరినాను. దోవలో పాలమాకుల యనే జలసౌఖ్యము గల గ్రామముమున్నది. ఆ పాలమాకుల వరకు భాట సరాళము. కొంత కొంత దూరము రాతిగొట్టుగా నున్నది. హలచలక వదిలిన వనక పర్వత సమూహముల దర్శనము దారిలో నిదివరకు లేదు. సాధారణమైన యడవినడుమ భాట పోవుచున్నది. ఆ గ్రామములో దిగి వాడికెపడిన మామిడితొపు జలవసతిగా నున్నందున అక్కడ భోజన మునకు దిగినాను. గ్రామమందు కావలసిన పదార్ధములు దొరకును గాని దిగను స్థలమివ్వరు. ఆత్మకూరు మొదలుకొని దిగడానకు దేవస్థలములుంటేనే వయివుగాని యండ్లలో స్థలమివ్వరు. ఇచ్ఫేపాటి విశాలమయిన యిండ్లులేవు.

ముసాఫరులు పరువు కావాలంటే డంభము వహించవలెను. ఆ డంభమునకు తగిన దాతృత్వము లేకుంటే లోకులు సంతోషింపరు. ఇంతే కాకుండా దోవలో విషయభోగములు నెక్కువగా ఆపేక్షించే కొద్ది వ్యసన మొక్కువౌచున్నది.

దూరప్రయాణము బోను మేనా సవారీలు తీసుకొనివచ్చేవారు సవారీలకు దండను ఆసరాచేసి కిందను మీదను నాలుగు ఇనపకమ్ములు బిగియింఛి యిస్కూలు చీలలు కొట్టక మునుపు బలమయిన మూలతగుళ్ళు కొట్టించి ఆ తగుళ్ళలో ద్వారములు చేసి వాటిలో యిస్కూలు చీలలు బిగియించవలెను. అటు చేయనందున నా బంగాళాపాలకీ దోవలోమోసుకొని వచ్చునప్పుడు ఆ చీలలు కొట్టిన తావున పలక చీలి పల్లకీ కిందపడుచు నుండెను. చీలిన చప్పుడు వినగానే నాబోయీలు పల్లకీని దిగువ దించినారు. దోవలో బావులు లోతుగా నుంటే నీళ్ళు చేదుకోవచ్చు నని తెచ్చిన సీమ సన్నతాడు ఇరవై బారలది వద్దనుండగా పయిన నాలుగు కట్లున్నూ చట్టానికి దిగువ నాలుగు కట్లున్ను చుట్టు బలముగా వేసి ముందు దండెకున్ను వెనక దండెకున్ను దిగువ ఛట్టముగుండా మూడు కట్లువేసి బిగించి ఇదివరకు భగత్కటాక్షము చేత ఆ పల్లకీ మీదనే సవారీ అయి వచ్చినాను కాబట్టి పల్లకీసవారీ అయి వఛ్ఛేవారు కొన్ని తాళ్ళు చాలక దోవలో నెక్కడ విచారించినా తాళ్ళు దొరికినవి కావు గనుక సాగనార నివృత్తిసంగమ మనే గ్రామములో తీసి బోయీలచేత తాళ్ళు పేడించి కట్టించినాను.

యింతే కాకుండా పనివారసమేతముగా దూరదేశము పొయ్యే వారు దారిలో అస్వస్థపడే పరిజనము ఆటంకపడి నిలవకుండా సాగి రావడానికి దినానికి మూడు ఆమడ దూరము నడవగల యొక గుఱ్ఱపు తట్టున నున్ను నాలుగు బోయీలలో నొక తేలికయయిన సామాన్యపు డోలీ నిన్ని కూడా తీసుకొని రావలసినట్టుగా నా యనుభవము నాకు తెలియ చెప్పినది. అదే ప్రకారము తిరుపతిలో రూపాయలు ఇరవై మూడు కి ఒక గుఱ్ఱపుతట్టువను తీసి కూడా తెచ్చినాను. అందరున్ను ఆరొగ్యముగా నుండే కాలములో తట్టువ మీదనున్ను డోలీలోనున్ను కావలసిన భోజన సామానులను అధికముగా చెయికావలికి వెసుకొని పోవచ్చును.

యింకా నా యనుభవము వలన తెలియవచ్చినది యేమంటే సపరివారముగా దేశము తిరిగేవారు చికిత్స చేసే క్రమము యధోచితముగా తెలిసిన వారిని కూడా పిలుచుకొని తగుపాటి యౌషధములు కూడా తీసుకొని పోవలసినది. ముఖ్యముగా అజీర్తికి జ్వరమునకు వ్రణాలకు గాయములకున్ను ఔషధాలు తీసుకొని పోవలసినది. ఆ ప్రకారముగానే నేను తెచ్చి నా వద్దనుండే ఔషధాలు నా బుద్ధిస్పురణద్వారా నాతో కూడా వచ్చిన వారికె ఇచ్చుచు వచ్చినంతలో భగవత్కటాక్షముచేత నా పరివారానికి వచ్చిన యుపద్రవములు నివారణ మవుచు వచ్చినవి. కూడా వఛ్ఛేవారికి నొక విధమయిన నిర్బయమున్ను తోచి యుండను. శీమమైనపువత్తు లెంత భద్రముగా నుంచినా తునకలుగా పగులు చున్నవి గనుక బంగాళా నాటువత్తులే దారికి యోగ్యము లని తెలుసుకొన్నాను. అణాలు, అర్ధణాలు, పావులాలు చెన్నపట్టణపు దుడ్లు కడప విడచిన వనుక దొరకవు. కూడా తెచ్చియుంటే వెండినాణ్యములు మాత్రము పనికివచ్చుచున్నవి. కృష్ణ కవతలి పయిసాలు కృష్ణ కీవల పనికిరావు. కృష్ణకు నుత్తరమున అణాలున్ను పనికిరావు.


మూడవ ప్రకరణము  హైదరాబాదు

ఆషాపురము మూడు ఘంటలకు వదిలి రాత్రి ఎనిమిది ఘంటలకు ఆరు కోసుల దూరములోనుండే హయిదరాబాదు షహరు ప్రవేశించి షహరుకు సమీపమందుండే బేగంబజార అనే పేటలో నొక తోటలోని బంగాలాలో దిగినాను. ఆ షాపురము వదలిన వెనక రెండు కోసుల దూరములో షంషాబాదు అనే బస్తీ గ్రామము కోటసహితముగా నొకటి యున్నది. అదివరకు దోవసరాళము. లొగడి మజిలీ భాటవలెనే ఒకటి గడియదూరము మిట్టయెక్కుచు గడియ దూరము పల్లములో దిగుచు దారిని నడవవలసినది. షంషాబాదు మొదలు చిన్నతిప్పలు దారికి నాలుగు పక్కలా అగుపడుచు వచ్చును. దారి కొంచెమయిన రాగిగొట్టుగలది. దగ్గిరదగ్గిర చిన్న గ్రామాలున్నవి. అనేక మశీదులు చూచుచు పోవచ్చును. చిన్న చెరువులు కొన్నియున్నవి. వాటికింద మామిడితోపులున్ను, కూరగాయల తోటలున్ను వేసియున్నవి.

ఆ దినము మొహర్రం అనే పండుగ ఆరంభ మయినది. ఆ తొమ్మిదో దినము ఆ షహరుకు కంచికి గరుడసేవ ముఖ్యమైనట్టుగా ఆ మొహర్రం పండుగ ప్రబలమైన యుత్సవము. ఆ యుత్సవ కాలములో పరమ్మాత్ముని చైతన్యము ఆ షహరులో వెక్కువగా ప్రకాశించుట చేత అనేక వేలమంది యితర మతస్థులుగా నుండేవారు కూడా షహరుకువచ్చి ఆతొమ్మిదోదినము మొదలు ఆఖరువరకు నుంచున్నారు. సకల విధములయిన యారాధనలను అంగీకరించి యాదృశీ భావనా యత్ర సిద్ది భ్రవతీ తాదృశీ అనే వచన ప్రకారము లోకుల యిష్టసిద్ధిని చేసే పరమాత్ముడు ఒక్కడే గనుక ఆ యుత్సవ కాలములో పరమాత్ముని చైతన్యము అక్కడ ప్రతిఫలించుటచేత ఆ స్థలముఆ కాలమందు పుణ్యస్థలమని భావించి అక్కడ వట్టికాలమందు నన్ను ప్రవేశ పెట్టినందుకు నీశ్వరుని చాలా కొనియాడడ మయినది.

తేది రాత్రి మొదలు జూలాయి నెల రెండు తేదీ సాయంకాలము వరకు హయిదరాబాదు షహరుతో చేరిన భేగంబజారులో నున్నాను. ఆ రాత్రిమొదలు జూలాయి పదమూడు తేది రాత్రివరకు శికందరాబాదు అనే పేరుగలిగిన యింగ్లీషువారి దండు ఉండే బస్తీకి సమీపముగా నున్న కాకాగూడ మనే బొమ్మదేవరు నాగన్నతోట చావడిలో నుంటిని.

హయిదరాబాదు షహ్రుకుచుట్టు బేగంబజారు అనే బస్తీయొకటి యున్నది. అందులో సాహుకర్ల కొఠీలు కలవు. అది షహరు కంటే వాసయోగ్యము. అక్కడికి కోసెడు దూరములో కారువానా అనే బస్తీ యొకటి యున్నది. అది రత్నాలు వగయిరా అమ్మే వర్తకులుండే స్థలము. ఆ బేగంబజారుకు చేరినట్టు యింగిలీషు రెసైడెంటు వారి ఖర్చుక్రింద విస్తారముగా నున్ను అలంకారముగా నున్ను ఒక హవేలి చుట్టున్ను లోకులున్ను వర్తకులున్ను ఇండ్లు కట్టుకొని యుండుటచేత నొక పెద్ద బస్తీ అయినది. ఆ స్థలము పేరు చంద్రఘాటు అనుచున్నారు.

షహరు లోపల షాలీబండ అనే పేరు కలిగిన యొక పేట యున్నది. ఆ స్థలమందు అక్కడి బ్రాంహ్మణులు ఇండ్లు కట్టుకొని కాపుర మున్నారు. దివాన్ పేష్కారు చందులాలు అక్కడ ఇండ్లు కట్టుకొని కాపురమున్నాడు. నిజాందేవిడి షహర్ నడమనున్నది. అనేకులయిన పెద్దమనుష్యులు, నిజాం వంశస్థులున్ను షహరు నడమ కాపురమున్నారు. షహరునడమ మక్కామజ్జీత్ అనే యొక తురకల్ జపశాల యున్నది. దాని స్థూపీలు రెండు మొలాము చేయబడి యున్నవి గనుక బహుదూరానికి తెలియుచున్నవి. మశీదుకు నెదురుగా లోగడి దివాన్ మీరాలం అనేవాడు కట్టించిన కారంజీలు లోతుగా నున్నవి. వాటికి సమీపముగా చౌకు అనే పేరుగల గుజిరీ అంగడి యొకటిన్ని, బట్టల యంగళ్ళు, పాత్రసామానుల యంగళ్ళున్ను ఉన్నవి. నాల్గు దోవలు చేరడానకు గాను కట్టిన యొక గొప్ప స్థూపీ గలిగి నాలుగు ద్వారాలు దానాకు కట్టిన యొక గొప్ప స్థూపీ గలిగి నాలుగు ద్వారాలు గలిగిన యొక చావడిన్ని యున్నది. షహరులో రాజవీధులయందు గుండురాళ్ళు పరచియున్నవి. అట్టి వీధులలోనుండే కశ్మలమయిన యడుసులో నడిచేవారి పాదాలు పూడిపోవుచున్నవి. ఇండ్ల యలంకారమున్ను సందులకు సందియున్ను యితర దక్షిణదేశపు షహరులలావాసముచేసే వారికి ఇష్టముగా నుండవు. రాజవీధులలో ఏనుగులు మొదలయిన వాహనాలు యెల్లప్పుడు సంచరింపు చున్నవి గనుక నున్ను మనుష్యులందరున్ను, ఆయుధపాణులై మెత్తని వారిని కొట్టి నరుకుచున్నారు గనుక నున్ను, షహరులో ఇతర దేశస్థులు సవారీమీద పోయి రావలసియుంటే ఆయుధపాణులైన వాక్పారుష్యము కలవారిని కొందరిని కూడా పిలుచుకొని పోవలసి యున్నది. కృష్ణానది దాటినది మొదలు హైదరాబాదు వరకు ఫకీరులు నిండియున్నారు గనుక సవారీమీద నెవరు వచ్చినా అడుగడుగునా ఫకీరులు భిక్షం అడగక మానరు. వారికి కొన్ని గవ్వలయినా యిచ్చి పోకపోతే అవమానము తోచుచున్నది. చెన్నపట్టనపు రూపాయి ఒకటి కి అక్కడి పయిసాలు యాభై పయిసా ఒకటి కి ఇరవై పుంజీగవ్వలు. పుంజీ ఒకటి కి గవ్వలు నాలుగు. యీ హయిదరాబాదులో పిచ్చిరూపాయిలని యొక దినున్ను గోవింద బఖ్షీలని యొక దినుసున్ను చెలామణి యవుచున్నవి. ఆ రూపాయలు ఒకచేతి నుంచి యొక చేతికి వచ్చేటప్పుడు యొకటి రెండు పయిసాలు నట్టమియ్యకనే చెలామణీ కానేరదు. చెలామణీ రూపాయలకు అక్కడివారు చేసే పరీక్ష అసదృశ మయినది. ఎట్టి రూపాయిలకయినా ఒక దోషము పెట్టకమానరు. చన్నపట్టణపు కంపెనీ రూపాయలకు ఆ తొందరలేదు. అయితే అవి దొరకవు. మరి అక్కడి రూపాయలకు రూపాయి ఒకటి కి పయిసాలు ఇరవై.

ఈషహరు గోడకు చేరినట్టుగా ముసి అని అక్కడి వారిచేత చెప్పబడుచున్న ముచుకుంద నది పారుచున్నది. ఆ నది వాడపల్లెవద్ద కృష్ణలో కలియుచున్నది. అది గొప్పనది. పోయినసంవత్సరం నదీప్రవాహము ఎక్కువగావచ్చి డిల్లీ ధరవాజవద్ద యింగిలీషువారు కట్టిన వారిధిని పగలకొట్టి ఆ షహరులో కొన్నివీధులున్ను, బేగంబజారులో కొన్నివీధులున్ను ముంచివేసి పోయినది. బేగంబజారుకున్నూ, షహరుకున్నూనడమ ఆ నది దాటుటకు పూర్వకాలమందు తురకలు మంచిరాళ్ళతో అతి బలముగా నొక్క వారధి యేనుగలు మొదలయినవి గుంపుగా నెక్కి పోవడానకు యోగ్యముగా కట్టినారు. ఆ షహరు చుట్టున్ను చిన్న తిప్పలున్నవి. కొండలు మెండు. అనేక తిప్పలు కొనల యందు మశీదులు కట్టబడి యున్నవి. హిందూ దేవాలయాలు లేవు. అవి యున్నా వృద్ధికి రానియ్యరు.

షహరుకున్ను ఇంగిలీషుదండుకున్ను రెండు కోసుల దూరమున్నది. నడమ హుశేనుసాగర మనే పేరుగల యొక చెరువున్నది. ఆకట్టమీద యింగిలీషువారు గుర్రపుబండ్లు పొయ్యేటందుకు యోగ్యముగా భాట ముచ్చటగా చక్కచేసి మొగలాయి వాహనాలున్నూ మనుష్యులున్ను ఎక్కినడచి చెరచకుండా భాటకు ఇరు పక్కల తమ పారా పెట్టియున్నారు. జాతులవాండ్లను తప్ప ఇతరులను ఆ కట్టామీద హుకుములేక ఎక్కనియ్యరు. ఈ జాతులవారిని సరంగీలని ఏలచెప్పుచున్నారంటే ఫిరంగీలతొ సహవాసము చేసేవారు గనుక ఫిరంగీవారని ఆభాసముగా అనబడుచున్నది. కంపెనీ లష్కరు ఉండే స్థలము హయిదరాబాదుకంటే నానాటికీ ఎక్కువగా బస్తీఅవుచున్నది. ఇరవై సంవత్సరముల క్రిందట నేను చూచినదాని కంటే మిక్కిలి బస్తి అయియుండుటను చూడగా ఆశ్చర్యముగా నున్నది. షహరులో వస్తువులకు సుంకకులేదు. ఏవ్స్తువు మీద సుంకానికి ఎవడు ఊహించి దర ఖాస్తుచేసినా దినాంజీ ఆ సుంకము గుత్తకు ఇచ్చుచున్నాడు. కట్టెల బండ్లకు, విస్తరాకులకున్ను, షహరులో రావడానికి నాలుగయిదు తీరువలు తీరువ తీనేవాని జోరావరి కొద్దిన్ని ఇవ్వవలసి యున్నది. చంపినా అడిగేదిక్కులేదు. యింగిలీషు దండులో ఈ తొందరలు లేకుండా న్యాయవిచారణ కూడా కొత్తవాల్ చావడిలో కమ్మిస్సేరైయాటు అసిస్టాంటు గుండాజరుగుచున్నది. గనుక లోకులున్ను వర్తకులున్ను ఆదండులో వసించడానికి మిక్కిలి ఇచ్చయింపు చున్నారు. అక్కడి యిండ్లకంతా ఎన్నిమిద్దెలు అంతస్తులుగా కట్టినా స్తంభాల మీద పయి పూరి మోపుచేసి మట్టి గోడలుపెట్టి, ఆ గోడల పయిన నాజూకుగా సన్నగారచేసి కావలసినట్టు చిత్రములతో పూయుచున్నారు. అక్కడి గులక కలిసిన యెర్రరేగడ మిక్కిలి గట్టిగా నుంచున్నది.

యింగిలీషు దండులో నేను దిగిన స్థలము వాసయోగ్యము. ఆ షహరుకు చుట్టునుండే భూమి బహు సారవత్త మయినది. ఏవృక్షము వేసినా అరి వీర్యముతొ పయిరయి వచ్చుచున్నది. అయితే పయిరుపెట్టే శ్రద్ధ యెవరికిన్ని రెండు కారణములచేత లేదు. మొదటి కారణమేమంటే బీదలయినవారు ఏచెట్టువేసినా వాటిఫలమును క్షేమముగా, ఆయుధాలే ఆభరణాలుగా నుంచుకొని దర్పమేయశస్సుగా భావించుకొని యుండే లోకులు అనుభవించ నియ్యరు. రెండో దేమంటే ఉపపన్నులు తోటలు వనాలు వేసుకొనవలె నంటే రాజకీల్యము లయిన విత్పరంపరలు అప్పుడప్పుడు వారికి కలుగుటచేత ఆ సుఖము ననుభవించ డానికి ప్రాప్తిలేక నున్నది. ఇంతకున్ను ఓర్పుచేసిన చెట్లు బహుబాగా అయియున్నవి. చోటా అరంజీపండ్లు విస్తరించి కలవు. సకల విధములయిన పండ్లున్ను, అరటిపండ్లు దప్ప మంచివిగానే దొరుకును. అయితే అతిప్రియము. చెన్నపట్టణము కంటే మూడింతలవెల యివ్వవలసినది. కూరగాయలు ఆ ప్రకారమే ప్రియములయినా మహా రుచికరములుగా నున్నవి. వస్త్రాలు, ఆభరణాలు, శిఫాయిలకు లాయఖు అయినవి, ఆ షహరులో దొరుకును. భారీరత్నాలు కొనేపాటి యుత్సాహధైర్యము లెవరికిన్ని లెనందున వర్తకులు తేవడములేదు. ఆభరణాలు వగయిరాలు ఉంచుకొని విక్రయించేవారు తమ పాపు నిమిత్తమై కొంత శిబ్బందిని వుంచుకొన వలసి యున్నది. తద్ద్వారా ఒక గొప్పగౌరవము వారికి గలుగుచున్నది. అందువలన రత్నాలు, నగలు, కావలసిన గొప్పవారు వారియింటికి పెళ్ళి, వారిని పిలిపించుకొని కావలసినది వారు చెప్పిన ధరకు పుచ్చుకొని తమకు సమ్మతి అయినప్పుడు ఖరీదు నిచ్చుచున్నారు. వర్తక సరణిగా అట్టి గొప్ప వస్తువులు కొని అమ్మడము లేదు. సాత్విక ప్రభుత్వముకల రాజ్యములో మెదిగినవారికి ఆ షహరులో ఉనికిన్ని, ఆరాజ్య సంచారమున్ను, భయప్రదములుగా నుంచున్నవి.

ఆ షహరు మూడు కోసుల దూరములో గోలకొండ అనే ప్రదేశ మొకటి యున్నది. అక్కడ బలమైన కోటయున్నది. అందులో నిజాముయొక్క, అంత, పుర స్త్రీలు సంస్థానము యొక్క మూలధనముతో కూడా ఉన్నారు, అందులో విస్తరించి గృహములు కట్టుకొని మనుష్యులు కాపురమున్నారు. ఆ షహరులో పెద్దమనుష్యులు ఆనందము కొరకు చేసుకోవడ మేమంటే ఒకబగీచా అనే చిన్నతోటవేసి, అందులో జలధారలు పయికిలేచే కారంజీలు, కట్టి యుంచుకొనుచున్నారు. ఆజల సూత్రాలు అలమారముగానే యుంచున్నవి.

అక్కడి రాజ్యూతంత్రము జరిపే క్రమమంటే పూర్వకాలమందు డిల్లీ పాదుషాను, శిఫాయి ధర్మముచేత సంతోషపెట్టి, ఆరాజ్యమును జాగీరుగా పుచ్చుకొన్న ఆనవాబు వంశస్థులు ఇప్పుడు రాజ్యము చేయుచున్నారు. యింతకు మునుపు షౌలరుజంగు అనే అతడు దొర తనముచేసి, సంవత్సరము కిందట చనిపోయునాడు. అతిని కొడుకులలో నొకడయిన నానద్దౌలా అనే అతడు ఇప్పుడు కంపెనీవారి సహాయము చేతకట్టుకొని ప్రభుత్వమును వహించి యున్నాడు. ఈ నవాబు కింద ఒక దివాన్ జాగీరు అనుభవింపు చున్నాడు. అతని కింద ఒక పేష్కారు సకల రాజ్య తంత్రము విచారింపు చున్నాడు. ఉండే రాజ్యమంతయు నవుకరులయిన అమీరు ఉమరాలనె పెద్దమనుష్యులకు జాగీరులుగానున్ను, పారంపర్యముగా ప్రభుత్వము చేసేవారికి జమీనులు గానున్న, భాగించి జమీనుదార్లవద్ద మాత్రము సాలుకు ఇంత మాత్రమని రూకలు వసూలుచేసుకొను చున్నారు. అమానిగా తాలూకాల నుంచుకొని మామిలియ్యతు వ్యహారమును జరుపు కోవడము నిండా లేదు. వారి వారి అధీనముగా నుండే భూమికి వారు వారు పూర్ణమయిన స్రాతంత్ర్యము గలిగి ఆయా భూములలోని కాపురస్థులను భర్త భార్య మీద చెల్లింఛే అధికారము కంటే ఎక్కువయిన అధికారముతో నేలుచున్నారు. ఆనావాబు పెద్దల వద్ద నలభై సంవత్సరముల కిందట కంపెనీ వారు స్నేహమూలకుగా ప్రవేశించి ఆరు పటాలాలను, వారి తయినాతిగా శికందరాబాదు అనేస్థలములో ప్రవేశపెట్టి, వకీలు భావనగా నొక రెసైడెంటును అక్కడ నిలిపినారు. ఆ పటాలాలవద్ద జాగీరుగా కంపెనీవారు పుచ్చుకొని యిప్పటికిన్ని అనుభవింపు చున్నారు. క్రమక్రమముగా రాజ్యతంత్రములో ఏ పని జరిగించవలసి వచ్చినా రెసైడెంటు అనుమతిలేక జరిపింఛె వాడికెలేని ఘట్టము ఇప్పట్లో పొసగి యున్నది. తమకు రూకలు కట్టని బలవంతులయిన జమీనుదారులవద్ద సాలేనా పయికము వసూలు చేసుకొనేటట్టు కందనూరు నవాబు రాజ్యము కంపెనీవారి యధీనము చేసినట్టే, కొద్ది కొద్దిగా చేయుచు వచ్చుచున్నారు. అటువంటి జమీందారులవద్ద కంపెనీ వారు రూకలు వసూలుచేసి నిజాముకు ముజరా యిప్పించుచున్నారు. సదరహి ఆరు పటాలాలు గాక నింకా పన్నెండు పటాలాల పర్యంతము రిసైడెంటు మూలకముగా ఆ నవాబు దివాన్ ఫేష్కారు యిచ్చుచు, రూకలు కట్టని జమీదారుని మీదికి కావలసినప్పుడు కావలసిన మట్టుకు ఆ ఫౌజును పంపించుచు వచ్చుచున్నారు. ఇప్పుడు దివాన్ ఫెష్కారు చేసే చందులాలా సదరహీజాస్తి పటాలాల జీతానికి గాను నెల ఒకటి కి సుమారు మూడు లక్షల రూపాయలు యిచ్చుచున్నాడు.

యిదిగాక నవాబు మనోవర్తి ఖర్చులకు గాను నెల ఒకటి కె మూడు లక్షల రూపాయలు ఇవ్వవలసి యుంచున్నది. ఇంతేకాక నజురుయినా యతులుగా కొంత సెలవు చందులాలుకు తగులుచు వచ్చుచున్నది. ఇది పోగా మిగిలిన వస్తువులు ఆ దివాన్ పేష్కారు చేసేవాడు సమ్మతమైన వ్రయము చేసుకొనుచు వచ్చుచున్నాడు. ఆ వ్రయములు చెయ్యడమునకు రాజ్యములో అయ్యే వసూలు చాలక దివాన్ పేష్కారు అప్పులతో తహతహ పడుచున్నాడు. ఆ నవాబు రాజ్యమంతా కంపెనీ వారివల్ల చాలా భయమును పొంది యున్నది.

యిటువంటి షహరు ఇరవై తేదీ ఉదయాన నాలుగు ఘంటలకు వదిలి మూడు కోసుల దూరములో నుండే మేడిచెర్ల అనేయూరు ఐదు సగం ఘంటలకు చేరినాను. దోవ బహు సరాళము, గులక యిసకపొర, గుర్రపుబండ్లు నడవడానికి యోగ్యముగా నున్నది. బాటకు నిరుపక్కల సీతాఫలపు చెట్లయడవి, మనోహరముగా నున్నది. మేడిచెర్ల యూరి ముందర నొకటి రెండు వాగులు దాటవలసి యున్నవి. అవి వర్షాకాలమున ప్రవాహము వస్తే దాటుటకు నొకటి రెండు దినములు కావలసియున్నది. ఊరు పెద్దది, కావలసిన వస్తువులు దొరుకును, అంగళ్ళు చాలా యున్నవి.

నేను చెన్నపట్టణము నుంచి వచ్చేటప్పుడు కొలువుగా పెట్టుకొని తెచ్చిన ఆరు మంది బంట్రౌతులు గాక కడపలో నాలుగు మరాటి బంట్రౌతులను కొలువులో పెట్టినాను. హయిదరాబాదులో నెక్కువగా నాలుగు మందిని కొలువు పెట్టినాను. వీరికంతా జనము ఒకటి కి నెల ఒకటి కి రూపాయలు ఏడు లెక్కను జీతముచేసి నేను చేసిన ఖాయిదా యేమంటే కాపాడవలసిన మూల పదార్ధము సహజముగా యజమానివద్ద నుండే పెట్టెలలో నుండు ననే తాత్పర్యము లోకులకు ఉండవలసినదే గనుక అటువండి తాత్పర్యముతొ అయోగ్యులు ప్రమాదమును చేతురని తలచి నామూల ధనము క్షేమముగా నుండుట కొరకు మూలధనపు పెట్టెలను సవారీలలో ఉంచి సవారీ తలుపులకు బిగాలు వేసి సవారీలను ఊళ్ళలో దూర ప్రదేశపు చావిళ్ళలోనున్ను, ముసాఫరు ఖానాలలో నున్ను, మశీదులలో నున్ను ఉంచి యిద్దరేసి బంట్రౌతులను జాముకు ఒక జతగా పారాయిచ్చే బట్టు ఆరు మందిని నిశ్చయించి బోయీలను జాగ్రత్తగా కూడా ఉండేలాగు దిట్టము చేయుచూ వచ్చినాను. సామాను కావడి పెట్టెలను నేను దిగేస్తలములో ఉంచి అక్కడ జాముకు ఒకడు వంతున పారాఉండే లాగు ముగ్గురు బంట్రౌతులను ఉంచుచు వచ్చినాను. హయిదరాబాదులో పాల్ లు అనే శిఫాయి డేరాలు నాలుగు తీసినందున అవి మోయను నాలుగు యెద్దులున్ను ఆడేరాలలో చెమ్మగిలకుండా వేసే కీలు చాపలు మోయను ఒకయెద్దున్ను, ఆడేరాల మేకులు రెండు వందలు మోయను ఒక ఎద్దున్ను, అంతు ఆరు యెద్దులున్ను ఎద్దు ఒకటి కి నెలకు రూపాయలు ఎనిమిది లెక్కకొలువు పెట్టి తీసుకొని వచ్చినాను. మూడు యెద్దులకు నొక మనిషి వంతున ఇద్దరు యెద్దుల వాండ్లు కూడా వచ్చినారు. ఆడేరాలు కట్టనున్ను, తియ్యనున్ను ఇద్దరు కళాసులను నెలకు ఒకటి కి మనిషి ఒకటి కి రూ. లెక్కను సంబళానికి కొలువు పెట్టుకొన్నాను. ఆ డేరా బొంగులు ఎద్దులు మోయవు గనుక మోయను ఒక మనిషిని ఆరు రూపాయల జీతము నిష్కర్షము చేసి కొలువు పెట్టి నాలుగు డేరాల బొంగులు పదిన్ని సదరహి యిద్దరు కళాసులచేతనున్ను, సదరహి మనిషి చేతనున్ను మోయించుకొని వచ్చినాను. ఇంతేకాక హయిదరాబాదు నించి నాగపురికి పొయ్యేదారి బహు అడివిన్ని, మృగ భయమున్ను, చోరుల యుపద్రవమున్ను కలిగినది గనుక దారిబాగా తెలిసే కొరకు హయిదరాబాదు రెసై డెంటు వద్దనుండే పోష్టాఫీసు రయిటరు మేస్తరు ల్యూమ అనే పరంగి వాని మంచి తనము చేసుకొని ఒకరన్నర్సు అనే టప్పాల మనిషిని కూడా పిలుచుకొని అక్కడక్కడికి రన్నర్సు మనుష్యులు వారి వారిహద్దు వరకు నాతోకూడా వచ్చి దారి చూపించేటట్టు దిట్టము చేసుకొన్నాను. ఆ తపాలా రన్నర్సులను ఇక్కడ హరకాలని వాడుచున్నారు. వారిని కంపెనీ యిలాకా మనుష్యు లని ఆయా యూళ్ళలో గౌరవపరచు చున్నారు.. తద్ద్వారా యీ యుపాయము నేను చెయ్యడము మిక్కిలి అనుకూల మయినది గనుక ఆ రన్నర్సుకు ఒకటి రూపాయి దనుక ఇచ్చుచు పుసలాయించి ఒక మజిలీ నుంచి మరియొక మజిలీకి పిలుచుకొని వచ్చినాను. ఆకృష్ణ దాటినది మొదలు ఆ దేశములో కాకులు విశేషముగా లేవు. ముఖ్యముగా హయిదరాబాదు షహరులో ఒకటియైనా కనుపడినది కాదు. డెగలు పెంచేవారు విస్తరించి యున్నందున షహరులో వుండే కొన్నిటినిన్ని బ్రతకనియ్యరని తోచుచున్నది. ఆ రాత్రి అక్కడే నిలిచినాను.

తేదీ ఉదయాన మూడు ఘంటలకు బయలుదేరి రెండు కోసుల దూరములో నుండే మాషాపేట అనే యూరు పన్నెండు ఘంటలకు చేరినాను. దోవ నిన్నటి దోవవలెనే రమణియ్యముగ నున్నది. ఇరు పక్కలా జీడిచెట్లు, టేకుచెట్లు, మోదగచెట్లు, మొదలయిన వృక్షములు గల యడివి భూమి, సమ మయినది. ఆ మాషాపేట గొప్పయూరు. పేటస్థలము, సకలపదార్ధాలు దొరుకును. అక్కడ ఆరాత్రి నిలిచినాను. ఆయూరు వర్షాకాలములో మిక్కిలి బురద కలిగి చిత్తడిగా నుంచున్నది. హయిదరాబాదు వద్ద హుశేనుసాగర మనే చెరువు మొక ప్రకారము దిగిన గ్రామము నుంచి అవతల దిగిపొయ్యే గ్రామనునకు పంపుచు వచ్చినాను. ఆరాత్రి దేవాలయములో చేరిన భ్రాంహ్మణ గృహమందు నిలిచినాను.

తేదీ ఉదయాన మూడు ఘంటలకు బౌయలుదేరి అక్కడికె ఐదు కోసులదూరలో నుండే కామారెడ్డిపేట పది ఘంటలకు చేరినాను. కృష్ణదాటినది మొదలుగా ఆ బిక్కనూరిపేట పర్యంతము దోవ గులక యిసక కలసిన గట్టిరేగడభూమి. ఏకాల మందున్ను నడిచేవారికి ఒక శ్రమమున్ను ఇయ్యదు. ఆ భిక్కనూరుపేట వదిలినది మొదలు కామారెడ్డిపేట చేరే పర్యంతము కాలుదిగబడే నల్ల రేగడ భూమి, వర్షాకాలములో మిక్కిలి అడుసుగా నుంచున్నది. యెండాకాలములో ముండ్లవలెనే నడిచే వారికి గుచ్చుకొనుచు, కొంతదూరము భాట గులక యిసక పరగా నుండినా యీ నల్ల రేగడ భూమిలో పడే ప్రయాస అసౌఖ్యమును జ్ఞాపకానికి రానియ్యదు. దోవలో కొన్ని వాగులు దాటవలసి యున్నవి. ఆ కామారెడ్డిపేట వసతి యయిన గ్రామమే. అంగళ్ళు కలవు. అన్ని పదార్ధాలున్ను దొగుకును. భ్రాంహ్యణగృహమందే దిగినాను. చెరువు వున్నది. జలవసతి గలదు. కృష్ణదాటినది మొదలుగా ప్రతిగ్రామములో నున్ను బియ్యము మంచిదిగా దొరుకు చున్నది. వడ్లపయిరు విస్తరించి హయిదరాబాదు మొదలుకొని పండుచున్నది. ఆరాత్రి అక్కడ వసించినాను.

తేది ఉదయమున మూడు ఘంటలకు ఆ యూరు వదిలి అక్కడికి నాలుగు కొసుల దూరములొ నుండే మల్లుపేట అనే గ్రామము పది ఘంటలకు ప్రవేశించినాను. దోవనిన్నటికన్నా యెక్కువయయిన నల్లరేగడ్దభూమి. బహులోతుగల వాగులున్ను, చెరువు మడుగులున్ను దాటవలసి యున్నది. ఆ గ్రామము ఖిల మయినది. యధోచిత ముగా ముసాఫరులకు కావలసిన సామానులు దొరుకును. దిగడానికి స్థలము లేక ఆ గ్రామమందు మూడు డేరాలు ఒక చావడివద్ద కొట్టించి దిగినాను. హయిదరాబాదు దాటినది మొదలు ప్రతి గ్రామానికిన్ని కోటలు బలమయినవి లేవు. కొన్ని కొన్ని గ్రామాలలో బురుజులు మాత్రము కట్టించి యుంచుతారు. ఆ మల్లుపేటలో ఒక పాడుకోట యున్నది. చెరువు జలసమృద్ధి గలది. ఆ గ్రామములో రాత్రి వసించినాను.

తేది ఉదయాన ఏడు ఘంటలకు బయలువెళ్ళి పదకొండు ఘంటలకు ఐదు కోసుల దూరములోనుండే యీదలవాయి అనే రామస్థలము చేరినాను. ఆ యూరు చీలి జమీందారునితో చేరినది. గుడి చక్కగా కట్టి యుండక పోయినా దక్షిణదేశపు మర్యాద ప్రకారము ఆ జమీను దారుడు గుడిలో సకల రాజోపచారములతో ఆరాధన నడిపింపు చున్నాడు. గుడిచుట్టు ముప్పై ఇండ్లుగల బ్రాంహ్మణుల యగ్రహారమున్నది. ఈతురకల రాజ్యమందు ఈస్థలము కుంపటిలో దామర మొలచి నట్టున్నది. తిరుపతి వదిలిన వెనక రాజోపచారములతో ఆరాధన నెడిచే గుడి యిది యొకటే చూచినాను. నా విచారణలోనున్ను వేరేలేదని తెలిసినది. ఈయూరు యధోచితముగా బస్తీగానే యున్నది. కావలసిన సామానులు దొరుకును. ఇక్కడి గుడిలో ప్రతిఫలించి యున్న పరమాత్ముడు ఈ జమీనుదారుని వంశస్థులకు పిలిచితేప లుకు ననేనాటి యనుగ్రహముతో ఆరాధనలు గైకొనుచున్నాడు. మల్లుపేట వదిలిన వనక కోసెడు దూరానికి ఇవతల యీదలగండి అనే దట్టమయిన అడివి యున్నది. రెండు కొంచపాటి తిప్పల నడమ భాట పోవుచున్నది. భాట బహురాతిగొట్టు, నల్లరేగడ భూమి. బహుచోర భయము గలది. మిక్కిలి భయంకరులయిన యింగిలీషు దొరలనే యీదలగండి భాటలో దోచినారు. నేను మల్లుపేట నుంచి ఆయుధసాణులను కొందరిని కూడా తీసుకొని నాతోకూడా వచ్చిన మనుష్యులను యుద్దసన్నద్దులుగా దిట్టము చేసుకొని గండి దాటి వచ్చినాను. దీనిపేరు యీదల్లఘాటు అని చెప్పుచున్నారు. నడమ వాగులు దాటవలెను. అదిన్నిగాక యీదలవాయి యూరినందు పర్షాకాలములో చెరువులో నుంచి మిక్కిలి వేగముగా పారుచునున్న బహులోతు గల రెండలుగు కాలువలు దాటవలెను. అక్కడ డేరామేకుల కంట్లము చెరువు మడుగు కాలువలు దాటేటప్పుడు కొట్టుకొని పోయినది. ఇట్టి భయ ప్రదేశములకు తుపాకులు బహుజరూరు గనుక కడపలో రెండు తుపాకులు తీసుకొన్నాను. హాయిదరాబాదులో కొల్వు పెట్టిన వారిలో అయిదుగురు తుపాకులు తెచ్చేటట్టు నిశ్చయము చేసినాను. ఆ గండిలో నడిచే టప్పుడు అక్కడక్కడ తుపాకీలు కాల్చుచు రావడ మయినది. మల్లుపేట మొదలుగా యీదలఘాటు చేరేపర్యంతము భాట నల్ల రేగడ భూమి, వెనుక భాట రాతిగొట్టు. ఆయీదలవాయి యూరిలో చీలి జమీనుదారుని తరఫున పట్టేలు అనే అధికారస్థుడున్నాడు. దేవాలయ విచారణను అతడే చేయు చున్నాడు. ఆయూరిలో ఇరవై మూడు తేదీ రాత్రి పర్యంతము నిలవడమైనది.

తేదీ ఉదయమున మూడు ఘంటలకు యీదలవాయి వదిలి అక్కడికి రెండు కోసుల దూరములోనుండే జగనంపల్లె అనే గ్రామము పన్నెండు ఘంటలకు ప్రవేశించినాను. యీదలవాయి దాటినది మొదలు కొని కోసెడు దూరములో నుండే డిచ్చుపల్లె అనే మజిలీ గ్రామము చేరేవరకు ఒక చిన్నఘాటునడుమ మార్గము పోవుచునది. అయినా మొందర వదలివచ్చిన ఘాటంత భయము కలది కాదు. భాట సమభూమి. గులక యిసకపొర. కొంచెము రాతిగొట్టు, ఇరుపక్కల మోదుగ చెట్లు వగైరాల యడినవి. ఈ డిచ్చుపల్లెలో యీదలవాయిలో నుండే రామమూర్తిని ప్రతిష్టచేసే నిమిత్తమై పూర్వమందు గొప్పదేవాలయము కట్టినారు. అయితే వాసానికె యోగ్యముగాదని తోచి పరమాత్ముడు కొన్ని లోకదృష్టాంతముల చేత తెలియచేసి యీదలవాల్యిలో యిప్పుడు ఆరాధనలు గైకొనే మూర్తులను స్తాపింపచేసినాడు. ఇప్పటికిన్ని డిచ్చుపల్లెలో కట్టిన దేవాలయము పాడుగాఉన్నది. ఈడిచ్చుపల్లె మొదలు జగనంపల్లె కోసెడు దూరము కలదనే వరకు భాట సరాళము, గులక యిసకపర, నిండా అడివి లేదు, అవతలి కోసెడుదూరమున్ను ఘాటునడుమ పోవుచున్నది. భాట కిరుపక్కల దట్టమయిన యడివి. కొండలసందున భాట. ఈఘాటు నిండా భయాస్పద మయినది కాదు. ఇక్కడ మొగలాయి రాణావారు కొందరు తుపాకులతో కూడా ఉంచున్నారు. వారు వచ్చేవారిచేత


నాల్గవ ప్రకరణము  కృష్ణా గోదావరుల మధ్య దేశము

మనిషికి రెండేసి పయిసాలువంతున పుచ్చుకొను చున్నారు. యీఠాణావారు పాంధులను కాపాడే వారివలె అభినయించడమే గాని వేరుగాదని తెలిసియుండ వలసినది. ఈ జగనంపల్లెలో రెండు చిన్న దేవాలయాలున్నవి. రమణియ్యమైన స్నానఘట్టము కలిగిన చెరువున్నది. అంగళ్ళు కలవు. అన్ని పదార్ధములు దొరుకును. బ్రాంహ్మణుల యిండ్లలోనే దిగి నాను. యిక్కడికి నాలుగు మజలీల దూరములో వేములవాడ అనే మహాక్షేత్రమున్నది. అది భీమేశ్వర రాజేశ్వరక్షేత్రము. వేములవాడ భీమకవి జన్మప్రదేశము. ఈ ప్రాంతములో వ్యాఘ్రాలు పశువులను అప్పుడప్పుడు భాధింపుచున్నవి. ఆ రాత్రి జగనంపల్లెలో నిలవడమయినది.

తేది ఉదయమున ఆరు ఘంటలకు ఆ యూరువదిలి పన్నెండు ఘంటలకు అక్కడికి ఆరు కోసుల దూరములో నుండే దూదుగాం అనే ఊరు చేరినాను. అది గోదావరీ నదీతీరము. ఆరు భ్రాంహ్యణుల యిండ్లున్నవి. గోవదావరి కవతలి గట్టున స్వర్ణ అని చెప్పబడే భ్రాంహ్మణుల యిండ్లు గల యగ్రహారమున్నది. ఆ దినము నడిచిన భాట సరాళము, యిసకపొర, నిండా అడివి లేదు. జగనంపల్లె నుంచి యీదూదుగాముకు రెండు మూడు భాటలు కలవు. అందులో నేను వచ్చినభాట కొంచము చుట్టయినా వసతి యయునది. ఆర్మూరు అనే బస్తీ గ్రామము జగనంపల్లెకు రెండు కోసుల దూరములో నున్నది. ఆయూరి మీదనొక భాట పోవుచున్నది. అది వసతి కాదు. జగనంపల్లెకు నాలుగు కోసుల దూరములో బాలకొండ యనే గొప్పగ్రామము షహరువలెనే బస్తీగానున్నది. యేరస్తాగుండా జగనంపల్లెనుంచి వచ్చినా యీ బాలకొండ నడివీధిలో నడిచి రావలసినది. నేనువచ్చిన భాట శీదాగా బాలకొండకు మధ్య యేయూరున్ను తగలకుండా వచ్చుచున్నది. హయిదరాబాదు వదిలినది మొదలుగా పాలు, పెరుగు మాత్రము తంబళజాతి వారిగుండా ఊరూరిలో సమృద్దిగా దొరకును. కూరగాయలు మాత్రము ఈబాలకొండలో కండ్ల చూడవలసినదిగాని మధ్యదొరకవు. ఈయూరికి మూడు కోసుల దూరములో రామనపేట అనే యూరున్నది. అక్కడ మేనాసవారీలు గంజీఫాచీట్లు ఇవి మొదలయినవి చేసి హయిదరాబాదుకు తీసుకొనిపోయి అమ్ముచున్నారు. యీ యూరిలో జీనిగెలవాండ్లు అనేకులు ఉపపన్నులుగా నున్నారు.

ఈదేశములో కంబళ జాతివారు పుష్పాలు, పాలు, పెరుగు తెచ్చి యిచ్చి మేళాలు వాయింపుచున్నారు. మంగలజారివారు మషాల్ వేయుచున్నారు. బాలకొండకు ఇవతల కొసెడు దూరములో మూకలా అనెచిన్నగ్రామము, అదిదాటి యీదూదుగాముకు రావసినది. యిదినిండా బస్తీ అయినది కాదు. ఆర్మూరు పరగణాతో చేరినది. పట్టేలు గుమాస్తా ఉన్నాడు. నది దాటీంచే పుట్ల విచారణకర్త వాసముగా నున్నాడు. ఈయూరికి అవతలు తట్టున నుండే యూరు మాధ్వుల మయము. వారే తీర్థవాసులు. స్మాత్రులు నది యిండ్లవారు ఈ రెండూళ్ళలో నున్నారు. కావలసిన పదార్ధాలు యధోచితముగా దొరుకును. యీ దూదుగాముకు ఉభయపార్శవాలలో షహరులవంటి గ్రామాలు రెండున్నది. ఒక పక్క బాలకొండ సరేగదా గోదావరి నదికి అటుపక్క నిర్మల అనే షహ రొకటి యన్నది. ఈ రెండు స్థలములలో పట్టణములలో దొరికేలాగు సకల వస్తువులు దొరుకును. యీదలవాయి మొదలుగా దూదుగాము వరకు భాట యోగ్యముగా నున్నది. అడుసువల్ల, రాతిగొట్టువల్ల ప్రయాస నిండాలేదు. ఈగోదావరి తీరమందు తీర్ధవిధులు మొదలయినవి చేయడానికు నాలుగు దినములు ఉంటిని. హయిదరాబాదులో నున్న మట్టుకు అన్ని, దినములు అక్కడ వృధాగా నిలవవలసి వచ్చెగదా అనేవ్యసనము చాలావుండెను. ఇప్పుడుతర్వ్యతిక్తముగా మనస్సుకు బోధ అయినది. ఏలాగంటే అక్కడ నేను నిలిచియున్న సుమారు ఇరవై దినములున్ను ఈప్రాంతములలో క్షోణీపాత మయిన నష్టము, ఇరిగింటి మనిషి పొరిగింటికి పోకూడకుండా కురిసినందున చెరువులు కాలువలు పుష్కలముగా నిండినవి. ఆ వర్షాకాలములో నేను ఈ గ్రామాలలో తగిలి నట్టయితే మిక్కిలి ప్రయాస పడుదును. అటుగాకుండా శ్రీరాముల దేమో నన్ను కొన్ని కారణాలచేత హయిదరాబాదు షహరులో నిలిపినదీన్నికాక, షహరు విడిచి ప్రయాణమైన వనుక కూడా, ప్రతిదినమున్నూ నేను మజిలీచేరి భోజనము చేసిన వెనక సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు వర్షము కురిసి వెలిసేటట్టు కటాక్షింపుచు వచ్చెను.

హయిదరాబాదు వదిలింది మొదలు ఈగోదారి తీరము వరకు నడమనుండే జమీను దారులు, జాగీరుదారులు పరగణాదారులు, షహరుకు ఆపక్కనిండెవారిపాటి బలాడ్యులున్ను కలహప్రియులున్ను కారు. యధోచితముగా రహితు జమాబందిమీద రూకలు వసూలు చేసే జ్ఞాపకము యీప్రదేశపు వారికి ఉన్నది గాని, షహరుకు అవతలితట్టు వారివలె ఊరూరికి కోటలు, కొత్తళాలు, బలముచేసి గ్రామాదులను పాడుచేయడములేదు. కృష్ణదాటినది మొదలుగా ఈగోదావరీతీరమువరకు యిక్కడివారు వాడే కోసు, మన పద్నాలుగు గడియ దూర మవుచున్నది. యిది హల్కాకోసు అనుచున్నారు. కృష్ణకు అవతలిగట్టు పర్యంతము వాడే కోసు, మన రెండుగడియల దూర మవుచున్నది. యిక్కడి కోసు రెండు మయిళ్ళుకు కొంచము తక్కువనే చెప్పవచ్చును. నేను మనకోసుల ఉమారే చూచి వ్రాయుచు వచ్చుచున్నాను. మనగడియ దూరం ఇరవై నాలుగు నిమిషాలకు నడవ వచ్చును. గనుక ఆ నిజామున ఊహించి, ఆ యూ యూరికిగల దూరమును నిర్ణయించి వ్రాయుచు వచ్చుచున్నాను. ఇక నున్నూ అట్లాగే వ్రాయడ మవుచున్నదని తెలియవలసినది.

ఈ గోదావరీ తీరమువరకు ఆ యా మజలీ గ్రామములలో తమలపాకులు దొరుకుచు వచ్చినా మంచివిగా నుండవు. గనుక దిగిన మజిలీ గ్రామాదులలో తమలపాకు లున్నచోటు విచారించి తోటలవృద్దికి మన సంతమనుష్యులను పంపించి లేతవిగా గిల్లించి సంగ్రహించు కొనుచు వచ్చినట్లయితే అనుకూలముగా నుంచున్నది. హయిదరాబాదులో గొప్పవారందరున్ను పండుటాకులు వేసుకొనుచున్నారు.

యీదలవాయిలో తమలపాకులు బహునయము. బాలకొడలో పండటాకులు దొరుకును. కడప మొదలుగా యీ గోదావరీ తీరమువరకు అమ్మే వక్కలు ముడి వక్కలు రెండుగా వొత్తి ఉడక బెట్టినవి కావు, మంచిదిగా ఏర్పరచివొత్తివేసుకొంటే మనదేశపు వక్కలకన్నా బాగా రుచిగా ఉంచున్నవి. యీదేశములో పేదలు నిండా తాంబూలము వేసుకోవడము లేదు, ఒక్కలు మాత్రము నవులుతారు. శూద్రుల చేతి హుక్కాలు ఇతరులు తాగుచున్నారు.

కృష్ణదాటినది మొదలుగానున్న ముఖ్యముగా హయిదరాబాదు మొదలుగానున్ను, ప్రతిమజిలీ యూళ్ళలో బియ్యముతోటి పాటు తియ్యగానుండే గోధుములపిండి విసిరి అమ్ముచు వచ్చుచున్నారు. యీదేశములో రొట్టె వినాగా అన్నమే భుయింపుచు వస్తే దేహానికి బలము లేదని వదైంతి గనుక, మే మొకపూట రాత్రి అన్నముతో కూడా రొట్టె తీసుకొనుచు వచ్చుచున్నాము. అది ఆరొగ్యము గానే యున్నది.

పై జగనంపల్లె నుంచి కుళదర్పణ మనే గోదావరీ తీరపు రామక్షేత్రానికి దారి పోవుచున్నది. ఆక్షేత్రము ఇమ్మడికి నాలుగు కోసుల దూరము. నాగపూరి దారికి వొత్తియుంచున్నది. అక్కడ అనేక బ్రాంహ్మణులు తీరవాసమని యిండ్లు కట్టుకొని యున్నారు. ఈదూదుగాము నదికి గడియదూరములోనున్నది. యిక్కడ స్నానఘట్టము వసతికాదు, నీడలేదు. నది యిప్పట్లో పూర్ణ ప్రవాహముగా నున్నది. ఇక్క్డసుమారు నది గడియదూరము వెడల్పుకలది. నది నడమ కొన్ని లంక లున్నవి.

కడప వదిలినది మొదలుగా అరవభాష తెలిసి మాట్లాడ తగినవారు సకృత్తుగానున్నారు. తెనుగుమాటలు సర్వసాధారణముగా రాగసరిళిగా చెప్పుచున్నారు. ప్రశ్నపూర్వకముగా ఉత్తర ప్రత్యుత్తర మెచ్చేటప్పుడు శబ్దములను సంకుచిత పరచి మాట్లాడుచున్నారు. ఎట్లాగంటే యీ యూరు ఆయూరికి ఎంతదూరమంటే నాకు యేమి యెరుక యని ప్రత్యుత్తరము పుట్టుచున్నది. పండుకొన్నాడు అనడానకు పండినాడని అనుచున్నారు. హిందూస్తాని తురకమాటలు తరుచుగా దేశ భాషలయినందున ఆమాటలు తెనుగుభాషలో గలిపి మాట్లాడుచున్నారు. ఈదేశములో ఈగలు బహు బాధపెట్టుచున్నవి. వర్షా కాలమయి నందున యిటు విస్తారమయిన దని చెప్పుచున్నారు.

కృష్ణ మొదలుగా గోదావరివరకు డ్రావిళ్ళు లెరుగదా? ఆంధ్రులుగా నుండే బ్రంహ్మణులందరు సగోత్రముగాక ఋషిప్రవనర కలియక పొయి నట్టయితే మధ్యదేశమువలె వెలనాడు, కాసలనాడు అనే తెగలు విచారించక సంబంధములు చేయుచున్నారు. లౌకీకులను వ్యాపారులను చున్నారు. మధ్యదేశపు సిద్ధాంతి పంచాంగముతో ఈ గొదావరీ తీరములో నుండే అనేక సిద్ధాంతులు గుణియించిన పంచాంగాలను సరిపెట్టినాను. తిది వార నక్షత్ర యోగ కరణములు అహ, ప్రమాణములు అరగడియ యేక్కువ తక్కువగా సరిపడుచు వచ్చుచున్నవి. యీదేశ పంచాంగములో శూన్యతిధులు, తిధిద్యయాలు వ్రాయడము లేదు. తద్ద్వారా పంచాంగపు వారి మూడ్యముచేత తిధులు ముణిగిపోవుచున్నవి. వైదికులు పాగా, చొక్కా లేక, ఆశీర్వాదము చేసే సంప్రదాయము లేదు. ప్రతిద్వ్జునకున్నూ చేత పంచంగ ముండవలసినది. పంచాంగశ్రవణము బహుప్రబలము. ఈదేశములో యిప్పట్లో వర్షా కాలము గనుక మన దేశపు కార్తిక మాసములోని వ్రతములు శ్రావణమందు శ్రావణ సోమవారలని, నిత్యాభిషేకాలని, సక్త భోజనాలని, ఛెయుచున్నారు. గృహకల్లోల కార్యములలో పురుషులకన్నా స్త్రీలకు చొరవ యెక్కువగా యీ దేశములో కలిగియున్నది.

కడప మొదలుగా గొప్ప వర్తకులు, ధనికులున్నుండే స్థలములో నొక్కొకవేళ డాగావాండ్లనే దొంగలు అతి ధైర్యముతో సాయంకాలములో గుంపుగా ప్రవేశించి యెదట కండ్లపడ్డ వారినంతా చంపి ధనికుల యిండ్లలో, అంగళ్ళలో జొరపడి ఖామందులను పోడిచి చంపి, ఉండే ధనము నెత్తుకొని, అరగడియలో మటుమాయ మయి పోవుచున్నారు. యీప్రకారము హయిదరాబాదు యింగిలీషు లష్కరు మధ్యె జరిగినది. యీ డాగావారి భయము యీ దేశములో విస్తరించి కలిగియున్నది. సాత్వికుల యోగ్యత యిటువంటి దుష్టులు లేకనే ప్రబలముగాదు గనుకనున్ను యిటువంటి వారు యీశ్వర చిద్విలాసానికి సామాగ్రి గనుకనున్ను, వారినిన్ని యీశ్వరుడు రక్షింపుచున్నాడు.

తేది మధ్యాహ్నము పన్నెండు ఘంటలకు ఆ గోదావరి నది దాటి యివతల అయిదు కోసుల దూరములో నుండే నిర్మల అనే షహరు నాలుగు ఘంటలకు ప్రవేశించినాను. దారి నదికి అటు ప్రక్క రెండు మజిలీల వరకు ఉన్నట్టే బాగా గులక యిసుక పరగా నున్నది. నదిదాటగానే ఒక బంగాళా జాతులవాండ్లు దిగడానికి యోగ్యమయినదిగా నున్నది. యివతల చిన్న యూళ్ళు మూడున్నవి. కొన్ని మజబూతి అయిన పాడుకోట లున్నవి. నిర్మల అనేయూరు పట్టణము వంటిది. సకల పదార్ధాలు దొరుకును. సకల విధములయిన పని వాండ్లున్నారు. ఊరుచుట్టున్నూ, ఊరు నడుమనున్ను చిన కొండలు నిండా వున్నవి. గొప్ప యిండ్లు కలవు. ఊరుకి చుట్టున్ను, తొటలు, చెరువులు కలిగి యున్నవి. ఇక్కడ అరికాటి నబాబు కింద లోగడ రాయిజీ *

గమనిక, *ఆర్కాటు నవాబుకింద రాయరేడ్డెరావు అను నతడు శిరస్తాదారుగా నుండేవాడు. ఇతడు పద్దెనిమిది వందల తొమ్మిది లో బలవన్మరణము నందినాడు.

సర్వాధికారిగా ఉన్నట్టు ఒక పరగణాదారుడు ఉన్నాడు. దేశముఖి, దేశపాండ్యాలు ఉన్నారు. కొత్తవాలు మొదలయిన యధికారస్థులున్నారు. వంద బ్రాంహ్మణ యిండ్లును, ఒక దేవాలయమున్నూ ఉన్నవి. అక్కడ నేను దిగినాను. యిట్లా గొప్ప యూళ్ళలో నుండే బ్ర్రాంహ్మణ మండలికి సభాపతి అనే ఒక బ్రాహ్మణుదు ఉన్నాడు. అతని యూజ్ఞకు తక్కిన వారు యధోచితముగా లోబడి యున్నారు. నిర్మల పంచపాత్రలు ఈప్రాంతములలో బహు ప్రసిద్దిగా నున్నవి. నిండా కంచర యిండ్లున్నవి. అయితే కూతురి ప్రౌఢమ తండ్రికి ఏప్రకారము అనుభవానికి రాదో అలాగే ఆయాపదార్ధాలు పుట్టే స్థలముల యందు అచ్చటివారికి అనుభవానికి రావు. అందుకు దృష్టాంత మేమంటే యిక్కడచేసే పంచపాత్ర యొకటి చూతామన్నా యీ యూరున దొరికినదికాదు. ఈ నిర్మల నుండే పొష్టు రన్నర్సులనే టప్పా మనుష్యులు హైదరాబాదు పోష్టాఫీసు యిలాకావారు ఇది మొదలుగా నుండే టప్పా మునుష్యులు నాగపూరి పోష్టాఫీసు యిలాకావారు గనుక రెండు యిలాకాలకు న్నిద్దరు మనిషీలు ఇక్కడ నున్నారు. నాగపూరు మనిషీగుండా నగపూరు వరకూ నొకటప్పామనిషిని మజిలీ మజిలీకిన్ని కూడా వచేటట్టు దిట్టము చేసుకొన్నాను. వూరి అములు దారుడు నేను వచ్చేటందుకు మొందరనే తగయిరు అయినాడు గనుక దేశపాండ్యా వెంకటరాయనివారిగుండా యేదులాబాదు వరకు వచ్చే టట్టు నాలుగు మంది ఆయుధ పాణులయిన జవానులను తయినాతి చేసుకొన్నాను. ఈ నిర్మలలో దృశ్యాఅనేవాడు. నిజాముకింద అధికారము చేసేవాడు. అతడు తన రాజ్యపురూకలు యజమానునికి పంపించకుండా తన చేతికిందనున్న భూమిని ఆక్రమించవలనని కోటలు కట్టి యజమానునితో చచ్చేవరకు యుద్ధముచేయుచు రాజ్యము ననుభవింపుచువచ్చినాడు. నేను దిగిన దూదుగాము అనేది నదీతీరమదలి యూరు. బహు రహధారి. కశిభాటలో నున్నది. ఆ నిర్మలలో మొదటి తేది ఉంటిని.

ఆగస్టునెల రెండు తేది ఉదయాన ఆరు ఘంటలకు ఉదయాన బయలువెళ్ళీ ఎనిమిది కోసుల దూరములో నుండే వొడ్డూరు అనె యూరు ఒకటి ఘంటకు చేరినాను. దోవ బహు ప్రయాస. నల్ల రేగడి భూమి. వర్షాకలములో నడిచేవారికి అడుగు అమడగా నుండును. ఏడు కొండలు దారిలో నడిచేవారికి నెక్కి దిగవలసియున్నది. దారిలో అడుసుతో కూడా రాళ్ళు మిశ్రములై యున్నవి. దారిలో అంకిరి అనే యూరున్ను మరికొన్ని చిన్న యూళ్ళున్నున్నవి. మజిలీ చెయ్యడానికి వయిపు అయినవి కావు. యీ నిర్మల్ నుంచి నేరేడు కొండ అనే యూరిమీదనొక భాటపోవుచున్నది. అ భాట సమీపమయినా వర్షాకాలములో నడవకూడదు. యీదినము నడిచిన భాట కిరుపక్కల దట్టమయిన యడవి. వ్యాఘ్రభయము జగనంపల్లె మొదలుగా కలిగియున్నది. పాంకిలి అనేయూరివద్ద ఒక వాగు దాటవలెను. ఇది బలమయిన వారు. అవతలి యూరి ముందర నొక లోతుగల వాగు ఉన్నది. యిదేగాక అనేకములయి గనుక చిల్లర వాగులు అనేకములు దాటినాను. ఈ వొడ్డూరు బస్తీ గ్రామము. సకల పదార్ధములు దొరుకును. భ్రాంహ్మణుల యిండ్లు చావిళ్ళున్నున్నవి. ఇక్కడ నొక చావిడిలో ఈ రాత్రి నిలిచినాను.

తేద ఉదయాన ఆరు ఘంటలకు బయలు వెళ్ళి ఏడు కోసుల దూరములో నుండే విచ్చోడా అనే యూరు ఒకటి పాయింట్ రెండు ఘంటలకు చేరినాను దారి నిన్నటివలెనే సకల్ విధములయిన ప్రయాసలను ఇచ్చుచున్నది. కొండ యొక్కుడు దిగుడు గలది. రాతి గొట్టు మాత్రములేదు. దారిలో కడం అనే నది దాటవలెను. ఈ నది వెడల్పు తక్కువ అయినను బహు ఘాత చేసేది. పడవ, తెప్ప, మొదలైనవి కూడా ప్రవాహవేగములో నడవవు. ప్రవాహ కాలములో కంపెనీ టప్పాకూడా రెండు మూడుదినములు ఇక్కడ నిలిచిపొవు చున్నది. విచ్చోడా అనే యూరు బహుచిన్నది. యధోచితముగా కావలసిన పదార్ధాలు ముసాఫరులకు దొరుకును. ఇక్కడ డేరాలలో వసించినాను. వోడ్డూరు - విచ్చోడా మధ్యే కొన్ని చిన్న గ్రామాలున్నవి. నిలవయోగ్యములు కావు. దారికి యిరుపక్కలా చిన్న పర్వతములు దర్శన మవును. మిట్టలో నించి పల్లానికి నిండా దిగే కడం నది దగ్గిర నెక్కవలసి యున్నది. ఆయూరున ఆరాత్రి ఉన్నాను.

తేది ఆరు ఘంటలకు బయలుదేరి రెండు ఘంటలకు పది కోసుల దూరములో నుండే యేదులాబాదు అనే షహరువంటి యూరు చేరినాను. దారి అట్నూరు అనే యూరివరకు నల్లరేగడభూమి. అడుసు లోగడి రెండు దినముల వలెనే దిగపడుచున్నది. ప్రయాస చెప్పి తీరదు. ఆట్నూరు మొదలు యేదులాబాదు వరకు దారి నడవడానికి గులక యిసుక పరయున్నుచిన్న రాళ్ళగోట్టున్ను గనుక అనుకూలముగా నున్నది. అయితే మేకల గండి అనే ప్రసిద్ద మైన ఘాటు ఇక్కడ దాటవలసినది. ఈ ఘాటులోని యడివి, బల్లెము దూరని పాటి దట్టమని చెప్పవచ్చును. వ్యాఘ్రభయము విస్తారము. పులియడుగులు దారిలో చూచుచు మేము నడిచినాము. బహు జాగ్రత్తగా బాటసార్లు ఇక్కడ నడుచు చున్నారు. ఒకరిని ఒకరు విడిచే ప్రదేశము కాదు. తుపాకులు అక్కడ కాల్చుచు వచ్చినాము. కొండల చెరువుల నడమ భాట పోతున్నది. అట్నూరి వద్ద నొక పెద్దవాగు దాటవలసినది. యింకా శానాశానా చిన్నచిన్న వాగులు దాట వలిసియున్నవి. నిర్మల మొదలు భాటలో సన్నముగా, విడువుగా నిండే చీకటి యీగెలు నిండా కరుచుచున్నవి. యీ మేకల గండి యడివిలో నడిచే టప్పుడు నడిచేవారు చిన్న మండలు విరిచి చేతపట్టుకొని తోలుకొనుచు రావలసినది. ఆ మక్షికాల భాధ ఘాటు దాటే పర్యంతముగలదు. ఆఘాటు ములులే అనే యూరి పర్యంతము ఉన్నది. ఆఘాటును మేకలగండి అనటానికి కారణమేమంటే ఘాటు మధ్య వుండే రాళ్ళన్ని మేక అడుగులతో ఈశ్వరుడు సృస్టిచేసి యున్నాడు. యేదులాబాదులొ సకల పదార్ధాలు దొరుకును. సకల విధములయిన పనివాండ్లు వున్నారు. జలవసతి కలదు. బ్రాంహణ యిండ్లు కలవు. ఊరికి బయిట బ్రంహ్మచారి బావా మఠ మున్నది. వూరి మధ్యే కొన్ని మఠాలున్నవి. ఒక మఠములొ దిగినాను. విచ్చోడా అనే వూరు మొదలుగా వోణి అనే వూరు వరకు ముషోర్మల్కు అనే దివాంజీకి జాగీరు అయివున్నది. యీ యేదులాబాదులో నాయబు అనే అములుదారు డున్నాడు. ఈయూళ్ళోకూడా వచ్చిన వారియొక్క అసోదా నిమిత్తమున్ను, పదార్ధాల సంగ్రహము కొరకున్ను ఆ దినమంతా నిలచినాను.

వ తేది ఉదయమైన ఆరు ఘంటలకు బయలు వెళ్ళీ ఎనిమిది కొసుల దూరములో నుండే ధనోరా అనే యూరు ఒకటి పాయింట్ రెండు ఘంటలకు చేరినాను. దారి నల్లరేగడ అయినా అడుగున రాతిపారు గనుక నెంత వర్షముకురిసినా ఆట్నూరు వర్యంతము దిగబడేలాకు ఈదారి దిగబడదు. దారి కిరుపక్కల భూమి వెల్లడిగానున్నది. ఆదివిలేదు. అయితే దారి రాతిగొట్టు. శానా వాగులు వర్షాకాలములో దాటవలసి యుంచున్నవి. యేదులాబాదుకు కొంత దూరములో నొక పెద్దవాగు మధ్య వుండే జేనదు అనే వూరి వద్ద నొక పెద్ద వాగు దాటవలెను. ఈ జేనదు అనే యూరు మంచి బస్తీ అయినది. ముచ్చటగా రాతి పని చేసిన యొక విష్ణు దేవాలయము ఈ యూరి చెరువు గట్టున వున్నది. సకల పదార్ధాలు దొరుకును. యేదులాబాదుకు సమీపముగా కోసుల దూరములో ఈ వూరున్నందున నెను దిగలేదు. ఇదిగాక చిన్నవూళ్ళు కొన్ని వున్నవి. మజిలీ చేయడానికి తలుచుకొనతగినవి కావు. ధనొరా వూరిముందర పిన్నగంగ అనే నది దాటవలసినది. ఇక్కడ కొయ్య తొలిచిన రెండేసి చిన్న దోనెలు జోడించి కట్టినదోనె రెండేసి సవారీలున్ను ఆరుబోయీలున్ను ఒక తేవకు దాటింపు చున్నది. సామానులున్న పరివారమున్ను దాటడానికి రూపాయలు రెండు దోనెవాండ్లకు ఈనాముగా నిచ్చినాను. కొంఫిణీవారి తఫాల్ దాటించడానికి సంవత్సరానికి ఒకటి కి మూడు రూపాయీలు లెక్క జీతముగా పన్నెండు రూపాయిలు గోదావరి మొదలయిన నదులు దాటించేవారికి యిచ్చేటట్టు వర్షాకాలము నాల్గు నెలలకు నెల ఒకటి కి మూడు మూడురూపాయీలు లెక్క జీతముగా నిచ్చుచున్నారు. లోకులవద్ద మనిషికిన్ని పశువుకు న్నింత మాత్రమని పుచ్చుకొని యీ దోనె వాండ్లు తమ వచ్చుఒడిలో నొక హిస్సా నిజాము సర్కారుకు ఇస్తారు. ధనొరా అనే వూరు చిన్నది. యధోచితముగా ముసాఫరులకు కావలసిన సామానులు ప్రయత్నముమీద దొరుకును. నేను నదియొడ్డున డేరాలలో వసించినాను. బ్ర్రాంహ్మణుల యిండ్లు లేవు. ఒక అంగడి యున్నది. యీ ప్రాత్యపు గ్రామాలలోనంతా వర్షాకలములో కాలుపెట్టను మనసురాదు. అసహ్యమయిన అడుసు. నడమ గ్రామములున్నవి. యిక్కడ యీ రాత్రి నిలిచినాను.

వ తేది ఉదయమైన ఆరు ఘంటలకు బయలుదేరి ఒకటి ఘంటకు ఏడు కోసుల దూరములో నుండే కాయరా అనే వూరు చేరినాను. దారి నిన్నటి దారివంటిదే. చిన్న వాగులు శానా వర్షాకాలములో దాటవలసి యున్నవి. యిదిగాక ఒకరాతి గొట్టుకల కనమ యెక్కి దిగవలసి యున్నది. యీ కనమ మీద ముందు వెనక అడివి కలిగియున్నది. యీ యడివిలో మేకల గండిలోనున్న యీగెలవంటి యీగెలు నడిచేవారిని బాధ పెట్టుచున్నవి. రోనేగరుగాం అనే వూరితో యీయడివిసరి. అవతల పొడిచెట్లుగాని భయములేదు. కాయరా యూరి ముందర నొక పెద్దవాగు దాటవలెను. కాయరా అనే యూరు బస్తీయయినది. నాయబు ఉండే కసుబా స్థలము. సకల పదార్ధాలు దొరుకును. బ్రాంహ్మణ యిండ్లు యిరవైదాకా కలవు. ఫేష్కారు యొక్క యింటిలో దిగి యీ రాత్రి ఇక్కడ నున్నాను.

తేదీ ఉదయమున మూడు ఘంటలకు బయలు వెళ్ళి ఐదు కోసులదూరములో నుండే వోణీ అనే యూరు పదకొండు ఘంటలకు చేరినాను. దారిలో చిన్నయూళ్ళు నాల్గున్నవి. నడిచినంత దూరము నల్ల రేగడ, అడుగున రాతిపరి, పయిన అడుసు. చిన్న వాగులు కొన్ని దాటవలసినది. అడివి, రాతిగొట్టు, వేమనో అనే గ్రామము బహు బస్తీ అయినది. దేవాలయాలు కలవు. సకల పదార్ధాలు దొరుకును. అధికారస్థులుండే కసుబాస్థలము, జలవసతి కలదు. ఇండ్లుగొప్పవి. నేను గొప్ప వేంకటేశ్వరదేవాలయములో దిగినాను. సవారీల నుంచడానికి, బోయీలు జవానులు కావటివాండ్లు వగయిరా లుండడానికిన్నీ, చావిళ్ళూ మణిగ లడే జామీనులు, మశీదులు అసర్ ఖానాలు శానా వున్నవి. దినుసువల్లు నాణ్యములు ఇక్కడ మార్చుకోవలసినది. ఈ యూరంతా యిసుక పర గాని, అడుసుకాదు. ఆ యూరు నదీతీరము. నిజాము వద్ద కలటరు హొదా చేసినవారు కొంద్రు జాతులవాండ్లు యిక్కడ యిండ్లు కట్టుకొని యున్నారు. ఇంగిలీషువారు కలకటరులు కావడానికి హేతువేమంటే నిజాము తరపున నున్న అధికారస్థులు జమీందారులు నసిగా రూకలు పంపించనందున యింగిలీషు దొరలు తాలూకాలమీద నుండే దాపుమీద రూకలు వచ్చునని దివాంజీ చేసే చందులాలా యోచించి రిసైడెంటుతో మాట్లాడి తాలూకాల మీదికి తన యములు దారులతొ కూడావుండి వ్యవహారము చూడ గలందులకు యింగిలీషు దొరలను పంపించినాడు. వారు అక్కడక్కడ నిజాం అధికారస్థులతొ కూడా వుండే వ్యవహారము జరిగించినారు. అందువల్ల మొగలాయి ధోరణి జులుము లోకుల మీద నిండా వ్యవహారస్థులు చేయకుండా వచ్చినది గనుక అధికారస్థులకు వైపు, ఉపాయము, తోచక, చందూలాలాకు తెలియచేసి నంతట్లో మళ్ళీ ఆ కలకటరులను రిసైడెంటు పిలుపించుకొన్నాడు. యిప్పటికీ యింగిలీషువారి న్యాయ ఉన్నది గాని, *

గమనిక, *మద్రాసు ఫోర్టుసెంటు జార్జికోటలో సివిలు సర్వీసు ఉద్యోగులకు దేశభాషలు వ్యవహారములు నేర్పడం కోసం పద్దెనిమిది వందల పన్నెండు లో నొక కాలేజి స్థాపింప బడినది.

కాలీజి సిద్ధాంతి వ్రాసినట్టు యింతకు మునుపే సింహరాశిగతుడైనట్టు వ్రాయలేదు. తూర్పు దేశము నుంచి క్షామాదులకు లేచివచ్చి యిక్కడ నిలకడగా నిలచిన వారెవరయినా గ్రామాదులలో నుంటే వారు మాత్రము తెనుగు మటలాడుచున్నారు. తూర్పు దేశపు బ్రాంహ్మణులు, కోంట్లు మాత్రమీ దేశానికి యిదివరకు యొగ పాకి వచ్చుచున్నారు. నేను బ్రాంహ్మణనింటిలో యీ రాత్రి వసించి, యింగిలీషువారు యిక్కడనున్ను ముందు మజిలీలో నున్ను కట్టించి యుండే ముసాఫరుఖానాలో నా సవారీలు మూడు న్నుంచినాను.


ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర
టీటీఎస్ ఆడియో నిర్మాణ పాఠ్యం
భాగం మూడు — మొత్తం ఎనిమిది భాగాలలో


నాల్గవ ప్రకరణము  కృష్ణా గోదావరుల మధ్య దేశము

తేది నాలుగు ఘంటలకు లేచి యిక్కడికి ఎనిమిది కోసుల దూరములో నుండే నాగిరి అనే యూరు చేరినాను. దారిలో నదరహి దోనెలవంటి దోనెలతో నొక నది దాటవలసినది. చికనీ అనే యూరివరకు దారి వల్లెడిగా నల్ల రేగడ భూమిగా నున్నది. ముందు గడిచిన దినముల దోవ వలెనే కాలు దిగబడే అడుసుకలది కాదు. ఆ గ్రామము మొదలుగా భూమి నల్ల రేగడయయినా గట్టిపరగనుక అడుసు త్వరగా నెండిపోవుచున్నది. విస్తరించి వాగులు యెక్కుడు దిగుడుగా దాటవలసి వున్నది. ఈ నాగరి అనే గ్రామము బస్తీ అయినది. రుక్మి విఠోబా దేవాలయము కొంచము విస్తారమయిన ముఖమంటముతో కూడా నున్నది. భ్ర్రాంహ్మణ యిండ్లున్నవి. ముసాఫరుఖానా కలదు. నేను దేవాలయములో దిగినాను. ముసాఫరులకు కావలసిన పదార్ధాలు దొరుకును. యేదులాబాదు మొదలుగా నిది వరకు మెరక పంటభూమి, పుంజధాన్యము చేనులు చేసి పయిరు చేయుచున్నారు. భాటకు నిరుపక్కల చేనులలో పశువులు చొరపడకుండా ముండ్లకంపలు తెచ్చి వెలుగు వేసుటవల్ల యీ ప్రయాస నిఛ్ఛే అడుసుతో కూడా ముండ్లుకలిసి యంచున్నవి. ఆ గ్రామములో ఆరాత్రి వసించినాను.

తేది ఉదయాన ఆరు ఘంటలకు లేచి యిక్కడికి ఏడు కోసుల దూరములోనుండే మాండగాం అనే యూరు ఒకటి పాయింట్ రెండు ఘంటలకు చేరినాను. దారిలో హింగన్ ఘాటు అనే షహరువంటి యూరివద్ద వన్నేనే నది సదరహివ్రాసిన దోనెకుండా దాటవలసినది. హింగన్ ఘాటు అనే షహరు స్థలము నిన్నటి మజిలీకి నాలుగు కోసుల. యీ యూరిలో చుట్టుపక్కలా బహు దూరానికి అందేటట్టుగా వుప్పు తెచ్చియుంచి వర్తకులు రాసులమోడిగా అమ్ముచున్నారు. సాహుకారు కొఠీ లున్నవి. నాణ్యములు ఇక్కడ మార్చుకొన వచ్చును. బట్టలు వగయిరాలు, సకల పదార్దాలు, ఔషద దినుసులు సమేతముగా యిక్కడ కావలసినంత దొరుకును. నేటి దారి చికిని అనే యూరు మొదలుగా నాగిరి పర్యంతము ఉన్నట్టే యధోచితముగా అనుకూలముగా నున్నది. వాగులు విస్తారము దాటవలెను. మాడుగాం అనే యూరు యధోచితముగా బస్తీ అయినదే. ముసాఫరులకు కావలసిన సామానులు దొరుకును. స్థల సంకుచితము లయిన యిండ్లు కలవు. బ్ర్రాంహ్మణయిండ్లున్నవి. నిన్నటి దేవాలమువంటి దేవాలయము ఒకటి యున్నది. యీ దినము గోకులాష్టమి గనుక ఆగుళ్ళో ఉత్సవము జరుగుటచేత నొక సంకుచిత మైన మారువాడివాని అంగట్లో దిగి ఈరాత్రి దిగి ఇక్కడ వసించినాను.

తేది ఆరు సగం ఘంటలకు బయలువెళ్ళీ ఐదు కోసుల దూరములో నుండే చింది అనే గ్రామము పది ఘంటలకు చేరినాను. దారినిన్నటి వలెనే యున్నది. అనేకములయిన పల్లాలు దిగి మిట్ట లెక్కవలసి వాగులు దాటవలసి యున్నవి. చింది యనేది కసుబా గ్రామము. పేట స్థలము. అన్ని పదార్దాలు దొరుకును. భ్ర్రాంహ్మణయిండ్లు, చావిళ్ళున్ను కలవు. నేను కఛ్ఛేరి చావడిలో దిగినాను. ఈ ప్ర్రాంతముల బస్తీ మజిలీ వూళ్ళలో వారానకు నొక దినము సంత. ఆ సంతకు అన్ని పదార్ధాలు ఇతర గ్రామాలనుంచి తెత్తురు. అదే ప్రకారము ఈదినమున ఈ యూరికిన్ని తెచ్చినారు. అప్పట్లో అన్ని వస్తువులు సయముగా బాహటముగానున్ను దొరుకుచున్నవి. కూరగాయలు తమలపాకులు మొదలయినవి కూడా సంతకు తెచ్చుచున్నారు. ఈ రాత్రి ఇక్కడ నిలిచినాను.

తేది ఉదయాన ఆరు సగం ఘంటలకు బయలువెళ్ళి ఎనిమిది కోసుల దూరములో నుండే గూంగాం అనే యూరు పదకొండు ఘంటలకు చేరడమయినది. దారి ముందు నడిచిన దినముల దారివలె నల్లరేగడ, రాతి గొట్టు కూడా కలిగియున్నది. యిక్కడికి నాలుగు కోసుల దూరములో నుండే కాకిఘాటు అనే యూరివరకు కొంచెము పొడిచెట్ల యడివి భాట కిరుప్రక్కల నున్నది. కాకిలిఘాటు ఊరివద్ద నదివంటి వాగు ఒకటి దాటవలసినది. యేదులాబాదు మొదలుగా ప్రతియూరు న్నొక యేరు వంటి వాగును అనుసరించి యున్నది. చెరువులు నిండాలేవు. ఈవాగులే ఉదక సమృద్ధిని కలకలగచేయు చున్నవి. కాకిలిఘాటు మొదులుగా రాతి గొట్టున్ను అడివిన్ని లేదు. భాట కిరుపక్కల చదరమైన భూమి. గూంగాం అనే యూరు కసుబాస్థలము. బక్కిబాయి అనే నాగపూరు రాజు బంధురాలికి జాగీరు గ్రామము. ఈవూరివారున్నూ, ఇక్కడి యధికారస్థులున్ను, నాగపూరు షహరుకు సమీపమందున్నారు గనుక అలక్ష్యము, అహంకారమునున్ను వహించియున్నారు. అయినా బస్తీ గ్రామము గనుక అన్ని పదార్ధాలు బజారులో దొరుకును. ఈవూరిమధ్య స్వచ్చమయిన జలము కల వాగు ఒకటి పారుచున్నది. దేవాలయము, ధర్మశాల అనే చావడి, బ్ర్రాంహ్మణ యిండ్లున్నవి. ధర్మశాల అనేది ఒక తాళ్వారము వీధికి అభిముఖముగా వేసి యుంచున్నది.

యీ దేశపు ముసాఫరులు తాము బ్రాంహ్మణులయినా దృష్టిదోషము పాటించడము లేదు. గనుక అందులో దిగి, వీధిలోవచ్చేవారు పొయ్యేవారున్నూ చూడగా వంట చేసుకొని భోజనము చేయుచున్నారు. భ్రాంహ్మణులు భోజనము చేసేటప్పుడు శూద్రులను యెదుగా కూర్చుండ బెట్టుకొని మాట్లాడు చున్నారు. శూద్రులను ఎదట పంక్తిగా తమతోపాటు కూర్చుండపెట్టి వడ్డించి చూచుచు, మాట్లాడుచు బోజనము చేసుట కలదు. అయితే మన ఏపయనుష్వాణాం కారణం బంధమోక్షయో! అనే న్యాయముచొప్పున


ఐదవ ప్రకరణము  నాగపూరు రాజ్యము

ఇట్టి నియమములంతా స్వతంత్ర ప్రవృత్తి నివృత్తులను కలవి గనుక ఈ ఆచారము ప్రమాదమైనది కాదు. అయినా ఆ స్థలము యుక్తముగా తోచనందుననున్ను, బ్ర్రాంహ్మణ యిండ్లలో జాగా కునందిగనుకనున్ను మరిన్ని వారి యాచారవ్యవహారాలలొ శూద్రులగుండా ఉదకము తెప్పించుకొని వాడుకొనేటట్టుగాకూడా ఉన్నది గనుక నున్ను వాగువొడ్డున డేరాలు వేసి దిగి ఆ యూరిలో ఆ రాత్రి వసించినాను. దారిలో దాకిలి ఘాటుదాకా కొన్ని యూళ్ళున్నవి. మజిలీ చేయడానికి యోగ్యములు కావు. హయిదరాబాదు మొదలుగా మంచి యిండ్లు కట్టుకొనేవారు మట్టిమిద్దె నొక అర యింటికిగాని, కూటానికిగాని వేసి పైన పెంకుల పూరితో నొక కట్టడి యేర్పరచి పైన నెక్కడానకు, ఒక నిచ్చెనగాని, పొడుఘుమెట్లుగాని కట్టి పెట్టుచున్నారు. సాధారణముగా ఇండ్లు కట్టే వారు పెంకులతోను, పూరితోను కట్టుచున్నారు. యెదులాబాదువరకు నుండే పెంకులు దక్షిణదేశములో నీళ్ళకాలువలకు పెట్టే కోవుల మాదిరిగా నుంచున్నది. ఆయూరికి ఇవతలి పెంకులు దక్షిణదేశములో మిద్దెలకు వేసే చదరపు పెంకుల జాడగా నడమ కొంచమువంపు కలిగి యున్నవి.

తేది ఉందయాన ఏడు ఘంటలకు ఈ యూరు వదిలి యిక్కడికి నాలుగు కోసుల దూరములో నుండే నాగపూరు షహరు పది ఘంటలకు ప్రవేశించినాను. దారి ఘట్టి నల్ల రేగడభూమి, అడివి కలదు. రాతిగొట్టులేదు. బాట కిరుపక్కల కనుచూపుమేరకు చదరముగా నుంచున్నది. నాగపూరు ముందర నగలేరు అనె పెద్దవాగు దాటవలెను. నాగపూరు షహరువద్ద శీతాబులిడి అనే ప్రదేశ మున్నది. అక్కడ రెసైడెంటు ఇల్లు, తోటలు కలుగ జేసుకొని యుంచున్నాడు. చుట్టున్ను కొన్ని ఇండ్లు అంగళ్లు తోటలు న్నవి. చెన్నపట్టణపు కాపురస్తుడయిన వీరాసామిమొదలారి పోష్టాఫీసు రయిటరుగా ఇక్కడ నున్నాడు. గనుక నితో హయిదరాబాదులొ కమ్మిస్సెరియాట్ మ్యానేజరు రామస్వామి మొదలారని విహితపరచు కొన్నట్టే విహితము చేసుకొని అతని గుండా మోతీ బాగు అనే బహువసతి అయిన తోటలో బంగాళాలో దిగినాను.

ఈ నాగపూరు రాజ్యము పూర్వ పూర్వకముగా కొండరాజులది. వారి అడివిని బలము చేసుకొని కొండల దుర్గ ప్రదేశాలను ఆశ్రయించుకొని భాటసార్లు కూడా తమభూమిలో రాకుండా వుండేటట్టు ఘాతచేయుచు ద్విపాతృశువులుగా సకల విధాల నటించి ఈ రాజ్యము ననుభవించు వచ్చినారు. సుమారు రెండు వందలు ఏండ్లకు మునుపు బుద్ధోజీ అనే అతని పెద్దలు షాహురాజు సుతులు గనుక *

గమనిక, * ఈ పునా శ్రీమంతుడు పీష్వా అని చరిత్రలో ప్రసిద్ది వహించిన మహారాష్ట్ర నాయకుడు. శ్రీ శివాజీ తరువాత మహారాష్ట్రరాజు ఆయన మనమడగు షాహు పేరుకు రాజు. ప్రధానమంత్రి బ్ర్రాహ్మణు డగు పీష్వాయే నిజమగురాజు.

పూనా శ్రీమంతునికి షాహురాజు రాజ్యమును దానము చేసి జ్ఞాతులను కొండరాజ్యముల సాధించుకొని శ్రీమంతుని ఆజ్ఞకింద నుండు డని నియమించినారు. ఈ నాగపూరు సమీపర్తి అయిన భూమిని బుద్ధోజీయొక్క పెద్దలు సాధించినారు. తదనంతరము క్షాత్రధర్మము చొప్పున క్రమక్రమముగా ఈ కొండరాజులను పూర్తిగా సాధించి యీ నాగపూరును రాజధానిగా చేసుకొని రాజ్యము చేయుచు వచ్చినారు. షాహురాజు యొక్క మరియొక తెగ జ్ఞాతులు దక్షిణ రాజ్యములో ప్రవేశించి తంజావూరి సీమసాధించి దొరతనము చేయుచు వచ్చినారు. ఆషాహురాజవంశము భోసల వంశమని చెప్పబడు చున్నది. సాతారా అనె షహరు షాహురాజుకు రాజధాని. ఆ షాహురాజును డిల్లీ పాదుషా కూతురు మోహించి వివాహము చేసుకోవలె నని యుండగా ఫాదుషా షాహురాజును చంపినాడు. అతని కొడుకు చిన్న షాహురాజును ఫాదుషా కూతురు పెంచి యీ సాతారాకు రాజుగా చేసెను. వనక రాజ్యము చేయుచున్న అతని వంశస్థులకు పుత్రసంతతి లేనందున ఆశ్రయించి యున్న భ్ర్రాంహ్మణునికి రాజ్యమును దత్తము చేసినాదు. జ్ఞాతులను, కొండ రాజ్యములను పయిన వ్రాసిన ప్రకారము సాధించుకొని తాను రాజ్యదాన మిచ్చిన బ్రాంహ్మణునియొక్క ఆజ్ఞకులోబడి నడుచుకొనుడని ఉత్తరువు చేసినాడు. ఆబ్ర్రాంహ్మడే శ్రీమంతుడు.

బుద్ధోజీ రాజ్యతంత్రము చేయగా బహు ప్రబలమయిన దశను పొంది ప్రసిద్దికెక్కినాడు. ఈ బుద్ధోజీ తండ్రి యయిన రఘోజీ అనే అతనికి మరి కొందరు కొడుకు లుండగా వారికి రాజ్యము పంచిపెట్టినాడు. బుద్ధోజీ నాగపూరిని రాజధాని చేసుకొన్నాడు. మరియొక కొడుకు చందా అనే వూరిని రాజధాని చేసుకొన్నాడు. ఇద్దవు రత్నపూరును, నంది గ్రామమునున్ను రాజధానులుగా చేసుకొని రాజ్యము చేయుచువచ్చిరి.

బుద్ధోజీ దినములు మొదలుగా యింగిలీషువారు విహీత రీతిగా ఈరాజ్యములొ ప్రవేశించి అతని కొడుకులయిన రఘోజీ వగైరాలతో యుద్ధ ప్రసక్తి కలగ చేసుకొని కాలు నిలగడ చేసుకొన్నారు. పిమ్మట రాజ వంశస్థులు ప్రత్యేకముగా రాజధానులు కలగ చేసుకొన్న వారిలో కొందరు లయ మయిరి. మిగిలి యున్నవారు ఒకరిని ఒకరు విశ్వాసఘాత చేసి చంపుకొన్నందువల్ల రాజ్యమంతా యేక ముఖమయి తుదను అప్పాసాహెబు అనేవాని అధీనమయినది. అతడు యిక్కడ చేరియున్న యింగిలీషువారిని వెళ్ళకొట్టవలె నని యత్నము చేసినందున దేశ భ్రష్టుడై యిప్పట్లో మృతజీవిగా నున్నాడు. ఇప్పుడు యింగిలీషువారు రఘోజీ దౌహితృనికి పట్టము కట్టే వయసు వచ్చేదాకా రాజ్యతంత్రము తామే విచారింపుచువచ్చి కొన్ని ఖరారుమదారుల మీద విడిచి పెట్టినారు. ఆ చిన్నవానికి రఘోజీ అని పేరు పెట్టినారు. ఆఖరారుల ప్రకారము సం. ఒకటి కి తొమ్మిది లక్షల రూపాయీలు కంపెనీవారికి కట్టవలచినది. వీరి రాజ్యము గత కాలములో తూర్పున కటకము వరకున్ను, దక్షిణమున నరదానది వరకున్నూ పడమట పునా వరకున్ను, ఉత్తరమున జభ్భలపూరు దాకానున్ను ఉండినది. రఘోజీ దినములు మొదలుగా కలహ పడ్డప్పుప్పుదంతా కొంచెము కొంచెముగా తూర్పు దేశోత్తరములను కంపెనీవారు ఆక్రమించినారు. అప్పట్లో నాగపూరికి ఉత్తరమున పదమూడు కోసులమీద కొంఫిణీవారు అధికారము గాని నాగపూరు రాజుకు నిమిత్తములేదు. రామటెంకితో నాగపూరువారి రాజ్యపు సరిహద్దు ముగిసియున్నది.

యీ నాగపూరి రాజు మరాటీజాతి తంజావూరి రాజు బంధువు. ఆ రాజువంశస్థులు శ్రేయస్కాములయి యుండగా దేవ బ్రాంహ్మాణ పూజ చాలాగా చేయుచు వచ్చినారు. ఈ సరికి కంపెనీ వారి కలకటరులు నియమించిన తహశ్శీలుదారులు వగైరాలగుండా రాజ్యతంత్రము గడుచుచున్నది. రాజ్యములో నుండేవారు రాజులకు రాజ్య మివ్వడవల్ల ఏమాత్రమున్ను సంతుష్టిని పొందియుండలేదు. ఈ రాజుకు సాలుకు ఇంతమాత్రమని రూకలు కట్టే జమీందారులు కొందరు ప్రబలులుగా నున్నారు. శీతాబులిడి యనే కొండవద్ద ఇదివరకు రాజుకున్ను, ఇంగిలీషువారికిన్నీ కొన్ని యుద్ధములు జరిగినవి. చుట్టూ కొన్ని జాతుల వారి యిండ్లున్ను, ఆర్సనలు అనే ఆయుధశాల, పోస్టాఫీసు మొదలయినవి కట్టియున్నవి. పాషింజాతివారు బొంబాయినుంచి సీమ వస్తువులు తెచ్చి యింగిలీషు లాయఖు అయిన షాపులు ఉంచుకొనియున్నారు. ఇక్కడ నొక బజారు, కొన్ని హిందువుల యిండ్లు కలిగియున్నవి. యిక్కడ విడవలిపూరి అల్లే నాజూకు బహువింతగా, అతి సుందరముగా నున్నది.

యీ నాగపూరికి మూడు కోసుల దూరములో కామిటి అనే పేరుకలిగిన ప్రదేశములో యింగిలీషువారు అయిదు బటాలాలబారునున్ను అందుకు తగిన యధికారస్థులనున్ను, ఉద్యోగస్థులనున్నుంచి యున్నారు. యీ కామిటి పెద్ద బస్తీ గ్రామము. దండులో లెక్కలు వగైరాలంతా యిగిలీషు భాషతో వ్రాయవలసి యున్నది. గనుక మధ్యదేశస్థులు బహుమంది అరికాటు మొదలారులు మొదలయినవారు చేరయున్నారు. వారు స్వదేశస్థులు వచ్చినంతలో ప్రీతి చేయడము మాత్రమే కాకుండా యీ దేశస్థులకంటె ఎక్కూవగా తాము పరస్పరా భిమానము కలిగి ఒక పొట్లముగా మిత్రభావమును పొందియున్నారు. యిదివరకు జాతుల వారు యీదేశములో ప్రవర్తించుటలో స్వజాతి వైరము లేక ఒకరికొకరు ఉపకారము చేయ నిచ్చ కలిగి యుండడము వీరి దేశ సంప్రదాయము కాబోలనుకొంటిని. యిప్పట్లో యీ కామిటిదండు ప్రవేశించిన వెనక సహజముగా పరదేశానికి మరియొక దేశస్థులు కొందరు పోయిన ట్టయితే కానని యిష్ట పదార్ధాము అపూర్వముగా కనుటచేత నొక విశ్వాసము అందరికిన్ని జనియింపుచున్న దని నిశ్చయించినాను.

యిప్పట్లో హిందువులుచేసే యుద్యోగాలలో హయిదరాబాదు, నాగపూరు, జాలనా, మహినూరనే ఈ నాలుగు స్థలముల కమ్మిస్సేరైయాటు ఉద్యోగాలు ఉత్తమములుగా దోచుచున్నవి. కమ్మిస్సేరైకి వచ్చే దొరలు కత్తికట్లున్ను అట్లాగే బంగాళిదండున్ను బహుదినములు ఇక్కడ వసించి బ్యారుకునులు, వారధులు మొదలయిన పబ్లికు బులుడింగును అనే గృహశాలలు శానా కట్టించినారు. ఇటువంటి పనులకు చెన్నపట్టణపు గవునరుమెంటువారి శాంకిస ననే అనుజ్ఞ దుర్లభము గాని, బంగాళా గౌనరుమొంటు వారు ధారాళముగా అనుమోదింపుచున్నారు.

యీ శీతాబులిడి మొదలు కామిటిదండు దాకా గుర్రపుబండ్లు పోయి వచ్చేటందుకు యోగ్యముగా శాలవేసి నడమనుండే వాగులకు వారధులు కట్టియున్నవి. అయితే దారి యడారిగా నున్నది. నాగపూరు షహరులో సుమారు యిరువైవేల యిండ్లు ఉండవచ్చును. బహు చిన్నయిండ్లు. చూపుకు లక్ష్మీకరములుగా, వాసయోగ్యములుగా నుండలేదు. బాజారులు శానావున్నవి. సకల భోజన పదార్ధాలున్ను, ఆ దేశపు ఫస్త్రాలున్ను సమృద్దిగా దొరుకును. పనుల విశేషాలు తెలిసిన వారి విస్తరించి లేరు. నివసస్థులు కృత్రిములుగాని, హయిదరాబాదు షహరు వారివలెనే మాటకు మునుపు ఆయుధమును వాడేవారు కారు. స్త్రీలు పురుషులున్ను బలిస్టులుగానున్ను, రూపవంతులుగా నున్నున్నారు. సకల ఫలజాతులు దొరుకును. కమలాపండు కాలమందు బహు మంచివిగా, విస్తారముగాఇక్కడ ఫలింపుచున్నవి. సీమ అత్తి పండ్లు, సీమ పన్నీరు పూలున్ను, అమితముగా ఫలింఉచున్నవి. సారవంత మయినభూమి. అనేక తోటలు షహరుచుట్టు ఉన్నవి. అరటిచెట్లు సమృద్ధిగా వేస్తారు. వీధులు కుసంది. ఇప్పట్లో కొత్తవాల్ చేసే తురక షహరులో నడివీధిలోవేసిన వస్తువు వేసినవాడువచ్చి వెతికి యెత్తుకొనేదాకా పడి యుండేటట్లు ఆజ్ఞ చేయుచున్నాడు. సందుకు ఒక ఠాణా ఉంచియున్నది. ఈ రాజుకు ఈ విషయములో బహు శ్రేయస్సు గలిగేలాగు తోచుచున్నది. కంపెనీ వారు దొరతనములోగాని న్యాయవిచారాణలోగాని యెంతమాత్రము సంబంధపడి యుండలేదు. మారుజాతివారు కొందరు గోసాయిలున్ను యిక్కడ కోఠీలు వేసుకొని సాహుకారు పనులు గడుపుచున్నారు. ఒక మాత్రపు రత్న వర్తకమున్ను వీరివల్లనే జరుగుచున్నది. రాజునగిరిలో మాత్రము రెండు దేవాలయాలు అలంకారముగా కట్టియుంచి పూజ జరిగింపబడు చున్నది గాని మరియెక్కడను లేదు. నాలుగు సత్రాలలో రాజు అన్న ప్రదానము నిత్యము నూటికి జరిగింపుచున్నాడు. అధ్యయన పాఠశాలలు లేవు. అధ్యయనము వినవలసి యుంటే ఆ జ్ఞాన నిమిత్తమై యిక్కడ వచ్చియుండే మధ్యదేశ బ్ర్రాంహ్మణుల గుండా వినవలసినది. యీదేశస్థులు హరికధ చేయడము చేయించడము వలన ఇహ పరాలు సాధించేటట్టు నాకు తోచుచున్నది. హయిదరాబాదు మొదలుగా కట్టియుండే దేవాలయాలలో నంతా ఒక గర్బగృహమున్ను తగుపాటి ముఖమంటపమును అరటిపువ్వు చందముగా నొక స్థూపిన్ని నిర్మంపబడి యున్నది.

ఈ దేశస్థులయొక్క ఆచారము మన దేశానకు యోగ్యము గాకున్నా శాస్త్రసమ్మత మైనదే కాని వేరే కాదు. ఆచారాలు, అలంకారాలు, ఆహారాదులున్నూ దేశానికి తగినట్టుగా పెద్దలు స్మృతుల గుండా యేర్పరచి యున్నారు. అది తెలియక ఒక దేశస్థులు మరియొక దేశస్థులను అన్యాయముగా నిందింపు చున్నారు. ఇందుకు దృష్టాంత మేమంటే యీ దేశములో భోజనానికి దృష్టి దోషమున్ను, ఉదకానికి స్పర్శదోషమున్ను అక్కర లేదని అంగీకరించి అలాగే నటింపు చున్నారు. అయితే అందువల్ల విరోధమేమి? బ్ర్రాంహణులు పరిషేచనము చేయడము దృష్టి దోషము పరిహారమయ్యే కొరకే కదా? అటుగా దృష్టిదోషము కలదిని పాటింఛే పక్షమందు పరిషేచన విషయమైన ఆపస్తంబ సూత్రము వ్యర్ధమవుచున్నది. అయితే ప్రధమములో శూద్రదృష్టి కూడదని ఒక వచనము ప్రవతించి వున్నది గనుక అది పట్టుకొని పిమ్మట ఆపస్తంబులు సూత్ర ద్వారా వరిషేచన ప్రకరణము కలగచేసినా పరిషేచనమునున్ను చేయుచు శూద్రదృష్టిన్నిలేకుండా దేశమునేలే ప్రభువుల ఆదరణచేతను మధ్యదేశపు బ్ర్రాంహ్మణులు వగయిరాలు జరుపుకొనుచు వచ్చు చున్నారు. వృధివ్యప్తజోనాయ్వ్యాకాశాలు బ్రంహ్మాండానికి పంచమహాభూతాలయి యుండగా అన్నిటిని పరిశుద్ధి చేయగల జలమునకు దోషమెక్కడిది? ఒక గుంటలో సకల జారులున్ను నాల్గు రేవులలో దిగి సమకాలమందు స్నారము చేయలేదా? ఉదకము కొద్దిగానుండి స్పర్శదోషము పాటింపవలెనని చెప్పే పక్షమందు అప్పుడు సమమయిన భూతముగానుండే అగ్నికిన్ని ఆ దోషము చెప్పవచ్చునే? అగ్ని మాత్రము యెంత కొంచమైనా యెవరు తాకినా అంటు దోషల్ల్ములేక్ పోవలసిన దేమి? యిక్కడిక యాచారానికి ప్రతిగా మధ్య ద్రావిడ దేశములో పర్యుషితాన్నముతింటే పునరుపనయనము కావలసినదనిన్ని చింతపండు, తో మిరియాలు కలిసి పచనమయితే సురతో సమాన మనిన్నీ శాస్త్రము ప్రవర్చించియుండగా ఈ రెండున్ను లేకపోతే ఉష్ణవాయువు భూమిలో వసించేవారు చచ్చిపోదురు గనుక అవతార పురుషు డయిన అప్పయదీక్షితులు ఆ పదార్ధ భక్షణణకు అనుజ్ఞ ఇచ్చినారనే బలమునుబట్టి దక్షిల్ణదేశశ్థులు వాటిని పుచ్చుకొనుచున్నారా? లేదా? ఇతర దేశస్ధులు ఆ పదార్ధాలతో తమకు నిమిత్తము లేదు గనుక అహ్యాపి వాటిని నిషేధించే యున్నారు. కర్మద్వారా జ్ఞానము చంపాదించవలసి యున్నది గనుకనున్ను, కర్మములకు నియమములేక పూర్తికాదు గనుకనున్ను నానా విధములయిన్ నియమాలను ఆయాదేశములకు అనుగుణముగా స్మత్రలు ఏర్పరచినారు. ఇటువంటి ఆచారాలకు వచనాలచేతనే ప్రవృర్తిల్ నివృత్తులు కలుగవలసియున్నవి. యీ నియమాలన్ని వృధ్దాచారమువలన అనుసరించుటఛేత మనోబంధకము లయినవి. అందుకు దృష్టాంతముగా కొందరి యాచార మే మంటే నిన్నటి మడుగువస్త్రము నేటి దేవతార్చనకు పనికివచ్చునని దరింపుచున్నారు. కొందరు నాటి మడుగు వస్త్రమే కావలె ననుచున్నారు. ఇందులొ నేమి భేదము? ఒక వస్త్రము ఉతికి ఆరవేసి నాలుగు జాము లయితే మరి యొకటి రెండుజాములై యుంచున్నది. ఈరీతిగా న్యాయశాస్త్రమున్ను దేశానుగుణముగా స్మర్తులు ఏర్పరచి యున్నారు. అది యెట్లావంటే నిండు దక్షిణ దేశములో స్త్రీచాపల్యము విస్తారము గనుక తొడబుట్టిన దాని కొడుకు నిశ్చయముగా రక్తసంబందంధికుడని తెలుసుగదా! రక్తసంబంధికుడని తొచే కుమారుని కన్నా రక్తసంబంధికుడని తెలిసిన మేనల్లుడే మేలని తోడబుట్టు కొడుకే ధనానికిన్ని, కుమారునికిన్ని అధకారిగా చేయబడినాడు. నిండు ఉత్తరదేశములో స్త్రీ చాపల్యము తక్కువ గనుక శరీరాధ్యంస్మృతా జాయా స్మృ తి ప్రకారముగా అవిభక్త విషయములో బహుమంది అన్నదమ్ములున్నూ భార్యకు పతి సొత్తును గురించి అర్హత కద్దనినియమించ బడి యున్నది. మధ్య దేశములో

స్త్రీల విషయముగా చాపల్యము మధ్యమముగా నున్నది గనుక పుత్రద్వారా సొత్తులో సకల స్వాతంత్ర్యమున్ను వారికి కలగచేసి అపుత్రవిషయములోనున్ను అవిభక్త విషయములో నున్ను పోషణకు మాత్రము వారికి అర్హత కలగ చేసి సొత్తును అన్నదమ్ములకు యిచ్చినారు. మెట్టుకు దేశాచారము లంతా శాస్త్రానికి, యుక్తికిన్ని విరుద్ధములుగా నుండవు గనుక అన్యదేశస్థులపట్ల వారి యాచార వ్యహారములు, అలంకారములు, ఆహారాదులున్ను భిన్నములుగా నున్నా వారియందు భక్తి విశ్వాసములను ఉంచి వారున్ను ఈశ్వరసృష్టితో చేరినవారు గనుక మనయొక్క అన్నదమ్ముల వలెనే సకల విషయములలో నున్ను వారిని విచారింపుచు రావలసిన దని తోచుచున్నది.

నాగపూరు షహరున్ను యింగిలీసు దండువుండే కామిటి అనే ప్రదేశమున్ను బహునల్ల రేగడభూమి, వర్షాకాలములో అట్టిభూమి యందు సంచరింఛే వాడికె లేనివారు చూస్తే అది బహు అసహ్యముగా తోచబడును, వర్షాకాలములో వీధులున్ను, సందులున్ను కాలు పెట్టడానికి యోగ్యములుగా నుండవు. శీతాబులిడెలోనున్ను, కామిటిలోనున్ను జాతులవారు మాత్రము గులకరాళ్ళు కలసిన ప్రదేశముగా చూచి శీతాబులిడిలో కొంఢ సమీపముగా నున్ను, కామిటీనది వొరగానున్ను తోటలు యిండ్లున్ను కట్టుకున్నారు. యీ ప్రాంతములలో జాజిపూలున్ను మొల్లపూలున్ను దొరుకునుగాని, మల్లెపూలు లేవు. శ్రీరంగ కస్తూరి పట్టెలు చెన్నపట్టణము వదలిన వెనక కండ్లచూడవలసినది లేదు. నాగపూవు రాజ్యము మొదలుగా యీనపుడకలు దొరకవు. ఈతాకులతో శృంగారకట్టలు కట్టుకొని పనులు గడుపుతారు. విస్తరాకులు జొన్నచొప్పతోను, వెదురు దబ్బలతోనున్ను కుట్టుకోవలసినది. సన్నిగల్లు గుండు కడప వదిలిన వెనక లోకులు వాడడము లేదు. నూరవలసిన పదార్ధాలంతా రోటిలోవేసి తొక్కవలసినది. నిండా మన దేశస్థులకు సన్నిగల్లు కావలసిన ప్రయత్నము చేస్తే కలవంగుండు సంపాదించి అందు గుండా పని గడుపు కొనవలసినది. కామిటి అనే కంటోనుమెంటు దండువుండే ప్రదేశములలో నున్ను పార్శివారు ఇంగిలీషు షాపులుకూడ వుంచి యున్నారు. ఊరున్ను, బజారు వీధులతో బస్తిగా కనుపడుచునున్నా హయిదరాబాదులో యింగిలీషుదండువుండే బస్తీకళలో శతాంశలలో నొక యంశయైనా లేకుండా వున్నది. అది యెందుచేతనంటే స్వయం రాజా స్వయంమంత్రి అనే న్యాయ ప్రకారముగా రాజ్యానికిన్ని దండుకున్ను యింగిలీషు వారే యిదివరకు ఖామందు లయి యుండినందున వీరి ప్రాపును అనుసరించి వీరి దండులో లోకులు చేరవలసిన అగత్యము యిదివరకు లేకుండా వుండిపోయినది. అంతేకాకుండా యీసరికి హయిదరాబాదు ప్రభువు లేస్తే కొరగాని చేను తోలే మంచమీది మొండివానివలె గౌరవములను కాపాడుకొనుచు వచ్చుచున్నాడు గనుకనున్నునాగపూరు వారు స్నానము చేసి చలి భయమును పోగొట్టుకున్నారు గనుకనున్నుయింగిలీషువారి దాపున్ను, చెల్వమున్ను హయిదరాబాదు వారి దేశములో వెశేషముగా నున్నది.

ఇంతే కాకుండా ప్రపంచంలో ఒక మంచితో కూడా, ఒక చెడు కలిసి యుంటేనే సౌఖ్యహేతువుగా తొచుచున్నది. నాగపూరు రెసైడెంటు అయిన *

గమనిక, *Mr. Groeme.

మేస్తర్ గ్రీన్ దొరగారితో ప్రపంచ సంబంధము లయున కొన్ని మాటలు మాట్లాడుచు నుండగా ప్రపంచమే పుణ్య పాపమిశ్రమమయినదనిన్ని పుణ్యము నిర్గుణ బ్రహ్మసంబంధ మయినదనిన్ని పాపము సంకల్పద్వారా స్పష్టమయిన మాయ సంబంధమయిన దనిన్ని ఈరెండున్ను కలిసి ప్రపంచము నిర్మించబడ్డది గనుక ఎట్టి మంచిపనిలో నున్ను చెడుకలిసి యుంచున్నది. అందుకు దృష్టాంత మే మంటే హిందువులు మూఢులకున్ను, బాలులకున్ను దైవమందు భక్తి కలిగే నిమిత్తమయి బింబాల యెడల దైవత్వమును ఆరోపించుటచేత పరిపక్వ కాలాలయందు కూడా ఆ నమ్మికె నిలవబడి మనుష్యకోటిని ముంచివేయుచున్న దనిన్ని, తద్వ్య్హతిరిక్తముగా విలాయతీ క్రీస్తు మతస్థులు ఈశ్వర స్వరూపము సర్వభూతాత్మక మని ఆదిలోనే బోధచేయు తలచుట చేత మూఢులున్ను, బాలులున్ను ఈశ్వరుడు కలడనే జ్ఞానమే లేక మణిగి పోతారనిన్ని, హిందువులు ద్వితీయ వివాహము స్త్రీలకు లేక చేసుట చేత బహుమంది బాల్యమున విధవలయిన స్త్రీలు మిక్కిలి కష్టపడు చున్నారనిన్ని దానికి వ్యతిరిక్తముగా యింగిలీషు జాతి వారు స్త్రీలకు ద్వితీయ వివాహానికి అనుజ్ఞ యిచ్చుటచేత స్త్రీలకు చాపల్యము సహజముగా నుండబట్టి స్వపురుషునియెడల భయభక్తులు తక్కువయి వాణ్ని కృత్రిమముచేత చంపి వేరే పురుషుని వివాహము చేసుకొను చున్నారనిన్ని ఒక మంచిని ఊహించితే ఒక చెడు ప్రపంచ స్వభావద్వారా ఆ మంచిలో జనింపుచున్న దనిన్ని యివి మొదలయిన హేతువులచేత చెడు కలియని మంచి పని ప్రపంచములో లేదనిన్ని నిశ్చయించినాము. పయిగా ఈయనేక జగత్తుల సృష్టిని పరబ్రఃహ్మ తన చిద్విలాసార్ధ మయి చేసి నందున ప్రతిదేహానికిన్ని ప్రకృతి వేరువేరుగా నున్నది. ప్రకృతి భేదము మనసువల్ల జనిత మయినది. మనస్సు బుద్ధి జనిత మైనది. కాష్టములో అగ్ని ప్రవేశించి యున్నట్టు బుద్ధిలో పరమాత్ముని చైతన్యము ప్రతి ఫలించియున్నది. కాష్టభేదములు అనేక భేదములయి నట్టు బుద్ధిభేదములు అనేకములుగా నుంచున్నవి. ఒకరాజుకు అధీనములుగా అనేక మండలాలు ఉండుటకు బదులుగా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క రాజూ ఉండినట్టయితే బుద్ధి భేదముల చేతనున్ను, ఒకరి యుక్తిమీద నొకరు తమ బుద్ధిద్వారా మొదటి వాని యుక్తిని కారణ మగురూప దేశముగా నుంచుకొని తాము యెక్కువ యుక్తిని కలగచేసి రాజ్య తంత్రము గడుపుదురు. పయిగా తల్లి దండ్రులుగల బిడ్డలు తల్లి కొపము చేస్తే తండ్రివద్దకిన్ని, తండ్రి కోపముచేస్తే తల్లి వద్దకిన్ని యెట్లా పోవుచు వచ్చుచు నుందురో హయిదరాబాదు యింగిలీసు దండులలో నుండేవారు ఒక ప్రభువును వదిలి మరియొక ప్రభువు వద్దికి పోవుచు, వచ్చుచు నెట్లా ఆనందింపుచున్నారో అలాగే ప్రజలు సుఖపడవచ్చునని తోచుచున్నది. యీ యుక్తి చేతనె యీశ్వరుడు (విభ్రాతి విశేషాలను భూరి దక్షిన పంఛినట్టు ఆయాకాలాలలో పాత్రమెరిగి పంచిపెట్టుచు వచ్చుచున్నాడు.

యీ నాగపూరు రాజ్యానకు చెన్నపట్టణపు దండు రాక మునుపు చింతపండు దేనికి ఉపయోగమయ్యేదిన్ని తెలియదు. ఈదేశస్థులు వేడిగా కాచకనే పచ్చి మజ్జిగెగాని పెరుగుగాని పోసుకొనరు. దక్షిణ దేశపు శూద్రులు రాత్రిలో మజ్జిగ పెరుగు పోసుకుంటే యెట్లా, జలుబు చేసునని భయపడుదురో అలాగే ఒక భయము వీరికి జనియించి యున్నది. ఆహార విశేషాలు జాఠరాగ్నికి స్నేహమయ్యేదాకా ఎటువంటిదిన్ని అనుకూలిందు, స్నేహమయిన వెనక బాధించదుగనుక మేమురాత్రిలో, పగటిలోనున్ను ఈ రాజ్యములొ విశేషముగా దొరుకుటచేత మజ్జగెగాని పెరుగుగాని తాగడమువల్ల మాకు ఏమిన్ని విరొధము చేసినది కాదు. యిందుకు దృష్టాంతము వనములో సంచరించే మనుష్యులు విషజంతువుల భీతి లేక నుండే కొరకు మనిషిని చంపదగిన గరళమును, ముష్టివిత్తులనున్ను తిని జీర్ణము చేసుకొనుచున్నారు. గనుక దేశాచారమునిబట్టి వాడికె యయిన ఆహారపదార్ధాలు విడవతగ్గవి కావని తోచుచున్నది. దేశాటనము చేయడములో పోష్యులుగా నుండే దారాపుత్రాదులను కూడా తీసికొని విషయాపేక్ష నివృత్తిపొందక వచ్చినా, తృణాగ్రముగాని భగవదాజ్ఞ లేక చలించ దనే సత్యవార్త పెద్దలకుండా వినపడినట్టు రాజఠీవిగా శ్రీరాములు ఇదివరకు దోవలో నాకు జోసింపుచు వచ్చినారు. ఈషణ త్రయాలమీది యభిమానము నిరోధిస్తే అది సచ్చిదానందము కలుగచేయగల మాయద్వారా ఆశ్ఛర్యకరమయిన భయహేతువుగా మనసుకు తోచుచున్నందున అయోధ్య మొదలయిన మహాస్థలములకు స్వదేశములో నున్నప్పుడు అనుకొన్న ప్రకారము సయిపు చేసుకొని పోదామనే తాత్పర్యము ఇక్కడవదిలినది. కర్మద్వారాజ్ఞానము సంపాదించవలెననే అస్మదాదులకు నమ్మికచేత కడతేరవలసినది గనుక మిత్రబోధవత్తుగానుండే స్మృతి వాక్యముల ప్రకారము గంగాస్నానము, గయావ్రజనమున్ను చేసి స్వదేశానికి రావలెనని యున్నాను. స్వదేశ పక్షపాతము లోకులకు ఈచొప్పున కలగడానికి ముఖ్యకారణ మేమని విచారించగా ధరించి యుండే దేహము మీద యభిమానము కలవారు బాల్యాదారభ్యతమతో సహవాసపడిన వారు బహుమంది స్వదేశములో నుండుట చేతనున్ను, మనసుకు దేహము నావవంటిది గనుకనున్ను మనసనే నావ తిప్పేవాడు జాగరూకుడు గాకపోతే యేలాగు వాడస్వేచ్చగా కొంతకాలము సంచరించగా ఆబాడవాడు వాడకు అధీనమైపోవునో అలాగే యీదేహము మనసు అధీనమయి నా దేహసౌఖ్యము తనదనే భ్రాంతిని పొంది యుండుటవల్ల మనసు దేహాధీనమయి స్వదేశగమనమును నిరీక్షింపుచున్నది.

ఇటువంటి నాగపూరు పట్టణములో ఒంటికంభం డబ్బల్ టాపు కావాతులు కల డేరా ఒకటిన్ని, వంట భోజనాలకు కంబళి దేరా ఒకటిన్ని సంపాదించు కొనుటకున్ను పల్లకి మరమ్మతు చేయించు కొవడమునకున్ను ఆగష్టు పద్నాలుగుతేది మొదలు ఇరవై తేది వరకు నిలిచి నాను. హయిదరాబాదు షహరువలెనే యీషహరులో నేను ప్రవేశించిన కాలమందు కృష్ణ నవరాత్రి యుత్సవము మధ్య దేశములో పసల పొంగలికి జరిగించే ఆగమమంతా పశువుల విషయముగా నున్ను మనుష్యుల విష్యముగానున్ను జరిపింపు చున్నారు. హయిదరాబాదులో నుంచి తెచ్చిన ప్రయివేటు టెంటును అనే శిఫాయి డేరాలను ఇక్కడ వదిలి, నూతనముగా సంపాదించిన డేరాలకు గాను ఆరుగుర్రాలను కాశికి పొవడానకు గుర్రము ఒకటి కి రూపాయిలు పదిహేను లెక్క బాడిగకు మాట్లాడి జుములా గుడారాలు నాలుగు కంబళి ఒకటి అందుకు తగ్గ బొంగులు, మేకులు, కింద వెయ్యడానకు కీలుచాపలు, ఇవంతా ఆ యారు గుర్రాలమీద సాగించుకొని రావడ మయినది. హయిదరాబాదు నుంచి వచ్చిన యెద్దులకు మళ్ళీ అవి స్థలము చేరడానికి పద్నాలుగు దినముల జీతము కట్తియిచ్చి పంపించివేయడ మయినది. యింతే గాకుండా ఒక కావటి మనిషి బళువులో మూడు మంచాలు కావలసినప్పుడు తీసి మళ్ళీ జోడించేటట్టు చేయించి, డేరాలలో చెమ్మగా నున్నా పండుకొవడానికి విరోధము లేక నుండేటట్టు చేసుకొన్నాను.

ఇక్కడ నాగపూరి రూపాయి యనేది ఒక్కటే చెలామణి. రూపాయల మార్పులో హయిదరాబాదు వలె చేతికి చెయ్యి నష్టము తగలదు. దుడ్లుమాత్రము నాలుగేసి యూళ్ళకు ఒక్కొక్క మాదిరి చలామణి అవుచున్నవి. ముందు చెలామణి దుడ్ల వయినము విచారించుకొని అప్పటప్పటికి దుడ్లు మార్చుకొనుచు రావలసినది. నాగపూరు రూపాయి ఒకటి కి ఇక్కడి దుడ్లు ముప్పై రెండు దుడ్ల భేదము కొద్ది సంఖ్యవ్యత్యాస మవుచున్నది.

నేను చెన్నపట్టణము వదిలి నప్పుడు కావలసిన సామానులనుంచు కొనేటట్టు పల్లకీలో జాగా చేయవలె నని తోచినది. పిమ్మట పల్లకీ బళువుచేత దారి సాగక పోయినంతలో వేసుకొనే పరుపుకూడా తీసివేసినారు. గనుక పాలకీ దొవప్రయాణానికి చులకనగా ఉండుట మేలు.

ఇక్కడ పదమూడు సంవత్సరములుగా వాసము చేయుచు నుండే డాక్టరు వొయిల్, Dr. Wylie, గారితో మాట్లాడగా నాగపూరు మొదలుకొని జబ్బలపూరు వరకి అడివి బలిసిన భూమి గనుక అది కొత్త నీళ్ళతో తడిసి ఆ యడవిలోని ఆకులు మురిగి వాటి రసముతోనే వూట యెక్కుటచేతను ప్రతి సంవత్సరమున్ను ఆగస్టు ఆఖరు మొద్లుగా ఆకుటోబరు పర్యంతము చలిజ్వరాలు తగులు చున్నది, నీవు త్వరగా జబ్బలపూరు చేరవలసిన దని చెప్పినాడు. ఈ దేశస్థులున్ను ఆ మాట నిజమే నని ఒప్పుకొన్నారు.

హయిదరాబాదు వద్ద ఒక మనిషిని బహుదుష్ట సర్పము కరిచి నంతలో పాముచెక్క నూరి యిచ్చి యేడులూనున్ను తాగించినాను. మూడు ఝాములకు మనిషి లేచి తన యింటికి నడిచిపోయినాడు. చలిజ్వరాలకు లింగకట్టు బ్యార్కు ఇచ్చుచు వచ్చుచున్నాను. కొంత అభిముఖమయిన వెనుక భేదికి యిచ్చుచున్నాను. శ్రీరామ కటాక్షముఛేత గుణ మవుచు వచ్చినది. కూడావచ్చేవారికి నేను యిచ్చే ఔషధాలు గుణముఖానికి తెచ్చేటందున దిగేయూరిలో నొప్పిగలవారు కునుపడితే మాయజమానునివద్ద మంచి మదులున్నవనిన్ని ధర్మానికి యిచ్చుననిన్ని రహస్యముగా నా మనుష్యులు చెప్పుచు వచ్చినారు. వారు వారు వచ్చినన్ను శ్రమపెట్టసాగిరి. తెలిసి తెలియని చికిత్స చేయడమువల్ల బహుపాతక మని చెప్పి ఉన్నది గనుక, హయిదరాబాదు మొదలుగా నాపరివారము వినాగా ఇతరులకు ఆపదలేని విషయములో మందులు ఇవ్వడము లేదని నిశ్చయము చేసి ఆప్రకారము జరిపింపుచు వచ్చుచున్నాను.

దక్షిణదేశములో తిరుపతి తిరుణామలె యాత్రచేసిన వారిని అనేకులను చూడడము ఎట్లా సహజమో ఆరీతిగా ఈ నాగపూరు రాజ్యములో కాశీయాత్రచేసి దారి ఖుల్లనుకూడా చెప్పగల వారిని అనేకులను చూడవచ్చును.

ఇటువంటి నాగపూరి షహరు ఆగష్టు ఇరవై ఒకటి తేది వదిలి ఆ దిన మున రెండు ఘంటలకు కామిటి అనే యింగిలీషు దండుండే స్థలము ప్రవేశించినాను. కామెటీశ్వర ఘట్టం రేవులోను అక్కడి ఖననానదిని దోనెల కుండా ఇరవై మూడు తేది దాటి అక్కడికి ఏడు కోసుల దూరములోనుండే రామ టెంకి అనే గుహస్థలము పగలు రెండు ఘంటలకు చేరినాను. నేను ఉదయాన కామిటి వదిలి బయలుదేరేటప్పుడు మూడు ఘంటలు. అప్పుడు త్యాజ్యశేషమూ ఉండినది. దానిఫలమేమంటే నదరహీనది దాటడానికి నాలుగయిదు రేవులలోను న్నుండే పదవలకు కర్నల్ ప్యారన్ మొదలయిన దొరలు వారికింది యధికారస్థులకు తొలుదినమే ఉత్తర్వుచేసినందున కింది అధికారస్థు లందరు నాతో కూడా దోవ పంపించను నదిదాకా వచ్చిన్ని పడవవాండ్లు యీరేవున దాటుతారని ఆరేవువారున్ను ఆరేవున దాటుతారని యీ రేవువారున్ను సందేహముతో హాజరులేక తుదను ఒక యొంటికొయ్య దోనెను రెండు ఘంటలకుపట్టి దానిగుండా ఒకటి ఘంటసేపులో మూడు సవారీలనున్ను దాటించుకొని యివతల సాగివచ్చినాను. దారిలో వర్షముచేత రామటెంకిముందర కొంచముగా తడిసి నాము, సామానుకావిళ్ళు పోయినదోవ తెలియక కొంతసేపు వ్యధపడితిమె.

కామిటినుంచి రామటెంకీకి మూడు దోవలు వున్నవి. కామిటేశ్వర ఘట్టమువద్ద ఒక చిన్న శివాలయము వున్నది. అక్కడ ఖనానా అనే నదిని దాటి వచ్చేదారి రాజమార్గము. నాసామాను కావళ్ళూ మరియొక రేవున దాటి వేరేమార్గముగా పోయి కేడి అనే ఊరి వద్ద కలుసుకొన్నై. మరికొందరు పరిజనులు రామటెంకి యూరిముందర కలుసుకొన్నారు. దారి నల్లరేగడ. అడివి లేదు. మామిడిచెట్లశాల వేసియున్నది. కొన్ని వాగులు దాటవలెను. చిన్న యూళ్లు కొన్ని దారిలో నున్నవి. వాటివేళ్ళు యీ అడుగున వ్రాసినాను.

నెంబరు ఒకటి- బరోడా ఒకటి - అగోరి రెండు - కేడి మూడు - సాటక్కుర హూరా నాలుగు - రామటెంకి ఐదు.

ఈ రామటెంకి రామక్షేత్రము, షహరువంటి యూరు. కొండచుట్టుకొనియున్నది. నాల్గువేలయిండ్లు కలవు. నాలుగయిదు చెరువులున్నవి. బహుజలవసరి. తమలపాకుల తోటలు అనేకముగా మజుబూతి అయిన పందిళ్ళు పెట్టివేస్తారు. యిక్కడ తమలపాకులు బహు ప్రసిద్ధిపొందినవి. దక్షిణమున హయిదరాబాదు వరకు, ఉత్తరమున ప్రయాగవరకున్ను పోవుచున్నవి. రాజాధిరాజులు టప్పవుంచి యీ తమలపాకులు తెప్పించు కొనుచున్నారు. నెలదినములవరకు కాపాడుచు వస్తే ఆకులు చెడిపొకుండా వుంచున్నవి. యీ ఆకుల గుణ మేమంటే పండినవెనక చెన్నపట్టణపు రవేసాకులంత సన్నములుగా మృదుత్వముకలిగి వుంచున్నవి, రుచిగాను న్నుంచున్నవి. ఈయూరిలో సకలపదార్ధాలున్ను దొరుకును. ఈయూరికి అర కోసెడు దూరములో కొండలమధ్యే అంబరీషతీర్ధ మనే కోలను దివ్యోదకముకలిగి చుట్టు అనేక మంటపాలతోకూడా వున్నది. తీర్ధానికిచుట్టు కొన్ని తీర్ధవాసుల యిండ్లున్ను ఇతరల్పరిజనుల యిండ్లున్ను నాగపూరిరాజు నగరు వొకటిన్ని వున్నవి. యీ నగరు అతి విశాలముగా కట్టియున్నది. యిక్కడ బ్రంహ్మోత్సవము తిరుణామలెవత్తుగా కార్తీక శుద్ధ పున్నమకు జరిపింపుచున్నారు. లక్షజనులు చేరుచున్నారు. కొండమీద దేవాలయానికి ఏడు వందలు మెట్లు ఎక్కిపోవలసినది. దేవాలయము చిన్నదయినా సుందరముగాను, పరిష్కారముగానున్ను కట్టియున్నది. కొండమీద నరశింహమూర్తి కిన్ని వరాహమూర్తి స్వామికిన్ని రెండాలయాలు కట్టి మూర్తులను స్థాపించినారు. ఆ రెండు మూర్తులున్ను అతిగాత్రములుగా, హధాశాస్త్రముగా జీవకళ తనకు దానేకలిగి యుండేటట్టు చేసియున్నవి. దేవాలయములో సకల రాజోపచారములతో నాగపూరిరాజు సం|| ఒకటి కి నాలుగు వందలు రూపాయిల ఖర్చుతో పూజలు బ్రాంహ్మణులకుండా నడిపింపుచున్నాడు. కొండమీదనుంచి చూస్తే ఆయూరి విస్తారము చక్కగా తెలియుచున్నది. యీగుళ్ళన్నీ కాశీ దక్షిణద్వారమని ఒక వాకిలి ఉత్తరపు పక్కనున్నది. తీర్ధమునుంచి కొండ నెక్కడానికి మెట్లుకట్టి యుండడముమాత్రమేకాక ఊరిలోనుంచి కొండ యెక్కడానకు వేరే మెట్లు సుందరముగా కట్టియున్నవి. రాజునగరులో దిగి క్షౌరము తీర్ధశ్రాద్ధము మొదలయిన క్రియలు చేసినాను. ఇక్కడి తీర్ధవాసులు మధ్యదేశజనులయినా ఆచార వ్యహార భాషలు దాక్షిణాత్యులతో భేదించియున్నవి. అరువై బ్రాంహ్మణుల యిండ్లు ఇంత యూరికి ఉండియున్నవి. తీర్ధమునము చుట్టున్ను మంటపాలు, ఫల వృక్షాలున్ను విస్తారముగా నుండుట చేతను చుట్టూ కొండ అవరించుకొని యుండుట చేతనున్ను బహు తపస్విజన వాసయోగ్యముగా నున్నది. కొందరు ప్, ఉనశ్చరణ తీర్ధతీరమందు దత్తత్రేయల వారి ప్రతిమ యొకటి మహా సుందరముగా చేసి ప్రతిష్ట చేయబడియున్నది. తీర్ధమధ్యే అంబరీష మహారాజు సువర్ణ మయముగా గుడికట్టి నాడనిన్ని అది కదాచిత్తుగా ఉదకము లోపమయిన కాలాలలో అగుపడుచున్న దనిన్ని తీర్ధ వాసులు చెప్పుతారు. ఆ కొలను


ఆరవ ప్రకరణము  నర్మదా తీరం

తీర్ధ హీనముగా ఎన్నటికిన్ని కాతగ్గదిగా నుండలేదు. ఆతీర్ధము పాతాళలోక జనితమయిన దనిన్ని యేట్లా ఊర్ధ్వలోకానికి భాగీరధిన్ని ఉన్నచో తద్వత్తుగా పాతాళలోకానికి భోగవతి అనే తీర్ధమిది యని పురాణ నిశ్చితమైయున్నది. అంబరీష మహారాజు అతిధిరాకను నిరీక్షించనందున దుర్వాసుల శాపగ్రస్తుడయి యుండగా ఈతీర్ధము ఆశాపమును నివర్తింపచేసినది. అంబరీష మహారాజు ఇక్కడికి నాలుగు కోసుల దూరములో నుండే నంది గ్రామములో రాజధాని కలగ చేసుకొని దొరతనము చేసినాడు. రుక్మాంగదుని రాజధాని యెంత విచారించినా ఉయిదివరకు తెలిసినది గాదు.

ఈ పర్వతము పేరు సింధురాజ పర్వతము. శ్రీరాములు తన దొరతనములొ బ్రాంహ్మణ శిశువూయొక్క మరణ హేతువుని కనిపెట్టే కొరకు వెతకగా శూద్రుడు తపస్సు చేయుచు నుండను గనుక వాని సంహరించిన వెనుక వాడు నమ్రతను పొంది ప్రార్ధనచేసి నందున వాని లింగాకృతి చేసి తాను సీతాలక్ష్మణ, హనుమత్సమేతుండై యిక్కడ వసింపు చున్నాడు. యిది యీస్థల మహాత్మ్య పురాణ బోధితముగా నున్నది. ఈ స్థలమందు ఇరవై ఎనిమిది తేది రాత్రి వరకు ఉందినాను.

తేది ఉదయమున ఆరు పాయింట్ నాలుగు ఘంటకు లేచి అక్కడికి ఆరు కోసుల దూరములో నుండే దొంగల తళావు అనే వూరు ఒకటి ఘంటకు ప్రవేసించినాను. ఈదినమున్ను కొంచెము త్యాజ్యశేషము ఉండగా ప్రయాణ మయినందున చెన్నపట్టణము వదలిన యిన్ని దినములు వర్షాకాలములో ప్రయాణ మయి నడిచి నందుకు సెలవుగా నేటి దినమున అడవిమధ్యే ఒక ఘంటసేపు నంతతొద్ధారమయిన వర్షములో తడియడ మయినది. దారి బహుబాగా ఉన్నది. నిర్మల నది లిన వనక ఈ సొఖ్యకరమయిన యెర్రగులక యిసక గల భూమిని ఒక కోసెడు దూరమయినా చూచినది లేదు. దట్టమయిన అడివి మధ్యే భాట. గొప్ప వాగులున్ను మరికొన్ని చిన్న వాగులున్ను దారిలో దాటవలసినది. దొంగలతళావు అనే ఊరు చేరగానే జాగాకు నిర్వ్యసనముగా దుకాణాలవారు తమ తమ యంగళ్ళకు చేరి నట్టుల్గా నలభై అడుగుల నిడివిన్ని పద్నాలుగు అడుఇగుల వెడల్పున్ను గల కొట్టాయీలు కట్టి, పొయిలువేసి ప్రతిదినమున్ను గోడలు సమేతుగా గొమయముతో శుద్ధి చేసి, కొట్టాయీల ముందర గుర్ర్రాలున్నూ పశువులున్నూ కట్టడానికి మేకులుపెట్టి కొట్టి యున్నారు. ముసాఫరులు సమ్మతమయిన కొట్టాయిలో దిగవచ్చును. అయితే కావలసిన భోజనసామగ్రీలు కొట్టాయి ఖామందువద్ద పుచ్చుకోవలసినది. ఒకటిన్ని కొనకపోతే పేదలను కొట్టాయిలో నిలవనియ్యరు. ముసాఫరులకు కావలసిన సామగ్రీలు అహంపూర్వ మహంపూర్వ మని యిచ్చుచున్నారు. యీ కొండమార్గములో కృష్ణమొదలుగా స్థలమునకి శ్రమపడుచు వచ్చినవారికి ఈ విశాలము లయిన స్థలములు ఆయాచితముగా దొరకటములో నుండే ఆనందము చ్ఫెప్పితీరదు. అయితే యీ కొట్టాయీలు వీధికి యెదురుగా నిరుపక్కల వేసియుంచున్నవి. పరదా కట్టివేస్తే యింతకుమిక్కిలి అనుకూలమయిన స్థలములేదని తోచబడును. గుర్రాలకు పచ్చికసువు మోపులుగా తెఛ్ఛి ఉంచి ప్రార్ధించి తీసుమను చున్నారు. కృష్ణదాటినది మొదలు సెనగలు అతినయము గనుక గుర్రాలదాణాకు చింతలేదు.

ఈ నాగపూరు రాజ్యములో దక్షిణదేశమువలె, యర్రకందులు, నల్లనువ్వులున్ను దొరకవు. అందుకు ప్రతి తెల్లకఁదులు తెల్లనువ్వులున్నూ సమృద్ధిగా అమ్ముతారు. తిలతయిలము దొరకడము అరుదు. ఆముదము శుద్ధముగా దొరకదు. అవిశలని నువ్వులవంటి గింజలు పండుచున్నవి. వాటినూనె విప్పనూనెయున్ను దీపాలకు పోయుచున్నారు. సకల ధాన్యాలున్ను అమ్మడముగాక అన్నిటినిన్ని పిండిగా విసిరి అంగడిలో పెట్టి ప్రతియూరిలోనున్ను అమ్ముచున్నారు.

ఈరామటెంకికి ఉత్తరము బంగాళా గౌనరుమెంటులో చేరిన శిమిని తాలూకాతో చేరినిది. ఈ రాజ్యము కంపెనీవారికి స్వాధీన మయిన వెనక గవనర్ జనరలువారు జబ్బలపురిలో ఒక ఏజంటును సాగరులో ఒక ఏజంటునున్ను ఉంచి వారికింద కొందరిని ప్రింసైపాలు అసిస్తాంట్సు అని యేడుగురు దొరలను ఏర్పరచినారు. ఇంగిలీషువారి ఆధీనముగా ఈరాజ్యము కాక మునుపు యీ యడవిలలో దొంగలభయము విస్తారముగనుక ఇప్పుడు ఊరికి మూడేసి గుర్రపుసాలాలను ఠాణాలుగా ఉంచి బహుమమందిని పట్టి శిక్షించి కొందరిని దారులలో తూకుతీసి, ఉరితీసి, ఆ కళెబరాలు శిధిలము లయ్యే దాకా వ్రేలుకాడుచు నుండేటట్టు చేసినారు. మజిలీ యూళ్ళలో పరువుకల ముసాఫరులు సరఫరా నిమిత్తము ఒకకొత్తవాలునున్ను యిద్దరేసి సరఫరా బంట్రౌతులునున్ను ఉంచియున్నారు. ఇప్పట్లో మృగ భయము ఒంటిగా వఛ్ఛేవారికి మాత్రము ఉండవచ్చును.

యీ దొంగల తాళవు అనే యూరు బహు జలవసతి కలది, దొంగలు వేసేతళావు కలది గనుక దొంగలతళావు అని పేరువచ్చినది. యీ శిమినీ తాలూకా కిందవుండే గ్రామాలు యిజారాలకు తీర్చియిచ్చినారు. ఆ యిజారాదారులను పట్టేలు అని వాడు కొనుచున్నారు. యీ యూరు చిన్నదయినా ముసాఫరులకు సౌఖ్యప్రదముగా నున్నది. ఆ రాత్రి అక్కడ వసించినాను. మోది అనేఊరు ఒకటి దారిలోనున్నది. అక్కడ నాగపూరు రాజు చౌకీ ఒకటియున్నది.

తేది ఉదయాన ఆరు పాయింట్ నాలుగు ఘంటకు లేచి యిక్కడికి ఏడు కోసుల దూరములో నుండే కురాయి అనేవూరు ఒకటి ఘంటకు చేరినాను. నడిమివూళ్ళూ, నెంబరు రెండు గర్ర ఒకటి కవాసా రెండు రెల్లి మూడు రంని నాలుగు కురాయీఐదు/

దారి నిన్నటి దారివలెనే బహు అనుకూలముగా నున్నది. దట్టమయిన అడివి మధ్య భాట. ఆరు వాగులు గొప్పవిన్ని, చిన్నవిన్ని దాటవలెను. మధ్య గర్ర అనే యూరివద్ద సుందరమయిన తామరకొలను ఒకటి వున్నది. అక్కడక్కడ యాభై బారల దూరముకదాచిత్తుగా నల్లరేగడ భూమి తగులుచువచ్చును. అదిన్ని గట్టిరేగడగాని, కాలుదిగిపడే అడుసు కాదు. కురాయి అనే ఊరిళో నిన్నటివలెనే కొఠాయిలు, చావిళ్ళున్ను కట్తియున్నవి. రమటెంకి మొదలుగా ఉండే టప్పమనుష్యులు శిమినీ టప్పారయిటరు యొక్క ఉత్తవుకు లొబడ్డవారైనా నాగపూరి యిలాకా టప్పా డభేదారులు ఇద్దరు నాతోకూడా వచ్చినారు గనుక వారి పెత్తనమవల్ల కురాయి దాకా టప్పా మనుష్యులను మజిలీ మజిలీకిన్ని తెచ్చినాను. రామటెంకి మొదలు కొండ్కోసులను పక్కాకోసులని చెప్పుతారు. ఒక పక్కా కోసుము మూడు కచ్చాకోసులు. ఒక కచ్చాకోసుకు రెండు మయిలు లని యిక్కడివారు చెప్పినారు. ఈ యూరున్ను నిన్నటి యూరివలెనే నిండా బస్తీకాకపొయినా ముసాఫహరులకు సౌఖ్యము కలుగచేయడానకు సకల విధాలా చాలియున్నది. యీ నాగపూరి రాజ్యము ప్రవేశించినది మొదలుగా ప్రతియూరిలో నున్ను చెరువు కలదు గనుక జలవసతి అయిన గ్రామమే. యిక్కడి చెరుఫులలో శింగాడి కాయలని పయిరుపెట్టుతారు. ఆ కాయలలో బాదంపప్పుజాడగా విత్తులు ఉన్నవి. ఆవిత్తులను పిండిచేసి ఉపవాస దినాలలో పూరీలుగా కాల్చి ఫలహారము చేస్తారు. యధోచితమయిన తీపుకలిగి ఉన్నది. ఆ పిండి ఆరొగ్యకరమయిన దని చెప్పుతారు. ఆ యూరిలో ఆ రాత్రి వసించినాను.

తేది ఉదయాన ఆరు ఘంటలకులేచి అక్కడికి ఆరు కోసుల దూరములో నుండే చావిడి అనే ఊరు పన్నెండు ఘంటలకు చేరినాను. నడిమె ఊళ్ళు. నెంబరుమూడు - మొహగాం- ఒకటి సూకుతలా రెండు - గోపాల పూరు ఏడు. ఆ యూరిలొ నున్ను ఆరీదిగానే కొట్టాయీలు దుకాణపు దారులు కట్టి యుంచినా బస్తి అయిన వూరుగనుక బజారు వీధులలో జనసమ్మర్ధముగా నుండుటచేత మనసుకు రమ్యముగా నుండలేదు. కురాయిపూరు దాటగానే కొండయెక్కి దిగవలసినది. ఇక్కడ వింధ్యపర్వతమును ఆరోహణము చేయవలసిన దనేది ప్రసిద్దముగా నున్నది. భాటరాతిగొట్టు, నల్లరేగడ కొంతమేర కొండదిగగానే యెర్రరేగడగా నున్నది. ఆడివి మధ్యేభాట. దారిలో కొన్ని వాగులున్ను దాటవలెను. ఈ కొండ యెక్కగానే యాత్ర వెళ్ళేవారు వింధ్యవాసినికి ప్రీతిగా కొన్ని టెంకాయలు కొట్టి చూరవిడుచు చున్నారు.

ఎండు కొబ్బెరలోపల నుండే టెంకాయలు దొరుకుచున్నవి. యీ ప్రాంతములలో ఉప్పుడు బియ్యము, చింతపండున్ను ప్రియమయినా కావలసినది దొరుకును. రాతిఉప్పు విశేషముగా అమ్ముతారు. ఈయూరినుంచి శిమినీ అనే యూరిలో కేప్టన్ వాడున్ లో దొర వద్ద ముఖ్యుడుగా నుండేఋ బంగాళీ బ్రాంహ్మణుడయిన బాలకిసన్ బాబు అనే వానికి ఒక యుపచార మయిన యింగిలీషు జాబు వ్రాసి నా తయినాతిగా నర్మదవరకు ఒక బిళ్ళ బంట్రౌతున్ను, ఒక టప్పామనిషిన్ని మజిలీల ప్రకారము కూడావచ్చేటట్టు శ్రీరామ కటాక్షముచేత ఉత్తరువు తెప్పించుకొన్నాను. చావడి అనే ఊరు గొప్పది. ఆ రాత్రి అక్కడ వసించినాను.

శప్టెంబరు నెల ఒకటి తేది ఉదయాన మూడు ఘంటలకు లేచి యేడు కోసుల దూరములో నుండే నారాయణగంజు అనే ఊరు పన్నెండు ఘంటలకు చేరినాను. నడిమివూళ్ళు, నెంబరు నాలుగు. పిండిరి. ఒకటి - లక్కుగోవాడ. ఒకటి. శింగపూరు ఒకటి. హోరా ఒకటి. చౌకి, ఒకటి. నారిల్లి, ఒకటి. గంటియా, ఒకటి నారాయణ గంజు ఒకటి.

దారిలో అదివి లేకపోయినా బహుశా నల్ల రేగడ. శానా పశ్చిమ వాహిను లయిన వాగులను దాటవలెను. కొంత దూరము రాతిగొట్టుగా నున్నది. యీ యూరు యడారిమధ్యే ఉన్నది. దుకాణపు దారులు పేదలు గనుక పనిగడుపుకొనే పాటిగా కొట్టాయిలు కట్టియున్నారు. ముసాఫరులకు కావలసిన సామానులు ఒక్కటిన్ని తక్కువ లేక దొరుకును. చెరువు కలదు. జలవసతి అయిన గ్రామ మేను. ఇక్కడ యీరాత్రి నిలిచినాను.

తేది ఉదయాన ఐదు ఘంటలకు లేచి ఎనిమిది కోసుల దూరములో నుండే గణెశగంజు అనే ఊరు చేరినాను. నడిమి వూళ్ళు. నెంబరు ఐదు. బండోలు - ఒకటి - సాదక్కునూని -ఒకటి- చప్పారా -ఒకటి- గనికెతాలు - ఒకటి- కుయ్యో - ఒకటి- గణేశగంజు -ఒకటి.

ఆవూరు కొండ కిందనున్నది. దారిలో చప్పారా అనే కనుబాబస్తి యూరివద్ద భానుగంగా అనే నది దాటవలసినది. చప్పారా అనే యూరి వరకు భాట నల్లరేగడ, రాతిగొట్టు. ఆయూరికి ఇవతల కొండలు యెక్కి దిగవలెను. ఇవతల గణేశగంజు చేరేవరకు ఇరుప్రక్కల పర్వతములు కలిగి వున్నది. భాట రాతిగొట్టు, ఈవూరిలో కొట్టాయీలు యధోచితమయిన వసతిగా కట్టియున్నారు. కావలసిన సామానులు దొరుకును. ఈ యూరికి సమీపముగా ఒక నిర్మలమయిన జలముగల వాగు పారుచున్నది. ఇటువంటి వాగులు కొన్ని దారిళొ దాటవలసి యున్నవి. ఆ రాత్రి అక్కడ వసించినాను.

తేది ఏడు ఘంటలకు బయలు దేరి యిక్కడికి ఇరవై కోసుల దూరములోనుండే ధూమా అనే వూరు మూడు ఘంటలకు ప్రవేశించినాను. నడిమి వూళ్ళూ నెంబరు -ఆరు - లక్కనోడాన్ -ఒకటి- మకరాచౌకీ -ఒకటి- నెడునది-ఒకటి- జూబా-ఒకటి- ఘాఘురీ-ఒకటి- ధూమా-ఒకటి-.

దాదిలో లక్కునోడాన్ అనే ఊరు ఉన్నది. అదివరకు కొండల మధ్యే మిట్టయెక్కుచు, పల్లానదిగుచు దారినడవనలెను. భాట నల్ల రేగడ, రాతిగొట్టు. చిన్నవాగులు అనేకములు దాటవలెను. జూబానది అనే ఒక పెద్దవాగు దాటవలెను. గణేశగంజువద్ద నుండే వాగున్ను పెద్దదేను. అదిదాటి కొండవంటి మిట్టయెక్కవలసినది. లక్కునోడాన్ మొదలుగా దారి కిరుపక్క్ల కొండలు లేవు. యడారిమధ్యే భాట, అడివిలేదు. ధూమా అనేఊరు కసుబాస్థలము, బస్తీ అయినది. దుకాణం దారులు సక్తులయినా బస్తీస్థలమందు వాసముచేసేవారు గనుక బేఫరాచేత ముసాఫరుల నిమిత్తమై యెంతమాత్రమున్ను వసతి అయిన కొట్టాయిలు కట్టినవారు కారు. నేను వూరికి బయట డేరాలు వేసి దిగినాను. నాలుగు శిపాయిడేరాలు, ఒక కంబళిడేరా, ఒక యెంటి కంభం డేరా అంతు ఆరుడేరాలున్ను వేయడానికి నలభై బోయీలున్ను, ముగ్గురు కళాసులున్ను వుండిన్ని దిగిన వెనక ఒకటి ఘంటసేపు పడుచున్నది. ఈయూరిలో బియ్యము తప్ప సకలపదార్ధాలున్ను దొరికినవి. యీదేశాస్థులకు పిండిజరూరే గాని బియ్యము నిమిత్తము సిద్ధముగా ఉంచడము లేదని చెప్పినారు. బహు ప్రయత్నముమీద నాపరిజనుల కందరికిన్ని చాలేటందుకు ఎక్కువగానే శ్రీరామ కటాక్షముఛేత బియ్యము తెప్పించినాను. ఈయూరు జలవసతి యయినది కారు. తమలపాకులు ఈ యూళ్ళో దొరకడము కష్టము.

శ్రీరామ కటాక్షమని అప్పుడప్పుడు నేను వ్రాయడములో పరబ్రంహ్మ యొకవస్తువే జగత్కారణమై యుండగా ఒకరొకరు ఒక్కొక్క అవరారముర్తి నామమును నావలేనే ఆశ్వయించి ఆరాధన చేయడమేమని శంక తొచును. అందుకు సమాధాన మేమంటే - పరబ్రంహ్మ సర్వాంతర్యామిగానున్నా చందన కాష్టములో ప్రవేశించిన అగ్ని పరిమళించినట్తు సృష్టిస్థితి సంహారాలకు కారణమయిన త్రిమూర్తులలో ప్రతిఫలింఛే పరమాత్ముదేమె లోకశిక్షార్ధమై అనేకావృత్తులు అవతరించిన సత్వగుణ ప్రధానుడయిన శ్రీమన్నారాయణ మూర్తిలో ప్రతిఫలింఛే పరమాత్ముడేమి, అస్మదాదులలో ప్రతిఫలింఛే పరమాత్ముడేమి, అంతా ఒక్క వస్తువయినా ప్రతిభాతిని ఇచ్చే వస్తువిశేషాలచేత ఒక ప్రకృతికి మరియొక ప్రకృతి పూజ్యమయినది. ఆ న్యాయప్రకారమే రామకృష్ణాద్యవతారాలు అస్మదాదులకంటె అతిపూజ్యము లయినవి గనుకనున్ను నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానంద స్వరూప మయిన పరబ్రహ్మము పూర్వన్యాయాలచేత బాధకమున్ను సాధకమున్ను వొక్కటే అయినందున రూపాంతర, నామాంతరాలను బట్టి ఆరాధన చేసుటఛేత బాధకను లేక సాధకముగానే యుండవచ్చును గనుకనున్ను ఈశ్వరలీలావతారకధలు శ్రవణము చేసుటలో ఏలీలచేత భక్తులను మిక్కుటముగా పరమాత్ముడు హర్షించి, పోషించి నాడని వారివారికి తోచబడుచున్నదో ఆయా యవతారనామమే మిక్కిలి ముఖ్యమని యెంచి దాన్ని వారు వారు వృద్దాచార ప్రకారము ఆశ్రయించి భక్తిపూర్వకముగా ఆరాధింపుచున్నారు. తామసగుణప్రధానుడయి త్రిమూర్తులలో ఒక్కడు న్నయిన సాంబమూర్తికి తమోగుణముచేత సంహారము చేయుచు రావలసినపని యొకటే మాయాయుక్త మయిన పరబ్రహ్మ వల్ల నియమింప బడ్డందున సంహారము చేయడానికి తా నున్న రీతి చాలు నని అవరారా లెత్తినాదు కాడని తోచుచున్నది. అందువల్ల అతనికి అవతారాలు, తత్సంబంధము లయిన నామాలున్ను లేవు. లీలా విశేషలు చేత కలిగిన నామాలు మాత్రము అనేకములుగా అతనికి కలిగి యున్నవి. రక్షించ వలసినపని సాత్విక మూర్తి యయిన శ్రీమన్నారాయణమూర్తికి నియత మయియున్నవి గనుకనున్ను అందులో దుష్టులకు శిష్టులను హించ పెట్టడము ఇష్టముగా నుంచున్నది గనుకనున్ను విష్ణువు మాత్రము అనేకవతారాలు లోకశిక్షార్ధమయి యెత్తి, సాధువులను రక్షించి తదపేక్షయా దుష్టులను పరిష్కార ముగా నిరూపింపుచు యధోచితముగా శిక్షించి శిక్షానంతరము మళ్ళీ రక్షింపుచు వచ్చినాడు గనుక అతనికి అనేకావరాతాలెత్తవలసి వచ్చినది. ప్రతియవతారానికిన్ని ఒక నామము గలిగిన దని నాకు తోచుచున్నది. రజోగుణముచేత సృష్టించడానికి నియమింపబడిన బ్రంహ్మకున్ను సాంబమూర్తి వలెనే అవతారాలు అగత్యము లేనందున ప్రపంచములో ఒక యవతారము నయినా వహించ లేదు. సాంబమూర్తి సంహార నిమిత్తమయి లేక పోయినది. తద్ద్వారా అతనికి నామాంతరముకూడా లేకపోయినదనిన్ని తోచుచున్నది. ఈరీతిగానే పరబ్రంహ్మ యీ బ్రంహ్మాండములో కొంత ప్రదేశమందు క్రీస్తు యెడల ప్రతిఫలించి ఆభాతి పాత్రద్వారా యెక్కువయి ఆ దేశస్థులకు అతను శిక్షకు డయినాడు. ఆ ప్రకారమే మహమ్మదు వగయిరాలు ఆయా దేశాలకు పూజ్యులయి యీశ్వరసమము లయినారు. మనము రామకృష్ణాద్యవరారాలను లోకశిక్షకములుగా భావించి ఆ నామోచ్చారణ చేసి ఆరాధించినట్టు ఇతరదేశస్థులు అక్కడ అవతరించిన వారిని ఆరాధింపుచున్నారు. ఏ పేదుతో ఏ మూర్తినిగాని, ఏవస్తువునుగాని యేరీతిగా ఆరాధించినా ప్రతిగృహీత అంతర్యామి యొక్కడే గనుక ఏమిన్ని బాధకము లేదు. ఈయుక్తిచేతనే గురుబ్రంహ్మ గురువిష్ణు అనే ప్రశస్త వాచకాలు ఏ ప్రకృతి పట్టితే ఆ ప్రకృతే ఆ ప్రకృతే సమస్త వాగులు, నదులున్ను వివరించి వ్రాయుచు వచ్చినానుగదా! ఊరికే దాటవలెనని నేను వాయుచు వచ్చిన వాగులంతా కాలినడకగా దాటతగ్గవని తెలిసి యుండవలసినది. నిన్న దాటిన జూబా నదివద్ద ఇంరుపక్కల రెండు కొయ్యలు నాటి రెండు కొయ్యల తలలకు ఒక కప్పితాడు కట్టినారు. తపాలాకట్ట రాగానే ప్రవాహకాలాలలో పక్కకు ఒక హరకాతా వంతున ఇరుపక్కల కాచియుండి తపాలా కట్టను కప్పికి కట్టివేస్తే యివతలి పక్కవాడు యీడ్చుకొనేటట్టు చేసి నారు. రాయచౌడువద్ద ఒక కొండ యెక్కిదిగవలసినది. యీ రాయచౌడు జలవసతి కలది. పెద్ద చెరువు కొండను కట్టగా చేసుకొని యున్నది. యీకట్టమీదనే అప్పాసాహెబు అనే నాగపూరి రాజును కొంఫిణీవారు ఖయిదు చేసి తీసుకొని వచ్చుచుండగా తప్పించుకొని పరుతెత్తిపోయినాడు. ఇక్కడ దిగడానకి అంగళ్ళవాండ్లు, యధోచిత వసతి గలవిగా చావళ్ళు కట్టి పెట్టినారు. అందులోనే దిగినాను. సకల పదార్ధాలు ముసాఫరులకు దొరుకును.

ఇటువంటి కాలు దిగబడే అడుసు, రాతిగొట్టు, ముండ్లు, వొరుగుడు, కాలువలు, వాగులు, కొండలెక్కి దిగడము, వీటివల్ల కలిగే ప్రయాసను ఓర్చి అర్ధముకన్నా దేహముమీది యభిమాన మెంత జఘన్యునికిన్ని యెక్కువగా నుండవలసినది సహజమై యుండగా కొంచానికి ఒకరితో నొకరు కలహమాడే బోయజాతి ఒక జతగా కలిసి యేకవాక్యతను పొంది దోవ సాగించడము ఎందువల్ల నని ఊహించితిని. అర్ధాపేక్ష చేత ఓర్చుచున్నా రందామంటే లొభులవద్ద అర్ధము గుంజలి స్తే వారి దేహమును బాధించి అర్ధాకర్షణ చేస్తారు. అప్పటికి అర్ధాపేక్షచేత సామాన్యముగా మనుష్యులు దేహకష్టమును మిక్కుటముగా ఓర్చజాలరు గనుక ఒకరు కాకుంటే ఒకడు యిటువంటి మిక్కుటముగా ఓర్చజాలరు గనుక ఒకడు యిటువంటి మిక్కుట మైన కష్టము వచ్చినప్పుడు నాకు రూకవద్దబ్బా అని వెనక తీసిపొవును. రాజాజ్ఞచేత సహిస్తారందామంటే మిక్కుటమయిన కష్టవు మోత కలిగి నప్పుడు ఒకడుకాకుంటే ఒకడు ఇప్పుడు దేహానికి ఆశక్తి వచ్చినది, యీ కష్టపుమోత నేను మోయలేనని తిరగబడితే రాజయినా ఏమిచేయగలడు? గనుక అదిన్ని కారణముకాదని తొచినది. అప్పటికి నేను ఊహించిన కారణ మేమంటే సమానులలో ఉత్తమ కీర్తిగలవారు కావలెననే శ్రుతివాక్యర్ధ ప్రకారము ప్రతి పురుషునికిన్ని సమానులలో ఉత్తము డనిపించుకో వలెననే ఆసక్తి సకల విధాలా వుండును గనుక యీ బోయీలు ఒక జతగా కలిసి నప్పుడు మంచి మోతేగాడయితే వారిలో ఉత్తమకీర్తి జనింపుచున్నది, గనుక ఒకరు యీప్రయాసలకు ఓర్చనేరక వెనకబడ్డా, మోతలో జబ్బుపడ్డా జతలో నుండే యితరులు అప్పుడేచాలాగా వెనకబడ్డ వానిని నిందింపుచున్నారు. గనుక సమానులవద్ద విందింపబడే దాని కన్నా దేహము పపోవడము మేలని తోచి యిటువంటి ప్రయాసను ఓర్చి సమానులచేత స్తుతింపబడక పోయినా, నింద యయినా లేక నుండవలెననే తాత్పర్యముతో ఈ కష్టములను ఓర్చి యీబోయీలు మోత సాగింపుచున్నా రని నిశ్చయించినాను. యీకొద్ది పరువు కల మనుష్యులెకే సమానులలో యోగ్యుడనిపించుకోవలెననే అక్కడ యింత ఉండగా తదపేక్షయా ఉత్తములకు పరంపరగా ఎంత ఉండవలసినది? యిది యోచించి సమానులను నిష్కారణముగా అవమానపరచి నంతలో ప్రమాదము వచ్చుననిన్ని సమానులను ఆదరించి గౌరవము చేస్తేగాని తాను ఉత్తమశ్లోకుడు కానెరడనిన్ని, తెలిసి ప్రపంచములో ప్రవర్తింపుచు రావలసినది. యీ యూరిలో యీ రాత్రి వసించినాను.

తేది ఉదయాన ఐదు పాయింట్ నాలుగు ఘంటకు లేచి యిక్కడికి ఆరు కోసుల దూరములో నుండే పిప్పర అనే ఊరు పన్నెండు ఘంటలకు చేరినాను., మధ్యనున్న ఊళ్ళు,

నెం.ఎనిమిది జంజూరికే భావనా - ఒకటి - చెన్రూ - ఒకటి - రొతినాలా-ఒకటి దారి రాతిగొట్టు, నల్లరేగడ సాతుగడ అనేఏడు కొండలు ఎక్కి దిగవలసినది. మోతినాలా అనేవాగు మధ్యే ఉన్నది. ఆ వాగు ఇవతల యేడుకొండలు యెక్కి దిగేవరకు కొంత అడివి కలిగి యుంచున్నది. కురాయి అనే యూరు మొదలుగా లొగడ యింగిలీషు వారికి నాగపూరు రాజు యిలాకా దారులతో అనేకవృత్తులు యుద్ధ ప్రసక్తులు కలిగినది. గనుక అప్పట్లో విస్తారముగా అడివికొట్టి భాట వెడల్పుచేసి చక్కపెట్టినారు. అది యిప్పట్లో లొకోపకారముగా నున్నది. యీ పిప్పర అనే ఊరు మజిలీలాయఖు అయినదే. దుకాణందారుల కొట్టాయీలలోనే దిగినాను. బియ్యము అతి ప్రయత్నముమీద దొరికినది. చింతపండు ఎంత ప్రయత్నము చేసినా సాధ్యమయినది కాదు. రామటెంకి మొదలు రాతివుప్పు మాత్రము దొరుకుచున్నది గనుక మెత్తగా విసిరి శాకములలో కలపవలసినది. ఈదేశములొ చింతపండుకు బదులు ఆముచూరు అనే మామిడివరుగు వాడుకొనుచున్నారు. నింమపండ్లు మాత్రము పట్టితావున దొరుకుచున్నవి. యీయూరిలో యీ రాత్రి వసించినాను.

తేది ఉదయాన ఐదు ఘంటలకులేచి యిక్కడికి నాల్గు కోసుల దూరములో నుండే తిలవారా అనే ఊరును దారిలో నర్మదా మహానది దాటి తొమ్మిది ఘంటలకు ప్రవేశించినాను. ఇక్కడ రెండు వందలు మంది యెక్కే పడవ ఒకటిన్ని యాభై మంది యెక్కే చిన్న పడవ ఒకటిన్ని ఉన్నది. ముందు యిటువంటివి ఈ నర్మదామహానది రేవులో అనేకములుగా నుండినవి. అయితే యిటు తర్వాతను రెండు సంవత్సరముల కిందట అకస్మా త్తుగా ప్రవాహము వచ్చి రేవున నున్న పడవలన్ని కొట్టుకొని పోయినందున ఇప్పుడు కంపెనీవారు రెండు చేయించి వేసి ఘాటు సుంకము సంవత్సరము ఒకటి కె ముప్పై రూపాయీలకు ఒక ఆసామీకి గుత్తకిచ్చినారు. వాడు మనిషికి ఒక పయిసా, గుర్రానికి ఒకటి అణా ఈవంతున హాశ్శీలు తీస్తాడు.

ఈనది పశ్చిమ వాహిని సుమతి అనే పశ్చిమ సముద్రతీరపు గ్రామమువద్ద సాగరసంగమవుచున్నది. యిక్కడికి ఆ సంగమప్రదేశము రెండు నెలల ప్రయాణ మున్నది. అమరకంటక మనే ప్రదేశములో వెదురుపొద మధ్యే యీనది పుట్టినది. ఆ మహాస్థలము ఇక్కడికి ఇరవై దినాల ప్రయాణముంచున్నది. ఈనది మహిమ యేమంటే ధృవమహారాజు యాగము చేసినప్పుడు ఋత్విక్కులుగా వచ్చిన మహాపురుషులు యాచనమీద సాంబమూర్తిని తపస్సుచేత సంతొషపెట్టి భూకిలో ఎక్కడా నదులు లేక నుండగా పశ్చిమ వాహినిగా ఒక నది కావలె నని ప్ర్రార్ధించి సాంబమూర్తియొక్క అర్ధ దేహాన్నే ప్రవహించేటట్టు చేసుకొన్నారు.

.

తద్ద్వారా యిది పురషనది అనిపించి కొనుచున్నది. యీ మహానది మహిమ పురాణములో పన్నెండు వేల గ్రంధములచేత విస్తరించి చెప్పియున్నది. యిందులో పుట్టే శిలలంతా లింగాలుగా ఆరాధింపుచున్నారు. ఈ లింగాలు హిందూస్తాని మాటతో అర్మదు కాకంకరునబు శంకరు అంటారు. బెడాఘాటులో కృష్ణవర్ణపు లింగాలు పుట్టుచున్నది. ఆ స్థలము ఇమ్మడికి నాలుగు కోసుల దూరము. ఓంకారంఘాటులో శ్వేతలింగాలుపుట్టుచున్నవి. ఆ స్థలము ఇక్కడికి పన్నెండు దినముల ప్రయాణము. ఈ తిలవారాస్థలములో ఒక దృష్టాంతము నాకండ్ల చూచినాను. అది యేమమంటే వేసిన అస్థులు సగము ముక్కాలువాసి శిలామయము లవుచున్నవి. గనుక క్రమముగా అంతా శిలామయము లవుచున్న వనడానకు సందేహములేదు. ఈ మహానది పశ్చిమవాహిని కావడముచేత అత్యాశ్చర్యముగా పది యిరువై తాటిచెట్ల పొడుగు గల కొండల నడమను భేదిచుకొని ప్రవహించుచున్నది. యీ వేదుక బెడాఘాటుకు పోతే చూడవచ్చును. ఈ మహానది ఇక్కడ నిండా వెడల్పు లేదు. ముప్పై సంవత్సరముల కిందట రఘోజీబాబాతల్లి బహుస్తొమముతో కూడా యిక్కడికి యాత్రకు వచ్చి ముందర నర్మదానదిని పూజచేసి దాటనలసిన దని ఘాటువారు చెప్పగా మా నాగపూరి వద్ద ఖనానా అనే నదిపాటి వెడల్పు లేదే పూజ యేమని అలక్ష్యపెట్టినందుకు, నాటి సాయంకాలమే యివతలి గట్టుకు వచ్చి నదివోరగా దిగివుండగా గడియలో అమితముగా ప్రవాహము వచ్ఫి ఆమె సర్వస్వాన్ని హరించి మరుసటి గడియలో ప్రవాహము తీసిపోయి యధాస్థితికి వచ్చినది.

ఈ తిలవారా అనె ఊరిలో పన్నెండు ఇండ్లవారు కృష్ణాతీర మందలి యాంధ్ర బ్ర్రాంహ్మణులు, ఇండ్లు కట్టుకొని బహుకాలముగా ఈ దేశపు బ్రాంహ్మణులతే సంబంధ బంధుత్వములు చేయకుండా అధ్యయనము చేయుచు పాఠము చెప్పుకొనుచున్నారు. రామటెంకి వదిలిన వనక ఈ యూరివరకు బ్ర్రాంహ్మణ దర్శనమే అయినది కాదు. ఈయూరిలొ వసతి అయిన కొట్టాయి కట్టియున్నారు. నేను బ్ర్రాంహ్మణ యింట్లో నే దిగినారు. సకల పదార్ధాలు దొరుకును. ఇక్కడ క్షౌరము మొదలైన పితృక్రియలు చేసినాను. నేటి దారి నల్ల రేగడయినా ప్రయాసకాదు, అడివి, రాతిగొట్టు, లేదు.

ఈ మబానది దాటిన వనక రంగిడి జాతి బ్రాంహ్మణులని ఒక సమూహమును చూచినాను. వీరికి గాయత్రీ జపము కలిగియున్నా వ్యస్థలేని నడితిని నడిచేవారు. ఈదేశపు కఠాడీ బ్రాంహ్యణులున్ను, చిత్వావనీబ్రాంహ్మణులున్ను వీరిని గర్హింపుచున్నారు. పిమ్మట వ్రాసిన రెండు తెగలవారితో మన దేశపు బ్ర్రాంహ్మణులు సాహచర్యము కలిగి సహపంక్తిగా భోజన మజ్జనాదులు గడుపుచున్నారు. చిత్పావనీవారు పునా శ్రీమంతుని జాతి. కరాడీవారు శక్తిపూజార్హులు. ఈ యిరుతెగలవారినిన్ని పరశురాముడు బ్రాంహ్మణుల యెడల జిహాస తోచి మశీదులలొవుండే శవాలను లేపి చిత్సావనీలను పుట్టించి కాష్టముల గుండా గడుపుకొన్నాడు. తెగకు ఏడు గోత్రాలవంతున వీరు పద్నాలుగు గోత్రాలవారు వీరిని కొంకణదేశస్థులని అనుచున్నారు.

నర్మదకు ఇవతలుగట్టు మొదలుగా విక్ర శకము ప్లవనామ సంవత్సరము బహుళ పాడ్యమి మొదలుగా పున్నమి వరకు మాసమనిన్ని వ్యహరింపుచున్నారు.

వింధ్య పర్వతమును కురాయి అనే వూరివద్ద ఆరోహణము చేసినట్టుగా లోగడ నేను వ్రాసినాను. అదే వింధపర్వతమునకి ఆరంభ మనిన్ని యీ భూమి యావత్తున్ను వింధ్యపర్వతము మీదిదే ననిన్ని చెప్పుతారు. రాయచౌడువద్దనున్ను పర్వతము మహాదేవ పర్వతమనిన్ని అచ్చట వరప్రసాదము చేయగల ప్రసిద్ధమయిన యొక శివస్థలము ఉన్నదనిన్ని చెప్పుతారు. యీ తిలవారాలో రెండుమూడు దేవాలయాలు చిన్నవయినా సుదరముగా కట్టియున్నవి. బ్రాంహ్మణ పూజ లేదు. గోసాయీల అధీనములో నున్నవి.

కురాయి అనే వూరు మొదలు నర్మదా నది పర్య్హంతము లోగడి కాలాలలో దారి నడిచి సురక్షితముగా చేరడము బహు దుర్లభము అందుకు దృష్టాంతముగా యిక్కడి దేశస్థులు సాహిత్యాలుగా ఈమధ్యవుండే ఊళ్ళపేళ్ళ కని కొన్ని చేసినారు. వాటి తాత్పర్యము ఈ యూళ్ళు గడిచి నర్మద చేరితే తల్లికడుపులోనుంచి మళ్ళీ పుట్టినట్తు అనుకోవలె నని యున్నది. ఆ భయాలు యింగిలీషు దొరతనము వచ్చినవెనకలేదు. ఈవిషయములలో వీరి దొరతనము మేలని అనిపించుకొన్నా, యిక్కడి బ్రాంహ్మణులు నాగపూరు రాజు సాగరారాజు మొదలయినవారు బాగా వుండగా మేము రాజాన్న భోజనము చేస్తూ వస్తిమి, వారున్ను వారికింది అధికారస్థులున్ను పుష్కల మయిన జీవనాలు మాకు కలగచేసి యిచ్చుచు వచ్చిరి, ఇప్పుడు పస్తుగానున్నా మంటారు. దొంగతనముపోతే దొంగను పట్టి శిక్షించే వరకు సొమ్ముపోగొట్టుకొన్నవారున్ను, సాక్షులున్ను ఇల్లు వాకిళ్ళువదిలి భత్యము కట్తుకొని తిరిగి చస్తాము. తుదకును శిక్షబలము లేదు. కొంతకాలము గిడ్డంగిలో దొంగనుపెట్టి వదలురారు. వారు మళ్ళివచ్చి కన్నమువేచి దొంగిలింపుచున్నే ఉంటారు, దొంగిలించిన దానికి సాక్షి తెమ్మంటే యెక్కడనుంచి తెఛ్ఛేది? అని యీ విషయాలలో ఇంగిలీషు దొరతనము బహు హింసగా నున్నదని వ్యసనపడు కొంటారు. యీ దృష్టాంతము చూడగా ఒక మంచి వూహించి పనిచేయ బోతే ఒక చెడు ఆ మంచిలోనే ఉత్పత్తికావడము నిశ్చయమేనని తోచుచున్నది.

హయిదరాబాదు మొదలుకొని తియ్ని దొండకాయలు విస్తారముగా దొరుకుచున్నదవి. యీతిలవారాఘాటు లోపల వరకాయ లని ఒకదినము కాయలు చూచినాను. పచ్చిపోకకాయలవలెనే ఆకారముకలిగి దొండకాయలవలె గీతలు తీరియున్నది. వంటచేసి బోజనముచేస్తే పువ్వులు రాలని లేతవంగ పిందెల రుచితో సరిపోలియున్నవి. ఈకాయలు బహు ఆరోగ్యకరములనిన్ని రుచిగానున్న వనిన్ని రాజాధిరాజులు నలభై, యాభై ఆమడదాకా విందులకు గుర్రపుసవారీలను తాపాలుపెట్టి తెప్పించు కొంటారు గాని తమ స్థలములో వృద్ధి అయ్యే యోచన చేయడము లేదు. యీ కాయలకు బీజము గడ్డలు, వాటిలో మొలక మొలిచి తీగెలు అల్లి కాయలు కాచుచున్నవి. ఆవాల నూనె నాలు గయిదు మజిలీలుగా దీపపుచమురుకు దొరుకుచు వచ్చు


ఏడవ ప్రకరణము  జబల్ పూరు

చున్నది. చింతకాయ తొక్కుకు నేను ఆవనూనె పోయించినంతలో అతి రుచికరముగా నున్నది. ఈయూరిలో ఎనిమిది తేది మధ్యాహ్నపర్యంతము వుంటిని.

తేది మధ్యాహ్నముమీద మూడు నుంచి నాలుగు వరకు ఘంటకు బయిలుదేరి యిక్కడికి మూడు కోసుల దూరములోనుండే జబ్బల్ పూరు అనే షహరు ప్రవేశించినాను. దారి బాగా ఘట్టనచేసి కాలువలకు వరధులు కట్టియున్నవి. దారికి ఇంరుపక్కలా దూరాన చిన్న కొండ లున్నవి. చిన్న యీ గుళ్ళు, బావులు, గుంటలున్ను కొన్ని దారికి ఇరుపక్కలా కట్టి యున్నవి. యీ గుళ్ళూ స్తూపీలు చెరిసగానికి పగలగొట్టిన శిగ గల టెంకాయ చందముగా కట్టియున్నవి.

యీ జబ్బల్ పూరు అనే షహరు లోగ డిదినములలో యధోచిత మయిన కసుభాస్థళము. ఘర్డామండల మనే రాజధాని కింద నుందినది. ఆ రాజధాని నిజాంషాహు అనే కొండరాజుది. షుమారు ఇరవై ఏండ్ల కిందట పూనా శ్రీమంతుడు భోసల వంశస్థులు సాధించిన రాజ్యములు గాక ఇంకా కొండరాజుల కిందనుండే ఘర్డామండలము మొదలయిన రాజ్యములను తియ్యవలెనని సర్వ ప్రయత్నమున్ను అప్పుడప్పుడు చేస్తూ వచ్చినందున బ్ర్రాంహ్మణ జాతిమీద ఒక ద్వేషము ఈకొండరాజుకు జనించి బ్ర్రాంహ్మణులని తన రాజ్యములో కనుపడ్డ వారి నంతా సంహరింపుచు వచ్చినాడు. ఈ నిజాంషాహు రాజును సాధించడము పురాశ్రీమంతునికి ప్రయాసగా నుంచు వచ్చినది.

ఆ కొండరాజుకు రాజధాని యయిన ఘర్డామండల షహరును చుట్టు కొని నర్మదానది ప్రవహింపుచు వున్నది. యీనది మహాత్మ్యమేమంటే గతకాలములో భృగు మహాముని యీ ప్రాంతమున తపస్సు చేయుచు నుండగా నది అతనికి కొంత దూరములో ప్రవహించినది. భృగుమహాముని నా సమీపముగా వచ్చిప్రవహించక వరగడగా పోవలసినదేమని మనసులో నొచ్చుకొన్నంతలో తత్పూర్వపు ప్రవాహమును వదిలి భృగుమహాముని సమీపముగా వచ్చి ప్రవహించినది. పూర్వము ప్రవహించి మళ్ళినచోటుకువరకు ఇప్పటికిన్ని బెడాఘాటువద్ద నవనీతము వంటి తెలుపు నునుపు వర్ణములతో భూమియావత్తున్ను శిలామయమయి యున్నది. ఆ శిలను ఇక్కడి దేవస్థళాలలో ప్రతిమలుగాచేసి యుంచుచున్నారు. నర్మదాలింగాలు తెచ్చి అమ్మే గొసాయీలు ఈశిలలతో కోడిగుడ్డుచందముగా లింగాలుచేయించి స్యయంభువులని దేశాంతరాలలో అమ్ముచున్నారు. మెట్టుకు వీరు ఎంత కృత్రిమముచేసినా నర్మదశిలలు శివస్వరూపాలు అనేమాట సత్యము గనుక ఆ లింగాలను అరాధనచేసేవారికీ అభ్యుదయమే కలుగును.

ఈకొండరాజు అపారమయిన ధనముగలవాడు గనుక అజేయుడుగా నుండినాడు. ఆరాజు వేసుకొన్న నవరత్నఖచితమయిన పాపాను, పాపోసు, ఒకటి ఇపుడు సాగరరాజు సంస్థానములో నున్నది. దాని వెల నిశ్చయించను ఇప్పటికిన్ని అశక్యముగా నున్నది. యిట్లావుండగా గోవిందపంతులు, గంగాధరబావా, బాలాజీబావా అనే కరాడి బ్ర్రాంహ్మణులు ముగ్గురున్ను పరస్పర రక్తసంబంధము గలవారు, వారు పునా శ్రీమంతుని ఆజ్ఞను ధరించిన సరదారులు. వారు నర్మదానదిని అనేక సహస్ర సువర్ణపుష్పములతో ఆరాధించి ఆ నదికటాక్షము సంపాదించి దాన్ని కాలినడకతొనే దాటి ఘర్డామండలంజిల్లా తీసుకొని కొండరాజును పట్టుకొన్నారు. ఆ కొండరాజు తాను పట్టుబడకమునుపే తన ద్రవ్యమంతా ఆ నర్మదకు ప్రీతిగా అందులోవేసి పగవారికి లభించకుండా చేసినాడు. ఆ ముగ్గురు సరదారులున్ను సాగరాయనే యూరును తమకు రాజధానిగా చేసుకొని అబ్బాసాహెబు అనే తమ వంశస్థునికి ఈ రాజ్య్హమిచ్చి తమ్ము నాశ్రయించియుండిన ఆంధ్రదేశపు బ్రాంహ్మణులకు తిలవారాఘాటు మొదలయిన స్థలములలో పుష్కలమయిన జీవనాలు కలగచేసి అక్కడి కాపురస్తులుగా చేసినారు. ఆ అబ్బాసాహెబు రవంత మెత్తని వాడయినందున కొన్ని సమయములలో తమ క్షాత్రధర్మము చేత పునాశ్రీమంతుని సంతొషపెట్టి యీ నర్మద సమీపప్రతి అయిన యీజబ్బల్పూరుతొ చేరిన భూమిని నాగపూరు రఘోజీబాబా తీసుఒన్నాడు. పిమ్మట పన్నెండు సంవత్సరముల కిందట రఘోజీ వగయిరా రాజులతో యింగిలీషు వారికి కలహము పొసగినంతలో వారు ఈ జబ్బల్పూరునున్ను యిక్కడికి సమీపములోనుండే సాగరా మొదలయిన భూములనున్ను ఆక్రమించుకొని రాజ్యము చేయుచున్నారు. మళ్ళి నాగపూరు రాజ్యమును రఘో దౌహిత్రునికి యిచ్చినా ఈ జబ్బల్పూరు పరగణాలు పూర్వము సాగరారాజుది గనుక సాగరారాజుకు పుత్ర సంతతి లేక అతని భార్య రాజ్యము చేయుచు నుండి యుద్ధ ప్రసక్తి పెట్టుకోకనే రాజ్యమును యింగిలీషువారి అధీనము చేసి సాలుకు వీరు యిచ్చిన లక్షరూపాయిలు తీసుకొని భోజనము చేయుచున్నది గనుక ఆపె తరపున ఈ జబ్బల్ పూరు రాజ్యమును తాము పుచ్చుకొన్నందున ఈ రాజ్యము నాగపూరితొ చేరినది కాదని కంపెనీవారు అనుభవింపుచున్నారు.

రఘోజీ రాజు యీ రాజ్యూమును కట్టుకున్నది మొదలు ఈ జబ్బల్ పూరు బస్తి అవుచూ వచ్చినది., యిప్పుడు యింగిలీషువారి దొరతనమయిన వెనక బజారు వీధులు రాజవీధులున్ను విశాలముగా లక్షణముగా కట్టించి బహు సుందరముగా నిర్మలముగానున్ను పెట్టుకొని యున్నారు. సారవత్తయిన భూములు గనుక అనేక తోటలు వూరి చుట్టున్ను వేసియున్నారు. ఇప్పుడు సివిల్ అధికారముచేసి దొరలు ఊరికి రెండు ఘడియల దూరములో సుందరమయిన తోటలు వేసి బంగాళాలున్ను కట్తుకొని శాలలు, నీడకోసం రెండుపక్కలా పాతిన చెట్ల వరుసలు, వేసి వేడుకగా కాపురమున్నారు. ఇక్కడ నుండే సుమారు ఒక పటాలం దండున్ను అందుతో చేరిన డాక్టర్ మొదలయిన దొరలున్ను మరియెక పక్క తోటలో బ్యారుకమలు కట్టుకొని కాపురమున్నారు. సకల పదార్ధాలు దొరుకును. కండ గలిగి గొప్పవిగా నుండే దోసకాయలు విశేషముగా అమ్ముతారు. పలవర కాయలు ఇక్కడ శానా దొరుకును. ఇక్కడనుంఛే దేశాంతరమందలి ప్రభువులకు సారిపోవు చున్నారు. బారెడేసి నిడువుగల బీరకాయలు, అమితముగా అమ్ముచున్నారు. బట్టలు పాత్రసామాను ఆయుధ విశేషాలున్ను నయముగా అమితముగా అమ్ముచున్నారు.

ఇక్కడ గౌనర్ జనరల్ యేజెంటువుండే స్థలము గనుక హాజూరనిపించుకొని చుట్టుపక్కలావుండే మైహరు రాజు రీమారాజు సాగరారాజు మొదలయిన వారి వకీళ్ళు కాచుకొని యున్నారు. అక్కడక్కడి తాలూకాలు విచారణచేసే ప్రి స్ పాల్ అసిష్టాంటునులు, జడ్జీ అధికారముకూడా జరిగింపుచున్నరు గనుక నున్ను వారి తీర్పులమీద యేజేంటుకు అప్పీలు చేయవచ్చును గనుక నున్ను చుట్టుపక్కల ఉండే అనేక రహితులతోను ఈబస్తీ నిండియున్నది. కాకరు ప్రసాదు అనే సాహుకారు ఒకడు కానుపూరు కాపురస్తుడు ఇక్కడ వసింది సాహుకారు పనులు జరిగింపు చున్నాడు. యేజంటు అయిన స్మిత్తు దొరగారు అత్యున్నతమయిన మొగలాయి సంతనతో దాపుకలిగిఉన్నా నాపట్ల శ్రీరాముల కటాక్షముచేత ఫరవానా ఒకటి దారిలో నాకు సకలక్షేమములున్ను కలిగేకొరకు హయిదరాబాదు కర్నల్ నాగపూరు మేస్తర్ గ్రీందొరవలెనే వ్రాశియిచ్చి కాశివరకుకూడా వచ్చేటట్టుగా చప్పరాశి అనే బిళ్ళబంట్రోతును ఒకని తయినాతి చేసినారు.* యీ జబ్బల్ పూరు చేరేవరకు నాతొగూడా వచ్చినవారందరున్ను సురక్షిరముగా ఉన్నా యిక్కడ చేరిన రెండు మూడుదినములకు వారిలో నలుగు రయిదుగురకి అడివి గడిచివచ్చినా తత్సంబంధ మయిన చలిజ్వరాలు తగిలినవి. యీ యూరిలో చిన్నపడుచులను కొందరిని తెఛ్ఛి అమ్మేటట్టువిన్నాను. యీ బస్తీలో పన్నెండు తేదీదాకా నిలిచినాను.

తేదీ ఉదయమైన మూడు పాయింట్ నాలుగు ఘంటకు లేచి ఇక్కడికి ఆరు కోసుల దూరములో వుండే గోసలపూరు అనేవూరు పది గంటలకు చేరినాను. మధ్యనున్న ఊళ్ళు, నెం.తొమ్మిది కొట్రా ఒకటి సహాగి ఒకటి వరియెడునది ఒకటి సన్నగరు ఒకటి రేవురా ఒకటి కూసుమీరు ఒకటి బాడాగల్ ఒకటి గోసలపూరు ఒకటి.

*జబ్బల్ పూరులొ తాలూకా ప్రించిపాల్ అసిస్తాంటు అయిన కర్నల్ స్లీమన్ గారు శిఫారసు ఉత్తారా లిచ్చి కాశీవరకు చప్రాసీనిచ్చి పంపినారని వ్రాత ప్రతి వంద ముప్పై మూడు పుటలో నున్నది. ఈ స్లీమన్ గారు తరువాత హిందూదేశాన్ని గురించి అనేక గ్రంధాలు వ్రాశారు.

దారి యిక్కడ పరంగి కొండకు* పొయ్యేమార్గమువలె సడక్కు అనే ఘట్టనవేసి యిరు పక్కలా మామిడి చెట్లు అశ్వద్ధాలు శాల@ వేసియున్నది. ఆ చెట్లు చూడగా వేసి యాడాది అయినట్టు తోచుచున్నది. దారి వెల్లిడిగా యిరుపక్కల తోపులతో వరిపయిరులతో శృంగారముగా ఉన్నది. చిన్న వాగులకు వారధులు కట్టినారు. పెద్దవాగులకు కల్లుగాళ్ళతో ఇనపమేకులు బిగించి దారిని కోయకుండా యెక్కి దిగడానికి సులువుగా మెట్లు కట్టియున్నవి. యీచెట్లు శాలపెద్దగాపెరిగితే సూర్యరశ్మిపయిన పడదు. గుర్రపుబండ్లు వేడుకగా నడిచి పోవచ్చును. ఈ దారులనున్ను శాలవృక్షాలనున్ను కాపాడడానికి రీమా అనే యూరిలో ఒక దొరను తగుపాటి సిబ్బందితో మార్గ విచారణకర్త హోదా కలగచేసి ఉంచియున్నారు. ఈ దారుల విషయమై బంగాళా గౌవర్ మెంటువారు చేసే వ్రయాణానికి ఈశ్వరుడు సంతొషించునని తొచుచున్నది. దారిలో పెన్నగరు అనే వూరికి ముందు ఒక పెద్దనది దాటవలసినది. యిక్కడ రెండు దోనెలు ఉన్నవిగాని నాకు కాలునడకగానే యుండను. పెన్నగరుకు ఇవతల ఒక పెద్ద వాగు దాటవలచినది.

ఈ గోసలపూరు పెద్దది. దుకాణాలు కొట్టాయిలున్ను కట్టి యున్నారు. అవి వసతివికావు గనుక వూరికి సమీపాన నుండే ఒక కొలను వొడ్డున డేరాలు వేసుకొని దిగినాను. అది రమణీయమయిన జలము గలది, ఫలవృక్షాలతోనున్ను అవరింపబడియున్నది. ఒక గొసాయి యిక్కడ శివప్రతిష్టచేసి కొన్ని మంటపాలు కట్టినాడు. అందులొ కొన్ని నూతన సృష్టములయినా యీశ్వరాజ్ఞ చేత శిధిలములయియున్నవి. యీరిలో సకల సకల పరార్ధాలున్ను పుష్కలముగా దొరుకును. చింతపండు మిరపకాయ యీ రెండు వస్తువులున్ను బహు ప్రయత్రముమీద కాశీ పర్యంతము దారిలో నా

*పరంగికొండ అనగా చెన్నపట్నంలో సెంట్ తామస్ మౌంటు. దీనికి పోయే రాజబాటకే మౌంటురోడ్డు అని పేరు. ఆ కాలానికే ఇది చాలా అందముగా ఉండేది.

@శాలవేసి యున్నదనగా నీడకోసం రోడ్దుకు రెండు పక్కలా చెట్లువరుసగా వేయబడనవని అర్ధం.

భ్రాంహ్మణ పరిజనానికి చాలేటట్టు జబ్బల్ పూవు బస్తీలో సంపాదించి బియ్యముతోకూడా రెండు బాడిగె గుర్రాలమీద గుర్రము ఒకటి కి పది నాగపూరి రూపాయలవంతున కాశికి బాడిగ మాట్లాడి యేర్పరచి తీసుకొని వచ్చినాను. ఈ యూరిలో ఈ రాత్రి నిలిచినాను.

తేది ఉదయముయిన నాలుగు ఘంటలకు లేచి యిక్కడికి ఎనిమిది కోసుల దూరములో నుండే సలమాబాదు అనే ఊరు రెండు ఘంటలకు చేరినాను. నడిమిఊళ్ళు, నెం|| పది బజారి - ఒకటి - మహీరా- హోందన్నయనది - సోమిరిల్యా ఒకటి - పరవా - శిహోరా ఒకటి - క్మానం రేవరా - మోహలా - ఒకటి - ధనుగ్రా - ఒకటి - చప్రా - ఒకటి - సలమాబాదు ఒకటి. బోయీలు యీదినము యెండగొట్తు పడినందున చప్రా అనే వూరివద్ద వారు వంటచేసుకొని భోజనముచేసి వచ్చే దాకా నాలుగు గడియలు నిల్వడమయినది గనుక మజిలీ చేరడానికి ఇంత ప్రొద్దు పోయినది. దారి నిన్నటివలె సౌఖ్యప్రదముగా శాలవేసి యున్నది. దారిలో హోరాఅనే యూరు బహు గొప్ప కసుబా, బస్తీ అయినది. సుందర మయిన మామిడితొపులు గుంటలు చెర్వులు చిన్న దేవాలయాలు జప మంటపాలున్ను కలిగి యున్నది. యీ యూరివరకు అడివిలేదు, ఫెల్లడిగా నున్నది. పైరుభూమి, దానికి ఇవతలి మజిలీ యయిన సలమాబాదు వరకు దారికి యిరుపక్కలా తేలికె యయిన అడివి కలిగి యున్నది. జబ్బల్ పూరు మొదలుగా ఈమజిలీ యూరివరకు భాట కిరుపక్కలా దూరములో చిన్న కొండలు కనుపడుచువచ్చుచున్నవి. యీ సలమాబాదులో ఉన్నట్టు ఈయూరిలోనున్ను ఒక కొత్తవాలు ఉన్నాడు. సకలపదార్దాలున్ను దొరుకును.

ఈఆచార నియమములు మనోబంధహేతుకము లనిన్ని అభావే విరక్తి అనే సత్యవచన ప్రకారము సాగని పక్షమందు ఆ నియమాలమీద విరక్తి పుట్టగలదని యనడానకు ఒక దృష్టాంత మే మంటే, మేము చెన్నపట్టణమూ వదలి వచ్చిన వెనక హైదరాబాదుకు ఇవతల నుండే మల్లుపేట అనే ఊరివరకు బ్రాంహ్మణయిండ్లు వుండి కష్టపడితే

వ తేది ఉదయాన నాలుగు ఘంటలకు లేచి యిక్కడికి ఆరుకోసుల దూరములో నుండే మురువారా అనే గళగ్రామము పది ఘంటలకు చేరినాను. నడిమి వూళ్ళు, నెం.పదకొండు తెవురి ఒకటి నయ్యగా ఒకటి లక్కెపటారి ఒకటి పిప్పరవేడు ఒకటి దేవుడి ఒకటి జింజరి ఒకటి మురువారా ఒకటి. దారి నిన్నటిదారివలెనే శాలవేసి రమణీయముగా నున్నది. పయిమజిలీవూరు ముందరనే కాటిని అనే నది దాటవలసినది. యిక్కడ దోనెలు వేసి యున్నా నేను కాలినడకతోనే దాటినాను. దేవురి అనేవూరివద్ద నేవారు అనే నదిఒకటి దాటవలసినది. అదిమొదలుగా మురువారా చేరేవరకు చిన్న పర్వతాలు దారికి నిరుపక్కలా సమీపమున నున్నవి. పొడిచెట్లు అడివివలనె యున్నవి. ప్రతిదినమున్ను అక్కడక్కడ మనుష్యులు భాట మరామత్తు చేస్తూ శాలగా పెట్టియుండే చెట్లను పశువులు తినకుండా చుట్టు అడివికొయ్యలతో గ్రాదులు కట్టుచునున్నారు.

నాగపూరు మొదలుకొని ముఖ్యముగా జబ్బల్ పూరు మొదలు గానున్ను సకల స్త్రీలున్ను వృద్దులతొ గూడా బహు పనితనముగా అనేకవిధాలుగాచేసి వెండివలె శుభ్రముగా నుండే కంచు పాంజేబులున్ను మోచేతులకు పొడుగుగా ఆలోహముతోనే చేసిన కడియాలున్ను ధరించియున్నారు. భూమి సారవంత మయినది గనుకనున్ను దేహము పృధ్వీభూత సంబంధ మయినది గనుకనున్ను స్త్రీలు పురుషుల వలెనే కండపుష్టిన్ని దేహవర్ణమున్ను కలిగి యున్నారు. దేహ మాధ్యంతమున్ను పావడ పయిట రవికె వీటి చేత నిండుగా కప్పియుండడముగాక పురుషదర్శన మయినంతలో ముఖమునకుకూడా ముసుగు యీడ్చి కప్పుకోవడానకు మాత్రమే యిక్కడి స్తీలకు తెలుసును గాని దాక్షణాత్యులవలె చిన్నలు వన్నెలు కులుకులు బెళుకులు చేయడానికి యేపాటిన్ని తెలియదు. పనిపాటలు చేసే సామాన్య పురుషులు అందరున్ను తల మట్టుకు యిమిడేటట్టు ఒక కుళ్లాయివలె యేర్పరచి దానిచుట్టూ విశాలముగా ఒక చట్టము వెదురు దబ్బలతోనున్ను మదారపు ఆకులు మోదుగాకులతో నున్ను గొడుగు చందముగా యేర్పరచుకొని యెండకు వానకున్ను తలకు వేసుకొని నడుస్తూ బయలులో పనిపాటలు చేస్తూ వుంటారు.

యీ మజిలీ వూరు రహితు పుష్టిగలది. నేను దుకాణాలలోనే దిగినాను. యిది నదీతీరము. సకల వస్తువులు ముసాఫరులకు దొరకును. యీరాత్రి యీయూరిలో వసించినాను. జబ్బలపూరులో వుండే తపాలు అఫీసు మ్యానేజరు కుషుచందరుదత్తుబాబు అనేవాణ్ని మంచి తనము చేసుకొని, ప్రతిచౌకిలో నుంచి ఒక తపాలుమనిషి వఛ్ఛేటట్టు జాగ్రత్త చేసు కున్నాను. హయిదరాబాదు మొదలు యీ తపాలు మనిషి కూడావచ్చుటచేత ఖర్చువిస్తారముగా తగులుచూ వచ్చినా యీ పరరాష్ట్రములో దారి తప్పితిమి అనేమాటలేదు. దారి యెటుపోవలసినదని ఒకణ్ణి అడగవలచినది లేకుండా దారితెలిసి నడుస్తూ రాబట్టి సౌఖ్యముగా వున్నది. యీమురువారాలో యీ రాత్రి వసించినాను.

వ తేదీ ఉదయాత్పూర్వమే మూడు ఘంటలకు బయలుదేరి పది ఘంటలకు యిక్కడికి ఐదు కోసుల దూరములో వుండే సభాగంజు అనేయూరు చేరి అమావాస్యగనుక వంటభోజనములు దుకాణాలలో చేసుకొని రెండు ఘంటలకు బయిలుదేరి అక్కడికి ఐదు కోసులలో వుండే గుణవారా అనేయూరు సాయంకాలము ఆరు ఘంటలకు చేరినాను. నడివూళ్ళు, నెం.పన్నెండు. చెక్కాం జాకాహి ఒకటి సభాగంజు ఒకటి సయగాం ఒకటి గుణవారా ఒకటి నుంచి ఐదు వరకు

సదరహి మురువారా వద్ద ఒక నదిని దాటవలెను. నేను దోనెలున్నా వాటితో దాటితే కాలమాన మవుచున్నదని మొలలోతు నీళ్ళలో కాలినడకగానే దాటినాను. దారి నిన్నటిదారివలెనే సడక్కువేసి చక్కబరచి యున్నది. అయితే కొంతమేర యెర్రగులక దొరకనందున బంకమట్టితో గట్టించియున్నది. తడిసినతావులో అడుసుగా నుంచున్నది. అయినా కాలు దిగబడడము, జారడమున్ను లేదు. చెక్కా అనే గ్రామము మొదలుగా గుణవారా మజిలీవూరువరకు దారికి నిరుపక్కల సమీపమందు సుందరము లయిన కొండలున్నవి. అవి యథోచితమైన నునుపుగలిగి అందముగా నున్నవి. కుడిచేతిపక్క కొండ బురుజుకు వెంబడి బురుజును కట్టినట్టు యేర్పడియున్నది.

మనుష్యులు సకల స్వరూపాఅలున్ను ఏర్పరచడానకు ఈశ్వరుడు ఒక మాదిరిని సృష్టించుచు వచ్చుట సిద్ధము గనుక కోట బురుజులను మనుష్యులు కట్టను ఈ కొండను సృష్టించి చూపించినట్టు తొచుచున్నది. భాట కిరుపక్కల పొడిచెట్లుగాని అడివిలేదు. దారిలో విస్తరించి వరిపయిరు వేసియున్నది. పచ్చికె దట్టముగా కోమలముగా పొడుగుగానున్ను పెరిగేభూమి సారవత్తమయినది గనుక నిర్మల మొదలు శింధిఅనే వూరిదాకా భూమి పచ్చికబాగా పట్టివున్నందున నున్ను మృదువయిన తియ్యని నల్ల రేగఘమట్టి గలిగి యున్నందుననున్ను అంతమేరయున్ను సారవత్తయినదని చెప్పవలెను. పయిగా ఆ భూమి చెట్లబలం ఇతరభూమి చెట్లకులేదు. అయితే వానకాలమున అక్కడ వసించేవారికి కాలు దిగబడుచున్నది గనుక ప్రయాస విస్తారము. ఒక విధమయిన సౌఖ్యము ఈశ్వరుని కృపవల్లకలిగితే ఒక విధమయిన కష్టమున్ను కలిగి యుంచున్నది.

సభాగంజు అనే గ్రామము మజిలీస్థలము. దిగను అంగళ్ళు వసితిగా వుండవు. అన్నిపదార్ధాలున్ను దొరుకుచున్నవి. గుణవారా అనేవూరిలో అంగళ్ళు దిగను మంచి వసతిగా నున్నవి. చెక్కాఅనే వూరు మొదలుగా మయిహరు రాజు రాజ్యము. అతనికింది అధికారస్థులు గొప్ప ముసాఫరుల సరఫరాయి నిమిత్తమై కొత్తవాలు మొదలయిన మనుష్యులను వుంచియున్నారు. ఈ గుణవారాలో ఆరాత్రి వచించినాను.

తేదీ ప్రొద్దున ఆరు ఘంటలకు లేచి పది ఘంటలకు నాలుగు కోసుల దూరమందుండే మైహరు అనే రాజధాని చేరినాను. మధ్యనున్న యూళ్ళు. నెంబరు పదమూడు, గురయ్యా ఒకటి. మైహరు - ఒకటి.

యీ మైహరు యధోచితముగా బస్తీ అయినది. దారి నిన్నటి దారివలె సడక్కు వెసి యున్నది. వానవల్ల అక్కడక్కడ దారి చెడిఉన్నందున మనుష్యులు మరామత్తు చేయుచున్నారు. నిన్నటివలె కొండల నడుమ దారి పోవుచున్నది. అడివిలేదు. ఈమైహారులో జబ్బల్ పూరు యిలాకా రహదరుల విచారింఛే దొర ఒక బంగాళాకట్టి తన ఠాణాను ఒక డభేదారునితో కూడా వుంచి యున్నాడు. రాజు కోటలోపల వున్నాడు. ఉత్తరువు లేకనే ముసాఫరులను కూడా లోపల పోనివ్వరు. వూరి చుట్టూ మంచి చెరువులున్ను గుంటలున్ను ఉన్నవి. అందులో దామరవేసి యున్నది. ఊరివద్ద పర్వతాగ్రమందు ఈ రాజు తన యిష్టదేవత యయిన శక్తికి గుడి కట్టించి యున్నాడు. ముసాఫరులకు గాను సదరహిబంగళాదగ్గిర ఒక చెరువు కట్టమీద సరాయి అనే ఒక పెద్ద కొట్టాము కట్టించి యున్నాడు. అందులో నొక అంగడి యున్నది. అందులోనే ముసాఫరులు దిగవలసినది. మరియొక గుంట గట్టున ఒక పెద్ద శివాలయ మున్నది. అందులో ఒక మధ్యరంగ మున్ను చుట్టూ తాళ్వారము, మండువా వసారా,న్నూ నయిన అంతస్థులతొ రెండుస్తూపీలున్ను అందులో రెండు అరలున్ను నాల్గు దిక్కులలో నాల్గు జపమంటపాలున్ను కట్టి యున్నవి.

నేను కన్యాకుమారి మొదలుగా ఇదివరకు దేశసంచారము చేసి నంతలో దాక్షినాత్యులకున్ను ఉత్తర దేశాస్థులకున్ను ఆహారాదులున్ను ధైర్యస్థైర్యములున్ను బింబారాధనలున్ను వీరందరున్ను శ్రుతిస్కృతి పురాణములను అనుసరించిన వారైనా, భేదించి యుండుటకు కారణమేమని యూహించగా నా బుద్దికి తోచినది యేమంటే యీ బ్రహ్మాండము కోడిగుడ్డు చందముగా పరబ్రహ్మ యాజ్ఞచేత రజ్జువుచేత విడబడ్డ బొంగరమువలెనే కొన్ని బ్రంహ్మాండాలకు జ్యోతిర్బూతముగా యేర్పరచబడి యుండేసూర్యునికి ఒక ప్రదక్షిణము ముప్పై ఆరు పాయింట్ నాలుగు దినములు చిల్లర గడియలకు చేసేది గనుక ఆ సూర్యునికి ఈబ్రంహ్మాండములో అభిముఖ ప్రదేశముగా వుండేదాన్ని మనవారు నిరక్షదేశమని చెప్పుతారు. యింగిలీషువారు దానినే లయను అని చెప్పుతారు. అక్కడ మధ్యాహ్న కాలానికి ఆయా వస్తువులమీద వాటి గాత్రము లో లయింపుచున్నది గనుక ఆప్రదేశము మిక్కిలి ఉష్ణకరమైనది. ఆ ప్రదేశము మొదలు ఉత్తరధృవుని పర్యంతము తొంభై భాగలుగా యీ గణితజ్ఞులు భాగించి యున్నారు. ఆవుత్తర ధ్రువుణ్ని యింగిలీషువారు నార్త్ పోల్ అను చున్నారు. ఆ నిరక్షదేశంకు మొదలు భాగకు భాగకున్ను ఉష్ణము తగ్గుచు వచ్చుట వలన అక్కడికి నిండా దూరపు ప్రదేశము శీతము శీతతరము అతిశీతతరము న్నవుచు వచ్చింది. ఆ ప్రకారము భూమిని భాగించి నంతలో కన్యాకుమారి తొంమ్మిదో భాగలోవున్నది. చేన్నపట్టణము పద్నాలుగు భాగములోనున్ను హయిదరాబాదు పద్దెనిమిది భాగలలోనున్ను నాగపూరు ఇరవై రెండు భాగలోనున్ను అగరా, ఆగ్రా, ఇరవై ఆరు భాగలోనున్ను డిల్లె ఇరవై తొమ్మిది భాగలోనున్ను వున్నవి. గనుక కన్యాకుమారి మొదలు సుమారు పదిహేను భాగలోనుండే నెల్లూరి వరకు భూమి ఉష్ణకరమయిన వెన్న యెట్లా ఉష్ణానికి క్రమక్రమముగా పలచన అవుచున్నదో తద్వత్తుగా ఆయుష్ణ భూమిలో వసించే వారి హృత్కమలము మృదుభావమును పొందే కొద్దిన్ని వారియొక్క ధైర్య స్థైర్యాలు జాఠరాగ్ని, బలహాని ద్వారా తక్కువ అయివుంటున్నది. ఉష్ణముష్ణేన శీతలా అనే న్యాయప్రకారము జాఠరాగ్నికి ఉష్ణభూమిలో దీపనశక్తి మట్టుబడ వలసినది సహజమేగదా? జాఠరాగ్ని మందగతిని పొందియుండుట చేత కన్యాకుమారి మొదలుగా నెల్లూరి వరకు వసింఛేవారు త్వరగా జీర్ణదశను పొందతగిన తేలికె ఆహారాలైన తమిదెల పుల్లటి యంబలి సద్దిఅన్నము కూటినీళ్ళు గంజి, మజ్జిగతేట, మిరియాల చారు మొదలయిన బక్ష్యములను పుచ్చుకొనుచు వస్తారు. యీభక్ష్యములు బలకరములు గానందున హృత్కమలాన్ని దృఢతరము చేయనేరక యున్నవి. హృత్కమలము దృఢకరము కానందున బిడ్డపాపలను విడచి ఎట్లా దూరసంచారము పోయ్యేది? పోతె మనగతి అక్కడ యేమవునో, యిక్కడ వీరిగతి యేమవునో అని భయపడి దేశ సంచారమును దాక్షిణాత్యులు బహుశ, మానుకొను చున్నారు, ఇంతేకాకుండా యెప్పుడు ధయిర్యము కొంచమవుచున్నదో అప్పుడు చంచల్యము జనింపుచున్నది గనుక చాంచల్యము ద్వారా వస్తు విషయములుగా నున్ను స్త్రీ బోగాలు మొదలయిన వాటి విషయముగానున్ను నిండా భోగింఛే శక్తిలేక పోయినా అలాటి విషయములను భోగించవలె నని తత్సంబంధమయిన అఫెక్ష యెక్కువ అవుచు వచ్చుచున్నది. అటివంటి వారున్ను ఒక పద్దతిని పొంద వలసినది. యీశ్వరునికి అగత్యము గనుక అతడు తన చైతన్యము యెక్కువగా ప్రతిఫలించిన అప్పయదీక్షితులు రామానుజాచార్యులు ఆళ్వారాదులు అప్పర సుందర మాణిక్యవాసులు మొదలయిన వారిగుండా ఆ దేశపు యద్వద్విబూతి మత్సత్వం అనే సాటిరాజులగుండానున్ను ధనికులగుండానున్ను వారున్న భూమిలో వూరూరికి సమీప వత్రిగా ఒక్కొక్క ప్రదేశాన్ని పుణ్యభూమియని యేర్పరచి ఆ ప్రదేశాలలో మనుష్యుల భక్తిని ఆకర్షింఛేపాటి దేవాలయాలను బహు ద్రవ్యవ్వయముతో అమానుష కృత్యముగా వుండే టట్టు కట్టించి అందులో బింబాలకు మంత్రమూలకముగా మహత్యమును కలుగజేసి ఆ బింబాలకి చేసే రాజోపచారములు మొదలయిన ఆరారాధనలు యీ చాంచల్యము కలిగిన జనులకు సుఖకరములుగానున్ను ఉత్సాహకరములుగా నున్ను ఆపేక్షితములుగానున్ను వుండేటట్టుచేసి యీ సుఖాపేక్షగుండానయినా అట్టిదేవాలయాలకు మనుష్యులుపోవుచు ఉపచరింపుచు అక్కడక్కడి విభవాలను ధనవ్రయము గుండా వృద్ధిపొందింప చేయుచురాగా వారికి ఒక భక్తిజనితమై తరించడానకు హేతువు అయివుంటున్నదని చేసినాడు. ఉత్తరదేశమున పద్నాలుగు నోల్ల్ భాగమొదలు సుమారి ముప్పై యేభాగపర్యంతము వసింఛేవారు, తత్పూర్వ దేశాస్థుల ఆపేక్షయా వుష్ణశల్మనమైన భూమిలో వశించేవారు గనుక నెల్లూరు మొదలుగా ఢిల్లీపర్యంతము వుండేవారికి జాఠరాగ్ని క్రమక్రమముగా పటుత్వముకలిగి వుండేటందున రొట్టె, నెయ్యి, పాలు, దూదుఫేడాలు పప్పు చక్కెర ఘనీభవించిన పెరుగు మొదలయిన దీఘ్రముగా జీర్ణము కాదగ్గ బలమయిన ఆహారాదులు పుచ్చుకొనుచున్నారు. తద్ధ్వారా హృత్కమలము యధోచితమయిన దృఢభావాన్ని పొంది ఉష్ణదేశస్థుల ఆపేక్షయా ధైర్యస్థైర్యాలు యెక్కువ కలవారై దేశాతనము చేయడానకున్ను గురుకుల వాసముచేసి శాస్త్రవిచారణ చేయునున్ను సామర్ధ్యము కలవారై యున్నారు. గనుక శాస్త్ర విచారణద్వారా జ్ఞానము ఉదయించక పోయినా భక్తి మాత్రము సహజముగా ఈశ్వరునిపట్ల ఉదయించ వచ్చును గనుక మూఢులకు ఉత్సాహాకరములైన నృత్యవాద్యగీతాలు రుచికరములయిన ప్రసాద తీర్ధాలున్ను లభ్యములు కాగల దేవాలయాలు ఉత్తర దేశములో అడుగడుకు విశేష ద్రవ్యవ్రయముచేత సృష్టించవలసిన అగత్యము లేదని ఉత్తరదేశపు పూర్వీకులైన ఉత్కృష్ణులు నియమించినవారు కారు, కాని ఒకవేళ శాస్త్రవిచారాణచేసి అందువల్ల భక్తి మాత్రము సంపాదించడము కూడా అందరికి సాధ్యము కాదని ఊహించినవారై యిక్కడి మూఢులు తరింఛే నిమిత్తమై యీ ఉత్తరదేశములో నున్ను యధోచితమైన ద్రవ్యవ్రయముతో బహు దూరానికి బహుదూరమున ఒక్కొక్క నదియందు ఒక్కొక్క మహాత్మ్యము నిర్ణయముచేసి ఆనదీ తీరమందు కొద్ది అయిన దేవాలయాలు నిర్మింఛేటట్టుచేసి వాటిలోని బింబాలకు యధోచితమయిన పూజలు ఉపాయముగా జరిగించేటట్టు చేసినారు. గనుక అందువల్ల యీ శీతదేశపు మూఢులు కొంతదూరము కాయాన్ని క్లేశపెట్టి దేశ సంచారము చేయడానికి సమర్ధులు గనుక ఆ ప్రకారమే ఛేసి అట్టి నదులలో స్నానముచేసి అట్టి దేవాలయాలలోని బింబాలను ఆరాధించి కడతేరుచు వచ్చుచున్నారని తొచుచున్నది. అయితే మూఢవ్యతిరిక్తులుగా వుండే వారు ఈ నదుల స్నానాలున్ను చేయ నక్కర లేదే అని శంఖ తోచును. మూడ వ్వతిరిక్తులకు శాస్త్రమువల్ల కలిగే తెలివి పై పాచిని తొసిన జలమువంటిది గనుకనున్ను మళ్ళీ మూఢత్వము పాచివలెనే కమ్ముచూ వచ్చును గనుకనున్ను మూఢవ్యతిరిక్తులు మూఢుల అనే క్షయా పెద్దలు గనుకనున్ను మూఢులకు గతి కల్పించవలసినది మూఢ వ్యతిరుక్తులకు మిక్కిలి అగత్య మయినందుననున్ను తృణము మొదలు మేరువు వరకు పరబ్రహ్మచైతన్యము నిండి ఉన్నదనే నిశ్చయముతో పూర్వీకులైన పెద్దలు వ్రాసిన నిమిత్తములను బట్టి యేర్పరచి వుండేస్థలముల నేమి బింబాలనేమి తీర్ధాలనేమి వారి సంకేతానికి యెంత మాత్రమున్ను భంగము రాకుండా భక్తితో మూఢ వ్యతిరిక్తులున్ను ఆరాధింపుచు రావలసినది. తద్ద్వారా యాదృశీభావనా, యత్ర సిద్ధిర్భవతి తాదృశీ అనే సత్యవాక్యప్రకారము మూఢులను మూఢ వ్యతిరిక్తులనున్ను తరింపచేయుచు వచ్చుచున్నది.

ధైర్య స్థైర్యాలకు నెల్లూరికి దక్షిణములోనున్ను నెల్లూరికి ఉత్తరములోనున్ను వుండే భేదములు తెలియును ఇంకా యీ అడుగున వ్రాయుచున్నాను. తంజావూరు తిన్నెవల్లి సీమవారు గాయికి వందనం తగప్పన్ అనేవాక్యాన్ని వాడుచు ఊరికి వచ్చిన అధికారస్థుడు ఏమిచేసినా అంగీకరింపుచున్నారు. హయిదరాబాదు నాగపూరు రాజ్యములలో భిక్షకుణ్ని ఒక ముసాఫరులు దిగే స్థలములో నుంచి నాలుగు గడియలు అవతలికి లేచిపోయి ఉండుమంటే తనకు చేసిన ఆజ్ఞ న్యాయ విరుద్దము గనుక నా తలకాయ కొట్టిన వెనక నా కళేబరాన్ని యీస్థలములో నుంచి వొత్తించ వలసినదిగాని నేనుగా భయపడి లేవనని సర్వాధికారము కలవారిని నిగ్రహించి చెప్పుతాడు. దక్షిణదేశస్థులకు బెత్తపు దెబ్బపుట్టించే నొప్పి, కలగచేసే భయము ఉత్తరదేశాస్థులకు తల తెగడములో లేకుండా వున్నది. అయితే దక్షిణదేశస్థుల భయము భక్తిజన్యము కాదు గనుక నిలకడగా వుండేదిలేదు. ఉత్తర దేశస్థులు భయప్రేరణ లేకుండానే చేతనయి నంత మట్టుకు న్యాయముగా నటింపుచు వచ్చుచున్నారు. తమ తాత్పర్యము యెదటివారి తాత్పర్యముతో భేదించినప్పుడు పురుషవాహిని ప్రకారము అహంకారాన్ని వృద్ధిపొందించి నటింపుచున్నారు. యిటు నంటి మనోబుద్ధి హయంకారమాలు స్థూలదేహముతొ నెయ్యిపాలలొ కలసినట్టు వున్నందున బౌద్ధులు నెయ్యిని పాలలోనుంచి విడతీసే ప్రయాస పుచ్చుకోచాలక పాలనే నెయ్యి అని భావించినట్తు స్థూలదేహాన్నే పరబ్రహ్మ అని భావింపుచున్నారు. అటువంటి భావనకూడా ప్రత్య వాయమయినది కాదని తొచుచున్నది. కొండకొనకు పోవలస్తే మెట్టు మెట్టుగా యెక్కిపోవలసినది గనుక ఒకరు ఒకదారిగా మరియొకరు మరియొక దారిగా యెక్కుచున్నారు. యేరీతిగా నయినా ఏపదార్ధమందయినా పరబ్రహ్మను నిరూపించి ఆరాధనచేసి కడతేరవలసినది గనుక సర్వం విష్ణుమయం జగత్ అనే న్యాయప్రకారము యేవస్తువును యే నామ రూపాలతొ పరబ్రహ్మగా నిరూపించినా బాధకము గాదు. దాక్షిణాత్యులకు అతి సమీపములో అనేక దేవాలయాలు అతివిభవముతో ఉత్సవాలు జరిగేవిగా వుండిన్ని తమకు భోజనమజ్ఞ నాదులు ఉపచదించేవారు అక్కడలేని పక్షమందు ఆస్థలానికి వెళ్ళడము మాని ఉపచరించేవారు ఉండే మహాస్థళానికే చెన్నపట్టణపు శెట్లు తిరువట్టూరికిన్ని కోమట్లు తిరువల్లిక్కేణికిన్ని మొదలారులు మయిలాపూరికిన్ని వెళ్ళేటట్టు పోవుచు నుంటారు గాని ఒకపూట అన్నము తమ ప్రయాసతొ జాగ్రత్త పెట్టుకొనేపాటి ధైర్యముతో ఇతర స్థళాలకు వెళ్ళడములేదు. ఉత్తర దేశస్థులు సహజముగా తీర్ధయాత్రలకు అక్కడ యెక్కువ విభవాలు జరగకపోయినా యెరిగిన వారు యెవరున్ను లేకపోయినా బహుదూరానికి వెళ్ళుచున్నారు. మళయాళదేశాస్థులు సేతుయాత్ర వెళ్ళవలిస్తే వర్ త్త్ కొట్టి యమణల్ వెళ్ళీ కట్టియముళ్ దారిలో వున్నదని అద్యాపి జడుస్తారు. హిందూస్థాని దేశస్థులు మనోభీష్టాలు యీడేరవలిస్తే అనాయాసముగా గంగోత్తరి మొదలయిన పంచగంగ కావిళ్ళు తెచ్చి దాతా వైద్యనాధ స్వామికి అభిషేకము చేస్తూవస్తున్నారు.

ఆహారములు, స్త్రీ సంగమాలున్ను, దృఢతరముగ్తా చేసి ఉత్తర దేశాస్థులవలె దాక్షిణాత్యులు తృప్తిపొంది వాటివల్ల వెంబడిగానే విరామాన్ని పొందకపోయినా దాక్షిణాత్యులు దినానికి నాలు గవసరాలుగా భోజనముచేసి మధ్యే మధ్యే మజ్జిగె తేట మొదలైన పానీయాలు పుచ్చుకొని చూచిన భక్ష్య యోగ్య స్వల్ప పదార్ధాల నంతా చూచినప్పుడంతా తినకోరుచున్నారు. స్త్రీ సంగమాదులలో నున్ను అదేరీతిగా మనస్సున నిబ్బరముతో దేహధర్మాన్ని వుంచనేరక ధృఢముగా భోగించలేకపోయినా, చూచిన మిణుకుకత్తెల పయినంతా దృష్టిని పోనిచ్చి సంగమాదులలో అనేకావృత్తులు ప్రవర్తింపు చున్నారు. అందువల్లనే ఆ దేశస్థులకు త్వరగా వీర్యనష్టమయి అండవాయురోగము కల్గుచు వచ్చుచున్న దని యింగిలీషువారు తాత్పర్యము గలవారై వున్నారు. ఈ చాపల్యాలకంతా కారణము పిత్తోద్రేకమని తోచుచున్నది. యీపిత్తోపరి కావడానికి ఉష్ణమే కారణముగాని వేరేలేదు వాతము రజోగుణధాతువు, పిత్తము తమోగుణధాతువు, శ్లేష్మము శీతభూమిలో ప్రకోపమవుచున్నది, వాతము ఉభయమధ్యస్థముగా ఇతరములయిన రెండు ధాతు


ఎనిమిదవ ప్రకరణము  బొందిలి ఖండము

వులతో ప్రత్యేక ప్రత్యేకముగా కలుసుకొన్నప్పుడు ఆ యా గుణములతో తాను ప్రకోపింవుచున్నది. అది యెట్లానంటే శీతదేశస్థులకు శ్లేష్మవాయువు ప్రకోపిమయి వేదించినట్టున్ను ఉష్ణదేశస్థులకు ఉష్ణవాయువు ప్రకోపించి వేధించినట్టున్నేగాని శుద్ధవాయువు ఎక్కడా ఒక ప్రకోపాన్ని పొందడములేదని తోచుచున్నది.

యీ మైహరు అనే ఊరు బొందిలీ ఖండము మధ్యేఉన్నది. దీని చుట్టూ పది ఆమడదూరపు భూమిని బొందిలీఖండ మంటారు. యీ మైహరు రాజుపేరు బిష్మశింగు వీని తాత పర్నా దేశపు రాజు కింద సరదారుగా వుండే పర్నారాజు తమ్ముణ్ణి యుద్ధములో చంపి నందున చెయి పట్టుగా పట్టి నాకు ఒప్పగించక నాతమ్ముని చంపితివే అని షరాపెట్టి పర్నారాజు యీరాజును తలకాజ్ఞచేసి అయినా తనకు నుపకారము చేసినందున సంత్సరము ఒకటి కి లక్ష రూపాయీలు యేత్తే యీ మయిహరు రాజ్యాన్ని యీ రాజు తండ్రికి జాగీరుగా యిచ్చినాడు. అద్యాసి ఆ ప్రకారమే అనుభవింపుచు కంపెనీ వారికి చాలా విహిరముగా నడుచుకొను చున్న ఈ దారిని వచ్చిన దొరలకు కావలసినట్టు సరఫరాయిచేసి సంతోషపెట్టి యీరాజు బహు యోగ్యుడని వారివద్ద క్యారకటరు పూనుకొనుచున్నాడు. భగవంతుడు నాయందున్న ఆప్రకారమే గౌరవము కలగచేసి నందున ఆరాజు సకల విధాలను నాకు ఉపచరించి వెనక నావద్దనున్ను క్యారకటరు పుచ్చుకొన్నాడు. కొన్ని సంవత్సరములు కిందట యీ బిష్మశింగు తమ్ముడు ప్రయాగదత్తు అనేవాడు అన్నతో కలహపడి జబ్బల్ పూరు యేజంటుగా రాజ్యమును పంచుకొన్నాడు. ఈబీష్మశింగు కింద యిపుడ తని సగానికి వచ్చిన నలభై వేల రూపాయీల రాజ్యమున్ను ఉన్నది. ఇతని రాజధాని నిండా బస్తి అయినదికాదు.

ప్రయాగకు సిహోరానుంచి బలుహోరా మీదుగా ఒక దారిన్నీ మైహరునుంచి చిత్రకూటము మీదుగా ఒకదారిన్ని పోవుచున్నది. ఆరెండు దోవలున్ను దగ్గిరైనా సడక్కు వేసివున్నందుననున్ను అన్నివిధాలా ప్రయాస నిఛ్ఛే మార్గములు గనుకనున్ను ఆరామడచుట్టయినా సడకువేసిన దారిగుండా మిరిజాపురానికి వెళ్ళేటట్టు నిశ్చయించినాను.

ఈ మైహరులొ ఇరవై తేది మధ్యాహ్నము వరకువుండి మూడు ఘంటలకు బయలుదేరి ఆరు కోసుల దూరములోనున్న అమరాపాట్ర అనేవూరు రాత్రి తొమ్మిది ఘంటలకు చేరినాను. నడిమివూళ్ళు, నెంబరు పద్నాలుగు. బ్రహ్వ - ఒకటి - అమరాపాట్ర - ఒకటి దారి ముందరి మజిలీవలె సడక్కువేసియున్నా యెర్రగులకవేసి గట్టించి నందుననున్ను వర్షాకాలము గనుకనున్ను భూమి గౌరవర్ణపు రేగడ అయినందుననున్ను నడవను అనుకూలముగా నుండలేదు. మైహరు వూరికి కోసెడుదూరాన తమసానది దాటవలెను. అమరాపాట్ర వూరిముందర జింజిరీఅనే కాలవ యొకటి దాటవలెను. ఆ కాలువ వరకు మైహరు రాజ్యమునది. దానికి ఇవతల రీమారాజు రాజ్యము. అమరాపాట్రవూరు గొప్ప బస్తి అయినది. అంగళ్ళు విస్తరించి వున్నవి. అన్ని వస్తువులు దొరుకును. రీమారాజు తన తరఫున గొప్ప ముసాఫరుల సరఫరా నిమిత్తమై ఒక కొత్తవాలును వుంచియున్నాడు. మైహరునుంచి అమరాపాటనుకు వఛ్ఛేటప్పుడు మార్గములో కుడిచేతితట్టు మాత్రము కొంతదూరములో కొండ అగుపడుచు వచ్చుచున్నది. ఎడమ చేతిపక్క కొండలు అక్కడక్కడ తునిగి సంక్షేపబడుచు వచ్చుచున్నవి. వాటిలో రెండుకొండలు- ఒకటి ఫిరంగిగుండ్లు రాశిపోసి అతికిన చందముగానున్ను, ఒకటి ఒంటి కంభము డేరాచందముగా నున్ను వున్నవి. యీవూరిలో అంగళ్ళలొ యీ రాత్రి వసించినాను.

తేద ఉదయమయిన ఆరు ఘంటలకు లేచి యిక్కడికి మూడు కోసుల దూరములోవుండే పల్నా అనేవూరు ఎనిమిది ఘంటలకు చేరినాను. జబ్బల్ పూరు దాటిన వెనక కూడా కొందరు బోయీలు కావటివాండ్లు బంట్రౌతులున్ను అటు ముందు దాటివచ్చిన అడివిగాలి సంబంధమయిన చలిజ్వరాలతో పడ్డందున కొందరిని దోలీలలో వేసి కూడా తేవలసివచ్చినది, గనుక వారు వచ్చి కూడా కలుసుకొనే నిమిత్తమయి యింత చిన్న మజిలీ చేసినాను. డోలీ అనగా ఒక చిన్ననులకమంచానికి బొంగు కట్టి యిద్దరు మోసేది. యిక్కడి బోయీలను డీమర్లు అంటారు. వారిద్దరు అటువంటి డోలీని సాధారణముగా నా సవారితో కూడా మోసుకొని వచ్చిరి. దారి నిన్నటి దారివలెనె అనుకూలమయినది కాదు. ఈవూరు చిన్నది. జలవసతి కద్దు. దీన్ని యీ దేశపు బ్ర్రాంహ్మణునికి రీమారాజు యీనాంగా యిచ్చినాడు. మజిలీవూరు కాదు గనుక ప్రయత్నము మీద బియ్యము మొదలయిన సామానులు అందిరికిన్ని దొరికినవి. యిక్కడ యీరాత్రి డేరాలలొ వసించినాను.

తేది ఉదయాత్పూర్వము మూడు పాయింట్ నాలుగు ఘంటకు లేచి యిక్కడికి మూడు కోసుల దూరములో వుండే రీమారాజుయొక్క రాజధానిని, రీమా, చేరినాను. నడిమివూళ్ళు. పద్నాలుగు వుమరి - ఒకటి - రీమా ఒకటి.

దారి నిన్నటివలెనే వున్నది. రీమా అనేవూరిముందర తమసా అనే నది మళ్ళి దాటవలసినది. ఈనది గంగలోనుంచి చీలివచ్చేదిగా చెప్పుతారు. రీమా బహు గొప్పవూరు. కోటలోపల రాజు వుంటాడు. కోటకు బయిట అంగళ్ళు మొదలయినవి వున్నవి. వూరిచుట్టు తొటలు గుంటలున్ను కొన్నివున్నవి. సకలమయిన పదార్ధాలున్ను దొరుకును. చింతపండుకూడా బహు ప్రయత్నముమీద ఒక శేరు యిక్కడ దొరికినది. నాతో కూడా వచ్చిన స్వదేశపు పరిజనులు మిరపకాయలు చింతపండు తిననందున మాకు రోగాలు వస్తున్నవని భ్రాంతిపడి చెప్పుతారు. వారికి చింతపండుకు బదులు గోగుకూర చింతాకు చింతపెందెలు దొరుకుచు వస్తున్నవి. ఉపపన్నులయిన యాత్రవచ్చేవారు నా వలె మోసపోకుండా స్వదేశ పరివార రక్షణ నిమిత్తమై రెండు నెలలకు చాలేపాటి చింతపండు మిరపకాయలు మిరియాలు ఆవాలున్ను నాగపూరులొనే జాగ్రత్తచేసుకొని కూడా తీసుకొని రావలసినది. లోగడ నేను వ్రాసిన ప్రకారము కోసుకు మూడుకోసులుగా వుండే కొండకోసులు నర్మదానదితొసరి. జభ్భల్ పూరు మొదలుగా అనుకొనే కొసులు కొంచమెచ్చుగా మనదేశపు కోసులకు సరిపడుచున్నవి.

నాగపూరు మొదలుగా వక్కలులేవు. పోకలు వొత్తికాచుతో కూడా వేసుకొనుచున్నారు. యీ సంగతి నాగపూరిలో తెలసి నందున నా దేహ సంబంధికులకు మాత్రము కాశివరకు చాలే పాటిగా నాతో కూడా వచ్చినవారు వక్కలు కొనితెచ్చినారు. యీదేశస్థులు హుక్కాతాగడము చేత పొగాకు సాథారణముగా దొరుకుచు వచ్చుచున్నది. తమల పాకులు జబ్బల్ పూరు మొదలు అతినల్పువర్ణముతొ బ్నిల్వపత్రివలెనే వుండేవి దొరుకుచున్నవి. మిక్కిలి ప్రయత్నము మీద అలాటి నల్లని వర్ణముగల తమల పాకులే పెద్దవిగా దొరుకు చున్నవి. హయిదరాబాదు మొదలుగా అమ్మేనెయ్యి మంచిది కాదు, గనుక నాగపూరు వరకు ఎన్నతీసి నెయ్యికాచుకుంటూ వచ్చినాము. పిమ్మట జబ్బల్ పూరు వరకున్ను అటు యివతలనున్ను వెన్న మజ్జిగె దొరకడము ప్రయాస అయినా నాకు యీ రాజ్యములో అక్క డక్కడ గొప్పవారిని శ్రీరాములు విహితము చేస్తూ వస్తాడు గనుక దొరికే తావులోనుంచి దొరకనితావుకు వెన్న మొదలయిన పదార్ధాలు నాకు ముట్టుచున్నవి.


ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర
టీటీఎస్ ఆడియో నిర్మాణ పాఠ్యం
భాగం నాలుగు — మొత్తం ఎనిమిది భాగాలలో


ఎనిమిదవ ప్రకరణము  బొందిలి ఖండము

ఆగామి సంచిత ప్ర్రారబ్ధ కర్మాలలొ మూటిలోనున్ను అవశ్య మనుభోక్తవ్యం కృతం కర్మశుభాశుభమ్ అనేవచనము ప్ర్రారబ్ధకర్మ విషయమై సత్యమై వుండగా ఈశ్వరకటాక్ష మేమి చేయగలదు? మనము చేసినంత అనుభవించవలసిన దాయెనే అని సందేహపడి యీశ్వర భజన చేసి యీశ్వర ప్రియములయిన పనులు చేసినంతలో అది పయివాక్యాన్ని అనృతపరచ కుండానే ఆ ప్రారబ్ధకర్మఫలము దు, ఖమయిన పక్షమందు దు, ఖఫలమును పొందకుండా చేసి అభ్యుదయాన్ని నిస్సందేహముగా పొందింప చేస్తున్న దనేటందుకు సాధనములయిన వచనములు కోటయో బ్రహ్మహర్యానా మగమ్యాగం కోటయ సద్య, ప్రళయ మాయాంతి మహాదేవేతి కీర్తనాత్ ఇది మొదలయినవి అనేకములున్నవి. యీ వచనములు సత్యములయితే అవశ్య మనుభోక్తవ్యం అనే వచనము అబద్ధము కావలసిన దాయెనే, యిందులో యేది సత్యము యేది అబద్ధము? లేక రెండున్ను సత్యములు కానేరవే, అనే తాత్పర్యము బహు దినములుగా నాకు కలిగి వుండి, నెను పెద్ధలని తోచిన వారినంతా యీ సందేహమును నివృత్తి చేయవలసిన దని అడుగుచు వచ్చినంతలో వారు వారు యథోచితమయిన సమాధానాలు చెప్పుచు వచ్చిరిగాని, నిస్సందేహమును పొందచేసిన వారుకారు. అయితే పరబ్రహ్మమే గురువు గనుక పరబ్రహ్మ ప్రతిమానుష దేహములో ప్రతిఫలించేటట్టు నాదేహములోనున్ను ప్రతిఫలింపు చున్నాడు. గనుక నాయొక్క అంతర్యామిగా వుండే పరబ్రహ్మ యీ విషయములో నాకు ప్రత్యక్ష గురువయి, నాబుద్ది ద్వారా నాకు సందేహ నివృత్తి చేసిన క్రమ మేమంటే, క్రమమనిన్ని పరబ్రహ్మమనిన్ని రెండువస్తువులు శిశువును తల్లితండ్రులు పోషించేటట్టు అప్పటప్పటికి మనుష్యుణ్ని శిక్షించి రక్షింపు చున్నననిన్ని కర్మము సదా తల్లివలేనే శిశువు మంచి పనులుచేస్తే లాలించి చెడు పనులు చేస్తే శిక్షించినట్టు మహుష్యులు చేసిన శుభాశుభకర్మములకు తగ్గ ఫలమును సిద్దముగా క్రమము అనుభవింప చేయుచున్న దనిన్ని అయితే శిశువుకు తండ్రిగావుండేవాడు శిశువు చేసిన దుర్మార్గాన్ని గురించి తల్లి దండించి శిశుకు ఏడ్చేపాటి తాపత్రయము పుట్టినప్పుడు శిశువు తండ్రిని తలచి నాయనా అని పేరుపెట్టి తిల్లిచేసే శిక్ష తాళలేక నివృతిని పొందించమని యేడిస్తే యెట్లా తండై మంచిదిపో ఆ చేష్ట చేస్తే చేసినాడు, వాణ్ని కొట్టక తిట్టక వానికి పాలు నెయ్యి అన్నమున్ను పెట్టుము, ఇకను అట్లా చేయడని ఎట్లా తల్లి చేయతలచిన శిక్షను పూర్తిగాకుండా శిశువును విడిపిస్తాడో తద్ద్వత్తుగా మనుష్యులు దుష్కర్మము చేసినా దుష్కర్మ ఫలానుభవము వచ్చినపుడు ఈశ్వరుని గురించి భజనచేసి ఈశ్వరప్రీతి సంపాదకములయిన పనులు చేసి నట్తయితే తల్లిచేత శిక్షింపబడిచు నుండే శిశువును తండ్రి విడిపించినట్టు మనుష్యుని ధుష్కర్మ ఫలానుభవములో నుంచి యీశ్వరుడు సిద్ధముగా విడిపించగలడు. అయితే కొన్ని వేళలలో దుష్కర్మ ఫలానుభవము వచ్చినప్పుడు యెంత ఈశ్వరభజన చేసినా ఈశ్వరప్రీతి సంపాదకము లయిన జపహోమసురార్చనాదులు అనేకములు చేసినా దుష్కర్మ ఫలానుభల్వమే ఘటిస్తున్న దే అది యేమి? అని శంక తోచును. దానికి సమాధాన మేమంటే శిశువు చెడు చేష్టలే విస్తారముగా చేస్తూ వచ్చినా వాటి నంతా ఆ శిశువు నటింఛే కొన్ని మంచి నడతలవల్ల మన్నించి బుజ్జగిస్తూ వచ్చిన్ని చెడు చేష్టలు యెక్కువయి తల్లి శిశువును దండించ తలచి దండించే రెండు మూడు తరుణాలలో తండ్రి విడిపించి యుండాగా మళ్ళిన్ని శిశువు చెడు చేష్ట మానక తల్లిచేత శిక్షింపబడుచు నుండగా తండ్రిని తలచి యేడ్చినట్టయితే యెట్లా తండ్రి మన కెక్కడి జోలి? యీ శిశువును కాపాడవలసిన భారము తల్లిదేను, మన మెంత సేపు ఈ శిశువును తల్లి దండనకు లోబడకుండా కాపాడగలము, తల్లి తెలియక దండించునా? ఇట్లా మనము దండనకు లోబడకుండా విడిపిస్తే శిశువు మరిన్ని మకురు బట్టిచేడిపోను, తల్లికి శిశువుకున్ను బంధ మెక్కువ, మనము తల్లికి యజమానుడయినా శిశువుకు సన్నిహిత బంధురాలు తల్లిగాని మనముగాము, యీ వుభయుల దు, ఖము ఎన్నడికిన్ని యిట్లా వుండేదేను, శిశువుకు బుద్ధి వచ్చేటందుకే తల్లిదండిస్తున్నది, మంచిపనే, యీ శిశువు ప్రతి దినమున్ను పెట్టే మొర జోలికి మనము పోరాదని యెట్లా తండ్రి విరామమును పొందుతాడో తద్వత్తుగా పరబ్రహ్మదుష్కర్మ ఫలానుభవమును చేయుచునుండే మనుష్యుడు నిండా పాపి అయి కొన్ని ఆ వృత్తులు తన కృపవల్ల ఆ యశుభఫలానుభవము తేలికె చేయబడిన్ని మళ్ళీన్ని దుష్కర్మ పరంపరనే చేసి వుండి తత్ఫలితానుభవాలు వచ్చినప్పుడంతా యీశ్వరభజన చేసి ఈశ్వరకటాక్ష సంపాదకము లయిన పనులుచేసినా మనుష్యునికి నుత్తరోత్తర శ్రేయస్సు నిమిత్తమై దుష్కర్మఫలమే అనుభవానికి వఛ్ఛేటట్టు అవుచున్నది. గనుక అవశ్యమనుభోక్తవ్య మనే వచనము సత్యమే, కోటయో పరబ్రహ్మహత్యానా మిత్యాద వచనాలున్ను సత్యములేగాని ఒకటికి ఒకటి విరుద్ధముగాదు.

చెన్నపట్టణములో నేను వుండగా కొందరు ఫరంగివాండ్లతో మతానుసారము లయిన మాటలు మాట్లాడుచు నుండగా యిదే రీతిగానే డిష్టయిని, Destiny, అనే విధి బలమయినప్పుడు ఈశ్వర కటాక్షమేమి పనికి వస్తున్నదని ప్రస్తాపము వచెను. అప్పుడు నాకు తోచిన బుద్ధిప్రకారము నేను సమర్ధించిన వయిన మేమంటె డిష్టయిని అనేవిధిని మదరాసు సూప్రీంకోర్టుగా భావించ వలసినదనిన్ని యీశ్వరుని సీమరాజుగా భావించ వలసిన దనిన్ని, యెట్లా సీమరాజుయొక్క ఆజ్ఞవల్ల లోకులుచేసే తప్పుకు సూప్రీంకోర్టు వారు తూకు, ఉరి, తీయగలరో తద్వత్తుల్గా డిష్టయిని అనేవిధి కర్మఫలానుభవమునిచ్చినా సీమ రాజుతో రూపురూపుగా చెన్నపట్టణములోనుంచి యెవరికయినా జాబులు నడుస్తూ వుండేపాటి విహితముండి తనకు తూకున తీసేటట్టు సుప్రీం కోర్టువల్ల కలిగిన ఆజ్ఞకు సీమ రాజుమన్నన నిమిత్తమై వ్రాసి పంపించి తెప్పించుకో గలిగితే యెట్లా సుప్రీంకోర్టు యొక్క దండన తప్పిపోవచ్చునో, అట్లా డిష్టయిని అనేవిధి యీశ్వరకటాక్షము ముందర నిలవనేరదని చెప్పి సమాధానపెట్టినాను. ఈయుక్తులచేత శిశువు చేసిన తప్పుచేష్టలకు తగినదండన చేస్తూవుండే కోపముగల తల్లికన్నా దూరముగా నుండిన్ని శిశువుచేసిన చేష్టలనున్ను అందుకు తల్లిచేసే దండననున్ను చూస్తూవుండే తండ్రై నిండా దయాళువు గనుకనున్ను తల్లి శిశువుల కిద్దరికిన్ని తండ్రి స్వామిగనుకనున్ను తండ్రియెడలనే శిశువు నిండా భయభక్తులతొ నడుచుకొంటే అది యెట్లా క్షేమకరమో తద్వత్తుగానే మనుష్యులు కర్మములు చేసుటకన్నా భక్తిపారంగతులు కావడమే మంచిది. యీ న్యాయమును పట్టేవిశిష్టాద్వైతులు సర్వధర్మాస్పరిత్యజ్య అనేవాక్యాన్ని పాటించిన వారివలె అభినయిస్తారు. అయితే తల్లి తండ్రికన్నా ఎక్కువగా యెప్పుడున్ను శిశువుతొ కిందను మీదను పడుచున్న పోషిస్తు న్నుండేది గనుక మంచి పనులుచేసి మంచిమాటలాడి నప్పుడంతా అతి త్వరగా మనస్సు కరిగి శిశువును తన చేతనయినంత మట్టుకు ఉత్సాహపరచడమే కాకుండా తండ్రికి ఫలానికి మంచిపని శిశువు చేసినాడు, ఫలాని మంచిమాటను ఆడినాడని తెలియచేసి యెట్లా తండ్రియొక్క మన్ననకూడా శిశువుకు సంపాదించి యిసుస్తున్నదో, తద్వత్తుగా మనుష్యులు చేసే శుభకర్మాలు ఈశ్వరకటాక్షాన్ని కూడా సంపాదించి యిస్తున్నది, యెట్లా శిశువు పెద్దవాడయ్యేదాకా శిశువు తల్లి యొక్క అనుసరణ మన్ననలు అగత్యమో తద్వత్తుగా మనుష్యుడు జ్ఞానముచచ్చే పర్యంతము కర్మబద్ధుడయి మంచి కర్మలు చేస్తూ తద్ద్వారా యీశ్వరకటాక్షాన్ని సంపాదించుకొనుచు జ్ఞానము పుట్టిన వెనుక కూడా తానుగా కర్మలను విడవకుండా జ్ఞానప్రకాశముచేత అక్రమములు తన్ను వదిలిపోయ్యేటట్టు నటింపవలసినదని దోచబడు చున్నది.

ఈ రీమారాజు పారంపర్యముగా యీ రాజ్యమును యేలుచున్నాడు. ఇతడు బగ్గెలు అనే క్షత్రియజాతి. యీరాజు పేరు జయశింగదేవు. ఇతనికి ముగ్గురు కుమాళ్ళు, వారు విశ్వనాధశింగు, లక్షమణసింగు, బలభద్రశింగు అనే పేళ్ళుగలవారు. యీముగ్గురుకిన్ని రాజ్యము పంచిపెట్టి జ్యేష్టుణ్ణి తనకు బదులుగా పట్టాభిషేకము చేసి వుంచి యిప్పటికిన్ని తండ్రి సుఖముగా వున్నాడు. సంవత్సరము ఒకటి కి పదిలక్షల రూపాయల యెత్తే రాజ్యము వీరికి కలిగియున్నది. యీ రాజు కంపెనీ వారిని నిండా లక్ష్యపెట్టడములేదు. యధోచితమయిన స్వతంత్రదశనుపొంది నటింపుచున్నాడు. కొన్ని కాలాలలొ దేవబ్రాంహ్మణపూజ బాగా చేస్తాడు. ఈ వూరిలో ఈ రాత్రి డేరాలలొ వశించినాను.

తేది ఉదయాన నాలుగు ఘంటలకు లేచి యిక్కడికి ఎనిమిది కొసుల దూరములోవుండే రాయపూవు అనే వూరు తొమ్మిది ఘంటలకు చేరినాను. దారి సడక్కు వేసినారనే పేరేగాని వేయనట్టే వున్నది. వుమరియనే వూరి పర్యంతము జబ్బల్ పూరు దారి విచారణకర్త అయిన కేపన్ నిక్కిల్సిన్ విచారణ అయినందున దారి యొక తీరుగా కాపాడపడి వున్నది. వుమరికి యివతల మిరిజాపూరు దారి విచారణకర్త కేపన్ ద్రమ్మన్ విచారణగనుక దారి విచారణ బహు తక్కువగావుండేటట్టు అగుపడుచున్నది. భాటకు యిరుపక్కలా చెట్లుకూడా పెట్టినట్టు అగుపడలేదు. భూమి యెర్రరేగడ గనుక యెండివుండేచోట గుచ్చుకొనుచున్నది. మైహరు మొదలుగా భూమి బాగా పచ్చికబట్టి వుండలేదు. పయిరున్ను వృద్ధికాకుండా వుండేటట్టు తోస్తున్నది. యీ రాయపూరు అనేవూరు గొప్పదేను. వూరిలో ఎక్కడ చూచినా మిట్టపల్లము, అడుసు కాలువలు మొదలయిన అపహ్యాములతో నిబిడీకృతముగా వున్నది. వూరిచుట్టూ నాలుగు తొటలు, పెద్దగుంటలు, చెరువులున్ను వున్నవి. సకలపదార్ధాలున్ను ముసాఫరులకు దొరుకును. అంగళ్ళు శానావున్నా వసతికావు గనుక దేరాలలో యీ దినమంతా వసించినాను.

కాశీయూఅత్ర చరిత్ర

తేది ఉదయాన నాలుగు ఘంటలకు లేచి యిక్కడికి ఐదు కోసుల దూరములోవుండే సత్తిని అనేవూరు పది ఘంటలకు చేరినాను. మధ్యనున్న యూళ్ళు, నెం - పదహారు - మనగాం - ఒకటి - సత్తిని -ఒకటి. దారినిన్నటివలెనే అనుకూలముగా వుండలేదు. కొండల యడివి కొన్ని దినములుగా ఉపద్రవపెట్టడములేదు. యీ దినము పది వాగులదాకా దాటినాను. ఆవాగులుదిగి యెక్కడానికి వయిపుగా, వీలుగా, రాళ్ళతో కట్టివుండలేదు. దారిలో మనగాం అనే వూరికి సమీపముగా ఒక వాగువద్ద ఒక మనిషిని చంపి పడవేసివున్నది. నాతోకూడా వచ్చే తపాలు మనుష్యులు కంపెనీ వారి యాజ్ఞ యీప్రాంతములలో కలిగిన వెనుక సడక్కమీద యిట్లా ఘాతలు నడవలేదు. యిప్పు డేమో ఆరంభ మయినదని వ్యసనపడు కొన్నారు. రీమాలో ఒక మనిషి జబ్బల్ పూరు యెజంటు రీమా అకుబర్లు, సమాచారములు, వ్రాస్తూ మిరిజాపురము వరకు తపాలు హరకారాల విచారణకూడా చేస్తూవున్నాడు. అతనితో స్నేహము చేసుకొని మిరిజాపురము దాకా తపాలు మనుష్యులు కూడావచ్చేటట్టు చేసుకొన్నాను. యీ వూరిలో ఈ రాత్రి పగలున్నూ వసించడ మయినది. అన్ని పదార్ధాలు దొరికినవి. చిన్న వూరు. జలవసతి కద్దు. గుంటగట్టున డేరాలు ఫేయించినాను.

తేది ఉదయాన నాలుగు ఘంటలకు లేచి యిక్కడికి నాలుగు కోసుల దూరములో వుండే మౌగంజు అనె వూరు తొమ్మిది ఘంటలకు చేరినాను. మధ్యనున్న ఊళ్ళు నెం.పదిహేడు. లవరుటిలావు ఒకటి- మాగంజు -ఒకటి-దారి నిన్నటివలెనే వున్నది. శిలానాలా అనే వాగు ఒకటి దాటవలసినది. యింకా కొన్ని వాగులు దాటవలెను. శిలానాలా మొదలుగా శాలగా దారికి యిరుపక్కల కొన్ని చెట్లు పెట్టి వున్నవి. నిన్నటి మజిలీ మొదలుగా భూమి చెన్నపట్టణము చుట్టూవుండే భూమివలెనే కలిమెడుచల్లితే తూమెడు పండే పాటి చవుడు కలిసిన రేగడగా వున్నది. అందుకు తగ్గట్టే యీ భూమి నివాసస్థులు పందిళ్ళు చెక్కిళ్ళు చిక్కి స్వల్పగాత్రులుయి వున్నారు. యీ మౌగంజు అనే వూరు మౌగంజు రాజు రాజధాని. యిప్పటి రాజు పేరు అనిరుద్ధసింగు. సెంగెరు అనే


తొమ్మిదవ ప్రకరణము  వింధ్యాచలం మరియు మీర్జాపూరు

క్షత్రియజాతి. వీని రాజ్యము సాలుకు లక్షరూపాయలు యెత్తేది. యితడు రీమారాజుకు సాలుకు పదిహేడు వేల ఐదు వందలు రూపాయిలు కట్టేవాడు. కొన్ని సంవత్సరముల రూకలు కట్టకపోయి బలహీనుడయి నందున రీమారాజు మూడు సంవత్సరములుగా రాజ్యము జప్తు చేసికొని దినానికి నాలుగు రూపాయలు లెక్క యీరాజుకు బత్యఖరుచుకు యిస్తూ వున్నాడు. ఈ వూరు బస్తీ అయినది గనుక సకల పదార్ధాలు దొరుకును. జలవసతి గలది గనుక సుందరమయిన తామరకొలను వొడ్డున డేరాలు వేయించి దిగి యీ రాత్రి పగలున్ను యిక్కడ వసించినాను.

తేది ఉదయాన నాలుగు ఘంటలకు లేచి యిక్కడికి ఆరు కోసుల దూరములో వుండే హనుమాన్యా అనేవూరు పది ఘంటలకు చేరినాను. మధ్య నున్న ఊళ్ళు, నెం.పద్దెనిమిది. పటహారా ఒకటి. చావోరా ఒకటి. కటుకరి ఒకటి - బిజాలి ఒకటి-గురుమానది ఒకటి. దారి నిన్నటివలెనే సడక్కువేసిన దని పేరు పెట్టుకొని వున్నా యెరుపుదాతు రేగడకలది గనుక మనుష్యులకు నడవడములో కాళ్ళు నిండా గుచ్చుకోలేదు. కొన్ని తావులలో వాగులకు కాలువలకున్ను వారధులు కట్టినారు, గాని మన్నువేసి శాలతో వాటిని సమయముచేసిన వారుకారు. వరిపంట భూమి నిన్నటివలె సారవత్తయినది కాదని తొస్తున్నది. దారిలో వుండే కటుకరి అనెవూరు నిండా బస్తీ అయినది. సకల పదార్దాలున్ను దొరుకును. నేను దిగిన హనుమాన్యా అనే మజిలీ వూరు చిన్నదయినా దుకాణాలు విశాలముగా వున్నవి. డేరాలు వేసి తీసే ప్రయాస లేకుండా వుండును గనుకనున్ను, చెరువుగుంటలు వసతి అయినవి లేనందుననున్ను, దుకాణాలలోనే దిగినాను. డాకు చౌకీ హరకారాల కుమ్మక్కువల్ల అన్ని పదార్దాలున్ను దొరికినవి.

మైహరు మొదలుగా నేనుమజిలీ చేసె ప్రతివూళ్ళోనున్ను జ్వరాలతో శానామంది హింసపడు చునున్నారు. నాసోబతు కోరి వచ్చేవారికి అదే గతిగా వున్నది. నా పరివారజనము సుమారు నూరుమంది. వీరిలో మందికి జ్వరాలు తగిలి ప్రతిదినమున్ను మజిలీ చెసిన వనక ఆసుపత్రిలో డాక్టరులు వరుసగా చికిత్స చేస్తూవచ్చేటట్టు నాడేరాలవద్ద వీరి కందరికిని చికిత్స జరుగు వచ్చినది. యిదివరకు శ్రీరామకటాక్షముచేత అందరికి అనుకూలముగానే ఉన్నది. యీ వూరిలో యీ రాత్రి పగలున్నూ వసించడమయినది.

యింతకుముందు నేను మజిలీ చేసిన సత్తిని అనేగ్రామమువద్ద నుంచి ప్రయాగకు సూతియయినదిగా నాల్గుమజిలీలతో చేరతగ్గదిగా ఒక దారి వున్నది. ఆ దారి అడ్సున్ను కొండ యెక్కుడు దిగుడు ప్రయాసయున్ను కలది. చెన్నపట్టణము వదిలి పెదపాళెమురాగానే ఒక గయావళీ కలుసుకొనెను. వానిని విదిలించుకోను బహుకష్టమైనది. అలాగే ఒక గయావళి తిరువళ్ళూరిలో కలిసి వదిలినాడు. కడపలో ఒక గయావళి తగిలి హయిదరాబాదు దాకా చెంగి చెంగి కూడావచ్చి వదిలి పోయినాడు. నాగపూరులో కొందరు తగిలి చేరనేరక వదిలినారు. రామటెంకిలో ఒక గంగాపుత్రుడు జబ్బల్ పూరులో యిద్దరు ప్రయాగ వాళీలును యిద్దరు కాశీ రాణీ తెనుగు బ్ర్రాంహ్మణులున్నూ తగిలి నా వద్ద చేరడము ప్రయాస అయినా మజిలీ మరు మజిలీగా నాతోకూడా వస్తున్నారు. యీరాత్రి పగలున్ను ఈ వూరిలో వసించినాను.

తేది ఎనిమిది ఘంటలవరకు పయిమజిలీ వూరిలోనే వుండి ఆవూళ్ళో యింటింట చలిజ్వరాలతో మనుష్యులు బాధపడుతారని తెలిసినందున యెండను లక్ష్యపెట్టకుండా బయలుదేరి యిక్కడికి ఏడు కోసుల దూరములో నుండే కట్రా అనిన్ని ద్రమ్మర్ గంజు అనిన్ని ద్వినామమయిన వూరు ఒకటి ఘంటకు చేరినాను. హనుమాన్యా విడిచి నది మొదలుగా కట్రా అనేవూరు చేరేవరకు కొండ కొంచెముగా యెక్కి నిండా దిగుతూ రావలసినది. యీ దినము దారి యావత్తు కొందమీద అడివిమధ్యే నడుస్తూ రావలసినది. మృగభయము విస్తారము గనుక కూడావున్న తుపాకీలను నా జవానులు కాలుస్తూ వచ్చినారు. ఆధ్వనికి వృక్షాలుకూడా అదురునుగనుక మృగభయము మాకు యేమాత్రమున్ను లేక వుండినది. పూర్వకాలమందు ఈహనుమాన్యూవూరినుంచి కట్రా అనే వూరికి రావడానికి మనుష్యులు కష్టపడి నడిచేపాటిగా ఆకొండలమధ్యే ఒక చిన్నదారి వుండినది. యీ రాజ్యములో యింగిలీషువారి అధికార మయిన వెనక యీ కొండను కొట్టి దారియేర్పరచి యేడుతిరుగుళ్ళుగా దిగడానికి యెక్కడానికిన్ని దారియేర్పరచి యేడుగుళ్ళుగా దిగడానికి యెక్క దానికిన్ని బండ్లకు కూడా ప్రయాసలేకుండా వుండేటట్టు చేసి నారు. యీదినము నడిచినదారి రాతిగొట్టు వొకటే ప్రయాస గాని కడమ అన్ని విధాల అనుకూలముగా నున్నది. నేడు నడిచిన ఏడు కోసులమధ్యె ఉదక వసతి యే మాత్రమున్నులేదు. తపాలు మనుష్యులుకూడా వేసంగి కాలములో ఉదకము కూడా తీసుకొని వస్తూ పోతూవుంటారు. కొందరు ముసాఫరులు వేసంగి కాలములో దారిలో ఉదకము దొరక నందున దాహమును వొర్చుకొనలేక ప్రాణములు వదిలి నారట. గనుక యీ యేడు కోసులున్ను చల్లనివేళ నడవ వలెను. యీవూరు కొత్తగా బస్తీ అయినది. అంగళ్ళు మొదలయినవి వసతిగా కట్టివున్నవి. దగ్గిర ఒక నదివున్నది, బావులుకలవు. పశువులు మొదలయినవి నిలాడానికి వూరిముందర ఒక మర్రి చెట్టు తప్ప వేరే ఆసరాలేదు. ముసాఫరులకు కావలసిన పదార్ధాలు దొరుకును. యిక్కడ మరునాడు మధ్యాహ్న పర్యంతము నిలిచినాను.

తేది మధ్యాహ్నము మీద రెండు ఘంటలకు యీవూరు వదిలి యిక్కడికి ఏడు కోసుల దూరములో నుండే బాలుగంజు అనేవూరు రాత్రి ఏడు ఘంటలకు చేరినాను. దారిలో మూడునదులు దాటవలెను. వాటికి వారధులు కట్టడానికి కంపెనీవారు యత్నపడు చునున్నారు. సడక్కువేసి యున్నదని పేరేగాని నడిచేవారికి అనుకూలముగా ఘట్టన చేసి యుండలేదు. దారి మయిదానము మధ్యే పోవుచున్నది. దారిలో బరోడా అనెవూరున్ను మరికొన్నిచిన్నవూళ్ళున్ను వున్నవి. యీ లాలుగంజిలో డాకా అనే దొంగసమూహల భయముచేత కంపెనీవారు ముసాఫరులను దుకాణాలలో, ఇతరస్థళాలలోనున్ను రాత్రి దిగకుండా చేసి సరాయి అనే ఒక పెద్దచాడి నాల్గు పక్కలా ప్రహరీగోడ పెట్టి ఆగోడ ఆసరాచేసి చుట్టూ కొట్టాయి వేసి ఆ కొట్టాయిని అర లరలుగా వుంచి రెండు దరవాజాలు పెట్టి, కావలికి ఇరవై ఐదు ఠాణాజవానులను వుంచినారు. రాత్రి పది ఘంటలకు ఈ సరాయి తలుపులు బిగించి, బీగాలు వేస్తారు. వెలుతుర అయ్యెదాక సామాన్యుల నిమిత్తము తలుపులు తెరవరు. ఈలోగా లోపలనుండే మనుష్యులకు దేహబాధ శానాగా వుంటున్నది. యీ వూరిలో సకల పదార్ధాలు దొరుకును బస్తీ అయినదేను. యీరాత్రి యీ సరాయిలోనే వసించినాను.

తేదు ఉదయాన ఆరు ఘంటలకు లేచి యిక్కడికి ఆరు కోసుల దూరములోవుండే మిరిజాపూరు అనే గంగగట్టు షహరు పన్నెండు ఘంటలకు ప్రవేశించి గంగా దర్శనము చేసి ఆనందించినాము. పరమాత్ముడు గంగానదిలో విస్తరించిన దీప్తితో ప్రతిఫలించి అనేక కోటి జనుల పాపములను వారి భక్తి ద్వారా పరిహరించి వారలను పావనులుగా జేసి యిష్టసిద్ధుల జేయుచున్నాడు. గనుక ఆమహానదీ దర్శనాపేక్షతులయి వచ్చిన మాకు ఆ గంగాదర్శనము కావడములో వున్న తృప్తి వ్రాసితీరదు. నేటి దారి శానాదూరము రాతి పొరగనుక వేసిన సడకు చెదరకుండా పాంధులకు హితముగా వున్నది. కట్రా వద్ద కొండ దిగినట్టుగా యీ దినమున్ను ఒక చిన్న కొండ దిగవలసినది. ఆ కొండ దిగుడు బహు వయిపుగా కంపెనీవారు బండ్లు కూడా చులకనగా దిగేటట్టు కొండ దారి చేసినారు. ఇది వింధ్యపర్వతము నుంచి దిగడమని తెలుసుకోవలసినది. దారిలో భగవ్రాతలావు, తులసీతలావు అనే చిన్న వూళ్ళూ కొన్ని వున్నవి. దారి వెల్లడి గాని అడివిలేదు. ఆ కొండ యేమి కట్రావద్ద కొండ యేమి దిగేటప్పుడు కిందవుండే భూమిని మీదినుంచి చూస్తే వుండే శృంగారము అనుఃభవవేద్యము కాని వ్ర్రాయశక్యము కాదు. దారిలో నాల్గు నదులు దాటవలెను. మయిహరు మొదలుగా దాటే నదులు పశ్చిమ వాహినులుగా కొన్ని ప్రవహిస్తూ వున్నవి.

యీ మిరిజాపూరు అనే వూరు గొప్ప షహరు. చెన్నపట్టణము వలెనే వీధులు తీర్చబడి అంగళ్ళు యిండ్లు మొదలయినవి బహు సుందరముగా నున్ను, వున్నతముగా నున్ను, కట్టబడి యున్నవి. యీ హిందూస్తాని కంతా యిక్కడి పాత్రసామాగ్రీలు ప్రసిద్ధమయినది. ఘనుక పాత్రసామానుచేసే కంచరవాండ్లు వెయుకడపదాకా అహోరాత్రిళ్ళు యీ వూళ్ళో పని చేస్తూవుంటారు.

గంగగుండా అనేక సరకులు కలకత్తా ఢిల్లీ మొదలయిన స్థల ములకు పోతూ వస్తూవుంచున్నవి గనుక ఒంటి కంభం పెద్ద పడవలు చిన్నపడవలున్ను సుమారు రెండు వందలు వురువులు సదా యీ మిరిజాపురము ఘాటున నిలిచివుంటున్నవి. యక్కడి గంగలో నాల్గు స్నానఘట్టాలు బహుసుందరములుగా కట్టివున్నవి. యీ స్నాన ఘట్టాలలో యీ దేశపు బ్రాహ్మణులు ఘాటు వారనేవారు పందిళ్ళు వేసుకొని స్నానము చేయవచ్చే వారికి సంకల్పము చెప్పి వారి వస్త్రములను కాపాడి, వారు వారు లలాటమందు వుంచుకోల్వడానికి గోపీచందనము స్త్రీలకు సింధూరము మొదలయినవి జాగ్రత్తచేసుకొని కూర్చుండి వుంటారు. యీ దేశస్థులు స్త్రీలు పురుషులున్ను స్నానముచేసి కాగానే మడుగుకు తెచ్చిన వస్త్రముమీద గంగ ప్రోక్షించి లలాట రేఖలు వుంచుకొని ఆఘాటు బ్రాహ్మణుల చేతిలో తాము చేసిన పాపమంతా యిచ్చి వేసినట్తు ఒకదుడ్డు ఒకర్భ పవిత్రముతో కూడా ధారపోస్తారు. ప్రతి దినమున్ను శిరస్నానము చేయని ప్రాణి యీ షహరులో వున్నట్టు నాకు తోచలేదు. బందేఖానాలోవుండే ఖయిదీలుకూడా బంట్రౌతుల కావలితొ వుదయానవచ్చి స్నానము చేసి ఒక గుంపుగా వెళ్ళి పోతారు. విటులుగావుండే స్త్రీలు పురుషులున్ను యెట్లా దేవాలయాలు ప్రబలించి వుండే ద్రావిడదేశములొ దేవాలయాల ఉత్సవ విభనాల సాకుపెట్టుకొని వారి వారికి కలిగిన అలంకారములతో బయట వస్తారో తద్వత్తుగా గంగా స్నాన వ్యాజము పెట్టుకొని యిక్కడి విటులు వుదయాన అగత్యముగా జమ అవుతూ వచ్చుచున్నారు.

ఈ ప్రాంతౌలో స్థలమును శుద్ది చేయవలిస్తే గంగాజలమునే ప్రోక్షించుచున్నాదు. గోమయమును ఆపేక్షింపరు. గంగాజలమును యే జాతి మనిషిచేతనున్నా పరిశుద్ధమని గ్రహింపుచున్నారు. ఇతర జలమును మాత్రము అలాగు గ్రహించరు. ద్ర్రావిడదేశములో మడుగు వస్త్రములను మడి సంచులలో దర్భాసనములలోనున్ను పెట్టుకొని వస్తే పవిత్రము లనుకొని స్నాననంతరము యేలాగు యెత్తి కట్టుచున్నారో అలాగే యిచ్చటివారు మడుగు వస్త్రములను చేతపట్తుకొని వచ్చి గట్టునవుంచి స్నానముచేసి తడిగుడ్డతో ఆ వస్త్రముమీద గంగను ప్రొక్షించి యెత్తి కట్టుకొనుచున్నారు. ద్రావిడ దేశస్థులకు గంగ పరమపావని యనే భక్తికలిగి యున్నా మడిసంచిలో మడుగువస్త్రమును వుంచుకోవలెనన్న బుద్ధి పుట్టుచున్నది. గాని యీ దేశస్థులవలె చేతపట్టుకొని పోయి గంగాజలముచేత పవిత్ర పరచే నమ్మికె పట్తుబడినది కాదు. మరిన్ని ద్రవిడదేశాములో మడుగు వస్త్రమును ఒక కొయ్యతొ యెత్తుకొనివచ్చి నా తాడుకు కట్టి ఆతాడు కొన పట్తుకొనివచ్చినా అది మడుగనే నమ్మికె కలిగి యున్నది. యీ దేశాచార భేదములను చూచి యోచించగా ఈ నియమాలంతా మనోబంధకాలేగాని వేరేగాదని రూఢిగా తోచుచు వచ్చుచున్నవి.

ఇది మొదలు కంపెనీవారి రాజ్యము గనక రహదారిలేక ఆయుధాలు పట్టనియ్యరు. ఇక్కడికి కాశి ఇరవై రెండు కోసులు, వింధ్యవాసినీ స్థలము రెండు కోసులు. ఇక్కడ గంగాదర్శనమయి నందున క్షౌరము తీర్థోపవాసము హిరణ్యశ్రాద్ధము మొదలయిన పితృక్రియలు చేసినాను. ఈషహరులో అన్నివిధాల పనివాండ్లున్ను వున్నారు. అన్ని పదార్ధాలున్ను దొరుకును. నాపరిజనానికి చింతపండు మిరపకాయ మొదలయిన ద్రవిడదేశపు వస్తువులు కూడా సమృద్ధిగా గొరికినవి. అరిటి చెట్లుమాత్రము ఈప్రాంతములలో లేవు. యింగిలీషు దొరలు గంగగట్టున యిండ్లుకట్టుకొని యున్నారు. ఈ షహరు చెన్నపట్టణమంత వుండునని తోచుసున్నది. ఇక్కడి తమలపాకులు రామటెంకి తమలపాకులకంటే బాగావున్నవి. నాపరిజనులకు జ్వరమువాశి అయ్యె దాకా ఇక్కడ వుండి ప్రతిదినమున్ను గంగాస్నానము చేయుచువచ్చినాను. నర్మదానదికి ఇవతల పున్నమిపోయిన పాడ్యమి మొదలుగా మాస ప్రవేశము గనుక ఇక్కడ నిన్న మొదలు కార్తిక మాసారంభమమయినది. కృత్తికాస్నానాలు గంగలో ముఖ్యము గనుక జగదీశ్వరుడు నాకు గంగలో ఆ స్నానాలు కలిగేలాగు కటాక్షించినాడు.

తేది మొదలు అకుటోబరు ఏడు డో తేదివరము మిరిజాపురములో నివాసముచేసినాను. కూడావఛ్ఛిన పరిజనులలొ ఇరవై కి చలి జ్వరాలు తగిలినందున పదిహేనుమందికి నేను యిచ్చిన వాంతిభేది వాంతిమందులతో నున్ను బ్యారుకుపొడి లింగకట్టు మాత్రలతోనున్ను వాశి అయినది. చెన్నపట్టణమునుంచి కూడా వచ్చిన యొక కావటివాడు మాత్రము గంగతీరమందు దేహము చాలించినాడు. ఇంతకు లోగడ హైదరాబాదు దాటిన వెనక ఒక బంట్రౌతు వాంతి భేదుల ఉపద్రవము అకస్మాత్తుగా తగిలి నావద్ద ఔషధాలు సేవించను అవకాశము చిక్కక చనిపోయినాడు. ఇప్పటికి నలుగురికి మాత్రము తేలికెగా చలిజ్వరములు తగులుచుండుటచేత వారినికూడా నడిపించుకొని తొమ్మిదవ తేది ఉదయమైన ఎనిమిది ఘంటలకు బయలువెళ్ళీ యిక్కడికి అధికారస్థులయిన గురుదాసుబాబు వగయిగాలతో కూడా యిక్కడికి రెండు కోసుల దూరములో వుండే వింధ్యవాసిని అనే దేవిక్షేత్రము పది ఘంటలకు చేరినాను.

మిరిజాపూరువూరి తోటలు మొదలయినవి దాటి వెలిపడాగానే గంగలోకలిసే నొక వాగు దాటవలసినది. ఆ వాగునీళ్ళు తీసి పోయునా రొంపివిస్తారము గనుక మోకాలుదాకా దిగబడుచు వుంటున్నది. అందువల్ల గంగలోనే పడయెక్కి ఆ వాగు అవతలిగట్తుట్టు చేరవలసినది. దారి సడక్కు లేకపోయినా నడవడానికి తోటలపెరండ్ల మధ్య నున్నది గనుక వైపుగావున్నది. రేగడభూమి.

వింధ్యవాసిని వూరు గొప్పదే. అయితే వీధులు బహు కుసంది మిట్టలు పల్లాలుగా వుంటున్నవి. యీ దేవిని పూజచేశేవారు పండ్యావాండ్లనే బ్ర్రహ్మణులు. ఇక్కడికి బ్రాహ్మణులు పంచగౌడులతో చేరినవారు. కన్యాకుబ్జు లనిన్ని, సర్వర్యులనిన్ని, గౌడులనిన్ని, సారస్వతులనిన్ని, మైధిలులన్ని, అయిదు తతెగలుగా నున్నారు. అందులో యీ పండ్యాలకు కన్యాకుబ్జులని పేరు. వీరే కనోజా లనబడుదురు. మన దేశములోను బ్రాహ్మణులు పంచ ద్రావిళ్ళ వయన మేమంటే ఆంధ్రులు, ద్ర్రావిళ్ళు, మహారాష్ట్రులు, కర్నాటకులు, ఘూర్జరులున్నని తెలిసేది. వీరి దేశవిభాగాలు తెలిసియున్నవిగదా, యీ అయిదు తెగల వారికి ఆచారవ్యవహారాలు భేదించి వుండేటట్టుగా యీ దేశపు పంచగౌడులకున్ను బేదించియున్నది.

యీ పండ్యాలలో యెవడు ముందర యాత్రవారిని కనుక్కుంటే వారికి యీ దేవీస్థలములో ముఖ్యాశ్రితులయి యాత్రవారు దేవీ విషయముగా యిచ్చే వస్త్రాభరణ దక్షిణలు మొదలయినవి యావత్తున్ను తీసుకొని అనుభవిస్తారు. గనుక నేను మిరిజాపురము చేరగానే నన్ను అనుసరించ వచ్చిన పండ్యాలను లెక్కపెట్టను శక్తి లేదనుకోవలసినిది. గురు దాసు బాబు పండ్యాను నేను నిష్కర్ష చేసుకొని యీ స్థలములోనుండే రామనగరపు రాజు వుదయ నారాయణన్ తోట బంగాళాలో దిగినాను. యీతొట సకల ఫల వృక్షాలతో శాలలు తీర్చబడి బహు సుందరముగా గంగాతీరమందున్నది. అందులో గంగవొడ్డుగా రమణీయమైన బంగాళా కట్టియున్నది. వంటకున్ను పరిజనానికిన్ని చుట్టూ ఆవరణాలు యేర్పరచియున్నవి.

యీ మహాస్థలములొ రెండు తామస మహోత్సవాలు చైత్రశుద్ధములోను, ఆశ్వీజ శుద్ధములోనున్ను, జరిగి అందుకు లక్షోపలక్ష ప్రజలు వస్తున్నారు. దేవి ప్రీతిగా బలియిచ్చే సన్నజీవాలు లెక్కపెట్టను ఒకరికిన్ని తరము కాదు కనుక ఆపది దినములలో సంహారమయ్యే జీవాలంతా ఒక మిరాశి దారుని చేతిగుండా సమాప్తి కావలసినది గనుక వానికి అజము ఒకటి కి వచ్చే ఒక పయిసా రుసుము ప్రకారము దినానికి, ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ఫరకుబాదు రూపాయిలు వస్తూ వుంటున్నవి. అనేకులు యీ స్థలములో పునశ్చరణచేసి యిష్ట సిద్దిని పొందినారు.

యీ స్థలములో మూడు శక్తులు వసిస్తున్నవి. వాటికి యోగమాయా, భోగమాయా, కాళీ, అనే పేళ్ళు కలిగియున్నవి. యీభోగమాయ ప్రతిదినము అయ్యే పూజా నైవేధ్యాలను మిక్కటముగా వూరికి సమీపమున వుండుకొని ప్రతిరహింపు చున్నది. అక్కడికి రెండుకోసుల దూరములో పర్వతముమీద యోగమాయా అనిన్ని, అష్టభుజీ అనిన్ని పేరుగలిగిన శక్తి వసించి యున్నది. అక్కడికి సమీపముగానే ఒక పక్క కాళి అనే శక్తి వసించి యున్నది. యీ బలిప్రదానాలు యేమి వున్నా కాళీ సన్నిధానమందు జరిగిస్తారు. పునశ్చరణలు యోగమాయ సన్నిధానమందు చేస్తారు. రాజోపచార పూజలు భోగ మాయ ముందుగా జరుగుచున్నవి. గుడి చిన్నది గాని ప్రసిద్ధికి తగ్గ బాహుళ్యము గలది కాదు.

యీ స్థల మహాత్మ్య మేమంటే యశోదాగర్బజనిత యయిన యోగమాయ కంసునివలన తప్పిందుకొని యీ పర్వతముమీద వసింది పిమ్మట శ్రీకృష్ణమూర్తి చేత సంహరింప బడక నిలిచిన రాక్షసులను జంపుటకై దేవతల ప్రార్ధనచేత మహాకాళీరూపము ధరించి భూభారాన్ని మాంపి మళ్ళీ సాంబమూర్తి సన్నిధాన ప్రాప్తిని గురించిన ఆపేక్షచేత ఆ ఉగ్రస్వరూపము వదిలి భోగశక్తి అయినట్టు చెప్పుచున్నారు.

యీ వింధ్యవాసినీ మహాత్మ్య మేమంటే యిటీవలనే కాశిలోనుంచి ఒక పురుషుడు తెచ్చి ఈ స్థలములో ప్రసిద్ధి చేసినాడు, ఈ వింధ్యవాసినికి సమీపమందు రామగయ అనే ఒక ప్రదేశమున్నది. అక్కడ పిండప్రదానాలు ముఖ్య మనిన్ని, యీ వింధ్యవాసినీ క్షేత్రముయొక్క పంచక్రొశము ముక్తిప్రదమనిన్నీ, యీ స్థల పురాణప్రసిద్ధము. ఈ శక్తికి నా వంటి వారు ఆరాధన చేయించ వలసితే వస్త్రమున్ను అంగుళీయకమున్ను వెండి చిన్న మధుపర్క పాత్రయున్ను యివి మొదలయిన అగత్యముగా ఇయ్యవలసినవి. బ్ర్రాంహ్మణ భోజనము చేయించడమని ఒక సంప్రదాయము ఇక్కడ కలదు. అది యేలాగంటే మిఠాయి వాండ్లను పిలిచి కచ్చారసూయి అనే పూరీలు చేయించి దూదుఫేడాలు బరిఫీలు బత్తాసాలు తీసి ఈ పండ్యాబ్రాంహ్మణులకు ఆకులు వేసి వడ్డిస్తే మనము దిగివుండే తావుకువచ్చి తింటున్నారు. గట్టిపెరుగుకూడా వడ్దించవలసినది. మనిషికి ఒక కొత్త పిడత రాహము పుచ్చుకొవడానికి తీసి యివ్వవలసినది. నూటికి సుమారు ఇరవై రూపాయిలు పట్టుచున్నది. భోజానంతరము ఒక పట్టి తాంబూలము రెండేసి అణాలు ఇస్తే ఆనందింపుచున్నారు.

ఈ దేవిని వారు తాకి పూజచేయవచ్చును గనుక నా పురోహితునిచేత మన దేశాచారప్రకారము స్త్రీ సూక్తప్రకారముగా యధోచితముగా షోడశోపచార పూజ చేయించి కుంకుమతోను, పుష్పాలతోనున్ను, అర్చన చేయించినాను. పూజాకాలమందు అయిన నామోచ్చారణలు బాగావున్నవని యిక్కడివారు ఆనందించినారు. ఆదేవీ నివేదనానికి గుడికి తీసుకపోయిన పదార్ధాలు మళ్ళీ బయటికి తేనియ్యరు. బ్రాంహ్మణభోజనాని కని చేయించే పదార్ధాలు విడిదిలోవుంచి మితముగా నివేదనార్ధమై గుడికి తీసుకపొవలసినది. యీవూరిలో బజారు వీధి వున్నది. సకల పదార్ధాలు దొరుకును. ఈ పండ్యాలు వెయ్యింటిదాకా వుంటారు. వీరుగాక యాచకులు అనేకులు గలరు. యీ మహాస్థలములో యీరాత్రి వసించినాను.

తేదీ ఉదయాన ఐదు ఘంటలకు లేచి యిక్కడికి నాలుగు కోసుల దూరములో వుండే గోపీగంజు అనేవూరు పదకొండు ఘంటలకు చేరినాను. వింధ్యవాసిని వూరిముందరనే గంగదాటవలసినది. దారికి సడక్కు లేదు, పాలరేగడిభూమి. అడుగడుగుకు వూళ్ళు కలవు. మెరికపయిరు భూమి. యిక్కడ గంగ దాటే తావున ఒక పెద్దవాగు గంగలోవచ్చికలుస్తున్నది. యీవాగు వొడ్దుగానే కొంతదూరము దాటిన వనక భాట పొవుచున్నది. యీ గొపీగంజు అనేవూరు రమనగరపు రాజుది. యీవూళ్ళో ముసాఫరులు దిగడానకు ఒక సరాయి కట్టియున్నది. యిదిగాక యీ రాజుకింది తాశ్శీలుదారుడు ఒక గుంటతవ్వి ఒక బంగాళా కట్టి దానిచుట్టూ సరాయిచట్టముగా అరలు కట్టినాడు. నేను అక్కడ దిగినాను. యిది మొదలుగా హిందూస్తాను తుదవరకు అక్క డక్కడ సరాయీలు కట్టి వున్నదట. ఆ సరాయీలకు తురకలేగాని యితరులు ఖావందులు కాకూడదట. అందుకు పాధుషా హుకుము వున్నదట! యీసారాయిలు కల తురకలు, దిగే మనుష్యులవద్ద వర్షాకాలములొ ఎక్కువగానున్ను, ఎండాకాలములొ తక్కువగానున్ను, మనిషికె సుమారు ఒకటి రెండు పయిసాలవంతున బాడిగె పుచ్చుకుంటారు. యీ సరాయీలు లాలుగంజులొ వుండే సరాయివలెనే కట్టియున్నవి. సర్కారుతరపున రాత్రిళ్ళు యిక్కడ యిద్దరేసి ఠాణావాండ్లు పారాయిస్తూ వుంటారు. యీ గోపీగంజు గొప్పవూరు. సకలపదార్ధాలు ముసాఫరులకు కావలసినవి దొరుకును.

యీవూరినుండి ఒక గుంటవద్ద నేను దిగినంతలో ఒక సమూహముగా స్త్రీలు పురుషులున్ను సుమారు యిన్నూటిదాకా ఒక చెట్టు నీడలొ నిశ్చబ్దముగా కూర్చుండి ఒక పురుషుణ్ణి సమూహముమధ్యే వున్నతాసనము మీద కూర్చుండబెట్టి వాడు చదివిచెప్పే అర్ధాన్ని వింటూ వున్నారు. ఏమని విచారించగా భాగవత గ్రంధ కాలక్షేపము జరిగేటట్టు తెలిసినది. యిదేప్రకారము మిరిజాపూరులోను జరిగేటట్టు వినివున్నాను. ఇంత సమూహములో ఒకరయినా యిన్ని పల్లకీల గుంపుతో వచ్చి నన్ను తిరిగి చూచినవారు కారు. తదేక ధ్యానముగా పురాణశ్రవణమే చేస్తూ వచ్చినారు. యింత యెండలో నియమముగా ఉపవాసముతో చిత్తాన్ని తదేకాగ్రముగా వుంచి భగవత్కధాశ్రవణము చేసే క్రమములో నిశ్చలమయిన మనస్సు కలవారికి ఉత్సవ విభవాలు జరిగే దేవాలయాలు భక్త్యాకర్షణ నిమిత్తమయి యేమిజరూరు? అందునుంచే శీతభూమిని నివసించే వారికి యధోచితమయిన చిత్తస్తాస్థ్యము కద్దని లోగడ నేను వ్రాసిన ప్రకారము, ఈదేశములొ ఉత్సవవిభవాలు జరిగే దేవాలయాలు విశేష ధనవ్రయాలుచేసి పూర్వీకులు కట్టినవారుకారు. తదనుసారముగా యిప్పటివారున్ను కట్ట నిచ్చయించిన వారు కారని తోచుదున్నది. యీవూళ్ళో యీరాత్రి పగలున్ను వసించడ మయినది.

తేది ఉదయాత్పూర్వము మూడు ఘంటలకు లేచి యిక్కడికి ఆరు కోసుల దూరములోవుండే అండ్యాసరాయి అనే వూరు మూడు ఘంటలకు చేరినాను. దారి రమణీయమయిన సడక్కువేసి కాలువలకు పూలు, వంతెన, అనే వారధులు కట్తి మయిలుకు వకరాయి వంతున కంపెనీవారు రాళ్ళువేసినారు. గులక లేకపోయినా ఘట్టన బాగా పడివున్నది. యీ సడక్కు ప్రయాగకున్ను కాశికిన్ని వేసివున్నది. యీ గోపీగంజు మొదలు యిదే ప్రకారము కాశివరకు సడక్కువేసి వున్నదట. జబ్బల్ పూరు వదిలినవెనుక యెండలు కొంచెము కొంచెముగా తీవ్రములు అవుచు వచ్చి మిరిజాపురము చేరేటప్పటికి పడమటిగాలి సమేతముగా అతి తీవ్రములయినవి. తొమ్మిది ఘంటలమీద


పదవ ప్రకరణము  ప్రయాగ

దారి నడవ కూడలేదు. మిరిజాపురము మొదలుగా భూమి పాల రేగడ గనుక భూమియొండి మనుష్యుల పాదఘట్టన అయ్యే కొద్ది గంధపొడి కన్నా సన్నమయిన యొక దినుసు ధూళి ఉత్పత్తి అయి మనుష్యులకు బహు ప్రయాసగా వుంటున్నది. మిరిజాపురము మొదలు యిక్కడ చెప్పే కోసులు మన దేశపు కోసులో ముక్కాలుకు తక్కువగా వుంటున్నది. యీ అండ్యాసరాయి అనేవూరు నాలుగు భాగములుగా నాల్గు పక్కలా కట్టి వున్నది. అన్నిపదార్ధాలు దొరుకను. నేను సరాయిలో దిగినాను. జలవసతి కద్దు. గుంటలవద్ద చెట్లనీడ బాగాలేదు. ఈ వూరిలో యీరాత్రి నిలిచినాను.

తేది ఉదయత్పూర్వము మూడు సగంఘంటలకు లేచి యిక్కడికి ఆరు కోసులదూరములో వుండే జూసీ సరాయి అనే వూరు ఎనిమిది ఘంటలకు చేరినాను. దారి నిన్నటివలెనే సడక్కు వేసి మయిలు రాళ్ళూ వేసి వున్నవి. వర్షాకాలములో మన్ను పాలరేగడ గనుక యెంత ఘట్టనపడి మనుష్యుల పాద ఘట్టన బండ్ల రాపుడు విస్తారమయి వుండినప్పటికీన్ని కాళ్ళు ఒక మాత్రముగా దిగబడుతూ వచ్చునని తోచుచున్నది. మిరిజాపూరు మొదలు వూళ్ళు బహు దగ్గిర దగ్గిరగా దారిలో వుంటూ వచ్చినందున అనేక చిన్న గ్రామాల పేళ్ళు వ్రాయడము విస్తరిస్తున్నదని వ్రాయలేదు. వింధ్యవాసిని కొండ అదృశ్యమయిన వెనుక చూపు మేరలో యెక్కడా కొండలు అగుపడడములేదు.

యీ జూసీనరాయి అనే ఊరు గొప్పది. గంగవొడ్డున వున్నది. గనుక గంగకు అటు పక్క వుండే ప్రయాగకోట ఊరున్ను, త్రివేణీ సంగమమున్ను, తెలుస్తూ వుంచున్నది. యిక్కడ గంగ దక్షిణ వాహిని. యమున కలియని శుద్ధగంగలో యీవూరి ఘాటువద్ద స్నానము చేయవచ్చును. యీ ఘాటున మళ్ళీ గంగదాటి ప్రయాగ చేరవలసినది. యిక్కడ గంగ కోసెడు దూరము వెడల్పు కలిగి వున్నది. ప్రవాహవేగము బహు విస్తారము. గంగ ప్రవహించే దేశము, ఇక్కడ ఆభ్రక సంబంధమయిన భూమి గనుక గంగాజలము మెరుస్తూ వున్నది. ఈ వూరిలో ముసాఫరు లాయఖు పదార్ధములన్ని దొరుకుచున్నవి.

వూరినుంచి గంగ దాటేటప్పుడు ప్రవాహము తీసి వుండేయిట్టి కాలాలలో నడమ మిట్ట పెట్టి వుంటున్నది గనుక నడమ పడవ దిగి మిట్టకవతల మళ్ళి పడవయెక్కి ప్రయాగలో దిగవలసినది. రెండుమాట్లు యెక్కి దిగే ప్రయాస లేకుండా యీవూరినుంచే యమునానదిలో నా పడవలు పొయ్యేటట్టు చేసి ఒకసారిగానే ప్రయాగలో పెరిమిట్టు ఘాటులో దిగినాను. యిక్కడ మనిషి ఒకటికి పయిసా వంతున ఘాటుసుంకము పడవదాటడానికి యియ్యవలసినది. యీ ఘాటుసుంకము సాలుకు ఇరవై మూడు వేల రూపాయిలు లెక్క యిజారాకు యిచ్చివున్నారు. రెండు పాయింట్ మూడు ఘంటలకు త్రివేణి దర్శనముచేసి స్నానక్షౌరాదులు చేసుకోవడమయినది.

యీ ప్రయాగ మాహత్మ్యమేమంటే జగత్సృష్టికి ముందు పరమాత్ముడు బాలరూపాన్నిధరించి యీ స్థళమందున్న అక్షయవటపర్ణముమీదవసించి వుండినాడు. యీ మూలవటము యెన్నటికి క్షయమును పొందనిది గనుక అక్షయవట మనే నామము గలిగినది. ఈ అక్షయవటమే బ్రహ్మస్వరూపమని పురాణసిద్దము. పిమ్మట జగత్సృష్టి అయన వెనకకూడా ఈ అక్షయవటము సువర్ణమయమై బహుకాలము శోభిస్తూ వుండినది. మాధవమూర్తి కూడా యీ వటవృక్షాన్ని అనుసరించి యిక్కడ విరాజమానుడయి వున్నందున యీ స్థళము బహు పుణ్యస్థల మయినది. తద్వారా యీ పుణ్యస్థలములోచేశే సుకర్మాలు అక్షయ ఫలప్రదము లౌననే తాత్పర్యముతో పూర్వము బ్రహ్మ యిక్కడ దశాశ్వమేధఘట్ట మని ప్రసిద్ధి పడి వున్నది. ఈ దశాశ్వమేధాలు చేసినంతలో మాధవమూర్తి బ్రహ్మకు ప్రసన్నుడయి యిచ్చయించిన వరమిస్తానని వాగ్దత్తము చేసినాడు. గనుక బ్రహ్మ యీ మహాస్థలము విష్ను క్షేత్రమని యిదివరకు ప్రసిద్దమై యున్నది కదా, యికమీద నావేరుకూడా యీ స్థళానికి సంబంధించి వుండేటట్టు చేయవలెనని ప్రార్ధించినాడు. మాధవమూర్తి అదేప్రకారము కటాక్షించి యికను లోకులు యీ క్షేత్రాన్ని విష్ణు ప్రజాపతి క్షేత్రమని వాడుకుందురు గాక అని నియమించినాడు. అది మొదలుగా యీ స్థళాన్ని విష్ణుప్రజాపతి క్షేత్రమని వాడుకుంటున్నారు.

యిట్లావుండగా సూర్యభగవానుడు చాయాదేవికి గర్భోత్పత్తి అయ్యేటట్టు చేసెను. తదనంతరము ఆమె తపస్సు చెస్తూ వుండేను. మళ్లీసూర్యుడు ఆమెతో సంగమము యిచ్చయించి నంతలో ఆమెగర్బావస్థలో సంగమము విధివవ్యతిరిక్తమని సమీపానికి రాక పోయినది. సూర్యుడు మోహావేశ యుక్తుడయి చాయాదేవి సమీపానికి వచ్చినాడు గనుక వెంబడిగానే అతని తేజోవేగానికి అమెగర్భము నిలవలేక్ విచ్చిత్తి అయిపోయినది. ఆ చొప్పున విచ్చిత్తి అయిన గర్భము కొంతమట్టుకు ఒక పిండాకృతిగా నున్ను కొంతవుదకముగా నున్ను స్రవించి నందున చాయాదేవి సహితముగా సూర్యుడు విస్మయాన్ని పొందినాడు. వెంబడిగానే హరిరుద్రాదులు ప్రసన్నులయి రుద్రుడు తన శక్తిని ఆ పిండములో ఆవాహనచేసి యమధర్మరాజు అనే ఒక పురుషుణ్ణి ఆ పిండము ద్వారా వుత్పత్తిచెసి భూమిలో దక్షిణభాగమందు వుండేటట్టు నీమించి పాపులను విచారించి శిక్షింఛేటట్టు నీమించినాడు. విష్ణువు తత్ప్రతిగా స్రవించిన వుదకములో తన శక్తిని ఆవహింపచేసి యమునా అనే నామముతో ఒక స్త్రీని ఉత్పత్తిచేసి నదీరూపముతో భూమిలో లోకుల పాపాలను పోగొట్టుచు రమ్మని నీమించినాడు. అప్పుడు ఆ యమునా అనే స్త్రీ నదీస్వరూపముతో యీ పుణ్యక్షేత్రానికి ప్రవహించి వచ్చినది. యిక్కడ విరాజమాన్యుడుగా వుండే మాధవమూర్తి ఆ స్త్రీ సౌందర్యము చూసి మోహితుడై భార్యగా వరించినాడు.

యిట్లుండగా రామాయణములో వివరించిన హేతువులచేత భగీరధుడు గంగను కూడా భూలోకమునకు తీసుకొని వస్తూవుండగా గంగ యీ క్షేత్రములో ప్రవేశించగానే యమునకు సమాచరము తెలిసి యెదురుకొని పొయి ఆరాధించి తనతొ కూడా కలిసి ప్రవహించనలెన్ని ప్రార్ధించినది. అందుకు గంగ చెప్పిన దేమంటే నీవు మహా ప్రసిద్ధురాలయితివే. నీతో కలిస్తే నాపేరే లేకపోనేమో అని సందేహించి నంతలో యమునానది గంగాసహావాసాపేక్షితురాలై యీ క్షేత్రము మొదలుగా నీవు నాతో కలిసి ప్రవహిస్తే పేరు నీదేను. నాప్రవాహ స్వరూపము మాత్రము వేరుగా వుండతగ్గదని వరమిచ్చినందున గంగ యమునతో యిక్కడ సంగమమైనది. యీ స్థలము యాగాలుచేయు నిచ్చయించిన బ్రహ్మదేవుడు మొదలుగాగల పెద్దలను ఆకర్షింపుచు వచ్చినందున ప్రయాగ అనే పేరు యీస్థలానికి కలిగి నది. యీ ప్రయాగక్షేత్రములో గంగ యమునతో సంగమమయినది మొదలుగా సాగరసంగమ పర్వంతము రెండునదుల సమిష్టి జలము ఒకపక్క యమునా సంబంధమైన నైల్యల్వర్ణము గలిగి గంగా అనే పేరుతో ప్రవహిస్తూ వున్నది.

యిట్లుండగా బ్రహ్మ అశ్వమేధాలు చేసిన వెనక యీస్థలాన్ని స్తుతి చేయను మొదలుపెట్టి సమాప్తి చేయడానకు శక్తుడుగాక పోయెను. బ్రహ్మపుత్రి అయిన సరస్వతి నేను సమాప్తిచేయ గలను గాని నీచేత వచ్చునా యని స్తుతి చేయను ఉపక్రమించి ఉపసంహారము ఛేయను శక్తురాలు కాకుండా పోయి లజ్జితు రాలయి వుండెను. యిట్లుండగా బడబుడు అనే ఒక రాక్షసుడు భూలోకమందు పుట్టి అతి క్షుత్తిచేత లోకాన్ని హింసిస్తూ వచ్చినందున త్రిమూర్తులు లోకరక్షణర్ధ మయి ఒకటిగా కూడి యోచన చేస్తున్నంతలో లజ్జితురాలయిన సరస్వతి యేసాకుచేత నయినా బ్రహ్మముఖము చూడక తప్పించుకొని పోవలెననే యిచ్చచేత నేను ఆ రాక్షసుని ఉపద్రవము జగత్తునకు లేక చేస్తున్నానని ప్రతిజ్ఞచేసి బ్రహ్మలోకము వదిలి వారి అనుజ్ఞమీద భూలోకానికి వచ్చి అతి సుందర రూపముతో వీణాగానము చేస్తూ ఆ రాక్షసుని సన్నిధానానకు వచ్చినది. ఆ రాక్షసుడు ఆమె సుందరాకృతికి మోహితుడయి క్షుద్బాధను కూడా వహించి కొంతసేపు లోకాన్ని ఉపద్రవ పెట్టని వాడయి సరస్వతిని చూచి నిన్ను వివాహము చేసుకోవలెనని మనసులో వున్నదని చెప్పినాడు. ఇంత క్షుత్తుగల నిన్నుపెండ్లి ఆడితే భోగాలకు సావకాశము వుండ నేరదే... ఒక వేళ నీవు నన్ను భక్షించి వేతువనే భయము నాకు జనింపుచున్నది గనుక క్షుత్తు నివర్తింఛే పని ముందర విచారిస్తే వెనక వివాహసంగతి మాట్లాడు కొందామని సరస్వతి చెప్పెను. సాక్షుత్తు నివృత్తి అయ్యేమార్గము నీవే విచారించ వలనని ఆ రాక్షసుడు సరస్వతిని ప్రార్ధించి నందున బడబాసురుని మంచిదని వెంట పెట్టుకొని సముధ్రమధ్యే తెచ్చి సముద్రోదకాన్ని పానము చేయుము, నీ క్షుత్తుతీరిన వనక వివాహము చేసుకుంటానని చెప్పెను. మంచిదని ఆద్వాసి బడబుడు అగ్ని స్వరూపముగా బడబాగ్ని యనే పేరు పెట్టుకుని సముద్రోదకాన్ని పానముచేస్తూ వున్నాడు.

యీ రీతిగా ఆ రాక్షసుణ్ణి నివృత్తి పొందించి నాకు కూడా సమాప్తి చేయను అశక్యమయిన స్తుతికి పాత్రభూతమైన యీ ప్రయాగను కండ్ల చూతామని సరస్వతి ఇక్కడికి వచ్చినది. ఆ సమాచారము గంగా యమునలకు తెలిసి సరస్వతిని ప్రార్థించి తమతో కూడా యీ స్థలమందు క్రీడింపుచు వుండవలనని చెప్పినారు. సరస్వతి ధన్యురాల నయితి నని యెంచుకొని వారి ప్రార్ధనను అంగీకరించి అయితే నేను ప్రకాశముగా మీతో క్రీడింపుచు నుంటే బ్రహ్మ యేమే సరస్వతి, ప్రయాగ మహాత్మ్య స్తుతిని సమాప్తిచేయక పోతివని నన్ను అడుగును, అప్పుడు నేను మిక్కిలి లజ్జించ వలసి యుండును, గనుక గుప్తగామినై మీతోకూడా వుంటానని, అద్యాపి క్రీడింపుచు నున్నది. వారు ముగ్గురునున్ను యీరీతిగా యిక్కడ సంగమమయి నందున త్రివేణి అనే మూడుపాయలు గల జడ అయినారు. ఈ త్రివేణి పయిన వ్రాసిన అక్షయ వటమనే వృక్షము కుచ్చుగా ప్రకాశింపు చున్నది. గంగ యమునతో సంగమ మయినది మొదలు లోకులు పాపాలను కత్రించను ఈ రెండు నదులు మంచి కత్తెర అనే ఆయుధముగా నున్నా ఆ కత్తెరకు నడుమ బిగింఛే చీల లేకున్నందున బలము తక్కువబడి యుండెను. ఈసరస్వతి గుప్తగామినిగా ఆఛీల స్థానముని పొంది వున్నందున ఈ మూడు నదులున్నూ అది మొదలుగా లోకుల పాపాలను కత్రించను శక్తిగల చురుకయిన కత్తెర అయి త్రివేణి నామమును వహించి సదరహి ముగ్గురు స్త్రీలున్ను ఇచ్చట ఒక నదీరూపమును వహించి ప్రవహింపుచున్నారు.

ఇచ్చట క్షౌరము, గోదానము, త్రివేణీదానము, తిలదానము, కించిద్దానమనే ఉపాయ దానమున్ను, ముఖ్యములని చెప్పబడియున్నవి. ధైర్యముచేత ప్రాణదానము ఇచ్చట చేస్తే వాడు జన్మాంతరమందు ఇహసుఖమును కోరిన ప్రకారముగా అనుభవించి మళ్ళీ యీ క్షేత్రమందే మరణము కలిగి అవతల జన్మమము లేకుండా ముక్తిని పొందునని పురాణమందు చెప్పబడియున్నది. యీస్థల మహాత్మ్యము ద్వాదశాధ్యాయములు గలది ఒకటిన్ని శతాధ్యాయములు గలది ఒకటిన్ని యిచ్చట శ్రవణము చేయబడుచు నున్నది. ఈ క్షేత్రమందు స్నాన దానాలకు మకర మాసము ముఖ్యము. అప్పట్లో లక్షోపలక్ష ప్రజలు వచ్చి యాత్ర చెసుకొని పోతారు.

యిక్కడ స్వేచ్చా మరణము వల్ల యిష్టసిద్దిని జన్మాంతరములో పొదుటచేత ముచికుంద బ్రహ్మచారి అనే తపస్వి సార్వభౌమత్వము కోరినవాడై నడుము దాకా దేహాన్ని బద్దలుగా కోసి అహుతులు చేసి యిక్కడ దేహము చాలించినాడు. అతని శిష్యులు జన్మాంతరములో అతనికి పరిచారకులుగా వుండవలెననే ప్రార్ధనతో ఆ హోమాగ్నిలో ధుమికి దేహాలు విడిచినారు. వీరి కందరికిన్ని జన్మాంతరములో పూర్వ జన్మజ్ఞానము వుండవలె ననే ప్రార్ధనకూడా వుండినందున యీ స్థల మాహాత్మ్యాన్ని ప్రస్తుతి చేసినట్టుగా యెనిమిది శ్లోకాలు వ్రాసి బొరుగులు వేయించి అమ్మే ఒక స్త్రీ వశముచేసి చనిపొయినారు గనుక ఆ బ్రంహ్మచారి ఢిల్లికి అకుబరు ఫాదుషాగా నున్ను శిష్యులు మంత్రులుగా నున్ను అయిన వెనక జన్మాంతరజ్ఞానము వున్నందున మళ్ళీ ఈ స్థళానికి వచ్చి తాము శ్లోకాలు వ్రాసివుంచిన స్త్రీ బ్రతికి వుండగా ఆపెవద్ధ పూర్వము వ్రాసివుంచిన శ్లోకాలు తీసి చదువుకొని ఆశ్చర్యపడి స్వేచ్చా మరణము కోరినవారికి యిక్కడ అనుకూలముగా మెడయిస్తే తృటికాలములో అనాయాసముగా తెగకోసే యంత్రము ఒకటి వుండగా తమకు బాధగా వుండుననే వెర్రి తాత్పర్యముతో ఆ యంత్రాన్ని యెత్తి పారవేసి త్రివేణీ సంగమము వద్ద అత్యద్భుతమయిన కోట వకటి కట్టినారు. ఆ కోట యెంత ప్రవాహాలనున్ను ధిక్కరించి అత్యంత బలముగా యిదివరకు ఉన్నది.

ఆ సువర్ణాక్షయపటము కలి సామ్రాజ్యకాల మయినందున త్రివేణీసంగమము వద్ద వున్నా యిప్పట్లో ఆదృశ్యమయి యున్నది.

దానికి ప్రత్యామ్నాయముగా కోటలో ఒక నేలమానికెలో ప్రయాగేశ్వరుడు మొదలయిన లింగాలు బింబాలున్ను ఉండే తావున ఒక లావు మర్రికొమ్మను తెచ్చి యీ స్థళజ్ఞులు పాతివున్నారు. వాటిని లోకులు ఆరాధిస్తారు. త్రివేణీ మాధనం సోమం భరద్వాజం చవాసుకిం, వందే ఒక్షయవటం శేషం ప్రయాగం తీర్ధనాయకం అనే శ్లోకప్రకారము ఆ యెనిమిది తావులకు వెళ్ళి యిక్కడ దిన యాత్ర చేయవలసినది. గనుక ప్రత్య్హామ్నాయ మయిన అక్షయవటపూజ యిక్కడ అగత్యమయినది. అందులో సోమేశ్వరుడిగుడి మాత్రము యమునకు అవతలిగట్టున వున్నది. కడమ అన్ని గుళ్ళు ప్రయాగ క్షేత్రమందే వున్నవి, గనుక నిత్య యాత్ర రవంత ప్రయాసతో చేయవచ్చును.

యీ స్థళమాహాత్న్యములో యీ త్రివేణీతీరమందు ప్రతి గ్రహానకు బహు ప్రత్యచాయము చెప్పి వున్నది. గనుక భిక్షాటన మే స్వధర్మ మయిన బ్రాంహ్మణులు యిక్కడ వాసము చేయడానికి భయపడి యీ స్థళవాసమే మానినారు. యింత పుణ్యతీరమందు బ్ర్రాహ్మణులు లేకపోతే లోకులు కడతేర రనే తాత్పర్యము చేత లోగడ డిల్లీ పాదుషా కింది అధికారస్థులు కొందరు కనోజా బ్రాహ్మణులకు భూస్థితు లిచ్చి యిక్కడ యెల్లప్పుడు తీరవాసులుగా వుండేటట్టున్ను యీ తీరములో వారికి స్థలాధికారాన్నిన్ని కలగచేసి కొందరిని స్థాపించినారు. వారు ప్రయాగవాశీలని పేరు పెట్టుకొని యిప్పటికే రెండు వందలుమంది, వంద ఇరవై నాలుగు ఝండాలు వేసుకొని స్నానఘట్ట మందు బలంపీటలువేసిస్నానము చేయవచ్చే వారికి ఉపకృతులు చేస్తూ ఆయాచిత జీవనము యాత్రవారిగుండా చేస్తూవున్నారు. వీరుగాక పంచ ద్రావిళ్ళతో చేరిన మహారాష్ట్రులు పది యిండ్లవారున్ను తెనుగు వారు మూడిండ్లవారున్ను నూరు యేండ్లుగా ఠాణాలనే పేరుపెట్టుకొని యిక్కడా వసిస్తూ వున్నారు.

ఒకటి రెండు ధర్మ శాలలు ద్వారకాదాసు లక్కునో నవాబు మంత్రి కట్టించినవి యీ స్థళములో వున్నవి. దేశాంతరస్థులకు అన్నము అహల్యాబాయి సత్రము నిలిచి పోయినది మొదలుగా శుద్ధముగా లేకవున్నది. త్రిస్థళయాత్ర చేసేవారు అందరున్ను యెట్లా? కాశిలో మాత్రము అన్నపూర్ణ ఆజ్ఞచేత ద్రావిడ దేశస్థులకు యిక్కడి వారికి బుద్ధి ప్రేరితమయి అనేక సత్రాలు యేర్పడి వున్నవేగాని యిక్కడ ఒక సత్రమయినా లేక వున్నది.

యీ క్షేత్రములో యమద్వితీయమనే కార్తిక శుద్ధ విదియ నాడు యమునాస్నానము బహు ముఖ్యము. యమధర్మరాజు ఆదినము తన తోడబుట్టు అయిన యమునను జూచే నిమిత్తమై యిక్కడికి వచ్చి ఆ దినము యమునలో స్నానముచేసేవారి వంశస్థుల కంతా యమదండన లేకుండా వుండేటట్టుగా వర మిచ్చినాడాట. ఆ దినము యమునా స్నానము నాకు రామబ్రహ్మము కలిగేటట్టు కటాక్షించినాడు.

యీ ప్రయాగ వూరు ఫాదుషా కోటకట్టిన వెనక బహు బస్తీ అయినది. ఇప్పుడు, ఊరు, కట్టి సుమారు నాలుగువేల యేండ్ల దాకా అయినది. లక్కునో నబాబు డిల్లి పాదుషాను స్వామిద్రోహము చేసి లక్కునో రాజ్యముతోకూడా యీ ప్రయాగను స్వాధీనపరచుకొని ప్రయాగ వాళీలకు పాదుషా యిచ్చిన మాన్యపు భూములు యావత్తు కట్టుకున్నాడు. పిమ్మట ముప్పై సంవత్సరముల కింద కంపెనీవారు స్నేహపూర్వకముగానే యీ ప్రయాగను దీని చుట్టు ఉండేభూమితోకూడ తీసికొని త్రివేణి సంగమమువద్ధ వుండే కోటను బహుబలముచేసి భరతపురపు రాజు మొదలయిన గొప్పవారిని భద్రపరచడానికి తగుబాటిగా మిక్కటమయిన రస్తుతో కూడా కోటను కాపాడుతూ వున్నారు. కోట బహు ముచ్చటగా బయిటికి కనబడుచున్నది. ప్రత్యామ్నాయ పటవృక్షాన్ని కొటబురుజుకింద వుండే సరస్వతి తీర్ధానిన్ని దర్శనము చేసినాను. యీ ప్రయాగకు మొగలాయీలలో అలహాబాదు అని పేరుపెట్టినారు. ఆధికారస్థులు అదేప్రకారము యిప్పటికిన్ని వాడుకుంటారు. యీ అలహాబాదులో ఒక రెవెన్యూ కల్కటరు ఒక కస్టం కల్కటరు ఒక మేజస్ట్రేటు ఒక జడిజీయున్ను వుండివున్నారు. వీరికందరికి అధికారిగా ఒక కమిస్సనరును యేర్పరచి పెట్టినారు.

మిరిజాపూరు దొరలు యిచ్చిన ప్యానుపోట్రులను యిక్కడి దొరలు కాయముచేసి వేరే ప్యానుపోట్రులు తాము ఇచ్చి కాశిదాకా కూడావచ్చేటట్టు బరక్రదాసు అనే ఒక పోలీసు బంట్రౌతును నా తయినాతీచేసి జూసీనరాయిలో ఫరవానాకు వ్యతిరిక్తముగా నా మూట ముల్లెలను శొధించి పెరిమిట్టు మనుష్యులను కొలువు తీసివేసేటట్టు నిశ్చయముచేసినారు. వారున్ను భగత్సృష్టితోచేరినవారయి తద్వారా నా సహోదరు లయినందున వారికి నావల్ల హింసకావడము యుక్తము కాదనిన్ని క్రోధము పాపకారి అనిన్ని యీశ్వరుడు నాబుద్ధికి తోపింపఛేసిన వాడయి నాకుండా ఆదొరలను మళ్ళీ ప్రార్ధించబడేటట్టు చేసి వారి జీవనాలు కాపాడినాడు.

యిక్కడ వేణీదానము పెనిమిటి సహితముగా వచ్చిన స్త్రీలున్ను పితృసహితముగా వచ్చిన వివాహముకాని కన్యలున్ను చేల్యవలసినది. యీ వేణీదాన మనగా జడ కత్రించి దాన మియ్యడము ముఖ్యమా, లేక తల వెంట్రుకలు యావత్తు కత్రించి యియ్యడము ముఖ్యమా అనే వివాదము, మనదేశములో రామానుజ దయాపాత్రము వారున్నూ శ్రీ శైల దయాపాత్రము వారున్ను నాసాగ్రము యేది అని వివాదపడ్డట్టుగా పడి, మనవారు ఏకవాక్యత పడనట్టు వీరున్ను యీ విషయములో ఏకవాక్యత పడక కొందరు స్త్రీలకు జడవేసి కొంతమట్తుకు కత్రించి దానము చేస్తారు, కొందరు తలవెంట్రుకలు యావత్తు కత్రించి యిస్తున్నారు. నేను సమగ్రముగానే దాన మిప్పించినాను.

ముందు కాలాలలో యిక్కడ వచ్చి క్షౌరము చేసుకొని యాత్ర చేయడానికి మనిషికి ఏడు రూపాయల వంతున దొరతనము చేసేవారు హశ్శీలు పుచ్చుకొనుచు వచ్చినారు. యిప్పట్లో మనిషికి కంపెనీవారు ఒక రూపాయ వంతున నిష్కర్షచేసి త్రివేణీ సంగమము ఎక్కడ అవుచున్నదో అక్కడ పాటక్కు అనే ఒక చావడివిడవలి, పూరి,తో కట్టివుంచినారు. ఆ పాటాక్కులో పన్నెండు బంట్రౌతులతో ఒక జమీదారుణ్ని ఉంచి యున్నారు. ఆ పాటక్కుకు కొన్ని బారలకు ముందుగా ఒక దారోగా కచ్చేరిని ఉంచుయున్నారు.

ఆరాధనను విధిగా యేర్పరచినారో యెట్లా వైష్ణవ మతస్థులలొని మద్యపాయలు తరించడానికి రహస్య రామానుజకూటారాధనను నియమించినారో తద్వత్తుగా లోకముమీద విసుకుచేత దేహమును బలాత్కారముగా త్యజించడానికి నిశ్చయించినవారు తరించడానికికూడా యీ ప్రయాగ మహాత్మ్యద్వారా దేహత్యాగము విధిచోదితముగా చేసినట్టు తోచుచున్నది. మెట్టుకు యీ కర్మభూమిని జనియించిన తిర్యగ్జంతువులు కూడా ఒక విధమైన భక్తి యీశ్వరుని యెడల కలిగి తరించవలసిన అగత్యము పూర్వీకులకు కలదు గనుక వాని వాని శక్తికి, ఇచ్చకున్ని, యెక్కువగా పనులు నియమిస్తే చెయక తద్ద్వారా యీశ్వరభక్తి లేక ముణిగిపోదురు గనుక వారి వారి ఇచ్చకు, శక్తికిన్ని, అనుకూలమయి నట్టుగా, సారాయి తాగితే తాగినావు యీశ్వరాప్రణమని ఒక విధమయిన ఆరాధనతో తాగు అన్నట్టు, ఆత్మహత్య చేసుకుంటే చేసుకున్నావు, యీశ్వరార్పిత మని శ్రద్ధతో ఫలాని తావుకుపోయి విధి పూర్వకముగా చేయుము అనేటట్టుగా యిక్కడ నియమించినారని నాకు తొచుచున్నది.

త్రివేణి గర్భములో కోటగోడకింద నాకోసరము తత్పూర్వమే చప్పరాల కొట్టాయీలు వేయించి వున్నందున అందులో తీర్ధశ్రాద్ధాదులు పెట్టించినాను. బ్రాహ్మణుడు ఒకటి కి రూపాయి వంతున దక్థిణ యిచ్చినాను. ఆ బ్రాహ్మణులున్ను, అందుకు సంతొషపడిరి. ప్రయాగవళీల స్త్రీలు రాణివాసము గలవారు గనుక తెనుగు మహారాష్ట్ర ముత్తయిదువలు పన్నెండు మంది దొరికి నందున వారికి మాయింటి స్త్రీలతొ కూడా ఆ చప్పరాలలో ముందుగా యిక్కడి వాడికె ప్రకారము గాజులు తొడిగించి అభ్యంగనాలు చేయించి నూతన వస్త్రాలను ధరింప చేసి మేళతాళాలు స్వస్తి వచనములతో కూడా త్రివేణీ సంగమము వద్దికి వెళ్ళి వేణీదానము యిప్పించినాను.

యీ చప్పరాలు పదహారు రూపాయల బాడిగెకు బనయావాడి, కోమటి, వద్ద నిష్కర్షచేసుకొని పయిన పది రూపాయిలు ఖర్చు చేసి అరవ భాష - పఆన, --- అను అక్షరస్వరూపము, అందముగా కొట్టాయీ ఒకటి కి నలభై అడుగుల నిడువున్ను పదహారు అడుగుల వెడల్పున్ను పెట్టి మూడు కొట్టాయీలు వేయించినాను. బహు రమణీయముగా వుండినవి. ఆచప్పరాలు బాడిగెకు యిచ్చిన బనయావాడు అక్కడనే ఒక అంగడి తెచ్చిపెట్టినాడు. సకల సమానులున్ను వాడివద్ద పుచ్చుకొన్నాము. మకర మాసంలో వచ్చే జనము దిగడానికి బనయావాండ్లు వేలపర్యంతము చప్పరాలు కట్టి యీలాగంటి కొట్టాయీలు వెసి అడుగుకు పావులావంతున బాడిగె తీసుకొని మీది మిక్కిలి ఆ దిగిన వారిని మరియొక తావున సౌదా అనే సామాను కొనకుండా నిర్బంధపెట్టుతారు. అయితే యిటువంటి చప్పరాలు కావలసినన్ని బాడిగెకు దొరుకుచున్నవి.

నేను యెల్లప్పుడున్ను త్రివేణీదర్శనము కాగల ద్వారకాదాసు ధర్మశాలలో దిగినాను. యీ స్థలములో వశించినన్ని దినాలున్ను ప్రతిదినమున్ను ఉదయాన యీ చప్పరాలకు వచ్చి సాయంకాల పర్యంతమున్ను యిక్కడనే వుండి రాత్రి పడకకు ధర్మశాలకు పోవుచు వచ్చినాను. ప్రయాగవాళీలకున్ను ఘాటీ వారికిని యింటికి రెండేసి అణాల వంతున సుమారు పదకొండు వందల ఇండ్లకున్ను, ముట్టచెప్పినంతలో వారందరున్ను సంతొష పడిరి. యిక్కడికి గొప్పవారు వస్తే స్నాన ఘట్టములో ఒక బలంపీట నున్ను ఒక జండానున్ను వేయడం వాడికె గనుక పదిరూపాయలలో రెండున్ను నన్ను అనుసరించిన శంకర ఘాటీకానును తెమ్మని స్నాన ఘట్టములో వేసి అతని అధీనము చేసినాను. క్షౌర గనమున్ను, వేణీదాన దినమున్ను, భూరి యివ్వడములో పద్నాలుగు రూపాయల పయిసాలు తగులుచున్నవి. అందులో అన్ని జాతులు చేరుతారు. త్రివేణిదానానికి మరునాడు నా ప్రయాగవాళీ యింట్లో ప్రయాగవాళీలకు నూరుమందికి సంతర్పణ చేసినాను. దక్షిణ సహితముగా ఇరవై నాలుగు రూపాయలు మట్టుకు ముట్టచెప్పినంతలో ఆనందించి నాతోకూడ వచ్చిన ప్రతి శూద్రుని చేత నేను మనిషి ఒకటి కి యిచ్చిన రెండేసి అణాలు తీసుకొని తీర్ధవిధి పిండప్రదాన సహితముగా చేయించినాడు. పంచద్రావిళ్ళుపెట్టే శ్రార్ధాలజోలికి వారు రావడములేదు. పిండ దక్షిణ అనే పేరుతో బ్రాహ్మణార్ధము చేసే ఒక బ్రాహ్మణునికి యిచ్చే దక్షిణంత ప్రతి శ్రార్ధానికిన్ని ప్రయాగవాళీ తీసుకొంటాడు. యీపాటి, నాకుండా యీ స్థలములో యీశ్వరుడు జరిపించడము వల్ల చెన్నపట్నానికి యశస్కరుముగానే వుండినది.

నేను ప్రయాగవాసము చేసినన్నిదినములు వైదికుల సమూహము తోనే కాలము తోయడమయినది గాని హయిదరాబాదు వగయిరా షహరుల వలెనే లౌకిక సహవాసము నేను త్రివేణీతీరమునందు దిగినందున నిండా తగిలినది కాదు. యీ ప్రయాగలో నాలుగు పటాలాల బారూన్నది. ఆ దండు వుండే స్థలము బస్తీకి రెండుకోసుల దూరము. నా మీద దయచేసి నేను సేవచేసిన సర్ జాన్ న్యూబోటు,, Sir John Newbolt,* సర్ చర్లీనుగ్రే మదలయిన దొరలు వ్రాసి యిచ్చిన క్యారకటరులు యీ పరస్థలాలలో నున్ను యింత గొప్ప చేస్తున్నవి.

సర్వాంతర్యామిగా వుండే పరమాత్ముడు యేలే స్వామిలో యేలబడే వారి యాత్మలలో దీపించుటకంటే యెక్కువ దీప్తితో ప్రకాశించుచున్నాడు. గనుక స్వామిభృత్యన్యాయముగా మనుష్యుడు నడుచుకొంటే పరమాత్ముడు ఆనందించి ఆ నడిచిన వానికి సకలేష్టసిద్ధులు కలగచేయు చున్నాడు. యిందుకు యే మాత్రమున్ను సందేహములేదని తోస్తున్నది.

బంగాళా గౌర్నమెంటువారు పినాన్సుకమిటీ అనే సెలవులు తగ్గించే సమూహము వారి తాత్పర్యము మీద అక్కడక్కడ ఉండే కష్టం హవులనే సాయరు చావిళ్ళు యెత్తివేసి చెన్నపట్టణమువలెనే కష్టం అనే సుంకమును యీజారాకు యివ్వవలె నని యత్నముచేసినారు. యీ రాజ్యములో వుప్పుకు తీరువగాని చెన్నపట్టణమువలె మొనాపొలీ చేసి సుంకము యీజారాకు యివ్వడములేదు. చెన్నపట్టణమువలె జరిగించడము యీ దేశస్థులకు సమ్మతము లేక నున్నది. అందువల్ల సుంకము యీజారాకు యివ్వడములో యిటీవల చెన్నపట్టణములో తూకున, ఉరి, తీయబడిన అణ్నాసామి వగయిరాలకంతా కలిగిన

*న్యూబోల్ టు గారు చెన్నపట్టనములో పద్దెనిమిది వందల పదిహేను నుండి పద్దెనిమిది వందల ఇరవై వరకు సుప్రీము కోర్టు ప్రధమ న్యాయమూర్తిగా వుండేవారు.


పదకొండవ ప్రకరణము  ప్రయాగ నుండి కాశీ మార్గము

ప్రమాదాలనున్ను, యింకా కలగ గల ప్రమాదాలనున్ను, నాకు తొచిన మట్టుకు తెలిశేటట్టు ఒక యాదాస్తు శీకష్టం కలకటరు మేస్తరు నీపన్, Mr. Nepean, దొర కోరినమీదట వ్రాసియిచ్చినాను.

మేస్తర్నీపన్ దర నాతో మత సంబంధమయిన ప్రసంగము వచ్చినప్పుడు యీ నదులను యీ గుళ్ళను యీశ్వరుడని నమ్ముతావా అని ప్రశ్నచేసెను. చెన్నపట్టణంకు చూడని మీకు, హిందూస్తాన్ ప్లాన్ యెత్తి యిదుగొ చెన్నపట్టనమని చూపిస్తే అది చెన్నపట్టణమౌనా? చెన్నపట్టణము ఫలాని తావున వున్నదని బోధ చేయవలసినవారికి వారిని చెన్నపట్టణానికి పిలుచుకుని పోయి ప్రత్యక్షముగా చూపించను వల్ల లేని పక్షమందు, ప్లాన్ గుండా నయినా చూపించవలసినది అగత్యము గనుక, యెట్లా ప్లాన్ వ్రాసి మీరు యెరుగని దేసాలను ప్రకటనము చేయుచున్నారో తద్వత్తుగా జ్ఞానముచేత యీశ్వరుని తెలుసుకో లేని వారికి ఈ కర్మస్థలముల మూలముగా యీశ్వరుని యెడల భక్తి కుదిరేటందుకు యిటువంటి స్వరూపాల యెడల యీశ్వరజ్ఞానము ఆరోపితము చేసి ఆరాధనోపాయములు మాపెద్దలు చేసినారు, అని ప్రత్యుత్తర్వు యిస్తిని. అయితే నీవు క్రీస్తు మతస్థుడవేకదా! అని చెప్పి సమ్మితి పడినాడు.

ఈదేశములో మహారాష్ట్రులు మొదలయిన ద్రావిళ్ళును, ఘూర్జరులతో భోజనప్రతి భోజనాలు చేయడము లేదు. అందుకు కారణము ఘూర్జరులు శంకరాచార్యులవారి శాపగ్రస్తులని చెప్పుచున్నారు. యిక్కడ వాసమి చేసే పంచ గౌడస్త్రీలు రవికెలు తొగడములేదు. తురకసంప్రదాయ ప్రకారము ప్రతిస్త్రీలున్ను ముసుకులేకనే బయటరారు. ఆరుమూర నిడివి, నాల్గు మూర వెడల్పులో చంగావివేసిన మంచిరేకు విత్తముకొద్దీ తీసి ముసుకుగా ముఖముకూడా తెలియకుండా దేహ మాద్యంతము కప్పుకొనుచున్నారు. గంగారీరందు వసించే సకలజారులు స్నానము శివపూజ చేయకనే జలపానము చాయడములేదు. పుణ్యనదుల తీరములలో వుండే వారి కంతా యిదే షాననియమము కలిగినట్లు నా అనుభవము నాకు తోపచేయుచున్నది. స్త్రీలు అందరు వుదయాత్పూర్వము గంగాస్నానముచేసి యిండ్లకు పోతారు. పిమ్మట పురుషులు స్నానానికి పోతున్నారు. యిక్కడి స్త్రీలకు స్వరూప సౌందర్మమే కాని ఆభరణాపేక్ష విస్తారము మనదేశమువలె కలిగిన వారు కారు.

మిరిజాపురము మొదలు ప్రతి మజిలీ వూరిలో బాడిగెకు గుఱ్రాలు కోసుకు ఒక అణావంతున కావలసినన్ని దొరుకుతున్నవి. తిరుల్వలిక్కేణి గాడీలవంటి గాడీలకు ఒక తట్టువాని గుర్రాన్ని కట్టి యెక్కా అని పేరు పెట్టి వారు వారు యెక్కడము మాత్రమే గాక కావలసినన్ని బాడిగకున్ను యిస్తూవున్నారు. ఆ యెక్కా అనే సవారీ దినానికి పది కోసుల సాధారణముగా పొవుచున్నది.

దక్షిణదేశములో వస్త్రాలు ఆ దేశస్థులు బహుశ, ప్రయాసపడి ఉతికి శుభ్రముగా వుంచుకొని వుండేటట్టు, ఈ దేశాస్థులు వాడుకునే పాత్రసామాను శానాసేపు ప్రయాసపడి తోమి బహు శుభ్రముగా వుంచుకొనుచున్నారు. యీ దేశస్థుల పస్త్రాల నైల్యమున్ను, మనదేశస్థుల పాత్రల నైల్యమున్ను, సమముగా ఉన్నది. యిందుకు కారణము నాబుద్ధికి తోచడ మేమంటే దక్షిణదేశస్థులు భొగప్రియులు గనుక వస్త్రసౌందర్యము కలవారయినారు. ఉత్తరతేశస్థులు భుక్తి ప్రియులు గనుక భక్షణోపకరణాలు శుభ్రముగా వుంచుకొనుచున్నారు. ఈదేశస్థులు యెనిమిదిమంది చేరితే తొమ్మిది పొయిలని ప్రసిద్ధిగనుక, వంటలు వారువారు దేహసంబంధికులయినా ప్రత్యెకముగా చేసుమొని మనదేశపు వైష్ణవులవలె దృష్టి దోషము మాత్రము పాటించకుండా భోజనము చేస్తారు.

మిరిజాపూరు మొదలు ప్రయాగవరము భూమినిండా సారవత్తు కాకపోయినా గంగవొడ్డు భూమిగనుక ప్రవాహము తీసిన కాలాలలొ దున్ని పయిరు పెట్తుచున్నారు. గంగవండలి మన్ను అతి సారవత్తు అయినది గనుక అమితముగా గోధుమలు వగయిరా పుంజధాన్యములు పండుచున్నవి. ఈదేశములో వేదపాఠము లేకునున్ను, వేదపారాయణము లేకనున్ను, ఉండడానికి కారణమేమని నా బుధ్యా ఊహించగా అర్ధము తెలియని వేదపాఠము యేమివున్నా శ్రౌత పురస్సరముగా యాగము మొదలయిన కర్మాలకు ఉపయోగమే గాని జ్ఞానానికి ప్రత్యక్షమైన సాధనము కాదు గనుక నున్ను, యీ భూమి మ్లేచ్చా క్రాంతమై పోయిన వెనక గంగాయమునల మధ్యే నివసింపుచు నున్న కర్మఠులయిన ద్రావిళ్ళు శుద్ధ ద్రవిడ దేశములయిన కావేరీ తామ్రపర్ణీ తీరములలో ప్రవేశించినందున అక్కడి వారు కర్మోపయోగిగా వేధాంతము తెలియక పోయినా వేద పారాయణము చేయడములో ఫలము కలదని ఫలశృతులు కలగచేసి బహుశ, వేదపాఠము పారాయణానకు ఉపయోగముగా జరిగిపుంచు వుండేటట్టు తోచుచున్నది.

యిప్పుడు పంచగౌడులని యిక్కడ వసింఛే వారికి గౌడులని పేరు రావడానకు కారణమేమంటే కర్మకులమయిన ద్రావిళ్ళు యీ గంగాయమునలమధ్యే వసింఛే కాలములో కర్మములయెడల శ్రద్ధ తక్కువైన వారైనందున వీరిని గౌణులు అంటూ వచ్చినారు. ఆనామమే యిప్పుఛు గౌడులని ప్రసిద్ధమైనది. కర్మఠులు యీ రాజ్యము వదిలి పోయి ఢిల్లీనుంచి వచ్చిన తురకలచేత ఈ రాజ్యమంతా నిండిపోయినందున నిండా కర్మకులు కాకుండావుండే గౌడులకు ఆ తురకలటో సహవాసము కలిగి నందున ఉచ్చారణలుకూడా ఆ తురకభాషను అనుసరించినవి. ఆచారాలు కూడా తద్ధ్వారానిండాభేదించి పొయినట్టు చెప్పుచున్నారు. ఈ దేశము తురకదేశమునకున్ను, హిందూ దేశమునకున్ను, నడుమనుండే సింధునదికి సమీప మయినది గనుక తురకలు ఢిల్లీ ప్రవేశించగానే వారు ఈ దేశాచార విరుద్ధ కర్మకు లయినందు వారివల్ల ఉపద్రఫము కలగ పోవుచున్నదని భయపడి యిక్కడి కర్మకులయిన ద్రావిళ్ళు పయిన వ్రాసిన ప్రకారము శుద్ధ ద్రవిడదేశములో ప్రవేశించినారు. అదినుంచి కర్మకులు గాని గౌడులు, యిప్పటికి ముక్తికి తగ్గ దారియయిన జ్ఞాన సంపాదనార్దమై తర్కము, మీమాంస మొదలయిన శాస్త్రములను అభ్యసింపు చున్నారు.

కర్మద్వారా, జ్ఞానమనే న్యాయ మార్గమును బట్టి కర్మమనే మజిలీయూరి మెదుగా జ్ఞానమనే పురమునకు పోతే దేహాన కున్ను, ప్రాణాలకున్ను, ప్రయాస యియ్యదు. కర్మమనే మజిలీలో నిలిచి ఆసోదా చేసుకోకనే జ్ఞానమనే పురమునకు ఒక్కసారిగా వేరే అగుపడలేదు. యిది గాక శ్రీమచ్చంకరాచార్య భగత్పాదులవారు దిగ్విజయార్ధముగా ఈ దేశానికి వచ్చిన కాలములో యిక్కడ సన్యాసమును స్థాపించిన వెనక ఈ గౌడులలో కొందరు సన్యసించి వారికి సిష్యభావమును వహించి ఉంటూ వచ్చినారు. భగత్పాదుల వారికి కొందరు మద్య మాంసాదులతో భిక్షచేసినప్పుడు గురువు స్వీకరించగా మేము యెందుకు విడిచి పెట్టవలసిన దని వారితో పాటుగా ఈ దేశపు శిష్యులు మద్య మాంసాదులను భక్షించినారు. పిమ్మట వారి పరిక్షార్ధమై ఒక కంచరవాడు సీసమును కరిగి ఆయుష్ణముతో భిక్షాకాలమందు భగత్పాదుల వారికి పాత్రతో సమర్పించగా దాన్ని భగవత్పాదులవారు సమదర్శను లయినందున ఉదక ప్రాయముగా పుచ్చుకొన్నారు. ముందు వారితోటి పాటుగా మద్య మాంసములను పుచుకొన్న గౌడ సన్యాసులు యిది మేము పుచ్చుకో గలమా అని కరిగించి పోసిన సీసమును తాగలేక త్యజించి నందున భగవత్పాదుల వారికి వారి యెడల ఆయానముతోచి, బుద్ధి స్ధైర్యమును పొందేవరకు లోకదృష్టితో మంచిచెడు తారతమ్యములను విచారించక నాయందు గౌరవమున్ను లేకుండా అవాంకృతిని వహించి నందున మీరు భ్రష్టులై పోదురు గదా యని శపించినారు.

అప్పట్లో శాపగ్రస్తులయిన పదిమంది సన్యాసులున్ను దశనామములు కలిగి శిష్యప్రశిష్య పరంపరగా యీ దేశములో గోసాయీ లనే పేరు తమది సన్యాసాశ్రమమైనా వర్తకవ్యాపారాలు చేసుకొంటూ యిక్కడ మహాజనులనే సాహుకారులుగా నటింపుచున్నారు. ఆతొసాయీలు సిష్యపరిగ్రహము చేసేటప్పుడు ఒక విధమయిన హోమముచేసి కొంత ఆగమము జరిపించి శిష్యపరిగ్రహము చేయుచున్నారు. ఆ శిష్యుడు గురువుయెక్క ధన ఋణాలకు బాధ్యుడవుచున్నాడు. యిట్లా మునుపు గోసాయీలు బ్ర్రాహ్మణవ్యతిరిక్త జాతులను కూడా శిష్యులుగా పరిగ్రహింపుచు వచ్చినారు. అయితే యిప్పుడు కొంతకాలముగా కంపెనీవారు ఆ యాచారమును నిలిపి బ్రాహ్మణులనే శిష్యులుగా పరిగ్రహించేటట్లు ఆగోసాయీలకు నియమముచేసి యున్నారు.. ఆగోసాయీలకు యెవరు నమస్కారము చేసినా యిప్పటికిన్ని నారాయణ స్మరణ చేయుచున్నారు. యీగోసాయీలందరున్ను, వనా, రణా, గిరి, పర్వత్, సాగరా, భారతీ, పురీ, సరస్వతీ, తీర్ధ, ఆశ్రమ, యీ పది నామధేయములకున్ను అంతర్భూతులయి యుంటారు గాని వేరేయుండరు.

యీ తెగలు గాక బయిరాగులని కొందరు విరక్త్యభినయాలు బహుశా కలిగి తెంగల నమధారులయి సంచరింపుచు నుంటారు. వారికి గురుపీఠముగా మన ద్రవిళదేశము నుంచి కొంతమంది వైష్ణవులు కొన్ని కాలములలో అచ్చి సమశ్రయణము చేసి వారిగుండా బహుధనమును సంపారించుకొని పోవుచున్నారు. వారు విష్ణుభక్తులయినా ద్రవిడ దేశములో అద్యైతులకున్ను, విశిష్టాద్వైతులకున్ను, సగుణనిర్గుణ వివాదము పడినట్టు యిక్కడ లేదు.

యీ దేశము యావత్తున్నూ తరుచుగా శ్రీమచ్చంకరాచార్యులవారు స్థాపించిన అద్వైత మతము చెతనే వ్యాపింపబడి యున్నది గాని పిమ్మట రామానుజాచార్యులు వారున్నూ, మధ్యాచార్యులవారున్ను, అవతరించి స్థాపించిన విశిష్టాద్వైత ద్వైతాలు యీ సరికి నకృచ్చముగా నెగబడినదికాదు. సకలమైన వారున్ను ఏమిన్ని భేదములేకుండా విభూతిన్నీ, గోపీచందనమునున్ను చందనమునున్ను లలాట మందు ధరింపుచున్నారు. బయిరాగులు మాత్రము తిరునామమును పయిన వ్రాసినట్టు ధరింపుచున్నారు.

శైవ వైష్ణవ పౌర శాక్తములు మొదలయిన మతాలన్ని అద్వైత విశిష్టాద్వైత మతాలకు అంతర్భూతము లయినవే గనుక యీ మూడు మతస్థులున్ను శైవవైష్ణవములు మొదలయిన ఆరాధనలు ఏవి చేసినా చేయవచ్చును. ఈ ఆరాధనలన్ని కర్మాలకు అంగుములే కాని వేరేకావు. మత రహస్య మనే వృక్షమూలము గురుముఖముగా తెలియవచ్చినప్పుడు కర్మాంగములయిన ఆరాధన లన్నియు తమకు తామే నివర్తించి పోవుచున్నవి. మత రహసమనగా ఆయా మతము యొక్క తత్వము, అద్వైతమతముయొక్క తత్త్వమేమంటే సృష్టికిన్ని సృష్టికర్తకున్ను, దీపికా న్యాయముగా భేదములేదనుట. విశిష్టాద్వైత తత్వమేమంటే సృష్టికిన్ని సృష్టికర్వకున్ను పాలతో కలిసి వుండే నెయ్యివలెనే కించిత్తు భేధము చెప్పడము. ద్వైత తత్త్వమేమంటే పాలు పెరుగు మజ్జిగె మజ్జిగెతేట నెయ్యి యివి భేదిస్తే భేదపడు చున్నవి గనుక వీటివలెనే యీశ్వరునికిన్ని జీవునికిన్ని భేదము ఉండడము మాత్రమే కాకుండా అనేక భేదాలు జీవులలో కూడా కల వనడము యీ మూడే యిదివరకు తీరని వివాదాలుగాని శివుని కన్నా విష్ణువు సర్వోత్తముడని వైష్ణవులున్ను, శివుడే వుత్తముడని శైవులున్ను వీరిద్దరికన్న శక్తి యెక్కువని శాక్తులున్ను, వివాదపడడమున్ను అందరికి యెక్కువ గణపతి అని గాణపతులు వగయిరాలు వివాద పడదమున్ను స్వప్రయోజనకారి కాదు. యేలాగంటే విందుకు వండిన కూరలు మొదలయిన వ్యంజనాలలో యెవరికి లేహ్య భక్ష్య బోజ్య చోష్యములలో యేది సమ్మత మయితే వారు అది యెత్తి భక్షించ వచ్చును, విందు చేసేవానికి కావలసిన ప్రయోజనము బోజనము చేసిన వారికి యెట్లాగయినా కడుపు నిండవలసినది. శైవ వైష్ణవరాధనలను కలగచేసిన మతోద్ధారకులకున్ను అదేప్రకారము తమతమ మత ప్రవిష్ణులు తత్వము తెలుసుకొనేవరకు ఒక విధమయిన నామ రూపాలు యేర్పరచుకొని ఈశ్వర జ్ఞానముతో ఈశ్వరుని యెడల భక్తికలిగి గుండవలేననిగాని వేరే కాదు. జ్ఞానోదయము కావడానికి శాస్త్ర నిచారణమాత్రము చేసి యిక్కడి సమస్తజనులున్ను, బహుశ, అద్వైతద్వైతమత ప్రవిష్ణులుగానే వున్నారని నాకు తోచబడుచున్నది. మనదేశములో వుండే ద్వైత మతస్థులయిన మాధ్యులు ధరింఛే చక్రముద్రలు మాత్రము యీ దేశములో బహుమంది గోపీతో వేస్తారు.

క్రీశ్తు మతస్థులలో ప్రోటెష్ట్యాంట్సు అనే జాతులవారు విశిష్టాద్వైత మతాను సారముగా సృష్టికర్త అయిన యీశ్వరుడు చేతనా చేతనాత్మక మయిన అనేక జీవులను సృష్టించినాడు, కర్మలు తదంగమయిన ఆరాధనలవల్ల యీశ్వర దృష్టి అల్ప వదార్దాలమీద కలిగెతే ప్రమాదాన్ని యిస్తున్నవి గనుక, కర్మాలున్ను, తజ్జనితమయిన ఆరాధననున్ను యేమి వద్దు, మనసా యీశ్వర భజన చేస్తూ వుండవలసినదని చెప్పుతారు. తురకలున్ను, అందు కనుసరణగా అనేక ప్రకారములయిన కర్మాలు తజ్జనిత మయిన ఆరాధనలున్ను వుంటే బుద్ల్ధి నిశ్చయము తప్పి పోతున్నది గనుక, ఒకటి రెండు విధములయిన కర్మాలను ఆరాధనల నున్ను యేర్పరచుకొని ఆమూలగముగా యీశ్వర భజన చేస్తున్నారు. తురకలకున్ను క్యాధేలిక్సులకున్ను తాము చేసే కర్మారాధనలలో వివాదమే కాని తత్త్వములో వుండనేరదని తోస్తున్నది.

భగవత్పాదు లయిన శంకరాచర్యులవారు అవతరించి దిగ్విజయము చేయక ముందర యీ కర్మభూమిలో దేహమే బ్రహ్మమని వాదించే ఒక ప్రమాదమయిన బౌద్ధమతము ప్రసిద్ధముగా వుండెను. యిప్పుడు ఆ మతము యీ దేశమందు ఖిలమయినా అంకురాలు మాత్రము అక్కడక్కడ ఉన్నవి. ఆ మతము పాలునే నెయ్యి అన్నట్లు స్థూల దేహాన్ని బ్రహ్మముగాను, యీశ్వరుడుగాను, అనేక దృఢయుక్తులతో వ్యవహరిస్తున్నది.

సచ్చిదానందమయిన పరబ్రహ్మ సంకల్పమనే మాయతో యుక్తుడయి సృస్టించిన అనేక బ్రహ్మాండములలో వసించే సృష్టి సంబంధమయిన యావజ్జనులున్ను అద్వైత విశిష్టాద్వైత ద్వైత దేహబ్రహ్మవాద మతాలకు లోబడి వుండవలసినదే కాని యితరముకాదని తోస్తున్నది. లేనిపక్షమందు దైవము గలదనే జ్ఞానలేశము లేకుండా ద్విపాత్పశువుల వలెనే ప్రవర్తింపుచు ఉండవలసినది. యింత కెక్కువ వేరేవుండనేరదు.

జ్ఞానజంతువు లయిన మనుష్యులకు ఆజ్ఞాన జంతువులయిన మత్వాదులకున్ను భేదమేమని విచారిస్తే యెట్లా అద్దాలంతా ఒకటే జనుసో తద్వత్తుగా జంతువులంతా ఒక దినుసేగాని వేరుకాదు. అయితే మన ప్రతిభాతి పుట్టవలసిన అద్దాలకు వనకతట్టు యెట్లారసము పూస్తామో తద్వత్తుగా యీశ్వరుడు తన ప్రతిభాతి కలిగే కొరకు బుద్ధి అనే రసాన్ని మానుష కోటికి వెనకతట్టు పూసి యున్నారు. అటువంటి రసము పూసిన అద్దాలకు కూడా యెట్లాచూచే పక్కముందుగా దుమ్ము అనే కల్మషము కప్పివుంటుంతో తద్వత్తుగా మౌఢ్యమనేమాలిన్యము మనుష్యులకు కమ్మిఉంటున్నది. ఆఅద్దాలపై కల్మషాన్ని మనుష్యులుతుడిస్తే యెట్లా తమప్రతిభాతి స్పష్టముగా తెలుస్తున్నదో తద్వత్తుగా సత్సంగతి కల్గడమువల్ల మనుష్యుల మౌఢ్యము వదిలి యీశ్వరాభాతి మనుష్యులబుద్ధిలో సంపూర్ణముగా కలగడానికి హేతువవుచున్నది.

బహుదినములుగా స్త్రీలు తిర్యగ్జంతువులవలెనే మోక్షార్హులు కాక నున్నారే! పుల్రుషులకు భోగార్హలా లేక పురుషులవలెనే వీరున్ను జ్ఞానవంతులయి మోక్షార్హులా? అనే శంక నాకు కద్దు. తిరువళ్ళూరి మహాముని రఘునాధాచార్యులు మొదలయిన పెద్దలను గురించి స్త్రీలు మోక్షసాంరాజ్యాన్ని పొందినట్టు భారత భాగవతాది సారవత్తు లయిన యితిహాస కధలలో యెక్కడనైనా వున్న జ్ఞాపకము గాని వున్నదా? తుదను స్వర్గాది భోగాలయినా వారు అనుభవించినట్టుగా గాని వున్నదా? తుదను స్వర్గాది భోగాలయినా వారు అనుభవించినట్టుగా గాని వున్నదా? అనిన్ని యితిహాసాదులలో పురుషులకు ఫలాని ఫలాని సుకర్మమును చేస్తే స్వర్గములో అనుభవించడానికి రంభాద్యప్సరసలు వున్నారని ఆశ చూపించియున్నిదిగాని ఫలాని మంచి కర్మము స్త్రీలు చేసుటవల్ల ఫలాని దెవతలతో స్వర్గములో క్రీడిస్తూ వుండవచ్చునని ఆశకూడా చూపలేదే! స్త్రీలు జ్ఞానవంతులయి మోక్షార్హులు యెట్లా అవుదురని ప్రశ్నచేస్తూ వచ్చినాను. వారువారు శానా ప్రయాసపడి స్త్రీలను పు, రుష సమానులుగా స్థాపించవలెనని యుక్తులు చెప్పినా దేవహుతి మొదలయిన తత్వబోధగల స్త్రీలనుగూడా వివాదములో దృష్టాంతములుగా తెచ్చినా తుదను నాసందేహమే వారినిన్ని పట్టుకున్నది గాని తేరుగడ అయినదికాదు.

నా బుద్ధిద్వారా నిశ్చయము చేసినది యేమంటే స్త్రీలకు పురుషులకున్ను హృత్కమలములు ఊర్ధ్వాధోభాగములయందు రెండేసి గ్రంధులనే ముళ్ళుగలిగి వుండేది నిశ్చయము. ఆధోభాగమందుండే గ్రంధి పరమాత్మ సంబంధమయిన దిన్ని ఊర్ధ్వభాగమందుండే గ్రంధి సంకల్పరూపం బయిన మాయా సంబంధ మయినదిన్ని ఔను.

స్త్రీలకు గర్భధారణ నిమిత్తమయి ఆధోభాగమందుండే గ్రంధి ఫల కాలము రాగానే వీడబడి ఋతువనే సంజ్ఞను పొందుచున్నది. పురుషులకు మాయా సంబంధమయిన పూర్ధ్వ భాగమందుండే గ్రంధి ఫలకాలము రాగానే జ్ఞానోదయ సామాగ్రిని చేయడానికి వయిపుగా వీడబడిపోవుచున్నది. యిందుకు దృష్టాంత మేమంటే పురుషులకు యౌవనప్ర్రారంభమయిన వెనక బాల్యమునందుండే కంఠధ్వని సౌషవము వుండేదిలేదు, భేదింపుచున్నది. స్త్రీలకు మాత్రము జననాదారభ్య కంఠధ్వనియొకటే రీతిగా పురుషులకంటే హెచ్చుగా యధోచితమయిన శ్రావ్యతికలిగి ఉంటున్నది. యీరీతిని స్త్రీలకు పరమాత్మ సంబంధమయిన గ్రంధి వీడ బడి మాయా సంబంధమయిన గ్రంధి నిలిచి యుండడముచేత యెన్నటికిన్ని జ్ఞానోదయ మయ్యే పాటిబుద్దిన్ని స్థైర్యమున్నులేక మాయాసంబంధమయిన చాంచల్యముతో మనస్సు తల్లడింపుచున్నది, తద్వారా జ్ఞానమునిగా ముక్తిలేదు, గనుక స్త్రీలు ముక్తికి అర్హులుకారు, యధోచితముగా అజ్ఞాన జంతువులతో చేరినవారేను.

జ్ఞానార్హులు కాకపోతే అట్టేపోయెను కర్మభూమియందు ఉత్త్పత్తిఅయిన స్త్రీలకు మంచి కర్మాలు చేయు నిచ్చ పుట్టేటట్టుగా స్వర్గాది భోగాలనే మీది ఫలము కలదని తద్ద్వారా దేవతలతో సంభోగము కలుగుననే ఆశైనా వుంచరాదా అని యోచిస్తే అటువంటి ఆశపెట్టితే స్వకీయ పురుషుల యెడల భక్తిని వదిలి అటునియమించిన కర్మములే చేస్తూవుందురనే భయముచేత మన పూర్వీకులు ఆయాశకూడా పెట్టక వారికి చెప్పిన కర్మాలు యేమి ఉన్నా ఐహిక సంబంధమయిన అష్టపుత్ర బహుధనములున్ను భత్ర్రార్హనహ ఆయురారోగ్యములున్ను మాత్రమే సకల పురాణాదులలో చెప్పియున్నవి, తద్ద్వారా స్త్రీలు తిర్యగ్జంతువుల వలెనే యధోచితముగా పురుషులను భోగార్హలే కాని యితరము కాదని తొచుచున్నది.

యీ ప్రయాగ మహాక్షేత్రములో ఉండే పౌరాణికు డయిన మధురానాధు అనే మహారాష్ట్ర బ్ర్రాహ్మణుని స్త్రీలకు యేసుకృత కర్మముచేతనైనా పురుషజన్మము కలిగినట్టు పురాణేతిహాసములలో కద్దా? అని ఆదిగినాను. కొన్నికొన్ని పురాణాదులలో పుత్రులు సన్యసిస్తే పురుష జన్మము కలిగేటట్టు ఉన్నది, కొన్నిపురాణాదులలో సర్వధాయెప్పుడున్ను స్త్రీలకు పురుషజన్మము లేదని పరిష్కారముగా వున్న దని చెప్పినాడు గనుక యీ యుక్తుల ద్వరా విచారించగా స్త్రీలు లేని పోని పురుష యోగ్యము లయిన కర్మముల జొలికి పోక వేదాంతాలు విచారించి శుష్కవేదాంతలు కాక, పతిశుశ్రూష కుటుంబ సంరక్షణ మొదలయిన ఐహికపు పనుల యెడలనే ప్రవిష్టులుగా ఉండుట యుక్తముగా తోచుచున్నది.

ఈ ప్రయాగలో సకల పదార్ధాలు దొరుకును. సకల విధమయిన పనివారున్నున్నారు. సీమసామానులు అమ్మే యింగిలీషు షాపుకూడా ఒక బంగాళీ వేసుకొని ఉన్నాడు. యీ ప్రయాగలో అక్టోబరు నెల పన్నెండు తేది మొదలు ఇరవై రెండు తేది రాత్రి వరకు వసించి ఇరవై మూడు తేది ఉదయాన బజిరా అనే యిల్లుగల పడవ ఒకటిన్ని. నావా అనే సాధారణపు పడవ ఒకటిన్ని బాడిగెకు తీసుకొని గంగగుండా ప్రయాణమై సాగివచ్చినారు. యీ బజరాలనే పడవలు సుమారు అరవై అడుగుల నిడివిన్ని, ఇరవై అడుగులు వెడల్పున్ను కలిగి ఒకటి వెనక ఒకటిగా మూడు అరయిండ్లు యేర్పడి ఉంటున్నవి. ఆ యిండ్లు మంచి పలకలతో కట్టి సుందరమయిన రంగువేసి యున్నవి. కడావటిది మరుగు అర. నడిమిది పడకటర. మొదటిది కచ్చేరి కూటముగా ఉంటున్నది. యీ అరల కింద సామాను ఉంచడానికి ఒక అంతస్తు ఉన్నది. ఈ మూడు అరలమీద సవారీలు మూడువుంచి ముప్పై మంది బోయీలు వుండవచ్చును. దీనికి కొయ్యలతో నీళ్ళు తోసేవారు మాలీలు అని పద్నాలుగు మంది మాంజీ అనే చుక్కాణి తిప్పేవాడు ఒకడున్ను ఉన్నారు. యిటువంటి బజరాకు సాధారణ మయిన బాడిగె దినానికి ఏడు రూపాయిలు. ఇక్కడకలదారలని, శిక్కారూపాయిలని చెలామణీ అవుచున్నవి. ఈ రూపాయలు మన దేశపు రూపాయి ఒకటి కి ఒక అణాయెక్కువ అనుకోవలసినది. యీబజరాలు ఫలాని ఊరికి వెళ్ళడానకు యిన్ని దినము లని సర్కారువారు నిరుకుచేసి ఉన్నారు. యీ పడవ ఒకరికి ఒక తావుకు బాడిగెకు వచ్చి మళ్ళీ వచ్చిన తావుకు పొయ్యేటప్పుడు మరిఒకడు బాడిగకు మాట్లాడుకుంటే ఆ నిరుకు దినాలలో సగము దినాలకే బాడిగయియ్య వలసినది. బజరాచేరే నిరుకుదినాలకు ఎంత తక్కువగా స్థలము చేరినా ఆ నిరుకుదినాల బాడిగె పూర్తిగా యివ్వవలసినది. అది యెట్లానంటే కాశికి ప్రయాగ నుంచి యీ కాలములొ బజరా మూడు దినములకు చేరుతున్నది. అయినప్పటికిన్ని నిరుకయిన పదిహేను దినాలకున్ను బాడిగె యియ్యవలసినది.

ఈప్రకారము దండు తీసుకొని అనేక పడవలు బంగాళానుంచి ప్రయాగకు వచ్చివుండి మళ్ళీ పొవుచుండగా ఒక బజరాను బాడిగెకు మాట్లాడి నిశ్చయము చేసుకున్నాను. యిది ఒకటే నాసల్తనకు నేను యిక్కడ ఉంచుకున్నంత మటుకు చాలును. అయితే దేశానికి పట్టుకుని పోవలసిన గంగాజలము యమున కలియకుండా ఇక్కడ దశాశ్వమేధ ఘట్టములోనే పట్టవలసినది నియమము గనుక సుమారు నాలుగు వందలుపళ్ల *గంగ నలభై బానలలో పట్టియుంచినాను. ఆ గంగ కాశికి తీసుకురాగలందులకయి ఒకనావా ఇరవై ఏడు రూపాయిలకు మాట్లాడి కుదుర్చుకున్నాను. మెరకను నాలుగు దినాలకు కాశికి పోవచ్చును. ప్రవాహము తీసిన దినాలు గనుక గంగకుండా పోతే ఆరు దినములు పట్తునని యిక్కడివారు చెప్పినా పరీక్షార్దముగా నున్ను కూడావచ్చిన వారి అసోదా, విశ్రాంతి, నిమిత్తమున్ను ఊహించి గంగకుండా రావడ మయినది.

గంగా ప్రవాహకాలము ఇక్కడ శ్రావణ భాద్రపద మాసాలు. యిప్పట్లో తూర్పుగాలి కొట్టుచున్నది. ప్రవాహపు వడి ముందర గాలికూడా నిండా పనికిరాదు. యీ బజరాలకు మూడేసి చాపలు ఒక స్తంభమునకు కట్టుచున్నారు. నేను పోవడము తూర్పు గనుక నాకు గాలి యెదురయి యున్నది. యిక మంచుకాలము వచ్చే నెల మొదలు ఇక్కడ ఆరంభ మవుచున్నది. చైత్రమాసమునందున్ను, వైశాఖ మాసమునందున్ను, ఈ కార్తీకమాసమునందున్ను ఇక్కడ ఎండ తీష్ణముగా కాయుచున్నది. నాతో కూడా వచ్చిన సామగ్రిని మిరిజాపురమునుంచి కాశికి లొగడనే పంపించివేయగా మిగిలిన నాతో

*చెన్నపట్నములో పాలు మొదలగు ద్రవములు కొలుచు కొలమానము ఒక పడి రమారమి ఒకటిన్నర సేరులు.

కూడావున్న కంబళిదేరా ఒకటిన్ని, శిఫాయిడేరా ఒకటిన్ని ఒక కళాసునున్ను కూడా పడవలమీద ఉంచుకుని, గుర్రాలను, ఒక జత బోయీలను, కావడివాండ్లను, కాయలా మనుష్యులనున్ను మెరకను పంపించి బయలు చేరినాను.

గంగలో రాతిగొట్టులేదు. గంగాతీరమునందు వసతి అయిన ప్రదేశములో దిగి రాత్రి పగలున్ను వంట చేసుకొని తర్లిపోవుచు వచ్చినాము. ప్రవాహపు వడిచేత గంగమధ్యే మిట్టలు పెట్టుచున్నవి గనుక పడవలు, బజరాలున్ను మిట్టతగిలి పగిలిపోతున్నదనే భయముచేత రాత్రిళ్ళు పడవలు ఇక్కడ నడిపించరు. చేకటిపడగానే ఒక తావున పడవలు నిలుపుతారు. గంగలో సాయంకాలమునందు పరంగి కొండశాలలో గుఱ్ఱపుబళ్ళు నడిచేటట్టు *పడవలు బజరాలున్ను వచ్చుచుపోవుచున్నవి. గాలిలేక ప్రవాహానికి యెదురుకొని పడవలు పోవలసినప్పుడు పడవలకు తాళ్ళుగట్టి గట్టుననుండే మనుష్యులు యీడ్చుకొని పోతారు. ప్రవాహపు దారిగా గాలికి యెదురుకొని పొయ్యే టప్పుడు కొయ్యలతో నీళ్ళు తోస్తూ పోతారు. గాలి అనుకూలించి నప్పుడు ప్రవాహపుజోరు కలిగిన తావులలో చాపలుకట్టి మాలీలు వూరికే కూర్చుంటారు. చుక్కాణివాడి జాగ్రత మాత్రము సర్వకాలమందు న్నుండవలసి యుంచున్నది.

గంగ భూమి మట్టానికి బహు లోతుగా ప్రవహింపుచున్నది గనుక ఊళ్ళు నిండా గంగ సమీపమునందు ఉండకపోయి నప్పటికిన్ని గంగకు యిరుపక్కల అడుగుకు ఒక ఊరు వున్నట్టుగా దగ్గిర దగ్గిర ఊళ్ళు వుండి వున్నవి. వాటి పేళ్ళు విచారించడానికి గంగలో రావడముచేత పయిపు లేకపోయెను. వాటి పేళ్ళు పడవతోశే మాలీలకు కూడా తెలియదు. గంగలో రాగా కనుపడ్డ ప్రసిద్ధ స్థలాలు యేవంటే వింధ్యవాసిని ఒకటి, మిరిజాపూరు రెండు, చెన్నాడుగడ అనే బస్తీకోట కలిగిన షహరు మూడు, చోటా కలకత్తాయనే దండు నాలుగు, రామనగరము వ్యాసకాళి అనే ద్వినామములు గల బస్తీ షబరు ఐదు.

*చెన్నపట్టణములో ఆనాడు దొరలు విహరించు స్థలము మౌంటు రోడ్దులో నీడకోసం రెండుపక్కలా వెయబడిన చెట్ల బజారులోనే.

చెన్నాడుగడ వద్ద ఒక కొండవున్నది. ఆ కొండమీదనే గంగ ఒడ్దుగా ఒక కోట యున్నది. దాన్ని యింగిలీషువారు ఇప్పటికి బహు బస్తీగా ఉంచుమొన్నారు. కాశికి యెదట గంగకు ఇవతలి పక్కనుండే వ్యాసకాశీలో ఇరవై ఆరు తేది రాత్రి ఎనిమిది ఘంటలకు ప్రవేశించినాను. ఇక్కడికి కాశీపట్టణము తెలియుచున్నది. నిత్యము చంద్రాస్తమయమయ్యేవరకు నా పడవలు తోయిస్తూ వున్నాను గనుక అదేరీతిగా యింకా రెండు గడియలు తోయిస్తే కాశి చేరుదును. అయితే ఉప వాసముతో మహానగరము చేరవలసిన నియమము గనుక యిక్కడనే ఈ రాత్రి వసించడమైనది.

గంగలో బజరాలమీద వెళ్ళే సౌఖ్యము అనుభవ వేద్యము గాని వ్రాయ శక్యము కాదు. దిగిన తావున పారా యియ్యడానికి మాత్రము మనవంటి వారికి మనుష్యులు చాలివుండవలసినది. సామాన్యపు ముసాఫరులు పడవలమీద వస్తే పెరిమిట్టు మనుష్యులనే సుంకం బంట్రౌతులు సోదా యియ్యవలె ననే బహనా, వంక, నెపము, ప్రతి వూరిదగ్గర పెట్టి యేమైనా లంచము యియ్యకపొతే మూట ముల్లెలు నిచ్చి అభాసు చేసి పడవలను నిలిపి బహు తొందర పెట్టుతారట. పేదలకు ప్రయాగనుంచి కాశికి రావడానికి పడవకు యిచ్చే బాడిగె గాక మనిషికి ఒకటి కి రూపాయి వంతున లంచాలకింద తగులుతున్నదట. యీ లంచాలు మూలకముగానే యీ ఘాట్లు సుంకపు దారొగాలకు జీతము పదిఅయిదు రూపాయలు అయినా యిన్నూరు మున్నూరు రూపాయలు నెల ఒకటి కి సంపాదించేటట్తు మిరిజాపూరులో నాకు తెలిసినది. ప్రయాగలో జూసీసరాయి సుంకము వారికి నా మిత్తమై జరిగిన దాపువల్లను, ఆ జిల్లా బంట్రౌతులు కూడావున్నందుచేతనున్ను అటువంటి శ్రమ నాకు యెక్కడా కలిగినది కాదు.

హయిదరాబాదు మొదలు యింగిలీషుదొరల వద్దికి మనవంటి వారు పోయి రాగానే కొంచెములొ తృప్తిలేని ఆదొరలవద్ది నకీబులు చోపుదార్లు వగయిరాలు యినాములకు వచ్చుచున్నారు. యీ దుబారు ఖర్చు విస్తారముగా అక్కడక్కడ తగులుతూ వచ్చినది.


పన్నెండవ ప్రకరణము  కాశీ

యీ ప్రయగలో పైన వ్రాసిన దాపువల్ల అటువంటి ఖర్చు ఒక గవ్వ అయినా తగిలినది కాదు. ప్రయాగలో స్నానఘట్టపు బంట్రౌతులు నిత్యము నా సేవచేస్తూ వచ్చినందున వారికిన్ని నా తయినాతి బరక్రదాసు బంట్రౌతులకున్ను మాత్రము నేను వచ్చేటప్పుడు కొంచెము యినా మిచ్చినాను.

ప్రయాగ యిండ్లు, అంగళ్ళు యధోచితమైన వెడల్పు గలవిగానే కట్టివున్నవి. ప్రయాగలో చెప్పే సంకల్పక్రమము మన దేశమువలెనే భరతఖండే అనే మట్టుకు చెప్పి అటుతర్వాత ఆర్యావత్రాంతగ్రత బ్రహ్మకైవర్తె కదేశే, విష్ణు ప్రజాపతి క్షేత్రే, షట్కోణమధ్యే, అంత ర్వేద్యాం, భాగీరధ్యా, పశ్చిమే బాగే, కాలింద్యా, ఉత్తరే తీరే, నటస్య పూర్వదిగ్భాగే, విక్రమశకే, బౌద్ధావతారీ, ప్లవనామ సంవత్సరే అని పిమ్మట మనదేశరీతిగా మాసము తిధి మొదలయినవి చెప్పవలసినది. కాశిలో చెప్పే సంకల్పక్రమమేమంటే ఆర్యావత్రైకదేశే, అవిముక్త వారణాసీక్షేత్రే, అసివరణయోమ్ర ధ్యే,, మహాశ్మశానే, అనందమనే, గౌరీముఖే, త్రికంటకవిరాజతే, భాగీరధ్యా, పశ్చిమేతీరే, బౌద్ధావతారే, విక్రమశకే, ప్లవనామసంవత్సరే అని చెప్పవలెను. ఇటువంటి కాశీమహాక్షేత్రమును అకుటోబరు ఇరవై ఏడు తేది ఉదయమయిన ఎనిమిది ఘంటలకు శ్రీరామకటాక్షముచేత చేరినాను.

కాశీపట్టణములో నిండా జనసంఘము కలిగివుండును గనుక వూరికి బయట అసివద్దవుండే తోటలలో ఒక తావున దిగవలెనని యోచిస్తిని. వాట్లలో స్థలము సంకుచితముగా వుండినందున నున్ను మణికర్ణిక మొదలయిన స్థలాలకు దూరమవుట చేతనున్ను కాశీతంబురాయనియొక్క కేదారఘట్టములో వుండే రెండు అంతస్థులు నాలుగు ముంగిళ్ళు కల ఒక పెద్దయింట్లో దిగినాను. నాకోసరమై ఆస్థలము ముందుగా ఖాళీచేసి శుద్ధి చేసివుంచియున్నందున బహుసౌఖ్యముగానే వుండెను. ఆయిల్లు గంగ యొడ్దుగానే వున్నందున సమ్మతి అయినప్పుడు మిద్దెమీదినుంచి గంగా దర్శనము చేయాడానికి అనుకూలముగా వుండినది.

ఈ కాశీస్థలానికి బాధ్యులుగా గంగాపుత్రులనే వారు పన్నెండు వందల యిండ్లువారు ఉన్నారు. వారు క్షాత్రశౌర్యాల చేత దొరతనము చేసే వారని, గంగాయాత్ర చేయ వఛ్ఛేవారివద్ద గుఱ్ఱానికి పన్నెండు రూపాయల వంతున నున్ను, మనిషికి నాలుగు రూపాయల వంతుననున్ను, గాడీకి యాభై రూపాయల వంతున నున్ను యాత్రవచ్చే వారిని ముందుగా చూచిన గంగాపుత్రుడు తీసుకొని మణికర్ణికలో స్నానము చేయింపుచు, యివ్వక స్నానముచేసి మొండాటలాడితే కొట్లో వేసి కోర్టు సెలవులతోకూడా తీసుకుంటూ, బహుశా యియ్యని వారిని యియ్యచాలని వారినిన్ని తమ పోకిరితనము చేత మానభంగమున్ను, దేహబాధయున్ను పెట్టుతూ వచ్చుచున్నారు. వీరికి భయపడి శరభోజీ మహారాజు *అంతటి వాడు, కేదార ఘట్టమే వృద్ధమణికర్ణికయని ఒక పురాణ ప్రమాణమును పట్టి క్షౌర శ్రాద్ధాలు కేదారఘట్టలో గడిపినాడు. విజయనగరపు రాజు కాశికి వచ్చిన్ని ఒక సంవత్సరము మణికర్ణిక స్నానము లేక నుండినాడు. యిక పేదల గతి చెప్పవలసినది లేదుగదా! యిటువంటి సమూహమువల్ల నాకు ఒక అభ్యంతమున్ను లేకుండా నన్ను రామటెంకివద్ద యెదురుకున్న రామరహల్లు అనే గంగాపుత్రుడు గోపీగంజులోనే నేను యిచ్చినది తీసుఒని యాత్ర చేయించేటట్టు దస్తవేజు వ్ర్రాసియిచ్చి ప్రయాగ వరకు కూడావచ్చి నా సహితముగా కాశి ప్రవేశించి నందున యధాశాస్త్ర ప్రకారము మహా స్థలము చేరిన మరుసటి గడియకే మణికర్ణికకు వెళ్ళి అక్కడ చక్రతీర్ధములో భేటికి అని ఒక మొహరు ఫలపుష్ప సహితముగా నుంచి ముందర స్నానము చేసి పిమ్మట క్షౌరానికి సంకల్పము చేసుకొని క్షౌరానంతరము మణికర్ణికలో స్నానముచేసి గంగాపూజ చేసి గంగాపుత్రుల సమూహానికి భూరి దక్షిణ అని పదిహేను రూపాయలు, ఘాటీయాలనే గంగాతీర స్నాన ఘట్టమునందు వుపచరించేవారి కని, పదిరూపాయలు, కంగాళీల

*ఈయన తంజావూరి మహారాజు, పదిహేడు వందల ఎనభై ఎనిమిది లో తండ్రి చనిపోవునాటికి తొమ్మిది ఏండ్లవాడు. పినతండ్రి రాజ్యాక్రమణ చేయిగా కంపెనీవారి నాశ్రయించి పదిహేడు వందల తొంభై ఏడు లో రాజ్యము పొందెను గాని రెండేండ్లలోనే పించనుదారు డయ్యెను. ఈయన పద్దెనిమిది వందల ముప్పై మూడు లో చనిపోయినాడు. బిషప్ హేబరు పద్దెనిమిది వందల ఇరవై ఆరు లో ఈయనను దర్శించినాడు.

కని అయుదు రూపాయలున్ను భూరి యిచ్చి నేను దిగిన స్థలము ప్రవేశించినాను. ఆ మరునాడు నాతో కూడావచ్చిన బ్రాహ్మణులందరిచేత తీర్ధశ్రాద్ధాలు పెట్టించడ మయినది. నాలుగొ దినము నేను తీర్ధ శ్రార్ధము పెట్టడమయినది. యీ మహా స్థలములలో అన్ని శాఖల బ్రాహ్మణులున్ను సమూహాలుగా వున్నందున శాఖకు యాభై మంది వంతున అధిశ్రవణనకున్ను, యిష్టబంతికిన్ని పిలిపించినాను. పావులా దక్షిణతో వారు సంతోషించినారు.

యీ కాశిలొ మణికర్ణికకు మహాత్మ్యము వచ్చినందుకు కారణ మేమంటే విష్ణువు చక్రము చేత తీర్ధము కల్పించుకొని తపస్సు చెస్తూ వుండగా పార్వతీసమేతముగా శివుడు అక్కడికి వచ్చినంతలో పార్వతియొక్క కర్ణికామణి ఆ తీర్ధములో పడిపోయెను గనుక శివుడు వెతికినట్టున్ను, విష్ణు మాయచేత దొరకనట్టున్ను, తదనంతరము విష్ణువు బావమరిది వొప్పారితో హాస్యముచేసినట్టున్ను, తదనంతరము ఆ చక్రతీర్ధము పార్వతీకర్ణికామణినిన్ని శివుని మానసమునున్ను, ఆకర్షించి విష్ణుచక్రోద్భవమున్ను అయినందున గంగ భగీరధుని నిమిత్తము భూలోక ప్రవేశమయినప్పుడు యీతీర్ధమహాత్మ్యము తెలిసి యీతీర్ధ సంగమము చేసినది గనుక యీ మణీకర్ణికా ఘట్టము యీస్థలానికి అతి ముఖ్యమయినది. ఆ చక్ర తీర్ధములోనే ప్రధమస్నానమును కాశి ప్రవేశించగానే అందరున్ను చేయవలసినది. ఆ చక్రతీర్ధము మణికర్ణికా ఘట్ట సమీపమునందు ఒక చిన్నగుంటగా యున్నది. ఆ తీర్ధాన్ని గంగాపుత్రులు అక్తమించుకోవడముమాత్రమే గాక సదా ఆవరించుకుని వుంటున్నారు.

యీ కాశికి బహుపుణ్య కాలమున్ను, బహు మహోత్సవ కాలమున్ను, బహు జనాకర్షణ కాలములమున్ను యేదంటే కార్తీకమాసము. ఆ కార్తీకమాసములోను శుద్ధైకాదశి మొదలు పున్నమవరకు పంచదినములు పంచరత్నాలని పేరు వహించివున్నవి. యీకార్తీకమాసము మొప్పైదినములు లక్షావధి ప్రజలు కాశికి స్నానాల నిమిత్తముగా వస్తారు. కృత్తికా నక్షత్రము అదర్శవము కాక మునుపే అందరునున్ను పంచగంగా ఘట్టమందు స్నానమి చేస్తున్నారు. శ్రీరామ కటాక్షము యీ పంచరత్న దినములొనే నన్ను యీ కాశిలో ప్రవేశింప చేసినందున పున్నమస్నానము ఆ పంచగంగా ఘట్టములో చెయ్యడమయినది. యీ పంచగంగా ఘట్టము పంచపాండవుల తపోబలముచేత యింత ప్రసిద్ధమయినట్టు పురాణ సిద్ధము.

కాశి పట్టణమునకు ఉత్తరమున వరణ దక్షిణమున అసి అని రెండు నదులు కాలువలుగా గంగలో సంగమ మవుచున్నవి. అసి అనే కాలువ అతి స్వల్పము. యీమధ్యేవుండే భూమి వారణాసి అనే పుణ్య క్షేత్రమయినది. యీ అసివరణల మధ్యే గంగ ధనురాకరముగా ప్రవహింపువున్నది. గంగకు పడమటి యొడ్డున కాశీపట్టణము యేర్పడి యున్నది. అసివరణల మధ్యము అవిము క్తక్షేత్రము గనుక యిక్కడ దేహము వదలిన జీవాత్మునికి తారకోపదేశము అవుచున్నదని పురాణ ప్రసిద్ధము. గనుక గంగాతీరము నందు యిండ్లు స్నానఘట్టాలున్ను నారు పోసినట్టు వీధులకు కూడా యెనిమిది అడుగుల భూమి విడువ కుండా జానడు జానెడు భూమికి వేలమోడిగా రూపాయలు యిచ్చి స్థలము విశాలముగా కావలిసివస్తే మిద్దెమీద మిద్దెగా యేడేసి అంతస్థులు కూడా కట్టుకుని కాపురము చేస్తూవున్నారు. యీ అసి-వరణల మధ్యే గంగాతీరమందు భూమి కొనవలస్తే పూనా శ్రీమంతుడు *వగయిరాలకు శక్యమేగాని సామాన్యులకు వయిపులేదు. అసివరణల మధ్యే కేదార ఘట్టము మొదలు రాజఘాటు వరకు అహల్యాబాయి,! నాగపూరిరాజు, శింధ్యావగయిరాలు అనేకలక్షలు వ్రయముచేసి కాపురానికి యిల్లున్ను

*పీష్వా అని చరిత్రలో ప్రసిద్ధిజెందిన మహారాష్ట్ర ప్రధానమంత్రి, తరువాత కొంతభాగము నకు రాజయ్యెను. పునహా అరని రాజధాని.

అహల్యాబాయి ఇందూరు రాజగు మలహల్ రావు హోల్కారు భార్య ఈమె ఇరవై అ ఏటనే భర్త మరణించాడు. కొమారు డప్రయోజకు డైనాడు. ఈమె సహగమనం చేయదలపగా ప్రజలు వారించి రాజ్యాధికారం వహించ మని ప్రార్ధించారు. పదిహేడు వందల అరవై ఐదు మొదలు ముప్పై సంవత్సరా లీమె ఇందూరును అతి సమర్ధతతో పరిపాలించింది. ఈమె సద్గుణములను, దాతృత్వమును, తెలివితేటలను ఇంగ్లీషువారు కూడా మెచ్చుకున్నారు. ఈమె హిందూదేశములో అనేక పుణ్యక్షేత్రాలలో గొప్ప దాన ధర్మాలు చేసి పదిహేడు వందల తొంభై ఐదు లో స్వర్గస్థురాలైంది.

స్నానానికి ఘట్టమున్ను శివప్రతిష్టకు గుడిన్ని ఒకటిగా కలిపి కట్టుతూ వచ్చినారు.

సవారీలలో స్నానానికి ఒక ఘట్టమునుంచి ఒక ఘట్టానికి పోవడము వీధుల కునందిచేత ప్రయాస గనుక చిన్నపడవలమీద పరువుగలవారు గంగగుండాపోతూ వస్తూ వుంటారు. ఆ ప్రకారము పోయి వచ్చేటప్పుడు చూడడమునకు ఆ పట్టణము అతిసుందరముగానున్ను అత్యద్బుతముగాను న్నుంచున్నది. అందులో శ్రీధర మునిషి అనే వాడు కట్టిన ఘట్టము, అహల్యాబాయి కట్టిన ఘట్టము మరికొందరు గోసాయీలు కట్టిన ఘట్టలున్ను సుందరముగా నున్నవి.

ఆ అసి-వరణల నడిమి పుణ్యఘట్టము లేవంటే పరణాఘట్టము, రాజఘట్టము, త్రిలోచన ఘట్టము, దుర్గాఘట్టము, పంచగంగా ఘట్టము, మణికర్ణికా ఘట్టము, దశాశ్వమేధఘట్టము, కేదారఘట్టము, హనుమద్ఘట్టము, అసిఘట్టము న్నునవి. త్రిలోసన ఘట్టమువద్ద చెన్నపట్టణములో కష్టం హవుసురేవు వలెనే సకల ధాన్యాలు భోళా అనే పెద్ద అంగళ్ళు పెట్టి మొత్తపు విక్రయాలు చేయుచు వున్నారు. రాజ ఘాటులొ ముఖ్యమయిన సుంకపు చావిడి వుంచున్నది.

కాశీవాసము యధావిధిగా చేశేవారు యీ అడుగున వ్రాసిన శ్లోక ప్రకారము ఆయా ఆలయాలకు వెళ్ళి అయా మూర్తులను ఆరాధించి రావలసినది. శ్లో|| విశ్వేశం మాధనం ధుండిం దండ పాణించ భైరవం | వందే కాశీం గుహాం భవానీ అనే అన్నపూర్ణ ఆలయము, ధుండి వినాయకుడి ఆలయమున్ను కేదారఘట్టానికి సమీపముగా మణికర్ణికకు పొయ్యె దోవలోనే యున్నవి. అటువెనుక దుర్గాఘట్టమువద్ద కాలభైరవుడి ఆలయము దండపాణి ఆలయము వుండియున్నది.

పంచగంగా తీమునందు బిందుమాధవుడి ఆలయము వున్నది. అక్కడికి సమీపముగా తురకల మశీదు ఒకటి ఆశ్చర్యకరమయిన యున్నతము కలిగి రెండు స్తూపీలతో నిర్మించపడి యున్నది. ఆ రెండు స్తూపీల కొనకు పోవడానికి లోపలనే మెట్లు కట్టియున్నది. ఆ రెండు స్తూపీలు సుమారు యేనూరు అడుగుల పొడుగు వుండవచ్చును. తొలుకాలమందు అకబరు పాదుషా కాశీ యావత్తూ తురకాణ్యము చెయ్యవలె నని తలచి ముఖ్య మయిన గుళ్ళు యావత్తు కొట్టి పాడుచేసినప్పుడు యీ మసీదును కట్టినాడట *అద్యాది అది నిర్మించబడి యుండే శృంగారము యింగిలీషువారిని కూడా మరామత్తు చేశేటట్టు ప్రేరేపణ చేసినది. యిప్పుడు వుండే విశ్వేశ్వరుడి ఆలయము మొదలుగా అనేకములు నూతన నిర్మాణములై వున్నవి.

పయి శ్లోకములో నుండే గంగా అనే తీర్ధము ఒక కొలను స్వరూపముగా పట్టణమునకు పశ్చిమ భాగమందు యుండి యున్నది. కాశీ దేవి అనే త్రిలోచనేశ్వరుడి ఆలయము వద్ద దుర్గాఘట్టములో యున్నది. గుహా అనే ఒక బిలము కాశీ పట్టణమునకు దక్షిణభాగమందున్నది. యీ కాశీ ఖండములో విష్ణుసాదిగా త్రిమూర్తులులేమి యింద్రుడాదిగా దేవతలేమి ధృవుడాదిగా తేజస్వరూపాలేమి సూర్యుడాదిగా గ్రహాలేమి అగస్త్య్లుడాదిగా ఋషులేమి ఈ అవిముక్త క్షెత్రమందున్న ఆనందవనములో లింగప్రతిష్ట చేసి ఆరాధన తపస్సు పురస్సరముగా ఆ యా విభూతులను సంపాదించుకొన్నట్టు యున్నది. గనుక ప్రతిలింగానికి అగస్త్యేశ్వరుడని, రామేశ్వరు డని ఒక్కొక్క పేరుగలిగి అవి వొకానొక దినమున అక్కడి ఆరాధన ప్రాబల్యము కలగచేసుకొని ఉండియున్నది. ఆ యా నియమింప బడిన దినములలో ఆ యా స్థలాలలో జనసంఘము మిక్కటముగా నుంచున్నది.

ఇక్కడ నుండే ఆలయాలు అన్ని సంకుచితములుగా నున్ను అరిటిపువ్వందముగా సాదాస్తూపీలు కలిగి అర్చకులపట్ల నిండా కాపులేకుండా నున్ను వృషభముల చేత ఆవరింపబడిన్ని యుంచున్నవి. ఆరాధనచేశేవారు పత్రపుష్పఫలతోయములతో తామే, శక్తి కలిగి నంతమట్టుకు ఆయా ఆలయములలో మూర్తులను జాతినియమము లేకుండా ఆరాధనచేయుచు వచ్చుచున్నారు. కాచియుండే

*ఇది పొరబాటు ఈ మశీదుకట్టినది జౌరంగజేబు చక్రవర్తి. విశ్వేశ్వరాలయం క్రీస్తు శకం పదహారు వందల అరవై తొమ్మిది ఏప్రిలులో నాశనం చేయబడింది.

అర్చకులు, వచ్చిన ఉపపన్నులను యాచిస్తూ పేదలు ఇచ్చేదాన్ని పుచ్చుకొంటున్నారు.

యీక్షేత్రములో పర్వత ఆలయములలోని అర్చకులు పంచగౌడులతో చేరినారు. కాలభైరవుని అర్చకులుమాత్రము కానుపడాలని ఒక వింతజాతివారు. చెవులు మధ్యప్రదేశములో బొందచేసుకొని స్ఫటిక బిళ్ళలను ధరించియున్నారు. మణికర్ణికా ఘట్టమునందు గంగాపుత్రులున్ను ఘూర్జరులున్ను వసింపుచున్నారు. దుర్గాఘట్టాములో మహాజను లనే సాహుకారులు పూర్వీకులైన స్థలజ్ఞులున్ను వసింపుచున్నారు. కేదారఘట్టములో కంగాళీలనే దక్షిణదేశస్థులు యాత్రార్ధముగా వచ్చినవారు మిక్కటముగా వసింపుచున్నారు. దుర్గాఘట్టములో ఇండ్లు వున్నతములుగా అంతస్థులు యెక్కువగా కలిగి యున్నవి.

మణికర్ణికకు దక్షిణమున సమీపముగా చౌకంబా అనే గుజరీ అంగడి యున్నది. యీపట్టణములో పీతాంబరాలేమి సకల విధములయిన వస్త్రములేమి అపూర్వము లయినవి కావలసినంత మట్టుకు దొరుకును. పాత్రసామానులు అపారముగా అమ్ముతూ ఉన్నారు మహాజనులు రత్నాలు మొదలయినవి అమ్ముతూ వున్నారు. లక్కునో *మొదలయిన సమస్థానములకు కావలసిన ఆభణాలు రత్నములున్ను యిక్కడి నుంచి పోవుచున్నవి.

పట్టణానికి వుత్తరముగా గంగా సంగమము అయ్యే వరణ పట్టణమును చుట్టుకొని పడమరగా ప్రవహింపుచు దక్షిణమున అసితో

*లక్కునో అయోధ్య నవాబు రాజధాని.

ఈనవాబు మొగలాయి చక్తవర్తికాలములో రాజప్రతినిధి తరువాత స్వతంత్ర రాజు. ఇంగ్లీషువారు ఇతనితో స్నేహంచేస్తూ ఇతనివల్ల చాలా సొమ్ము సంపాదించారు. ఇతని దర్భారు అతివిభవంగా వుండేది. ఇతడు దొరల మెప్పుకోసం అమితసొమ్ము ఖర్సుపెట్టి అప్పులపాలైనాడు. అత్యధికవడ్డీలతో ఇతనివల్ల దొరలు చాలా పత్రాలు వ్రాయించుకొన్నారు. అయోధ్యరాజ్యం పాడిపంటలతో తులతూగుతూ సుభిక్షంగా వున్నందువల్ల ఎలాగైనా దీన్ని కాజెయ్యాలని కంపెనీవారితని పరిపాలన బాగులేదని ప్రజలు భాధపడుతున్నారని దుష్టప్రచారంచేస్తూ చివరకు పద్దెనిమిది వందల యాభై ఏడు లో ఇతని త్రోసి రాజన్నారు. ఈ నవాబు సద్గుణాలను విభవాన్ని బిషప్ హవరుగారు పద్దెనిమిది వందల ఇరవై ఒకటి లో వర్ణించారు.

కలిసి వుంచున్నది గనుక ఆవరణకు బహి, ప్రదేశములో జాతులవారు సిక్కులూరు అనే ప్రదేశములో ఇండ్లు తోటలు కట్టుకొని వసింపుచున్నారు. ఇక్కడ ఉండే అధికారస్థులు గౌనరు జనరల్ యేజెంటు అనే సర్వాధికారి ఒకడు, అప్పీల్ కోరటు జడ్జీలు ముగ్గురు, కష్టం కలకటరులు యిద్దరు, జడ్జీ ఒకడు, మేజస్ట్రేటు ఒకడు, వీరుగాక రెండుమూడు పటాలాలు ఇక్కడ వునికిగా ఉంచున్నవి గనుక వాటిలో చేరిన దొరలు ఒక జనరల్ సహితముగా వసింపు చున్నారు. లోగడును యీ పట్టణములో టంకసాల ఉండెను, ఇప్పుడు యెత్తివేశినారు. యీ దొరల కచ్చేరీలు అన్ని శిక్కులూరిలో ఉన్నవి.

యీపట్టణములో కొత్తవా లనే ఒక పెద్దఉద్యోగస్థుని కచ్చేరీ యున్నది. ప్రతి వీధికి ఠాణా లున్నవి. యిక్కడి వీధులకు గళ్ళీలని పేరు. ప్రతి గల్లీకి పాటక్కు అని తలుపులు ద్వారబంధనాలు పెట్టివున్నవి. ప్రతిపాటక్కునున్ను రాత్రి పది ఘంటలకు బిగింపుచున్నారు. అవతల జనులు తిరుగులాడడము ప్రయాస. ఠాణా బంట్రౌతులు బరక్రదాసులనే పేళ్ళతో రాత్రిళ్ళు గస్తు తిరుగుతూ వున్నారు. వీరందరున్ను కొత్తవాల్ ఉత్తరువుకు లోబడి వున్నారు.

సమస్తమయిన కూరకాయలున్ను ఫలాలున్ను అపరిమితంగా దొరుకుచున్నవి. అందులో ఇక్కడి ముల్లంగిగడ్డల గాత్రమున్ను పొడుగున్ను నేను యీసరికి యెక్కడ చూచినవాణ్ని కాను. కూరగడ్డలని వేలెడులాఫు గల గడ్డలు వాటి ఆకు సహితముగా అమ్ముతూ వున్నారు. కిచ్చిలి మణీలా పండ్లు, కిచ్చిలి కమలాపండ్లున్ను చెట్లకింద రాలి యెత్తేవారు లేక నున్నవి.

గొప్పయిండ్లు పట్టపగలే చీకటిగా ఉంచున్నవి. ఘాటేయా లనే స్నానొపచర్యలు చేసేవారు అనేక జాతులుగా కలిసి యుంచున్నారు. అసివరణల మధ్యే పన్నెండు వందల మంది ఆయా స్నానఘట్టాలలో పలకలు వేసుకుని ఉపచర్యాద్రవ్యా లయిన విభూతి గోపీసందనము మొదలయినవి ఉంచుకొని యున్నారు. స్నానఘట్టములలో వారి యధికారము ఎక్కువ. యీ గంగా పుత్రులు ఘాటియాలు కాక ఠాణీలని పంఛ పూజలని ప్రసిద్ధముగా చేయుచున్నారు. ముప్పై రూపాయలలో ముఖ్యమైన స్థలములలో మహాపూజలు జరుగుచున్నవి.


ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర
టీటీఎస్ ఆడియో నిర్మాణ పాఠ్యం
భాగం ఐదు — మొత్తం ఎనిమిది భాగాలలో


పన్నెండవ ప్రకరణము  కాశీ

పట్టణమునకి దక్షిణ భాగమున అసీతీరము నందు దుర్గాగుడి ఒకటి యున్నది. ఈ దేవత ఈ పట్టణమునకు కావలిగా వుండే శక్తియని పురజనులు మెండుగా ప్రతి మంగళవారమున్ను వెళ్ళి ఆరాధింపు చున్నారు. ఈగుడి తక్కిన గుళ్ళకన్నా విశాలముగా నున్నది. సమస్త మయిన గుళ్ళున్ను యెక్కడ చూచినా నిత్యయాత్రచేసేవారు అభిషేకనిమిత్తమైపోశే ఉద్దరిణి నీళ్ళతోనున్ను బిల్వదళములతో నున్ను తిలాక్షతలతోనున్ను నిండియున్నవి. యీబిల్వపత్రములు తిలాక్షతలున్ను తినడమునకు వృషభములు లోగా సంచరింపు చున్నవి. కాబట్టి పూజించ పొయ్యేవారు పుష్పమాలికలున్ను, బిల్వదళములున్ను, చేతులో తెలిసేటట్ట్లు యుంచుకుంటే ఈ వృషభములు పయిన పడుతున్నవి. నిత్య యాత్ర చేసే నిమిత్తముగా వేలపర్యంతము స్త్రీలు, పురుషులున్ను, పిడికిలి కణిగిన బుట్టలలో డబ్బిలలో నున్ను బిల్వపత్రము, తిలక్షతలున్ను ఉంచుకొని, మరియొకచేత ఉదకము తీసుకొని, చూచిన లింగానికిన్ని లింగము ఉండే ఆలయ ద్వారము మూసియుండే పక్షమందు ఆ ద్వారపు కడప మీద ఒక ఉద్ధరిణీ ఉదమకుతో అభిషేకము చేసి ఒక బిల్వపత్రము వేసి కొన్ని తిలాక్షతలు చల్లుచు వచ్చుచున్నారు. స్నాననియమము ప్రతి మనిషికిన్ని కలిగియున్నది. శూద్రులుకూడా శిరస్నానము చేయక భోజనము ఛేయరు. ఈ దేశపు బ్రాహ్మణులు ఇతర వర్ణాలను నిండా అనాదరణ చేసి అగౌరవ పరచనందున కర్మహీనులుగా చేయవలెననే క్రీస్తు మతస్థులు ప్రయత్నము ఈ దేశములో ఈ సరికి మిక్కిలి సాగలేదు.

ద్రావిడ దేశములో శూద్రులనున్ను, ముఖ్యముగా చండాలులనున్ను అగౌరవ పరుస్తూ, శూద్రుల దృష్టిన్ని చండాలుల సమీప వర్తిత్వమున్ను కూడని నిండా అగౌరవ పరచడము చేత, వేల పర్యంతము ప్రజలు క్రీస్తు మతస్థులుగా పెదపాళెము మైలాపూరు క్రీస్తుగుళ్ళ వుత్సవాదులలో చూడబడుచున్నారు. భ్రాహ్మణులకు శ్రుతి చోదితములయిన కర్మాదులను చేసుకొనుచు స్వస్తి ప్రజాభ్యం ద్రావిళ్ళు పంచగౌడులతో చేరిన యాచకులు పదిహేను వేల మంది దాకా వున్నారు. అందులో పంచద్రావిళ్ళు సగమని చెప్పవచ్చును.

ఈ కాశిలో వుండే వుపద్రవాలు మూడని చెప్పుకొనుచున్నారు. అవి యేవంటే - రాండు - సాండు - చీడీ అని మూడు వుపద్రవాలు కలవు. రాండు అనగా విధవస్త్రీలు, సాండు అనగా వృషభములు, చీడీలు అనగా మెట్లు. విధవలు నిండా యాచించడము చేతనున్ను, దుర్మార్గపు బాలవిధవలు ఇతర నడతలు కలిగి యుండుట చేత నున్ను వారివల్ల బహు పీడ లోకులకు కలిగి యున్నది. వృషోత్సర్జనము చేసి లోకులు అనేక వృషభములను పట్టణములో విడిచి పెట్టినందున యీ గల్లీలలో మనుష్యులతోటి పాటు మెలగి సంచరింపుచు ఉంచున్నవి. ఇట్లా నుండగా వాటికి రంధి పుట్టినప్పుడు మనుష్యులను చాలా హింస పెట్టుచున్నవి. చీడీలని ప్రతి గల్లీలలో మెట్లు యెక్కి దిగవలసినది. వైపు తప్పి పడ్డవారికి కాళ్ళు చేతులు విరగడము కద్దు.

గొసాయీలు ధనికులుగా మహాజనాలనే పేరు పెట్తుకుని సాహుకారు పనులు చేయుచున్నారు. భిక్షాటకులుగాను బహు మంది బయిరాగులతోటి పాటు సంచరింపుచు ఉన్నారు. కంగాళీలనే భిక్షాటకులకు లెక్కలేదు. సవారీ సమేతముగా యాత్ర వచ్చేవారిని యాచించే కంగాళీలు పక్కీతులు గల్లీలలో సవారీని సాగనియ్యరు.

ఈ కాశీ మహా క్షేత్రములో అధర్వణ వేదమును కొందరు ఘూర్జరులు అధ్యయనము చేసి యున్నారు. ఆ వేదస్వరము ఋగ్వేదస్వరమునకు సమీపముగా నున్ను, ఉదృతముగా నున్ను, యున్నది. యజుర్వేద్ములో మాధ్యందినశాఖ యని శుక్లయజుశ్శాఖ యని ప్రధమ శాఖ యని తైత్తిరీయశాఖ యని సర్వభేదములతో అధ్యయనము చేయుచున్నారు. ఇక్కడ సామగులు నూటిదాకా యున్నా స్వరము దక్షిణ దేశమునకు బహు భేదముగా నున్నది, గాన సౌష్టవము విస్తారములేదు. పంచద్రావిళ్ళలో పంచగౌడులలో నున్ను ఒకటి రెండు శాస్త్రాలు చదివిన పండితులు వెయిమంది దాకా ఈ కాశీలో యున్నారు. న్యాయశాస్త్రము ఇక్కడ నిండా ప్రచురము.

బంగాళీ బ్రాహ్మణులు బహుమంది యిక్కడ పండితులయి యున్నారు. వారు ఉత్కలగౌడులు. ఉత్కలదేశములో మత్స్యభక్షణ, ద్రావిడ దేశములో మాతులకన్యా వివాహము, మాగధదేశములో మద్యపానము, మైధిలదేశములో దేవరేణ సుతోత్పత్తిన్ని, అద్యాపి నిషిద్ధము కాదని ప్రసిద్ధము.

ఈ గంగాపుత్రుల ఉత్పత్తి హేయముగా కొన్ని పురాణాదులలో చెప్పియున్నది. వారు చెప్పడ మేమంటే భీష్మాచార్యులకు పూర్వము గంగ కన్నకొడుకులను తనలో ఐక్యము చేసుకొని యుండగా అటుతర్వాత భీష్మాచార్యుల తండ్రిని గంగ వదలిన వెనక, లోగడ తనలో కలుపుకొన్న పుత్రులను మళ్ళీ భూమిలో ఉద్ధరించినట్టున్ను, తాము వారి వంశస్థులనిన్ని వాదింపుచున్నారు. వారు ఇప్పట్లో కాన్యకుబ్జులతో సంబందములు చేయుచున్నారు. గంగాతీరమునందు ఏదానమున్ను వారిని మినహా మరి ఒకరికిన్ని యివ్వకూడదు. ఠాణీబ్రాహ్మణులు వచ్చినవారికి తీర్ధ పురోహితము చేసినా యిండ్లలో యిచ్చే దాన్ని ప్రతిగ్రహించ తగ్గవారేగాని బాహటముగా గంగాతీరమునందు తీసుకోలేరు. ఘాటియాలకు ఠాణీలకు గంగాపుత్రులు తమ రహితులని అధికారమును ఆ యా కాలములలో చెల్లింపుచు వచ్చుచున్నారు.

ఇక్కడి రూపాయిలకు చెన్నపట్టణపు రూపాయలకున్ను ఒక అణా భేదమున్నది. మన రూపాయలు చిన్న. రూపాయి ఒకటి కి పదహారు గండులనే అరవై నాలుగు పయిసాలు. అన్ని భక్షణయోగ్య పదార్ధాలున్ను నయముగా అమ్మినా రుచికలిగీ యుండడములేదు. చూపుకుమాత్రము బహుబాగా యుంచున్నవి. నీళ్ళున్ను ఉప్పున్నూ కలియని మిఠాయిన్ని పక్వాన్నాలున్ను సకలమయిన బ్రాహ్మణులున్ను కొని భక్షింపుచున్నారు. చేసే వారిజాతి విచారణ అక్కరలేదు. పుష్పాలలో జాజి పూలుతప్ప యితర సుగంధ పుష్పాలు దొరకవు. మన దేశములో తురక పూలని నిషేధముగా యెంచేపుష్పము లంతా యిక్కడ దేవతారాధనకు పరిగ్రహింపుచు నున్నారు. యిక్కడి గుళ్ళలో మహా పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాఖ అనే శ్లోకప్రకారము సమస్త లోకుల క్షేమము కొరకు ఈశ్వర ప్రార్ధన చేయుచున్న తమ కర్మాదులకు విరొధము లేక క్షాత్రధర్మముతో తంమును కాపాడే క్షత్రియ జాతిని గౌరవ పరచుచు, తమకు దొరకని దేశాంతరాలయందుండే పదార్ధాలను వాణిజ్యమూలకముగా తెచ్చి యిచ్చే వైశ్యులను లాలించి, తమకు ఉపచరించి సేవ చేసే శూద్రులను ఆదరింపుచు రమ్మని శాస్త్రనియమ మున్నది గాని వండేపెట్టడానకు అర్హుడయిన శూద్ర దృష్టే మనకు కూడదు, బ్రాహ్మణ వీధి లోనే శూద్రుడు రాకూడ దనే ఆచారము మూల స్మృతులలో ఇటువంటి అగౌరవాలకు ఆకరము పుట్టియున్నది గనుక ద్రావిడ దేశస్ధులు భూరూప మయిన జీవనాలు పుష్కలముగా కలుగుటచేత కర్మాదుల విషయ మయిన ఆచారాలు మెక్కుట మయి శూద్రులను నిండా తృణీకారము చేయుచు రావడముచేత, వారికి మాంసభక్షణ మొదలయిన దుర్మార్గములో బుద్ధితగిలి, స్నానాది కర్మములను వదిలి నికృష్టు లయి వారున్ను వారికి తక్కువ తెగ అయినవారున్ను ఈ నికృష్టములో పడి అవమానపడడ మేమి? సమానత్వము పొందగల మతములోనే ప్రవర్తింపుచున్నామని, క్రీస్తుమతస్థుల ప్రేరేపణకు లోపడుచున్నారు.

ఈ బ్రహ్మాండములో కన్యాకుమారి మొదలు కాశ్మీరమువరకు నుండే దేశము సర్వోత్తమ మయిన కర్మభూమియై, రామకృష్ణాద్యవతారములకు పాత్రభూతమయి, శాపానుగ్రహ శక్తులయిన అగస్త్యాది ఋషులకు వాసయోగ్యమయి యుండిన్ని, ఈ బ్రహ్మాండముయొక్క చివరను వసింపుచు పూర్వకాలమునందు పశుప్రాయులుగా నుండిన యింగిలీషువారిచేత యిప్పుడు యేలబడి యున్నది. నరుబ్బు ఇప్పుడు కర్మశూనులయిన ఆ యింగిలీషువారు ఈశ్వరకటాక్షమునకు ఈ కర్మదేశస్థులకంటే యెక్కువగా పాత్రులై ఉండవలసిన కారణ మేమని యోచించి నంతలో నాకు శ్రీరాములతోపచేసిన యుక్తి యేమంటే, తత్వబోధసాధన మయిన విద్యాబుద్ధి లేనివారికిన్ని స్త్రీ బాలులకున్ను భక్తిజనితమయ్యే నిమిత్తముగా ముఖ్యముగా కర్మాదులనున్ను బింబారాధనలనున్ను ఉద్ధరించిన పూర్వీకులయిన స్మర్తలు బింబాలకు మనోజ్ఞమయిన మధుఘృతాదూలతోనున్ను ఫలరసాలతొనున్ను అభిషేకము చేసి ఆలయాలు కట్టియుంచి అలంకరించి అర్చనచేసి రాజోపచారలాంచనలు జరగవలసిన వని వ్రాస్తే ఇటీవల ఉపస్మర్తలు భక్తినివృద్ధి పొందింప చేయవలెననే వెర్రితాత్పర్యముతో యెంత తేనె అభిషేకము చేస్తే అంత మంచిది, యెంత పెద్దగుడి చిత్రాలతో కట్టితే అంత పుణ్యము, యెన్ని విచిత్రాలతో అలంకరించితే అంత శ్రేష్టము, యెందరిని రూపవతులయిన దాసీలను రాజోపచార నిమిత్తముగా గుడిలో వుంచితే అంత గుణ మని వ్రాసినందున యధోచితము లయిన పంచామృతాభిషేకములను వదిలి అంతర్యామి రూపముతో పరమాత్మ వసింపుచు నుండే దేహములకు భొజ్యములయిన వస్తువులను విస్తరించి బింబముల మీద పోయుచు వ్యర్ధ పరచుచు రాసాగి దర్శనమాత్రము చేతనే కామవికారములను కట్టసాగిరి. మరిన్ని సాధారణపు స్త్రీపురుషులు ధరించే వికార వేషములతోనున్ను వికార చర్యలతోనున్ను బింబాలను అలంకరించసాగిరి. మరిన్ని ఆ గుడికంటె యీగుడిలో విభవము యెక్కువ అనిపించవలెనని పైపోటీలతో వ్యర్ధముగా ద్రవ్యవ్యయము చేసి పయిన చెప్పిన పనికి మాలిన పనులు జరిగించి అలాటి అలంకార విభవముల గుండా లోకులకు భక్తిని కలగజేయ సంకల్పించినందున సర్వాంతర్యామి యైన భగవంతునికి అది విరుద్ధముగా తోచినది.

ఆ ప్రకారమే బ్రాంహ్మణులను సత్కర్మముల నాచరింపుచు లోకుల శ్రేయస్సును ప్రార్ధింపుచు అందరినిన్ని ఆశీర్వదింపుచునుండు డని చెప్పితే మేము సర్వోత్కృష్టులమని అహంకరించి ఇతర వత్ణములను తృణీకరించ సాగిరి. అదిన్ని భగవంతునికి అసహ్యమయినట్టు తోచుచున్నది. సగుణ బ్రహ్మారాధన విషయమయి చిత్తము భక్తి కలిగి తదేకనిష్టతో ఉండేకొరకు ధ్యానారంభకాలము నందు, యధోచితముగా తగుపాటి మత్త ద్రవ్యమును సకృదావృత్తిపుచ్చుకొను మన పూర్వీకులు దోవచూపితే, సారాయి పీపాయిలను ఖాలీచేయ సాగినారు. గొ బ్రాహ్మణుల పోషణ ప్రకటనమయ్యే కొరకై వారి పోషణ విషయమై అబద్ధమయినా ఆడవచ్చునని పూర్వీకులు వారికి పక్షముగా వ్రాస్తే, అపద్దముతోనే జీవనము ఛేయసాగిరి. వృద్ధ మాతాపితృపోషణ ముఖ్యమని తెలియపరచను అస్యకార్యశతం కృత్వా అని మనువువ్రాస్తే పరద్రవ్యమును పేలపిండి వలెనే భుజింపసాగిరి. యీ రీతిగా పూర్వీకులు కడతేరేటందుకు వేశిన మొలకలను విషధారలతో పెంచినందుచేత విషజ్వాలా సహితము లయిన ఫలములే ఫలించినవి.

కలిలో భావిఫలములను పూర్వీకులు ఊహించినట్టు ఈకర్మతులు బహు మంచిది బహుమంచిది అనిచేసే పనులంతా యీశ్వరదృష్టికి అపరాధములుగా తోచి ఈ విపరీతము లయిన ఆచారములనున్ను అర్చనలనున్ను బ్నొత్తిగా నిలపదలచి యిప్పుడు ఈ బ్రహ్మాండములో యధోచితముగా పదవాక్య ప్రమాణ్యముగల యింగిలీషువారిని యీ కర్మభూమిని యేలేటట్టు చేసినాడు. యీ ఇంగిలీషువారికి అనుగుణము వుండడము మాత్రమే కాకుండా భూతదయ పశ్చాత్తాపము తారతమ్య జ్ఞానము శుచిరుచి సాత్విక గుణము ఉపశాంతి ఈశ్వరభక్తి యిది మొదలయిన సుగుణాలు శావావున్నట్టు తోస్తున్నది. తద్ధ్వారా వారు సర్వాంతర్యామి కటాక్షానికి పాత్రులయి సర్వోత్తమ మయిన యీ కర్మ భూమికి సార్వభౌములయినారని తోచు చున్నది.*

యీ కాశీపట్టణ మందువుండే సమస్త బ్రాహ్మణులు స్తోమాలని తడలనిపేళ్ళు వహించి ప్రత్య్హేకము ప్రత్యేకు లయిన గుంపులుగా నొక్కొక్క గుంపుకు ఒక అధిపతిని యేర్పరచుకొని యిది జాలంభొట్లస్తోమ మనిన్ని, యిది రాజేంద్రబాబు తడయనిన్ని యిట్లా చెప్పబడుచు కొంతకాలము ఒక గుంవు మరియొక గుంపుతో విహితముగానున్ను మరికొంతకాలము ద్వేషరీతిగానున్ను విద్వత్ గ్రామము గనుక

*వీరాస్వామయ్యగారి కాలంలో ఈ దేశంలో ఉద్యోగాలుచేసిన దొరలలో సర్ తామస్ మన్రో, విలియం బెంటింకు గార్ల వంటి సత్పురుషులు, స్నేహపాత్రులు చాలామంది వుండేవారు. అందువల్లనే ఆంగ్లేయులయందు వీరి కంత అభిప్రాయం కలిగింది.

ఆచార వ్యవహారములను గురించి తాత్పర్య భేదము కలవారము ప్రవర్తింపుచు వుంటారు. వీరిని ఆరాధన చెయ్యడములో ఉపాయము తెలిసి కొంత గుంపులకు ముందుగా కొంతగుంపుకు వెనక కొంత గుంపుకు సమకాలములో ప్రత్యేక స్థలాలలోనున్ను యీ ప్రకారముగా సభాపూజలు ఛేయుచు రావాలసినది. సుమంగలీపూజకు వేయి మంది స్త్రీలు వత్తురు. భిక్షము పెట్టేవారు కలిగితే రెండువేలమంది అనాధ స్త్రీలు జమ అవుతున్నారు. యిందరికిన్ని అన్నపూర్ణ కటాక్షముచేత పుష్కళమయిన అన్నము దొరుకుచున్నది. పిలువకనే వచ్చే పరదేశులలో స్త్రీలు పురుషులుగా రెండు వేల మంది పంచ ద్రావిళ్ళలో వున్నారు. వీరి కందరికి అన్నపూర్ణ సత్రములో పూనా శ్రీమంతుని తమ్ముడైన అమృతరాయడు రెండు వేల నాలుగు వందలు మందికి ప్రతిదినమున్ను అన్నము పెట్టుతాడు *మన దక్షిణదేశస్థులు బహుమంది కాశీ తంబురాయడనే పండారముగుండా పది వందల కి అన్నము ప్రతిదినము కలగచేసియున్నారు. మయిసూరు రాజు మొదలయిన గొప్పవారు యింకా అనేకులు అన్నముగానున్ను శీదా, స్యయంపాకము, లుగానున్ను ప్రతి దినమున్ను యిచ్చుచున్నారు. విశ్వేశ్వరుడు యిక్కడ చనిపొయ్యే వారికి తారకనామ ఉపదేశము చేస్తానని ఆచొప్పున అన్నపూర్ణయిక్కడ వసించే వారికి అన్నము సమృద్ధిగా కలగచేస్తాననిన్ని ప్రతిజ్ఞ చేసినట్టు పురాణ మందు చెప్పియున్నది. అన్నపూర్ణ ప్రతిజ్ఞ ప్రత్యక్షముగా వున్నది.

శ్రీరాములుయొక్క అవతారానికి పూర్వమే అనాదిగా రామనామము తారకమయి యున్నది. అది తెలిసి శ్రీరాములకు ఆనామము తోనే వసిష్ఠులు నామకరణము చేసినారు. ఈహేతువుచేత యీ పట్టణములో యెవరు చనిపోయినా శ్మశానానికి శవానికి శవానుగమనము చేశే వారు రామ నామసత్తుహే అంటు నడుస్తారు. తద్ద్వారా తద్వ్యతిక్తమయిన దంతా అనృతమని అర్ధమవుతూ వున్నది. యీ మహా స్థళానికి శ్రీమంతులు అనేకులు వచ్చి లక్షల మోడి సెలవు చేసినారు. స్థళమహాత్మ్యమేమో కాని, యే బహనా, నెపము,చేతనయినా నెలకు

*పీష్వా అమృత రాయని దానదర్మములను గూర్చి బిషప్ హెబరు చక్కగా వర్ణించి యున్నాడు. ఈ అమృతరాయడు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు లోనే దివంగతుడైనాడు.

నాలుగయిదు లక్షలు సెలవుచేసేపాటి ఆసామి ఒకడు యీస్థళమందు వసింపుచున్నే యుంటాడు. ఇప్పట్లో శ్రీమంతుని తమ్ముడు బిమ్మాజీ అనే అతను నెలకు మూడు లక్షల రూపాయలు ఖర్చు ఛేసుకుంటూ అసి తీరమందు యున్నాడు. యింకా యీదేశపు బహు ధనికులు విరామదశను పొంది కాశీవాసము చేయుచున్నారు. యీక్షేత్రాన అవశ్యముగా చెయ్యవలసినపనులు వాసము ఒకటిన్ని వర్షాశనదానము ఒకటిన్ని ముఖ్యములు.

కాశీ పట్టణములో పదివేల యిండ్లున్ను, లక్షప్రజలున్ను వుందురని తోచుచున్నది. *యిక్కడ దొరకని పదార్ధము వకటిన్ని లేదు. అందరు దేశభాష అయిన హిందూస్థాన్ మాటలాడు చున్నారు. బాహాటమయిన సంత అంగళ్ళను బాళాలని వ్యవహరింపుచున్నారు. ఉత్సవాదులను మ్యాళా అనిన్ని, పల్లకీలను కడుకడియా అనిన్ని, బోయీలను కారులోకు అనిన్ని వాడుతారు. బొందిలీ ఖండములో బోయీలను డీమరు అంటూవచ్చిరి. సామాన్య నౌకరుల జీతము నెలకు నాలుగు రూపాయలకు యెక్కువ లేదు.

యీ స్థల మాహాత్మ్యము స్కాందపురాణాంతర్బూతముగా వుండే కాశీ ఖండములో వంద అధ్యాయాలుగా విస్తరించి చెప్పబడుతునున్నది. యిదిగాక సూక్ష్మముగా ఐదు అధ్యాయాలు గల కాశీ మాహాత్మ్య మనే గ్రంధమున్ను విస్తరించబడి యున్నది. వాటి సార

*బిషప్ హెబరుగారు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు లో కాశిని దర్శించి తన దినచర్యలో చక్కగా వర్ణించియున్నారు. అదిచాలా విషయములలో వీరస్వామయ్యగారు వ్రాసినదానికి సరి పోతున్నది. జనసంఖ్య విషయంలో మాత్రం వీరాస్వామయ్యగారు పొరబాటుపడినట్లు కనబడుతూవుంది. హెబరుగారు వ్రాయడంలో పద్దెనిమిది వందల ఎనిమిది లో వేయబడిన ఒక జనాభా లెక్క ప్రకారం కాశీలో ఐదు,ఎనభై రెండు,సున్నా ప్రజలు వున్నట్లు తేలిందనిన్నీ దానిలో కొంతమంది అతిశయోక్తి వున్నదనుకున్నా, ఉన్న లెక్క అది ఒక్కటేననిన్నీ, పట్టణ వైశాల్యము బట్టిన్నీ క్రిక్కిరిసియున్న కట్టుడును బట్టిన్నీ ఆ అంచనా యించుమించుగా సరియైనదేనని తొస్తూ వున్నదనిన్ని, లండన్, ప్యారిస్ నగరాలు తప్ప ఐరోపాలోని తక్కిన అన్ని నగరాలు కన్నా యీ కాశీనగరం ఎక్కువ జనాకీర్ణంగా వున్నదనిన్నీ వ్రాశారు. చూడు. బిషప్ హెబర్సు జర్నల్ మొదటి సంపుటము, పుటలు మూడు వందలు డెబ్బై నుంచి నాలుగు వందలు వరకు.

మేమంటే నిర్గుణ బ్రహ్మము సృష్టి సంకల్పము కాకమునుపు జ్యోతిర్మయకారముగా యీ స్థలములొ మిక్కిలి జ్వలిస్తూ వున్నట్టున్ను బ్రహ్మకు, విష్ణువుకున్ను అహంపూర్వ మహంపూర్వ మని వివాదము పొసగినట్టున్ను జ్యోతిర్మయాన్ని చూచి ఆ యుభయులున్ను పరమయిన వస్తువు యీజ్యోతిస్సని తెలుసుకొని తాము శాంతిపడ్డట్టున్ను, సాంబమూర్తి ఈ స్థలము అనుపూర్విక మయినందున యిక్కడ వసించసాగినట్టున్ను, తద్ద్వారా మహాశ్శశాన మయినదనిన్ని ఆ జ్యోతిర్లింగము యిప్పటికిన్ని యిక్కడ పంచకోశాత్మకముగా యున్న దనిన్ని అదిని యీ భూమి జ్యోతిర్భూతానికి వాసయోగ్యమయినందున బ్రహ్మాదులు యిక్కడ తపస్సుచేసి సకల సిద్ధులు పొందినారనిన్ని, అగస్త్యాది ఋషులు అదేప్రకారము యుక్కడ తపస్సు చేసి సచ్చిదానందమును అనుభవించినందున యీ స్థలము ఆనందవనమనే పేరు వహించినదనిన్ని, మహాప్రళయాదులలో జ్యోతిర్భూతానికి యీ భూమి వాసయోగ్యమైనందున త్రిగుణాత్మకమయిన మూడు ముండ్లవంటి కొనలు కల ఆయుధముతో యీ భూమి యెత్తబడి వుండినందున త్రికంటక విరాజితమనే బిరుదు యీస్థళానికి కలిగినదనిన్ని, మిక్కిలి ముఖ్యముగా చెప్పి అటుతర్వాత పరాపరఫస్తువు సర్వాంతత్యామి గనుక యెవరియందు ఆ వస్తువును ఆరొపితము ఛేసినా ఛేయవచ్చును గనుక స్కాందపురాణ కారకుని ఇష్టప్రకారము అపరాపర వస్తువునే శివుడని సిద్ధాంతపరచబడిన ఆ సాంబమూర్తి తద్ద్వత్తుగా జ్యోతిర్మయముగా ప్రకాశించి నాడనిన్ని, ఆయన కటాక్షము సంపాదించి బ్రహ్మాదులు వారివారి అధికారాలు పుచ్చుకున్నారనిన్ని విస్తరించి

యున్నది.

యింతటికి యిక్కడి యీశ్వరుని పేరు విశ్వేశ్వరుడు. ఇది సమష్టివాచకము. లింగమున్ను సమష్టిరూపమేగాని పార్వతిసహితముగా వృషభారూఢుడయిన సాంబమూర్తి రూపముకాదు, లక్ష్మిని వక్షస్థలమందు వహించిన మహావిష్ణు రూపమున్ను కాదు, అయితే శైవులు ఆ లింగారాధనను చేయుచు వచ్చుచున్నారు. అందువల్ల వైష్ణవులు ఆ రూపము యొక్క ఆరాధనను వదిలినారు. యీస్థలములో జ్యోతిర్భూతమ్మ


పదమూడవ ప్రకరణము  కాశీవాసము మరియు గాజీపూరు

జ్వలిస్తూ యుండినందున ముక్తిక్షేత్ర మయినది. ఈ క్షేత్రములోని పాపులకు ప్రకారాంతరముగా కాలభైరవ దండన మూలకముగా పాపానుభవము చెప్పి అటుతర్వాత విశ్వేశ్వరుడివల్ల తారకమంత్రము వుపదేశమయి ముక్తిని పొందేటట్టు పురాణసిద్ధ మయి యున్నది.

యీ స్థలము అవిముక్త క్షేత్రమయినందున గంగ విశ్వేశ్వరుడి అనుగ్రహము సంపాదించి అసి-వరణల మధ్యే తనలోని జంతువులగుండా యెవరికిన్ని ఉపద్రవము చేసేది లేదని ఖరారుచేసి ఇక్కడ ప్రవహించసాగినది. ఈ కలియుగములో పాపాలను పోగొట్టడానకు గంగకు మించిన పదార్ధములేదని కంఠోక్తిగా కాశీఖండములో చెప్పియున్నది. ఆటువంటి గంగ ఇటువంటి క్షేత్రములో ఇక్కడ జతపడినందున ఈ రెంటిమూలకముగా పరమాత్మడు అనేకుల భక్తిని ఆకర్షించి తరింపచేయుచున్నాడు. ఇటువంటి మహాస్థలములో డిసంబరు నెల పదహారు తేది రాత్రివరకు వసించినాను.

తేది ఉదయాన నాలుగు ఘంటలకు ధనుర్లగ్నములో పన్నెండు దాండ్లుగల బజరాలోయెక్కి గయకు తరలి వచ్చినాను. నాబోయీలు మొదలయినవారు ఉండడానికి పట్టేలు అనే తడికెలు కట్తిన పడవను ఒకదాన్ని కూడా తేవడమయినది. ఈ బజరాకు పట్నా అనే షహరు వరకు బాడిగె యాభై యైదు రూపాయలున్ను, పట్టేలు అనే పడవకు ముప్పై రూపాయలున్ను యిచ్చినాను. కార్తీకశుద్ధ పున్నమివరకు యీ ప్రాంతమందు శీతకాలము ప్రవేశించలేదు. అదిమొదలు చలి దినదిన ప్రవర్ధమాన మయినందున యెండను మనదేశములొ వసంతకాలపు వెన్నెలవలె అతిప్రియముతో అనుభవింపుచు నున్నారు.

కాశీపట్టణ్ము గంగయెడ్డు అయినందున గంగ ధనురాకారముగా ప్రవహింపుచు గట్టునుకోసి వొత్తిరాకుండా బలమయిన గట్టములను వొడ్డున కడాకున్ను కట్టియుంచుట చేత, వొడ్డు కోశేదానికి బదులు ప్రవాహముయొక్క జోరు భూమిని కోశి లోతు అవుతూ వచ్చినది. గనుక ఆ చొప్పున లొతు కావడమువల్ల వడ్డున వుండే భూమి వూటపారి యీ శీతాకాలములో అతిశీతలమయి పయిగా జనసమ్మర్ధము విస్తారమయి నందున జ్వరాలు మొదలయిన అనేక రోగాలను ఉత్పత్తి చేయుచున్నది. మిక్కటముగా భూమి కొత్త అయినవారికి వుపద్రవము యెక్కువగా వుంచున్నది. కాశీలో ప్రవేశించిన వెనక యికను సుభిక్ష రాజ్యములో ప్రవృత్తి కలుగు చున్నదనే తాత్పర్యము చేతనున్ను కలకత్తా పర్యంతము నావల మీద పోవలెననే యిచ్చచేతనున్ను కాశెలో కొన్ని దినములు వసించవలసియున్నదనిన్ని హయిదరాబాదులో కొలువుపెట్టిన ఒక జత పండ్రెండు మంది బోయీలనున్ను, ఆరుగురు బంట్రౌతులనున్ను పట్నాంన్నుంచి వచ్చిన ఆరుగురు కావడి వాండ్లనున్ను కొలువు తీసి వేసినాను. మిగిలియున్న వారిలో నలుగురికి కుదురుతువస్తే ఆరుగురికి జ్వరాలు మొదలయిన యుపద్రవాలు తగులుతు వచ్చుచున్నవి. యిక్కడి స్థలజ్ఞులు అదేప్రకారము రోగపీడితులుగానే వున్నారు. యిక్కడి చలి మన దేశస్థులకు అసహ్యముగా నున్నది. నాపరివారానికంతా ధగళాలు, కుళ్ళాయిలు, చావళ్ళు, లుంగీలున్ను తీసియిచ్చిన్ని కుంపట్లు ఆపేక్షింపుచున్నారు. నేను ప్లానుల, ఫ్లాన్ల్,తో అన్ని వస్తువులున్ను వారివలెనే కుట్టించుకుని ధరించినాను. యెండకాలములో వుష్ణము అదెప్రకారము అతిమిక్కటముగా నుంచున్నదట. అందుకు కారణము అప్పట్లో గంగ లోపలికి పోవడము ఒకటే గాని వేరే తొచలేదు. ఇప్పట్లో ఇక్కడ అహస్సు ఇరవై ఆరు గడియలు. యీ వాశి రాత్రి వృద్ధి అయి వుంచున్నది.

కాశీక్షేత్రము సకల స్థలములలోనున్ను చేసిన పాపములను పోగొట్టుచున్నది. యీ కాశీ మహాస్థలమందు లోకులు చేసే పాపములను యావత్తున్ను పోగొట్టడానికి జ్యోతిర్లింగ ప్రదక్షిణార్ధము పంచక్రోశయాత్ర అని యొకటి చేయవలసినది. ఆ యాత్ర చేసిరావడానకు అయిదు దినములు పట్టుచున్నది. ప్రధమ దినము మణికర్ణీకలో స్నానము చేసుకొని సంకల్ప పురిసారముగా ప్రయాణమయి మొదటి దినము కద్రమేశ్వరము అనే యూళ్ళో నిలిచి అక్కడ కర్దమతీర్ధములో స్నాన తీర్ధశ్రాద్ధాదులు చేసి కద్మమెశ్వరుని అర్చించి రెండో దినము భీమచండీ అనే స్థలము చేరి అక్కడ మొదటి దినము వలెనే గడిపి మూడో దినము రామేశ్వరము చేరి అక్కడ వరణ ప్రవహింపుచున్నది గనుక అక్కడ వరణా తీరమందు తీర్ధనిధి చేసి రామేశ్వరార్చన చేసి, నాలుగో దినము కపిలధార అనే స్థలము చేరవలెను. అక్కడ లోగడి మూడు దినముల వలెనే గడిపి అయిదో దినము మణికర్ణీక చేరి అక్కడ తొలు నాలుగు దినములవలెనే గడిపి స్వస్థలము చేరవలెను. యీ యాత్ర తిరగడము ఇరవై ఆరు కోసులు కద్దు. ప్రతి మజిలీస్థలములో నున్ను విశాలమయిన ధర్మశాలలు కట్టి యున్నవి. యిదిగాక అంగళ్ళు యిండ్లు, తొపులు అక్కడక్కడ కలిగి వున్నవి. దారిపొడుగునా శాల, నీడకొరకు వేసిన చెట్లవరస, యుంచి యున్నారు. ప్రదక్షిణానికి ఆరంభము అసిమొదలుగా చేయవలసినది.

కాశీయాత్ర చేసేవారు వారానికి ఒకసారి మసోపవాసి అనేనక దేవి దుర్గా గుడికి సమీపముగా నున్నది. అక్కడికి వెళ్ళి కొన్ని గవ్వలు వేయవలసినది. వేయనివారి యాత్రాఫలము ఆమె అపహరించేటట్టు ఒక వదంతి కలిగి యున్నది. యీ పంచక్రోశయాత్ర చేసే టప్పుడు భిక్షకులకు, గలిగినవారు నిండాగా నుపచరింప వలసియుంచున్నది. యీ కాశీక్షేత్రమందు గంగలో పూజచేసే బిల్వము ముణిగి పోవుచున్నదని ప్రసిద్ధి కలిగియున్నది. ప్రయాగలో స్త్రీలు యిచ్చేవేణిన్ని అదే ప్రకారము మణిపోతూ వుంచున్నది. యేస్థలములో నున్ను సన్యాసులు త్రిరాత్రానికి అధికముగా వాసము చేయకూడదని విధియేర్పడి యున్నా, విశ్వేశ్వర స్మృతి ప్రకారము ఈ కాశికి వచ్చిన యతులు యీ స్థలము వదలి పోకూడదని యేర్పరచి యున్నందున పంచగౌడులు పంచద్రావిళ్ళలో సుమారు వెయ్యింటికి యతులు యీ మహాస్థలములో నివాసముగా యున్నారు.

ఆంధ్రులలో వెలనాడు, కాసలనాడు, మురికినాడు అని వున్నట్టున్ను ద్రావిళ్ళలో వడమలు, కండ్రమాణీక్యము, యెణ్నాయిరము అని వున్నట్టున్ను ప్రతి గౌడ తెగకున్ను అనేక చీలికలున్నవి. బహు సావకాశముగా విచారించక గాని వాటి ఖుల్లస్సు బోధపడదు. బంగాళీ బ్రాహ్మణు లయిన ఉత్కల గౌడులలో ఒక అన్యాయము జరుగు తున్నది. అది యేమంటే లోగడ వారి తెగలో కొంత విపత్తులు వచ్చినప్పుడు కొందరు యధాశాస్త్రముగా ప్రవర్తింపుచున్నట్ట్లున్ను, అద్యాపి వారి సంతతి ద్వారా కులీనులయినట్టున్ను, అటు కులీనుడికి కన్యకును వివాహము చేసి యిస్తే కులము పవిత్రమవుతున్న దని ఒక బోధ తోచి యుపపన్నులు అందరున్ను అటువుండే బహు కొద్దిమంది కులీనులకు బహుద్రవ్య మిచ్చి వొప్పచేసి కన్యమీద కన్యను యిరువై ముప్పైయింటిగాకా యిచ్చి వివాహము చేయుచున్నారు. ఆ ప్రకారము వివాహము చేసుకొన్న కులీనుడు తదనంతరము నూరాగులు యిస్తేగాని ఒక రాత్రి ఆప్రకారము వివాహమయిన స్త్రీలతో వసించేదిలేదు. అటుగనుక అటు వివాహమయిన స్తీలు చాపల్యము లేనివారు హింసపడుతూ, చాపల్యము కలవారు వ్యస్థ తప్పి నడుచుచున్నారు.

యీదేశములో వసింఛే ఘూర్జర దేశాస్థులు అనేక తెగలుగా భేడా వారని, నాగరీ లని ప్రత్యేకగుంపులుగా ఒకరి యింట్లో ఒకరు భోజనము లేక నియమము కలిగియున్నారు. యీ దేశములో దృష్టి దోషవిచారము లేకపోయినా కచ్చారసూయి, పక్కారసూయి అనేపాక నియమాలు బహుశా పాటింపు చున్నారు. పక్కరసూయి ఒకడు పాకము చేసినది మరి ఒకడు సంప్రదాయము విచారించక శూద్రుడయినా బ్ర్రాహ్మణునిచేత కూడా తినడు. శూద్రులు బహుశా మాంస భక్షణము చేయడములేదు. కొన్ని సంఫత్సరముల కిందట దక్షిణ దేశములో నుంచి గూపాలకజాతి యయిన ఒక గొప్ప మనిషి కొమార్తె ఇక్కడికి యాత్ర వచ్చి స్వకులస్థులను యిక్కడ పరిచర్యకు కొలువు వుంచినది. అటు కొలువువున్న స్త్రీలు పురుషులున్ను వచ్చిన స్త్రీ మాంస భక్షణము చేయడము చూచి, నిండా నిందించి కొలువు వుండమని చాలించుకొన్నారు. యీదేశములో గోపాలకులు తులసీమణి ధారము చేసినట్టయితే ఆచార సంపన్నులని వారి చేతి గంగను ధారాళముగా యీ దేశపు సర్వజనులున్ను పుచ్చుకొంటారు. వారిని సచ్చూద్రులని చెప్పుతారు.

కాశీలో సకల గ్రంధమలున్ను సంగ్రహింపబడి వున్నవి. కంపెనీవారు బహు దినములుగా ఒక పాఠశాలను వుంచి సమస్త గ్రంధాలు సంగ్రహించి యుంచి పాఠము చెప్పను మనిషికి ముప్పై రూపాయీలు జీతము ఛేసి పదిమంది పండితులను వుంచి చదవడానకు వంద మంది విద్యార్ధులకు మూడేసి రూపాయలు లెక్కని జీతమును చేసియుంచినారు.* యింకా రాజాధిరాజులు గ్రంధ సంగ్రహము కావలసినప్పుడు లక్షావధి రూపాయలు కాశికి పంపించి గ్రంధ సంగ్రహము చేయుచు నున్నారు. గనుక బహుమంది పెద్దలు తమ సోధనార్ధమున్ను అట్టి తరుణాలలో రాజాధిరాజులకు పనికి వఛ్ఛేటట్టు చాయడానికిగాను అనేక గ్రంధాలు సంగ్రహించి అపారముగా వుంచి యున్నారు.

కాశికి సుమారు యిరువై మజెలీలలో గోకుల బృందావనము యుండి యున్నది. హరిద్వార మనే పుణ్యభూమి ఇరవై మజిలీలలో నున్నది. ఆ హరిద్వారమునుండి గంగోత్తరికిన్ని బదరీకేదారానికిన్ని బదరీ నారాయణానికిన్ని జ్వాలాముఖి కిన్ని దారిపోతున్నది. హరిద్వారము వెళ్ళకనే పయిన వ్రాసిన స్థలములకు యెక్కడికిన్ని పోను ఆయత్తు కాదు. హరిద్వారమునుంచి పయిన వ్రాసిన స్థలములలో యే స్థలానికి పోవలసినా ఈశ్వరేచ్చ యేమోగాని పదిహేనేసి దినాల మజిలి ఆయూస్థలములకు సరిగా నున్నది. అందుకు ఒక స్థలమునుంచి ఒక స్థలానికి వెళ్ళడానికి వేరేదారిలేదు. గంగోత్తరినుంచి బదరీకేదారము వెళ్ళవలసివస్తే హరిద్వారానికి వచ్చి పోవలసినది. అయోధ్య అతి సమీపము. ప్రయాగకు పన్నెండు ఆమడ వున్నవి.

పయిన వ్రాసిన గంగోత్తరి మొదలయిన మహాస్థలములు అన్ని నీలకంఠనేపాళరాజుయొక్క రాజ్యములొ యున్నవి. ఆరాజు నేపాళములో వాసముచేయుచు యింగిలీషువారికి లోబడియున్నాడు. ఆ నేపాళము వద్దనే మూరంగి అనే యూరున్నది. అందులో ద్రాక్షలు ఫలింపుచున్నవి. ఆ గ్రామము కాశీతంబురాయడనే పండారానికి

*ఈ విద్యాలయమును గురించి బిషప్ హెబరు చక్కగా వర్ణీంచినాడు.

బదరీ కేదారేశరుని పూతానైవేద్యాల కొరకు నేపాళరాజు జాగీరు యిచ్చియున్నాడు. ఆ ప్రాంతములలో మంచు అపారముగా నున్నది. కేదారేశ్వరునికి ఆరునెలలు పూజలేదట. మంచుకాలము యొక్క ఉపక్రమణలో ఒక పెద్ద కొడి స్తంభము నాటిపెట్టి మంచు గుడిని మూసుకునిపోతే మంచుకాలము తీసినవెనక ఆ కొడి స్తంభము గుర్తుపట్టుకొని మంచుగడ్డలు తొవ్వి యెత్తి గుడిని కనుక్కోవలసినదని చెప్పినారు.

ఈశ్వరుడు నీళ్ళలోని చేపలకు జలాధివాసము సహజము చేసి నట్టు ఆయాస్థలస్థులకు ఇటువంటి తనరూప మయిన కాలాలను సహజము చేయుచు వచ్చినాడు. కాలాన్ని అనుభవింఛే వ్యక్తిలోనున్ను కాలములోనున్ను యీశ్వరుడు అంతర్యామి అయినప్పటికిన్ని అభ్యాసము వల్లనున్ను యిచ్చవల్ల నున్ను యిటువంటి కాలభేదములు కొన్ని వ్యక్తులకు సరిపడక వుంచున్నవి. యెట్లా అత్తిచెట్టుయొక్క అనేకపండ్లలోని ఒక క్రిమిగాని ఆ ఛెట్టుయొక్క గాత్రమునున్ను శక్తినిన్ని యెట్లా తెలుసుకో నేరదో తద్వత్తుగా అనేక బ్రహ్మాండాలు ఉత్పత్తి ఛేసిన యీశ్వరునియొక్క చిద్విలాస మహిమను ఒక బ్రహ్మాండములోని ఒకా నొక ప్రాణి తెలిశి ఆశ్చర్య పడడానకు శక్తుడు కాడు.

యీ కాశీ మహాపట్నము యొక్క వేడుకను చూచి ఆనందించి, కపిల మహాముని యించుకు అధికముగా తనతప, ప్రభాముచేత యీ కర్మభూమికి చివరను గంగాతీరమునందు కాశ్మీరము అనే పట్నాన్ని ఉత్పత్తి చేసి సకల విధాలా బాగాచేసి కాశీవిశ్వేశ్వరునికి యెరుకచేసి అక్కడికివచ్చి చూడుమని ప్రార్ధించి నంతలో విశ్వేశ్వరుడు ఆ కపిలుని మాట నిజమేనని తెలుసుకున్నవాడై అప్రతిద్వంద్వముగా కాశి యుండవలసిన సంకల్పము పరమాత్మునికి నుండగా గర్వము చేత కపిలుడు యీప్రకారము ఛేసినాడు గనుక ఆ కాశ్మీర పట్నము అతని గర్వభంగము అయ్యేకొరకు వెంబడిగానే మ్లేచ్చాక్రాంతమయి మ్లేచాభూయిష్టమయి పోగాకా అని శపించినాడట. అదిమొదలు అద్యాపి యెంత అక్కడ శంకరాచార్యులవారు దిగ్విజయము చేసినా సరస్వతీపీఠమున్నా అక్కడ ప్రవహింఛే గంగ సస్యాదులకు కూడా వుపయోగింపుచున్నా అక్కడవున్న బ్రాహ్మణులు అందరు బలాత్కారముగా తురకలలోకలిసి బ్రాహ్మణుడు అప్ర్రాంత్యాల తలచూపడము అద్యాసి ప్రయాసగా నున్నది.

ఇప్పట్లో ఆ రాజ్యము రణజిత్తు సింగు* అధీనముగా యున్నది. ఆకాశ్మీరములోనే కుంకుమపువ్వు అవుచున్నది. శాలూలు నేయడానికి యోగ్యమయిన వెంట్రుక లయ్యే మృగాలు ప్రత్యేకముగా ఉత్పత్తి అవుచున్నవట. కాశ్మీరశాలూలు బయటికి విస్తారము రావటములేదట. అందుకు నకలుగా లాహోరులో నేసిన శాలూలు బయటికి విక్రయయానికి వచ్చేటట్టు విన్నాను. నిరక్షదేశము మొదలుగా ఇరవై మూడు భాగల దూరము లో నుండే కాశీ లొగానే కాలము మొదలుకొని ఆచారవ్యహారములు యింత భేదించి యుండగా యికను ఉత్తరోత్తరా యేమి వింతగా నుండునో తెలిసినది కాదు, వీపుమీద నుండే మచ్చ చూడడానకు కూడా మనుష్యుడు శక్తుడుకాడు. మాయావృతజ్ఞానము కలిగి వుండుట మిక్కటముగా యీ ప్రకారము మాయామగ్ను లయిన అస్మదాదులను కాపాడ వలసినది.

వ స|| డిసంబరు ఇరవై ఎనిమిది తేది పట్నా అనే షహరు ప్రవేశించినాను. గంగలో పదిదినములు బజరా పట్టేలు అనే పడవల గుండా నడవడమయినది. దారిలో గంగ కిరుప్పక్కలనున్న వూళ్ళ పేళ్ళు ఈ అడుగున వ్రాయుచున్నాను. నెం.ఇరవై ఒకటి. కబారా ఒకటి మంజీ ఒకటి ఛోటక్పూరు ఒకటి కనాలుగంజి రెండు సయత్పూరు ఒకటి మాంజీ ఒకటి చోబక్పూరు ఒకటి రోజా ఒకటి జిమ నియ్యాం ఒకటి రాంపూరు ఒకటి మదనా పూరు ఒకటి గాజీపూరు ఒకటి కాతిసుపూరు ఒకటి నెరువూరు ఒకటి బకుసరు, బక్సార్, ఒకటి నిక్కావూరు ఒకటి బుదాగా ఒకటి కట్రాజిగంజి ఒకటి బిసన్ పూరు ఒకటి ఆరా ఒకటి నవరంగా ఒకటి రామనగరము ఒకటి శిరువూరు ఒకటి శిరంపూరు ఒకటి చప్రా ఒకటి రస్తాన్ గంజి ఒకటి దానాపూరు ఒకటి బాకీపూరు ఒకటి పట్నా ఒకటి.

*రంజితసింగు శిక్కుల రాజు. పదిహేడు వందల ఎనభై లో జన్మించి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది లో దివంగతుడైనాడు.

పెరుగు, పాలు, కూరగాయలు - ఇత్యాది అనేక దినముల పరియంతము బాగావుండని పదార్ధాలకు గాను ఒకవేళ గంగకు ఇరుపక్కలావుండే వూళ్ళలోకి వెళ్ళితే మనుష్యులు వెళ్ళీ రావలసినది. సుఖహేతువులంతా కష్టసాధ్యములు గనుక యీ గంగా తీర సంచారసుఖానుభవములో పడవలోకి నీళ్ళు వూరి వచ్చిన దనిన్ని పడవ తోశే వాండ్లు చెప్పినట్టు వినలేదనిన్ని కూడా వుండే పరిజనుల ప్రకృతులు భిన్నాలు అయినందున వాండ్లు ఒకరితో నొకరు కలహము పడడము వల్లనున్ను, వద్దవుండే స్థితికి చోరులవల్ల అపాయము వచ్చునేమో అనే భయముచేతనున్ను, మనస్సుకు అప్పుడప్పుడు ప్రపంచదృష్టి పూరా కలిగిన దేహాధీన మయినందున వికల్పము కలుగుచున్నది. అప్పట్లో జగము యావత్తు పరబ్రహ్మ ఆడించే బొమ్మలుగాని, వేరే కాదనిన్ని తృణాగ్రమయినా యీశ్వరాజ్ఞ చేతనే కదల వలసినదిగాని మరిఆన్యధా కాదనే తెలివితోనున్ను మనస్సునిండా ఖేదాన్ని పొందనియ్యకుండా బుద్ధిద్వారా శిక్షించి నట్టయితే పయిన వ్రాసిన స్థలజల సౌఖ్యములు మిక్కిలి ఆనందములుగా తేటపడు తున్నవి.

యీ గంగలో నడిచే అనేకపడవలు అనేక భేదములు కలిగి యున్నవి. అందులో విచారించగా తెలియవచ్చిన వాటిని అడుగున వ్రాసినాను. నావల భేదక్రమము బజరా ఒకటి. అది ఒంటికంభము కలది. వెడల్పుయెక్కువ. తలపక్కచుక్కాణి, చుక్కాణి మొదలు పొడుగున తగ్గుచూవచ్చు చున్నది. పిన్నిస్సు ఒకటి. అదిరెండు కంభాలుకలది. నిడువు యెక్కువ. మొనను చుక్కాణీ. యిల్లు మధ్యే వుంచున్నది. పొడుగు కొనా మొదలున్నుసమము. కటరు ఒకటి. అది పిన్నిసుజాడ, గాలిని చాపలచేత వైపు, వీలు, చేసుకోవచ్చును. బవులియ్యా ఒకటి. అదిబజరాజాడ, గాలిని చాపలచేత స్వాధీనము చేసుకోవచ్చును. డోంగా ఒకటి. అది చిన్నయిల్లు గలతేలిక పడవ. బాలిబోటు ఒకటి. అది చెయిపడవ. పయిన వ్రాసిన ఆరుదినుసులు సవారీలాయఖు. సర్కు మోసే నావలు పట్టేలి ఒకటి. అది మిరిజాపురపు శాత. పొడుగు తక్కువ. వెడల్పు యెక్కువ. వులాకు ఒకటి. అది పట్నాశాత.

పట్నా మధ్యే గంగకు యిరుపక్కలా వుండే వూళ్ళలో గాజీ గంగలో కలియుచున్నది. చప్రావద్ధ కర్మనాశినీ అనే నది దక్షిణము నుంచి వచ్చి గంగలో కలియుచున్నది. యీ కర్మనాళిని నదిలో యెవరు కాలుపెట్టినాగాని సుకర్మాలు నశించుచున్నదనే తాత్పర్యముచేత కర్మఠులు యెవరున్ను యీనదిలో కాలు పెట్టరు. యీనది దాటడానకు కాశీనుంచి గయకు వచ్చే దోవలో అహల్యాబాయి అనె యశ, కాయము గల పుణ్యాత్మురాలు వారధి కట్టడానకు శానా యత్నము చేసినది. యిప్పటికి ఆమె చేర్చిన సామానుతో కట్టాడానకు అనేకులు యత్నము చేసినా కొనసాగలేదు.

యీ పట్నాషహరువద్ద పునఃపునః అనే నది దక్షిణమునుంచి వచ్చి గయవద్ద వచ్చే ఫల్గుని నదివలెనే గంగాసంగమ మయినది. యీ పున, పున, అనేనది గయా క్షేత్రమునకు ప్రదక్షిణముగా ప్రవహింపుచున్నది గనుక యెటువంటి గయకు వచ్చే వారున్ను యీ పున, పున, నదివద్ద క్షౌరము చేసుకొని తీర్ధశ్రాద్ధము చేసి గయావ్రజనము చేయడానకు నియమము ధరించవలసినది.

దక్షిణమునుంచి వచ్చే పయినదు లంతా నర్మదానదివలెనే వింధ్య పర్వతములొ ఉత్పత్తి అయినవి. శోణభద్రా నదిన్ని, నర్మదానదిన్ని ఒక్క ప్రదేశములోనే ఉత్పత్తి అయి రెండు ధారలుగా చీలి ఒకటి లింగాలనున్ను, మరి ఒకటి వినాయకశిలలనున్ను జగత్తుకు కలుగ ఛేసి యున్నవి. యిదిగాక పేరు ప్రశస్తములేని కొన్ని నదులు ఉత్తరము నుంచి వచ్చి కాశీ పట్నాలమధ్యే గంగలొ కలియు చున్నవి.

కాశి మొదలు పట్నాషహరు వరకు గంగకు ఇరుపక్కలా సరసు అనే పెద్ద ఆవాలున్ను, రాయి అనే చిన్న ఆవాలున్ను, బూటి అనే శనగలున్ను, పటానులున్ను, కందులున్నూమితముగా పయిరు చేసి యున్నారు. యీ పెద్ద ఆవాలు చెట్లు ముల్లంగి చెట్లవలెనే ప్రధమములో పయిరు అయి యెన్నుతీసి పచ్చని పూలు పూచి, గోరుచిక్కుడు కాయలవలె కాయలు కాయుచున్నవి. యీ ఆవకూర యీమంచు దినములలో పుల్లకూరవండి యీ దేశస్థులు అవశ్యముగా పుచ్చుకొను చున్నారు. పుల్లకూర బహురుచిగా వుంచున్నది. మంచు కాలములొ దేహానికి లేపనము చేసేటందుకు నాలుగు

విధాలు పరిమళ శైలములు యిక్కడ తయారు అవుతున్నవి. వాటి పేళ్ళు సుగంధరాజతేలు అనేది ఒకటి, బేలా అనేదిఒకటి, చెంబెలిఅనే నూనె ఒకటి, పూలేది అనేనూనె ఒకటి, ఇవి వుపపన్నులు చేసుకొనేవి. పేదలు పెద్ద ఆవాలనూనె పట్టించుకొను చున్నారు. యీ తైలాలతో అంగమర్ధనము చేయకపోతే చర్మములో ల్నుంచి సూదితో కుట్టి నట్టు బెజ్జాలుపడి నెత్తురు చెమ్మగింపు చున్నది. యీ ప్రకారము నాపదిజనానకు నడిచేటప్పుడు కాళ్ళలో కొందరికి నెత్తురు చెమ్మగించి నందున భయపడి వారు యిందుకు వైద్యము ఆవనూనె పట్టించి వేన్నీళ్ళు పోసి కడిగితే వెంబడిగానే వాశి అయిపోతున్నది. చిన్నఆవాలలో నూనె నిండా రావడము లేదు గనుక చిన్న ఆవాలను భక్ష్యయోగ్యముగా వాడుకొని, పెద్దఆవాలలో మాత్రము నూనెను గానుగ ఆడి తీయుచున్నారు.

యీ మంచుకాలములో బ్రాహ్మణ సంతర్పణలు కాశిలో నావల్ల యీశ్వరుడు జరిపినప్పుడు యీ దేశములో నివాసముగా నుండే పంచద్రావిళ్ళకు దృష్టిదోషము అక్కరలేనందున ఆ బ్ర్రాహ్మణులు ఆవరణలోపలను భోజనము ఛెయడానకు చలి యుపద్రవముగా వుంచున్నదని పగలు రెండుజాములవేళ మెద్దెమీద పయిదళములో యెండలో ఆకులు వేయించుకొని కాకుల బాధలేకుండా నాలుగు పక్కలా నలుగురు శూద్రులు తుపాకులు కాలుస్తూ యుండేటట్టు యేర్పరసుకొని యెండ సౌఖ్యముగా వున్నదని భోజము చేసినారు.

కాశివరకు తాటిచెట్లు కండ్లపడక పోయినా, గంగకు యిరుపక్కలా అనేక గ్రామాదులలో తాటిచెట్లు కలిగి యున్నవి. యిరువై యేండ్లకు మునుపు జాతులవాండ్లు పొట్టేటసు అనే గడ్డలు, బంగాళాదుంపలు, యీ దేశానికి తెచ్చి పయిరుపెట్టే క్రమమును యీదేశపు జనులకు నేర్పించినారు. అది మొదలుగా యీ దేశములొ యెక్కడ చూచినా వాటికి ఆలి అనే పేరు పెట్టి అమోఘముగా పయిరు పెట్టుచున్నారు. ఆ గడ్డలు పెద్దదినుసు నిమ్మకాయలంతేసి, చిన్నదినుసు గచ్చకాయలంతేసిగా అనేక రాసులుగా పన్నీరు పూలవర్ణముతో ఫలించి యెక్కడ చూచినా యీ ప్రాంత్యములలో అమ్ముచున్నారు. గంగలో పడవలు యెల్లప్పుడు వస్తూపోతూ వుండడముచేత యీ పడవలు వాడికెగా నిలిచే ఘాట్లవద్ద యిటువంటి భక్ష్యయోగ్య మయిన వస్తువులు తెచ్చి పెట్టుకుని అమ్ముతూ వుంచున్నారు. కాశిలో అమ్మే గొయ్యా పండ్లు, జామపండ్లు, మిక్కిలి గొప్పలుగా, విత్తులు శానా తక్కువగా యుంచున్నవి. ఈ దేశములో కాలము యెరిగి కూరకాయలు వేయుచున్నారు గనుక ఒక కాలములో అయ్యేవస్తువులు మరియొక కాలములో మన దేశములో అకాలములో కూడా దొరికేటట్టు చిక్కదు.

పట్నా అనే షహరు దానాపూరు మొదలుగా ఆరుకోసుల దూరమునకు ఒకే షహరుగా నున్నది. పట్నా షహరులో కలకటరు జడిజీ మెజిస్ట్రేటు ఉండడము మాత్రమేగాక ఒక అప్పీలు కోరటు రివిన్యూ క్రిమినాలు సంగతులు విచారించడానకు ఒక కమిసనరు వున్నాడు. యీ షహరు మ్లేచ్ఛమయముగా నున్నది. లోగడ యెల్లీసు దొర యీ దేశము చూసే నిమిత్తము వచ్చియుండి యీ షహరులో గోమాంసము బహిరంగముగా బజారులో పెట్టి అమ్ముచున్నారు, యీ వింత నేను హిందూదేశములో యెక్కడ చూడలే దని వ్రాసినాడు. అటువంటి వస్తు విక్రయము నా కండ్ల పడకపోయినా అంతపని సాధారణముగా చేసేపాటి మ్లేచ్ఛ షహరు అనవచ్చును.

ఈ షహరులో రెండు దేవస్థలా లున్నవి. ఒకటి పట్నాదేవి మందిరము, మరియొకటి గోపీనాథుని మందిరము. రాజసపూజ వితరణగా జరుగుచున్నది. గాజీపూరు, ఆరా, చప్రా, వీటికన్నా యీ షహరులో యిండ్లమిద్దెలున్ను విస్తారముగా నున్ను, గొప్పలుగానున్ను కట్టియున్నవి. కాశీపట్నమువలెనే ప్రతిసందుకు పాటక్కులనే వాకిళ్ళు తలుపులతోకూడా కట్టియున్నవి. రాత్రిళ్ళుమూశి గడియలు బీగము వేయుచున్నారు. బాజారులను బహునిర్బంధము మీద యిటీవల జాతులవాండ్లు వెడల్పుచేసి చక్కపెట్టినారు. యిండ్లకు బాడిగె యీ షహరులో బహు అల్పము. నేను దినానికి ఒక రూపాయివంతున నిలిచిన దినమునకు బాడిగె యిచ్చుచు వచ్చినాను. సకల పదార్థాలు సకల విధములయిన పనివాండ్లు సమృద్ధిగా దొరుకుదురు. పనివాండ్లను యీ దేశస్థులు కాలీగర్లు అని అనుచున్నారు. యీ షహరులో యెక్కాలనే ఒంటిగుర్రపు గాడీలు బాడిగకు వేలాంతరాలు దొరుకును. యీ సహరులోవుండేపాటి యెక్కాలు యెక్కడా లేవని హిందూస్తాన్ లో ప్రసిద్ధము. ద్వీపాంతర పదార్ధాలుకూడా సమృద్ధిగా దొరుకును. యింగిలీషు షాపులు కొన్నియున్నవి.

షహరుకు మూడుకోసుల దూరములో జాతులవాండ్లు గంగాతీరమునందు యిండ్లు, తోటలు కల్పనచేసుకొని యున్నారు. సమస్తఫలవర్గాలున్ను దొరుకును. అరిటిపండ్లు దొరికినా బొంతపండ్ల జాతేగాని రస్తాళి మొదలయిన రుచికరమయిన జాతిపండ్లు దొరకవు. నాగపూవు వదిలిన వెనక మంచి అరిటిపండ్లు వెడల్పుగల అరిటి అకులున్ను చూచిన వాణ్నికాను. మెవావస్తువులని యీషహరులొ పిస్తా, బాదము, అగురోటు, మునక్కా అనే విత్తు కలిగిన విత్తు లేని ద్రాక్షయేమి పయిచెక్కు యెండి లొపల మాధుర్యము గలిగి విత్తు అతిహ్రస్వముగా కండకలిగిన అనారు అనే దాడింమపండ్లున్ను యెండి అత్తిపండ్లున్ను సమృద్దిగా అమ్ముతారు. సెబుభి యివి మొలయిన శీమ అప్పీల్సు యీ దేశములో అవుతున్నవి. కాశీలో హుక్కాబుర్రలు అమ్మేటందుకు ఒక వీథి ప్రత్యేకముగా యున్నట్టు యీషహరులో యెక్కడ చూచినా నానావిధాలయిన పాదరక్షలు, హుక్కాబుర్రలు మొదలయినవాటి సామానులు అమ్ముతువుంచున్నవి. చలికాలములో రజాయి దుప్పట్లు, రజాయి చొక్కాలు అమితముగా తయారు చేసి అంముతారు.

యీ షహరులో హయిదరాబాదు వలెనే ఆయుధములే ఆభరణాలుగా యుంచే స్వభావము కల మనుష్యులు సమృద్ధిగా వున్నా యింగిలీషువారి అధికారము పూర్తిగా యిక్కడ జరగసాగిన వెనక లక్షాంతరాలు ఆయుధాలు నిర్బంధము మీద లోకులవద్ధ తీసి విరిచి గంగలో వేసినారు. అట్లా చేసిన్ని యింకా యెవరిచేత చూచినా ఆయుధాలున్ను నిర్నిమిత్తముగా ఒకణ్ని ఒకడు నరుక్కోవడాలున్ను గలగి యున్నది.

యీ దేశములో చక్కెర కాచి పోసే కలకండ, చీనా కలకండ పచ్చకర్పూరమున్ను యెంత మాత్రము దొరకదు. నేపాళ దేశము


పదునాలుగవ ప్రకరణము  హిందూస్తాన్ సంస్థానాలు మరియు ఆచార విచారణ

యిక్కడికి సమీపము గనుక అక్కడ అయ్యే కస్తూరి అమ్ముతారు. అందులో కృత్రిమము బహుశ, జరుగుచున్నది. కుంకుమ పువ్వు అయ్యే కాశ్మీర దేశము దక్షిణదేశము కన్నా యీ దేశానికి సమీపముగా వున్నా మనదేశములో దొరికేపాటి మంచి విడి కుంకుమపువ్వు యిక్కడ దొరకదు. వస్తువులు అయ్యే దేశాలనుంచి అన్య దేశాలకు ప్రియమయిన దినుసులను తమ దేశములో వాడీకెలోకి తేకనే పంపించేటట్టు తోచుచున్నది. యీ దేశస్థులు యిక్కడి శీతము యేపాటి? నేపాళ దేశములో కలిగే చలికి సహస్రాంశములలో ఒక అంశ యిక్కడ లేదని చెప్పుతారు. సాల గ్రామాలు ఉత్పత్తి అయ్యే కొండ భూమి నేపాళ దేశములోనే వుండియున్నది. ఆ కొండ మీదుగా గండకీనది ప్రవహింపుచున్నది. ఆ నదిలో సాలగ్రామాలు యెత్తడము నర్మదా శోణభద్రా నదులవలె పట్నావద్ద కలిసే గండకీ నదిలో పట్టిన తావున సాలగ్రామాలు దొరకవు, ఆ కొండ ప్రదేశములోనే ఆ నదిలోనే సాలగ్రామాలు కలిగి వున్నవి.

యీ హిందుస్తాన్ లో యింగిలీషు వారికి అధీనము కాకుండా యికను నిండా ప్రయత్నము మీద స్వాధీనము కావలసిన రాజ్యము రణజిత్తుశింగుదీ ఒకటేను. వాడి రాజ్యము హిందూస్తాన్ కు చివర కాశ్మీర ఖండమున్ను, లాహోరు అనే షహరున్ను, మూడు లక్షలమంది మార్బలము కలిగియున్నాడు. హయిదరాబాదు చట్టముగా యింగిలీషు వారిని ఉపసర్పించుకొని రాజ్యము చేయుచు నుండే వారు జోతీపురపు రాజు, జయపురపు రాజు, బిక్కనెరి, బికెనీరు!, రాజు, నేపాళపురాజు లక్కునో నబాబు, శింధ్యా, హోలుకరు, వీరు తప్ప మరి యెవరున్ను రాజ్యాధిపతి అని పేరు పెట్టి పిలవడానికి హిందూస్తాన్ లొ లేరు. హోలుకరు, వీరు తప్ప యెవరున్ను రాజ్యాధి పతి అని పేరు పెట్టి పిలవడానకు హిందూస్థాన్ లో లేరు. హోలుకరు గడిచి పోయిన వెనక రాజ్యము బహుశ, యింగిలీషువారి అధీనమయి హోలుకరు కొడుకు యింగిలీషువారి ఆజ్ఞాబద్ధుడుగా నున్నాడు హోలుకరురాజధాని హిందోలి అనే షహరు. శింధ్యాపడిపోయిన వనక వాడికి వున్నలక్షమంది మార్బలము చేదరనియ్యకుండా పట్టుకొని దత్త పుత్రిడితొ హింసపడుతూ శింధ్యాబార్య కాలము గడుపుతూన్నది. ముందరి శింధ్యారాజధాని హుజనీపట్నము. యిప్పట్లో గవాలియ్యరులో దండు సమేతముగా అతని కుటుంబము వాసము చేస్తూవున్నది. లక్కునో నవాబు ధనము విస్తారముగావున్నా లక్షపౌజు వున్నా ప్రజలను హింస పెట్టుతూ* పేరుకు నవాబుగా వున్నాడు. జోతీపురము జయపురము బిక్కానెరి రాజులు మారువాడీలు గనుక యీశ్వరుడు వారికి యిచ్చిన సిర్జల భూములలో యున్నారు.

జ్వాలాముఖి యనేస్థలము రణజిత్తుశింగు రాజ్యములో వున్నది. ఆదేవిని అతడు బాగా ఆరాధింపు చున్నాడు. అతని రాజ్యములొ యిప్పటికిన్ని న్యాయము బాగా జరుగుతూ ప్రజలు బాగా పరిపాలింపబడుతూ యున్నారు. యీదేశము మొదలు కాశ్మీరములొగా సారా అనిన్ని, బరువు అనిన్ని మంచుగడ్డలు పడుచున్నవి. యింతమంచు నీభూమికి పెట్టిన ఈశ్వరుడు ఈ భూమినివాసుల క్షేమముకొరకు ఉష్ణోదకపు పూట కలిగిన గుండములు కొన్ని నిర్మించి ఉన్నాడు. అవియెక్కడ వంటే గయనుంచి జగన్నధానికి పొయ్యేమార్గములో బలుబలు అనేవూళ్ళో వొకటి, గయకు కొంతదూరములో రాజగృహీ అనేవూళ్ళో ఒకటి, మూంగేరి అనేముంగా చీరలు అయ్యే గంగవొడ్డుషహరుకు సమీపముగా సీతాగుండ మనేది వొకటి, హుజ్రి దేశములో తప్తమణికర్ణిక అనే గుండాము వొకటి, డాకాదేశములో బాలవాగుండ మనేది ఉదకము మీద జ్వాలలు లేస్తూవుండే గండము వొకటి, బదరీ నారాయణమువద్ద వుండేది వస్తువులను వేడిచేసే గుండము వొకటి, యీప్రకారము ఈశ్వరుడు సృస్టించి వున్నాడు. తప్రమణికర్ణికలో బియ్యము మూటకట్టి వేస్తే అన్నముగా పచనమవుచున్నదట. ఈ వుష్ణగుండముల వుదకము యావత్తు గంధకపు వాసన కలిగి వున్నట్టు విచారణమీద తెలిసినది. సదా జ్వాలలు

*ఇది ఇంగ్లీషువారు వ్యాపెంప చేసిన వదంతి యని బిషప్ హెబరుగారు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో స్వయముగా చూచి వ్రాసినారు.

కలిగి వుండే జ్వాలాముఖి గుళ్ళోనున్ను ఆ ప్రకారమే గంధక పరిమళము సదా కలిగి వున్నట్టు తెలియవచ్చినైది. నాయిక్తితో విచారించగా పయి భూములలో శీతము కలుగ చేసిన ఈశ్వరుడు భూమి కింద వుష్ణంకు కలిగివుండే కొరకు గంధమము విస్తారముగా వుత్పత్తి చేసినాడనిన్ని, అగ్ని గంధములో పుట్టడము సహజము గనుకనున్ను యీ గంధకము కలిగిన ప్రదేశములలో పుట్టే వూటజలము సహజముగా ఉష్ణముగా వుండేటట్టు తోచుచున్నది. జ్వాలాముఖిప్రదేశములొ ఆరాధన నిమిత్తమయి గంధకద్వారా భూమిలో జ్వాలను ఈశ్వరుడు సదా కలగచేసినట్టు తొచుచ్ఫున్నది. జ్వాలాముఖి స్వారూపముగా వుండే మహామాయ రణజిత్తుశింగుకు ప్రత్యక్షముగా యిష్టసిద్ధులు చేయుచూ యున్నది.

జ్వాలాముఖికి కొంత దూరములో రేవాలేశ్వర మనే తటాకములో అద్యాసి రెండు పెద్ద గుండ్లు పర్వతాకారముగా తేలుతూ లోకుల యారాధనలను అంగీకరింపుచు సంచరిస్తూ వుండేటట్టు నిశ్చయముగా తెలిసియున్నది. ఆ శిలల స్వభావము యెటువంటిదో తెలిసినదికాదు. కాలక్షేప నిమిత్తమయి సృష్టించిన యీ సృష్టిలో అటువంటి ఉదకము మీద తేలే శిలలు వుంటే యేమి వింత! అయితే దానికిన్ని హేతువు గర్భములో వున్నదని తొచుచున్నది.

నేపాళ దేశములో దేవప్రయాగ అనే వూరు వొకటి వున్నది. అందులో భగవత్పాదులవారు శ్రీరామమూర్తిని యంత్ర సహితముగా స్థాపించి కర్మకులుగా వుండే ద్రావిళ్ళు ఆ మూర్తిని ఆరాధన చేసేటట్ట్లు నియమించి ద్రావిళ్ళను కొందరిని అక్కడ వుంచినారు. ఆద్యాపి వారు అక్కడ వుండి పుట్టే ఆడబిడ్డలను యీ దేశములో నుంచి వచ్చే ద్రావిళ్ళకు స్థితులు వ్రాసియిచ్చి వివాహము చేసియిచ్చి అక్కడనే వుంచుకుంటూ వచ్చుచున్నారట. ఆటు జరగడమువల్ల ద్రావిడ దేశస్థుల యిండ్లు యిన్నూరుదాకా ఆ దేవప్రయాగలో యేర్పడి వున్నవి.

ద్రావిళ్ళ ప్రవేశము కావడములో యీ దేశములో యింతే కాకుండా మొన్నూరుయేండ్ల కిందట ద్రావిడి యయిన యొక వెలనాటి నాడు దేశములో భార్యను వదిలి బృందావనానికి వచ్చి వరక్తుడయి సన్యాసము తీసుకొన్నాడు. కొన్నిదినములకు పిమ్మట భార్య వెతుక్కొనుచు ఆ పురుషుని వద్దికి వచ్చి తన్ను పరిగ్రహించక పోయినంతలో ఆపె నిండా నిర్బంధపెట్టి కృష్ణమూర్తి ఆజ్ఞ అయితే నన్ను పరిగ్రహిస్తావా అని అడిగి నట్టున్ను, మంచిదని అతను కృష్ణమూర్తి యుపాసకు డయినందున చెప్పినట్టున్ను పిమ్మట కృష్ణమూర్తి ప్రత్య్హక్షమయి భార్యను స్వీకరించమని ఆజ్ఞ యిచ్చినట్టున్ను అటుపిమ్మట ఆ సన్యసించిన పురుషుడు భార్యను అంగీకరించి యేడుగురు కొడుకుల కన్నట్టున్ను ఆ యేడుగురున్ను యేడుపీఠాలను యేర్పరచుకొని వల్లభాచార్యులని పేరుపెట్టుకొని కృష్ణమూర్తి యుపాసకులై ద్వారక మొదలుగా యీ హిందూస్తాన్ లో వుండే బనయా అనే వైశ్వెజాతి వారికంతా ఆచారవ్యహారాదు ఉపదేశించి అటుయేర్పడ్డ శిష్యులకు తులసీ మణులు ధారణ చేసి అతిప్రబలులుగా వున్నారు. వారు ద్రావిడ దేశపు వెలనాటి వారితో సంబంధములు చేయుచూ వృద్ధిపొందినారు. ఆయేడు పీఠాలలో నాధద్వారములో ఒక పీఠము వున్నది. అది ముఖ్యపీఠమని చెప్పుకోవడము. దక్షిణదేశములో వారికి శిష్యులు కోటిమంది గుజరాతీ వాండ్లు ఆ యేడుపీఠస్థుల యొక్క వంశస్థులు హిందూదేశము యావత్తున్ను శిష్యయాత్ర చేస్తూవుంటారు.

యీ వల్లభాచార్య పీఠస్థులు గోపీకృష్ణోపాసకులు. వారికి బనయా జాతికాక ఇంకా అనేక శూద్రజాతివారు గూడా శిష్యులై యున్నారు. యీ వల్లభాచార్యుల పీఠముగాక హితహరి వంశాచార్యులని యీ దేశపు బ్ర్రాహ్మణుడు వొకరు రాధాకృష్ణోపాసన చేసి బృందావనములో వక పీఠమును యేర్పరచుకొని వారికి తులసీమణి ధారణచేసి ఆచారవ్యహారాలు నియమించి వున్నాడు. యీ పీఠస్థుని వంశస్థులకు ఏకాదశినాడు తాంబూల చర్వణము చేయడానికి శ్రీకృష్ణమూర్తి అనుజ్ఞ యిచ్చి వున్నాడని అపశక్యముగా అతని శిష్యజనులున్ను ఏకాదశినాదు ఆద్యాపి తాంబూల చర్వణము చేయుచూ వుంచున్నారు. హిందూస్తానులో ఏకాదశినాడు విష్ణుభక్తులు సకలవిధములయిన ధాన్యములు పరిత్యజించి కందమూలాదులు శింగాణి పిండిన్ని తిని వ్రతము ఆచరింపు చున్నారు.

బ్రాహ్మణులకు దక్షిణ దేశములో భట్లు, అయ్య అని పౌరుష నామధేయ్ములు స్వనామముతో కలిసివుండేటట్టు యీదేశములో బ్రాహ్మణులకు పాడె, దూబె, చౌబె, మిశిరి, తేల్వాడి, అని పౌరుషనామధేయాలు కలిగి వున్నవి. యీ పంచగౌడు లని పంచ ద్రావిళ్ళనిన్ని భేదము కలిగి వుండడమే వాటికి కారణముగా వున్నది. మిక్కిలి విచారించగా నా బుద్దికి తెలియ బడ్డది యేమంటే సుమారు వెయ్యున్నేనూరు సంవత్సరములకు ముందర హిందువులు వసించే హిందూస్తాన్ అనే యీ గంగా యమునల మధ్యేవుండే భూమి మ్లేచ్చ భూమి అయిన పార్షి దేశానికి సమీపము అయి వుండగా కాబూలు కనమగుండా సింధువనిన్ని హిందువనిన్ని ద్వినామక మయిన మహానదిని దాటి కలి సాంమ్రాజ్య ప్రేరణచేత మ్లేచ్చులు* డిల్లి అనే హస్తినాపురి ప్రవేశించి కర్మద్వారా బ్రాహ్మణులు అయివుండే వారికర్మములు సాగకుండా వారిని భ్రష్టులను చేశేకొరకై అనేక హింసలు చేసినందున యీ రాజ్యము యావత్తు మ్లేచ్చాక్రాంతమైనందున యీ దేశస్థులు కర్మమును నిండా పాటించను వయిపులేనివారైరి.

యిప్పట్లో దాక్షిణాత్యులయున హిందువులు స్వభాషతో యింగిలీషుమాటలు కలిసి మాట్లాడుతూ వచ్చేటట్టు యిక్కడ దొరతనము చేసేవారి తురకమాటలు సంస్కృతభాషతొ యీ డేశస్థులు కలిపి మాట్లాడుతూ తురకలవలెనే వస్త్రవాహనాద్యలంకారాలను అంగీకరించి ప్రవర్తిస్తూ వఛ్ఛేటట్టు తెలిసినది. అయినప్పటికిన్ని ముఖ్యమయిన వర్ణాశ్రమ ధర్మాదులు మాత్రము యిక్కడివారు వదిలినారు కారు.

*మ్లేచ్చుల దండయాత్రలు, క్రీస్తుకు పూర్వము మూడు వందలు నుంచి రెండు వందలు వరకు శరాబ్దములలో మన దేశమునకు, గ్రీకులు, వయనులు, శాకులు వచ్చిరి. క్రీస్తు తరువాత కూడా యీచీ మొదలకు ఆశియా తెగలువచ్చిరి. క్రిస్థుశకము ఐదు,ఆరు శతాబ్దములలో, హూణులు, ఎనిమిదవ శతాబ్ధములో అరబ్బీలు, తరువాత ఆఫ్ఘనులు పారశీకులును వచ్చిరి. వీరినందరిని మనవారు మ్లేచ్చులనిరి.

యీబ్రహ్మాండమునందు నున్న బ్రాహ్మణమండలి ద్రావిళ్ళ నిన్ని, గౌడులనిన్ని రెండు తెగలుగా చీలి ఆ రెండు తెగలలో నున్ను అయిదేశి తెగలు యేర్పడి తుదకు పది తెగలుగా చీలినది. అందులో గౌడులకు సొంతమయిన భూమి సాత్విక ప్రధానముగా అనాదిగా వుండుటచేతనున్ను స్థూలదేహాలు పృధివీ భూతానుగుణముగా వుండేవి గనుకనున్ను అనాది సంప్రదాయ ప్రకారముద్వైతాద్వైతాలు శాస్త్రము చేత వాదింపబడుచునున్నా కర్మదృష్ట్యా ఉపాస్యదేవతలు భిన్నుములు గానున్నా యెదటివాడి ఉపాస్యదేవతను నిందించకుండా స్వంత తండ్రిని కాపాడి యితరుల తండ్రులను కొట్టక తిట్టకవుండి మర్యాద చేయుచు వుండేటట్టు తమ తమ అంత, కరణాను గుణముగా ఉపాసనములు చేయుచు అందరు అన్యోన్యముగా ప్రవర్తింపుచున్నారు.

స్వదేశము వదిలి కర్మము మీది శ్రద్ధ విస్తారము కలగ చేసుకొనుట చేత లేచి వచ్చిన దక్షిణ దేశస్థులయిన ద్రావిళ్ళు వింధ్య పర్వతాలకు దక్షిణదేశమునందు ప్రవేశించగానే ఆ దేశవాసులు అందరు అప్పట్లో శ్రుతి స్మృతి పురాణాదుల సంకేతాలకు నిండా లోబడని వారలై మూఢులుగా ఉన్నందున వింధ్య దక్షిణదేశమునకు యిక్కడినుంచి లేచి వచ్చినవారు చేతనయినంత మట్టుకు కృత్య సంకేత ప్రకారము వైశ్యజాతిని మాత్రము కల్పించ తలచి క్షత్రియ కృత్యానికి తగినవారు లేనందున ఆ వర్ణకల్పన వదిలి తాము బ్రాహ్మణులుగానున్ను తాము కల్పించినవారు వైశ్యులుగానున్ను యితరు లందరు శూద్రులుగానున్ను యేర్పాటుచేసి అలాగే ప్రవర్రింపుచూ వచ్చినారు. అందువల్లనే వైశ్యులు మేమంటే మేము వైశ్యులమనే వివాదము అద్యాపి దక్షిణదేశములో తీరకుండావున్నది. వింధ్యకు దక్షిణదేశ నివాసులు అందరున్నూ తత్పూర్వము శూద్రులకు శ్రుతి స్మృతి పురాణాదులగుండా నియమింపబడియుండే ఆచారాలు యెరగక నొక మూఢ ధోరణి అయిన తమ పూర్విక మార్గముగా ప్రవర్తింపుచు వున్నందున, ఇక్కడినుంచి లేచి వచ్చిన బ్రాహ్మణులు శూద్రులతొ తాము యీదేశములో ప్రవర్తింపుచూ వచ్చిన జాడ వదిలి తమ యెక్కువగౌరమును ఆపాదించుకొనే కొరకు వాండ్లను కొంత వెలిగా వుంచి తదనుగుణముగా ఉపస్మృతులు పురాణాదులు కల్పనచేసి అక్కడి భూపతులకు బోధించి తమకు తోచిన కర్మాదులను క్రమక్రమముగా ఆచారవ్యవహారాదుల మూలముగానున్ను బింబారాధనల ద్వారానున్ను ప్రబలపరచుచు వచ్చినారు.

వింధ్యకు నుత్తర దేశవాసులయిన బ్రాహ్మణులు అందరున్ను ఋషులని అద్యాపి బ్రాహ్మణుల సంధ్యావందనములలో గంగా యమునల నడుమనున్న ఋషులకు సమస్కార మని వచిస్తూవున్నారు. దక్షిణదేశములో తత్పూర్వము బ్రాహ్మణులు లేనందున యీ దేశము నుంచి వచ్చిన బ్రాహ్మణులను నాక్షాదృషులనే తాత్పర్యముతో దక్షిణదేశములోని భూపతులు వీరు చెప్పినట్టువిని, ఆలయాదులు వాటి ఆరాధనలు, బ్రాహ్మణ గౌరవము, వారిపోషణ, మొదలయినవి సకలవిధాల చేస్తూ వచ్చినారు. అప్పట్లో యీ బ్రాహ్మణులు వింధ్యకు దక్షిణ దేశానికి రావడము సూర్యుడు భూమికి దిగివచినట్టు అక్కడి భూపతులకు తోచినది గనుక యీ బ్రాహ్మణులు తమ దేశము వదిలిపోకుండా వుండేకొరకు అపారమైన భూస్థిరులు యిచ్చినారని నాకు తోచశాడుతున్నది. యిప్పట్లో అక్కడి బ్రాహ్మణులు అనుభవించే భూస్థితులవంటివి యేకాలమందున్ను యీదేశపు బ్రాహ్మణులు యిక్కడ అనుభవించినది లేదు గనుక యీ హేతువు పై వూహకు నిండా అకరముగా వున్నది.

యీ ప్రకారము కర్మశ్రద్ధ మితిని మింఛేటట్టు చేసేకొద్దిన్ని క్రమక్రమముగా తమలోతమకే యీకర్మము చేసుటచేత నేను యెక్కువంటే ఆ కర్మము నీవు చేయతగవు గనుక నీవే తక్కువ యని వివాదము పుట్టి వివాద పురస్సరముగా ద్వేషము జనించి నీవు చూడగా నేను బోజనము చేయరా దనిన్ని నీవు తాకిన పాత్ర నేను కడగక వాడుకో ననిన్ని, నీ యుపాస్య దేవత మీద ఫలాని ఫలాని దోషాలు వున్న వనిన్ని, నా యుపాస్యదేవత గుడికి నీవు రాకూడ దనిన్ని, నీయుపాస్యదేవత గుడి నీడలోకి కూడా కూడా నేను రా ననిన్ని వాదింపుచు తమ్మున గురుభావనగా ఆరాధింపుచూ వుండే అక్కడి దేశస్థులకు కూడా వారిలో వారికి అలాటి ద్వేష బుద్ధిని పుట్టించి పుండ్రాలు వస్త్రధారణలు కూడా వీదు ఫలాని దేవతోపాసకుడు, వీడు ఫలాని కర్మము చేసేవాడని గురుతు వుండే కొరకు సంపూర్ణముగా భేదించే టట్టు ఛెసినారు. అది మొదలు దిన దినానికి శైవ వైష్ణవులున్ను తదంతర్భూతులున్ను యితరులున్ను ద్వేషములకు అంతము లేకుండా యిప్పటికిన్ని వివాద పడుతూ వున్నారు.

హిందూస్తాన్ లో ప్రవేశించిన తురకలు క్రమ క్రమశ, వింధ్య దక్షిణచేశములో కూడా పిమ్మట ప్రవేశించినా యిక్కడ హిందువుల సహవాసము తత్పూర్వము తమకు నిండా కలిగి వున్నందుచేతనున్ను హిందువుల మత సంకేత బలాబలాలను చక్కగా తెలుసు కొని వున్నందు చెతనున్ను తమ మతోద్ధారకుడైన మహమ్మదు తనువు ధరించిన తమ మతము శ్రేష్టమని లోకులకు బోధపడే కొరకు తమ మతములో ఒకణ్ని కలుపుకొని తురక చేస్తే పుణ్యమనిన్ని తమ మతముకాని వాని మొగము చూడరా దనిన్ని ఖురానులో వ్రాసిన మాటను నమ్మి మూఢభక్తి కలిగిన తురక భూపతులు యిక్కడ అదిలో తురకల చేసే కొరకు హిందువులను హింస పెట్టినట్టు దక్షిణ దేశములో పిమ్మట వారు హింసించిన వారు కారు. రాజ్యకాంక్ష కలిగిన బుద్ధి ఆ విషయములో వారికి సాత్వికాన్ని సంపాదించి యిచ్చినది.

వెనక వెంబడిగానే నడితి వెరేనున్ను తత్వము వేరేగానున్ను వుండే హిందువుల బహిరంగ కృత్యములు చూచి వీండ్లు వెర్రివాండ్లు తెలియక రాళ్ళు రప్పలు నదులు కొండలు యివి మొదలైన వాటిని దేవుండ్లనుగా యెంచి చెడిపోతారనే పశ్చాత్తాపబుద్ధి మాత్రమే కలిగిన అతి దూరములోవుండే సాత్వికగుణప్రధాను లయిన యింగిలీషు జాతి వాండ్లు హిందుదేశానికి భూపతులయినందున వారివల్ల కర్మాదులు యేహ్యపడ్డా ప్రబలవిరోధము మాత్రములేక తమ తమ కర్మాదులు తమ తమ యిష్టాల్నుసారముగా సారినమట్టుకు గడుపుకొంటూ యిప్పుడు దాక్షిణాత్యులు అక్కడ వున్నారని తోచుచున్నది.

పయిన వ్రాసిన ప్రకారము గంగా యమునా తీరవాసులయిన బ్రాహ్మణులలో కొన్ని తెగలు వింధ్య దక్షిణదేశములో ప్రవేశించిన వెనక నొక తెగ కృష్ణాగూదావరీ నదుల సమీపప్రాంతమందున చేరినందున దేశభాష అక్కడ ఆంధ్రమ యినందున ఆంధ్రమయినందున ఆంధ్రులయినారనిన్ని రెండోతెగ కావేరీ తామ్రపర్ణీనదుల సమీపములో చేరినందున ఆ దేశభాష రీత్యా వారు ద్రావిళ్ళు అయినారనిన్ని మూడోతెగ గోదావరి యుత్పత్తికి సమీపముభూమి అయిన నాసికా త్రియంబకము మొదలయిన భూమెచేరినందున దేశభాషరీత్యా వారు కొంకణులని మహారాష్ట్రులని రెండు నామములు గల దేశస్థులైనారనిన్ని నాలుగో తెగవారు కావేరి యుత్పత్తికి సమీపస్థళమయిన కర్ణాటకులైనారనిన్ని తోచుచున్నది.

నిండా విచారించగా ఘూర్జరులు మాత్రము ఎప్పుడున్ను హిందుస్తాన్ లోనుంచి యెత్తిపోయిన బ్రాహ్మణులతో చేరినావారు కారు. వారు ఎల్లప్పుడున్ను ఘూర్జర దేశములోని కాపురస్తులే నని తోచబడుచున్నది. అయితే వారిని పంచద్రావిళ్ళతో కలిపి వాడడము ఎందువల్లనంటే వారున్ను ద్రావిళ్ళరీతిగా వింధ్య దక్షిణదేశ నివాసులయి వున్నందుననున్ను హిందూస్తాన్ లో అయిదు తెగలుగా అయిదు దేశాలలో బ్రాహ్మణులు వృధక్కు వృధక్కుగా భాగింపబడి వున్నందున యీ పంచగౌడులకు ప్రతిగా పంచగ్రావిళ్ళు అనుకోవడానకు ఘూర్జరులను కూడా కూర్చి వాడుకుంటూ వచ్చేటట్టు తోచబడుచున్నది. అందుకు ప్రబలమయిన కారణము యేమంటే యీ దేశములోపుట్టిన గయావళీలు మొదలైన స్థలవాసులు ఘూర్జరులు వినాగా వుండే నాలుకు తెగల ద్రావిళ్ళు అన్నశ్రాద్ధముచేస్తే బ్ర్రాహ్మణార్ధముచేసి వారి పాకములో భోజనము చేస్తారు గాని ఘూర్జర బ్రాహ్మణులు చేసే శ్రాద్ధాలలో భ్రాహ్మణార్ధము నిమిత్తమైవారి పాకములో భోజనము చేయడము లేదు. ఘూర్జరుల చేత చటకశ్రాద్ధము చేయించి శీదా లనే స్యయంపాకము గయావళీలు పుచ్చుకుంటున్నారు. అందువల నున్ను యీ ఆచారములనే అద్యాపి దక్షిణ దేశమందున్ను కడమ నాలుగు తెగల ద్రావిడ బ్ర్రాహ్మణులున్ను పాటిస్తూ వుండడము చేతనున్ను కావేరి తామ్రపర్ణి తీరాల యందు మాత్రము ఘూర్జర బ్రాహ్మణులు నిండా కర్మకులుగా నడవపట్టి ఒక మాత్రముగా వారితో భోజన ప్రతిభోజనాలు కల్గివుండుట చేతనున్ను భగవత్పారుల వారు దిగ్యిజయము చేసినప్పుడు ఘూర్జర దేశములోనే నివాసులుగా వున్నట్టు శంకర విజయములో కని వుండుట చేతనున్ను బ్రాహణ మండలి పృధక్కు కాకమునుపే యీ మండలిలో చేరక ఘూర్జరులు ప్రత్యేకముగా స్వదేశ నివాసము యెప్పుడు ఒకటే రీతుగా ఛెస్తూవుండే టట్టు తోచుచున్నది.

యీ ప్రకారము యిప్పుడు తెలివచ్చి వుండే పంచగౌడులు పంచద్రావిళ్ళు అనే పదితెగల బ్రాహ్మణులు గాక పరశురామ నిర్మితమైన కేరళదేశాస్థులు, చిత్పావనులు, కరాడీలు, అనేమూడు తెగలవారు వున్నారు. యీ మూడు తెగలలో పునా శ్రీమంతుడు చిత్పావన బ్రాహ్మణుడై సార్వభౌముడై బహుకాలము ప్రవర్తించి నందున కొంకణస్థులలో నాశికాత్రయంబక నివాసులైన బ్రాహ్మణులకు కనకాభిషేకాలుచేసి, ఆ తెగతొ పూరాగా తాను తన జాలాన్ని కలిపి కరాడీలను కూడా కలిసినారు. యిప్పుడు మహారాష్ట్రులకున్ను వారికిన్ని యెంత మాత్రమున్ను భేదములేకుండా వుభయులు వొకరితో వొకరు కలిసి యున్నారు. యీ తెగలు గాక కేరళ దేశస్థులు తమ దేశములొ పూజ్యులుగా, యితర బ్రాహ్మణులతో నిండా కలియక నున్ను కలియ కూడకనున్ను నంబురు, నంబూద్రీ, లనిపించుకొని తమంతట తాము వుండి వున్నారు.

గయలో బ్రహ్మ కల్పిత బ్రాహ్మణులనే వొక తెగవారు గయావళీలుగా వున్నారు. కాశిలో గంగా పుత్రులని వొక తెగవారు గయావళీలుగా వుండి వున్నారు. యిదిన్నిగాక శాకద్వీప బ్రాహ్మణులని వొక తెగవారు హిందూస్థాన్ దేశములో వాసము చేస్తూ యిప్పటికిన్ని వున్నారు. వారి వృత్తాంత మెమంటే శ్రీకృష్ణులు ద్వారకలో విరాజమానులయి వుండగా సాంబుడనే అతని కొమారుడికి పెద్దరోగము ప్రాప్తించి నట్ట్లున్ను చికిత్స నిమిత్తమై వైనతేయుడు శాకద్వీపమునుంచి వొక బ్రాహ్మణుని తెచ్చినట్టున్ను వాని వంశస్థులు తామని ఆ తెగవారు అద్యాపి యీ దేశములొ చికిత్స చేస్తూ నెగడి వున్నారు. పైన వ్రాసిన తెగలుగాక యీ హిందూస్తాన్ లో విశ్వరర్మకు రంభకున్ను శాపము తగిలి భూలోకములో మానుషజన్మము కలిగి ఉభయులున్ను దాంపత్యము పొసగి సంతు కలిగినట్టున్ను వారికి కలిగిన సంతు విశ్వకర్మ కల్పిత బ్రాహ్మణులని వారి శిల్పిపనులు చేస్తూ యిప్పటికిన్ని నెగడి వున్నారు.

గయలో వుండే డాక్టరు జాన్ డేవిడు సన్ దొర ప్రపంచసృష్టి సంబంధము లయిన మాటలు నాతో ఆడుతూవుండగా హిందూదేశములో వుండే బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలనె భేదము యీశ్వ నిర్ణయమా? లేక్ మానుష సంకేతమా? అని ప్రశ్నవేసినాడు. బహుదూరము వాదము జరిగి మానుష నిర్ణయమని తెలియచేసినాను. పిమ్మటనున్ను బహుశా విచారించగా అదే తాత్పర్యమునాకు బోధ అయినది. అందుకు హేతువులు యేమంటే వొక పురుషుడు ప్రజల వుత్పత్యర్ధమున్నూ తద్వారా మానుషానందానుభవార్ధమున్ను స్త్రీని పరిగ్రంచి ప్రజావృద్ధి చేసినట్టు యీశ్వరుడు సృష్టించిన అనేక బ్రహ్మండాలలో అనేకకోటి పిండాండాలు అంతర్భూతములై వున్నవి. ప్రతిపిండాండానికిన్ని బ్రహ్మాండానికికలిగిన సకలగుణాలు చేష్టలు మొదలయినవి వేర్పడివున్నవి. అందుకు దృష్టాంత మేమంటే పృధివ్యప్తేజోవాయ్వాకాశాలు ప్రతి బ్రహ్మాండానికికలిగివున్నట్టు అంతర్భూతములుగా వుండే అనేక పిండాండాలకు కలిగివున్నవి. ప్రతి పిండాండానికిన్ని అనేక సూక్ష్మ పిండాండాలు అంతర్భూతములై వున్నవి. అందుకు దృష్టాంతమేమంటే ప్రతి దేహములోనున్ను అనేక క్రిమికీటాదులు ఉత్పత్తి అయి నశింపుచు వుండడము సిద్ధము గనుక యీఅర్ధమున్ను సత్యమే గదా! ఒక అద్దానికి యెదురుగా మరివొక నిలువుటద్దము కట్టి నడమ మనిషి నిలిచి చూస్తే వొకటిలో నొకటిగా తన ప్రతి బింబాలు అసంఖ్యేయముగా ఉత్పత్తి అయ్యేటట్టు దీపదీపికా న్యాయముగా అనేక అనుష్యులున్ను జంతువులున్ను పరంపరగా యీశ్వర భాతిచేత సృష్టములై స్థితిని బొంది లయమవుచు నున్నవి.

ఇట్లు సృజింపబడిన యనేక బ్రహ్మాండములలో మనము వసించే బ్రహ్మాండము న్నొక్కటే. యిందులో యీ భూమియొక్క కొలత యింగిలీషు వారి యొక్క వూహ ప్రకారమున్ను మన గోళశాస్త్ర ప్రకారమున్ను చచ్చొకము సుమారు యిరువైకొట్లమయిలు లున్నవి. వీటిలో ఉదకమయముగా నుండే భూమి పదమూడు కోట్లు మయిళ్ళు పోగా మనుష్య వాసముగా నుండే భూమి నాలుగు కోట్ల మయిళ్ళు. యిందులో వశింఛే మనుష్యమండలి డెబ్బదికోట్లు. యిందులో దక్షిణోత్తరాలలో కన్యాకుమరి మొదలు కాశ్మీరము వవకున్ను తూర్పు పడమరలలో సింధునది మొదలు బ్రహ్మపుత్రి నదివరకున్ను వాసము చెసే హిందు దేశల్పు జనులను మొత్తముగా చెరిసగముగా లెక్కచూచినా ముప్పదియైదు కోట్లకు యెక్కువవుండరు. వర్ణాశమ నియమము కలిగిన కర్మభూమి పయిన వ్రాశిన యల్ల సరిహద్దుకు లోపల నున్నది గాని యీ బ్రఖాండములో మరియెక్కడనున్ను లేదు.

పైన వ్రాసిన చత్రురశ్ర, మ భూమిలో నుండే మానిషమండలికి మాత్రమే వర్ణాశ్రమ ధర్మములు కలిగియున్నవి గాని మిగిలిన సగం భూమిలోనున్ను వారికి వృత్తులచేతనున్ను కృత్యములఛేతనున్ను మనుష్యతారతమ్య జ్ఞానమేగాని వృత్తికృత్యములతోకూడా హిందూదేశ మర్యాద ప్రకారము రక్త పరంపర నిమిత్తము లేదు. యీ కర్మభూమిలోనున్ను రక్త పరంపరే స్వతంత్రముగా వర్ణాశ్రమాలను కాపాడనేరదు. కృత్యమున్ను వృత్తిన్ని పుట్టుకతొకూడా మిళిగమై యుండవలసి యున్నది గదా! యిందుకు ఆకరమేమంటే జన్మనా జాయతే శూద్ర, కర్మణా యాయతే ద్విజ, అనే వచనమే ఆకరము. యీశ్వరుడు ఆదిలో యీ వర్ణాశ్రమ ధర్మములతో మనుష్య సృష్టిని చేసి యుంటే బ్రహ్మాండమందంతటా యీవర్ణాశ్రమ ధర్మములు యీ రీతిగానే గలిగియుండ వచ్చునే! అయితే ఈ బ్రహ్మాండములలో మానుష సృష్టి పయినవ్రాసిన చతురశ్రమమైన కర్మభూమి మొదలుగా ఆరంభింపబడినది. అందుకు అకర మేమంటే యింగిలీషు వారి బైబిలులో యేడం, Adam,అనే కూటస్థురాలున్ను యీ ప్రదేశములో పుట్టినట్టు చెప్పియున్నది గనుకనున్ను మన పురాణాలు అందుకు ఏకవాక్యతపడుతున్నవి గనుకనున్ను మన పురాణాలు అందుకు ఏకవాక్యతపడుతున్నవి గనుకన్ను మానుష సృష్టికి ఆరంభము మొట్టమొదట హిందుదేశములో నుంఛేనని నిశ్చయించ వలసినది. పిమ్మట పరంపరగా దీప దీపికా న్యాయముగా బ్రంహ్మాండమంతా మానుష మండలితొ నిబిడీకృత మవుతూ వచ్చుచున్నది.

అటు సృష్ట్రికి అది మనుష్యులు యీ ప్రదేశములొ వసించినందు చేతనున్ను వారు సచ్చిదానంద స్వరూపుడైన యీశ్వరునికి యధోచితిముగా సమానులుగా వుండవలసినవారు గనుకనున్ను తద్వారా వారు స్వేచ్చామరణము గలవారుగా వుండవలసినవారు గనుకనున్ను అటువంటి మహాత్ములు యీశ్వరుని చిద్విలాసము చూచి బహు కాలము ఆనందింపుచు వుండడానకు కోరి చిరకాలము జీవింపుచు వుండవచ్చును గనుక నున్ను వారి యీ భూమిలో సృష్టులయినవారి పరంపరలను చూచి, నాలుగు ముఖ్యమయిన పనులకుగాను మానుష కోటిని నాలుగు వర్ణములుగా నియమించి, యీ నియమింపబడిన వారి పరంపరే ఆ యా వర్ణాశ్రమకృత్యములు చేయుచు వుండతగినవి కాని వొక వర్ణమువాడు మరియొక్క వర్ణము కృత్యములు చేయకూడదనిన్ని ఒక వేళ చేస్తే భ్రష్టులవుతారనిన్ని శిక్షకూడా విధించి ఆయా వర్ణాశ్రమాలలో నున్నవారు వర్ణానుసారముగా చేయ వలసిన పనులు తెలియడానకు పూర్వికులు శృతి స్మృతులు చేసి యిచ్చి నారనిన్ని తేట పడుచున్నది. అందుకు ఆకరము యజుర్వేదములో భరద్వాజమహామునివల్ల శృతులు మానుష మండలిలో ప్రచురము చాయబడ్డవని వున్నది. అష్టాదశ స్మృతులున్ను వాటి వాటి నామాంకితాలవల్లనే మంవాదులయిన యిక్కడ మనుష్యులఛేత వర్ణాశ్రమ ధర్మాలను నియమించి తెలియ వ్రాయబడిన పుస్తకము లని తేట పడుచున్నవి.

మూల స్మృతులు పన్నెండు స్కృతులున్ను ఆజ్ఞలను విధించి నట్టు విషయాదులను నిరూపించి చెప్పుతూ వచ్చును గాని ఫలాని ఋషి మతము యిది, అందుమీద నామతము ఇది, అని మూలస్మృతులు చెప్పవు. అటు ఋషులు మతాలు వుదాహరించి చెప్పే వంతా ఉపస్మృతియని శానా దూరము వలసినది. ఇందులొ యేదేది మూల స్కృతియని శానా దూరము గయలో జడ్జీగా వుండే జార్జి ఐ. మారీసు దొరగారి సన్నిధానమందు నాకున్ను యిక్కడి పండితులుకున్ను వివాదము పడి ఒక నిశ్చయానకు వచ్చినాము గనుక ఆమూల స్కృతుల పేళ్ళు యీ అడుగున వ్రాయుచున్నాను. నెం.ఇరవై మూడు, స్వాయం భువమను స్కృతి ఒకటి. బృహస్పతి స్మృతి రెండు. వశిష్టస్మృతి మూడు. కశ్యప స్మృతి నాలుగు. భారద్వాజస్మృతి ఐదు. గౌతమస్మృతి ఆరు. యాజ్ఞవల్క్య స్మృతి ఏడు. భృగుస్మృతి ఎనిమిది. నారద స్మృతి తొమ్మిది. కపిల స్మృతి పది. పరాశరస్మృతి పదకొండు. వ్యాసస్మృతి పన్నెండు. కాత్యాయన స్మృతి పదమూడు. ఆపస్తంబ స్మృతి పద్నాలుగు. అశ్వలాయనస్మృతి పదిహేను. కణ్వస్మృతి పదహారు. అత్రిస్మృతి పదిహేడు. హరీత స్మృతి పద్దెనిమిది. యివి మూల స్మృతులు అనడానకు యెవరు సందేహపడనేరరు. కాశిలో యీ వివాదము పొశిగివున్నట్టయితే కంపెనీవారి పాఠక శాలలోనున్ను యింకా అనేకులవద్ద నున్ను గ్రంధగ్రహము బాహుళ్యముగా వున్నది గనుక వయిపు, వీలు, అయునన్ని మూల స్మృతులు సంపాదింతును.

ఇటీవల మారీసుదొర బహురసికుడును బహు శోధకుడున్ను గనుక సహగమనము స్త్రీలకు కూడదని లార్డు బెంటిక్కుగారు విధించి యిటీవల యేర్పరచినారు గదా, మీలో స్త్రీలు పురుషుడు చనిపోతే అగత్యముగా సహగమనము చెయ్యవలసినదేనా? చేయక పోతే ప్రత్యనాయమా? అని ప్రశ్నచేసినాడు. మను పరాశరులు అదిస్మత్రలు, వారి స్మృతులలొ పురుష దేహాసంతరము విధవస్త్రీలు నడవలసిన విధులను విధించి వ్రాశినారుగాని సహగమనము చేయ వలసిన దని విధిగా మూలస్మృతులలొ వ్రాయలేదు, నేను బహుదినాలుగా యీ సంగతిని విచారింపు చున్నాను, ఉపస్మృతులలో యీ విషయానకు అనేక ఆకరము లున్నవిగాని మూల స్మృతులలో లేదని చెప్పినంతలో యిక్కడి కోటపండితులు తద్వ్యరింతముగా చెప్పి తుదను మూలస్మృతులలో సహగమనానికి ఆకరము లేదని ఒప్పుకున్నారు.

యీ స్మృతులు కల్పించిన వారి పేళ్ళనున్ను ఋగ్యజు స్వామాలను భూమిలో ప్రచురము చేసిన భారద్వాజుల పేరున్ను సావధానముగా యోచిస్తే వారు యీ కర్మభూమిలో వుత్పత్తి అయినవారు మాత్రమేగాక ఆయా పద్దెనిమిది ఋషుల జననమును జనన కాలమున్ను పురాణాదులవల్ల వూహించి చూడగా సృష్టికి బహు కాలమునకు వెనక వారు జననమయిన వారుగా అగుపడుతున్నారు. అప్పటికి వర్ణాశ్రమ ధర్మాలు సృష్టిక్ ఆదిన కలిగినవిన్ని కారు. యీశ్వర నిర్ణల్యమున్ను కాదు. అయితే భారద్వాజులేమి స్వాయంభువమను నేమి, పరాశరులేమి, గౌగము లేమి, కశ్వపు లేమి, యింకా యితర స్మత్రలేమి వీరిని మనుష్య మాత్రులుగా చెప్పకూడదు, బ్రహ్మజ్ఞానము కలవారు గనుక సచ్చిదానంద స్వరూపులుగానే చెప్పవలసినది.

పయిన వ్రాసిన ప్రకారము వర్ణాశ్రమ ధర్మాలు వారు నియమించినంతలో యేతత్సంకేతానికి ఆ దినము లోబడ్డవారి రకత పరంపర గలవారే ఆ ధర్మాలను ఆచరించవలసినది గాని యితరులు ఆచరించకూడదని అప్పటి సంకేత ప్రకారము నియమము యేర్పడ్డది గనుక క్రీస్తు మతస్థులవలనున్ను చూచినవారికంతా బోధించి నిర్బంద పెట్టి యీ హిందూమతములో కలుపుకోవడానకు హిందువులకు నిమిత్తము లేకుండా పోవడము మాత్రమే కాకుండా ఆ ప్రకారము నియమించబడ్డ ధర్మాలుతప్పి నడిచిన వారినంతా యీ హిందు సమూహములోనుంచి తోశి అటు ప్రార్థింఛే క్రీస్తు మహమ్మదు మతస్థులతో చేరేటట్టుగా ప్రేరేపణ చేయడమవుచున్నది. ముఖ్యముగా వర్ణాశ్రమ ధర్మాలు చేసినంతలో వర్ణాశ్రమములు సిద్ధి అయ్యేటట్టుగా శాస్త్రాలు యేర్పడివుండడము మాత్రమే కాకుండ ఆదినం కేతానికి లోబడ్డ వారి పరంపర వంటివారే ఆ కర్మాదులు చేయవలసినది గాని యితరులు ఆకర్మాదులు చేసినంతలో ఆ వర్ణాశ్రమములు చిద్ధించక పోవలసినదని కూడా వెంబడిగా ఒక విధి శాస్త్రాలలో యేర్పడి వుండవలసిన దేమని యోచించిగా భారద్వాజులు మనకోసరము భూమిలో ప్రచురము చేసిన మూడు శృతులున్ను మన్వాదులు తదనుసారముగా చేసిన స్కృతులున్ను గజోమిధ్యా పలాయనం మిధ్యా అని అడివి యేనుగ బ్రహ్మజ్ఞాని తరిమితే తప్పించు కోవడానికి పరిగెత్తుతూ జగన్మిధ్యా బ్రహ్మసత్య మనే అద్వైత వచన ప్రకారము నా పరుగు అబద్ధము, తరమే యేనుగ అబద్ధము, బ్రహ్మమనే అస్తువఒకటే సత్యము అని ద్వైతులు నవ్వేటట్టుగా అద్వైతి అనుకున్నట్టు ఒక్కటే వస్తువని అంతస్తులోనమ్మి ఆవస్తువే యిన్నిగా వున్నదనే నిశ్చయముతో పయికి కనపడే అనేక వస్తువుల స్వరూపాలను మనోవికాలుగా భావించి అయినప్పటికిన్ని దేహబుద్ధి వుండేవరకు వాటికి తారతమ్యములు విచారించి తారతమ్యమయిన పనులు చేయవలసినది గనుక యీరీతిని నడవడానికి సాంప్రతాయకము తెలిసినవారే నడుతురుగాని నూతనస్తులు ఒకటి అనుకుంటూ ఒకటి చేయడము ప్రయాస గనుక చేసిన సంకేతము వదవక చేడిపొవనే తాత్పర్యముచేత పూర్వికులు అదినం కేతానికి లోబడ్డవారి వంశస్థులే యీ నర్ణాశ్రమధర్మాలు జరపవలనని నిశ్చయము చేసినారని నాకు తోచుచున్నది.

పయినవ్రాసిన మూల స్కృతులు పన్నెండు గాక మరికొన్ని స్మృతులుగూడా మూలస్మృతులని వివాదాస్పదములుగా వున్నవి. ఋగ్యజుస్సామాలుగాక అధర్వణమున్ను వొక ప్రత్యేకమయిన వేద మని వివాదముగా వున్నది. బ్రాహ్మణమండలి పయినవ్రాసిన ప్రకారము భిన్నులయి ఒక తెగ దక్షిణదేశ నివాసులయిన వనక దేశకాలాలకు అనుగుణముగా దక్షిణానికి సాగివచ్చిన మండలిలోని పండితులు నూరారులు ఉపస్కృతులు వ్యాస, వశిష్ట, నారద, అని ఆకరాలు వ్రాసి వారి వారికి సమ్మతి అయినట్టు వుపస్కృతులు యేర్పరచినారు. దక్షిణదేశములో మూల స్మృతుల సంగ్రహించడము విస్తారము లేనందున యెల్లాజియ్యము, నిర్ణయసింధు మొదలయిన ఉపస్కృతులే సంభవించే విషయాల పరిష్కాతము నిమిత్తము యెత్తిచూచుచున్నారుగాని మూల స్కృతుల జ్ఞాపాకమే మరచినారు. ఉత్తరదేశములొ పండితమండలి బహుశ, దక్షిణదేశానికి లేచిపోయు నందుననున్ను మూలస్మృతి సంగ్రహమును తాము విపత్తులచేత చేసి వుండనందున నున్ను యిటు వెనక పుట్టిన మితాక్షరము సరస్వతీ విలాపము మొదలయిన కొన్ని వుపస్కృతులె హిందుస్తాన్ లో ప్రచురముగా వాదుతారుగాని దక్షిణదేశమువలె యిక్కడ వున్న స్మృతుల పరంపర అనర్గళ పరంపర అనర్గళ ప్రవాహమై వుండ షట్చాస్త్రముల వల్ల ఆదినుంచి వివాదస్పదములుగా వుండే ద్వైతాద్వైతమతాలు రెండుగాక విశిష్టాద్వైతమతము ఒకటి అతి ప్రసిద్ధమయి దక్షిణదేశములో యిప్పుడు వెగడియున్నది. అటు ఒకటే ఆశ్చర్యకరమయిన యుక్తులతో నేగడి విదిన్ని గాక ఆరుకాటి రాయజి* సర్వాధికారము చేయుచు వుండగా సాకారాద్వైతమని ఒక మతము వుద్ధరించి ప్రబలము చేయ తలచినాడు. పాండిత్య కుశలతలు అది శృతిస్కృతులనే వృక్షముయొక్క క్షేమాన్ని వతకకుండా వేళ్ళను భేదించడమేవృక్షమునకు బలక మని దక్షిణ దేశస్థులు మూలభేదము చేయుచువచ్చు చున్నారు. వారి తాత్పర్యానికి వ్యతిరిక్తముగా వృక్షము బలహీన దశను క్రమ క్రమశ, పొందుచున్నది.

అయినప్పటికి యీ సర్వోత్తమ మయిన కర్మభూమి కర్మ ద్వారా బ్రంహ్మానుసంధానము చేసే మార్గమును యేర్పచిన పూర్వీకుల తప, ప్రభావము అమితము గనుక జరిగిన అచాతుర్యాలకు విశ్వేశ్వరుడు మ్లేచ్చులవల్ల తగుపాటి శిక్ష కొంతకాలము హిందూదేశపు కర్మకులకు కలగచేసి యిప్పుడు సాత్వికగుణ ప్రధానులయిన యింగిలీషువారిని బహు దూరము నుంచి అనాయాసముగా యీ కర్మ భూమికి దెచ్చి యిక్కడి సార్వభౌమత్వము వారికి కలగ చేసినాడు. యిఖమీదటనున్ను ఆ కరుణా కటాక్షముతొనే మన అపరాధాలు క్షమచేశి ఆదిని వుద్ధరింపబడ్డ శృతి స్కృతి చోదితమయిన కర్మములున్ను తజ్జనితమయిన బ్రంహ్మానుసంధానమున్ను నిష్కల్మషముగా కాలాంతరములో సిద్ధించ వలశినది.

*చెన్నరాజధానిని ఇంగిలీషు వారక్రమించే నాటికి ఈ సముద్రతీరపు భూమిని చాలవరకు కర్నాటక మనే వారు. ఆ కర్ణాటక నవాబునకే ఆర్కాటు నవాబు అనిపేరు. వాలాజా నవాబు కింద శిరస్తాదారు రాయరేడ్డిరావుగారు చాలా బలవంతుడుగా వుండేవాడు. ఇతడు పద్దెనిమిది వందల తొమ్మిది లో చనిపోయినాడు.


పదిహేనవ ప్రకరణము  గయా మహాక్షేత్రము

పయిన వ్రాశినటువంటి పట్నాషహరులో డిసంబరు నెల ముప్పై ఒకటి తేది దాకా వుండి పద్దెనిమిది వందల ముప్పై ఒకటి సం|| జనవరి నెల ఒకటి తేది ఉదయ మయిన నాలుగు గడియలకు గయా మహాక్షేత్రానికి ప్రయాణమై పది ఘంటలకు పున, పున, అనే నదివద్ద చేరినాను. దారి సడక్కు వేసియున్నది. యిరుపక్కల తోపులు వూళ్ళు నిబిడీకృతముగా యున్నవి. గయా వ్రజనము చేయడానము పున, పున, నదివద్ద క్షౌరముచేసుకొని శ్రాద్ధము చేసి సంకల్పము చేయవలసినది గనుక అదేప్రకారము జరిగించినాను. దిగడానకు నదివొడ్డున స్థలములేదు గనుక బయలులో గుడారము వేశి వంటభోజనములు గట్టున గడుపుకుని రాత్రి నీమా నదామా అనే వూళ్ళవద్ద ఒక సరాయి, ఒక పబ్లిక్కుబంగళా వుండగా వాటి సమీపమండు నిలిచినాము. సరాయిమధ్యే ఒక భావియున్నది. సరాయి దిగడానకు మంచివసతి. యీ సరాయి పట్టణమునకు తొమ్మిది కోసులదూరములో నున్నది. భాటబాగుగాని దువ్వరేగడ భూమి నీమా వదామా అనే రెండు వూళ్ళున్ను గొప్ప వూళ్ళేను. బాజారు వున్నది. అన్ని పదార్ధాలు దొరుకును. వంట చెరుకులు మాత్రము ప్రయత్నముమీద దొరకవలసినది. మిరిజాపూరు మొదలుగా అడివి సమీపముగా యీ ప్రాంత్యాల లేదు గనుక గొమయ శుష్కములు నాటుపురాలలో బహుశ, వాడుతారుగాని వంటచెరుకులు పట్టణములలో దొరికేటట్టు సహజముగా నాటుపురాలో దొరకవు. పున, పున, అనేనది నిండా వెడల్పు లేకపోయినా జీవనదిగా సార్వకాలము ప్రవహింపుచున్నది. యీ రాత్రిపయి రెండువూళ్ళవద్ద వసించియున్నాను.

జనవరి రెండు తేది ఉదయమయిన రెండు ఘడియలకు మంచువల్ల బాగా యెండవచ్చిన వనక బయలుదేరి యిక్కడికి తొమ్మిది కోసుల దూరములో వుండే జానా అనే వూరు ఒకటి ఘంటకు చేరినాను. దారి నిన్నటి వలెనే బాగా సడక్కుకలిగి యున్నది. ఈ వూరు షహరువంటి వూరు, పది వందల యిండ్లు కద్ధు, బట్టలుకూడా నేశి అమ్ముతారు. గొప్ప బాజారు వున్నది. వూరివద్ద ఒక చిన్ననది ప్రవహించుచున్నది. నదివొడ్డున లోగడె మజిలీవలెనే హిందువులకు ఒక సరాయి, జారులవారికి ఒక బంగళా కట్టివున్నది. బరక్రదాసు అనే పోలీసు బంట్రౌతు ముసాఫరుల సరఫరాయి నిమిత్తమున్ను కాపు నిమిత్తమున్ను సరాయి బంగాళాలవద్ద కాచియుంటాడు. యీ గొప్ప వూరిలో వంటచెరుకులు ప్రయత్నము మీద దొరికినవి. యీ రాత్రి యిక్కడ వసించినాను.

తేది ఏడు ఘంటలకు బయలువెళ్ళీ యుక్కడికి ఎనిమిది కోసుల దూరములోవుండే చెలాయనే యూరు రెండు ఘంటలకు చేరినాను. దారినిన్నటిదారివలెనే బాగావున్నది. ఈవూరిలోను సరాయి బంగాళా వున్నప్పటికిన్ని సరాయిలో మనుష్యులు నిండి యున్నందుననున్ను కాశీ పట్టణము మొదలుగా ప్రతి జిల్లా మేజస్ ట్రేటు వారు వారి సరిహద్ధు పరియంతమున్ను చప్రాశి అనే ఒక బిళ్ళ బంట్రౌతును దయచేశియిస్తూ వున్నందున, కూడావున్న తయినారి బంట్రౌతు గుండా ఆవూరిజమీందారుణ్ని పిలుపించి వాడియింటిని ఖాలీ చేయించి అందులో దిగినాను. యీ వూరు గొప్పవూరేను. సకల పదార్ధాలు దొరుకును. జలవసతి నిండాలేదు. యీ వూరిలో యీరాత్రి ససించినాను.

తేది ఉదయ మయిన ఏడు ఘంటలకు ప్రయాణమై యిక్కడికి పది కోసుల దూరములో వుండే గయామహాక్షెత్రము రెండు ఘంటలకుచేరినాను. కాశిలోవుండాగానే డౌలత్తురావు శింధ్యా గయావళి సహదేవ భయ్యా స్వీకారపుత్రుడయిన చోటాలాలు భయ్యా యోగ్యుడని తెలిసినందున ఆ చిన్నవాణ్ణి కాశికి పిలుపించినాను. అతడు రాజసల్తనతో కూడా నావంబడి ఒక బజరాచేసుకొని పట్నాషహరుకు వచ్చి అక్కడి నుంచి కూడా గయకు మజిలి మరుమజిలీగా నాతోకూడా భోజనము చేసుకొంటూవచ్చి ముందర దిగడానకు విష్ణుపాదము గదాధరస్వామి గుళ్ళకు ఫల్గుణీనదికిన్ని అతి సమీపముగా ఒక గొప్పయిల్లు కుదుర్చి పెట్టినందున అందులో దిగి, యీశ్వర కటాక్షముచేత నాగయావళీ ఉపపన్నుడయి బ్నహుశ, యింగిత జ్ఞానము తెలిసి గదాధర భట్లు అనే దేశస్థ బ్ర్రాంహ్మణుని తనవద్ద సర్వాధికాగానున్ను ప్రాపకుడుగానున్ను వుంచుకొని వున్నాడు. గనుక సకల విధాల ఆ క్షేత్రము నా స్వస్థలములవలెనే అయ్యేటట్టుగా జాగ్రత్త పెట్టించినాడు. కాశీనుంచి వచ్చేదారిలో చప్రా అనేషహరులో లోగడ చన్నపట్టణములో ఆక్టింగు గౌనరుగా వున్న గ్రీందొరగారు జననమయి వారి తండ్రిగారు అక్కడ బహుకాలము అధికారము చేసినందున వారి పాత నవుకరులకు కొంత యినాములు యిచ్చి వారి కుశలము విచారించే కొరకు నన్ను కొన్ని దినములు చప్రాలొ నిలువు మని చెప్పినందున ధనుగ్రయ త్వరగా ఆరంభించడానకు కొంత ఆలస్య పడ్డరి గనుక ధనుర్మాసములో గయావ్రజనము సమాప్తి కాక పొయినా ఆరంభము మాత్రము ధనుర్మాసములోనే చేసినాను.

గయాక్షేత్రము మహా గొప్పపట్టణము. అందుకు వుత్తర భాగ మందు యాభై యేండ్లుగా యింగిలీషువారు సాహేబు గంజు అని రెండు కోసుల దూరములో తాము యిండ్లు తోటలు కట్టుకొని ఒక బస్తీ చేసినారు. అక్కడ అనేక మళిగలు గొప్పబజారు వీధిన్ని యేర్పడ్డది. సకలపదార్ధాలు ఆబజారులో చవుక. ఆసాహేబుగంజు బస్తిన్ని గయాషహరున్ను యిప్పట్లో యిండ్ల సమూహముతో కలిసి వున్నది. రెండు స్థలాలలో మూడు వేలయిండ్లున్ను పదిహేను వేల వేల మంది ప్రజలున్ను కలిగి వుండునని తోచుచున్నది. గయలో ఒక మేజస్ ట్రేటు ఒక జిల్లాజడ్జి, ఒక డాక్టరు, యాత్రదారుల వద్ద మహస్సూలు వసూలు చేయడానికి ఒక టాక్సుకలకటరు జిల్లాకలకటరుకు అంతర్బూతముగా వున్నారు. గయాపట్నము బాహారుజిల్లాతో చేరినది. కలకటరు హుజూరి కచ్చేరి యిక్కడ బహుకాలము వశింపుచూ వుంచున్నది. యిక్కడ సకల పదార్ధాలు ద్వీపాంతర వస్తువులు సకల విధములయిన పనివాండ్లు కలరు. గడియారము చక్క పెట్టడానకు పనివాండ్లుమాత్రము పట్నా షహరులో వుండేటట్టు మిక్కటము యిక్కడలేదు. మిఠాయి అంగళ్ళలో తిలలతో అనేక దినుస్సులు భక్ష్యరూపములుగా చేసి అమ్ముతారు. వాటిఆకుకూరకు నిండా బాగా వుంచున్నది. యెర్రమందారపు మొగ్గలు అమితముగా తెచ్చి కూరకు అమ్ముతారు. అది పెసలపప్పుతో కలిపి వండితే బహు బాగా వుంచున్నది. మన దేశములో యీ మొగ్గలు వున్నా వికసించినవనక అర్చనకు వాడుతాముగాని మొగ్గలను భక్ష్యయోగ్యముగా వాడడములేదు. యిక్కడి దూదుప్యాడాలు ప్రసిద్ధి కలిగి దినాల పేరట వుంచున్నవి, వీధులు కాశీ అంతటి కుసంది కావు. జాహేబు గంజువీధులు దక్షిణ దేశములోని వీధులకు సరి పోలి వున్నవి. యిండ్లు నాలుగు అంతస్తులుదాకా కొయ్యసామాను వేశి మజుబూతి, గట్టి, మిద్దేలుగా కట్టి వున్నారు.

యీ క్షేత్రముచుట్టు కొండలు వుండడము మాత్రమేగాక షహరుమధ్యే కూడా చిన్న తిప్పలు వున్నవి. ఆ తిప్ప మిట్టలమీదనే యిండ్లు కట్టియున్నారు. సమీప మందున్న ఫల్గుని నదిని ఇక్కడి దేశస్థులు ఫల్గు అనుచున్నారు. బహుశ, వడల్పు కలిగి బహుదూరము ప్రసిద్ధి కెక్కియున్నా ప్రవహింపుచు వుండే దినాలు బహు కొద్ది గనుక అందులో యెక్కడ చూచినా చలమలుతీసి స్నాన పానాలు గడుపుకుంటూ వుంటారు. యీ చలమల విషయమయి యీ షహరుని వాసుల ఖర్చులు విస్తారముగా ప్రతి నెలకు తగులుతూ వచ్చుచున్నది. గదాధరస్వామి సన్నిధిలో వుండే ముఖ్య చలమ వుదమకు కూపోదక మర్యాదగా వుష్ణకాలానకు శీతముగానున్ను శీతకాలానకు వుష్ణముగాను వుంచున్నది. గయావళీల యిండ్లు---పది వందల చిల్లర అని ప్రసిద్ధి అయి వున్నా ఏడు వందలు యిండ్లు హాజరుగా వున్నవి. గౌడబ్రాహ్మణుల యిండ్లు శానా

వున్నవి. మహారాష్ట్రులు ఆంధ్రులు కలిశి ముప్పై యిండ్ల దాకా వున్నారు. పంచద్రావిళ్ళలో నూటిదాకా బ్రాహ్మణ మండలి చేరుతున్నవి. వారికి జీవనము షోడశీ అనే పౌరొహితము. వారు గయావళీలను వుపసర్పించుకొని వుంటారు. వారి ఆజ్ఞానుసారముగా వచ్చినవారి గయాప్రజనాలకు పౌరోహితము చేయిస్తారు. వారికి క్లిప్తములు, నిర్ణయములు, యేర్పడి యున్నవి. అందుకు తక్కువ యాత్రవారివల్ల పుచ్చుకొరు.

యిక్కడ గయాప్రజనాలు చేసే క్రమాలు నాల్గు. అష్టగయా అనే గయావ్రజనము ముఖ్యమున్ను ఖర్చుయెక్కువ పట్టేదిన్ని, పంచగయా అనేది రెండోపక్షము. యేకోద్ధిష్ట మనేది మూడోపక్షము.

ఫల్గుశ్రాద్ధ మనేది నాలుగోపక్షము. మొదటి పక్షానికి కంపెనీ సర్కారుకు వంద నలభై ఎనిమిది, రు పద్నాలుగు సగం, రూపాయి యివ్వవలసినది. రెండోపక్షానికి డెబ్బై నాలుగు, రు ఏడు సగం, మూడోపక్షానికి మూడున్నర రూపాయ, నాలుగోపక్షానికి రెండు రూపాయలు.

యీ గయా మాహత్మ్యము వాయుపురాణ గరుడ పురాణాంతర్భూతముగా యెనిమిది అధ్యాయాలతో యిక్కడ ప్రచురముగా వున్నది. వాటిసారము యేమంటే గయాసురుడనే రాక్షసుడు అతి దీర్ఘకాయము కలవాడు బహు తపస్సుచేసి సకలతీర్ధాలకన్నా తన దేహము అతి పవిత్రముగా వుండేటట్టు వరముతీసుకొని తన తొలుదేహవాసనసంబంధమయిన తామస పనులుచేస్తూ వచ్చినట్టున్ను, త్రిమూర్తులలో ఒకడైన బ్రహ్మ వాణ్ని శాంతిపొందించవదలచి వాడివద్దికి వచ్చి నీదేహము అతిపవిత్రము గనుక నీదేహముమీద నేను యాగము చేయతలచినానని చెప్పినంతలో రాక్షసుడు సమ్మతించి ఈక్షేత్రములో తలపెట్టి శయనించినట్తున్ను బ్రహ్మ ఋత్విక్కులను సృషృంచి యాగము వుపక్రమణ చేసినంతలో రాక్షసుడి శిరస్సు చలనతదశ పొందినట్టున్ను శిరస్సును కదలకుండా పెట్టేకొరకు యెన్ని గొప్పకొండలు తెచ్చివేసినా నిలవక చెదిరి చుట్టు పడి యిప్పుడు రామపర్వతము ప్రేతపర్వతముగా సమీపమున నిలిచివుండేటట్టున్ను అటుపిమ్మట అవశాత్తుగా నొకానొక పతివ్రత పురుషుడి శాపన్ని ధరించి శిలారూపముగా వుండగా ఆ శిలను తెచ్చి గయాసురుడి శిరస్సుమీద వుంచినట్టున్ను ఆ శిలా అతిపవిత్రమయినదిగనుక గయాసురుడు తోసివేయలేక శిరస్సు మీద వుంచుకున్నా వాడి శిరస్సుయొక్క కంపముమాత్రము వదల నందున బ్రహ్మ యాగము పరిపూర్తి చేసేకొరకు యీశాన విష్ణుకమలాసన అని శ్రాద్ధకాలములలో వచించే శ్లోకప్రకారము దేవతలందరు వచ్చిరి. విష్ణువు గదాధర స్వరూపుడయి ముఖ్యముగా ఆ శిరస్సు మీద వున్న శిలమీద కుడికాలుపెట్టి నట్టున్ను తదనంతరము శిరస్సు కదలకుండా బ్రహ్మ యాగము పరిపూర్ణ మయి నట్టున్ను యాగసంరక్షణ నిమిత్తముగా గదాధారుడై అక్కడ నిలిచిన విష్ణువు కరుణాసముద్రుడు గనుక వచ్చిన సకల దేవతల సమ్మతముగా, లేవలేని గయాసురుడున్ను శిలా స్వరూపముగా వున్న పతివ్రతయున్ను ప్రార్ధించి నంతలో తాను అదేస్వరూపముగా ఉయెల్లప్పటికి యిక్కడ విరాజమాన మయ్యేటట్టు వొప్పుకున్నట్టున్ను అప్పట్లో కూడిన సమస్త దెవతలు చేసిన ప్రార్ధన ప్రకారము యెవరు యీ స్థలమందున శమీపత్రప్రమాణేన పిండం దద్యాద్గయాశిరే అనే శ్లోక ప్రకారము పిండ ప్రదానము ఛేసినా వంద ఒకటి కులమువారు తరించేటట్టు వర మిచ్చినాడు. గనుక తదారభ్య పితృస్వరూపుడైన పరమాత్మ యిక్కడ శ్రాద్ధ కర్మాలు చేసినంతలో అతితృప్తు డయ్యేటట్టు నిశ్చయ మయి యున్నది గనుక, ప్రతిదినము వుదయ ప్రభృతి సాయంకాల పర్యంతము సహస్రావధి ప్రజలు ఆ రీతిగా వుంచిన విష్ణు పాదలాంఛన మీద పిండప్రదానాలు చేస్తూ వుంటారు. శ్రాద్ధము వినా పిండప్రదానము మాత్రము కూడకపోయినా స్థల పురాణములో యీ స్థల మందు పిండప్రదానమే ముఖ్యముగా చెప్పివున్నది. గనుక అనేక ముగా పెట్టవలసిన శ్రాద్ధాలకు బదులు యీ స్థలాంతర్భూతమయిన ప్రదేశాలలో పిండప్రదానాలు మాత్రమే ఛేయుచున్నారు గనుక నేను ఆ దేప్రకారము ఛెసినాను.

నెం. ఇరవై ఏడు అష్టగయ చేయవలసిన క్రమము, -- క్షేత్రము ప్రవేశించిన దినము ఫల్గునినదిలో స్నానముచేసి గదాధర్శనము విష్ణుపాదము గుడి బహుపాదదర్శనము విష్ణుపాదదర్శనముచేసి క్షేత్ర వుపవాసము వుండవలసినది. విష్ణుపాదము గుడి బహుసుందరముగా నల్లశిలతో ముందు విశాలమయిన ముఖమంటపముతోకూడా అహల్యాబాయి కట్టించివున్నది. అరటి పువ్వందముగా సువర్ణమలాముతో చేసిన కలశముతోకూడా ఒక స్తూపీ యేర్పరచి యున్నది. గదాధరస్వామి మందిరము అందుకు రెండో తరము విష్ణుపాదపు గుడికి చేరినట్టుగానే కట్టియున్నది. గోడలో చేర్చి గదాధరమూర్తిని నిలిపివున్నారు. విష్ణుపాదము, మనిషి అడుసులో కాలిపెట్టితే అడుగు యేర్పడ్డట్టు శిల మీద లాంచనగా యెర్పడివున్నది. బహుకాలమయినది గనుక రేఖాలాంచనలు తెలియవు. మహాపూజా కాలమందు ఆపాదము మీద చందనము సమర్పించి కుంకుమ పువ్వుతో రేఖాలాంఛనములు చందనము మీద అతి సుందరముగా యేర్పరుస్తారు. గదాధర మూర్తిని అతి సుందరముగా కల్పించి వున్నది. యీ రెండు గుళ్ళు ఫల్గుని తీరమందు వున్నవి. విష్ణు పాదానికి సమీపముగా అష్టాదశపాదాలు యీశాన విష్ణు అనే శ్లోక ప్రకారము ఒకటే పెద్ద శిల మీద వున్నట్టు వదంతి గనుక ఆ శిలకు ఒక పెద్ద మంటపము అహల్యాబాయి కట్టించి వున్నది. ఆ పుణ్యాత్మురాలు శానా ధర్మాలు యిక్కడ ఛేసి వుండెను. అది అంతా యిప్పట్లో నిలిచిపొయినవి. ఆపె ఆకృతి శిలతో చేసి గదాధరస్వామి గుడివద్ద ఆపె అన్నసత్రములో వుంచినారు గనుక ఆ బింబాన్ని చూచి ధన్యుణ్ణి అయినాను. ఆ అన్నసత్రమున్ను యిప్పుడు నిలిచిపోయినది.

డో దినము ఫల్గుని శ్రార్ధము క్రమముగానే ఛెయవలసినది. గయావళులను తప్ప మరి ఒకరిని బ్రాహ్మణార్దము చెప్పకూడదు. యీ దినము పెట్టే పిండాలు ఫల్గుని నదిలో పెట్టవలసినవి. బ్రాహ్మణార్ధానికి మనకు యేర్పడ్డ గయావళి వారి స్వకియ్యుల్ను పిల్చుకొని రావలసినది గాని వారి సంకేతము ప్రకారము మనము పిలిస్తే వారు రారు. యీ గయావళీలు యెందరు యెక్కడ వచ్చి యాత్రవారిని కల్సుకున్నా యజమానుడు యిచ్చవచ్చిన వాణ్ని నీవు నా గయావళీ అని నియమించి మిగిలిన వారిని నాకు అక్కరలేదని చెప్పవచ్చును. కాశీ ప్రయాక స్థలముల వలెనే నిర్బంధము లేదు.

డో దినము షహరుకు ఉత్తరపు పక్క మూడు కోసుల దూరములో వుండే ప్రేతపర్వతానికి పోవలసినది. కొండకింద బ్రంహ్మగుండము అనే తీర్ధము ఒక గుంట అందముగా వున్నది. గయావ్రజనము చేసే వారికి గయావళి మూలకముగా పిండపిచ్చి యనే అంగటివాడు ఒకడు యేర్పడుతాడు. ఆ యా దినానికి పెట్టవలసిన పిండాలు తెలిసి పిండ మామగ్రీలు బ్రాహ్మల కయితే బియ్యము యితరులకు యన పిండిన్ని నువ్వుల్ దర్భ తేనె నెయ్యి మృణ్మయ పాత్రలో పెట్టి యిస్తాడు. వానికి అష్టగయ చేసేవారు రెండురూపాయిలు యివ్వవలసినది. యీ షోడశీ ఆ పిండ సామగ్రీని తీసుకొని కూడావస్తాడు. ప్రేత పర్వతమునకు వచ్చేవాడు రెండు తావులలో పిండ ప్రదానము చేయవలసినది. యీ కొండకు సుమారు మున్నూరు మెట్లు కలవు. యెక్కడము ప్రయాస, సవారి మీద పోదామంటే కొండపయిన స్నానికి వుదకములేదు గనుక నడిచిపోవలసినది. ఆ కొండమీదికి నిమిత్తము లేనివారిని సర్కారు మనుష్యులు పొనియ్యరు. వుపచారము చేశేవాడు కూడా వస్తే వాడికి వేరే అమరాహి అనే వొక చీటి మూడున్నర రూపాయి యిచ్చి తీసియ్యవలశినది. భార్య మొదలయిన వారు కూడా వస్తే వారికి వేరే ఛీట్లు మూడున్నర రూపాయి వంతున యిచ్చి తీసుకోవలసినది. కొండమీద స్వర్ణరేఖ ఒక శిలామంటపము కిందవున్నది.

ప్రేతగయావళీలు అనే వక తెగవారు వుంటారు. వారు పిండదాన కాలమందు శానా తెమ్మని తొందర పెట్టుతారు. అష్టగయకు రెండురూపాయలు వారికి క్లిప్తము, నిర్ణయము,. అంతమటుకు యిచ్చితీరవలెను. యీ ప్రేత గయావళీలు సుఫలము యివ్వడమని వొక సంప్రదాయము. ఈ ప్రేత గయావళీలు సుఫలము యిచ్చేక్రమ మేమంటే, పిండప్రదానము కాగానే భం అనే పేరుతో చెయితిప్పి నోరుకొట్టుకొని మీపితృలు స్వర్గస్థులయినా రని చెప్పవలసినది. అక్కడ పిండప్రదానము కాగానే మడుగు నిమిత్తము లేదు గనుక స్త్రీలతో కూడా సవారీల మీద యెక్కి కొండ దిగి వచ్చినాను.

యీ ప్రేతగయావళీలు గయావళుల అక్రమసంతు అనే వొక మాట వాడుకుంటారు. అసలు గయావళీల ఉత్పత్తి పయిన వ్రాసినప్రకారము బ్రహ్మయాగార్ధము ఋత్విక్కులను సృష్టించి నారని వ్రాసివుంటే గదా. వీరు ఆ ఋత్విక్కుల సంతువారని యీ గయావళీలను బ్రహ్మకల్పితబ్రాహ్క్మణు లని వారిపూజా కాలమునందు వచింప బడుచున్నది. బ్రహ్మ యాగము పూర్తికాగానే సమస్తమున్ను కావలశినమట్టుకు వీరికి యిచ్చి నప్పటికిన్ని మళ్ళీ బ్రహ్మను చాలదని యాచించి నట్తున్ను, బ్రహ్మకు కొపమువచ్చి మీకు యిచ్చినది సమస్తమున్ను వ్యర్ధమై పోగాకా అనిన్ని, మీరు విద్యారహితులై దరిద్తురులైపోదురు గాకా అనిన్ని శపించినట్టున్ను ఆపిమ్మట వారు పశ్చాత్తపులై బ్రహ్మను శరణు చొచ్చినంతలో యిక్కడ పితృకర్మాలు చేసేవారు మిమ్ములనే ఆరాధింపు చున్నారు, అందువల్ల జీవనము చేయం డని ఆజ్ఞ యిచ్చి నట్టున్ను అదే పురాణములో వ్రాసియున్నది. ఆ బ్రాహ్మణ కల్పన కాలమునందు వారికి సమానులయిన స్రీలను ఉత్పత్తి చెయలేదు గనుక యీ క్షేత్రములొ మిక్కటముగా వసియింపుచు నుండే మేదరజాతి స్త్రీలను వారు పరిగ్రహించి తద్వారా వంశము వృద్ధిఅయి నట్లున్ను అందువల్ల అవ్యాపి స్త్రీప్రజ వీరిలో వంటవార్పులకు పనికిరాకుండా బోగార్ధమునకు మాత్రము ఉపయోగింపుచు వుండేటట్టు యిక్కడా ప్రసిద్ధముగా నున్నది. యీ గయావళీలు భార్యలచేత భోజనము చెయ్యరు గనుక మన దేశము నుండి వచ్చిన అనాధస్త్రీలను స్వయం పాకమునకు కొలువు పెట్టుకొంటారు. తమస్త్రీలచేత నీళ్ళు తాగేది లేదని చెప్పడము. యీ గయావళీల స్త్రీలు యధోచిత మయిన రాణివాసము గలిగి వుంటారు. యీగయావళీలకు యెనిమిది యేండ్లలోనే వివాహమవుచున్నది. రెండోపెళ్ళికిపడుచును యివ్వడములేదు. వీరి ఆజ్ఞకు తగ్గట్టే వివాహము మొదలయిన విషయములలో వీరికిప్రయము యెక్కువగా అవుచున్నది. వీరియిండ్లలో స్త్రీప్రాబల్యము యెక్కువ అని ప్రసిద్ధి. గయాఫళీల విద్యావివేక విషయాలళొ బ్రహ్మశాపము వ్యర్ధమయినట్టు తోచలేదు. వారి ఆచారాలు యీ దేశానకు తత్కాలానుగుణముగా వున్నా మన దేశస్థులకు యేహ్యముగా నున్నది.

గో దినము ప్రేతపర్వతము దారిలొనే షహరుకు రెండు కోసుల దూరములో సాజెబుగంజుకు చేరినట్టుగా రామపర్వత మనే కొండవున్నది. అక్కడికివెళ్ళి నాలుగు ప్రదేశాలలో నాలుగు ఆవృత్తులు పిండప్రదానాలు చేయవలసినది. కొండమీద శివమందిరము, రామమందిరమున్ను వున్నవి. గనుక ఆ అమందిరాల సన్నిధిలో పిండప్రదానము చేయవలసినది. యీకొండ యెక్కడము నిండా యెక్కుడు కారు. వంద నలభైమెట్లు యెక్కవలసినది. మెట్లు నిండా పొడుగుకావు. యీ పర్వతముమీదను పిండప్రదానముకాగానే యిక్కడకూడా ప్రేతగయావళీల ప్రదేశము గనుక భం అనె ధ్వనితో వారు సుఫలము యియ్యవలసినది. యీ కొందమీదనున్ను వుదకములేదు. అష్టగయ చేయని మనుష్యులను యీకొండమీదికి కూడా రానియ్యరు. యీ కొండ దిగివచ్చిన వెనక కింద మూడు తావులలో పిండప్రదానాలు చేయవలసినది గనుక నేటిదినము దిగివచ్చే టప్పుడు పాదచారిగానే దిగిరావలశినది. యీ పిండపిచ్చులు వగయిరాలు పావుశేరు బియ్యముతో అక్కడక్కడ పిండప్రదానాలు చెస్తూవస్తే అష్టగయకు రెండురూపాయిలు వంతున యివ్వవలసినది. అర్ధశేరుకు రూపాలు నాలుగు, శేరుకు రూపాయిలు రెండు దేలెక్క ప్రకారము షోడశికిప్రేతగయావళీలకు నిష్కర్ష గనుక బియ్యపుమూయినకు తగ్గట్లు తిలలు మొదలైన సామానులు యిస్తాడు. యీ దేశములో తెల్లనువ్వులు విస్తారముగా వున్నాయీ పితృకర్మాలకు వాడడము నల్లతిలలేదు. దర్భదొరకదు గనుక యీ దేశమునందు యావత్తు అతి కోమలముగా పెరిగే కుశనుప్రతిగా వాడుకుంటున్నారు. ప్రతి పిండప్రదానానికి కారుణ్యాల సహితముగా పిండప్రదానము కాగానే ధర్మపిండాలని నలభై శ్లోకాలతో నాలుగు నుంచి సున్నా వరకు పిండాలు వేయవలచినది. యీధర్మపిండాలు ప్రతి పిండప్రదానకాలందు వెయ్యవలసినది. పితృవంశే మృతాయేచ అనే శ్లోకాలతో ధర్మపిండాలు వేయవలసినది.

దో దినము పంచతీర్ధాలనే నాలుగు ప్రదేశాలలో పిండప్రదానాలు చేయవలసినది గనుక నాలుగు పిడతలు హాజ రయి వుంచున్నవి. వాటిని సాహెబుగంజు వద్దవుండే వుత్తరమానస తీర్ధానికి తెచ్చి అయిదు పిడతలలొ అన్నము ఒకసారిగా పక్వముచేసుకుని ఆతీర్ధము ఒక గుంట ఆకారముగా వుంచున్నది గనుక ఆతీర్ధము వొడ్డున నొక సారి పిండప్రదానముచేసి అక్కడ గుళ్ళోవుండే సూర్యమూర్తి దర్శనము చేసుకుని మౌనవ్రతముతో దక్షిణమానసతీర్ధము అనే సహరునధ్యైవుండే నొక పెద్దగుంటకు కడమ, నాలుగు పిడతల అన్నము పిడతలతోనే యెత్తుకుని రావలసినది. యీ రెండు మానవతీర్ధాలు రమణియ్య మయినవికావు.

ఆ దక్షిఅణ మానస తీర్ధములోనే మూడు తావులలో వుదీచితీర్ధమని, ఖనఖలతీర్ధమని, దక్షిణమానస తీర్ధమని, మూడు పేళ్ళతో పిండ ప్రదానాలు చేసి అక్కడ మందిరములో వుండే సూర్యమూర్తి దర్శనము చేసుకొని ఫల్గుని నదికి ఒక పిడత అన్నము తీసుకుని వచ్చి అక్కడ గదాధరునికి యెదురుగా పిండప్రదానముచేసి, గధాదరునికి అభిషేక పూజలు చేసి, దర్శనము చేసుకుని అక్కడికి కొంతదూరములో వుండే పితామహేశ్వరుని దర్శనము చేసుకుని, రావలసినది. రామపర్వతములో, ప్రేత పర్వతములో ప్రేతగయావళీల పూజ చేసి నట్లు యీ స్థలాలలో స్వంత గయావళీ పూజచేస్తూ రావలసినది. యీ ఫల్గుని నదికి అనేక స్నానఘట్టాలు కట్టి వున్నారు. గయావళీల యిండ్లు అనేకముగా ఫల్గునీ నదీతీరమందుకూడా శానా గొప్పలుగా కట్టివున్నవి యీగయవాళీలకు కాపురము వుండే యిండ్లు గాక పరువుకలవారు బయటకు అని కచ్చేరి కూటాలు వేరే కట్టుకుని వుంటారు. ఆప్రేత గయావళీలు యీ గయావళీలను వుపసర్పించుకొని వుంటారుగాని వారికి స్వతంత్రదశ వున్నట్టు అగుపడ లేదు. గదాధర స్వామిపూజ ప్రేతగయావళీలది. విష్ణుపాద పూజ శుద్ధగయావళీలది.

రో దినము, ధర్మారణ్యం బౌద్ధగయ అనే ప్రదేశాలకు పోవలసినది. యీ ప్రదేశాలు షహరుకు నాలుగు కోసుల దూరములో వుంచున్నవి. పోయిరావడానకు అస్తమాన మవును. యీ ప్రదేశాలు క్షేత్రానికి పశ్చిమ భాగమందున్నవి. యిక్కడ ఒక గోసాయి పీఠస్థుడు జాగీరు అనుభవిస్తూ వచ్చినవారికి సదావృత్తి యిస్తూ వుంటారు. యీ స్థళము గయనుంచి కలకత్తావెళ్ళే భాటలో వున్నది. ఇక్కడ దెహబ్రహ్మవాదుల బౌద్ధగుడి ఒకటి యున్నది. అక్కడవుండే ప్రతిమలు బ్రహ్మదేశములో నుంచి జాతులవాండ్లు తెచ్చిన ప్రతిమకు సరిగా యున్నవి. ఆ గుడి చూడగా రెండు వందలు నుంచి మూడు వందలు వరకు యేండ్లకిందట కట్టినట్టు అగుపడుతున్నది. ఆ మతస్థుల ప్రబలము యెప్పుడు యీ ప్రాంత్యాల అయివున్నదిన్ని ఖుల్లముగా తెలియలేదు. యిందుకు వుత్తరము జయపురము, జోతీపురము, బిక్కానెరి అనే మారువాడి దేశాలు మొదలుగా దేహబ్రహ్మవాదుల నివాసభూమి గనుక పూర్వము ఒక కాలమునందు వారు యిక్కడ ప్రవేశించి పిమ్మట యీ కర్మ భూమియందు నిలవలేక ఖిలల్పపడి వుందురు.

యిక్కడ వుండే గోసాయి మహంతు సంత్రాసునింబూ అనే నారదపు కాలలలో అనేక లవణాలు పిప్పలి, శొంఠి, మొదలయిన జీర్ణకారి పదార్ధాలు కూరిపోశి యెండపెట్టి వచ్చినవారికి మెప్పుగా తారతమ్యము విచారించి యిస్తాడు. యీ దేశములొ ఆహార పదార్దాలు బలకరమయినవి గనుక అజీర్తిమాద జ్వరాలు వస్తూవుండుట చేత పాచక మనే మందులు కరక్కాయలు, జీలకర్ర, పిప్పళ్ళు, వోమము మొదలయిన వస్తువులను భావన చేసి అటువంటి పదార్దాలు నారదపు కాయలు మాదీఫలములలో యిమిడ్చి యిక్కడ చెయ్యడమే కాకుండా నేపాళాన్నుంచి అనెకముగా తెప్పించి అమ్ముతూ వుంటారు. ఆ సంత్రాసునింబు అనే పండ్లలో సూదులు గుచ్చి పెట్టితే సూదులు కరిగి పొతున్నవని వదంతి. యీపాచక ఔషధాల దినుసులకు యిక్కడ లెక్కలేదు. యీ ఔషదాలు జీర్ణకరములై భేదికారిగా వున్నవి.

గయావళీలు వచ్చిన ప్రభువు ప్రసన్నుడయితే అంతకు మిక్కిలి పండగ వేరే లేదు గనుక కలిగిన భూషణాదులు అలంకరిచుకుని వుండే నల్తముతొకూడా యిటువంటి పిండదానము చేసే ప్రదేశాలకు యజమానుడితో కూడా వచ్చి చేశే పూజలు ప్రతిగ్రహిస్తారు. ఒక నూత్రులయితే షోడశిని కూడా పిల్చుకుని వెళ్ళి యీ ముందు వ్రాసిన స్థలములలొ నంతా పిండదానాలు చేసి రావలసినది. ఆ బౌద్ధ గయలో జగన్నాయకుల గుడి వొకటి వున్నది. పయిన వ్రాశిన మహంతుతొట ఒకటి గొప్పదిగా నున్ను సుందరముగా నున్నది. ఈదినము నాలుగు తావులలో పైన వ్రాసిన ప్రకారము పిండదానాలు చేయడమయినది.

డో దినమందు లేచి తొలుదినమే బౌద్ధగయ చేశేనాడే చేస్తే నిండాప్రయాస అవుతున్నది గనుక యీదినము క్షేత్రానికి అతిసమీపముగా వుండే బ్రహ్మసరస్సుకు వెళ్ళీ అక్కడ పిండదానము చేసి కాక బలి, యమబలి, శ్వాసబలి యనే మూడుబలులు అక్కడికి సమీపముగా వుండే ఒక మంటపములో వేశి అక్కడ వుండే చూతవృక్షదర్శనము చేసి పూజచేసి రావలసినది.

యెనిమిదో దినమున విష్ణు పాదానికి సమీపముగా వుండే అష్టాదశ పాదాలమీద పన్నెండు మాట్లు ప్రత్యేక ప్రత్యేకముగా పిండదానాలు ఒక మంటపములోనే ప్రత్యేక ప్రదేశాలలో చేశి ప్రతి పాదము వద్దనున్ను నదదీప మనే ఘృతదీపాలువుంచి క్షెరతప్రణము ప్రతిపాదము మీద పితృద్దేశముగా చేయ వలసినది. యీ కృత్యము కావడానకు యీదినము అస్తమాన మవుతున్నది. ఈ స్థలాలయందు పిండ ప్రదానాలు చెశేటప్పుడు యేదేవతాత్మకముగా ఆస్థళము వుంటే ఆలోకములో అన్శత్పతృ నివాస సిధ్యర్ధం అని సంకల్పము చేయుచూ రావలసినది.

తొమ్మిదో దినమున ఫల్ఘునీశ్రాద్ధమువలేనే క్రమముగా అన్నశ్రాద్ధము విష్ణుపాద ప్రయుక్తముగా చేసి శ్రాద్ధానంతరము విష్ణుపాదము మీద పిండప్రదానము చేయవలసినది. విష్ణుపాదము మీద అశక్యముగా లోకులు పిండాలు వేస్తూ వుంటారు గనుక పిండముమీద పిండము పడకుండా రాజాధిరాజులుగ వుండే వారు సరకారుహుకుము మీద తాము పిండప్రదానము చేశి బయిట వచ్చేకొరకు యెవరినిన్ని గర్భగృహములోకి రానివ్వకుండా సరకారు మనుష్యులను వుంచి నిరోధము చేస్తారు. యిటువంటి లౌకీకప్రతిష్ట అయిన పనులు యిక్కడి జడ్జీగా వుండే మారీసు దొరగారికి, కలకత్తాలో వున్న నావిహితుడయిన మేస్తర్ మించ్చన్ దొరగారు ఒక కాకితము పంపించినంతలోనాయెడల మిక్కిలి కటాక్షము వుంచి యిక్కడవుండే సకల అధిరారము గల యింగిలీషు దొరలతో నాకు విహితము చేసి వారిగుండా కావలసిన సహాయము నాకు కరతలామలకము అయ్యేటట్టు చేసినాడు గనుక యీశ్వర కటాక్షముచేత నాకు కావలసినంతకన్నా యెక్కువ లౌకీక ప్రతిష్ట యిక్కడ సిద్ధించినది.

విష్ణుపాదముమీద పిండప్రదానము కాగానే గయావళీకి ముఖ్యముగా గోదానము చేయవలశినది. యీ విష్ణుపాదపు గుడివద్ద కొన్ని ధర్మశాలలు కట్టివున్నవి. స్థలంతరము దొరకనివారు యీ ధర్మశాలలో శ్రాద్ధాలు ఛేయుచున్నారు. యీ దినము యెక్కడ శ్రాద్ధము పెట్టినా పిండాలు తెచ్చి విష్ణుపాదముమీద వేయవలసినది.


ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర
టీటీఎస్ ఆడియో నిర్మాణ పాఠ్యం
భాగం ఆరు — మొత్తం ఎనిమిది భాగాలలో


పదిహేనవ ప్రకరణము  గయా మహాక్షేత్రము

దో దినమున, గయా ప్రజనానికి పూర్తిగా నటశ్రాద్ధము చేయవలసినది గనుక అక్షయ వటము కట్టివుండే ధర్మశాలలకు శ్రాద్ధయోగ్యమయినపదార్ధాలు అన్ని యెత్తుకొని వెళ్ళి ఆధర్మశాలలో పాకముచేసి శ్రాద్ధముచేయవలసినది. ఫల్గుని, విష్ణుపది, అక్షయవట శ్రాద్ధాలకు గయావళీలే బ్రాహ్మణార్ధాలు చేయవలసినది. గనుక వారు భోజనానికి రావడానకు శానా సావకాశ మవుతున్నది. వారిలో బహుమంది వుదయాన ఫలహారముచేసి వస్తారు. బ్రాహ్మణార్ధము చేస్తే రెండోసారి భోజనము చేయరాదనే నియమము వారికి లేదు. బ్రాహ్మణార్ధానికి పూర్వము సహజముగా తాంబూల చర్వణము చేయచూ వుంటారు. బ్రాహ్మణార్ధానికి వచ్చేటప్పుడు యింట్లోనే స్నానము చేసి సవారియెక్కి వచ్చి యిక్కడ వస్త్రపరివర్తనము చేసుకొని బ్రాహ్మణార్ధానకు కూర్చుంటున్నారు. హిందూస్తానులో వసించే పంచద్రావిళ్ళూ మొదలైన బ్రాహ్మలందరు స్త్రీలుసహా బోజన కాల మందు పట్టువస్త్రాలు, నారపట్టులు, ధావళ్ళు కట్టుకొని వుండడము గాని నూలుబట్టలు కట్తుకొన్నవారు పంక్తికి వచ్చింప్పటికి అశుచిగా యెంచుతున్నారు గనుక యీ గయావళీలకు అదే ఆచారము.

అక్షయవటము చుట్టు గోడపెట్టి వాకిలి పెట్టియున్నది. ప్రేతపర్వతము రామపర్వతము తప్ప కడమ పిండప్రదానాలు చేసే స్థలముల కంతా కావలసిన వారిని కూడా పిల్చుకుని పోవచ్చును. యెవరు కావలసినా ఆయా స్థలముల దర్శనము నిమిత్తము యెప్పుడు కావలిస్తే అప్పుడు పోతూ వస్తూ వుండవచ్చును. గయా వ్రజనాలు చేసి పిండప్రదానాలు ఆ యాస్థలములలో చేశేవారు సరకారులో నుంచి యిచ్చే చీట్లను అక్కడక్కడ వుండే చౌకీ బంట్రోతులకు చూపించి వారికి చీటీ ఒకటి కి వొకపైసా వంతున యిస్తూ రావలసినది. యీఅక్షయవటము అనేకావృత్తులు సమూలముగా యెండిపోయి వేరే వృక్షౌలు కూడా బదులుకు సమీపముగా వుంచి సిద్ధము చేసినవనక హాశ్చర్య కరముగా తున్నారు. వీండ్లుపెట్టే నిర్బంధము అంతా యీవటశ్రాద్ధమునాడు, అనుఫలము యిచ్చే కాలమందు గాని మరి యెప్పుడు నోటిమాట మాట్లాడరు. పూర్వకాలమందు యీసుఫలము యివ్వకుండా లోకులకు శానా శ్రమపెట్టుతూ వచ్చినారట. యిప్పుడు తుదను నాలుగు రూపాయిలు యిచ్చినా పుచ్చుకుంటున్నారు. ముఖ్యమయిన యీ అష్టగయ చేయడానకు సకల శలవులతో కూడా అరువై రూపాయలు పట్టుచున్నవి. యీసుఫల పుచ్చుకొని అక్కడ సమీపములో వుండే గుళ్ళో ప్రసితామహేశ్వర దర్శనము చేసుకొని శ్రార్ధశేషము భోజనము చేసుకొని వారి వారి పరువుకొద్ది విభవములతోనున్ను, మేళతాళములతోనున్ను వచ్చి విష్ణుపాదగదాధర దర్శనము చేసుకొని యింటికి రావలసశినది.

యీ అక్షయవటము వద్ద ధర్కశాలలో గయావళులు తప్ప యితరులు భోజనము చేయకూడదని ఒకకట్టు కట్టుకొని శ్రాద్ధశేషము కర్తను తప్ప మరి ఒకరిని అక్కడ భోజనము చేయనీయకుండా అంధపరంపరగా యీవరకు జరుగుతూ వచ్చినది. యీశ్వర కటాక్షముచేత నేను గయా మహాక్షేతములో వుండేవరకు అన్నసత్రాలు లేనందున పంచద్రావిళ్ళు అయిన మన దేశస్థులు ముప్పై కి తక్కువ లేక నిత్యము నాతో సహపంక్తిగా భోజనము చేయుచూ వచ్చిరి గనుక వారు అందరు నామండలితో కూడా ఆ ధర్మశలలో పిండప్రదానానంతరము భోజనము చేశేటట్టు ఘటన అయినది. పునా శ్రీమంతుడు కూడా యీపని చేయనేరక శ్రాద్ధానంతరము విడిదికి భోజనానికి పోయినాడు, యీ పని యీ పురుషుడికి జరిగిన దని బ్రాహ్మణ మండలి సంతోషపడేటట్టు యీశ్వరుడు కటాక్షించినాడు. యిందుకు కారణము నా గయావళి అనుకూలము ఒకటి, మేజస్ట్రేటు కొత్తవాలును కూడావుండేటట్టుగా వుత్తర్వు చేసినంతలో ఆకొత్తవాలున్ను నూటికి బంట్రోతులతోకూడా హాజరు భాషిగా నావద్ద వున్నందున యీపని జరిగినది. యిక మీదు అక్షయవటము కింద అనేకబ్రాహ్మణభోజనాలు జరుగుతూ రావచ్చును. యీ అక్షయవటము షహరుకు అరకోసు దూరములొనే వున్నది.

డో దినము అష్టతీర్ధాలని రామగయ అనే కొండకింద


పదహారవ ప్రకరణము  గయా ప్రాంతము మరియు మగధదేశము

మధుస్రవ అనే స్థలములోనున్ను, గయాశిరసి అనే తెర్ధములోనున్ను కూపగయ అనే బావివద్దనున్న, మృడవృష్ఠం అనే స్థలములోనున్ను, భీమగయ అనే స్థలములోనున్ను, గోష్పదం అనే స్థలములోనున్ను, వైతరణి అనే స్థలములోనున్ను అంతు పదిస్థలములలో ప్రత్యేక ప్రత్యేకముగా పిండప్రదానములు చేయవలసినది. యిది అష్టగయాశ్రాద్ధముటొ చేరిందికాదు. యివి అన్ని ఉపతీర్ధములు. ఇటువంటివి సహస్రావధి తీర్ధములు వున్నవి. వాట్లలో నంతా చేయడానికి మనుష్యులకు ప్రయాస అని గదాధరరూపముగా గయావళి అక్షయవట శ్రాద్ధము నాడు సుఫలము యియ్యడము గనుఇక గయావళీలలో ప్రముఖముగా వుండే వారంతా నాయెడల జడ్జీ మొదలయిన దొరలు ప్రీతిగా వుండేది చూచి మీరు అందరింవలెనే అష్టతీర్ధములు చేయనక్కర లేదు. రామసాగర మనే గొప్ప తీర్ధము ఒకటి దొరలు ఆక్రమించుకొని సంకిళ్ళవాండ్లుగుండా మరామత్తు చేయింపు చున్నారు. ఆ తీర్ధము క్షేత్రానికి మధ్యే వున్నది. ఆ తీర్ధము దొరల అధీన మయిపోతే మాకండ్లు తీసివేసినట్టు అవుల్చున్నది. ఆ తీర్ధమువద్ద యెవరినిన్ని పిండప్రదానాలు చేయనివ్వడములేదు. మీరు దొరలవద్ద సెలవు తీసుకొని ఆ రామసాగర తీర్ధము వద్ద పిండప్రదానము చేసినట్టయితే అన్ని ఉపతీర్ధములలో పిండప్రదానము చేసిన దాని కన్న యెక్కువ ఫలము సిద్ధింపుచున్నదని చెప్పుకొన్నందు చేతనున్ను, నామనివి దొరల వద్ద అప్పట్లో సాగేటట్టుగా ఈశ్వరుడు కటాక్షించి వున్నందున మారీసు దొరగారితో మనివి చేసినంతతో వారు మేజట్రేటు జాంసన్ దొర గారితో యోచించి ఆ తీర్ధము వద్ద హిందువులు పిండప్రదానములు చేయడము ఫలాని ప్రదేశమని నిశ్చయించి అక్కడ నున్ను పిండప్రదానము చేశేటట్టు వుత్తర్వు చేశినారు. గనుక అన్ని ఉపరీర్ధాలకు బదులుగా గయావళీల సమూహము అప్పట్లో అక్కడ కూడినది గనుక వారి సన్నిధిని ఆ రామసాగరములొ పిండప్రదానము చేసినాను. ఆ మరుసటి దినమే మరి ఒక గొప్పవాడు యీ దేశస్థుడు వాడి గయావళీ ప్రేరేపణ మీద నావలెనే అష్టతీర్ధములకు ప్రత్యామ్నాయముగా రామసాగరములో పిండప్రదానము చేశినాడు. నాతో కూడా వచ్చిన మండలిమాత్రము యధావిధిగా అష్ట తీర్ధములలో నున్ను పిండప్రదానములు చేసిన వారయినారు.

డో దినము న్యూనపరిపూర్తి విష్ణుపాద శ్రాద్ధమని ఒక శ్రాద్ధము ఛేయవలెను. మనవారు దానికి శుద్ధ శ్రాద్ధమని పేరు పెట్టి పంచద్రావిళ్ళున్ను తమ వారిని బ్రాహ్మణార్ధము చెప్పి రెండో సారి విష్ణు పాదము మీద పిండప్రదానము చేయుచున్నారు. నేనున్ను అదే ప్రకారము ఛేసినాను. యీ శ్రాద్ధానకు గయావళీలు బ్రాహ్మణార్ధము చేయ నిచ్చయించడము లేదు. వారి వారికి యిష్టమైన వారిని బ్రాహ్మణార్ధము చెప్పుకొనేటట్టు అనుజ్ఞ యిస్తున్నారు. ఈ ప్రకారము రెండుమాట్లు విష్ణుపాదము మీద పిండ ప్రదానము చేశే టందుకు, పూర్వము, అభిషేక పూజలు చేయవలసిన విధి గనుక శ్రీరములవారు నాకు కావలసినంత సేపు గర్భగృహములో నా పరివారము యేకాంతముగా వుండేటట్టు కటాక్షించినాడు గనుక యాభైయింటికి బ్రాహ్మణులను గర్భగృహములో జమ చేసి పురుషసూక్తముతో అభిషేకము యధావిదిగా చేసి లక్ష తులసీదళములు అర్చన చేసి ఆ తులసీ రాసిమీదనే పిండప్రదానములు రెండు ఆవృత్తులు విష్ణు పాదము మీద చేసినాను. యీ విష్ణు పాదము చుట్టు తొట్టి కట్టి వుండగా ఆ తొట్టికి తంజావూరి రాజు వెండి తగుళ్ళు కొట్టించినాడు. ఆ తొట్టి నిండేటట్టు శ్రీమంతుడు ఒక లక్ష అరవై వేల వేల రూపాయిలు పోయిన సంవత్సరమున యీ దినముల లోనే అందులో పోసి గయావళీలకు పంచిపెట్టినాడు. యీ గయావళీలకు యీ లాగు ప్రవాహమువలె ఆర్జన కలిగియున్నా బ్రహ్మదేవుడు నిత్య దరిద్రులుగా వుందురు గాక యని యిచ్చిన శాపము వారియెడల సత్యముగానే వున్నట్టు అగుపడుచున్నది.

డో దినము ఫల్గునినదిలో సాత్రియనే మడుగులో ప్రాత స్నానము చేసి దగ్గిరవుండే గుడిలో ప్రకాశింపుచున్న గాయత్రీదెవతా దర్శనముచేసి అక్కడ అదివరకు ప్రాతస్సంధ్యలను కాలాతీరముగా కలిగి కుదురుగా ఒక స్థలములోనే వుండుకొని సద్వ్యాపారముతో కాలము తోయవలెనని తలిస్తే అలాటివారు కన్నతావులలొనున్ను తిరగసాగితే పుట్టిన నిశ్చయము భేదించి పోవును గనుక అందుకు యోగ్యమయిన స్థలమును ఒకదాని యేర్పరచి అక్కడ చేయవలసిన కృత్యముల నున్ను యేర్పరచి తద్ద్వారా మోక్షము క్రమక్రముగా కలుగు నని బోధచేస్తే మనుష్యుల బుద్ధికి చాలా స్వస్థ్వము కలుగును గనుక యీ కాశీమహాత్మ్యము అలాటి వారికి వుపయోగింఛే లాగు యేర్పరచినా రని తోచుచున్నది.

గయా మహాత్మ్యమును గురించి యోచిస్తే లోకమందు తల్లి దండ్రులు మొదలయిన రక్త సంబంధికుల మీద అత్యంతమయిన ప్రీతి కలిగియుండవలసినది గనుకనున్ను, జరామరణాదులు యెప్పుడు సంభవింఛెదిన్ని యెవ్వరికిన్ని తెలియరాదు గనుకనున్ను అట్టి రక్త సంబంధికులు దేహము చాలించినంతలో వారు బ్రతికి వుండగా చేయవలసిన సత్కారములు చేయ డానకు వల్లపడక పొయివుండినా, చేసినది చాలదని తోచినా, వారి ఋణము మనమీద నిలిచిపోయెనే అనే పశ్చాత్తాపము కలవారికి అటువంటి రక్త సంబంధికుల మరణానంతరము వారిని తరింప చేసే వుపాయము ఒకటి వున్నదని తెలిస్తే ఆ పనిచేసి మన ఋణము తీర్చుకుంటిమి గదా అని మనస్సుకు ఆనందము పుట్టించవలసినది అగత్యము గనుక యీ గయా మహాత్మ్యము అటువంటి వారి విషయ మయి ప్రకటనము చేసినారని తోచబడుచున్నది.

సకల స్వరూపుడుగా నున్ను సర్వాంతర్యామిగా నున్ను వుండే దేవుడు వొక్కడే గనుక యే రూపము మీదనయినా భక్తి జనియించి దృఢమయిన బుద్ధితో యెటువంటి ఆరాధనను చేసినా సంతుష్టిపడి యేక మేవ యనే శృతి ప్రతిపాదితు డయిన అద్వితీయ బ్రహ్మా అంగీకరించు నని తలచి మానుష సామాన్యబుద్ధికి ప్రీతివిశ్వాసములు జనియించతగిన రూపములు కల్పించి ఆ రూపముగానైనా పరమాత్ముడి ఆరాధనలను మనచేత చేయించ తలచి పూర్వికులు యిట్టి స్థలమాహాత్మ్యాలను ప్రకటన చేసినా రని తోచబడుచున్నది.

న్నవి. సుగంధము కల పూలలో పన్నీరు పూలు ఒక దినుసు, జాజిపూలు ఒక దినుసు, సబురాపూలు అని ఒకదినుసును, యివి తప్ప కడమ దొరికే పూలు అన్ని చూపులకు అలంకారముగాని సుగంధము కలవి గావు.

యీ గయా మహాక్షేత్రములో చెప్పే సంకల్ప క్రమము యీ అడుగున వ్రాయుచున్నాను. నెం.ఇరవై ఎనిమిది. వైవస్వత మంవంతరే, మేరో, దక్షిణ దిగ్భాగే, ఆర్యావర్తాంతర్గత మధదేశే గయా గదాధర క్షేత్రే, కోలాహలపర్వతే, మధువనే, విక్రమశకే, బౌద్ధావతారే, బార్హల్స్పత్యమానే, ప్లవనామసంవత్సరే, ఆత్మహితైకోత్తరశతకులొద్ధారణార్ధ మని చెప్పుచున్నారు.

ఈ మగధదేశములో వుండే మహాస్థలములు, --నెం.ఇరవై తొమ్మిది. గయ ఒకటి, రాజగృహి రెండు, పవనాశ్రమం మూడు, పున, పున, నాలుగు, లోహదండం ఐదు, వైకుంఠం ఆరు, ఈ మహాస్థలములకు యాత్రార్ధము వస్తే రావచ్చును గాని నిర్మిత్తముగా యీ దేశానకు కర్మకులు రాకూడ దని పూర్వీకులు పురాణసిద్ధముగా నియమించి వున్నారు.

కాశీ నుంచి గయకు రావలసిన దారిని నేను రాకపోయినా విచారించి ఆ దారి మజిలీ వూళ్ళు క్రమముగా వ్రాయుచున్నాను, నెం.ముప్పై. మొగలుసరాయి కోసులు ఐదు, కఫనాశిని కో, సులు, ఏడు, మోఘనాసరాయి కో.ఏడు, సహస్రాం కో. పన్నెండు, నాసరుగంజు కో.పది, పున, పున, కో ఏడు, పదాన్ పూరు కో తొమ్మిది, గయ కో ఐదు, అంతుకోసుల అరవై రెండు.

యీ గయా షహరులో నల్లరాతితో చెంబులు, గ్లాసులు, తట్టలు, ప్రతిమలు మొదలయిన స్వరూపాలు బహుకుదురుగా చేసి అమ్ముతూవుంటారు. అనేక విధములయిన విగ్రహాలు విత్తళి, ఇత్తడి,తో పోసి అమ్ముతునారు. విష్ణు పాదాలు తామ్రరేకులతోను, వెండితోను అనేక దినుసులుగా చేసి అమ్ముతూ వున్నారు. యిక్కడికి సమీప మయిన రాజగృహి కొండలవద్ద నున్ను, టంకారి అనే వూరి కొండవద్ద నున్ను స్ఫటిక శిలలు పుట్టు చున్నవి గనుక వాటిని స్ఫటిక మణులుగా నున్ను, శివలింగాలుగా నున్ను చేశి యీ గయా క్షేత్రములో అమ్ముతూ వుంటారు.

అండవాయువులు యింగిలీషువారు చెన్నపట్టణములోవశిస్తూ వుండగా వారికి లేక నల్లవాండ్లము మాత్రము ఆ భూమిలో కలగడ మే మని కొందరు దొరలను అడిగివుంటిని. వారు దీన్ని గూర్చి యోచించి తమ డాక్జ్టరులు అందరున్ను కూడి నిశ్చయముచేసిన తీర్పుసంగతిని నాతో చెప్పినారు. అది యేమంటే యౌవనప్రారంభాత్పూర్వమే నల్లవాండ్లు స్త్రీభోగములలో ప్రతివర్తింపుచున్నారు గనుక స్త్రీ సంచారము మిక్కటము కావడమే అండవాయువు ఉపద్రవము కలుగుటకు కారణ మని నిశ్చయించినారట. ఆ కారణమువల్లనే యీ మగధ దేశములో అండవాయువులు విస్తరించివున్న వని విచారణమీద తెలిసినది. కాబట్టి చెన్నపట్టణానుభవముచేత నున్ను, మగద దేశపు వర్తమానము తెలిసినందుననున్ను, డాక్టరులు చెప్పినయోచన సరే నని నిశ్చయించడమయినది.

యీ దేశపు రేగుపండ్లు బహు యోగ్యములుగా వున్నవి. నిడువు అందముతో పొట్టివిత్తులు కలవిగా అతి మాధుర్యము గలిగి పురుగులు లేకుండా వున్నవి. యీ పండ్లు అమితముగా అమ్మడము కలిగి వున్నది. యీ దేశమంతా తట్టలతో భోజనము చేయుచు నుండడమున్ను, మర్రిచెట్టు పూరార్హముగా వుండడమున్ను, యిప్పపూలతో సారాయి దించడమువల్ల వాటి ఆకులు కోయడము లేక వుండడమున్ను మోదుగచెట్లు విస్తరించి లేక వుండడమున్ను యిక్కడా కలిగి వున్నందున పట్టణములలో కూడా విస్తళ్ళు దొరుకుట ప్రయాస ముగా నుండును. దొరికినా భోజనయోగ్యములుగా వుండవు. చేసుకొని వుంచుతూ రావలసినది. హిందూస్తాన్ యావత్తున్ను రొట్టెల వలెనే అన్నమునున్ను ప్రతిదినము భోజనము చేయుచున్నారు. గనుక చింతపండు మిరపకాయలు మొదలయినవి సహజముగా యెక్కడపడితే అక్కడ దొరుకుతూ వచ్చుచున్నవి.

యిక్కడి రూపాయి ఒకటి కి పయిసాలు ముప్పై నాలుగు. పయిసా ఒకటి కి గవ్వల పుంజీలు ఇరవై నాలుగు. పుంజీ ఒకటి కి గవ్వలు నాలుగు. కట్టెలు మొదలుగా సకల పదార్ధాలున్ను తూనికెమీద అమ్ముతున్నారు. తూనికె క్రమము, శేరు ఒకటి కి సుమారు యెత్తు ర్పు ఎనభై. దాన్ని ఇరవై గండాలు అనుచున్నారు. గండా అనగా నాలుగు రూపాయల యెత్తు, కొన్ని తావులలో శేరు ఒకటి కి పద్దెనిమిది గండాలు, కొన్నితావులలో ఇరవై నాలుగు గండాలుగల శేరు వున్నది. కొన్ని తావులలో ఇరవై రెండు గండాలుగల శేరు వున్నది. యీ గండాలు శేర్లు ఒకటి కి ఎన్ని అని తెలుస్కున్ని వస్తువులు బేరము చయవలసినది. మణుగు ఒకటి కి నలభై శేర్లు, శేరు ఒకటి కి చికాకులు పదహారు. అంగళ్ళలో వుండే తూనిక గుండ్లు యేవంటే శెరు అనే గుండును, పక్కాశేరు అనే అయిదు శేర్లగుండు ఒకటి, చికాకులగుండ్లు కొన్ని కొన్ని వున్నవి. కట్టెలు, బియ్యము మొదలయిన గొప్పతూనికెలు మణుగు పండ్లతో తూచుదున్నారు.

పంచగయలు చేసే క్మర మేమంటే ఫల్గునీ శ్రాద్ధము యధాప్రకారముగా ముందర ఛేసి పయిన వ్రాసిన పంచతీర్ధాలలో పిండప్రదానములు చేసి అటుతర్వాత మూడోదినము విష్ణునదీ శ్రాద్ధము పయిన వ్రాసిన రప్రకారమే వెరవేర్చి నాలుగోదినమందు విష్ణుపాదపు గుళ్ళోనే మరివొక వటవృక్షము వున్నది. గనుక అక్కడి దర్మశాలలో శ్రాద్ధము చేసి ఆ వటవృక్షము కింద పిండప్రదానము చేసి గయావళీవద్ద సుఫలము పుచ్చుకోవలసినది. ఏకోద్దిష్ణము చేసేక్రమము మొదటి దినము ఫల్గునీశ్రాద్ధముచేసి రెండోదినము విష్ణుపదీ శ్రాద్ధముచేశి విష్ణుపాదము మీద పిండప్రదానము కాగానే గయావళీవద్ద ఆ విష్ణుపాదము వద్దనే సుఫలము పుచ్చుకోవలసినది. ఫల్గునీ శ్రాద్ధము చేయవలసిన క్రమ మేమంటే ఫల్గునీశ్రాద్ధము మాత్రము ప్రధమదినము చేశి ఫల్గునిలో పిండప్రదానము కగానే గయావళీ వద్ద ఫల్గునీనదిలో సుఫలము పుచ్చుకొని పిండములు ఫల్గునీనది చెలమలలో కలిపి వెయ్యవలశినది. యీ నాలుగు క్రమములుకాక వేరేవిధమయిన గయాప్రజనక్రమము లేదు. గనుక నాతోకూడావచ్చిన బ్రాహ్మణ మండలిచేత నంతా అష్టగయా వ్రజనము చేయించి, గయావ్రజనము ఛేయను శక్తిలేక గయలో కాచి యున్న ద్రావిడ దేశస్థులయిన బ్ర్రాహ్మణులచేతనున్ను, నాతోకూడా వచ్చిన బోయీలు బంట్రౌతులు వగయిరా శూద్రుల చేతనున్ను ఏకోద్దిష్టమనే గయావ్రజనము చేయించినాను.

యీ గయామహాక్షేత్రము రాజా మిత్రజితశింగు అనేవాడి జమీందారితో చేరినది. వారి నివాస్థలము టంకారి అనే వూరు, గయకు పదికోసుల దూరములో వున్నది. యితను బహు సంపత్తుగలిగి యున్నాడు. యితని జమీందారికి యితడు కంపెనీకి కట్టే రూపాయలు సాలు ఒకటి కి మూడు లక్షలు యితని రాజ్యములో యితనికి యాభై లక్షల రూపాయలు సునాయాసముగా కనుబడి అవుచున్నది. యిదే రీతిగా యీ ప్రాంత్యాల వుండే జమీందారులంతా అపరిమితమయిన లాభమును అనుభవింపుచు సుఖముగా నున్నారు. యింత లాభమునకు కారణ మేమంటే యాభై అరువై యేండ్ల కిందట యీ హిందూస్తాన్ రాజ్యము కంపెనీ వారికి స్వాధీనము కాగానే నాలుగు పక్కల శత్రుసమూహాలు నిండివుండెను గనుక రాజ్యములు తమ స్వాధీనానికి వుపర్యుపరిగా వచ్చేకొరకున్ను వచ్చిన రాజ్యము పరాక్రాంతము గాకుండా స్వాధీనములో వుండేకొరకున్ను లార్డు కారన్ వాలీసుగారి వుత్తర్వుమీద అప్పట్లో యీ జిల్లాలకు వచ్చిన కలకటరులు పూర్వము వున్న జమీందారులకే యావత్తు భూమినిన్ని తేలికెగా జమాబంది యేర్పరచి యుద్ధప్రసక్తులు తమకు కలిగి నప్పుడు మంది మార్బలములతొకూడా, కాలు బలము,కావలసిన రస్తుసామగ్రీలను ప్రతి జమీందారుడ్లున్ను కుమ్మక్కు చేయవలెనని వొక ఖరారు చెసుకొని భూమిని జమీందారుల వశము ఛెసినారు. అటువంటి సయాయములు వీరివల్ల కంపెనీ వారికి యీ వరకు నిమిత్తము లేకుండా తమ పరువుకు కావలసినంత శిబ్బందిని వుంచుకొని గజాంతైశ్వర్యములు జమీందారు లందరున్ను అనుభవింపుచు కాలము తోయుచున్నారు.

యిక్కడి భూమివాటము మామిలియతు వాటము, రహితుల క్షేమము వారి ప్రారాపత్యాలఖుల్ల నున్ను యేమంటే యీ హిందుస్తాన్ లో భాను అని ఒక భూమి కొలతకర్ర కద్దు. ఆభాను అనే వెదురు పంటలలో అభినిమందు గోధుమలు యవలు యివి నిండా వెలగల వస్తువులు.

అభిని మందు గసగసా కాయలమీది బంక. ఆ కాయలను పోస్తుకాయ అంటారు. యీవస్తువులు ఫలింఛే కాలము యిదే గనుక గయ చుట్టూవున్న పట్నా నుంచి గయకు వచ్చే దారిలో నున్ను పైన వ్రాసిన వస్తువులు అమితముగా ఫలించియున్నవి. పోస్తుచెట్లు వూళ్ళవద్ద వేస్తారు గాని యిండ్లకు దూరమైన పొలములో వేయరు. పోస్తుచెట్లు అరిటిచేట్ల రీతుగా మొద్దుకట్టి వుండును. ఆ యేన్ను మొద్దుకు నాలుగు పక్కలా ముల్లంగి ఆకులవలెనే దళసరిగా ఆకులు వేసుకుని వచ్చి ముల్లంగి చెట్టంత పొడుగు కాగానే కాడవంటి యెన్ను తీసి యెన్నుకొనను తెల్లని పుష్పములు పుష్పించి రేకులు రాలిన వెనక పత్తికాయలవంటి పిందె బుట్టుచున్నది. అరటి పువ్వందముగా వెలపటి కాయ రవంత పెద్ద పెరగగానే కాయ వూర్ధ్వముఖ మవుచున్నది. ఆ కాయ నిమ్మకాయ కన్నా యెక్కువ గాత్రమయ్యేది. ముక్కాలు వాసి కాయ కాగానే మూడు సూదులు ఒక కట్టగా కట్టుకుని నాలుగు ఆవృత్తులుగా కాయకు నాలుగు పక్కలా మూడేసి గీట్లుగా గీస్తారు. గీచిన మురసటిదినము ఆ గీతలమీద మునగబంక వర్ణముగా మెత్తని బంక పుట్టు చున్నది. వాటిని కత్తులతో గీచి కంపెనీవారికి శేరు ఒకటి కి రూపాయలు నాలుగు వంతున యిస్తారు. మరి ఒకరికి రహితులు అభినిమందు యియ్యకూడరు.

ఈ మందు యీ హిందూస్తాన్ లో అయ్యేదంతా శేఖరం చేసే కొరకు పట్నాలో సర్ చర్లీస్ చార్లీన్ డాలిబ్యార్డు అనే గొప్ప దొరను వుంచివున్నారు. నభినిమందు విషయాన్ని గురించి అతను మేమి వ్రాసినా కలకటరు మొదలయిన అధికారస్థులు శిరసావహించి నడవవలసినది. ఆ దొర ములుకుగిరి తిరుగుతూ వుంటాడు, ఆ పోస్తుకాయలు చేతికి మెత్తగా వుంచున్నవి. కోస్తేలొపల కిత్తిలిపండువలె తొలలుగా చీల పోతున్నవి. ప్రతి తొలమీదా గసగసలు ఈశ్వరుడు కూరిపోసివున్నాడు. పోస్తు కాయలు పొలము చూచి నప్పుడు గోడుగులవంటి శుద్ధధావళ్యముగల పూలతో బహుశృంగారముగా చూడ


పదిహేడవ ప్రకరణము  పట్నా నుండి ముంగేరు మరియు రాజమహల్

వేడుకగా వుంచున్నది. మధ్యే ఒక్కొక్క యెర్రవర్ణపు పూలున్ను సకృత్తుగా పూచియుంచున్నవి.

గోధుమలు, జవ అనే యవలున్ను వరిపయిరు వలెనే పెరిగి తోకవడ్లవలెనే యెన్నులు తీయుచున్నవి. గోధుమ యెన్నులు కురచగా నున్ను, గింజలు గుండు అందముగానున్ను జడ అల్లినట్టుగా వుంచున్నవి. యవయెన్నులు తోకవడ్ల యెన్నులకు అన్ని విధాలా సరిపోలి వుంటున్నవి. యీదేశపు గౌడ బ్రాహ్మలందరున్ను అభిని మందు, బంగాకు దాని జడలున్ను సహజముగా అంగీకరిస్తారు.

యీ గయా మహాక్షేతములో కాశివలెనే అడుగడుగుకు లింగాలు లేకపోయినా శానా గుళ్ళు తీర్ధాలకు నాలుగు పక్కలా వున్నవి. అందులో ముఖ్యముగా మంగళగౌరి యని వొక శక్తి గుడిన్ని గయాసురి అనే శక్తి గుడిన్ని వున్నవి. యీ రెండు గుళ్ళలో తామసారాధన లయిన బలిప్రదానాలు జరుగుచున్నవి. యీ మంగళ గౌరి యనే దేవిగుడి అష్టాదశ పీఠాలలో ఒకటి యని వాడుకుంటారు. యీ గయా మహాక్షేత్రములో ఫిబ్రవరి నెల పద్నాలుగు తేదివరకు వాసము చేసినాను.

ఫిబ్రవరి నెలె పద్నాలుగు ది మధ్యాహ్నము పన్నెండు ఘంటలకు ఆ క్షేత్రము వదిలి ప్రయాణమై లోగడి దారిగానె మళ్ళీ పన్నెండు తేది పట్నాషహరు ప్రవేశించినాను. నేను మైహరు అనే వూరు వదిలిన వెనక యీ నెలపద్నాలుగు తేదివరకు యెక్కడా వొక చినుకయినా పడ్డది కారు. శివరాత్రి ముందు వెనకలుగా యీ దేశములో వర్షము కురియడము వాడికె గనుక సివరాత్రి ముందు వెనకలుగా యిక్కడ మంచివర్షాలు కురిశినవి. యీకాలమందు కురిశే వర్షము కూడా ఘనీభవించి రాళ్ళ వాన కురియడము కద్దట. ఆదేప్రకారము యీ చుట్టుపక్కలా తూర్పు గాలి సహితముగా రాళ్ళవాన కురిశినట్టు విన్నాను. ఆ రాళ్ళు భూపతన మయిన రెండు గడియలకు కరిగి పోవుచున్నవట. యీ వానలు యిక్కడికి గోధుమ వగయిరా పయిరులకు నిండా విరోధము. అకుటోబరు నెల ఆఖరు మొదలు ఫిబ్రవరి పదిహేను తేది పర్యంతము చలియొక్క బాధ ఒకటేరీగిగా వుండినది. పిమ్మట చలిబాధ విడిచినట్టు తోచగానే యెండలు తీక్ష్ణము కాసాగినవి. యీ వాన కురియకపోతే చలి శుద్ధ ముగా నివర్తించునట. యీ వానవల్ల వైశాఖమువరకు వుదయకాలమందు కొంచము చలి వుపద్రవము వుంటూ వచ్చునని యీ దేశస్థులు చెప్పినారు. యెట్లా శీతము యెక్కునో, అట్లా యెండయున్ను ఆ కాలములో అంత యెక్కువగా వుంచున్నదనివిన్నాను. యీ వుష్ణకాలానికి భయపడి లార్డు వుల్లియం బెంటిక్కుగారు నెపాళ దేశములో వుండే సముద్రోదకానికి పైన ఇరవై ఏడు వేల అడుగుల పొడుగుగా యీ బ్రహ్మాండాని కంతా వున్నత పర్వతమైన హిమాలయ పర్వతానకు యెండకాలపు కాలక్షేపము కొరకు వెళ్ళినారు. ఫిబ్రవరి నెల పద్దెనిమిది తేది మొదలు కొని మార్చి నాలుగు తేదివరకు వర్షప్రతిబంధకము చేతనున్ను బజరా పుల్లాకులు అనే వాడలను కుదుర్చుకోవలసి సావకాశముగా పట్నా షహరులో వసించినాను.

మార్చి నెల ఐదు తేది సాయంతరము పట్నాషహరు వదిలి పద్నాలుగు దాండ్ల బజరా ఒకటి బంగాళాకు బాడిగె వంద పన్నెండు రూపాయలకు కుదిరి వుండగా దానిమీద సహకుటుంబముగా సవారి అయి డెబ్బై రూపాయిల బాడిగెకు పుల్లాకి యనే పడవ వొకటి కుదిరి యుండగా దాని మీద బోయీలు, కళాసులు, డేరాలు మొదలయిన సామానులను యెక్కించి ప్రయాణమైనాను. హిందుమతము యొక్క బాహ్యపు చిన్నెలు చూచి హిందువులు తెలియక చెడిపోతారనే తాత్పర్యము యిప్పట్లో యీశ్వరాజ్ఞ వల్ల హిందువులను యేలే ఇంగిలీషు జాతివారికి నిష్కర్షగా తోచివున్నది. అటువంటి తాత్పర్యము వారికి కలగడము యీ సరికి నేను వ్రాసిన హేతువులవల్ల యెంత మాత్రమున్ను వింతకాదు. గండకెగంగాసంగమ ప్రదేశములో యిక్కడ హరిహరాదుల గుళ్ళు రెండువున్నవి. అక్కడ సంవత్సరానికి ఒకసారి మహోత్సవము జరిగి లక్షావధి ప్రజ వస్తు శ్రీ శైలనాధునికి సమమవునా శ్రీకాళహస్తి నాధునిన్ని యుక్తులు చెప్పి శైవవైష్ణవులు మొదలయిన హిందువులు వారలలో వారే పోట్లాడ సాగుతూ వుంటే మూడు వేల ఆమడ దూరములో నుంచి వచ్చిన యింగిలీషువారు హిందువులను జూచి నవ్వక అంతస్తత్వము విచారించే వోపిక త్వరలో యెట్లా కలుగును! గనుక పూర్వీకుల తాత్పర్యము యీ కర్మోద్ధారణ విషయములో యేమైనదంటే నిప్పులో నీళ్ళు పుట్టినట్టయినది.

పట్నాషహరు వదిలిన వెనక మార్చి నెల రెండు తేది మూంగేరి, మాంఘీర్, అని యిప్పుడు లోకప్రసిద్ధిగా వుండే పూర్వపు ముద్గలాశ్రమము ప్రవేశించినాను. గంగామహానది సర్పము నడిచినట్టుగా అనేక తిరుగుళ్ళుగా ప్రవహింపుచున్నది. మూంగేరి ముందుగా గంగ నడమ చిన్నతిప్పలు రెండు వున్నవి. ప్రవాహకాలమందు ఆ కొండతిప్పలు ముణిగిపోను గనుక పడవలకు గుర్తు తెలిశే నిమిత్తము వాటిమీద రెండు కొడిస్తంభములు నాటివున్నారు. మూంగేరి ఖసుబా కలకటరు వగైరా అధికారస్థులు వుండే స్థలము. సకల పదార్ధాలు దొరుకును. గొప్పయిండ్లు, ఒక చిన్న కోట కలదు. జాతులవాండ్లు కొన్ని బంగాళాలు ముచ్చటగా కట్టివున్నారు. యీ షహరులో నేమి యీ చుట్టు ప్రాంత్యాలలో నేను మూంగాచీర అనే పట్టు నారమళ్ళు నేశి మన దేశానకు రావడము, యీ బట్టలను మూంగేరి చీరలనడానకు మూంగాచీరలని అభావముగా ప్రఖ్యాతి అయినది. ఆ బట్టలు యుక్కడా శానా నయము.

యిక్కడ మాకు పడవతోశే మల్లాలకు కావలశిన భక్ష్యయోగ్య పదార్ధాములు పుచ్చుకొని సాగిపోయి యిక్కడికి నాలుగు కోసుల దూరములో వుండే సీతాగుండ ప్రదేశానకు సమీపముగా పడవలు నిలిపీ సవారీలతో రెండుకొసుల దూరము వెళ్ళి అక్కడవుండే సీతాగండదర్శనము చేశి స్నానపానాదులు చేసినాము. ఆ సీతాగుండము సుమారు ముప్పై అడుగుల చదరముతో తిరుకొలను వలె కట్టివున్నది. వుదకము బహు నిర్మలముగా వున్నది. వుదకముకింద రాతిగొట్టు కొండరాతిలో వూటపుట్టి తిరుకొలనులో పెట్టివుండే తూముగుండా వుదకము బయట పారుతున్నది. తిరుకొలను వదిలి వంద బారల దూరము పొయ్యేదాకా వుదకము యొక్క వుష్ణము యెక్కువ గనుక చెయి నిండాసేపు వుంచ సహ్యముకాదు. తిరుకొలనులో వుదమము మీద పొగలు పారుతూ వుదకమునద్ది మెట్లను వుష్ణము చేయుచూ కిందమంట వేస్తే తపిలలోని వుదకము పొంగుతూ వుంచున్నది. లోకులు పూజార్ధము ఆ కొలనులో బియ్యము వేస్తారు. ఆ బియ్యము రెండు మూడు దినములకు నాని తూముగుండా బయిటికి వస్తున్నది గాని పచనము కావడము లేదు. యల్లీసు దొర కోడిగుడ్డును యీ వుష్ణోదకములో వుంచితే పక్వము కాలే దని వ్రాశినాడు.

యీ వుదకము యేప్రల్ నెలలో వచ్చే శ్రీరామనవమి మొదలుకొని యిక్కడా వర్షాకాలము ఆరంభమయి శ్రావనమాసము దాకా శీతకరముగా వుండి వర్షప్రదము కాగానే వుదకము మళ్ళీ వుష్ణము కాసాగి శీతకాలమునందు చెప్పితీరని వుష్ణమవుచున్నదట. యిక్కడ సంవత్సరానికి వకసారి అయ్యే వుత్సవములో బహు జనసమ్మర్ధము చేత మనిషి కాలుజారి ఆ కొలనులో పడితే చర్మమువూడి నాలుగయిదు దినములలో దేహమునకే అపాయము వస్తున్నదట. యిప్పట్లో ఆగుండములో నుంచి ముంచిన ఒక కుండ గంగలో సుమారు రెండు కుండల చల్లని గంగపోసి చల్లర్చి స్నానము చేసినాను.

ఆ తీర్ధానికి చుట్టున్ను రామగుండము లక్షమణగుండము అనే తీర్ధములు నాలుగు అయిదు కొలనుల వలెనే కట్టియున్నవి. వాటి వుదకము చల్లనే గాని, వుష్ణముకాదు. వాటి వుదకము వూటే గాని సీతాగుండమువలె వుదకము వుదకము నదివలెనే సదా స్రవింపుచు పారడములేదు. యీ వుష్ణోదకము కనిపెట్టకూడని వొక సువాసనగా వున్నది. అది నిండా మాధుర్యము లేకపోయినా పానానికి సహ్యముగా వున్నది. పానానంతరము నోరు కొంచెముగా పుల్లగా వుంచున్నది. స్నాన పానానంతరము ఒకవిధమయిన సువాసన మన దేహాన్ని అనుసరించి కొంతసేపు వచ్చే వుచ్చ్వాస నిశ్వాసాలతో తెలియవచ్చుచున్నది.

నల్సెటిర్ యేసిడ్ అనే గంధక ద్రావకము వుదకములో కలిసి తీసుకుంటే పుల్లగా వుంచున్నది గనుకనున్ను అగ్ని గంధకపు భూమిలో తనంతట పాషాణ సంబంధమయితే త్వరగా వుత్పత్తి కావచ్చును గనుక నున్ను లోకారాధ్యుడు మహానదులనున్ను, మహాపర్వతాలనున్ను అనేకముగా సృష్టించి నప్పటికిన్ని అటువంటి సృష్టికోటి చూచి ఒక వేళ తన అత్యద్భుత చర్యను తెలుసుకొలేక పోదురనే తాత్పర్యముతో యీ వుష్ణ గుండాన్ని తగుపాటి కారణాలను వుంచి సృష్టించినాడని తోచబడుచున్నది.

యీ వుష్ణగుండపు కధ, శ్రీరాములు రావణ బ్రహ్మహత్య పరిహారార్ధముగా ముద్గలాశ్రమమునకు సహకుటుంబముగా వచ్చి నట్టున్ను, అప్పట్లో తన లంకా నివాసదోష సందేహము అక్కడవున్న అనేక ఋషులకున్ను, అక్కడికి సమీపమందున్న తన తండ్రి అయిన మిధిలాపురనాయకుని కిన్ని నివృత్తి అయ్యేటట్టు పాతాళమందు వుండే బాడబాగ్నిని తెప్పించి సీతాదేవి తాను ప్రవేశమై బయిటికి వచ్చి నట్లున్ను, ఆ అగ్నివల్ల యీలోకానకు బాధలేకుండాపిమ్మట అక్కడ తదుపరి వుదకప్రవాహాన్ని సృస్టించినట్టున్ను తద్వారా అద్యా ఆ వుపి ఉదకము వుష్ణకరముగా వుండేటట్టున్ను చెప్పుతారు.

రామకృష్ణాద్యవతారములు అబద్ధములు కావు గనుకనున్ను, వారు పరబ్రహ్మ స్వరూపు లనడానకు యేమాత్రము సందేహము లేదు. గనుక నున్ను తమమహిమలు లొకములో ప్రసిద్దిగా వుండేకొరకు యిటువంటి యాశ్చర్యకరము లయిన విషయాదులు కలగచేసినా కలగజేసి వుండవచ్చును.

యీ స్థలమందు వసించి ఆమరునాడు జాంగీరు అనిన్ని, జాంగరాబాదు అనిన్ని చెప్పబడే గొప్పబస్తీ యయిన గంగ వుత్తరవాహినిగా ప్రవహింఛే పుణ్యస్థలము ప్రవేశించినాను. యీ వూరు కలకటరు మొదలయిన అధికారస్థులు వసించే జిల్లా కాకపోయినా నీలిమందు చేసే యింగిలెషు దొరలు గంగాతీరమందు

అక్కడక్కడా మిద్దెలు వగయిరాలు కట్టుకొని యీ ప్రాంతముల అనేకులు వుండేటట్టు యిక్కడా కొందరు వసించి యున్నారు. యిది గొప్పవూరు. మైధిలి కాన్యకుబ్జ బ్రాహ్మణులు యిండ్లుకట్తుకొని తీరవాసు లయి యున్నారు.

వంటి సిద్ధులకు నిమిత్తములయిన వస్తువులను స్వాధీనము చేసుకోవలనని వృధా ఆశపడి నిమిత్తము మాలిన భ్రమప్రమాద మైన పనులు చేయడము అతి వ్యర్ధమని నిశ్చయము చేసినాను.

యీ దాతా వైధ్యనాధ స్వరూపముగా వుండే పరమాత్మునికి శివరాత్రి దినమున సపాదలక్ష అనే లక్షాయిరువై అయిదువేల గంగ కావిళ్ళకు తక్కువ లేకుండా లొకులు తెచ్చి కామ్యార్ధముగా అభిషేకముచేస్తే యిష్టసిద్ధి అవువున్నదని యీ హిందూస్తాన్ లో బహు ప్రసిద్ధి. ఆ పంచకావిళ్ళు యేదే దంటే గంగోత్తరి, గంగా సాగర సంగమము కావిళ్ళు రెండు, హరిద్వారమువద్ద యెత్తే గంగకావడివొకటి, ప్రయాగలో యెత్తే కావడి వొకటి, యీ జాంగీరువద్ద యెత్తే గంగకావడి వొకటి, అంతు కావిళ్ళు అయిదు.

యీదాతావైద్యనాధస్థలముయొక్క కధయేమంటే పూర్వకాలమునందు రావణాసురుడు కైలాసానకు వెళ్ళి శివుణ్ని నాలంకలో నీవు వసించవలనని ప్రార్దించి నట్టున్ను శివుడు మంచిదని ఒకలింగములో మూర్తీభవించి నన్ను దిగువపెట్టకుండా నీలంకకు యెత్తుకొని పొమ్మని చెప్పినట్తున్ను విష్ణువుకు యీ వర్తమానము తెలిసి లోక సంరక్షణ పనికి నియమింప బడ్డ వాడు గనుక యీ తామసగుణ ప్రధానడయిన రావణుని సమీపమందు శివుడు వసిస్తే వీడు మరీ శివప్రసాదము కలిగే కొద్దిన్ని సాధులను బాధపెట్టు ననే భయముచేత వుదకాధిపతి అయిన వరుణుని ప్రేరేపణ జేసి రావణుడు యీ జాంగీరువద్ద గంగ దాటి అడివి మధ్యే పోతూవుండగా రావణునికి జలబాధ బహుశా కలిగేటట్టు చేసి తాను వృద్ధ బ్రాహ్మణుని వేషము వెసుకొని ఆ లింగము తీసి వుంచుకొని రావణుడు జలబాధ నివృత్తి చేసుకుని వచ్చేలోపల ఆ అరణ్యములో పెట్టి వెళ్ళీనట్టున్ను ఆ లింగాన్ని పెల్లగించడానికి శక్తిలేక లంకకు వెళ్ళిపోయినట్టున్ను, పిమ్మట వైద్ది అనే గోపాలకుడు కాళహస్రి కన్నప్పవలెనే అతిమూర్ఖమయిన భక్తితో ఆరాధన చేశినట్తున్ను ప్రసిద్ధి గలిగి యున్నది.

ఆ స్త్ఘలము చుట్ట్లున్ను అడివి బిల్వ మయముగా వున్నది. యీ దేశములోనున్ను ముఖ్యముగా బగాళీలున్ను, యెండకాలములో బిల్వపండ్లు షర్బత్తుచేసి బహుశ, తాగుతారు. ఈ దేశపు బిల్వపండ్లు బహు గొప్పలుగా వున్నవి. పండిన వెనక బహుమాధుర్యముగా వుంచున్నవి. యీ బిల్వపండలు నిమిత్తము బిల్వచెట్టుకు బహుకట్టు చేశియున్నారు. యీ చెట్ల కిందికి మనుష్యులను పోనివ్వరు. యీ జాంగీరువద్ద నొక తోటలో బిల్వచెట్టు పనసచెట్టు కాచివుండగా నా మనుష్యులు పనసాకులు కొయ్యపోతే పనసచెట్లనువిరచినా సమ్మతించినారుగాని పూజకు రెండు నిల్వదళములు కొయ్యనిచ్చినవారు కారు. యీ జాంగీరు స్థలములో అమావాస్య ఆదివారము ఘటనమైనది గనుక ఆ దినమునకు మరునాడు అమావాస్య సోమవార వ్రత మిక్కడనే గడిపి సోమవారము మధ్యాహ్నము బయలుదేరి సాగివచ్చినాను.

మార్చి నెల పదహారు తేది కహలుగాం అనే గొప్పవూరుచేరినాను. యీ వూరివద్దను గంగమధ్యే రెండు చిన్న కొండలున్నవి. ఆకొండల మీద మానుషసంచారము లేదు. అడివి పెరిగియున్నది. ఈ వూళ్ళో అన్ని పదార్ధాలున్ను దొరుకును. మయిధిలి బ్రాహ్మణులు, కనోజాబ్రాహ్మణులు నలభై యిండ్లదాకా యున్నారు. కరివేపాకు మన దేశము వదిలిన తరువాత అక్కడక్కడ ప్రయత్నముమీద దొరుకుతూ వచ్చినది. ఈ వూరిలో ప్రతిపెరటిలోనున్ను కరివేపాకుచెట్లు కొల్లగా వేసి యున్నారు. కొత్తమల్లి మనిషిపొడుగున యీ దేశాములొ గడియ దూరము దాకా పరిమళింపుచు పయిరు అవుచున్నరి. యీ ధనియాలు కునుంబా చెట్లతో కలిపి అభిని చెట్లతొ కూడా నున్ను ప్రత్యేకముగా పొలాలలో నున్ను చల్లుతారు.

మూంగేరి మొదలుగా గంగకు యిరుపక్కలలో పర్వత దర్శనము అవుతూ వున్నది. బజారాలో వచ్చేటప్పుడు ఆ పర్వతాలు వొక పక్క నుండేవయినా నాలుగు పక్కలా తిరుగుతూ వుండేటట్టు స్థిరముగా నుండే సూర్యుడు భూచలనముచేత వొక పక్కనుండి వక పక్కకు వచ్చేటట్టుతోచే లాగు అగుపడుచున్నది.

జాంగీరునుంచి కహలుగాముము వచ్చేలోపల భాగల్పూ రనే జిల్లాకసుబా గొప్ప షహరు వొకటి వున్నది. అక్కడ కలకటరు మొదలయిన అధికారస్థులు నివాసముగా వుండి వున్నారు. ఆ వూరి వద్ద నుండే గంగాధార యీ దినాలలో లోతు చాలనందున ఆ వూరికి వుత్తరముగా వుండే పద్ద ధారలో యీ బజరాలు వస్తున్నవి గనుక దూరపుదృష్టి మాత్రము ఆ వూరిమీద కలిగినది. యీగంగధారలను యీ పడవవాండ్లు దరియ్యా లంటారు. జలధార తక్కువయితే యె దరియ్యా మరుగయా అంటారు.

తేది గురువారము పడమటిగాలి అనుకూలముగా కొట్టి నందున యీ దినము వుదయము మొదలు అస్తమానము లొపల ఇరవై నాలుగు కోసుల దూరము మా బజరా సాగి వచ్చినందున రాజా మహాలు అనే గొప్ప వూరు చేరినాము. యీ వూరిలో నీలిమందు చేశే దొరలు మాత్రము నివాసముగా వున్నారు. యీ వూరివద్ద గంగలో రాళ్ళు వున్నవి. పడవలు జాగ్రత్తగా రావలసినది. యీ వూరు తోపులు, తోటలతో నిండి వున్నది. వొక మశీదు వున్నది. అది తురకల భక్తిని ఆకర్షించే పాటిగా పురాతముగా వుండి వున్నది. పూర్వికపు రాజులు *కట్టినది వొక నల్లరాటి మహలి శిధిలమై యున్నది. సకల పదార్ధాలు దొరుకును.

పట్నా అనే షహరు విడిచిన వెనక శోధన చూడవలెననే వేషముతో సుంకపు చౌకిదార్లు యెవరున్నూ మా బజరాలవద్దికి చిన్నపడవలు వేసుకొని రావడములేదు. వారిని యిక్కడి కష్టం కలకటరులుపోయి వస్తూవుండే పడవలను నిండా తొందరపెట్టకుండా తాకీదు చేసినట్టు తోచుదున్నది. సుంకపువాండ్లు యీ దేశములో లోకులను చేసేతొందర అధికారస్థు లయిన దొరలకు తెలుసును. కాశిలో వుండే బ్రూక్కుదొర యీప్రసక్తి నాతో మాట్లాడే టప్పుడు ఈలాగే మాదేశమైన యింగిలాండులోనున్ను సుంకపువాండ్లవల్ల తొందర కలిగి

*ఔరంగజేబు చక్రవర్తి సోదరుడు షూజా క్రీస్తు శకం పదహారు వందల ముప్పై లో దీనిని కట్టె నని బిషప్ హెబరు వర్ణించినాడు.

వున్నది. వీరికి అధికారము యివ్వక విధిలేదు. యిచ్చినందువల్ల లోకులకు హింసగా వున్నదని వ్యసన పడుకున్నాడు.

యు దేశములో బంట్రౌతులు మొదలుగా గల శిరస్తా వుద్యోగస్థుల వరకు జీతములు బహు స్వల్పము గనుక లోకులవద్ద లంచాలు నిండా తీస్తారని గయా మేజస్ట్రేటుదొర మేస్తరు జాకుసన్ దొరతో మాట్లాడునప్పుడు ప్రసక్తివచ్చి అప్పుడు వారి చెప్పినది యేమంటే, పిడికిళ్లతో యెత్తి యీ దేశములో అధికారస్థులకు లోకులు లంచాలు యిచ్చేవాడికె పడియున్నందున జీతాలు మీ దేశమువలె యెక్కువచేసినా అధికారస్థులు అడకక పోయినా వాడికె ప్రకారము లొకులు తెచ్చియివ్వలసినదాన్ని యిస్తూ వస్తున్నారు గనుక అప్పట్లో కంపెనీవారికి యెక్కవజీతము యిచ్చేనష్టము ఒకటేగాని యెవరికి క్షేమముండ నేరదని చెప్పినాడు. బరకందాసు అనే వొక ఠాణాబంట్రౌతులకు యిక్కడ జీతము నెల ఒకటి కి నాలుగురూపాయిలు. వాడి గుర్రము వగయిరాలకు మాత్రము నెల ఒకటి కి పది రూపాయలు సెలవు వుంటూ వున్నది. యిక్కడ జిల్లామేజస్ట్రేటు నాజరుకు సుమారు నల ఒకటి కి నూట్కి తక్కువలేక వస్తూవున్నది. హిందుస్తానులో జుడైసైయాల్ లయనులో నల్లవాండ్లలో నాజరు వుద్యోగము సర్వోత్తమ మని నిశ్చయిముచేసినాను.

యిక్కడ సకల కచ్చేరలలోనున్ను లెక్కలు వగయిరా వ్రాసే భాష ఫాషీన్. యింకా యిక్కడా వ్రాశే అక్షరములు శానా విధములుగా వున్నవి. ఒకరికి వ్రాయ చదవ తెలిసినది మొరొకరికి తెలియదు గనుక జాబులు మూలకముగ పనులు జరుగడము ప్రయాస. ఫార్శి లిపిమాత్రము సర్వమధ్యస్థముగా వున్నది. యిక్కడ వ్రాశే లిపుల ఖుల్లసు యేమంటే మహాజని యని సాహుకార్ల లిపి వొకటి. బ్ర్రాహ్మణీ అని బ్రాహ్మలు గ్రంధాలువ్రాశే లిపి ఒకటి, మోడి అనే మహారాష్ట్రపు లిపివొకటి, మారువాడి అని మారువాడీలు వ్రాసే లిపివొకటి. ఇంకా కొన్నిలిపులు వున్నట్టు తోచుచున్నది. మగధ దేశములో మాగధి అని వొక భాష గయావళీలు అంతరంగముగా మాట్లాడు కొంటారు.

యీగయావళీలేమి, యీదేశపు పంచగౌడ బ్రాహ్మణులేమి వారి వటువులకు యెనిమిదో సంవత్సరమున వుపనయనము క్రమముగా చెస్తారుగాని ఆచిన్న వాండ్లచేత అటుతర్వాత త్రికాలములను సంధ్యవార్పింఛే జాగ్రత చెయ్యడములేదు. వివాహాదులు నాలుగు దినముల దీక్షతో చేస్తారు. నిశ్చితార్ధము మాత్రము కొన్ని నెలలకు ముందే చేసివుంచుతారు. ప్రవేశ హోమము శేషహొమము పాణిగ్రహణము యీ ముఖ్య కృత్యములు కద్దు. మంగల్య ధారణము మొదలయిన లౌకిక లాంచనలు దక్షిణదేశము వలెనే నడవడము లేదు. జాతా శౌచాదులు శృతి స్మృతి ప్రకారము ఆవరించుతారు. గంగకు సమీపప్ర్రాంతములందు వశించేవారు, యెవరు దేహము వదలినా దేహమును యథోచితముగా కర్మ నిమిత్తము తప్తముచేసి గంగలో విడిచిపెట్టుతారు. కర్మ ప్రసక్తి లేనివారి దేహములు వొక నిమిత్తము లేక గంగలో విడిచి పెట్టడమే ముఖ్యముగా జరుగుచున్నది.

యిక్కడి పంచాంగాలలొ గ్రహ దృష్టులు సాధించి వ్రాయుచున్నారు. తిధివార నక్షత్ర యోగకరణాదులు దక్షిణదేశపు పంచాంగానికి గడియ యెచ్చు తక్కువగా సరిగా వుంచున్నది. పంచాంగాలలో వివాహోపనయన ముహుర్త విచారణ బహుశ, లోకులు చేయుచున్నారు. శివాలిఖిత మని వొక ప్రయాణ ముహూర్త నిర్ణయ గ్రంధమున్నది. దాని ప్రమేయము సాంబమూర్తి త్రిపుర పరిహారము చేయబోవు నప్పుడు తలచిన కాలమందు ముహూర్తము దొరికేటట్టు ఆ గ్రంధము లోకోపకారముగా చేసినాడట. జాతక సంవత్సర ఫలాలు గొప్ప వారికి జ్యోతిషికులు వ్రాయిస్తూ వస్తారు.

కాశీప్రయాగలొ దక్షినదేశస్థులేమి, యిక్కడి ఉత్తర పశ్చిమ తూర్పు దేశస్థులేమి అనేక ధర్మాదులను కాశీతంబురాయడి అధీనముగా దక్షిణదేశస్థులు కాశీ మొదలయిన ధర్మాదులను చేసినట్టు చేసి అనేక గుమాస్తాలగుండా నడిపిస్తూ వుండేది. నడుస్తున్నదా లేదా అని సర్కారుతరపున విచారణలేదు.

దక్షిణదేశపు సౌరమాన చాంద్రమాన నక్షత్రమానాలకున్ను విశ్వాసములు కలవారు గనుకనున్ను, కలకత్తా దేశమునుంచి నూరార్లు నావాలు వేసుకొని నా యెదట యిప్పుడు వస్తున్నారు గనుక యెక్కడ రాత్రిళ్ళు దిగినా ఐదారు నావాలు నాతో కూడా దిగుతూ వస్తున్నవి. యీ ప్రాంతములలో రాత్రిళ్ళు వావాలు ఒంటిగా మనిషి కట్టు తక్కువగా దిగి వుంటే దొంగలు తెలివిగా వుండే కిస్తీలు అనే నావాలమీద వచ్చి కొళ్లపెట్టుక పోతారని వాడుకుంటారు. యిప్పట్లో అటువంటి దుర్మార్గములు శానా మట్టుపడ్డట్టు తోచబడుచున్నది.

లోగడ వ్రాశినంతలో శాస్త్రయుక్తిచోదిత మయిన ద్వైతమతము ప్రసిద్ధముగా మధ్వాచార్యులవారు వుద్ధరించి దక్షిణ దేశములొ బహుమందిని తదనుష్టానపరులుగా నున్ను యేర్పరుచుకున్నట్టు యీ దేశములో యెవరినిన్ని లోపరుచు కో లేదని వ్రాసుకుని వుంటిని. గయామహాక్షేత్రము ప్రవేశించిన వెనక గయావళీల మతము విచారించగా వారు మధ్వమత ప్రవిష్టులుగా నున్ను దక్షిణ దేశపు సత్యపూర్ణ పీఠపు శిష్యవర్గముగానున్ను తెలియవచ్చినది.

యీ గయావళీలు మాత్రము యింత దేశములో మధ్వమతానికి లోబడ వలసిన కారణ మేమని విచారించగా వాయుపురాణ ప్రకారము యాగార్ధమై వీరు బ్రహ్మ కల్పిత బ్రాంహ్మణులు గనుక నున్ను ధర్మప్రజా వృధ్యర్ధం వర్ణాంతర స్త్రీలను పరిగ్రహించి నారు గనుకనున్ను యిక్కడి బ్రాంహ్మణ మండలి యీ గయావళీలను తమ సముగాయములో కూర్చుకొక గయాప్రజనకాలములలో మాత్రము వాయుపురాణ ప్రకారము వీరిని తగురీతిని ఆరాధనచేయుచు నుండగా మధ్వమత ప్రకటనార్ధము యేనూరేండ్లకిందట మధ్వమతొద్ధారకులు యీ దేశమునకు వచ్చినప్పుడు అందరికి యిక్కడా వెలిగావున్న గయావళెలు అందరున్ను యిక్కడ అనంగీరారము చేశిన మతాన్ని అంగీకరించి తమంతట తాము యిక్కడ వొక ప్రత్యేక మతానుసారులుగా వుండడము యుక్తమని నిశ్చయము చేశి మధ్వమత సంకేతాలకు అన్నివిధాలా అప్పుడు లోపడినారు. మతోద్ధారకులు ద్రావిడాచారాలు యావత్తు వీరికి బోధచేసి తదారభ్య ద్రావిడాన్నము భోజనము చేసేటట్టు వీరికి యిచ్చను కలగచేసినారు. ఆ


పద్దెనిమిదవ ప్రకరణము  దేశాలు భాషలు మరియు సృష్టి విచారణ

యిచ్చమాత్రము యిప్పుడు నిలిచి వున్నది గాని, వారు బోధ చెసిన ఆచార వ్యవహారాదులు యీ దేశాస్థుల సాంగత్యము చేత క్రమక్రమశ, ఖిలపడుతూ వచ్చినది.

వాయుపురాణ ప్రకారము గయావళీలను గయావ్రజనక్రియలు చేయడములో ఆరాధన చెయవలసినది అగత్యము గనుకనున్ను, ద్రావిడాచార ప్రకారము పిండప్రదానాత్పూర్వము అన్నశ్రాద్ధము చేయడము ముఖ్యము గనుకనున్ను, గయవళీలు ద్రావిళ్ళు పచనము చేసిన అన్నము భోజనము చేసేటట్టు సమ్మతించినారు గనుకనున్ను, చటకము మొదలైన శ్రాద్ధాలు చేసి గయావళీలకు ఆమం మొదలైన భక్ష్యయోగ్య వస్తువులు యిచ్చే టంతకన్నా అన్నశ్రాధ్హానికి గయావళీలను బ్రాహ్మణార్ధము చెప్పేటట్టు దక్షణ దేశస్థులు నిశ్చయము చేసినారు గాని యేకారణము చేతనున్ను గయావళీలు పక్వము చేసిన అన్నమును ద్రావిళ్ళు వుచ్చుకునేటట్టు సమ్మతించినవారు కారు. తదారభ్యగయావళీలు ద్రావిళ్ళవల్ల యీపాటి జరిగే గౌరవమును కాపాడుకోవలసి ద్రావిడ దేశస్థులు భోజనము చయ్యకనుండేవారి చేతి పక్వాన్నము తామున్ను భుజించకుండా ద్రావైడాచార ప్రకారము నడిచేవారమని అభినయిస్తూ కాలము గడుపుతూ వస్తున్నారు. యాభై అరవై యేండ్ల క్రిందట సత్యూపూర్ణ పీఠస్థులు యీ ప్రాంతముల చచ్చివుండి గయావళీలకు నమాశ్రయణము చేసి పూజగైకొని పోయినారు. యిప్పుడున్ను పునా శ్రీమంతుడు మొదలయిన గొప్పవారి గయావళీలు మాత్రము యధోచితముగా యజమాన ప్రీత్యర్ధమై బ్ర్రాహ్మణ నిత్యకర్మలు జరుపుకుంటారు.

మనలో పేరుగలిగిన యాభై ఆరు చేశాలు వాటి ఛెప్పన్నభాషలున్ను యీ బ్రహ్మాండములో యేపక్క వున్న వని విచారించగా నేను చేసిన దేశాటనముచేత నాకు కలిగివుండే స్వానుభవము చెతనున్ను, నా వినికిడి వల్లనున్ను, నేను నిశ్చయము చేసినది యేమంటే ఆ దేశాలంతా కర్మద్వారా బ్రహ్మానుసంధానము చేసే యిండియా అని నామధేయము కలిగిన కన్యాకుమారి మొదలు కాశ్మీరము లోపలనే వున్నవి గాని అన్యత్ర కాదు, అని నిశ్చయము చేసినాను. అయితే బహు దినములుగా యీ భూమి తురకలచేత ఆక్రమింపబడి దేశ సరిహద్దులు తెలియకుండా భూమిని కలిపి వారి యేలుతూ వచ్చి నందుచేత యిప్పట్లో ఆ యాభ్హై ఆరు దేశాల సరిహద్దులు అన్ని కనిపెట్టి వ్రాడనకు ప్రయాసగా నున్నది. అయినా ఆ యాభై ఆరింటిలో అనేక దేశాల సరిహర్రులు కనిపెట్టి వ్రాయవచ్చును.

మనము వసించే భూమితోకూడా ఊర్ధ్వ లోకాలు యేడు, అధోలూకాలు యేడు. వాటిస్థితి యెక్కడ నని విచారించగా నాబుద్ధికి తేటపడ్డది యేమంటే, పయిన వ్రాశిన పదునాలుగు భువనములు యీ బ్రహ్మాండమునకు అంతర్భూతములని నిశ్చయపడ్డది. అది యెట్లంటే యీ బ్రహ్మాండము కోడిగుడ్డు ఆకారముగా వున్నదని మన శాస్త్రమున్ను మతారంతరస్థుల భూగోళ శాస్త్రములున్ను యేక వాక్యవ పడి వున్నవి. మన గణిత శాస్త్ర ప్రకారముగా నున్ను యీ బ్రహ్మాండానికి వంద ఇరవై భాగాలుగా చేసి అందులో మధ్య ప్రదేశాన్ని మనవారు నిరక్ష దేశమనిన్ని, జాతులవాండ్లు లయన్ అనిన్ని పేరుపెట్టి వున్నారు. గనుక ఆ నిరక్ష దేశానకు వుత్తరము యేడులొకములుగానున్ను, దక్షిణము అధోభాగమునందు యేడు లోకాలుగా నున్ను మన వారు నియమించినారు. వుత్తరము వూర్ధ్వభాగమందు వుండే యేడు భువనములలో మానుష నివాస భువనము వొకటి. దీనికి పై అంతస్థు అంతస్థుగా మనుష్యాపేక్షయా దేవతాస్వరూపులుగా వుండేవారు సృష్టికోటి తారతమ్యాల ప్రకారము శుద్ధసత్విక గుణప్రధానులై శీతల భూప్రదేశాలలో ఆనందింపుచు నుండే లాగు తోచుదున్నది. యీ లోకము లను స్వర్గ మర్వ్య పాతాళలోము అని మూడుగా చెప్పుచున్నారు. నిరక్ష దేశమునకు దక్షిణమందు అధోభాగమున తమోగుణ ప్రధానులైన రాక్షస భూతప్రేత పిశాచూదులు వారి వారి తారత్మ్య ప్రకారము అంతస్థులుగా వసింపుచునుండేలాగు తోచబడు చున్నది.

మనుష్యనివాసభూమికి ఊర్ధ్వాధ, ప్రదేశములలో వసింపచే చూస్తే తామసగుణ ప్రధానులకు ద్వేషబుద్ధి జనించడము సహజము గనుక, తామసగుణ ప్రధాను లయిన రాక్షసులు మొదలైన వారికిన్ని సాత్విక గుణప్రధానులైన దేవతలకున్ను యుద్ధములు పురాణోకతముగా వుండేలాగు అప్పుడప్పుడు సంభవిపుచు వచ్చినట్టు తోచుచున్నది. వశిష్టాదులుగా వుండే మునులు జన్మంకుచేత మనుషదేహులైనా వారు చేసిన సుకర్మములచేత దేవదేహులై దేవ సమానులైనారు. గనుక సాత్వికగుణ ప్రధానమైన దేవలోక సంచారములు వారికి గలిగి వుండేటట్టు తోచబడుచున్నది. విరజానది సన్నిహితమైన విష్ణు నివాస వైకుంఠమున్ను, సాంబమూర్తి నివాసమైన కైలాస పర్వతమున్ను మొదలైన వుత్తమ ప్రదేశములు మనకు వూర్ధ్వమున నుడే ఆరు భువనములలోనే వున్నవి. యీ కర్మ భూమిని వసించే మానుష మండలిలో కొందరు తామసారాధన ప్రియులై తామస గుణ ప్రధానులైన భూత ప్రేత పిశాచ రాక్షస్ గణాలను వుపాసన చేయుచూ వచ్చినారు గనుకిఅ వారి ప్రదేశమున్ను యీ మానుష నివాస భూమియందు గలిగి వారున్ను అతి తామసారాధనలచేత సర్వేశ్వరుని కటాక్షము సంపాదించినవారై సాత్వికగుణప్రధానులైన దేవతలను ధిక్కరించేపాటి సామర్ధ్యము కలవారైనారు గనుక వారు అటు తర్వాత తమ్మున ఆరాధించినవారియందు అనుగ్రహము చేయుచు తమంత వారినిగా చెయుచూ వచ్చినట్టు తోచుచున్నది.

లవణేక్షు సురాదులనే యేడు సముద్రములు ప్రత్యేక ప్రత్యేక ముగా నున్నవా లేక వొక సముద్రములోనే ఆ యేడు సముగ్రాలున్ను అంతర్భూతములా అని విచారించగా మన పురాణాదుల రీతిగానున్ను మతారంతరస్థుల పురాణాదుల రీతిగానున్ను సృష్టియొక్క ఆదిలో లోకారాధ్యుడు జలార్ణవముగా వున్న బ్రహ్మాండములో జలమును తొలగతోసి మృత్తికను కలుగచేసినట్టు వున్నది గనుక అటుతర్వాత పిండాండములయొక్క వాసార్ధము కలగచేసిన భూమి వినాగా మిగిలిన ప్రదేశామంతా బ్రహ్మాండములో జలమయముగా వున్నది గనుకనున్ను ఆ జలరాశి సమూహానకు సమిష్టి పేరు సముద్రము గనుకనున్ను సముద్రము వొకటే గాని అనేక సముద్రములు వుండనేరవు. అయితే సముద్రసంచారులుగా నుండే జాతులవాండ్లు సముద్రములో వుండే ప్రదేశాంతరములు గుర్తు తెలిసే కొరకు బ్లాకిసీ, రెడ్డుసీ అని పేళ్ళు పెట్టినట్టు మన పూర్వపు పౌరాణికులు దేవతలు మొదలైన సిద్ధస్వరూపులు వసించే ప్రదేశములు ఈ బ్రహ్మాండములో ఫలాని తావులు అని గుర్తు తెలిసేకొరకు వొక జలరాశిలోనే యిది లవణ సముద్రముయిది యిక్షు సముద్రమని యేర్పచినట్టున్ను ఆ మధ్యనుండే దివ్యభూఖండములను జంబూ ప్లక్ష అనే సప్త ద్వీపాంతరములుగా యేర్పరచినట్టుగానున్ను తోచబడుచున్నది.

సృష్టియొక్క క్రమము విచారించగా మొదట అయిదు మహా భూతములు వుద్భవించినవి. వాటిపేళ్ళు పృధిన్యప్తేజోవాయ్వాకాశాలు. ఆకాశభూతము శుద్దశూన్యమయినా సర్వవ్యాపకముగనుక అదే పర తత్వమైయుపనిషద్వాశ్య ప్రకారము తనవల్ల వాయువు దానివల్ల అగ్ని, దానివల్ల జలము, దానివల్ల భూమి అని యిట్లు సృజించెను. ఆకాశము గాక మిగిలివుండే నాలగు భూతములలోనున్ను వాటియొక్క సృష్టి పరంపరలోనున్ను ఆకాశ మహాభూతముయొక్క సంకల్ప స్వరూపమైన మాయాశక్తిన్ని, సర్వకారణమైన ఆకాశ భూతమున్ను లీనములై యున్నవి. వాయువుమొదలైన మహాభూతములు నాలుగింటిలో మాయాశక్తి చైతన్యము విస్తారము ప్రతిఫలించే స్త్రీ భూతములు తెండు, ఆకాశభూతసంబంధమైన పురుష చైతన్యము విస్తాఅరము ప్రతిఫలింఛే పురుష భూతములు రెండు, అంతు మహా భూతములు నాలుగు. అందుకు దృష్టాంతము యేపురాణములో విచారించినా భూమినిన్ని వుదకరాశినిన్ని స్త్రీలింగాలుగా చెప్పుతూ వచ్చినారు. ఆ అయిదు మహాభూతముల ద్వారా సంకల్ప ప్రకారము అనేక బ్రహ్మాండాలను సృష్టించి వాటిలో అంతర్భూతమయిన అనేక కోటి ప్రకృతిగల పిండాండాలను పరమాత్మ యనే ఆకాశ భూతముసృష్టించినది.

ఆప్రకారము సృష్టి అయిన అనేక బ్రహ్మాండములలో వుండే ప్రకృతి గల దేవమానుషులు మొదలైన దివ్యదేహాలంతా పరతత్వమయిన ఆకాశ మహాభూతము యొక్క ప్రత్యక్ష సృష్టి గనుక ప్రకృతి గలదేహములన్ని పంచభూతాత్మకములుగా వుంచున్నవి గనుక ప్రకృతి దేహాలకు బ్రహ్మానుసంధానము చేయదగిన శక్తి పుట్టే వరకు భగవద్గీతా వాక్యమైన వాసాంసిజీర్ణానీ అనే వాక్యప్రకారము దేహాంతరములు కలవు. ఆప్రకారము పరతత్వమువల్ల సృష్టిచేయబడిన ప్రకృతిదేహాల రక్షణనిమిత్తము గాను వాయు మహాభూతము తిర్యగ్జంతుకోటి అయిన పశువులు మొదలైన ప్రత్యక్ష జీవరాసులను సృష్టించెను. అవి పరతత్వముయొక్క సృష్టి కావు గనుకనున్ను పశువులు మొదలయిన దేహములలో పరతత్వముయొక్క ప్రతిభాతి కాతగ్గ ప్రకృతిలేదు గనుకనున్ను ఆ జంతుకోటికి దేహాంతరాలున్ను లేవు. యంత్రములవలెనే వాటిలో ప్రాణవాయువు నిలిచివుండే వరకున్ను చరింపుచు నుండి దేహములో ప్రాణవాయువు వదలగానే దేహాంతరములేక యంత్రము పగిలిపోయినట్టు విచ్చిన్నమై పొవును. అయితే తిర్యగ్జంతు కోటి ముఖ్యమయిన మహా వాయుభూతముయొక్క సృష్టి గనుక నున్ను ఆ జంతుకోటిలో ఆకాశభూతవ్యాప్తి ప్రత్యక్షముగా లేకపోయినప్పటికిన్ని వాయు మహాభూత సమేతముగా కొదవ నాలుగు మహాభూతముల వ్యాప్తి సంపూర్ణముగా నుండుటచేత ఆ జంతుకోటి దేహములలో పంచేంద్రియములు గలిగి ఆ యింద్రియాల ప్రేరేపణచేత ఆహార నిద్రాభయ మైధునాదులున్ను బాల్య యౌవన కౌమార వార్ధక దశలున్ను వాటికి కలిగి వున్నవి. అయితే అవి తల్లి బిడ్డ అనే వ్యవస్థలేక మూఢత్వముతో చిన్నదేహాలను పెద్దదేహాములు ఆహారము చేసికొంటూ వుంచున్నవి.

పరతత్వము యొక్క సృష్టిఅయిన ప్రకృతిదేహుల సంరక్ష్ణార్ధమని ఆ ప్రకారము వాయుమహాభూతము సృష్టించిన తిర్యగ్జంతుకోటిచాలదని తోచి అగ్ని మహాభూతమువల్ల వృక్షాదులు ఓషధులు సన్యాదులు, తృణాదులు మొదలయిన అచేతన వస్తుకోటి వాయుభూత సృష్టియైన జంతురక్షణకొరకు సృష్టించబడినది. తద్ద్వారా అగ్ని సృష్టించిన వృక్షగుల్మ సస్యాదులున్ను, పరతత్వవ్యాప్తిన్ని, వాయుభూతవ్యాప్రిన్ని అంతు రెండు వ్యాప్తులున్ను లేనందున పంచేంద్రియ వ్యాపారములు తజ్జనితమైన ఆహార నిద్రాభయ మైధునముల్ లేక్ నున్ను జాగ్రత్స్వప్నసుషుప్తులనే అవస్థా త్రయము లేకనున్ను స్థావర రూపములను వహించి బాల్యము యౌన వస్తాడు. ప్రతిభాతి తక్కువపడే కొద్ది జీవాత్మ అశుద్ధు డవుతూ వస్తాడు. ప్రకృతిలో పరమాత్మ ప్రతిభాతి పరమాత్మ సగృశమై పరమాత్మ తేజోంశము పూర్తిగా సంబంధించే వరకు యీ ప్రకృతి కష్టసుఖములు అనుభవింపుచూ వచ్చుచున్నారు. పైన వ్రాసిన పాంచభౌతిక దేహనివాసి అయిన ప్రకృతిని ఆత్మ అని పెద్దలు అనుచున్నారు, అందులో ప్రతిభాతి అయ్యే పరమాత్మ ప్రతిబింబాన్ని అంతరాత్మ అను చున్నారు. ప్రతిభాతిని కలగచేసే వస్తువు పరమాత్మ అని అంటారు.

ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ, అనేవస్తుత్రయము దేవ మాను షాది దివ్య దేహములలో అంతరించి వున్నవి. యీ దేహములలోని ప్రతిభాతులన్ని పరమత్మవల్ల సృష్టి అయిన విన్ని, పరమాత్మ సమములున్ను అయినందున యివి పాంచభౌతిక దేహములు అయినవి. అటువంటి ప్రకృతి దేహములు యీ యెనిమిది వస్తువులతో వుండేవి స్థూల దేహములని పేరువహించి వుంటున్నవి. స్థూల దేహాకృతి పూర్తిగా కిందవ్రాసిన పాణి పాదాదులయిన అవయవాలతో యేర్పడగానే కిందవ్రాసిన జ్ఞానకర్మసాధనములైన యింద్రియాలు జనములై ఆ యింద్రియాలకు పటుత్వము రాగానే వాటి సమూహాన్ని సూక్ష్మదేహ మని అనుచున్నారు. యీ సూక్ష్మ దేహల్ము శబ్ద స్పర్శ రూప రస గంధాలను గ్రహింపుచు జాగ్రదవస్థలో బహు వ్యాపారములు విరామము లేకుండా చెయుచున్నది. అందులో వాక్చక్షుశ్శ్రోత్ర జిహ్వాఘ్రాణా లనే పంచేంద్రియములు బహు వ్యాపారమువల్ల అలియగానే మనస్పనే ఇంద్రియము తమకు యజమానుడు గనుక ఆ మనస్సనే యింద్రియము తాను అలిశే వరకు స్వప్నావస్థ అని వొక అవస్థను కల్పించుకొని ఆ అవస్థలో బహువ్యాపారములను యేకాంతముగా చేయుచూ వుంచున్నది. ఆ మనస్సనే ఇంద్రియానకు అలసట పుట్టగానే అది ఆత్మ అనే జీవునిలో లయించి పోవుచున్నది. అలాగు మన స్సనే యింద్రియము ఆత్మలో లయించి నప్పుడు సుషుప్తి అవస్థ యని అనిపించు కుంచున్నది.

వాయుభూతజన్య మయిన తిర్యగ్జంతు దేహముల కన్నిటికి త్వక్కు చర్మము మాంసము మొదలైన అన్ని వస్తువులు గలిగినా వాటివల్ల శిర, పాణి పాదావయవాలు వుద్భవించినా అవస్థాత్రయము ఇంద్రియాలద్వారా వున్నా ఆకాశానికి బదులు వాయునే అంతరత్మ అయి వాటి ఆత్మలను కల్పించెను గనుక ప్రకృతి దేహాలవలెనే తిర్యగ్జంతువులు సుషుప్త్యవస్థా వంతరము యీ వరకు సుషుప్తి యనే అవస్థను నేను పొంది వుంటిని అని అనుకోవడానకు నాటి దేహములలో వస్త్యంతరమున్ను తెలివిన్ని లేదు. ఆ వస్తువే పరమాత్మభాతి అని తెలుసుకోవలసినది. అగ్నిభూతజన్యమైన వృక్షాదులలో అగ్ని మహాభూతమే వాటికి ఆత్మగా తన ప్రతిభాతి ద్వారా యేర్పడి నందున ఆ సృష్టికోటిని తిర్వగ్జంతువులకున్ను భిన్నముగా మొరివొకవిధమయిన తక్ చర్మ మాంసాదులతో వాటి దేహములు యేర్పడి శిర, పాణి పాదాలుగా వుండే అవయవములు పరిష్కాతముగా యేర్పడక యింద్రియములు జనించక బీజాంకురాలను మాత్రము కల్పించుదున్నది. అప్పుభూతము యొక్క సృస్టిలో ఆకాశము, వాయువు, వహ్ని యీ మూడు భూతముల ప్రతిభాతి లేనందుననున్ను స్వయం అప్పుభూతమే సదమునదులు మొదలయిన జలరాశి స్వరూపము ధరించుట ఛేత చలనశక్తి మాత్రము వాటికి కలిగి వురుషభూతముల సృష్టికోటిని కాపాడుతూ వున్నది. పృధివీభూతము తన సృష్టి అయిన మృత్తు మొదలయిన వస్తువులలో పయి నాలుగు మహాభూతముల వ్యాప్తి లేనందున చలనశక్తి కూడా లెకుండా పురుషభూతసృష్టిని ధరించి అప్పుసృష్టి సహాయ ద్వారా వాటిని పరిపాలన చేయుచూ స్థితిని పొందియున్నది.

యీ ప్రకారము యీ బ్రహ్మాండములలో సృష్టి అయిన సకల మున్ను ఆకాశ మహాభూతమువల్ల సృష్టి అయిన ప్రకృతి దేహముల పరిపాలనార్ధమే గనుక యీ ప్రకృతి దేహములు మిగిలివుండే సృష్టికోటిని యేలుబడిచేయు చున్నవి. యీ యిక్తిమీద విచారించగా ప్రతి బ్రహ్మాండమునకున్ను అటువంటి పరమాత్మ ప్రతిభాతికి యోగ్యమయిన ప్రకృతులు సృష్టికి అదిన్ని యిన్ని అని సంఖ్య నిర్ణయింపబడి వుండవలనని తోచబడుచున్నది. యింతే కాకుండా మహమ్మదు యింగిలీషు శాస్త్రాల ప్రకారమున్ను మనశాస్త్రముల ప్రకారమున్ను యీ ప్రకృతులకంతా వొక్క కాలములొనే వుపసంహార మనిన్ని తోచబడుచున్నది. ఆకాలమును జాతులవాండ్లు డే ఆఫ్ జడ్జిమెంటు అంటారు. మనవారు బ్రహ్మణాసహముక్తి అంటారు. మహమ్మదు మతస్థులు కయామల్ కాదిర్ అని చెప్పుచున్నారు. సృష్టియొక్క విభజన తెలిసే నిమిత్తము పైన వ్రాసిన వివరములవల్ల పరమాత్మవ్యాప్తి కొన్నిటియందు లేకుండా వుండునేమో అని సందేహించ వలసినది లేదు. పరాత్పర మయిన ఆకాశమహాభూతమనే పరమాత్మ సరాంతర్యామిగానున్ను, అణువులో అణువుగానున్ను మహత్తులో మహత్తుగా నున్ను ప్రత్య్హక్షపరోక్షాలుగా వుండే వున్నాడు. సృష్టియొక్క విభజన తెలియడానకు పయిఖుల్ల స్సు వ్రాసినాను. పంచమహాభూతములే దీపదీపికా న్యాయముగా పరమత్మ సంబంధములే గనుక సర్వంబ్రహ్మమయం జగర్ అనేవచనము సత్యముగా నమ్మడానకు యేమిన్ని సందేహము లేదు.

ఆకాశవాయు వహ్నిభూతాలు సృష్టించిన జంతుకోటికి బాల్యయౌవన కౌమార వార్దక దశలు సంభవించడానకు కారణమేమనిన్ని ఆ నాలుగు దశల సంచారకాలాలలో ఆ దేహములలోని అంతరాత్ములు దశాభేదరల్హితులైనా వారి దేహ చేష్టలద్వారా వారికే దశాభేదములు కలిగినట్టు అగుపడవలసిన దేహ చేష్టలద్వారా వారికే దశాబేదములు కలిగినట్టు అగుపడవలసిన దేమనిన్ని విచారించగా సృష్టియొక్క్జ వృద్ధి నిమిత్తము స్థూల దేహములలో పాంచభౌతికాలుగా వుండే ప్రకృతులనే బీజాలను యీశ్వరుడు ప్రవేశపెట్టి వాటి ధారణకున్ను పొషణకున్ను, అంకురోత్పత్తి చేయనున్ను మాయాశక్తి చైతన్య స్వరూపులయిన స్త్రీల యొక్క గర్భాలను కలగచేసి పురుష దేహసంగమ ద్వారా ఆ గర్భాలలో బీజాలను కలగచేసి, ఆబీజము తగుపాటి అంకురము కాగనే మాయాశక్తి చైతన్యము పూర్తిగా కలిగి పృధ్వీభూతము మీద ప్రత్యక్షముగా యీశ్వరుడు నిలుపుతాడు. అని మొదలుగా ఆ అంకురాన్ని పృధ్వీ మహాభూతము వృద్ధిచేసి దాని సన్యకాలము వచ్చేవరకు పోషింపుచూ వుంచున్నది. సమస్త విధములయిన దేహములను ధరించి పొషించే శక్తి పృధ్వీ మహాభూరముదేకాని యితర మహా భూతములది కాదు. అందుకు దృష్టాంత మేమంటే మనుష్యులేమి, మృగాదులేమి, పక్షులేమి అన్ని జాతులున్ను వాటి పిల్లలను, గుడ్లను భూమి ధరింఛేపాటి పక్వమయ్యే వరకు మనుష్యులు విత్తనములు భూమిలో చల్లేటందుకు ముందర కొంతసేపు కుండలో నానవేసి వుంచి నట్తు కొంతకాలము జంతువులు బీజములను వాటి స్త్రీజాతి గర్భాలలో వుంచుకుని అవి భూధారణకు పక్వములు కాగానే యీశ్వరాజ్ఞ చొప్పున భూమిమీద ఆయా స్త్రీ జంతువులు వుంచుచున్నవి. అది మొదలుగా పృధివీ భూతము వాటినన్నిటిని యింకా తన మీద వుంచబడే యితర బీజములనున్ను అంకురాలం ఛేసి తర్వాత ఆ వృక్షాదులను, సస్యాదులనున్ను బెంచి మనుష్యులకు, జంతువులున్ను అనుభవించేటట్తుగా యీశ్వరాజ్ఞ చేత కాపాడుతూ వస్తున్నది. యీప్రకారము వుత్పత్తి అయిన దేహములు పెరిగి పుష్టిని పొందక బీజప్రదానము చేయలేక వుండేకాలము బాల్యదశగానున్ను, పెరిగి పుష్టిని పొంది బీజప్రదానము చేయ నిచ్చయించే కాలము యౌనదశగా నున్ను తర్వాత బేజొత్పత్తి చేయగలకాలము కౌమారదశగానున్ను, తదనంతరము విరామకాలము వార్ధకదశగానున్ను ప్రత్యేకముగా అనుభ్వించడానకు హేతు లైనవి. కాష్టములో అగ్ని ప్రవేశించినట్టు ఆత్మాంతరాత్మలు దేహాలలోప్రవేశించి వుంటారు గనుక కాష్టము వంగితే ప్రవేశించిన అగ్నిన్ని వంగినట్టు ఆత్మాంతరాత్మలు దేహసంబంధ మైన దశలను దేహాలు అనుభవించేటప్పుడు తామున్ను అనుభవించేవారివలె అగుపడుతారుగాని, ఆనాలుగు దశానుభవాలు ఆత్మాంతరాత్మలకు యెంతమాత్రమున్ను వాస్తవముగా లేవని తెలియబడుచున్నది.

దేహులయొక్క దేహాలలో సత్వరజస్తమోగుణములు మూడున్ను భిన్నములై వుండవలసినదేమనిన్ని, వాటి ప్రవృత్తి నివృత్తులకు కారణ మేమనిన్ని విచారించగా సాత్వికగుణము ఆభాసమయితే రాజసగుణముగా పరిణమింపుచున్నది గనుక నున్ను రాజసము ఆభాసమయితే తామసముగా పరిణమించడము దృష్టాంతము గనుకనున్ను, సత్వగుణ ప్రధాను డయిన పరమాత్మ ఆత్మలో భాతిఅయి ఆభాతే అంతరాత్మ అయినది గనుక పరమాత్మవల్ల అంతరాత్మ జనించినట్టు సాత్వికమువల్ల అంతరాత్మ స్వభావమయిన రజోగుణము దేహములో వుత్పత్తి అయినది. అంతరాత్మజననద్వారా ఆత్మకు చైతన్యప్రభావము కలిగినది. గనుక ఆచైతన్యము అంతరాత్మయొక్క ఆభావమైనందున రాజసగుణాభావముగా వుండే ఆత్మస్వభామైన తామస గుణము దేహములో జనించినది. ప్రకృతి దేహములలో పరమాత్మ - అంతరత్మ -ఆత్మ యీ ముగ్గురి వ్యాపకము సిద్ధముగా నుండుటచేత వారి ముగ్గురిస్వభావాలైన సత్వర్జస్తమోగుణాలున్ను వ్యాపించి యున్నవి. తమోగుణ జన్య మైనవి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు, వీట్లను సాధారణముగా అరిషడ్వర్గము లనుచున్నారు. రజోగుణజన్యములు అహంకార మమకారాలు. సత్వగుణజనములు శాంతి దాంతిక్షములు, ఆత్మకు అంతరాత్మద్వారా చైతన్యముకలిగినదనే తెలివి ఈశ్వర్కటాక్షము చొప్పున కలిగేవరకు దేహియొక్క దేహములో తమోగుణప్రవృత్తి కలిగి ఆత్మ అరిషడ్వర్గాలచేత బహు బాధపడుతూ వుంచున్నది. అటుతర్వాత పరంపరగా అంతరాత్మకున్ను, నాస్థితికి కారణము పరమాత్మేగదా. నేను యే పాటివాడను? జలబుద్బుద వత్తనే తెలివి కలిగేవరకు రజోగుణానకు ప్రవృత్తి కలిగి నాకు సమానులు వొకరుకద్దా నేను శాసాపనులు చేసినారు, యింకా చెయగలుగుదును, అంటూ అహంకార మమకారాలచేత అంత రాత్మ వ్యధపడుతూ వుంచున్నది. పైన వ్రాసిన తెలివి అంతరాత్మకు కలిగి అంతరాత్మ ప్రకోపము అణిగిపోగానే పరమాత్మ యొక్క దీప్తిస్ఫరత్తుగా ప్రకాశించి సత్వ గుణ ప్రధానమై తజ్జ్స్యమైన శాంతి దాంతి క్షమాదులు ప్రవృత్తిని పొంది వుంచున్నదవి.

సపుంసక లింగము వుల్లింగము స్త్రీ లింగ మనే లింగ త్రయము వాచకము లేల పుట్టినవి? వేటికి ఆ వాచకములు వాస్తవమూఅ వుపయుక్తము అని విచారించగా పరమాత్ముడు సృష్టినిమిత్తముగా వటబీజములో వటవృక్షము అణిగి వున్నట్టు ఆకాశభూత స్వరూపముతో సమస్తములో అణిగినాడు గనుక, అట్లా అణిగిన వస్తువులన్ని బీజాలు అనిపించు కున్నవి గనుక వాటిని నపుంసక లింగా లని చెప్పవలసినది. అటువంటి బీజములను తానే ధరించి అంకురోత్పత్తి చేసే నిమిత్తము గర్భములో వుంచతగిన దేహముల నంతా పుల్లింగములుగా చెప్పవలసినది. అటు చేయబడే బీజప్రదానాలను భక్తి శ్రద్ధలతో ప్రతిగ్రహించి గర్భములో భద్రపరచి అంకురోత్పత్తి పూర్తి కాగానే మహా స్త్రీలింగభూతముగావుండే పృధ్వియొక్క అధీనము చేయుచు వుండే దేహాములంతా స్త్రీలింగములుగా చెప్పవలసినది. యీ లింగత్రయము పైన వ్రాసిన దేహములను విభజనచేసి వ్యహరించను జన్యమైనది గనుకనున్ను నపుంసక లింగవాచక యోగ్యమైన బీజాలు అదృశ్యాలు గనుక స్త్రీలింగ పుల్లింగ వాచకములు ఆకాశ మహాభూతము వాయుమహాభూతమువల్ల చేయబడ్డ సృష్టికోటికే వుపయోగములు గాని మిగిలిన భూతత్రయముయొక్క సృష్టికోటిమి లింగవిభజన లేదు గనుక వుపయోము లేదు. అయితే మానుషకోటి తమయొక్క సమయ సంకేతాలనే శాస్త్రములద్వారా అటువంతి సృష్ట్యంతరములగుండా స్త్రీలింగ పూర్వకమయిన నామధేయములు వుంచి వాడుకొనుచున్నారు.

పయిన వ్రాసిన ప్రకారము లింగవాచకములు వుత్పత్తి అవుట చేతనే శాక్తమతస్థులు సర్వం శక్తిమయం జగత్ అని చెప్పేమాటము బంకరముగా ఆత్మ - అంతరాత్మ - పరమాత్మ యీ ముగ్గురికిన్ని ఇచ్చా శక్తి - జ్ఞాపకశక్తి - పరాశక్తి అని నామాంతరాలు వుంచినారు. యీ మూడువస్తువులు వాస్తవమూఅ స్త్రీలింగవాచకములున్ను పుల్లింగవాచకములున్ను కాక శుద్ధ నపుంసక లింగవాచకాలు అయివుండినా రామ అనేశబ్రములో రుద్ర సంబంధముగా వుండే అక్ష్రరము వున్నదని దశరధనందను డని చక్రవర్తి తిరుమర్హి అని రాముడికి వైష్ణవులు పేరుపెట్టి నట్తున్ను, శైవు డయిన అప్పయదీక్షితులు వగయిరాలు నారాయణ అనే నామాన్ని శైవపరముగా అర్ధముచేయును మిక్కిలి హింసపడ్డట్టున్ను ఆత్మ - అంతరాత్మ - పరమాత్మ - అనే వాచకములు పురుషపరముగా వున్నదని శాక్తులు స్త్రీపరముగా నామాంతరాలు వుంచినారు.

ప్రకృతి దేహములలో కొందరిని దేవతలుగానున్ను కొందరిని రాక్షసులుగానున్ను కొందరిని మనుష్యు మొదలయిన వారుగానున్ను భేదము కలగఛెసి అటువంటి తెగలలొను ప్రతి తెగకు అనేక ప్రకృతి భేదములుగా పరాత్పర వస్తువు సంకల్పము చేయవలసిన దేమని విచారించగా సృష్టి సంకల్పము అబాజ్మానస గోచరమైన వస్తువుకు పుట్టడము చిద్విలసాల్ర్థము గనుక సృష్టిని అంఖండమున్ను, యేకాకారమున్ను చేస్తే రసము పుట్టదు. అందుకు దృష్టాంత మేమంటే మనుష్యులు తమ నకలుగా విలాసార్ధమై వొక మేళము జతపరచి నత్రనము చేయించి వేడుక చూచేటప్పుడు అందరున్ను వొక్కతాళము నేవాయించితే రనముగా వుండ దని, ఆడేటట్టుగా వొకరిని నియమించి, సుతిఎనిమిదిపట్టడానకు ప్రత్యేకముగా వుండేటట్టుచేసి మళ్ళీ అందరిని వొక తావులో చేర్చి వొకనికి వొకణ్ని పైపోటీచేసి తన్నే శాబాను అన వలెనని ప్రతిపురుషుడు తనకు నీమకమయిన వాద్యాన్ని శ్రావ్యముగా వాయింపుచునుంటే యెట్లా మనమువారి యితరేతర ధిక్కరాలను పరస్పరానుకూలతనున్ను చూచి ఆనందిసారేమో తద్వత్తుగా సరోత్తమమయిన వస్తువు యీదేహములనున్ను వాటిలోని ప్రకృతులనున్ను భిన్నములుచేసి వారి మనస్సు వాక్కు- కాయములు - కర్మములద్వారా వారు చేసే చేష్టలను చూచి ఆనందింపుచున్నది.

సప్తగ్రహముల పేళ్ళతోవుండే బృహస్పతి, శుక్రుడు మొదలయిన వారిని సప్తబ్రహ్మాండములనే చెప్పవలని. ఆపేళ్ళు గలవారు బ్రహ్మాండ స్వరూపులయితే యీ బ్రహ్మాండానికి వచ్చి శృతులకు వ్యాఖ్యానమయిన స్మృత్లుచేసి యీ బ్రహ్మాండము వదలి దేవతలు, తోరాక్షసులు మనుష్యులతోను వారు సహవాసము యేట్లా చేసినారని యోచించి విచారించగా పరమాత్మ జ్యోతిర్భూత మయిన సూర్యుణ్ని రూపములయిన జ్యోతిస్వరూపలు గాక రాత్రిళ్ళు భూపతన మవు తూవుండే కొన్ని తేజస్సమూహాలు నక్షత్రాలుగా తోచబడుచున్నవి. అవి భూమిని అగుపడే మిణుగురులవలెనే భేచరమార్గముతో వుండే మిణుగురులు గాని నక్షత్రములు గావు గనుక నున్ను ఆ మిణుగురులు బృహత్తులు గనుకనున్ను అవి అధోభాగమునందు పడేటప్పుడు ఆ బృహత్తులయిన మిణుగురులు నక్షత్రములవలెనే మనకు అగుపడుచూ వుండుటచేత మిరియాలలో నుండే నల్లరాళ్ళను వాటి యేకరాశి గతివల్ల వాటి సమూహదర్శన మైనప్పుడు రాళ్ళను మిరియాలనుకున్నట్టు ఆ బృహత్తులైన మిణుగురులను నక్షత్రములని భ్రమ పడవలసియున్నది.

యిటువంటి అనేకకోటి బ్రహ్మాండములలో కొన్ని బ్రహ్మండములయిన బృహస్పతి మొదలయినవారు తృటికాలముకూడా జ్యోతిర్భూతమునకు చేసే ప్రదక్షిణము భంగము కాకుండా తిరగవలసిన వారై వుండగా వారు యీ బ్రహ్మాండమునకు పురుషాకృతితో వచ్చీయిక్కడి పిండాండాము లయిన మనకు స్మృతులు చేసి యిచ్చి హెతవు యెట్లా ఛేయగలుగుదురు! గనుక, వాటి వాస్తవము యేమంటే భృగు బృహస్పతి మొదలైన వారు మన ఆపేక్షయా దేవతలు గనుకనున్ను స్వేచ్చావిహారులై మన స్వూర్యుణ్ని ఆశ్రయించి వుండే కొన్ని బ్రంహ్మాండములకు వెళ్ళుతూ వాటిలొ విస్తారముగా వసింపుచున్నందున నవాబు వసించే పెటను నవాబుపేట అని గుర్తు నిమిత్తము నవాబు పురస్సరముగా పేటను తెలియ చేసినట్టు బృహస్పతి మొదలైన వారి గమనాగమనములు పట్టి జ్యోతిశ్శాస్త్రములో గ్రహగతులు గణిత మూలకముగా నిర్ణయించబడమునకు గాను యీ మహా పురుషుల పేళ్ళనే ఆ బ్రంహాండములకు సంకేత వాచకములైన పేళ్ళుగా విర్ణయించి యుండవలె నని తొచుదున్నది.

నేను యెనిమిదో లంజం భాగలోవుండే కన్యాముమారి మొదలుగా యిరువైయారో భాగలో నుండే కాశీపట్టణమువరకు దేశాటనము చేయడములో అహ, ప్రమాణములు దేశదేశానకున్ను భేదింపుచు వచ్చుచున్నది. యీ ప్రకారము అహ, ప్రమాణములు దేశ దేశానకు భేదించడమునకు కారణ మేమని విచారించగా యీబ్రంహ్మాడము యొక్క మధ్యభాగమైన నిరక్షదేశములో రాత్రి పగలున్ను సరిగా ముప్పదేసి గడియల వంతున దిన ప్రయాణ మవుచున్నది. గనుక సూర్యోద యాస్తమయములు సమముగా అవుతూ వుంచున్నవి. అందుకు కారణము అక్కడి వారికి సూర్యబింబ దర్శానము వుదయకాల మందున్ను, అస్తమయ కాలమునందున్ను చక్కని అభిముఖము కావడముచేత అది మొదలుగా వుత్తరపు దిక్కు వుదయాస్తమయకాలములలో సూర్య్దర్శనము యధోచితమయిన పార్శ్వభాగముగా క్రంక్రమముగా అవుతూ వుండుటచేత బ్రంహాండము యొక్క వున్నత ప్రదేశములలో వసించే వారికి సూర్యదర్శనము అయ్యే ప్రమాణకాలము భూమియొక్క చక్రాకార చలనముచేత క్రమక్రమముగా తక్కువవుతూ వచ్చుచున్నది. యీబ్రంహ్కాండమునకు చలనశాక్తి కలిగి వుండడానికిన్ని, యీ బ్రంహాండము సూర్యబింబానికి ప్రదక్షిణము చేయుచూ వుండడానికిన్ని యీ అహ, ప్రమాణభేదము వొక్కటే దృష్టాంతముగా వున్నది. యిదిన్ని గాక యింగిలీషు దేశపు సముద్రసంచారులలో వొకడు యీ పరెక్షనిమిత్తము వొక ప్రదేశములోనుంచు కావలసిన రస్తు కొన్ని సంవత్సరములకు వాడలో వుంచుకొని తూర్పుగా పోతూవుండేటట్టు వాడని సాగిస్తూ వచ్చినాడు. తూర్పుదిక్కు ఫలాని దనే జ్ఞానము సూర్యోదయమువల్లనే పుట్టుచున్నది గనుక ప్వత్యహము సూర్యోదయమును పట్టి తూర్పు తెలిసి పోతూవుండే కొద్ది సుమారు కొన్ని సంవత్సరములలో బయిలువెళ్ళిన స్థలమే చేరినాడు. అట్లా యెందువల్ల బయలు వెళ్ళిన స్థలమే ఆ పురుషుడు చేరినాడంటే బ్రంహ్మాండములో నొకపక్క వసించే వారికి తూర్పుదిక్కు బ్రంహ్మండముయొక్క చలనద్వారా వారి వృష్ణభాగమునందు వసించే వారికి ఆ తూర్పుదిక్కు పడమటి దిక్కౌతున్నది గనుక తూర్పూని తోచేప్రదేశమునుంచి బయలుదేరి అక్కడికి పడమర వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి తూర్పు దిక్కుగానుండే ప్రదేశమునకు తరులుతూ వస్తే బయిలు వెళ్ళిన తావు చేరడము వింతకాదు గదా! యీ దృష్టాంతము


పంతొమ్మిదవ ప్రకరణము  రాజమహల్ నుండి కలకత్తా

వల్లనున్ను యీ బ్రంహ్మాండమునకు చలనశక్తి కద్దనడానకు సందేహములేదు. గోళము తిరుగుతూవుంటే గోళముమీద నుండేవారికి నిలిచిన స్థలము కదిలికె అయితే తెలియదా అనిన్ని, గోళము తిరిగితే జంరువులు తలక్రిందుగా నడవా అనిన్ని కొందరు సందేహిస్తారు, ఆ సందేహము యెంతమాత్రము నిమిత్త్ములేదు, యెందువల్లనంటే పెద్దవాడలలో వుండేవారికే వాడనడవడము తెలియక వుండగా యింతబృహతైన గోళముమీద వుండేవారికి గోలచలనముయేట్లా తెలుసును గనుక? సూదంటు రాయిని పొడుగుగాయెత్తి కింద సూదిని వుంచితే భూమిని ఆధారముగా చేసుకొనివున్న సూది రాయిలోవుండే ఆకర్షణ మహిమచేత పైకిలేచి రాయిని అంటి వెలాడుచూ వుంచున్నదిగాని భూమిమీద పడదు గనుక, యీ గోళమునకువుండే ఆకర్షణ మహిమ చేత గోళము మీదనుండే సృష్టికోటి తలక్రిందుగా పడవలసిన నిమిత్తము యెంతమాత్రమున్ను లేదు.

మార్చినెల ఇరవై రెండు తేది బదరుగంజు అనే వూరు చేరినాను. యిదిన్ని పది అంగళ్ళుగల బస్తీవూరు. యీ బదరుగంజు నుంచి గంగాభవాని తూర్పుగా సముద్రగామి కావడానకు సాగిపోవుచున్నది. ఆపెద్దప్రవాహము గుండా కలకత్తాకు సాగిపోతే సముద్రములో ప్రవేశించి కొంతదూరము సముద్రములొ పడమరగా వచ్చి మళ్ళీ హుగ్గుళి అనే నది ముఖద్వారములో చొచ్చి దక్షిణముగా తర్లి కలకత్తాకు చేరవలచినది గనుకనున్ను అటు పోవడానకు యిలాగంటే బజరాలు మొదలయిన వావాలు నడిపేవారికి జీళ్ళ పొలుకువ తెలియదు గనుకనున్ను అటుపొవడము యిరివై దినములు చుట్టుగనుక నున్ను అటివెళ్ళే గంగాభవానిధార సుందరవనమనే అఘోరమైన యడివి మధ్యే పోతున్నది. గనుకనున్ను ఆ అడివిలో నుండే వ్యాఘ్రాదులు మదలైన దుష్టమృగములు మనుష్యులను బాధపెడుతూ వుండుటచేత గట్టున దిగడానకు సయిపు లేక వావాలమీదనే భోజన మజ్జనాదులు గడపవలోసినది గనుకనున్ను గంగాభనానిలోనుంచి హదరుగంజు అనే వూరివద్ద చీలి దక్షిణముగా ప్రవహింపుచూ కలకత్తాకు పొయ్యే జలంగి అనే పేరుగలిగిన గంగధారలో ప్రవేశించి కలకత్తాకు సాగి వచ్చినాను. యీ జలంగినది గంగాప్రవాహము తక్కువైన దినము లలో బహు హ్రస్వమై కొన్ని మిట్టతావులలో వొక మూర, వొకటిన్నరమూర లోతు వుంచున్నది. అట్టి తావులలో వస్తూవుండే వరకు నిండిన పడవలు నాగక దినాలవెంబడి సమూహములుగా నిలిచి, వచ్చేపొయ్యే పడవలకు దారికూడా లేకుండా నిబిడీకృతముగా వుంచున్నవి. అట్లా తక్కువ నీళ్ళు గల ప్రదేశములకు గట్టానా అని యీ నావవాండ్లు పేరు పెట్టినారు. అట్టి తావులలో వొక నిమిషమైనా ఆలస్యపడకుండా నాతోకూడావుండే మనిషికట్టుద్వారా సమీప గ్రామవాసుల సహాయద్వారానున్ను అక్కడా నిలిచివుండే నావ మల్లాలద్వారా నాబజరా వుల్లాకులతో యివతలికి సాగివచ్చినారు.

మార్చ్ది నెల ఇరవై మూడు తేది పటకాబాడి యనే గొప్పవూరు చేరినాను. యీ వూరుచెరేలోపల గట్టానాలు శానా తగిలినవి. యిది మొదలు జలంగినది పల్లపు ప్రదేశములో ప్రవహిస్తూ వచ్చినది గనుక నీళ్ళుకావలసినంత నదిలో వుంటూవున్నవి. యీ జలంగినది సర్పాకారముగా బహుచుట్టు చుట్టి ప్రవహింపుచున్నది. గనుక వుత్తరమునుంచి దక్షిణము పోవడములో మళ్ళీ మళ్ళీ వుత్తరమే చేరి, భోజనము చేసి వూరికి గట్టున రెండు గడియల దూరములో వుండేవూరు సాయంత్రము చేరుతు వచ్చినాము.

గంగాభవాని ప్రవాహము పుష్కలముగా వుండేకాలములో బదరుగంజుకు పడమరగా వుండే మౌర్హగంజు భగవ్రాగోలా అనే వూళ్ళవద్దనుంచి వొక ధారమక్కుషూరాబాదు, మూర్షిదాబాదు, కాసంబాజారు, కాసీంబజారు, బురంపూరు అనే మహర్లమీద వచ్చి యిప్పుడు నేను వచ్చే ధారలొ కృష్ణనగరు అనే వూరివద్ద కలియుచున్నది గనుక ఆ ధార కలకత్తా వెళ్ళడానకు నిండా సూటి యని ఆదారిని అన్నినావాలు వెళ్ళుతున్నవి. యిప్పట్లో ఆ ధారలో వుదకములేదు గనుక యీజలంగినదిగుండా అన్ని వానాలు వస్తూ పోతూ వుంచున్నవి. కొందరు యింగిలీషు దొరలు సుందరవనపు నరిధార పూర్వోత్తరములు తెలిసినవారిని కలకత్తాలో బజరాల మీద యెక్కించుకుని గంగాభావానిలో యీ నీళ్ళ తగ్గుసంబంధమైన శ్రమను పొందకుండా కలకత్ తనుంచి కాశికి ఢిల్లీ మొదలైన దేశములకు వెళ్ళుచున్నారు. యీ గంగామహానదిలో గొప్ప దేహములు కల మొసళ్ళు, కూర్మములు, మత్స్యములున్ను అమితముగా వున్నవి. వొక గొప్ప మత్స్యమును నా బజరామల్లాలు గాలమువేసి పట్టిరి. అది పురుష ప్రమాణము పొడుగున్ను, అందుకుతగ్గ లావున్ను గలిగి వుండినది. దాని కళేబరమును నాతోకూడావున్న పరిజనము సుమారు యిన్నూరుమంది రెండు మూడు దినములుగా భక్షణచేసినారు. యింత గొప్ప జలచరములు గంగలో వసించినా యెవరినిన్ని హింసపెట్టినట్తు యీవరకు వదంతి లేదు. సుందరవన మనే అడివిమధ్యే ప్రవహించే గంగలో సముద్రసంబంధమైన జలచర జంతువులుకూడా వచ్చి ప్రవేశించి వుంచున్నవి గనుక అవి మనుష్యులను బాధపెట్టుచున్నవని చెప్పుతారు. యీ జలచరజంతువులేమి, కౄరములైన స్థలచరజంతువులేమి వీటి ఆత్మలలో పరమాత్మ ప్రతిభాతి ప్రవ్యక్షముగాలేక వుండుటచేత జ్ఞానవిహీనమిలైన చిన్నదేహాలను పెద్దదేహములు భక్షణచేయుచూ యితరులకు వుపద్రవకరములుగా వుంచున్నవి. మనుష్యులు మాత్రము జ్ఞానయుక్తులై వుండేటందువల్ల పరస్పరభక్షణ లేకుండా, ప్రకృతిలేక యంత్రవత్తుగా వుండే అజ్ఞాన జంతు దేహములను దూరము విచారించి తమ ప్రభావము తెలుసుకునేదాకా భక్షిస్తూ జ్ఞానోదయము స్ఫుటముగా కలిగినవెనకగాని సంకేత బోధనవల్లగాని అటువంటి భక్షణలను చాలించి అగ్నిమహాభూతసృష్టితో చేరిన సన్యాదులు భక్షిస్తూ వచ్చి పిమ్మట తుర్యదశను పొందినవెనక హఠయోగరాజయోగలంబికా యోగములచేత తమలోని వాయువునే తాము భక్షణ చేయుచు దివ్యదేహధారణ చేసి వుంటారు.

యీ జలంగినది అనేక తిరుగుళ్ళుగా ముందువచ్చి వెనకకు పోతూ వుండే టందున యిందులో బజరామీద వచ్చేటప్పుడు బజరా తిరుగుడువల్ల సూర్యబింబము వొకపక్కనుంచి మరివొక పక్కకు ధర్మము లేదు గనుక సమస్త జగదాధార మయిన వస్తువు అవాజ్మానస గోచరమై శుద్ధశూన్యముగా ధ్యానించ పడి వున్నది. గనుక నున్ను నాస్తికులు ప్రపంచము యే స్వభావముచేత జరుగుచున్నదని అంటారో ఆ స్వభావాన్నే జ్ఞానులకు సహపాకులే గాని వేరే కాదు.

యేప్రల్ నెల ఒకటి తేది కృష్ణనగర మనే గొప్ప వూరు చేరి నాను. ఈ వూళ్ళో యిక్కడి రాజు అనే వొక జమీందారుడు వున్నాడు. శానా అంగళ్ళు వున్నవి. సకలపదార్ధములు దొరుకును.

యిక్కడ కంపెనీవారు వచ్చేవానాలు వగయిరాలకు వాటిదాంట్ల సంఖ్యమీద నున్ను, నావాల గాత్రములమీద నున్ను నిరుకులు యేర్పరచి టల్లా అనే తీరున తీస్తారు. ఆ సుంకము తీరువ వసూలు చేయడానకు వొక కలకటరు యీ వూళ్ళో వుంటాడు. ఆ టల్లా అనే తీరువ నిమిత్తము నా బజరాకు వుల్లాకు అనే వాడకున్ను యేడున్నర రూపాయి యిచ్చినాను. యీ ప్రకారము వసూలు చేసే తీరువ రూకలకుండా కంపెనీవారు శిబ్బంది వుంచి జలంగినది అనే పేరు కలిగిన గంగాదారలో నుంచి బదరుగంజు వద్ద చీలే ప్రదేశము మొదలు నదిలో మిట్టలు పెట్టకుండా సూత్రపు పడవలకుండా మన్ను యెత్తి పారవేసి నావాలు రావడానకు వయిపు చేయుచుంటారు. యీ జలదంగి నది ధార చిన్నది గనుక ఈ వుపాయము కంపెనీవారు చేయడము బహు అగత్యముగా నాకు తోచినది. మన్నుయెత్తే సూత్రపు పడవ వోకటి బదదుగంజువద్ద వున్నది. ఆ పడవకు గొప్ప పారచిప్పలను మాత్రము కట్టి తగిలించి వున్నారు. పడఫలలో మనుష్యులు సూత్రపు తాళ్ళు పట్టి యీడిస్తే ఆ పారచిప్పలు మన్ను తొవ్వి పడవలో తెచ్చి వేస్తున్నది. సూత్రపుపడవ తయారిచేయడానకు యిరువై వేల రూపాయలు ఖర్చుతగిలి వుండునని తోస్తున్నది.

సదరహీ కృష్ణనగరము దాటి రాగానే నదీయ, నద్య, అనిన్ని నవద్వీప మనిన్ని త్రినామము కలిగిన విద్యద్గ్రా మమువద్ద మక్కుషూదాబాదుకుండా వచ్చేభాగీరధిఅనే పేరుకలిగిన గంగధార కలియుచున్నది గనుక యిక్కడ నద్యామొదలుగా ధారగొప్ప అయి అరకోసువెడల్పున ప్రవహింపుచున్నది. ప్రవాహవులోతున్ను మిక్కిలీగంభీరమై వున్నది.

పయిన వ్రాసిన నదియ్య అనే గ్రామములో కొందరు జమీందార్లవల్ల కొన్ని పాఠశాలలు యేర్పరచబడి అందులో అనేక విద్యార్ధులను పోషించేటట్టు నియమముచేసి వున్నది గనుక గౌడులలోనున్ను, ద్రావిళ్ళలోనున్ను నన్నూటిదాకా సుమారు శాస్త్రపాఠములు చదువుకొంటూ వుంటారు. యిక్కడ శిక్షాధికారులు గౌడా బ్రాహ్మణులుగాని, ద్రావిళ్ళు కారు. వారి పాండిత్యము ప్రసిద్ధికెక్కి వున్నది.

యేప్రల్ నెల రెండు తేది శాంతిపూరనిన్ని సంతిపూరనిన్ని ద్వినామము కల విద్యద్గ్రామము చేరినాను. యిదిన్ని గొప్పవూరు. అన్నివిధాల నద్యాకు సరిపోలివున్నా విధ్యార్దులున్ను, శిక్షాధికారులున్ను మిక్కిలిలేరు. యీ శాంతిపూరుకు ముందు కలనా అనే గొప్పగ్రామమున్నది. యీవూరు మొదలుగా టెంకాయతోపులు, పోకచెట్లు నిండా చూస్తూవస్తాను. మనస్వదేశము వదిలిన వెనక యీవరకు యెక్కడా టేంకాయ తోపులు చూచినవాణ్నికాను. టెంకాయచెట్లు, పోకచెట్లు శానా ప్రదేశములలో లేకవుండినా ఆ ఫలములు అయ్యే ప్రదేశాములలో లేని దేశస్థులు తెప్పించుకుని అవశ్యము వాడికెలోకి తెచ్చుకుంటూ వున్నరు. యీ హిందూ దేశములో యీ వుభయఫలములకు యింత అవశ్యకత యీశ్వరుడు కలగ చేశినాడు.

నదియ్యా అనే గ్రామము మొదలు యీ గంగధారలో సముద్రము యొక్క పోటు పాటు ప్రత్యహము రెండుమాట్లు తగులుతూ దక్షిణము రాగారాగా ఆపోటుపాటు యొక్క జోరు అవుతూ వస్తున్నది. సకల విధమైన నావాలకు రాళ్ళతోను, మట్టితోను బళువుకలగచేసి లంగరు అందముగా కొయ్యలతో నద్యావద్ద కట్టి నావాలకు నిత్యము వేస్తూవస్తరు. లంగరులు లేకనే యీ వరకు నావాలను తాళ్ళతో గట్టున మేకులు పాతి దిగగానే బేపర్వాగా కట్తుతూ వచ్చినట్తు నద్యామొదలు రావడము లేదు. పోటుకు మనిషి పొడుగుకు అధికముగా నీళ్ళువచ్చి పాటుకు తీశిపోతూ వస్తున్నవి. యీ పోటు పాటు కాలములో కలకత్తకు పోవలసినవారు పాటులోను, అక్కడనుంచి వచ్చే వారు పోటులోను నవాలను నడిపిస్తూ వస్తారు.

తేది హుగ్గులీ అనే కసుబా బస్తీ చేరినాను. యిక్క్డ కలకటరు వగైరా అధికారస్థులున్నూ, శొంతదండున్ను వున్నది. యీ హుగ్గులీలో సుందరమైన యిండ్లు జాతులవారు గంగాతీరమునందు శానాగా కట్తివున్నారు.

తేదీ బారకుపూరు అని జాతులవాండలవల్ల చెప్పబడుతూ నల్లవాండ్లవల్ల ఆ చానక్కు అని చెప్పబడుతూ వుండే ద్వినామధేయము గల వూరు చేరినాను. ఈ బ్నస్తీవూరు కలకత్తతోచేరి కలకత్తను అందుకొని వున్నది. యీ బస్తీలో గౌరన్ మెంటు వారిది వొక గొప్ప యిల్లు తోట బహుసుందరముగా కట్టించబ్నడివున్నది. యిక్కడ కొంత దండుకూడావున్నది. యీ బస్తీ కలకత్తకు సమీపముగా మూడు కోసుల దూరములో వున్నది గనుకనున్ను, విశ్రాంతి ప్రదేశాముగనుక నున్ను యిక్కడ అనేకులు సౌఖ్యార్ధముగా మంచితోటలు, యిండ్లు బంగాళాలు కట్టించివున్నారు. అందులో గ్రీష్మకాలములో కలకత్తా నివాసులైన గొప్ప దొరలు వచ్చి వాసము చేస్తూ వుంటారు.

యీ వూరికి యెదురుగా నదికి అవతలపక్కను శ్రీరాంపూరు అనే వొక వొలందావారి కసుబాబస్తీ గ్రామము అనేకమయిన గొప్ప మిద్దెలు కలిగివున్నది. హుగ్గుళిమొదలుగా ఆచానక్కువరకు నదికి యిరుపక్కలా యిండ్లు, తోటలు, మిద్దెలు అసంఖ్యముగా కట్తివున్నవి. అందులో కొన్ని బస్రీలు ఫ్రాంసువారివిగానున్ను కొన్ని డెన్మారు కు వారివిగా నున్ను, కొన్ని డచ్చివారివిగానున్ను ఆద్యాపి ఆ యా జాతి వాండ్ల యేలుపాటులో వున్నవి గనుక నొచ్చి పొయిన బంగాళాదేశస్థులు యింగ్లీషువారిన్యాయ ప్రకారము అప్పులవారి నిమిత్తము కలిగే రాజదండనవల్ల తప్పించుకొనే కొరకు చెన్నపట్టణమువద్ద పులిచేరికి వంజినది. మాయాశాక్తి దుష్ట నిగ్రహార్ధము మహాకాయము ధరించి దుష్ట నిగ్రహము అయిన వెనుక తన మహాకాయము తనకు అసహ్యముగా తోచినంతలో తన చైతన్యాన్ని సౌమ్యకాయము సృష్టించుకొని అందులో ప్రవేశపెట్టి లోగడి మహాకాయమును వదిలి నంతలో మహాశక్తి నాధుడైన సాంబమూర్తి ఆ మహాకాయ మోహితుడై ఆ మహాకాయమును చంకపెట్తుకొని పరవశుడై దేశాటనము చెస్తూ వచ్చినట్తున్ను లోకశిక్షకులలో వొకడయిన అతను పరవశుడైవుండుటచేత లోకమునకు క్షేమవిరోధ మయినట్టున్ను లోకరక్షకుడయిన విష్ణువు లోకముయొక్క క్షేమముకొరకు చక్రాయుధధరుడై, అటుతిరుగుతూ వున్న సాంబమూర్తిని వెంబడించి అతని చంకనుండే కళేబరమును చక్రాయుధముతో తునకలుగా కత్తిరించుతూ వచ్చినట్టున్ను అవి భూమిలో రాలుచు వచ్చినట్తున్ను అటుక త్తిరించిన తునకలలో యీ కలకత్తాలో ఆ మహాకళేబరము యొక్క చేతివ్రేలు పడ్డట్టున్ను యిక్కడికి వుత్తర దేశమందుండే కామరూప దేశములొ యోనిపడ్డట్టున్ను యింకా యితర ప్రదేశములలో అనేక అవయవాలు పడ్డట్టున్ను అటు అవయవాలుపడ్డ ప్రదేశములంతా శక్తి ప్రత్యక్షకరములై ఆరాధించిన వారికి అబీష్టసిద్ధులు చేస్తూ వచ్చేటట్టున్ను యిక్కడి స్థలపురాణ మహిమ గనుక యీ కలకత్తా షహరుకు మూడుకోసుల దూరములో దక్షిణభాగమందు ఒక కాళీ గుడి వున్నది.

ఆ గుడి దక్షిణదేశమువలెనే నిండా సుందరముగా కట్టివుండక పోయి నప్పటికిన్ని విశాలమైన గర్భగృహము ముఖమంటపము కలిగి వున్నది. ఆ గుడిసమీపముగానే గంగవాగు వకటి పారుతూవున్నది. ప్రతిదినము ఆ శక్తిని యీ దేశపు బ్ర్రాహ్మణపండ్యాలు పూజ చేయుచు వుంటారు. మేకలను, మేకపిల్లలను లోకులు ప్రతిదినము తెచ్చి బలులు యిచ్చి పోతారు. శుక్రవారము, ఆదివారము విశేషబలులు పూజలు జరుగుతున్నవి. నవరాత్రిళ్ళలో యిక్కడ మహోత్సవమును జరిగించి యీ దేశములో మహిషములు లేకపోయినా దేశాంతరాలలొ నుంచి అనెకములుగా తెప్పించి యీగుళ్ళలొ నున్ను వారివారి యిండ్లలొ పెట్టి పూజచేసే బింబాల ముందరనున్ను బలులు యిస్తారు. యీ కలకత్తాలోనున్ను చుట్టుపక్కలనుండే బంగాళీ దేశాస్థులకు యిక్కడ విలశిల్లివుండే కాళి ప్రత్యక్షదేవతై వారిభక్ర్తిని మిక్కిలిగా ఆకర్షిస్తూ వున్నది. యీ గుళ్ళో వుండే కాళిప్రతిమ బహుస్థూలముగా వున్నది. బహుమంది గుళ్ళలో పునశ్చరణ చేయుచుంటారు. గుడిచుట్టూ పూజాదిద్రవ్యాలు అమ్మే అంగళ్ళు శానావున్నవి. జపాకుసుమాలు సంపెంగలు వగయిరా పుష్పాలు మనిషి చెయ్యెత్తు పొడుగున మాలలు కట్టి అపరిమితముగా సదా అమ్ముతూ వుంటారు. ముప్ఫయి రూపాయిలలో వస్త్రసమేతముగా షోడశోపచార పూజ అవుతున్నది. భిక్షుకులు బ్రాహ్మణులుగా నున్ను కంగాళీలుగా నున్ను ప్రతిదినము వెయ్యింటికి తక్కువ లేక గుడిచుట్టూ వుంటారు. యీ దేశమందు గవ్వలు మరడముచేత పిడికిడేశి గవ్వలు యిచ్చినా యిరువై రూపాయలు దక్షిణకు పట్టుచున్నవి. పూజ చేసే లోకులు మిఠాయి మొదలైన పక్వపు పదార్ధములు పండ్లు పచ్చిబియ్యమున్ను నైవేద్యము పెట్టుతారు. గుడి పూజారులు నిత్యము పక్వాన్నము మొదలయినవి నైవేద్యముచేసి, తాము తిని బ్రాహ్మల కిస్తారు. దేవీప్రతిమను సువర్ణముతో దావుడు నాలికెను చేసి యెనిమిది భుజములు కల్పించి లలాటమందు సిందూరము వుంచి భీకరాకారముగా అలంకరించి వుంటారు. ముఖమంటపముకన్నా గర్భగృహము, రొమ్ముల లోతు పల్లములో వుంచున్నది. నవరాత్రిళ్ళలో ఈ బంగాళీదేశస్థులు భీకరాకృతిగా మృత్తుతొ దేవి ప్రతిమలుచేసి వాటికి వర్ణరేఖలు మొదలయినవి పూయించి వుత్సవానంతరము విభవముకొద్ది వూరేగింపుచేసి గంగలో కలుపుతారు. ఆ వుత్సవాలకు మద్యపానాలు వేశ్యలపొందున్ను బహుశా జరిగి చూడ వింతగా వుంచున్నది. ఆ విభవము మతాంతరస్థులకు యీ మతస్థులను నింద చేయడానకు ప్రబలమైన ఆకరముగా వున్నది.

యిది కన్యాకుమారీ క్షేత్రమంటారు. యిక్కడ పురుషులు స్ఫురత్తులేక దీనత పొందివుంటారు. స్త్రీలున్నూ నిండా సౌందర్యవతులుకారు. పన్నెండు మూరల బట్టతో దేహాచ్చాద్నమంతా చేసి తల మీద ముసుకుకూడా వేసుకుంటారు గనుకనున్ను రవికెలు తొడిగే సంప్రదాయము లేదు గనుకనున్ను అవయవాలు పూరాగా కప్పబడి వుండడములేదు,. పుల్రుషుల దీనత్వమున్ను, స్త్రీల ఆచ్చాదనమున్ను మళయాళానకు సరిపోలివుండినా స్త్రీల సౌందర్యముమాత్రము వ్యతిరిక్తముగా లోపముపడివున్నది. బంగాళీభాష హిందూస్థాని అభాసముగా బడా అండాకు బోడా అనే వతుగావున్నది. బంగాళీ అక్షరాలు దేవనాగరానకు కొంచెము భేదము కలిగివున్నవి. పురుషులు కృశాంగులు గనుక ప్రయాసకు యెండకు వోర్చలేరు. శైత్యోపచారాలు తైలలేపనము ప్రత్యహముచేసి శీకాయ మొదలయిన నూనె పొయ్యే పదార్ధాలతో తోమి కడగక నేస్నానముచేసి వొళ్ళు తుడుచుకుంటూవస్తారు. శీకాయ యిప్పపిండి మొదలయిన పదార్ధాలు యీ దేశమందు దొరకవు.

యీ దేశాన్ని గౌళదేశమనిన్ని, విరాట దేశమనిన్ని చెప్పుతారు. యీ దేశమందు శిష్టులయిన బ్రాహ్మలుకూడా సహజముగా మత్స్యభక్షణ చేయడముమాత్రమే కాకుండా యిచ్చటి వారు సకల బ్రాహ్మణులున్ను ఆరీతినే చేస్తూ వుందురనే సిద్ధతాత్పర్యులై నావంటి విహితులు తటస్థమైనప్పుడు లేతమత్స్యకలేబరాలను యితర భక్ష్యయోగ్య పదార్ధాలతో కూడా పంపిస్తూ వస్తారు. యిక్కడ పండితులకు ద్వైత సిద్ధాంతము కలిగి గౌతమ వైరచితమయిన న్యాయ శాస్త్రములో చాలా పరిశ్రమకలిగి వున్నది. యీ దేశస్థులకు స్నాననియమము దేశాచారములు చాలా కలిగివున్నవి. స్యయ్ంపాక నియమమున్నూ కలిగివున్నది. వుప్పునీళ్ళు కలియని పక్వాన్నాలు వ్యవస్థ లేక పుచ్చుకొని భక్షిస్తున్నారు.

సంవత్సరముల కిందట యీ దేశపురాజు వొక యాగము యత్నముచేసి నిర్వహించను సమర్ధులు యీ దేశపు బ్రాహ్మలలో లేనందున గంగా యములమధ్య ప్రదేశ నివాసులయిన కాన్యకుబ్జులను అయిదు గోత్రాలవారిని యీదేశమునకు పిలువనంపించి ఆ యాగము సాంగముగా కాచేసుకొని ఆ అయిదు తెగలవారిని యీ దేశములో నిలుపుకో వలెననే తాత్పర్యముతో వారిని కులీనులని ప్రసుద్ధ పరచినాడు. యీ కులీనుల కూటస్థులు యీ దేశములో ప్రవర్తించిన వెనుక కొన్ని జాతినియమాలు ఆచారనియమాలు కలగచేసినారు. అందులో కొన్ని సువర్ణపు పనులు సువర్ణవ్యాపారాలు చేసేవారు బనియాలనే జారిని స్వర్ణస్తేయము సురాపానము మొదలైన పంచమహాపాతకాలు శాస్త్రచోదితములై వుండుట చేతనున్ను, యీ సునారుబనియాజాతి యేవిధముగా స్వర్ణ స్తేయము చేయకనే విధిలేని వారుగనుకనున్ను ఆ జాతిని అతినికృష్టముచేసి పెట్టినారు. తదారభ్య అదేరీతిని నికృష్టులయి వున్నారుగాని దక్షిణదేశపు కంసాలజాతివలెనే బ్ర్రాఃమలకు సమము కావలెననే ప్రయత్నము కలవారయి యేమాత్రము వుండలేదు.

యీ బంగాళీ దేశములో వంశావళీ పరంపర ఆయా తెగది ప్రత్యేకముగా వ్రాశివుంచగలందులకు తెగకు కొన్ని కుటుంబాలను ఘటికులని యేర్పరచి వుంచి వున్నారు. వివాహాలు తటస్థ మయి నప్పుడు ఆకవిలెలు వ్రాసేవారిని పిలువనంపించి యోచించి ఆ ఘటికులు సమ్మతించిన వెనక ఫలానివాడికి ఫలాని చిన్నదాన్ని యివ్వవలసినది నిశ్చయము ఛేయబడుచున్నది. యీ సంప్రదాయము దక్షిణదేశములో నందవరీకుల కులాచారాలకు సరిపడుతున్నది.

యీ దేశములో వివాహాములు విషయమందున్ను అపరవిషయముల యందున్ను ధనికులకు విశేష వ్రయముచేసే సంప్రదాయము కలిగి యున్నది. పూర్వాపరాలు చేయించడములో మంత్రబాహుళ్యము లేకపోయినా తంత్ర బాహుళ్యము చాలాగా కలిగి మళయాళదేశము వలెనే శుభాలు ప్రసక్తి అయినప్పుడు స్త్రీలు కొళాలి అనే ధనిచేసే వతుగా కంకారానము చేస్తారు. అనుగమనాలు స్త్రీలు చేయడము యీ దేశములో యీ వరకు బహు విస్తారముగా జరుగుతూ వచ్చినది. అని భక్త విషయములో కూడా యీ దేశమందు స్త్రీలకు భాగము కద్ధు. రఘునందనుడనే వొక పురుషుడు చేసిన పునస్మృతిని యీ దేశములో నిండాగా వాడుకుంటారు. తంత్రజ్ఞులని పేరుపెట్టుకొని శాక్తమతస్థులు కొందరు ప్రబలి వున్నారు.

నద్యా శాంతిపురము మొదలుగా వుండే యిండ్లు పూరియిండ్లు కము చేసుకునేటట్టు వునికి పట్టుకు కొంత భూమి యిచ్చి యెగుమతి దిగుమతి సరుకులమీద నూటికి యింత అని తీరువ సుంకము మొకరరు, నిర్ణయము, చేస్తే మా యింగిలీషు జాత్రివారికి క్షేమము కలగుచున్నది, యింతకు మిక్కిలి బహుమానము నాకు యేమి అక్కరలేదని మనివి చెసుకున్నంతలో పట్నా షహరు ప్రభువు ఆ డాక్టరుయొక్క సామర్ద్యానికిన్ని నిస్పృహతకున్ను సంతోషించి అప్పుడే పరవానా డాక్టరు కోరిన ప్రకారము వ్రాసి యిచ్చినాడు. తదనంతరము, కాళీ గుడివద్ద కొన్ని గుడిశెలు వుండగా ఆ స్థలములలో ప్రవేశించిన తర్వాత హుగ్గులియనే సమీపపు వూళ్ళో గిడ్డంగీలు యిండ్లు మొదలైనవి కట్టుకొని యింగిలీషు వారు వర్తకము చేయుచూ వచ్చినారు. తర్వాత మక్కుషూదాబాదు, మూర్షిదాబాదు, లోని అధికారస్థునికి ఢిల్లీ పాదుషాకుండా మొక్త్యారు అధికారము కలిగి యీ దేశము అతని అధీనమై ఆ అధికారస్థుడు, యీదేశములో పూర్వపు కాపురస్థులైన ప్రాంచువారి బోధనవల్ల యింగ్లీషు వారిని యెక్కువ తీరువ యివ్వమని నిర్భందపెట్టి పట్నా అధికారస్థుడు వ్రాయించి యిచ్చిన ఫరవానా పాదుషాదికాదు అనే షరా మీద యిక్కడా యింగిలీషు వారికి వుండరాములు చెసినంతలో యింగిలీషు వారు ఒక డాక్టరు సమేతముగా డిల్లి పాధుషాతో మొరపెట్ట్లుకునేటందుకు వెళ్లినారు. అప్పట్లో యీశ్వర ఘటనచేత ఢిల్లీ పాదుషాకు దేహము స్వస్థములేక యత్నము చేసిన వివాహము కూడా నిల్చివుండేటట్టు ప్రసక్తి అయి యింగిలీషు డాక్టరు వచ్చివుండే వైనము తెలిసి పిలువనంపించినాడు. యీశ్వరుడు ఆ డాక్టరుమూలమగా పాదుషాకు దేహముకుదిర్చి యింగిలీషువారి అభీష్టమును పాదుషా పరమానా మూలకముగా సిద్ధి చేసినాడు. ఆ ఫరమానా ప్రకారము కొంచెము దినములు నడిపించి మళ్ళీ మక్కుషాబాదు అధికారస్థుడు తిరగబడినందున యింగిలీషువారి నిభాయించ లేక కొందరు తమవారు వుండే చెన్నపట్టణముచేరి శీమరాజుకు అర్జీ యిచ్చుకున్నంతలో శీమరాజు తమ జాతివారి క్షేమముకొరకు కొన్ని యుద్ధపు వాడాలను ఫౌజుబందితో కూడా కలకత్తకు పంపించి చెన్నపట్టణపు గౌవరుమెంటువారిని కుమ్మక్కు చెయ్యమని వుత్తర్వు చెసినందుననున్ను యిరుపక్కలా భూమి ధనురాకారముగా వుండే సముద్రోదకము గంగా సంగమమయ్యే భాగీరధిలో వూరాగా లోచొచ్చేటట్టు యీశ్వర నియమనమయువున్నది. గనుక ఆ భాగీరధి కుండా యుద్ధపువాడలు హుగ్గులీ ప్రవేశించి ప్రాంసువారు వాసము చేయను కట్టుకొనివుండే కోటను వూరినిన్ని తీసుకునియింతలో మక్కుషూబాబాదుపై యుద్ధముచేసి వాన్ని స్వాధీనముచేసుకొని *కుమ్మక్కు చేసిన హస్తాంతరమయినవానికి అప్పట్లో ఢిల్లీపాధుషా దొరతనము ఆరాజకమై వుండగా అందులో పట్టాభిషేకము చేసి ఇంగిలీషువారిలో అప్పటికి యుద్ధప్రసక్తికి నిలిచిన దొరలు కావలసినంత ధనము కొత్త ప్రభువువల్ల పుచ్చుకొన్నారు. అదిమొదలుగా కలకత్తా కోటయున్ను వూరున్ను బస్తీ అయినది.

యింగిలీషు జాతివారు యీశ్వర కటాక్షమునకు పాత్రులయ్యే కొరకు వాక్యమందు ప్రయాణికులై నందున వర్తకులు ధనికులున్ను అనేక హింసలుగల చుట్టుపక్కల రాజ్యములు వదిలి కలకత్తా బ్నస్తీ ప్రవెశించినారు. యిప్పటికి కోట్యంతాధారులుగా వుండే హిందువులు కలకత్తాలో పదిమంది అయిదుమంది వున్నారు. యిరువై ముప్పై లక్షలు కలవారు నూటికి యిన్నూటిటికిదాకా వున్నారు. యీకలకత్తా బస్తీ యీ చొప్పున నవీనమైనందున గొప్పవారి యిండ్లన్ని యింగిలీషు తరహాగా కట్టివున్నవి. వొక మాత్రపువారి యుండ్లు యెంతమాత్రము బాగులేక యింగిలీషు డౌలుతో హిందూతరహాకూడా కలిసి వొక వికారమగా కట్తివున్నవి. కలకత్తాలో కోటచుట్టూ యైస్ల్చ్దానేడు అనే కొంత బయలు విడిచి అవతల యింగిలీషువారు రెండు మిద్దెలకు తక్కువ లేకుండా అయిదు అంతస్థులకు ఎక్కువలేకనున్ను గొప్పయిండ్లు అనేకముగా కట్టివున్నారు. యిక్కడికి జాతూలవాండ్లు చెప్పడ మేమంటే కలకత్తా యిండ్లు రాజునగళ్ళు అనిన్ని, చెన్నపట్టణపు ఇండ్లు బంగాళాలు అనిన్ని ప్రతిష్టగా చెప్పుకుంటారు. కలకత్తా గౌర్నమెంటు యిండ్లంత

*మూర్షిదాబాదు నవాబు సురాజుద్దౌలా క్రింది యుద్యోగి మీర్జాఫరు స్వామిద్రోహముచేసి యింగ్లీషువారితో చేరగా పదిహేడు వందల యాభై ఏడు లో ఇంగ్లీషువారు ప్లాసీయుద్ధము గెలిచి మీర్జాఫరును నవాబు జేసిరి.

గొప్పయిండ్లు యీ వరకు నేను చూచినది లేదు. హయిదరాబాదులో మాత్రము రిసైడెంటు వుండే యిల్లు యీ యిండ్లకు ముకాలువాసి గొప్పగా చెప్పవచ్చును. యిక్కడి గౌరన్ మెంటు యిండ్లు మూడు అంతస్థులు భాగీరధీ నది వెంబడిగా శాలవేశి కష్టమాఫీసు మొదలైన కచ్చేరీలు అన్ని కట్టివున్నారు. కలకత్తా కోటచుట్టూవుండే బయిలు శాలలు చూస్తే చెన్నపట్టణము చూచి తయారు చేసినట్టు తోచు చున్నది.

కలకత్తాకు వుత్తరము చిత్తుపూరు అని వొక బస్తీవున్నది. దక్షినము మచ్చిగోల అనిన్ని గార్డన్ రీచ్చి అనిన్ని ద్వినామము కలిగిన బస్తీ వొకటి వున్నది. ఆ బస్తీలో తోటలు మెద్దెలు గంగాతీరమందు వుండుటచేత సూప్రీం కోరటు జడ్జీలు మొదలయిన గొప్పవారంతా అక్కడనే వున్నారు. ఆ ప్రదేశము వసతి అవుటచేత నేను వున్న దినాలకు నెల ఒకటి కి వంద ఇరవై రూపాయీల వంతున ఒక తోటమిద్దె బాడిగకు తీసుకొని వున్నాను. పడమటిపక్క చోరంగ అనిన్ని, కిదరుపూరనిన్ని, లాలుడిగ్గీ అనినిన్ని మూడు బస్తీలు వున్నవి. యిక్కడ సమస్త జాతివారు రెండు మూడు అంతస్థులుకల గొప్ప మెద్దెలు కట్టుకొని కాపురమున్నారు. అయితే ఆ మెద్దెలకు చుట్టూ తోటలు లేవు. చిత్తుపూరు నుంచి కిదరపూరికి వచ్చే శాలలో వస్తే చెన్నపట్టణపు పాపంసు బ్రాడివే అనే వీధిలో వచ్చినట్టు యిరుపక్కలా షాపులు కలిగివున్నవి.

కలకత్తా షహరులో పోలైను వారు నెంబరు వేశిన వోఢ్రబోయీలు మోశేకూలి పల్లకీలు పది వందల కె సరిగా వుంచున్నవి. వోఢ్రబోయీలు యిరువురు మోయడమేగాని ముప్పిరియెంత బళువైనా వేయరు. నడుముకు వొకబట్ట చుట్తుకుని చేతమొగిలాకు గొడుగు పట్టుకుని చింపిరితలతో మోయుచు నుంటారు. కరాచీలు అనేబండ్లు యింగిలీషు చారయాట్ బండ్లకు నకలుగాచేసి, రెండుతట్టువాణి గుఱ్ఱములు కట్టి చెన్నపట్టణపు గూడుబండ్లకు బదులుగా వీధికి నాలుగైదు బాడిగకు పెట్టుకొని వున్నారు. కలకత్తా షహరు అలంకారము జాతి వాండ్ల యిండ్లవద్దనున్ను శీమవాడలు నిండియుండే గంగాతీరపు శాల లోనేగాని హిందువుల యిండ్ల వద్దికిపోతే సామాన్యపు స్త్రీలకు రాజును చూచిన కండ్లతో మొగుణ్ణి చూచినట్టు వుంచున్నది. జాతులవాండ్ల బస్తి ఆపేక్షయా కలకత్తాను చెన్నపట్టణమునకు రెట్టింపు షహరని చెప్పవచ్చును. యింకా హిందూస్తాన్ లో జమీందారులు రాజులు నిస్సారులు కాక వుండేటందున యిక్కడ వర్తకము అమోఘముగా జరుగుచున్నది.

యేప్రల్ మే నలలు రెండున్నూ యిక్కడ మిక్కటమైన గ్రీష్మ కాలము గనుక ప్రతీ ఇంట్లోను ప్రతికొట్టిడికిన్ని పంకాలు వేశివున్నవి. యీ కాలములో ఆ పంకాలగాలివల్ల యిక్కడివారు జీవిస్తారు గాని అన్యధా కాదని తొచినది.

యీ ప్రదేశాలభూమి నివాసులున్ను పశువులున్ను బలిష్టములు కాకపోయినప్పటికిన్ని భూమి పచ్చికమాత్రము బాగాపట్టి వున్నది. అయితే పచ్చిక పొడుగు పెరగలేదు. యీకలకతాలో యింగిలీషువారు వారి శీమలోని పిచ్చన్సునే పండ్లున్ను రెండుదినుసులు పయిరువేశినారు. లిచ్చన్సుపండ్లు బెత్తపు పండ్లు జాడగా పులుసుతో తీపుకలిసి వుంచున్నవి. సిచ్చన్సు అనే పండు బాదంకాయలవంటి విత్తులు లోపల కలిగి పులుసుమీరిన రుచితో వుంచున్నది. యీ షహరు హిందువులు జంబునేరేడుపండ్లను పూజ్యతగా వాడుతారు. పచ్చిద్రాక్షపండ్లు అరుదు. హిందువులందరు అటాటాకులు వేసుకోవడమేగాని యితరమయిన ఆకులు తాకడములేదు. అన్నిచెట్లు వీర్యముగానే పెరిగివున్నవి. గీష్మకాలపు రెండు నెలలనున్ను యీదేశస్థులు తుపాను కాలమంటారు. యిక్కడ హుక్కాలు తాగనివారులేరు. గుడాకుచేసే గిడ్డంగీలకు బొగ్గువుంటలుచేసే గిడ్డంగీలు శానా కలవు, గుడాకువుండలు ప్రతి అంగడిలోను వుంచి అమ్ముతారు. తమల పాకులు బహుదళముగానున్ను పెద్దవిగానున్నుమిక్కిలి లావు పొడుగైన కాడలు కలవిగా నున్ను తెచ్చి సాధారణముగా అమ్ముతారు. యీదేశస్థులు తాంబూల చర్వణము చేయడము విస్తారముగానే వున్నది.

యీ షహరులో ఒక వేగినాటి బ్రాహ్మణుడు విశ్వనాధభొట్లనే వాడు ముప్ఫై యేండ్లుగా సంసారములో దక్షిణ దేశపు బ్రాహ్మణులకు యధాశక్తి సహాయము చేయుచూ కాపురమున్నాడు. సంపాదనార్ధము అగంతుకులుగా పంచద్రావిళ్ళతో చేరిన బ్రాహ్మలు ముప్పదిమంది వాసము చేయుచు బంగాళీ ప్రభువులను ఆశ్రయించి వారివల్ల జీవనము చేయుచున్నారు.

బంగాళీ వారికి శివప్రతిశ్హ్ట చేయడము బహు అగత్యము గనుక గర్భగృహము మాత్రము కట్టి గుమ్మటపు అందముగా స్థూపీ కట్టి యీ ప్రాంతములలో అనేక లింగాలు ప్రతిష్ట చేయబడివున్నవి. యీ షహరులో అనేక తటాకములు కలవు. అందులో నేను దిగిన ప్రదేశములో వుండే మూతిబీలనే గుంట బహుప్రసిద్ధమయిన వుదకముకలది. యీ షహరులో వుద్యానవనములున్ను అనేకముగా వున్నవి. అందులో గంగకు అవతలి పక్కవుండే కుఫిణీవారి బోతానికాలు గార్డన్ అనే వనౌషధుల తోట బహుగొప్పది. నిడుపులో వుత్తర దక్షిణాలు అయిదు గడియల దూరము వుండును, వెదల్పులో సుమారు మూడు గడియల దూరము కద్దు.

కంపెనీవారు, బంగాలీల శిక్ష నిమిత్తము, కొన్ని కాలీజు పల్లె కూటములు పెట్టినారు. అందులో చదివి తీరిన పిల్లకాయలు దేశము విస్తారం కర్మభూయిష్టమయి నప్పటికిన్ని శుష్కవేదాంతులై ప్రవర్తింపు చున్నారు.

యీ దేశస్థులు మీసాలు ప్రాయశా, వుంచడములేదు క్షౌరము దినముమార్చి దినము చేసుకుంటారు. స్త్రీలు పురుషులున్ను బహుశా లలాట శూన్యులుగానే తిరుగుతూ వుంటారు. తులసీమణిధారణ విస్తారము కద్దు. కొందరు స్త్రీలు ముక్కుమీద పచ్చ పొడుచుకుంటారు. పట్నాప్రాంతముల స్త్రీలకు పాపటలో సిందూరమును కాయముగా ధరించడము శృంగారమని తోచినట్టు వీరికి ఆ పచ్చ శృంగారముగా తోచి వున్నది. యిక్కడదొరికే చీరలు పన్నెండు మూరకుయెక్కువ దొరకవు. తెల్లచీరలే సాధారణముగా ధరించుతారు.

షహరు వీధులలో భిక్షుకులు నిండా తిరగడములేదు. యిండ్లబాడిగె నవుకర్ల జీతాలున్ను బహు భారీగా వున్నవి. జాతిదొరలున్ను గొప్ప హిందువులున్ను సరకారనే పేరుపెట్టి వొక ప్రధాన నవుకరును వుంచుతారు. ద్వారమువద్ద కాచివుండడమునకు దారువాన్ అనే పేరుతో వొక నవుకరును అవశ్యముగా వుంచుతారు.


ఇరువదవ ప్రకరణము  ఒడిశా మార్గము మరియు బాలేశ్వరము

క్రీస్తుమతానికి అంతర్భూతమయిన అరమనజాతి మొదలయిన వారిగుళ్ళు బహుశ, యీ బస్తీలో కట్టివున్నవి. క్రీస్తుమత ప్రకటన నిమిత్తము యిక్కడ అనేక ప్రయత్నములు గ్రంధప్రచురత్వద్వారా జరుగుచున్నవి.

ముచ్చిగోలా మొదలు బ్రారకుపూరుదాకా వొక సడక్కువేసి యిరుపక్కలా చెట్లువేసి బహుసుందరముగా యేర్పరచి వున్నది. సహరు బస్తీ నిడువున వుత్తర దక్షిణములు మూడామడవుండవచ్చును. వెడల్పులో రెండామడ వుండవచ్చునని తోచుచున్నది. జనబాహుళ్ళము చూస్తే సుమారు పదిహేను వేల వేలు వుండవచ్చునని తోచినది.

మవాసైనీలయిన స్త్రీలు శంఖపుగాజులు ధరించవలసినది అగత్యము గనుక దక్షిణదేశపు శంఖాలంతా ఈ దేశములోనే వ్రయమయ్యేటట్టు తోచబడుచున్నది. స్త్రీలు విస్తారము ఆభరణాదులు ధరించడము లేదు. పురుషులలో గొప్పగా వుండేవారు యింగిలీషు జాడగా వస్త్ర వాహనాదులు వాడుకుంటున్నారు. వాద్యవిశేషములలో ఫిడీలు అనే యింగిలీషు వీణలు యీప్రాంతముల బహు ప్రచురముగా వున్నవి. యిక్కడల స్తర్లు గ్లాసులు కరిగిపోశి చేయుచున్నారు. కంట్లాలు మోశే గుర్రాలు వొంటెలు దొరకవు గనుక నా డేరాలను బోయీల చేత మోయించేటట్టు నిశ్చయము చేసినాను.

దేశ దేశపు వాడలు యిక్కడ వరకు తెచ్చి యిక్కడి సరకులు దేశ దేశాలకు తీసుకొనిపోవుటచేత యీ షహరులో దొరకని ద్వీపాంతర పదార్ధములుగాని స్వదేశ పదార్ధములు గాని లేకవున్నవి. వర్తకులు సుఖించివున్నారు. యిటువంటి కలకత్తాషహరులో జూన్ నెల రెండు తేది వరకు వసించినాను.

తేది వుదయాన ఐదు గంటలకు ప్రయాణమై పడవలమీద వుడుబడియా యనే వూరికి పన్నెండు గంటలకు చేరినాము. ఈ దేశములో ఆయుధపాణులుగా యెవరున్ను వుండకూడకపోయినా బనారసుల్లో వర్షారంభము గనుక యీ రాత్రి నిండా వర్షముకురిసినది. యీ రాత్రి యిక్కడ వసించినాను.

తేది వుదయాన ఆరు గంటలకు లేచి యిక్కడికి నాలుగు కోసుల దూరములోవుండే బాగునా అనే వూరు తొమ్మిది గంటలకు ప్రవేశించినాను. దారి సడక్కువేశియున్నది. నామోదరు అనేనది పడవలతో దాటినాను. కాశినుంచి పది బాడిగె గుఱ్ఱాల మీద నలభై బిందెల గంగ చెన్నపట్టణమునకు పంపించినది గాక కూడా వున్న గంగాజలము యెనిమిది బిందెలున్ను నిత్యము జరూరులేని డేరాలు రెండున్ను మందుల పెట్టెలు వగైరా సామానున్ను రెండుబండ్లమీద తెచ్చినందున యీనదులు పడవలకుండా దాటేటప్పుడు, బహుప్రయాస యిచ్చినవి. యీవూరుగొప్పదేను. బాజారుకద్దు. సకల పదార్ధాలున్ను దొరుకును. భాటసారులు దిగడానకు గొప్ప యిండ్లు, అంగడివాండ్లు కట్టివుంచి వుండేటందున డేరాలు నిమిత్తము లేకుండా విశాలమైన అంగడి యింట్లో దిగినాను.

తేది వుదయాత్పూర్వము మూడుగంటలకు లేచి యిక్కడికి అయిదు కోసుల దూరములో వుండే సీదహాటు అనేవూరు పదిగంటలకు చేరినాము. దారి నిన్నటివలెనే సడక్కు వేశి వారధులు కట్టి వున్నది. రుక్మినారాయణ న్ అనే నది వొకటి యీదినము పడవకుండా దాటినాము. యీవూరు గొప్పది. బాజారున్నది. దిగడానకు యిండ్లు సహా కట్టివున్నారు గనుక డేరాలు వెయ్యలేదు. దిగినయింటికి నాలుగణాలు యిస్తే అంగటివాడు సామాను తీయవలసినది గనుక అదే ప్రకారము చేసినాను. సమస్తమైన పదార్ధాలు ఈ వూళ్ళో సహజముగా దొరికినవి. యీవూళ్ళో ఈ రాత్రి వసించినాను.

తేది వుదయాత్పూర్యము మూడుగంటలకు లేచి యిక్కడికి యేడు కోసుల దూరములో నుండే డబరా వూరు పది గంటలకు చేరినాను. దారి సడక్కువేసి ముందుదినముల దారివలెనే యిరుపక్కలా పైరుపొలాలుకలిగి సుందరముగా వున్నది. దోవలోవుండే క్రసా అనేనది కాలునడకగా దాటినాను. యీవూరుగొప్పదేను. అంగటివాండ్లు గొప్ప యిండ్లుకట్టిపెట్టివున్నారు. సమస్తమయిన పదార్ధాములు దొరికినవి. పోలీసు జమీందారుడువుండే కసుబావూరు నాపరవానా వొక మజిలి ముందు పంపిస్తూ రావడమువల్ల నేను దిగే ప్రతివూరున్ను అన్ని విధాలా సొంతమువలే కావడముమత్రమే కాకుండా దింగిన వూరిమష్యులు దిగిపొయ్యే వూరిదాకా కూడావచ్చిసాగనంపించి పోవుచున్నారు. యిటు నాకు జరగడమే కాకుండా యిక్కడ పోలియను ఖాయిదా ముసాఫరులువచ్చి దిగితే చౌకీపారా రాత్రిళ్ళు యిచ్చి వారిని వారి సామానునున్ను కాపాడి పంపించేటట్టుగా వుత్తర్వు అయివున్నది. అంగటివాండ్లు వచ్చిన మొసాఫరులను ప్రార్ధించి దిగేలాగుచేసి కావలసిన పదార్ధాలు యిచ్చి ఆదరింపుచున్నారు.


ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర
టీటీఎస్ ఆడియో నిర్మాణ పాఠ్యం
భాగం ఏడు — మొత్తం ఎనిమిది భాగాలలో


ఇరువదవ ప్రకరణము  ఒడిశా మార్గము మరియు బాలేశ్వరము

యీ దేశపువాడికె వొకసారి వండుకున్నకుండ రెఒడోసారికి పనికిరాదు గనుకనున్ను కుండలు నయముగకనున్ను ముసాఫరులు అందరు కుండలుకొని వండుకొని దిగిన తావులలో ఆకుండలు పగల కొట్టిపోతారు. దిగుడు మజిలోలో కుండ పెంకుల వల్ల అసహ్యము మాత్రము ఒకటి కలిగియున్నది. యిల్లుకట్టి అంగటివాండ్లు జలవసతికి కూడా పూరాగాచేసి యుంచుతారు. యీవూళ్ళోనుంచి రాణీ సరాయిదాకా సడక్కు లేనందుననున్ను సడక్కు తిన్నగా యీవూరి నుంచి మేదినిపూరునకు వేశియుండుటందుననున్ను నా రెండుబండ్లను మేదినివూరుకుండా రాణీసరాయికి రమ్మని సాగనంపించి యీవూళ్ళో యీరాత్రి వసించినాను.

తేదీ ఉదయాత్పూర్వము మూడు సగం గంటలకు లేచి యిక్కడికి యేడు కొసుల దూరములో వుండే భద్రకాళి అనే వూరు పన్నెండు గంటలకు ప్రవేశించినాను. దారి సడక్కులేదు. పొలములమీద నడిచి రావలసినది. ప్రతిదినమున్ను నేను బయలుదేరిన దినము మొదలుగా కలకత్తాలో కలిగియున్న గ్రీష్మము లేకుండా తెల్లవారి మబ్బువేసి మజిలీ దిగినవెనక వర్షము కురియుచూ వచ్చినది. గనుక దారి బహు అడుసుగావుండినది. యీవూరున్ను గొప్పదేను. భద్రకాళి అనే దేవి గుడివున్నది. దిగడమునకు విశాలమయిన యిండ్లుకట్టి వసతికి గుంటలు తొవ్వించి యున్నారు. మొసాఫరులు దిగడానకు ఈ అంగడివాండ్లు అంగడికి చేరినట్టు ప్రత్యేకముగా కట్టివుంచే యిండ్లు విడవలిపూరికలవి అయినా బహు రమణీయముగా ప్రతిదినమున్ను శుద్ధిచేసి వుంచుతారు. యిక్కడ సమస్తమైన పదార్ధములు దొరికినవి.

వ తేది వుదయాత్పూర్వము నాలుగు గంటలకు లేచి యిక్కడికి యెనిమిదికోసుల దూరములోనుండే రాణీసరాయి ప్రవేశించినాను. ఈజాగాలో వూరులేదు. ముప్పై అంగళ్ళు సడక్కుకు యిరుపక్కలా కట్టివున్నవి. దిగడానకు విశాలమయిన యిండ్లుకట్తి వాటికి చేరినట్టుగానే రమణీయమైన గుంటతొవ్వించినారు. చౌకీదారులు మాత్రము వున్నారు గాని పోలీసు బంట్రౌతులు యిచ్చట వుండడములేదు. దారిలో నారాయణగడయని వొకవూరు వున్నది. అక్కడ పూర్వరాజులు నియమముచేసిన సదావృత్తి సత్రాన్ని అద్యాపి కంపెనీవారు నడిపిస్తూవున్నారు. యిక్కడ సకల పదార్ధములు కూరగాయల సమేతముగా దొరికినవి. ఈదేశములో పాలు పెరుగు సహజముగా దొరుకుచున్నవి. దిగిన మజిలీలలోవుండే చౌకీదార్లను నలుగురేశిమందిని రాత్రిళ్ళు నాబంట్రౌతులతో కూడా పారాయిచ్చేటట్టు చేసి వుదయాన సాగివచ్చేటప్పుడు నాలుగేశిఅణాలు యిస్తూ వచ్చుచున్నాను. యీ దినము దారి కొంతమేర సడక్కువేశి యున్నది.

తేది ఉదయాత్పూర్వము రెండు సగం గంటలకు లేచి యిక్కడికి తొమ్మిది కోసుల దూరములో నుండే జేలేశ్వరం పట్టణం అనే వూరు ఒకటి పాయింట్ మూడు గంటలకు ప్రవేశించినాను. దారిసడక్కువేసి వారధులు కట్టివున్నవి. యిరుపక్కలావుండే భూమికన్నా మనిషి పొడుగుమిట్టతో సడక్కువేసియున్నారు. సడక్కునిమిత్తమై కాలువగా మట్టి యెత్తినారు గనుక ఆ కాలువలో నీళ్ళు నిచిచినప్పుడు వొంటికొయ్య దోనెలమీద కావలసిన సామానులు వుంచి యీడ్చుకొని వస్తూవుంటారు. ఈ వూరు సువర్ణ అనే నదీతీరము. గొప్పవూరు. బాజారువీధి వున్నది. ముసాఫరులు దిగడానకు యిండ్లు సమేతముగా యేర్పడివున్నవి. సమస్తమయిన పదార్ధాలు దొరికినవి.

తేది వుదయాత్పూర్వము మూడు సగం గంటలకు లేచి యిక్కడికి అయిదుకోసుల దూరములో నుండే బస్తా అనే వూరు పది గంటలకు చేరినాను. యీవూరు చిన్నదైనా అన్ని పదార్ధాములు అప్రయత్నముగా దొరికినవి. కంపెనీవారు విశాలమైన ధర్మశాలలు రెండుమిద్దెలు కట్తించివున్నారు. నేటిదారిన్ని సడక్కువేసియున్నది. సువర్ణనది కాలువ నడకగా దాటినాము. నదికి యీ పక్క మంకపుచౌకీ వొకటి యున్నది. వొకమాత్రపు వారిని సోదాచూడడమనే సాకుపెట్టి కొంత గుంజుకోకనే ఆ చౌకీదారులు వదలరు. నేటిదారిలో భాటకు కుడిపక్క కొంతదూరములో వొక పర్వతము తెలుస్తూ వచ్చుచున్నది.

కలకత్తాలో నేను వుండగా వొకదినము గాలితోకూడా రాళ్ళ వాన కురిశి గచ్చకాయలంతేశిరాళ్ళు పడ్డవి. ఆరాళ్ళు పది అయిదు యెత్తి వొకపాత్రలోవేశి కుదిలించితే రాళ్ళు రాళ్ళు కుదిలించినట్టు చప్పుడౌతున్నది. కిందపెట్టి బళువైన పదార్థముతో కొట్టితేనీళ్ళయిపోతున్నవి గాని దెబ్బకు తాళనెరవు. చేత పట్టుకుంతే తూటుపొయ్యేపాటి శీతళముగా శుద్దస్ఫటిక నంకాశముగా వున్నది. గడియవుంచితే క్రమక్రమముగా కరిగిపోతున్నవి. మళ్ళీ అటువంటి నాన ప్రసక్తించలేదు. కలకత్తాలో కలిగివున్న పిశాచగాలిన్ని యిక్కడలేదు.

కలకత్తాలో నేను వుండగా మలడీ అనే జ్వరము కలకత్తాలో నంతా ప్రవేశించి నా పరివారములో యివవైమందిని బాధపెట్టినది. గయలో వొక నల్ల డాక్టరు నాకు చెప్పిన ప్రకారము హిందూస్థాని భాషలో చిరటా అనిన్ని యింగిలీషులో బిట్టరు అనిన్ని చెప్పేమూలిక వేశి కషాయముపెట్టి యిలిక్కిసియా విత్రిల్ అనే ద్రావకము వొక క్వార్టర్ బాటిల్ కషాయానకు రెండు తేగరిటెలు పోశి సాయంప్రాత, రెండేసి తులాలు యిస్తూ వచ్చినంతలో ఈశ్వర కటాక్షముచేత అందరికిన్ని అనాయాసముగా వాశి అయినది. వొక బోయివాడికి నీరుకు బదులు నెత్తురు దిగుతూ వచ్చినంతలో బొందెగడ్డ రసము తీసి తవ్వెడు రసములో మూడు బొట్లు గంధకద్రావకము పోశి యిచ్చినాను. త్వరలో వాశి అయినది.

తేది వుదయాత్పూర్వము రెండు సగం గంటలకు లేచి యిక్కడికి ఏడు కోసుల దూరములో వుండే బాలేశ్వరమనే కసుబాబస్తీ తొమ్మిది గంటలకు చేరినాను. దారి యీవరకు వున్నట్టు సడక్కు యేర్పడి వుండడములో భూమి యిసుక కలిసిన రేగడ గనుక బహు గట్టిపడి వర్షము కురిశివున్నా కాలికి అంటుకోకుండా వున్నది.

కలకత్తా మొదలుగా సువర్ణనది వరకు భూమి జిగట రేగడి, అందువల్ల కలకత్తాలో కోశే యిటికెరాళ్ళు బహుగట్టిగా రెందుమూళ్ళ చచ్చౌకముగా కొయ్యగల పాటివైపు కలిగివున్నవి. కలకత్తా యిటికె రాళ్ళు యినుప చిట్టముతో సమమైన బలము కలవని చెప్పవచ్చును. కలకత్తా సున్నము మాత్రము ధావశ్యము చాలదు గనుక యింటి గోడలు చెన్నపట్టణము వలె నీడలు తేరడము లేదు.

దేశాస్థులందురున్ను గుల్లసున్నము వేసుకొంటారు. యీ విషయాన్ని గురించి ఒక దినము బంగాళీవారు మీ దేశములో బ్రాహ్మణులు మత్స్యభక్షణ చేయడములేదంటిరే, గుల్లసున్నము తాంబూలచర్వణముతో తినడములేదా అని అడిగెను. నా అనుభవద్వారా కావేరి మొదలు కన్యాకుమారి వరకు సమస్త బ్రాహ్మణులున్ను దేశాచారప్రకారము గుల్లసున్నము వేసుకుంటారని తెలిసి నేను ఆ దేశ సంచారము చేసినప్పుడు వారితోటిపాటుగా అదే సున్నము వేసుకొనివున్నా బంగాళీవాడుచేసిన ప్రశ్నమహిమను యోచించి మా చెన్నపట్టణములో గుల్లసున్నము వేసుకోవడము లేదని వుపాయముగా వుత్తర్వు చెప్పినాను గాని నా మనస్సుమాత్రము కలతబడి వున్నది. గుల్ల లున్నూ జలజంతువుల కళేబరాలతో చేరినది నిజమేకదా! యీ దేశస్థులు మత్స్యకళేబరాలను పచనముచేసి తింటే దక్షిణదెశస్థులు వాటి దేహాలమీది చిప్పలను కాల్చి తింటారు. ఈ రీతిగా పరోక్ష ప్రత్యక్షాలుగా జలజంతువుల కళేబరాలను వొక పక్కది వొక దేశస్థులు వొకవిధమయిన పచన ద్వారా భక్షణ చేస్తే మరివక దేశస్థులు మొరివొకపక్క కళేబరాన్ని మరివొక విధమయిన పచనముతొ భక్షణ చేయుచూ సమమైన పాపులయివున్నా వొకరిని వొకరు నిమిత్తము మాలి నిందింపుచూ వుంటారు. యీసరికి నావద్ద ప్రయాగనుంచి తెచ్చిన రాతిసున్నము వున్నది. యిది ఖర్చు అయిన వనక బంగాళి వాడివల్ల ధర్మసూక్ష్మము యెచ్చరించబడ్డా యుక రాతిసున్నము దొరకక పోతే దేశాచారాన్ని లోగడివలెనే అనుసరించవలసి వస్తున్నది.

మూటశోధన నిర్బంధము లోకులకు కలిగి యున్నది.

వ తేది వుదయాత్పూర్వము ఒకటి సగం గంటలకు లేచి యిక్కడికి తొమ్మిది కోసుల దూరములో వుండే సూరంగు అనే వూరు ఏడు గంటలకు చేరినాను. నామూడు సవారీలలో రెండు సవారీలకు యిరువై యింటికి వోఢ్రబోయీలను పెట్టవలసి వచ్చినందునన్ను వారు యిరువురి మోతతో వారి వారి అడుగులను యివతలవారి అడుగులతో కలుపుకోకుండా మెల్లిగా నడిచేవారు గనుకనున్ను యెండగొట్టుకు యెంతమాత్రము సహించలేదు గనుకనున్ను రాత్రిళ్ళు యింతప్రొద్ధువుండగా లేచి నడవ వలసివున్నది. దారి నిన్నటివలెనే సడక్కుచేసి యున్నది. యిసక కలిసిన రేగడ. బాలేశ్వరము మొదలుగా కుడిపక్క రెండు గడియల దూరములో సముద్రములో కలియవచ్చిన వింధ్యపర్వత సంబంధమైన పర్వతములు వుండి వున్నవి. నేటిదారిలో బాలేశ్వరానకు కొశెడు దూరములో వక సుంకపు పెరిమెట్టు చౌకీ వున్నది. యిక్కడి కలకటరు మేజెస్ట్రేటు అయిన రికెట్టుదొర వొక చప్పరాశి బంట్రౌతును తయినాతిగా యిచ్చినందున తలషీ అనే శోధన చిక్కులేకుండా సాగి వచ్చినాను. అయినప్పటికి నా గొప్ప కాపాడుకునే నిమిత్తము చౌకీ ఒకటి కి ర్పు రెండు వంతున యినాము యిస్తూవచ్చినాను. ఠాణా సరిహద్ధు ప్రకారము వొక బరక్రదాసు అనే పోలీసు బంట్రౌతు వస్తూ వచ్చినాడు గనుక యివతలి సరిహద్ధు పోచాయించి, చేర్చి, బంట్రౌతు సాగి పొయ్యేటప్పుడు అరదూపాయిలు యినాము యిస్తూవచ్చినాను.

యీ భూమిని వరిపయిరు యెక్కువ. యీ వుత్కలదేశములో వసించే వొఢ్రబ్రాంహ్మణ పండితులు గౌడదేశస్థులకన్నా సంస్కృత భాషను బాగా వుచ్చరించుతారు యీ దేశస్థులకు తెనుగుమాట వొకటి అర వచ్చును. చెన్నపట్టణమంటే తెలియదు. మదిరాసు అనవలసినది.

కలకత్తావద్ద భాగీరధీంది వదిలిన వెనక గంగలో కొట్టుకునివచ్చే కళేబరాలను తినే నిమిత్తము యీశ్వరుడు గంగకు యిరుపక్కలా సృజన చేసిన వింత ఆకృతిగల బోరుగద్ధలను చూడలేదు. ఆగద్దలు రెండు పూర్వ మహంపూర్వ మని యెదురుగా వచ్చినారు. వారు వోఢ్రబ్రాహ్మలు, వుత్కలు లనిన్ని చెప్పుతారు. యిక్కడ శేరు ఒకటి కి ఇరవై రూపాయల యెత్తు, కలకత్తా శికారూపాయలకు చెన్నపట్టణపు రూపాయలకు నూటికి పది వ్యత్యాసము వున్నది. చెన్నపట్టణములో తగ్గిన దినుసని తెలియవలసినది. బంగాళా సీమలోనుండే బోయీలు యీరీతిన బళువు యెత్తలేని జన్ను మోతగాండ్లుగా వున్నారే, మన దేశానకువచ్చే బంగళా పల్లకీలు బహు బళువుగా వుంటున్నవే, వీటి నిమిత్తమే మని విచారించగా బంగాళాలొవుండే యింగిలీషుదొరల కేమి? హిందువులకేమి పాలకీలుయెక్కే షోకేలేదు. పని గడవడానకు కూలిపల్లకీలు అప్పటప్పటికి వుంచుకుంటారు. ఆకూలివల్ల కీలు తేలికగానె వుంచున్నవి. అక్కడ నెల పొడుగు పల్లకీలు మాత్రము చేసి వుంచివున్నవి. వాట్లను హిందూస్తాన్ చెన్నపట్టణము మొదలయిన దేశాంతరాలకు పంపించడానకు తయారయినట్టుగా తోచబడుచున్నది.

తేది వుదయాత్పూర్వము నాలుగు గంటలకు లేచి యిక్కడికి రెండు కోసుల దూరములో నుండే వైతరణీనదీతీరపు వూళ్ళయిన ఆకులాపదా, మూడియాపాడు అనే వూళ్ళు పదకొండు గంటలకు చేరినాను. యీనది వర్షాలు కురిశినందున వడవలకుండా దాటడమయినది. యీ దినము నడిచినభూమి శుద్ధరేగడ, మన్ను వర్షము కురిశినందున అమితముగా కాళ్ళకు అంటుకుంచూ వచ్చినది.

యిక్కడికి జాజీపురమని పేరుకలిగిన నాభిగయ మూడుకోసుల దూరములోవున్నది. అక్కడ యీ వైతరణీ నదీతీరమందు దేహానంతరము జీవుడు వైతరణీనది దాటే కష్ణము పొందకుండా వుండేకొరకు వైతరణీ ప్రయుక్తముగా వొక గొదానముచేసి నాభి ఆకారముగా వుండే వొక కూపములో పిండప్రదానము చేయవలసినది. వుత్కల బ్ర్రాహ్మలు వంద నలభై యిండ్లవారు నాభి గయావళీలని పేరు వుంచుకొని యాచించి జీవనముచేస్తారు. వీరు మత్స్యభుక్కులు కామనిచెప్పినా గయామహాక్షేత్రములో గయావళీలకు బ్రాహ్మణార్ధము చెప్పినట్తు దక్షినదేశస్థులు వీరిని చెప్పడములేదు. ప్రత్యక్షముగా అన్నశ్రాద్ధము చేస్తే స్వదేశాస్థులు దొరికితే బ్రాహ్మణార్ధము చెప్పుతారు. లేని వుగా యెక్కి పడవలమీద వుందవచ్చును. ఈ రెండునదుల పేర్లు కరుసా అనిన్ని బ్రాహ్మణి అనిన్ని చెప్పుతారు. బ్రాహ్మణినది గోపాలపూరుకు వోరగా వున్నది. యీవూళ్ళోను ధర్మశాలలు రెండు వందలు అడుగుల నిడువు పదిహేను అడుగుల వెడల్పుతో నొక కూటమున్ను ఆరడుగుల వెడల్పుతో నొక తాళువారమున్నూ వేశి రెండుకొనలలో రెండు కొట్టిడీలు కట్టివున్నవి. ఇటువంటి ధర్మశాలలు రెండేశి వొక్కోక్క వూళ్ళో యెదురెదురుగా మధ్యే నాలుగు వందలు అడుగుల బయలు విడిచి రమణీయముగా కట్టివున్నవి. మధ్యేవుండే బయిలులో వొక బావి తొవ్వించివున్నారు. యీధర్మశాలలు కంపెనీవారు కట్టించి మూడుసంవత్సరములు అయినవి. ప్రతి ధర్మశాలలోను వొక పోలీసు బంట్రౌతును యిద్దరేశి ఝూడుమాలీలను వుంచినారు. యీదినము దిగిన ధర్మశాలకు చేరినట్టుగా సమీపములో వున్నవి. యీవూళ్ళో సమస్తమైన పదార్ధాలు దొరికినవి.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కడికి ఏడు కోసుల దూరములో నుండే చత్తియా అనే వూరు పది గంటలకు చేరినాను. దారి సడక్కువేసివున్నా వర్షము కురిసి యెండివున్నందున మనుష్యులను నడవనియ్యకుండా మట్టిగడ్డలు కాళ్ళకు నిండాగా గుచ్చుకుంటూ వచ్చినవి. యిక్కడి బోయీలను బేరాలని చెప్పవలెను. వారందరు గోపాలకజాతి అని తెలియవచ్చినది. మనదేశపు వుప్పాడ బోయీలు వారు మోశే దండే మీద చెయివేస్తే మాజాతి మణిగిపోయనని బహు రచ్చచెస్తారు, వీరు స్నానము మొదలయిన ఆచారముకలిగి బ్రాహ్మణులకు యిక్కడి దేవతలకున్ను వుదకము పాకానికి తెచ్చి యిచ్చి నిండా వుపచారము చేయును అర్హులుగా తుళసీమణి ధారణ చేసి మాంసభక్షణ వదిలి నియమముగా వుంటారు. యీవుత్కలదేశములో అమితమైన పొగచుట్టలు తాగుతారు గాని హుక్కాల ప్రసక్తిలేదు. నేడిదారి కుడిపక్క కనుపడుతూ వచ్చే కొందలకు అడివికిన్ని సమీపము గనుక పులుల భయముకద్దు. మేముదారివడుస్తూ వుండగా దారిలో వొక అంగడివద్దవుండే కుక్కను పులివచ్చి పట్టుకొనిపోయెనదని గాబరాగా వుండినది. యీ వూరిలో బజారు వీధి వొకటే కలిగివున్నది. దిగడానకు ఇండ్లు నిండా చిన్నవిగా కట్టివున్నవి. నపల్లకీలు నవుకర్లు వుండడానకు నడివీధిలో వొక గుడారము వేసి యిముడ్చుకొని దిగినాను. ధర్మశాలలు యిక ముందర లేవని విన్నాము. యీ వూళ్ళోను కావలసిన పదార్ధాలన్ని దొరికినవి. యీ వూళ్ళో యిద్దరు పోలీసుఠాణా బంట్రౌతులు ఠాణా వుంటారు. ఠాణా యిక్కడికి మూడుకోసుల దూరములో వున్నది.

నాతోకూడావచ్చిన మనుష్యులలో కొందరికి అకస్మాత్తుగా తాళకూడని కడుపునొప్పి తగిలి నూరుబొట్లు స్పిరిటులవండర్ ద్రావకము పోసియిస్తే కుదిరినది. కొంతమందికి నెత్తురుబంకపడుతూ వచ్చినంతలో లాడును ద్రావకము పదిబొట్లు చక్కెరలో పోసియిస్తే కుదిరినది. భేదులు అమితముగా అవుతూ వచ్చివారికి శుద్ధిచేసిన అభిని మందు పూటకు చిన్నదూకయెత్తు యిస్తూ వస్తే కుదిరినది. స్త్రీసంబంధమయిన మేహరోగముమాత్రము వొకమాత్రానికి సాధ్యమయ్యేదిలేదు. వొక కావిటివానికి అతి బలిష్టుడైనా సకృదావృత్తి ఒక స్త్రీ సంభోగము అయినంతలో మేహము మేహవ్రణముకూడా పుట్టి క్రమముగా పాదాలలో నొప్పిపుట్టి నడవ కూడకుండా కలిగి నా చేతనయినంత చికిత్స కలకత్తలో చేయించిన్ని కుదరక నా స్నేహితులవశముగా ఆ మనిషిని కలకత్తలో విడిచిపెట్టి వచ్చినాను.

ఈశ్వరుడు యింతరోగముము సకృదావృత్తిలో పురుషులకుయిచ్చే పాడి దేహధర్మముతొ స్త్రీలను పురుషాకర్షణ చేయుచు వచ్చే టట్టుగా వేడుకతో తిరుగుతూ వుండేటట్టు యెందుకు నియమించినాడో ఆకారణము అతనికే తెలియ వలసినది. అయితే నాకు తోచేది యేమంటే ఆరీతిగా స్త్రీలను వుంచడము వల్ల తన కటాక్షానకు పాత్రులు కాతగ్గ పురుషులకు అడివిలో చరింపుచు నుండే వ్యాఘ్రము మొదలయిన మృగాలను చూచితే యెట్లా భయపడి దూరస్థు లౌదురో తద్వత్తుగా అయ్యే నిమిత్తమని తోచినది. అయితే అతని మాయ దురత్యయము గనుక మోహాన్ని జయించలేకుండా వున్నాము.

యీగౌడ దేశములోనున్ను వుత్కల దేశములోనున్ను చింతపండు మిరపకాయలు విస్తారముగా మన దేశమువలె తినక పోయినా మనదేశస్థుల నిమిత్తము కావలసినవి అంగళ్ళలోపెట్టి వుంచుతారు. యెండు మామిడి వరుగు చింతపండుకు బదులుగా వాడుతారు. మామిడిచెట్లు అమితముగా కలవు. శాలలోకూడా అవేపెట్టి పయిరు చెస్తూవున్నారు. యీ దేశపు బోయీలు మిట్టలు యక్కవలసినప్పుడు హరిబోలో అనే మాటతో కంఠధ్వని వుగ్గళించి చేయుచూ వచ్చుచున్నారు.

తేది ఉదయాత్పూర్వము నాలుగు గంటలకులేచి యిక్కడికి ఏడు కోసుల దూరములో నుండే కటమమనే షహరు పదకొండు గంటలకు చేరినాను. దారి సడక్కువేశి గట్టిపడి వున్నా నిన్నటి దినము అమితమయిన వర్షము కురిశినందున దారినిండా అడుసుగా వుండినది. ఆ కటకముముందు రెండుకోసులు కద్దనంగా సడక్కులోనుంచి నొక కాలువ చీలి మహానదిలో కలిసినది. ఆదారి గులకయిసుక పరగా వుండినది. ఆ మహానది కటకము చుట్టుకొని ప్రవహింపుచున్నది. ఆ నది రెండుకోసుల వెడల్పు కద్దు. యీ నది వింధ్యపరతములో వుత్పత్తి అయి కటకానికి సమీపముగానే సముద్రగామి యయినది. వైతరణినది మొదలుగా కటకము వరకున్ను అతి ఘోరమయిన అడవిగా లోగడ వుండినది. యిప్పుడు కంపెనీవారు కలకత్తాలో వుండే బంగాళీధనికులు కూడా ఆ అడివి కొట్టించి సడక్కు వేయించినారు.

కటకముపూర్వమందు ఢిల్లీ కింద వుండినది. అక్కడిపాధుషా కుటుంబస్థులకు అంత, కలహము కలిగి అరాజక మయిన మీదట నాగపూరు యేలుతూ వున్న షాహురాజు వంశస్థులు యీ నెట్టునవున్న అధికారస్థులను కొట్టి తీసుకున్నారు. పిమ్మట యింగిలీషువారు పునాషహరు స్వాధీనము చేసుకొని క్రమక్రమముగా హిందూస్తాన్ సమగ్రముగా స్వాధీనము చేసూంటూ వచ్చేసమయములో నాగపూరున్నాసాహేబుతో కలహప్రసక్తి అయినది గనుక ఆకలహము ఆకరము చేసుకొని కటకపుజిల్లా స్వాధీన పరుచుకొన్నవారై పిమ్మట నాగపూరు రాజ్యము ఆరాజు సంబధికుని అధీనము చేసినప్పుడు యీ కటకపుజిల్లా ఢిల్లీ పాధుషాది గనుకనున్ను ఆ ఢిలీతక్తుయిప్పట్లో తమచేతికింద వున్నది గనుక అన్యా


ఇరువదియొకటవ ప్రకరణము  కటకము నుండి జగన్నాథ క్షేత్రము

యుముగా మీవారు ఆక్రమించిన కటకపుజిల్లా మీకు యివ్వవలసినది లేదని యింగిలీషువారు నిలుపుకొని యేలుతూ వున్నారు. ఇరవై నాలుగు సంవత్సరములుగా వీరి అధీనములో వుండివున్నది.

కన్యాకుమారి మొదలు కాశ్మీరమునకు సమీపమయిన దేశము వరకు ఉత్తర దక్షిణములున్ను సింధునది మొదలు బ్రహ్మపుత్రినది వరకు తూర్పు పడమర లున్ను యింత అనాయాసముగా యెంతో దూరవాసులయిన క్రీస్తు మతాంతరులకు యీశ్వరుడు స్వాధీనము చేయవలనదేమని మరిమరి యోచించగా నాబుద్ధికి విశేషముగాతొచినది యేమంటే మన పూర్వీకులు చెప్పియుండే అహింసా పరమోధర్మం, స్వర్ణస్తేయం సురాపానం, ఆత్మవత్సర్వ భూరాని యివి మొదలయిన వచనములయొక్క ధర్మములను జగత్తులో అందరున్ను పరిపాలన చేయసాగితే ప్రపంచధర్మము జరగక లోకము కృత్యరహితమై శాంతినిపొందును గనుకనున్ను అటువంటి శాంతి యీశ్వరుని చిద్విలాసానకు వ్యతిరిక్తము గనుకనున్ను అటువంటి ధర్మాలు అందరున్ను జరిపించ నేరరు గనుకనున్ను ప్రపంచముయొక్క మర్యాదప్రకారము కామక్రొధములతో చిద్విలసము నడుస్తూ వుండేటట్టుగానున్ను అటువంటి ముఖ్యధర్మాలు వదలకుండా కొందరు అవస్యముగా లోకములో జరిగించి యీశ్వరుణ్ని తృప్రిపరచి ఈశ్వరకటాక్షము సంపాదించి అటువంటి జగదీశ్వరును యొక్క దుర్లభమయిన కటాక్షము తాము సంపాదించుకునేటట్టుగా తమకు ఆయాచిత జీవనము కలుగచేసి కాపాడుచువచ్చిన ఇతరులక్షేమమును స్వస్తి ప్రజాభ్య, పరిపాలయంతాం అనే వచన ప్రకారము ప్రార్ధింపుచూ వుండేకొరకు బ్రాఃహ్మణ క్షత్రియులు మొదలయిన వర్ణములు నిర్ణయించపడ్డవిగదా? అందులో క్షత్రియులు చేయుచూవచ్చిన క్షాత్రధర్మపురస్సరమయిన రాజ్యపరిపాలన పూజ్యులుగా వున్న బ్రాహ్మణులకు దురభిమాన పురస్సరముగా పూర్వకాలములో సరిపడక ఆగ్రహోదగ్రులై క్షత్రియులను నిర్వంశము చేసినందున రాజ్య పరిపాలనచేయ నేర్చిన సంప్రదాయకులు యీ కర్మభూమిని లేకపోయిరి. కడమ మూడువర్ణములవారు యెంతవారివారి ధర్మములు జరిపింపుచున్నా శిక్షకులు రక్షకులున్ను అయిన క్షత్రియులు లేకపోయి నందున వీరి స్వధర్మములు ధీర్ఘముగా జరిపించు కోలేక వర్ణాశ్రమ సంకరులైనారు.

శాంతిరహితులయిన బ్రాహ్మణులద్వారా యింత సంకరము అయిన వేడుక యీశ్వరుడు చూచి వీరి శిక్షనిమిత్తము బలాత్కారము చేత కర్మశూన్యులని చేయ నేర్పరచిన తామసగుణ ప్రధానులయిన మహమ్మదంత ప్రవిష్ణులను యీ భూమిలో ప్రవేశింపబెట్టి కావలసి నంతమట్టుకు పూర్వపు వాసనప్రకారము కర్మద్వారా జ్ఞానము సంపాదించనలె నని పొరాడుతూ వుండే బ్రాహ్మలను శిక్షించినాడు. పూర్వీకులు చేసిన పాపానికి వారివంశస్థులు యెట్లా శిక్షకు అర్హులయినారని విచారిస్తే మాతాశేశద్ మక్కళ్ క్కొ అనే అన్యయారువచనమే ఆకరము. పిమ్మట యెశ్వరుడు కృపాసముద్రుడు గనుక అనుపూర్వికమైన కర్మభూమి శుద్దముగా కర్మశూన్యమైపోవుననే భయముచేత సత్వగుణప్రధానులై బుద్ధికుశలతచేత యీశ్వర సృష్టి అయిన అనేక బ్రహ్మాండముల గతులను ఉత్తర దక్షిణ ధృవనక్షత్రాల స్థితులనున్ను తెలిపి సాహస ధైర్యములతొ నక్షత్రరూపముగా నుండే బ్రహ్మాండాల వుచ్చములను పట్టి సముద్రము మధ్యేవాడలను నడిపించి యిన్ని బ్రహ్మాండములకు సృష్టికర్తగా వొకడేవున్నాడని నమ్మి యీశ్వరుణ్ని ఆరాధనచేయుచూ వుండే యింగిలీషువారికి తగుపాటి బహుమతిగా ఈ కర్మభూమిని అవలీలగా యిచ్చినాడని తోచినది.

యీశ్వరుడు చిద్విలసార్ధమై ప్రతి చైతన్యానికి భిన్నరూపము భిన్నధ్వని భిన్నతత్పర్యము కలుగచేసి వున్నాడు గనుకనున్ను ప్రకృతి దేహములకు సద్గురుకటాక్షము కలిగేవరమున్ను ఆత్మస్తుతి పరనింద చేసేటంతగా మిక్కిలి ఆనందము వేరే లేదు గనుకనున్ను సాత్విక బుద్ధిగా విచారించితే హిందువులను తమ క్రీస్తుమతానకు యెక్కువ అని వారు అనుకోక పొయినా సరిపోలిన దనియైన అనుకో వచ్చును. దురత్యయమయిన యీశ్వరమాయ అటు సాత్వీకముతో వొకమాత్రముగా యెవరినిన్ని అనుకోనివ్వరు గనుకనున్ను మీది మిక్కిలి హిందువులు పై సంకరద్వారా మత విషయమై బహిరంగకృత్యములలో గర్హితముగా కొన్నికొన్ని ప్రమేయాలయందు నడుచుచున్నారు. గనుక పయిన నార, లోపల చెక్క, అందులోపల మధురమయిన విత్తు, కలిగిన బాదమపండు వతుగా వుండే హిందూమత సారమును తెలుసుకోలేక హిందువులు తెలియక మణిగిపోతారే, మనమతము పట్టితే కడతేరుదురే, అనే పశ్చాత్తాపముతో స్వమత ప్రకటన చేయను యిగిలీషువారు వుద్యోగిస్తూవున్నారు గాని మరి యెటువంటి విషయములోనున్ను హిందువులకు యే విరోధముచేతనైనా తమచేతనయిన మట్టుకు తొందరలేకుండా రాజ్యపరిపాలన చేయుచు ఈశ్వర కటాక్షమునకు దినదినానికి పాత్రులుగా ప్రవర్తింపుచువున్నారు.

యీ కటకపు షహరులో రెండు వేల యిండ్లు కద్దు. పదివేలమంది ప్రజలు వుండవచ్చును. సమస్తమయిన పదార్ధములు దొరుకుచున్నవి. తురకలు ఈ రాజ్యము చేసేటప్పుడు యిక్కడ తురకలు నిండా ప్రవేశించినారు. ఇప్పట్లో మొహరంపండుగ అయినందున యీవూళ్ళో తత్ప్రయుక్తమయిన వుత్సవము జరుగుచున్నది. గాని దక్షిణదేశమువలెనే వుత్సవము జరిగింఛేవారు నామము బొగ్గు మొదలయినది పూసుకొని వెఱ్ఱిచెష్టలు విస్తారము చెయ్యడములేదు.

మహమ్మదు మతస్థులు కాబూలుదేశ ద్వారా హిందుస్తానులో ప్రవేశించిన వెంబడిగానే సింధునదీ తీరమందు వున్న సోమనాధస్వామి గుడి నవరత్నఖచితమైనది వుండగా కొట్టి పాడుచేసి కోట్యంతరాల రత్నాలు స్వాధీన్ముచేసుకొని అక్కడి నివాసులనున్ను పంజాజ అనే అయిదు దారలు కల సింధు నదీ తీరమందు వుండే హిందువులనున్ను సుమారు లక్షమందిదాకా మహమ్మదుమతములో మేము ప్రవేశించమని చెప్పినందుకు వారిని శిరచ్చేదము చేయించినారు. అటుతర్వార ప్రయాగలోవున్న అక్షయవటం యంత్రము మొదలయిన స్థలములను నిర్మూలముచేశినారు. కాశిలో విశ్వేశ్వరుడు అన్నపూర్ణ వగైరా దెవతలను వారి మందిరాలను బ్రహ్మాలయాలను పగలగొట్టినారు. యింత నిర్బంధము మహమ్మదు మతస్థులు జరిగించినప్పడికీన్ని యిప్పువు వుపాయముచేత క్రీస్తుమతస్థులు తమ మతములో చేర్చిన హిందువులలో సహస్రములో వొకపాలైనా ఆ కాలమందు మహమ్మదుమతములో హిందువులు ప్రవేశించక మహమ్మదు మతస్థులను క్రమక్రమశ, తమ మతముజోలికి రాకుండావుండేటట్టు చేసుకొని యిడిసిన దేవాలయాలను బ్రహ్మాలయాలను మళ్ళీ వుద్ధరించుకుంటూ వచ్చినారు. క్రీస్థుమతస్థులు ఉపాయేవతు యచ్చక్యం సతచ్చక్యం పరాక్రమై, అనే వచనప్రకారము క్రమక్రమముగా యీ దేశములో గౌరవము సుతరాంలేకుండా వుండే జాతిని విస్తారముగా తమమతములో చేర్చుకొని కర్మఫలము యొక్క రహస్యము తెలియని వారిని క్రీస్తు మతమే వుత్తమమని చెప్పుకుంటూ వుండేటట్టు యెప్పటికిన్ని చేసి వున్నారు.

మహమ్మదు మతానకు క్రీస్తుమతానకున్ను, హిందూమతానకున్ను, వుండే తారతమ్యములను గురించి నేను ఒకకధ వినడమయినది. అది యేలాగంటే వొక ప్రభువు ఈ మూడుమతస్థులను వద్దవుంచు కొని వొక ప్రశ్నచేసినాడట. ఆ ప్రశ్న, ఏది, అనగా వొక దారిమధ్యే వొకడు భాటసారిని కొట్టి నిర్భంధపెట్టి తన యింటికి పిలుచుకొని వచ్చి ఆతిధ్యము యిచ్చేటట్టు సంకల్పముచేసుకొని యిల్లు కట్టుకొని కాపురము చేయుచూ వచ్చినాడు. మరినొకడు తన యింటియొక్క సౌఖ్యమును తన ఆతిధ్యముయొక్క రుచినిన్నిభోధచేసి దారిన నడిచేవారిని యింటికి పిలుచుకొని వచ్చి ఆతిధ్యము యిస్తూ వచ్చేటట్టు సంకల్పముచేసి వొక యిల్లు కట్టుకుని కాపురము చేయుచువున్నాడు. మరివొకడు తనయింటికి వొకరిని పిలువవలసినది లేదు, నేను వొకరింటికి వొకరివద్దికి పోను, నా అంతట నేనువుండ వలసినదని నిశ్చయము చేసి యిల్లు కట్తుకుని కాపురము చేయుచు వచ్చినాడు. యీముగ్గురిలో యెవడు వుత్తముడని పై ముగ్గురి మతస్థులను ప్రశ్నచేసినంతలో మహమ్మదు మతస్థుడు బోధించి పిలుచుకుని వచ్చేవాణ్నిన్ని తావులో పడివుండే వాణ్నిన్ని నపుంసకులుగా నిందించి ఆతిధ్యము యివ్వవలెనని తోచినప్పుడు వెర్రితనముచేత దారిపొయ్యేవారు రాకపోతే తన్ని ఆదిధ్యము యిచ్చేదే పురుషవాహిని యని ప్రత్యుత్తరము యిచ్చినాడట. క్రీస్తుమతస్థుడు నిర్భంధము చేసేవాణ్ని కౄరుణ్నిగానున్ను వుండేతావులోనుంచి కదలని వాణ్నిస్థావరిరూపుణ్నిగా నిందించి మనసును రంజితపరచి ఆతిధ్యం యిచ్చేవాడు శ్రేష్టుడని ప్రత్యుత్తరవు యిచ్చినాడట. హిందుమతస్థుడు మంచిపదార్ధములున్ను మంచిస్థలమున్ను దొరికినవాడు తనకు అబ్బెగదా అనిన్ని కొత్తవాణ్నిపిలుచుకొని వస్తే తనకు దొరికిన మంచి పదార్ధము భక్షణచేసెవాడికె కొత్తవానికి లేక పదార్ధాన్ని చెరిచి తాను భుజించక ఆ మంచి పదార్ధాన్ని నిందించి పదార్ధము కలవానికి పనికి రాకుండా కొత్తవాడు యెక్కడ చేసిపోనో అనే భయముచేత మంచిపదార్ధము కలవాడు వొకణ్ని చేర్చక వొకని తొను చేరక తనంతట వుండును. వాడు పూర్ణుడున్ను బలవంతముచేసి తన పదార్ధము పెట్టేవాడున్ను బోధించి తన పదార్ధమును పెట్టేవాడున్ను సకాములు వుత్తమ పదార్ధమును కన్నవారు కారు అని పరస్పరమున్ను నిందించివారట.

యిదిన్నిగాక మరివొక ఇతిహాసము విన్నాను. అది యేమంటే వొక యింగిలీషుదొర వొక బ్రాహణ్ని నాదేహమువలెనే నీదేహము రక్తమాంసాది యుక్తములయిన అవయవాదులతో చేసివున్నదే? బ్రాహ్మలు మేము యెక్కువ అని అనుకోవడానకు కారణ మేమని అడిగినంతలో బ్రాహ్మణుడు పుల్లమామిడిపండు తియ్యమామిడి పండున్ను వొక్కదినుసు ఆకులు కొమ్మలుగల చెట్టున వొక ఋతువులో వొకటే విధమయిన తోలు కండముట్టేతో జనించి సమస్త విధాలా వొక్కటేరీతిగా వున్నా రుచిభేదము కావడానకు యేమికారణమో అదేకారణము బ్రాహ్మణుల యెక్కువతనాన కని చెప్పి మరిన్ని బ్రాహ్మలు శ్రేష్టులని యీశ్వరుడు చెప్పినాడంటాము గాని మేమే చెప్పలేదు. యెట్లా అన్ని మామిడిపండ్ల వుత్పత్తి స్థితిలయాలు వొక్కటే క్రమమయినా వాటి భోక్తకు వాటి రుచిభేదము తెలిశి యిది మంచి యిదిచెడు అని వాట్లను వాడినట్లు మీదేహసారానిన్ని బ్రాహ్మణదేహాల సారానిన్ని యెరిగి యీశ్వరుడు తియ్యమామిడిపండు శ్రేష్టమని రుచిచూడగలవాడు చెప్పినట్లు బ్రాహ్మలను శ్రేష్టులని నిరూపించినాడని చెప్పినాడట.

తేదీ మధ్యాహ్నమువరకు కటకములో నిలిచి నాలుగు గంటకు బయలుదేరి యిక్కడికి ఐదు కోసుల దూరములో నుండే గోపాలపూరు అనేవూరు ఎనిమిది గంటలకు చేరినాను. కటకముముందర చుట్టుకొనివుండే మహానదిని పడవలకుండా నొకసారి దాటినాను. లోగడ మామిడిచెట్లు శాలవుండగా వాటిమధ్యే యిప్పుడు సడక్కు వేసి వున్నది. గనుక బహు రమణియ్యముగా వున్నది. గోపాలపూరు గొప్పవూరు. బాజారు వీథి కద్దు. వూరుమధ్యె వొక సరసింహస్వామి గుడి కట్టి లోపలి ఆవరణలో బ్రాహ్మలు దిగడానకు తాళువారము వేశి వెలిపక్క శూద్రులకు తాళువారమువేశి మిద్దెవేశి కట్టివున్నది. గనుక ఆగుళ్ళోనే దిగడమయినది. నరసింహమూర్తిని సుందరముగా చేసి వుంచినారు. యీమత్స్యదేశపు బ్రాహ్మణుడు రెండుకాలాలున్ను పూజచేస్తాడు. దక్షిణదేశపు చట్టముగా గుడి కొంచములో ముఖమంటపము వుంచి కట్టివున్నది. యీవూళ్ళో అన్నిపదార్ధములు దొరికినవి. గోపాలపూరు ముందర రెండు నదులు కాలినడకగా దాటినాను. వాటిపేళ్ళు భార్గవనది వొకటి, కుశనది వొకటి.

తేది వుదయాత్పూర్వము నాలుగు సగం గంటలకు లేచి యిక్కడికి పది కోసుల దూరములో నుండే సత్యవాది యనే వూరు రెండు గంటలకు చేరినాను. దారిలో పిప్పిలి అనే మజిలీ వూరివద్ద మనుష్యులు తడిశేపాటి వర్షము కురిశినది. రేపటిదినము ద్వాదశి గనుకనున్నుజగన్నాధమహాక్షేత్రములో కొంచము బ్రాహ్మణ భోజనము చేయింతామని యత్నముతో యీదినము యింతదూరపు మజిలీ చేయడమయినది. యీవూరున్ను గొప్పది. మహాస్థలము. వొకమఠములో విశాలముగా స్థలమువుండగా దిగినాను. యిక్కడ గోపాల మూర్తి గుడి వున్నది. వజ్రరెఖయనే నది వొకటి చిన్నదిగా గుడికి సమీపముగా ప్రవహిస్తూవున్నది.

ఈ స్థలమాహాత్మ్యము పూర్వకాలములో గోకుల బృందావన నివాసిగావున్న కులీనుడయిన బ్రాహ్మణుడు, ఆసన్న కాలమందు వుపచరిస్తూ వున్నవాడికి తనకన్యకను యిస్తానని వాగ్దత్తము చేసినట్టున్ను, ఆ వృత్తాంతము కన్యాబంధుజనము అబద్ధమని వాదించినంతలో గోకుల బృందావననివాసి యయిన గోపాలమూర్తి పురుషాకృతి ధరించి యిక్కడి రాజుముందర సాక్షి చెప్పి ఆ కులీనుడుకి కులీనుడికన్యను తీసి యిచ్చి వివాహము చేసినట్టున్ను అదునిదలుగా యిక్కడ గోపాలమూర్తి విలశిల్లి అంగుళియ్యముతో గీచి, నదిని కలగచేశి భక్తవత్సలుడుగా వుండేటట్టు వాడుకుంటారు. మత్స్యదేశపు బ్రాహ్మల యిండ్లు యీవూళ్ళో వంద కడపదాకా వున్నవి. యీ మూర్తికి పిష్టపక్వాన్నము నైవేద్యముగాని ప్రత్యక్ష అన్నము నైవేద్యము చేసే వాడికెలేదు.

తేది వుదయాత్పూర్వము నాలుగు గంతలకు లేచి యిక్కడికి అయిదు కోసుల దూరములోనుండే జగన్నాధ మహాక్షేత్రము వుదమయిన రెండు గడియలకు చేరినాను. దారి సడక్కు వేసియున్నది. క్షేత్రానకు కోశెడు దూరములో తులసీదాసు అనే మహాపురుషుడి సమాధి వున్నది. అక్కడ జగన్నాధస్వామి స్థూపీమీదనుండే చక్రదర్శనము అవుతున్నది. అక్కడి స్థలవాసులకు యధోచితము దక్షిణయిచ్చి చక్రదర్శనము చేయవలశినది. అటారానాళాఘాటు కుండా క్షేత్రము ప్రవేశించినాను. ఆఘాటులో యాత్ర్ర వచ్చినవారివద్ద హశ్శీలు పుచ్చుకొనే కచ్చేరి వున్నది. అక్కడ మనుష్యులు గణన చేయించుకొని హాశ్శీలు యిచ్చి చీటీచేయించుకుని స్థలము ప్రవేశించవలసినది.

యీ జదన్నాధ మహాక్షేత్రమాహాత్మ్యము పురాణ సిద్ధముగా యిప్పుడు తెలియడము యేమంటే పూర్వకాలమందు యీ భూమి అతిఘోరమయిన దండకారణ్యముగా వుండినది. అందులో నీలాద్రి అనే పేరుగల పర్వతము వొకటి వున్నది. అందులో నీలమాధవస్వామి అనే మూర్తి నివాసము చేయుచు కిరాతకులవల్ల ఆరాధన చేయబడుతూ వుండినట్తున్ను యిట్లా వుండాగా యిక్కడికి బహు దూరప్రాంతమందున్న యింద్రధ్యుమ్న మహారాజుకు యీమూర్తి ప్రభావము ఈస్థల ప్రభావమున్ను తెలిశి నిశ్చయముగా చూచి విచారించి వచ్చేకొరకు వొక బ్రాహ్మణ్ని పంపించినాడు. పూజ చేయుచున్న కిరాతకులకు నీలమాధవస్వామి తత్పూర్వము నన్ను యెప్పుడు బ్రాహ్మడు వచ్చి దర్శనము చేయుచున్నాడో అప్పుడు మీ అధీనము వదిలిపోతానని చెప్పివుండినాడు. గనుక యింద్రద్ద్యుమ్న మహారాజువల్ల పంపించబడ్డ బ్రాహ్మడు తన్ను బ్రాహ్మణుడని తెలిస్తే కిరాతకులు హింసింతురనే భయముచేత ప్రచ్చన్న వేషుడై యీ దండకారణ్యము ప్రవేశించి స్త్రీలు మాయాశక్తి చైతన్య పరిపూర్ణులై సమస్త కామక్రోధ కలహాలు పురుషులకు కలగచేశేవారు గనుక వచ్చిన బ్రాహ్మణుడు కిరాతక రాజుకొమార్తెను స్వాధీనపరచుకుని కిరాతకులవల్ల అర్చింపబడే నీల మాధవస్వామిని దర్శనముచేసి తన రాజుకు సమాచారము చెప్పను వెళ్ళినాడు. ఇంతలో నీలాద్రిపర్వతమున్ను నీలమాధవస్వామి మూర్తిన్ని సముద్రసైకతమువల్ల అంతర్ధానమైపోయి సముద్రతీరమందుండే చక్రతీర్థమువద్ద బలభద్ర కృష్ణసుభద్రల మూడు కళీబరాలున్ను కొంతమట్టుకు దహనమై కొంతకాలకనిలిచి అవి దారుమొద్దువలెనే ఆకారములు కలిగినవిగా కొట్తుకునివచ్చి పడివుండగా అందులో నీలమాధవస్వామి చైతన్యాంశలు ప్రవేశించివుండింవి. ఆవయినము ముఖ్యకిరాతకులకు తెలిసి ఆ దారుమొద్దులను తెచ్చి మృదంగవతుగా వక్షస్థలములయందు ధరించి వాటిని వాయిస్తూ ఈశ్వరభజన చేయుచూ వచ్చినారు. ఇట్టి సమయమందు యింద్రద్యుమ్నరాజు యీ స్థలము ప్రవేశించి నీలమాధవస్వామి అంతర్ధానమయిన వర్తమానము తెలిసి ఖిన్నుడై బహు తపస్సుచేసి మళ్ళీ నీలమాధవస్వామి ఇక్కడ విలసిల్లుతావని వాకు ఇచ్చినందు మీదట యిప్పుడుదృశ్యముగా వుండే మందిరములు కట్టి మళ్ళీ బహుకాలము తపస్సుచేయుచూ నుండగా యీ మందిరాలు పర రాజు స్వాధీనమై పోయినవి. మళ్ళీయీమందిరలనున్ను కిరాతకుల స్వాధీనముగా వున్న దారువులనున్ను యింద్రద్యుమ్నరాజు సంపాదించిన వెనుక విశ్వకర్మ వృద్ధ స్వరూపముగావచ్చి ఆ దారుమొద్దులను బింబాలు చేస్తూవుండగా విశ్వకర్మ నియమించిన కాలము వరకు మనసు తాళక అతను పనిచేసే ఆలయము తెరిచి చూచినందున సగము మట్టుకైన పనితో ఆ మొద్దులను యథోచితముగా బింబాకృతి చేసి విడిసిపెట్టి విశ్వకర్మ పోయినాడు. తర్వాత ఆరీతిగావుండే బింబాలలోనే మూర్తీభవిస్తానని అశరీరవాక్కుగా యీశ్వరాజ్ఞ అయినందున బ్రహ్మపురస్సరముగా ఆ మూర్తులను యింద్రద్యుమ్న రాజు ఇక్కడ ప్రతిష్ట చేసినాడు. అది మొదలుగా యిక్కడ యీశ్వర చైతన్యము ప్రతిఫలించివున్నది---యిక్కడ ప్రసాదమహిమ యెక్కువ కావడానకు కారణము యేమంటే వైకుంఠములో నుండే శ్రీమహావిష్ణుదర్శనానకు సాంబమూర్తిన్ని బ్రహ్మౌయున్ను వెళ్ళినట్లున్ను అప్పుడు లక్ష్మి బ్రహ్మకు శివునికిన్ని యిచ్చినట్టున్ను వీరుభయులు వుచ్చిష్టమని యెంచక మహాప్రసాదమని భుజించి వీరి స్వస్థలాలకు వచ్చినంతలో వీరుభయుల భార్యలుకున్ను వీరుభయులు కళాహీనులై యున్నట్టు తోచి అందుకు కారణమేమని అడిగినంతలో వీ రుభయులు తాము మహాప్రసాదభక్షణ చేసిన వర్తమానము చెప్పగా ఆ యిద్దరుస్త్రీలు ఆ మహాప్రసాదభక్షణ కళావృద్ధి చేయతగ్గదికాని కళాహీనము చేయనేరదే, మరి యేమి పనిచేసినారో అని చెప్పి ఆ ప్రసారము మాకు యేల తెచ్చి యియ్యక పోతిరి అని అడిగినట్తున్ను వీరుభయులు మీరు స్త్రీలు మాయాస్వరూపులు గనుక మహాప్రసాదానకు అర్హులు కారని మీకు తెచ్ఫి యియ్యలేదని చెప్పి మనము కళాహీనులు కావడానకు కారణ మేమో అడిగి తెలుసుకుందా మని మళ్ళీ విష్ణువద్దికి వచ్చినట్టున్ను విష్ణువు వారికి చెప్పడములో మా ప్రసాదభక్షణవల్ల మీరు కళాపరిపూర్ణులు కావలసినవారైనా ఆ మహాప్రసాదము స్వీకరించడములో ఆ ప్రసాదము మీచేతులకు తగిలి పరంపరగా తక్కువయిన అవయవములలో తాకి ప్రసాదాన కగౌరవము మీవల్ల నడిచినది గనుక తన్నిమిత్తమయిన అపరాధముచేత మీరు కళాహీనులైనారని తెలియచెప్పినట్టున్ను అందుకు ప్రాయశ్చిత్తమేమని అడగగా జగన్నధ మహాక్షేత్రములో వొక పుణ్యతీర్ధము వున్నది, ఆ పుణ్యతీర్ధమందు మీరు స్నానము, పానము మొదలయినవి చేసితి రేని తత్పాపపరిహారమగునని చెప్పినట్తున్ను బ్రహ్మరుద్రులు అట్లా చేసినట్లున్ను తదారభ్య యీ స్థలము వదిలిపొయ్యేటప్పుడు యాత్రకు వచ్చినవారు అందరు ఆ తీర్ధములో ప్రసాదవిషయమయిన అపరాధపరిహారార్ధము స్నానపానములు చేస్తారు. ఆ చొప్పున విష్ణుమహాప్రసాదానకు స్త్రీలు అర్హులుకారని తెలిసిన వెనక పార్వతి సరస్వతులు యిద్దరు ఈ స్థలములో తపస్సుచేసి సర్వసాధారణముగా స్త్రీలకు శూద్రులకు కూడా విష్ణుహాప్రసాదము కలిగేటట్టుగా వరము తీసుమున్నారుగనుక అద్యాపి యిక్కడ ప్రసాదము సర్వసాధానణమై తారతమ్యము లేకుండా పరిగ్రహింపబడుతూ వున్నది.

ఆ చొప్పున తపస్సుచేసి అవసరముగా పార్వతి విమలా అనే పేరు ధరించి యీ గుళ్ళో విలసిల్లి ఆమె సంవత్సరోత్సవములో అద్యాపి తామసపూరాంగ మయిన జీవహింసలు అంగీకరింపుచున్నది. విష్ణుగుళ్ళో ఆవరణము లోపల యీ బలులు జరగడము యుక్తముకాదని కొందరు సాత్వికులు యిటీవల విరోధిస్తే వారిని ఉపద్రవపెట్టి యధాప్రకారము ఆశక్తి బలిపూజలు జరిగించుకుంటూ వున్నది. సరస్వతి రజోగుణ ప్రధానురాలు గనుక యధోచితమైన పూజను అంగీకరిస్తూ యీ గుళ్ళో పార్వతివలెనే విశేషనామధేయములేక విలసిల్లివున్నది. యీగుళ్ళో స్నానము చేసినమాత్రాన విష్ణుసారూప్యము కలగచేయ తగ్గపాటి వొక మహాతీర్ధము వుండినదట. తద్ధ్వారా కాకులు మొదలయిన పక్షులకు విష్ణుసారూప్యము కలుగుతూ వచ్చెనట. ఆతీర్ధము యిప్పుఛు కలిసామ్రాజ్యద్వారా అంతర్ధానమై ఆ ప్రదేశాముయొక్క నిశానిమాత్రము చూపింపుచున్నారు. రజస్యమయిన తాపిని మొదలయిన గ్రంధాలలో పరమాత్మ చతుర్ధాకృతిగా ఇక్కడ దర్శనము యిస్తున్నాడని చెప్పేటట్టు తెలిసినది.

ఇక్కడి గుడి నన్నూరు అడుగుల చచ్చవుకములో సుమారు తిరువట్టూరి గుడిపాటి విశాలముగా రెండు ప్రాకారాలు కలిగివున్నది. గర్భగృహము మీద చక్రము వుంచివున్నది. ముఖమంటపము విశాలముగా పయిన పయిన గుంమటము అందము గల స్థూపీ అరటి పువ్వందముగా రెండుతాటిచెట్లపొడుగున కట్టి మీద చక్రము వుంచివున్నది. ముఖమంటపము విశాలముగా పయిన గుంమటము అందముగల కట్టి వున్నది. ముఖమంటపముయొక్క బయిటి ప్రాకారము గోడలో తురకరాయి మీద చిత్తుళిపని బహుసుందరముగా చేసివున్నారు. గర్భగృహము చుట్టూ చిల్లర గుళ్ళ శానా కట్టివున్నవి. గుడిలోపల వొక అక్షయ వటము వొక ముక్తి మంటపము వున్నది. వాటికింద జపము చేస్తే ముక్తిప్రదమని నియమించివున్నారు. వెలిప్రాకారములో నన్నూరు పొయిలుగల వంటశాల విశాలముగా వొకటి కట్టివున్నది. వొక్కొక్కపొయిమీద పన్నెండు పిడతలు వుంచి అన్నము పచనమయ్యేటట్టు వయిపు, వీలు, చేసివున్నారు. వొక్కొక్కపొయి ఐదు వేల రూపాయలకు కదా చిత్తుగా అమ్మకానికి దొరుకుతున్నది. పచనమయ్యే ప్రసాదములో పొయి గలవానికి వరుమానము విస్తారము. నిత్యము రమారమిని అయిదు గరిశల బియ్యము అన్నము భోగ్యముగా నివేదనము అవుతున్నది. పిడతలు చేసే కుమ్మరవాండ్లు నాలుగు వందలు యిండ్ల వారున్నారు. ప్రసాదస్వీకారము చేయడములో ఉచ్చిష్టదోషము యెంతమాత్రము పాటించక స్వీకారము చేయుచున్నారు. గుడి లోగడ నీలాద్రిపర్వమున్న తావులో కట్టివున్నది గనుక వూరువుండే భూమి కన్నా గర్భగృహము సుమారు నూరడుగుల పొడుగులో కట్టి వున్నట్టు తోచబడుచున్నది.

గుడికి నాలుగు పక్కలా నాలుగు ద్వారాలువున్నవి. అందులో తూర్పుపక్క ద్వారములో ఒక సింహాన్ని చేసివున్నారు. గనుక దాన్ని సింహద్వారమంటారు. అక్కడ సర్కారు మనుష్యులుంటారు. చీటీ చూచుకొని స్వామిదర్శనానికి గుడిలోపల మనుష్యులను యెంచి విడిచి పెట్టుతారు. జేలేశ్వరమువద్దవుండే సువర్ణ రేఖనది మొదలు గంజాం వద్దవుండే ఋషికుల్యానదివరకు వోఢ్ర దేశముగనుక యీ మధ్యేవుండే కాపురస్తులు జగన్నాధానకు వస్తే యెంతమాత్రము హాశ్శీలు యివ్వనక్కరలేకుండా పూర్వమునించి యేర్పాటు అయివున్నది. యితరదేశస్థులు యెవరువచ్చినా నాలుగుదినములు స్వామి దర్శనము చేసి అయిదోదినము భోజనముచేసి పోవడానకు జమను ఒకటి కి ర్పు రెండు రు, రెండు నుంచి ఆరు వరకు-సున్నా, యివ్వవలసినది. యెక్కువ దినాలు స్వామిదర్శనము ఆమేక్షిస్తే ఆలెక్కకు త్రైరాశికము మీద రెట్టించి మహసూలు యిచ్చి చీటి పుచ్చుకోవలేను. మహసూలు తీరువచీట్లు యిచ్చేటప్పుఛు పురోహితము వహించిన పండా మారీఫత్తున వాడి పేరుకూడా దాఖలా వ్రాసుకుని యిస్తారు. క్లుప్తమయిన దినాలకు యెక్కువగా యాత్రవారు వుండి పండా తెలియచేయకపోతే పన్నెండు రూపాయలు జులుమానా పుచ్చుకుంటారు. గనుక పండావాండ్లు క్లుప్త దినాలకు యెక్కువ వొక గడియ అయినా యాత్రవాండ్లను వుండనీయకుండాకూడా ఘాటీవరకువచ్చి సాగనంపించి లోగడ యిచ్చిన చీటీని మళ్ళీ వెళ్ళీపోయిన ఘాటులో దాఖలుచేసి యాత్రావాండ్లు సాగిపోయిన వయినము లెక్కపెట్టించి రెపోర్టు వ్రాయించివేస్తాడు.

యీ పండాలనే స్థలవాసులని ఏడు వందలు యిండ్లదాకా వున్నవి. వీరు ముప్పదియారు తెగలవారై పూజ వంట మొదలైన పరిచారకము గుళ్ళో చెస్తూవుంటారు. ఈగుడి దేవదాశీలు వింజామరలు మొదలైనవి వేశి వుపచారపు వస్తువులు చేతవుంచుకొని సన్నిధానములో సేవ చేయడముగాని నాట్యమాడడము లేదు. మేళగాండ్లు కొలువులేదు. హాశ్శీలు మూలకముగా లక్షాయిరువైవేల రూపాయిలు సాలుకు వసూలు అవుచున్నవి. అందులో సగముమట్టుకు గుడిసెలవుల నిమిత్తము కంపెనీవారు నెలకు సుమారు నాలుగువేల రూపాయిలవంతున యిస్తూవస్తారు. *

గమనిక, * చూడు. యీపుటలోని వ్యాఖ్యానము.

అన్నిదూపాయిలు ప్రసాదముగా నివేదనచేసి ప్రతి దినపు ప్రసాదాన్ని వారివారి క్లుప్తప్రకారము పంచుకోవలసినదిగాని వొక గవ్వ అయినా రొక్కముగా గుడి యిలాకాదార్లకు దొరకదు

ప్రసాదాలు సింహద్వారము మొదలు ముఖమండపము వరకు గంపలలో పెట్టి అనేక అంగళ్ళుగా అమ్ముతూ వుంటారు. వుచ్చిష్ట వ్యవస్థను విచారించక సమస్త జనులున్ను రుచిచూచి కొనుక్కొనుచున్నారు. కంపెనీవరు మహసూలు వసూలుద్వారా పైన వ్రాసిన ప్రకారము యివ్వడము కాకుండా గుడికి కొంత, లాకు జారి భూమిన్ని వుండివున్నది. స్వామిముందర భేటి యనే కానుకలు యేవివుంచినా సరకారు చేరుతున్నవి. యీ మహసూలు ద్వారా సరకారువారికి సమస్త శలవులుపోగా సాలుకు సుమారు పదివేల రూపాయిలు మిగిలేటట్టు తెలిసినది. ♦

గమనిక, ♦ పద్దెనిమిది వందల నలభై మూడు సంవత్సరము వరకు దేవాదాయములను కంపెనీవారు స్వయముగా పరిపాలించుచుండిరి. కలెక్టరులు రెవెన్యూబోర్డు తనిఖీక్రింద అజమాయిషీ చేయచుండిరి. మిగిలిన సొమ్ము తీసికొనుచుండిరి.

పండాలకు యాత్ర వారిని యాచించి జీవనము చేయడమేకాని వేరే యెటువంటి భూరూపకమయిన ఆకరములేక వున్నా లక్షాధిరారులుగా కొందరు పండాలు వున్నారు.

మూడుమూర్తులున్ను దేవదారు దారువులతో నడుముట్టుకు తీరితీరని అంగములతో చేసివున్నవి. బలభద్రుడు జగన్నాధస్వామియనే మూర్తులకు రెంటికిన్ని మణికట్టులేని హస్తాలు ఆలింగనము చేసుకోను జూచిన వతుగా యేర్పరచి యున్నది. మధ్యేవుండే సుభద్రా బింబము చిరతవాలుగా చేతులు లేకనే యేర్పరచబడి యున్నది. జగన్నాధస్వామికి కుడి పక్క సుదర్శనమనే పేరుపెట్టి వొక ముసలాకారముగా ఆదారువుతోనే వొక రూపము యేర్పరచి వుంచినారు. పన్నెండు సంవత్సరములకు వొకసారి వచ్చే అధిక ఆషాఢమాసములో కొత్తదారువులను తెచ్చి మూర్తులు యిక్కడ పరంపర్యముగా చేసే శిల్పులచేత చేయించి పూర్వికపు కిరాతకుల వంశస్థులలో ముక్తిని ఆపేక్షించి ఏకవారాశము చేసి బ్రహ్మచర్యము చెయుచునుండే వృద్ధులచేత పాతమూర్తుల వక్షస్థలములో వుండే చైతన్యాన్ని కొత్తమూర్తులలో వుంపించి ఆవక్షస్థలానకు బీగము ముద్రలు వెయిస్తారు. సుభద్ర మూర్తిలోని చైతన్యము పరరాష్ట్రస్థులకు చిక్కి వోఢ్రదేశమందే వేరేచోట పూజింప బడుచున్నది. నాకు తెలియడములో బలభద్ర మూర్తిలోను జగన్నాధస్వామి మూర్తిలోను అద్భుతమయిన వొక లోహమిశ్ర మయిన హస్తప్రమాణము గల వొక స్థూలాకృతి పరమాత్మకున్ను వొకవిగ్ర, హ,ము జీవాత్మకున్ను ప్రత్యామ్నాయముగా వుండేటట్టు విన్నాను. సుభద్రా దేవిబింబములో వొకలక్ష్మీనారాయణ మూర్తి సాలగ్రామము మాత్రము వుండేటట్టు పీఠము మీద మెత్తతలగడలు వేశి వుంచి వస్త్రాలంకారము చేసివుంచుతారు. గనుక కాళ్ళుకలిగినట్తుగానే దర్శనమూవుతూవుంచున్నది. జగన్నాధ బింబమునకు నీలవర్ణము పూశి యున్నారు. బలభద్రబింబమునకు శ్వేతవర్ణముమున్ను సుభద్రకు పసుపువర్ణమున్ను పూసి వర్ణముతో కండ్లుముక్కు యేర్పరచి యున్నారు. రత్నమయముగా మూడుశిరోభూషణములు మూడు బింబములకు ధరించివున్నవి.

నిత్యము యేడు భోగ్యపదార్ధములు నివేదన మవుచున్నవి. వాటిలో ప్రధమద్వితీయాలు యేమంటే బాలభోగ్య మొకటిన్ని కిచ్చిడి భోగ్యమొకటిన్ని యీ రెంటిలోనే విశేషపదార్ధాలు చెరడముగాని తతిమ్మా భోగ్యమునంతా అన్నము పప్పుకూరలు చారు పులుసు పరమాన్నము వడలు అతిరసాలు మొదలయిన పిండివంటలున్ను చేరి నివేదమవుచున్నది. బాల భోగ్యానకు దూదుపూరీ అని పాలమీగడతో వొక దినము పూరీచేస్తారు. అది అపూర్వముగా తోచినది. మిరపకాయలకు బదులు మిరియాలు వాడతారు. హారతికి పచ్చకర్పూరము వాడుతున్నారు. ఉదయకాలమందు దంతధావనసేవయున్ను అర్ధరాత్రిలో బడాశృంగారపు సేవయున్నుముఖ్యములు. నైవేద్యమయ్యేవరకు ప్రసాదాలు నియమము కల పండాల అధీనముగా వుంచున్నవి. నైవేధ్యానంతరము జాతిహీనుల అధీనమయి అందరికి వారు తెచ్చి యిస్తూ వుంటారు. వంటశాలలో పాచకులు తప్ప యితరులు పోకూడదు.

జ్యేష్ఠశుద్ధ పున్నమనాడు గర్భగృహములోనించి మూర్తులను వెలిప్రాకారములో వుండే అభిషేక మంటపానకు నడిపించి తీసుకుని వచ్చి జ్యేష్ఠాభిషేక మంటపములో సాయంకాలము దాకా వుంచి రాత్రి మళ్ళీ నడిపించి గర్భగృహము వద్దికి తీసుకొనిపోయి మరుసటి అమాస్య వరకు తెరకు లోపల యెవరికిన్ని దర్శనము లేకుండా శయనావసరముగా మూర్తులను వుంచి పెట్టుతారు. యీపక్షము యావత్తు కిరాతక వంశస్థుల ఆరాధనతో మూర్తులుంటున్నవి. పండాలుకూడ చూడడము లేదు. జ్యేష్ఠాభిషేక మంటపము బహువున్నతముగనుక ఆ అభిషేక దినము సాయంకాలము వరకు వూళ్ళో యెదటి వీధులలో వుండే వారికంతా స్వామిదర్శనము అవుతూవుంచున్నది. యీదినపు యాత్రనున్ను రధయాత్రనున్ను పతితపావనయాత్ర అని యిక్కడివారు చెప్పుచున్నారు. జ్యేష్ఠాభిషేకానంతరమువచ్చే అమావాశ్యమీది పాడ్యమినాడు ప్రతిసంవత్సరమున్ను చేసే క్రొత్తరధాలు మూటినిన్ని సింహ గొప్పది. పది వందల యిండ్లు వుండును. రధములుపొయ్యే వీధులు మాత్రము నిండా విశాలముగా వున్నవి. స్వతంత్రుఘుగా శీమనుంచి వచ్చివుండే పేయిర్ అనే దొరను యాత్రవారి మహసూలు వసూలు చేసే పనులలో కలకటరు హస్తాంతరముగా మామూలు ప్రకారము అటారానాళాఘాటువద్ద వుంచి వున్నారు. యాత్రవారి సమేతముగా పండాల విచారణ ఆ దొర పరమై వుంచున్నది. బియ్యము మొదలయిన సమస్త పదార్ధములు అంగళ్ళలో వుండేవి. స్వామికి నివేదనాహ్రములు గనుక వాటిని వాసన చూచి మళ్ళీ ఆ రాసులలో వెయ్యనియ్యరు. యీ నియమము వింతగా యీవూళ్ళో జరుగుచున్నది. మహాజనులనే సాహుకారులు యీ వూళ్ళో లేరు. సమస్త పదార్ధములు దొరుకువున్నవి. యీవూరు సముద్ర తీరమందున్నవి. యిక్కడ సముద్రస్నానము బహుముఖ్యము. జాతులవాండ్లు సముద్రతీరమందు యిసుక దిబ్బలలో వుపాయమైన యిండ్లు కట్తుకుని కాపురమున్నారు.

కొత్త మూర్తులను ప్రతిష్ణచేసిన వెనక గుళ్ళోవుండే పాత మూర్తులను మూటినిన్ని రెండో ప్రాకారములో వుండే మోక్షద్వారమనే కూపములో ప్రవేశింప పెట్టుతారు. ఆ కూపము అగాధమైన లోతని తెలియవచ్దినది. ఆ కూపము వుండే ప్రదేశానకు యిక్కడివారు పోను భయపడుతూ వుంటారు. పాతమూర్తులలో నుండిన చైతన్యకళలను కొత్తమూర్తుల వక్షస్థలములలో ప్రవేశింప పెట్టినవెనక రెండుమూడు నెలలలో ప్రవేశపెట్టిన వృద్ధ కిరాతకులు దేహాలు వదులుతారని నిశ్చయముగా తెలిసినది. దానికారణము యీశ్వరునికే తెలుసును. అయినా నాకు భయమే కారణముగా తొచుచున్నది. యిక్కడ నాలుగు కూరలు పప్పుపులుసు పరమాన్నము రెండు పిండివంటలతో సాధారణముగా వెయింటికి భోజనము చేయించ వలిస్తేయిన్నూటయాభై రూపాయలు సరాసరిపట్టుచున్నవి. యిక్కడ అనేక మకాలున్ను రోగిష్టులకు ప్రసారవినియోగమయ్యే కొరకు కంపెనీ ధర్మశాల వొకటిన్ని వుండేటందున బ్రాహ్మణ భోజన నిమిత్తము వొకదినము ముందు పిలిస్తే పండితులు పామరులుసహా వెయ్యింటికి చేరుతారు. గుడి పండాలలో పద్నాలుగు వందల కి దాకా చేరుదురు. గోసాయిలు బయిరాగులు యేనూటికి చేరుతారు. వొక్క అణాపామరునికిన్ని నాలుగూణాలు పండితుడికిన్ని దక్షీణ యిస్తే ఆనందింపుచున్నారు. గొప్పవాడు యీ స్థలము విడిచిపెట్టి వచ్చేటప్పుడు గుడియిలాకాపండాలకు నూరు రూపాయలు బహుమతి రూపముగా మొత్తముగా యిస్తే వారివారి తారతమ్య ప్రకారము కలియపంచుకొని తృప్తిని పొందడము లేదు. నాపరువుకు మొన్నూరు రూపాయలు ముట్టచెప్పితే యెంత మాత్రము నా పురోహితునికి కనికరము తోచ లేదు.

వింధ్యకు ఉత్తర దేశస్థులు యెందరు ధనికులు యెందరు ప్రభువులు యే యాత్రవచ్చినా యే సత్కర్మలు చేయతలచినా తోచిన కాలమందు యీశ్వరుడు యిచ్చిన సంపత్తుకొద్ది దానాలు చేసి యత్నసిద్ధి గలవారవుతారు గాని దాక్షిణాత్యుల స్వభావము వలె నేటికి బోరిగెల కోనుకోగానే సరేనా, యెల్లప్పటికి వొక్కటేరీతిగా నడవను యోచనచేసి ఒక్కటే నిదానముగా ధర్మము చేయుచూ వుండవద్దా? అని వెర్రితనముగా యీశ్వరవేద్యము లయిన భవిష్యత్కార్యములను తమకు తెలిసినట్టు తమ అధిక జాగ్రత్తవల్ల కొన్నిపనులు నడవతగ్గట్టుగా యీశ్వరుడు కటాక్షించిన కాలమందు కూడా శక్తికొద్ది ధర్మము చేసుకోకుండా విత్తము త్యాగభోగరహిత మయ్యేటట్టు దాచి వ్యర్ధోపయోగ మయ్యేటట్టు చేయడములేదు. గనుక హిందుస్తానులోని గొప్పవారు యీ పండ్యాలవంటి యాచకులకు యిచ్చే ప్రకరణములో అతిశయమైన యీవిని యిస్తారు గనుకనున్ను దక్షిణ దేశస్థులు కొంచముయిచ్చి తియ్యనిమాటలు శానా చెప్పుతారు గనుక దక్షిణ దేశస్థులకు యేర్పడివుండే పండ్యా దాక్షిణాత్యులకు రాక్షసులని నామకరణము చేసినాడు.

ఈ స్థలముయొక్క రీతి యేమంటే గుళ్ళోవుండే బింబాలు నిరూపించకూడని స్వరూపాలతో వుండడమున్ను రెండుబింబాలు యిరు పక్కల వుండేవి యధోచితముగా సమయమయిన గాత్రముతో వుండడమున్ను మధ్యే సూక్ష్మరూపముతో ఒక బింబము స్త్రీ అని పురుషుడనిన్ని సందేహవిషయముగా వుండడమున్ను వుచ్చిష్టనిషేధములు లేక ప్రసాదస్వీకారము చేయడమున్ను ప్రసాదముమీద అత్యంతగౌరవమున్ను జాతినియమ వర్జితమున్ను యివిమొదలయినవి కలిగియున్నవి. వీటిని యావత్తున్ను వొక సమూహముచేసి వాటివాటి కారణాలున్ను ఆ కారణాలలో పరంపరగా జన్యమయ్యె కారణాలున్ను యివంతవిచారించగా నా బుద్ధికి తొచడము యేమంటే సమస్తమయిన కర్మభూమియందున్ను సగుణోపాసనకు అనుకూలముగా అనేక దేవతల ఆరాధనలు నియమించి వారివారి భార్యలతోకూడా బింబాలను చేసి వాటికి మందిరములు కట్టి ఆరాధింపుచూ వుండగా నిష్కాముడయి మహాత్ముడయి నామరూప రహితుడయి జ్ఞాన స్వరూపుడయిన దేవునియొక్క రీతిని లోకులకు కృష్ణలీలలను భాగవతసేవ అనే ఆటమూలకముగా ప్రసిద్ధపరచినట్లు యీ జగన్నాధమందిరాన్ని కట్టి యిందులోని మూర్తులను యీరీతిగా రూప నిర్ణయములేక కల్పించి స్థాపించి వొక తత్వ సంగ్రహ పురాణద్వారా ఉచ్చిష్టదోషరహితముగా ప్రసాదగ్రహణము జాతిభేద నివృత్తి యీ స్థలములో కలుగజేసి ప్రకాశింపచేసినట్టు తోచుచున్నది. దని క్రమ మేమంటే శుద్ధతత్వము సమస్తశౄతి చోదితముగా నాదము బిందువు కళ అతీతము అని చెప్పబడుచున్న నాలుగు వస్తువులు ఒకటిగా అయితే అవాజ్మానసగొచర వస్తువు ప్రకాశిస్తున్నది. నాదస్వరూపమయిన జీవాత్మ, బిందు స్వరూపమయిన ఆత్మ కళా స్వరూపమయిన అంతరత్మ, అతీత స్వరూపమయిన పరమాత్మ వీటియొక్క రూపములు యిట్టివని నిర్ణయించ కూడనిది సత్యము గనుక నిర్ణయించకూడని రీతిగానే జీవాత్మ అని చూపించేకొరకు యిప్పట్లో బలభద్రుడనే బింబాన్ని చేసి ఆత్మ నిరూపణ కొరకు సుభద్ర బింబాన్ని చేసి అంతరాత్మయొక్క నిరూపణకొరకు జగన్నాధస్వామిబింబాన్ని చేసి పరమాత్మ నిరూపణకొరకు శుద్ధస్తంభాకారముగా వుండే సుదర్శన బింబాన్ని కల్పించి యీ నాలుగింటిని బోధితము లయ్యేటట్టు చేయడము అవాజ్మానన గోచరవస్తువుయెక్క అన్నమయినందున ఆ అన్నాన్ని ప్రసాదముగా యిక్కడ పేరుపెట్టి సమస్తానకు ఆధారభూతము అన్నము


ఇరువదిరెండవ ప్రకరణము  జగన్నాథ క్షేత్రము నుండి గంజాము

గనుక దాన్ని సమస్తవిధాలా యిక్కడ పూజితపరచి అన్నము యెట్టిగతిని పొందినా నిషిద్ధముకారని యేర్పరచి ప్రపంచము యావత్తు పైన వ్రాసిన అయిదు పదార్ధాలకు అంతర్భూతము అయినది గనుక నేను యెక్కువ, నీవు తక్కువ అనే బుద్ధి లేకుండా జాతి నియమాదులు కూడా మరిచిపోయి ప్రవర్తించేటట్టు ప్రసాదస్వీకార విషయములో వొకనిర్ణయము గలగచేసి అందుకు కొన్ని పురాణాలున్ను ప్రసిత్థ పరచినట్టు తోచుచున్నది. అటువంటి సారవత్తైన పురాణాలున్ను ప్రసిద్ధ పరచినట్టు తోచుచున్నది. అటువంటి సారవత్తైన పురాణములు ఇక్కడ దొరకకపొయినా వాటి కధాక్రమము యెవరికైనా యిక్కడ జ్ఞాపకము వుండునా అని విచారిస్తే యెటువంటి పండితునికిన్ని నాకు తోచినకధ వినికిడి అయివుండేటట్టు తోచలేదు. అయితే పరబ్రహ్మ నాలుగాకృతులతో యీ స్థలమందు ప్రకాశింపు చున్నా డని వొక మాట స్థూలముగా పండితుల వాక్కున ప్రచురముగా వినపడుచున్నది. వాటి క్రమ మేమని అడిగితే ధోరణిగా చెప్పను వారికి వినికిడి లేకుండావున్నది. యిటువంటి మహాస్థలములో జూన్ నెల ఇరవై ఆరు తేది వరకు వసించినాను.

తేది భోజనోత్తరము పదకొండు ఘంటలకు బైలుదేరి యిక్కడికి నాలుగు కొసుల దూరములో వుండే సరసింగఘాటు అనే వూరు మూడు గంటలకు ప్రవేశించినాను. యీ వూరు చిన్నదైనా ముసాఫరులకు కావలసిన సామానులు అన్ని యిచ్చేపాటి కోమట్లున్నారు. యిక్కడ కోమట్లు రెండుతెగలు. కళింగ కోమట్లని వొకతెగ, గౌరకోమట్లని వొక తెగ. దక్షిణదేశములో వుండే తెగ గౌరకోమట్లు. యిక్కడగౌరకోమట్లు నిండాలేదు. యీవూళ్ళోదక్షిణదేశస్థుడు ముద్ధుకృష్ణ పిళ్ళ అనేవాడు గంజంలో వుద్యోగముచేసి వొక డాబా అనే సత్రము చుట్టు మిద్దెవేశి కట్టి మధ్యేజగనాధస్వామికి వొక మందిరముకట్టి వొక తటాకము వొక వనప్రతిష్ట చేసి భూస్థిరులు సంపాదించి అతిని ఆచార్యపుషుడు జగన్నధ నివాసియై వుండగా అతనికి దానము యిచ్చినాడు.

ఆ డాబా యేనూటికి దైగేపాటి విశాలముగా వున్నది. గుళ్ళో వొఢ్ర బ్రాంహ్మణుని గుండాపూజ నడిపింపుచు అప్రతిగృహీత సంతతివారు యిప్పటికి వుంచుకొని వుండేటందున అందులో దిగినాను. యీవూరికి సమీపముగా జగన్నాధ క్షేత్రములో వుండే పండ్యాలు మొదలైన వారికి ముఖ్యమైన యిష్టదేవత అయిన వొక చండీదేవి ప్రతిమ వొక చిన్న కొండమీద ప్రతిసంవత్సరము తామరసపూజలు అంగీకరింపువువున్నది. నేటిరాత్రి సముద్రతీరమందు యిసుకలో నడిచివచ్చినాము. యెండ కాలములో దారి యిక్కడ నడవడము ప్రయాస అనిపించును. చెట్లనీడకూడా లేదు. యీ నాలుగు కోసులదారికి చెరిసగములో వొక మంచి నీల్లబావి నొక బోగంది తొవ్వించినది వున్నది.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కడికి తొమ్మిది కోసులదూరములో వుండే మాణీక్యపట్టణము ఏడు గంటలకు చేరినాము. నిన్నదిగిన మజిలీపూరివద్ద వొక వుప్పుటేరు వున్నది. పాటుపోటు కాలాలు చూచి దాటవలెను గాని పడవలువుండే పాటి లోతు కలది కారు. నేటిదారి సముద్రతీరము. యిసుకలో చిలక సముద్రము అనే వుప్పుకయిదారిగా నడిచివచ్చినాము. మాణిక్యపట్టణములో పోలయిసుదారోగా వుంటాడు. యీ వూరు మొదలుగా మూలఝూ అనేవూరువరకు వొక తురకవానికి జాగీరు. యిక్కడా సమస్త పదార్ధములు అంగళ్ళలో దొరుకును. యీవూరివద్ద చిలకసముద్రము దాటవలసి వున్నది గనుకనున్ను యాత్రవారికి దిగడానకు స్థలములేక ప్రయాసపడుతూ వుండినారు గనుక గంజాం కలకటరువద్ద శిరస్తాగా వుండే వెంకన్నపంతులు జాతి విభజనగా దిగడానకు వసతిచేసి సుందరమయిన ధర్మశాల కట్టి సదావృత్తి అందరికి యిస్తూ వున్నాడు. యీ ధర్మశాలలో యీ దినము వసించినాను.

తేది వేకువనే మూడు గంటలకు లేచి అక్కడికి నాలుగు కోసుల దూరములో నున్న మిఠాగువ్వ అనేవూరు పన్నెండు గంటలకు చేరినాను. ఇంత ప్రొద్ధుపోను కారణమేమంటే, బయిలు దేరిన వూరిముందర చిలకసముద్రమనే నది దాటవలెను. అది రెండు కోసుల వెడల్పు కద్దు. దాన్ని దాటింఛే హక్కు యిచ్చటి జాగీరువారు డయిన తురకకు యివ్వబడి వున్నది. ఆ తురక యీనదిలొ పడవలను పురుగులు తూట్లుపడేటట్లుగా తినివేస్తున్నవని నలుగు యెక్కేపాటి వొంటికొయ్య దోనెలు నాలుగయిదు చెయించివున్నాడు. మనిషికి అణా ఒకటి బండికి ర్పు నాలుగు, సున్నా నుంచి ఎనిమిది వరకు-సున్నా, గుఱ్ఱానికి ర్పు ఒకటి, సున్నా నుంచి నాలుగు వరకు-సున్నా, యీలాగు కూలితీసుకుని దాటింపుచున్నాడు. ఆ చిన్నదోనెలతో నా పరిజనము నూరుమందిన్ని, మూడుబండ్లున్ను, మూడు సవరీలున్ను దాటను అక్కడనే వుదయమయిన ఏడు గంటలదాకా పట్టేను. నాకు సర్కారుకుమ్మక్కు వున్నందున అంత త్వరగా దాటినాను. సాధారణమైనవారు రెండు మూడుదినాలు కాచివుండవలెను.

యీ మిఠాగువ్వలో వుప్పుకొఠారులు వున్నది గనుక వాటి అధికారస్థులు ఇండ్లుకట్టుకుని వున్నారు. జాగీరుదరుడు కట్టించిన డాబా సముద్రపు యిసుక పెట్టి పూడిపోయినది. యిప్పుడు త్రొవ్వి బయటికితీసినా దిగను వసతిగావుండలేదు. వొక్కమర్రిచెట్టు తప్ప వెరే చెట్టునీడకూడా లేదు. వొక్కటే అంగడి వున్నందున అక్కడ వొక బావివొడ్డున చెట్టునీడలో వంటభోజనము కాఛెసుకుని రెండు గంటలకు బయిలుదేరి రాత్రి ఆరు గంటలకు యిక్కడికి ఆరుకోసులదూరములో వుండే మాలుఝూ అనేవూరు చేరినాము.

యిక్కడ జాగీరుదారుడు కట్టిన డాబా పనికిరాక వున్నది. వూరు పెద్దది అయినప్పటికి యాత్రవాండ్లు దిగడానకు స్థలము లేదు. వూరిముందర వొక పెద్ద వటవృక్షమున్ను అమృతతుల్యమైన జలము గలిగి మంచివూటగల బావి వొకటిన్ని వుండగా వాటివద్ద డేరాలు వేశి దిగినాను. యిక్కడ పోలీసు జమేదారుడు వుండే స్థలము గనుక తాత్రిపారాచౌకీ యివ్వడానకు నలుగురు చౌకీదార్లను పంపించినాడు.

కలకత్తా మొదలుగా ప్రతిగ్రామములోనున్ను దక్షిణదేశములోని తలారులు వలెనే యిక్కడ నాయకు లని కొందరు వుంటారు. యిదిన్నిగాక చౌకీదార్లని సరకారువారు యేర్పరచిన వారు కొందరు ప్రతివూరికి వుంటారు. అందరున్ను పోలీసు నౌకరుల అధీనమయి వుంటారు. ఈ మాలుఝూ అనే వూళ్ళో పది అంగళ్ళదాకా వున్నవి. సమస్త పదార్ధాలు దొరుకును. నేటిదారి చిలక సముద్రము మూలుఝూ యీరెంటి మధ్యే యీ దినమంతా నడిచినాను. దారి శుద్ధ యిసక, నిలవ నీడలేదు.

తేది ఉదయాత్పూర్వము నాలుగు గంటలకు లేచి యిక్కడికి ఐదు కోసుల దూరములో వుండే ప్రయాగ అనేవూరు రెండు గంటలకు చెరినాను. యీవూరు మొదలుగా మదిరాసు గౌర్నమెంటు యిలాకాతో చేరినది. వూరుగొప్పదేను. అన్నిపదార్ధాలు దొరుకును. యిక్కడ వొకతపాలా రైటరు గంజాం కలకటరుకింద వున్నాడు. సుంకంచావడి వొకటి వున్నది. వచ్చేపొయ్యేవారి మూటముల్లెలు సరిహద్దుజాగా అయినందున ఆ సుంకరులు శొధించి చూస్తారు. యీవూరు మొదలుగా చెన్నపట్టణపు రూకలు చెల్లుచున్నవిగాని యీ ప్రయాగలో పట్టరు. యీ హద్ధుమొదలుగా పిచ్చశేరులు. శేరు ఒకటి కి యిరవై రూపాయల యెత్తు., శేరు యిన్నిరూకలని వెలగాని యిన్నిఅణాలు పయిసాలు అనుకోవడము లేదు. గంజాములో వుండే వొక గౌరకోమటి యిక్కడ విశాలముగా డాబాకట్టి వొక వనప్రతిష్ట, తటాక ప్రతిష్టయున్ను చేసి భూస్థితికూడా వాటి పరిపాలనకు సంపదించినాడు.

యీ ప్రాంతములలో కొండలు గుహలు అడువులు కల ప్రదేశాలను మన్యా లంటారు. ఆ మన్యాల యజమానులను మన్యదొర లని చెప్పడము, వారి తమకు యిష్టములేనివారి యిండ్లను కలిమిగలవారి యిండ్లనున్ను మనుష్యులకు రాత్రిళ్ళు దివిటీలు యిచ్చి పంపించి కొళ్లపెట్టించి మనుష్యులను నరికించి యిండ్లను కాల్పిస్తూ రావడము సహజముగనుక అదేరీతుగా యీవూరి తపాలారైటరు యిల్లు మరివొకరిద్దరి వర్తకుల యిండ్లున్ను పదిహేను రోజులకిందట యీ ప్రాంత్యపు జమీదారుడు దోపించినాడు. యీ దేశపుజమీదారుడు డాబాభూస్థితిని కప్తీ చేసుకొన్నందున డాబా బేమరామత్తు కింద వసతి తప్పివున్నది. సమీపమందుండే టెంకాయతోపులో డేరాలు వేయించి వంట భోజనము చేసుకొని ఒకటి గంటకు బయలుదేరి యిక్కడికి ఏడు కోసుల దూరములో వుండే గంజాం అనే షహరు తొమ్మిది గంటలకు చెరినాను.

వుదయాన నడిచినదారి సముద్రతీరమైనప్పటికి యిసక వొక మాత్రముగా వుండినది. భోజనాత్పరము నడిచినదారి యేనుగపొడుగు యిసక దిబ్బలమధ్యే వొకపక్క సమద్రము, కుడిచేతిపక్క అంది పుచ్చుకున్నట్టు మింధ్యపర్వతము వుంచూ వచ్చినది. యిక్కడ వింధ్యపర్వరము సముద్రములో కలిసినట్టు తోచుచున్నది. యిక్కడ యెప్పుడున్ను దొంగలు కొట్టి దోచడము వాడికె యని తెలిసినది. నిలవనీడ, తాగ నీళ్లున్ను దొరకవు. ప్రయాగకు గంజానికి చెరిసగములొ వొకబావి. వొక చిన్న శివాలయమున్నున్నది. ఆగుడిచుట్టూ యీశ్వరాజ్ఞ చేత వొక మర్రిచెట్టు ఆవరించినట్టు అల్లుకుని యేనూటికి చాలేపాటి చల్లని నీడ గలిగివున్నది.

గంజాం షహరు పదిహేను యేండ్లకిందట మల్లాడి యనే జ్వరముచేత హతమైనది గనుక నున్ను మిగిలినవారు బురంపురమునకు వలసవెళ్ళి అద్యాపి అక్కడి నివాసులై యున్నారు గనుక షహరు పాడుపడ్డట్టుగా కనుబడుచున్నది. యిక్కడ వాడలు మరామత్తు చెయ్యడానకు గంగాతీరమందు కలకత్తాలోనుంచి వుడిబడియాకు నావలమీద వచ్చే దారిలో బాందలు అమితముగా చేసి పగిలిన వాడలు వుంచివుండేటట్టు యిక్కడ సముద్రతీరమందు గదులు చేసి వాడలు వుంచివున్నది. అనేక గొప్పయిండ్లు ఖాలిగా వున్నవి గనుక అందులో వొక యింట్లో దిగినాను. యిక్కడ వొక రేవుదొర, వొక కొత్తవాలు న్ను న్నారు. మొసాఫరులకు కావలసిన పదార్ధాలు ఆని దొరుకుచున్నది.

యీ గంజాం పట్టణము ఋషికుల్య అనే నదితీరము. వింధ్యగిరి యిక్కడనే సముద్రగామి యయినందుననున్ను, యీ గంజాము వింధ్యకు దక్షిణదేశ మనిపించుకోబడి యిక్కడివారు యీ ఋషి కుల్యనది మొదలుగా చాంద్రమాన రీత్యా అయ్యే ప్రభవాది సంవత్సరములను సంకల్పములో చెప్పుతారు. ప్రయాగ యనే వూరివరకు బృహస్పతి మానము, గంజాం మొదలుగా చాంద్రమానము. గంజాం మొదలుగా యీశ్వర నిర్ణయ ప్రకారము కళింగదేశము ఆరంభమవుటఛేత యిండ్లు మనుష్యుల అలంకారాలు దృష్టిదోషపు పాటింపులు దక్షిణదేశము వలెనే యావత్తు కలిగివున్నవి. చిన్నయిండ్లకు కూడా వాకిట పంచవన్నెలు పెట్టేకట్టినారు. ప్రతిస్త్రీలు బులాకులు ముక్కర ధరించివున్నారు. సమీపమున వుండే మాలుఝూ అనేవూరిలో యెవరికి రాని తెనుభాష యిక్కడ అందరికి వచ్చివున్నది.

జూలాయినెల ఒకటి తేదీ వుదయాత్పూర్వము మూడుగంటలకు లేచి యిక్కడికి నాలుగు కోసుల దూరములోవుండే నాయడిపేట అనేవూరు యేడుగంటలకు చేరినాను. యీ దినము దారి మదరాసు గౌర్నమెంటువారి హుకుము లోబడ్డభూమిలోది గనకనున్ను యీ గౌర్నమెంటువారి యోచన లగాయతునుంచి హిందువులను చలిపురుగులకు సములనే అగౌరవబుద్ధితొ ఆత్మార్ధమైన పనులలో సర్వకృషిచేసి పరార్ధమైన పనులుమాత్రము యీశ్వరాధీనముచేసి వుండడము సహజము గనుకనున్ను కలకత్తా గౌర్నమెంటువారి వలెనే లోకోపకారమైన దారులను గురించి సడక్కువేశే ప్రయాస వీరు విశేషము పుచ్చుకోకుండా వున్నందున యశోవిలాసముగా అడివి యీజిల్లాలొ బలిసివున్నది గనుక ఆ అడివిలో సూటిగా లయనువేసి నూరడుగుల వెడల్పుకు అడివికొట్టి శాలచెట్లు పెట్టినారు. ఆ చెట్లుమాత్రము అక్కడక్కడ వొకటొకటి జీవించివున్నది. భూమిని చదరంగానైనా చేసినవారుకారు గనుక లయనుకు చుట్టూవుండే చదరపు భూమిని వెతుక్కుని దారినడిచేవారు తాము దారులు కలగజేసుకుని నడుస్తూ వున్నారు.

యా దినమంతా భాట అడివి దారిలో చత్రపురమనే వూళ్ళో కలటరు స్థలవసతినిమిత్తము వసింపుచున్నాడు.*

గమనిక, * అరణ్యమార్గంగా చత్రపురానికి ప్రయాణము కలకటరుకచేరీలో ట్రాంసులేటరుగా వుండే కపిల రామదాసు పంతులుగారికి నేను ఒక వుత్తరంద్వారవ్రాసి వున్నంతలో ఆయన నలభై కావళ్ళ రెండు డలాయతులు ఒక గుమాస్తాను పంపి అరణ్యమార్గం సుళువు చేయించినాడు., చూ. వ్రాతప్రతి పుట నాలుగు వందలు పంతొమ్మిది,

యీనాయుడిపేట యనే వూరు అడివిమధ్యే వున్నది. ఆవూరి వద్ద అడివికొట్టి బందా చలమయ్య యనే కోమటి వొక డాబా కట్టించి గుంటబావి తొవ్వించినాడు. వొక అంగటివాడు వున్నాడు. అక్కడ పదార్ధాలు మృగ్యముగా దొరికినవి. అక్కడ భోజనము కాచేసుకుని అక్కడికి మూడుకోసులదూరములో వుండే బురంపురమనే బస్తీ నాలుగు గంటలకు బయిలుదేరి యేడు గంటలకు చేరినాను. దారి తెల్లవారి వలెనే వున్నది.

బురంపురము బస్తీవూరు. గంజాంలో మకారత్రయమనే మల్లఛి మార్తా మరాహి అనే జ్వరములవల్లనున్ను కొండపాళెగాండ్ల బందిపోటువల్లనున్ను మరాటీల కొళ్ళగుర్రాలవల్లనున్ను అర్ధములు ప్రాణాలున్ను పోయి బేజారయిన వెనక కలకటరు మొదలయిన ధైర్యము గల యింగిలీషుదొరలు సమేతముగా ఋషికుల్యానది దాటడానకు సందుచిక్కకుండా వలస వచ్చి ఈ బురంపురము ప్రవేశించినారు గనుక అదిమొదలు యీవూరు వొక పటాలముదండు కూడా వుండబట్టి బహు బస్తీ అయివున్నది.

యీవ్చూళ్ళో కొద్దిదినములకు ముందు సర్వతోముఖమనేక్రతువు నడిచి ఆక్రతువు నిమిత్తము నన్ను యెరిగిన గోదావరీతీరపు బ్రాహ్మణమండలి నూటిదాకా యిక్కడ వచ్చివున్నది. ఆ బ్రాహ్మణులందరున్ను శ్రౌతవిషయము బాగా తెలిసినవారు గనుక అధర్వణ వేదము మూలమా లేక కడమ మూడు వీడాలసంగ్రహమా అని నాకు బహుశ, వున్న సందేహము వారివల్ల తీరు నని వారిని విచారించినంతలో సంగ్రహమేనని తీరినది. అందుకు ఆకరము సర్వతోముఖ యాగములో కడమ మూడు వేదాలవలెనే అధర్వణానకు ప్రత్యేల్కాధ్యరము లేదు. పయిగా లోకప్రకటనకు భారద్వాజులు మూడువేదాలే తెచ్చి యీ మూడింటిలోనుంచి అస్త్రప్రయోగ నిమిత్తము మంత్రమగ్రహము చేసిక్షత్రియులకు అధర్వణమని పేరుపెట్టి వొక వేదము చేసియిచ్చినారు. పంచగౌడులలో గాని పంచద్రావిళ్ళలో గాని మేము అధర్వణుల మని చెప్పేవారు యెవరున్ను లేరు.

కలకత్తాలో నుంచి జగన్నాధమువరకు బోయీలకు జనము వొకటింటికి యేడురూపాయలు లెక్కను, బండి వొకటింటికి యిరువై యెనిమిది రూపాయలు లెక్కను తెచ్చి జగన్నాధమునుంచి మళ్ళీ బురంపురమువరకు వేరేబోయీలను, కావడివాండ్లను జనము వొకటింటికి ర్పురెండు, రెండు నుంచి నాలుగు వరకు-సున్నా, వంతున బండి ఒకటి కి ఏడు ర్పు లెక్కనిష్కర్షచేసి తెచ్చి నాను గనుక వారికి యివ్వవలసినది తీర్చియిచ్చి వేరేబోయాలను వస్తూ వుంచున్నవి. యిక్కడి నేతగాండ్లను దేవాందులంటారు. యీ దినపుదారిలో వున్న అడివి బలిశివున్నది. బహుశా భూమి నల్లరేగడ. దారిలో మంత్రిరెడ్డి అనే వూరు వున్నది.

తేది వుదయ మయిన ఐదు ఘంటలకు లేచి యిక్కడికి ఐదు కోసుల దూరములో వుండే కంతర్ల అనే వూరు పది గంటలకు చేరినాను. యిక్కడా అయిపోలు, అయిపోలు?, వారు అనే యీ దేశపు వర్తకులు వొక సత్రముకట్టి తటాకప్రతిష్ట, వనప్రతిష్టలు చేసి వొక గోసాయి అధీనము చేసినందున ఆ ధర్మశాలను గోసాయీలు వారి నివాస మఠముగా చేసుకుని అందులో వొక మూర్తిని పెట్టి అరాధన చేయుచూ సత్రానికి వుండే భూస్థితిని తమ అనుభవములోకి తెచ్చుకొని సదావృత్తిని నిలిపివేసి ఆధర్మశాలలో భాటసారులను ప్రవేశించనియ్యకుండా నిర్బంధము పెట్టుతూ వచ్చినారు గనుక యీ జిల్లా శిరస్తా వెంకన్నపంతులు యిక్కడనున్నూ, వేరే ధర్మశాల విశాలముగా కట్టింపుచున్నాడు. యిక్కడవుండే కోమట్లు యిటీవల బందిపోటువల్ల వొచ్చిపోయి విడవలి యిండ్లు బందిపోటువారి దీపారాధనకు అనుకూలముగా మళ్ళీ కట్టుకుని, వచ్చినవారికి కావలసిన సామాను యిస్తూవున్నారు. యీవూళ్ళో గుంటవొడ్డున వంట, భోజనాలు కాచేసుకొని మూడు ఘంటలకు బయిలువెళ్ళీ యిక్కడికి మూడుకోసుల దూరములో వుండే కొత్తపల్లియనే వూరు నాలుగు గంటలకు చేరినాము.

యీ వూరివద్ద మహేంద్రతనయా అనే నది వొకటి వున్నది. యీవూరు బ్రాహ్మణ అగ్రహారము. యిది మొదలుగా వింధ్య దక్షిణదేశమయినందున అవశాత్తుగా గంగా యమునా మధ్యప్రదేశమునుంచి వచ్చిన బ్రాహ్మలను యిక్కడిరాజులు ఆదరించి బ్రాహ్మలు దేవమందిరాలు గల వూరే శ్రేష్టమని అక్కడక్కడ బ్రాహ్మలను ప్రవేశపెట్టుతూవచ్చినందుననున్ను యధారాజా తధాప్రజా, అనే వాక్యప్రకారము ఒక పాటిభూస్వాతంత్ర్యము కలవారుకూడా తమతమవూళ్ళల్లో బ్రాహ్మలకు వసతులు చేసియిచ్చి యిండ్లుకట్టి యిస్తూవచ్చినారు గనుకనున్ను యిదిమొదలుగా కన్యాకుమారి పర్య్హంతము బ్రాహ్మణాగ్రహారాలు చూస్తూ రావచ్చునని తోచినది. కొండమార్గములో గోదావరి దాటినది మొదలు యీవరకు అగ్రహారమనే మాట వినలేదు. పంచద్రావిడబ్రాహ్మలు వొక సమూహముగా వున్నవూరు వొకటిన్ని లేదు. వోఢ్రదేశములోని మనుష్యులు మూర్ఖులున్నూ హఠవాదులున్ను కృత్రిమముచేత హఠము సాధింఛేవారుగానున్ను నాకుతోచబడ్డది. యీబరంపురపు షహరుతో వోఢ్రదేశస్థుల ప్రచారము నిలిచిపోయినది. యిక్కడ అందరు తెనుగువాండ్లేగాని వోఢ్రదేశస్థులు అతిస్వల్పముగా నున్నారు. యీ బ్రాహ్మలయిండ్లు చిన్నవైనా అందులోనే దిగినాము.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కడికి ఐదు కోసుల దూరములోనుండే పలాశీ యనే వూరు ఏడు గంటలకుచేరినాను. యూవూరు గొప్పదేను. వొకమఠము కొన్ని బ్రాహ్మణయిండ్లునున్నవి. మఠములో దిగినాను. యీవూళ్ళూన్ని జమీందారులవి. యీ గంజాం జిల్లాలో సరకారుకు పన్నెండు లక్షలరూపాయిలు వసూలవుచున్నవి. అందులో జామీందారులవశముగా వుండేభూమి ఆరులక్షలరూపాయలది గాక మలకు రాజీలని కొన్ని ముఠాలు లోకులు చేసి లాలుకు కిస్తీలప్రకారము సరకారు రూకలు కట్టుతూ వుంటారు.

ఈదేశాస్థులకు బహుమందికి అర్ధలోభము చాలాకలిగి సుషుప్తి కాలాలలో యిండ్లమీద పడి మనుష్యుల అర్ధప్రాణాలు హరింఛే బుద్ధులు పుట్టడముచేత మల్లడియనే వింతజ్వరము యీశ్వరుడు వీరి శిక్షనిమిత్తము ఈ దేశాములో పుట్టించి లక్షావధి ప్రజలను యీలోకము వదలపెట్టినట్టు తోచుదున్నది. అయితే అందులో సాధువులుకూడా కొందరు లయించి యుందురే అని శంక తోచితే అందుకు సమాధానము, ఏక, పాపాని కురుతే ఫలం భుంజ్తే మహాజన,, అనే వచనము. యీ వచనానకు దృష్టాంత మేమంటే వొకగురువు, వొక శిష్యుడున్ను సముద్రతీరమందు సంచరింపు చుండగా వొకగొప్పవాడ ముణిగి పోయినది. శిష్యుడుచూచి అనేకవేల జనము వాడతోకూడా ముణిగి పోయినదిగదా యిందుకు కారణమేమన గురువును అడిగినాడు. గురువు ఆవాడలో ఒక పాపిష్ఠుడు వుండబట్టి వారిగతి అట్లా అయినదని చెప్పినాడు. శిష్యుడు యింత అన్యాయము యీశ్వరుడు చేయవచ్చునా?

వొకపాపి నిమిత్తము వెయ్యింటిని చంప నిచ్చయించడము యుక్తమా అని ప్రశ్నచేసినాడు గనుక గురువు అందుకు మౌనధరుడై యుండేను. కొంతమేర యీశిష్యగురువులు వెళ్ళేలోపలనే సుర్ణ రేఖలు గల వొక సుందరమయిన దక్షిణివర్త శంఖము శిష్యునికి ఆ సముద్రతీర మందు దొరికి నంతలో యెత్తిపూజ్యముగా వక్షస్థలమందు ధరించినాడు. ఆ శంఖములోపల అనేక లక్షల చీమలు శంఖములోని మాంసము భక్షించేకొరకు పుట్టపెట్టి వుండినది. ఆ సమూహములోని ఒక చీమ బయిలువెళ్ళి శిష్యుణ్ణి కరవగానే శిష్యుడు ఆ శంఖముతీసి అందులో చీమల గుంపు చూచి దాన్ని విశిరిపుచ్చి సముద్రములో పడవేసినాడు. యీనడితి గురువుచూచి యేమబ్బా వొకసాఫీనిమిత్తము వెయ్యింటిని యీశ్వరుడు వాడతోకూడ సముద్రములో ముంచినందుకు యీశ్వరుణ్ని దూషించితివే, వొక చీమ నిన్ను కరిచినందుకు అనేకలక్షల చీమలు చచ్చేటట్టు యేల మంచిశంఖమును న్యాయ క్రమ మెరిగిన నీవు సముద్రములో పడవేస్తివని అడిగినాడు.

యీదినము నడిచినదారి దట్టమైన అడివిమధ్యేవున్నది. వెదుళ్లు విస్తారముగా యీఅడివిలోవున్నవి. బురంపూరు మొదలుగా పర్వతసమూహాలు దారికి కుడిపక్క సమీపమందే వున్నవి. జగన్నాధము మొదలుగా భూమి సముద్రతీరమై యిసకైనందున ముంతమామిడి చెట్లు ముంతమామిడిపప్పున్ను ఈ ప్రాంతాల వెశేషముగా కలవు. చెన్నపట్ట్సణము వదిలినవెనక ఈ చెట్లున్ను తమిదె పయిరున్ను చూచిన వాడనుకాను. గంజాం మొదలుగా బురంపురమువరకు భాట పశ్చిమాభిముఖముగా వచ్చి యిచ్చాపురము మొదలు కొండలకిందుగా దక్షిణాభిముఖ మవుచున్నది.

యీదేశములో కర్ణాలు తక్కువజాతివారు. బ్రాహ్మణవేషధారులు వారిని శిష్టుకరణాలంటారు. వేశ్యాస్త్రీలను సాండీ లంటారు. బ్రాహ్మణాగ్రహారప్రవత్రకులను భుక్తు లంటారు. శూద్రగ్రామ ప్రవర్తకులను నీయిం డ్లంటారు. తలారులను చారకు లంటారు. పల్సాళిలో అంగళ్ళు వున్నందున సమస్తపదార్ధాలు దొరికినవి.

యిక్కడ వంట, భోజనము కాచేసుకొని యిక్కదికి ఏడు కోసుల దూరములో నుండే రఘునాధపుర మనే గొప్పవూరు రాత్రి తొమ్మిది గంటలకు చేరినాను.

దారి వుదయాన నడిచినంత వసతికాదు. అంత దట్టమయిన అడివి ఇరుపక్కల లేదు. కొండలుమాత్రము దారికి సమీపముగా వున్నవి. దారిలో కొత్తాగ్రహార మని వొకవూరు వుండగా దానివద్ద కొంతసేపు ఆసోదా చెసుకొని అక్కడి బ్రాహ్మలను పూజించి సాగివచ్చినాము.

రఘునాధ పురములో యిక్కడి జమీదారుడు వొక గొప్ప గుడి రెండు అంతస్తులుగా కట్టి రాధాకృష్ణులను ప్రతిష్టచేసి పూజ నైవేద్యాలకు వసతులు యేర్పరచి బైరాగుల అధీనము చేసియున్నాడు. బ్రాహ్మల యిండ్లున్నా రాత్రి అయినందున స్థలము విచారించుకోలేక ఆగుడివద్ద దేరాలు వేసుకొని దిగి రాత్రిభోజనాలు మొదలయినవి గడిపినాను. గుడి మహాసుందరముగానేవున్నది. యీవూరిలో సమస్తమయిన పదార్ధాలుకలవు. మా డేరాలవద్ద అంగళ్ళు తెచ్చి వేయించి కావలసిన సామానులు తీసుకొన్నాము.

తేది ఉదయాత్పూర్వము నాలుగు గంటలకు లేచి యిక్కడికి అయిదుకోసుల దూరములో నుండే హరిశ్చంద్రపురము పదిగంటలకు చేరినాము. దారిలో కంపెనీవారి వేశిన లయను చుట్టు గనుకనున్ను, ఆ లయను మిట్టాపల్లాలుగా వున్నది గనుక, చిన్నగ్రామముల మీద పొయ్యే పూర్వము కలిగివుండే దారే యిప్పటికి నడుస్తూ ప్రసిద్ధి కలిగి వున్నది. అయితే లయనుదారి అనే మాటమాత్రము వొకటి యిక్కడా వినికిడిలోకి వచ్చియున్నది.

ఈవూరు నలభై యిండ్ల బ్రాహ్మణాగ్రహారము. గంజం మొదలుగా బ్రాహ్మలలో వెలనాడు, కాసరనాడు, నియ్యోగు లనే వ్యస్థలు కద్దు. యీ అగ్రహారాల కన్నిఛికి జమీనుదారులు భూవసతులు చేసి వున్నాదు. హరిశ్చంద్రపురములోను అంగళ్ళున్నవి. సమస్త పదార్ధాలు దొరికినవి. బ్రాహ్మణయింట్లో దిగి వంట భోజనములు కాచేసుకొని నాలుగుగంటలకు బయిలువెళ్ళి యిక్కడికి మూడు కోసులదూరములోనుండే నరసన్నపేటవద్దవుంఛే రావులవలస అనే వూరు ఆరుగంటలకు చేరినాము. దారి పొడిచెట్లు అడివి. కాలిబాట రేగడభూమి.

యీవూళ్ళో కొరివి రామన్నపంతులు అనే జమీందారుడు నివాసము చేయుచూ వచ్చినాడు. వారియింట్లో దిగినాము. అంగళ్ళు వూళ్ళో లేకపోయినా నాపరివారానకు కావలసిన బియ్యము పప్పు యావత్తు ఆ జమీందారుగారు యిచ్చినారు గనుక రాత్రి సుఖోపాయముగా గడిచినది.

మధ్యాహ్నము దిగినవూరు మొదలుగా నరసన్నపేటవరకు రాత్రిళ్ళు నిద్రలేదని గ్రామస్థులు చెప్పుతూవచ్చినారు. దానికి కారణమేమంటే యిక్కడి జమీందారుడు కొన్ని బందిపోట్లకు ఆధారభూతుడైనందున సరుకోటు, Circuit, విచారణకు పెట్టినారట. ఆ కోర్టువారు పూర్తిఅయిన రుజుకాలేదని అతణ్ని వదిలినారట. యిప్పట్లో నామీద సాక్షి చెప్పినవారి వూళ్ళన్ని కొళ్లపెట్టి తగలపెట్టుతానని పౌరుషము పులికి వున్నాడట. అందునిమిత్తము నిద్రలేక బాధపడుతున్నామని చెప్పినారు. జగన్నాధములోను వొకసంగతి వినడములో యిదేప్రకారము హయిదరాబాదునుంచి ధర్మరూకలు తెచ్చే గుమస్తాలను యీదారిలో చంపినందుకు చచ్చినవాడివద్ద వున్న సామానులు కొన్ని దొంగలవద్ద దొరికిన్ని వారిని సరుకోటువారు వదిలినట్టు పండావాండ్లు చెప్పినారు. విజయనగరపు రాజు కాశిలో యిదే ప్రకారము దొంగలను సొమ్ముతోకూడా పట్టిన్ని సరుకోటువారు వదులుతారు గనుక నేను నిభాయించ లేక రాజ్యము కలకటరు అధీనము చేసి కాశీనివాసము చేస్తానని చెప్పినాడు.

యింగిలీషువారి న్యాయమేమంటే, పదిమంది దొంగలు శిక్షలేక తప్పిపోవడము మంచిది గాని, సందేహముమీద వొకగృహస్థుడు దండనకు లోబడడము యుక్తము కాదని లలితముగా న్యాయవిచారణ చేస్తారు. యీదేశములో చూస్తే వొకదుష్టుణ్ని రక్షిస్తే వెయిమంది శిష్టులను శిక్షించినట్టు అనేమాట ప్రత్యక్షముగా వున్నది. యెట్లానడిస్తే చెడ్డదో యీ ధర్మసూక్ష్మము తెలియడానకు యీశ్వరుడు సమర్ధుడుగాని యీశ్వరజ్యోతి దీప్తిగా ప్రకాశించే ప్రకృతి జనులు శక్తులు కారు.

రావడముచేత కొన్నికొన్ని తావులలో పశ్చిమాభిముఖముగా వెళ్ళిమళ్ళీ దక్షిణాభిముఖముగా వచ్చుచున్నది.

యీ శ్రీకాకుళము బలరామక్షేత్రమని ప్రసిద్ధి. యీస్థలమహత్యము స్కాందపురాణాంతర్భూతమయిన కూర్మపురాణములో ముప్పై అధ్యాలలో విస్తరించియున్నదట. యీవూరి వోరగా, లాంగూలనది అనే పేరుకల నది వొకటియున్నది. యీవూళ్ళో వీధులు నడమ ప్రవాహకాలాలలో నదిసంబధమైన వుదకము ప్రవహిస్తూ వుంచున్నది గనుక యిండ్లు పురుషప్రమాణము మిట్టవేశి ఆ మిట్టలమీద కట్టుకున్నారు. నదీతీరమందు కోటీశ్వరుడనే శివస్థల మొకటి పురాణసిద్ధమయినదిగా వున్నది. యీవూళ్ళో బ్రాహ్మణ గుజరాతి వాండ్లు నలభై యిండ్లవారు రత్న వ్యాపారసాహుకారు పనులు చేయుచున్నారు. సమస్తమయిన పనివాండ్లు వున్నారు. యీవూళ్ళో ఎనిమిది తేది పర్యంతము వెనక దిగబడిపోయిన బండ్లను కలుసుకొని వెరే బండ్లు యిక్కడ టీకా చేసేకొరకు నిలిచినాను. బండి ఒకటి కి బురంపూరు నుంచి యిక్కడికి కూలి రూపాయిలు డెబ్బై నాలుగు, యిక్కడినుంచి విజయనగనానకు బండి ఒకటి కి రూపాయిలు నాలుగు చొప్పున నిష్కర్ష చేసినాను.

తేది వుదయమయిన ఐదు గంటలకు లేచి యిక్కడికి అయిదు కోసుల దూరములో నుండే వెజ్జపురం తొమ్మిది గంటలకు చేరినాను. యీ వూళ్ళో నాలుగు బ్రాహ్మణయిండ్లు వున్నవి. అంగళ్ళు కలవు. సమస్త పదార్ధాలు దొరుకును. ఆరునెలలుగా వర్షము లేక నిన్నరాత్రి మంచివర్షము కురిసినది. దారిలో యెక్కడచూచినా మడకలుకట్టిదున్నుతూ వున్నారు. శ్రీకాకుళము నుంచి విజయనగరానకు రెండుమూడు మార్గాలు వున్నవి. అందులో యీ మార్గము సమీపమనిన్ని, వసతి అనిన్ని తెలిసినది. యీవరకు నడిచిన దారి యిసక కలసిన రేగడ. నిండా మిట్టాపల్లాలు లేవు.

విజయనగరపురాజులు సంగీతసాహిత్య ప్రియు లయినందున కొందరు భోగస్త్రీలకు సంగీతరత్నాకరం భరతశాస్త్ర ప్రకారము శిక్ష చేప్పించి తయారు చేయించినారు. వారు కొందరు శ్రీకాకుళము వచ్చి వుండగా చింతా జగన్నాధ పంతులు నిన్నరాత్రి వారి విద్యాప్రకట యిక్కడ విజయనగరపు రాజు గురువు వశిస్తాడు. యీ రాజుయొక్క పూర్వీకులు వైష్ణవ మతస్థులయి దక్షిణదేశ సంచారము లోగడ చేసినందున శానామంది వైష్ణవులను ఈ దేశానకు పిలుపించి ఈ రామతీర్ధాలలో ప్రవేశపెట్టి వారికి పుష్కలమైన భూజీవనాలు యిచ్చినారు గనుక వారు సంతోషముగా యీ రాజ్య్హములో వశింపుచున్నారు. ఈ విజయనగరము యిప్పటి రాజుల పూర్వీకుల కింద రెండు వందలు నలభై సంవత్సరములు గా వున్నట్టు తెలిసినది. ఈదేశము దేవబ్రాహ్మణ సమాగమద్వారా వంద సంవత్సరములుగా నిండార్లుగా కర్మభూమి అయినట్టు తోచినది. యీ బస్తీలో రాజు వశించే చిన్న కోట వొకటి వున్నది. కోటవలిగా యెయ్యిండ్లు కలవు. సమస్తమయిన పనివాండ్లు వున్నారు. బంగారుమీద పోగరపని చేసేవాండ్లు ఘట్టివాండ్లుగా శానామంది వున్నారు. సుందరమైన పాత్రసామానులు చేయగల కంచర వాండ్లున్ను, మంచి బట్ట నేసే నేతగాండ్లున్ను వున్నారు.

యిక్కడి రాజు రాజ్యము విశాఖపట్టణపు కలకటరు అధీనముచేసి కాశీ వాసము సహాకుటుంబముగా చేసుట ఛేత యీ రాజ్యనివాసులు తల్లిని కానని బిడ్డలవలెనే తల్లడింపుచున్నారు. యీ మొర ఆలకించగా హిందువులకు వర్ణాశ్రమధర్మముల ప్రకారము సమస్త తారతమ్యములు తెలిశిచేసే దొరతనమే మిక్కిలీ అనుకూలముగ తోచబడుచున్నది. యిక్కడి రాజు అయిన నారాయణబాబు ధనసంగ్రహ మయిన జాగ్రత విశేషముగా పెట్టక అప్పులపాలైనా ప్రజలవల్ల స్తుతి చేయబడుచున్నాడు.

యీ వూళ్ళొ బోయీలు బండ్లు మార్చుకునే నిమిత్తము సోమవారమంతా గొపాలస్వామి మఠములో నిలిచినాను. యీవూరి యిండ్లు యథోచితముగా బాగానే కట్టియున్నవి. రాజవీధులు మాత్రము విశాలముగానే కట్టియున్నవి. యీ సోమవారము జగన్నాధములో రధోత్సవము గనుక యెవూళ్ళోనున్ను ఒక జగన్నాధస్వామి గుడి వుండగా అక్కడ రథోత్సవము బహువిభవముగా జరిగినది. యీ రాజ్యము తొమ్మిది లక్షల రూపాయల దని పేరు. రెండు లక్షల యెత్తుతున్నది. సాలుకు నాలుగు లక్షలు కంపెనీవారికి కట్టవలశినది. దేవాదాయము బ్రహ్మా


ఇరువదిమూడవ ప్రకరణము  గంజాము నుండి రాజమహేంద్రవరము

దాయము యీరాజ్య్హములో రెండు లక్షల దాకా వుండేటట్టు విన్నాను. యిక్కడానున్ను బందిపోటు వుపద్రవము చెన్నపట్టాణములో వారంటు తియ్యడాలు జడిజీకోటుకు యీడ్చడాలవలెనే వొకరి మీద వొకరికి కోపమువస్తే నిమిషములో జరిగింపుచున్నారు. ఆదివారము రాత్రి నేను దిగిన వూళ్ళో వొక బిందువు పడకపోయినా విజయనగరములో అమితమయిన వర్షము కురిసినది.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కడికి ఆరు కోసుల దూరములో వుండే ఆలమంద యనే వూరు రెండు గంటలకు చేరినాము. యీ విజయనగరము దేశపు బోయీలు బాగా నడుస్తారు. చెన్నపట్టణములో పల్లకీసవారీలయొక్క షోకు బహుశా అందరికి కలిగి వున్నందున గంజాము మొదలుగా వుండే బోయీలందరు చెన్నపట్టణము వచ్చుచున్నారు. చెన్నపట్టణములోనుంచి నాతోకూడా యాత్రవచ్చిన యాత్రబోయీలలో కొందరు యిండ్లు బురంపురము వద్ద వున్నందున వారు శలవుతీసుకొని వెళ్ళినారు.

నేను కన్యాకుమారి మొదలుగా కాశ్మీరమువరకు సంచరించిన ప్రదేశములలో వుప్పాడ బోయీలకు సమానమైన మోతగాండ్లు, చూపరులు, బలాఢ్యులు, అలంకారప్రియులు, ప్రయాసకు వోర్చగల వారు, బంట్రౌతుమానాగా ఆయుధధారణప్రియులు యెక్కడా వున్నట్టు తోచలేదు. అయితే దేశముకాని కొన్నిదేశాలకు వస్తే యీ వుప్పాడ బోయీలకు దేహదార్ఢ్యము తప్పి రోగిష్టులొవుతారు. వారిని జాగ్రత్తగా కాపాడుచూ వారి దేహములు వొచ్చిన కాలమందు ఆయా దేశస్థులయిన బోయీలతో పనిగడిపి వీరిని తీసుకొనివస్తే యీ వుప్పాడ బోయీలతో భూగోళ సంచారము యావత్తూ చేయవచ్చునని తోచుచుచున్నది. పాలకీలు మోశే వృత్తికి యీ వుప్పాడదేశస్థులనే ఈశ్వరుడు తగినవారినిగానే నియమించినట్టు తోచబడుచున్నది. అయితే వీరు మాంస, మద్య, మత్స్యప్రియులు మిక్కిలి అయినంచున వీరు తాగినప్పుడు తమలో రాము పోట్లాడితే పోట్లాటలు ఖామందుల మనసున నిండా నొప్పిచేస్తున్నది.

నేడు వుదయాన నడిచినదోవ కంపెనీలయను దారి కిరుపక్కలా చెట్లుమాత్రము పెట్టి యండాకాలములో వాటికి నీళ్ళు పోయడానకు మనుష్యులను వుంచుతారు. వర్షాకాలము రాగానే ఆ మనుష్యులను తీసివేయడమువల్ల పెట్టినచెట్లు అదృశ్యమయి మళ్ళీయివతలి సంవత్సరానకు కొత్తచెట్టు పేట్టవలసి వున్నవి.

యీ రాజ్యములో వీరభద్రరాజు యనేవాడు తనకు కావలశినంతా నారాయణ బాబుగారి కార్యస్థులు యివ్వలేదని కొళ్ళగాండ్లను కొలువు పెట్టించి మనుష్యులను హింస చేయుచున్నాడు గనుక నేను బురంపురములో కొలువు పెట్టిన ఆరుగురు బంట్రౌతులు శ్రీకాకొళమునుంచి కోటునజీరు తయినాతి పంపించిన ముగ్గురు జవాన్లు గాక నారాయణబాబుగారి ఫౌజు సంబంధ మయిన పదిమంది శిఫాయిలను కూడా తెచ్చినాను. ఆలమందలో విజయనగరమురాజు నారాయణబాబుగారి షడ్డకుడు వాసము చేస్తాడు. పది బ్ర్రాహ్మణయిండ్లున్నవి. సమస్తమైన పదార్థాలు అంగళ్ళు కలవు గనుక దొరుకుచున్నవి. యిక్కడ వర్ష ప్రతిబంధముఛేత యీ వూళ్ళో యీరాత్రి వసించినాను.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కడికి ఆరు కోసుల దూరములో వుండే సబ్బవర మనే వూరు రెండు గంటలకు చేరినాను. దారి బహు దొంగల భయము. కొండలు, అడివి దారి కిరుపక్కలా వున్నవి. కొంతదూరము రాతిగొట్టు తతిమ్మాదారి కొంతదూరము యిసకపొర, కొంతదూరము రేగడాభూమిగా నున్నది. ఆలమంద అనే వూరికి సమీపమందు అరణ్యము మధ్యే కొండమీద పర్మనాభమనే స్థలము వున్నది. పురాతన ప్రతిష్టగాని అనాదిపురాణ సిద్ధముకాదు. అక్కడ మానుషసంచారము విస్తారములేదు. సబ్బవరమనే వూళ్ళో వెన్నకోటివారు వొక గ్రామము విజయరామరాజువద్ద సంపాదించి వొకపాలు అగ్రహారానకు వృత్తులు చేసి మరివొక పాలు అన్నసత్రానకు వొదిగేటట్టు నిశ్చయము చెసి వొక అన్న సత్రము కట్టి మరివొకపాలు తమ వంశస్థుల అనుభవానకు వుంచినాడు గనుక అతని వంశస్థుడైన రవణప్ప ఆ సత్రము లోకోపకారముగా బహుచక్కగా నడిపింపుచున్నాడు. యీ దినము మేము కొంచము తడిశినందున యీ రాత్రికూడా నిలిచినాను. యీవూళ్ళో వచ్చిన సమస్తజాతిపాంధులకు కావలసిన భోజనసామానులు యీ సత్రములో బలవంతముచేసి కావలిస్తే పక్వాన్నముగాకూడా పెట్టుతారు. అంగళ్ళు విచారించనక్కరలేదు. నలభై బ్రాహ్మణయిండ్లున్నవి. మంచి వసతైన గ్రామము.

యీవూరికి రెండుకోసులదూరములొ సింహ్వాచల మనే మహా స్థల మున్నది. ఆ గుడిఖర్చుకు సాలుకు పది వేల రూపాయిలు తగులు చున్నవి. యీ ధర్మము విజయనగరపురాజు పరిపాలనఛేయుచున్నాడు. యీస్థల మహాత్మ్యము ప్రహ్లాదుణ్ని తండ్రిదండనవల్ల నివర్తింప చేసి కాపాడిన అవసరము. యీ మూర్తి పేరు వరాహ నరసింహమూర్తి. అనేక జలధారలు స్రవింఛే పర్వతము మీద వరాహాకృతిగా ఆ మూర్తి వొకమందిరములో వసించివున్నాడు. రెండు వందలు వైష్ణవుల యిండ్లు యీ స్థలమందున్నవి. రాజోపచారములతో యీ మూర్తిని ఆరాధింపుచున్నారు. అక్షతదియతప్ప మరియేదినము ఆ మూర్తి దర్శనములేదు. తతిమ్మా దినాలు చందనముచేత ఆ మూర్తిని కప్పివుంటారు. యీ మూర్తియొక్క ధాన్యశ్లోకము యీ అడుగున వ్రాయుచున్నాను. శ్లోక, త్రాహీతి వ్యాహరంతం త్రిదశా రిపుసుతం పాతుకామ స్స్వభక్తం ı విస్రస్తం పీతవస్త్రం జిజకటియుగళే నవ్యహస్తే గృహ్ణన్ ı వేగశ్రాంతం నితాంతం ఖగపతి మమృతం పాయయ న్యస్స్వపాణౌ ı సింహాద్రౌ శీఃఘ్రపాతక్షితినిహితపద, సాతుమాం నారసింహ, యీ శ్లోకమే యీస్థల మాహాత్మ్యానకు సంగ్రహమని తెలియవలసినది.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కదికి ఏడు కోసులదూరములో నుండే కసంకోట అనేవూరు తొమ్మిది గంతలకు చేరినాను. దారిలో అనకాపల్లి హనే మజిలీవూరు వున్నది. పోలీసు అమీనున్నునలభై యిండ్ల బ్రాహ్మణాగ్రహారమున్ను కలది. దారి నిన్నటివలెనే భయోత్పదములయిన మన్యాలు యిరుపక్కలా కలిగివున్నవి.

కనంకోట యనే వూరు గొప్పదేను. అన్నిపదార్ధాలు దొరికేపాటి అంగళ్ళు కలవు. బ్రాహ్మణ యిండ్లలో వంట, భోజనము కాచేసుకుని వొక గంటకు బయిలుదేరి యిక్కడికి యేడుకోసులదూరములో నుండే యలమంచిలి యనే వూరు ఏడు గంటలకు చేరినాను.

నేటి మధ్యాహ్నము దారిలో వ్యాఘ్రభయాలుకూడా కద్దు. యిది మజిలీవూరు అయినప్పటికిన్ని దారి వొత్తి వొకకోసుదూరములో వుండే దివ్యల అనే గ్రామ నివాసి యయిన భాగవతుల కిత్తన్న యెదురుగా వచ్చి తన వూరికి రమ్మని ప్రార్థించినందున ఆ వూరు ఏడు గంటలకు ప్రవేశించి ఆరాత్రి ఆ మరునాడు శుక్రవారము వర్ష ప్రతిబంధముచెత నిలిచినాను. యీ వూరు వంద యిండ్ల అగ్రహారము. అందరు ఉపపన్నులు అయినప్పటికిన్ని వొక యతిశాపముచేత పెంకుటిండ్లు కట్టక పూరియిండ్లల్లో కాపురము చేయుచున్నారు. యీ వూళ్లో వుండే బ్రాహ్మణులందరు వేదపారంగతులు. కిత్తయ్య యనే వారు జమీౝదారుడున్ను, మంచి సాంప్రదాయికుడున్ను. యీ వూళ్ళో అంగళ్లు కలవు. అన్ని పదార్ధాలు దొరుకును.

తేది వుదయాత్పూర్వము నాలుగు గంటలకు లేచి యిక్కడికి ఐదు కోసుల దూరములో నుండే నక్కపల్లి వుపమాకా యనే వూళ్లు తొమ్మిది గంతలకు చేరినాను. దారి కొంత వెల్లడిగా వున్నది. కొంతదూరము యిసకపరగానున్ను, కొంతదూరము రేగడగానున్ను వున్నది. వుపమాకా యనే వూళ్ళో వొక చిన్నకొండమీద వెంకటాచలపతి గుడి వున్నది. యాభై యిండ్ల వైష్ణవాగ్రహారము ఆ గుడిని నమ్ముకుని వున్నది. వెంకటాచలపతిపేరు ప్రసిద్ధి. యీవూరు మొదలుగా దక్షిణదేశములో కలిగివున్న దని తెలియవలసినది. ఆకు తినే మేకల మందలు పొలాలలో విశాఖపట్టణముతోచేరిన విజయనగరపు రాజ్యము సరిహద్దు మొదలుగా చూస్తూవస్తాను. జగన్నాధము మొదలుగా యేదలనే యెనుములు పోతులు విస్తారము కలవు.

విశాఖపట్టణము జిల్లా సాలుకు పద్నాలుగు లక్షల రూపాయిలు యెత్తుచున్నది. భూమి యావత్తు జమీౝదారుల అధీనముగాని కలకటరు అమానీ విచారణలో యేమాత్రమున్ను లేదు. జమీౝదారులకు యీ జిల్లాలో వంద కి ఇరవై నాలుగు వంతున లాభమువచ్చును. అయినా బందిపోట్లవల్ల నిండా నొచ్చిపోవుచున్నారు. నక్కపల్లి, వుపమాకా యనే వూళ్ళున్ను చేరినట్టుగానే యున్నవి. మధ్యే వొక చెరువుకట్టకద్దు. వుపమాకాలొ వొక శివమందిరమున్ను, దానిలో చేరినట్టు వొక సత్రమున్ను వుండగా అందులో దిగినాను. నక్కపల్లెలో అన్ని పదార్ధములు దొరుకును.

యీ దేశపు స్త్రీలు మంచి సౌందర్యము కలవారుగానున్ను, ముఖలక్షణము కలవారుగానున్ను అగుపడుతారు. జాఫరావిత్తుల వర్ణముచేసిన బట్టలు వుపపన్నులు కట్టుతారు. కాళ్ళకు పాడగాలు వెయ్యడము కలిగివున్నది.

సర్వసాధారణముగా యీ దేశమందు తెనుగుభాష ప్రచురముగా వున్నది. మాటలు దీర్ఘముగానున్ను దేశియ్యమయిన శబ్దహ్రస్వముగానున్ను పలుకుతారు. తెనుగు అక్షరములు గొలుసుమోడిగా వ్రాస్తారు. మనుష్యులు స్వభావమూఅ దౌష్ట్యములు చేయతలచినా మంచితియ్యని మాటలుమాత్రము వదలరు. యేపనిన్ని వూహించి చేస్తారు. యీ వూళ్ళో రాయవరపు మునిషీ కోటూరు వీరరాఘవమొదిలిని కలుసుకొనే నిమిత్తము యీ రాత్రికూడా నిలిచినాను.

తేది వ్దయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కడికి నాలుగు కోసులదూరములో వుండే తుని యనే వూరు ఏడు గంటలకు చేరినాను. యీవూరివద్ద తాండవ మనే నది వొకటి, కసంకోటవద్ద శారదా అనే వది వున్నట్టె వొకవాగున్నది. యీ తాండవనదికి అవతలిపక్క రావుపేటాయనే వూరు వొకటి వున్నది. అక్కడ తపాలాఆఫీసు రయిటరు వొకడు ఆఫీసును వుంచుకుని వున్నాడు. ఈ రెండువూళ్ళుగొప్పబస్తీలు. యిక్కడ హేడ్డాపోలియను వసముచేయుచున్నాడు. సమస్త పదార్ధములు దొరుకును. యీవూరినుంచి రాజమహేంద్రవరానము కంపెనీవారు వేసిన లయను దారి మన్యాలమీద వేరేచీలి పెద్దాపురము, పిఠాపురముల నిమిత్తము లేకపోవుచున్నది. ఆ దారి వొక ఆమడ సమీపమయినప్పటికిన్ని, బండ్లదారి అయివున్నా నాతొకూడా చెన్నపట్టణమునుంచి వచ్చిన బోయీలయిండ్లు పిఠాపురపుదారిలో వున్నందున వారి సంతోషనిమిత్తము ఆ దారివళ్ళ నిశ్చయించినాను. యీ మధ్యాహ్నము నడిచినదారి బహుదూరము రేగడ, అడివి నిండాలేదు. దారి కిరుపక్కలా కొంతదూరములో చిన్నకొందలు వుండివున్నవి.

గంజము మొదలుగా అన్ని యిండ్లలో యర్రమన్ను గోడలకు పూశి సున్నపుచుక్కలు నాలుగైదు అంతస్తులుగా బారుతీర్చి వుంచుతారు. కడపలకు పసుపు కుంకుమ వుంచుతూవస్తారు. విజయనగరము మొదలుగా రనచెక్కలని కాచు కలిపి నిండు, చిన్నపోకలను వుడకపెట్టి వక్కలుగా అమ్ముచున్నారుగాని యీవరకు కనుపడుతూవచ్చిన పోకలు విశేషము లేవు. చుట్టలు తాగడము విశేషము.

యీవూరునుంచి బండ్లను రాజానగరములో నున్ను కలుసుకునే టట్టు పంపించి యిక్కడ బ్రాహ్మలయిండ్లలో వంట, భోజనము కాచేసుకుని రెండు గంటలకు బయిలుదేరి యిక్కడికి నాలుగు కోసుల దూరములో వుండే వంటిమామిడి యనే వూరు ఆరు గంటలకు చేరినాను. యీ వూరు చిన్నది. అయినప్పటికిన్ని యిప్పుఛు కోటీత్రియంబకరాయని వారు నడిపించే సదావృత్తి అన్నసత్రము వొకటి విశాలముగా కట్టివున్నది. అంగళ్ళు కలవు. సమస్తమయిన పదార్ధములు దొరికినవి. యీ వూళ్ళో యీ రాత్రి వసించినాను.

తేది వుదయాత్పూర్వము నాలుగు గంతలకు బయిలువెళ్ళి యిక్కడికి తొమ్మిది కోసుల దూరములో నుండే నగలాపల్లె అనే వూరు పది గంటలకు చేరినాను. తుని మొదలుగా దారి దక్షిణాభిముఖముగా వచ్చినందున కొండలు దూరమై సముద్రము దగ్గిర అవుతూవచ్చినది. కన్యాకుమారి మొదలుగా కలకత్తావరకు యీభూమిగడ్డను సోగతమలపాకు అందమయ్యేటట్టు సముద్రము ఆవరించి వున్నందున మనము దక్షిణాభిముఖముగా వఛ్ఛే కొద్ది సముద్రతీరానకు సమీపముగా రావడమైనది. గంజాం మొదలు సముద్రతీరమందే వచ్చేటట్టు చెన్నపట్టణమునకు వొక బాట వున్నది. ఆభాట సమీపమయినా వుప్పుకాలువలు అనేకముగా దారిలో దాటవలసి వున్నది గనుక ఆమార్గము నుంచి కంపెనీవారు పడమరవొత్తి శాలవేసినారు. సముద్రతీరువు భలేను వుప్పుకటారులు త్రిరోదయం యెటున్నదో అటువంటి దారిని అడివి, కొండలు, పులులు, రాళ్ళు, దొంగలు వీండ్ల భయము చాలా కలిగివున్నది. యీ దినము నడిచినదారి యెడారి. కొంతమేర అడుసు నీళ్ళుగా వున్నది. నాగలాపల్లెవూరి ముందర వొక వుప్పు కాలువ వున్నది. దానికి పాటు పోటు కద్దు. పోటువేళ దానికి సంగడి అని రెండు తాటిచెట్లును దోనువలెనే తొలిచి చేర్చి కట్టివుంటారు. అందులో ఆరుగురు యెక్కవచ్చును.

నాగలాపల్లె అనేవూరు పెద్దది కాక పోయినా అన్ని పదార్ధములు దొరుకును. యిక్కడి వుప్పుకాలువ వద్ద చెన్నపట్టణములో వుండే వొక పెద్దమనిషే యీ దేశస్థుడి బోధన మీద్ పదివేల రూపాయలు ఖర్చుపెట్టి రెండుతాటాకు గుడిశలు వేసి రెండునీలిమందుచేసే తొట్లుకట్టి వొకబావి తొవ్వించినాడు. నీలిమందు లాభముయొక్క భ్రాంతి చెన్నపట్టణపు వారిని బహుశా యీరీతుగా ముంచినది. యీ వూరికి యానాం నీలపల్లి అనే గొప్ప బస్తీలు మూడు ఆమడలోవున్నవి. యింజరమనే గ్రామము నీలపల్లికి సమీపముగా వున్నది. మాదయాపాళెము యానానికి ఆమడదూరములో నున్నది. యీవూరికి కాకినా డనే కలకటరు నివాసస్థలము ఏడు కోసుల దూరములో వున్నది.

వుప్పాడా అనేవూరు యిక్కడికి కోసేడుదూరములో నున్నది. వుప్పాడాకు చుట్టూ ఆమడదూరములో సముద్రతీరమందు సుమారు యేనూరు యిండ్ల బోయిజాతివారు గుడిసెలు వేసుకొని కాపురమున్నారు. వీరికి పయిరు భూమి యిలాకా యెంతమాత్రములేదు. సముద్రములో మత్స్యములి పట్టి యెండవేశి మణుగు ఒకటి కి కొంగము తీరువ యిచ్చి అమ్ముకోవడమున్ను చెన్నపట్టణములో కొలువుకొలిచి బ్రతకడమున్ను. వీరియిండ్లలో మొగవాడు పుట్టితే చచ్చేవరకు తల ఒకటి కి ర్పూ పద్నాలుగు సరకారువారికి తీరువ యివ్వవలసినది. వీరి గుడిశలు నాలుగు రూపాయలకు యెక్కువచేయవు. యీబోయస్త్రీలు కట్టెలుకొట్టి అమ్మడమువల్లనున్ను, పైరుపెట్టే సంసారులకింద పనిపాటులు చేయడామువల్లనున్ను, వన్యములైన కూరకాయలు తెచ్చి అమ్మడమువల్లనున్ను కాలక్షేపముచెయుచు మొగవాండ్ల నిమిత్తము సరకారుకు యివ్వవలసిన పన్నుసహా యిచ్చుకుంటారు. మొగవాండ్లు రూపాయి ఒకటి కి నెలంతా ఆరు యింటికి పావులావంతున వడ్డీకి అప్పుతీశి సారాయి మొదలయిన మత్తద్రవ్యములు తాగి ఆ అప్పులు మిక్కటమయితే తీర్చడానకు దేశాంతరములకు జతలుగా కలిసివచ్చి బోయీకొలువుచేసి మళ్ళీ దేశమునకు వచ్చి చేసియున్న అప్పులు తీర్చుకుంటూవుంచున్నారు. కొందరు బైటిసంపాదనకూడా తాగడానకు చాలక స్వదేశగమనమే పదిపదిహేనుయేండ్లు తలుచుకోకుండా వుంటారు. నాతోకూడావచ్చిన బోయీలలో యిద్దరు యీ దేశము వదిలి బహుకాలమౌటచేత వారి భార్యలు వారిని గుర్తుపట్టలేకపోయినారు. ఆ యిద్దరిని వారి యిండ్లస్త్రీలు మాకు తాగడానకు మేము కావలసినది యిస్తాము, యికమీరు దేశమువదలి పోవద్దని బతిమాలుకొనుచున్నారు.

యీ మత్తద్రవ్య పానమువల్ల లోకులకు యింత ఆసక్తియేల కలిగినదో అది యీశ్వరునికే తెలుసును. అయినా నాకు తోచడము యేమంటే యేలే బుద్ధి యనే రాజుయొక్క అధికారమునకు లోబడని దేహములోని మనసు మృతముయొక్క చేష్టలతో తిరుగులాడుచూ వుంచున్నది. గనుక ఆ మనసు యీషణత్రయబద్ధ మయి స్వప్నావస్థలోకూడా యీషణాదులను గురించి కలిగే విరోధములు అబద్ధములని జాగ్రదవస్థలో తెలిశిన్ని జాగ్రదవస్థ పొందిన వెనకకూడా స్వప్న సంభావితాలను జ్ఞాపకమునకు తెచ్చుకొని అవి సత్యములని కొంతసేపు భ్రమసి కొంచము దు, ఖించడము స్వానుభవముచేత నాకు తెలిశి వున్నది గనుక బుద్ధిచేత యేలబడని మనసుకు దు, ఖనివృత్యర్ధమున్ను యధోచితము బ్రహ్మానందవతుగా తాగడానకు మొదలు పెట్టినారనిన్ని అది పరంపరగా యెక్కువ అయి అనేకులు యీశ్వరుడు తమకు యిచ్చిన యథోచితమైన ప్రజ్ఞనుకూడా తాము పొగొట్టుకునేటట్టు పానాపేక్ష కలగడమయినది.

ఇంతదేశము తిరగడమువల్ల స్త్రీ పురుషులకు పరస్పర స్నేహమున్ను కలియకయున్ను మోహమున్ను ఆసక్తులున్ను పుట్టను కారణమేమని విచారించగా యిదిన్ని ఆహారములు, ఆచారములు, అలంకారములు వీటియెడల రుచిపుట్టేలగే గాని, యుక్కువలేదని తోచబడుచున్నది. అది యెందువల్లనంటే వొకదేశపు పురుషుణ్ని మరివొక దేశపు స్త్రీ చూస్తే ఆ పురుషుడి రూపాలుకారములు బాగా వున్నా హేయముగా చూచి అపహాస్యము కిందికి తెచ్చి అసహ్యబడుచున్నది. స్వదేశస్థుణ్ని చూచినంతలో వొక విధమైన యిష్టము హృదయములో అకస్మాత్తుగా జనించి కలియక ఆపేక్ష కలిగిన వెర్రి వాలుచూపులు కులుకులు అనే దేహకంపము - యిది మొదలయిన చేష్టలు స్త్రీలకు పుట్టి మర్మమైన అవయవములు దాచి మూసే లాంచనలతో తమ అవయవములకు ఆ స్వ దేశపురుషులకు నిరూపిస్తూ వుంటారు. తత్రాసి స్వదేశస్థులలోను స్వకీయులనున్ను, అత్యాసన్నులనున్ను స్త్రీలు చూచిన పక్షమందు పైన వ్రాశిన చేష్టలు దశగుణముగా అధికమవుచున్నది. యీ హేతువులవల్లనే పూర్వీకులు వివాహవిషయమై స్వకియ్యులలో సమీప రక్తస్పర్శ కలస్థలములలోకన్యాదానాలు కన్యాప్రతిగ్రహము నిషేధించి నిర్ణయించినట్టు తోచుచున్నది. ఆ నిశ్చయానుసారముగానే పరస్పరవాంచలున్ను వుదయింపుచున్నవి. గాని యీ వాంఛలున్ను వుదయింపుచున్నవి. గాని యీవాంఛలకు ఆచారాలకారాలవలెనే వాడికె మీద పుట్టే మనసు కారణమేగాని మరివొకకారణము వేరే వున్నట్టు తోచలేదు. యిందుకు శిష్టవాక్యము యింగిలీషువారిలో యూజ్ రిక్రిసయిల్స్ వుయిత్ ఎవ్వది ధింజ్ అని వున్నది. దీనికి తాత్పర్యము యేమంటే పరిచయము అన్నిటితోనున్ను అనుకూలింపచేయుచున్నది అని అర్ధము. పంతొమ్మిది తేది అంతా యీవూళ్ళో నిలిచినాను.

తేదివుదయాన నాలుగున్నరగంటలకు బయిలువెళ్ళి యిక్కడికి మూడుకోసుల దూరములో వుండే పిఠాపురమనే పుణ్యస్థలము యేడు గంటలకు చేరినాను. యీవూరు పూర్వము గయాసుర రాజధానిగా వుండినది. యీ స్థలమును పాదగయ యని అనుచున్నారు. యిక్కడ వొక తటాక మున్నది. దాన్ని పాదగయతీర్ధ మనుచున్నారు. యీ తటాకములో గయాసురుని పాదములు వున్నవని ప్రసీద్ధిగనుక యిక్కడ శ్రాద్ధముచేశి పిండప్రదానము చేయవలసినది. తీర్ధ్యమువొడ్డున వొక చిన్న శివాలయమున్నది. అందులోని లింగముపేరు కుక్కుటేశ్వరుడని అనుచున్నారు. యీవూళ్ళో వొకపాడుకూపములో అష్ఠాదశపీఠములతో చేరిన పురుహూత యనే శక్తి అదృశ్యముగా వసింపుచున్నదట. ఆపెకు ఉత్సవాలు యేమిన్ని నడవడము లేదు.

యీ వూళ్ళో యిన్నూరు బ్రాహ్మణయిండ్లు కలవు. వారందరు తీర్ధవాసులుగా యాచకవృత్తిని వహించియున్నారు. యీదేశములో గంజాము మొదలుగా భూరూపకమయిన జీవనము లేని బ్రాహ్మణుడు లేడు. యీ దినము తొలిఏకాదశి. దీన్ని సమస్తమయిన వారు యీ ప్రాంతములో గొప్ప పండగగా జరిగింపుచున్నారు. గయాపాద తీర్ధమువొడ్దున నేను డేరాలువేశి దిగి యిక్కడికి గుడిలోపల వంట, భోజనములు కాచేసుకున్నందున గయాతీర్ధములో స్నాననిమిత్తమై వచ్చిన వూరి స్త్రీలను బాలుల సమేతముగా అందరినిన్ని దర్శనము చేయడమయినది.

యీ వూళ్ళో పోలీసుదారోగా సహితముగా జమెందారులు నీలాద్రిరాయనింగారి కుటుంబస్థులు వొక మట్టికోటకట్టుకొని అందులో వసింపుచున్నారు. యీవూరు గొప్పబస్తీ. సమస్తపదార్ధాలు దొరుకును. సురాకార మనే పెట్లప్పు యిక్కడ పైరౌచున్నది. వూరుతోపులతోను తటాకాలతోను నిండి విశాలమైన వీధులు కలిగివున్నది. నేడు తెల్లవారి నదిచిన దారి కొంతమేర అడుసు నీళ్ళుగాని మిగిలిన భాట యిసకపరగానున్నది. జగన్నాధము మొదలుగా యిసకపరభూమి గనుక తాటిచెట్లు, మొగిలిచెట్లు, జెముడు, యివి మొదలయినవి విస్తరించిల్వున్నవి. యిండ్లకు తాటాకులు కప్పి పయిన కసువు పరుస్తారు. యీవూరి బ్రాహ్మణులు విచ్చలవిడిగా తారతమ్యాలు తెలియక నటింఛేవారు. పదిరూపాయలు భూరి పంచిపెట్టినంతలో యధోచితముగా సంతోషించిరి.

యిక్కడనుంచి రెండుగంటలకు బయిలువెళ్ళి నాలుగు కోసులదూరములొనుండే పెద్దాపురము ఆరు గంటలకు చేరినాను. యీ మధ్యాహ్నము నడిచిన దోవ పల్లపు పారు గనుకనున్ను భూమి రేగడ గనుకనున్ను యీదినము వర్షము కురిశినందుననున్ను అడుసునీళ్ళుగా వుండినందున చాలా జారుచూ వచ్చినది. యీ నడమ యేలా అనే వొక చిన్ననది కాలినడకగా దాటినాము. ఈ నది చిన్నదయినా మిక్కిలి తీక్ష్ణమయిన వేసంగికాలములయందున్ను, అనావృష్టి దోషాలు కలిగినప్పుడున్ను వొక్కరీతిని మిట్టను ప్రవహింపుచున్నది. పిఠాపురము పెద్దాపురము జమానుదారులు తాలుకాలవారు వంతుల ప్రకారము యేటి నీళ్ళు అడ్డకట్టి తమ గ్రామాదులకు తెచ్చుకోవడము చేత వీరి తాలూకాలలో యెల్లప్పుడు పంటలు సమృద్ధిగా గలిగియున్నవి.

పెద్దపురమనే వూరు పిఠాపురముకన్నా గొప్పది. యీ వూరి యిండ్లున్ను గొప్పలుగానే కట్టియున్నారు. వంద బ్రాహ్మణుల యిండ్లు కలవు. యిక్కడ పోలీసుదారోగా సహితముగా యిక్కడి జమీందారుడు వసింపుచు నుంటాడు. యితని తాలూకా మూడు లక్షలది. అంగళ్ళు కలవు. సమస్తపదార్ధాలు దొరుకు చున్నవి. యీ వూళ్ళో మూడు సంవత్సరములుగా యీ జమీందారుని భార్య అమ్మన్న అనే పురుషుని గొప్పయిల్లు స్వాధీనము చేసుకుని వొక అన్నసత్రము వేసియున్నది. ఆ స్థలము విశాలముగా వున్నందున అందులోనే యీ రాత్రి వసించినాను.

తేదీ వుదయాత్పూర్వము రెండు పాయింట్ నాలుగు గంతలకు లేచి యిక్కదికి రెండు ఆమడ దూరములోనుండే రాజానగర మనే వూరు పది గంటలకు ప్రవెశించినాను. దారి ఇసక కలిసిన రేగడ. కొంచపాటి యడివిన్ని, వొక కొండ తిరుగుడున్ను బహు చోరభయమున్ను కలిగి నడవ సమకూలమై వున్నది. యిక్కడ గోపాలరాజుల పితూరి అనే పేరుగల బందిపోట్లు ప్రతివూర కలిగివున్నది. నేను తుని యనే వూరివద్ద వదిలిన అయళ దారి రాజానగరము ముందు వచ్చి కలిసింది. రాజానగరము జలవసతి కల వూరు. అంగళ్ళు కలవు. పోలీసు అమీనా వసిస్తూ వుంటాడు. అన్ని పదార్ధములు దొరుకును. యీ వూరు కొచ్చలకాకోట వెంకటరాయుడి జమీను. యిక్కడ లోగడ రాజాబహదరు వారి అన్నసత్రము వుండి నిలిచిపోయినంతలో యీ జమీందారుడు. ఆ సత్రాన్ని వుద్ధరించి మళ్ళీ జరిగింపుచున్నాడు. యీ సత్రములో వంటబోజనముల నిమిత్తముదిగినాను. సత్రము బహువిశాలముగా కట్టివున్నది. యీవూరికి సమీపమందే నలభై యిండ్ల బ్రాహ్మణాగ్రహారము వొకటి వున్నది.

పాదగయలో నేను తీర్ధము వొడ్డున డేరాలలో దిగివుండగా గొప్పవర్షము కురిశినది. అప్పట్లో స్నాననిమిత్తమున్ను శివాలయదర్శననిమిత్తమున్ను వచ్చిన స్త్రీలు వర్షమును లక్ష్యపెట్టక స్నానపానములు స్వామిదర్శనాలు తడుస్తూచేసిన వేడుక చూడముచ్చటనున్ను విజయనగరములోను పట్నాఅనే షహరులోను గొప్పవారి యిండ్ల స్త్రీలకు అత్యంత దేహోపద్రవాలు కలిగి నేను ఔధముయిచ్చి పధ్యము తీసుకొమ్మన్నంతలో చచ్చినా మంచిదిగాని స్నానము లేక మేము వంటచేసుఖోక అన్నము పుచ్చుకొనమని వొకపట్టుగా మూర్ఖముచేసిన నిశ్చయముచూడగానున్ను కలిసాధుస్త్రీయస్సధు యనే సామాన్యవచనము బాగానేవున్నట్టు తోచుచున్నది.

యిక్కడనుంచి రెండుగంటలకు బయిలువెళ్ళి యిక్కడికి నాలుగు కోసుల దూరములోనుండే రాజమహేంద్రవరము మూడు గంటలకు చేరినాము. దారి కిరుపక్కలా అడివికలిగి యిసుకపరగావున్నది. రాజానగర రాజమహేంద్రవరాలకు చేరిసగాన పోలీసుఠాణాను పాంధుల క్షేమముకై కలకటరు వుంచివున్నాడు. యీ రాజమహేంద్రవరము పూర్వము రాజరాజనరేంద్రుని రాజధాని. అతని కొడుకు సారంగధరునితో చంద్రవంశము అంత్యమయిన దని లోకప్రసిద్ధి.

యీ రాజమహేంద్రవరము గౌతమమహాముని ఆశ్రమము పూర్వకాలమందు ద్వాదశర్షక్షామము సంభవించి సమస్త బ్ర్రాహ్మణ్యము అన్నములేక మనుష్యకోటికి గురువులయిన గౌతమలవద్దికి వచ్చి మొరపెట్టుకుంటే వారు తన తపోబలముచేత బ్రత్యహము కొద్దిగా వరిబీజాలు చల్లి అవి సద్య, ఫలమునకు వచ్చేటట్టుచేసి ఆధాన్యము అక్షయ మౌటచేత అనేకకోటి బ్రాహ్మణ్యమునకు ప్రత్యహము అన్నము యిచ్చి వారల ప్రాణరక్షణ చేసినారు. పిమ్మట క్షామము వదలగానే సమస్త ద్విజులు గౌతముల ఆశ్రమము వదిలి పొయ్యేటప్పుడు యంత యశస్సు గౌతములకు రావచ్చునా అని అసూయచేత, పాంఛంభౌతిక దేహములన్ని యీశ్వరుని మాయా సంబంధమయిన అరిషడ్వర్గముతో బద్ధము లయివున్నవి గనుకనున్ను ఉయిక్కడి జిల్లాజడ్జియయిన వైబరుటుదొర, చెక్కుముక్కి రాయిపై యినుము వేగముగాకొట్టి అగ్ని పడకపోతే తుపాకీలోని మందుగుండు బయిలుపడదు అన్నవతుగా యీ ప్రపంచము కృతజ్ఞత సాత్వికత్వౌలతో నిండితే అన్ని ప్రకృతులు చప్పుడు లేక స్థావరములుగా నిద్రపోతూ వుండవలశినవి గనుకనున్ను దురత్యయమయిన మాయ కష్నతి కష్నతి కష్న త్యేన అనే వచనప్రకారము పండితులను కూడా మోసపరచి చీకటిలో కండ్లు కలవాడు కండ్లు లేనివాడున్ను సమ మయినట్టు మనుష్యులను కృతఘ్నులను చేయుచున్నది గనుక అదేప్ర్కారము అప్పట్లో గౌతముల ఆశ్రమములో నున్న బ్రాహ్మణులు కుతంత్రమువల్ల ల్వొక గోవును కల్పించి గౌరములు ఆ దినము చల్లిన పయిరు మే శేటట్టు చేసినారు. ఆ గోవు ఆ ప్రకారము తాను చల్లిన పయిరు మేశేకృత్యము చూచి గౌతములు బ్రాహ్మలమీది భక్తిచేత గరికపోచను గొవుమీద వేశి అదలించినాడు. అంతమాత్రానికే ఆ గోవు చచ్చినట్టు అభినయించినది. వెంబడిగానే అక్కడవున్న బ్రాహ్మలు గౌరములను హత్యదోషము కలవాణ్నిగా నిందించినారు. గౌతములు పశ్చాత్తప్తలయి నాకు యేమి గతి యని బ్రాహ్మణమందలిని అడగగా శివుని జటాజూటములో వుండే విష్ణుపాదప్రసూతయయిన గంగను బయిటికి తెచ్చి అందులో అవగాహనము చేస్తేనేగాని నీవు పుణ్యాత్ముడవు గావని చెప్పినారు. పిమ్మట గౌతములు తపస్సువల్ల సాంబమూర్తిని సంతోష పెట్టి వొక ధారను భూమిమీదికి తెచ్చి తన ఆశ్రమముదాకాతెచ్చి స్నానముచేసి యెప్పుడున్ను లోకాపకారముగా భూమిమీద ప్రవహింపుచు వుండేటట్టు చేసినాడు. ఆ ధారకు, గొదావరి అని నామకరణము చేయడమయినది. పిమ్మట సప్తఋషులు గౌతములను ప్రార్ధించి సెలవు పుచ్చుకుని యేడుధారలుగా గోదావరిని చీలదీసి తమ తమ ఆశ్రమాలకు తీసుకుని వెళ్ళీనారు గనుక యీ రాజమహేంద్రవరమునకు గోదావరి అఖండముగా వచ్చిధవళేశ్వరము మొదలుగా చీలి సప్తగోదావరులుగా అయినది. ఆ సప్తగోదావరీ తీరమందు వుండే భూములు గోదావరీ వుదకబలముచేత సమసస్యా ధులను అమోఘముగా ఫలింపచేయుచున్నవి. ఆ సప్తగోదావరీ తీరమును కోనశీమ అనుచున్నారు. అక్కడ బ్రాహ్మలకు భూవసతులు చాలా వున్నవి.

యిది కాకినాడుజిల్లా యెనిమిదిలక్షల వరహాలు సాలుకు యెత్తు తన జమీన్ గ్రామాలమీదుగా తానుకూడా వచ్చి యెనిమిదామడపత్యంతము నన్ను సాగనంపించవలె నని తలచి ప్రార్ధించినాను గనుక దండుల్దారిని యేలూరిమీదుగా నా రెండుబండ్లను రవానాచేసి నేను అడ్డదారినివుండే వాడపల్లి రాత్రి ఏడు గంటలకు ప్రవేశించినాను. దారి గోదావరి వొడ్డుననే వొక మనిషి నడిచేపాటి కాలిదారిగా వున్నది. రాజమహేంద్రవరమునకు వాడపల్లె అనేవూరు ఆరు కోసుల దూరము. గోదావరి మధ్యే కొన్ని లంకలు ప్రవాహపు వేగాన పెట్టబడుచువచ్చుచున్నవి. వాడపల్లి యనే వూరు విష్ణుస్థలము గనుక వెంకటేశ్వరుల గుడి చిన్నదిగా వొకటి వున్నది. యిరువై యిండ్ల వైష్ణవాగ్రహారముకూడా కలదు. రాజా కొచ్చర్లకోట వెంకటరాయనింగారి తమ్ముడు యీ వాడపల్లెలో విశాలమయిన నగరు కట్టివున్నాడు. యీ రాత్రిన్ని మరునాడున్ను యిక్కడ వుండినాను. యీవూరు గోదావరి వొడ్డు గనుక యీవూళ్ళో బావులులేవు.


ఏనుగుల వీరాస్వామయ్య గారి కాశీయాత్ర చరిత్ర
టీటీఎస్ ఆడియో నిర్మాణ పాఠ్యం
భాగం ఎనిమిది — మొత్తం ఎనిమిది భాగాలలో


ఇరువదిమూడవ ప్రకరణము  గంజాము నుండి రాజమహేంద్రవరము

తేది వుదయమయిన ఆరుగంటలకు లేచి యిక్కదికి ఏడు కోసుల దూరములో వుండే ఆచంటయనే వూరు పదకొండు గంటలకు చేరినాను. దారిలో సప్తగోదావరి యనే వొక పాయ పడవలకుండా దాటడమయినది. యిది కాలి భాట. తొపులు, వూళ్ళమధ్యే నడుస్తూ వచ్చినాము. అందులో రాల, ర్యాలి, యనే వొక గ్రామములో శుభ్రమయిన నల్లశిలతో ప్రభసమేతముగా వొక గోపాలమూర్తిని చేసివున్నది. ఆ ప్రభలోనున్న మూర్తి పీఠము మీదనున్ను రాసక్రీడలు మొదలయిన అవసరాలు మూర్తీభవించి నట్లుచెక్కి ప్రధానమూర్తిని గోళ్ళు, వెండ్రుకలుకూడా విరళపరచి అతిసుందరముగా చేసివున్నది. యీ మూర్తి సముద్రములో కొట్టుకొని వచ్చినట్టు యిక్కడ చెప్పుకొంటారు. ఆచంట అనే వూళ్ళో వెంకటరాయనింగారు తన నివాసముకొరకు వొక గొప్ప నగరుకట్టి దానికి చుట్టూ సుందరమయిన వనము నిర్మించిల్ వున్నాడు. యీ వూళ్ళోనున్ను, వాడపల్లెలోపల వున్నట్టే వొక పోలైసు అమీను వున్నాడు. ముప్పై బ్రాహ్మణ యిండ్లు వున్నవి. యిక్కడ పెండలపు గడ్డలు బహు బాగా అయి


ఇరువదినాల్గవ ప్రకరణము  రాజమహేంద్రవరము నుండి నెల్లూరు

యీనెట్టున బహుప్రసిత్థి కెక్కివున్నవి. వొక దేవాలయముకూడా వున్నది. యీవూళ్ళో యీరాత్రి వసించినాను.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కడికి రెండామడ దూరములోనుండే శింగవృక్ష మనే వూరు వొక గంటకు చేరినాను. దారి వరిపొలాల గనిమొల మీద నడిచి రావలసినది. రేగడ భూమి అయినందుననున్ను, వర్షాలు కురిశి వున్నందునన్ను చాలా అడుసునీళ్ళు గలిగి బహుప్రయాసగా వుండినది. గోదావరి వుదకము లడ్డకట్టి తెచ్చిన నాలుగు మడుగులు, రొమ్ముల లోతునీళ్ళలో దాటినాము. శింగవృక్ష మనే వూరు గొప్పబస్తీ. వంద బ్రాహ్మణ యిండ్లు కలవు. అనేకముగా అంగళ్ళు కలవు. ఈవూళ్ళో భోజనానకు నిలిచి మూడు గంటలకు మళ్ళీ బయిలువెళ్ళీ ఆరు గంటలకు బోండాడ ప్రవేశించినాను. దారిలో తెల్లవారివలెనే రెండు మడు, గులు దాటడమయినది.

బోండాడ అనేవూరున్ను బస్తీగ్రామమేను. యీ వూరికున్న ఘట్టిపర అయినందున ధాన్యము పాతరలువేశి వుంచుతారు. రాజమహేంద్రవరము మొదలుగా తాటిచెట్లు అమితముగా కలిగివున్నవి. ప్రతివూరనున్ను తాటిపండ్లరసము తీసి చాపలుగా చేసి వుంచుతారు. యీరాత్రి యిక్కడ వసించినాను.

ఆగష్టునెల ఒకటి తేది వుదయమయిన నాలుగు గంతలకు బయిలువెళ్ళీ యిక్కడికి నాలుగు కోసులదూరములో నుండే యేలూరిపాడు అనేవూరు పది గంటలకు చేరినాను. యీవూరు పేటస్థలము. నేడు నడిచిన దారి యిసకపర. శింగవృక్ష మనేవూరు మొదలు యిదే రీతిని దారి అనుకూలముగా వున్నది. బండ్లు సమేతముగా రావచ్చును. యీవూరు నియోగుల అగ్రహారము. రాజమహేంద్రవరము జిల్లాకున్ను బందరు జిల్లాకున్ను యీవూరివద్ద వుండే వుప్పుకాలువ సరిహద్దు అని తెలియవలసినది.

యీ మధ్యాహ్నము పన్నెండు గంతలకు యిక్కడినుంచి భోజనము చేసుకొని బయిలి వెళ్ళి వుప్పకాలవ సంగళ్ళకుండా దాటి రాత్రి ఏడు గంతలకు యిక్కడికి ఆరు కోసులదూరములో వుండే తుమ్మడి యనే వూరు చేరినాను. యీ మధ్యాహ్నము మీద నడిచిన దారి యిసకపర, శుద్ధబయిలు. యేలూరిపాడు మొదలుగా వర్షాలు లేనందున యిక్కడ దారిలో మడువులు బొత్తిగా యెండివున్నవి. దారిలో కలిదండియనే ప్రసిద్ధి గ్రామము దాటి వచ్చినాను. తుమ్మడి అనే గ్రామములో బ్రాహ్మణయిండ్లలో స్థలము దొరకనందున కలకత్తాలో విశ్రయించడానకు యిచ్చివచ్చిన రెండు డేరాలు, వెంకటరాయనింగారికి యిచ్చివచ్చిన వొక డేరాగాక మిగిలిన రెండు డేరాలు యిక ఫరవాలేదు ప్రతివూళ్ళో బ్రాహ్మణ యిండ్లలో స్థలము దొరకునని అందరు బోధించినా చెయికావలికి యెనిమిదిమంది బోయీలచేత తెచ్చినందున ఆ రెండు డేరాలు వొక బావివద్ద వేయించి యీరాత్రి గడపడమయినది. యీవూళ్ళో మంచినీళ్ళు బహుప్రయాస. నేను డేరాలు వేయించిన స్థలమున వుండే బావి యీ వూరికి మంచినీళ్ళు, ఆ నీళ్ళు మాకు తాగకూడనిదిగా వున్నది. అభ్యాసము అన్నిటినిన్ని అనుకూలపపరుస్తున్నదనే యింగిలీషుమాట యీ దినము సత్యముగా తొచినది.

తేది వుదాత్పూర్వము రెండు గంటలకు మబ్బుచినుకులుగా వున్నా లేచి యిక్కడికి రెండామడదూరములో వుండే మచిలీబందరు అనే షహరు యీ దేశస్థులు పేటా అని చెప్పే బస్తీని ఆరు గంటలకు ప్రవేశించినాను.*

గమనిక, * మచిలీబందరు రెండవ తేది మగళ్వారం ఉదయాన దారి యిసకపొర నాతమ్ముడయిన సీతాపతికి బారుజల్లి అనే తాలూకాకు పని అయింన్నీ నాకోసరం బందరులో శలవుమీద కాచివున్నాడు. మణపాక సాల్వపతినాయిడుగారు నాకు విహితుడు గనుకనున్ను వారు వుభయులూ కలుసుకొని వీరాస్వామయ్యగారిని వాద్యములతో వూరిలోకి తీసుకొని వెళ్ళి రామన్నపేటలో వక గొప్పతోటయింట్లో బస యేర్పరిచినారు.

దారి నిన్నటివలెనే యిసుకపర. బండ్లు సాధారణముగా

, వ్రాత ప్రతిపుట నాలుగు వందలు ఎనభై ఎనిమిది లోని అదనపుసంగతి, నడవవచ్చును. రామన్నపేటలో వొక గొప్పతోట యింట్లో దిగినాను. యీ మచిలీబందరు బస్తీలో ఇరవై రెండు పేటలు కలిగివున్నది. వొక్కొక్క పేటను పూర్వమందు లక్ష్మెకటాక్షము కలిగిన పురుషులు తామై కలగచేసినారు గనుక ఆపేటలలో వచ్చుబడిబాడిగెలను పేటలు కలగచేసిన వారి వంశస్థులు నూరారు రూపాయలవంతున సుఖోపాయముగా యిప్పట్లో ప్రతిమాసమున్ను అనుభవింపుచున్నారు. ఈ బస్తీ లోగడ తురకలది. హయిదరాబాదు కింద వున్న అధికారస్థుడు యిక్కడికి తాను నవాబు అనిపించుకొని యీ రాజ్యాన్ని ఆక్రమించినాడు. ఆ స్వామి ద్రోహము వారి వంశస్థులను కంపెనీవారికింద పించను తీసుకొని యిప్పట్లో వుండేటట్టు చేసినది.

పూర్వకాలము మొదలుగా యీ బస్తీ సర్వాధికారుల నివాసముగా వుంటూ రావడముచేతనున్ను, యిప్పట్లోనున్ను వుత్తరఖండం ప్రొవింషియల్ కోరటులో జిల్లాకోరటు కలకటరు కచ్చేరి మమ్మిస్సెర్యాటు ఆఫీసు సహితముగా కొంత దండు వసించివుంటూ రావడంచేతనున్ను, కాండ్రేగులవారు మొదలయిన కొందరు జమీందారులు సాహుకారులు వర్తకులున్ను వుండుటచేతనున్ను బస్తీ చాలాగా శోభించివున్నది. రాజవీధులు బాగా విశాలముగా వున్నవి. యిండ్లు బయిట చూచేటందుకు చిన్నవిగా అగుపడ్డా లోపలి ఆవరణాలు విశాలముగా కట్టివున్నారు. లోముంగిళ్ళుమాత్రము కొంచపరచి కట్టివున్నారు. సమస్ పదార్ధాలున్ను సమస్తపనులు చేయగల మనుష్యులున్ను దొరుకుదురు. శ్రీకాకొళము వదిలిన వెనక బాడిగెకు బండ్లు యీ బస్తీలొ దొరకడము కష్టము. భూమి వుప్పుకలిసిన రేగడి. నీళ్ళవసతి లేదు. దూరమునుంచి యీ బస్తీకి మంచినీళ్ళు తెచ్చుకోవలసినది.

వీరాస్వామయ్యగారు బందరులో జిల్లాజడ్జిగా నుండిన ఆంధ్రభాషోదారకులగు చార్లెస్ ఫిలిప్ బ్రౌను గారిని దర్శించారు గాని యీ పుస్తకములొ ఆ సంగతి వ్రాయలేదని బ్రౌనుగారు స్వదస్తూరితొ వ్రాత ప్రతి నాలుగు వందలు ఇరవై మూడు పుటలో రిమార్కువ్రాసినారు. వీరాస్వామయ్యగారు చెన్నపట్టణము చేరిన తరువాత బ్రౌనుగారికి వ్రాసిన యింగ్లీషు వుత్తరము వ్రాతప్రతి చివర అంటించబడియున్నది. వీరాస్వామయ్యగారిని బందరుపుర వాసులు పద్నాలుగు రోజులు అక్కడ వుంచారు.

మనుష్యులు నిండా ఆరోగదృఢగాత్రులుగా వుండలేదు. స్త్రీలు లలంకారపురస్సారముగా శోభాయమాన లయి వున్నారు. స్వరూపలావణ్యము గలవారు కారు. చెవులకు నిడుపుగొలుసులు వేశి కొన్ని పాపటకు చేర్చి చెక్కుతారు. స్త్రీ పుర్లుషులు చాయ వేసిన వస్త్రప్రియులై యున్నారు. రాజమహేంద్రవరానికి యీవల కృష్ణవరకు బ్రాహ్మణ్యమునకు భూజీవనాలు విస్తారములేక సంతుమాత్రము అతిశయిస్తూ రావడముచేత బందరుబస్తీ యాచక బ్రాహ్మణపూరితమై వున్నది. గంజాం, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, మచిలీబందరు, గుంటూరు జుములా యీఅల్యిదు జిల్లాలలోను భూమి విస్తారము జమీందారుల అధీనముగా పూర్వము నుంచి చేయబడివున్నందున జమీందారుల ప్రాబల్యద్వారా హిందువులవల్ల అద్యాపి కొన్ని విశేషధర్మాలు ఇరవై నుంచి ముప్పై వరకు వేల బ్రాహ్మణులకు సంతర్పణములున్ను చేయబడుచున్నవి. అన్నిటిలోను బందరు కాకినాడ జిల్లాల జమీందారులు చాలా ధర్మబుద్ధిగలవారు. రాజా కొచ్చర్లకోట వెంకటరాయనింగారు రెండావృత్తులు కుటుంబసహితముగా తులాభారము తూగి రెండావృత్తులు లక్ష బ్రాహ్మణభోజనము చేయించి అనేకయాగాలు చేయించినారు. వాశిరెడ్డి వెంకటాద్రినాయుడు అప్పారావు మొదలైన మరికొందరు అంతకు యెక్కువగా హిందుధర్మములను జరిగించినారు. యీ దేశస్థులు కచ్చేరి సహితముగా విందుచేస్తే ఆ వుత్సవాన్ని మేజువానీ లంటారు. కాకినాడజిల్లా సాలుకు రెండు లక్షల వరహాలు యెత్తుచున్నది. మచిలీబందరు ఆరు లక్షల వరహా లెత్తుచున్నది. యీ మచిలీబందరులో ఆగస్ఠు నెల పదిహేను తేదివరకు వసించినాను.

తేది వుదయాత్పూర్వము నాలుగుగంటలకు బైలువెళ్ళి యిక్కడికి రెండు ఆమడ దూరములో నుండే కొత్తపాళె మనే కృష్ణాతీరపు వూరు పది గంటలకు చేరినాను. దారిలో యీదేశస్థులు పర్రలు అని చెప్పే పల్లెలు కొన్ని వున్నవి. రేగడభూమి. కొత్తపాళెమునకు రెండు కోసుల దూరములో చల్లపల్లియనే యేర్లగడ్డ జమీందారుని నివాసగ్రామము వొకటి వున్నది. అందులో సుందరతరముగా వొక మిద్దెను ఆ జమీందారుడు కట్టియున్నాడు. యీ కొత్తపాళెము చిన్నవూరు అయినప్పటికిన్ని వెచ్చా గోపాలకృష్ణమ్మయనే కోమటి యిప్పట్లో బందరు ప్రొవింషియల్ కోర్టులో ప్లీడరుగావుండి అతడు వొక సత్రము కట్టించినందున మార్గస్థులకు బహువుపకృతిగా వున్నది.

గంజాంలో బందం చలమయ్య అనే అతను, విశాఖ పట్టణములో చిన్నం చలమయ్య అనేఅతను, యానాంలో మన్నెం కనకయ్య, రాజమహేంద్రవరములో గుండు శోభనాద్రి వగైరాలు జమీందారులయి లక్షాంతరములు వ్యాపారముచేసి దొరతనపు డౌలు పాయాపరువున్ను కలిగివున్నా వీరిని దక్షిణ దేశములాగున శెట్టి అనడములేదు గాని గారు అనే ప్రతిష్టావాచక ప్రయోగమున్ను తాజీం అనే ప్రత్యుద్ధానమున్ను వీరికి చేయకూడ దని వొక నిష్కర్ష యితర జాతులందరు తాగాల్యతునుంచి చేసుకొని అటు యీ దేశములో జరిగింపుచున్నారు. కోమటి జాతిలో వెచ్చా వారి కుటుంబము లాగున గవర్నమెంటు వుద్యోగాలు చేసిన కుటుంబాన్ని ఎక్కడా చూడలేదు/ శూద్రజాతిలోనున్ను యెంతగొప్పవాడైనా నాయిడనే ప్రతిష్టా వాచకాన్ని ఆ పురుషుని పేరుతోకూడా సాధారణముగా వాడరు. గంజాం మొదలుగా భోగస్త్రీలు సభాస్థలములకు వస్తే తంబుర వీణల వుంచుకొని పాడేకాలము తప్ప తక్కిన వేళలలో కూర్చుండకూడరు. పశ్చాత్తాపములేక రెండు మూడు ఝాములు వారిని నిలల్వపెట్టుతారు.

బందరుజిల్లా ప్రవేశించినవెనక బందిపోట్లు, పితూరీలు అనే మాటలు వినడములేదు. ఆ విషయమై యీ దేశము సుభిక్షముగా వున్నది. యిటీవల గుంటూరుజిల్లాలో భేది, వాంతి వుపద్రవాలు చాలా కలిగియున్నట్టు తెలియడమయినది. ఆ వుపద్రవము తగిలినయింట్లో మళ్ళీమళ్ళీ తగులుతూవున్నట్టు తెలిసినది. గనుక అందుకు హేతువు నాకు తొచడము యేమంటే అవశాత్తుగా వొక పురుషునికి ఆ వుపద్రవము తగిలి విపత్తుకు హేతువు కాగానే సన్నిహితులు భీతినిచెంది భీతిద్వారా యీ వుపద్రవము పరంపరగా వారు తెచ్చుకొనేటట్టు తోచుచున్నది. భీతి మరణాన్ని యివ్వగల వుపద్రవమని అనుభవసిద్ధముగదా! తేన వినా తృణాగ్రమపిన చలతి అనే వాక్యము సత్యమయినా దేహదృష్టిచేత నున్ను ప్రపంచ దృష్టిచేతనున్ను యిటువంటి వూహలు దేహదృష్టి విలయము పొందే కొరము చేయవలసి యున్నది.

కృష్ణాతీరమునందు పంతొమ్మిది తేది మధ్యాహ్నమువరకు నిలిచి నాను. కృష్ణానదీ మహాత్మ్యము విచారించగా లోకులనుతరింపచేసే కొరకున్ను యీ కలిలో లోకుల పాపాలు యెంతబళువో అంత పాటి పుణ్యము వొక స్నానముచేతనే కలిగేకొరకున్ను శ్రీమహావిష్ణువు యీ నదీస్వరూపముగా అవతార మెత్తినట్టు తెలియవచ్చినరి. యీ కృష్ణామాహత్మ్యము స్కాందపురాణాంతర్భూతముగా వున్నది. యిక్కడికి రెండు కోసుల దూరములో కళ్ళేపల్లి అనే మహాస్థలము వొకటి వున్నది. యీ నది సహ్యపర్వతములో వుత్పత్తి అయినది. ఆవుత్పత్తి స్థలసాగరసంగమాలకు డెబ్బై ఆమడ అని విన్నాను. యిక్కడ కృష్ణానది కోశెడు వడల్పు, అనేక గొప్పలంకలు కలవు. అందులో అనేక అడివి యావులు స్వేచ్చగా విహరింపుచున్నవి. యీ లంకలలో కాయకూరలు చాలాగా పైరై బందరు బస్తీలో వ్రయ మవుచున్నవి.

తేది మధ్యాహ్నము మీదట ఒకటి గంటకు బయిలువెళ్ళి కృష్ణానది పడవలకుండా దాటి ఐదు కోసుల దూరములోవుండే కనగాల యనే వూరు సాయంకాలము తొమ్మిది గంటలకు చెరినాను. యీ తీరమందు గ్రామస్థులు తమ ఖర్చుకింద పడవలు చేయించుకుని బీదలవద్ద డబ్బులు తరాతర ప్రకారము పుచ్చుకుని దాటిస్తారు. బలిష్ఠులకు అధికారస్థులకు అమిజీ, వెట్టి,కి దాటిస్తూ వుంటారు. యీతీరమందు నా స్నానకాల మందు చుట్టుపక్కల గ్రామాలలో వుండేవారుగా భూరి దక్షిణ నిమిత్తము రెండు వందలు బ్రాహ్మణులు చేరినారు.

యిక్కడి బ్రాహ్మలలొ కొందరు దేశాంతరాలు వెళ్ళి ద్రవ్యము సంపాదించి స్వదేశము కుదురుగా చేరినందువల్ల నున్ను యీ తీరపు బ్రాహ్మలు పుత్రదారాదులయిన బాంధవులను వదిలి దక్షిణము కన్యాకుమారివరకున్ను, వుత్తరము కాశ్మీర పత్యంతమున్ను సంచారము చెసి లోకులు చేయతగిన బ్రాహ్మణపూజలు నిర్బంధపెట్టి చేయించుకుంటూ వుంటారు. యీరీతిని కొండవేడు మొదలయిన యీ స్థలజ్ఞులు విచ్చలవిడిగా వొకరినిచూచి వొకరు సంచరించ ప్రయత్నపడ్డవా ఆవరించేపాటి ముక్కరలు చాలా లావుగా చేసి ధరించుతారు. యీ లోపల భూమికొలతను కత్తెలు, కత్తులు, అంటారు. గంజాం మొదలుగా కృష్ణాతీరమువరకు పెద్దమనుష్యులు సమానుల సమాగమము అయినప్పుడు అత్తరుతాను వుంచి తాంబూలముతోకూడా అత్తరునున్ను అవశ్యము యిస్తూ వస్తారు. యీ కళింగదేశము మొదలుగా కోసులు సుళువుగా అగుపడుచున్నవి. యిక్కడి వొక కోసు దక్షిణదేశపు రెండుగడియల దూరానకు కాలు గడియ తక్కువ అని చెప్పవచ్చును. గ్రామలెక్కలు మొదలయిన వ్రాతలు రాజమహేంద్రవరానకు దక్షిణము తాటాకులలో వ్రాస్తారు.

గంజాం మొదలు విజయనగరము వరకు తామర సమస్త గుంటలలో, చెరువులలో వేశివున్నారు. వాటి తూంట్లను కూర మొదఒలయిన పక్వాన్నాలుగా చేసి భక్షిస్తూ వస్తారు. నీళ్ళు తూకడానకు బావుల వద్ద తాటాకులు దొన్నెలుగా కట్టివుంచుతారు. వాటికి తాడుకట్టి నీళ్ళు చేదినంతల్లో రెండుపళ్ళ నీళ్ళు వచ్చుచున్నవి. యీ కనగాల అనే వూరు గొప్పది. విశాలమయిన బ్రాహ్మణ యిండ్లున్ను వొక గొప్ప చావడిన్ని కలవు. సమస్త పదార్ధాలు దొరుకును. యిక్కడ సమీపముగా కాటికెవా రని పౌరుష నామధెయముగల వొక నేత్రచికిత్సకుల కుటుంబము వున్నది. వారు యధాశాస్త్రముగా నేత్రచికిత్సకుల కుటుంబము వున్నది. వారు యధాశాస్త్రముగా నేత్రచికిత్స చేయుచూ వుంటారు. యీ వూళ్ళో యీ రాత్రి నిలిచినాను. దారి నల్లచౌటిరేగడ. తుమ్మచెట్లు యిరుపక్కలా వుంటూ వచ్చినవి. దారిలొ భట్టుప్రోలు అనే వూరివద్ద లంజదిబ్బ అని వొక మిట్టవున్నది. అదిమొదలు చెట్లశాలను దారిలో వేసివున్నారు.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కడికి ఆరు కోసుల దూరములో వుండే చందవోలు అనే గ్రామము ఏడు గంటలకు చేరినాను. దారి యిసకపర. యిరుపక్కలా చెట్లు పెట్టివున్నారుగాని నిండా లేతలు గనుక నీడ యివ్వనేరవు. యీ చందవోలు అనే వూళ్ళో వెచ్చా గొపాలకృష్ణమ్మ తమ్ముడు ధర్మపురి అనే అతను వొక సత్రము కట్టితివున్నాడు. యీవూరినుంచి కొండవీడుశీమకు దారి చీలిపొతూ వున్నది. యీవూరు తురక భూయిష్టమయినది. లోగడ అనేక శివా కోసులదూరములోవుండే చినగంజాం అనేవూరు ఆరు గంటలకు చేరినాము. దారి యిసకపొర అయినా కాలు దిగబడేపాటి బొల్లియిసక కాదు. చినగంజాంవూరిచుట్టూ వుప్పుపంట విస్తారము చేస్తారు. వూరు నిండా చిన్నది కాదు. యిక్కడ కొళంద వీరాపెరుమాపిళ్ళ సత్రము వొకటి వూరికి బయిలున వున్నది గనుక అక్కడదిగినాను. ముసాఫరులకు కావలశిన సామాను దొరికినది.

తేది వుదయాత్పూర్వము మూడు గంతలకు బయిలుదేరి యిక్కడికి నాలుగు కోసుల దూరములోవుండే అమ్మనబోలు అనేవూరుఆరు గంటలకు చేరినాను. దారి నిన్నటిదినము మేమునడిచినట్టె ఉపాయమయిన యిసకగా వున్నది. చనగంజాం అనే వూరితో గుంటూరు జిల్లా సరిహద్ధుసరి. యివతల నెల్లూరిజిల్లా అమ్మనబోలు అనేవూరు గొప్పదేను. సమస్త పదార్థాలు దొరుకును. కృష్ణకు యీవలవుండే యిండ్లు అన్ని పూరివేసికట్టివున్నవి. పెంకుటిండ్లు సకృత్తైనందున యీ దేశస్థులకు అగ్నిభయము చాలా కలిగివున్నది. బాపట్ల వద్దినుంచి నాతోకూడా వచ్చిన పరిచారకపు బ్రాహ్మణులు కొందరు వారి స్వగ్రామమయిన లంజచెరుకూరికి రెండుకొసులదూరములో వుండగా వెళ్ళి అమ్మనబోలులో మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. ఈ వూరి గ్రామ కరణము యింట్లో వంట భోజనాలు కాచేసుకున్నాము. బాపట్ల వలెనే యీ వూళ్ళోనున్ను తొపులు చెరువులు వసతిగా వున్నవి. మధ్యాహ్నము మీదట రెండు గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమడదూరములో వుండే ఆకులల్లూరు అనేవూరు ఆరు గంటలకు చేరినాను. దారి వుప్పుకలిశిన రేగడ. వర్షాకాలములో నడవడము ప్రయాసగా వుందును.

ఆకులల్లూరు అనే వూరు యధోసితము పెద్దదిగా వున్నది. ఎనభై బ్రాహ్మణ యిండ్లు వున్నా స్థలము యిచ్చేవారు కారని ప్రసిద్దికెక్కివున్నారు. అయినప్పటికి యీ శీమగ్రామ అధికారులయిన రెడ్డి కరణాలను పిలిపించి మాట్లాడి వొక బ్రాహ్మడి యిల్లు కురుర్చుకుని అందులో బసచేసినాను. అన్నిపదార్ధాలు దొరికినవి.

రాజమహేంద్రవరము మొదలు గుంటూరుజిల్లా సరిహద్దువరకు సరఫరాయి బంట్రౌతులను నాయక వాడీ లంటారు. వారు ముసాఫరులకు గొప్పవారయిన పక్షమందు సమస్త సరఫరాయి చేస్తూరావలసినది. నెల్లూరిజిల్లా మొదలుగా ఆదేతరహా నౌకరులను మహాతాదులంటారు. నెల్లూరిజిల్లాలో భూమికొలతను కుచ్చళ్ళు అంటారు. కుచ్చల ఒకటి కి రెండు గొర్రుల సంజ్ఞ యారాత్రి యిక్కడ వసించడమైనది.

తేదీ వుదయాత్పూర్వము నాలుగుగంటలకు లేచి యిక్కడికి నాలుగు కోసులదూరములోనుండే వలగపూడిసత్రము రెండు గంటలకు చేరినాను. దారి యిసకరేగడ కలిసియున్నది. యీసత్రము రాజాముద్ధుకృష్ణమనాయుడు వెలగపూడియనే గ్రామముందుగా యిక్కడి జమీందారులవద్ద యినాముగా సంపాదించి కట్టినాడు. గ్రామపు వసూలులో సదావృత్తి యిస్తూ వునారు. సత్రములక్షణముగా కట్టి యిప్పటికి బాగావున్నా కళాహీనమై వున్నది. నా అనుభవముచేత విచారించగా కళకలలాడుతూ వుండే భవంతుల కళావిలాసాలు వొకటే తీరున వున్నావాటి వ్యత్యాసకాలాలలొ కళాహీనమై పాడుకోరుతూ వుంటున్నది. గనుక యిటువంటి మానుష నిర్మాణములయందుకూడా పరమాత్ముని చైతన్యము యథోచితముగా ప్రతిఫలించెటట్టు తోచుచున్నది. యిక్కడ వంటభోజనాలు కాచేసుకుని ఐదు గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి మూడుకోసులదూరములోవుండే కరేడు అనేవూరు రెండు గంటలకు చేరినాను.

దారిలో రెండు వుప్పుటేరులు దాటినాము. యిప్పుఛు కాలినడకగానే వున్నది. యీ రెండుయేరులలో సర్పాకారమయిన విషజంతువుల భయము కదాచిత్తుగా కలిగి వుంచున్నది. దారి యిసకకలిసిన రేగడ. అమ్మనబోలుకు ఆకులల్లూరి మధ్యే నాగర్తను కొత్తపట్టణము యీతముక్కల వగయిరా బస్తీలువున్నట్టు యీమధ్యే గొప్పవూళ్ళులేవు. కరేడు గొప్పవూరు. యాభై బ్రాంహ్మయిండ్లు, వొక సత్రము, రెండుగుళ్ళున్ను, కలిగిన పేటస్థలము. సమస్తపదార్ధాలు దొరుకును. యీ రాత్రి యీ వూరి కరణము కట్టించిన సత్రములో వసించినాను.

తేది వుదయాత్పూర్వము రెండు గంటలకు లేచి యిక్కదికి రెండు ఆమడ దూరములోవున్న కొత్తసత్రమనే పేరుతో రామానుజరాయడుకట్టిన సత్రము రెండు గంటలకు ప్రవేశించినాను. దారి బహుయిసక. రామయపట్నము వరకు కాలు పూడిబోతూ వచ్చినది. యివతల సత్రమునకు రెండు కోసుల అంత యిసకలేదు. సత్రము బహు వసతిగా వున్నది. వద్దవుండే అంగళ్ళల్లో భాటసారులకు కావలశిన పదార్ధాలు దొరుకును. యిక్కడ వంటభోజనము కాచేసుకుని యిక్కడికి ఐదు కోసుల దూరములోవుండే జువ్వులదిన్నె అనేవూరు ఆరు గంటలకు చేరినాను. దారి కొంతమేర యిసక, కొంత యిసక కలిసిన రేగడ. దారిలో మామిళ్ళదొరువు అనే మజిలీవూర ముసాఫరుఖానా దొరలు దిగే లాయఖుగా వొకటి వున్నది.

జువ్వలదిన్నె అనేవూరు గొప్పదయినా నీళ్ళు ఆసరా విస్తారములేదు గనుక పంటలుజబ్బు. పేటస్తలముగా శానాకోమటి యిండ్లువున్నందున సమస్తపదార్ధాలు దొరుకును. దేవాలయాల సహితముగా కొన్ని బ్రాహ్మణయిండ్లు వున్నవి. అందులో వొక యింట్లో రాత్రివశించినాను. కృష్ణకు యివతల పశువులు గొప్ప దేహాలు కలవిగా వుంటూ వచ్చినవి. అమ్మనబోలు మొదలుగా అటువంటి పశువులు పుష్టికలవిగా గాలిమందలుగా అనేకములు చూస్తూ వచ్చినాను.

నేను యీవరకు కన్యాకుమారిమొదలుగా సంచరించిన భూములలో యీపాటి వైలక్షిణ్యము, స్థూలము, వున్నతము కల పశువులను చూడలేదు. యీ పశువుల పోషణముందర వ్యవసాయము నున్ను యీ దేశపు కాపులు లక్ష్యపెట్టేవారు కారు. పొలము బీడువేసి వాటికి పుల్లరి అనే తీరువ యిచ్చి పశువులను మేపించి కాపాడుతారు. యీ నెట్టు వారికి పశుధనమే ప్రబలముగా కలిగి వున్నది.

తేది వుదయాత్పూర్వము రెండు గంటలకు లేచి యిక్కదికి రెండామడ దూరములో వుండే కొడవలూరి సత్రము ఎనిమిది గంటలకు చేరినాను. దారి పంటల్లూరివరకు యిసక కలిసిన రేగడ. పంటల్లూరు మొదలుగా సత్రమువరకు సడక్కువేశి శాలవేశి వున్నది. పంటల్లూరు భారీదస్తు అయ్యే గ్రామము. తహశీలుదారుడు వుండే కసుబా. నేను దిగిన సత్రము వసతిగా వున్నా జలసౌఖ్యము మట్టు. యిక్కడ గొప్పది. పది వందల యిండ్లు వుండును. రధములుపొయ్యే వీధులు మాత్రము నిండా విశాలముగా వున్నవి. స్వతంత్రుడుగా శీమనుంచి వచ్చివుండే పేయిర్ అనే దొరను యాత్రవారి మహసూలు వసూలు చేసే పనులలో కలకటరు హస్తాంతరముగా మామూలు ప్రకారము అటారానాళాఃఘాటువద్ద వుంచి వున్నారు. యాత్ర వారి సమేతముగా పండాల విచారణ ఆ దొరల పరమై వుంచున్నది. బియ్యము మొదలయిన సమస్త పదార్ధములు అంగళ్ళలో వుండేవి. స్వామికి నైవేదనార్హములు గనుక వాటిని వాసన చూచి మళ్ళీ ఆ రాసులలో నెయ్యనివ్వరు. యీ నియమము వింతగా యీవూళ్ళో జరుగుచున్నది. మహాజనులనె సాహుకారులు యీ వూళ్ళో లేదు. సమస్త పదార్తములు దొరుకుచున్నవి. యూవూరు సముద్రతీర మందున్నది. యిక్కడ సముద్రస్నానము బహుముఖ్యము. జాతుల వాండ్లు సముద్రతీరమందు యిసక దిబ్బలలో వుపాయమైన యిండ్లు కట్తుకుని కాపురమున్నారు.

కొత్త మూర్తులను ప్రతిష్టచేసిన వెనక గుళ్ళోవుండే పాత మూర్తులను మూటినిన్ని రెండో ప్రాకారములొ వుండే మోక్షద్వారమనే కూపములో ప్రవేశింప పెట్టుతారు. ఆ కూపము అగాధమైన లోతని తెలియవచ్చినది. ఆకూపము వుండే ప్రదేశానకు యిక్కడివారు పొను భయపడుతూ వుంటారు. పాత మూర్తులలో నుండిన చైతన్యకళలను కొత్తమూర్తుల వక్షస్థలాలలో ప్రవేశింప పెట్టినవనక రెండుమూడు నెలలలో ప్రవేశింపపెట్టిన వృద్ధ కొరాతకులు దేహాలు వదులుతారని నిశ్చయముగా తెలిసినది. దాని కారణము యీశ్వరునికే తెలుసును. అయినా నాకు భయమే కారణముగా తోచుచున్నది. యిక్కడ నాలుగు కూరలు పప్పుపులుసు పరమాన్నము రెండు పిండివంటలతో సాధారణముగా వెయింటికి భోజనము చేయించ వలిస్తేయిన్నూటయాభై రూపాయలు సరాసరిపట్టుచున్నది. యిక్కడ అనేక మఠాలున్ను రోగిష్ఠులకు ప్రసాదవినియోగమయ్యేకొరకు కుంఫ్హిణీ ధర్మశాల వొకటిన్ని వుండేటందున బ్రాహ్మణ భోజన నిమిత్తము వొకదినముముందు పిలిస్తేపండితులు పామరులు సహా భోజనము కాఛెసుకుని రెండు గంటలకు బయిలు వెళ్ళి యిక్కడికి అమడదూరములో వుండే నెల్లూరు షహరు ఆరు గంటలకు చేరినాను.

పయి సత్రమువద్ద కొమటియిండ్లులు కొన్ని చేరినవి గనుక కావలసిన సామానులు దొరికినవి. ఆ సత్రానికి ముందు అల్లూరు మొదలుగా నేమి, యివతల నెల్లూరువరకు న్నేమి నాలుగైదు సత్రాలున్నవి. దారి సడక్కు వేశి గులకరాళ్ళు పరచి ఘట్టించి శాల చెట్లు వుంచివున్నారు. అవి పెద్ద చెట్లు అయినవి గనుక నీడ బాగా యిస్తూవున్నవి. నెల్లూరిలో జిల్లాజడ్జి కలకటర్లు వున్నారు.

పినాకినీనది దాటి నెల్లూరు ప్రవేశించినాము. నది అరకోసెడు వెడల్పు కద్దు. వొడ్దున రంగనాయకులపేట యనే గొప్ప విష్ణుస్థలమున్నది. వుత్తరము మూడుకోసుల దూరములో జొన్నవాడ యనే వూరు కామాక్షమ్మదేవీ సహితముగావున్నది. అక్కడ లక్ష్మీసరస్వతులు వింజామరలు వేశే అవసరముగా దేవివద్ద బింబాలను చేసి వున్నారు. బహుమంది సేవించి వరప్రసాదసిద్ధు లవుతారు. ఆ వూరు భోగస్త్రీలకు మిరాశి గనుక వారి సంఘప్రాబల్యముగలది. ఆవూరికి మిక్కిలి సమీపముగానే వొక చిన్న కొండమీద నరసింహస్వామి దేవాలయ మున్నది. యీజిల్లాలోనే వంగోలుకు రెండామడదూరములో శింగరాయకొండ యనే జాగ్రతస్థలము వొకటి వున్నది. నెల్లూరు సౌఖ్య మయిన వూరు. ఆరోగ్యకరమయిన భూమి. సుమారు వెయ్యిండ్లుకలవు. వుద్యోగస్థులచేత నిబిడీకృతముగావున్నది. గాని వర్తకులు లేరు. సమస్త కూరకాయలు పదార్ధాలు మంచి పాలుపెరుగు కావలశినప్పుడు దొరుకును.

చినగంజాం మొదలుగా సముద్రతీరమందు యీ జిల్లాలో వుప్పు పయిరుచేయడము విస్తారము గనుక వుప్పరజాతి స్త్రీలు దోటిముక్కరలు ధరించి పురుషులు సహాగా భూమి తొవ్విపొలాలుయేర్పరచే పనులలో జాగ్రత్తగా వుంటారు. యిప్పట్లో దక్షిణదేశము పడమటిదేశము పొడుగునా భూమి తొవ్వడానకు నెగడివుండేవారు యీ దేశపు వుప్పరవాండ్లున్ను, వోఢ్రదేశపు వొడ్డేవాండ్లుగా తోచినది. నెల్లూరిలో సమస్త విధములయిన పనివాండ్లు వున్నారు. మరునాడు యావత్తు యిక్కడ వసించినాను.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమణ్నరదూరములో వుండే మనుబోలువద్ద కృష్ణమాచార్యుల సత్రము ఏడు గంటలకు చేరినాను. యీ సత్రము బహువసతిగా వున్నది. సమస్తపదార్ధాలు దొరికినవి. యిక్కడ వంట, భజనములు కాచేసుకుని యిక్కడికి ఆమడ దూరములో వుండే గూడూరు జాములో చేరినాము. గూడూరు పెద్దదైనా అనావృష్టి కాలములయందు నీళ్ళకు బహు ప్రయాస. బావులు లేవు. ప్రయాసమీద బ్రాహ్మణయిండ్లలో స్థలము దొరికినది.

రాజమహేంద్రవరము వదిలినది మొదలు నియోగుల కర్ణీకపు వుద్యోగము కలవారై పూర్వోత్త్రరమునుంచి ప్రబలులుగా వుండడము వల్ల గొప్ప యింఛ్లు కట్టుకొని వున్నారు. వీరి ప్రారబ్ధవశమువల్లల్ భాటసారులకు స్థలము యిస్తేతమకు పరువుతక్కువాని వొక బుద్ధి జనియించి యిల్లు గొప్పగదా అని అవరైనా వెళ్ళి స్థలము అడగపోతే బ్రాహ్మణ యిండ్లకు పొమ్మంటారు. మీరు బ్రాహ్మణులుకారా అని ప్రశ్నచేస్తే కాదు మేము కరణాలము, స్థలములేదు పొమ్మంటారు. యీ వూళ్ళో రెడ్లు ప్రబలముగా వున్నారు. వొక దేవాలయ మున్నది. యిక్కడ యీ రాత్రి వొక బ్రాహ్మణయింట్లో వసించినాను. దారి సడక్కువేశి శాలపెట్టి వంటల్లూరు మొదలుగా వొక్కతీరుగా గులకపరచి వారధులు కట్తివున్నవి.

తేది వుదయాత్పూర్వము మూడు గంటలకు లేచి యిక్కడికి ఇరవై నాలుగుఆమడ దూరములొవుండే నాయడిపేట అనే వూరు తొమ్మిది గంటలకు చేరినాను. యిది పేటస్థలము. సమస్త పదార్ధాలు దొరుకును. మనుబోలు మొదలుగా వెంకటగిరిరాజు వారి భూమి. యె పేటలోను, వారి సదవృత్తి అన్నసత్రము, నగెరున్ను వున్నది. యిక్కడ బోజనము చేసుకుని ఆరు గంతలకు బయిలువెళ్ళి యిక్కదికి కోసెడు దూరములో వుండే బ్రాహ్మణ పుదూరు చేరినాను. యీవూరు దారి కాక పొయినా యాభై యిండ్లు విద్యన్మడలి వుండే గ్రామము గనుకనున్ను నాపరివారల స్వకీయులు కొందరు అక్కడ వున్నారు. గనుకనున్ను యీ వూరికి రావడమయినది. యిక్కడ అనాది దేవాలయాలు రెండు ఆబ్రాహ్మణుల పేదరికమునకు తగినట్టి కాపాడబడుచున్నవి. యీ బ్ర్రాహ్మలకు ఈ గ్రామము శ్రోత్రియము. ఈ వూళ్ళో ఇరవై తొమ్మిది తేది మధ్యాహ్న పర్యంతము నిలవడమయినది.

కృష్ణ మొదలుగా గూడూరివరకు తాగ నీళ్ళులేవని జనులు హాహాకారపడుతూ వుండినారు. ఇవతల నాయడిపేట మొదలుగా యెక్కువ వర్షాలు ప్రతిదినము కురుస్తూ వున్నవి. జగదీశ్వదుడు యీ చొప్పున పాత్రాపత్రములు యెరిగి జీవనాదానము చేయుచూ వున్నాడు. కాల నష్టములకు కారణము అనేకవిధాలా విచారించగా రాజధర్మము ప్రజల నడవడికె యీ రెండుకారణాలున్ను ముఖ్యములని తొచబడుచున్నది. గూడూరు మొదలుగా దారి సడక్కుకాదు. యిసక కలిసిన రేగడ. నాయుడిపేటవద్ద సువర్ణముఖరీనది దాటవలసినది. యేరు అరగడియ దూరము వెడల్పుకద్దు.

నెల్లూరు మొదలుగా అరవమాటలు వింటూ వస్తారు. యీ వూరికి ఆ వూరు యిన్ని గడియల దూరమని చెప్పుతారు. కోసులమాట నిలిచిపోయినది. వుత్తరపినాకిని మొదలు దక్షిణపినాకిని వరకు మధ్య దేశముగా తోచుచున్నది. యీ దేశాములో పడమటి నుంచి కన్నడము వచ్చి కలిసినది. దక్షిణము నుంచి అరవము వచ్చి కలిశినది. వుత్తరము నుంచి తెనుగు అదే రీతుగా వచ్చి కలిసినది గనుక యీధ్యదేశపు భాష యీ మూడు భాషల మిశ్రమయి యీ మూడు భాషలు యీ దేశస్థులు వచ్చి రాక ఆ యా దేశములోకి వెళ్ళి మాట్లాడపోతే ఆ యా దేశస్థులు హాస్యము చేయసాగుతారు.

తేది మధ్యాహ్నముమీద మూడు గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమడదూరములో వుండే దొరవారి కోనేరు అస్తమానానకు చేరినాను. యిక్కడ వెంకటగిరి రాజు వొక గుంట తొవ్వించినాడు. అందులో యెన్నడికి అరోగ్యముగానున్ను, రుచికరముగానున్ను ఆరోగ్యకరముగానున్ను వుండే వుదకము కలిగివున్నది. యిక్కడ వారు కట్టివుండే సత్రము చావిళ్ళు యధోచితముగా విశాలములై వున్నా నిత్యము వేలమోడిగా ప్రజలు దిగుతారు గనుక స్థలము సమ్మర్ధముగా వున్నది. సమీపమందు వుండే అంగళ్లలోను, భాటసారులకు కావలశిన పదార్ధాలు అన్ని దొరుకును. యిక్కడ యీరాత్రి వచించినాను. దారియెర్రయిసక. యిరుపక్కలా అడివి. చోర భయము కద్దు.

చేది వుదయాన నాలుగు గంతలకు బయిలువెళ్ళి యిక్కదికి ఆమడదూరములో వుండే మన్నారు పోలూరు రెండు గంటలకు చేరినాను. దారి నిన్న మధ్యాహ్నము నడిచినటువంటిదేను. యిక్కడ ప్రసిద్ధమయిన కృష్ణ దేవాలయము వున్నది. వూరికి వుభయపార్శ్వాలా కాళించి యమునలు అనే నదులు రెండు చిన్నివిగా ప్రవహిస్తూవున్నవి. యీ గుళ్ళో జాంబవతుని గుహ యనే బావి వొకటి వున్నది. యిక్కడ జాంబవతునితో పోరి శమంతకమణిన్ని, జాంబవవతిన్ని ప్రతిగ్రహించి శ్రీకృష్ణులు విరాజమానుడయినట్టు స్థలపురాణము తెలియపరుస్తున్నది. భక్తాభీష్టములిచ్చే కోదండరామస్వామి ఆలయమున్ను, జాంబవతుని ఆలయమున్ను లోఆవరణములో వున్నది. కృష్ణమూర్తిని వ్యత్యస్తపాదమనే ధ్యాన శ్లోక ప్రకారము నిర్మించి వున్నారు. యిరువైయిండ్ల బ్ర్రాహ్మణులు వున్నారు. అగ్రహారము ముందర తిరుక్కొళము గమణీయముగా వొకటి యున్నది. వెంకటగిరిరాజాగారి నగరు వొకటి కట్టి వున్నారు. అతిరుక్కొళము నీళ్ళు నిండా పాచి అయినప్పటికిన్ని ప్రతియింటా బావులున్నవి గనుక జలవసతి కలదిగానే వున్నది. కాళిందీ నదికి ఆపక్క, కోటపోలూరని వొకటి వున్నది. గడియ దూరములో సూళూరుపేట అనేపేటా వొకటి వున్నది. యిక్కడి నూరిండ్ల నియోగులు చుట్టుపక్కలా వున్నారు. పోలూరిలో ప్రయత్నము మీద కావలశిన పదార్ధాలు దొరుకును. నెల్లూరు మొదలుగా భూమి తొవ్వితే అక్కడక్కడ కావలసి నన్ని గులకరాళ్ళు తియ్యవచ్చును. నిన్నానేడు నదిచిన భాట కొంత మేర రాతిగొట్టుగా వచ్చినది. యిక్కడ యీరాత్రి నిలిచినాను.

తేది వుదయమయిన నాలుగు గంటలకు బయిలు వెళ్ళి యిక్కడికి ఆమడదూరములో వుండే చిలకలపూడి రామస్వామి సత్రము ఏడు గంటలకు చేరినాను. దారి సన్నయిసక పొర. నిండా అడివి లేదు. యీ సత్రము పూర్వము వున్న వొక గుంతను ఆసగాచేసి కట్టినాడు. మంచి మజిలీ స్థలము. సత్రము విశాలముగా వున్నది. సత్రములో తొవ్విన బావినీళ్ళు తేలికగానున్ను, రుచిగానున్ను వుంచున్నవి. భాటసారులకు కావలసిన సామానులు అన్ని దొరుకును. యిక్కడ భోజనము కాచేసు కోవడానకు మధ్యాహ్నము నిలిచినారు.

నెల్లూరిసీమ పుల్రుషులు, స్త్రీలు దేహపటుత్వము కలవారుగా నున్ను, యధోచితమయిన శుకచరూపము కలిగి సౌందర్య వతులుగా తోచు చున్నదిగాని దేహవర్ణము నలుపుకలసిన చామనగా తోచుచున్నది. గుణము నిష్కాపట్య ప్రధాన మని చెప్పవచ్చును. యీ మధ్యాహ్నము మీదట రెండు గంటలకు బయిలు వెళ్ళి యిక్కడికి ఆమడ దూరములో నుండే కోళూరురాజు సత్రము ఆరుగంటలకు చేరినాము. దారిలో పెరియవేడు అనే వూరువున్నది. అక్కడినుంచి బండి భాట గుమ్మడిపూడిమీద చీలిపోవుచున్నది. నేను వచ్చిన భాటలో పయిసత్రము సమీపముగా పడవలగుండా వొక వుప్పుటేరు దాటవలెను. చెన్నపట్టణమునకు సమీపగా వుండే కాకిరేనుకాలువకు నీళ్ళువచ్చే ప్రళయకావేరి అనే యేరు పోలూరుదాకా ప్రవాహకొలమునందు వచ్చుచున్నది. ఆయేరు యీ దినము దారి నడవడములో చూస్తూ రావచ్చును. నేడు మధ్యాహ్నము నడిచినదారి యిసకపర. పెరియవేడు మొదలుగా వుప్పుపయిరు చేసే అళాలు శానా వున్నవి. పయినవ్రాసిన సత్ర్ము నుంచి సుందరమయినతోట మధ్యే రెండుకట్లుగా కట్టి వున్నది. జలవసతి కద్దు. సత్రమువద్ద వొక అంగడి అయినా అన్నిపదార్ధాలు దొరికినవి. యీ రాత్రి యిక్కడ వసించినాను.


ఇరువదియైదవ ప్రకరణము  నెల్లూరు నుండి చెన్నపట్టణము

సెప్టెంబరునెల ఒకటి తేది ఉదయాత్పూరము నాలుగంటలకు బయిలువెళ్ళీ యిక్కడికి పద్నాలుగు ఆమడలదూరములో వుండే పొన్నేరి యనే స్థలము పది గంటలకు చేరినాను.*

గమనిక, * ఇక్కడ యీదులనారాయణయ్యగారి దగ్గఱ బసచేసినా నని వ్రాతప్రతి నాలుగు వందలు ఇరవై పుట.

దారి రేగడభూమి గనుకనున్ను వర్షాలునిండాగా యిప్పట్లో కురిశివున్నది గనుకనున్ను నడవడానకు నిండా ప్రయాసగా వుండినది. పొన్నేరి వూరిముందర అరణ్యనది రొమ్ములమట్టు నీళ్ళుండగా కాలినడకగా దాటినాము. పొన్నేరియనే వూరు రెండుభాగాలుగా విభజింపబడి వున్నది. ఆరెండు భాగాలున్ను కలియడానకు మధ్యే వొక విశాలమయిన అంగడివీధి సత్రాలు సహితముగా కట్టివున్నది. యీ వీధిలో ప్రతిసంవత్సరము హరిహరాదులు వారివారి వాహనారూఢులయి సంధించే వుత్సవము జరుగుచున్నది. గనుక ఏతద్విషయమయి యీ వీధిని బహుసుందరముగా యేర్పరచివున్నారు. దక్షిణభాగమందు వుండేవూళ్ళో ఆరుముఖ మొదలారి వొక శివాలయము తటాకము మొదలైన ధర్మస్థలములను నిర్మించివున్నాడు. ఉత్తరభాగమందు అనారి విష్ణుస్థలము తటాకము మొదలయిన దేవాలయ బ్రహ్మాలయాలు వున్నవి. నలభై బ్రాహ్మణయిండ్లు కలవు. బట్టలు సహితముగా కావలసిన పదార్ధాలు అన్ని యీ వూళ్ళో దొరుకును. విశాలమయిన సత్రాలు చెన్నపట్టణపు వారు కొన్ని కట్టివున్నారు. విష్ణు స్థలమునకు భూరూపకమయిన జీవనము వుండేటందున కంపెనీవారు ధర్మకర్తను యేర్పరచి పనులు జరుపుకుంటారు. శివస్థలమునకు ఆరుముఖ మొదలారి వొక ముఠాను తీసి దాని ఆర్జితముగుండా అతి విమర్శగా నిత్యోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాలు జిరిగింపుచున్నాడు.

ఈస్థల మహాత్మ్యము బ్రహ్మాండపురాణాంతర్భూతముగా ఐదు అధ్యాయాలువున్నవి. వాటిసారమేమంటే శ్రీకృష్ణమూర్తి ద్వాపరాంతమందు కలిలో తాను యీస్థలములో మూర్తీభవింఛేటట్టు ఋషులకు చెప్పివున్నందున ఈ రహస్యము భారద్వాజులు తెలుసుకుని యిదే బృందావనక్షేత్రమని నిశ్చయించి యిక్కడ స్వామిసాక్షాత్కారము పొందడమునకు బ్రహ్మను కూర్చి తపస్సుచేసినట్టున్ను బ్రహ్మభారద్వాజుల యిష్టసిద్ధి అయ్యేకొరకు విష్ణుప్రీత్యర్ధముగా నారాయణవనములో యాగము చేసినట్టున్ను అప్పుడు అరణి మధనలో ప్రధమము వొక నది పుట్టినంతలో ఆ అరణ్యనదిని భారద్వాజుల నిత్యకర్మాదులకు వొదిగేటట్టుగా యీ పొన్నేరికి పంపించినట్టున్ను పిమ్మట యాగానంతరము శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమైనంతలో భారద్వాజుల యిష్టసిద్ధి చేయమని వేడుకుని శేషశాయి రూపముతో ఈ స్థలములో విరాజమాను డయ్యేటట్టు చేసినట్తున్ను పిమ్మట వొక గోవు పాలు కార్చడం మూలముగా వూహించి పుట్టచేత కప్పబడియుంఛే స్వయంభు కృష్ణమూర్తిని కరిపాండ్యరాజు వేశేషక్షీరాభిషేకము వల్ల బయిలుపరచి దేవాగారాలు కట్టి తనపేరు సహితముగా కరికృష్ణుడని నామమరణముచేసి ఆరాధనచేయనుచూ వచ్చినట్టున్ను ఈ అరణ్యనదిన్ని ఈ స్థలమున్ను తదారభ్య యింద్రాదుల శాపాన్ని పోగొట్టి అనేకులను పావనులుగా చేయుచూ వుండేటట్టు విదితమయివున్నవి.

ఈ దినము వుట్లపండగ గనుక యిక్కడ భొజనానికి నిలిచి స్వామి దర్శనమున్ని చేసి నాలుగుగంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమడదూరములోవుండే విచ్చూరికి రాత్రి రెండు గంటలకు చేరినాను. మధ్యాహ్నముమీద నడిచినదారి రేగడభూమి. బండిదారి వొకటి కాలిదారి వొకటి అంతు రెండుదారులు కలిగివున్నవి. కాలిదారిగానే నడుస్తున్నవి. వర్షాకాలము గనుక బహు ప్రయూసగా వున్నది. పొన్నేరికి రెండు గదియల దూరములో యెలవంబేటి వద్ద కొరత లేదు నడుముల మట్టులోతు గనుక కాలినడకగానే దాటినాము. విశేష ప్రవాహకాలమందు పడవలు తెప్పలగుండా దాటవలసినది. విచ్చూరు లింగిశెట్టివారికి శ్రోత్రియగ్రామము. సంవత్సరానకు వెయివరహాలు యెత్తును. ముప్పై బ్ర్రాహ్మణ యిండ్లు కలవు. సమస్త పదార్దాలు దొరుకును. చుట్టూ అశ్వద్ధవృక్షాలుగల రమణీయమయిన వొక తామరకొలను అగ్రహారమునకు సమీపముగా వున్నది. యిక్కడ ఈ రాత్రి మసుసటి దినము మధ్యాహ్నమువరకు నిలిచినాను.

లోకములో యీశ్వరుడు వొక రూపముతో ఆదరింపుచు మాతాపిత్రాదులు అనేక రసాలను కాలోచితముగా తెచ్దుకొని వొక్కొక్క రసముతో వొక్కక్క విధమయిన అభినయాన్ని పట్టి శిసువులను రక్షించేటట్టు సమస్తవిధాలా యెదటనిలిచి యీశ్వరుడు మాట్లాడుచు వుండగా యీశ్వరుడు ప్రత్యక్షముకావలె నని లోకులు యీశ్వర సాన్నిధ్యము కావలెననిన్ని పిచ్చి తపస్సులు చేయుచున్నారు. యిందుకు కారణము జగదీశ్వరుని దురత్యయ మయిన మాయకాని వేరేకాదు.

తేది మధ్యాహ్నము మీదట నాలుగు గంటలకు బయిలువెళ్ళి యిక్కడికి ఆమడ దూరములో వుండే తిరువట్టూరు అనే మహాస్థలము అస్తమానానకు చేరినాను. *

గమనిక, * కోమలేశ్వరుడి గుడి మునియపిళ్ళ కొమారుడు శ్రీనివాసపిళ్ళ వారున్ను వచ్చి కలుసుకొని తమ సంకల్పం సిద్దించెగదా అని ఆనంద పడ్డాడు అని వ్రాత ప్రతి నాలుగు వందలు ఎనభై ఒకటి పుటలో వున్నది.

దారి వుప్పురేగడిభూమి. చెరిసగము దూరములో సుంకపుమెట్టు వొకటి వున్నది. సుంకము వసూలు నిమిత్తము యిక్కడ మూటలు ముల్లెలు చెన్నపట్టణమునకు నాలుగు పక్కలా వుండే మెట్లలో సోదా యిచ్చేటట్టుయిక్కడ యివ్వవలశినది. నేటి దారిలోమధ్యే కాకిర్రేవు కాలువ దాటవలశినది. వారధి మీదపోతే కొంతచుట్టు గనుక పడవలగుండా ఆ కాలువ దాటినాను. వర్షాకాలము గనుక దారి అడుసుగా వున్నది. యీతిరువట్టూరు బహు సుందరమైన వూరు. ప్రతిసంవత్సరము యిక్కడ జరిగే బ్రహ్మోత్సవము వసంతకాలములో శుక్లపక్షములో అపర రాత్రిళ్ళలో విభాము జరుగుటచేత చెన్నపట్టణములో సమస్త విధములయిన జీవనోపాయాలు కలవారు నిద్రాకాలాన్ని మానుషానందాను భవానకు వుపయోగము చేసుకుని చెన్నపట్టణము మొదలు తిరువట్టూరివరకి రెండు కోసులదూరములో అడుగుకు వొక సత్రముకట్టి దానికి తగ్గ వుపచారములు వారువారు ఆ సత్రాలలో చేస్తూవుండడమువల్ల సౌఖ్యముగా వచ్చి యీబ్రంహ్మోత్సవాన్నిన్ని వేడుకపరచి తాము ఆనందపడిపోతూ వుంటారు. యీవూళ్ళో చెన్నపట్టణపు వుపపన్నులు అనేకసత్రాలు కట్తివున్నారు. విశాలమయిన వీధులు కలవి. వీధులు తెంకాయచెట్లశాలల వల్లను బయిటితిన్నెలు పందిళ్ళుచేతనున్ను అలంకరించబడివున్నవి. సుందరమయిన దేవాలయము తటాక సహితముగా వున్నది. సమస్తపదార్ధాలు దొరుకును. యీ గుడిధర్మము లింగిశెట్టి కుమారుడైన అరుణాచల శెట్టి తనచేతి సొమ్ము సంవత్సరానకు రెండు వేల వరహాలదాకా ఖర్చు చేసి జరిగింపుదున్నాడు. ఆ ధర్మము కాక అతను అన్నదానాపేక్ష చాలా కల వంశములో జనించినాడు గనుక ఆ వాసన యీ పురుషుణ్ని బాగా పట్టి వున్నది.

యీ స్థల మహాత్మ్యము యే మంటే సృష్టికి ఆదియందు భూమి జలార్ణవమై వుండగా యీశ్వరుడు సృష్టికి అంకురముగా వొక ఔదుంబర వృక్షము కలగచేసి చండవాయువు చేత ఆవృక్షమును యుక్తప్రదేశములో నిలుపుమని పంపించినట్టున్ను ఆ వృక్షము యీ వూళ్ళో పతనమై పాతాళలోకము అంటినట్టున్ను దాన్ని వేళ్ళపుష్టి భూమిని అప్పట్లో ఆవరించి భూమి మీద వుండే వుదకాన్ని పానము చేసి భూమిని బయిలు పడతోశినట్టున్ను అప్పట్లో వినాయకుడు మొదలయిన ఆవరణదేవతలు ఆచెట్టు కింద ప్రవేశించినట్టున్ను ఆదిశేషుడుకూడా వొకపుట్టను యిక్కడ కల్పించుకొని వసింపుచున్నట్టున్ను అఘుపిఎనిమిదిమ్మట యీస్థలములో వసించగలందులకు పార్వతిని రమ్మంటే సృష్టి స్థితి సంహారములలో అధికారము తనకుకూడ యివ్వకగాని తాను రానని చెప్ప్నట్టున్ను పిమ్మట యీశ్వరుడు అదేప్రకారము అధికారము యిచ్చి పార్వతిని వెంటపెట్టుకుని ఆదిశేషునివల్ల పూజింపబడి అతను కట్టుకునివున్న వల్మీకములోనే ప్రవేశించి అద్యాది వుండేటట్టున్ను పార్వతీదేవినిన్ని త్రిపురసుందర్యాకారము వహించి సృష్టి స్థితి సంహారాధికారము చేయుచూ యిక్కడ విలశిల్లి వుండేటట్టున్ను పిమ్మట యీశ్వరుడు తన ప్రతిభాతిని మూర్తీగాచేసి సుందరుడని నామముపెట్టి పార్వతియొక్క ప్రతిభాతితో పొగడచెట్టుకింద యిద్దరి కిన్ని వివాహముచేసినట్టున్ను ఆ వాహము ఛూడవచ్చిన గంగాస్నాతయయిన భక్తుడు కాలాతీతముగా వచ్చి వివాహము చూడడానకు లేకపోయెనని దు, ఖపడితే అతని గంగను యిక్కడి తటాకములొ విలసింపచేసి మళ్ళీ ఆవివాహ లాంఛన జరిగించి అతనికి దర్శనము యిచ్చినట్టున్ను ఆ వివాహలాంచన ప్రతిసంవత్సరము యిప్పుడు బ్రహ్మోత్సవములో పొగడమాను సేవ అని జరిగేటట్టున్ను బ్రహ్మకు పార్వతి నిమిత్తము తాను ఆడిన తాండవము యీశ్వరుడు యిక్కడ మళ్ళీ దర్శనము అయ్యేటట్టు చేసినట్టున్ను మరికొన్ని కాలాలలో కొందరు భక్తులకు అపహరించబడ్డ భాగ్యాన్ని త్యాగము చేసినట్టున్ను మొట్టమొదట పుట్టిన పురి అయినందున యీవూరు ఆదిపురి అనిపేరు కలిగి తాండవము చూపుటచేత తాండవ ప్రయుక్తమయిన భవును అనే నటనలు ఆడుతూ త్యాగద్వారా త్యాగరాజు అని మూర్తి పేరువహించి వల్మీకనివాసముచేత అదే మూలస్థానమై వుండేటట్టుగా ప్రసిద్దిపడి యున్నది. యిక్కడ మరునాడు దాకా వచింనాను.

తేది సాయంకాలము ఐదు గంటలకు బయిలువెళ్ళి యిష్టులతో కూడా చెన్నపట్టణమునకు అరకోసెడుదూరములో తండయారు వేడులో వుండే నాతోట యిల్లు ఆరుగంటలకు చేరినాను. దారి యిసక పొరభూమి. యిరుపక్కలా తోటలు సత్రాలు దట్టముగా వుండుటచేతనున్ను భాట వెడల్పు చలాకలిగివుండుట చేతనున్ను బహు రమణీయముగా చూడవేదుకగా వున్నది. జగదీశ్వరుడు ఈ తృణాన్ని మేరువు చేసుననే వాక్యము సత్యము అని నేను అతి ఘోర ప్రమాణము చేయగలను. అది యెట్లాగంటే నేను స్వస్థలము వదిలి మళ్ళీచేరినకాలము పదిహేను మాసాలౌ పదిహేను దినాలు పది నిమిషాలు. నాస్వస్థలము వదిలి దూరదేశము సంచరించి మళ్ళీవఛ్ఛినట్టు నాకు నాపరివారానికిన్ని తోపచేయక వొకరికి కాలిలో ముల్లుకూడా నాటినట్టు తోపచేయకుండా తృణానికి తక్కువ అయిన నన్ను రాజఠీవిగానే స్థలముచేర్చినాడు.

గనుక అవ్యాజముగా ఈశ్వరుడు తృణాన్ని మేరువుచేస్తాడనే మాట సత్యం సత్యం పున, సత్యమని నా సహోదరులైన లోకులు నమ్మవలశినది.

నా జన్మభూమి అయిన చెన్నపట్టణపు వృత్తాంతము యెటువంటిదంటే మూడు వందలు యేండ్ల కిందట చంద్రగిగిలో బీజానగరపు స్దంస్థానాధిపతి యయిన శ్రీరంగరాయడు దొరతనము చేయుచుండగా డే అనే దొర యీ సముద్రతీరమునందు వొక రేవుబందరు కట్టించవలనని యత్నము చేసి శ్రీగంగరాయణ్ని అడిగి వుత్తరువు తీసుకుని యీ ప్రాంత్యాలకు జమీందారుడయిన దామర్ల వెంకటాద్రినాయుడి పేర సన్నదు పుచ్చుకొన్నాడు. ఆ వెంకటాద్రినాయడు డే దొరకు కృతపరిచయుడు గనుక శ్రీరంగరాయడు తన పేరుపెట్టి శ్రీరంగరాయ పట్టణము అని రేవు బందరు కట్టమన్నా వెంకటాద్రినాయడు తన తండ్రియైన చెన్నపనాయడి పేరట చెన్నపట్టణ మని పేరుపెట్టి కట్టమని చెప్పడమేగాక తానే సన్నిధానాధిపతి గనుక అదే నామకరణము ఆరంభములో ఛేసినందున చెన్నపట్టణమని పేరు కలిగినది. తత్పూర్వము యీరేవును యింగిలీషువారు మదిరాసు అంటూ వచ్చినారు.

పిమ్మట పదహారు వందల నలభై నాలుగు యింగిలీషు సంవత్సరములో రేవు బందరుకు చేరినట్టుగా వొక కోటకట్టి చముద్రతీరము నందు రెండుకోసుల భూమిని యింగిలీషువారు స్వాధీనము చేసుకున్నారు. అటుపిమ్మట పదహారు వందల అరవై ఒకటి సంవత్సరములో యింగిలీషువారిలో కొంత అంత, కలహము జరిగి అరాజమమయి పదహారు వందల డెబ్బై ఒకటి సంవత్సరములో మళ్ళీ స్థిరపడి యీ రేవు బందరు సుంకము యిజారా కంపెనీవారి చేసినారు. వంబడిగానే కంపెనీవారి ప్రాపకము కోరి జగదీశ్వరుడు సత్యవాదులపై పక్షపాతి గనుక యింగిలీషువారు చాలా సత్యసంధులయినందున యీ బస్తీలో మూడు లక్షల ప్రజ వాసముఛెశేటట్టు చేశినాడు. పిమ్మట పదహారు వందల అరవై ఆరు సంవత్సరములో నలభై వేల వరహాలు సాలుకు యెత్తేపాటి భూమి కంపెనీవారి యధీనమయినది. పిమ్మట పదిహేడు వందల రెండు సంవత్సరములో డిల్లీ పాదుషా అవరంగజీబు తరపున దావూతుఖానుడు దండుయెత్తివచ్చి యింగిలీషువారిని చాలా కలతపెట్టినాడు. అప్పట్లో అనేక తెగలు అనేక దేశములనుంచి యిక్కడికి చేరినందున యెడమచెయ్యి కక్షి అని కుడిచెయ్యి కక్షి*

గమనిక, * కుడియెడమల కులకక్షలు, వైష్ణవబ్రాహణులలోని వడగలి తెంగలి తెగలవలెనే ద్విజేతరకులములందు కుడి ఎడమ కులకక్షలు చాలాకాలమువరకు అతి తీవ్రముగా నుండేవి. కుడిచెయ్యి కలకక్షిలో లింగధారణముచేసిన నేతగాండ్రు, తెలికలవాండ్లు, కుట్రపుపనివాండ్రు, బలిజలు, గొఱ్ఱెల కాపరులు, కుమ్మరులు, మేదరులు, చాకళ్ళు, మంగళ్ళు, జోగులు, బుడబుక్కలవాండ్రు, మాలలు నుండిరి. ఈ కుడికులమువారిని కొన్నిచోట్ల చైనాచారులని న్ని, కొన్నిచోట్ల మహానాటివారనిన్ని వ్యవహరించిరి. ఎడమచెయ్యి కులములను పాంచాలలనిన్ని, మత్తుజనిన్ని వ్యహరించిరి. వీరిలో జందెములు వేసికొను అయిదు తెగల బత్తులు, వెండి బంగారు పనిచేయు కంసాలిబత్తులు, రాగి యిత్తడి పనిచేయు కంచరిబత్తులు, రాతి పనిచేయు శిల్పులు, రంగులువేయు హటగాదులు, నేతనేయు దెవాంగులును, గొల్లలు, మతరాచలు, మాదిగలు మొదలగువారుండేవారు. ఈ రెండు కక్షలలోని కులములవారు వొకరికన్న వొక రెక్కువ వారమనిన్ని తమకు ముందుగా మర్యాదలు జరుగవలెనన్ని తగవులాడుచుండేవారు. ఈ రెండు తెగలకు వేరువేరు మతాచారములుండెను. దేవతలు దేవుళ్ళు నుండిరి. వీరి వివాహములందు మరణములందు కొలువులందు జాతరలందు ఒక కులకక్షివారి వీధులనుండి రెండవకక్షి కులములవా రూగేంపులు చేయకూడదను కులకట్టులు నిషేధములు అనాదిసిద్ధముగా నుండి తగవులకు దెబ్బలాటలకు కారణ మగుచుండెను. పెండ్లిండ్లలో మహానాటివారిలో మాలలు గుఱ్ఱమునెక్కి యూరేగుటకు కొన్ని గ్రామములందభ్యంతర ముండెను. తక్కివారిలో ఆయా కులముల తారతమ్యములను బట్టి పల్లకీలు మొదలైనవి యెక్కి భజంత్రీలు మేళతాళములతో నూరేగినచో నెడమకులములవా రభ్యంతర పెట్టకుండిరి. ఇంకను చిత్రవిచిత్రములైన యాచారాలుండెను. ఇవి మీరినట్లయితే రెండవారు ఆటంక పరుచుచుండేవారు. చాలాకాలమువరకు నింగ్లీషు కంపెనీప్రభుత్వము వారీ కులమర్యాదలను కాపాడుచునే యుండిరి. సివిలు క్రిమినలు కోర్టు లీ తగవులతో నిండుచుండేను. దేశము తెలుగు మీరిన తరువార రోడ్లు మొదలగు బహిరంగస్థలములలో నందరికిని సమానమైన హక్కులు కల సమ సిద్ధాంతము స్థాపింపబడినది. చెన్నపట్టణమున పదహారు వందల యాభై రెండు, వంద డెబ్బై నుంచి ఏడు వరకు, పదిహేడు వందల పద్దెనిమిది సంవత్సరములం దిట్టితగవులువచ్చింట్లు కంపెనీ వారి రికార్డులలోనే వివరింపబడియున్నది. ఈ రెండుకులములవారికి పెద్దనాయకునిపేట ముత్యాలపేటలలో ప్రత్యేక వీధు లేర్పాటు చేయబడెను.

అని రెండు పక్కలుగా యిక్కడివారు చీళి యింగిలీషువారికి చాలా శ్రమను కలగఛెసినారు. అందుకు నలభై సంవత్సరముల తర్వాత ప్రాంసువారు యీకోట తీసుకొని యింగిలీషువారిని వెళ్ళకొట్తినా హిందూస్థాన్ లో యింగిలీషుజాతికి దిగ్విజయము కలిగి వుండెను గనుక వారు వొకపాటిగా సమాళించినారు. వెంబడిగానే ఐదు సంవత్సరములకు రాజీ మీద యీ స్థలమును యింగిలీషువారు స్వాధీనము చేసుకున్నారు. పదిహేడు వందల నలభై రెండు సంవత్సరములో కలాపన పొసగి జగదీశ్డ్వరుని కటాక్షముచేత ప్రాంసు దండు పరారి అయిపోయినది. అది మొదలుగా అరికాటి నవాబును విహితపరుచుకుని క్షేమముగా కాలము తోయుచుండగా పదిహేడు వందల అరవై ఏడు సంవత్సరమువరకు హయిదరుతో నవాబు నిమిత్తము పోరవలశి వచ్చినది.

అది మొదలు యధాక్రమముగా అరికాటినవాబు రాజ్యమంతా యింగిలీషువారి అధీనమయి వుత్తరము గంజాం మొదలు దక్షిణము తిన్నెవల్లి శీమవరకున్ను తూర్పుసముద్రము మొదలు పశ్చిమసముద్రమువరకున్ను యేకచక్రాధిపత్యముగా యీ చెన్నపట్టణమును రాజధాని చేసుకుని కంపెనీవారు యేలుతూ వున్నారు. యీ రాజదానికింద యిప్పుడు వుండే జిల్లాలు యిరువైవొకటి. యింత భూమిమధ్యే మయి సుమారు మళయాళము కొచ్చిల్ యీ దేశముల రాజులుతప్ప కొదవ అందరు జమీందారి పాయకాలవారు గాని యుద్ధసన్నద్ధులు కాగల భూపతులు వొక్కడున్నులేరు.

యీ చెన్నపట్టణము కొడి, జండా, కింద యిప్పుడు సాలుకు సుమారు ఒకటింకాలు కోటివరహాలు వసూలవుతున్నవి. ఖరుచులు అప్పులకు యిచ్చేవడ్డి సహాగా వసూలుకు యెక్కువగాని తక్కువలేదు. యీ చెన్నపట్టణము కొడికింద కంపెనీవారి అప్పు సుమారు రెండుకోట్లవరహాలు వుండును. స్థావరజంగమ రూపమైనస్థితి మూడుకోట్ల వరహాలు వుండునని తోచుచున్నది. దండు నలభై వేలమంది ఫౌజువున్నది. యీ చెన్నపట్టణపు బస్తీకి మూడుపక్కలా షహరు, పానా, గోడపెట్టివున్నది. తూర్పుపక్క సముద్రమేగాని గోడలేదు. బస్తీకోసెడు దూరములో దక్షిణపక్క యుద్ధసన్నద్ధమయిన కోట సముద్రవారగా కట్టివున్నారు. వుత్తరపక్క సముద్రముగట్టున యెగుమతి దిగుమతులయ్యే రేవు సరుకు వేసేకొట్లున్ను కట్టి వున్నవి. ఈ చెన్నపట్నానికంతా పాపంవీథి శాలవీధి ఈరెండున్ను విశాలమైనవి. నిండా కుసంధి అయిన వీధులుకావు. యిండ్లకు రెండువిధాల పన్ను రూకలు తీసుకుని వీధులుపూడ్చి మరామత్తుచెసి ఠాణాలు వుంచి కంపెనీవారు కావలి కాస్తూవుంటారు. యిండ్లు తలవాకిలి తిన్నెలు పందిళ్ళు బయిటికి అలంకారముగానున్నూ లోపల కలకొద్దిలో ఘాలికి అడ్దులేకుండా కట్టియున్నారు. పది దేవాలయముల దాకా యున్నవి. అందులో విభవముగా ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు జరుగుతూ వుంచున్నవి.

సముద్రముగుండా వచ్చేపొయ్యే సరుకులకు తీరువసుంకము తీశే నిమిత్తము సముద్రతీరమందు కష్టంహవుసు అని వొక కఛ్ఛేరివున్నది. గట్టున వచ్చేపొయ్యే సరుకులకు తీరువ తియ్యడానకు పడమటిపక్క లాండు కష్టంహవుసు అని వొక కచ్చేరి కట్టివున్నది. మిగిలిన కఛ్ఛేరీలు కొన్ని రేవులొనున్ను, కొన్ని కోటలోనున్ను, కొన్ని బయటతొటలలోనున్ను చేయుచూ వుంటారు. సర్వాధికారియైన గౌనరుయిల్లు అరికాటి నవాబు యిల్లున్ను కోటకు దక్షిణభాగ మందు పావుకోసు దూరములొ తిరువళిక్కేణి అనె వుపగ్రామములో వున్నవి. జాతుల వాండ్లందరు బస్తీకి దక్షిణము ఆమడ దూరములో వుండే పెరుంబూరి వరకున్ను సుందరమయిన తోటలు వేసి బంగాళాలు, యిండ్లు కట్టుకుని వున్నారు. బస్తీలోపలవుండే హిందువుల యిండ్లలో అయ్యాపిళ్ళ యిల్లు పెద్దది. కోటలోపల వుండే యిండ్లలో వాడలకు తెలిశే నిమిత్తము రాత్రిళ్ళు దీపముపెట్టే యెక్కీసుచెంజియిల్లు పెద్దది. బయిటావుండే జాతులవాండ్ల మిద్దెలలో మురాతు, J. Moorat, కట్టిన యిల్లు పెద్దది.

బస్తీకి దక్షిణము తిరువళిక్కేణి, మయిలాపూరు, తిరువటేశ్వరుని పేట మొదలయిన కొన్ని వుపగ్రామాలు వున్నవి. పడమటిపక్క చూళ పొరికపాక, కోమలేశ్వరునిగుడి యివి మొదలయిన కొన్ని గ్రామాదు లున్నవి. వుత్తరభాగమందు చాకలపేట, రాయపురము, తండయారువేదు మొదలయిన్ కొన్ని గ్రామాలు వున్నవి. యీ బస్తీలో వుండే హిందువులు అందరు వుత్తరభాగమందు తిరువట్టూరి వరకు ఆరామక్షేత్రాలు భేటాగా యేర్పరచుకొని విలాసకాలముల యందు అక్కడికి వెళ్ళి విహరిస్తూ వుంటారు. కోమలేశ్వరున గుడివద్ద వొక చిన్నయేరు ప్రవహింపుచున్నది. దక్షిణపక్క మయిలాపూరు చెరువు కట్టివున్నది. పడమటిపక్క లుంగంబాక చెరువు కట్టియున్నది. వుత్తరపక్క ప్రతి తోటలలో తటాకాలు, దొరువులు తొవ్వివున్నారు. అందులో జగదీశ్వరుని కటాక్షముచేత మంచినీళ్ళు కలిగివున్నవి. సమస్త ద్వీపాంతరాల పదార్ధాలు కలవు. పనివాండ్లసహా అమితముగా కలరు. అయితే జనసమ్మర్దముచేత భూమి ఆరోగ్యమయినది కాదు. వుష్ణవయువు భూమి. సంకలిత రోగాలు ప్రాప్తిస్తూ వస్తున్నవి. కాల నియమాలు లేకుండా కాయగూరలు, ఫలాదులు, పుష్పాదులు అమితముగా దొరుకుచున్నవి.

యిక్కడివారి ప్రకృతులు ఉపాయవేత్తలుగాని సాహసులుగారు. ద్రావిడాంధ్రకర్ణాటక దేశాలమధ్యే యీ ప్రదేశము వుండుటచేత బాల్యాదారభ్య దేశ్యములయిన ఆ మూడు భాషలున్ను ముందు దొరతనముచేసినవారి తురకభాష, యిప్పుడు దొరతనము చేసే యింగిలీషువారి భాషయున్నూ నోటనానడముచేతనున్ను, పదార్ధములుగా కొన్ని సంసృతవాక్యాలు అభ్యసించుటచేతనున్ను యిక్కడివారి వుచ్చారణ స్ఫుటముగా వుంటూ వచ్చుచున్నది. యిక్కడి స్త్రీలు గర్విష్టులుగానున్ను, పురుషుల పట్ల నిండా చొరవచేసుకొగలవారుగానున్ను అగుపడుతారు. అయితే వస్త్ర్రాభరణప్రియులే గాని నైజగుణమయిన సాహసము నిండా కలవారుగా తోచలేదు.

యిక్కడి భూమి సారవత్తు కాకపోయినా లోకులు చేసే కృషివల్ల ఫలకారిగా వున్నది. వృక్షాదులు పుష్టికలవి కాకపోయినప్పటికిన్ని యిక్కడ సమస్తదేశపు వృక్షాదులున్ను కలవు. సమస్తజారుల పుష్పాదులు చూడవచ్చును. యిక్కడివారు చాలా మూర వెడల్పుకలబట్టలు కట్టుతారు. యధోచితము యిక్కడివారు కర్మకులుగానున్ను, దేవబ్రాహ్మణ విశ్వాసము కలవారుగానున్ను వుంటారు. యిక్కడి హిందువులకు పూర్వపు పురోవృద్ధి లేకపోయినప్పటికిన్ని ముందర చెందిన వాసనను ప్రయాసమీద కాపాడుకుంటూ వస్తారు. జాతులవారి జనబాహుళ్యము వారి విభవముతో స్త్రీ పురుష సల్లాపాలు చూడవలిస్తే ప్రతిదినము సాయంకాలమందు పరంగికొండశాల

గమనిక, పరంగికొండ అనగా సెంట్ తామస్‌మౌంటు. శాల యనగా బాటకిరు ప్రక్కల నీడకొరకు వేయు చెట్లవరుస. ఆకాలమున మౌంటురోడ్డులో కోటదగ్గర నుండి సెంట్ తామస్‌మౌంటుకు పోవు దారిలో ఐదు మైళ్ళ దూరమున కారన్ వాలీసు స్మారక చిహ్నము వరకు బాట విశాలమైనునుపైయుండెను. దానికి రెండుప్రక్కల మఱ్ఱిచెట్లు ఇతరవృక్షములు వరుసగానుండెను. ఇంగ్లీషు స్త్రీ పురుషులు సాయంకాల మా స్మారక చిహ్నము వరకు పల్లకీలలోను బండ్లలోను పోయి అక్కడ నేడు బీచిలోవలెనే సరససల్లాపములతో విహరించుచుండిరి. ఇట్లే వాడరేవు అనగా హార్బరు వద్దను నీడకొరకు చెట్లు వరుసగా పెంచియుండిరి. ఇదియే వాడరేవుశాల.

లోను సముద్రము వద్ది వాడరేవుశాల*లోనున్ను నిలిస్తే వారందరు వాహన విశేషాలు యెక్కి వస్తారు గనుక చూచి ఆనందించ వచ్చును. యిట్టిదొరతనములో జగదీశ్వరుడు నావంశపరంపరగా జీవనము కలగజేసి నన్ను వుంచియున్నాడు.

కాశియాత్ర చరిత్ర సంపూర్ణమైనది.

అనుబంధము

సంపాదకుడు

దిగవల్లి వేంకట శివరావు

బెజవాడ

అనుబంధము

సూచిక,

విషయములు పుట

ఒకటి. సౌరమానము, చాంద్రమానము, బౌర్హస్పత్యమానము

అధిక క్షయ మాసాలు ఒకటి నుంచి నాలుగు వరకు

రెండు. సనరణల పట్టిక మూడు నుంచి పదహారు వరకు

మూడు. చెన్నపట్టణ ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారములో వున్న

కాశీయాత్ర చరిత్ర అసలు గ్రంధం

వ్రాతప్రతి - మచ్చుపుటలు పదిహేడు నుంచి ముప్పై మూడు వరకు

నాలుగు. కాశీయాత్ర చరిత్రలోని కొన్ని పదముల అర్ధములు ముప్పై నాలుగు నుంచి నలభై వరకు

ఐదు. అకారాది విధయసూచిక నలభై ఒకటి నుంచి డెబ్బై తొమ్మిది వరకు

కృతజ్నత

ఈ గ్రంధప్రకటనకు అనేక అంతరాయాలు కలిగినప్పటికీ, పరమేశ్వరుని అనుగ్రమహంవల్లను, మిత్రుల తోడ్పాటువల్లను, ఇది నిర్వహింపగలిగాను. ఈకార్యంలో బ్రహ్మశ్రీ శతావధాని వేలూరి శివరామశాస్త్రులుగారు, శ్రీ చెరుకుపల్లి వేంకటప్పయ్యగారు, శ్రీ ఘంటసాల సీతారమశర్మగారు, శ్రీ చల్లా జగన్నాధంగారు, శ్రీ కుందా నరసింహమూర్తిగారు మొదలైన నామిత్రులు చాలా శ్రద్దతీసుకుని నాకనేక విధాలుగా తోడ్పడ్డారు. శ్రీ శాస్త్రులువారు తమ ఆరోగ్యం సరిగ్గాలేనప్పటికీ పుస్తకాన్ని జాగ్రత్తగా పరిశోధించి కొన్ని ప్రయోగాలకు అవసరమైన అర్ధాలు వ్రాసి యివ్వడమేగాక అకారాది విషయ సూచికను కూడా సరిచూసి కొన్ని సంగతులు చేర్చారు. వీరందరికి కృతజ్నుడను.

తొమ్మిది నుంచి పది వరకు-నలభై ఒకటి -దిగవల్లి వేంకటశివరావు సం|| మార్చి పదహారు తేది మొదలు జూలై తొమ్మిదవ తేది వరకు ఆంధ్రనార పత్రికలో వారానికి ఆరు ఏడు కలములచొప్పునను, మార్చి మొదటి తేది మొదలు మే పది తేది వరకు కృష్ణాపత్రికలోనూ, వరసగా ప్రతివారము వ్యాసాలరూపంగా ప్రకటితమైనది. ఇది ఇంకా పుస్తకరూపంగా ప్రకటించబడలేదు. మీకు కావలిస్టే ఆ సంచికలు తెప్పించుకుని చదివి చూడండి.

చ్సరిత్రపేరున మన కన్నులు గప్పుతూ బ్రిటిష్ ప్రభువుల యాధిక్యతను మన అల్పత్వమును ప్రకటించుటకు భారత దేశమున బ్రిటిష్ రాజ్యతంత్రమును సమర్థించుటకు ఏర్పడిన చరిత్ర వాఙ్మయం లోని అసత్యపు వ్రాతల నన్నింటినీ పూర్వకాలంనాటి ఇంగ్లీషు గ్రంధకర్తల నోళ్ళద్వారానె ఖండించి రాజకీయార్థిక రహస్యాలను భేదించి యధార్ధ చరిత్రను బయల్పరచ గలిగాను. ఇంకా వివరాలు కావలసిన వారు చదువుకో గలందులకు అసలు గ్రంధాలపేర్లుకూడా అందులో వుదాహరించాను. ఇది నాలుగేళ్ళనుంచీ చేస్తూవున్న పరిశొధన యొక్క ఫలితము.

ఆంధ్ర వార పత్రికలోని వ్యాసాల శీర్షికలు చూడండి,

* విస్సన్న చెప్పింది వేదం-విన్ సెంటుస్మిత్తు వ్రాసింది చరిత్ర

, ప్రచారంలో లేకుండా చేయబడిన పూర్వచరిత్రలు, చరిత్రలో కెక్కకుండా చేయబడిన, ఆంగ్లయుగంనాటి చరిత్రాంశాలు, నూతనంగా సృష్టిమబడిన పక్షపాతపు చరిత్రలు.,

*భారతదేశ పారతంత్ర్యము - భారతీయుల దేశాభిమానము.

, భారతీయులు బ్రిటిష్ రాజ్యతంత్రానికి సులభంగా లొంగలేదు- దానికి ఇష్టపడి హర్షించలేరు - నూరేండ్లు పోరాడారు.,

*ధరణాకూర్చొనుట - సాత్విక విరోధము.

, పదహారు వందల డెబ్బై ఎనిమిది నుంచి పదహారు వందల ఎనభై రెండు వరకు, పద్దెనిమిది వందల అరవై ఐదు, పద్దెనిమిది వందల పదమూడు నుంచి పద్దెనిమిది వందల పదిహేను వరకు సంవత్సతములలో కంపెనీ పరిపాలనలో జరిగిన సత్యాగ్రహముల చరిత్ర.,

*ఇంగ్లీషు దొరతనముయొక్క ప్రత్యక్ష ఫలితాలు.

, భారత దేశ రాజకీయ ఆర్ధిక సాంఘిక పరిస్థితులలలో మార్పులు.,

*బ్రిటిష్ హెబరుగారి భారదేశయాత్ర.

, పద్దెనిమిది వందల ఇరవై నాలుగు నుంచి పద్దెనిమిది వందల ఇరవై ఆరు వరకు మధ్య ఆయన చూచిన భారతదేశ స్థితిగతులు.,

*కృష్ణాపత్రికలో- ఇంగ్లీషు చదువుల చరిత్ర.

ఏనుగుల వీరాస్వామయ్యగారి కాశీయాత్ర చరిత్ర కాలం నాటి భారతదేశ రాజకీయ, ఆర్ధిక సాంఘిక పరిస్తితులను గూర్చిన వివరములను తెలిసికొన గోరువారు పైన నుదాహరించిన వ్యాసాలను, నేను రచించిన భారత దేశమున బ్రిటిష్ రాజ్య తంత్రము అను బ్రిటిష్ ఇండియా చరిత్రను తప్పకుండా చదవాలి.


అనుబంధము  కాలమానము సవరణలు మరియు చారిత్రక పద వివరణలు

కాశీయాత్ర చరిత్ర - అనుబంధము

సౌరమాన చాంద్ర మాసములు - అధిక క్షయమాసాలు.

ప్రపంచములో మనుష్యులందరూ సూర్యచంద్రుల నడకలను బట్టి కాలం లెక్కించుకుంటారు. అమావాస్యనుండి అమావాస్యవరకు గాని పౌర్ణమినుండి పౌర్ణమివరకూ గాని చంద్రుని వృద్ధి క్షయాలు చూసి నెలలు లెక్కపెట్టుకుంటారు. ఇలాంటి నెలలో రమారమి ఇరవై తొమ్మిది సగం రోజులు వుంటాయి. అలాగే సూర్యుడి నడకవల్ల కలిగేఋతువుపోయి అది మళ్ళీ రాగానే ఒక సంవత్సరమైనదని వ్యవహరించు కుంటారు. సూర్యుడు ఆకాశ చక్రంలో మేషాది పండ్రెండు రాసులూ తిరిగి రవడానికి మూడు వందలు అరవై ఐదు రోజుల ఆరు గంటల పన్నెండు నిమిషాలు ముప్పై సెకనులు పడుతుంది. పన్నెండు చాంద్రమాన మాసాలూ కలిసి మూడు వందలు యాభై నాలుగు రోజుల ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల ముప్పై నాలుగు సెకనులు మాత్రమే అవుతాయి. సూర్యుడొక రాసినుంచి ఇంకొక రాసిలో ప్రవేశించడానికి సంక్రాంతి అంటారు. దానికి పట్టే కాలాన్నే మాసంగా లెక్క పెట్టుకుంటే ఒకనెలలో ఇరవై తొమ్మిది లేక ముప్పై రోజులు ఇంకొక నెలలో ముప్పై ఒకటి రోజులు వుంటూవుంటాయి. అలాంటి పన్నెండు నెలల సౌరసవత్సరానికి రోజులు మూడు వందలు అరవై ఐదు సగం అవుతాయి. ఇలాంటి పండ్రెండు సంక్రాంతులను బట్టి ఏర్పడిన పన్నెండు మాసాలకూ మేషాది పన్నెండు రాసుల పేళ్ళు చైత్ర వైశఖాది పన్నెండు పేర్లుకూడా వ్యహారంలో వున్నాయి. ఈపద్ధతికే సౌరమాసం అని అంటారు. ఇది అరవదేశంలోను మళయాళదేశంలోనూ బంగాళాదేశంలోను వాడుకలోవుంది.

క్రీస్తుశకంలో ఇంగ్లీషువారు వాడేమాసాలుకూడా సౌరమానమాసాలే. తురకలు కేవలమూ నెలబాలుణ్ణీచూసి లెక్కపెట్టే చాంద్రమానమాసాలే వాడుకుంటారు. సౌరమాన సంవత్సరం కన్న చాంద్రమాన సంవత్సరం చిన్నది అవడంవల్ల వారి పండుగలు కొన్నాళ్ళవరకూ ఒక ఋతువులోను కొన్నాళ్ళతరువాత ఇంకొక ఋతువులోనూ వస్తూవుంటాయి.. పైన చెప్పినట్లు చంద్రసూర్యులు గమనాన్ని బట్టి గాక బృహస్పతి గమనాన్నిబట్టి కాలం లెక్కించుకొనే బార్హస్పత్యేమానం అనేది ఒకటి ఉత్తర హిందూస్థానంలోమగద దేశము మొదలైనచోట్లను ఓడ్రదేశంలోను వాడుకలో వున్నది. ఈ మాసంలో సంవత్సరానికి రమారమి మూడు వందలు అరవై రోజులే వుంటాయి.

మన ఆంధ్రదేశంలోను మహారాష్ట్ర కర్ణాటక దేశాలలోను చాంద్రమానమే వాడుకలో వున్నది. చాంధ్రమానం శుద్ధపాడ్యమితోను సౌరమాన మాసం సంక్రాంతితోను ఆరంభం అవడం వల్లను ఒకే పెరుగల మేష లేక చైత్రమాసం యొక్కవ్యాప్తి సౌరచాంద్రమానాలనుబట్టి తేడా వున్నందువల్లను యీరెండు మాసాలని బట్టి ఏర్పరచిన పర్వదినాలకు, సంబంధం లేకుండాపోతుందని మన జ్యోతిష్కులు చాంద్రమానాన్ని సౌరమానానికి లంకేవేసి మన సంవత్సరాదిని సౌరమానం మేష మాసం మన చైత్రమున్నూ వృషభమాసం వైశాహమున్నూ అవుతాయి. పైవుద్దేశ్యంతో మన పంచాంగాలలో తిధి వార నక్షత్రాదులను కూడా ఇలాగే సరిపుచ్చారు. అమావాస్యనాడు సూర్యచంధ్రులు కలిసియుంటారు. చండ్రుడు రొజుకు రమారమి కాశీయాత్ర చరిత్ర - అనుమంధము

అంశలు, డిగ్రీలు, నడుస్తాడు, సూర్యుడు ఒక అమ్శ మాత్రమే నడుస్తాడు. అందువల్ల వీరిద్దరికీ యాభై తొమ్మిది ఘడియల నాలుగు విగడియలలో,, ఇరవై మూడు సగం గంటలలో, పన్నెండు అంశల అంతరం కలుగుతుంది. ఈఅంశం వల్లనే ఒక తిధి ఏర్పడుతుంది. ఇలాంటి ముప్పై తిధుల కొక చాంద్రమాసం అవుతుంది. అయితే చాంద్రమాన సంవత్సరంలో తిధులు మూడు వందలు అరవై వున్నా రోజులు మూడు వందలు యాభై నాలుగు మాత్రమే గనక తిధులు వృద్ధిక్షయం చెంది ఆరు రోజులు తగ్గుతాయి. సూర్యచంద్ర్రుల నడకలలో తేడాలవల్ల ఒక తిధివ్యాప్తి ఒకప్పుడు అరవై ఐదు గడియలు ఇంకొకప్పుడు యాభై మూడు గడియలూ వుంటుంది. ఇలాగ మొత్తం మీద చాంద్రమాన సంవత్సరంలో పదమూడు క్షయ తిధులూ ఏడు వృద్ధి తిధులూ వుంటాయి.

ఇంక నక్షత్రాల సంగతికూడా ఇంతే. మొత్తం మీద చంద్రుడు రోజుకో నక్షత్రంలో వుంటాడుగనుక నక్షత్రమాసంలో ఇరవై ఏడు రోజులు పైచిల్లర వుంటాయి. తిధులలాగనే కొన్ని నక్షత్రాల వ్యాప్తి వృద్ధీ కొన్నింటిని క్షయమూ చెందుతుంది.

వారానికి ఏడు రోజులే వుంటాయి గాని పక్షంలో మాత్రం ఒక్కొకప్పుడు పదమూడు రోజులు, ఒక్కొక్కప్పుడు పద్నాలుగు రోజులు, పదహారు రోజులుకూడా వుంటాయి.

పైన చెప్పినట్లు చాంద్రమానాన్ని సౌరమానంతో సరిపుచ్చడంలో రమారమి మూడు సంవత్సరాల కొకమాటు చాంద్రమాన సంవత్సరంలో పదమూడు నెలలు ఏర్పరచ వలసి వస్తూ వుంటుంది. దానికే అధిక మాసమంటారు. ఏమాసం అధికమాసంగా నిర్ణయించడం అనే విషయంలో కూడా సంక్రాంతినే లక్ష్యంగా తీసుకుంటారు. సూర్య చంద్రుల గమనాలను బట్టి చాంద్రమానం చిన్నదిన్నీ సౌరమానం పెద్దదిన్నీఅ అయినప్పుడు ఆ చాంద్రమానంలో సంక్రాంతి వుండదు. ఆమాసాన్ని అధికమాసంగా నిర్ణయిస్తారు. చాంద్రమాసము పెద్దదిన్నీ సౌరమాసము చిన్నదిన్నీ అయినప్పుడు ఆ చాంద్రమాసంలో సూర్యుడు ఒకరాసి దాటి యింకొక రాసిలోకి పోయి మళ్ళీ దానిని కూడా దాటి మూడవరాసిలోనికి పొతాడు. ఒకేచాంద్రమాసంలో ఇలాగ రెండు సంక్రాంతులు కలగడంవల్ల ఆమాసానికి రెండు పేళ్ళు పెట్టవలసి వస్తుంది. అందుచేత ఆ సంవత్సరంలో ఒక నెలను అణిచివేస్తారు. దనికే క్షయమాసమంటారు. అప్పుడు పదకొండు నెలలే వుండవలసిందేగాని క్షయమాసం వచ్చిన సంవత్సరంలో తప్పకుండా అధికమాసంకూడా వస్తూవుంటుంది గనుక ఆ సంవత్సరంలోకూడా సరిగ్గా పన్నెండు నెలలు వుంటాయి. క్షయమాసాలు చాలా అదుదుగావస్తాయి. నూరు సంవత్సరాలలో ఒకటి రెండు క్షయమాసాలు వస్తాయి. శాలివాహన శకము వెయ్యి ఏడు వందలు నలభై నాలుగువ సంవత్సరము, క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై రెండు నుంచి పద్దెనిమిది వందల ఇరవై మూడు వరకు, చిత్రభాను నామ సంవత్సరంలో ఆశ్వయిజం అధికమాసంగాను పుష్యమాసం క్షయమాసంగాను వచ్చాయి. మళ్ళీ, పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు, శోభకృతు సంవత్సరంలో పుష్యము క్షయమాసంగాను ఆశ్వీజము అధికమాసం గాను వస్తాయి. ఎఫ్ఫుడువచ్చినా క్షయమాసం మార్గశీర్ష పౌష మాఘ మాసాలలో నే వస్తాయి. ఎందుచేతంటే ఈ చాంద్రమాసాలకు ఇరవై తొమ్మిది దినముల వ్యాప్తిగల సౌరమాసములతో సంబంధం వున్నది.*

*చూడు, ఆంధ్రవిజ్ఞాన సర్వస్వంలో కొమఱ్రాజు లక్షమణరావుపంతులు గారు వ్రాసిన అధికమాసం అనే వ్యాసము, లక్ష్మణరాయ వ్యాసావళిలో పంచాగము అనేవ్యాసము.

కాశీయాత్ర చరిత్ర - సవరణల పట్టిక అసలు గ్రంథం - వ్రాతప్రతి - మచ్చుపుటలు

చెన్నపట్టణం గవర్నమెంటు ఓరియంటల్ మన్యూస్క్రిట్సు లైబ్రరీలో వున్న నెం.పద్నాలుగు వందల ఏడు కు కాశీయాత్రచరిత్ర వ్రాతప్రతి. పద్దెనిమిది వందల ముప్పై రెండు లో బందరు జిల్లాజడ్జిగా వుండిన సె. పి. బ్రౌను దొరగారికి, ఈ గ్రంధకర్త వీరాస్వామయ్య గారు వ్రాయించి పంపిన అసలు పుస్తకమే.

ఇది పన్నెండు సగం అంగుళముల నిలువు ఎనిమిది ముప్పావు అంగుళముల వెడల్పు గల అరఠావులకు రెండు పక్కలా పుటకు ముప్పై ఒకటి పంక్తుల చొప్పున మంచి దస్తూరీతో తప్పులు లేకుండా వ్రాయబడిన నాలుగు వందలు తొంభై పుటల గ్రంధం శైధిల్యము, గ్రంధపాఠములులేవు. సమగ్రమైనది.

సంక్షిప్త పరచబదిన ఇంకొక ప్రతి తమవద్ద నున్నదనిన్నీ పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది లో అచ్చు పడిన గ్రంధం ఇంకా సంక్షిప్తమైన దనిన్నీ ఇదే అన్నింటికంటే మేలైన ప్రతి అనిన్నీ బ్రౌను గారు దీనిపైన పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది లో రెమార్కు వ్రాసి యున్నారు.

ఈ అసలు గ్రంధానికీ అచ్చుపుస్తకానికీ భాషలోకూడా తేడాలు కనబడుతూ వున్నవి. అసలు గ్రంధంయొక్క రచన ఎలావుంటుందో తెలియగలందులకు మచ్చుకు కొన్ని భాగాలను ఇక్కడ వుదాహరిస్తున్నాను.

వీరాస్వామయ్యగారు దినచర్యగాను, తమ మిత్రుడైన కోమలేశ్వరపురం శ్రీనివాసపిళ్ళగారికి జాబులు గాను వ్రాసిన కాశీయాత్ర చరిత్ర గ్రంధరూపంగా ఎలా కూర్చబదిందీ, దానిని అచ్చువేయడంలో ఆ గ్రంధాన్ని ఎలా తగ్గించినదీ, ఎలాగ మార్చినదీ కూడా ఈ వ్రాతప్రతివల్ల తెలుస్తుంది. వుప్పుకాలువకు వారధి కట్టి వుంన్నది, దాటి రావాలశ్నిది, దొవలో కొరతలేరు దాటవలశింది, అనే మొదలైన సూచనలు వీరాస్వామయ్యగారు అసలు జాబులలో మిత్రునికి వ్రాసే వాడుక భాషగానే వున్నది. ఇప్పటికీ వాడుక భాషకూ ఆ కాలంనాటి భాషకూ గల తేడాలు కూడా దీనివల్ల తెలుస్తాయి. ముఖ్యంగా వర్ణక్రమంలోని విశేషాలు గమనించతగివని. ఉ, భ్రాంహ్మణులు, చంన్నపట్నము, వుంన్నవి, లింగ్గము, తండ్డయారు వేడు, బండ్డి, మొదలైనవి. కొ, కో, గొ, గో, దొ, దో మొదలైన అక్షరాలకు ఏత్వమిచ్చి కొమ్ము, కొమ్ముకు దీర్ఘము ఇచ్చి ఒకారముగా వ్రాసే పద్దతి, ఇప్పుడు అచ్చూక్షరాలలో దొరకడంలేదు. ఇంకా చాలా వెశేషాలున్నవి చూడండి.

ఈవ్రాతప్రతిలోని భాగములు వ్రాసుకొనుట కనుజ్ఞ నిచ్చిన ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారాధికారులకు కృతజ్ఞడను.

భెజవాడ, ఇరవై నుంచి తొమ్మిది వరకు-నలభై ఒకటి ----దిగవల్లి వేంకటశివరావు.

యిది ఏనుగుల వీరాస్వామి అల్లించిన కాశీయాత్రచరిత్ర.

పద్దెనిమిదిth May పద్దెనిమిది వందల ముప్పై ఒకటి page in the printed Edition.

ప్రతి నెంబరుఒకటి

సంవ్వత్సరం మే నెల పద్దెనిమిదిది కుజవారం రాత్రితొమ్మిది ఘంటలకు చంన్నపట్నం వదిలి ప్రయాణమయి మాధవరం అనే గ్రామములో రాత్రి నిలిచినాను మాధవరం తండ్డయారువేడులోవుండె వాతోటకు మూడుఘడియల దూరం కీనీరుభూమి మాధుర్యమయిన వుదక సమృద్ధికలదు ద్ర్రావిడ వైష్ణవులు కసపురం క్రిషిమీద లక్ష్యం లేదు సమిధలు వగయిరా పట్నంలో అమ్ముకుని జీవనం చేసేవారు దోవలో వుప్పుకయ్య వుంన్నది ఆవుప్పుకాలువకు వారధికట్టి వుంన్నది దాటి రావలశ్నిది.

వుదయాన మాధవరం వదిలి పొల్లిపాలవాయ సత్రం మార్గంగ్గా వెంక్కటేశనాయుడి సత్రం చేరినాను అక్కడ తఋఆకము వుంన్న సత్రం ఖిలమయివుంన్నది అంగళ్ళుకద్దు మాధవరానికి ఐదు ఘడియలదూరం దొవ సరాళమయిన బుడ్డిభాట ఆ రాత్రి పెద్దపాళెం చేరి నాను దొవలో కొరతలేరు దాటవలశినది దగ్గర దగ్గర గ్రామాలు వుంన్నవి భాటసరాళం పెద్దపాళెంలో శక్తిరూపకంగ్గా పరమాత్ముడు తామస ఆరాధనను అంగీకరించ్చి లోకుల యిష్టసిద్ధి చేస్తూ వుంన్నాడు. అరణ్య నదీతీరం వాసయోగ్యం భ్రాంహ్మణ అగ్రహారం పలప

ట్టాడ యిండ్లు శివాలయం వున్నది ఆ శక్తి చింన్న లింగ్గం జాడగా భూమిలో వుద్బవించ్చివుంన్నది. శక్తి ఆలయం బహు చింన్నది శూద్రపూజ యీస్థళం పై సత్రానికి రెండుఆమడ దూరం.

ది పగులు పెద్దపాళెంలోవుండి రాత్రి తిరువళ్ళూరు చేరి నాను దొవలో కొరతలేరు మళ్ళీ దాటవలశ్నది దోవ సరాళం మంచ్చిబండ్డిభాట నెంగలి అనే గ్రామంవద్ద దొవలో సత్రంవుంన్నది తిరువళ్ళూరు విష్ణుస్తళం తీర్ధప్రాబల్యం, పుట.రెండు, తీర్ధంపేరు వృత్తాపనాశనీ తీర్ధంలో ప్ర్రార్ధనవాండ్లు బెల్లం వేయడం సాత్వికమూర్తి మహా ప్రాయశ్చత్తాలలో స్మృతిరీతిగా యీ తీర్ధం స్నానం యెత్తివుంన్నది ప్యాటస్థళం సమస్త వస్తువులు దొరుకును యీస్థళం పయిపాళ్యాని. రెండ్డుంన్నర ఆమడ యిక్కడ ఇరవై ఒకటి ది మధ్యాంన్నంవర్కు వుంన్నాను.

ది రాత్రి రామంజేరి మార్గంగా కనకంమ్మ సత్రం చేరి నారు రెండు ఆమడదూరం నది దాటవలశ్నిది రామంజేరివద్ద దారి రాతి గొట్టు మిగతాభాట సరాళం సత్రం బొంమాకంటి శంకరయ్య కట్టినాడు ప్యాటస్థళం కోమట్లు వుపపన్నులు అగ్రహారం వుంన్నది యిది మొదలుగా కావేటినగరంవారి శీమ గుంట్ట వుదకం బాగావుంన్నది.

ది బుగ్గగుడి భోజనానికి పగులు చేరినాను భాట సరాళం దూరం పద్నాలుగు ఆమడ పుణ్యప్రదేశం శాశ్వతంగా మూడుధారలు గంగ్గా యమునా సరస్వతీ అనిపించ్చుకుని గుడికింద్ద స్రవించ్చి నదిలోపడుతుంన్నది కాశీగుడి లాంచ్చనగా మూర్తులకు పేరు వుంచ్చివున్నారు సమీపాన వూరు యిండ్లు లేదు పదార్ధాలు దూరాన్నించి తెచ్చుకుని గుడికి సమీపముగా వుండ్డె తోపులో వంట్టచేసుకుని భోజనం చేసుకోవ్లశ్నిది. రమణియ్యం ప్రదేశం వుదకవసతి అరణ్యనదీతీరం యీరాత్రి నగిర మార్గంగా పుత్తూరు చేరినాను. పద్నాలుగు ఆమడదూరం నగిరివద్ద కనమ దాటవలశ్నిది కనం రాతిగోట్టు నాలుగు ఘడియల దూరం భాట ప్రయాస అవతల సరాళమయిన భాట నగిరి ప్యాటస్థళం సకల వస్తువులు ముసాఫరులకు కవలశ్నిది దొరుకును యీ పగిరిలో వెంకటేశనాయ, పుట.ఎనిమిది,డి కొమారుడు గొప్ప సత్రం కట్టను యత్నంచేస్తూ వుంన్నాడు. పుత్తూరిలో మునియప్పిళ్ళ సత్రం వుంన్నది యిప్పుడువచ్చిన భ్రాంహ్మల్కు గోసాయీలకు బైరాగులకు సదావర్తి యిచ్చేటట్టు నిశ్చయమయి వుంన్నది కంపెనీవారు దొరలకు ముసాఫరుఖానా కట్టివుంన్నారు చింన్న ప్యాటస్థళం కావలశిన సామానులు దొరుకును బ్ర్రాంహ్మల యిండ్లు వుంన్నవి మంచ్చినీళ్ళ గుంట వుంన్నది రమణియ్య ప్రదేశం చుట్టూ కొండలు.

అంజాలమ్మ కనమదాటి పడమాలపేటసత్రం ప్రవేశించినాను ఆమడదూరం కనమరాతిగొట్టు అయినా దాటడం నిండ్డా ప్రయాసకాదు ఆ కనమలో అంజాలమ్మ అనేశక్తి ప్రతిమెను వుంచ్చి వుంన్నది పందిలివేశి వుంన్నారు పరమాత్ముడి చైతన్యం ఆ ప్రతిమ యందు ప్రతిఫలించ్చి ప్రార్దించినవారి యిష్టశిద్దిని చేస్తూవుంన్నది భాట సరాళం. యీ సత్రం కొల్లా పెద్దసామి శెట్టి కట్టించినాడు సత్రం విశాలంగావుంన్నది బ్ర్రాంహ్మల్కు మాత్రం సదావర్తి యిస్తూంన్నారు తద్వారా సత్రానికి యశస్సు కలిగివుంన్నది. కనకంమ్మసత్రం మొదలు యీవర్కు కావేటినగరంవారిరాజ్యం. యీ రాత్రి అలమేలుమంగాపురం మార్గంగా దిగువతిరుపతి చేరినాను ఆమడదూరం దొవలో సువర్నముఖి దాటవలశినది. చెరువుకట్టమీద కొంత్తదూరం భాట నడవలశ్నిది సరాళమైన భాటెను దోవలో కొంన్ని బస్తీఅయ్ని వూళ్ళువుంన్నవి ఇరవై మూడు ఆదివారం ఇరవై నాలుగు ది సోమవారం ఇరవై ఐదు ది మంగళ్వారం ఇరవై ఆరు ది ఇరవై ఏడు ది బుధవారం ఇరవై ఎనిమిది ది గురువారం, పుట.నాలుగు, ఇరవై తొమ్మిది ది శుక్రవారం ముప్పై ది శనివారం ముప్పై ఒకటి ఆదివారం యీ తేదీ దినములు దిగువతిరుపతిలో వుంన్నాను.

ది భుధవారం కొండయెక్కి దిగినాను ఇరవై ఏడు ది గురువారం కపిలతీర్ధంలో సమారాధన చేసినాను ముప్పై ది ఆదివారం పగులు మూడు ఘంటల్కు తిరుపతివదిలి కరకరంబాడికి పోయినాను దిగువ తిరుపతిలో గొవిందరాజుల గుడి కోదండరామస్వామిగుడి వుంన్నది రామస్వామి గుడికి సర్కారు కుంమ్మక్కుఏమీలేదు గోవిందరాజుల గుడిఆచార్య పురుషుల స్వాధీనంలో వుంన్నది సర్కారువిచారణ కద్దు బ్రాంహ్మలు త్రిమస్తులగా రెండు వందలు యిండ్లు కద్దు గురునాధ శెట్టి అన్నసత్రం స్మార్తులకు వుంచి వుంన్నాడు మునియప్పెళ్ళ పదమూడు మందిచిన్నవాండ్లను పోషించ్చె పాటకశాల వుంచ్చి వేదాధ్యయనం చెప్పిస్తూ వుంన్నాడు చందూలాలా మొదలయిన ముగ్గురు పుణ్యాత్ములు గొసాయీల వగైరాలకు సదానత్రి యిప్పిస్తూవుంన్నాడు రెండ్డు మూడు రామానుజకూటాలని నామకరణంచేసి శ్రీవైష్ణవుల్కు ప్రసాదం దినం కలుగుతూ వుంన్నది. భారీవూరు సకల పదార్దాలు దొరుకును సకల విధములయిన పనివాండ్లు కలరు పంగ్గులూరు గురునాధ శెట్టి వగయిరా కొంద్దరు సాఃహుకార్లు వున్నారు. షహరుస్థళం అనిపించ్చు కుంట్టూ వుంన్నది కోతుల వుపద్రవం కలిగివుంన్నది పానానికి సరశింహ్మతీర్ధ వుదకం వుపయోగిస్తున్నది గాని వేరేలేదు రెండు ఘడియల దూరంలో కపిలతీర్ధం వుంన్నది యిది బహురమణియ్య ప్రదేశం గంగ్గదార సదాపడుతూ కింద తటాకవతుగా గంగ్ల నిలిచువుంన్నది, పుట.ఐదు, చుట్టూ విశాలమయిన మంట్టపం కట్టివుంన్నది భ్రాహ్మణ సంవారాదనకు అతియోగ్యంగా వుంన్నది యీ చుట్టుపక్క దేవస్థళాలలో చందులాలా ధర్మాలు నిండాగా జరుగుతున్నది ఘాలికాలంగనుక కొండమీద ఒక పగులు వున్నాను దిగువ తిరుపతినుంచ్చి కొండమీద స్వామివుండెప్రదేశం ఇరవై నాలుగు ఆమడ ఘాలిగోపురంవర్కు యెక్కుడు దిగుడు బహు కష్టం ఆవల కొంతప్రదేశం సమభూమిగా వుంటున్నది మళ్ళి యొక్కడం దిగడం కలిగినా ఘాలిగోపురంవర్కు కలిగినసంత ప్రయాసకాదు దారిలో నిలవడానికి అనేక మంట్టపాలు వుదక వసతి కలిగివుంన్నది ఘాలి గోపురంవద్ద ఒఖ బయిరాగి శ్రీరామవిగ్రహాలను ఆరాధిస్తూ వచ్చిన వారికి మజ్జిగ మొదలైనది యిచ్చి ఆదరిస్తూవుంన్నాడు. యెగువ తిరుపతిస్వామికి చెల్లుబడిఅయ్యె ప్రార్ధనలవల్ల కంపెనీవారికి సుమారు లక్షరూపాయలు వస్తూవుంన్నది యె సత్కార్యం యెగువ జరిపించ్చడానికి సర్కార్కు రూక యివ్వవలశి వుంన్నది యిక్కడ పరమాత్ముడు సంపూర్ణ కటాక్షంతో ప్రతిఫలించ్చి లోకుల పాపాంన్ని వారివిత్తం కుండాహరించ్చి యిష్టశిద్ధి చేస్తూవుంన్నాడు. వుండె శ్రీనివాసమూర్తి ప్రతిమె దివ్యమంగళ విగ్రహంహంగ్గా వుంన్నది దేవతులో ల్యాక దేవతులకు సమానమయిన వారో గత కాలంలో ఆమూర్తిని ఆరాధించ్చినట్టు తోస్తుంన్నది యిక్కడ గోసాయి బయిరాగులకు గురుపీఠంగావుండ్డె మహాంత్తుమఠం వకటి అతివిశాలంగ్గా కట్టి వుంన్నది ఆ మహంతుకు సిష్యార్జన విస్తారం కలదు. యిండ్లు నంకుచితం చైత్రమాసం మొదులు జ్యేష్టమాసంవర్కు వుదయకాలమంద్దు చ, పుట.ఆరు, చల్లని ఘాలికొట్టుతుంన్నది. అది శీతళించ్చి కొండమీద వుండెవారికి నిండ్డారోగప్రద మవుతున్నది. కోతుల వుపద్రవం విస్తారం. అడివిపందులు నిరొపద్రవంగ్గా మనుష్యుల మధ్యే సంచరిస్తూవుంట్టున్నది ఘాలికాలంలో మనుష్యులు నిండా కొండమీద వుండడం లేదు కొండమీద అరతిరుపావడ రెండు వందలు ఇరవై రూపాయిలు యిచ్చి విడిచి దక్షిణనసమేతంగ్గా ప్రసారం వినియోగం చేయడమయినది.

ఆదివారం రాత్రి కరకంబాడి చేరినాను దిగువతిరుపతికి ఆమడ దూరానికి కొంచ్చం తక్కువగా వుంన్నది యిది పాళెగాడి వూరు తిరుపతివగైరా వూళ్ళ కావలికెగాను యీ కరకంబాడి దీనితో చేరిన కొన్ని గ్రామాలు ఆ పాళెగాడికి కంపెనీవారు జారీగా నడిపిస్తూ వుంన్నారు. వూరు వసతి అయినదికాదు అయిన అవతల కఠినమయిన అడివగనుక విదిల్యాక దిగవలశ్ని మజిలీ అయినది. పోస్టు ఆఫీసు యిక్కడ వుంన్నది యధోచితంగా సామానులు ముసాఫరులకు దొరుకుతున్నది యిక్కడ ముసాఫరుఖానా కట్టివుంన్నది.

ది పగులు ఆరు ఘంటల్కు ముందురత్రి రెండ్డు ఘంటల్కు బయలుదేరి శెట్టిగుంట్ట చేరినాను దోవమిక్కిలి అరణ్య మధ్యంలొ వుండ్డి వుంన్నది. దొంగల రొష్టు మిక్కిలికద్దు. రాతిగొట్టు మార్గంమధ్యే పాలేగాండ్ల వూళ్ళు మామండూరు క్రిష్ణాపురం దోవలో దాటవలశ్నిది. వీరి సహాయం ల్యాక మాతుబరులు నిర్బయంగా యీఅడ్వి దాటలేరు. కలక్కటరుల్కు యీఅడ్విబాట నిర్భయంగా యీఅడ్వి దాటలేరు. కక్కటరుల్కు యీఅడివిబాట నిర్భయంగా చెయ్యడానికి, పుట.ఏడు, చాతకాకుండా వుంన్నది మామండూరికి యీవల ఐదు ఘడియల దూరములో బాలపల్లె అనేవూరు వుంన్నది అది మొదలు కడపజిల్లా సరిహద్దు యీ బాలపల్లె భూమినీళ్ళు బహు రోగప్రదమయినది. యిక్కడ రెండుమూడు నదుల వంట్టి కాలువలు దాటవలెను ఖనమ ఒఖటి దాటవలెను. బాట బహు రాతిగొట్టు యెక్కుడు దిగుడుగా వుంట్టుంన్నది. బహు దట్టమయిన వెదురు అడివి యీ శెట్టిగుంటలో మంచినీళ్ళచెరువు ఒఖటి వుంన్నది రెండ్లు బ్ర్రాంహ్మణ యిండ్లు కలవు ప్యాటస్థళం. కావలశిన సామానులు దొరుకును. బాలపల్లె మొదలు కడప కలక్కటరు అడ్వికొట్టి బాటవెడల్పుచేసి అక్కడక్కడ ఠాణాలు వుంచివున్నాడు. శేట్టిగుంట చేరె వర్కు భాట రాతిగొట్టుగానున్న అడ్విగానున్ను వుంటుంన్నది. కరకంబాడినుంఛ్ఛి ఆపాళెగాండ్లను మంచితనం చేసి యిరువైయింట్కి తుపాకీవాండ్లను శెట్టిగుంట దాకా తెచ్చినాను బాలపల్లెలో ముసాఫరుఖానా వుంన్నది యీదినం పగులు మూడు ఘంటల్కు బయలు దేరి సాయంత్రం ఏడు ఘంటల్కు ఒకటి ఆమడ దూరంలో వుండే కోడూరువద్ద వుండె సత్రం అగ్రహారం చేరినాను. కోడూగు బస్తి ప్యాటస్థళం ముసాఫరుల ఖానా వుంన్నది.

బ్రాహ్మణయిండ్లు లేవు. పయి అగ్రహారంలో యెమీ దొరకదు అంగళ్ళు లేవు భ్రాంహ్మలు శాంతులు కారు.

ది జూన్ ఐదు ఘంటల్కు బయలు వెళ్ళి ఆమడదూరంలో వుండె వోరంబాడు తొమ్మిది ఘంటల్కు చేరినాను యిక్కడ ముసాఫరుఖానా వుంన్నది ప్యాటస్థళం అన్ని సామానులు దొరుకును బాట బాగానేవున్నది. శెట్టిగుంట నుంచ్చి కోడూరికి రెండుమార్గాలు వఖటి అడ్విలో దండుభాట వఖటి పల్లెలమీద కాలిబాట. యీ కాలి భాటలోను సవారీలు రావచ్చు, పుట.ఎనిమిది,ను అడ్విభయం కోడూరితో సరి. యివతల భూమి తెరపగా దగ్గర గ్రామాలు పయిరుపొలం వుదకవసరి యిది మొదలయినది. భాటలో కోడూరి మొదలు కలిగి వుంన్నది యక్కడ చూచినా చింతచెట్లు కలవు బాలపల్లెవద్ద వుండ్డె కొండ వాగునీళ్లు నాబోయీలు వగైరా తాగినంద్దున వఖ బోయి వక కావడివాడు జ్వరం తిగిలి ఖాయిలా పడ్డంద్ను సమీపవతుగావుండె వోరంబాడిలో మధ్యాంన్నం నిలిచినాను యీ బాలపల్లెవద్ద వుండె కొండవాగువద్ద రాతిగొట్టు కనుమ వుంన్నది వాటివద్ద శ్రీనివాసమూర్తి పాదం వుంన్నది. అక్కడ నుంచ్చిపడమటి దేశస్తులు కొండ్డయెక్కుతారు యీదినం మూడు ఘంటల్కు బయలు దేరి ఘడియప్రొద్దువుండగా పుల్లంప్యాట చేరినాను నాలుగు ఘడియలు దూరం ముసాఫరు ఖానావుంన్నది ప్యాటస్థళం బ్రాంహ్మణయిండ్లు కలవు., ఈముద్రణం పుటలు.రెండు నుంచి మూడు వరకు,

వ్రాతప్రతి పుటలు నలభై నాలుగు నుంచి యాభై వరకు, చూడు. ఈముద్రణం పుటలు. ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు వరకు,

జూన్ ఇరవై ఆరు ది మంగళవారం రాత్రి మొదలు జూలాయి యనిమిదొ తేదీ మంగళ్వారం సాయింత్రంవరకు హయిదరాబాదు షహరుతో చేరిన బేగంబాజారులో వుంన్నాను ఆ రాత్రి మొదలు జూలాయి పదమూడు ది సోమవారం రాత్రివరకు శికింద్రాబాదు అనే పేరుగలిగిన యింగిలీషు వారిదండు వుండె బస్తీకి సమీపంగా వుండె కాకాగూడం అనే బొమ్మదేవరు నాగన్నతోట చావడిలొ వుంన్నాను. యీ హయిదరాబాదు షహరుకు చుట్టు బేగంబజారు అనే బస్తీ ఒకటి సాహుకార్ల కొఠీలుకలది వుంన్నది యిది షహరు ఆపేక్షయా వాసయోగ్యం యిక్కడికి కోశడు దూరములో కారువాన అనే బస్తీ రత్నాలు వగైరా అంమ్మె వర్తకులు వుండె స్థళం వకటి వుంన్నది. ఆబేగంబాజారుకు చేరినట్టు యింగిలీషు రెసైడెంటు నిజాంవారి ఖర్చుకింద విస్తారంగానున్ను అలంకారగానున్ను వక హవేలి కట్టించుకొని, పుట.నలభై మూడు, బాడిగె నిజాంకు యిస్తూ కాపురంగావుంన్నాడు. యీహవేలిచుట్టు లోకులు వర్తకులు యిండ్లు కట్టుకుని వుండటచేత వకపెద్ద బస్తీ అయినది. యీస్థలం పేరు చంద్రఘాటు అంటున్నారు. షహరులోపల షాలీబండ అనేపేరుగల్గిన వక పేట వుంన్నది. యీస్థలమందు యిక్కడ కల బ్రాంహ్మమండలి యిండ్లు కట్టుకుని కాపురం వుంన్నారు. దివాను పెష్కారు చందులాలు యిక్కడ యిల్లు కట్టుకుని కాపురం వుంన్నారు. నిజాందేవడి యీ షహరు మధ్యే వుంన్నది. అనేక మయిన పెద్ద మనుష్యులు అమీర్లు వుమారాలు అనే పేరుగల వార్లు సాధారణపు వర్తకులు నిజాంవంశస్తులు షహరుమధ్య కాపురంవుంన్నారు. షహరుమధ్యే మక్కామశీదు అనే వక తురకల జపశాల వుంన్నది. వాటిస్తూపీలు రెండు మొలాం ఛేసినది బహుదూరాన్ని తెలుస్తుంది. మశీదుకు యదురుగా లోగడ దినాను మీరాలం అనేవాడు కట్టించిన కారంజీలు లోతు కలది వుంన్నది. వాటికి సమీపముగా గుజలీ అంగడీచౌకు అనేపేరు గలది ఒకటి బట్టల అంగళ్ళు పాత్రసామాను అంగళ్ళు నాలుగు దోవలు అనేపేరు చేరడానికిగాను కట్టిన ఒక గొప్పస్తూపెకలిగి నాల్గుద్వారాలుకలిగిన వక చావడి వుంన్నది. షహరులోపల రాజవీధులకంత్తా గుండురాళ్ళు పరిచినారు. అటువంటి వీధులలొవుండె కస్మలము అడుసు నడిచేవారికి పాదాలను పూడుస్తూ వుంటుంన్నది. యిండ్లాలంకారం సందుల కునంది యితర దక్షిణదేశం షహరులలో వాసంచేసేవారికి యిష్టతిగావుండదు. రాజ వీధులలో ఏనుకులు మొదలైన వాహనాలు సదా వస్తూపోతూ వుండుటచేతనున్ను ప్రతిమనిషి ఆయుధపాణులయి మెత్తని వారిని, పుట.నలభై మూడు,నరకడం కొట్టడం శూరకృత్యంగా యిక్కడ యంఛేవాడికె అయి యుండడము చేత షహరులో యితరదేశస్తులు సవారి మీద పోయి రావలిస్తే కొందరు ఆయుధపాణులు వాక్పారుషం కలవారినిగా కూడా పిల్చుకొని పోవలశివుంన్నది. కృష్ణానది దాటినది మొదలు హయిదరాబాదువరకు పక్కీరులమయం గనుక సవారిమీద యవరువచ్చినా అడుగడుక్కూ పక్కీరులు పోగడి భిక్షం అడగకమానరు. వార్కి కొన్ని గవ్వలయినా యిస్తూరాకపోతే అవుమానం వంటిది పైసావారికి గొప్ప సంభావన చంన్నపట్టం ర్పూ ఒకటి కి ఇక్కడి పైసాలు యాభై పైసా ఒకటి కి ఇరవై పుంజీలు గవ్వలు వుంజీ ఒకటి కి గవ్వలు నాలుగు యీ హయిదరాబాదులో పిచ్చి రూపాయలని వకదినం గొవిందబకుషీలు అని ఒక దినుసు చలామణి అవుతుంది యీ రూపాయిలు ఒకచేతినుండి వకచేతికి వచ్చినట్టు అయితే ఒకటికి రెండుపైసాలు నట్టమియ్యకనే మారకం కానేరదు. యీ చలామణి రూపాయలకు యిక్కడవారుచేసే పరీక్ష అన్యాదృశ్య్హము. యటువంటి రూపాయికయినా ఒకదోషం పెట్టకమానరు. చన్నపట్టం కంపెనీరూపాయలకు ఆ తొందరలేదూ అయితే దొరకవు. యిక్కడి రూపాయిలకు ర్పూ. ఒకటి కి. పైసాలు నలభై పైసాలు ఎనభై యీ షహరు గోడకు చేరినట్టుగా ముశీ అని యిక్కడివారు చెప్పి ముచుకుందనది పారుతూ వుంన్నది. యీనది వాడపల్లివద్ద క్రిష్ణలో కలుస్తున్నది గొప్పనది పోయిన సంవత్సరం, పుట. నలభై రెండు, నది ప్రవాహం యెక్కువగా వచ్చి ఢిల్లీ దర్వాజా వద్ద యింగిలీసువారుకట్టిన వారిధిని పగలగొట్టి యీ షహరులో కొన్ని వీధులు ముంచ్చివేశిపోయినది. బేగంబాజార్కు షహర్కు మధ్యే యీనది దాటడానికి పూర్వకాలమంద్దు తురకలు రాళ్ళతో అతిజలనతుగా వక వారధి యెనుగలు మొదలయినవి గుంపులుగా ఎక్కి పొవడానికి యోగ్యంగా కట్టినారు. షహరుచుట్టూ చింన్న తిప్పలు కొండలమయం అనేక తిప్పల అగ్రమంద్దు మశీదులు కట్టివుంన్నారు. హిందూ దేవాలయాలులేవు వుంన్నా వృద్ధికిరానివ్వరు షహరుకు యింగిలీసు దండ్డుకు రెండు కోసులదూరం వుంన్నది మధ్య హుస్సెనుసాగరు అనే పేరుగల గొప్ప చెర్వు వుంన్నది ఆకట్టమీద యింగిలీసువారు గుర్రపుబండ్లు పొయ్యేటంద్దుకు యోగ్యంగా భాట ముచ్చటగా చక్కచేసి మొగలాయి వాహనాలు మనుష్యులు యెక్కి నడిచి చరచకుండా భాటకు యిరుపక్కలా తమ పారా పెట్టియున్నారు. జాతులవాండ్లను వినహాగా యితరులను ఆకట్టమీద హుకుంల్యాక యెక్కనివ్వరు. యీ జాతులవారిపేరు పరంగ్గీలని యాల అంట్టారంటే ఫిరంగ్గీలతో సహా వాసం చేసె వారుగనుక ఫిరంగ్గివారని యీ దేశస్తులనసాగినారు యితర దేశాలలో పరంగ్గీవారని అనబడ్డా, రు, కంపెనీలష్కరు వుండ్డె స్థళం హయిదరబాదుకన్నా దిన దినానికి యెక్కువగా, పుట.నలభై రెండు, బస్తీ అవుతున్నది ఇరవై సంవత్సరముల కింద్ద నేను చూచినప్పటికంన్నా యిప్పట్కి హాశ్చర్యకరమయిన బస్తీ అయినది షహరులో వస్తువుల్కు నిరుకులేదు యెవస్తువమీద సుంకాన్ని యవడు వూహించి దరఖాస్తుచేసినా దివాన్ జీసుంక్కం గుత్త యిస్తాడు కట్టెలబండ్లకు విస్తరాకుల్కు షహరులో రావడానికి నాల్గు అయిదు తీరువలు అడిగితీసేవాడికి జోరావరి గొద్ది యివ్వవలసివుంన్నది చంఫ్ఫినా అడిగే దిక్కులేదు యింగిలీసు దండ్డులో యీ తొందర ల్యాక న్యాయ విచారణకూడా కొత్తవాల్ చావడిలో కంమ్మిసరయాట్టు అసిస్టాంటుగుండా జరుగుతూంది గనుక లోకులు వర్తకులు యీదండ్డులో వశించడానికి దినదినానికీ యెక్కువగా యిచ్చయిస్తూవుంన్నారు యిక్కడి యిండ్లు అంత్తా యెన్నిమిద్దెలు అంతస్థులవారిగా కట్టినా స్తంభాలమీద పయివూరి లోభంచేసి మట్టి గోడలుపెట్టి ఆగోడలపైన నాజూకు అయిన సంన్నగార కావలశ్ని చిత్ర విచిత్రాలతో పూస్తూన్నారు యిక్కడ మట్టి గులక కలిస్ని యెర్రర్యేగడ మహాఘట్టిగా వుండతగ్గది ఇంగ్లీసు దండులో నేను దిగిన స్థళం వాసయోగ్యం యీ షహరుచుట్టూవుండే భూమి బహు సారవత్తూయినది యె వ్రిక్షం వేశినా అతివీర్యంగా పయిరు అయి వస్తుంన్నది అయితే పయిరు పెట్టె శ్రద్ద యెవరికి రెండ్డు కారణాలవల్ల లేవు మొదటికారణం బీదలయినవారు యెచెట్టు వేసినా, పుట.నలభై రెండు, వాటి ఫలాన్ని క్షేమంగా ఆయుధాలే ఆభరణాలుగా వుంచుకొని దర్పణమె యశస్సుగా బీవించ్చుకొని వుండె లోకులు అనుభవించ్చనియ్యరు వుపసంపన్నులు తోటలు వనాలు వెతామంటే విపత్పరంపరలు రాజకియ్యంచాత అప్పటప్పటికి వారికి సకలుగుట చాత తాసుఖం అనుభవించడానికి ప్రాప్తం ల్యాకవుంన్నది యింతకు వోర్చివేశిన చెట్లు మహాభాగా అయివుంన్నది చోటాఆరంజిపండ్లు నిస్తారంకద్దు సకల విధములయిన పండ్లు అంటిపండ్లు వినహాగా మంఛ్ఛిది దొరుకును అయితే అతి ప్రియము చంన్నపట్ణానికన్నా మూడింతలు ధర యివ్వవలశ్నిది కూరగాయలు అదెప్రకారము ప్రియమయినా మహా రుచి కరంగావుంన్నది వస్త్రాలు ఆఃభరణాలు శిపాయిలాయక్కు అయినవి యీషహరులో దొరుకును. భారీరత్నాలు కొనేపాటివుత్సాహం ధైర్యం ఎవరికీ లేనందున వర్తకులు తేవడంలేదు. ఆభరణాలు వగయిరా వుంచుకొని విక్రయించే తమ కాపు నిమిత్త్యం కొంత శిబ్బంది వుంచవలశి వుంట్టున్నది తద్వారా వక బుజురుగు వార్కి కలగడవమ వుతున్నది అందువల్ల కావలశ్ని గొప్పవారు వారి యింట్టికి వెళ్ళడం వారిని పిలిపించ్చుకుని కావలశింద్ది వారుసెప్పినధరకు పుచ్చుకుని తమకు సమ్మతి అయినప్పుడు ఖరీదుచేస్తూ వస్తారు. వర్తకసరళిగా అటువంటి గొప్ప వస్తువులుకొని అమ్మడంలేదు సాత్వీక ప్రభ్హుత్వంకల రాజ్యంలో మెదిగిన వారికి యీ షహరులో వునికింన్ని యీ రాజ్య సంచారమున్నూ భయప్రదంగా వుం, పుట.నలభై,టుంన్నది., చూడు. ఈముద్రణం పుట ముప్పై నాలుగు,

వ్రాతప్రతి పుట మూడు వందలు యాభై ఐదు*

క్రిష్ణనగరు చేరినదిమొదలు ప్రతిదినం కొంత మబ్బువేశి నాలుగు ఘడియలు అమితమయిన ఘాలి కొట్టి పడవలను హల్ల కల్లోలంచేసి మబ్బును తీసుకొనిపోతూ వుంన్నది. యీ చానక్కు! లోముందు దినములు వెఫ్ ట్పాడ్ డాకటర్ కార్బిన్ అనేవారి తొటలో గంగ్గవడ్దున గుడారాలువేశి నివశించినాను. యీ యిద్దరు ధొరలు బహు పరోపకారులున్ను సాంప్రదాయకులుగా తోచినది. ఆ డాకటర్ కార్బిన్ అనే దొర చికిత్స నిమిత్తంగా వక గ్రంధం చేసినాడు భేదివాంతి, పుట.మూడు వందలు యాభై ఆరు,చిగిత్స నిమిత్తమున్ను అదెప్రకారం వక గ్రంధం చేసినాడు. నాడేరాలు వెయ్యడానకు పరిశుధి అయిన స్థళం నాబజారానిలిచిన తావులో దొరకక పోయుణంతల్లో సమీప నివాసులయిన పయియిద్దరు దొరలకు వారితోటలో కొంచ్చం స్తళం నిమిత్తం నఖ చీటి వ్రాసుకుంన్నంత్తల్లో సర్వాంతర్యామియొక్క ప్రేరణచాత నాకు కావలసినంత స్తళం వారి తోటలో యిచ్చి నేను అక్కడ వుంన్నమట్టుకు సహోదర న్యాయంగా నడిపించ్చినారు యీశ్వరుడు వారిని రక్షించ్చు గాకా.

*పాత ముద్రణం అచ్చుపుస్తకంలో ఈ పేరాగ్రాపులేదు. అందువల్ల ఈ ముద్రణలోనూ లేదు.

ఈముద్రణంలోఅచానక్కు, బారకుపూరు, పుటరెండు వందలు అరవై ఎనిమిది వ్రాత పుటమూడు వందలు యాభై ఆరు., ముద్రణం పుట రెండు వందలు అరవై తొమ్మిది,

, పద్దెనిమిది వందల ముప్పై ఒకటి, ఏప్రిల్ తొమ్మిది తేదీ శనివారం పన్నెండు ఘంటల్కు సార్వభౌముడి విభూతి పరంపర యెక్కువగా కలిగిన కలకత్తాపట్నం ప్రవేశించినాను యీదినముల్లో యిక్కడ నివాసం చేసే జనసమూహంయొక్క దేశ కాల ద్వారా జనించే భక్తి పురస్కతమయిన చరత్కుపూజా భాను పొడా అనే ఆరాధనలు యీశ్వర చైతన్యం యిక్కడ విస్తారం ప్రతి భాతియై*, యెట్లా హైదరాబాదులో నా ప్రవేశకాలంలో తన ఆరాధనకొరకు పీర్లపండగను సంభవింప్ప చేసినాడో యెట్లా నాగపూరిలో గోకులష్టమి ప్రయుక్తంగా పసలపండుగ ఘటింనదో యెట్లా మిరిజాపూరిలో కార్తీకమాస ప్రయుక్తంగా యీశ్వర శ్రిష్టి అయిన నక్షతాలకు ప్రతిభాతిగా ఆకాశదీపాలు పెట్టె పండగ యెట్లా ఘటించ్చినదో కాశీలో కృత్తికా స్నానాలలో పంచత్నాలు అనే దినాలు యెట్లా ఘటించినదో గయామహాక్షేత్రంలో శివరాత్రి ఉత్సవం ఘాలిపఠా పండుగ యెట్లా ఘటించ్చినదో పట్నా షహరులో హోళిపండగ అనే మహోత్సవం యెట్లా ఘటించినదో తద్వతుగా, యీకలకత్తాలోనున్ను సాంబమూర్తి ప్రీతికరమయిన పయివ్రాసిన మహోత్సవం ఘటించినది. యీ వుత్సవంలో యిక్కడి జనులు మనదేశములో శడలు ఆడినట్లు దేహాలను పొడుచుకుని నరుక్కుని తమ రక్తదర్శనాలు చేసి సంన్యాసా, పుట.మూడు వందలు యాభై ఏడు, శ్రమలాంచనలు వహించి వుదకకుంభదానాదులు పిండప్రదానాలు మొదలైన శ్రాద్ధాలు పితృప్రీతిగా కూడా జరిగిస్తూవుంన్నరు పైన వ్రాసిన స్థళంలో పయిన వుత్సవాలకు మించ్చినది సంవత్సర మధ్యే ఆయా స్థళనివాసులకు

*బ్రాకెట్లలోని భాగం పూర్వపు ముద్రణం అచ్చుపుస్తకంలొ లేదు. అందువల్ల యీ ముద్రణంలోనూ లేదు.

ల్యాక వుంన్నది. కలకత్తా షహరుకు చేరిన ఉత్తరపార్శ్వం చిత్తుపూరు అనే ప్రదేశంలో గంగాతీరమంద్దు యభయి రూపాయలు నెల ఒకటి కె బాడిగ నిష్కర్ష చేసి వక యిల్లు తీసుకుని అందులొ ప్రవేశించ్చి నాను.

వ్రాతప్రతి పుటలు నాలుగు వందలు ఇరవై నాలుగు నుంచి నాలుగు వందలు తొంభై వరకు,, ఈముద్రణం పుటలు రెండు వందలు అరవై తొమ్మిది నుంచి రెండు వందలు డెబ్బై నాలుగు వరకు,

, నాలుగు వందలు ఇరవై నాలుగు, నా జన్మభూమి అయిన చంన్నపట్నం వ్రిత్తాంత్తం యటువంటిదంటే యింన్నూరుయేండ్ల కిందట చంద్రగిరిలో వీజానగరం సమస్తానాధిపతి అయిన శ్రీరంగరాయడు ధొరతనం చేస్తూ వుండగా డే అనే ధొర యీ సముద్రతీరమంద్దు వక రేవుబందరు కట్టించవలనని యత్నంచేసి శ్రీరంగరాయణ్ణి అడిగి వుత్తరువు తీసుకుని యీప్రాంత్యాలకు జమీదారుడైన దామరుల వెంక్కటాద్రినాయుడిపేర సన్నదు పుచ్చుకున్నాడు. ఆ వెంక్కటాద్రినాయుడు తన పేరుపెట్టి శ్రీరంగరాయపట్నం అని, నాలుగు వందలు ఇరవై ఐదు, రేవు బందరు కట్టమన్నా వెంక్కటాద్రినాయుడు తన తండ్రి అయిన చంన్నప్పనాయడిపేర చంన్నపట్నమని పేరుపెట్టమని చెప్పటమేగాక తానె సంన్నిధానాధిపతి గనుక అదే నామకరణం ఆరంభంలో చేసి నందున చంన్నపట్నమని పేరుకలిగినది తత్పూర్వం యీ రేవును యింగ్గిలీసువారు మదరాసు అంటూ వచ్చినారు యిప్పటికి వింధ్యన్యోత్తర దేశంలో మందరాసు అంటే యీస్తళం నిర్నయమవుతుంన్నది. గాని ఛంన్నపట్నం అంటే యవరికి అక్కడ తెలియదు పింమ్మట పదహారు వందల నలభై నాలుగు యింగిలీసు సంవ్వత్సరంలో రేవుబందరుకు చేరినట్టుగా వక కోటకట్టి సముద్ర తీరమంద్దు రెండు కోసుల భూమిని ఇంగిలీసు వారు స్వాధీనం చేసుకుంన్నరు. అటుపింమ్మట పదహారు వందల అరవై ఒకటి సంవ్వత్సరం యింగిలీసు వారిలో కొంతాఅంత, కలహంజరిగి అరాచికమయి పదహారు వందల డెబ్బై ఒకటి సంవ్వత్సరంలో మళ్ళీ సుతరాయించ్చి యీరేవుబందరు సుంకం యిజారా కంపెనీవారి చేసినారు. వెంబడిగానే కంపెనీవారి ప్రాపకం కోరి జగధీశ్వరుడు సత్యవాదుల పక్షపాతి గనక యింగ్గిలీషువారు చాలా సత్యఫంధులు అయినంద్దున యీ బస్తీలో మూడులక్షల ప్రజ వాసం ఛేసేటట్టు చేసి నాడు. పింమ్మట వెయ్యి ఆరు వందలు తొంభై ఆరువ సంవత్సరంలో నలుభయివేల వరహాలు సాలుకు యెత్తేపాటే భూమి కంపెనీవారి అధీనం అయినది అటుపిమ్మట పదిహేడు వందల రెండు సంవత్సరంలో ఢిల్లీపాదుషా అవరంగజీబు తరఫున దావూదుఖాన్ డు దండ్డుయెత్తివచ్చి యింగ్లీసువారిని చాలా కలతపెట్టినాడు అప్పట్లో అనేక తెగలు అనేక దేశాలనుంచి యిక్కడ చేరి, నాలుగు వందలు ఇరవై ఆరు, నంద్దున యడమచెయ్యి కక్షి అని కుడిచెయ్యి కక్షి అని రెండుపక్కలుగా యిక్కడ వారు చీళి యింగిలీసువారికి చాలా శ్రమను కలుగచేసినారు అందుకు నులుభై సంవత్సరముల పింమ్మట ప్రాంసువారు యీకోట తీసుకుని యింగిలీసువారిని వెళ్ళకొట్టినా హింద్దూస్తాన్ లో యింగిలీసుజాతికి దిగ్విజయం కలిగివుండెను గనక వొకసాటిగా సమాళించినారు వెంబడిగానె అయిదు సంవత్సరములకు రాజీమీద యీ స్తళాంన్ని యింగిలీసువారు స్వాధీనం చేసుకొంన్నారు పదిహేడు వందల ఎనభై రెండు సంవత్సరంలో కలాపన పొశిగి జగధీశ్వడి కటాక్షంచాత ఫ్రాంసుదండు పరారి అయిపోయినది అదిమొదలుగా అరికాటి నవాబును విహిత పరచుకొని క్షేమంగ్గా కాలంతోస్తూ వుండగా పదిహేడు వందల అరవై రెండు సం. మొదలు పదిహేడు వందల ఇరవై ఒకటి సం. వరుకు హయిదరుతో నవాబు నిమిత్తం పోరవలసి వచ్చినది. అది మొదలు యధాక్రమంగా అరికాటి నవాబు రాజ్యమంతా యింగిలీసువారి స్వాధీనమై వుత్తరం గంజ్జాం మొదలు దక్షిణం తిన్నెవల్లిశీమ వరకుంన్నూ తూర్పున సముద్రం మొదలు పశ్చిమం సముద్రం వరకూ ఏకచక్రాధిపత్యంగా యీ చంన్నపట్నాన్ని రాజధాని చేసుకొని కంపెనీవారు యెలుతూవున్నారు యీ రాజధాని కింద్ద యిప్పుడు వుండే జిల్లాలు ఇరవై ఒకటి యింతభూమి మధ్యేమయిసూరు, మళయాళం కొచ్చి యీ ముగ్గురు రాజులు తప్ప కొదవ అంద్దరు జమిందారిపాయా కలవారుగాని యుద్ధసన్నుద్దుడుకాగల భూపతి, నాలుగు వందలు ఇరవై ఏడు, వక్కడూ లేడు యీ చంన్నపట్నం కొడికింద్ద యిప్పుడు వసూలు సాలుకు వకటింకాలుకోటి వరహాలు అవుతున్నది ఖర్చు అప్పులకు యిచ్చేవడ్డీ సహాగా వసూలుకు యక్కువగాని తక్కువకాదు యీ చంన్నపట్నం కొడికింద్ద కంపెనీవారు అప్పు సుమారు రెండు కోట్ల వరహాలు వుండును స్థావరజంగ్గమ రూవకమయిన స్తితి మూడుకోట్ల వరహాలు వుండునని తోస్తుంన్నది. దండు యాభైవేలమంది పౌజువుంన్నది. యీచంన్నపట్నం బస్తీకి మూడుపక్కలా షహరుపానా గోడ పెట్టివుంన్నది. తూర్పుపక్క సముద్రమేగాని గోడలేదు. బస్తి కోశెడుదూరం చచ్చవుకానికి వుంన్నది. బస్తీకిపోవు కోశడుదూరంలో దక్షిణపక్క యుద్దసన్నద్దమయిన కోట సముద్రవారగా కట్టివుంన్నారు. వుత్తరపక్క సముద్రంగట్టున యెగుమతి దిగుమతులు అయ్యే రేవు సరుకు వేసే కొట్లు కట్టివుంన్నది. యీ చంన్నపట్నానికంతా పాపం వీధిశాలవీధి యీ రెండు విశాలమయినది నిండ్డా కుసంద్ది అయిన వీధులు కాదు యిండ్లకు రెండువిధాల పంన్నురూకలు తీసుకుని వీధులు వూడిచి మరామత్తు చేసి ఠాణాలువుంచ్చి కంపెనీవారు కావిలి కాస్తూ వుంటారు. యిండ్లు తలవాకిలి తిన్నెలు పందిళ్ళు బయటికి అలంక్కారం గానుంన్ను లోపల కలకొద్దిలో ఘాలికి అడ్డం లేకుండ్డా కట్టివుంన్నారు. పరి దేవాలాయాల దాకావుంన్నది అంద్దులో విభనంగా ప్రతిసంవ్వత్సరం బ్రంహ్మో, నాలుగు వందలు ఎనభై ఎనిమిది,త్సవాలు జరుగుతూ వుంటుంన్నది సముద్రంకుండావచ్చి పొయ్యే సరుకులకు తీరువ సుంక్కం తీశె నిమిత్తం సముద్రతీరమందు కష్టంహవుని అని వక కచ్చేరి వుంన్నది. గట్టున వచ్చెపొయ్యే సరుకులకు బస్తికి పడమట పక్క ల్యాండు కష్టం హవుసని కొన్ని కోటలోను కొన్ని బైట తోటలోను చేస్తూవుంటారు. యిక్కడికి సర్వాధికారి అయిన గవునరు యిల్లు అరికాటినావాబు యిల్లు కోటకు పడమర పావు కోశెడు దూరంలో తిరువళిక్కెణె అనే వుపగ్రామంలో వుంన్నవి. జాతలవాండ్లు అంద్దరు బస్తికి దక్షిణం ఆమడ దూరంలో వుండే పరంగి కొండవరకు మూడుకొసుల దూరంలో వుండే పరంగికొండవరకు మూడుకోసుల దూరంలో వుండే పరుంబ్బూరి వరకు సుందరమయిన తొటలు వేసి బంగ్గళాలు యిండ్లు కట్తుకుని వుంన్నారు. బస్తీలోపల వుండేవాళ్ళు హిందువుల యిండ్లలో అయ్యాపిళ్ళ యిల్లు పెద్దది కోటలోపల వుండే యిండ్లలో వాడలకు తెలిశె నిమిత్తం రాత్రిళ్ళు దీపంపెట్టె యెక్సిచెంఇల్లు పెద్దది బయట వుండే జారులవాండ్ల మెద్దెలలో మురాతు కట్టినయిల్లు పెద్దది బస్తికి దక్షిణం బస్తికి సమయమయిన తిరువళిక్కెణి మైలాపూరు తిరువటేశ్వరుడిపేట మొదలైన కొంన్ని వుపగ్రామాలు వుంన్నవి పడమట పక్క చూళా పొరశవాక కోమలేశ్వరుడిగుడి యివి మొదలైన కొన్ని గ్రామాదులు వుంన్నది. వుత్తరభాగమందు చాకలపేట రయపురం తండ్డయారువెడు మొదలయిన కొంన్ని గ్రామాదులు వుంన్నవి యీబస్తీలో వుండ్డే హిందువులు అందరు వుత్తరభాగమండ్డు తిరు, నాలుగు వందలు ఇరవై తొమ్మిది,పట్టూరివరకు ఆరామక్షేత్రాలు భేటగా యేర్పరచుకొని విలాసకాలాల యందు అక్కడికి వెళ్ళీ విహరిస్తూ వుంట్టారు. కోమలేశ్వరుడిగుడివద్ద వక చింన్న యేరు ప్రవహిస్తూ వుంన్నది దక్షిణపక్క మైలాపూరి చెరువు వకటి వుంన్నది పడమటిపక్క నుంగ్గంబాక చెరువు వకటి వుంన్నది. వుత్తరపక్క ప్రతితోటలో తటాకాలు దొరువులు తొవ్వివుంన్నారు. అందులో జగఢీశ్వడి కటాక్షం చాల మంచి నీళ్ళూ కలిగివుంన్నది. సమస్త ద్వీపాంత్తర పదార్ధాలు పనివాండ్లసహా అమితంగా దొరుకుతూవుంన్నది. యిక్కడి వారి ప్రకృతులు వుపాయవేత్తలుగాని సాహసులు గారు. ద్రవిడ ఆంధ్ర కర్నాటక దేశాలకు మధ్యే యీప్రదేశం వుండ్డుట చాత బాల్యారభ్యం దెశియ్యమయిన యీమూడు భాషలున్నూ ముంద్దు ధొరతనం ఛేశినవారి తురకభాష యిప్పుడు ధొరతనం చేశేవారి యింగిలీసు భాష మాటలు నోట వానడంచాత నుంన్ను పదార్ధంగా కొంన్ని సంసృత వాక్యాలు అఃయశించ్చుట చాతనుంన్ను యిక్కడివారి వుచ్చారణ స్ఫుటంగా వుంట్టూవస్తుంన్నది. యిక్కడి స్త్రీలు గర్విష్టులుగానున్నూ పురుషులపట్ల నిండా చొరవ ఛేసుకోగలవారుగానున్ను అగుపడతారు. అయితే వస్త్రాభరణ కృషిప్రియులెగాని నైజగుణమయిన సాహసం నిండా కలవారుగా, నాలుగు వందలు ఇరవై,తొచలేదు. యిక్కడి భూమి సారవంతం కాకపోయినా మోకులు చేశె కృషివల్ల ఫలకారిగావుంన్నది వృక్షాదులు పుష్టికారులు కాక పోయినప్పటికిన్ని యిక్కడ సమస్తదేశపు వృక్షాలు సలవు సమస్త జాతుల పుష్పాలు చూదవచ్చును యిక్కడివారు చాలా మూరవెడల్పుకల బట్టలు కడతారు. గనక యితర దేశాలవాడికె బట్టలు వీరికి పనికిరాక వుంటుంన్నది. యధోచితం యిక్కడివారు కర్మఫలంగానుంన్ను దేవబ్రాహ్మణ విశ్వాసం కలవారుగా వుంట్టారు. జగఢీశ్వర కటాక్షంచాత యిక్కడి హింద్దువులకు పూర్వ పురోవృద్ధిలేక పోయినప్పటికిన్ని ముంద్దర చెంద్దిన వాసనను ప్రయాసమీద కాపాడుకుంటూ వస్తారు. జారులవారి జనబాహుళ్యం విభవం తెంపు స్త్రీపురుష సల్లాపాలు చూడవలిస్తే ప్రతిదినం సాయంత్రకాలమంద్దు పరంగికొండ్డ శాలలోను సముద్రంవద్ద వాడరేవు శాలలోనున్ను నిలిస్తే వారు అందరు... వాహన విశేషాలు యెక్కివస్తారు గనక చూచి అనందించ వచ్చును యిటువంటి రాజధానిలో జగఢీశ్వరుడు తరాల వెంబడిగా జీవనం కలగజేసి నంన్ను నిలిపి వుంన్నాడు. జగద్గుగోసాహి జగద్గురోసాహి జగద్గుగోసాహి.

కాశియాత్ర చరిత్ర వ్రాతప్రతి సంఫూర్ణ మైనది.

సవరణ

యిది ఏనుగుల వీరస్వామి అల్లించిన కాశియత్ర చరిత్ర అనే శీర్షికతో అసలు గ్రంధం వ్రాత ప్రతి ప్రారంభమవుతుంది. ఈమచ్చుపుటలు శీర్షికను కూడా నేను అలాగే వ్రాసాను. అచ్చు చిత్తులు దిద్ధడంపూర్తిఅయి ఫారం కట్టేవరకూ కూడా అది సరిగ్గానేవున్నది గాని తీరా ఫారం మిషనుపై కెక్కిన తరువాత అచ్చువేయడానికి ఆజ్ఞయిచ్చేవారు అది పొరపాటనుకుని, వీరస్వామిని ఫీరాస్వామి అనిన్నీ, కాశియాత్రను కాశీయాత్ర అనిన్నీ దిద్దినారు!

అసలు గ్రంధానికి మళ్ళీ ఒక ప్రతి వ్రాయించి అచ్చు వేయవలసివచ్చి నందువల్ల ఇలాంటివి - లేఖరి పొరపాట్లు కొన్నీ, అచ్చు చిత్తులు దిద్దేవారి పొరపాట్లు కొన్ని, నా పొరభాట్లుకొన్నీ, దీనిలోకి దొర్లడం సంభవించింది. ఇందుకు క్షమాపణ వేడుకున్నాను.

------సంపాదకుడు.

కొన్ని పదముల అర్థములు

పుట

సరాళము=సరళము, తిన్నని, సుళువైన, చిక్కులులేనిది, సరళము, సరాళము, బాట, భాట, అప్పటి వాడుకభాషలో రూపాంతరాలు - చూడు, బ్రౌణ్యనిఘంటువు. ఇది చాలసార్లు ప్రయోగింపబడినది.

పలపట్లల యిడ్లు = చిల్లరజనముయొక్క యిండ్లు, సకలపట్టాడ యిండ్లు అని వ్రాతప్రతిలో వున్నది. పలపట్టడ అనే అరవమాటలోనుండి పలపట్ర అనే తెలుగు రూపము వచ్చినది. పలపట్రజనము అనగా చిల్లరజనము,, rabble, అని బ్రౌణ్య - మిశ్రనిఘంటువు.

ఉత్తర పినాకిని దక్షిణ పినాకినికిని మధ్యనున్న దేశంలో అరవంలోనుండి, కన్నడంలోనుండీ, తురకంనుండీ, ఇంగ్లీషునుండీ కూడా చాలామాటలు తెలుగులోకి వచ్చికలిసి వాడుకలో నున్నవి. వీరాస్వామయ్యగారు కాశీయాత్ర చరిత్ర లోనే వ్రాశారు. ఈప్రయోగాలన్నీ బ్రౌణ్యనిఘంటువులో కనబడుతున్నవి.

పేటస్థలము=పేట, అనగా పట్టణసమీపమందుండి సంతసాగే యూరు, నగరము యొక్కశాఖ, బస్తీలోభాగము, లేక దానినంటిన ఉపగ్రామము. నాట్యస్థళము అని వ్రాతప్రతి లేఖరి వ్రాసియున్నాడు.

వ్రాతప్రతికీ అచ్చుప్రతికీ వర్ణక్రమంలో ఇలాంటి తేడాలు చాలావున్నవి. అచ్చుప్రతిలో కూడా ఒకేపదము కొన్నిసార్లు ఒకలాగున మరికొన్నిసార్లు ఇంకొకలాగున వ్రాయబడినది. ఉదావరణానికి, బ్రాంహ్మణుడు, బ్రాఃహ్మణుడు, కర్మ, కమన్ మొదలైనవి.

మూడు., కనమ, రాతిగొట్టు,, దోవ, రాతిగొట్టు, ఆరు,- రాతిపారు, రాతిపాద, రాతిపర అని కూడా బహుళంగా ప్రయోగింపబడినది., బ. ప్ర,*

ఇందులోని గొట్టు శబ్ధము భూమియొక్క స్వభావవమును సూచిస్తుంది. వస్తు స్వభావమువలెనే మనుష్య స్వభావమును సూచించే గొట్టు శబ్ద మున్నది. ఉదా,

*ఈ పట్టికలోని కొన్నిపదములకు అర్థములను బ్రహ్మశ్రీ శతావధాని వేలూరి శివరామశాస్త్రులుగారు వ్రాసియున్నారు. తక్కినవి బ్రౌణ్యనిఘంటువు మొదలైన గ్రంధములలోనివి.

^బ.=ప్ర=బహుళ ప్రయోగము, చాలాసార్లు ఉయోగింపబడిన పదము. బ్రౌణ్య= సి పి బ్రౌనుగారు రచించిన తెలుగు నిఘంటువు, పద్దెనిమిది వందల యాభై రెండు, బ్రౌణ్య - మిశ్ర = బ్రౌణ్యనిఘంటువు చివర అనుబ్ంధముగా చేర్చబడిన మిశ్రపదముల నిఘంటువు, పద్దెనిమిది వందల యాభై నాలుగు,

ఈపట్టికలో చేరని పదములు అర్ధములకు పై నిఘంటువులు చూడవలెను. హిందూస్థానీ పదములకు నేను కూర్చిన పారిభాషిక నిఘంటువు చూడవలెను.

దేబిరిగొట్టు, వాపిరిగొట్టు, తంట్రగొట్టు, అని వాడతారు. విశేషణముగా కఠినమైన దుష్టమైన అని అర్థమున్నది =, బ్రౌణ్య,.

అవసరాలుగా = రీతులుగా,, బ. ప్ర,

చీకారణ్య = కీకారణ్య,, బ. ప్ర,

హాశ్శీలు = పన్ను, సుంకము, రుసుము

పుంజధాన్యములు = మెట్టధాన్యములు

బేబందు = సరియైనకట్టు దిట్టములేని, తారుమారుగా వుండే,, బ్రౌణ్య-మిశ్ర,

మేటీలు = అంశములు, భాగములు,

హామీభరాయించి = బాధ్యత వహించి

పరుష వాండ్లు,, పర్షవాండ్లు, = తిరుణాళ్లకు వచ్చే గుంపు, పరస = యాత్రకువచ్చు జనము, అని శబ్దరత్నాకరము.,

వయిపు, వైపు = ఉపాయము, వీలు, వైపు దెలసి బలుక వలయు వేమా, బ. ప్ర.

పొలకట్లు = దున్నిన మడులు. సాగుకు దున్నిన పొలము. దీనికి బ్రౌనుగారు కాశియాత్ర చరిత్ర యాభై ఐదువ పుటనే ప్రమాణంగా పేర్కొన్నారు.

పేడించు = సేవించు

చెయికావలి = కాయి కావిలి, చెయిజాగ్రత. ముందు జాగ్రత్త కోసం వుంచుకొనే బియ్యం వగైరా భోజనసామాగ్రి, Reserve,, బ. ప్ర,

చేరీనట్టు = ఆనుకొనినట్లు., బ. ప్ర,

గుజరీ అంగడి, వంద అరవై ఒకటి, = గుజరి, గుజిరి, గుజలి = బజారు స్థలము, సంతచోటు, గుజలీబజారు,, దొంగల బజారు, బజారువేళ - సాయింత్రము Market Place, Thieving Bazer, a Madras word-బ్రౌణ్య-మిశ్ర.,

స్తుపీ = మశీదుపైన, బురుజు పైసగల శిఖరము

జోరావారి =, జోరావరి, బలాత్కారము, బలోద్దతి

అమానిగా = గుత్తకివ్వక దివాణపు విచారణ కింద నుండే భూమి

మామిలియ్యతు = సర్కారు నిర్వహణము. చూడు, మామిలీయతు, రెండు వందలు ఇరవై ఎనిమిది,

దివానుపేష్కారు = ప్రధాన పరిపాలకోద్యోగి, సివిలు అధికారి

నజరు యినాతులుగా = పైయధికారుల కిచ్చు నజరులుగాను, క్రింది వారి కిచ్చు బహుమతులుగాను

పారా = కావలి, పారాచౌకీ అనగా కావలిస్థలము

అంతు = వెరసి, బ. ప్ర,
